SNo
int64
0
21.6k
date
stringlengths
19
19
heading
stringlengths
3
91
body
stringlengths
6
38.7k
topic
stringclasses
5 values
605
24-04-2017 02:14:50
ఆటుపోట్ల గమనం
‘‘డెరివేటివ్స్‌ ముగింపు, అంతర్జాతీయంగా చోటుచేసుకునే భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, నాలుగో త్రైమాసికం ఫలితాలతో ఈ వారంలో మార్కెట్‌ ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉంది.’’ ఫ్రాన్స్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల కారణంగా ఈ వారం మార్కెట్లు ఫ్రాన్స్‌పైనే దృష్టి సారించే అవకాశం ఉంది. యూరోజోన్‌లో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఫ్రాన్స్‌.. ప్రపంచంలో ఏడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. మే 7న ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా అదే నెల 11న అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు అమెరికా, కొరియాల మధ్య పెరుగుతున్న భౌగోళిక ,రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు భారత మార్కెట్లపై ప్రభావం చూపించనుంది. ఈ వారం వెలువడనున్న ఆర్థిక ఫలితాలను మార్కెట్‌ ట్రెండ్‌ను దిశా నిర్ధేశం చేయనున్నాయి. ఫలితాల వెల్లడి కారణంగా ఫండ్‌ మేనేజర్లు తమ పోర్టుఫోలియోల్లో మార్పులు చేర్పులు చేపట్టే అవకాశం ఉంది. సోమవారం ఇండియాబుల్స్‌ హౌజింగ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) క్యు4 ఫలితాలను ప్రకటించనున్నాయి. మంగళవారం యాక్సిస్‌ బ్యాంక్‌, విప్రో, గురువారం కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, మారుతి సుజుకీ, శుక్రవారం అంబుజా సిమెంట్స్‌, ఐడిఎఫ్ సి ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఏప్రిల్‌ నెల సిరీస్ కు సంబంధించి ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ పొజిషన్లను ట్రేడర్లు రోల్‌ఓవర్‌ పొజిషన్లను చేపట్టనుండటంతో మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలున్నాయి. 27వ తేదీన ఏప్రిల్‌ నెల డెరివేటివ్స్‌ ముగియనున్నాయి. మరోవైపు గురువారం నాడు యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఇసిబి)... ఫ్రాంక్‌ఫర్ట్‌లో ద్రవ్యపరపతి విధాన సమీక్షను ప్రకటించనుంది. అలాగే యుఎస్‌, మిన్నెపొలిస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ నీల్‌ కష్‌కరీ.. లాస్‌ఏంజెల్స్‌లో చేయనున్న కీలకోపన్యాసం కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది.          విజయ్‌ సింఘానియాడైరెక్టర్‌, ట్రేడ్‌స్మార్ట్‌ ఆన్‌లైన్‌
business
9,575
07-11-2017 19:08:06
అబ్బాయ్, బాబాయ్‌లతో ఇరగదీసిన ముద్దుగుమ్మలు
టాలీవుడ్‌లో ఇప్పుడో ఆ ట్రెండ్ ఇంకా కొనసాగుతోంది. బాబాయ్‌లతో నటించిన హీరోయిన్స్ అబ్బాయిలతోనూ, అబ్బాయిలతో నటించిన హీరోయిన్స్ బాబాయ్‌లతోనూ నటిస్తూ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నారు. రియల్ లైఫ్‌లోని రిలేషన్స్‌ను రీల్ లైఫ్‌లోనూ పాటిస్తే చాలా మంది హీరోలకు అసలు హీరోయిన్సే దొరకరు. ముఖ్యంగా తండ్రి కొడుకులు, బాబాయిలు అబ్బాయిలు.. తెరమీద కూడా వరసలు పాటిస్తే ఒకరు నటించిన హీరోయిన్స్‌తో మరొకరు నటించే అవకాశమే ఉండదు. అందుకే వాటిని రియల్ లైఫ్‌కే పరిమితం చేస్తుంటారు హీరోలు . ఈ నేపథ్యంలోగతంలో వెంకీ సరసన చాలా సినిమాల్లో నటించిన నయనతార ఆ తర్వాత అబ్బాయ్ రానా సరసన 'కృష్ణం వందే జగద్గురుం'లో నటించి మెప్పించింది. ఇప్పుడు దీనికి రివర్స్‌గా ఈ సంవత్సరం మంచి విజయం సాధించిన రానా చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'లో హీరోయిన్‌గా నటించిన కాజల్ ఇప్పుడు తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రంలో బాబాయ్ వెంకీ సరసన కూడా నటించనుంది. ఈ లిస్ట్‌లో నందమూరి బాబాయ్ - అబ్బాయ్‌లు కూడా ఉన్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'చెన్నకేశవరెడ్డి', 'గౌతమీ పుత్ర శాతకర్ణి'‌లో.. కథానాయికగా నటించిన శ్రీయా గతంలో అబ్బాయ్ యన్టీఆర్ సరసన 'నా అల్లుడు'లో హీరోయిన్‌గా నటించింది. అలాగే గతంలో అబ్బాయ్ యన్టీఆర్‌తో 'అదుర్స్'లో నటించిన నయనతార ఆ తర్వాత బాబాయ్ బాలకృష్ణ సరసన 'సింహా', 'శ్రీరామరాజ్యం' చిత్రాల్లో నటించింది. ఇక ఈ జాబితాలోకి చేరిన మరో బాబాయ్ అబ్బాయ్‌లు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్. పవన్ కళ్యాణ్ సరసన గతంలో 'గబ్బర్ సింగ్'‌లో నటించిన శ్రుతిహాసన్ ఆ తర్వాత అబ్బాయ్ రామ్ చరణ్ సరసన 'ఎవడు'లో నటించి మెప్పించింది. అలాగే దీనికి రివర్స్‌గా రామ్ చరణ్ సరసన గతంలో 'మగధీర', 'గోవిందుడు అందరివాడేలే' చిత్రాల్లో నటించిన కాజల్ తర్వాత పవన్ సరసన 'సర్దార్ గబ్బర్ సింగ్'‌లో నటించింది. మొత్తం మీద ఈ హీరోయిన్స్ అందరూ బాబాయ్ అబ్బాయ్ అనే భేదం లేకుండా నటించి అభిమానుల్ని ఖుషీ చేశారు. మరి రానా‌కి ఈ ఏడాది విజయాన్నందించిన కాజల్ వెంకీకి ఏ స్థాయి విజయాన్నందిస్తుందో చూడాలి.
entertainment
8,391
17-01-2017 22:54:20
నయీం కథతో ‘ఖయ్యుం భాయ్‌’
గ్యాంగ్‌స్టర్‌ నయీం జీవిత కథ ఆధారంగా ‘ఖయ్యుం భాయ్‌’ అనే సినిమా రూపొందుతోంది. శ్రీ సాయి ఊహ క్రియేషన్స్ పతాకంపై కట్టా శారద చౌదరి నిర్మిస్తున్నారు. భరత్ పారేపల్లి దర్శకుడు. నయీం పాత్రలో కట్టా రాంబాబు, కీలకమైన ఏసీపీ పాత్రలో తారకరత్న నటిస్తున్నారు. ఇప్పటికి 90 శాతం చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సన్నివేశాల్ని తీస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం అక్కడ ఏర్పాటుచేసిన సమావేశంలో కట్టా రాంబాబు మాట్లాడుతూ ‘‘దర్శకుడు భరత్ అద్భుతంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నయీం చిన్నతనం నుంచి అతని ఎనకౌంటర్‌ వరకూ జరిగిన సంఘటనల్ని తెరపై చూపిస్తున్నాం. ఐదు పాటలుంటాయి’’ అని చెప్పారు. నయీం పాత్రకు రాంబాబు సరిగ్గా సరిపోతారని ఆయనను ఎంపిక చేశామని దర్శకుడు భరత తెలిపారు.
entertainment
15,630
25-04-2017 20:26:33
హిందుత్వం పేరుతో.. ఆ మతాన్ని బీజేపీ నాశనం చేస్తోంది..
కూచ్ బెహర్: హిందుత్వం పేరుతో బీజేపీ ఆ మతాన్ని నాశనం చేస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రజల మధ్య విద్వేషాలు, ఘర్షణలు సృష్టించే బీజేపీలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ చేరవద్దని బెంగాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీలో చేరితే ఆ తర్వాత చాలా బాధపడాల్సి వస్తుందని మంగళవారం కూచ్ బెహర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె అన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద బోధించిన హిందుత్వం మత సహనానికి ప్రతీక అని, అలాంటి హిందుత్వం అందరికీ ఆదర్శమని మమతా బెనర్జీ అన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు, విబేధాలు, ఘర్షణలు సృష్టించే బీజేపీ హిందూ సిద్ధాంతం అసలు హిందుత్వం కాదని, ఆ పార్టీని నమ్మవద్దని, అందులో అసలు చేరవద్దని బెంగాల్ ప్రజలకు ఆమె సూచించారు.
nation
18,738
19-01-2017 17:55:47
ప్రసిద్ధ ప్లాస్కో భవనంలో మంటలు.. కూలిన 17 అంతస్తుల భవనం.. 30 మంది దుర్మరణం
టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బందిలో 30 మంది దుర్మరణం పాలయ్యారు. టెహ్రాన్‌లోనే అత్యంత ఎత్తైన 17 అంతస్తుల ప్రసిద్ధ ప్లాస్కో భవనంలో గురువారం అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న 200 మంది అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 30 మంది అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 75 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 45 మంది అగ్నిమాపక సిబ్బంది కాగా 30 మంది పౌరులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భవనం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
nation
16,826
01-01-2017 17:53:23
కొత్త ఏడాది తొలి రోజు.. సీఎంకు చేదు అనుభవం
న్యూఢిల్లీ: కొత్త ఏడాది తొలి రోజు సీఎంకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పైకి ఓ వ్యక్తి బూటు విసిరాడు. హర్యానాలోని రోహ్తక్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఓ ర్యాలీలో ప్రసంగించిన కేజ్రీవాల్ పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రధాని మోదీపై మండిపడ్డారు. ఇంతలో ఓ వ్యక్తి ఆయనపైకి షూ విసిరాడు. అయితే అది కేజ్రీవాల్‌కు తగలలేదు. బూటు విసిరిన వ్యక్తిని కూడా ఎవరు గుర్తించలేదు.
nation
9,152
15-09-2017 12:24:27
నా డెస్క్‌ మీద ప్రభాస్‌, రజనీకాంత్‌, హృతిక్‌..: అల్లు శిరీష్
‘నా డెస్క్‌ మీద ప్రభాస్‌, రజినీకాంత్‌, హృతిక్‌ ఉన్నారు’ అంటున్నాడు అల్లు శిరీష్. అదేంటి అనుకుంటున్నారా? శిరీష్‌కు రజినీకాంత్‌, ప్రభాస్‌, హృతిక్‌ రోషన్‌లు నటించిన మూవీస్ కబాలి, బాహుబలి, క్రిష్ మూవీలు చాలా ఇష్టమనుకుంటా. ఆ ముగ్గురు నటించిన ఆ మూడు మూవీల్లోని స్టిల్స్‌ను తన ఇంట్లో పెట్టుకున్నారు.  ఈ ఫోటోను గురువారం తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసి.. "నా డెస్క్ మీద ప్రభాస్, రజినీకాంత్, హృతిక్ ఉన్నారు" అని ఓ కామెంట్‌ను జత చేశాడు. ప్రస్తుతం శిరీష్ ఆనంద్ డైరెక్షన్‌లో చక్రి నిర్మాణ సారధ్యంలో ఓ మూవీలో నటిస్తున్నారు. శిరీష్ సరసన సీరత్ కపూర్, సురభి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
entertainment
10,411
23-11-2017 18:35:39
ప్రీ లుక్‎తో ఒక్కసారిగా సర్‎ప్రైజ్ చేసిన పవన్..
పవర్‎స్టార్ పవన్ కల్యాణ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా తన కొత్తసినిమాలోని ప్రీ లుక్‎తో అందరినీ సర్‎ప్రైజ్ చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న 'అజ్ఞాతవాసి' (వర్కింగ్ టైటిల్) ప్రీ లుక్‎తో అందరినీ తనవైపు తిప్పుకున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై వస్తున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్‎ని కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ లుక్‎లో పవన్ అటు వైపుగా తిరిగి బ్లాక్ షేడ్‎లో కనిపిస్తున్నాడు. ఆయన ముఖం కనిపించకుండా ఇలా డిఫరెంట్ లుక్ బయటకు వదలడం స్పెషల్‎గా అనిపిస్తోంది టాలీవుడ్ ప్రేక్షకులకు. సినిమా ఫస్ట్‎లుక్ నవంబర్ 27న విడుదల చేయనున్నట్లుగా ఈ పోస్టర్‎లో చూపించారు. అదే రోజున సినిమా అసలు టైటిల్ కూడా ప్రకటించనున్నారు. ఈ పోస్టర్ చూడటానికి సాధారణంగా ఉన్నప్పటికీ ఎంతో ఆకర్షణగా నిలుస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్- త్రివిక్రమ్ క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై టాలీవుడ్ సహా దేశమంతటా భారీ అంచనాలున్నాయి. ఇందులో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిరుద్ సంగీత సారథ్యంలోని బాణీలు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. సంక్రాంతి కానుకగా సినిమాను జనవరి 10న విడుదల చేయడానికి అంతా సిద్ధం చేస్తోంది యూనిట్.
entertainment
1,206
12-11-2017 23:13:27
కీలక నిరోధం 10500
టెక్ వ్యూ నిఫ్టీ గత వారం ప్రారంభంలో మరింత పురోగమించి కీలక స్థాయి 10500 వరకు వెళ్లినా రియాక్షన్‌ సాధించింది. అయితే 10250 వద్ద రికవరీ సాధించింది. ఇది మైనర్‌ రికవరీ మాత్రమే. వీక్లీ చార్టుల్లో కనిష్ఠ స్థాయికి చేరువలో ముగిసినా స్వల్పకాలిక మద్దతు స్థాయి 10250 కన్నా పైనే ముగియడం పాజిటివ్‌ ట్రెండ్‌ సంకేతం. అయితే మరోరోజు బలాన్ని ప్రదర్శించి బలంగా క్లోజయినప్పుడే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ ఏర్పడుతుంది. గత వారం ఓవర్‌బాట్‌ స్థితిని సద్దుబాటు చేసుకుంటున్నట్టు కనిపించినా నెలవారీ చార్టుల్లో మాత్రం ఓవర్‌బాట్‌ స్థితి కొనసాగుతోంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. గత వారంలో ఏర్పడిన టాప్‌ 10500వద్ద స్వల్పకాలిక నిరోధాన్ని ఏర్పరచుకుంది. బుల్లిష్‌ స్థాయిలు...మార్కెట్‌ ప్రధాన నిరోధం 10500 వద్ద మరో పరీక్ష ఎదుర్కొనే ఆస్కారం ఉంది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌లో ప్రవేశించాలంటే ఈ స్థాయి కన్నా పైన బలంగా క్లోజ్‌ కావాలి. అప్పుడు మార్కెట్‌ మరో కొత్త జోన్‌లోకి ప్రవేశిస్తుంది. ఆ పైన ఉండేవన్నీ మానసిక అవధులే. తదుపరి ప్రధాన మానసిక అవధి 11000. బేరిష్‌ స్థాయిలు...మైనర్‌ నిరోధం 10400 వద్ద విఫలమైతే స్వల్పకాలిక కన్సాలిడేషన్‌ ఆస్కారం ఉంటుంది. ప్రధాన మద్దతు స్థాయి 10250. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనతలో ప్రవేశిస్తుంది. దిగువ టార్గెట్‌ 9950. బ్యాంక్‌ నిఫ్టీ కరెక్షన్‌ అనంతరం మద్దతు స్థాయి 25000 కన్నా పైన రికవరీ సాధించింది. ప్రధాన నిరోధం 25700. గత వారం ఏర్పడిన టాప్‌ ఇదే. మరింత అప్‌ట్రెండ్‌ కోసం ఈ స్థాయి కన్నా పైన క్లోజ్‌ కావాలి. కరెక్షన్‌లో పడితే ప్రధాన మద్దతు స్థాయిలు 25350, 25300.స్వల్పకాలిక వ్యూహం: 10250 కన్నా దిగువన గట్టి స్టాప్‌లాస్ తో స్వల్పకాలిక ట్రేడర్లు స్వల్పకాలిక బై పొజిషన్లు హోల్డ్‌ చేయవచ్చు. కరెక్షన్‌ ఏర్పడి దిగువ మద్దతు స్థాయిలకు చేరితే మరిన్ని బై పొజిషన్లపై దృష్టి పెట్టవచ్చు. పాటర్న్‌: 10500 దగ్గర అడ్డంగా కనిపిస్తున్న రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌ వద్ద స్వల్పకాలిక నిరోధం ఉంది. ఇండెక్స్‌ ఇప్పటికీ 45 డిగ్రీల కోణంలో ఎగువకు కనిపిస్తున్న ట్రెండ్‌లైన్‌ కన్నా పైనే ఉండడం సానుకూల ధోరణికి సూచన. 10250 వద్ద అడ్డంగా కనిపిస్తున్న సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌ దిగజారితే స్వల్పకాలిక బలహీనతలో పడుతుంది. గత వారం ఏర్పడిన బాటమ్‌ 10250 క్నా దిగజారితే డౌన్‌సైడ్‌ బ్రేకౌట్‌ పాటర్న్‌ను సూచిస్తుంది. ఇది స్వల్పకాలిక బలహీనత సంకేతం. మార్కెట్‌ ప్రస్తుతం 20 డిఎంఎ కన్నా స్వల్పంగా పైన ఉంది. ప్రధాన ట్రెండ్‌లో సానుకూలతకు ఇది సంకేతం.టైమ్‌: ఈ సూచిక ప్రకారం బుధవారం తదుపరి రివర్సల్‌ ఉంది.  సోమవారం స్థాయిలివే...నిరోధం: 10400, 10500మద్దతు : 10250,10100కోల్గేట్‌ (రూ.1043) - కొనుగోలు స్థాయిలకు చేరువలో..రూ.1040 ఎగువన అప్‌ట్రెండ్‌ మొదటి నిరోధం రూ.1080 రెండో నిరోధం రూ.1130రూ.1020 దిగువన డౌన్‌ట్రెండ్‌ మొదటి మద్దతు రూ.990 రెండో మద్దతు రూ.960 టాటా స్టీల్‌ (రూ.704) - కొనుగోలు స్థాయిలకు చేరువలో..రూ.700 ఎగువన అప్‌ట్రెండ్‌ మొదటి నిరోధం రూ.730 రెండో నిరోధం రూ.760రూ.690 దిగువన డౌన్‌ట్రెండ్‌ మొదటి మద్దతు రూ.670 రెండో మద్దతు రూ.650
business
6,798
16-04-2017 22:26:08
ఇది తెలుగు సినిమాకు దక్కిన గౌరవం
‘‘రెండున్నర దశాబ్దాల తర్వాత తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం గర్వంగా ఉంది. దిల్‌ రాజు, సతీశ్ వేగేశ్న కాంబినేషన్‌లో ‘శతమానం భవతి’ పెద్ద విజయం సాధించడమే కాదు, పరిశ్రమకు గౌరవాన్ని తీసుకొచ్చింది’’ అని చిరంజీవి అన్నారు. అల్లు అకాడమీ ఆఫ్‌ ఆర్ట్ప్‌ సంస్థ తరుఫున అలు అరవింద్‌ శనివారం రాత్రి ‘శతమానంభవతి’ టీమ్‌ను చిరంజీవి సమక్షంలో సత్కరించారు. చిరంజీవి మాట్లాడుతూ ‘‘రుద్రవీణ సినిమాకు నర్గీస్‌దత్ నేషనల్‌ ఇంటిగ్రిటీ అవార్డ్‌ వచ్చింది. ఆరోజుల్లో ఆ అవార్డు తెలుగు సినిమాకు రావడం అరుదు. ఇప్పుడు ‘శతమానంభవతి’ చిత్రానికి వచ్చిన అవార్డు పరిశ్రమకు వచ్చిన అవార్డుగా భావిస్తున్నా. తోటి నిర్మాతను గౌరవిస్తూ సత్కరించిన అరవింద్‌గారికి కృతజ్ఞతలు’’ అని అన్నారు. ‘‘మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాలన్న ఆయన తపనే దిల్‌ రాజుకు జాతీయ పురస్కారాన్ని తీసుకొచ్చింది’’ అని అల్లు అరవింద్‌ అన్నారు. ‘‘గ్రేట్‌ ఎచీవ్‌మెంట్‌ పొందిన సమయంలోనే చేదు ఘటన కూడా ఎదురైంది. లైఫ్‌లో అనుకున్నవాటిలో కొన్ని సాధించినప్పుడు కలిగే ఆనందం వేరుగా ఉంటుంది. అలాంటి వాటిలో ‘శతమానంభవతి’ ఒకటి. ఈ అవార్డు కన్నా పదిహేనేళ్లగా అరవింద్‌గారితో ఉన్న స్నేహం గొప్పదిగా భావిస్తా’’ అని దిల్‌ రాజు చెప్పారు. ‘‘బాహుబలి’ తెలుగు సినిమాను జాతీయస్థాయిలో నిలబెట్టింది. అలాగే శతమానంభవతి’ కూడా నేషనల్‌ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది’’ అని అల్లు అర్జున్ అన్నారు. ‘‘ఒక సినిమా కమర్షియల్‌గానో, అవార్డుల పరంగానో గుర్తింపు తెచ్చుకుంటుంది. నాకు ఆ రెండూ ఒకే సినిమాతో దక్కాయి. నా జీవితంలో మరచిపోలేని క్షణాలివి’’ అని శర్వానంద్‌ చెప్పారు.
entertainment
12,266
17-11-2017 01:57:33
కీలక డాక్యుమెంట్లపై వ్యాజ్యాలా?: సుప్రీం
న్యూఢిల్లీ: ప్రభుత్వంలోని కీలక డాక్యుమెంట్ల ఆధారంగా కొందరు పిల్స్‌ దాఖలు చేయడంపై కేంద్రం ఆందోళన చెందడాన్ని సుప్రీంకోర్టు సీరియ్‌సగా పరిగణించింది. న్యాయమూర్తులు జస్టిస్‌ ఏకే గోయల్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందు గురువారం ఒక వ్యాజ్యం విచారణకు వచ్చింది. గోప్యంగా ఉండాల్సిన కొన్ని డాక్యుమెంట్లను క్రమశిక్షణ లేని కొంతమంది ఉద్యోగులు లీక్‌ చేస్తున్నారని, ఇది ఆందోళనకర పరిణామమని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ అన్నారు. ప్రభుత్వ ఆందోళనతో ధర్మాసనం కూడా ఏకీభవించింది.
nation
12,968
06-11-2017 00:59:35
గ్రామీణ ఆదాయంపై పోటు
న్యూఢిల్లీ, ముంబై, నవంబరు 5: ఈ ఏడాది వానలు బాగానే పడ్డాయి. రుతుపవనాలు రైతులకు మేలే చేశాయి. పంటలు కూడా బాగానే పండాయి. ఉత్పాదకతా అంచనాల మేరకే ఉంది. కానీ వ్యవసాయ ఆదాయంలో వృద్ధిరేటు మాత్రం ఆశించనంతగా ఉండదని దేశంలోని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జేఎం ఫైనాన్షియల్‌ తన వార్షిక నివేదిక ‘రూరల్‌ సఫారీ’లో పేర్కొంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గడం, నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావమే ఇందుకు కారణాలని అందులో వివరించింది. ఏపీ, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, హరియాణా, గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌ తదితర కీలక వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లో జూలై-అక్టోబరు నడుమ 3000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి ఈ నివేదికను రూపొందించారు. సాధారణంగా గ్రామీణ ఆదాయంలో మూడింట రెండు వంతులు సాగేతర ఆదాయమే. ఈ ఏడాది తొలిసగంలో ఆ విభాగంలో వృద్ధి శూన్యమని జేఎం ఫైనాన్షియల్‌ తన నివేదికలో తెలిపింది. ఇసుక తవ్వకాలపై కఠిన నియంత్రణలు విధించడం, నగదులావాదేవీలు తగ్గడం, జీఎస్టీ, వ్యవసాయ ఉత్పత్తులకు తక్కువ ధరలు, మందగించిన ఆర్థిక కార్యకలాపాలే ఇందుకు కారణమని వివరించింది. ఈ ప్రభావం వార్షిక సాగు ఆదాయంపైనా ఉంటుందని అభిప్రాయపడింది. గ్రామాల్లో ఏటీఎంలు పెరగాలి..గత ఏడాది నవంబరు 8 నుంచి ఇప్పటికి దేశవ్యాప్తంగా 358 ఏటీఎంలు మూతపడ్డాయి. సంఖ్యపరంగా చూసుకుంటే ఇది చాలా తక్కువే అనిపించొచ్చుగానీ.. అంతకు ముందు నాలుగేళ్లూ ఏటా ఏటీఎంల సంఖ్య సగటున 16.4 ు మేర పెరిగేది. ఆ పెంపు ఆగిపోవడమే కాక.. ఉన్న ఏటీఎంలు 0.16 శాతం మేర మూతపడటమంటే ఇది గుర్తించదగిన రికార్డే. ఒక్క ఏడాదిలో ఇంత తగ్గుదల.. నగదు రహిత లావాదేవీలు పెరుగుతున్నాయనడానికి నిదర్శనం. అదే సమయంలో.. ఏటీఎంల నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో బ్యాంకులు వాటి విస్తరణ ప్రక్రియను నెమ్మదింపజేశాయి. అంటే ఏటీఎంల సంఖ్య మునుపటిలా పెరిగే అవకాశం కూడా లేనట్లే. దీంట్లో ఇంకో సమస్య ఏమిటంటే.. దేశంలో ప్రస్తుతం ఉన్న ప్రతి 10 ఏటీఎంలలో సగటున 8 నగర ప్రాంతాల్లోనే ఉన్నాయి. శాతాల్లో చెప్పాలంటే.. దేశంలో 33 శాతంగా ఉన్న నగర జనాభాకు 85ు ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయి. కానీ.. నగరాల్లో డిజిటల్‌ చెల్లింపులకు అవకాశాలు, నెట్‌ కనెక్టివిటీ వంటివి ఎక్కువ. మిగతా 67ు జనాభా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 15ు ఏటీఎంలే ఉన్నాయి. వారికి డిజిటల్‌ చెల్లింపులకు అవకాశాలు తక్కువ. నెట్‌ కనెక్టివిటీ కూడా తక్కువే. దీంతో వారు ఏటీఎంలపై ఆధారపడతారు. నోట్ల రద్దు తర్వాత ఏటీఎంలలో నగదు లభ్యత తగ్గంతో ఆ ప్రభావం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై పడింది. కాబట్టి పట్టణ, నగర ప్రాంతాల్లో తగ్గించి గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని ఏటీఎంలను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని ఏటీఎం ఆపరేటర్లు అభిప్రాయపడుతున్నారు. డిజిటల్‌ లావాదేవీల్లో భారీ పెంపు2016 నవంబరు 8కి ముందు.. అంటే నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించక మునుపు పేటీఎం లాంటి పేమెంట్‌ వ్యాలెట్ల గురించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. తెలిసినవారిలోనూ వాటిని వాడేవారి సంఖ్య ఇంకా స్వల్పం. కానీ.. నోట్ల రద్దు తర్వాత చాయ్‌ బండ్లు, కిరాణా దుకాణాల్లో సైతం పేటీఎం స్కాన్‌కోడ్‌లు ప్రత్యక్షమవడం మొదలైంది. ఫలితంగా గత 12 నెలల్లో ఈ తరహా డిజిటల్‌ లావాదేవీల విలువ 3 రెట్లు పెరిగింది. ఉదాహరణకు.. తమ నెలవారీ లావాదేవీల విలువ గతంలో రూ.3 వేల కోట్లు కాగా ఇప్పుడు రూ.6,800 కోట్లకు చేరిందని ఆటమ్‌ టెక్నాలజీస్‌ సీఎండీ దేవాంగ్‌ నేరళ్ల తెలిపారు. అలాగే నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అందుబాటులోకి తెచ్చిన యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) ద్వారా చేసే చెల్లింపులు ఏడాదిలో 77 రెట్లు పెరిగాయి. లెక్కల్లో చెప్పాలంటే.. 2016 అక్టోబరులో యూపీఐ చెల్లింపులు 0.1 మిలియన్‌ (అంటే ఒక లక్ష లావాదేవీలు) కాగా.. 2017 అక్టోబరు చివరి నాటికి ఆ సంఖ్య 7.69 కోట్లకు చేరింది. సెప్టెంబరులో సైతం ఈ చెల్లింపులు 3.09 కోట్లు కాగా.. ఒక్క నెలలోనే భారీగా పెరిగి 7.69 మిలియన్లకు చేరడం గమనార్హం. ఈ లావాదేవీల విలువ రూ.7 వేల కోట్లకు పైమాటే. ‘పేమెంట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’ లెక్కల ప్రకారమైతే.. గతంలో 20 నుంచి 50 శాతంగా ఉన్న డిజిటల్‌ చెల్లింపుల పరిశ్రమ వృద్ధి రేటు ఈ ఏడాది కాలంలో 40 నుంచి 70 శాతానికి పెరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. అందరికీ అందుబాటులో ఉండే డెబిట్‌కార్డుల చెల్లింపులు మరొక ఎత్తు. కార్డు చెల్లింపులపై వసూలు చేస్తున్న రుసుము కారణంగా ఇంకా చాలామంది నగదు లావాదేవీలకే మొగ్గుచూపుతున్నారు. కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఆ భారాన్ని కూడా ప్రభుత్వం తగ్గించగలిగితే డిజిటల్‌ లావాదేవీల సంఖ్య శరవేగంగా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.బ్లాక్‌ డే కాదు.. వైట్‌ డేనాగపూర్‌: ప్రధాని మోదీ నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన నవంబరు 8ని ‘బ్లాక్‌ డే’గా జరుపుతామని ప్రతిపక్షాలు అంటుంటే.. కేంద్రమంత్రి రాందాస్‌ అఠవలే ఆ రోజును ‘వైట్‌ డే’గా జరుపుతామని ప్రకటించారు. నల్లధనాన్ని లక్ష్యంగా చేసుకుని నోట్ల రద్దును ప్రకటించిన ప్రధాని మోదీకి ఆ రోజు కృతజ్ఞతలు తెలుపుతామన్నారు. తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రతి పదేళ్లకొకసారి నోట్లలో మార్పు రావాలని అంబేడ్కర్‌ కూడా అన్నారని గుర్తుచేశారు.
nation
5,368
08-12-2017 18:20:28
చిరు, బాలయ్యలకు డేట్స్ ఇవ్వలేనంత బిజీ అంటున్న నటి
నటి యమున తన సినిమా విశేషాలను తాజాగా ఓ వెబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. వినోద్ కుమార్, సురేష్ వంటి వారికే మీరు పరిమితం అయ్యారు. అప్పటిలో ఇండస్ట్రీ టాప్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి వారితో నటించకపోవడానికి కారణం ఏంటి అనే ప్రశ్న ఈ ఇంటర్వ్యూలో యమునకు ఎదురైంది. ఈ ప్రశ్నకి ఆమె సమాధానం చెబుతూ.. "అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణగారి సినిమాలలో అవకాశం వచ్చాయి. కానీ ‘మౌన పోరాటం’ తరువాత అదే బ్యానర్లో రెండు సినిమాలు కమిటై ఉండటం వల్ల మరో సినిమా చేయలేకపోయాను. చిరంజీవిగారి 'కొదమసింహం' సినిమా సమయంలో.. ఆయనతో ఓ సినిమా కోసం నన్ను అనుకున్నారని అప్పట్లో కైకాల సత్యనారాయణగారు తెలిపారు. అలాగే బాలకృష్ణ సినిమా కోసమని నా గురించి ఉషా కిరణ్ మూవీస్ వారిని కూడా సంప్రదించారని తెలిసింది. ఇప్పటిలా అప్పుడు మొబైల్స్ లేకపోవడం వలన.. సరైన కాంటాక్ట్స్ లేకపోవడం వలన కొన్ని అవకాశాలు మిస్సయ్యాను. నిజంగా స్టార్ హీరోలతో చేయకపోవడం ఇప్పటికీ నా దురదృష్టంగానే భావిస్తాను" అంటూ యమున ఈ ప్రశ్నకి సమాధానమిచ్చారు.
entertainment
819
30-06-2017 00:17:59
బిఎండబ్ల్యు సరికొత్త 5 సీరిస్‌ కారు
ప్రారంభ ధర రూ.49.9 లక్షలుముంబై : జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బిఎండబ్ల్యు గురువారం నాడు 5 సీరీస్ లో సరికొత్త కారును విడుదల చేసింది. దీని ధ ర 49.9 లక్షల రూపాయల నుంచి 61.3 లక్షల రూపాయల (ఎక్స్‌షోరూమ్‌, ముంబై) వరకు ఉంది. పెట్రోల్‌, డీజిల్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉండే ఈ కారు విడుదల కార్యక్రమంలో మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పాల్గొన్నారు.. డీజిల్‌ ఇంజన్‌ మోడల్‌ మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధర 49.9 లక్షల రూపాయల నుంచి 61.3 లక్షల రూపాయల వరకు ఉండగా.. పెట్రోల్‌ కారు ధర 49.9 లక్షల రూపాయలుగా ఉంది. దేశంలో 5 సీరిస్‌ కార్లకు అత్యధిక డిమాండ్‌ ఉందని బిఎండబ్ల్యు ఇండియా గ్రూప్‌ ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పవా తెలిపారు. జిఎస్టి అమలు తర్వాత కొత్త మోడల్‌ డెలివరీని ప్రారంభిస్తామని చెప్పారు. చెన్నైలోని ప్లాంట్‌లోనే ఈ కారును అసెంబుల్‌ చేస్తున్నట్టు తెలిపారు. గత పదేళ్ల కాలంలో బిఎండబ్ల్యు భారత్‌లో 66,000కు పైగా కార్లను విక్రయించిందని, ఇందులో 19,000కు పైగా కార్లు బిఎండబ్ల్యు 5 సీరిస్‌ కార్లేనని ఆయన చెప్పారు. ఇంతకు ముందటి కార్లకన్నా కొత్తగా తెచ్చిన కారు 70 కిలోలు తక్కువ బరువు ఉంటుందని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీ ఈ కారులో ఉందని, డ్రైవర్‌ అసిస్టెన్స్‌, కనెక్టివిటీ వంటివి వీటిలో ముఖ్యమైనవని ఆయన చెప్పారు. బిఎండబ్ల్యు ఇప్పటికే భారత్‌లో 1,120 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. అదనంగా మరో 130 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.
business
16,628
21-04-2017 02:58:35
ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8.65%
2016-17 కాలానికి ఆర్థికశాఖ ఓకే: దత్తాత్రేయ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్‌)పై 2016-17 కాలానికి 8.65% వడ్డీ రేటు చెల్లించడానికి కేంద్రం అంగీకరించింది. దీనిపై అధికారిక ప్రకటన రానుందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. గురువారం ఇక్కడ జరిగిన జాతీయ భద్రతా అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... మీడియాతో మాట్లాడారు. ఈ నిర్ణయం వల్ల సంఘటిత రంగంలోని నాలుగు కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం కలుగనుంది. కాగా, పన్ను రహిత గ్రాట్యుటీని రూ.20లక్షలకు పెంచే బిల్లును కూడా త్వరలోనే కేబినెట్‌లో ప్రవేశపెడతామని దత్తాత్రేయ చెప్పారు. కార్మికులకు భద్రత కల్పించడంలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్న పలు కంపెనీలకు ‘భారత జాతీయ భద్రత మండలి’ (ఎన్‌ఎస్‌సీఐ) సేఫ్టీ అవార్డులను ఆయన అందజేశారు.
nation
20,777
25-09-2017 01:31:37
టాప్‌ లేపారు..
 మూడో వన్డేలో భారత్‌ ఘన విజయం 3-0తో సిరీస్‌తోపాటు నెం.1 ర్యాంక్‌ కైవసంచెలరేగిన పాండ్యా, రోహిత్‌, రహానె ఫించ్‌ శతకం వృథా ఆసీస్‌కు తప్పని భంగపాటుశ్రీలంకను అన్ని ఫార్మాట్లలో వైట్‌వాష్‌ చేసిన భారత్‌కు ఆస్ట్రేలియా గట్టి పోటీ ఇస్తుందనుకున్నాం..! వన్డేల్లో మనకన్నా మెరుగైన ర్యాంక్‌లో ఉన్న కంగారూలతో హోరాహోరీ తప్పదనుకున్నాం..!లంకలో ఏకపక్ష పోరును చూశాక.. స్మిత్‌సేనతోనైనా ఉత్కంఠ పోరాటాలను ఆశించాం..! కానీ.. అప్రతిహతంగా దూసుకెళ్తున్న కోహ్లీసేన ముందు ప్రపంచ చాంపియన్‌ ఆసీస్‌ కూడా తలొంచింది..! తొలి రెండు వన్డేల్లో మన బౌలర్లు దెబ్బకు బిత్తరపోయిన ఆ జట్టు.. ఇండోర్‌లో బ్యాట్స్‌మన్‌ ధాటికి మరోసారి దాసోహమన్నది..!ఆరోన్‌ ఫించ్‌ సెంచరీతో దంచేసినా.. స్మిత్‌ ఫామ్‌ను కొనసాగించినా.. సవాల్‌ విసిరే లక్ష్యాన్ని నిర్దేశించినా.. భారత బ్యాటింగ్‌ ధాటికి అవన్నీ మరుగున పడిపోయాయి..!హార్దిక్‌ పాండ్యా, రోహిత్‌, రహానె ఒకరిని మంచి మరొకరు చెలరేగడంతో హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకున్న భారత్‌ మరో రెండు వన్డేలు మిగిలుండగానే సిరీస్‌ను 3-0తో ఖాతాలో వేసుకుంది..! పనిలోపనిగా దక్షిణాఫ్రికాను వెనక్కినెట్టి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్నీ అందుకొని డబుల్‌ ధమాకా మోగించింది..! అంతేనా.. వన్డేల్లో వరుసగా ఆరో సిరీస్‌ విజయంతో సిక్సర్‌ కొట్టింది..! చావోరేవో మ్యాచ్‌లో ఓడిన కంగారులు పోరాడాల్సిందిక పరువు కోసమే..!  ఇండోర్‌: ఫార్మాట్‌ ఏదైనా ఎదురే లేకుండాపోయిన భారత్‌ ఖాతాలో మరో సిరీస్‌ చేరింది. హార్దిక్‌ పాండ్యా (72 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 78) ధనాధన్‌ బ్యాటింగ్‌కు రోహిత్‌ శర్మ (62 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 71), రహానె (76 బంతుల్లో 9 ఫోర్లతో 70) మెరుపులు తోడవడంతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఐదు వికెట్లతో ఆస్ర్టేలి యాను చిత్తుగా ఓడించింది. ఆసీస్‌ నిర్దేశించిన 294 పరుగుల లక్ష్యాన్ని 47.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. తొలుత స్మిత్‌సేన నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 293 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ (125 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 124) శతకంతో చెల రేగినా... కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (63) హాఫ్‌ సెంచరీతో రాణించి నా ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్లలో బుమ్రా, కుల్దీప్‌ చెరో రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు. బౌలింగ్‌లోనూ రాణించి ఒక వికెట్‌ తీసిన హార్దిక్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లభించింది. నాలుగో వన్డే ఈనెల 28న బెంగళూరులో జరగనుంది.  ఆ ముగ్గురి హవా.. లక్ష్యం పెద్దదే అయినా.. ఫ్లాట్‌ పిచ్‌పై ఓపెనర్లు రహనె, రోహిత్‌ భారత్‌కు అద్భుత ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా రోహిత్‌ భారీ షాట్లతో రెచ్చిపోయాడు. కమిన్స్‌ వేసిన బౌన్సర్‌ను పుల్‌షాట్‌తో సిక్సర్‌ కొట్టిన అతను.. కల్టర్‌నైల్‌ ఓవర్లో బౌండ్రీ, సిక్సర్‌ రాబట్టాడు. ఇక, రిచర్డ్‌సన్‌ బౌలింగ్‌లో అతను కొట్టిన సిక్సర్‌ స్టేడియం అవతల పడింది. రోహిత్‌ ధాటికి 9 ఓవర్లలోనే స్కోరు 50 దాటింది. స్టొయినిస్‌ వేసిన తర్వాతి ఓవర్లో కళాత్మక షాట్లతో మూడు ఫోర్లు కొట్టిన రహానె కూడా గేరు మార్చాడు. స్మిత్‌.. స్పిన్నర్‌ అగర్‌ను రంగంలోకి దించినా ఫలితం లేకుండా పోయింది. అతను వేసిన 13వ ఓవర్లో మరో సిక్సర్‌ బాదిన రోహిత్‌ 42 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆపై.. రోహిత్‌తో పోటీపడీ బౌండ్రీలు రాబట్టిన రహానె కూడా 50 బంతుల్లో ఈ మార్కు చేరుకున్నాడు. ఈ ఇద్దరి జోరుకు 20 ఓవర్లలో భారత్‌ 132/0తో పటిష్ఠ స్థితిలో నిలిచింది.  అయితే.. రోహిత్‌ను కల్టర్‌నైల్‌, రహానెను కమిన్స్‌ వెంటవెంటనే వెనక్కిపంపి ఆతిథ్య జట్టుకు బ్రేకులు వేశారు. కానీ, హార్దిక్‌ పాండ్యా వచ్చీ రాగానే అగర్‌ బౌలింగ్‌ రెండు భారీ సిక్సర్లతో ఎదురుదాడికి దిగాడు. తర్వాత ఆసీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో బౌండ్రీలు రావడం కష్టమైంది. అయినా.. కోహ్లీ (28), పాండ్యా స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ స్కోరు రెండొందలు దాటించారు. ఇక, అంతా సవ్యంగా సాగుతున్న దశలో కోహ్లీ, కేదార్‌ జాదవ్‌ (2) వరుస ఓవర్లలో అవుటవడంతో ఆసీస్‌ రేసులోకొచ్చింది. అప్పటికి 14 ఓవర్లలో భారత్‌కు 88 పరుగులు అవసరమయ్యాయి. అయితే, అగర్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ 6, 4 కొట్టి ఇన్నింగ్స్‌కు ఊపుతెచ్చాడు. అదే ఓవర్లో అతనిచ్చిన క్యాచ్‌ను స్మిత్‌ వదిలేశాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న పాండ్యా.. అగర్‌ బౌలింగ్‌లోనే మరో సిక్సర్‌ కొట్టి 45 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మనీష్‌ పాండే (36 నాటౌట్‌) కూడా ధాటిగా ఆడాడు. స్టొయినిస్‌ బౌలింగ్‌లో ఇద్దరూ చెరో రెండు బౌండ్రీలు కొట్టి గెలుపు ఖాయం చేశారు. విజయానికి పది పరుగులు అవసరమైన దశలో పాండ్యా అవుటైనా.. మనీష్‌, ధోనీ (3 నాటౌట్‌) మ్యాచ్‌ను ముగించారు.   ఫించ్‌ కొట్టుడు..: ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఆరోన్‌ ఫించ్‌ ఆటే హైలైట్‌. గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే అతను అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్‌ వార్నర్‌ (42) కూడా ఫామ్‌ అందిపుచ్చుకోగా.. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ కూడా ఫామ్‌ కొనసాగించడంతో ఓ దశలో 224/2తో నిలిచిన ఆసీస్‌ సులభంగా 350 స్కోరు చేసేలా కనిపించింది. కానీ, ఈ ముగ్గురి నిష్క్రమణ తర్వాత పుంజుకున్న బౌలర్లు పర్యాటక జట్టును కట్టడి చేశారు. తొలి పది ఓవర్లలో ఆసీస్‌ 49/0తో నిలిచింది. అప్పటికి భువీ బౌలింగ్‌లో వార్నర్‌, బుమ్రా బౌలింగ్‌లో ఫించ్‌ చెరో మూడు బౌండ్రీలు కొట్టారు. ఇక, చాహల్‌ బౌలింగ్‌లో లాంగాన్‌ మీదుగా పదునైన సిక్సర్‌ కొట్టిన వార్నర్‌ జోరు పెంచాడు. అయితే, 14వ ఓవర్లో అతణ్ణి అవుట్‌ చేసిన హార్దిక్‌ తొలి వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఫించ్‌కు ఫామ్‌లో ఉన్న స్మిత్‌ జతకలిశాడు. వార్నర్‌ అవుటయ్యాక ఫించ్‌ ఒక్కసారిగా గేరు మార్చాడు. సిన్నర్లను లక్ష్యంగా చేసుకొని దాడి చేశాడు. అద్భుతమైన ఫుట్‌వర్క్‌తో ఆకట్టుకున్న అతను.. లెగ్‌ స్పిన్నర్లు చాహల్‌, కుల్దీప్‌ ప్రధాన అస్ర్తాలైన గూగ్లీను అలవోకగా ఆడాడు. అతను కొట్టి ఐదు సిక్సర్లలో నాలుగు గూగ్లీల్లో వచ్చినవే కావడం విశేషం. అలవోకగా బౌండ్రీలు బాదేసిన ఆరోన్‌ 61 బంతుల్లో అర్ధ శతకం, 110 బంతుల్లోనే సెంచరీని దాటాడు. మరో ఎండ్‌లో స్మిత్‌ కూడా బ్యాట్‌కు పని చెప్పడంతో 35 ఓవర్లలోనే ఆసీస్‌ స్కోరు 200 దాటింది. స్మిత్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోవడంతో భారత శిబిరంలో ఆందోళన నెలకొన్నది. అయితే, తన బౌలింగ్‌లో ఆడిన 26 బంతుల్లో ఏకంగా 41 పరుగులు రాబట్టిన ఫించ్‌ను కుల్దీప్‌ ఎట్టకేలకు 38వ ఓవర్లో పెవిలియన్‌కు చేర్చి భారత్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత భారత బౌలర్లు అసాధారణ రీతిలో పుంజుకున్నారు. చివరి పది ఓవర్లలో 49 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టారు. స్మిత్‌ను కూడా కుల్దీప్‌ బుట్టలోవేసుకోగా.. చాహల్‌ వైడ్‌ బాల్‌కు మాక్స్‌వెల్‌ (5) స్టంపౌటయ్యాడు. ఇక, వరుస ఓవర్లలో ట్రేవిస్‌ హెడ్‌ (4), పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌ (3)లను అవుట్‌ చేసిన బుమ్రా ఆసీస్‌కు షాకిచ్చాడు. స్టొయినిస్‌ (27 నాటౌట్‌) అజేయంగా నిలవడంతో ఆసీస్‌ 300 మార్కుకు చేరువగా రాగలిగింది.  స్కోరు బోర్డు ఆస్ట్రేలియా: వార్నర్‌ (బి) పాండ్యా 42, ఫించ్‌ (సి) కేదార్‌ (బి) కుల్దీప్‌ 124, స్మిత్‌ (సి) బుమ్రా (బి) కుల్దీప్‌ 63, మాక్స్‌వెల్‌ (స్టంప్డ్‌) ధోనీ (బి) చాహల్‌ 5, హెడ్‌ (బి) బుమ్రా 4, స్టొయినిస్‌ (నాటౌట్‌) 27, హ్యాండ్స్‌కోంబ్‌ (సి) మనీష్‌ (బి) బుమ్రా 3, అగర్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 50 ఓవర్లలో 293/6; వికెట్ల పతనం: 1-70, 2-224, 3-243, 4-243, 5-260, 6-275; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 10-0-52-0, బుమ్రా 10-0-52-2, చాహల్‌ 10-0-54-1, హార్దిక్‌ 10-0-58-1, కుల్దీప్‌ 10-0-75-2. భారత్‌: రహానె (ఎల్బీ) కమిన్స్‌ 70, రోహిత్‌ (సి) సబ్‌/కార్ట్‌రైట్‌ (బి) కల్టర్‌ నైల్‌ 71, కోహ్లీ (సి) ఫించ్‌ (బి) అగర్‌ 28, హార్దిక్‌ (సి) రిచర్డ్‌సన్‌ (బి) కమిన్స్‌ 78, కేదార్‌ (సి) హ్యాండ్స్‌కోంబ్‌ (బి) రిచర్డ్‌సన్‌ 2, మనీష్‌ (నాటౌట్‌) 36, ధోనీ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 47.5 ఓవర్లలో 294/5; వికెట్ల పతనం: 1-139, 2-147, 3-203, 4-206, 5-284; బౌలింగ్‌: కమిన్స్‌ 10-0-54-2, కల్టర్‌ నైల్‌ 10-0-58-1, రిచర్డ్‌సన్‌ 8.5-0-45-0, స్టొయినిస్‌ 8-0-61-0, ఆస్టన్‌ అగర్‌ 10-0-71-1, మాక్స్‌వెల్‌ 1-0-2-0. మళ్లీ జట్టులోకి అక్షర్‌ పటేల్‌ ఆసీస్‌తో చివరి రెండు వన్డేలకు స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ జట్టులోకి వచ్చాడు. జడేజా స్థానంలో అతడికి చోటు కల్పించారు. ఆస్ర్టేలియా తో చెన్నైలో జరిగిన వన్డేకి ముందు పాదం గాయమవడంతో పటేల్‌ స్థానంలో జడేజాను తీసుకున్నారు. 15 మంది జట్టులో ఇదొక్కటే మార్పు.
sports
12,302
16-04-2017 02:41:11
పెరిగిన పెట్రో ధరలు
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15: పెట్రోల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు రూ.1.39; డీజిల్‌పై లీటరుకు రూ.1.04 పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయించాయి. ఈ పెంపు శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. హైదరాబాద్‌లో పెట్రోలు లీటరుకు రూ.1.89; డీజిల్‌ లీటరుకు రూ.1.33 పెరిగాయి. నిజానికి, పక్షం రోజుల కిందటే పెట్రో ధరలను భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గడంతో హైదరాబాద్‌లో పెట్రోలుపై లీటరుకు రూ.5.10; డీజిల్‌పై లీటరుకు రూ.3.68 తగ్గించారు. కానీ, తాజా సమీక్షలో భాగంగా ధరలను మళ్లీ పెంచారు.
nation
10,469
23-10-2017 18:42:55
విజయ్, విశాల్ అనువాద చిత్రాలకు ఝలక్
ఒకేసారి రెండు భాషల్లో విడుదలవ్వాల్సిన సినిమా ఒక భాషలో విడుదలై మరొక భాషలో లేటుగా విడుదలయితే ఆ చిత్రం పరిస్థితి ఏమిటి? ఇప్పుడు రెండు తమిళ చిత్రాలు అలాంటి స్థితినే ఎదుర్కొంటున్నాయి. కొత్త సినిమాల పాలిట పైరసీ భూతం పెద్ద ఆటంకంగా మారుతోంది. సినిమా విడుదలయిన రోజే ఆ చిత్రానికి సంబంధించిన పైరసీ ప్రింట్స్ నెట్‌లో హల్ చల్ చేస్తూ ఆ చిత్ర నిర్మాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక రెండు భాషల్లో విడుదలయ్యే చిత్రాలు వేర్వేరు తేదీలలో ఉంటే ఆ సినిమాలు పైరసీ వల్ల భారీ నష్టపోవలసి వస్తుంది. ఇటీవల తమిళంలో విడుదలైన 'మెర్సల్', 'తుప్పరివాలన్' చిత్రాలది అదే పరిస్థితి. విజయ్ కథానాయకుడిగా నటించిన 'మెర్సల్' దీపావళికి తమిళంలో విడుదలైంది. తెలుగులో 'అదిరింది' పేరుతో వారం లేటుగా విడుదలకాబోతుంది. అనుకున్నతేదీకే ఆడియెన్స్ ముందుకు వచ్చిన తమిళ వెర్షన్‌కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. అంతవరకూ బాగానే ఉంది. కానీ చిత్రంలో రాజకీయాలపై, మెడికల్ మాఫియాపై భారీ వ్యంగ్యాస్త్రాలు ఉండడంతో కొన్ని రాజకీయ పార్టీలు, డాక్టర్లు 'మెర్సల్'పై విమర్శలు ఎక్కుపెట్టారు. కొంతమంది ఇంకాస్త ముందుకెళ్లి ఈ సినిమా పైరసీ లింక్స్‌ను షేర్ చేస్తూ 'మెర్సల్' మేకర్స్‌పై కక్ష తీర్చుకుంటున్నారట. దీంతో 'మెర్సల్' పైరసీ అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులోనూ హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు వెర్షన్ విడుదల వరకూ ఆగకుండానే తమిళ వెర్షన్ పైరసీకోసం ఎగబడుతున్నారు సినీ లవర్స్. విజయ్ 'మెర్సల్' లాగే తెలుగులో విడుదలకు సిద్ధమైంది విశాల్ నటించిన 'తుప్పరివాలన్' డిటెక్టివ్ ఏజెంట్ కథాంశంతో గత నెలలో తమిళంలో విడుదలైన 'తుప్పరివాలన్' తెలుగులో 'డిటెక్టివ్' పేరుతో విడుదల కాబోతుంది. తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పటికే విశాల్ అమెజాన్ ప్రైమ్‌లో అఫీషియల్‌గా విడుదల చేశాడు. అంతే కాదు విశాల్‌పై కోపంతో ఛాలెంజ్ చేసి హెడి ప్రింట్‌ను పైరసీదారులు ఆన్ లైన్‌లో పెట్టేశారు. దీంతో ఈ సినిమా కూడా ఆన్ లైన్‌లో వైరల్ అయింది. మరి తమిళంలో మంచి విజయాలు సాధించిన 'మెర్సల్', 'తుప్పరివాలన్' పైరసీని అధిగమించి తెలుగు వారినీ ఆకట్టుకుంటాయేమో చూడాలి.
entertainment
13,264
23-09-2017 03:25:18
నాడు చక్రవర్తి.. నేడు ప్రధాని!
450 ఏళ్లకు ఆ ఊరికి ప్రభుత్వాధినేతఅది ఉత్తరప్రదేశ్‌లోని షహన్‌షాపూర్‌ గ్రామం. ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసికి 23 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ కుగ్రామం 450 ఏళ్ల తర్వాత మరోసారి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. అప్పట్లో మొఘల్‌ చక్రవర్తి హుమాయున్‌ ఈ ఊళ్లో ఒక రోజు తల దాచుకున్నారు. ఆయన షేర్‌షా సూరి చేతిలో ఒక యుద్ధంలో ఓడిపోయి పారిపోతూ కల్పూర్‌ గ్రామానికి వచ్చారు. ఓ వృద్ధురాలి గుడిసెలో తల దాచుకున్నారు. మొఘల్‌ చక్రవర్తి గ్రామంలో తలదాచుకున్న విషయం ఆ తర్వాత బయటకు రావడంతో ఆ గ్రామాన్ని ప్రజలు షహన్‌షాపూర్‌ అని పిలవసాగారు. ఇప్పుడు మళ్లీ 450 ఏళ్ల తర్వాత మొఘల్‌ చక్రవర్తి కన్నా శక్తివంతమైన పదవిలో ఉన్న భారత ప్రధాని మోదీ ఆదివారం షహన్‌షాపూర్‌ను సందర్శించనున్నారు. మెగా జంతు ప్రదర్శనతో పాటు నూతన గోశాలను ప్రధాని ప్రారంభించనున్నారు. 1800 ఎకరాల్లో తొలిసారి ఈ గ్రామంలో యానిమల్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నారు.
nation
10,841
25-07-2017 22:45:41
డాన్స్‌ కోసం బరువు తగ్గా
‘‘సంపత్‌ నంది ఇప్పటివరకూ చేసినవన్నీ మంచి సినిమాలే. అయితే వాటన్నింటిలో బెస్ట్‌ స్ర్కిప్ట్‌ ‘గౌతమ్‌నంద’. ఇదివరకు ఆయన ‘రచ్చ’, ‘బెంగాల్‌ టైగర్‌’ సినిమాల్లో హీరోయిజం మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఇందులో హీరోయిజం మీద కాకుండా స్ర్కిప్ట్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు’’ అని చెప్పారు కేథరిన్‌ ట్రెసా. ‘గౌతమ్‌నంద’ చిత్రంలోని ఇద్దరు నాయికల్లో ఒకరిగా ఆమె నటించారు. గోపీచంద్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సంపత్‌ నంది దర్శకుడు. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె. భగవాన్‌, జె. పుల్లారావు సంయుక్తంగా నిర్మించిన ఈచిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా కేథరిన్‌ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే... ఈ చిత్రంలో ముగ్ధ అనే సంపన్న యువతి పాత్రను పోషించా. బాగా ఎనర్జీ ఉండే క్యారెక్టర్‌. అభినయించడానికి బాగా అవకాశమున్న పాత్ర. అదే సమయంలో గ్లామరస్‌గానూ కనిపిస్తా. ఇలాంటి తరహా పాత్రలు చేయడం ఇష్టం. ఊరికే ఇలా వచ్చి, అలా పోయే పాత్రలు చేయడమంటే అయిష్టం. ఇందులో నాది తల పొగరు పాత్ర కాదు. మంచి అమ్మాయి పాత్రే. ‘సరైనోడు’లో చేసిన ఎమ్మెల్యే పాత్రకు ఎంత పేరొచ్చిందో, అంతటి పేరు ఈ పాత్రకూ వస్తుందని ఆశిస్తున్నా. తల పొగరు పాత్రను ‘నేనే రాజు నేను మంత్రి’లో చేశా. అవకాశమిస్తే పాడతాతెలుగు ఇండస్ట్రీకి వచ్చిన చాలా రోజుల తర్వాత ‘గౌతమ్‌నంద’లోని ముగ్ధ పాత్రకు డబ్బింగ్‌ చెప్పా. డబ్బింగ్‌ చెప్పాలని ఎప్పట్నించో ప్రయత్నిస్తున్నా. మనం చేసిన పాత్రకు మన గొంతే ఉంటే దానికి సాధికారికత వస్తుంది. ‘ఇద్దరమ్మాయిలతో..’., ‘పైసా’ సినిమాల్లో చేసిన పాత్రలకు డబ్బింగ్‌ చెప్పాలని ప్రయత్నించా. అప్పట్లో నా తెలుగు సరిగా ఉండేది కాదు. అందుకే ఆ సినిమాల దర్శకులు పూరి జగన్నాథ్‌, కృష్ణవంశీ నా వాయిస్‌ టెస్ట్‌ చేసి అంత ఎఫెక్టివ్‌గా లేదని వేరే వాళ్లతో డబ్బింగ్‌ చెప్పించారు. ఇప్పుడు నా తెలుగు మెరుగైంది. ఉస్మానియా యూనివర్శిటీలో పనిచేసే ఒక లెక్చరర్‌ సాయంతో తెలుగు నేర్చుకున్నా. అలాగే సినిమా స్టాఫ్‌ నుంచి కూడా. అందుకే డైరెక్టర్‌ సంపత్‌ నంది నా చేత డబ్బింగ్‌ చెప్పించారు. నా వాయిస్‌ బాగుంటుంది. చిన్నప్పుడు చర్చిలో బాగా పాడేదాన్ని. అవకాశం వస్తే సినిమా కోసం పాట పాడే విషయం ఆలోచిస్తా. ఆమెను ఇష్టపడతారుగోపీచంద్‌ ఇందులో చాలా స్టయిలిష్‌గా కనిపిస్తారు. ఆయన్ని చూసి నేనే ఎగ్జయిట్‌ అయ్యానంటే ప్రేక్షకులు ఇంకెంతగా ఎగ్జయిట్‌ అవుతారో! నా దృష్టిలో ఇప్పటివరకూ ఆయన చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్‌ స్టయిలిష్‌ లుక్‌, ఇదే బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌. హన్సికతో నాకు ఒక్క సీనే ఉంది. అదీ క్లైమాక్స్‌లోనే. ఆమెది డీగ్లామరస్‌ రోల్‌. ఆమె పాత్రను అందరూ ఇష్టపడతారు. అనుకున్న విధంగా చేయలేకపోయానాకు డాన్స్‌ ఇష్టం. మంచి డాన్సర్‌ని. షూటింగ్‌ లేనప్పుడు మాస్టర్‌ సాయంతో ఇంట్లో ప్రాక్టీస్‌ చేస్తుంటా. అదేవిధంగా ‘సరైనోడు’ షూటింగ్‌ చివరలో డాన్స్‌ ప్రాక్టీస్‌ చేశా. మాస్టర్‌ను ఈజీ మూవ్‌మెంట్స్‌ కాకుండా కొంచెం క్లిష్టంగా ఉండే డాన్స్‌ మూవ్‌మెంట్స్‌ చేయించమని అడిగాను. ఆయన చాలా టఫ్‌ మూవ్‌మెంట్స్‌ చూపించారు. నేను ట్రై చేశా కానీ అనుకున్న విధంగా చేయలేకపోయా. బరువు తగ్గితే ఆ మూవ్‌మెంట్స్‌ బాగా చేయొచ్చని, బెటర్‌ డాన్సర్‌ని కావచ్చనీ అర్థమైంది. అప్పుడు బరువు తగ్గడం ప్రారంభించా. ‘గౌతమ్‌నంద’లో చేయడానికి వచ్చినప్పుడు సన్నగా ఉండటం చూసి ముగ్ధ పాత్రకు కరెక్ట్‌గా సరిపోతావని సంపత్‌ అభినందించారు.
entertainment
5,588
01-11-2017 13:54:31
అఖిల్ తీరుతో ఇబ్బందిపడుతున్న 'హలో' డైరెక్టర్
అక్కినేని అఖిల్ గురించి ఆయన మొదటి సినిమా సమయంలో చిన్న రూమర్ వినిపించింది. షూటింగ్ సమయంలో అన్ని విషయాల్లో కల్పించుకుని డైరెక్టర్‌కు చిరాకు తెప్పిస్తాడని గుసగుసలు వినిపించాయి. మళ్లీ ఇప్పుడు తాజాగా ఇదే రూమర్ బాగా వినిపిస్తోంది. ప్రస్తుతం మనం సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్‌తో అఖిల్ హలో సినిమా చేస్తున్న విషయం విదితమే.  అయితే ఈ సినిమా విషయంలో అఖిల్ బాగా జోక్యం చేసుకుంటున్నాడనే టాక్ వినిపిస్తోంది. సినిమాకు సంబంధించిన సాంగ్స్, ఫైట్స్ ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నాడని.. అఖిల్ తీరుతో విసుగెత్తిన విక్రమ్ కుమార్ ఈ విషయాన్ని నాగార్జున దృష్టికి తీసుకెళ్లినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అఖిల్ కారణంగా సినిమా షూటింగ్ లేట్ అవుతోందని.. ఈ ఎఫెక్ట్ రిలీజ్ డేట్‌పై పడవచ్చని టాక్.
entertainment
4,715
13-01-2017 13:28:33
ఆ సినిమా చూసి గర్వపడుతున్నా: రాఘవేంద్ర రావు
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సగటు అభిమానుల నుంచే కాకుండా సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు బాలయ్యను అభినందించగా తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు బాలయ్యను ప్రశంసించారు.  ‘‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తెలుగువాడి చరిత్ర. శాతకర్ణి పాత్రలో అత్యద్భుతంగా జీవించిన బాలకృష్ణ తెలుగువాడు. అద్వితీయంగా తెరకెక్కించిన క్రిష్‌ ఓ తెలుగువాడు. తెలుగువాడి చరిత్రను దశదిశలా చాటి చెబుతున్న చిత్ర బృందానికి నా అభినందనలు. సాటి తెలుగువాడిగా నేనూ గర్వపడుతున్నాన’ని రాఘవేంద్రరావు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.
entertainment
4,011
18-09-2017 03:31:41
అంతరార్థ కథన శిల్పి
పతంజలి వ్యంగ్యాన్ని వ్యంగ్యం కోసమో, హాస్యం కోసమో రాయలేదు. దాని వెనుక రచయిత అంతర్మథనం, ఆవేదన కనిపిస్తాయి. తెలుగు సాహిత్యంలో ఉత్తరాంధ్రకు చెందిన సాహిత్యమూర్తులది ఒక ప్రత్యేకస్థానం. గొప్ప చారిత్రకనేపథ్యం, ఘనమైన సాంస్కృతిక వారసత్వం, ఉద్యమ రాజకీయ చైతన్యం... అలాంటి వారసత్వమున్న ఉత్తరాంధ్ర నుండి వెలువడిన భిన్నస్వరం కె.ఎన్‌.వై. పతంజలి. ఆయన ఎంచుకున్న రచనావస్తువులు, కథన రీతులు, శిల్పవైవిధ్యం, ప్రక్రియా వైశిష్ట్యం, నిర్వచనాల పరిధికి ఒదిగి ఉండేవి కావు. ‘‘ఏమీ తెలియకుండా కూడా రాయవచ్చునని’’ పదేళ్ల వయసుకే అనుభవ పూర్వకంగా గ్రహించినట్టు చెప్పుకున్న పతంజలి ప్రపంచసాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేశారు. ఆయన రచనావ్యాసంగం డిటెక్టివ్‌ నవలతో ప్రారంభమైంది. కేవలం రాయడం పట్ల మక్కువే కాకుండా, రాసింది వాసిగలదో కాదో నిర్ణయించగల శక్తి ఆయనకుంది. పతంజలి రచనలో కథ ఒక సాకు మాత్రమే. తాను చెప్పదలుచుకున్న విషయానికి అది పైకి కనిపించే ఒక ఉపరితల పార్శ్వం మాత్రమే. కథ లోపల మరెన్నో అంతరార్థ కథనాలు వినిపిస్తాయి. కథావాచకాన్ని చదువుతున్న కొద్దీ మరిన్ని కొత్త స్వభావాలు, ధర్మాలు, వాస్తవికతలు ప్రత్యక్షమవుతాయి. పతంజలి తన రచనను బహుళార్థ ప్రయోజన సాధనంగా తీర్చిదిద్దారు. రచనల్లో పతంజలి లేవనెత్తిన ప్రశ్నలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. మన చుట్టూ ఉన్న వ్యవస్థలపై పతంజలి ప్రకటించిన యుద్ధం సామాన్యమైంది కాదు. ప్రజాస్వామ్యంలో కీలకమైన చట్టం, న్యాయం, రాజకీయ, పత్రికావ్యవస్థలపై సంయమనంతో కూడిన ఆగ్రహాన్ని ఆయన వ్యక్తపరిచారు. ఆయా వ్యవస్థల నడుమ గందరగోళమే పతంజలి రచనల్లో ప్రతిఫలించింది. సామాజిక శాస్త్రాలకంటే ప్రతిభావంతంగా ఉత్తమ సాహిత్యం సమాజాన్ని ప్రతిబింబిస్తుందనే మాటలను పతంజలి రచనలు నిరూపిస్తాయి. ప్రజాసంక్షేమం కోసం రూపొందిన వ్యవస్థల బాధ్యతారాహిత్యాన్ని, వైఫల్యాలనూ నిరసిస్తూ దాఖలుచేసిన సృజనాత్మక ప్రజాప్రయోజన వ్యాజ్యంగా ఈ రచనలు నిలుస్తాయి. వ్యంగ్యం అంటే పతంజలి అనేంతగా తెలుగు సాహిత్యంలో పతంజలి వ్యంగ్యం స్థిరపడింది. కానీ, పతంజలి వ్యంగ్యాన్ని వ్యంగ్యం కోసమో, హాస్యం కోసమో రాయలేదు. దాని వెనుక రచయిత అంతర్మథనం, ఆవేదన కనిపిస్తాయి. రచయిత నిబద్థత, తీవ్రతలే ఆయన రచనలలో ‘బ్లాక్‌ హ్యూమర్‌’గా పరిణామం చెందాయి. పతంజలి వాచకాలను పరిశీలించగల, అంచనా వేయగల విమర్శసామగ్రి తెలుగు సాహిత్యం సమకూర్చుకోలేదు. పతంజలి రచనలే అతని సారస్వత అధ్యయనానికి, విమర్శకు ముఖ్యమైన ఆధారాలు. తన రచనల్లోనే వ్యాఖ్యానాన్నీ, విమర్శనూ సమాంతరంగా సృజించిన నిరుపమాన రచయిత పతంజలి.  జె. నీరజ(కె.ఎన్‌.వై పతంజలి గురించిన మోనోగ్రాఫ్‌ను చింతకింది శ్రీనివాసరావు రచించారు. ‘భారతీయ సాహిత్య నిర్మాతలు’ శీర్షికన కేంద్రసాహిత్య అకాడమీ దీనిని ప్రచురించింది. ఈ గ్రంథావిష్కరణ సెప్టెంబర్‌ 23 శనివారం సా.6గం.లకు విశాఖపట్నం పబ్లిక్‌ లైబ్రరీలో మిత్రసాహితి ఆధ్వర్యాన జరుగుతుంది.)
editorial
21,182
14-08-2017 15:03:01
శ్రీలంక వైట్‌వాష్.. చివరి టెస్ట్‌లో భారత్ ఘన విజయం!
పల్లెకెలె: అనుకున్నట్టే జరిగింది. భారత బౌలర్ల ముందు శ్రీలంక క్రికెటర్లు నిలవలేకపోయారు. నిప్పులు చెరిగే బంతులకు నిలదొక్కుకోలేకపోయారు. ఫలితంగా విదేశాల్లో విరాట్ సేన రికార్డు విజయంతో సాధించింది. శ్రీలంకను వైట్‌వైట్ వాష్ చేసింది. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక, రెండో ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌటై ఇన్నింగ్స్ 171 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మూడు టెస్ట్‌ల సీరిస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసి విదేశీ గడ్డపై సిరీస్‌ను దక్కించుకున్న జట్టుగా  రికార్డు సృష్టించింది. 19/1 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన లంక ఏ దశలోనూ కోలుకోకుండా టీమిండియా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. భారత బౌలర్ల దాటికి వికెట్ల ముందు నిలవడం కష్టంగా మారడంతో లంకేయులు వికెట్ల ముందు నిలబడడానికి ఆపసోపాలు పడ్డారు. ముఖ్యంగా అశ్విన్ దెబ్బకు లంక బ్యాట్స్‌మెన్ కకావికలయ్యారు. అశ్విన్‌కు షమీ జత కలవడంతో లంక బ్యాట్స్‌మెన్ 183 పరుగులకే ఆలౌటై సిరీస్‌ను సమర్పించుకున్నారు. అంతుకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్ 4, షమీ 3, ఉమేశ్ యాదవ్ 2, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ నేలకూల్చారు. లంక బ్యాట్స్‌మెన్‌లలో వికెట్ కీపర్ డిక్‌వెల్లా చేసిన 41 పరుగులే అత్యధికం. ఐదుగురు బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ఆ ఘనత సాధించిన ఒకే ఒక్క భారతీయుడు కోహ్లీ  ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్‌లైన్స్ ఇదేనట..
sports
7,331
14-11-2017 03:05:16
‘మనం’ సెట్‌ అగ్నికి ఆహుతి
అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదంరూ.2 కోట్ల నష్టంబంజారాహిల్స్‌, నవంబరు 13: అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టూడియోలోని ‘మనం’ సినిమా సెట్‌ పూర్తిగా దగ్ధం అయ్యింది. బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు-2లో ఉన్న ఈ స్టూడియోలో సోమవారం సాయంత్రం షార్ట్‌ సర్క్యూట్‌ జరగడంతో ‘మనం’ సెట్‌కు నిప్పంటుకుంది. పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. గమనించిన స్టూడియో సిబ్బంది.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో రెండు అగ్నిమాపక శకటాలతో చేరుకుని రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. ఐదేళ్ల క్రితం ‘మనం’ సినిమా కోసం వేసిన ఈ సెట్‌ను అప్పటి నుంచి అలాగే ఉంచేశారు. ప్రమాద విషయం తెలియగానే స్టూడియో అధినేత, సినీ నటుడు నాగార్జున ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం ఎలా జరిగిందీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.2 కోట్ల నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ జరిగిన సమయంలో సెట్‌లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది.  నాన్న చివరి రోజులు ఈ సెట్‌లోనే గడిపారు: నాగార్జునతన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు చివరి రోజులను ‘మనం’ సెట్‌లోనే గడిపారని నాగార్జున చెప్పారు. ‘మనం’ షూటింగ్‌లో భాగంగా ఎక్కువగా ఇక్కడే ఉండేవారని అన్నారు. ఈ సెట్‌తో తమ కుటుంబసభ్యులకు ప్రత్యేక అనుబంధం ఉన్నదని, అందుకే ఈ సెట్‌ను తొలగించకుండా అలానే ఉంచేశామన్నారు. ఇప్పుడు సెట్‌ పూర్తిగా కాలిపోవడం బాధగా ఉందని నాగార్జున అన్నారు.
entertainment
19,328
04-05-2017 05:06:57
పార్నెల్‌కు ఛాతీ నొప్పి
లండన్‌: దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ వేన్‌ పార్నెల్‌కు ఛాతీ నొప్పి రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇంగ్లిష్‌ కౌంటీ కెంట్‌ తరఫున వన్డే కప్‌లో ఆడుతున్న పార్నెల్‌.. ఛాతీ పట్టేసినట్టుగా ఉందని చెప్పడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతడికి గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు. 27 ఏళ్ల పార్నెల్‌కు హృదయ సంబంధిత ఇబ్బందులున్నాయి.
sports
9,746
21-03-2017 12:57:33
‘బాహుబలి-2’లో ‘కాలకేయ’ రేంజ్ విలన్ ఇతనేనా?
రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ మొదటి భాగంలో ప్రభాస్‌, రాణాలతో సమానంగా పేరు తెచ్చుకున్నాడు ‘కాలకేయ’ పాత్రలో నటించిన ప్రభాకర్‌. ఆ పాత్ర ప్రభాకర్‌కు ఎంత పేరు తెచ్చిపెట్టిందంటే.. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో అతని పేరును ‘కాలకేయ’ ప్రభాకర్‌ అనే వేస్తున్నారు. ఆ పాత్ర మొదటిభాగంలోనే చనిపోవడంతో రెండో పార్టులో కనిపించే అవకాశం లేదు.
entertainment
194
18-08-2017 23:48:04
గవర్నర్‌ని కలిసిన హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఎంఎ) ప్రెసిడెంట్‌
శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల గవర్నర్‌ ఈస్‌ఎల్‌ నరసింహన్‌ను హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఎంఎ) ప్రెసిడెంట్‌ కె హరిశ్చంద్రప్రసాద్‌, కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎంఎ చేపడుతున్న కార్యకలాపాలను గవర్నర్‌ కు హరిశ్చంద్ర ప్రసాద్‌ వివరించారు.
business
2,805
08-10-2017 23:43:34
తెలంగాణ, ఎపిల్లో ఆర్‌బిఐ ఆర్థిక అక్షరాస్యత
న్యూఢిల్లీ : భారత రిజర్వు బ్యాంకు తొమ్మిది రాష్ర్టాల్లోని 80 బ్లాక్‌లలో ప్రయోగాత్మక ప్రాతిపదికన ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు చేపడుతోంది. ఆ తొమ్మిది రాష్ర్టాలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా మహారాష్ట్ర. చత్తీ్‌సగఢ్‌, బీహార్‌, ఒడిశా, కర్ణాటక, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాల్లో భాగంగా ఇ లావేదేవీలు, వ్యవస్థీకృత రంగం నుంచి రుణసేకరణ, బీమా పాలసీల కొనుగోళ్లు వంటి భిన్న అంశాలపై ప్రజలకు చైతన్యం కల్పిస్తారు. గృహ వినియోగ బడ్జెట్‌ రూపొందించుకోవడం, ఆర్థిక లావాదేవీలన్నింటినీ నమోదు చేయడం, పొదుపు ఖాతాల్లో లావాదేవీలను ప్రోత్సహించడం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్ల ద్వారా క్రియాశీలంగా పొదుపు చేయడం వంటి లక్షణాలు ప్రజల్లో అలవరచేలా చూడడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
business
11,257
11-04-2017 20:58:39
కాంగ్రెస్ ఎంపీలకు.. సోనియా గాంధీ విందు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ పార్టీ ఎంపీలకు విందు ఇచ్చారు. మంగళవారం పార్లమెంట్ హాస్‌లో కాంగ్రెస్ పార్టీ సభ్యులకు డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ సీనియర్ నేతలు ఇందులో పాల్గొన్నారు. పార్లమెంటులో కీలకమైన జీఎస్టీ బిల్లుపై చర్చ నేపథ్యంలో ఈ విందు ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం ఎన్డీయే భాగస్వామ్య పార్టీ ప్రముఖులతో భేటీ అనంతరం ప్రధాని మోదీ విందు ఇచ్చారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం తమ పార్టీ ఎంపీలకు విందు ఇవ్వడం విశేషం.
nation
7,375
21-12-2017 11:01:50
ఇప్ప‌ట్లో ప్ర‌భాస్‌తో క‌లిసి ప‌నిచేయ‌ను: రాజ‌మౌళి
యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌, దర్శ‌క ధీరుడు రాజ‌మౌళిల‌ది విజ‌య‌వంత‌మైన కాంబినేష‌న్‌. వీరి కాంబోలో వ‌చ్చిన `ఛ‌త్ర‌ప‌తి`, `బాహుబ‌లి` సిరీస్‌లు సూప‌ర్‌డూప‌ర్ హిట్‌లుగా నిలిచాయి. మ‌ళ్లీ మ‌రోసారి వీరు క‌లిసి ప‌నిచేస్తారా? అనే ప్ర‌శ్న‌కు ఓ ఆంగ్ల ప్ర‌తిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రాజ‌మౌళి జ‌వాబిచ్చారు. `ప్ర‌భాస్‌తో క‌లిసి నిర్విరామంగా ఐదేళ్ల ప‌నిచేశాను. మా ఇద్ద‌రికీ కాస్తంత బ్రేక్ కావాలి. ప్ర‌భాస్ ఇప్పుడు త‌న సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. కాబ‌ట్టి ఇప్ప‌ట్లో ప్ర‌భాస్‌తో క‌లిసి ప‌నిచేయను. కానీ, భ‌విష్య‌త్తులో మాత్రం ప్ర‌భాస్‌తో మరో సినిమా చేస్తాన‌`ని రాజ‌మౌళి చెప్పారు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో `సాహో` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు, రాజ‌మౌళి ఎన్టీయార్‌, చెర్రీ కాంబినేష‌న్‌లో మ‌ల్టీస్టార‌ర్ కోసం సిద్ధ‌మ‌వుతున్నారు.
entertainment
19,665
30-01-2017 02:59:02
బూమ్‌ బూమ్‌.. బుమ్రా
జస్‌ప్రీత్ మ్యాజిక్‌5 పరుగులతో భారత్ ఉత్కంఠ విజయం1-1తో సిరీస్‌ సమంనాగ్‌పూర్‌: చావోరేవో పోరులో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌ జస్‌ప్రీత్ బుమ్రా (2/20) మ్యాజిక్‌ చేయడంతో భారత్ టీ-20 సిరీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది. కేఎల్‌ రాహుల్‌ (47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 71) అర్ధ సెంచరీతో పాటు వెటరన్‌ పేసర్‌ ఆశీష్‌ నెహ్రా (3/28), బుమ్రా అద్భుత బౌలింగ్‌తో.. రెండో టీ20లో భారత్ 5 పరుగులతో ఉత్కంఠ విజయం సాధించి.. మూడు మ్యాచ్‌ల సర్వీస్‌‌ను 1-1తో సమం చేసింది. భారత్ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్య ఛేదనలో.. ఇంగ్లండ్‌ ఓవర్లన్నీ ఆడి 6 వికెట్లకు 139 పరుగులకే పరిమితమైంది. బెన్‌ స్టోక్స్‌ (38), జో రూట్‌ (38) పోరాడినా ఓటమి తప్పలేదు. కాన్పూర్‌ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత భారత నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. రాహుల్‌తో పాటు మనీష్‌ పాండే (30), కెప్టెన్‌ కోహ్లీ (21) కీలక పరుగులు చేశారు. సురేష్‌ రైనా (7), యువరాజ్‌ (4) నిరాశపర్చారు. బుమ్రా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. ఫిబ్రవరి 1న బెంగళూరులో ఆఖరి టీ20 జరగనుంది. భారత్ : కోహ్లీ (సి) డాసన్‌ (బి) జోర్డాన్‌ 21, కేఎల్‌ రాహుల్‌ (సి) స్టోక్స్‌ (బి) జోర్డాన్‌ 71, రైనా (సి) జోర్డాన్‌ (బి) రషీద్‌ 7, యువరాజ్‌ (ఎల్బీ) అలీ 4, మనీష్‌ పాండే (బి) మిల్స్‌ 30, ధోనీ (బి) జోర్డాన్‌ 5, హార్దిక్‌ పాండ్యా (రనౌట్‌) 2, మిశ్రా (రనౌట్‌) 0, బుమ్రా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 144/8; వికెట్లపతనం: 1-30, 2-56, 3-69, 4-125, 5-139, 6-143, 7-144, 8-144; బౌలింగ్‌: డాసన్‌ 2-0-20-0, మిల్స్‌ 4-0-36-1, జోర్డాన్‌ 4-0-22-3, స్టోక్స్‌ 3-0-21-0, అలీ 4-0-20-1, రషీద్‌ 3-0-24-1.
sports
12,340
29-07-2017 02:43:10
మూడుసార్లూ మధ్యలోనే వైదొలగిన షరీఫ్‌
 పాక్‌ ప్రధానులకు అర్థాంతర శాపం! సుప్రీం వేటు వేసిన రెండో ప్రధానిఇస్లామాబాద్‌, జూలై 28: పాకిస్థాన్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ ఏడు దశాబ్దాల్లోనూ ఒక్క ప్రధాన మంత్రి కూడా ఐదేళ్లపాటు పూర్తి కాలం పదవిలో కొనసాగలేదు. కోర్టు తీర్పులు లేదా మిలటరీ కుట్రల ద్వారా పదవీచ్యుతులయ్యారు. ఇక షరీఫ్‌ ప్రధాని పదవి నుంచి అర్థాంతరంగా తప్పుకోవడం కూడా ఇది మూడోసారి. తొలిసారి ప్రధాని పదవిని చేపట్టినప్పుడు కన్జర్వేటివ్‌ అధ్యక్షుడు గులామ్‌ ఇషాక్‌ ఖాన్‌తో విభేదాలొచ్చాయి. దీంతో జాతీయ అసెంబ్లీని రద్దు చేయ డంతో మూడేళ్లకే షరీఫ్‌ పదవి పోగొట్టుకున్నారు. ఇక, రెండోసారి రెండేళ్లకే అప్పటి ఆర్మీ చీఫ్‌ ముషార్రఫ్‌ కుట్రకు బలయ్యారు. 2013లో జరిగిన సాధారణ ఎన్నికల్లో షరీఫ్‌ మళ్లీ ప్రధాని అయ్యారు. ఈసారి దాదాపు నాలుగేళ్లు పదవిలో ఉన్నారు. కానీ, సుప్రీం కోర్టు తీర్పుతో ఇప్పుడు పదవిని పోగొట్టుకోవడమే కాదు. జీవితంలో ఇక ప్రధాని పదవి చేపట్టే అవకాశాలూ మృగ్యమైనట్లే. అంతేనా, పాకిస్థాన్‌లో సిటింగ్‌ ప్రధానిపై సుప్రీం కోర్టు అనర్హత వేటు వేయడం ఇది రెండోసారి. ఇంతకు ముందు, అప్పటి అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీపై అవినీతి కేసు నమోదు చేయడానికి నిరాకరించిన ప్రధాన మంత్రి యూసఫ్‌ రజా గిలానీపై 2012లోనూ సుప్రీం కోర్టు అనర్హత వేటు వేసింది.
nation
16,022
04-08-2017 14:17:26
మా సహనానికి ఓ హద్దు ఉంది : చైనా
బీజింగ్ : చైనా నుంచి భారతదేశానికి రోజుకో హెచ్చరిక వస్తోంది. సిక్కిం సెక్టర్‌లో భారతదేశంతో కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభనపై తాము ఇప్పటి వరకు అత్యంత ఔదార్యంతో వ్యవహరించామని, అయితే తమ సహనానికి ఓ హద్దు ఉంటుందని హెచ్చరించింది. భూటాన్, చైనా, భారతదేశం మధ్య సిక్కిం సెక్టర్‌లో ఉన్న ట్రై జంక్షన్‌ వద్ద చైనా సైన్యం రోడ్డును నిర్మించేందుకు ప్రయత్నించింది. దీంతో జూన్ 16 నుంచి ప్రతిష్టంభన ఏర్పడింది. చైనా ఏకపక్షంగా రోడ్డును నిర్మిస్తోందని, ఈ ప్రాంతంలో యథాతథ పరిస్థితులను మార్చేందుకు ప్రయత్నిస్తోందని భారతదేశం ఆరోపిస్తోంది. ఈ రోడ్డును నిర్మిస్తే, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళడానికి భారతదేశానికి అవకాశం లేకుండా చైనా చేయవచ్చునని భారతదేశం ఆందోళన చెందుతోంది. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి రెన్ గుయోకియాంగ్ విడుదల చేసిన ప్రకటనలో సరిహద్దుల్లో ప్రశాంతత, శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు సరైన రీతిలో వేగంగా ఈ సమస్యను పరిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి చైనా అత్యంత ఔదార్యాన్ని చూపిస్తోందని, దీనిని పరిష్కరించేందుకు దౌత్య మార్గాల ద్వారా భారతదేశంతో సంప్రదించేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. చైనా సాయుధ దళాలు కూడా సాధారణ ద్వైపాక్షిక సంబంధాలను, శాంతి, సుస్థిరతలను దృష్టిలో ఉంచుకుని అత్యున్నతస్థాయి సంయమనాన్ని పాటిస్తున్నాయన్నారు. అయితే ఔదార్యానికి కూడా సూత్రాలు, కట్టుబాట్లు ఉన్నాయని, సంయమనానికీ ఓ హద్దు ఉందని హెచ్చరించారు. శాంతిని కాపాడటంలో చైనా దళాల నమ్మకం, సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయవద్దని కోరారు. దేశ భౌగోళిక సార్వభౌమాధికారాన్ని, భద్రతా ప్రయోజనాలను చైనా సాయుధ దళాలు దృఢంగా పరిరక్షిస్తాయన్నారు.
nation
3,200
22-08-2017 02:08:08
కార్పొరేట్ల లాభాలకు జిఎస్‌టి గండి
ముంబై: ఈ ఏడాది జూలైలో జిఎ్‌సటి ప్రవేశపెట్టడానికి ముందు నెలకొన్న అస్థిరత కారణంగా భారత కార్పొరేట్‌ రంగం లాభాలు మొదటి త్రైమాసికంలో 15.7 శాతం తగ్గాయి. జిఎస్‌టి ప్రవేశపెట్టడానికి ముందు మార్కెట్లో అప్పటికే ఉన్న నిల్వలన్నింటినీ క్లియర్‌ చేయడానికే కంపెనీలు ప్రాధాన్యం ఇచ్చినట్టు క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థ కేర్‌... 2108 కంపెనీలను సర్వే చేసి రూపొందించిన నివేదికలో వెల్లడించింది. జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో కార్పొరేట్‌ కంపెనీల అమ్మకాలు కూడా 8.7 శాతం క్షీణించాయి. 2016-17 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కార్పొరేట్‌ కంపెనీల లాభాలు 1.04 లక్షల కోట్ల రూపాయలున్నాయి. క్యు1 అమ్మకాల్లో 9.7 శాతం వృద్ధి నమోదైంది. జిఎ్‌సటి ముందు నెలకొన్న అప్రమత్త స్థితి కారణంగా ఏడు పారిశ్రామిక విభాగాలు నష్టాలు ప్రకటించగా 33 విభాగాలు తక్కువ వృద్ధిని ప్రకటించాయి.
business
9,005
19-12-2017 18:52:24
ఆ చిత్రం కూడా అనిరుధ్‌కే..
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన ‘భారతీయుడు’ చిత్రం క్రియేట్ చేసిన సెన్సేషన్ అందరికీ తెలిసిందే. లంచంపై పోరాటం అనే కాన్సెఫ్ట్‌తో వచ్చిన ఆ చిత్రం గురించి ఇప్పటికీ ఎక్కడో ఒక చోట మాట్లాడుకుంటూ ఉన్నారంటే.. ఆ చిత్రం గొప్పతనం అది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ ని దిల్ ‌రాజు నిర్మాతగా శంకర్ చేయబోతున్నట్లుగా ఈ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్ నుండి దిల్ రాజు తప్పుకున్నట్లుగా ఆయన రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దిల్ రాజు ఈ చిత్రం నుండి తప్పుకోవడంతో ప్రస్తుతం శంకర్, రజినీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘2.0’ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ చేతుల్లోకి ఈ ప్రాజెక్ట్ వెళ్లినట్లుగా తెలుస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో న్యూస్ వార్తల్లో హైలెట్‌గా నిలుస్తుంది. మ్యూజిక్ సంచలనం అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం ఇవ్వబోతున్నారట. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఉన్న టాప్ సంగీత దర్శకుల్లో అనిరుధ్ ఒకరు. పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో ఆయన తెలుగులోకి కూడా ప్రవేశిస్తున్నారు. వెనువెంటనే ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేయనున్న ప్రాజెక్ట్‌కి కూడా అనిరుధ్ సంగీతం ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగునాట సైతం ఆయనకు స్టార్ మ్యూజిక్ కంపోజర్‌గా గుర్తింపు వచ్చేసింది. కోలీవుడ్, టాలీవుడ్‌లతో పాటు కొలవెరీ సాంగ్‌తో ప్రపంచం అంతటికీ అనిరుధ్ ఎవరో తెలుసు. దీంతో.. ఈ చిత్రానికి అనిరుధ్‌నే తీసుకోవాలని దర్శకనిర్మాతలు నిర్ణయానికి వచ్చినట్లుగా టాక్. దీనిపై అధికారక విషయం అతి త్వరలోనే రానుందట.
entertainment
1,900
03-01-2017 23:30:36
ప్రతి నెలా 3జిబి ఉచిత డేటా...తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ కాల్స్
ఎయిర్‌టెల్‌ బంపర్‌ ఆఫర్‌ప్రస్తుత కస్టమర్లతో పాటు నాన్‌ యూజర్లకు వర్తింపు హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : భారతి ఎయిర్‌టెల్‌.. టెలికాం రంగంలో మరో యుద్దానికి తెరలేపింది. రిలయన్స్‌ జియో ఇప్పటికే హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్‌తో మార్చి 31 వరకు తన ఉచిత సర్వీసులను పొడిగించగా తాజాగా ఎయిర్‌టెల్‌.. 4జి స్మార్ట్‌ఫోన్‌ ఉన్న నాన్‌ యూజర్లకు ప్రతి నెలా 3జిబి ఉచిత డేటాను అందించనున్నట్లు ప్రకటించింది. 2017 డిసెంబర్‌ 31 వరకు ఎంపిక చేసిన ప్రీ పెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ ప్యాక్‌లపై వినియోగదారులు ఉచితంగా 3జిబి డేటాను అందుకోవచ్చని తెలిపింది. ఎయిర్‌టెల్‌ 4జి నెట్‌వర్క్‌ అనుభవాన్ని వినియోగదారులకు అందించాలన్న ఉద్దేశంతో ఈ ఆఫర్‌ను తీసుకువచ్చినట్లు వెల్లడించింది. ఎయిర్‌టెల్‌ 4జికి మారాలనుకుంటున్న నాన్‌ వినియోగదారులకు ఆఫర్‌లో భాగంగా ఏడాది కాలంలో 9,000 రూపాయల విలువైన ఉచిత డేటాను అందిస్తున్నట్లు పేర్కొంది. 4జి స్మార్ట్‌ఫోన్‌ కలిగి ఉండి ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌లోని ఏ వినియోగదారులకైనా ఈ 12 నెలల ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అలాగే అప్‌గ్రేడ్‌ కావాలనుకుంటున్న ప్రస్తుత ఎయిర్‌టెల్‌ వినియోగదారులు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ నెల 4 వ తేదీ (బుధవారం) నుంచి ప్రారంభం కానున్న ఈ ఆఫర్‌ ఫిబ్రవరి 28న ముగుస్తుందని ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. 349 రూపాయల ప్రీ పెయిడ్‌ ప్యాక్‌తో లోకల్‌ ప్లస్‌ ఎస్‌టిడి కాల్స్‌ ప్లస్‌ 4జిబి (1జిబి రెగ్యులర్‌ ప్యాక్‌ బెనిఫిట్‌ ప్లస్‌ ఉచితంగా 3జిబి) డేటా ఆఫర్‌ చేస్తున్నట్లు తెలిపింది. మై ఎయిర్‌టెల్‌ యాప్‌ ద్వారా మొదటి సారి 3జిబి ఉచిత డేటాను ఉపయోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. తర్వాతి నెలల్లో రీచార్జ్‌ చేసుకుంటే డేటా బెనిఫిట్స్‌ వాటంతటవే వస్తాయని తెలిపింది. అలాగే పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌లోని ఆల్‌ రెగ్యులర్‌ ప్లాన్‌ బెనిఫిట్స్‌కు అదనంగా ప్రతి నెలా 3జిబి డేటాను ఆల్‌ మై ప్లాన్‌ ఇన్ఫినిటీ ప్లాన్స్‌కు ఆఫర్‌ చేస్తున్నట్లు పేర్కొంది. దేశంలో 4జి స్మార్ట్‌ఫోన్ల వినియోగం నానాటికి పెరిగిపోతుండటంతో, ఎయిర్‌టెల్‌ 4జి నెట్‌వర్క్‌ అనుభూతిని వినియోగదారులకు అందించాలన్న ఉద్దేశంతో ఈ ఆఫర్‌ను తీసుకువచ్చినట్లు భారతి ఎయిర్‌టెల్‌ డైరెక్టర్‌ అజయ్‌ పూరి తెలిపారు.
business
415
29-11-2017 03:48:09
మిడ్‌సెషన్‌ మెరుగు
తిథి: మార్గశిర శుద్ధ దశమి/ఏకాదశి నక్షత్రం: ఉత్తరాభాద్రభరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు, మేష, సింహ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి.  నిఫ్టీ: 10370.25 (-29.30)  ట్రెండ్‌ మార్పు వేళలు: 10.51; 11.17 ధోరణి: గ్రహగతులను బట్టి నిస్తేజంగా ప్రారంభమై 11.25 నుంచి 1.10 గంటల వరకు మెరుగ్గా ట్రేడవుతూ ఆ తర్వాత చివరి వరకు నిలకడగా ఉండవచ్చు. ట్రేడింగ్‌ వ్యూహం: నిఫ్టీ ఫ్యూచర్స్‌ 9.30 సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి) కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్‌లాస్ తో షార్ట్‌ పొజిషన్లు తీసుకుని 11.15 సమయానికి క్లోజ్‌ చేసుకోవాలి. 11.30 తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్‌ పొజిషన్లు తీసుకుని ఒంటి గంట సమయానికి క్లోజ్‌ చేసుకోవాలి. ఇంట్రాడే ట్రేడింగ్‌కు ప్రారంభ స్థాయి కీలకం. అంతకన్నా దిగువన మాత్రమే షార్ట్‌ పొజిషన్లు శ్రేయస్కరం. నిరోధ స్థాయిలు: 10410, 10445 మద్దతు స్థాయిలు: 10330, 10295 గమనిక: ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నికల్‌ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచన. మార్కెట్‌ వాస్తవిక కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. -డా.భువనగిరి అమరనాథశాస్ర్తిwww.thefinanciala strologer.blogspot.in
business
132
08-08-2017 23:28:22
ఎన్‌సిసి లాభం రూ.63 కోట్లు
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎన్‌సిసి లిమిటెడ్‌ 63.43 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది (52.34 కోట్ల రూపాయలు)తో పోల్చితే నికర లాభం 21 శాతం వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం రాబడులు కూడా 5 శాతం వృద్ధితో 1,929.70 కోట్ల రూపాయల నుంచి 2,034.60 కోట్ల రూపాయలకు పెరిగాయి. ఈ కాలంలో ఒక్కో షేరుకు ఆర్జన 1.14 రూపాయలుగా ఉందని కంపెనీ పేర్కొంది. త్రైమాసిక కాలంలో కంపెనీ 6,051 కోట్ల రూపాయల ఆర్డర్లను చేజిక్కించుకోవటంతో మొత్తం ఆర్డర్ల విలువ 22,009 కోట్ల రూపాయలకు చేరుకుందని ఎన్‌సిసి తెలిపింది. మంగళవారం బిఎస్‌ఇలో ఎన్‌సిసి షేరు 0.89 శాతం నష్టపోయి 89.15 రూపాయల వద్ద స్థిరపడింది.
business
17,858
19-04-2017 15:02:30
ఆహారంపై ఫిర్యాదు చేసిన జవాన్‌ను బీఎస్ఎఫ్ ఏం చేసిందో తెలుసా?
న్యూఢిల్లీ : సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) కఠిన నిర్ణయం తీసుకుంది. జవాను తేజ్ బహదూర్ యాదవ్‌ను విధుల నుంచి తొలగించింది. తమ శిబిరంలో ఏర్పాట్లు సరిగా లేవని, నాసిరకం ఆహారాన్ని తినవలసి వస్తోందని ఆయన జనవరిలో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. యాదవ్‌ను డిస్మిస్ చేయడం గురించి బీఎస్ఎఫ్ అధికారి ఒకరు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉండగా మొబైల్ ఫోన్‌ను ఉపయోగించడం, నిరాహార దీక్ష చేయడం నిబంధనలకు విరుద్ధమని, ఆయనను భోజనం చేయమని కోరినప్పటికీ తిరస్కరించారని, అందుకే ఆయనను డిస్మిస్ చేశారని తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న జవాన్లు మొబైల్ ఫోన్లను ఉపయోగించడంపై నిషేధం ఉందని తెలిపారు. బీఎస్ఎఫ్ 29వ బెటాలియన్‌ జవాన్ యాదవ్ పోస్ట్ చేసిన 4 వీడియోలలో తమకు నాసిరకం ఆహారం పెడుతున్నారని ఆరోపించారు. ఒక్కోసారి ఖాళీ కడుపుతో గడపవలసి వస్తోందని తెలిపారు. ప్రభుత్వం తమకోసం ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నప్పటికీ, ఉన్నతాధికారులు అక్రమంగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఆయన జమ్మూ-కశ్మీరులోని భారత్-పాక్ సరిహద్దుల్లో విధులు నిర్వహించారు.
nation
16,285
27-12-2017 11:20:19
జాదవ్‌ ఘటనపై పార్లమెంటులో సుష్మ ప్రకటన రేపు
న్యూఢిల్లీ: భారత మాజీ నావికాదళ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను ఇస్లామాబాద్‌లో ఆయన తల్లి, భార్య కలుసుకున్న సమయంలో వారికి ఎదురైన చేదు అనుభవాలు, పాక్ అధికారుల విపక్షాపూరిత ఆంక్షలు విధించడం, పాక్ మీడియా వ్యవహరించిన తీరు పట్ల భారత్‌లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇస్లామాబాద్ నుంచి తిరిగొచ్చిన జాదవ్ తల్లి అవంతి, భార్య చేతన్‌కుల్ ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కలుసుకుని ఆ వివరాలు ఆమెకు తెలియజేశారు. దీనిపై సుష్మాస్వరాజ్ గురువారంనాడు పార్లమెంటులో ఒక ప్రకటన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు రాజ్యసభలోనూ, 12 గంటలకు లోక్‌సభలోనూ ఆమె ఈ అంశంపై ప్రకటన చేస్తారు. ఎంపీలకు బీజేపీ విప్కాగా, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక 'ట్రిపుల్ తలాక్' బిల్లు పార్లమెంటు ఆమోదానికి రానుండటం, కుల్‌భూషణ్ అంశం సైతం ఉభయసభల్లో ప్రస్తావనకు రానుండటంతో తమ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. గురువారం, శుక్రవారం తప్పనిసరిగా పార్లమెంటుకు హాజరుకావాలని లోక్‌సభ ఎంపీలను ఈ విప్‌లో పార్టీ ఆదేశించింది. గురువారం ఉదయం 9.30 గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది.
nation
7,726
14-08-2017 17:09:52
ఈ క్రేజీ హీరో సినిమాలకు రూ.50 కోట్ల ఆఫర్
టాలీవుడ్ క్రేజీ హీరో కొత్త సినిమాలకు సంబంధించిన ఆన్ లైన్ ప్రసార హక్కుల కోసం ఓ బడా కార్పొరేట్ సంస్థ భారీ ఆఫర్‌తో ముందుకొచ్చిందట. దీంతో నిర్మాతలకు ఈ సినిమాల ద్వారా ఊహించని విధంగా లాభాలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 'బాహుబలి' తరువాత ప్రభాస్ రేంజ్ బాగా పెరిగిపోయింది. బాలీవుడ్‌లోనూ 'బాహుబలి', 'బాహుబలి-2' సూపర్ హిట్ కావడంతో ప్రభాస్ నటించబోయే కొత్త సినిమాలపై కూడా అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న 'సాహో' సినిమాను 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారంటేనే. ఈ సినిమా బిజినెస్‌పై నిర్మాతలకు ఏ స్థాయిలో నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రభాస్ నటించబోయే కొత్త సినిమాల ఆన్ లైన్ హక్కులను కొనుగోలు చేసేందుకు నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 50 కోట్ల రూపాయలను ఆఫర్ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. 'బాహుబలి 2' సినిమా కోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ 25 కోట్ల రూపాయలు చెల్లించిందని రీసెంట్‌గా వార్తలు వినిపించాయి. బాలీవుడ్‌లోని సూపర్ హిట్ సినిమా అయిన 'దంగల్'తో పాటు మరికొన్ని సినిమాల ఆన్ లైన్ హక్కులను ఈ కార్పొరేట్ దిగ్గజం కొనుగోలు చేసింది. తాజాగా ఈ సంస్థ ప్రభాస్ నటించబోయే రెండు సినిమాలకు సంబంధించిన ఆన్ లైన్ ప్రసార హక్కుల కోసం యువి క్రియేషన్స్‌కు 50 కోట్ల వరకు ఆఫర్ చేసిందట. 'సాహో'తో పాటు మరో సినిమాను కూడా యువి క్రియేషన్స్ బ్యానర్‌లో చేయాలని ప్రభాస్ నిర్ణయించడంతో ఈ సంస్థతో ఒప్పందం కోసం నెట్ ఫ్లిక్స్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రభాస్ నటించబోయే రెండు కొత్త సినిమాలకు సంబంధించిన తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ఆన్ లైన్ ప్రసార హక్కుల కోసం ఈ కార్పొరేట్ దిగ్గజం రూ. 50 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చిందట. అయితే ఇందుకు సంబంధించిన డీల్ ఇంకా పూర్తి కాలేదని కొందరు చెబుతున్నారు. చూస్తుంటే ప్రభాస్ కొత్త సినిమాల ద్వారా నిర్మాతలకు భారీగానే లాభాలు వచ్చేలా కనిపిస్తున్నాయి.
entertainment
9,408
29-06-2017 09:37:43
పృథ్వీరాజ్‌కు షాకిచ్చిన విజయవాడ కోర్టు!
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ కామెడీ పండించి తనదైన శైలిలో వెండితెరపై చెలరేగిపోతున్న నటుడు పృథ్వీరాజ్‌కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు షాక్‌ ఇచ్చింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో ఈ బాయిలింగ్‌ స్టార్‌ బబ్లూకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యిందంటున్నాయి సినీ వర్గాలు. ఇంతకీ నటుడు పృథ్వీరాజ్‌పై ఉన్న కేసు ఏమిటి? ఇప్పుడిదే ఫిల్మ్‌ ఇండస్ట్రీలోనూ....ఆయన అభిమానుల్లోనూ హాట్‌ టాపిక్‌. హాస్య నటుడు పృథ్వీరాజ్‌పై ఆయన భార్య శ్రీలక్ష్మి విజయవాడ ఫ్యామిలీ కోర్టులో భరణంకోసం పిటిషన్‌ వేశారు. నటుడిగా వెలిగిపోతున్నందున నెలకు రూ. 10 లక్షలు భరణం ఇప్పించాలని కోరింది. వాదనలు విన్న కోర్టు .... నెలకు రూ. 8 లక్షలు భరణంగా చెల్లించాలని పృథ్వీరాజ్‌ను ఆదేశించింది. దాంతో పృథ్వీరాజ్‌ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. విజయవాడ అరండల్‌పేటకు చెందిన శ్రీలక్ష్మికి నటుడు శేషు అలియాస్‌ మూర్తి అలియాస్‌ బాలిరెడ్డి పృథ్వీరాజ్‌కు 1984లో పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీలక్ష్మి తల్లిదండ్రులు విజయవాడలో మిఠాయి దుకాణం నిర్వహించేవారు. తండ్రి చనిపోవడంతో శ్రీలక్ష్మి, పృథ్వీరాజ్‌లు కొన్నాళ్లు ఆ దుకాణం చూసుకున్నారు. ఆ సమయంలోనే నటనపై ఆసక్తితో తరచూ చెన్నై వెళ్లేవారు పృథ్వీరాజ్‌. క్రమేణా సినీ రంగంలో రాణించడంతో కాపురం హైదరాబాద్‌కు మారింది. అయితే వ్యసనాలకు బానిసై 2016 ఏప్రిల్‌ 5న ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఆరోపిస్తున్నారు శ్రీలక్ష్మి. దీంతో ఆమె తిరిగి విజయవాడ వెళ్లిపోయారు. తమ దంపతుల మధ్య పెద్దమనుషులు రాజీకి ప్రయత్నించినా పృథ్వీ పట్టించుకోలేదని శ్రీలక్ష్మి కోర్టు దృష్టికి తెచ్చారు. చివరకు 2016 నవంబరు 2న సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ 498ఏ కింద కేసు పెట్టారు. తన భర్త ఆదాయ పరిస్థితి బాగానే ఉన్నందున తన జీవనోపాధికి అతని నుంచి నెలకు 10 లక్షల రూపాయలు ఇప్పించాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు శ్రీలక్ష్మి. సమన్లు అందుకోకపోవడంతో హైదరాబాద్‌లో పేపరు ప్రకటన ద్వారా పృథ్వీకి నోటీసులు ఇచ్చారు. ఆపై కేసు వాయిదాకు పృథ్వీరాజ్‌ హాజరు కాలేదు. చివరకు బాధితురాలి పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు శ్రీలక్ష్మికి నెలకు 8 లక్షలు భరణంగా చెల్లించాలని ఆదేశించింది.
entertainment
20,734
22-10-2017 04:32:37
తల్లయింది... ఇక పెళ్లంట
బోసి నవ్వులు విరబూసిన ఇంట్లో పెళ్లి హడావుడి మొదలైంది. అమ్మ అయిన అమెరికా టెన్నిస్‌ క్వీన్‌ సెరెనా విలియమ్స్‌ త్వరలో పెళ్లి కూతురు కాబోతుంది. గత నెలలో సెరెనా.. ఓ పండంటి పాప అలెక్సిస్‌ ఒలింపియా ఒహానియన్‌ జూనియర్‌కు జన్మనిచ్చింది. నిశ్చితార్థం చేసుకున్న మిలియనీర్‌ అలెక్సిస్‌ ఒహానియన్‌ను ఇప్పుడు వివాహం చేసుకోనుంది. వీరిద్దరూ పెళ్లి ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. భారీ ఎత్తున అతిథులను ఆహ్వానించి అంగరంగ వైభవంగా ఒక్కటయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం కాబోయే భార్యాభర్తలు.. రోజుల పాపను ఇంట్లోనే వదలి ప్రత్యేక విమానంలో న్యూ ఓర్లాండోకు బయల్దేరి వెళ్లారు. ఆతిథ్యం ఇచ్చే విలాసవంతమైన మెర్లిన్‌ రెస్టారెంట్‌లో గంటపాటు గడిపిన వీరిద్దరు.. వెడ్డింగ్‌ ప్లానర్లతో సమావేశమయ్యారు. ఈ ఏర్పాట్ల హడావిడి చూస్తుంటే ఈ నెలాఖరు లేదా వచ్చే నెల ఆరంభంలో ఉంగరాలు మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
sports
13,083
22-11-2017 01:16:29
ముగాబే రాజీనామా
అభిశంసనకు సిద్ధమైన పార్లమెంటుచర్చ మొదలైన కొద్దిసేపటికే రాజీనామా లేఖహరారే, నవంబరు 21: మూడున్నర దశాబ్దాలకు పైగా జింబాబ్వేను పాలించి వారం రోజులుగా సైనిక నిర్బంధంలో ఉన్న ఆ దేశ అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే(93) ఎట్టకేలకు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వారం రోజులుగా సైన్యం, ప్రజలు ఎంతగా కోరుతున్నా రాజీనామా కు అంగీకరించని ముగాబే.. తన ను తొలగించడానికి జింబాబ్వే పార్లమెంటు అభిశంసన తీర్మా నం పెట్టడానికి సిద్ధమైన వేళ మెట్టు దిగారు. ‘‘రాబర్ట్‌ గాబ్రియేల్‌ ముగాబే అను నేను జింబాబ్వే రాజ్యాంగంలోని సెక్షన్‌ 96 ప్రకారం తక్షణమే అమలయ్యేలా నా రాజీనామాను లాంఛనంగా సమర్పిస్తున్నాను’’ అంటూ రాజీనామా లేఖ పంపారు. ఈ నిర్ణయాన్ని తాను స్వచ్ఛందంగా తీసుకున్నానని, అధికార మార్పిడి సజావుగా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ముగాబే అభిశంసనకు సంబంధించి చర్చ జరుగుతుండగానే ఆయన రాజీనామా లేఖ అందడంతో.. చర్చను ముగిస్తున్నట్టు స్పీకర్‌ జాకబ్‌ ముడెండా ప్రకటించారు.
nation
16,130
13-10-2017 16:21:16
నల్లధనంలో నా వాటా ఇవ్వండి : మోదీకి రైతు లేఖ
తిరువనంతపురం : నల్లధనంపై ఇచ్చిన వాగ్దానం ప్రకారం తన వాటాను ఇవ్వాలని వయనంద్ ప్రాంత రైతు కే ఛతు (68) ప్రధాని మోదీకి లేఖ రాశారు. మనథవాడికి చెందిన ఛతు రాసిన లేఖలో కనీసం రూ.5 లక్షలు తన బ్యాంకు ఖాతాలో జమ చేయాలని కోరారు. పంట నష్టం నుంచి తేరుకునేందుకు తనకు ఈ సొమ్ము అవసరమని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో విదేశాల్లోని నల్లధనాన్ని వెనుకకు తీసుకొస్తామని, ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని చెప్పారని ఛతు ఈ లేఖలో గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్ళయినా ఈ వాగ్దానాన్ని నెరవేర్చలేదని ఆరోపించారు. వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గిపోతున్నాయని, నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయని, దీంతో సామాన్యుడికి కష్టాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు కనీసం రూ.5 లక్షలు తన ఖాతాలో జమ చేయాలని కోరారు. తనకు ఫెడరల్ బ్యాంకులో ఖాతా ఉందని, ఆ వివరాలను కూడా ఇస్తున్నానని పేర్కొన్నారు. ఛతు గతంలో సినీ నటుడు మమ్ముట్టిపై కేసు పెట్టి సంచలనం సృష్టించారు. తప్పుదోవపట్టించే ప్రకటనలో మమ్ముట్టి నటించారని ఆరోపించారు. ఛతు మాజీ నక్సలైట్. ‘పోరాటం’లో చురుగ్గా పాల్గొంటారు. ఇది అతి తీవ్ర వామపక్ష సంస్థ అని పేరు పొందింది.
nation
2,628
03-10-2017 01:43:42
భారత్‌కు చేరిన అమెరికా ముడి చమురు
న్యూఢిల్లీ: అమెరికా నుంచీ భారత్‌కు ముడి చమురు దిగుమతులు ప్రారంభమయ్యాయి. అమెరికా గల్ఫ్‌ కోస్ట్‌ నుంచి ఆగస్టు 19న 16 లక్షల పీపాల ముడి చమురుతో బయలు దేరిన ‘ఎంటి న్యూ ప్రాస్పరిటీ’ అనే నౌక ఒడిసాలోని పారాదీప్‌ నౌకాశ్రయానికి చేరింది. ప్రభుత్వ రంగంలోని ఐఒసి ఈ ముడి చమురు దిగుమతి చేసుకుంది. 1975 తర్వాత మన దేశం అమెరికా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం మన దేశం పశ్చిమాసియా, రష్యా, లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి పెద్ద మొత్తంలో చమురు దిగుమతి చేసుకుంటోంది. షేల్‌ గ్యాస్‌ ఉత్పత్తితో అమెరికా ముడి చమురు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది.
business
20,517
10-05-2017 03:27:46
పంజాబ్‌ అదుర్స్‌
కోల్‌కతాపై ఉత్కంఠ విజయం జూ సత్తా చాటిన బౌలర్లుకింగ్స్‌ ప్లే ఆఫ్‌ ఆశలు సజీవం జూ క్రిస్‌ లిన పోరాటం వృథా చివరి ఐదు ఓవర్లలో 50 పరుగులు కావాలి..! అర్ధ శతకం పూర్తి చేసుకున్న క్రిస్‌ లిన జోరు మీదున్నాడు..! చేతిలో మరో ఏడు వికెట్లుండడంతో కోల్‌కతా విజయం ఖాయమే అనుకున్నారంతా...! కానీ, మ్యాచ చేజారిపోతున్న సమయంలో పంజాబ్‌ అసాధారణంగా పుంజుకుంది..! స్లాగ్‌ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మూడు వికెట్లు పడగొట్టిన కింగ్స్‌ 35 పరుగులే ఇచ్చింది..! ఫలితంగా అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకున్న మాక్స్‌వెల్‌సేన ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది..! ఇక, చేతుల్లోకి వచ్చిన మ్యాచను చేజార్చుకున్న కోల్‌కతా అధికారికంగా ప్లేఆఫ్‌ బెర్తు దక్కించుకోవాలన్న నిరీక్షణ ఫలించలేదు..! ఈ మ్యాచలో పంజాబ్‌ ఓడిపోతే అన్ని ప్లే ఆఫ్స్‌ బెర్తులు తేలిపోయేవి..! కానీ, కింగ్స్‌ గెలుపుతో ఇప్పుడు రేసు రసవత్తరంగా మారింది..! మొహాలీ: ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో కింగ్స్‌ లెవెన పంజాబ్‌ పంజా విసిరింది. అద్భుత పోరాటంతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను ఓడించింది. తక్కువ స్కోరే చేసినా అరంగేట్రం స్పిన్నర్‌ రాహుల్‌ తెవాటియా (4-0-18-2), స్లాగ్‌ ఓవర్లలో మోహిత్ (2/24), మాట్‌ హెన్రీ (1/31), సందీప్‌ శర్మ (0/31) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో దాన్ని కాపాడుకుంది. మంగళవారం జరిగిన ఈ మ్యాచలో పంజాబ్‌ 14 పరుగులతో కోల్‌కతాపై ఉత్కంఠ విజయం సాధించింది. పంజాబ్‌ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్య ఛేదనలో క్రిస్‌ లిన (52 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 84) అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగినా.. ఓవర్లన్నీ ఆడిన కోల్‌కతా ఆరు వికెట్లకు 153 పరుగులే చేయగలిగింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 167 పరుగులు చేసింది. కెప్టెన గ్లెన మాక్స్‌వెల్‌ (25 బంతుల్లో ఫోర్‌, 4 సిక్సర్లతో 44), సాహా (38) సత్తా చాటా రు. కోల్‌కతా బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ (2/20), కుల్దీప్‌ (2/34) చెరో రెండు వికెట్లతో రాణించగా.. నరైన (1/27) పొదుపుగా బౌలింగ్‌ చేశా డు. పంజాబ్‌ బౌలర్‌ మోహిత శర్మ ‘మ్యాన ఆఫ్‌ ద మ్యాచ’గా నిలిచాడు. కాగా, 12 మ్యాచల్లో 6వ విజయంతో పంజాబ్‌ (12 పాయింట్లు) ఐదో స్థానంలో ఉంది. కోల్‌కతా (13 మ్యాచల్లో 16 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచింది. లిన పోరాడినా..: సునీల్‌ నరైన (18), క్రిస్‌ లిన మరోసారి ధనాధన బ్యాటింగ్‌తో అలరించడంతో కోల్‌కతా ఛేదనను ధాటిగా ఆరంభించింది. ఇన్నింగ్స్‌ తొలి రెండు బంతులను నరైన బౌండ్రీకి చేర్చగా.. లిన కూడా ఫోర్‌తో ఖాతా తెరవడంతో మొదటి ఓవర్లోనే 14 పరుగులు రాబట్టింది. హెన్రీ బౌలింగ్‌లో లిన రెండు బౌండ్రీలు కొట్టగా.. మోహిత బౌలింగ్‌లో వరుసగా నరైన రెండు ఫోర్లు బాదాడు. కానీ, తర్వాతి బంతికే ఆఫ్‌ కట్టర్‌తో సునీల్‌ను మోహిత బౌల్డ్‌ చేశాడు. వనడౌనలో వచ్చిన గంభీర్‌ (8) జాగ్రత్తగా ఆడినా.. లిన మాత్రం తన మార్కు షాట్లతో విజృంభించడంతో పవర్‌ప్లేలోనే కోల్‌కతా 61/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ, స్పిన్నర్ల రాకతో ఆ జట్టు ఇన్నింగ్స్‌ స్వరూపం మారింది. అక్షర్‌ పటేల్‌, అరంగేట్రం ఆటగాడు రాహుల్‌ తెవాటియా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. తన రెండు ఓవర్లలో అక్షర్‌ ఆరు పరుగులే ఇచ్చాడు.  పదో ఓవర్లో గంభీర్‌, ఊతప్ప (0)ను అవుట్‌ చేసిన తెవాటియా తన మూడు ఓవర్లలో తొమ్మిది పరుగులే ఇచ్చాడు. పవర్‌ప్లే తర్వాతి 36 బంతుల్లో ఒక్క బౌండ్రీ కూడా కొట్టని కోల్‌కతా 12 ఓవర్లకు 86/3తో కష్టాల్లో పడిపోగా.. పంజాబ్‌ రేసుకొచ్చింది. అయితే, 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న లిన... స్వప్నిల్‌, అక్షర్‌ ఓవర్లలో ఒక్కో సిక్సర్‌తో మళ్లీ వేగం పెంచాడు. మరో ఎండ్‌లో మనీష్‌ పాండే (18) స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ అతనికి సహకారం అందించాడు. చివరి నాలుగు ఓవర్లలో 44 పరుగులు అవసరమవడంతో మొగ్గు కోల్‌కతాదే అనిపించింది. అయితే, 17వ ఓవర్లో మోహిత ఏడు పరుగులే ఇవ్వగా.. హెన్రీ వేసిన తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో పాండే, లిన వికెట్లు కోల్పోయిన కోల్‌కతా 8 పరుగులే చేసింది. దాంతో, సమీకరణం 12 బంతుల్లో 29గా మారింది. ఇక, మోహిత వేసిన 19వ ఓవర్‌ తొలి బంతికే భారీ షాట్‌ ఆడిన యూసుఫ్‌ పఠాన (2) మాక్స్‌వెల్‌కు చిక్కాడు. క్రిస్‌ వోక్స్‌ (8 నాటౌట్‌) సిక్సర్‌ కొట్టినా ఆ ఓవర్లో 9 పరుగులే వచ్చాయి. ఇక, ఆఖరి ఓవర్లో 20 రన్స అవసరమవగా సందీప్‌ ఐదే ఇచ్చి పంజాబ్‌ను గెలిపించాడు. ఆదుకున్న మాక్సీ, సాహా: తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు అంత మంచి ఆరంభం దక్కలేదు. వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయగా.. నాలుగో వికెట్‌కు కెప్టెన మాక్స్‌వెల్‌, వృద్ధిమాన సాహా 71 పరుగులు జోడించడంతో పంజాబ్‌ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. మార్టిన గప్టిల్‌ (12) తడబడినా.. మరో ఓపెనర్‌ మనన వోహ్రా (16 బంతుల్లో 4 ఫోర్లతో 25) ధాటిగా ఆడడంతో నాలుగు ఓవర్లకు 28/0 స్కోరుతో నిలిచింది. అయితే, వరుస ఓవర్లలో వీరిద్దరినీ అవుట్‌ చేసిన కోల్‌కతా బౌలర్లు కింగ్స్‌ లెవెనను దెబ్బకొట్టారు. ఐదో ఓవర్లో రెండు బౌండ్రీలు కొట్టిన జోరు మీద కనిపించిన వోహ్రాను ఉమేష్‌ షార్ట్‌ బాల్‌తో అవుట్‌ చేశాడు. ఆ వెంటనే గప్టిల్‌ను ఫ్లాట్‌ డెలివరీతో నరైన వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక, రెండు బౌండ్రీలతో ఊపందుకున్న షాన మార్ష్‌ (11)ను క్రిస్‌ వోక్స్‌ బౌల్డ్‌ చేయడంతో సగం ఓవర్లకు పంజాబ్‌ 63/3 స్కోరుతో నిలిచింది.  ఈ దశలో మాక్స్‌వెల్‌, సాహా జట్టు బాధ్యతలు తీసుకున్నారు. క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్న మాక్స్‌వెల్‌ తర్వాత తన మార్కు షాట్లతో చెలరేగిపోయాడు. గ్రాండ్‌హోమ్‌ వేసిన 12వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో 19 పరుగులు పిండుకున్నాడు. తర్వాతి ఓవర్లో మాక్సీ, సాహా చెరో బౌండ్రీ రాబట్టారు. సాహా కూడా వేగం పెంచడంతో 15 ఓవర్లకు పంజాబ్‌ 115/3తో కోలుకుంది. అయితే, కుల్దీప్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు భారీ సిక్సర్లతో రెచ్చిపోయిన మాక్సీ.. తర్వాతి బంతికి మరో షాట్‌ ఆడే ప్రయత్నంలో కవర్స్‌లో క్రిస్‌ వోక్స్‌ పట్టిన అద్భుత క్యాచకు క్రీజు వీడాడు. ఇక, 18వ ఓవర్లో లాంగాన మీదుగా చక్కటి సిక్సర్‌ రాబట్టిన సాహాను కుల్దీప్‌ స్టంపౌట్‌ చేశాడు. స్వప్నిల్‌ సింగ్‌ (2)ను క్రిస్‌ వోక్స్‌ బౌల్డ్‌ చేసినా.. రాహుల్‌ తెవాటియా (15 నాటౌట్‌) మూడు బౌండ్రీలు సాధించడంతో చివరి రెండు ఓవర్లలో 17 పరుగులు చేసిన పంజాబ్‌ కాపాడుకునే స్కోరు సాధించింది. స్కోరుబోర్డుపంజాబ్‌: గప్టిల్‌ (ఎల్బీ) నరైన 12, వోహ్రా (సి) ఊతప్ప (బి) ఉమేష్‌ 25, షాన మార్ష్‌ (బి) వోక్స్‌ 11, సాహా (స్టంప్డ్‌) ఊతప్ప (బి) కుల్దీప్‌ 38, మాక్స్‌వెల్‌ (సి) క్రిస్‌ వోక్స్‌ (బి) కుల్దీప్‌ 44, అక్షర్‌ (నాటౌట్‌) 8, స్వప్నిల్‌ (బి) క్రిస్‌ వోక్స్‌ 2, తెవాటియా (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 167/6; వికెట్ల పతనం: 1-39, 2-41, 3-56, 4-127, 5-146, 6-149; బౌలింగ్‌: ఉమేష్‌ 3-0-26-1, గ్రాండ్‌హోమ్‌ 4-0-37-0, నరైన 4-0-27-1, క్రిస్‌ వోక్స్‌ 4-0-20-2, అంకిత 2-0-17-0, కుల్దీప్‌ 3-0-34-2. కోల్‌కతా: నరైన (బి) మోహిత 18, క్రిస్‌ లిన (రనౌట్‌) 84, గంభీర్‌ (సి) మార్ష్‌ (బి) తెవాటియా 8, ఊతప్ప (సి) అక్షర్‌ పటేల్‌ (బి) తెవాటియా 0, మనీష్‌ పాండే (సి) అక్షర్‌ (బి) హెన్రీ 18, గ్రాండ్‌హోమ్‌ (నాటౌట్‌) 11, యూసుఫ్‌ (సి) మాక్స్‌వెల్‌ (బి) మోహిత 2, వోక్స్‌ (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 153/6; వికెట్ల పతనం: 1-39, 2-78, 3-79, 4-131, 5-132, 6-139; బౌలింగ్‌: సందీప్‌ 4-0-31-0, హెన్రీ 3-0-31-1, మోహిత 3-0-24-2, అక్షర్‌ 4-0-28-0, రాహుల్‌ తెవాటియా 4-0-18-2, స్వప్నిల్‌ 2-0-19-0.
sports
17,535
19-04-2017 19:02:58
ఆయిల్ ట్యాంకర్ బోల్తా... వంట నూనె కోసం ఎగబడిన స్థానికులు
బెంగళూరు: ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా కొట్టింది. దీంతో అందులోని వంట నూనె రోడ్డు పాలైంది. ట్యాంకర్ నుంచి కారుతున్న నూనెను పట్టుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. కుకింగ్ ఆయిల్ కోసం బకెట్లు, బిందెలతో తరలివచ్చిన వారిని పోలీసులు చెదరగొట్టారు. కర్నాటక‌లోని గుల్బర్గాలో బుధవారం ఈ ఘటన జరిగింది.
nation
20,326
18-10-2017 02:00:31
అర్జున్‌, సారా నకిలీ అకౌంట్ల తొలగింపు
న్యూఢిల్లీ: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ విజ్ఞప్తి మేరకు.. అతడి పిల్లల పేర్లతో ఉన్న నకిలీ అకౌంట్లను ట్విటర్‌ తొలగించింది. మాస్టర్‌ కొడుకు అర్జున్‌, కూతురు సారా పేరిట ట్విటర్‌లో నకిలీ అకౌంట్లు కొనసాగుతున్నాయి. దీనిపై సచిన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వాటిని సత్వరం నిలిపివేయాలని మాస్టర్‌ ట్వీట్‌ చేశాడు. దీనిపై స్పందించిన ట్విటర్‌.. మంగళవారం మధ్యాహ్నం నుంచి నకిలీ అకౌంట్లను నిలిపివేసింది.
sports
12,682
22-03-2017 14:06:30
పోలీసుల నుంచి తప్పించుకోబోయి చెరువులో దూకేసిన బాలికలు
భరత్‌పూర్: రాజస్థాన్‌లోని రెడ్‌లైట్ ఏరియాగా భావిస్తున్న ఓ ప్రాంతంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా విషాదం చోటుచేసుకుంది. పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకునేందుకు ఇద్దరు మైనర్ బాలికలు ఓ చెరువులో దూకేశారు. అయితే వారికి ఈత రాకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. వీరితోపాటు చెరువులో దూకిన మరో మైనర్ బాలికను పోలీసులు కాపాడారు. స్థానికుల నుంచి వరుసగా ఫిర్యాదులు రావడంతో ఈ ప్రాంతంలో పోలీసులు మంగళవారం అకస్మిక సోదాలు నిర్వహించారు. భరత్‌పూర్ రేంజ్ ఐజీ అలోక్ వశిష్ట నేతృత్వంలో పోలీసులు మూడు బృందాలుగా వెళ్లి సోదాలు జరిపారు. వ్యభిచారం చేస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 12 మందిని అరెస్టు చేసినట్టు ఐజీ వెల్లడించారు. కాగా పోలీసులు కనీస వివరాలు కూడా తెలుసుకోకుండా మైనర్ బాలికలను కొడుతూ తీసుకెళ్లేందుకు ప్రయత్నించారనీ.. అందుకే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
nation
544
07-02-2017 00:28:33
నిజమైన ఇన్వెస్టర్లకు భయం లేదు : సిబిడిటి
న్యూఢిల్లీ : స్టాక్‌ ఎక్స్చేంజ్‌ల్లో లిస్టు కాని ఎలాంటి షేర్ల లావాదేవీలకు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టిసిజిటి) వర్తించదో త్వరలోనే పూర్తి జాబితా ప్రకటిస్తామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) ప్రకటించింది. బడ్జెట్‌పై సిఐఐ నిర్వహించిన ఒక సదస్సులో పాల్గొన్న సిబిడిటి చీఫ్‌ సుశీల్‌ చంద్ర ఈ విషయం చెప్పారు. ఆదాయ పన్ను (ఐటి) చట్టంలోని సెక్షన్‌ 10 (38) ప్రకారం ఏదైనా ఒక కంపెనీ షేర్ల ను కొన్న ఏడాది తర్వాత అమ్ముకుంటే వచ్చే లాభాలను ఎల్‌టిసిజిటి నుంచి మినహాయిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొంత మంది అక్రమార్కులు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్టు కాని అల్లాటప్పా కంపెనీల షేర్లు కొని, తర్వాత వాటి ధరలను భారీగా పెంచేసి లాభాలు పొందుతున్నారు.      ఈ సెక్షన్‌ దుర్వినియోగాన్ని కట్టడి చేసేందుకు ఆర్థిక మంత్రి జైట్లీ మొన్నటి బడ్జెట్‌లో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్టు కాని కంపెనీల షేర్లకు, సెక్యూరిటీస్‌ లావాదేవీల పన్ను (ఎస్‌టిటి) చెల్లించకుండా జరిగే షేర్లకూ ఎల్‌టిసిజిటి వర్తించదని స్పష్టం చేశారు. అయితే దీనిపై పిఇ సంస్థలు, వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌ ఆందోళన వ్యక్తం చేయడంతో ఎలాంటి షేర్ల లావాదేవీలకు ఎల్‌టిసిజిటి వర్తించదో స్పష్టం చేయాలని సిబిడిటి నిర్ణయించింది. పబ్లిక్‌ ఇష్యూలు, ఎఫ్‌డిఐ మార్గంలో భారత కంపెనీల ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేసే నిజమైన ఇన్వెస్టర్లు ఎల్‌టిసిజిటి మినహాయింపు నిబంధనపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సిబిడిటి చీఫ్‌ స్పష్టం చేశారు.  ఎంఎస్‌ఎంఇలకు 25 శాతమే పన్ను
business
16,917
20-08-2017 12:14:23
అత్తారింట్లో మరుగుదొడ్డి లేదు... విడాకులు మంజూరు...
న్యూఢిల్లీ : మరుగుదొడ్డిని నిర్మించకపోవడం క్రూరత్వమేనని రాజస్థాన్‌లోని ఓ కుటుంబ న్యాయస్థానం తీర్పు చెప్పింది. వివాహాన్ని రద్దు చేసేందుకు దీనిని ఓ కారణంగా పేర్కొన్నవచ్చునని తెలిపింది. ఓ మహిళ విడాకుల కోసం 2015లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తనకు 2011లో వివాహం జరిగిందని, తాను ఇంట్లో మరుగుదొడ్డిని నిర్మించాలని తన భర్తను పదే పదే కోరేదానినని తెలిపారు. ఎన్నిసార్లు కోరినప్పటికీ తన భర్త తమ ఇంట్లో మరుగుదొడ్డిని నిర్మించలేదని ఆరోపించారు. ‘‘వివాహ సమయంలో మీ తల్లిదండ్రులు మరుగుదొడ్డి కట్టించాలని కోరలేదు’’ అనేవాడని పేర్కొన్నారు. స్నానం చేయడానికి, కాలకృత్యాలను తీర్చుకోవడానికి చీకటి పడే వరకు వేచి చూడవలసి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ స్థలాల్లో ఇటువంటి కార్యకలాపాలు నిర్వహించడం వల్ల తన గౌరవ, మర్యాదలకు భంగం కలుగుతోందని చెప్పారు. దీనిపై కోర్టు స్పందిస్తూ ఇంట్లో మరుగు దొడ్డి లేకపోవడం మహిళ మర్యాదకు భంగకరమని తీర్పు చెప్పింది. ఆమె దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఆమోదించింది. ‘‘మనం పొగాకు, మద్యం, మొబైల్ ఫోన్లను కొనుక్కోవడానికి డబ్బులు ఖర్చుపెడతాం, కానీ మన కుటుంబ సభ్యుల గౌరవ, మర్యాదలను కాపాడేందకు టాయ్‌లెట్లను నిర్మించేందుకు ఇష్టపడం. గ్రామాల్లో మహిళలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి చీకటి పడే వరకు వేచి చూడవలసి వస్తోంది. ఇది కేవలం శారీరక క్రూరత్వం మాత్రమే కాదు, మహిళ మర్యాదకు భంగకరం కూడా’’ అని తెలిపింది.
nation
4,329
12-01-2017 03:19:22
అటకెక్కుతున్న విభజన హామీలు!
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటానికి పొంతన లేని కుంటిసాకులతో రాష్ట్ర ప్రజలకు అసంతృప్తి మిగిల్చారు. ప్రత్యేక పాకేజీ అన్నారు, చట్టబద్ధత కల్పించమంటే ఉలుకూ, పలుకూ లేదు! రైల్వే జోన్ విషయంలోనూ నీళ్ళు నములుతున్నారు! గిరిజన విశ్వ విద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయాల విషయంలోనూ స్థలసేకరణ జరిగినా, కేంద్ర పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం గర్హనీయం! కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని, మాట మార్చి, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తామని నమ్మబలికారు! ప్రజలు మర్చిపోయారని కేంద్ర పాలకులు భావిస్తున్నట్లున్నారు! శంకుస్థాపనలు చేసిన వివిధ కేంద్ర విద్యాసంస్థలకు నిధుల విడుదల ఎండమావిగా మారింది! రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్లమెంట్ సభ్యులు ఉదాసీనంగా వ్యవహరిస్తే ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుంది. నియోజకవర్గాల పెంపు ప్రజలు కోరుకోవటం లేదు. ప్రజలు, నిత్యం పాలకుల ధోరణిని నిశితంగా పరిశీలిస్తున్నారు, రాజకీయ అవసరాల కోసం ప్రాధాన్యతలను విస్మరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది!గరిమెళ్ళ రామకృష్ణ, ఏలూరు
editorial
12,144
23-10-2017 18:34:27
కండబలం పనిచేయలేదని కేంద్రం ఒప్పుకుంది : చిదంబరం
న్యూఢిల్లీ : జమ్మూ-కశ్మీరులో కండబలం పనిచేయలేదని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ఎద్దేవా చేశారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రకటనపై చిదంబరం ఈ విధంగా స్పందించారు. అంతకుముందు, రాజ్‌నాథ్ సింగ్ అనూహ్యంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ జమ్మూ-కశ్మీరు సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేందుకు నిరంతరాయ, దీర్ఘకాలిక చర్చలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని భాగస్వాములందరితోనూ చర్చలు జరుపుతామన్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ దినేశ్వర్ శర్మ కేంద్ర ప్రభుత్వం తరపున ప్రాతినిథ్యం వహిస్తారని చెప్పారు. ఎవరితోనైనా చర్చలు జరిపే స్వేచ్ఛ శర్మకు ఉందని చెప్పారు. దీనిపై చిదంబరం స్పందిస్తూ జమ్మూ-కశ్మీరులో కండబలం విఫలమైందని ప్రభుత్వం చివరికి అంగీకరించిందని ఎద్దేవా చేస్తూ ట్వీట్లు చేశారు. చర్చల ప్రసక్తే లేదన్న ధోరణి నుంచి భాగస్వాములందరితోనూ చర్చిస్తామనేంత వరకు వచ్చిందన్నారు. ఇది జమ్మూ-కశ్మీరులో రాజకీయ పరిష్కారం కోసం బలంగా వాదించినవారి భారీ విజయమని పేర్కొన్నారు.
nation
8,398
10-10-2017 11:33:30
పవన్ కల్యాణ్‌కు కొడుకు పుట్టాడు!
పవన్ కల్యాణ్-అన్నా లెజొనెవా దంపతులకు కొడుకు పుట్టాడు. రేణు దేశాయ్‌తో వివాహానంతరం వీరికి అకీరా, ఆధ్య జన్మించారు. అనంతరం రేణుతో విడిపోయాక పవన్ రష్యాకు చెందిన అన్నాను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇంతకు మునుపే పొలెనా అనే పాప ఉంది. ఇప్పుడు బాబు పుట్టాడు. హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో అన్నా లెజొనెవాకు కాన్పు జరిగింది. ఆసుపత్రిలో బాబును ఎత్తుకుని మురిపెంగా చూస్తున్న పవన్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. తమ ఇంటికి మరో చిన్నారి రాకతో పవన్ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇద్దరు పిల్లలు పేరేంటంటే..పవన్ కంటే ఏ హీరో 10 రెట్లు బెటరని వర్మ అన్నాడో తెలుసా?
entertainment
3,628
05-09-2017 04:17:45
కేంద్ర కేబినెట్‌ విస్తరణలో ఆంధ్రులేరి?
రోడ్లు విస్తరణలో ఇళ్ళు కోల్పోయిన వారిలా ఉంది మంత్రివర్గ విస్తరణ తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల పరిస్థితి. రాజ్యాంగ పదవిలోకి వెంకయ్య వెళ్లడం, విస్తరణలో దత్తన్న పదవి కోల్పోవడం వెరసి తెలుగువారి ప్రాతినిధ్యం కేంద్రంలో మరింత తగ్గినట్టయింది. ప్రాతినిధ్యం మాత్రమేనా, ప్రభావం, ప్రాభవం కూడా తగ్గుముఖం పట్టినట్టేనా అన్నది తొందరలోనే తెలిసిపోగలదు. ఏమైనా మంత్రి మండలి కూర్పు అన్నది ప్రధాని విచక్షణాధికారం. ఎలాంటి జట్టు కూర్చుకోవాలో ఆయన ఇష్టమే. అయితే అన్ని ప్రాంతాలకు, వివిధ వర్గాలకు సమభాగం ఉండాలన్నది అప్రకటిత సంప్రదాయం. బాధాకర విషయమేమిటంటే ప్రతీ చర్యలోనూ తదుపరి ఎన్నికల వ్యూహం దాగి ఉండడం. ప్రతీ నియామకానికి వచ్చే ఎన్నికల్లో కలగ గల లబ్ధి గీటురాయి కావడం. ఒక రాజకీయ పక్షానికి అది ముఖ్యాంశం కావడం వేరు, అది మాత్రమే కీలకం కావడం వేరు. దేశ ప్రయోజనాలకు ముందు రాజకీయ ప్రయోజనాలు నిలవడం మంచి సంప్రదాయం కానేరదు.- డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం
editorial
7,313
19-03-2017 16:29:42
అక్షయ్ కుమార్ నిజమైన దేశభక్తుడట!
రీసెంట్ గా మలయాళ మూవీ షూటింగ్ పూర్తిచేసిన అల్లు శిరీష్.. తదుపరి 'ఎక్కడకి పోతావు చిన్నవాడా' ఫేం వీఐ ఆనంద్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఇద్దరు హీరోయిన్లు నటించనున్న ఈ సినిమాలో ఇప్పటికే సురభిని ఓ హీరోయిన్ గా ఎంపిక చేయగా.. మరో కథానాయికగా శీరత్ కపూర్ నటించనుందట. 'రన్ రాజా రన్' సక్సెస్ తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న శీరత్.. ప్రస్తుతం నాగార్జున చిత్రం 'రాజుగారి గది 2'లో నటిస్తోంది. ఇక ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న శిరీష్ మూవీ అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది.          తెరపైనే కాదు.. తెర వెనుక కూడా హీరో అనిపించుకుంటున్నాడు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాల నడుమ జరిగిన కాల్పుల్లో.. 12 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు అర్పించిన జవాన్ల ఒక్కో కుటుంబానికి 9 లక్షల రూపాయల చొప్పున రూ.1.08 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించిన సీఆర్పీఎఫ్‌.. అక్షయ్ నిజమైన దేశభక్తిని చాటుకున్నాడని, ఆయనకు సీఆర్పీఎఫ్‌ సెల్యూట్‌ చేస్తోంది' అంటూ ట్వీట్‌ చేసింది. మరి.. అక్షయ్ బాటలో ఇంకెందరు స్టార్స్ రియల్ హీరోస్ అనిపించుకుంటారో చూడాలి..!
entertainment
12,136
03-12-2017 14:40:14
'కులాల పేరుతో కాంగ్రెస్ చిచ్చు'
అహ్మదాబాద్: కులాల పేరుతో గుజరాత్‌ను కాంగ్రెస్ విడగొడుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేదని, కులం పేరుతో రాష్ట్రాన్ని విడిదీయాలనుకునే శక్తులకే నాయకత్వం అప్పగించిందని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎద్దేవా చేశారు. సుపరిపాలన అందించిన ట్రాక్ రికార్డు బీజేపీ సొంతమని అన్నారు. 'అభివృద్ధి, రాజకీయ స్థిరత్వం ఒకవైపు, అవకాశవాద కూటమి, అరాచకం మరోవైపు పోటీపడుతున్నాయి. ఈ రెండింటి మధ్యే పోటీ నెలకొంది. 22 ఏళ్ల పాటు అద్భుతమైన పాలన అందించిన ట్రాక్ రికార్డు బీజేపీకి ఉంది' అని ఆయన అన్నారు. 182 సీట్ల గుజరాత్ అసెంబ్లీకి ఈనెల 9న తొలివిడత, 14న చివరి విడత పోలింగ్ జరుగనుండగా, 18న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
nation
8,984
01-11-2017 07:02:45
ప్రముఖ సినీనటి అమలాపాల్ లగ్జరీ కారు రిజిస్ట్రేషన్‌పై దర్యాప్తు
యానాం : ప్రముఖ సినీనటి అమలాపాల్ విలాసవంతమైన కారు కొనుగోలు వ్యవహారంపై పుదుచ్చేరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత ఏడాది అమలాపాల్ పుదుచ్చేరిలో రూ.1.12 కోట్లు వెచ్చించి విలాసవంతమైన కారు కొన్నారు. కారును తన సొంత రాష్ట్రమైన కేరళలో కాకుండా తప్పుడు చిరునామాతో పుదుచ్చేరి ఆర్టీవో కార్యాలయంలో ఆమె రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 20లక్షల రూపాయల పన్ను మాఫీ కోసమే పుదుచ్చేరిలో అమలాపాల్ కారు కొని తక్కువ పన్నుతో రిజిస్ట్రేషన్ చేయించారని సమాచారం. దీనిపై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరు, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు. కిరణ్ బేడీ ఆదేశంతో పోలీసులు అమలాపాల్ తప్పుడు అడ్రసుతో కారు రిజిస్ట్రేషన్ చేయించిన బాగోతంపై దర్యాప్తు చేస్తున్నారు. అమలాపాల్ తో పాటు మరికొందరు సెలబ్రిటీలు ఇలా పన్ను ఎగ్గొట్టేందుకే పుదుచ్చేరిలో లగ్జరీ కార్లను కొని ఇక్కడే రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని కిరణ్ బేడీ పోలీసులను ఆదేశించారు.
entertainment
3,656
19-09-2017 03:50:14
గురివింద విమర్శలు
కర్ణాటకలో జరిగిన ఒక హత్య ఆధారంగా వామపక్ష నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలు సంస్కారవంతంగా లేవు. ముఖ్యంగా, దేశంలో సంఘ్‌పరివార్‌ని విమర్శించడమే లక్ష్యంగా వీరి విధానం వుంటోంది. దేశ అంతర్గత -బహిర్గత రక్షణలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమయింది. ఆ పార్టీ అసమర్థ నాయకత్వం, స్వార్థ రాజకీయాల మూలంగానే దేశం మత ప్రాతిపదికన విభజించబడింది. భారతీయులకు అత్యంత పవిత్రమైన కైలాస శిఖరం, మానస సరోవరంతో పాటు 90,000 చదరపు కిలోమీటర్ల విలువైన భారత భూభాగాన్ని చైనా దురాక్ర మించుకుంది. భద్రతామండలిలో మనకు దక్కాల్సిన శాశ్వత సభ్య స్థానం చైనాకు దఖలు పర్చారు. కాశ్మీరి ప్రాంతాన్ని వివాదాస్పదం చేసిన అసమర్థత నాటి పాలకులదే. ఇక కాషాయ ఉగ్రవాద మంటూ నోటి వాచాలత్వాన్ని నిర్లజ్జగా ప్రదర్శించిన దిగ్విజయ్ సింగ్‌కు, దాన్ని సమర్థించిన కాంగ్రెస్ నాయకత్వానికి కాషాయ ఉగ్రవాదం ఎట్లా వుంటుందో దేశ ప్రజలు తెలియపర్చారు. మన దేశ సంస్కృతిని, కుటుంబ వ్యవస్థని, సామాజిక జీవనాన్ని నాశనం చేసి, విఫల విదేశీ సిద్ధాంతాన్ని ఇక్కడి ప్రజల నెత్తిన రుద్దాలనే విధంగా వామపక్షాల ప్రవర్తన వుంటోంది. రక్తపాత హింసా కాండకు పెట్టింది పేరయిన సామ్యవాద సమర్థకులకు శాంతి యుత భారత జీవన విధానమంటే గిట్టదు. అందుకే ఈ రెండు పక్షాల నాయకులు, జాతీయవాద సంస్థలపై తమ అక్కస్సుని వెళ్ళగక్కుతున్నారనుకోవచ్చు. పాకిస్తానీ ప్రేరిత ఉగ్రవాద శక్తులవల్ల తమ ధన, మాన ప్రాణాలతో పాటు సర్వస్వాన్ని కోల్పోయి, స్వస్థలానికి దూరమై, స్వదేశంలోనే కాందిశీకులుగా మారి దుర్భర జీవితాన్ని గడుపుతున్న కాశ్మీరీ పండిట్ల పై లేని దయ, జాలి, మానవత్వం - ఎక్కడో విదేశంలోని రోహింగ్యో ముస్లింలకోసం ఇక్కడ ఆందోళలు చేయడం వీరికే సాధ్యమవుతోంది.– వీరుభొట్ల పేరయ్య శాస్త్రి, విజయవాడ
editorial
14,791
15-06-2017 03:40:25
ఓ రాత్రి గడుపు.. నీ భర్తను వదిలేస్తా
వివాహితకు ఎస్‌ఐ ప్రతిపాదన.. రాజస్థాన్‌లో ఘటనజోధ్‌పూర్‌, జూన్‌ 14: ‘‘రాత్రి మీ ఇంటికి వస్తాను.. నీతో సరదాగా కాసేపు గడుపుతాను’’.. తన భర్తను విడిపించుకునేందుకు వచ్చిన ఒక మహిళతో ఓ ఎస్‌ఐ చేసిన ప్రతిపాదన ఇది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్నా.. ఆ భావాలను ఆమె పైకి కనబడనీయలేదు. సరికదా.. ‘‘ముస్తాబై సిద్ధంగా ఉంటాను’’ అని గారాలు పోయింది. సంబరపడిన ఆ ఎస్‌ఐ.. డ్యూటీ ముగించుకొని ఆమె ఇంటికి వెళ్లాడు. అతడిని ఇంట్లోకి ఆహ్వానించి గడియపెట్టింది. దగ్గరకు తీసుకునేంతలో డోర్‌బెల్‌ మోగింది. తెరిచి చూస్తే.. ఎదురుగా ఏసీబీ అధికారులు! రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ జిల్లాలో ఓ వివాహిత ఇలా ఓ ఎస్సైని పట్టించింది. కిలో ఓపియం డ్రగ్‌ను కలిగి ఉండటంతో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విడిపించుకునేందుకు వెళ్లిన అతడి భార్యను ఎస్‌ఐ కమల్‌ధన్‌ చరణ్‌ రూ.2లక్షలు డిమాండ్‌ చేశారు. రూ.లక్ష ఎలాగోలా సర్ది, మరో లక్షకు చెక్‌ ఇచ్చింది. నగదు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేయగా.. నిస్సహాయత వ్యక్తంచేసింది. అలా అయితే.. మంగళవారం రాత్రి మీ ఇంటికి వస్తా.. అంటూ అతడు ప్రతిపాదన పెట్టాడు. దీంతో ఆమె.. ఏసీబీ అధికారుల సాయంతో అతడి ఆట కట్టించింది.   అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి బాలకృష్ణ నటించిన సినిమా ఏది?‘వందేమాతరం’ పదాన్ని ఏ నవల నుంచి గ్రహించారు?
nation
21,101
07-12-2017 03:17:47
వావ్‌.. ఇండియా
హాకీ లీగ్‌ సెమీస్‌కు భారత్‌సడన్‌ డెత్‌లో బెల్జియం అవుట్‌భువనేశ్వర్‌: పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు.. వారి ప్రోత్సాహం తో రెచ్చిపోయిన భారత జట్టు.. ఒలింపిక్‌ రజత పతక విజేత బెల్జియంపై అన్ని విభాగాల్లో పట్టు సాధించింది. ఫలితంగా బుధవారం జరిగిన వరల్డ్‌ హాకీ లీగ్‌ క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ పెనాల్టీ షూటౌట్‌లో 3-2తో నెగ్గి సెమీస్‌లో ప్రవేశించింది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు 3-3 స్కోరుతో సమవుజ్జీలుగా నిలిచాయి. అనంతరం షూటౌట్‌లోనూ 2-2తో సమమవడంతో సడన్‌డెత్‌ అనివార్యమైంది. అందులో కీపర్‌ ఆకాష్‌ చిట్కే అద్భుత ప్రతిభతో గోల్‌కాకుండా ప్రత్యర్థి ని అడ్డుకోగా.. హర్మన్‌ప్రీత్‌ తన గోల్‌తో భారత్‌కు విజయా న్ని ఖాయం చేశాడు. అంతకుముందు గుర్జాంత్‌సింగ్‌ (31వ నిమిషం), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (35), రూపిందర్‌పాల్‌ సింగ్‌ (46) భారత్‌కు గోల్స్‌ అందించారు. బెల్జియం తరపున లూపెర్ట్‌ (38, 46), క్యుస్టెర్స్‌ (53) గోల్స్‌ సాధించారు. మ్యాచ్‌లో సింహ భాగం బెంచ్‌కే పరిమితమై 47వ నిమిషంలో బరిలో దిగిన కీపర్‌ ఆకాష్‌ చిట్కే షూటౌట్‌లో అద్భుత ప్రతిభతో ప్రత్యర్థి నాలుగు గోల్స్‌ అవకాశాలను అడ్డుకోవడంతో మ్యాచ్‌ సడన్‌డెత్‌కు మళ్లడం.. అందులో భారత్‌ ఘన విజయం సాధించడం విశేషం. మరో క్వార్టర్‌ఫైనల్లో ఆస్ర్టేలియా 4-1తో స్పెయిన్‌ను చిత్తుచేసింది. గురువారం జరిగే క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌- అర్జెంటీనా (సా.5:15), జర్మనీ-నెదర్లాండ్స్‌ (రా.7:30) తలపడ నున్నాయి. ఇంగ్లండ్‌-అర్జెంటీనా మ్యాచ్‌ విజేతతో భారత్‌ సెమీస్‌లో పోటీపడనుంది.
sports
8,306
02-12-2017 08:56:41
అమ్మచేతి వంట అమోఘం: ‘హూలల్లా’ హీరోయిన్
బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపుకోసం అనుక్షణం పరితపించే హీరోయిన్ విద్యాబాలన్... ఈ ‘హూలల్లా’ హీరోయిన్‌కు ఆహారమంటే అమితమైన ప్రీతి. అయితే విద్యాబాలన్ ఇంటిలో వండే ఆహారమంటేనే ఇష్టపడతారు. తన తల్లి స్వయంగా చేసే వంటలు బ్రహ్మాండంగా ఉంటాయని విద్యా చెప్పారు. ఆమె పరాఠాలు, స్టీమ్‌డ్ రైస్, గ్రీన్ కర్రీని రోజూ తీసుకుంటారు. ఫిట్‌నెస్‌ను కాపాడుకునేందుకు తగిన పోషకాహారాన్ని ప్రతీరోజూ తీసుకుంటారు. ఇక ట్రావెలింగ్ సమయంలో మసాలా చాయ్‌ని తాగడం మరచిపోరు. ఇందుకోసం ఆమె ఒక బ్యాగ్‌లో టీ తయారుచేసేందుకు కావలిసిన సామగ్రిని అందుబాటులో ఉంచుకుంటారు. అలాగే షూటింగ్ సమయంలో ఆమె తన అసిస్టెంట్, డైరెక్టర్‌లకు చాక్లెట్, కప్‌కేక్ మొదలైనవి ఇస్తుంటారు. విద్యాబాలన్ డర్టీ పిక్చర్ సినిమాలో ‘హూలల్లా హూలల్లా’ పాటకు అద్భుతంగా అభినయించి ప్రేక్షుకులను మెప్పించారు.
entertainment
4,830
28-07-2017 13:18:08
బాలయ్య స్టంపర్‌పై రానా రియాక్షన్
నందమూరి బాలకృష్ణను సరికొత్త కోణంలో చూపిస్తూ, డైలాగుల్లో వేరియేషన్ చూపించారు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. అంతేకాదు, ప్రమోషన్‌లోనూ సరికొత్త పంథాను అనుసరించారు. టీజర్, ట్రైలర్ మాదిరిగానే ‘స్టంపర్’ అంటూ రిలీజ్ చేశారు. దీనిపై అభిమానుల నుంచి మంచి స్పందనే వచ్చింది. కాగా, పూరీ స్టంపర్‌పై తాజాగా రానా స్పందించారు. ‘‘పూరీ నువ్వు క్రేజీ’’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, పైసావసూల్ స్టంపర్ యూట్యూబ్ లింక్‌ను పోస్ట్ చేశారు.
entertainment
1,237
20-04-2017 23:59:55
ముగింపు నిస్తేజం
తిథి: బహుళ దశమి, నక్షత్రం: చిత్తా నక్షత్రం, పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు అప్రమత్తంగా ఉండాలి. ట్రెండ్‌ మార్పు వేళలు: ఉదయం 10.30 నుంచి 12.30 వరకు బాగుంటుంది. 12.30 తర్వాత ముగింపు నిస్తేజంగా ఉండే అవకాశం ఉంది. ట్రేడింగ్‌ వ్యూహం: ఉదయం 10.30కి ఓపెనింగ్‌ యావరేజ్‌ బాగుంటే లాంగ్‌ తీసుకుని 12.30కి క్లోజ్‌ చేసుకోవాలి. మధ్యాహ్నం 1.30 తర్వాత యావరేజ్‌ సెల్లింగ్‌ ప్రైస్‌ కింద ఉంటే షార్ట్‌ తీసుకుని కవర్‌ చేసుకోవాలి. నిరోధ స్థాయిలు : 9175-9210, మద్దతు స్థాయిలు :9095-9060 గమనిక: ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నికల్‌ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచన. మార్కెట్‌ వాస్తవిక కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. - డా.భువనగిరి అమరనాథశాస్ర్తి www.thefinancialastrologer.blogspot.in
business
20,911
07-06-2017 02:16:32
వోజ్నియాకి అవుట్‌!
మ్లదనోవిచ కూడాపురుషుల క్వార్టర్స్‌ వాయిదాపారిస్‌: సంచలన విజయాలతో క్వార్టర్స్‌కు దూసుకొచ్చి టైటిల్‌పై ఆశలు రేకెత్తించిన ఫ్రాన్స యువ తార క్రిస్టీనా మ్లదనోవిచ సెమీ స్‌కు చేరకుండానే పోరాటం ముగించింది. అలాగే కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న డెన్మార్క్‌ భామ, ప్రపంచ మాజీ నెంబర్‌వన కరోలిన వోజ్నియాకి కూడా క్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టింది. కాగా.. రోలాండ్‌ గారో్‌సలో వర్షం ఆటకు పలుమార్లు అంతరాయం కలిగించడంలో రఫెల్‌ నడాల్‌-కరెనో బుస్టా, నొవాక్‌ జొకోవిచ-డొమినిక్‌ థీమ్‌ మధ్య మంగళవారం జరగాల్సిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచలు రద్దయ్యాయి. ఈ మ్యాచలను బుధవారానికి వాయిదా వేశారు. మహిళల సింగిల్స్‌లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన వర్ష ప్రభావిత మ్యాచలో 13వ సీడ్‌ మ్లదనోవిచ 4-6, 4-6తో టిమియా బాసినస్కీ (స్విట్జర్లాండ్‌) చేతిలో వరుస సెట్లలో చిత్తయింది. మరో క్వార్టర్స్‌లో 11వ సీడ్‌ వోజ్నియాకి కూడా ఓటమిపాలైంది. లాత్వియా సంలచనం జెలెనా వోస్తపెంకోతో జరిగిన పోరులో డెన్మార్క్‌ భామ వోజ్నియాకి 6-4, 2-6, 2-6తో మూడు సెట్లపాటు పోరాడి ఓడింది. పురుషుల క్వార్టర్స్‌ రద్దు: పురుషుల సింగిల్స్‌లో మంగళవారం జరగాల్సిన క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచలు రద్దయ్యాయి. క్వార్టర్స్‌లో తొమ్మిది సార్లు చాంపియన, క్లే కోర్టు కింగ్‌ రఫెల్‌ నడాల్‌తో కరెనో బుస్టా (స్పెయిన) తలపడాల్సి ఉంది. అయితే ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా ఆట సాధ్యం కాలేదు. మరో క్వార్టర్స్‌లో ఆస్ర్టియా యువ సంచలనం డొమినిక్‌ థీమ్‌తో డిఫెండింగ్‌ చాంప్‌, రెండోసీడ్‌ నొవాక్‌ జొకోవిచ (సెర్బియా) తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ కూడా వర్ష ప్రభావానికి గురైంది. వర్షం కారణంగా మంగళవారం పూర్తి స్థాయి ఆట సాధ్యం కాకపోవడంతో బుధవారం జరగాల్సిన ఈ మ్యాచలను ఉదయం 11 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30) ప్రారంభించనున్నారు.పారిస్‌: సంచలన విజయాలతో క్వార్టర్స్‌కు దూసుకొచ్చి టైటిల్‌పై ఆశలు రేకెత్తించిన ఫ్రాన్స యువ తార క్రిస్టీనా మ్లదనోవిచ సెమీ స్‌కు చేరకుండానే పోరాటం ముగించింది. అలాగే కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న డెన్మార్క్‌ భామ, ప్రపంచ మాజీ నెంబర్‌వన కరోలిన వోజ్నియాకి కూడా క్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టింది. కాగా.. రోలాండ్‌ గారో్‌సలో వర్షం ఆటకు పలుమార్లు అంతరాయం కలిగించడంలో రఫెల్‌ నడాల్‌-కరెనో బుస్టా, నొవాక్‌ జొకోవిచ-డొమినిక్‌ థీమ్‌ మధ్య మంగళవారం జరగాల్సిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచలు రద్దయ్యాయి. ఈ మ్యాచలను బుధవారానికి వాయిదా వేశారు. మహిళల సింగిల్స్‌లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన వర్ష ప్రభావిత మ్యాచలో 13వ సీడ్‌ మ్లదనోవిచ 4-6, 4-6తో టిమియా బాసినస్కీ (స్విట్జర్లాండ్‌) చేతిలో వరుస సెట్లలో చిత్తయింది. మరో క్వార్టర్స్‌లో 11వ సీడ్‌ వోజ్నియాకి కూడా ఓటమిపాలైంది. లాత్వియా సంలచనం జెలెనా వోస్తపెంకోతో జరిగిన పోరులో డెన్మార్క్‌ భామ వోజ్నియాకి 6-4, 2-6, 2-6తో మూడు సెట్లపాటు పోరాడి ఓడింది. పురుషుల క్వార్టర్స్‌ రద్దు: పురుషుల సింగిల్స్‌లో మంగళవారం జరగాల్సిన క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచలు రద్దయ్యాయి. క్వార్టర్స్‌లో తొమ్మిది సార్లు చాంపియన, క్లే కోర్టు కింగ్‌ రఫెల్‌ నడాల్‌తో కరెనో బుస్టా (స్పెయిన) తలపడాల్సి ఉంది. అయితే ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా ఆట సాధ్యం కాలేదు. మరో క్వార్టర్స్‌లో ఆస్ర్టియా యువ సంచలనం డొమినిక్‌ థీమ్‌తో డిఫెండింగ్‌ చాంప్‌, రెండోసీడ్‌ నొవాక్‌ జొకోవిచ (సెర్బియా) తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ కూడా వర్ష ప్రభావానికి గురైంది. వర్షం కారణంగా మంగళవారం పూర్తి స్థాయి ఆట సాధ్యం కాకపోవడంతో బుధవారం జరగాల్సిన ఈ మ్యాచలను ఉదయం 11 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30) ప్రారంభించనున్నారు.
sports
21,090
29-09-2017 01:38:49
బెన్‌ స్టోక్స్‌పై సస్పెన్షన్‌ వేటు
లండన్‌ : ఓ నైట్‌ క్లబ్‌లో గొడవపడి న ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. స్టోక్స్‌తోపాటు ఆ గొడవ సమయంలో అతడి పక్కనున్న ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌నూ సస్పెండ్‌ చేస్తున్నట్టు ఇంగ్లండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు గురువారం వెల్లడించింది. మళ్లీ ప్రకటిం చేవరకూ ఈ ఇద్దరినీ ఇంగ్లండ్‌ జట్టుకు ఎంపిక చేయబోమని తెలిపింది. ఈ గొడవకు సంబంధించిన వీడియోను బ్రిటిష్‌ పత్రిక సన్‌ విడుదలజేసింది. అందులో స్టోక్స్‌ ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టడం కనిపించింది. వెస్టిండీస్‌తో బ్రిస్టల్‌లో జరిగిన మూడో వన్డే అనంతరం.. గత సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ఘర్షణ లో స్టోక్స్‌ చేతికి గాయం కూడా అయింది. గొడవకు సంబంధించి పోలీసులు స్టోక్స్‌ను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేయకుండా విడుదలజేసిన సంగతి తెలిసిందే.  గత ఐపీఎల్‌లో బెన్‌ స్టోక్స్‌ను పుణె జట్టు అత్యధిక ధరకు దక్కించుకున్న విషయం తెలిసిందే.
sports
2,659
28-11-2017 00:57:04
ఆటుపోట్లే అయినా.. లాభంలో మార్కెట్‌
 సెన్సెక్స్‌ 45 పాయింట్లు అప్‌ముంబై: భారీ ఎగుడుదిగుడు కదలికల నడుమ సోమవారం మార్కెట్‌ ఒక మోస్తరు లాభాలతో ముగిసింది. చివరి క్షణంలో జరిగిన కొనుగోళ్లు మార్కెట్‌ లాభాల్లో ముగిసేందుకు దోహదపడ్డాయి. ప్రధానంగా భారత రేటింగ్‌ను స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్‌ సంస్థ యథాతథంగా కొనసాగించడం మార్కెట్‌వర్గాలను నిరాశపరిచింది. ఈ కారణంగా ఇండెక్స్‌ల కదలికలు పరిమిత పరిధుల్లోనే కదలాడాయి. అయినప్పటికీ ఈ వారాంతంలో వెలువడనున్న జిడిపి ద్వితీయ త్రైమాసికం గణాంకాలపై ఆశలు ఇన్వెస్టర్లను కొనుగోళ్ల దిశగా నడిపించాయి.  డే కనిష్ఠ స్థాయి నుంచి రికవరీ సాధించిన సెన్సెక్స్‌ చివరికి పాజిటివ్‌గా ముగిసిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధనా విభాగం హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు. అంతర్జాతీయ విపణిలో ఆయిల్‌ సరఫరాలపై సమీక్షకు ఒపెక్‌ సమావేశం కానుండడం, ఫ్యూచర్స్‌ కాంట్రాక్టుల ముగింపు వారం కావడం వల్ల ఇన్వెస్టర్లు పూర్తి స్థాయిలో మార్కెట్‌కు మద్దతు ఇవ్వలేకపోతుండడం నిరోధకంగా పని చేస్తున్నదని అంటున్నారు. చివరి గంట కొనుగోళ్లతో సెన్సెక్స్‌ 45.20 పాయింట్లు లాభపడి 33724.44 వద్ద ముగిసింది. దీంతో వరుస ఏడు సెషన్లలో ఇండెక్స్‌ 919 పాయింట్లు లాభపడినట్టయింది. జూన్‌ 23వ తేదీ తర్వాత ఇండెక్స్‌లు ఇంత దీర్ఘకాలంపాటు లాభాల్లో ట్రేడ్‌ కావడం ఇదే ప్రథమం. నిఫ్టీ ఇంట్రాడేలో 10407.15 పాయింట్ల వరకు వెళ్లినా చివరికి 9.85 పాయింట్ల స్వల్ప లాభంతో 10399.55 వద్ద క్లోజయింది. ఆటుపోట్లతోసాగిన పయనంలో విద్యుత్‌, రియల్టీ, ఇన్‌ఫ్రా, వినియోగ వస్తువులు, యంత్ర పరికరాల విభాగాలకు చెందిన స్టాక్‌లు లాభాలతో ముగిశాయి. సెబి వద్ద అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం శుక్రవారంనాడు దేశీయ సంస్థలు 428 కోట్ల రూపాయల విలువ గల షేర్లను కొనుగోలు చేయగా ఎఫ్‌పిఐలు 416 కోట్ల రూపాయల విలువైన షేర్లు విక్రయించాయి. ఎన్‌టిపిసి 3.13 శాతం లాభంతో అగ్రస్థానంలో నిలువగా యాక్సిస్‌ బ్యాంక్‌, ఔన్‌జిసి, ఎస్‌బిఐ, విప్రో, ఎల్‌ అండ్‌ టి కూడా లాభాల బాటలో నడిచాయి. 1.24 శాతం లాభంతో రియల్టీ ఇండెక్స్‌ అగ్రస్థానంలో నిలవగా పవర్‌, ఇన్‌ఫ్రా, వినియోగ వస్తువుల ఇండెక్స్‌లు కూడా లాభపడ్డాయి.ఎన్‌ఎస్‌ఇలో వాటాలు విక్రయించనున్న ఐడిబిఐ బ్యాంక్‌ ఎన్‌ఎస్‌ఇలో 1.5 శాతం వాటాలను విక్రయించే యోచన ఉన్నట్టు ప్రభుత్వ రంగంలోని ఐడిబిఐ బ్యాంక్‌ ప్రకటించింది. లాభసాటి కాని వ్యాపారాల నుంచి తప్పుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ విక్రయం జరుపుతున్నట్టు తెలిపింది. సోమవారం నాటి బోర్డు సమావేశంలో ఇందుకు అనుమతించినట్టు పేర్కొంది. భారీగా తగ్గిన రుణపత్రాలుప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ విధానం ద్వారా రుణపత్రాలు జారీ చేసి సమీకరించిన నిధుల మొత్తం అక్టోబరు నెలలో 37 శాతం తగ్గింది. వివిధ కంపెనీలు రుణపత్రాల ద్వారా సమీకరించిన నిధుల పరిమాణం 44 వేల కోట్ల రూపాయలకే పరిమితమైంది. దీంతో ఏప్రిల్‌-అక్టోబరు నెలల మధ్య కాలంలో ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ విధానంలో రుణపత్రాలు జారీ చేయడం ద్వారా సమీకరించిన నిధుల మొత్తం 3.68 లక్షల కోట్ల రూపాయలకు చేరింది.
business
9,540
20-10-2017 08:23:09
ప్రేమ దీపాల మధ్య ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి
రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ అంటూ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే చిత్రాన్ని తెరకెక్కించబోతోన్న విషయం తెలిసిందే. తన సినిమా గురించి ఫేస్‌బుక్‌లో పోస్టులతో సంచలనం సృష్టిస్తున్నారు. తన పోస్టులతో సినిమాకు పబ్లిసిటీని కల్పించుకుంటున్నారు. లక్ష్మికి బాగా కనెక్ట్ అయిన వర్మ, దీపావళికి వెలిగించే క్రాకర్స్‌లో అతి ముఖ్యమైన లక్ష్మిబాంబ్ వంటి పెద్ద బాంబ్ లక్ష్మి రూపంలో నెక్స్ట్ ఇయర్ రాబోతుందనే విధంగా ఈ పోస్ట్‌తో వర్మ హింట్ కూడా ఇచ్చిన విషయం విదితమే. అయితే ప్రస్తుతం తన సినిమాకు బాగా సరిపోయే జిఫ్ అంటూ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి కలిసి ఉన్న ఓ ఫోటోను హార్ట్ షేప్‌లో దీపాలను పెట్టి పోస్ట్ చేశారు. దీనిని హరిని కరెన్‌గలా రూపొందించారని.. ఇది తన సినిమాకు బాగా సరిపోతుందని కామెంట్ పెట్టారు.
entertainment
5,853
13-07-2017 16:45:12
అంచనాలు తలకిందులు చేసిన ‘నిన్నుకోరి’!
నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘నిన్నుకోరి’. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుని దూసుకుపోతోంది ఈ సినిమా. ఇది కేవలం క్లాస్‌ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకే నచ్చుతుందనే ఉద్దేశంతో చాలా తక్కువ ధరలకు అమ్మారట నిర్మాతలు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ మంచి కలెక్షన్లు సాధిస్తోంది ఈ సినిమా. ఓవర్సీస్‌లో అతి త్వరలో మిలియన్‌ డాలర్ల వసూలు మార్కును చేరుకోనుంది ఈ చిత్రం. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.18 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. దీంతో ఇప్పటికే బయ్యర్లందరూ లాభాల్లోకి వచ్చేశారట. కొంతకాలంగా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న రచయిత కోనవెంకట్‌కు ఈ సినిమా ఊపిరి పోసింది. ఈ సినిమాకు కోన వెంకట్‌ సహ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
entertainment
2,358
04-05-2017 01:00:02
రూ.2,600 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మూలవిరాట్టు అరెస్ట్‌
న్యూఢిల్లీ: పాతికపైగా బ్యాంకులకు 2,600 కోట్ల రూపాయలకుపైగా రుణాలను ఎగవేసి, మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబై సంస్థ జూమ్‌ డెవలపర్స్‌ ప్రమోటర్‌ విజయ్‌ ఎం చౌధరిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. దేశంలోని అతిపెద్ద బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల అక్రమమళ్లింపు కేసుల్లో ఇదే అతిపెద్దదని చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే అమెరికాలోని కాలీఫోర్నియాలో 1,280 ఎకరాల స్థలాన్ని ఇడి ఇప్పటికే జప్తు చేసింది. సిబిఐ చార్జ్‌షీట్‌ ఆధారంగా ఈ కేసులో మనీలాండరింగ్‌ కోణంపై ఇడి అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. జూమ్‌ డెవలపర్స్‌ నిర్వాకం వల్ల పిఎన్‌బి, కెనరా బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సుమారు 966 కోట్ల రూపాయల మేర నష్టపోయాయి. ఈ కేసులో కీలకపాత్రధారిగా ఉన్న చౌధరి తన పేరున తన బంధువుల పేరున దాదాపు 485 కంపెనీలను ఏర్పాటు చేశారు.
business
11,107
16-11-2017 01:10:48
అమెరికాలో మళ్లీ కాల్పులు.. నలుగురు మృతి
లాస్‌ఏంజల్స్‌, నవంబరు 15: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఉత్తర కాలిఫోర్నియాలోని రాంచో తెహామా రిజర్వ్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు. ఇద్దరు చిన్నారులుసహా 12 మంది గాయపడ్డారు. దుండగుడు పాఠశాలలోకి చొరబడి కాల్పులు జరిపేందుకు యత్నించడంతో విద్యార్థులు గాయపడ్డారు. రంగంలోకి దిగిన భద్రతా దళాలు దుండగుడిని మట్టుబెట్టడంతో విద్యార్థులు ప్రాణాలతో బయటపడగలిగారు. కాల్పులు జరపడానికి దుండగుడు సెమీ ఆటోమెటిక్‌ రైఫిల్‌, రెండు హ్యాండ్‌ గన్లు ఉపయోగించాడని భద్రతాదళాధికారులు చెప్పారు.
nation
10,294
24-05-2017 17:22:01
రకుల్‌.. నువ్వెందుకు హానికరం: అల్లు హీరో ప్రశ్న
‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అనే డైలాగ్‌ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దుమ్మురేపుతోంది. ఈ డైలాగ్‌ ట్రైలర్‌లో విన్న వెంటనే నాగచైతన్యకు కాబోయే భార్య సమంతకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆమె ఎదో సర్ది చెప్పి తప్పించుకుంది. నాగ్‌ కూడా ఆ డైలాగ్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ఇక, ఆ డైలాగ్‌కు సీనియర్‌ నటుడు చలపతిరావు చెప్పిన సమాధానం ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్రను ఉద్దేశించి హీరో అనే డైలాగ్‌ ఇది. సినిమా విడుదలైన తర్వాత హీరో ఈ డైలాగ్‌ ఎందుకన్నాడో అర్థమైపోతుంది. అప్పటివరకు నిరీక్షించే ఓపిక లేక దానికి సమాధానం ఏంటని డైరెక్ట్‌గా రకుల్‌ను అడిగేశాడు యంగ్‌ హీరో అల్లు శిరీష్‌. ‘నువ్వు ఆరోగ్యానికి ఎందుకు హానికరం? నాకు తెలుసుకోవాలని ఉంద’ని రకుల్‌ను ప్రశ్నించాడు శిరీష్‌. దానికి స్పందించిన రకుల్‌.. ‘నేనైతే చాలా తక్కువ హానికరం.. భ్రమరాంభ అయితే చూడాలి’ అని సమాధానమిచ్చింది. ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమాలో రకుల్‌ పాత్ర పేరు భ్రమరాంభ అని తెలిసిందే.
entertainment
13,631
21-02-2017 17:26:52
సయూద్‌కు పాక్ మరో షాక్...
ఇస్లామాబాద్: ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్‌ను ఇప్పటికే గృహనిర్బంధంలో ఉంచిన పాక్ తాజాగా ఆయనకు మరో షాక్ ఇచ్చింది. జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు, ఆయన సంస్థకు చెందిన ఇతర సభ్యులకు కేటాయించిన 44 ఆయుధాల లైసెన్సులను పాకిస్తాన్ ప్రభుత్వం రద్దు చేసింది. సయీద్, ఆయన సంస్థలైన జమాత్ ఉద్ దవా, ఫలహ-ఇ-ఇన్సానత్‌పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఆయుధాల లైసెన్సులను రద్దు చేసినట్టు పంజాబ్ హోం శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. 'భద్రతా కారణాల దృష్ట్యా 44 ఆయుధాల లైసెన్సులను రద్దుచేశాం' అని ఆ అధికారి వివరణ ఇచ్చారు. సయూద్‌ను, ఆయన సంస్థకు చెందిన మరో నలుగురిని జనవరి 30న లాహోర్‌లో 90 రోజుల గృహనిర్బంధంలోకి పాక్ ప్రభుత్వం తీసుకుంది. అనంతరం సయూద్, జేయూడీ, ఎఫ్ఐఎఫ్‌లకు చెందిన 37 మంది సభ్యులను ఎగ్జిట్ కంట్రోల్ జాబితాలో చేర్చింది. యాంటీ టెర్రరిజం యాక్ట్ కింద వీరిని ఆ జాబితాలో చేర్చడంతో వీరు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా దేశాన్ని విడిచి వెళ్లడానికి వీలుండదు. గతంలోనూ 2008లో ముంబై పేలుళ్ల ఘటన అనంతరం సయీద్‌ను పాక్‌ సర్కార్ గృహనిర్బంధంలోకి తీసుకున్నప్పటికీ 2009లో ఆయనను లాహోర్ హైకోర్డు విడిచిపెట్టింది.
nation
20,279
14-03-2017 00:21:54
ఒకే మ్యాచ్‌లో తండ్రీకొడుకుల అర్ధ సెంచరీలు
చందర్‌పాల్‌-త్యాగి అరుదైన ఫీట్‌ జమైకా: క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో తండ్రీకొడుకులు బరిలోకి దిగడమే అరుదు. ఇద్దరూ ఒకే మ్యాచ్‌లో అర్ధ సెంచరీలు చేస్తే అది పెద్ద విశేషమే మరి. వెస్టిండీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ శివనారాయణ్‌ చందర్‌పాల్‌ తన కుమారుడు త్యాగి నారాయణ్‌తో కలిసి కరీబియన్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఈ అరుదైన ఫీట్‌ చేశాడు. సబీనా పార్క్‌ వేదికగా నిర్వహిస్తున్న డబ్ల్యూఐసీబీ ఫ్రొఫెషనల్‌ క్రికెట్‌ లీగ్‌లో జమైకాపై త్యాగి (58), చందర్‌పాల్‌ (57) హాఫ్‌ సెంచరీలు నమోదు చేయడంతో గయానా జట్టు 262 పరుగులు చేసింది. అంతకుముందు గ యానా తరఫున 20 ఏళ్ల త్యాగితో కలిసి చందర్‌పాల్‌ ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. 42 ఏళ్ల చందర్‌పాల్‌ విండీస్‌ తరఫున 164 టెస్ట్‌ల్లో 11,867 పరుగులు చేశాడు.
sports
5,242
26-08-2017 11:08:52
బిగ్ బాస్ హౌస్‌లోకి స్టార్ హీరో.. ఒప్పించిన డైరెక్టర్..?
 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రిన్స్ మహేశ్ బాబు 'స్పైడర్' ప్రచారం నిదానంగా ఊపందుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లోనూ వినూత్న పద్ధతిలో సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు దర్శకుడు మురుగదాస్.         చిన్న చిత్రాలే కాదు... భారీ బడ్జెట్ చిత్రాలు సైతం ఇప్పుడు అన్ని రకాల ప్రచారాల పైనా ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పుడు జనం టీవీలను అతుక్కుపోతుండటంతో, అందులో ప్రసారమయ్యే సీరియల్స్, షోస్ ద్వారా బాలీవుడ్ దర్శకనిర్మాతలు తమ చిత్రాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆ ట్రెండ్ ఇటీవల దక్షిణాదికీ పాకింది. ఎన్టీయార్ హోస్ట్ చేస్తున్న 'బిగ్ బాస్' షో ద్వారా 'నేనే రాజు నేనే మంత్రి' మూవీని రానా, 'ఆనందో బ్రహ్మ' చిత్రాన్ని తాప్సీ, 'అర్జున్ రెడ్డి' సినిమాని విజయ్ దేవరకొండ ప్రచారం చేసుకున్నారు.           అందుకోసం పూణేలోని బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళి మూడు నాలుగు గంటలు గడిపి వచ్చారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'స్పైడర్' ప్రమోషన్ కోసం ప్రిన్స్ మహేశ్ బాబు సైతం 'బిగ్ బాస్ హౌస్'కు వెళ్లబోతున్నాడని తెలుస్తోంది. అయితే... అది తమిళ బిగ్ బాస్ షో కోసమట. 'స్పైడర్' సినిమాను తెలుగుతో పాటు తమిళంలోనూ నిర్మిస్తున్నారు. అక్కడ మహేశ్‌కు పెద్దంత గుర్తింపులేదు కాబట్టి భారీగా పబ్లిసిటీని చేయాలని దర్శకుడు మురుగదాస్ భావిస్తున్నాడట. అందుకనే కమల్ నిర్వహిస్తున్న తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొనేలా మహేశ్‌ను ఒప్పించాడట. కమల్ మీద ఉన్న గౌరవం, ఆయన కూతురు శ్రుతీహాసన్‌తో ఉన్న అనుబంధం కారణంగా మహేశ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. మరి పనిలో పనిగా తెలుగు బిగ్ బాస్ హౌస్‌కు కూడా మహేశ్ వెళితే సూపర్‌గా ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీయార్‌ను, ప్రిన్స్ మహేశ్ బాబును స్మాల్ స్ర్కీన్ లో ఒకే ఫ్రేమ్‌లో చూడడం సినిమా అభిమానులందరికీ పండగే అనడంతో సందేహం లేదు. మరి అది సాధ్యమవుతుందా లేదా అనేది వేచి చూడాలి. మహేశ్‌బాబు గురించి చాలా మందికి తెలియని విషయాలి..  ఎన్టీఆర్‌ను రాజమౌళి అంతమాటన్నాడా..!
entertainment
7,735
10-03-2017 12:14:40
లాగే..లాగే.. అభిమానుల మనసు దోచే..!
పవన్ కల్యాణ్ కాటమ రాయుడు రెండో పాట విడుదలైపోయింది. మిరా..మిరా మీసం అంటూ తొలి సాంగ్‌తో రికార్డుల వేట మొదలుపెట్టిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. రెండో పాటతోనూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. లాగే..లాగే..లాగే..లాగే మనసు లాగే.. నీ వైపే అంటూ అభిమానులందరినీ తనవైపు తిప్పుకొన్నాడు. గురువారం సాయంత్రం విడుదలైన ఈ పాట అప్పుడే మిలియన్ వ్యూస్ దాటిపోయింది. దానికి తగ్గట్టే లైక్స్ కూడా వస్తున్నాయి. ఇప్పటికే లక్ష లైకులను దాటి ముందుకెళుతోంది. రెండో పాట సూపర్‌గా ఉందంటూ పవన్ కల్యాణ్ అభిమానులు తెగ రెచ్చిపోతున్నారు. డీజే టీజర్‌కు వచ్చిన డిస్‌లైకుల ఎఫెక్ట్ ఈ పాటపై లేదు. దీంతో పలువురు అభిమానులు అల్లు అర్జున్‌ అభిమానులపై కామెంట్ చేస్తున్నారు. బన్నీ అభిమానులూ.. ఎక్కడున్నారు.. డిస్‌లైక్‌లు కొట్టే దమ్ములేదా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్లు ఎలా ఉన్నా.. పవన్ అభిమానుల నుంచి రెండో పాటకు అపురూపమైన స్పందన లభిస్తోంది. అనూప్ రూబెన్స్ చక్కటి ట్యూన్స్ ఇచ్చాడని, పాట బాగుందని తెగ పొగిడేస్తున్నారు. దీంతో పాట విడుదలై ఒక్కరోజు కాకముందే 11 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది కాటమరాయుడు రెండో పాట. మొత్తానికి పాట.. లాగే..లాగే పవన్ అభిమానుల మనసు లాగేసే..! పాట కోసం క్లిక్ చేయండి
entertainment
19,910
13-02-2017 17:10:45
చెత్త రికార్డ్ నమోదు చేసిన బంగ్లాదేశ్..
హైదరాబాద్: భారత్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 208 పరుగుల భారీ తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. టీమిండియాపై బంగ్లాదేశ్ జట్టు ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. అయితే బంగ్లా జట్టు ఇప్పటివరకూ పది జట్లపై టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. అందులో తొమ్మిది జట్లపై ఆడిన తొలి టెస్ట్‌లోనే ఒటమిని చవిచూసింది. ఒక్క వెస్టిండీస్ జట్టుపై మాత్రమే ఆడిన తొలి టెస్ట్‌లో విజయాన్ని నమోదు చేయగలిగింది బంగ్లాదేశ్ జట్టు.
sports
4,509
07-03-2017 00:45:12
విద్వేష విష కౌగిలిలో యూఎస్‌
అమెరికాలో భారతీయులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వరంగల్‌కు చెందిన ఓ అమ్మాయిపై దుండగుడు కాల్పులు జరపడంతో ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక ప్రవాస భారతీయుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కాగా, అమెరికాలో వరుసగా భారతీయులపై జాత్యహంకార దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇటీవల దుండగుల కాల్పుల్లో వంశీ, శ్రీనివాస్ కూచిభొట్ల, హర్నీశ్ పటేల్ అమెరికాలో హత్యకు గురైన విషయం తెలిసిందే. అమెరికా సమాజం ఆర్థిక, సామాజిక సంక్షోభంలో కూరుకుపోవడంతో ప్రజా సమూహాల మధ్య, వివిధ జాతీయుల మధ్య, మతస్థుల మధ్య విద్వేష వాతావరణం చోటుచేసుకుంది. నిరుద్యోగానికి కారణం వలస ప్రజలేనని, వారిని వెళ్ళగొడితేనే విధులు, నిధులు అన్నీ తమసొంతం కాగలవని సగటు శ్వేత జాతీయుని ఆకాంక్షగా మారింది. ఈ ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నికైన ట్రంప్‌ ప్రభుత్వం ఎలాంటి చారిత్రక వైపరీత్యాలకు పాల్పడుతోందీ వేచి చూడాలి.- ఫణిభొట్ల అమూల్య, హైదరాబాద్‌
editorial
9,088
01-09-2017 14:30:42
ఇలాగే చేస్తే ఇక తెలుగులో సినిమాలు తీయను: 'అర్జున్‌రెడ్డి' డైరెక్టర్
అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్‌కి ముందే ఎంత వివాదాస్పదమైందో.. అదే రేంజ్‌లో సినిమా బాక్సాఫీస్ దుమ్ము రేపుతోంది. యాంటీ పబ్లిసిటీతో ఈ సినిమా బాగా పాపులారిటీని సంపాదించింది. ఈ సినిమాలోని ముద్దు సీన్‌ పోస్టర్ బస్సుపై అంటించడంతో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వాటిని చింపేయడం.. తాతయ్య చిల్ అంటూ అర్జున్ రెడ్డి సినిమా హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టడం. మధ్యలో రామ్‌గోపాల్ వర్మ ఎంటరై సినిమాకు మరింత క్రేజ్‌ను పెంచడం.. తదితర వివాదాలు నడిచాయి. ఇదంతా సినిమా రిలీజ్‌కు ముందు వ్యవహారం.  సినిమా రిలీజ్ తర్వాత అనసూయ ఆగ్రహం వ్యక్తం చేయడం ఒక ఎత్తైతే.. మహిళా సంఘాలు సినిమాపై వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి. సినిమా థియేటర్లకు వెళ్లి మరీ సినిమా చూడొద్దంటూ అడ్డుకుంటున్నాయి. దీంతో డైరెక్టర్ సందీప్‌ రెడ్డి ఈ విషయంపై సీరియస్‌గా స్పందించారు. మహిళా సంఘాలు ఎందుకు ఇలా సినిమాను అడ్డుకుంటున్నాయో అర్థం కావట్లేదని.. సినిమాను అడ్డుకుంటే తాను ఏం చేయలేనన్నారు. ఇకపై ఇలాగే జరిగితే బాలీవుడ్‌కు వెళ్లి హిందీ, భోజ్‌పురి, కన్నడ భాషల్లో సినిమాలు తీసుకుంటానని సందీప్‌ రెడ్డి మండిపడ్డారు. అక్కడ కూడా అడ్డు తగిలితే ఇండియా వదిలి హాలీవుడ్‌లో సినిమాలు చేస్తానంటూ ప్రకటించారు. భర్త కోసం ఆ యువతి చేసిన సాహసం మరెవరూ చేయరేమో..
entertainment
15,288
16-08-2017 03:02:35
మాట తడబడి.. మధ్యలోనే కూలబడి..
వేడుకల్లో ఒడిసా సీఎంకు అస్వస్థతభువనేశ్వర్‌, ఆగస్టు 15: చూస్తుంటే నలతగా ఉన్నట్లు కనిపిస్తున్నా.. ఓపికంతా కూడదీసుకుని నిలబడ్డారు.. మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు.. ప్రసంగం మొదలుపెట్టాక ఇబ్బందిపడ్డారు. మాట తడబడింది. ఇక ఆయన వల్ల కాలేదు. మధ్యలోనే నిష్క్రమించారు. ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌(71) స్వాతంత్య్ర వేడుకల్లో అస్వస్థతకు గురయ్యారు. భువనేశ్వర్‌లోని మహాత్మాగాంధీ మార్గ్‌లో జెండా ఆవిష్కరణ తర్వాత 15 నిమిషాల పాటు ప్రసంగించిన ఆయన.. నిలబడలేక మధ్యలోనే ముగించారు.
nation
14,132
06-07-2017 03:13:07
భారత్, ఇజ్రాయెల్ ‘సప్త’పది!
7 కీలక ఒప్పందాలపై భారత్‌, ఇజ్రాయెల్‌ సంతకాలుజల సంరక్షణ యజ్ఞానికి ఇజ్రాయెల్‌ సాంకేతిక పరిజ్ఞానంరూ.260 కోట్లతో సంయుక్త పరిశోధన నిధిఎలక్ట్రిక్‌ ప్రొపెల్షన్‌ సిస్టమ్‌ అభివృద్ధికి తోడ్పాటుఉగ్రవాదానికి మద్దతిచ్చేవారి పీచమణుద్దాంఉమ్మడి పోరుకు మోదీ, నెతన్యాహు పిలుపుఇజ్రాయెల్‌ నిజమైన స్నేహితుడు: మోదీమనది స్వర్గంలో నిర్ణయమైన అనుబంధంభారతీయులు ప్రతిభా సంపన్నులు: నెతన్యాహుభారత్‌ పర్యటనకు ఇజ్రాయెల్‌ ప్రధాని ఓకేజెరూసలేం, జూలై 5: భారత్‌, ఇజ్రాయెల్‌ ‘సప్త’పదికి శ్రీకారం చుట్టాయి. వ్యవసాయం, అంతరిక్షం, శాస్త్ర పరిశోధన రంగాల్లో రెండు దేశాల నడుమ ఏడు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇజ్రాయెల్‌ సాంకేతికపరిజ్ఞానాన్ని భారతదేశానికి బదలాయించడమే ప్రధానంగా ఈ ఒప్పందాలు జరిగాయి. ఇజ్రాయెల్‌ను నిజమైన మిత్రుడిగా అభివర్ణించిన ప్రధాని మోదీ, రెండు దేశాల నడుమ బంధాన్ని ‘ఐ ఫర్‌ ఐ’(ఇజ్రాయెల్‌ ఫర్‌ ఇండియా)గా అభివర్ణించి భారత్‌, ఇజ్రాయెల్‌ బంధానికి కొత్త భాష్యం చెప్పారు. మూడు రోజుల పర్యటనకుగాను మంగళవారం ఇజ్రాయెల్‌ చేరుకున్న ప్రధాని మోదీ బుధవారం ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  ‘ప్రపంచశాంతికి ఉగ్రవాదంతో పెనుముప్పు పొంచి ఉంది. ఉగ్రవాదాన్ని ఊడలతోసహా పెకలించివేసేందుకు దృఢసంకల్పం అవసరం. ఉగ్రవాదం ఏ నేలపై ఉన్నా.. ఏ రూపంలో ఉన్నా దాన్ని అంతమొందించాల్సిందే. ఉగ్రవాదంపై చిత్తశుద్ధితో ఉమ్మడిగా పోరాడుదాం’ అని ఇద్దరు నేతలు ప్రతినబూనారు. ఉగ్రవాద నిరోధానికి ఉద్దేశించిన కాంప్రహెన్సివ్‌ కన్వెన్షన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ టెర్రరిజం(సీసీఐటీ)ని త్వరగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియాలో త్వరలో ప్రశాంత వాతావరణం నెలకొంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారంటూ నెతన్యాహుపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్‌, ఇజ్రాయెల్‌ వ్యూహాత్మక భాగస్వాములుగా మారడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని నెతన్యాహు పేర్కొన్నారు. భారత్‌కు రావడం గొప్పగా భావిస్తాభారత్‌లో పర్యటించాలని నెతన్యాహును మోదీ విలేకరుల సమావేశంలోనే ఆహ్వానించారు. కుటుంబసమేతంగా భారత్‌కు రావాలని కోరారు. దీనికి ఇజ్రాయెల్‌ ప్రధాని తక్షణం స్పందించారు. ఇండియాలో పర్యటించడం గొప్పగా భావిస్తానని పేర్కొన్నారు. భారత్‌, ఇజ్రాయెల్‌ బంధం స్వర్గంలో నిర్ణయమైందని వ్యాఖ్యానించారు. మోదీ పర్యటనను అసాధారణమైనదిగా నెతన్యాహు అభివర్ణించారు. ‘భారతీయుల ప్రతిభ పట్ల మాకు అపారమైన విశ్వాసం ఉంది. భారతదేశంలోని ప్రతిభావంతులకు ప్రముఖ భారతీయ గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ నిలువెత్తు నిదర్శనం. అలాగే ఇజ్రాయెల్‌లోనూ ప్రతిభకు కొదవ లేదు.’ అని నెతన్యాహు పేర్కొన్నారు. మోదీ స్ఫూర్తితో యోగా నేర్చుకుంటున్నాయోగాపై మోదీకి ఉన్న అపారమైన ఆసక్తి తనలో స్ఫూర్తిని నింపిందని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఆ స్ఫూర్తితో తాను కూడా యోగాసనాలు వేయడం నేర్చుకోవాలని అనుకుంటున్నానని తెలిపారు. ‘తెల్లవారుజామున తడ ఆసనం వేస్తూ నా తలను కుడి పక్కకు తిప్పగానే నాకు కనిపించే తొలి ప్రజాస్వామ్య దేశం ఇండియా. అలాగే మోదీ వశిష్టాసనం వేస్తూ తలను ఎడమ వైపు తిప్పితే కనిపించే తొలి ప్రజాస్వామ్య దేశం ఇజ్రాయెల్‌ అవుతుంది.’ అని నెతన్యాహు చమత్కరించారు. మోదీ సాబ్‌.. అదే టెంపుల్‌ మౌంట్‌!జెరూసలెంలో ఉండే టెంపుల్‌ మౌంట్‌ను యూదులు, క్రైస్తవులు, ముస్లింలు పవిత్రప్రాంతంగా భావిస్తారు. అంతటి ప్రాశస్త్యమున్న టెంపుల్‌ మౌంట్‌ను ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు, మోదీకి స్వయంగా చూపించి దాని గొప్పతనాన్ని వివరించారు. ఇక ఎక్కడికెళ్లినా తన ఆహార్యం, ప్రసంగాలతో అక్కడి వారిని ఇట్టే ఆకట్టుకునే ప్రధాని మోదీ.. ఇజ్రాయెల్‌ పర్యటనలోనూ దుస్తుల్లో ప్రత్యేకతను చాటుకున్నారు. తొలి రోజు ఇజ్రాయెల్‌లో ఆయన దిగినప్పుడు తెల్లటి సూటు జేబుకు నీలంరంగు రుమాలు అమర్చిఉంది. ఈ రెండు ఆ దేశ జెండాలోని రంగులు కావడం విశేషం! అలాగే, మంగళవారం అక్కడి యాద్‌ వాషెమ్‌ స్మారక మ్యూజియాన్ని సందర్శించినప్పుడు.. సంప్రదాయం ప్రకారం సందర్శకులు ధరించే టోపీని మోదీ ధరించారు. ఆ రెస్టారెంట్‌ నాకు కలిసొచ్చింది!ప్రధాని మోదీకి నెతన్యాహు మంగళవారం రాత్రి తన నివాసంలో డిన్నర్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వంటలు వండే బాధ్యతను టెల్‌అవీవ్‌లో ఇండియన్‌ రెస్టారెంట్‌ నడుపుతున్న రీనా పుష్కరణ్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా నెతన్యాహు 30 ఏళ్ల క్రితం నాటి సంఘటలను గుర్తు చేసుకున్నారు. ‘30 ఏళ్ల క్రితం రీనా పుష్కరణ్‌ నడుపుతున్న రెస్టారెంట్‌కు సారా(నెతన్యాహు భార్య)తో కలిసి ‘డేట్‌’కు వెళ్లాను. ఆ రెస్టారెంట్‌లో భోజనం మహత్తుతో ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు తండ్రినయ్యాను. అందుకే మోదీకి విందు ఇవ్వాలని నిర్ణయించుకోగానే నాకు అదే రెస్టారెంట్‌ గుర్తుకొచ్చింది. వెంటనే రీనాకు వంట బాధ్యతలు అప్పగించాం. ఈసారి ఎలాంటి మహత్తు జరుగుతుందో చూడాలి’ అంటూ వ్యాఖ్యానించారు. మన బంధం ‘ఐ ఫర్‌ ఐ’!అలవోకగా కొత్త పదబంధాలను సృష్టించే ప్రధాని మోదీ.. ఇజ్రాయెల్‌ పర్యటనలోనూ తన జోరు కొనసాగించారు. ‘ఐ ఫర్‌ ఐ’ అన్న పదబంధానికి కొత్త నిర్వచనం ఇచ్చారు. ‘ఐ ఫర్‌ ఐ’ అన్న దాన్ని సహజంగా కంటికి కన్ను అన్న వ్యతిరేకార్థంలో వాడుతారు. కానీ మోదీ.. ‘ఇండియా ఫర్‌ ఇజ్రాయెల్‌’ అని స్నేహపూర్వకంగా నిర్వచించారు. ఇవీ ఏడు ఒప్పందాలు!ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌ పర్యటనలో రెండు దేశాల నడుమ బుధవారం ఏడు కీలక ఒప్పందాలు కుదిరాయి. అవి..రూ.260 కోట్లతో ఇండియా-ఇజ్రాయెల్‌ ఇండిస్ట్రియల్‌ రీసెర్చి, డెవల్‌పమెంట్‌ అండ్‌ టెక్నికల్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌ ఏర్పాటుకు ఎంవోయూపై సంతకాలు చేశాయి. ఈ నిధికి చెరి రూ.130 కోట్లు సమకూరుస్తాయి. రెండుదేశాల శాస్త్రవేత్తలు సంయుక్తంగా శాస్త్ర పరిశోధనలు చేసేందుకు ఈ నిధిని వినియోగిస్తారు.జలసంరక్షణపై రెండు ఒప్పందాలు కుదిరాయి. అతితక్కువ నీటివినియోగంతో అద్భుతాలు సృష్టిస్తున్న ఇజ్రాయెల్‌ భారత్‌లో జలసంరక్షణకు సహకారమందిస్తుంది.వ్యవసాయరంగంలో ఉత్పాదకత పెంచేందుకు 2018 నుంచి 2020 వరకు ఇజ్రాయెల్‌ భారత్‌కు సహకారం అందిస్తుంది.అటమిక్‌ క్లాక్స్‌ రూపకల్పనలో పరస్పరం సహకరించుకొనేందుకు ఒప్పందం కుదిరింది.జీఈవో-ఎల్‌ఈవో ఆప్టికల్‌ లింకు, సూక్ష్మ ఉపగ్రహాలకు ఉపయోగపడే ఎలక్ట్రిక్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో పరస్పర సహకారానికి ఇస్రో, ఇజ్రాయెల్‌ స్సేస్‌ ఏజెన్సీ నడుమ ఒప్పందాలు కుదిరాయి.అత్యుత్తమ నేత మోదీ: రివిలిన్‌నెతన్యాహుతో భేటీకి ముందు మోదీ ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు రూవెన్‌ రివిలిన్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. రెండుదేశాల నడుమ ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకొనేందుకు ఉన్న అవకాశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ‘ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి ఆత్మీయ స్వాగతం పలికారు. ఇది భారతదేశ ప్రజలకు దక్కిన గౌరవం’ అని మోదీ ట్వీట్‌ చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నాయకుల్లో మోదీ ఒకరని రివిలిన్‌ కొనియాడారు.
nation
4,802
07-10-2017 14:32:57
సునీల్‌తో పూరి సినిమా!
పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్. నిజంగా ఆయన స్పోర్టివ్ స్పిరిట్‌కి హ్యాట్సాఫ్ చెప్పాలి. వరుస పరాజయాలు ఎదుర్కొన్నారు. అయినా ఆయన ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూనే ఉన్నారు. ఒకపక్క తనయుడితో మెహబూబా అనే మూవీని తెరకెక్కించే పనిలో ఉన్నారు. 1971లో ఇండియా-పాక్ వార్ సందర్భంగా తలెత్తిన ప్రేమ కథను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా తప్పక హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు పూరి. మరోపక్క కామెడీ హీరో సునీల్‌తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారని టాక్. సునీల్ ప్రస్తుతం వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పూరి-సునీల్ కాంబినేషన్ నిజమైతే.. సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
entertainment
14,682
08-06-2017 01:27:30
సైనిక విమానం కూలి వంద మంది మృతి
100 మందికి పైగా సైనికులు, కుటుంబ సభ్యులు గల్లంతుయాంగన్‌, జూన్‌ 7: మయన్మార్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 100 మందికిపైగా సైనికులు, కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న సైనిక విమానం అండమాన్‌ సముద్రంలో కుప్పకూలిపోయింది. విమానంలో సిబ్బంది సహా 106 మంది ప్రయాణిస్తున్నారని, వారిలో 12మందికి పైగా పిల్లలు ఉన్నారని కమాండర్‌-ఇన్‌-చీఫ్‌ కార్యాలయం ప్రకటించింది. 14 మంది సిబ్బంది కూడా గల్లంతయ్యారు. నావికా దళం ఓడలు, విమానాలతో గాలింపు చేపట్టగా సముద్ర జలాల్లో తేలియాడుతున్న విమాన శకలాలను గుర్తించారు. డావీ నగరానికి 218 కి.మీ. దూరంలో సముద్రంలో విమాన శకలాలు కనిపించగా, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. వై-8ఎఫ్‌-200 అనే ఈ విమానం దక్షిణాది నగరం మెయిక్‌ నుంచి దేశ వాణిజ్య రాజధాని యాంగన్‌కు బయలుదేరింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 1.35 గంటలకు అకస్మాత్తుగా విమానంతో సంబంధాలు తెగిపోయాయి. 18,000 అడుగులు (5.486 మీటర్లు) కంటే ఎత్తులో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మయన్మార్‌లో ఇది రుతుపవనాల కాలమే అయినా, ప్రమాదం సంభవించిన సమయంలో వాతావరణ ప్రతికూలత ఏమీ లేదని అధికారులు తెలిపారు. విమానం అదృశ్యమైన సమాచారంతో నాలుగు నేవీ ఓడలు, రెండు ఎయిర్‌ ఫోర్స్‌ విమానాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు ప్రారంభించాయి. సాయంత్రం అండమాన్‌ సముద్రంలో విమాన శకలాలను కనుగొన్నారు. చైనాలో తయారైన ఈ విమానాన్ని సాధారణంగా మిలిటరీలో సరుకు రవాణా కోసం వినియోగిస్తుంటారు. ఇది గత ఏడాది మార్చిలో సైన్యం చేతికి రాగా, 809 గంటలు ప్రయాణం చేసిందని సైనికాధికారులు తెలిపారు. కాలం చెల్లిన విమానాలు!మయన్మార్‌ సైనిక విమానాల్లో చాలావరకు పాతబడిపోయాయని, దీనికి నిర్లక్ష్యం తోడవడంతో కాలం చెల్లాయని పేరు వెల్లడించడానికి ఇష్టపడని విమానయాన శాఖ మాజీ అధికారి ఒకరు తెలిపారు. ఎయిర్‌ ఫోర్స్‌ ఇటీవల చరిత్ర చూస్తే ఆ అధికారి మాటలు ఎంత నిజమో తెలుస్తుంది. గత ఏడాది ఫిబ్రవరిలో రాజధాని నెపిడాలో టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఎయిర్‌ ఫోర్స్‌ విమానంలో మంటలు చెలరేగి అయిదుగురు సిబ్బంది సజీవ దహనమయ్యారు. జూన్‌లో ఎంఐ-2 హెలికాప్టర్‌ ఒకటి కొండల్లో కూలిపోయి ముగ్గురు ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు.
nation
12,569
06-12-2017 01:47:30
కారుంటే గ్యాస్‌ సబ్సిడీ కట్‌?
న్యూఢిల్లీ, డిసెంబరు 5: మీకు కారుందా? అయితే, త్వరలోనే మీరు వంటగ్యాస్‌ సిలిండర్‌పై సబ్సిడీని వదులుకోవాల్సి రావొచ్చు. ‘నేరుగా నగదు బదిలీ’ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా కేంద్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా 3.6 కోట్ల నకిలీ గ్యాస్‌ కనెక్షన్లను ఏరేసింది. ఇది తొలిదశ మాత్రమే. రెండో దశలో కారు యజమానికి సబ్సిడీ ఎత్తేస్తారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఆర్టీయే కార్యాలయాల నుంచి కారు యజమానుల సమాచారాన్ని తెప్పించారు. వార్షిక ఆదాయం పది లక్షలు దాటిందా లేదా చూస్తున్నారు. ఈ లెక్కల్లో ఎక్కువ మంది ఆదాయాలు పది లక్షలు దాటినట్లయితే వారికి ఒక్కవేటున గ్యాస్‌ సబ్సిడీని ఎత్తేస్తారు. తమకు అంత ఆదాయం లేదని ఎవరైనా నిరూపించుకుంటే మళ్లీ సబ్సిడీని పునరుద్ధరిస్తారు.
nation
12,394
22-03-2017 02:36:33
‘హోం’ నాకే కావాలి!
సీఎం యోగి, డిప్యూటీ సీఎం మౌర్య పట్ట్టు ఢిల్లీకి చేరిన యూపీ శాఖల పంచాయితీ లఖ్‌నవ్‌, మార్చి 21: యూపీలో శాఖల కుమ్ములాట మొదలైంది. కీలకమైన హోంశాఖ తమకే కావాలంటూ ఇటు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అటు ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్‌ మౌర్య పట్టుబడుతున్నారు. దీంతో శాఖల కేటాయింపులో ప్రతిష్టంభన ఏర్పడినట్లు సమాచారం. యూపీలో గత ప్రభుత్వాల కాలంలో శాంతిభద్రతలు అడుగంటాయని బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఆరోపించింది. తమ ప్రభుత్వం శాంతిభద్రతలకు అధికప్రాధానమిస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో హోంశాఖను తన దగ్గరే ఉంచుకోవాలని యోగి భావిస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎంగా ఉన్న తన కే హోంశాఖ కావాలని మౌర్య పట్టుబడుతున్నారు. ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు సీఎం ఆదిత్యనాథ్‌ మంగళవారం ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటీ అయ్యారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు భేటీలో పాల్గొన్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. సీఎం, డిప్యూటీ సీఎం మధ్య తలెత్తిన హోంశాఖ వివాదాన్ని పరిష్కరించడంతోపాటు మిగిలిన మంత్రులకు శాఖల కేటాయింపుపై కూడా పార్టీ పెద్దలు ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిసింది.
nation
1,404
24-04-2017 02:01:49
జీవిత బీమాకు అపూర్వ ఆదరణ
గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో జీవిత బీమా సంస్థలు దూకుడును ప్రదర్శించాయి. 2016-17లో మొత్తం పాలసీల సంఖ్య తగ్గినప్పటికీ కొత్త పాలసీల ప్రీమియంల వసూళ్లు మొత్తం 1,75,022.50 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాదితో పోల్చితే 26.2 శాతం వృద్ధి నమోదు కావటం విశేషం. 2015-16లో జీవిత బీమా సంస్థల ప్రీమియం మొత్తం 1,38,657.31 కోట్ల రూపాయలుగా ఉంది. పాలసీల సంఖ్య 2,67,40,088 నుంచి 2,64,56,645కు తగ్గినప్పటికీ ప్రీమియంల వసూళ్లు మెరుగ్గా ఉండటం విశేషమని బీమా నియంత్రణ, అభివృద్ది మండలి (ఐఆర్‌డిఎఐ) విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుతం భారత జీవిత పరిశ్రమ 36 కోట్ల పాలసీలతో ప్రపంచంలోనే అతిపెద్దదిగా ఉంది. ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి)తో పాటు మొత్తం 24 సంస్థలు దేశీయంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
business
14,297
17-09-2017 12:23:59
చైనాకు దీటైన జవాబిచ్చిన అమిత్ షా
రాంచీ : దేశ సరిహద్దుల్లో అభివృద్ధి చేసుకునే సార్వభౌమాధికారం భారతదేశానికి ఉందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శనివారం అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ఆసక్తి చూపిస్తుండటంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని తప్పుబట్టారు. భారతదేశ విధానాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టంగా చెప్పారన్నారు. మన దేశ సరిహద్దుల్లో అభివృద్ధి చేసుకునే సార్వభౌమాధికారం మనకు ఉందన్నారు. ఆ హక్కును వినియోగించుకుంటామన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సంసిద్దత వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనా శనివారం స్పందిస్తూ చైనా-భారత్ సరిహద్దు వివాదాల్లో మూడో పక్షం జోక్యాన్ని సహించబోమని ప్రకటించింది. తమతో వివాదం ఉన్న ప్రాంతాల్లో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తామని పేర్కొంది.
nation
20,123
08-08-2017 05:09:01
అంపైర్లది ఓవరాక్షన్‌
కొలంబో: రవీంద్ర జడేజాపై ఓ టెస్ట్‌ నిషేధం విధించడాన్ని అంపైర్ల ఓవరాక్షన్‌గా మాజీ కెప్టెన్‌ గవాస్కర్‌ అభివర్ణించాడు. శ్రీలంకతో రెండో టెస్ట్‌లో ఆదివారం ఆటలో కరుణరత్నె క్రీజులో ఉన్నా.. జడేజా అతడిపైకి బంతి విసిరా డు. దీన్ని ఫీల్డ్‌ అంపైర్లు ప్రమాదకర చర్యగా గుర్తించారు. దాంతో ఈ రెండేళ్ల లో అతడి ఖాతాలో మరో ఆరు డీమెరిట్‌ పాయింట్లు చేరడంతో జడేజాపై ఓ టెస్ట్‌ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక తాను తప్పు చేశానని జడేజా అంగీకరిస్తూ.. ‘నేను మంచివాడిగా మారదా మనుకున్న తరుణంలో లోకమంతా చెడ్డదైపోయింది’ అని ఓ హిందీ సినిమాలో డైలాగ్‌ను ఉటంకించాడు.
sports
13,560
21-10-2017 13:59:30
అల్లాని తప్ప వేరే దేవుళ్లను ఆరాధిస్తే... మరో ఫత్వా జారీ!
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేయడాన్ని నిషేధిస్తూ ఇటీవల సంచలన ఫత్వా వెలువరించిన ముస్లిం సంస్థ దారుల్ ఉలూమ్... తాజాగా భారతీయ ముస్లింలకు మరో కొత్త ఫత్వా జారీ చేసింది. ముస్లిం పురుషులు, మహిళలు అల్లాని తప్ప మరే ఇతర దేవుళ్లను ఆరాధించరాదని స్పష్టం చేసింది. ‘‘అల్లాని తప్ప ఎవరైనా ఇతర దేవుళ్లను ఆరాధిస్తే.. వాళ్లు ముస్లింలుగా ఉండబోరు..’’ అని దారుల్ ఉలూమ్ దియోబంద్ పేర్కొంది. కొందరు ముస్లిం మహిళలు దీపావళి సందర్భంగా వారణాసిలో హారతి ఇచ్చిన నేపథ్యంలోనే... శనివారం సదరు ముస్లిం సంస్థ ఈ ఫత్వా జారీ చేయడం గమనార్హం.  కాగా ముస్లిం మహిళలు కనుబొమ్మలను పీకడం, ట్రిమ్మింగ్ చేసుకోవడం, మంచి షేప్ వచ్చేలా తీర్చిదిద్దుకోవడం పైనా ఈ నెల మొదట్లో దారుల్ ఉలూమ్ ఫత్వా జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. ముస్లిం మహిళలు కనుబొమ్మలు పీకడం, జుట్టు కత్తిరించుకోవడం సహా మొత్తం పది అంశాలు ఇస్లాంకి విరుద్ధమంటూ దారుల్ ఇఫ్తా వివరణ ఇచ్చారు.
nation
10,307
09-01-2017 20:30:07
అన్ని వేడుకలకూ అందరూ రావాలని లేదు.. పవన్ రాకపోవడంపై చిరు
హైదరాబాద్: ఖైదీ నెంబర్ 150 ప్రి రిలీజ్ ఫంక్షన్‌కు పవర్ స్టార్ రాకపోవడంపై విస్తృతంగా చర్చ జరుగుతున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘వేడుకకు ఏ మాత్రం అవకాశమున్నా రా బాబాయ్‌’ అని చరణ్‌ పిలిచాడని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించిన చిరంజీవి తెలిపారు. అవకాశాన్ని బట్టి చూస్తానని కల్యాణ్‌ చెప్పాడని, రాకపోయినా ట్వీట్‌ చేశాడని చిరు చెప్పారు. అన్ని వేడుకలకూ అందరూ రావాలని లేదని చిరంజీవి అభిప్రాయపడ్డారు. స్థానికంగా జరిగింది కాబట్టి, తనకు ఆ టైమ్‌లో కుదిరింది కాబట్టి ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ ఫంక్షన్‌కు పవన్ వెళ్లగలిగాడని, సమయం కుదరకే ఖైదీ ఫంక్షన్‌కు రాలేకపోయాడని చెప్పారు. అగ్రెసివ్‌గా వెళ్లడమనేది పవనకల్యాణ్‌ శైలి అని చెబుతూ రాజకీయాల్లో పవన్‌కు అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నట్లు మెగాస్టార్ చెప్పారు.
entertainment
3,169
04-05-2017 01:03:11
పుంజుకున్న పొగాకు కొనుగోళ్లు
ఒంగోలు (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గత ఏడాది మార్చి15 నుంచి ఏప్రిల్‌ నెలాఖరు వరకు 1.2 కోట్ల కిలోల పొగాకు కొనుగోళ్లు జరిగితే, ఈ సంవత్సరం అదే కాలంలో రెండు కోట్ల కిలోల పొగాకు కొనుగోళ్లు జరిగినట్టు పొగాకు బోర్డు ఆక్షన్స్‌ మేనేజర్‌ రవి కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. గత ఏడాది రైతులకు కిలోకు సగటున రూ.131.54 ధర లభించగా, ఈ సంవత్సరం అది రూ.147కు పెరిగిందన్నారు. నెల్లూరు,ప్రకాశం జిల్లాల్లో సాగు చేసే మధ్య, తక్కువ రకం పొగాకు వేలంలో పెద్దగా కొనుగోలు చేయడం లేదన్న విషయాన్ని తెలుసుకునేందుకు రవి కుమార్‌ ఒంగోలు, వెల్లంపల్లి వేలం కేంద్రాలను సందర్శించారు. ఈ సంవత్సరం ఎపిలో 10.4 కోట్ల కిలోల పొగాకు ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్టు చెప్పారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ఎగుమతి అవకాశాలు సరిగా లేకపోవడం వలనే మధ్య, తక్కువ రకం పొగాకుకు సరైన ధర లభించడం లేదన్నారు. అయితే వారం-పది రోజుల్లో మార్కెట్‌ తిరిగి పుంజుకునే అవకాశం ఉందన్నారు.
business
1,094
14-06-2017 00:33:22
సింగరేణి కాలరీస్ పై ఫిర్యాదును కొట్టివేసిని సిసిఐ
న్యూఢిల్లీ: నాన్‌ కోకింగ్‌ కోల్‌ విక్రయాలకు సంబంధించి సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సిసిఎల్‌) నిబంధనలను అతిక్రమిస్తోందంటూ దాఖలైన ఫిర్యాదును కాంపిటీసన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సిసిఐ) కొట్టివేసింది. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎస్‌సిసిఎల్‌పై కర్ణాటక పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (కెపిసిఎల్‌) ఈ కేసు దాఖలు చేసింది. 2007లో తీసుకువచ్చిన జాతీయ బొగ్గు పంపిణీ విధానానికి అనుగుణంగా డిస్ట్రి‌బ్యూషన్‌ సిస్టమ్‌ లింకేజీ కింద ఎస్‌సిసిఎల్‌ నుంచి బొగ్గును కొనుగోలు చేసేందుకు కెపిసిఎల్‌ ఒప్పందం కుదుర్చుకుంది.
business
378
29-09-2017 06:19:26
తక్కువ ధరకు కంప్యూటర్లు..ఐటీ మాల్‌ దసరా ధమాకా
హైదరాబాద్‌ : వినియోగదారులకు తక్కువ ధరకే కంప్యూటర్లను అందించాలనే ఉద్దేశంతో దసరా ధమాకా అమ్మకాలను ప్రారంభించినట్టు ఐటీ మాల్‌ ఎండీ అహ్మద్‌ తెలిపారు. ఖైరతాబాద్‌లోని ఐటీ మాల్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్ని రకాల కంపెనీలకు చెందిన కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌ పరికరాలు ఒకే చోట లభిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఐటీ మాల్‌ను ప్రారంభించామన్నారు. విద్యా ర్థులకు కంప్యూటర్లను ప్రత్యేక రాయితీపై అందిస్తున్నామని, జీరో ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. తమ మాల్‌లో ప్రతి కొనుగోలుపై ఒక స్ర్కాచ్ కార్డు ఇస్తామని, అందులో రూ. 2500 నుంచి రూ. 50 వేల వరకు ఉంటాయన్నారు. వస్తువు కొన్న ప్రతి ఒక్కరికీ గిఫ్ట్‌ కూపన్ అందజేస్తామని, నవంబర్‌ 10న డ్రా తీసి విజేతకు రూ. 5 లక్షల బహుమతి ఇస్తామన్నారు.
business
21,482
28-12-2017 01:41:47
ఇంగ్లండ్‌ దీటుగా...
కుక్‌ అజేయ సెంచరీతొలి ఇన్నింగ్స్‌లో 192/2మెల్‌బోర్న్‌: ప్రస్తుత యాషె స్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ ఆడిన ఆరు ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులు 83 మాత్రమే. దీంతో కొన్నాళ్లుగా తన వైఫల్యంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వేళ అతను నాలుగోటెస్టులో జూలు విదిల్చా డు. సిరీస్‌ ఇప్పటికే 0-3తో ఆసీస్‌కు కోల్పోయినా పరువు కాపాడుకునే ప్రయత్నంలో ఉన్న ఇంగ్లండ్‌ జట్టుకు అజేయ సెంచరీ (166 బంతుల్లో 15 ఫోర్లతో 104 బ్యాటింగ్‌)తో అండగా నిలిచాడు. దీంతో ఆస్ర్టేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 57 ఓవర్లలో రెండు వికెట్లకు 192 పరుగులు చేసింది. ఆసీస్‌కన్నా 135 పరుగులు వెనుకంజలో ఉండగా చేతిలో ఎనిమిది వికెట్లున్నాయి. కుక్‌ కెరీర్‌లో ఇది 32వ శతకం. క్రీజులో అతడికి కెప్టెన్‌ జో రూట్‌ (49 బ్యాటింగ్‌) చక్కటి సహకారం అందిస్తున్నాడు. అంతకుముందు పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ (4/51) నిప్పులు కురిసే బంతులతో చెలరేగడంతో ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఆ తర్వాత బ్రాడ్‌, అండర్సన్‌ (3/61) ధాటికి ఆతిథ్య జట్టు 83 పరుగులకే మిగిలిన ఏడు వికెట్లను కోల్పోయింది. స్టీవ్‌ స్మిత్‌ (156 బంతుల్లో 8 ఫోర్లతో 76), షాన్‌ మార్ష్‌ (148 బంతుల్లో 8 ఫోర్లతో 61) అర్ధ సెంచరీలతో రాణించారు.
sports
9,977
08-04-2017 02:05:46
‘సీతా.. అయాం నాట్‌ ఏ వర్జిన్‌’ దర్శకునికి బెదిరింపులు
హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): యూట్యూబ్‌లో ఇటీవల విడుదలైన ‘సీతా.. అయాం నాట్‌ ఎ వర్జిన్‌’ షార్ట్‌ ఫిల్మ్‌ రోజురోజుకీ మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఈ సినిమా తీసిన డైరెక్టర్‌ కౌశిక్‌బాబు.. వెంటనే సినిమా టైటిల్‌లో సీత పేరు తొలగించాలని హిందూ ఆత్మరక్షణ సమితి కార్యదర్శి, న్యాయవాది మేకల శ్రీనివాస్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ‘డైరెక్టర్‌ వీపు పగలగొట్టిన వారికి రూ.50వేలు.. అతన్ని రాముడి సన్నిధికి పంపిన వారికి 1లక్ష బహుమతిగా ఇస్తాను’’అని ప్రకటించారు. సీత పేరిట ఉన్న ఈ సినిమాకి ట్యాగ్‌లైన్‌ని అసభ్యకరంగా పెట్టారని ఇప్పటికే పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా సికింద్రాబాద్‌, చాణక్యపురికి చెందిన మేకల శ్రీనివా్‌సయాదవ్‌ స్పందించారు. సినిమా కథ.. సీత పేరును అప్రతిష్టపాలు చేసే విధంగా ఉందన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని అన్నారు. కౌశిక్‌బాబు దర్శకత్వంలో, నీర్జా నాయుడు నిర్మాతగా వ్యవహరించిన ఈ షార్ట్‌ఫిల్మ్‌లో దీప్తీ సునయన సీత పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని మార్చి 12న యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. బీజేపీకి చెందిన కొందరు డైరెక్టర్‌ సహా చిత్ర యూనిట్‌పై మార్చి 13న పోలీసు కేసు పెట్టారు.
entertainment
7,470
28-10-2017 14:56:42
సూర్య, భరత్ ఇద్దరూ ఒక్కరోజే రాబోతున్నారు..
సూర్య, భరత్ ఒకేరోజు రాబోతున్నారు. అభిమానులు పండుగ చేసుకోవడమే తరువాయి. సూర్య, భరత్ ఎవరా? అనుకుంటున్నారా? అల్లు అర్జున్ నటించిన 'నాపేరు సూర్య'.. ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన 'భరత్ అనే నేను' మూవీస్. శనివారం జరిగిన ప్రెస్ మీట్‌లో ప్రొడ్యూసర్ బన్ని వాసు.. బన్నీ నటిస్తున్న నాపేరు సూర్య మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. వక్కంతం వంశీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే కొరటాల శివ డైరెక్షన్‌లో మహేశ్ నటిస్తున్న భరత్ అనే నేను సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. అయితే ఈ ఇద్దరి సినిమాలు ఒకేరోజున అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 27న విడుదల కాబోతున్నాయి. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలతో వచ్చే వేసవి మరింత వేడెక్కనుంది.
entertainment
20,578
14-12-2017 01:51:22
ఐవోఏ అధ్యక్షుడిగా బాత్రా!
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) అధ్యక్షుడిగా అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) చీఫ్‌ నరీందర్‌ బాత్రా ఎన్నికకు సర్వం సిద్ధమైంది. గురువారం జరిగే ఐవోఏ సర్వసభ్య సమావేశంలో బాత్రాను లాంఛనంగా ఎన్నుకోనున్నారు. పోటీల్లో ఉన్న ఐటా మాజీ అధ్యక్షుడు అనిల్‌ ఖన్నా తప్పుకోవడంతో బాత్రాకు లైన్‌ క్లియర్‌ అయింది. సెక్రటరీ జనరల్‌గా రాజీవ్‌ మెహతా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికకానున్నా డు. కాగా, ఐవోఏ ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవడానికి ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఎన్నికల నిర్వహణలో స్పోర్ట్స్‌ కోడ్‌ ఉల్లంఘన జరుగుతుందని హైకోర్టులో రాహుల్‌ మెహ్రా అనే న్యాయవాది పిటిషన్‌ వేశాడు.
sports
12,025
05-08-2017 03:03:47
ప్రభుత్వ పథకాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు
లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం... జీఎస్టీ కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్తా: జైట్లీన్యూఢిల్లీ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాలైన భగీరథ, కాకతీయ, డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకం, సాగునీటి ప్రాజెక్టులన జీఎస్టీ నుంచి మినహాయించాలని టీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఎంపీ జితేందర్‌ రెడ్డి లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆయన సభలో మాట్లాడుతూ.. గతంలో ఉన్న పన్నులు, వ్యాట్‌ను అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించిందని, ఇప్పుడు అదనంగా జీఎస్టీ చెల్లించాలంటే భారం పడుతుందన్నారు. కాంట్రాక్టు పనులపై 18 శాతం పన్ను విధించడంతో రాష్ట్ర ఖజానాపై 19,200 కోట్ల భారం పడుతుందని వివరించారు. 18 శాతాన్ని 5 శాతానికి తగ్గిస్తే ఆర్థిక భారం భారీగా తగ్గుతుందని ప్రతిపాదించారు. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ స్పందించాలని డిమాండ్‌ చేశారు. అరుణ్‌ జైట్లీ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కాగా మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ (ఎంఐఎస్‌) పథకం కింద తెలంగాణ మిర్చి రైతులను ఆదుకున్నామని కేంద్ర మంత్రి రాధామోహన్‌ సింగ్‌ రాజ్యసభలో తెలిపారు.
nation