inputs
stringlengths 53
5.97k
| targets
stringlengths 51
5.93k
| template_id
int64 1
2
| template_lang
stringclasses 1
value |
---|---|---|---|
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
ఏపీలో గత 24 గంటల్లో 30,752 నమూనాలను పరీక్షించగా 141 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనా కారణంగా చనిపోయారు. గత 24 గంటల్లో 165 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు నమోదయ్యాయి. అనంతపురం 10, చిత్తూరు 26, తూర్పుగోదావరి 5, గుంటూరు 24, కడప 3, కృష్ణా 16, కర్నూలు 1, నెల్లూరు 7, ప్రకాశం 1, శ్రీకాకుళం 13, విశాఖపట్నం 7, విజయనగరం 1, పశ్చిమగోదావరి 27 కేసులు నమోదయ్యాయి. . నమోదు చేయబడ్డాయి. | ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'ఏపీ కరోనా అప్డేట్'. | 2 | ['tel'] |
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
మమ్మల్ని రెచ్చగొడితే ...ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం : జేఏసీ నేత అశ్వద్ధామరెడ్డి | కార్మికులు ప్రభుత్వ హెచ్చరికలకు భయపడొద్దు. ఎంతమంది ఉద్యోగాలు తీసేస్తారో చూస్తాం. ఇదే పోరాటాన్ని కార్మికులు కొనసాగించాలి. ప్రైవేట్ వాహనాలతో ప్రమాదాలు జరుగుతాయి.ఆర్ర్టీసీ ఆస్తులను కొల్లగోటెందుకే.ప్రైవేట్ వాహనాలు.మమ్మల్ని రెచ్చగొడితే .ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం. న్యాయమైన మా డిమాండ్లను పరిష్కరించాలి. ప్రభుత్వం చర్చలు జరిపితేనే నిర్ణయం ప్రకటిస్తాం అని టీఎస్ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామరెడ్డి తెలిపారు
| 1 | ['tel'] |
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
కొనసాగుతున్న ఇర్మా బీభత్సం | వాషింగ్టన్: కరీబియన్ దీవుల నుంచి మొదలై అమెరికాను గజగజలాడిస్తున్నహరికేన్ ఇర్మా తాజాగా ఫ్లోరిడా మరోవైపు తీరాన్ని తాకింది. ఆదివారం ఫ్లోరిడాలోని కీస్ వద్ద దక్షిణ తీరాన్ని తాకిన ఇర్మా నేడు పశ్చిమ తీరానికి చేరుకుంది. పశ్చిమ తీరంలోని మార్కో ద్వీపంలో ఈ హరికేను ప్రతాపాన్ని చూపిస్తోంది. గంటకు 192 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. దీంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఇక్కడి నుంచి తంపా బే ఏరియావైపుకు ఇర్మా చురుగ్గా కదులుతున్నట్లు అధికారులు తెలిపారు. కరీబియన్ దీవులను వణికించిన ఇర్మా హరికేన్ ఆదివారం ఫ్లోరిడా తీరాన్ని తాకిన విషయం తెలిసిందే. తొలుత తీవ్రత తగ్గినట్లే కన్పించినా మళ్లీ బలం పుంజుకుని పెను తుపానుగా మారింది. ఇర్మా భయంతో ఇప్పటికే ఫ్లోరిడాలో దాదాపు 63 లక్షల మందిని ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరించారు. ప్రస్తుతం ఈ హరికేన్ మార్కో ద్వీపం నుంచి తంపాబే ఏరియా వైపునకు చురుగ్గా కదులుతోంది. తంపాలో 30లక్షల మంది నివసిస్తున్నారు. కాగా. ఇర్మా స్థాయి తగ్గుతున్నట్లు కన్పిస్తోందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తీరం వద్ద 15అడుగుల ఎత్తుతో అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో నాప్లెస్, మార్కో ద్వీపాల్లోని ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇర్మా ధాటికి కరేబియన్ తీరంలో ఇప్పటికే 25 మంది ప్రాణాలు కోల్పోగా. ఫ్లోరిడాలో ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఫ్లోరిడా మొత్తం హరికేన్ పరిధిలో ఉందని ట్రంప్ అన్నారు. అయితే ఇర్మా పశ్చిమ దిశగా కదులుతుండటంతో చాలా వరకు ముప్పు తప్పిందనే భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. అదే తూర్పు దిశగా కదిలితే చాలా ప్రమాదం జరిగేదని. ఇది అదృష్టమనే చెప్పాలని ట్రంప్ అన్నారు. | 1 | ['tel'] |
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
రూ.10కే బిర్యానీ... ఎక్కడో తెలుసా...? | హైదరాబాద్ లో రూ.10 కే వెజ్ బిర్యానీ అమ్ముతున్నారు. అవును మీరు విన్నది నిజం. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ లోని అప్జల్ గంజ్ బస్టాప్ దగ్గరికి వెళ్లి అస్కా బిర్యానీ స్టాల్ అంటే ఎవరైనా చెబుతారు. అది చూడడానికి పాత హోటల్ లా ఉంటుంది. 10 సంవత్సరాల క్రితం హోటల్ మరీ అది. ఉదయం 7 గంటలకు తెరిచి అర్దరాత్రి వరకు అమ్ముతారు. 10 రూపాయలకే వెజ్ బిర్యానీని అందిస్తున్నారు. పేదవారికి,కూలీలకు ఈ హోటల్ కడుపు నింపుతుంది. ముందుగా దీనిని రూ.5 కు ప్రారంభించారు. ఖర్చులు పెరుగుతుండడంతో దానిని రూ.10 చేశారు. ప్రస్తుతం ఉస్మానియా జనరల్ హాస్పిటల్, కోటి ఉమెన్స్ కాలేజీ బస్టాప్, అబిడ్స్లోని జనరల్ పోస్టాఫీస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా ప్రారంభించి నడిపిస్తున్నారు. | 1 | ['tel'] |
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి:
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. గురువారం తిరుమల శ్రీవారిని 62,725 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.85 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. నిన్న స్వామివారికి 30,172 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నేడు నవంబర్ కోటా అంగప్రదక్షిణ టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు డిసెంబర్ ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నారు. నేడు నవంబర్ కోటా అంగప్రదక్షిణ టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. | ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'తిరుమల దేవస్థానం అప్ డేట్స్'. | 2 | ['tel'] |
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
ఏపీలో మరోమారు గ్రూప్-1. గ్రూప్-2 నోటీఫికేషన్లు | ఏపీలో నిరుద్యోగులకు వై.ఎస్.జగన్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ అందిస్తోంది. 2018లో నిర్వహించిన గ్రూప్-1 ఫలితాలను ప్రకటించిన రోజుననే మరోమారు గ్రూప్-1తో పాటు గ్రూప్-2 పోస్టు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటన చేసింది. ఈ మేరకు మంగళవారం 2018 గ్రూప్-1 ఫలితాలను ప్రకటించేందుకు మీడియా ముందుకు వచ్చిన ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ గ్రూప్-1, 2 నోటిఫికేషన్లపై ప్రకటన చేశారు.
ఆగస్టులో విడుదల కానున్న ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేసే పోస్టుల సంఖ్యను కూడా సవాంగ్ వెల్లడించారు. 110 పోస్టుల భర్తీ కోసం గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ఆయన. 102 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని వెల్లడించారు. | 1 | ['tel'] |
క్రింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి:
కరోనా రాక ముందు జీవితం వేరు. వచ్చాక వేరు అన్నంతగా పరిస్థితి మారిపోయింది. కోవిడ్ తగ్గాక అన్ని రకాల ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. పెట్రోల్ ధరలు పెంచిన ప్రభావం. అకాల వర్షాలు, ఇతరత్రా. కారణం ఏదైనా సరే ఖర్చులు మాత్రం తడిసి మోపడవుతున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాలకు ఈ ఖర్చులు భరించలేనంతగా మారాయి. ప్రతి నెలా పెరుగుతున్న ఇంటి ఖర్చులు. ఆగస్టులో మరింతగా పెరిగాయని యాక్సిస్ మై ఇండియా కన్జూమర్ సెంటిమెంట్ ఇండెక్స్ సర్వేలో వెల్లడైంది. గత ఐదు నెలల ఇంటి ఖర్చులను పోల్చి చూస్తే. ఆగస్టులో మరింత ఎక్కువగా ఉన్నాయని ఈ సర్వే తెలిపింది.
దేశం మొత్తం మీద 58 శాతం కుటుంబాలు ఆగస్టు నెలలో ఇంటి ఖర్చు పెరిగిందని చెప్పాయి. అంతకు ముందు రెండు నెలలతో పోలిస్తే ఆగస్టులో ఇంటి ఖర్చు రెండు శాతం పెరిగింది. దేశం మొత్తం మీద దక్షిణాదిలో ముఖ్యంగా. ఏపీ, తెలంగాణల్లో ఇంటి ఖర్చులు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 71 శాతం కుటుంబాలు ఇంటి ఖర్చు పెరిగిందని వాపోగా. తెలంగాణలో 67 శాతం కుటుంబాలు ఇదే మాట చెప్పాయి. పొరుగున ఉన్న కర్ణాటకలో 65 శాతం ఫ్యామిలీలు ఇంటి ఖర్చుల భారం పెరిగిందని తెలిపాయి. జాతీయ స్థాయితో పోలిస్తే. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ఖర్చుల భారం ఎక్కువగా ఉండటం గమనార్హం. ఆగస్టు నెలలో పర్సనల్ కేర్, ఇంటికి అవసరమయ్యే వస్తువుల కోసం పెట్టిన ఖర్చు ఆగస్టు నెలలో 13 శాతం పెరిగిందని 44 శాతం కుటుంబాలు తెలిపాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజల నెలవారీ ఖర్చులు భారీగా పెరిగాయని యాక్సిస్ మై ఇండియా కన్జూమర్ సర్వేలో తేలింది. నిత్యావసరాల కోసం నెలవారీ ఖర్చులు పెరిగాయని తెలంగాణలోని 67 శాతం కుటుంబాలు చెప్పాయి. ఏపీలో 63 శాతం, తమిళనాడులో 61 శాతం కుటుంబాలు ఇదే మాట చెప్పాయి. ఒక్క నిత్యావసరాలే కాదు. కుటుంబాలకు ఇతరత్రా ఖర్చులు సైతం ఆగస్టు నెలలో పెరిగాయి. ఏసీ, కారు, ఫ్రిజ్లు లాంటి వస్తువుల కోసం ఆగస్టు నెలలో 6 శాతం అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది.
మీడియా అందించే కంటెంట్ వినియోగం కూడా పెరిగిందని ఈ సర్వేలో తేలింది. తాము ప్రతి రోజూ టీవీ షోలు చూస్తామని సర్వేలో పాల్గొన్నవారిలో 70 శాతం మంది తెలిపారు. వారంలో కనీసం ఒకసారైనా టీవీ షోలు చూస్తామని 87 శాతం మంది చెప్పారు. ఎంటర్టైన్మెంట్ విషయంలో టీవీనే ఇప్పటికీ ప్రధాన మాధ్యమంగా నిలిచింది. ఆగస్టు నెలలో వార్తలు చదవడం, చూడటం పెరిగిందని 20 శాతం కుటుంబాలు తెలిపాయి. ప్రతిరోజూ వార్తాపత్రికలు చదువుతామని సర్వేలో పాల్గొన్న వారిలో 64 శాతం మంది చెప్పడం గమనార్హం. ప్రింట్ మీడియా పట్ల జనాల్లో ఇప్పటికీ ఆదరణ తగ్గలేదనే విషయాన్ని ఇది వెల్లడిస్తోంది. సర్వేలో పాల్గొన్న వారిలో 80 శాతం మంది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ షార్ట్స్ లాంటి వాటిల్లో వీడియోలు చేస్తున్నట్లు తెలిపారు. | ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'ఆగస్టులో తడిసి మోపెడైన ఇంటి ఖర్చులు,యాక్సిస్ మై ఇండియా కన్జూమర్ సర్వేలో వెల్లడి'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి:
ప్రియుడిపై మోజుతో ఓ భార్య తన భర్తను అంతమొందించిన ఘటన కర్ణాటకలోని బెళగావి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం. అంబేడ్కర్ నగర్లో రమేశ్ కాంబళే, సంధ్యా నివాసముంటున్నారు. సంధ్య. బాళు బీరెంజె అనే వ్యక్తిలో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన ఆనందానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి సంధ్యా. మరో ముగ్గురితో కలిసి అంతమొందించింది. ఆ తర్వాత తన భర్త వేరే మహిళతో పారిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెపై అనుమానంతో విచారణ జరిపిన పోలీసులు సంధ్యతోపాటు ముగ్గురిని అరెస్ట్ చేశారు. | ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'ప్రియుడిపై మోజు... భర్తను చంపిన భార్య!'. | 2 | ['tel'] |
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : మంత్రి కేటీఆర్ | జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు.జిల్లాలో కురుస్తున్న వర్షాలపై కలెక్టర్ కృష్ణబాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే లతో ఫోన్లో మాట్లాడారు.జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మరో రెండుమూడు రోజులు కూడా భారీగా వానలు పడే అవకాశం ఉంటుందన్న వాతావరణ శాఖ వారి హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, క్షేత్ర స్థాయి అధికారులు స్థానికంగా ఉండేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే పొంగుతున్న వాగుల వద్ద తగు హెచ్చరికలను, వేరే దారులను సూచించే గుర్తులు ఏర్పాటు చేయాలన్నారు.గ్రామాల్లోనూ పాత ఇండ్లలో ఉన్నవారిని గుర్తించి సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా వర్షకాలంలో గ్రామాల మధ్య ఉన్న చిన్నచిన్న వాగులను దాటేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఎగువ మానేరు జాలశయ నీటి మట్టం పూర్తి స్థాయిలో నిండి మత్తడి దుంకుతుందని, జలాశయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. | 1 | ['tel'] |
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
న్యూఢిల్లీ: నూతన సంవత్సర వేడుకలకు ప్రజలంతా ఇప్పటినుంచే సన్నాహాలు మొదలుపెట్టేశారు. పైగా ఇటువంటి సందర్భంలో డబ్బును వెచ్చించేందుకు జనం వెనుకాడరు. అయితే వేడుకలు అద్భుతంగా చేసుకోవాలంటే ఇప్పటి నుంచే జాగ్రత్త పడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే డిసెంబరు 20 తరువాత ఏకంగా బ్యాంకులకు ఐదురోజులు సెలవులు రానున్నాయి. ఫలితంగా ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశంవుంది. దీంతో ఇబ్బందులు తప్పేలా లేవు. డిసెంబరు 20కి ఇంకా మూడు రోజులే మిగిలివున్నాయి. ఈ మూడు రోజుల్లో మీకు అవసరమైనంత మొత్తం బ్యాంకుల నుంచి తీసుకోవడం ఉత్తమం. ఈ పనేదో డిసెంబరు 20లోపునే పూర్తిచేయాలి. డిసెంబరు 21నుంచి 26 మధ్యలో కేవలం ఒక్క రోజు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. డిసెంబరు 21న దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఆందోళన నిర్వహించనున్నారు. తరువాత 22న నాల్గవ శనివారం కావడంతో బ్యాంకులకు సెలవుదినం. అలాగే 23 ఆదివారం. ఆరోజు కూడా సెలవు. 24 న బ్యాంకులు సామాన్యంగానే పనిచేస్తాయి. 25న క్రిస్మస్ సందర్భంగా అన్ని బ్యాంకులకు సెలవు. తరువాత 26న బ్యాంకు ఉద్యోగులు యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో జరిగే ఆందోళనలో పాల్గొననున్నారు. మొత్తంగా చూసుకుంటే డిసెంబరు 21నుంచి 26 మధ్యకాలంలో బ్యాంకులు కేవలం ఒక్కరోజు మాత్రమే పనిచేస్తాయి. అందుకే నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా చేసుకోవాలంటే ఇప్పటి నుంచే డబ్బు కోసం జాగ్రత్తపడటం ఉత్తమం. | ఇచ్చిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'బ్యాంకులకు వరుస సెలవులు... న్యూఇయర్ వేడుకలకు ఆటంకం'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
సైబర్ మోసగాళ్ళ వలలో పడకండి | పాన్, ఆధార్,మరియు మి వ్యక్తిగత వివరాలను ఎవరికి షేర్ చేయకండి. సైబర్ మోసగాళ్ళ వలలో పడకండి అని గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ అరిఫ్ హఫీజ్ ఐపీఎస్ తెలియజేసారు. మి పాన్, ఆధార్ వంటి వివరాలను తెలియని వ్యక్తికి లేదా ఏదైనా సంస్థలకు పంపితే వారు వాటిని చట్ట విరుద్ధ పనులకు ఉపయోగించ వచ్చు కాబట్టి వాటిని గోప్యంగా ఉంచుకోండి. అలానే ఎవరైనా సైబర్ మోసానికి గురి అయితే 1930 నంబర్ కి ఫిర్యాదు చేయండి అని పోలీస్ శాఖా తెలియజేసింది. | 1 | ['tel'] |
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
మహబూబాబాద్: ప్రమాదావశాత్తూ ఓ గీత కార్మికుడు మరణించాడు. స్థానికుల వివరాల ప్రకారం. దంతాలపల్లి మండలం, కుమ్మరిగంట్ల గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు కారుపోతుల ఉప్పలయ్య తన వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కుతుండగా. దాదాపు చెట్టు పై వరకు వెళ్లిన అతడు అదుపు తప్పి జారిపడ్డాడు. ఈ ఘటనలో ఉప్పలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విన్నవించారు. | ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'ప్రమాదావశాత్తూ గీత కార్మికుడు మృతి'. | 2 | ['tel'] |
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
యూపీలో సరికొత్త విధానం అమలు...ఇకా అలా యూనిఫాంలతో వెళ్లితే మాత్రం | బుల్డోజర్లు అంటేనే అందరికీ యూపీ గుర్తుకొస్తుంది. అలాంటి రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి సరికొత్త రూల్ అమలులోకి రానున్నది. రాష్ట్రంలో విద్యార్థుల విషయంలో కొత్త నిబంధనలు అమల్లో రానున్నాయి. పార్క్లు, మాల్స్, రెస్టారెంట్స్, జంతు ప్రదర్శన శాలలు వంటి వాటికి ఇక నుంచి స్కూల్ యూనిఫాం ధరించి వెళ్లేందుకు విద్యార్థులకు అవకాశం ఉండకపోవచ్చు. స్కూల్ యూనిఫాం ధరించి విద్యార్థులు వెళ్లడాన్ని నిషేధించాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్రంలోని అన్ని జిల్లా మెజిస్ట్రేట్లకు లేఖ రాసింది. కొంతమంది విద్యార్థులు పాఠశాలకు డుమ్మా కొట్టి బయట షికారులకు వెళ్లడంతో కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లు దీనిని పాటించాలని కమిషన్ సభ్యురాలు డాక్టర్ సుచితా చతుర్వేది ఆదేశించారు.
విద్యార్థులు యూనిఫామ్లో బయటకు వెళ్తే ఏదైనా జరిగే అవకాశం ఉందని డాక్టర్ చతుర్వేది లేఖలో పేర్కొన్నారు. 18 ఏళ్ల వరకు మైనర్లందరి ప్రయోజనాలను పరిరక్షించడం సమాజం సమిష్టి బాధ్యత అని కూడా ఆమె అన్నారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఈ విషయంలో నిశితంగా గమనిస్తోందని, తన వంతు కృషి చేస్తోందన్నారు. అంతేకాదు బాలల రక్షణ, హక్కులకు సంబంధించిన విషయాల్లో తగిన చర్యలు తీసుకునే అధికారం యూపీఎస్సీపీఆర్ కు ఉందిన లేఖలో పేర్కొన్నారు. అలాగే బాలల హక్కుల ఉల్లంఘన, వారి భద్రతకు భంగం వాటిళ్లితే సుమోటోగా విచారణ చేపట్టే పూర్తి హక్కు కమిషన్కు ఉందని పేర్కొంది.
ఈ ఆదేశాలు ఒకటి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ వర్తిస్తాయి. ఈ మేరకు ఇకపై పాఠశాలలు, కళాశాలల పని వేళల్లో పాఠశాల యూనిఫాం ధరించినవారు పార్కులు, మాల్స్, సినిమా హాళ్ళు, ఇతర బహిరంగ వెళ్లే ఛాన్స్ ఉండదు. విద్యార్థినీ, విద్యార్థులు తరగతులకు హాజరవడానికి బదులు ఇటువంటి ప్రదేశాల్లో గడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆ సందర్భాల్లో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని సుచితా చతుర్వేది అభిప్రాయపడ్డారు. | 1 | ['tel'] |
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
నిజామాబాద్ అధ్యక్షుడిగా జీవన్ రెడ్డి | తెలంగాణ రాష్ట్ర తెరాస పార్టీ విస్తరణలో భాగంగా నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడిగా జీవన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారిని కలిసి ధన్యవాదాలు తెలిపి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.
నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారిని కలిసి ధన్యవాదాలు తెలిపి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది@KTRTRS @trspartyonline pic.twitter.com/LEXFAkc74Q
| 1 | ['tel'] |
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి:
కడప : కడపలోని వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ లూర్ధయ్య నాయుడు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే అభియోగంపై ఏసీబీ అధికారులు లూర్ధయ్య నాయుడు ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. | ఇచ్చిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'డిప్యూటీ కమిషనర్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు'. | 2 | ['tel'] |
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి:
కడప జిల్లాలోని చక్రాయపేట మండలం ఆంజనేయపురం దగ్గర పోలీసులు వాహనా తనిఖీలు నిర్వహించారు. భారీగా అక్రమంగా తరలిస్తున్న విదేశీ మద్యం పట్టుబడింది. పోలీసులను చూసి పారిపోతుండగా బైక్పై వెంబడించి వేంపల్లె బైపాస్లో చక్రాయపేట ఎస్సై మల్లికార్జున్రెడ్డి పట్టుకున్నారు. నిందుతుల దగ్గర నుండి లక్ష 30 వేలు విలువ చేసే 98 ఫుల్ బాటిల్స్ , 401 క్వార్టర్ మద్యం బాటిళ్లు, సుమో వాహనం స్వాధీనం చేసుకున్నారు. పులివెందుల డిఎస్పీ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. | ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'కడప లో అక్రమ మద్యం పట్టివేత'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి:
న్యూఢిల్లీ: 2019లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ఇండియా ఓ హిందూ పాకిస్థాన్ అవుతుందని అన్నారు కాంగ్రెస్ నేత శశి థరూర్. దేశంలో మైనార్టీల హక్కులను అణిచేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో శశి థరూర్ మాట్లాడుతూ. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలిస్తే కొత్త రాజ్యాంగాన్ని రాస్తుందని, అది దేశాన్ని మరింత అసహనం దిశగా తీసుకెళ్తుందని థరూర్ అన్నారు.మన ప్రజాస్వామ్య రాజ్యాంగం ఇక మనుగడ సాగించలేదు. ఆ రాజ్యాంగాన్ని మొత్తం మార్చేసి కొత్తదాన్ని రాసే అన్ని శక్తులు బీజేపీలో ఉన్నాయి అని థరూర్ చెప్పారు. కొత్త రాజ్యాంగంలో హిందూ రాష్ట్ర ఆదర్శాలు మాత్రమే ఉంటాయి. మైనార్టీలకు సమానత్వం అనేది ఉండదు. గాంధీ, పటేల్, నెహ్రూ, మౌలానా ఆజాద్ తీవ్రంగా వ్యతిరేకించిన హిందూ పాకిస్థాన్గా ఇండియా మారుతుంది అని థరూర్ స్పష్టంచేశారు. అయితే ఆయన వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ వల్లే పాకిస్థాన్ ఏర్పడిందని, ఇప్పుడు మరోసారి దేశాన్ని, దేశంలోని హిందువులను అవమానించేలా థరూర్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీ కచ్చితంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. | ఇచ్చిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'బీజేపీ గెలిస్తే ఇండియా హిందూ పాకిస్థాన్ అవుతుంది!'. | 2 | ['tel'] |
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి:
మదనపల్లె- బెంగుళూరు మార్గంలో చీకిలబైలు చెక్ పోస్టు వద్ద కర్ణాటక మద్యం భారీగా పట్టుబడింది. టాటా ఏస్ వాహనంలో తరలిస్తున్న లక్షల రూపాయల విలువ చేసే కర్ణాటక మద్యాన్ని మదనపల్లె ఎస్ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పెద్దమండ్యం మండలం వెలిగల్లుకు చెందిన సురేష్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. | ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'ఏపీ లో భారీగా పట్టుబడిన కర్ణాటక మద్యం'. | 2 | ['tel'] |
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి:
బీఆర్ఎస్ ఏర్పాటుతో...కేసీఆర్ వ్యూహాత్మక అడుగుల...కర్ణాటకలో ప్రకాశ్ రాజ్ ఎంట్రీ | బీఆర్ఎస్ ఏర్పాటుకు ముందే జాతీయ స్థాయిలో పార్టీని విస్తరింపజేసే విషయంలో కేసీఆర్ పథక రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఆపథకంలో ఒక్కో అస్త్రం బయటకు తీసేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఇదిలావుంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అవతరించింది. తెలంగాణ భవన్లో శుక్రవారం (డిసెంబర్ 9) మధ్యాహ్నం 1.20 గంటలకు ఇందుకు సంబంధించిన పత్రాలపై వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కె.చంద్రశేఖరరావు సంతకం చేశారు. ఆ మరుక్షణం నుంచి టీఆర్ఎస్ ‘బీఆర్ఎస్’గా మారిపోయింది. ఆ తర్వాత బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు కేసీఆర్. బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయాన్ని కొత్త జెండాలతో అందంగా అలంకరించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి, సినీనటుడు ప్రకాశ్ రాజ్ ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
నటుడు ప్రకాశ్ రాజ్. బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక లేదా తమిళనాడుకు పార్టీ అధికార ప్రతినిధిగా ప్రకాశ్ రాజ్కు కేసీఆర్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ తరఫున ప్రకాశ్ రాజ్. బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
కర్ణాటకలో జేడీఎస్తో బీఆర్ఎస్ కలిసి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు, మరికొన్ని స్థానాల్లో జేడీఎస్ అభ్యర్థులు (పార్లమెంట్ స్థానాలకు) బరిలో ఉండే అవకాశం ఉంది. బెంగళూరు సెంట్రల్ స్థానం నుంచి ప్రకాశ్ రాజ్. బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కేంద్రంలోని బీజేపీ సర్కార్కు వ్యతిరేకంగా ప్రకాశ్ రాజ్ కొంత కాలంగా తన గళాన్ని వినిపిస్తున్నారు. కేసీఆర్ భావజాలంతో ఏకీభవిస్తూ పలుమార్లు మద్దతు ప్రకటించారు. పలుమార్లు ప్రగతి భవన్కు వచ్చి కేసీఆర్తో జాతీయ రాజకీయాలపై చర్చించారు. పార్టీ విధి విధానాల రూపకల్పనలోనూ ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో కేసీఆర్ కర్ణాటక పర్యటన సమయంలోనూ ప్రకాశ్ రాజ్ ఆయన వెంట ఉన్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో జాతీయ రాజకీయాలపై కేసీఆర్ చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రకాశ్ రాజ్ ప్రశంసలు కురిపించారు. రైతు బంధు, పల్లె ప్రగతి, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలను ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపించారు. హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్నారు. మహబూబ్నగర్లో ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రకాశ్ రాజ్. నాటి నుంచి కేసీఆర్కు ఆయన దగ్గరయ్యారు.
కర్ణాటకకు చెందిన ప్రకాశ్ రాజ్. విలక్షణ నటుడిగా దక్షిణాదితో పాటు బాలీవుడ్లోనూ మంచి గుర్తింపు సాధించారు. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఆయనకు మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కోసం ప్రకాశ్ రాజ్ సేవలను, ఆయన చరిష్మాను సమర్థంగా వినియోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. | 1 | ['tel'] |
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి:
వడ గండ్లతో కూడిన అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి చెప్పారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన ప్రాంతాల్లో వర్షాలు తగ్గగానేవ్యవసాయ, ఉద్యాన, వాణిజ్య పంటల నష్టం అంచనా వేస్తారన్నారు. పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీతో పాటు వాతావరణ ఆధారిత పంటల బీమా, దిగుబడి ఆధారిత బీమా ద్వారా నిర్దేశించిన పరిహారాన్ని రైతులకు అందిస్తామని చెప్పారు. | ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'పంట నష్టానికి పరిహారాన్ని ఇస్తాం'. | 2 | ['tel'] |
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
కర్నాటక కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్పై మరికాసేపట్లో సుప్రీం కోర్టులో విచారణ విచారణ జరగనుంది. స్పీకర్ తమ రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడం లేదని 15 మంది కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జులై 18న బల నిరూపణ నేపథ్యంలో సుప్రీం తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. | ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'కాసేపట్లో కర్నాటక కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్పై సుప్రీంలో విచారణ'. | 2 | ['tel'] |
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి:
ముంబై ఇండియన్స్ ప్లేయర్ కీరన్ పొలార్డ్కు మ్యాచ్ ఫీజులో కోత విధించారు. ఆదివారం ఉప్పల్ మైదానంలో చెన్నైతో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో పొలార్డ్కు 25 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించారు. అంపైర్ల నిర్ణయంపై పొలార్డ్ అసహనం వ్యక్తం చేయడం వల్ల అతనికి ఈ జరిమానా పడింది. బ్రావో వేసిన చివరి ఓవర్లో స్ట్రయికింగ్లో ఉన్న పోలార్డ్. అంపైర్ల నిర్ణయం పట్ల తనదైన స్టయిల్లో నిరసన వ్యక్తం చేశాడు. ఆ ఓవర్లో బ్రావో వరుసగా రెండు బంతులను ఆఫ్సైడ్ వేశాడు. సైడ్లైన్ బయట బంతులు పడినా ఫీల్డ్ అంపైర్ వాటిని వైడ్గా ప్రకటించలేదు. దీంతో చిర్రెత్తిన పొలార్డ్ తన బ్యాట్ను గాలిలోకి విసిరేశాడు. ఆ తర్వాత బ్రావో మరో బంతి వేసేందుకు లైనప్ తీసుకోగా. పోలార్డ్ వికెట్లను వదిలేసి చాలా దూరంగా స్ట్రయికింగ్ తీసుకున్నాడు. దీంతో కాసేపు పొలార్డ్, ఫీల్డ్ అంపైర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ మ్యాచ్లో పొలార్డ్ అజేయంగా 41 రన్స్ చేశాడు. థ్రిల్లింగ్ ఫైనల్ను ముంబై గెలుచుకున్నది. | ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'కీరన్ పొలార్డ్కు జరిమానా'. | 2 | ['tel'] |
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి:
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణం 4, 5 వార్డుల్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం పర్యటించారు. వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అలానే ఇటీవల మరణించిన కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను, అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలను పరామర్శించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ బాబాయ్ వివేకా హత్య చేయించింది అబ్బాయి జగన్ రెడ్డే నని అన్నారు. అవినాష్ రెడ్డి హత్య చేయించాడని తేలిపోయిందని ఇక జగన్ రెడ్డి పాత్ర పై సీబీఐ విచారణ జరగాలని అన్నారు.
నాడు సొంత పత్రికలో నారాసుర రక్త చరిత్ర అని అసత్య ప్రచారం చేసారని, నేడు బాబాయ్ పై గొడ్డలి వేటు జగనాసుర రక్త చరిత్ర అని అందరికి అర్థమైందని అన్నారు. రాజధాని పై కోర్టు తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా రైతులు శాంతియుతంగా పోరాడి విజయాన్ని సాధించారని స్పష్టం చేశారు. ఇది ముమ్మాటికీ రైతుల విజయమేనని ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు న్యాయ వ్యవస్థను కించపర్చడం మాని తీర్పుని గౌరవించి అమరావతిని అభివృద్ధి చెయ్యాలని సూచించారు.
జడ్జీలను సైతం కించపరిచే విధంగా పోస్టులు పెట్టించింది వైసిపి ప్రభుత్వమేనని ఆ కేసులో వైసిపి నేతలు అరెస్ట్ అయ్యారని గుర్తు చేశారు. మరోసారి వైసిపి నేతలు న్యాయ వ్యవస్థను తప్పు పడుతూ మాట్లాడుతున్నారని న్యాయం రైతుల వైపు ఉంది కాబట్టే తీర్పు అనుకూలంగా వచ్చిందని అన్నారు.
మూడు ముక్కలాట మూర్ఖత్వాన్ని వీడి ఒకే రాష్ట్రం- ఒకే రాజధానికి వైసిపి కట్టుబడాలని అన్నారు. అనంతరం మంగళగిరి పట్టణం లో మహిళలు, చిరు వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. | ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'సీఎం జగన్ పై నారా లోకేష్ సంచలన విమర్శలు'. | 2 | ['tel'] |
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి:
అత్యంత సంపన్న ఆలయాల్లో మహారాష్ట్ర షిర్డీ సాయిబాబా టెంపుల్ ఒకటి. సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకూ అంతా ఆయన భక్తులే. అయితే, భక్తుల కానుకలు సాయిబాబా ఆలయానికి కొత్త కష్టాలు తెచ్చాయి. పెద్ద మొత్తంలో చిల్లర నాణేలను కానుకగా హుండీలో వేయడంతో టెంపుల్ సంస్థాన్ ఇబ్బందులు పడుతోంది. దాదాపు 3 ట్రక్కుల వరకూ నిండాయని, బ్యాంకుల లాకర్లు సైతం చిల్లరతో నిండిపోయాయని అధికారులు వివరించారు. | ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'షిర్డీ సాయి ఆలయానికి కాయిన్ కష్టాలు'. | 2 | ['tel'] |
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి:
ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్స్టార్ట్ డేస్ సేల్ ప్రారంభమైంది. డిసెంబర్ 31 వరకు ఇయర్ ఎండ్ సేల్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సేల్కు కొనసాగింపుగా ఫ్లిప్స్టార్ట్ డేస్ సేల్ ప్రారంభించింది ఫ్లిప్కార్ట్. ఈ సేల్ మూడు రోజుల పాటు కొనసాగుతుంది. జనవరి 3న సేల్ ముగుస్తుంది. ఈ సేల్లో భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది ఫ్లిప్కార్ట్. స్మార్ట్వాచ్ల నుంచి స్మార్ట్ టీవీల వరకు అనేక ప్రొడక్ట్స్పై ఆఫర్స్ ఉన్నాయి. చాలావరకు ప్రొడక్ట్స్పై 70 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ సేల్లో స్మార్ట్ఫోన్లపై పెద్దగా ఆఫర్స్ లేవు. ఇతర ప్రొడక్ట్స్పై మంచి డిస్కౌంట్స్ పొందొచ్చు. స్మార్ట్వాచ్లు రూ.1,299 నుంచే మొదలవుతాయి. షావోమీ, రియల్మీ, సాంసంగ్, హానర్, యాపిల్ లాంటి కంపెనీల స్మార్ట్వాచ్లపై డిస్కౌంట్స్ ఉన్నాయి.
స్మార్ట్టీవీ కొనాలనుకునేవారికి ఈ సేల్లో మంచి ఆఫర్స్ ఉన్నాయి. నోకియా, సాంసంగ్, రియల్మీ, థామ్సన్, షావోమీ ఎంఐ టీవీలపై డిస్కౌంట్స్ ఉన్నాయి. స్మార్ట్ టీవీల ధర రూ.8,999 నుంచే ప్రారంభం కావడం విశేషం. రూ.10,000 బడ్జెట్లో మంచి స్మార్ట్ టీవీ కొనొచ్చు. ఇక ఫ్లిప్స్టార్ట్ డేస్ సేల్లో ల్యాప్టాప్స్పైన డిస్కౌంట్స్ ఉన్నాయి. 30 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. హెచ్పీ 14ఎస్ కోర్ ఐ5, ఏసుస్ వివోబుక్ 15, యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్, లెనోవో ఐడియాప్యాడ్ ఎస్145 లాంటి ల్యాప్టాప్స్ తగ్గింపు ధరలకే కొనొచ్చు. ఫోటోగ్రఫీ కోసం మంచి కెమెరా కొనాలనుకునేవారికి సోనీ, కెనాన్, ప్యానాసోనిక్, నికాన్ లాంటి కంపెనీల కెమెరాలపై ఆఫర్స్ ఉన్నాయి. | ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'ఫ్లిప్కార్ట్లో డిస్కౌంట్ సేల్'. | 2 | ['tel'] |
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
ముంబైకి గట్టి షాకిచ్చిన ఆల్ రౌండర్ ప్యాట్ కమిన్స్ | అనుకొన్నది ఒకటి అయిందొక్కటి అన్నట్లుగా ఐపీఎల్ లో తాజా పరిస్థితులు నెలకొన్నాయి. గెలుస్తాం. అని ధీమాగా సాగుతున్న ముంబైకి విధ్వంసకర ఇన్నింగ్స్ తో కోల్ కతా ఆల్ రౌండర్ ప్యాట్ కమిన్స్ భారీ షాకే ఇచ్చాడు. ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ నమోదు చేసిన ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును సమం చేసిన కమిన్స్ పై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన ఇన్నింగ్స్ పై కమిన్స్ తాజాగా స్పందించాడు. అసలు తానే నమ్మలేకపోతున్నానని వ్యాఖ్యానించాడు. ఆ ఇన్నింగ్స్ తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. ఇంకా చెప్పాలంటే అందరికన్నా తానే ఎక్కువ షాక్ కు గురయ్యానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏదైతేనేం తాను బాగా ఆడినందుకు ఆనందంగా ఉందన్నాడు.
మంచి చోట బంతి పడితే స్టాండ్స్ కు పంపాలని ముందే ఫిక్సయ్యానని అతడు చెప్పాడు. ఈ సీజన్ లో ఫస్ట్ గేమ్ లోనే ఇలా ఆడడం మజా ఇచ్చిందన్నాడు. బౌండరీ చాలా చిన్నగా ఉందని, దాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించానని వివరించాడు. మెగా వేలం తర్వాత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయన్నాడు. ముంబై నిర్దేశించిన 161 పరుగులు లక్ష్యాన్ని నిన్న కోల్ కతా నాలుగు ఓవర్లు మిగిలుండగానే ఛేదించిన సంగతి తెలిసిందే. కమిన్స్ 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ మార్కును అందుకుని ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును సమం చేశాడు. | 1 | ['tel'] |
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
మరదలు స్నానం చేస్తుంటే వీడియో తీసి... | తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో భార్యతో ఏర్పడిన తగాదాల కారణంగా మరదలు స్నానం చేస్తుంటే వీడియో తీసి. ఆ వీడియోను భార్యకు. ఆమె కుటుంబీకులకు పంపిన కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే. చెన్నై వలసరవాక్కంకు చెందిన దినేష్ ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. అతనికి వివాహమై ఏడేళ్ల కుమారుడు వున్నాడు.మద్యానికి బానిసైన ఇతడు భార్యతో అప్పుడప్పుడు తగాదాకు దిగేవాడు. ఈ కారణం చేత దినేష్ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో ఆవేశానికి గురైన దినేష్ తన అత్తారింటికి షాకివ్వాలనుకున్నాడు. ఇంకా భార్యను బ్లాక్ మెయిల్ చేసి కాపురానికి రప్పించాలనుకున్నాడు.
ఇందులో భాగంగానే మరదలి స్నానం చేసే వీడియో తన వద్ద వుందని. కాపురానికి రాకపోతే. ఆ వీడియోను ఆమె కుటుంబ సభ్యులకు, సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. చెప్పినట్లే. దినేష్ తన మరదలి స్నానపు వీడియోను భార్యకు, ఆమె బంధువులకు వాట్సాప్ ద్వారా పంపాడు.దీంతో షాకైన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దినేష్ను అరెస్టు చేశారు. ఆ వీడియోను మరదలు అక్క ఇంటికి వచ్చినప్పుడు ఆమెకు తెలియకుండానే తీసినట్లు దినేష్ ఒప్పుకున్నాడు.
| 1 | ['tel'] |
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
రాజస్థాన్: ఏటీఎంను పగులగొట్టడానికి ఎంతో కష్టపడాలి. అంత టైమ్ లేదనుకున్నారో ఏమో. ఏకంగా ఏటీఎం మిషన్నే దోచుకెళ్లారు. ఈ ఘటన బూందిలోని నైన్వాలో జరిగింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం మిషన్ను నలుగురు వ్యక్తులు ఎత్తుకెళ్లిన ఘటన మొత్తం ఏటీఎం సెంటర్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దుండగులు ఎత్తుకెళ్లిన ఏటీఎం మిషిన్లో రూ.5 లక్షలు ఉన్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. | ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'ఏటీఎం మిషన్ను ఎత్తుకెళ్లిన దుండగులు'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
రెస్టారెంట్ నుంచి పారిపోయిన కస్టమర్లు | ముందు వెళ్తున్న గొర్రెను మిగిలిన గొర్రెలు గుడ్డిగా అనుసరిస్తాయని మనకు తెలుసు. అయితే అలాంటి అమాయకత్వం మనుషులలో కూడా ఉంటుంది. తాజాగా బ్రెజిల్లో ఈ తరహా ఘటన జరిగింది. రెస్టారెంట్ వెలుపల కొందరు కసరత్తులలో భాగంగా రన్నింగ్ చేయడం ప్రారంభించారు. అయితే ఈ ఘటనతో సమీపంలోని రెస్టారెంట్లో తింటున్న కస్టమర్లు భయపడ్డారు. ఏదో జరిగిందని భావించి, తింటున్నది మధ్యలోనే వదిలేసి పారిపోయారు. తీరా అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. దీనిని ట్విట్టర్లో పోస్ట్ చేయగా నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. అయితే పారిపోయిన వారు బిల్లు చెల్లించారో లేదోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. | 1 | ['tel'] |
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
ఎలాన్ మస్క్ తల్లి కీలక వ్యాఖ్యలు | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు సొంత ఇల్లు అంటూ లేదు. దీంతో ఆయన తల్లి మే మస్క్ ఇటీవల ఓ కారు గ్యారేజీలో పడుకుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియాతో ఆమె తాజాగా వెల్లడించింది. తనకు అంగారక గ్రహంపైకి వెళ్లాలనే కోరిక లేదని కీలక వ్యాఖ్యలు చేసింది. 'స్పేస్ ఎక్స్' ద్వారా అంతరిక్షంలోకి మనుషులను పంపేలా ఎలాన్ మస్క్ కృషి చేస్తున్నాడు. ఈ తరుణంలో ఆయన తల్లి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. | 1 | ['tel'] |
క్రింది వార్తా కథనానికి శీర్షికను రాయండి:
జమ్మూకాశ్మీర్ కొన్ని ఉగ్రవాదులు పెట్రేగి పోతున్నారు. ముఖ్యంగా భద్రత దళాలే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు ఈ నేపథ్యంలో తాజాగా మరో దాడికి ఉగ్రవాదులు ఒడిగట్టారు శ్రీనగర్ శివార్లలోని జెవాన్ ప్రాంతంలో ఓ పోలీస్ బస్సుపై ఉగ్రవాదులు భారీగా కాల్పులకు తెగబడ్డారు. పోలీస్ శిబిరానికి సమీపంలోని పంతా చౌక్ వద్ద ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించారు.ఘటనపై సమాచారం అందుకున్న సాయుధ బలగాలు వెంటనే ఆ ప్రదేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. కొన్నిరోజుల కిందట కూడా ఇదే తరహాలో ఓ పోలీస్ బస్సుపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. డిసెంబరు 10న బందిపొరా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మరణించారు. ఇటీవల కశ్మీర్ లోయలో వలస కూలీలపై జరిగిన దాడుల తర్వాత ఉగ్రవాదులు పోలీస్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. | ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'జమ్మూ కశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు... ఇద్దరు పోలీసుల మృతి'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి:
పెద్దపల్లి: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 144.57 మీటర్లు గా ఉంది. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 148 మీటర్లు. ఎల్లంపల్లి ప్రస్తుత సామర్థ్యం 11.79 టీఎంసీలుగా ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు. ఎల్లంపల్లి ఇన్ ఫ్లో 2022 కాగా. ఔట్ ఫ్లో 660 క్యూసెక్కులుగా ఉంది. | ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 144.57 మీటర్లు'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
బండ్లమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ మంత్రి | గుంటూరు, బాపట్ల: పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బండ్లమ్మ తల్లి అమ్మవారిని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, ఆయన కుమారుడు మధుసూదన్ రెడ్డి దర్శించుకున్నారు. గురువారం బండ్లమ్మ తల్లి దేవాలయానికి వచ్చిన వెంకట రెడ్డి కుమారుడితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాదె వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. బండ్లమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు | 1 | ['tel'] |
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి:
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 12,751 కోవిడ్ పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. అంతేకాకుండా 16,412 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా యాక్టిక్ కేసుల సంఖ్య 1,31,807కు చేరుకుంది. డైలీ పాజిటివిటీ రేటు 3.05 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. | ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు'. | 2 | ['tel'] |
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఈనెల 8న తమిళసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 8న ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర ఎస్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొననున్నారు. ఇకపోతే తెలంగాణ రాష్ట్రానికి రెండో గవర్నర్ గా, తొలి మహిళా గవర్నర్ గా రికార్డు సృష్టించబోతున్నారు సౌందర రాజన్. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త గవర్నర్గా తమిళిసై సౌందర రాజన్ నియామకాన్ని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. అటు ప్రస్తుత గవర్నర్ నరసింహన్ ఈనెల 7న బాధ్యతల నుంచి వైదొలగనున్నారు.మరోవైపు కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఈ నెల 11వ తేదీన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. | ఇచ్చిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'ఈనెల 8న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళసై ప్రమాణం'. | 2 | ['tel'] |
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి:
ప్రమాదంపై పోలీస్ స్టేషన్ లో సంపూర్ణేశ్ బాబు ఫిర్యాదు | సిద్దిపేట కొత్త బస్టాండ్ వద్ద సినీ నటుడు సంపూర్ణేశ్ బాబుకు ఈ రోజు ఉదయం ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. ఆయన కారును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో. కారు స్వల్పంగా ధ్వంసమైంది. అనంతరం ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు ఆ కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ ప్రమాదంపై సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సంపూర్ణేశ్ బాబు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్సు తాత్కాలిక డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యం మత్తులో డ్రైవింగ్ చేశాడా? అన్న విషయంపై పోలీసులు ఆరా తీశారు. డ్రైవర్ ను బ్రెత్ ఎనలైజర్ తో పరీక్ష చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. | 1 | ['tel'] |
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి:
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ రాజమౌళి గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బాహుబలి గురించి ఆ సినిమాలోని కట్టప్ప పాత్ర గురించి చేసిన కామెంట్స్ చేశారు. తన దృష్టిలో ఇండియన్ సినిమా అంటే 'బాహుబలి' అని అంటూ భవిష్యత్ భారతీయ సినిమాలకు 'బాహుబలి' ఒక రోడ్ మ్యాప్లా మారుతుంది అంటూ ఒక సంచలన కామెంట్స్ చేశాడు.
తాను 'చెన్నై ఎక్స్ ప్రెస్' సినిమాలో నటిస్తున్న రోజులలో 'బాహుబలి' ప్రారంభమైందని. తాను మూడు సినిమాలలో నటించినా ఇంకా 'బాహుబలి-2' నిర్మాణం జరుగుతూనే ఉన్న నేపథ్యాన్ని పేర్కొంటూ అలాంటి పాత్ బ్రేకింగ్ సినిమాలను తీయడం ఒక రాజమౌళికే కుదురుతుందని జక్కన్నను ఆకాశానికి ఎత్తేశాడు. అంతేకాదు అలాంటి సినిమాలలో నటించాలని తనకు కూడ కోరిక ఉందంటూ రాజమౌళికి గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నాడు షారూఖ్ ఖాన్.
ఇదే సందర్భంలో తాను ముంబైలో ఉంటున్నా తెలుగు రాష్ట్ర ప్రజల సమస్యల గురించి తెలుసుకుంటూ ఉంటానంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు షారూఖ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పెషల్ స్టేటస్ కోరుకోవడం మంచి విషయం అని చెపుతూ ప్రజలు ఎన్నో ఆశలతో కోరుకుంటున్న కోర్కెలను తీర్చడంలో ప్రభుత్వాలు ముందడుగు వేస్తే బాగుంటుందని తెలిపాడు. | ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'ఇండియన్ సినిమా అంటే బాహుబలి... జక్కన్న సినిమాలో నటించాలనుంది: షారూఖ్'. | 2 | ['tel'] |
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్ట్ | రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎన్టీపీసీ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. గురువారం గౌతమినగర్లో గంజాయి విక్రయాలపై ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ విభాగం దర్యాప్తు చేయగా గాంధీనగర్కు చెందిన కౌశిక్, మార్కండేయ కాలనీకి చెందిన దినేష్ అనే ఇద్దరు యువకులను పోలీసులు విచారించినట్లు రామగుండం సీఐ కణతల లక్ష్మీనారాయణ, ఎస్ఐ స్వరూప్రాజ్ తెలిపారు. 300 గ్రాముల కవర్లు. 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం వారిని కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. నిందితులను పట్టుకుని గంజాయి నిర్మూలనలో చాకచక్యంగా కృషిచేస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు. | 1 | ['tel'] |
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
సీఎం జగన్ పై విమర్శలు గుప్పించిన నారా లోకేష్... | ఏపీలో మహిళలకు డ్వాక్రా చెల్లింపుల అంశంలో సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శలు చేశారు. "డ్వాక్రా మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తానన్న మీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పావలా వడ్డీ పేరుతో ఐదేళ్లలో రూ.268 కోట్లు మాత్రమే విదిల్చాడు. నువ్వేమో నెలకు రూ.3 వేల చొప్పున ఐదేళ్లు ఇస్తామని చెప్పి, ఆ మొత్తంలో సగం కోసేసి రూ.1,500 చొప్పున నాలుగేళ్లకే పరిమితం చేశావు. మీ నాన్నది నయవంచన అయితే నీది విశ్వాసఘాతుకం. మీ వంశమే మోసానికి ప్రతిరూపం అని నిరూపించుకున్నావు జగన్!" అంటూ లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. | 1 | ['tel'] |
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
భైంసాలో దళితుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. భైంసాలో 144 సెక్షన్ అమలైంది. భైంసా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.భైంసాలో దళితుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. భైంసాలో 144 సెక్షన్ అమలైంది. భైంసా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. | ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'భైంసాలో కొనసాగుతున్న దళితుల ఆందోళనలు'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి:
విశాఖపట్నం: నడిరోడ్డుపైనే ఓ కారు మంటల్లో చిక్కుకుని దహనమైన ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. నక్కపల్లి మండలం ఉద్ధండపురం జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారుకు విధికుక్క అడ్డువచ్చింది. దీంతో సడన్ బ్రేక్ వేయడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అంతేకాదు వెనకనుండి వచ్చిన మరో కారు కూడా ఈ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుండి ఇద్దరు చిన్నారులతో సహా మరొక నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేసారు. అప్పటికే కారు ముందుభాగం మొత్తం అగ్గికి ఆహుతయ్యింది. | ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం...'. | 2 | ['tel'] |
కింది వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి:
మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. స్పోర్ట్స్ మీట్లో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బందికి నిర్వహిస్తున్న క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ తదితర క్రీడా పోటీలను బుధవారం పోలీసు కమిషనర్ ప్రారంభించారు. మానసిక ఉల్లాసం కోసం క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విధి నిర్వహణ, క్రీడలతో పాటు వాకింగ్, యోగా సాధన చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ పోటీలు వారం రోజుల పాటు జరుగుతాయని, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన జట్లకు బహుమతులు అందజేస్తామన్నారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆర్ఎస్ఐ అడ్మిన్ శ్రీధర్ రెడ్డికి సూచించారు. రాజశేఖర్రెడ్డి, రామకృష్ణ, రవికుమార్ లు లైజనింగ్ అధికారులుగా వ్యవహరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ రామచందర్ రావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ రఘుపతిరెడ్డి, టూ టౌన్, త్రీటౌన్ శిథిల ఏసీపీలు రవికుమార్, భానుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. | ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చు: పోలీసు కమిషనర్'. | 2 | ['tel'] |
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు | దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ శుక్రవారం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు మంత్రులకు, చీఫ్ విప్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవి నవరాత్రుల సందర్భంగా వారు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వారికి ఆలయ పూజారులు అమ్మవారి తీర్థ, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతూ. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని వేడుకున్నట్టు పేర్కొన్నారు. మంత్రులకు స్వాగతం పలికిన వారిలో ఆలయ అధికారులు, వేద పండితులు, పాలకవర్గ సభ్యులున్నారు. | 1 | ['tel'] |
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
దేశవ్యాప్తంగా ఇంధన ధరలు రోజురోజుకి పెరిగిపోతోన్న తరుణంలో కొనుగోలదారుల దృష్టి ఎలక్ట్రిక్ వాహనాలపై పడుతోంది. ఇప్పటికే దేశంలో యూలు, వోగోలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు తయారు చేస్తున్నాయి. అయితే అద్దెకు బైక్లను ఇచ్చే బౌన్స్ కంపెనీ 'బౌన్స్-ఈ ఎలక్ట్రిక్ స్కూటర్'ను ఇండియాలో త్వరలోనే ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు కంపెనీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు వివేకానంద హెల్లెకెరె ట్విటర్ ద్వారా వివరాలు వెల్లడించారు.
'బౌన్స్-ఈ ఎలక్ట్రిక్ స్కూటర్'కు సంబంధించి గత సెప్టెంబర్లో ఐసీఏటీ నుంచి అధికార ధ్రువీకరణ పత్రం అందుకున్న తొలి కంపెనీ మాదే అని సీఈవో హెల్లెకెరె తెలిపారు. ఇండియాలో కూడా ఇదే ధ్రువపత్రం తీసుకున్న తొలి బైక్ షేరింగ్ కంపెనీ తమదేనన్నారు. డిమాండ్కు అనుగుణంగా బౌన్స్ ఆప్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను అద్దెకు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. బౌన్స్ కంపెనీ ప్రస్తుతం బెంగళూరు, హుబ్లీ, విజయవాడ, మైసూర్లలో ద్విచక్రవాహనాలను అద్దెకు ఇస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రస్తుతం బెంగళూరు, మైసూరులలో టెస్టింగ్ చేస్తున్నట్లు హెల్లెకెరె తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లాజిస్టిక్స్, డెలివరీ కంపెనీలకు అమ్మేందుకు కృషి చేస్తున్నట్లు గతంలోనే హెల్లెకెరె తెలిపారు.
ఇక ధర విషయానికి వస్తే ఇండియాలో రూ.55,000 నిర్ణయించనున్నట్లు సమాచారం. బ్యాటరీ మార్పిడి, నిర్వహణ ఖర్చుల కోసం వినియోగదారుడు అధనంగా మరో రూ.1,450 భరించవలసి ఉంటుంది. ఇక 'ఎలక్ట్రిక్ స్కూటర్' పసుపు, నలుపు రంగుల్లో లభించనుంది. రెండు హెల్మెట్లు భద్రపరుచుకోవడానికి వెసులుబాటు ఉంది. ఒకసారి ఛార్జి చేస్తే 65 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. | ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'త్వరలో బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్'. | 2 | ['tel'] |
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి:
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఒడిశాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం భువనేశ్వర్లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్రపతిని రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, గవర్నర్ గణేశిలాల్ కలిశారు. ద్రౌపది ముర్ము జూలై 25 నుండి 27 వరకు ఒడిశాలో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు.రాష్ట్రపతి సెక్రటేరియట్ నుండి అధికారిక ప్రకటన ప్రకారం, అధ్యక్షుడు ముర్ము 'అటుట్-బంధన్' కుటుంబం స్పాన్సర్ చేసిన వైద్య విద్యార్థుల బృందంతో సంభాషించనున్నారు మరియు భువనేశ్వర్లో రాజ్ భవన్ ఒడిశా యొక్క కొత్త బిల్డింగ్ బ్లాక్కు శంకుస్థాపన చేస్తారు. | ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'ఒడిశా చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము'. | 2 | ['tel'] |
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి:
10 రోజులలో... 5 అత్యాచారాలు...! | హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలో 10 రోజుల వ్యవధిలో 5 అత్యాచారాల ఘటనలు వెలుగు చూశాయి. కాగా అన్ని కేసుల్లోనూ బాలికలపైనే లైంగిక దాడులకు పాల్పడడం గమనార్హం. జూబ్లీహిల్స్ లో బాలికపై గ్యాంగ్ రేప్ మరువక ముందే మొఘులురాలో, కాలాపత్తర్, రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలో ఘటనలు వెలుగు చూడగా. తాజాగా సికింద్రాబాద్ కార్ఖానాలో బాలికపై గ్యాంగ్ రేప్ జరగడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. | 1 | ['tel'] |
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
ప్రెషర్ బాంబు పేలుడు... జవాన్ మృతి | ఛత్తీస్ గడ్ లో మావోయిస్టులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. దంతెవాడ జిల్లాలో ప్రెషర్ బాంబు పేలి జవాన్ మృతి చెందాడు. ఇంద్రావతి నది వంతెన నిర్మాణ పనులు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఆ వంతెన నిర్మాణ పనులకు సెక్యూరిటీగా జవాన్లు ఉన్నారు. లక్ష్మీకాంత్ అనే సీఏఎస్ఎఫ్ 22వ బెటాలియన్ జవాన్ పొరపాటున ప్రెషర్ బాంబుపై అడుగువేయడంతో పేలుడు సంభవించింది. | 1 | ['tel'] |
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
శ్రీవారి ఆర్జిత సేవక్వం, దర్శనం టిక్కెట్ల షెడ్యూల్ విడుదల | భక్తుల సౌకర్యార్థం శ్రీవారి ఆర్జిత సేవ, దర్శనం టిక్కెట్లను ఆన్లైన్ కోటాలో బుక్ చేసుకునేందుకు టీటీడీ షెడ్యూల్ విడుదల చేసింది. ప్రతినెలా 18 నుంచి 20వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవలో లక్కీ డిప్ నమోదు చేసుకోవచ్చు. ఈ లక్కీ డిప్లో టిక్కెట్లు పొందిన భక్తులు 20 నుంచి 22వ తేదీలోపు డబ్బులు చెల్లించి టిక్కెట్లను ఖరారు చేసుకోవాలి.కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకరణ సేవతో పాటు వర్చువల్ సేవా టిక్కెట్లను ప్రతి నెల 21న విడుదల చేస్తారు. శ్రీవాణి, అంగ ప్రదక్షిణ, వృద్ధులు, వికలాంగుల దర్శనం టిక్కెట్లు ప్రతి నెల 23న, రూ.300 దర్శనం టిక్కెట్ కోటా ప్రతి నెల 24న, తిరుపతి గది కోటా ప్రతి నెల 25న, తిరుమల గది కోటా ప్రతి నెల 26న విడుదల చేయనున్నారు. | 1 | ['tel'] |
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
మీకు మేం అండగా ఉంటాం...శ్రీలంకకు భారత్ అభయం | తొలి నుంచి శ్రీలంకకు చేయూతనిస్తున్న భారత దేశం మరోమారు ఆ దేశ ప్రజల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేసింది. తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. శ్రీలంక ప్రజలకు భారత్ మద్దతు ప్రకటించింది. సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రజాస్వామ్య విలువలతో, రాజ్యాంగ వ్యవస్థల అండతో తమ ఆశలను సాకారం చేసుకునేందుకు ఉద్యమిస్తున్న శ్రీలంక ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తున్నాం అంటూ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఏడాది తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కుదేలైన శ్రీలంకకు ఇప్పటిదాకా 3.8 బిలియన్ డాలర్ల మేర ఆర్థికసాయం అందించినట్టు తెలిపింది. శ్రీలంకలో తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని వివరించింది. | 1 | ['tel'] |
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి:
చంద్రబాబుతో కీలకంగా ఉన్న ఒక్కొక్కరినీ అరెస్ట్ చేస్తున్నారని మాజీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ కక్ష సాధింపే అని మాజీ ఎంపీ జెసి అన్నారు. చంద్రబాబు జోలికి వెళ్తే భస్మమే అని అన్నారు. ఇవాళ ఉదయం జేసీ ప్రభాకర్ రెడ్డి ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే | ఇచ్చిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'చంద్రబాబుతో ఉన్న ఒక్కొక్కరినీ అరెస్ట్ చేస్తున్నారు. జెసి దివాకర్ రెడ్డి'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
రష్యా- ఉక్రెయిన్ వార్... ముడి సరుకుల ధరల పెంపు | రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సన్ ఫ్లవర్, పామాయిల్, సోయాబీన్ ఆయిల్ దిగుమతులపై ప్రభావం పడింది. సబ్బుల తయారీ కంపెనీలు దాదాపు పామాయిల్ను తమ ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తాయి. ఈ నేపథ్యంలో హెచ్యూఎల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.హిందుస్థాన్ యూనీలీవర్ కంపెనీ సబ్బులు, డిటర్జెంట్ల ధరలను 3-5 శాతం మేర పెంచింది. ముడి సరకు ధరలు పెరగడం, భవిష్యత్ లో మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ధరలను పెంచింది. దీంతో సర్ఫెక్సల్, వీల్, రిన్ వంటి డిటర్జెంట్ పౌడర్లతో పాటు డోవ్, లక్స్, పేర్స్, హమామ్, లిరిల్, రెక్సోనా వంటి సబ్బుల ధరలు కూడా పెరగనున్నాయి. తాజా పెంపుతో సర్ఫెక్సల్ డిటర్జెంట్ కేజీ రూ.130 నుంచి రూ.134కు పెరిగింది. లక్స్ సోప్ (100గ్రాములు× 4) ఏకంగా 6.66 శాతం పెరిగి రూ.160కి చేరింది. పియర్స్ (75 గ్రాములు×3) సబ్బుల ధర సైతం 5.4 శాతం పెరిగి రూ.135కి చేరింది. ఇతర కంపెనీలు సైతం ధరలు పెంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. బ్రిటానియా ఇండస్ట్రీస్ సైతం ధరల పెంచనున్నట్లు వెల్లడించింది. | 1 | ['tel'] |
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
హై... అలర్ట్-రాజమహేంద్రవరం విమానాశ్రయంలో విస్తృత తనిఖీలు | రాజమహేంద్రవరం విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. ఆదివారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ముంబాయి ఎయిర్పోర్టుకు హైజాక్ బెదిరింపు రావడంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాలను అత్యవసరంగా అప్రమత్తం చేశారు. ఇందులో భాగంగా ఇక్కడా అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. హై అలర్ట్తో తనిఖీలు.విమానాశ్రయంలో తనిఖీలు ముమ్మరం చేశారు. సాధారణ రోజుల కన్నా హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో విస్తృతంగా రక్షణ ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా ఎస్పీఎఫ్, ఎయిర్లైన్స్, పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు. విమానాశ్రయం ముఖద్వారంలో వాహనాలతో పాటు ప్రయాణికులను మూడు దశలుగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. టెర్మినల్ లోపలికి వచ్చిన బ్యాగులను స్క్రీనింగ్ చేయడంతో పాటు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విమానాశ్రయం లోపల, బయట ఆవరణలతో పాటు సమీప ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పది రోజులపాటు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలున్నాయి.
| 1 | ['tel'] |
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
పళనిస్వామికి రాజ్ భవన్ నుంచి పిలుపు | ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేసులో శశికళ నటరాజన్ జైలుకి వెళ్లడంతో తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రభుత్వ ఏర్పాటుపై ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు 11.30కి తనని కలవాలంటూ అన్నాడీఎంకే శాసనసభ పక్షనేత పళనిస్వామికి గవర్నర్ నుంచి పిలుపువచ్చింది. దీంతో గోల్డెన్ బే రిసార్టులో ఉన్న పళనిస్వామి అక్కడి నుంచి పలువురు మంత్రులతో కలిసి రాజ్భవన్కు బయలుదేరారు. ఈ భేటీ తరువాత ఇక ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ ఓ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పళనిస్వామికే ఆ అవకాశం ఇస్తారని అందరూ భావిస్తున్నారు. నిన్న పళనిస్వామితో పాటు పన్నీర్ సెల్వంతో కూడా విద్యాసాగర్ రావు చర్చించిన విషయం తెలిసిందే. తనకి పార్టీలో మెజారిటీ ఉందని పళనిస్వామి గవర్నర్ తో ఆ సందర్భంగా తెలిపారు. మరోవైపు పన్నీర్ సెల్వంకి పార్టీలో అంతగా మెజార్టీ లేకపోవడంతో గవర్నర్ పళనిస్వామికే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. | 1 | ['tel'] |
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి:
హరియాణాలో ఘోర ప్రమాదం జరిగింది. ఝజ్జర్ పరిధి బద్లీ సమీపంలోని కేఎంపీ ఎక్స్ప్రెస్వే పై కారును మరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, చిన్నారి ఉన్నారు. | ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'ఘోర రోడ్డు ప్రమాదం... 8 మంది మృతి'. | 2 | ['tel'] |
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
పార్వతీపురం మణ్యం జిల్లా, సీతానగరం రోడ్ బ్రిడ్జి మలుపు వద్ద బుధవారం ఆటో, బైక్ ఢీకొని ముగ్గురు యువకులకు గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళగా ఆ యువకులు బక్కుపేట గ్రామస్తులుగా గుర్తించారు. వీరిని చికిత్స నిమిత్తం పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రికి 108 వాహనం ద్వారా తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సీతానగరం అవుట్ పోస్ట్ పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. | ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'ఆటో, బైక్ ఢీకొని ముగ్గురు యువకులకు గాయాలు'. | 2 | ['tel'] |
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి:
రామాయంపేటలో గంగం పద్మ, వారి కుమారుడు గంగం సంతోష్ ఆత్మహత్య కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని జనగామ పట్టణంలో ఆర్యవైశ్యులు అందరూ కలిసి వారి కుటుంబానికి ఆత్మశాంతి కలగాలని శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులపై కఠినమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆర్యవైశ్యల పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహా సభ జనగామ జిల్లా అధ్యక్షులు మహంకాళి హరిశ్చంద్ర గుప్త, ఐ వి ఎఫ్ జిల్లా అధ్యక్షులు బిజ్జాల నవీన్ కుమార్, ఏ వి ఓ పి ఏ జిల్లా అధ్యక్షులు గంగిశెట్టి ప్రమోద్ కుమార్, జనగామ ఆర్యవైశ్య సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి గట్టు వెంకటేశ్వర్లు, జిల్లా కోశాధికారి జైన రమేశ్, సంఘ సభ్యులు గట్టు శ్రీను, శివరామకృష్ణ, అయిత శ్రీనివాస్, శరీరాల ఉపేందర్, కందుకూరు కైలాస్, సోమరాజు, కందుకూరు శ్రీనివాస్, సంతోష్, లగి శెట్టి వీరాలింగం, నల్ల మధు, తాడూరు సంతోష్, కందుకూరి కుమార్, నాగరాజు, కల్వకుంట్ల శ్రీనివాస్, పట్టురు శ్రీనివాస్, రమేష్, గాంధీ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. | ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
రైతులకు ఏం సమాధానం చెప్తారు? వైఎస్ జగన్ : దేవినేని ఉమా | పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరుగుతోందని టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ చేసిన ఫిర్యాదులే ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు శాపంగా మారాయని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. కమీషన్ల కోసం చంద్రబాబు నాయుడు కక్కుర్తి పడుతున్నారని, అందుకే ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.55,548 కోట్లకు పెంచారని, దీనిపై విచారణ జరపాలని విపక్ష నేత హోదాలో అప్పట్లో వైఎస్ జగన్ పంపిన ఫిర్యాదు లేఖలతో పాటు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ప్రసంగ పత్రాల వల్ల ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని దేవినేని పోస్ట్ చేశారు.
‘ప్రతిపక్షంలో ఉండగా పోలవరంపై తప్పుడు విమర్శలు, అసత్య ఆరోపణలు. పరిహారం, పునరావాసానికి అవినీతి కలర్. కేంద్రానికి నిత్యం ఫిర్యాదుల మీద ఫిర్యాదులు, విచారణ కోసం పట్టు. నేడు వెంటాడుతున్న గతం. గతంలో వైసీపీ వైఖరే పోలవరానికి పెను శాపంగా మారిందంటున్న రైతులకు ఏం సమాధానం చెప్తారు? వైఎస్ జగన్’ అని దేవినేని ఉమ నిలదీశారు. | 1 | ['tel'] |
కింది వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
2018 ఎన్నికలలో పార్టీ విజయం సాధించినా అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో ప్రమాణం చేసి 48 గంటలు గడవకముందే రాజీనామా చేసిన ఎడ్యురప్ప మరోమారు కన్నడ సిఎంగా గద్దెనెక్కనున్నారు. ఎన్నికలలో ప్రత్యర్ధులుగా పోటీచేసిన కాంగ్రెస్-జేడీఎస్ లు అధికారం కోసం ఏకమై సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు రడీ అయిన సమయంలో అసలు ఈ ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందో చూస్తానని వ్యాఖ్యానించారు. సరిగ్గా 14 నెలల అనంతరం తన మాట నిలుపుకుంటూ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయడానికి సిద్ధమయ్యారు. కుమార ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో ఆయనను ప్రభుత్వ ఏర్పాటు చేయమని గవర్నర్ ఆహ్వానించే అవకాశాలున్నాయి.యడ్యూరప్ప ఇప్పటి వరకు 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. దక్షిణ భారత దేశంలో బీజేపీకి చెందిన తొలి ముఖ్యమంత్రి యడ్యూరప్పే కావడం విశేషం. మూడుసార్లు (2007, 2008, 2018) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా మరోమారు సిఎం అయ్యే ఛాన్సు యడ్యురప్పకు వచ్చింది.
| ఇచ్చిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'యడ్యు శపథం నెరవేరింది - నాలుగో సారి సిఎంగా'. | 2 | ['tel'] |
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! | ఏపీలో సీఎం జగన్ పాల్గొనే 'రచ్చబండ' కార్యక్రమాన్ని సెప్టెంబరు 2 లేదా అక్టోబరు 2 నుంచి ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సీఎం జగన్ గ్రామ సచివాలయాలకు వెళ్లి స్థానిక ప్రజలతో సమావేశమవుతారని, వారికి ప్రభుత్వ పథకాలు ఎంత మేర అందుతున్నాయి. వాటిని పొందడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులేమైనా ఉన్నాయా? సిబ్బంది పనితీరు ఎలా ఉంటోంది? లాంటి అంశాలపై సీఎం జగన్ ప్రజలతో మాట్లాడి తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సెప్టెంబరు 2న వైఎస్ వర్థంతిని పురస్కరించుకొని 'రచ్చబండ' కార్యక్రమాన్ని ప్రారంభించడమా లేక అక్టోబరు 2న (గాంధీ జయంతి) మొదలు పెట్టాలా అనే విషయంపై చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. కరోనా థర్డ్ వేవ్ ప్రభావాన్ని బట్టి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 6న జరిగిన కేబినెట్ భేటీలో సీఎం త్వరలోనే తానూ సచివాలయాల సందర్శనకు వెళ్లనున్నట్లు మంత్రులకు చెప్పిన విషయం తెలిసిందే. | 1 | ['tel'] |
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటా: రోజా | హైదరాబాద్: ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటానని, జీవితాంతం జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటానని వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. లోకేష్ వ్యాఖ్యలపై రోజా స్పందించారు. జాతీయ జెండాకు వందనం చేయడం లోకేష్ నేర్చుకోవాలని తెలిపారు. జగన్కు సవాల్ విసిరే స్థాయి లోకేష్ది కాదని వ్యాఖ్యానించారు. | 1 | ['tel'] |
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమా రాజమహేంద్రవరం జైలు నుంచి గురువారం విడుదలయ్యారు. కృష్ణా జిల్లా కొండపల్లిలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో జి.కొండూరు పోలీసులు ఎస్సి, ఎస్టి అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద ఉమాపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన్ను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ దేవినేని ఉమా హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో దేవినేని ఉమా జైలు నుంచి విడుదలయ్యారు. | ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'జైలు నుంచి దేవినేని ఉమా విడుదల'. | 2 | ['tel'] |
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
ప్రాణాలు కాపాడిన హెల్మెట్ | అల్వాల్ లోతుకుంటలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. వాహనంపై ఉన్న ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అయితే వాహనం నడిపే వ్యక్తి హెల్మెట్ పెట్టుకోవడంతో ప్రాణాలు దక్కాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది. | 1 | ['tel'] |
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
ఎస్ఆర్ ఇన్నోవేషన్ ఎక్సేంజ్ సెంటర్ను ప్రారంభించిన కేటీఆర్ | వరంగల్: రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన హన్మకొండకు చేరుకున్నారు. కేటీఆర్కు మంత్రులు కడియం శ్రీహరి, చందూలాల్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అక్కడి నుంచి హసన్పర్తి మండలం అనంతసాగర్కు వెళ్లారు. అనంతసాగర్లో ఎస్ఆర్ ఇన్నోవేషన్ ఎక్సేంజ్ సెంటర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కడియం శ్రీహరి పాల్గొన్నారు. | 1 | ['tel'] |
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
ఉత్తరప్రదేశ్ లో ముగిసిన ఐదో దశ పోలింగ్ | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి 53.98 శాతం పోలింగ్ నమోదైంది. యూపీలోని 12 జిల్లాల్లోని 61 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది.మరోవైపు యూపీలో మరో రెండు దశల పోలింగ్ మిగిలి ఉంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. | 1 | ['tel'] |
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
హైదరాబాద్: రేపు రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర, సభలో పాల్గొననున్న జేపీ నడ్డా. రేపు మధ్యాహ్నం 12.40ని.లకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి జేపీ నడ్డా. నోవాటెల్ లో లంచ్. రోడ్డు మార్గాన పాలమూరుకి ప్రయాణం. మహబూబ్ నగర్ లో సభ.
| ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'రేపు రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా'. | 2 | ['tel'] |
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి:
న్యూఢిల్లి : ఢిల్లిలోని శాస్త్రి పార్కు ప్రాంతంలో ఒక రసాయన గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి కృషి చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. | ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'రసాయన గోదాములో భారీ అగ్ని ప్రమాదం'. | 2 | ['tel'] |
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
సీఎం కేసీఆర్ కు పాదాభివందనం చేస్తున్నా: ఎమ్మెల్యే వనమా | సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బోనస్ ప్రకటించడంపై కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. కార్మికుల తరపున సీఎం కేసీఆర్ కు పాదాభివందనం చేస్తున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ పాయింట్ వద్ద ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సింగరేణిలోని ప్రతి కార్మికుడికి రూ.1,00,899 చొప్పున బోనస్ ప్రకటించారని, గత ఏడాది ఇచ్చిన బోనస్ తో పోలిస్తే నలభై వేలకు పైగా పెంచారని కొనియాడారు. బోనస్ పెంచడంపై బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన తిప్పికొట్టారు. బీజేపీకి భయపడి బోనస్ పెంచారనడం ఓ అపోహ అని, అసలు, తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. మరో ఇరవై ఏళ్లు కేసీఆరే సీఎంగా వుంటారని వ్యాఖ్యానించారు. | 1 | ['tel'] |
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి:
ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఫోన్ చేశారు. యూపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు ప్రధానికి చంద్రబాబు అభినందనలు తెలిపారు. అభివృద్దితోనే విజయం ఉంటుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. | ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'ప్రధానికి అభినందనలు తెలిపిన చంద్రబాబు'. | 2 | ['tel'] |
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
రోజాపై నిప్పులు చెరిగిన ఆనం | టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ కి వెళ్లడంతో వైసీపీ మంత్రులు సంబరాలు చేసుకుంటున్నారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. మేయ్. రోజా నిన్ను, మీ నాయకుడిని అరెస్ట్ చేసి రోడ్డు మీద ఈడ్చుకెళ్లే రోజు దగ్గర్లోనే ఉంది అని మంత్రి రోజా కి హెచ్చరిక జారీ చేసారు. సెక్స్ రాకెట్తో నీకు సంబంధం ఉందో, లేదో తెలియదు కానీ, ఉండి ఉండొచ్చు కూడా. చంద్రబాబుకి మాత్రం సంబంధం లేదు. ఆఫ్ టిక్కెట్టు సీఎం ఆట మొదలెట్టాడు. ఆట మేము ముగిస్తాం అని ఆశాభావం వ్యక్తపరిచారు. | 1 | ['tel'] |
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
తన మాట వినలేదన్న అక్కసుతో సొంత తండ్రినే దారుణంగా నరికి చంపారు ఇద్దరు కుమారులు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలో ఈ ఘటన కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం. గ్రామానికి చెందిన మడివి బుచ్చయ్య (48). తన ఇద్దరు కుమారులు సోమయ్య, సన్యాసిరావులతో కలిసి నివసిస్తున్నాడు. నెల రోజుల నుంచి పొలానికి సంబందించిన విషయాలలో తండ్రీ కుమారుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. బుచ్చయ్య కొడుకులు సన్యాసిరావు,సోమయ్య భూమిని తమకు పంచమని. లేదా అమ్మేయాలని కొంతకాలంగా తండ్రితో గొడవపడుతున్నారు. ఇదే క్రమంలో మంగళవారం కూడా ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన అన్నాదమ్ముళ్లు. తండ్రిపై చేయి చేసుకున్నారు. ఇంతలో సన్యాసిరావు తండ్రిని కదలకుండా గట్టిగా పట్టుకోగా. సోమయ్య గొడ్డలి తీసుకొచ్చి అతని వీపుపై నరికాడు. దీంతో బుచ్చయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఇద్దరూ కలిసి వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. | ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కుమారులు...'. | 2 | ['tel'] |
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి:
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ముందు నారా లోకేష్ ఒక పిల్ల బచ్చా అని ఎంపీ మార్గాని భరత్ ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యామ్ నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ కడితే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏం పనిచేస్తుందని ప్రశ్నించారు. గత టీడీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని, ఇంత పెద్ద పొరపాటు చేసిన చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. | ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'సీఎం జగన్ ముందు నారా లోకేష్ ఒక పిల్ల బచ్చా'. | 2 | ['tel'] |
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి:
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ బెస్ట్ బ్యాట్స్మెన్ అని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ కొనియాడారు యాసెస్ సిరీస్లో స్మిత్ 671 పరుగులు చేశాడు. దీంతో ప్రపంచంలో బెస్ట్ టెస్టు బ్యాట్స్మెన్గా అగ్ర స్థానానికి ఎగబాకాడు. స్మిత్ గొప్ప వ్యక్తి అని, ఆకలితో ఉన్న పులిలా పరుగులు చేశాడని స్మిత్ అభివర్ణించారు. టెస్టు బౌలర్లో కమ్నీస్ తొలి స్థానానికి చేరుకున్నాడు. చివరి టెస్టులో ఏడు వికెట్లు తీశాడు. యాషెస్ సరీస్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చెరో రెండు విజయాలతో సిరీస్ ను సమం చేశాయి. టెస్టుల్లో నంబర్ వన్ స్థానంలో టీమిండియానే ఉంది. ఎందుకంటే ఆసీస్ రెండు టెస్టులు గెలిచినప్పటికి, వెస్టిండీస్ టూర్ లో టీమిండియా కూడా రెండు టెస్టుల్లో విజయం సాధించింది. కానీ పాయింట్ల పట్టికలో మాత్రం టీమిండియా తొలి స్థానాన్ని ఆక్రమించింది. ప్రతి సిరీస్ కు ఐసిసి 120 పాయింట్లు ఇస్తుంది. ఐదు టెస్టుల్లో ఆసీస్ రెండు గెలవడంతో 48 పాయింట్లు వచ్చాయి. విండీస్ టూర్ లో భారత జట్టు రెండు టెస్టు మ్యాచ్ లు గెలవడంతో 120 పాయింట్లు రావడంతో తొలి స్థానంలోకి దూసుకెళ్లింది. | ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'కోహ్లీ కంటే స్మిత్ బెస్ట్ బ్యాట్స్మెన్!'. | 2 | ['tel'] |
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి:
వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం ఖాయమని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. కృష్ణా జిల్లాలో ఉన్న ఊర కుక్కలకే తాను సమాధానం చెప్పానని. ఇక్కడ బురద పందులకు సమాధానం చెప్పలేనా అని అన్నారు. ‘‘అరిసే కుక్కలు కరవవు. మా కృష్ణా జిల్లాలోనే కుక్కలు ఉన్నాయని అనుకున్నాను. అక్కడి ఊర కుక్కలకే సమాధానం చెప్పాను. బురద పందులకు సమాధానం చెప్పలేనా? స్పీకర్ తమ్మినేని సీతారాం. మా స్కూల్ నుంచి (తెలుగు దేశం పార్టీ) వచ్చిన వ్యక్తే. ప్రజల సొమ్ము తిని పందిలా బలిశారు. చచ్చే వరకూ టీడీపీలో ఉంటానని సీతారాం అన్నారు. ఇప్పుడ బురద పందిలా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. 2019 ఎన్నికలలో తమ్మినేని గెలిచారు. 2024 ఎన్నికలో ఆయన ఓటమి ఖాయం.
టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిగా చెబుతున్నా. 2024లో ఆముదాలవలసలో కూన రవికుమార్ గెలవబోతున్నారు. ఒకవేళ ఆయన ఓడిపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతారు. మీరు ఓడిపోతే మీ కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకుంటారా? 2024 ఎన్నికల్లో ఆముదాలవలస రోడ్డుపై అంకుశం సినిమాలో రామిరెడ్డి లాగా తమ్మినేని రోడ్డు మీద ఉండాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికలలో తమ్మినేనిపై కోన రవి కుమార్ పోటీ చేసి గెలుస్తారు. తమ్మినేని పందిలాగా బలిసి చంద్రబాబు పినిష్ చేస్తానని అంటావా? బుద్ధి ఉందా?’’ అంటూ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిలో పేద ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని బుద్ధా వెంకన్న అన్నారు. విశాఖపట్నంలో దశపల్లా భూములు, వైసీపీ నేతలు దోచుకున్న భూముల్లో పేదలకు జగన్ ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. అనకాపల్లి జిల్లా బయ్యారంలో వైసీపీ నేతలు అక్రమ లే అవుట్ వేశారన్నారు. 600 ఎకరాల్లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, విజయసాయి రెడ్డి బినామీలతో వెంచర్ వేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. గుడివాడ అమర్నాథ్, విజయసాయి రెడ్డి రికార్డులు తారుమారు చేసి. కబ్జా చేశారని ఆరోపించారు. అక్కడ ఎవరూ కొనుక్కొని మోసపోవద్దని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని బుద్ధా వెంకన్న అన్నారు.
ఇక, న్యాయ వ్యవస్థను ఎవరూ మేనేజ్ చేయలేరని బుద్ధా వెంకన్న అన్నారు. తల్లి వంకతో కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ తెచ్చుకున్నారని ఆరోపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ విషయంలో వ్యవస్థల్ని వైసీపీ వాళ్లు మేనేజ్ చేశారా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి కంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా భయపడుతున్నారని చెప్పారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు ఎన్నికలకు వెళ్లినా. వెనకస్తుకి వెళ్లినా తెలుగు దేశం పార్టీనే గెలుస్తుందని బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు. ఇడుపాయ ఎస్టేట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి రూ. 2 వేల నోట్ల కట్టలు దాశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆ రూ. 2 వేల నోట్లను ఎలా మార్చాలనే పనిలో జగన్ ఉన్నారని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డిది పక్కా క్రిమినల్ మైండ్ అని. ప్రస్తుతం ఆయన డిప్రిషన్లో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జనాల దగ్గరకు సీఎం జగన్ డేరాలు కట్టుకొని వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ఇప్పుడు ఏపీ డేరా బాబుగా మారారని సెటైర్లు వేశఆరు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుంచి తాను పోటీ చేస్తానని బుద్ధా వెంకన్న వెల్లడించారు. కాని పక్షంలో చంద్రబాబు ఎక్కడి నుంచి చంద్రబాబు పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేస్తాననని స్పష్టం చేశారు. ఇక, టీడీపీ అధిష్టానానికి వ్యతిరేకంగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలపై తాను స్పందించబోనని అన్నారు. | ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'వచ్చే ఎన్నికల్లో తమ్మినేని ఓడిపోవడం ఖాయం: బుద్దా వెంకన్న'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
రిజర్వేషన్లు సాధించే వరకు మా పోరాటం ఆగదు : ఎంపీ కవిత | న్యూఢిల్లీ : పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేపట్టారు. రిజర్వేషన్ల అమలు రాష్ర్టాలకే అప్పగించాలంటూ నినదిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. రిజర్వేషన్ల పెంపు అంశంపై కేంద్రం వైఖరిని టీఆర్ఎస్ ఎంపీలు తప్పుబట్టారు. రిజర్వేషన్లు తప్పకుండా సాధించుకోవాలని ఎంపీ కవిత అన్నారు. రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. తమ పోరాటంతో తప్పకుండా ఫలితం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపి పది నెలలైనా కేంద్రం నిర్ణయం తీసుకోలేదని ఎంపీ వినోద్ తెలిపారు. తమిళనాడు, మహారాష్ట్రలో రిజర్వేషన్లు 50 శాతం కంటే ఎక్కువ ఉన్నాయని గుర్తు చేశారు. రిజర్వేషన్ల అమలు అన్ని రాష్ర్టాల్లో ఒకే తీరుగా ఉండాలని, రిజర్వేషన్ల పెంపు విషయంలో రాజ్యాంగ సవరణ చేయాలని సీఎం కేసీఆర్. ప్రధాని మోదీని ఎన్నోసార్లు కోరారని వినోద్ తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం దిగొచ్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని ఎంపీ వినోద్ స్పష్టం చేశారు. | 1 | ['tel'] |
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి:
న్యూఢిల్లి :మాక్సిస్ – ఎయిర్సెల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి మార్చి 8వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి)కి ఇప్పటికే పలుమార్లు తనను ప్రశ్నించి అన్ని వివరాలు రాబట్టినప్పటికీ, ఇ.డి, సిబిఐ తనను పదేపదే పిలుస్తున్నాయని ఆరోపిస్తూ కార్తీ చిదంబరం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై తదుపరి విచారణను మార్చి 8వ తేదీకి వాయిదా వేసింది. | ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'మాక్సిస్ ఎయిర్సెల్ కేసుపై వివరణ ఇవ్వాలని ఇడికి సుప్రీంకోర్టు ఆదేశం'. | 2 | ['tel'] |
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
పురావస్తు తవ్వకాల్లో బయటపడిన దేవాలయం | భారతీయ పురావస్తు శాఖ తవ్వకాల్లో వేల వందల ఏళ్ల క్రితం నాటి జైన మత దేవాలయం బయటపడింది. జనవరి 20న ఈ తవ్వకాలను ప్రారంభించగా, దేవాలయం రూపురేఖలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. భారతీయ పురావస్తు శాఖ అధికారులు చరిత్రాత్మక ఘట్టానికి నాంది పలికారు. 11వ శతాబ్దంలో నిర్మించినదిగా భావిస్తున్న ఓ జైన మత దేవాలయాన్ని కనుగొన్నారు.కర్ణాటక రాష్ట్రంలోని హస్సాన్ జిల్లాలోని హలేబిడ్ ప్రాంతంలో ఈ దేవాలయం బయటపడింది. జనవరి 20న ఇక్కడ జైన్ దేవాయలం ఉన్నట్టు గుర్తించి అధికారులు తవ్వకాలు చేపట్టారు. భారతీయ పురావస్తు శాఖ అధికారులు చేపట్టిన ఈ తవ్వకాల్లో హోసల రాజుల కాలానికి సంబంధించిన జైన దేవాలయం బయటపడింది. 11వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాలను హోసల రాజులు పాలించారు. ఈ తవ్వకాలను భారతీయ పురావస్తు శాఖ రీజనల్ దక్షిణాది రీజనల్ డైరెక్టర్ జీ మహేశ్వరి స్వయంగా పర్యవేక్షించారు. బెంగళూరు సర్కిల్ సూపరిండెంట్ ఆర్కియాలజిస్ట్ శివకాంత్ బజ్ పాల్ ఈ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. | 1 | ['tel'] |
క్రింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి:
హైదరాబాద్ జేఎన్టీయూలో బుధవారం ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మేఘనారెడ్డి అనే విద్యార్థిని సీఎస్ఆర్ బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మేఘన కంప్యూటర్ సైన్స్ విభాగంలో 4వ సంవత్సరం చదువుతోంది. మేఘన సూసైడ్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని రోజుల నుండి మేఘన అనారోగ్యంతో బాధపడుతోందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. | ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి:
మంగళవారం సాయంత్రం కేరళలోని కొల్లాం జిల్లా పరిపల్లిలో పలు మాదక ద్రవ్యాలు, హత్యాయత్నం కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన నలుగురు పోలీసు అధికారులపై కత్తితో పొడిచారు.నలుగురు అధికారులు -- సిపిఓలు శ్రీజిత్, వినోద్, చందు మరియు గ్రేడ్ ఎస్ఐ జయన్ -- తిరువనంతపురంలోని కల్లంబలం పోలీస్ స్టేషన్కు చెందిన వారని పోలీసు అధికారి తెలిపారు.నిందితుడిని అరెస్టు చేశామని, అధికారులపై దాడికి పాల్పడినందుకు పరిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.గాయపడిన నలుగురు అధికారుల్లో ముగ్గురిని ఇక్కడి కిమ్స్హెల్త్ ఆసుపత్రిలో చేర్పించగా, నాల్గవ వ్యక్తిని పారిపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారి తెలిపారు. | ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'కేరళలో నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో 4 పోలీసులకి గాయాలు'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
పోలీసులకు తప్పని ఇసుక కష్టాలు | ఏపీలో ఇసుకపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోక పోవటంతో సామాన్య జనాలకుఇసుక కష్టాలు అన్ని ఇన్ని కాదు. ఇప్పుడు ఈ సెగరాజధాని పోలీసులకు కూడాతగిలింది. వివరాల్లోకి వెళితేగుంటూరు జిల్లా తాడేపల్లిబాత్రూం నిర్మాణానికి పోలీసులకు ఇసక అవసరమైంది.ఈలోగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు పోలీసుల చేతికి చిక్కడంతోఇసుక తరలించుకు పోవాలని ప్రయత్నం చేశారు.ఇంతలో అక్కడే ఉన్న గ్రామస్తులుచేరుకొనిపోలీసులను అడ్డుకోవడంతో ఖంగుతిన్నారు.పోలీస్ స్టేషన్లో బాత్రూమ్ కోసం తరలించుకుపోతున్నామని చెప్పిగ్రామస్తులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ససేమిరా అన్నారు. అయితే ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపటం తో పోలీసులు నిదానంగా అక్కడ నుండి జారుకున్నారు. ఇసుక కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పేందుకు ఈ సంఘటనే నిదర్శనం.
ఏపీలో ఇసుకపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోక పోవటంతో సామాన్య జనాలకుఇసుక కష్టాలు అన్ని ఇన్ని కాదు. ఇప్పుడు ఈ సెగరాజధాని పోలీసులకు కూడాతగిలింది. వివరాల్లోకి వెళితేగుంటూరు జిల్లా తాడేపల్లిబాత్రూం నిర్మాణానికి పోలీసులకు ఇసక అవసరమైంది.ఈలోగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు పోలీసుల చేతికి చిక్కడంతోఇసుక తరలించుకు పోవాలని ప్రయత్నం చేశారు.ఇంతలో అక్కడే ఉన్న గ్రామస్తులుచేరుకొనిపోలీసులను అడ్డుకోవడంతో ఖంగుతిన్నారు.పోలీస్ స్టేషన్లో బాత్రూమ్ కోసం తరలించుకుపోతున్నామని చెప్పిగ్రామస్తులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ససేమిరా అన్నారు. అయితే ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపటం తో పోలీసులు నిదానంగా అక్కడ నుండి జారుకున్నారు. ఇసుక కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పేందుకు ఈ సంఘటనే నిదర్శనం. | 1 | ['tel'] |
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
రాష్ట్ర రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఈ నెల 31న భూకర్షణం, బీజావాపనం కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు టిటిడి కార్యనిర్వహణాధికారి అనిల్కుమార్ సింఘాల్ వెల్లడించారు. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణ స్థలంలో భూకర్షణ కోసం జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం టిటిడి తిరుపతి జెఈవో పోల భాస్కర్, సివిఎస్వో గోపినాథ్జెట్టితో కలిసి ఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 31న ఉదయం 9.15 నుండి 9.40 గంటల మధ్య భూకర్షణ కార్యక్రమం జరుగనుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారని తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం ఆగమశాస్త్రం ప్రకారం భూకర్షణ చేయడం ఆనవాయితీ అని, ఆగమ సలహాదారుల సూచన మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. సిఆర్డిఏ 25 ఎకరాలు టిటిడికి కేటాయించిందని, ఇందులో 5 ఎకరాల్లో శ్రీవారి ఆలయం, మిగిలిన 20 ఎకరాల్లో మాస్టర్ప్లాన్ రూపొందించి ఆధ్యాత్మిక కార్యకలాపాల నిర్వహణ కోసం ఆడిటోరియాలు, కల్యాణమండపాలు తదితర నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. దాదాపు రూ.140 కోట్లతో ఆలయ నిర్మాణం చేపట్టేందుకు టిటిడి ధర్మకర్తల మండలి టెండర్లు ఖరారు చేసినట్టు వెల్లడించారు. శ్రీవారి భక్తుల కోరిక మేరకు గత ఏడాది జులైలో కురుక్షేత్రలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టామని, ఇక్కడ రోజువారీగా వెయ్యి నుండి 2 వేల మంది, ఉత్సవాల రోజుల్లో 10 వేల నుండి 15 వేల మంది స్వామివారిని దర్శించుకుంటున్నారని ఈవో తెలిపారు. ఈ నెల 27న కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ విగ్రహప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం నిర్వహిస్తామని, మార్చి 13న హైదరాబాద్లో శ్రీవారి ఆలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలైన సీతంపేట, రంపచోడవరం, పార్వతీపురంలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టెండర్లు ఖరారు చేశామన్నారు. విశాఖపట్నం, భువనేశ్వర్లో శ్రీవారి ఆలయాలతో పాటు చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ధర్మప్రచారంలో భాగంగా వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించి తిరుమల తరహాలో సంప్రదాయబద్ధంగా కైంకర్యాలు నిర్వహిస్తామన్నారు. భూకర్షణం కోసం హోమగుండాలు, వేదిక, సిఆర్డిఏ స్టాళ్లు, ఆలయ నమూనా ఎగ్జిబిషన్, ప్రత్యక్ష ప్రసారాలు, డిస్ప్లే స్క్రీన్లు తదితర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించామని ఈవో తెలిపారు. భూకర్షణంలో భాగంగా శ్రీవారి కల్యాణోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తామన్నారు. భూకర్షణం తరువాత 10 రోజుల పాటు అర్చకులు ఆగమోక్తంగా వైదిక కార్యక్రమాలు, హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు చేపడతారని, అనంతరం ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయన్నారు.
శ్రీవారి సేవకులకు ఆహ్వానం.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఈ కార్యక్రమానికి శ్రీవారి సేవకులను, భజన మండళ్ల సభ్యులను ఆహ్వానిస్తున్నామని ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. శ్రీవారి సేవకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో టిటిడి ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్రెడ్డి, ఎస్ఇ (ఎలక్ట్రికల్) వేంకటేశ్వర్లు, ఎస్వీబీసీ సిఈవో వెంకట నగేష్, ఈఈ ప్రసాద్, డెప్యూటీ ఈవోలు రాజేంద్రుడు, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి వేణుగోపాల్, ఏఈవో గోవిందరాజులు ఇతర అధికారులు పాల్గొన్నారు. | ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ '31న అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూకర్షణం'. | 2 | ['tel'] |
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
ప్రతి సంస్థకు డ్రెస్ కోడ్ ఉండాలి: యోగి ఆథిత్య నాథ్ | ప్రతి సంస్థకు డ్రెస్ కోడ్ ఉండాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆథిత్యనాథ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా హిజాబ్ (ముస్లిం మహిళలు ముఖం కనిపించకుండా ధరించే వస్త్రం) గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న సందర్భంలో. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దీనిపై స్పందించారు. తన అధికారులపై డ్రెస్ కోడ్ అమలు చేయబోనని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే తనకు ఇదే తరహా (కాషాయం) వస్త్రాలు ధరించడమే ఇష్టమని చెప్పారు. ‘‘ప్రతీ వ్యక్తి తాను కోరుకున్నది ధరించొచ్చు. కానీ, ఆ స్వేచ్ఛ బహిరంగ ప్రదేశాలు, మార్కెట్లు, ఇళ్లకే పరిమితం. కానీ, ఎవరిపైనా డ్రెస్ కోడు రుద్దబోము. ప్రతీ సంస్థ యూనిఫామ్ నిబంధనను అనుసరించాలి. ఒకవేళ పోలీసుమ్యాన్ తాను ఒక మతానికి చెందిన వ్యక్తినని, ఆ మత సంప్రదాలకు తగ్గ వస్త్రాలు ధరిస్తానంటే గందరగోళానికి దారితీస్తుంది’’ అని ఆదిత్యనాథ్ చెప్పారు. ముస్లిం మహిళలపై హిజాబ్ బలవంతంగా రుద్దిన ఆచారమే కానీ, వారు తమ ఇష్టానుసారం ధరిస్తున్నది కాదని ఆదిత్యనాథ్ అన్నారు. ‘‘ఏ మహిళ కూడా హిజాబ్ ను తన ఇష్ట ప్రకారం ధరించదు. ట్రిపుల్ తలాఖ్ అనే దుష్ట సంప్రదాయాన్ని మహిళలు ఎప్పుడైనా ఆమోదించారా? కూతుర్లు, సోదరీమణులను ప్రశ్నించండి. దీని గురించి మాట్లాడుతున్న సందర్భాల్లో నేను వారి కళ్లలో నీళ్లు చూశాను’’అని ఆదిత్యనాథ్ వివరించారు. | 1 | ['tel'] |
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి:
పాస్టర్ ల గౌరవ వేతనానికి... నిబంధనలను సడలించిన ఏపీ ప్రభుత్వం | పాస్టర్ ల గౌరవ వేతనానికి సంబంధించి నిబంధనలను ఏపీ ప్రభుత్వం సడలించింది. మూడుసార్లు దరఖాస్తులు స్వీకరించినా ఆశించిన స్థాయిలో అర్హులు లేరనే కారణంతో ఈ నెల 25వ తేదీ వరకు గడువుగా నిర్ధారించి ప్రభుత్వం అప్లికేషన్లు స్వీకరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాస్టర్లకు నెలకు రూ. 5 వేల గౌరవ వేతనం అందించే నిబంధనల్లో జగన్ ప్రభుత్వం మరోసారి సడలింపులు ఇచ్చింది. గౌరవ వేతనానికి చర్చిని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటామని, అన్ని పథకాలకు అమలు చేస్తున్న ఆరు దశల నిబంధనలు ఈ పథకానికి వర్తించబోవని తేల్చి చెప్పింది.
స్థలం చర్చి పేరుపై రిజిస్టరై ఉండాలనే షరతును కొనసాగిస్తూనే. చర్చి పేరుపై తహసీల్దారు జారీ చేసిన పొజిషన్ సర్టిఫికెట్ ఉన్నా, దాతలు ఇచ్చిన రిజిస్టర్ గిఫ్ట్ డీడ్ ఉన్నా సరిపోతుందని ఇప్పటికే నిబంధన మార్చింది.
తాజాగా, మరికొంత సడలింపునిచ్చి స్థానికంగా ఉన్న వీఆర్వో, సంక్షేమ కార్యదర్శి పరిశీలించి ధ్రువీకరణ పత్రం ఇచ్చినా సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దాతలు ఇచ్చిన స్థలాల్లో, అద్దె ఇళ్లలో ఉండే చర్చిలకు గాను నోటరీ సర్టిఫికెట్ సమర్పిస్తే సరిపోతుందని వెల్లడించింది. సొసైటీ చట్టం ప్రకారం చర్చి రిజిస్టరై ఉండాలనే నిబంధన మాత్రమే ఉండగా ఇప్పుడు అదనంగా ట్రస్ట్ను కూడా జత చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఒకే రిజిస్ట్రేషన్ కలిగి వేరు వేరు ప్రాంతాల్లో బ్రాంచ్ చర్చిలు ఉన్నా, ఆయా ప్రాంతాల్లోని బ్యాంకుల్లో వేర్వేరుగా ఖాతాలు కలిగి ఉంటే అందులోని పాస్టర్లు గౌరవ వేతనానికి అర్హులేనంటూ జిల్లా స్థాయి అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. చర్చి సొసైటీ లేదా ట్రస్ట్కు ఇతర ఆదాయాలు లేవని పాస్టర్/ సభ్యులు ధ్రువీకరిస్తే చాలని పేర్కొంది.
ఇక, పాస్టర్లకు సంబంధించి కులధ్రువీకరణ పత్రం కూడా అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇతర వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతాతో పనిలేదని స్పష్టం చేసింది. పాస్టర్ల కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, కుటుంబ ఆదాయం నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువ ఉన్నా, వైఎస్సార్ పింఛన్ కానుక కింద లబ్ధి పొందుతున్నా గౌరవ వేతనానికి అర్హులేనని ఆదేశాలు జారీ చేసింది. ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు పాస్టర్లు ఉండి వారు వేర్వేరు చర్చిలకు పాస్టర్లుగా వ్యవహరిస్తుంటే వారు కూడా అర్హులేనని వెల్లడించింది. | 1 | ['tel'] |
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి:
గూడూరు వైసీపీలో అంతర్యుద్ధం... | గూడూరు వైసీపీలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఎంపీపీ పదవి కోసం కె. నాగలాపురంకు చెందిన మహిళ ఎంపీటీసీ రాజమ్మ, కార్యకర్తలతో కలిసి రోడ్డెక్కి నిరసన తెలియజేశారు. మండలంలోని ఎంపీపీ పదవిని కె. నాగలాపురం గ్రామానికి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి రాజమ్మకు ఎంపీపీ పదవి ఇస్తామని చెప్పిన ఎమ్మెల్యే మోసం చేశారని వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ముందు ఆందోళనకు దిగారు.
స్థానిక వైసీపీ నాయకులు నరసింహరెడ్డి ఆధ్వర్యంలో, మహిళాలతో కలిసి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. వైసీపీ పార్టీలో మొదటి నుంచి గూడూరు ఎంపీపీ పదవి ఇస్తామని చెప్పిన జిల్లా, స్థానిక వైసీపీ నేతలు మాట మార్చి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీతో సంబంధం లేని వ్యక్తులకు ఎంపీపీ పదవి ఇస్తామని మోసం చేస్తున్నారని, చనుగొండ్ల మహేశ్వరరెడ్డి కుటుంబానికి ఆ పదవిని ఇస్తామని చెప్పి, మాకు అన్యాయం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై జిల్లా వైసీపీ నాయకులు స్పందించి ఎంపీపీ పదవిని కేటాయించాలని వారు కోరారు. జిల్లా నాయకులు కాకుండా కర్నూలు జిల్లా వైకాపా ఇన్చార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. | 1 | ['tel'] |
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి:
తెలంగాణలోని నిరుద్యోగుల గుడ్ న్యూస్. నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. త్వరలో ఉద్యోగ ప్రకటన ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించి దాదాపు ఏడాది కావస్తోంది. అయితే కొత్త సంవత్సరంలో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కొత్త జోనల్ విధానం ప్రకారం 2022 జనవరి 20 నాటికి ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తవుతుందని. అప్పటికి రాష్ట్రంలోని ఖాళీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుందని అధికారులు తెలిపారు. తర్వాత 65 వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు కూడా వస్తాయని చెబుతున్నారు. అయితే మరికొద్ది రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. | ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త'. | 2 | ['tel'] |
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి:
శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం | కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయి కృష్ణతేజ అతిథి గృహం వరకు భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. గురువారం రోజు శ్రీవారిని 71 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 38 వేల మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీకి రూ. 4.07 కోట్ల ఆదాయం వచ్చింది. | 1 | ['tel'] |
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి:
మాచర్ల పట్టణంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు | మాచర్ల: పట్టణంలో శనివారం చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాండురంగ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భారతదేశం లో అప్పటికి తెలంగాణ ప్రాంత చేరలేదు హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబుల పరిపాలనలో ఉండేది. ఆకృత్యాలు జరిగాయి. అది తట్టుకోలేక ప్రజలందరూ తిరగబడ్డారు అందులో చాకలి ఐలమ్మ ప్రధాన పాత్ర పోషించారు. | 1 | ['tel'] |
కింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
ఐటీ హబ్బుల్లో రూ.కోట్ల అవినీతి : రేవంత్ | భూకేటాయింపులు, ఐటీ హబ్బుల్లో రూ.కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ… భూకేటాయింపులు, ఐటీ హబ్బు శాఖలు కేటీఆర్ ఆదీనంలో ఉన్నాయన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా సరే అవినీతిని బయటపెడతామన్నారు. కేసీఆర్ అక్రమాలపై పుస్తకాలు ముద్రిస్తానన్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత పక్కా ఆధారాలతో బయటపెడతామన్నారు. అవినీతి ఎలా చేయాలో కేసీఆర్ కంటే కేటీఆర్ కు బాగా తెలుసన్నారు. | 1 | ['tel'] |
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి:
రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్తో చేతులు కలిపి ఎన్నికల ప్రచారానికి వస్తమంటున్న టీఆర్ఎస్ నేతలను రాష్ట్ర సరిహద్దుల్లోనే నిలదీయాలని, రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా తమ ఓటుతో వైసీపీ నేతలకు గట్టిగా బుద్ది చెప్పాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఓటర్లకు విన్నవించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మంత్రి దేవినేనికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ సెంటర్ లోని మల్లెల పద్మనాభం ఇంటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మంత్రి దేవినేని ఉమ… కిక్కిరిసిన జనసందోహం నడుమ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా తమ ఓటుతో వైసీపీ నేతలకు గట్టిగా బుద్ది చెప్పాలని దేవినేని ఉమా మహేశ్వరరావు పిలుపునిచ్చారు. వైసీపీ ప్రచార వాహనాల్లో కేసీఆర్ పార్టీ గుర్తులు కనిపిస్తున్నాయని…. మోదీ, కేసీఆర్, జగన్ కలిసి రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిపై దండయాత్ర చేసేందుకు వస్తున్న జగన్ అండ్ కో పార్టీపై ఓటుతో ఎదురుదాడి చేయాలని పిలుపునిచ్చారు. గోదావరి – కృష్ణా పవిత్ర సంగమం వల్ల ఇబ్రహీంపట్నం ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి సాధించిందని తెలిపారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకపరంగా మరింత అభివృద్ధి చేసేందుకు మరిన్నిప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయన్నారు , తనకు మరోసారి అవకాశం కల్పిస్తే మైలవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
| ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'ప్రచారానికి వచ్చే టిఆర్ ఎస్ నేతల్ని నిలదీయండి : మంత్రి ఉమ'. | 2 | ['tel'] |
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
గండిమైసమ్మ చౌరస్తాలో నల్ల కండువాలతో ర్యాలీ | టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, పార్లమెంట్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోడీ అహంకారపూరితమైన మాటలకి వ్యతిరేకంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గండిమైసమ్మ చౌరస్తాలో నల్ల కండువాలతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపిన ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు,ఎమ్మెల్యే కే పి వివేకానంద్ మరియు తెరాస నాయకులు
| 1 | ['tel'] |
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
శామ్ సంగ్ జెడ్ ఫోల్డ్ 4 ఫోన్ ను వాడుతున్నా: బిల్ గేట్స్ | ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో బిల్ గేట్స్ ఏ ఫోన్ వాడుతుంటారు అన్నది సహజంగా అందరిలో ఆసక్తి ఉంటుంది. శామ్ సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4. మైక్రోసాఫ్ట్ ఫోన్లు మార్కెట్లో (యూఎస్ లో) ఉన్నప్పుడు ఆయన శామ్ సంగ్ ఫోన్ వాడడం ఏంటి? అన్న సందేహం వస్తుంది. ఇటీవల రెడిట్ ప్లాట్ ఫ్లామ్ పై ‘ఆస్క్ మీ ఎవ్రీథింగ్’ కార్యక్రమంలో బిల్ గేట్స్ పాల్గొన్నారు. తాను శామ్ సంగ్ జెడ్ ఫోల్డ్ 4 ఫోన్ ను వాడుతున్న విషయాన్ని బిల్ గేట్స్ స్వయంగా వెల్లడించారు.
ఇంతకుముందు అయితే తన రోజువారీ జీవితంలో శామ్ సంగ్ జెడ్ ఫోల్డ్ 3 ఫోన్ వినియోగించే వాడినని, గతంలో నిర్వహించిన ఆస్క్ మీ ఎవ్రీథింగ్ కార్యక్రమంలో బిల్ గేట్స్ వెల్లడించారు. అంటే జెడ్ ఫోల్డ్ 3 నుంచి, 4కు ఆయన అప్ గ్రేడ్ అయ్యారు. విషయం ఏమిటంటే దక్షిణ కొరియా దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్ సంగ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన జే వై లీ ఈ ఫోన్ ను బిల్ గేట్స్ కు ఇచ్చారట.
మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డుయో ఫోల్డబుల్ ఫోన్ ఉన్నప్పటికీ బిల్ గేట్స్ శామ్ సంగ్ జెడ్ ఫోల్డ్ 4కు ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. తాను నిత్య జీవితంలో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్ వేర్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటానని గేట్స్ తెలిపారు. శామ్ సంగ్ జెడ్ ఫోల్డ్ 4 ఫోన్ లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాప్స్ డిఫాల్ట్ గా లోడ్ అయ్యి ఉంటాయి. ఈ ఫోన్ కోసమే ప్రత్యేకంగా వాటిని రూపొందించారు. తాను టాబ్లెట్ వాడనంటూ, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 స్క్రీన్ సైజు పెద్దగా ఉండడంతో, రోజువారీ పనుల కోసం అది సరిపోతున్నట్టు బిల్ గేట్స్ చెప్పారు. | 1 | ['tel'] |
కింది వార్తా కథనానికి శీర్షికను రాయండి:
కూచారం గ్రామంలోని సర్వే నంబర్ 228 భూమి మూడు తరతరాల నుండి కుటుంబీకులకు చెందిన భూమి సర్వే నంబర్లు పూర్తి విస్తీర్ణం 260 ఎకరాల భూమి సీలింగ్ చట్టం ప్రకారం 113. 20 ఎకరాల ప్రభుత్వం స్వాధీనం పరుచుకొని భూమిలోని నిరుపేదలకు మరియు మాజీ సైనికులకు కేటాయించింది. అయితే ఈ మాజీ సైనికుల కోటాలో కొంతమంది సైనికులు కూడా భూ పంపిణీలో అక్రమంగా లబ్ధి పొందారు. సర్వేనెంబర్ 228లో మూడు కుంటలు ఉండేవి కనపడకుండా మాయమైపోయినాయి. అంతేకాకుండా సుమారు 12 ఎకరాల్లో తెల్ల పలువు గుట్ట ఉండేది ఇది సీలింగ్ భూమికి సంబంధించింది కాదు. ఇది వంశపారంపరంగా నాకు సంక్రమించిన పట్టా భూమి గత కొన్ని సంవత్సరాలుగా రాత్రిపూట అక్రమంగా మొరం తరలించడం వల్ల అక్రమంగా ఈ గుట్ట వైశాల్యం తగ్గుతూ పోయింది. నేను హైదరాబాదులో ఉస్మానియావిశ్వవిద్యాలయం ఓయూలో ప్రొఫెసర్గా విధులు నిర్వహించడం అంతేకాకుండా ఊరికి ప్రధాన రహదారి ఈ భూమి కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల అర్థరాత్రి అక్రమంగా మట్టి మొరం తవ్వకాలను ఆపడం సాధ్యపడులేదు.
అయితే తెలంగాణ ప్రభుత్వం ధరణి పోట్రాలను ప్రవేశపెట్టడం వల్ల రెవెన్యూ అధికారులు అనక అవకతవకలు జరగడం చాలావరకు తగ్గిపోయాయి ప్రభుత్వాధికారులు ఉన్న ప్రగాఢమైన విశ్వాసంతో ఈ అక్రమ తవ్వకాలు మొరంపై ఫిర్యాదు చేయడం జరిగింది. అక్రమార్కులకు తెలపలుగుట్ట పై దృష్టి పడింది అక్కడున్నటువంటి వంటి వాచ్మెన్ను ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అయితే శుక్రవారం రాత్రి సాయంత్రం కొంతమంది భూకబ్జాదారులు మట్టిని తరలించేందుకు ప్రయత్నిస్తుంటే అక్కడున్న వాచ్మెన్ భూతవకాలు చేయొద్దని చెప్తే వాచ్మెన్ బెదిరించడం జరిగిందని , ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల తీసుకెళ్తే అధికారులు స్పందించడం వల్ల ఆ ప్రయత్నాలు మానుకున్నారు. శనివారం ఉదయం పోలీసుల మాటలను బేకాతర చేస్తూ మళ్లీ అదే ప్రయత్నం చేస్తుంటే మేము వెళ్లి ఆపడం జరిగింది. ఈ విషయాన్ని మీడియా మిత్రులకు తెలియజేయడం జరిగింది. ఈ అక్రమ తవ్వకాలపై శాశ్వతంగా ఆపివేసే దిశగా చూడాలని అధికారులను మీడియా ముఖంగా మురళీధర్ యాదవ్ మీడియాతో తెలిపారు. | ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'పోలీసు అధికారుల చోరువతో అక్రమ మైనింగ్ నిలిపివేత'. | 2 | ['tel'] |
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
పలు ప్రత్యేక రైళ్ల గడువు పొడిగింపు | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక రైళ్ల గడువు పొడిగించనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ. కె. త్రిపాఠి బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. విశాఖ- (08579) రైలు జులై 5 నుంచి 26 వరకు సికింద్రాబాద్ ప్రతి బుధవారం సికింద్రాబాద్-విశాఖ(08580) రైలు జులై 6 నుంచి 27 వరకు ప్రతి గురువారం నడుస్తాయన్నారు. విశాఖ-మహబూబ్ నగర్ (08585) రైలు జులై 4నుంచి 25 వరకు ప్రతి మంగళవారం మహబూబ్ న గర్-విశాఖ (08586) రైలు జులై 5 నుంచి 26 వరకు ప్రతి బుధవారం విశాఖ-తిరుపతి(08583) రైలు జులై 3 నుంచి 31 వరకు ప్రతి సోమవారం తిరుపతి- విశాఖ(08584) రైలు జులై 4 నుంచి ఆగస్టు 1 వరకు ప్రతి మంగళవారం భువనేశ్వర్-తిరుపతి(02809) రైలు జులై 1 నుంచి 29 వరకు ప్రతి శనివారం తిరుపతి-భువనే శ్వర్(02810) రైలు జులై 2 నుంచి 30 వరకు ప్రతి ఆదివారం నడుస్తాయని పేర్కొన్నారు. | 1 | ['tel'] |
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
పిక్నిక్కు వెళ్లిన 12 మంది గల్లంతు | మధ్యప్రదేశ్లోని శివపురిలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. శివపురి, గ్వాలియర్ సరిహద్దుల్లోని సుల్తాన్ఘడ్ పోల్ దగ్గర పిక్నిక్ చేసుకుందామని వచ్చిన 12 మందిపైకి వరదనీరు ముంచెత్తడంతో వారంతా వంద అడుగుల దిగువకు పడిపోయారు. వరదనీరు వారిని కిందకు నెట్టేసింది. మరో 30 మంది నది మధ్యలో రాతిపైభాగాన చిక్కుకుపోయారు. వీరిలో 8 మందిని రెస్క్యూ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో బయటకు తీసుకురాగలిగింది. ప్రస్తుతం అక్కడ బాధితులను రక్షించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆగస్టు 15న సెలవు రోజు కావడంతో భారీ సంఖ్యలో జనం ఇక్కడికి పిక్నిక్ చేసుకునేందుకు వచ్చారు. ఉన్నట్టుండి నదిలోని నీటిమట్టం పెరిగింది. దీంతో భయాందోళనలకులోనైన వారికి ఏం చేయాలో తెలియలేదు. ఇంతలోనే వారిలో 12 మంది వరదలో కొట్టుకుపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
| 1 | ['tel'] |
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి:
జోగిపేటలో ఎగిరిన ముదిరాజ్ జెండా | తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం ప్రపంచ మత్స్య కారుల దినోత్సవం సందర్భంగా సోమవారం జోగిపేట పట్టణ ముదిరాజ్ సంఘం అవరణలో ముదిరాజ్ జెండాను ఎగుర వేసారు.ఈ కార్యక్రమంలో జోగిపేట పట్టణ ముదిరాజ్ అధ్యక్షులు పట్లూరి శివశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. నారాయణ, జిల్లా మహిళ అధ్యక్షురాలు నిర్మలా, ఆందోలు నియోజకవర్గ ముదిరాజ్ కన్వీనర్ డి. బి నాగభూషణం, ముదిరాజ్ నాయకులు చాపల వెంకటేశం, తుపాకుల సునీల్ కుమార్, చిట్టిబాబు, ఉలువల వెంకటేశం, ఉలువల రాజు, డాకురి శ్రీనివాస్, రామక్రీష్ణ, ఉలవల మాణయ్య, ప్రసాద్, తుపాకుల మాణయ్య, కొత్త శ్రీనివాస్, డాకూరి శివ గణేష్, అల్లె యాదగిరి, తెనుగు అనిల్, దుద్యల శ్యాం, నర్సింగ్ సాయి బాబా, తిమ్మిగారి పాండురంగం, అరిగె ప్రకాష్ ముదిరాజ్ బందువులు పాల్గొన్నారు. | 1 | ['tel'] |
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి:
ఒకే కేసు కింద ఎన్నికల పిటీషన్లు... హైకోర్టు నిర్ణయం | అక్రమాలకు పాల్పడి గెలుపొందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన పిటీషన్లను ఒకే కేసు కింద పరిగణించాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు పిటీషన్ దారులకు హైకోర్టు స్పష్టం చేసింది. మొన్న జరిగిన ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారంటూ పలువురు కాంగ్రెస్ అభ్యర్థులు వేర్వేరుగా పిటీషన్లు దాఖలు చేశారు. ఇలా దాఖలైన 12 పిటీషన్లపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కౌంటింగ్ పూర్తయిన 45 రోజుల వ్యవధిలో కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉండడంతో పలువురు హైకోర్టును ఆశ్రయించి ఆధారాలతో సహా పిటీషన్లు వేశారు. కొడంగల్ అధికార పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఎన్నికల నియమావలిని ఉల్లంఘించారని, ఎన్నికల్లో రూ. 6.5 కోట్లు ఖర్చు చేసినట్లు డైరీ దొరికిందని కాంగ్రెస్ అభ్యర్థి ఏ. రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ధర్మపురి టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికను రద్దు చేయాలని అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గద్వాల నుంచి గెలిచిన కృష్ణమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి డీకే అరుణ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై దాసోజు శ్రవణ్ కుమార్, నాగం జనార్దన్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, పొన్నం ప్రభాకర్, అద్దంకి దయాకర్, ఫిరోజ్ ఖాన్ లు పిటీషన్లు వేశారు.
| 1 | ['tel'] |
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి:
ముఖ్యమంత్రి కేసీఆర్ మనువడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు బుధవారం సాయంత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి హిమాన్షుతో పాటు అతని స్నేహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిమాన్షుకు ఆలయ వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వదించారు. యాదాద్రి ఆలయానికి చేరుకున్న హిమాన్షును ఆలయ పండితులు సాదరంగా ఆహ్వానించి, స్వామి వారి దర్శనం కల్పించారు. ఇక యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వచ్చిన హిమాన్షు రావుకు యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వద్ద బీఆర్ఎస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. | ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'యాదాద్రి సన్నిధిలో కేటీఆర్ తనయుడు'. | 2 | ['tel'] |
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
అహ్మదాబాద్లో ప్రారంభమైన ప్రధాని సభ | అహ్మదాబాద్: అహ్మదాబాద్లో బుల్లెట్ రైలు మార్గం నిర్మాణానికి శంకుస్థాపన కార్యాక్రమం ప్రారంభమైంది. ఇప్పటికే ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే సభాస్థలికి చేరుకున్నారు. ముంబయి-అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల మేరకు ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. గతేడాది నవంబర్లో మోదీ జపాన్ పర్యటనలో భాగంగా బుల్లెట్ రైలు పథకానికి శ్రీకారం చుట్టారు. 2017లో బుల్లెట్ రైలు పథకానికి భూమిపూజ, 2018లో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. | 1 | ['tel'] |
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి:
మనీష్ సిసోడియా ఆసక్తికర ట్వీట్ | ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఈరోజు సీబీఐ మరోసారి విచారించనుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. తాను నెలల తరబడి జైల్లో గడపాల్సి వచ్చినా పట్టించుకోనని పేర్కొన్నారు. ‘నేను భగత్ సింగ్ అనుచరుడిని, దేశం కోసం భగత్ సింగ్ ఉరి తీయబడ్డాడు’ అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు కూడా అవాస్తమని చెప్పుకొచ్చారు. | 1 | ['tel'] |
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ తయారీకి ఆర్థిక శాఖ కసరత్తు | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ తయారీ కసరత్తుకు ఆర్థిక శాఖ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో అన్ని శాఖల నుంచి ఆర్థిక శాఖ ప్రతిపాదనలు కోరింది. ఈ నెల 11వ తేదీ వరకు అన్ని శాఖలు ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించింది. కిందిస్థాయి నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఆయా శాఖలు తమ అభిప్రాయాలను ఈ నెల 18వ తేదీ వరకు పంపాలి. ప్రతిపాదనలను ఆన్ లైన్ లోనే పంపాలని ఆర్థిక శాఖ సూచించింది. 2018-19 సవరణ బడ్జెట్ 2019-20కి బడ్జెట్ అంచనాలు పంపాలని ఆర్థిక శాఖ కోరింది. | 1 | ['tel'] |
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి:
భారత అమ్ములపొదిలో అత్యాధునిక ఆయుధం | భారత నావికాదళం లాంగ్ రేంజ్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని శనివారం విజయవంతంగా పరీక్షించింది. దీనిపై ఇండియన్ నేవీ ట్విట్టర్లో ప్రకటన విడుదల చేసింది. సుదూర లక్ష్యాలను బ్రహ్మోస్ క్షిపణి విజయవంతంగా చేధించగలదన్నారు. ఆత్మనిర్భర్లో ఇదో ప్రాముఖ్యమైన ముందడగుగా నేవీ అభివర్ణించింది. ప్రపంచంలోనే అత్యంత అధునాతన క్రూయిజ్ క్షిపణుల్లో ఒకటైన బ్రహ్మోస్ను నావికాదళం క్రమం తప్పకుండా పరీక్షిస్తోంది. 2020 నవంబర్లో, అండమాన్-నికోబార్ దీవుల నుండి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి ల్యాండ్-ఎటాక్ వెర్షన్ను పరీక్షించింది. గతేడాది డిసెంబర్లో సూపర్సోనిక్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ సుఖోయ్ 30 ఎంకే-ఐ ద్వారా బ్రహ్మోస్ క్షిపణి ఎయిర్ వెర్షన్ను పరీక్షించారు. ఒడిశా తీరంలోని చండీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి ఈ పరీక్ష జరిగింది. | 1 | ['tel'] |