inputs
stringlengths
28
112
targets
stringlengths
30
2.36k
template_id
int64
1
14
template_lang
stringclasses
1 value
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పంపకాలు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పంపకాలు' చావుబతుకుల మధ్య కొట్టుకుంటున్న ఓ వ్యక్తి భార్యాపిల్లలను పిలిచి చెప్పాడిలా. ముందు భార్యకి చెప్పాడిలా. నువ్వు కూకట్పల్లిలో ఉన్న పది అపార్ట్మెంట్స్ తీసుకో! పెద్దకొడుక్కి చెప్పాడిలా. నువ్వు మియాపూర్లోని మూడుషాపింగ్ కాంప్లెక్సులూ, అక్కడి గుడీ తీసుకో! రెండోవాణ్ణి పిలిచి చెప్పాడిలా. నువ్వు ఎర్రగడ్డలోని రెండు గుళ్ళూ తీసుకో! చిన్నవాణ్ణి పిలిచి చెప్పాడిలా. నువ్వు మోతీనగరంతా తీసుకో! కూతుర్ని పిలిచి చెప్పాడిలా. నువ్వు కల్యాణ్నగర్లోని రెండు స్వీట్షాప్సూ తీసుకో! చెప్పాల్సింది చెప్పి, చనిపోయాడతను. గమనించింది నర్స్. అడిగిందిలా. మీ నాన్నగారు చాలా గొప్పవారిలా ఉన్నారే. సంపాదించిన ఆస్తి అంతటినీ పంచి మరీ పోయారు. ఆస్తా పాడా! మాది పాలవ్యాపారం తల్లీ! పాలఖాతాలు అప్పజెప్పి చచ్చూరుకున్నాడు అన్నారు పిల్లలు.
7
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక సంతోషం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సంతోషం' సుబ్బారావు: సార్! మా ఆవిడ తప్పిపోయింది. ఆఫీసర్: ఇది పోస్టాఫీసయ్యా! పోలీస్స్టేషన్ కాదు. సుబ్బారావు: వెధవది! సంతోషంలో ఎక్కడకెళ్తున్నానో తెలియడం లేదు. సారీ సర్!
7
['tel']
మిక్సీ అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'మిక్సీ' భార్య: ఎక్కడ ఉన్నారు? భర్త: ఇంట్లోనే డార్లింగ్! భార్య: నమ్మమంటారా భర్త: నమ్మాలి డియర్! భార్య: అయితే మిక్సీ ఆన్ చెయ్యండి చూద్దాం. భర్త: చూడయితే! మిక్సీ ఆన్ చేశాడు భర్త డుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్... భార్య: ఓకే డియర్! ఐ లవ్ యు. మర్నాడు మళ్ళీ.. భార్య:ఎక్కడ ఉన్నారు? భర్త: ఇంట్లోనే డార్లింగ్! భార్య: నమ్మమంటారా భర్త: నమ్మాలి డియర్! భార్య: అయితే మిక్సీ ఆన్ చెయ్యండి చూద్దాం. భర్త: చూడయితే! మిక్సీ ఆన్ చేశాడు భర్త డుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్... భార్య: ఓకే డియర్! ఐ లవ్ యు. ఆ మర్నాడు... ఆఫీస్ నుంచి భార్య ఫోన్ చెయ్యలేదు. నేరుగా ఇంటికి వచ్చింది. ఏడేళ్ళకొడుకు ఆడుకుంటూ ఒంటరిగి కనిపించాడు. చిన్నూ! డాడీ ఇంట్లో లేరా? కనిపించడం లేదు? కొడుకు: ఏమో మమ్మీ! పొద్దున్నే మిక్సీపట్టుకుని బయటికెళ్లారు.
2
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక గ్రుడ్లు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'గ్రుడ్లు' ఆ కోళ్ళఫారం యజమాని మహాక్రూరడు. ఫారంలోని కోళ్ళను ఓ రోజు ఇళా హెచ్చరించాడు. రేపు పొద్దునకల్లా తలా రెండు గుడ్లు పెట్టాలి. పెట్టకపోతే కోసుకుంతింటా. తెల్లారింది. కోళ్ళఫారానికి వచ్చి చూశాడు యజమాని. కోళ్ళన్నీ రెండు రెండు గుడ్లు పెట్టాయి. ఒకటి మాత్రం ఒకటే గుడ్డుపెట్టింది. ఏవే ! బలిసిందా? ఒకటే పెట్టావు? కసిరాడు యజమాని. వణకిపోయింది కోడి. వణకిపోతూ అన్నదిలా. ఆ ఒకటి కూడా కోసుకుని నన్ను తింటావన్న భయంతో పెట్టా. నేనసలు పుంజున్నా అని గొల్లుమంది ఆ కోడి.
6
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పేరు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పేరు' ఒక పిల్లకోడి, తల్లికోడిని అడిగిందిలా. అమ్మా! మనుషులు పుట్టగానే పేర్లు పెట్టుకుంటారు కదా, మరి మనకెందుకు పుట్టగానే పేర్లు పెట్టరు? మనకి పుట్టగానే పెట్టరు. చచ్చింతర్వాత పెడతారు. చికెన్టిక్కా, చికెన్చిల్లీ, తందూరిచికెన్, చికెన్మలై, చికెన్ కడాయి..చెప్పింది తల్లికోడి.
7
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక కస్టమర్ కేర్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కస్టమర్ కేర్' హలో కస్టమర్ కేరా..? అవునండీ.. చెప్పండి.. మీకు నేను ఏ విధంగా సహాయపడగలను..? మావాడు సిం కార్డు మింగేశాడ్సార్.. అయ్యయ్యో..! నేనేం చేయ్యాలో చెప్పండి..? ఆ సిం కార్డులో బేలన్సింకా వంద రూపాయలు ఉంది సార్..! ఉంది.. నన్నేం చేయమంటారు..? ఏం లేదు.. నాదో చిన్న డౌటు.. మా వాడు కానీ మాట్లాడితే.. ఆ బ్యాలెన్స్ కట్ కాదు కదా..!
5
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక సవాలుకు సై... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సవాలుకు సై...' ‘నేను హెలికాప్టరుతో భయంకరమైన విన్యాసాలు చేస్తాను. అయినా కూడా కిమ్మనకుండా నా వెనకే కూర్చున్నవారికి లక్ష రూపాయలు’ అని ప్రకటించాడు ఒక పైలెట్. ఆ సవాలుకు సిద్ధపడిందో కుర్ర జంట. హెలికాప్టర్ ఎగిరింది. గిరగిరా గాల్లో గింగిరాలు తిరిగింది. అయినా వెనక సీట్లోంచి సౌండ్ లేదు. చివరికి పైలెట్కి విసుగుపుట్టి వాహనాన్ని నేల మీదికి దింపాడు. వెనక్కి తిరిగి చూస్తే భర్త ఒక్కడే ఉన్నాడు. ‘అయ్యయ్యో... మీ ఆవిడేది!’ అని కంగారుగా అడిగాడు పైలెట్. ‘ఇందాకే పడిపోయింది. అరిస్తే... పందెం ఓడిపోతామని... అలాగే కూర్చుండిపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
3
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అందుకే మరి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అందుకే మరి' పోలీస్: అర్ధరాత్రివేళ కార్లో స్పీడుగా ఎక్కడికి వెళ్తున్నారు? అరవింద్: మద్యపానం, దాని దుష్ఫలితాల మీద ఉపన్యాసం వినేందుకు వెళ్తున్నా సార్. పోలీస్: నేనేమైనా పిచ్చోడిలాగా కనిపిస్తున్నానా... ఇంతరాత్రి పూట అలాంటి ఉపన్యాసం ఇచ్చేదెవరు? అరవింద్: మా ఆవిడ....
6
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక బంపర్ ఆఫర్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'బంపర్ ఆఫర్' ‘ఏసీ కోచ్లో ప్రయాణించేవారి భార్యకు టికెట్ ఉచితం’ అని ప్రకటించింది రైల్వేశాఖ. ఆ స్కీమ్తో ఏమేరకు ఫలితాలు వచ్చాయో తెలుసుకునేందుకు, పథకాన్ని ఉపయోగించుకున్నవారి ఇళ్లకు సిబ్బందిని పంపింది. తలుపు తట్టిన ప్రతి ఇంట్లోనూ గొడవే! ‘నాకు తెలియకుండా... ఎప్పుడు, ఎక్కడికి, ఎవరితో వెళ్లావు?’ అని.
8
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అనుభవం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అనుభవం' ఆఫీసర్: మా కంపెనీ కోసం బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తి కావాలి. మీకా లక్షణాలు ఉన్నాయా? అభ్యర్థి: నాకంటే బాధ్యతాయుతమైన వ్యక్తి మీకు దొరకడు సార్. నేను పనిచేసిన ప్రతి కంపెనీలోనూ, ఏం జరిగినా నాదే బాధ్యత అని తేల్చేవాళ్లు!
13
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పోయింది ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పోయింది' వెంకట్: ఉబ్బసం తగ్గడానికి స్వచ్ఛమైన గాలి కోసం కిటికీలు తీసి పడుకోమని చెప్పారు కదా! డాక్టర్: అవును... ఇంతకీ మీ ఉబ్బసం పోయిందా? వెంకట్: లేదు. నా లాప్టాప్, రోలెక్స్ వాచీ మాత్రం పోయాయి.
5
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక డబుల్ ట్రబుల్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'డబుల్ ట్రబుల్' ‘ఏమోయ్... ఇది విన్నావా? మగవాళ్ల కంటే ఆడవాళ్లు రెట్టింపు మాట్లాడతారట!’ ‘అందులో విశేషం ఏముంది? మీకు ఏ విషయాన్నయినా రెండుసార్లు చెప్పాల్సి వస్తుంది కదా!’
4
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అజమాయిషీ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అజమాయిషీ' కన్నబాబుకి విమానాశ్రయంలో బిల్గేట్స్ కనిపించాడు. వెంటనే అతని దగ్గరకు వెళ్లి... ‘‘సార్! నాకోసం ఓ క్లయింట్ వస్తున్నాడు. ఆ సమయంలో మీరు నా దగ్గరకు వచ్చి ‘బాగున్నావా కన్నా!’ అని అడిగితే నా పరపతి పెరిగిపోతుంది’’ అని ప్రాధేయపడ్డాడు. అతను కోరినట్లుగానే క్లయింట్తో మాట్లాడుతుండగా బిల్గేట్స్ వచ్చి ‘బాగున్నావా కన్నా!’ అని అడిగాడు. వెంటనే కన్నబాబు ‘బుద్ధి లేదూ. క్లయింట్తో మాట్లాడుతుంటే విసిగిస్తావా. ఫో అవతలికి’ అనేశాడు!!!
4
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అంతా టైమ్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అంతా టైమ్' సుబ్బారావు కారు తోలీ తోలీ అలసిపోయాడు. కాసేపు రోడ్డు పక్కనే నిలిపి ఓ కునుకు తీసే ప్రయత్నంలో పడ్డాడు. అలా తలవాల్చాడో లేదో. ‘హలో. టైమ్ ఎంతయ్యింది?’ అని లేపాడు దారిన పోయే దానయ్య. లేచి విసుక్కుంటూ ‘నాలుగున్నర’ అని చెప్పి మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు. మరో పది నిమిషాలకు... ‘మాస్టారూ! టైమ్ ఎంతయ్యింది?’ అని అడిగాడు రోడ్డున పోయే రామయ్య. ‘నాలుగూ ముప్పావు’ అని విసుక్కున్నాడు సుబ్బారావు. ఇలాగే ఉంటే లాభం లేదనుకుని ఓ కాగితం మీద ‘నాకు టైమ్ తెలియదు’ అని రాసి అద్దానికి తగిలించి నిద్రపోయాడు. పది నిమిషాలు గడిచాయో లేదో ఎవరో నిద్ర లేపారు. ‘టైమ్ తెలియదన్నావుగా. నాకు తెలుసు. ఐదు గంటలు’ అని చెప్పి చక్కా పోయాడు, పక్క నుంచి పోయే పాపయ్య.
12
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఓ మిడిల్క్లాస్ కథ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఓ మిడిల్క్లాస్ కథ' మా ఇంట్లో ఎలుక పడింది. దాన్ని ఎలా వదిలించుకోవాలో చెప్పవా! - ఏముంది ఓ బోను ఉంచు. అబ్బే బోను కొనేందుకు నా దగ్గర డబ్బెక్కడుంది? - సరే! ఎలుకల మందు పెట్టు. అహా... అది చాలా ఖరీదు కదా! - పోనీ పకోడీ పెట్టి, ఎలుక తింటుంటే కొట్టి చంపెయ్యి. నేను తిండి తినే రెండు రోజులయ్యింది. - కనీసం ఓ ఉల్లిపాయ ముక్కన్నా వాడు. అమ్మో ఉల్లిపాయలా... బోల్డు రేటు కదా! - ఇంక ఆ ఎలుక ఖర్మ... నీ దరిద్రం చూశాక విరక్తి పుట్టి రెండ్రోజుల్లో అదే పారిపోతుంది.
10
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ స్నేహం కోసం... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'స్నేహం కోసం...' ‘నువ్వు నా ప్రాణస్నేహితుడివి కాబట్టి నా బీరువా తాళాలు నీ దగ్గర ఉంచి వెళ్తున్నాను’ అంటూ రోహిత్ చేతిలో తాళం చెవులు ఉంచి ఊరికి బయల్దేరాడు కార్తీక్. పది నిమిషాల్లో అతనికి రోహిత్ నుంచి ఫోన్వచ్చింది. ‘పచ్చి మోసం. నువ్వు ఇచ్చిన తాళం చెవులతో బీరువా తెరుచుకోవడం లేదు’ అంటూ.
12
['tel']
అలవాటు అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'అలవాటు' డాక్టర్: కోమాలోకి వెళ్లిన పేషెంట్కి స్పృహ వచ్చిందా? నర్స్: రాకేం. మధ్యమధ్యలో వాట్సప్, ఫేస్బుక్ మెసేజీలు చూసుకుని, మళ్లీ కోమాలోకి జారుకుంటున్నాడు.
2
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక దారి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'దారి' అభిరాం ఊరికి వెళ్తూవెళ్తూ దారి తప్పిపోయాడు. దిక్కులు చూస్తూ ఉండగా, దారిన పోయే దానయ్య కనిపించాడు. ‘నక్కలపాలేనికి ఎటు వెళ్లాలో చెబుతారా!’ అని అడిగాడు. ‘నేరుగా ఓ నలభై వేల కిలోమీటర్లు వెళ్తే నక్కలపాలెం వస్తుంది’ తాపీగా చెప్పాడు దానయ్య. ‘అంతదూరం ఉంటుందా! దానికంటే, వెనక్కి తిరిగి వెళ్లిపోవడం నయం’ అంటూ నిట్టూర్చాడు అభిరాం. ‘వెనక్కి తిరిగి వెళ్లేట్లయితే ఓ మూడు కిలోమీటర్లలోనే నక్కలపాలెం వస్తుంది’ అంటూ జారుకున్నాడు దానయ్య.
5
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఆఫర్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఆఫర్' ఏదో కేసులో వీరబాబును ఉరితీస్తున్నారు. తనని చూసి జైలువార్డెనుకి జాలేసింది. ‘చూడూ! రేపు ఉదయమే నిన్ను ఉరితీసేస్తారు. ఈలోగా నాతో కలిసి ఓ రెండు పెగ్గులు మందుకొట్టు’ అని ఆఫర్ చేశాడు. ‘అబ్బే వద్దులేండి... నేను మందు కొడితే వారం రోజులు హ్యాంగోవర్ తగ్గదు’ అంటూ ఆఫర్ను తిరస్కరించాడువీరబాబు.
4
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మ్యాన్ హాండ్లింగ్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మ్యాన్ హాండ్లింగ్' తన ఇంట్లోకి చొరబడే ప్రయత్నంలో ఉన్న దొంగని చూసి రంగాయమ్మ చితక్కొట్టేసింది. ఆపై బుద్ధిగా పోలీసులను పిలిచింది. ‘వెరీ గుడ్ రంగాయమ్మగారు! మీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. కానీ ఆ దొంగని మరీ అంతలా కొట్టకుండా ఉండాల్సింది’ అంటూ పొగడ్తలతో పాటు నసిగాడు ఇన్స్పెక్టరు. ‘అబ్బే నిజంగా అలా కొట్టాలనుకోలేదండీ! గేటు దూకి ఇంట్లోకి వస్తున్న మనిషి మా ఆయనే అనుకున్నాను. అందుకే చితకామతకా దంచేశాను’ అంటూ సంజాయిషీ చెప్పుకుంది రంగాయమ్మ.
10
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తలరాత ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తలరాత' ఆ తల్లి తన కూతురిని చెడామడా తిడుతోంది. ‘నీకు బుద్ధుందా! వారం రోజుల్లో ఆ డాక్టరుతో పెళ్లి పెట్టుకుని, వీధి చివర మందుల షాపు వాడితో తిరుగుతావా!’ ‘అంతా నా తలరాత మమ్మీ! ఆయన రాసిన ప్రేమలేఖలు చదివించుకోవడానికి మందుల షాపతని దగ్గరకి వెళ్లాల్సి వస్తోంది’ వాపోయింది కూతురు.
8
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఏమున్నట్టు? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఏమున్నట్టు?' నీ జేబులో అయిదు పదిరూపాయల నోట్లు ఉన్నాయి. వాటిలో నాలుగు పోతే జేబులో ఏమున్నట్టు? ‘ఏమున్నట్టు? జేబులో చిల్లున్నట్టు!
11
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక రుజువు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రుజువు' ఓ ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేసేందుకు ఇంటర్వ్యూకి వెళ్లింది జూలీ. ‘ఇంతకు ముందు నేను ఫలానా హోటల్లో ఐదేళ్లు పనిచేశాను సర్!’ అని గొప్పగా చెప్పింది. ‘నువ్వు అక్కడ పనిచేశావని చెప్పడానికి రుజువేంటి!’ అడిగాడు యజమాని. ‘రుజువులు లేకేం! మా ఇంట్లో ఉన్న చెంచాలన్నీ అక్కడివే!’ అనేసి నాలుక కరుచుకుంది.
3
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ప్రతిఫలం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ప్రతిఫలం' ఆ టీచరుగారు చింటూకి మంచిబుద్ధులు నేర్పుతున్నారు... ‘నువ్వు పొరపాటున ఓ పెద్దాయన కాలు తొక్కితే ఏం చేస్తావు?’ అడిగారు టీచర్. ‘వెంటనే సారీ చెబుతాను’ చెప్పుకొచ్చాడు చింటూ. ‘గుడ్! నీ ప్రవర్తనకు మెచ్చుకుని ఆ పెద్దాయన చాక్లెట్ ఇస్తే ఏం చేస్తావు?’ సాగతీసింది టీచర్. ‘వెంటనే రెండో కాలు తొక్కుతాను’ తడుముకోకుండా చెప్పాడు చింటూ.
14
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ముందు... తర్వాత ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ముందు... తర్వాత' ఆటోవాలా: సార్! ఘోరం జరిగిపోయింది. బ్రేకులు పనిచేయడం లేదు. ఇప్పుడేం చేయడం. ప్రయాణికుడు: ముందు మీటర్ ఆపెయ్. తర్వాత సంగతి తర్వాత చూద్దాం.
9
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఆలస్యం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఆలస్యం' ‘నాలుగు ఇంజన్లలో ఒక ఇంజన్ పాడైంది. విమానం ఓ గంట ఆలస్యం అవుతుంది’ అంటూ ఎనౌన్స్మెంట్ వినిపించింది. ‘ఇంకో ఇంజన్ కూడా పాడైంది. విమానం ఇంకో గంట ఆలస్యం అవుతుంది’ కాసేపటికి మరో అనౌన్స్మెంట్ వచ్చింది. ‘మూడో ఇంజన్ కూడా పాడైంది. మరో గంట ఆలస్యమవుతుంది. క్షమించాలి’ అంటూ ఇంకో అనౌన్స్మెంట్. కాసేపటికి ‘నాలుగో ఇంజన్ కూడా పాడైంది...’ అని వినిపించగానే ‘ఛీఛీ ఇంకో గంట ఆలస్యం’ అని విసుక్కున్నాడు పరమేశం.
7
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మందు జాగ్రత్త ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మందు జాగ్రత్త' ‘నేను మందు కొట్టిన రోజు చాలా జాగ్రత్తగా ఉంటాను. చప్పుడు చేయకుండా ఇంటికి వెళ్లి, మారు మాటాడకుండా అన్నం తిని, బుద్ధిగా స్నానం చేసి మంచం ఎక్కుతాను. అయినా నా భార్య పసిగట్టేస్తుంది.’ అంటూ వాపోయాడు జగన్నాధం. ‘నేను మందు కొట్టిన రోజు తిక్కతిక్కగా ఉంటాను. అందుకే నా భార్య పసిగట్టలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు రాజనాల.
11
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక భర్త మనోగతం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'భర్త మనోగతం' వంటేం చేస్తున్నావు (ఆకలేసి చస్తోంది) చీర బాగుందే (ఎన్ని డబ్బులు తగలేశావో!) నాకు నిద్ర వస్తోంది (ఇక మీ పుట్టింటి కబుర్లు ఆపేయవా ప్లీజ్) సాయంత్రం లేట్గా వస్తాను (ఫుల్లుగా మందు కొట్టి వస్తా) ఏమనుకుంటున్నావ్ నేనంటే (నువ్వు కూడా తీసిపారేస్తే ఎలా!) మీ నాన్నగారు ఎలా ఉన్నారు (డబ్బులేమైనా మిగుల్తున్నాయా?)
5
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక రంగు పడాలి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రంగు పడాలి' ఎలక్షన్లలో ఓటు వేయడానికి బయల్దేరాడు వీరబాహు. ఓటు వేశాడు. వేలి మీద ఇంకు పూయించుకున్నాడు. ‘ఈ మరక నీళ్లతో కడిగితే పోతుందా’ ఆసక్తిగా అడిగాడువీరబాహు. ‘పోదు’ బదులిచ్చాడు ఎలక్షన్ ఆఫీసరు. ‘పోనీ సబ్బుతో రుద్దితే’... ‘పోదుగాక పోదు’ ‘వారమైనా పోదా’... ‘ఒకోసారి నెలైనా పోదు’ ‘బాబ్బాబు ఆ రంగేదో కాస్త నా జుత్తుకి కూడా పూయరా? వారం రోజుల్లోనే నా హెయిర్ డై పనిచేయకుండా పోతోంది.’
4
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఇంకెవరు! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఇంకెవరు!' అధికార పక్షంలో ఉన్న నాయకుడు, ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు.... ఇద్దరూ ఓ మునిగిపోతున్న పడవలో ఉన్నారనుకుందాం. ఎవరు బతికిపోతారని మీరు అనుకుంటున్నారు? జనం!
6
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అటూ ఇటుగా ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అటూ ఇటుగా' కౌన్ బనేగా కరోర్పతికీ నేతలకూ పోలిక ఏమిటి? కేబీసీలో జవాబులు చెప్పి కోట్లు సంపాదించుకుంటాం. కానీ రాజకీయాల్లో కోట్లు సంపాదించాక ఏదో ఒక జవాబు చెప్పవచ్చు.
4
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అంతేగా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అంతేగా!' బంటి: నేనో రాజకీయ నాయకుడి దగ్గరకు వెళ్లాను. తను నా సమస్యలన్నీ సావధానంగా విన్నాడు. అక్కడికక్కడే వాటిని పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులను జారీ చేశాడు. చంటి: వావ్ గ్రేట్.... తర్వాత ఏం జరిగింది. బంటి: ఏం జరుగుతుంది.... మెలకువ వచ్చింది.
13
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పోలిక మారింది ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పోలిక మారింది' నాన్నా ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చెప్పవా? అని అడిగాడు పదేళ్ల వాసు. ‘అదెంత పని! నీకు తేలికగా అర్థమయ్యేలా చెబుతా విను. నేను, మీ అమ్మ ఇల్లు గడవడానికి కావల్సిన డబ్బు తెస్తున్నాం. కాబట్టి మేం వ్యాపారవేత్తలం అనుకో. నువ్వు ఈ ఇంట్లో హాయిగా తిరుగుతున్నావు కాబట్టి దేశ పౌరునిగా ఊహించుకో. పని పిల్ల పని చేస్తోంది కాబట్టి, తను శ్రామిక వర్గం. ఈ ఇంటి వ్యవహారాలన్నీ చూసుకుంటున్నాడు కాబట్టి మీ తాతయ్యే ప్రభుత్వాధికారి. నీ తమ్ముడు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు కాబట్టి తనే ఈ దేశ భవిష్యత్తు’ అంటూ చాలా తెలివిగా చెప్పాననుకుని మురిసిపోయాడు తండ్రి. ఆ రాత్రి కరెంటు పోయింది. తమ్ముడు గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. తాతయ్యేమో గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. కిందకి వచ్చి చూసిన వాసుకి, అమ్మానాన్నలు పనిపిల్లను కొడుతూ కనిపించారు. ‘ఇప్పుడర్థం అయ్యింది నాకు ప్రజాస్వామ్యం అంటే’ అనుకున్నాడు వాసు. ‘ప్రభుత్వం గుర్రుపెట్టి నిద్రపోతుంటే, వ్యాపారవేత్తలు కార్మికులను చావగొడతున్నారు. భవిష్యత్తు అంధకారంలో గుక్కపెట్టి ఏడుస్తోంది’.
11
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మాట తప్పలేదు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మాట తప్పలేదు' నన్ను ఎన్నుకోండి మీ జీడీపీ పెంచేస్తాను అని మాట ఇచ్చాడు నాయకుడు. అంతా ఆశగా తనని ఎన్నుకున్నారు. తను మాట తప్పలేదు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.
13
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తేడా ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తేడా' ఫ్రెండంటే! నువ్వు జైల్లో ఉంటే, బెయిల్ ఇచ్చి విడిపించేవాడు. బెస్ట్ ఫ్రెండంటే! నీతో పాటు పట్టుబడేవాడు.
4
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఉద్యోగి వేదాంతం! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఉద్యోగి వేదాంతం!' ఎక్కువ పని చేస్తే ఎక్కువ తప్పులు చేస్తాం. తక్కువ పని చేస్తే తక్కువ తప్పులు చేస్తాం. అసలు ఏ పనీ చేయకపోతే, తప్పులు చేసే అవసరమే ఉండదు. అందుకే... పని చేయనివాడికే ప్రమోషన్ వస్తుంది. ప్చ్!
14
['tel']
భలే బేరం అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'భలే బేరం' ఈ గడి యారం ఖరీదు ఎంత? అయిదు ముద్దులు! ఆ బొమ్మ ఖరీదు ఎంత? పది ముద్దులు! సరే! ఆ రెండూ నాకు కావాలి. మరి బిల్లు సంగతో! మా డాడీ వచ్చి నీ బిల్లు పే చేస్తారు.
2
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ కనబడుటలేదు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కనబడుటలేదు' సురేష్ ఫేస్బుక్ వాల్ మీద వాళ్ల నాన్నగారు ఇలా రాశారు... ‘బాబూ ఇప్పటికైనా నీ కంప్యూటర్ షట్డౌన్ చేసి గదిలోంచి బయటకి రా! నిన్ను చూసి రెండు రోజులైపోయింది. ఇవాళైనా కలిసి భోజనం చేద్దాం’. సురేష్ మనసు కరిగిపోయింది. ఓ లైక్ కొట్టి, బ్రౌజింగ్ కొనసాగించాడు.
12
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పచ్చి అబద్ధం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పచ్చి అబద్ధం' పాలు తాగితే బలం వస్తుందని ఎవరు చెప్పారు? నాలుగు గ్లాసుల పాలు తాగినా ఎదురుగా ఉన్న గోడని కదిలించలేం. కానీ ఓ గ్లాసుడు ఓడ్కా తాగితే, గోడ దానంతట అదే కదిలిపోతుంది.
9
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక భవిష్యత్తు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'భవిష్యత్తు' ఓ కప్ప జ్యోతిషుడి దగ్గరకు వెళ్లింది. ‘కప్పలు, అందమైన అమ్మాయిలను కలుసుకున్న కథ చదివాను. నేను కూడా అలా ఓ అమ్మాయినికలుసుకుంటానా?’ అని ఆశగా అడిగింది. ‘తప్పకుండా! వచ్చే ఏడాది ఓ బయాలజీ క్లాస్లో’ అంటూ శూన్యంలోకి చూస్తూ బదులిచ్చాడు జ్యోతిషుడు.
3
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పని.. పని.. పని ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పని.. పని.. పని' ఆవిడ కిరాణా షాపుకి వెళ్లి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, గసగసాలు అన్నీ పావు కిలో చొప్పున ఒకే కవర్లో వేసి కట్టమని చెప్పింది. ‘అన్నీ కలిపేయాలా! ఎందుకలా? ఏదన్నా కొత్త వంటకం ట్రై చేస్తున్నారా’ అని అడిగాడు షాపు వాడు. ‘వంటకమా పాడా! మా అత్తయ్యగారు ఓ వారం పాటు ఇంట్లో ఉండటానికి వస్తున్నారు. ఇవన్నీ ఇచ్చి వేరు చేయమని అడిగితే ఇక నా జోలికి రారు కదా!’ అని మూతి విరుచుకుంటూ బదులిచ్చింది సూర్యకాంతమ్మగారి కోడలు.
14
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మగబుద్ధి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మగబుద్ధి' బస్టాండులో ఉన్న ఆ యువకుడి అందం చూసి, ఓ అమ్మాయికి మతిపోయింది. వెంటనే దగ్గరకి వెళ్లి- ‘నువ్వంటే నాకిష్టం. అలా కాఫీకి వెళ్దాం వస్తావా!’ అని అడిగింది. ఆ మాటలకి అబ్బాయి అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. ‘ఇదంతా వయసు వల్ల కలిగే ఆకర్షణ. ముందు కెరీర్ మీద దృష్టి పెట్టు. అప్పుడు నాకంటే మంచివాడు దొరుకుతాడు’ అని చెప్పాడు. కాగితంపై ఏదో రాసి... ‘ఇందులో మంచి సూక్తులు ఉన్నాయి. వెళ్లి చదువుకో’ అంటూ ఓ పేపరు చేతిలో పెట్టాడు. ఇంటికెళ్లాక దాన్ని చూసిందా అమ్మాయి- ‘పిచ్చిదానా! వెనకే ఉన్న నా భార్యని నువ్వు చూసినట్టు లేదు. రేపు సాయంత్రం ఈ నెంబరుకి ఫోన్ చెయ్! కాఫీకి వచ్చేస్తాను’ అని రాసి ఉంది.
9
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ గురి తప్పిన వరం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'గురి తప్పిన వరం' ఓ 70 ఏళ్ల ముసలావిడ హాస్పిటల్లో ఉంది. ‘భగవంతుడా నన్ను ఎలాగైనా బతికించు’ అంటూ తెగ ప్రార్థించింది. ఇంతలో ఆమెకు దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ‘నువ్వు ఇంకో 30 ఏళ్లు కచ్చితంగా బతుకుతావు. నాది హామీ!’ అంటూ వరం ఇచ్చాడు. తను ఇంకా బతుకుతానన్న ఆనందంలో ముసలావిడ రోజూ చక్కగా మేకప్ వేసుకోవడం మొదలుపెట్టింది. కానీ నెల రోజులకే స్వర్గానికి చేరుకుంది. ‘మోసం! నేను ఇంకో 30 ఏళ్లు బతుకుతానని హామీ ఇచ్చావు కదా!’ అని స్వర్గంలో ఉన్న దేవుడితో తగవు పెట్టుకుంది. ముసలావిడ వంక చూసిన దేవుడు నాలుక కరుచుకున్నాడు. ‘అరే నువ్వా! సారీ. మేకప్ ఎక్కువ కావడంతో గుర్తుపట్టలేదు’ అంటూ పక్కకి తప్పుకున్నాడు.
14
['tel']
ఆరోగ్య రహస్యం అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'ఆరోగ్య రహస్యం' డాక్టర్: ఓ పెగ్గు విస్కీతో నీ జీవితంలో అయిదు నిమిషాలు క్షీణించిపోతుంది. అదే నవ్వుతో పదినిమిషాల ఆయుష్షు పెరుగుతుంది. దేవదాసు: అందుకే కదా! నేను ఫెగ్గుకీ ఫెగ్గుకీ మధ్య నవ్వుషుంటాను!!! హ.. హ.. హ!
1
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ నిస్వార్థం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నిస్వార్థం' కొందరు మతం కోసం గొడవపడుతుంటారు... మరికొందరు డబ్బు కోసం గొడవపడుతుంటారు... ఇంకొందరు కులం పేరుతో గొడవ పడుతుంటారు... ఒక్క భార్యాభర్తలు మాత్రమే... నిస్వార్థంగా దేనికో తెలియకుండానే గొడవ పడుతుంటారు.
12
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ బారులో తోడు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'బారులో తోడు' వీరసింగుడు బార్లో కూర్చుని తెగ తాగాడు. తాగీతాగీ పక్కన కనిపించిన మనిషితో మాట్లాడటం మొదలుపెట్టాడు. వాళ్లిద్దరూ ఒకే ఊరి నుంచి వచ్చారనీ, ఒకే కాలేజీలో చదువుకున్నారనీ తేలింది. ఆ సంతోషంలో రెండో మనిషి బిల్లు కూడా వీరసింగుడే కట్టి బయల్దేరాడు. ‘ఇప్పటికైనా అర్థమైందా! బార్లో అద్దాలు పెట్టడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో?’ అంటూ కొడుక్కి హితబోధ చేశాడు బారు ఓనరు.
14
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక కష్టమే! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కష్టమే!' ఎప్పుడూ చేపల మార్కెట్లాగా ఉండే ఆఫీసులో ఆ రోజు శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ‘ఇవాళ ఎందుకింత నిశ్శబ్దంగా ఉంది?’ ఆశ్చర్యంగా తన పీఏని అడిగాడు ఆఫీసరు. ‘ఇవాళ ఆఫీసులో అందరూ వచ్చారండీ. ఇంక ఎవరి గురించి మాట్లాడుకుంటారు పాపం!’ బదులిచ్చాడు పీఏ.
7
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ కొక్కొరొక్కో ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కొక్కొరొక్కో' ఓ పిచ్చాసుపత్రి. అందులో ఓ హాలు. అక్కడ పదిమంది పిచ్చివాళ్లు ‘కొక్కొరొక్కో’ అంటూ కోడిలాగా అరుస్తున్నారు. పదకొండో వ్యక్తి మాత్రం నిశ్శబ్దంగా ఓ మూల కూర్చుని ఉన్నాడు. ఆ మనిషిని చూసి డాక్టరుగారు ముచ్చటపడిపోయారు. ‘వాళ్లంతా అరుస్తున్నా నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావంటే నీకు పిచ్చి తగ్గిపోయినట్లుంది. వెంటనే నిన్ను డిశ్చార్జ్ చేసేస్తాను’ అన్నారు డాక్టరు. ‘ఉష్! నోర్ముయ్. గుడ్డుపెడుతున్న కోడితో మాట్లాడకూడదని నీకు తెలియదా!’ అని కసురుకున్నాడు పదకొండో మనిషి!
13
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ చెప్పను పో! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'చెప్పను పో!' ‘నీ వయసెంత!’ ‘ఏడిశావ్! అమ్మాయిలు ఎప్పుడూ వాళ్ల వయసు చెప్పరని తెలియదా!’ ‘సరే! అయితే నీ ఈమెయిల్ అడ్రస్ చెప్పు!’ ‘వనజచి1998ఃమెయిల్.కామ్ !!!’
13
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మోసం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మోసం' చిన్ను: నేను టీసీని బోల్తా కొట్టించాను తెలుసా! మిన్ను: ఎలా? చిన్ను: నన్ను టీసీ టికెట్ అడగ్గానే పరుగు లంకించుకున్నాను. రైలు ఆ చివర నుంచి ఈ చివర వరకు పరుగు తీయించాను. చివరికి ఎప్పటికోకానీ తను నన్ను పట్టుకోలేకపోయాడు. మిన్ను: మరి ఎలా బోల్తా కొట్టించావు! చిన్ను: నా దగ్గర టికెట్ ఉందిగా!!!
11
['tel']
భవిష్యవాణి అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'భవిష్యవాణి' ముగ్గురు జ్యోతిషులు ఒకచోట కలుసుకున్నారు. ‘వచ్చే ఏడాది విపరీతమైన వరదలు వస్తాయి. వాటిని తల్చుకుంటేనే చెమటలు పడుతున్నాయి’ అంటూ భవిష్యవాణి పలికాడు ఒక జ్యోతిషుడు. ‘అవును వచ్చే ఏడు ఎండలు కూడా చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి. ఊహించుకుంటేనే వడదెబ్బ కొడుతోందనుకో’ అంటూ బడాయికి పోయాడు రెండో జ్యోతిషుడు. ‘కంగారుపడకండి! వచ్చే ఏడాదికి మీరు ఇద్దరూ ఉండరు’ అంటూ భరోసా ఇచ్చాడు మూడో జ్యోతిషుడు.
2
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అపార్థం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అపార్థం' ఆ హైవే మీద వాహనాలన్నీ సర్రు సర్రున దూసుకుపోతున్నాయి. కానీ సుబ్బారావు కారు మాత్రం పది కిలోమీటర్ల స్పీడులోనే నడుస్తోంది. ‘ఎందుకంత నిదానంగా వెళ్తున్నారు?’ అని అడిగాడు చెక్పోస్టు దగ్గర ఉన్న పోలీసు. ‘రోడ్డు పక్కనే 10 అన్న బోర్డు కనిపించింది. అది స్పీడ్ లిమిట్ ఏమో అనుకుంటున్నాను’ వివరించాడు సుబ్బారావు. ‘భలేవారే! అది హైవే నెంబరు. మీరు దాన్ని స్పీడ్ లిమిట్ అని పొరపాటుపడ్డారు’ అని నచ్చచెప్పాడు పోలీసు. ఇంతలో కారు వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు ముసలమ్మలు బిక్కచచ్చిపోయి కనిపించారు. ‘ఎందుకని మీరంతగా భయపడిపోయి కనిపిస్తున్నారు’ అంటూ ఆసక్తిగా అడిగాడు పోలీసు. ‘ఇందాకే మేము 150 నెంబరు హైవే నుంచి వచ్చాం’ అంటూ భోరుమన్నారా బామ్మలు.
10
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పరమార్థం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పరమార్థం' లెక్చరర్: ప్రతి మగవాడి విజయం వెనుకా ఒక స్త్రీ ఉంటుంది. దీన్ని బట్టి మీకేం తెలుస్తోంది? స్టూడెంట్: ఈ చదువులన్నీ కట్టిపెట్టి, ఓ మంచి అమ్మాయిని వెతకాలని అర్థం అయ్యింది.
14
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఎడబాటు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఎడబాటు' జైలర్: నీకు మరణశిక్ష విధించేలోగా ఎవరైనా ఒక వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ఎవరు కావాలి? ఖైదీ: నా భార్యని పిలిపించండి! జైలర్: అదేంటి, నీకు తల్లికంటే భార్యే ఎక్కువైందా? ఖైదీ: అబ్బే అదేం లేదు. మళ్లీ జన్మంటూ ఉంటే, పుట్టిన వెంటనే నా తల్లిని చూస్తాను. కానీ వచ్చే జన్మలో మా ఆవిడని చూడాలంటే 21 ఏళ్లు ఆగాలి కదా!!!
7
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఉపాయం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఉపాయం' చిన్ను: నేను ఏ ఆయుధమూ వాడకుండా పులిని చంపగలను. మిన్ను: అసాధ్యం. లక్షరూపాయలు పందెం! చిన్ను: ఎందుకు కుదర్దు. ఓ సీసాడు సైనేడు మింగి పులి ముందు పడుకుంటే సరి. అది ఫుడ్ పాయిజనింగ్తో చచ్చిపోతుంది.
6
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఏమో మరి! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఏమో మరి!' బార్య: నాకేమన్నా జరిగితే... భర్త: అంతమాట అనకు. నేను పిచ్చివాడిని అయిపోతాను. భార్య: అంటే రెండో పెళ్లి చేసుకోరా? భర్త: ఏమో పిచ్చివాళ్లు ఏమైనా చేయొచ్చు కదా!!!
14
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక గణిత తత్వం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'గణిత తత్వం' జామెట్రీ అంతా పిజ్జాల్లోనే ఇమిడి ఉంది. పిజ్జా డబ్బా చతురస్రంలో ఉంటుంది. పిజ్జాలు గుండ్రంగా ఉంటాయి. వాటి ముక్కలు త్రికోణంలో ఉంటాయి. పాపం ఆ లెక్కలు నేర్చుకోవడానికే ఇంజనీరింగ్ కుర్రాళ్లు పిజ్జాహట్ల చుట్టూ తిరుగుతుంటారు.
4
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ లాస్ట్ ఛాన్స్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'లాస్ట్ ఛాన్స్' ఆశారావ్: నాకు పిల్లులు ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నట్టు కలలు వస్తున్నాయి. డాక్టర్: మరేం ఫర్వాలేదు! ఈ టాబ్లెట్ వేసుకో. ఇవాల్టి నుంచి నీకు ఆ కల రావడం ఆగిపోతుంది. ఆశారావ్: మీరేమీ అనుకోనంటే, ఈ టాబ్లెట్ రేపు వేసుకోవచ్చా! ఇవాళ ఫైనల్ మ్యాచ్ ఉంది.
9
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ నాలుగోవాడే! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నాలుగోవాడే!' గోపాలరావు: నాకు నలుగురు కొడుకులు. వాళ్లలో ముగ్గురు చక్కగా డిగ్రీ పాసయ్యారు. నాలుగోవాడే ఉత్త మొద్దు. ఏ పనీ చేతకాక కూలిపనికి కుదిరాడు. నాగభూషణం: ఛీ ఛీ! అలాంటివాడిని ఏం చేసినా పాపం లేదు. వాడిని ఇంట్లోంచి తరిమెయ్యకపోయావా! గోపాలరావు: అలా ఎలా కుదురుతుంది. మా అందరినీ పోషిస్తోంది వాడే కదా!!!
9
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఆలస్యం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఆలస్యం' ‘డార్లింగ్! మనం ఫంక్షన్కి ఆలస్యం అయినట్టున్నాం’ ‘ఎలా చెప్పగలుగుతున్నారు’ ‘ఫంక్షన్కి వెళ్లినవాళ్లంతా ఎదురొస్తున్నారు’ ‘మీ మొహం! ముందా కారుని రాంగ్ వేలో తోలడం ఆపండి’
9
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పాలసీ మేటర్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పాలసీ మేటర్' ప్రయాణికుడు: నువ్వు నా జేబులో చెయ్యెందుకు పెట్టావు? శేఖర్: అబ్బే! ఊరికనే. అగ్గిపెట్టె తీసుకుందామనే! ప్రయాణికుడు: ఆ మాటే నన్ను అడగొచ్చు కదా! శేఖర్: నేను ముక్కూమొహం తెలియనివారితో మాట్లాడను బాబూ!
8
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ వెళ్లొచ్చా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'వెళ్లొచ్చా!' టీచర్: నేను అడగబోయే ప్రశ్నకి ఎవరైతే మొదట జవాబు చెబుతారో, వాళ్లు ఇంటికి వెళ్లిపోవచ్చు. ఇంతలో ఒక ఈల వినిపించింది. టీచర్: ఎవర్రా ఆ ఈల వేసిందీ! చింటూ: నేనే మేడం. మీ ప్రశ్నకి జవాబు చెప్పినట్లేగా. ఇక నేను ఇంటికి వెళ్లొచ్చా?
12
['tel']
తెలుసా! అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'తెలుసా!' రాజు: రెండు కళ్లూ మూసుకున్నా కూడా నాకు కనిపిస్తుంది తెలుసా! రాణి: వావ్! ఏం కనిపిస్తుంది? రాజు: ...... చీకటి.
1
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఇద్దరూ ఇద్దరే! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఇద్దరూ ఇద్దరే!' పరమానందం తన మిత్రుడితో కలిసి క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళ్లాడు. మ్యాచ్ మొదటి ఓవర్లోనే ఆటగాడు సిక్స్ కొట్టాడు. పరమానందం: వాహ్... భలే గోల్ కొట్టాడు కదూ! మిత్రుడు: నీ మొహం. అది గోల్ కాదు సిక్స్. గోల్ని క్రికెట్లో కొడతారు!!!
7
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఉక్రోషం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఉక్రోషం' జనం- పాపం ఎందుకతన్ని కొడుతున్నారు? వీరబాహు - కొట్టాలా? కొయ్యాలా? ఇతను మా ఆవిడ మనసులో లేనిపోని ఆశలు కల్పిస్తున్నాడు. జనం - ఎవరతను? ఏంచేశాడు? వీరబాహు - నేను పోతే ఎంత లాభమో మా ఆవిడకి చెబుతున్నాడు. ఎంత బీమా ఏజంటైతే మాత్రం....
10
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఓ పరిశీలన ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఓ పరిశీలన' అడుక్కుతినేవాడంటే సమాజానికి ఎంత అభిమానం! అందరూ ‘ముందుకి వెళ్లమని’ ప్రోత్సహించేవారే!!
9
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పగ... పగ... పగ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పగ... పగ... పగ' ఒక పెద్దాయన రోజంతా పార్కులో కూర్చుని కనిపించేవాడు. ‘రోజూ ఇక్కడ కూర్చోవడం వల్ల ఏంటి లాభం!’ అని అడిగాడుఓ పేరయ్య. పెద్దాయన: నేను కూర్చునీ కూర్చునీ పగ తీర్చుకుంటున్నాను పేరయ్య: ఎవరి మీద పెద్దాయన: కాలం నా జీవితాన్ని నాశనం చేసింది. అందుకని నేను ఇప్పుడు కాలాన్ని నాశనం చేస్తున్నాను
8
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అవసరమా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అవసరమా!' సుబ్బారావు: జడ్జిగారూ! మా ఆవిడ నుంచి విడాకులు కావాలంతే! జడ్జి: కారణం! సుబ్బారావు: ఓ ఏడాది నుంచి ఆవిడ నాతో మాట్లాడటమే లేదు. జడ్జి: ఇంకోసారి ఆలోచించుకో! అంత ప్రశాంతమైన కాపురం నీకెక్కడా దొరకదు.
13
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అలవాటు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అలవాటు' వెంగళాయ్ తన ఆరునెలల పిల్లవాడికి పుట్టినరోజు చేస్తున్నాడు. ‘అదేంటి! ఇంకా ఏడాది నిండకముందే పుట్టినరోజు చేస్తున్నారు’ అని అడిగారు ఇరుగుపొరుగు. ‘పెద్దయ్యాక వాడిని ఇంజనీరు చెయ్యాలనుకుంటున్నాను. అందుకే ఇప్పటి నుంచి సెమిస్టరు విధానం అలవాటు చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు వెంగళాయ్.
3
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక కమింగ్ సూన్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కమింగ్ సూన్' వార్త- ఆ హీరోగారి వెయ్యో చిత్రం విడుదల అవుతోంది. పోస్టరు మీద ఇంతెత్తు హీరో బొమ్మ ముద్రించి, దాని కింద ‘కమింగ్ సూన్’ అని రాశారు. దాన్ని ఊరంతా అంటించారు. అయినా హీరోగారు అలిగారు. కారణం.... పనిలో పనిగా.... ‘కమింగ్ సూన్’ పోస్టరుని శ్మశానంలో కూడా అతికించేశారు.
4
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అదే.. వస్తుందిలే! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అదే.. వస్తుందిలే!' హరి: మా ఓనరు చనిపోయాడు. అంతా ఒకటే ఏడుపు. కానీ నాకేమో నవ్వొస్తోంది. ఎవరన్నా చూస్తే బాగోదు కదా! గిరి: ఓస్ అంతేనా! మీ ఓనరు మళ్లీ తిరిగొచ్చినట్లుగా ఊహించుకో. ఏడుపు అదే తన్నుకొస్తుంది.
14
['tel']
సందిగ్ధం అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'సందిగ్ధం' భార్య: ఏమండీ! మన వంటింట్లోకి దొంగ దూరాడండీ! నేను చేసిన బిర్యానీ కూడా తినేశాడని అనుమానంగా ఉంది! భర్త: అయితే మనం ఇప్పుడు పోలీసులని పిలవాలా? ఆంబులెన్సుని పిలవాలా?
1
['tel']
అకౌంట్ క్లోజ్ అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'అకౌంట్ క్లోజ్' బ్యాంక్ మేనేజర్: అకౌంట్ క్లోజ్ చేయాలనుకుంటున్నారా! ఎందుకలా! వీరబాహు: నిన్న రాత్రి ఎవరో నన్ను హత్య చేసినట్లు కల వచ్చింది. మేనేజర్: దానికీ అకౌంటుకీ ఏంటి సంబంధం? వీరబాహు: ‘మీ కలలను నిజం చేస్తాం’ అని కదా మీ స్లోగన్.
2
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ సంతోషించక ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సంతోషించక' ‘సిగ్గు లేదూ! వందకి అయిదు మార్కులు వచ్చినా పళ్లికిలిస్తున్నావు?’ ‘ఖాళీ పేపర్కి అయిదు మార్కులు వేస్తే సంతోషపడరా ఏంటి మేడం!’
9
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మళ్లీ మొదలా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మళ్లీ మొదలా!' మురళి: డిగ్రీలో మళ్లీ ఫెయిలయ్యానురా! ఆ బాధతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను కానీ ఆగిపోయాను. రవి: గుడ్. నీకు గుండె ధైర్యం ఎక్కువే! మురళి: ధైర్యమా పాడా! వచ్చే జన్మంటూ ఉంటే మళ్లీ ఎల్కేజీ నుంచి చదవాలి కదా!!!
8
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ప్రేమకి ఎన్ని అర్థాలో ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ప్రేమకి ఎన్ని అర్థాలో' ఎనిమిదేళ్ల పిల్లవాడు: ఐ లవ్యూ మమ్మీ. తల్లి: ఐ లవ్యూ టూ కన్నా! పదహారేళ్లప్పుడు: ఐ లవ్యూ మమ్మీ. తల్లి: సారీ బాబూ! నా దగ్గర డబ్బులు లేవు. ఇరవై నాలుగేళ్లకి: ఐ లవ్యూ మమ్మీ. తల్లి: ఎవర్రా అదీ... ఎక్కడుంటుందీ! ముప్పై రెండేళ్లు: ఐ లవ్యూ మమ్మీ. తల్లి: నేను అప్పుడే చెప్పానా! ఆ పిల్లని చేసుకోవద్దని. నలభై ఏళ్లు వచ్చాక: ఐ లవ్యూ మమ్మీ. తల్లి: చూడూ! నేను ఏ పేపరు మీదా సంతకం పెట్టేది లేదు.
4
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ కాదనగలరా? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కాదనగలరా?' టీచర్: ఈ ప్రపంచంలో అన్నిటికంటే ప్రాచీనమైన జంతువు ఏది? చందు: జీబ్రా టీచర్: ఎందుకని అలా అనిపించింది. చందు: ఎందుకంటే జీబ్రా బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది కాబట్టి!!!
12
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఏర్పాట్లు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఏర్పాట్లు' స్నేహితుడు: ఇంకో రెండు రోజుల్లోనే పెళ్లి కదా! ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? పెళ్లికొడుకు: భేషుగ్గా జరుగుతున్నాయి. నా రెండు సిమ్లూ తీసి కాలువలో పారేశాను. ఫోను ఫార్మాట్ చేశాను. లాప్టాప్లో ఉన్న ప్రైవేటు ఫోల్డరుని డిలీట్ చేసేశాను. ఫేస్బుక్ నుంచి బయటకి వచ్చేశాను. వాట్సాప్ని వదిలించుకున్నాను. ఇక పెళ్లికి నేను సిద్ధం.
8
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పాజిటివ్ యాటిట్యూడ్' ‘మా తాతగారు నాకోసం యాభై లక్షలు వదిలిపెట్టి చనిపోయారు తెలుసా!’ ‘అదేమంత గొప్ప విషయం! మా తాతగారు నా కోసం ప్రపంచాన్నే వదిలిపెట్టి చనిపోయారు తెలుసా!!’
5
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అక్కడి దాకా వెళితే.... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అక్కడి దాకా వెళితే....' గిరిబాబు: డాక్టర్! మా ఆవిడ మెమరీ కార్డు మింగేసింది. అందులో మ్యూజిక్ ఫోల్డరులో ఉన్న పాటలన్నీ పాడుతోంది. డాక్టర్: మరీ మంచిది. ఇందులో బాధపడాల్సింది ఏముంది? గిరిబాబు: రేపో మాపో! వీడియో ఫోల్డర్ ఓపెన్ అయితే ఏం జరుగుతుందా అనీ.....
7
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ నిజమే! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నిజమే!' భార్య: మీరు ఎంత అమాయకులండీ! ఎవరైనా మిమ్మల్ని వెధవాయిని చేసేయగలరు. భర్త: నిజమే! ఆ విషయాన్ని ముందు కనిపెట్టింది మీ నాన్నే!
11
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక రాయడం వచ్చుగానీ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రాయడం వచ్చుగానీ' ఆయుష్: అమ్మా! ఇవాళ నాకు బడిలో అక్షరాలు రాయడం నేర్పించారు తెలుసా! అమ్మ: వెరీ గుడ్! ఏం రాశావు? ఆయుష్: ఏమోనమ్మా! నాకింకా చదవడం నేర్పలేదు కదా!!!
8
['tel']
అందుకనే... అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'అందుకనే...' సందేహం: మీ ఆవిడ ఎప్పుడూ కోపంగా ఉంటుంది. ఎందుకు? జవాబు: ఓసారి పొరపాటున ‘నువ్వు కోపంలో ఇంకా అందంగా ఉంటావు డార్లింగ్’ అన్నాను. అప్పటి నుంచి అదే వరస!!!
2
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ త్వరగా... త్వరగా ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'త్వరగా... త్వరగా' సన్నీ, బన్నీ అడవిలో వెళ్తున్నారు. ఇంతలో ఓ ఎలుగుబంటి వాళ్లని చూడనే చూసింది. చూసీ చూడగానే వెంటపడటం మొదలుపెట్టింది. వెంటనే సన్నీ తన బ్యాగ్లో ఉన్న రన్నింగ్ షూస్ తీసి వేసుకోవడం మొదలుపెట్టాడు. బన్నీ: నీ తెలివి తెల్లారినట్టే ఉంది. రన్నింగ్ షూస్ వేసుకుని పరిగెత్తితే మాత్రం ఎలుగుబంటి నిన్ను పట్టుకోలేదనుకుంటున్నావా! సన్నీ: నేను షూస్ వేసుకుంది ఎలుగుబంటి కోసం కాదు.... నీకంటే వేగంగా పరిగెత్తడం కోసం...
11
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక బహుమతి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'బహుమతి' హైవే మీద వస్తున్న ఓ కారుని ఆపాడు పోలీసాఫీసరు. ‘ఈ హైవే మీద అడుగుపెట్టిన లక్షో వాహనం మీది. అందుకే మీకు వెయ్యి రూపాయలు బహుమతిగా ఇస్తున్నాం. ఈ డబ్బుతో మీరేం చేస్తారు?’ అంటూ ఆసక్తిగా అడిగాడు. ‘వెంటనే డ్రైవింగ్ లైసెన్సుకి అప్లై చేస్తాను’ కంగారుగా చెప్పాడు కారు దిగిన రాంబాబు. ‘అయ్యో మీరు ఆయన మాటలు నమ్మకండీ. అసలే తాగి ఉన్నారు’ అని సర్దిచెప్పబోయింది పక్కనే ఉన్న వాళ్లావిడ. ‘పోలీసులు ఆపుతారని భయపడే, కారు దొంగతనం చేయొద్దని మొత్తుకున్నాను’ అని వెనకాల సీట్లోంచి అరిచింది చెవిటి ముసలమ్మ. ఈ మాటలన్నీ విన్న పోలీసాఫీసరు బిత్తరపోయి చూస్తుండగా కారు డిక్కీలోంచి ఒక గొంతు వినిపించింది- ‘కారు ఆగిపోయిందేంటీ? అంటే మనం బోర్డరు దాటేశామా!’
6
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అనుభవం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అనుభవం' ఓ పెద్దాయన పార్కులో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఆయనకి ఓ మాట్లాడే కప్ప కనిపించింది- ‘మీరు నన్ను ముద్దు పెట్టుకుంటే, అందమైన రాకుమారిగా మారిపోయి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను’ అంది కప్ప. పెద్దాయన మాట్లాడకుండా కప్పని సంచిలో వేసుకుని బయల్దేరాడు. ‘అదేంటీ. నేను అందమైన రాకుమారిలా మారిపోతానని చెప్పాను కదా! ముద్దు పెట్టుకోవేం’ అని అడిగింది కప్ప. ‘చూడూ! ఈ వయసులో నాకు రాకుమారితో కంటే మాట్లాడే కప్పతోనే బాగా కాలక్షేపం అవుతుంది. నీకు ఎవర్ని ఏమడగాలో తెలియదా! ఇక నుంచీ నా సంచిలోనే ఉండి కబుర్లు చెబుతూ ఉండు’ అని విసుక్కున్నాడు ఆ పెద్దాయన.
3
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ స్పోకెన్ ఇంగ్లిష్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'స్పోకెన్ ఇంగ్లిష్' భార్య: ఏమండీ! మిమ్మల్నే! డిన్నర్ చేద్దురుగాని రండి. భర్త: నీ ఇంగ్లిష్ ఏడ్చినట్లే ఉంది. ఇది మధ్యాహ్నం. ఇప్పుడు తినేదాన్ని లంచ్ అంటారు. రాత్రి తినేదాన్ని డిన్నర్ అంటారు. భార్య: మీ తెలివి మండినట్లే ఉంది. నిన్న రాత్రి మిగిలిందే ఇప్పుడు పెడుతున్నాను.
9
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అదీ విషయం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అదీ విషయం' టీచర్: క్లాసుకి ఎందుకింత ఆలస్యం అయ్యింది? చింటూ: ఒకాయన ఐదొందల నోటు కోసం వెతుక్కుంటున్నాడు మేడం. టీచర్: గుడ్! నువ్వు ఆయనకి వెతకడంలో సాయం చేశావన్నమాట! చింటూ: అబ్బే లేదు. ఆ ఐదొందల నోటు మీద నిలబడి ఉన్నాను.
7
['tel']
సహకారం అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'సహకారం' నువ్వు గొప్ప డాన్సర్వే! కాకపోతే ఆ రెండూ నీకు సహకరించడం లేదు. - ఏంటా రెండూ? నీ కాళ్లు
1
['tel']
అదే రేటు అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'అదే రేటు' ఓసారి బాబూరావు జిలేబీల దుకాణానికి వెళ్లాడు. అక్కడ ఓ పావుకిలో జిలేబీ గుటుకూ గుటుకూ తినేశాడు. డబ్బులు అడిగితే మాత్రం ఖాళీ జేబు చూపించాడు. షాపు వాడికి ఒళ్లు మండిపోయింది. ‘ఈ వెధవకి ఓ నాలుగు దెబ్బలు తగిలించి అవతలికి గెంటెయ్!’ అని నౌకరుకి పురమాయించాడు. నౌకరు ఓ నాలుగు దెబ్బలు వేసి బాబూరావును దుకాణంలోంచి తోసేశాడు. బాబూరావు లేచి నిలబడ్డాడు. ఒంటికి అంటిన మట్టిని జాగ్రత్తగా దులుపుకుంటూ మళ్లీ దుకాణంలోకి అడుగుపెట్టాడు. ‘ఇప్పుడిచ్చిన రేటుకే ఓ అరకిలో జిలేబీ పార్సిల్ కట్టివ్వరా!’ అని ఆశగా అడిగాడు.
1
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ కలగాపులగం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కలగాపులగం' సుందరం మొట్టమొదటిసారి ఓ ఫైవ్ స్టార్ హోటల్లోకి అడుగు పెట్టాడు. ఓ టేబుల్ దగ్గర కూర్చుని భయంభయంగా టీ ఆర్డర్ చేశాడు. వేడి నీళ్లు, టీ పొడి, పాలు, పంచదార.. అన్నీ ఒక పళ్లెంలో పెట్టుకొని, సుందరం ముందు ఉంచాడు సర్వరు. ఓ పావుగంట పాటు తంటాలు పడి ఎలాగోలా టీ చేసుకుని తాగాడు సుందరం. ‘ఇంకా ఏమన్నా తీసుకురమ్మంటారా సర్!’ అని అడిగాడు సర్వరు. సుందరం తటపటాయిస్తూ- ‘బిర్యానీ తినాలని ఉంది కానీ.... ఇప్పుడు వద్దులే! నాకు బిర్యానీ వండుకోవడం రాదుకదా!’ అంటూ బయల్దేరిపోయాడు.
11
['tel']
విశ్రాంతి అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'విశ్రాంతి' డాక్టర్: మీ ఆయన చాలా నీరసంగా ఉన్నాడమ్మా. ఆయనకి విశ్రాంతి అవసరం. ఇవిగో ఈ నిద్రమాత్రలు తీసుకోండి. భార్య: మంచిది డాక్టర్. ఇవి ఆయన ఎప్పుడెప్పుడు వేసుకోవాలి. డాక్టర్: అబ్బే అవి వేసుకోవాల్సింది మీరే! చెప్పానుగా ఆయనకి విశ్రాంతి అవసరం అనీ....
1
['tel']
ఓ పరిశీలన అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'ఓ పరిశీలన' భర్త వేసిన జోకులకి కనుక భార్య నవ్వుతూ ఉంటే... ఇంట్లో అతిథులు ఉన్నట్లు లెక్క..
1
['tel']
పెళ్లి - విడాకులు అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'పెళ్లి - విడాకులు' నందు- ‘నేను ఇంక పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. మా ఇంట్లో ఉన్న చెత్తనీ, అంట్లనీ, మురికి బట్టలనీ చూసీ చూసీ విసుగు పుట్టేసింది.’ చందు- ‘నేను ఇక విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాను. మా ఇంట్లో ఉన్న చెత్తనీ, అంట్లనీ, మురికి బట్టలనీ చూసీ చూసీ విసుగు పుట్టేసింది.’
2
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక గొడవ గొడవ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'గొడవ గొడవ' రవిచంద్ర హడావుడిగా బారులోకి అడుగుపెట్టాడు. ‘ఇక్కడ గొడవ మొదలయ్యేలోగా నాకో బీర్ తెచ్చిపెట్టు’ అని అంతే హడావుడిగా అడిగాడు. బీరు పూర్తయ్యాక మళ్లీ ‘ఇక్కడ గొడవ మొదలయ్యేలోగా నాకో బీర్ తెచ్చిపెట్టు’ అని తొందరపెట్టాడు. అలా ఓ ఐదారు బీర్లు కడుపులో పడ్డాయి. రవిచంద్ర కంగారు చూసి బార్టెండరుకి చిరాకేసింది. ‘ఇదిగో బీర్లకి బీర్లు తాగేస్తున్నావు. ఇంతకీ నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా?’ అని గట్టిగా అడిగాడు. ‘చూశావా ఇప్పుడు గొడవ మొదలవుతోంది’ అంటూ చొక్కా పైకి మడిచి నిలబడ్డాడు రవిచంద్ర.
6
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అదీ విషయం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అదీ విషయం' తండ్రి: నిన్నో చిక్కు ప్రశ్న అడుగుతాను. తారాజువ్వ వెలిగించినప్పుడు ముందు వెలుతురు కనిపిస్తుంది. తర్వాత శబ్దం వినిపిస్తుంది. ఎందుకలాగా! గౌతం: ఆ మాత్రం తెలియదా డాడీ! కళ్లు ముందు ఉంటాయి కాబట్టి, వెలుతురు ముందు కనిపిస్తుంది. చెవులు వెనక ఉంటాయి కాబట్టి, వాటికి శబ్దం చేరేందుకు కాస్త ఆలస్యం అవుతుంది.
4
['tel']
పిచ్చి నాకు కాదు అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'పిచ్చి నాకు కాదు' వైద్యుడు: నిన్నెందుకు పిచ్చాసుపత్రిలో చేర్చారు? రోగి: నేను ఓ అయిదు వందల పేజీల పుస్తకాన్ని రాశాను. వైద్యుడు: అందులో ఏముంది? రోగి: మొదటి పేజీలో రాజుగారు గుర్రం మీద వేటకి బయల్దేరతారు. చివరి పేజీకి అడవికి చేరుకుంటారు. వైద్యుడు: మరి మిగతా పేజీలలో... రోగి: గుర్రం ‘డిక్ చిక్ డిక్ చిక్’ అని నడుస్తూ ఉంటుంది. వైద్యుడు: నీ మొహం! ఎవరైనా ఇదంతా చదువుతారా? రోగి: పిచ్చి నాకు కాదు మీకు. ఓసారి అదంతా వాట్సాప్లో పెట్టి చూడు. లక్షలమంది చదువుతారు.
1
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ చాలా ఫాస్ట్ గురూ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'చాలా ఫాస్ట్ గురూ' ఓ జపాను యాత్రికుడు ఇండియాకి వచ్చాడు. ఊరంతా తిరిగి చూసేం దుకు ఓ కారెక్కి కూర్చున్నాడు. ఆ కారు రోడ్డు మీద వెళ్తూ ఉండగా... దాని పక్క నుంచి సర్రున ఓ హోండా బండి దూసుకుపోయింది. ‘మా దేశంలో తయారైన బండి అది. చాలా చాలా ఫాస్టు!’ అని గర్వంగా చెప్పాడు జపాను మనిషి. కారు ఇంకాస్త దూరం వెళ్లేసరికి, దాని పక్క నుంచి ఝామ్మని ఓ టొయోటా కారు దాటుకుపోయింది. ‘మా దేశంలో తయారైన కారు ఇది. చాలా చాలా ఫాస్టు!’ అని మరికాస్త గర్వంగా చెప్పాడు జపానాయన. కాసేపటికి జపాను పెద్దాయన దిగాల్సిన చోటు రానే వచ్చింది. ‘రెండు వేల రూపాయలు ఇవ్వండి,’ అంటూ నిదానంగా చెప్పాడు టాక్సీ డ్రైవరు. ‘అదేంటి! అయిదు వందలకి మించదని అనుకున్నానే!’ ఆశ్చర్యంగా అడిగాడు జపాను పెద్దమనిషి. ‘నా మీటర్ మేడిన్ ఇండియా... చాలా చాలా ఫాస్టు’ తాపీగా చెప్పాడు డ్రైవరు.
14
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పీహెచ్డీ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పీహెచ్డీ' ఉమేష్- ఎన్నాళ్లయ్యింది నిన్ను చూసి! ఇప్పుడు ఏం చేస్తున్నావు? సోమేష్- నేను పీహెచ్డీ చేస్తున్నాను. ఉమేష్- వావ్ ఎందుకంత సిగ్గుప డుతూ చెబుతున్నావు. నా చిన్ననాటి స్నేహితుడు పీహెచ్డీ చేస్తున్నాడని తెలిసి నాకు చాలా గర్వంగా ఉంది. ఇంతకీ దేని మీద పీహెచ్డీ? ఉమేష్- దేని మీదా కాదు. పీహెచ్డీ అంటే పిజ్జా హోం డెలివరీ.
6
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక సగం సగం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సగం సగం' ‘నేను లాటరీ గెల్చుకుంటే ఏం చేస్తావు?’ గోముగా అడిగాడు భర్త. ‘అందులో సగం తీసుకుని మా పుట్టింటికి వెళ్లిపోతాను’ చిరాగ్గా చెప్పింది భార్య. ‘సరే ఇవాళ ఓ ఇరవై రూపాయలు గెల్చుకున్నాను. పదిరూపాయలు తీసుకుని బయల్దేరు’ బాంబు పేల్చాడు భర్త.
4
['tel']

Summary

aya-telugu-jokes is an open source dataset of instruct-style records generated by webscraping a Telugu Jokes website. This was created as part of Aya Open Science Initiative from Cohere For AI.

This dataset can be used for any purpose, whether academic or commercial, under the terms of the Apache 2.0 License.

Supported Tasks:

  • Training LLMs
  • Synthetic Data Generation
  • Data Augmentation

Languages: Telugu Version: 1.0

Dataset Overview

aya-telugu-jokes is a corpus of more than 900 records generated by webscraping of the Telugu Jokes website. This Dataset can be used for the following task:

  • Given the title of a funny conversation, generate a funny conversation based on the title.

Intended Uses

While immediately valuable for instruction fine tuning large language models, as a corpus of instruction prompts, this dataset also presents a valuable opportunity for synthetic data generation in the methods. For example, prompt-completions could be submitted as few-shot examples to a large open language model to generate additional funny conversations and their titles.

Dataset

Load with Datasets

To load this dataset with Datasets, you'll just need to install Datasets as pip install datasets --upgrade and then use the following code:

from datasets import load_dataset
ds = load_dataset('SuryaKrishna02/aya-telugu-jokes')

Purpose of Collection

Telugu is a low-resource language where there no funny conversation generation instruct-style dataset to the best of my knowledge. This was created as a part of Aya Open Science Initiative from Cohere For AI to make sure Telugu is well represented in the space of AI/ML. Unlike other datasets that are limited to non-commercial use, this dataset can be used, modified, and extended for any purpose, including academic or commercial applications.

Sources

  • Andhrajyothi Website: Performed webscraping from Andhrajyothi Website which is a website consisting of funny conversations. Next, performed some pre-processing of the data like removing unwanted characters from the scraped data. Finally, converted the scraped data into Instruct-style prompts and completions.

Data Fields

  • inputs : Prompt or input to the language model.
  • targets : Completion or output of the language model.
  • template_id : Id of the template used in inputs and targets.
  • template_lang: ISO code of the language used in the inputs and targets where tel refers to Telugu.

Templates

For the creation of instruct-style prompts and completions from the scraped data, the following one template category with 14 different variations were used:

  1. Given the title of a funny conversation, generate a funny conversation based on the title.
    template_id inputs targets
    1 {{Title}} అనే శీర్షిక తో జోక్ ఇవ్వు శీర్షిక: {{Title}}\n\n{{Funny Conversation}}
    2 {{Title}} అనే టైటిల్ తో జోక్ ఇవ్వు శీర్షిక: {{Title}}\n\n{{Funny Conversation}}
    3 ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక {{Title}} ఉండే లాగా ఇవ్వు. శీర్షిక: {{Title}}\n\n{{Funny Conversation}}
    4 ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక {{Title}} ఉండే లాగా ఇవ్వు. శీర్షిక: {{Title}}\n\n{{Funny Conversation}}
    5 ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక {{Title}} ఉండే లాగా ఇవ్వు. శీర్షిక: {{Title}}\n\n{{Funny Conversation}}
    6 ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక {{Title}} ఉండే లాగా ఇవ్వు. శీర్షిక: {{Title}}\n\n{{Funny Conversation}}
    7 ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక {{Title}} ఉండే లాగా ఇవ్వు. శీర్షిక: {{Title}}\n\n{{Funny Conversation}}
    8 ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక {{Title}} ఉండే లాగా ఇవ్వు. శీర్షిక: {{Title}}\n\n{{Funny Conversation}}
    9 ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ {{Title}} ఉండే లాగా ఇవ్వు. శీర్షిక: {{Title}}\n\n{{Funny Conversation}}
    10 ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ {{Title}} ఉండే లాగా ఇవ్వు. శీర్షిక: {{Title}}\n\n{{Funny Conversation}}
    11 ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ {{Title}} ఉండే లాగా ఇవ్వు. శీర్షిక: {{Title}}\n\n{{Funny Conversation}}
    12 ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ {{Title}} ఉండే లాగా ఇవ్వు. శీర్షిక: {{Title}}\n\n{{Funny Conversation}}
    13 ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ {{Title}} ఉండే లాగా ఇవ్వు. శీర్షిక: {{Title}}\n\n{{Funny Conversation}}
    14 ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ {{Title}} ఉండే లాగా ఇవ్వు. శీర్షిక: {{Title}}\n\n{{Funny Conversation}}

Personal or Sensitive Data

This dataset contains public information. To our knowledge, there are no private person’s personal identifiers or sensitive information.

Language

Telugu

Known Limitations

  • The Dataset is scraped from the Jokes Website and the contents of this dataset may reflect the bias, factual errors, inappropriate and sensitive matters.
  • Although there is utmost care taken to keep the dataset as monolingual, there might be some records that may contain English Language along with Telugu.

Contributors

SuryaKrishna02 and Desik98

Downloads last month
52
Edit dataset card