SNo
int64
0
21.6k
date
stringlengths
19
19
heading
stringlengths
3
91
body
stringlengths
6
38.7k
topic
stringclasses
5 values
2,298
26-12-2017 23:33:28
అవకాశాలు ఉపయోగించుకునేందుకు సిద్ధమవుదాం
ఉద్యోగులకు టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ పిలుపున్యూఢిల్లీ : ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతున్నందున ఆ అవకాశాలను ఉపయోగించుకునేందుకు సిద్ధం కావాలని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ టాటా గ్రూప్‌ కంపెనీల ఉద్యోగులకు పిలుపు ఇచ్చారు. మెరుగైన వ్యాపార అవకాశాల కోసం సరళంగా, కలిసికట్టుగా పని చేయాలని టాటా గ్రూప్‌ కంపెనీల్లో పని చేస్తున్న 6.95 లక్షల మంది ఉద్యోగులను కోరారు. ‘ఈ మార్పుతో అనేక అద్భుత అవకాశాలు ఏర్పడుతున్నాయి. అదే సమయంలో అనేక అనిశ్చిత పరిస్థితులూ ఏర్పడే అవకాశం ఉంది’ అన్నారు. 2011 తర్వాత తొలిసారిగా 2018లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నాలుగు శాతం వృద్ధి రేటు అందుకోనుందన్నారు. మళ్లీ ఈ వృద్ధిలో ఎక్కువ భాగం భారత్‌లో లాంటి వర్థమాన దేశాల్లో నమోదు కానుందన్నారు. ఇవన్నీ టాటా గ్రూప్‌ వ్యాపారాలకూ కలిసి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘భారత ఆర్థిక అభివృద్ధిలో టాటా గ్రూప్‌ది ప్రధాన పాత్ర. అంతర్జాతీయ యవనికపైనా ప్రభావశీలమైన పాత్ర పోషిద్దాం’ అని చంద్రశేఖరన్‌ తన సందేశంలో పేర్కొన్నారు.
business
13,420
28-06-2017 02:36:21
హద్దు దాటింది భారతే: చైనా
సిక్కింలో దళాలను వెనక్కి పిలవాలని డిమాండ్‌లేకపోతే మానస సరోవర యాత్ర నిలిపేస్తామని పరోక్ష హెచ్చరికబీజింగ్‌, జూన్‌ 27: ‘దొంగే దొంగా దొంగా’ అన్న చందంగా.. సిక్కింలో హద్దు దాటిన చైనా బుకాయింపులకు దిగింది. వాస్తవాధీన రేఖను దాటింది తమ సైన్యం కాదని.. భారత సైనికులే ఎల్‌ఏసీ(లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌ కంట్రోల్‌)ని దాటారని వాదిస్తోంది. భారత సైనికులు వెంటనే వెనక్కి వెళ్లాని డిమాండ్‌ చేసింది. భారత్‌ తన సైనికులను ఉపసంహరించుకునే దాకా నాథులా కనుమ గుండా కైలాస మానస సరోవర యాత్రికులను అనుమతించేది లేదని పరోక్షంగా హెచ్చరించింది. ఈ విషయమై ఢిల్లీలో, బీజింగ్‌లో దౌత్యవర్గాల ద్వారా భారత్‌కు తమ నిరసన తెలిపినట్టు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లు కాంగ్‌ తెలిపారు. ‘‘మా ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో శషభిషలకు తావులేదు. భారతదేశం కూడా ఈ విషయంలో అందుకు అనుగుణంగా వ్యవహరించి.. చైనా సరిహద్దులు దాటిన తమ సేనలను ఉపసంహరించుకుంటుందని భావిస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘నాథులా కనుమ గుండా కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లే యాత్రికుల విషయానికి వస్తే.. ఇన్నాళ్లూ చైనా ఈ విషయంలో ఎంతగా సహకరించిందో భారత్‌కు తెలుసు. కానీ.. ఇప్పుడు భారత సరిహద్దు దళాలు చైనా సరిహద్దులను దాటి మా నిర్మాణ పనులను అడ్డుకున్నాయి. అందుకే మేం తప్పనిసరి చర్యలు తీసుకున్నాం. వారికి భద్రత కల్పించలేనందునే నాథులా కనుమ గుండా యాత్రను నిలిపివేశాం’’ అన్నారు. సరిహద్దుల అతిక్రమణ విషయంలో భారత్‌ ఏం చేస్తుందో దానికి అనుగుణంగానే తమ చర్యలుంటాయని తేల్చిచెప్పడం ద్వారా.. సిక్కిం సరిహద్దులకు, యాత్రకు లింకు పెట్టారు. సిక్కింలోని ఎల్‌ఏసీపై ఎలాంటి అభ్యంతరాలూ లేవని.. ఈవిషయాన్ని భారత్‌ గతంలో లిఖిత పూర్వకంగా అంగీకరించిందని, ఇప్పుడు ఇలా చేయడం ఏమిటిన రక్షణ శాఖ ప్రతినిధి ప్రశ్నించారు. భారతదేశం సరిహద్దు ఒప్పందాలను, చైనా ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని గౌరవించాలని అన్నారు. మరోవైపు.. చైనీస్‌ మీడియా సైతం ఈ విషయంలో భారత్‌పై విషం కక్కుతోంది. భారత్‌కు సరిహద్దు నిబంధనల గురించి తెలిపేందుకు ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాల్లోనూ ప్రయత్నించాలని చైనాలోని అధికార కమ్యూనిస్టు పార్టీ పత్రిక గ్లోబల్‌టైమ్స్‌ ప్రభుత్వానికి సూచించింది. ‘‘చైనాకు భారత్‌తో ఘర్షణ పడే ఉద్దేశం లేదు. న్యూఢిల్లీలో స్నేహసంబంధాలు బీజింగ్‌ ప్రాథమిక విధానం. కానీ, ఇది పరస్పరం ఉండాలి. చైనా జీడీపీతో పోలిస్తే భారత జీడీపీ కేవలం పావు వంతు. కాబట్టి, చైనాతో స్నేహ సంబంధాలు నెరపడం, సరిహద్దు అంశాల్లో జాగ్రత్తగా ఉండడం భారత్‌ ముందున్న అవకాశాలు’’ అని ఒక వ్యాసంలో పేర్కొంది. అమెరికాతో జట్టు కట్టొద్దు..దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్ఛాయుత నౌకాయానం, అన్ని ప్రాదేశిక, సముద్ర సరిహద్దుల సమస్యలను అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా పరిష్కరించుకోవాలని భారత ప్రధాని మోదీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సోమవారం పిలుపివ్వడంపై చైనా మండిపడింది. తమను దెబ్బతీసేందుకు అమెరికాతో జట్టుకట్టాలనుకోవడం భారత్‌ప్రయోజనాలకు మంచిది కాదని అలీన హోదాను మరచి అమెరికా చేతిలో పావుగా మారితే దక్షిణాసియాలో సరికొత్త సంక్షోభాలు ఎదురవుతాయని హెచ్చరించింది.
nation
8,016
29-11-2017 22:29:16
ఘనంగా దాసరి కిరణ్‌కుమార్‌ పుట్టినరోజు
మంగళవారం సాయంత్రం జరిగిన నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌ పుట్టినరోజు వేడుకల్లో పాల్లొన్న దర్శకుడు బి.గోపాల్‌, సురేశ్‌ వర్మ, ఎస్‌. గోపాల్‌ రెడ్డి, పరుచూరి సోదరులు, రక్షిత్‌ తదితరులు
entertainment
1,372
27-06-2017 23:47:46
గాలికి ఎదురీదిన స్పైస్‌జెట్‌
ఫలించిన అజయ్‌ సింగ్‌ మేజిక్‌రెండేళ్ల క్రితం కేవలం 22 లక్షల డాలర్ల ఇంధన బిల్లులు చెల్లించలేక చేతులెత్తేసిన భారతీయ ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ స్పైస్‌జెట్‌ ఇప్పుడు 2,600 కోట్ల డాలర్లతో 250 కొత్త విమానాల కొనుగోలుకు రెడీ అయింది. మూడేళ్ల క్రితం దాదాపు నేలమట్టమైన షేరు ధర ధగధగలాడుతోంది. విమానాల కొనుగోలు కోసం అమెరికా కంపెనీ బోయింగ్‌, బొంబార్డియర్‌లకు స్పైస్‌జెట్‌ ఇచ్చిన ఆర్డర్‌ ఇప్పుడు అక్కడ వేల సంఖ్యలో ఉద్యోగాలను కల్పించనుంది. ఇంత భారీ ఆర్డర్లలను తమ కంపెనీలకు ఇచ్చి ఉద్యోగాల సృష్టికి దోహదం చేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా స్పైస్‌జెట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని భారతీయులపై అక్కసు వెళ్లగక్కి, వీసాలను కఠినతరం చేసిన ట్రంప్‌ ఇప్పుడు స్పైస్‌జెట్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. రెండున్నర ఏళ్ల కాలంలోనే స్పైస్‌జెట్‌ ఈ అసాధారణమైన టర్న్‌ఎరౌండ్‌ను ఎలా సాధించింది. ఈ విజయం వెనక ఎవరున్నారు? రెండున్నర ఏళ్ల క్రితం స్పైస్‌జెట్‌ ఆర్థిక పరిస్థితిని చూసినవారెవ్వరూ ఈ స్థాయిలో సంస్థ టర్న్‌ఎరౌండ్‌ సాధిస్తుందని ఊహించలేదు. ఈ అసాధారణ విజయం వెనక ఉన్న కీలక వ్యక్తి, మెజార్టీ వాటాదారు అజయ్‌ సింగ్‌ అని మార్కెట్‌ వర్గాలు చెబుతాయి. అజయ్‌ సింగ్‌ ప్రయత్నాలకు గత రెండేళ్లుగా కనిష్ఠ స్థాయిలో ఉన్న ముడి చమురు ధరలు కూడా కలిసివచ్చాయి. భారీ స్థాయిలో మూలధనాన్ని సమకూర్చడంతో పాటు, నష్టాల్లో ఉన్న రూట్ల నుంచి సర్వీసులను ఉపసంహరించడం, కొత్త సామర్ధ్యాలను సమకూర్చుకోవడం ద్వారా స్పైస్‌జెట్‌ను అజయ్‌సింగ్‌ మళ్లీ సమున్నతంగా నిలబెట్టగలిగారు. నిజానికి స్పైస్‌జెట్‌గా ఇప్పుడు కనిపిస్తున్న కంపెనీకి దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది. దేశంలో విమానయాన రంగంలో ప్రైవేట్‌ సంస్థలకు తలుపులు తెరిచిన తొలనాళ్లలోనే ఈ రంగంలోకి ఈ సంస్థ అడుగుపెట్టింది. మోడీలుఫ్త్‌, రాయల్‌ ఎయిర్‌వేస్‌ ఆ తర్వాత 2005లో స్పైస్‌జెట్‌గా పేర్లు మార్చుకుంటూ వచ్చింది. ఈ ప్రస్థానంలో ప్రమోటర్లు కూడా మారుతూ వచ్చారు. 2005లో అజయ్‌ సింగ్‌, లండన్‌కు చెందిన ప్రవాస భారతీయ వ్యాపారి భులో కన్సాగ్ర భారీ ఎత్తున మూలధనాన్ని సమకూర్చి అప్పటికే మూలబడిన రాయల్‌ ఎయిర్‌వే్‌సను టేకోవర్‌ చేసి స్పైస్‌జెట్‌ పేరుతో పునరుద్ధరించారు. 2010లో ఇద్దరూ కంపెనీ నుంచి తప్పుకున్నారు. 2014లో కంపెనీ మళ్లీ కష్టాల్లో పడింది. లీజు సంస్థలు కొన్ని విమానాలు తీసేసుకున్నాయి. జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి. మరోవైపు ఆయిల్‌ కంపెనీల నుంచి బిల్లుల చెల్లింపునకు ఒత్తిళ్లు... ఈ దెబ్బతో సర్వీసులను రద్దు చేసి స్పైస్‌జెట్‌ చేతులెత్తేసింది. షేరు ధర కనీస స్థాయికి పడిపోయింది. ఈ సమయంలోనే అజయ్‌ సింగ్‌ మళ్లీ రంగంలోకి వచ్చారు. 500 కోట్ల డాలర్ల ఇన్వె్‌స్టమెంట్‌తో మళ్లీ గాలిలోకి లేపే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం నుంచి సహకారం లభించింది. మరోవైపు విమానయాన రంగంలోనూ ట్రాఫిక్‌ పెరిగింది. అజయ్‌ సింగ్‌ వ్యూహం ఫలించింది. 2014 డిసెంబర్‌తో పోలిస్తే స్పైస్‌జెట్‌ షేరు ధర ఎనిమిది రెట్లు పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచే లెక్కిస్తే 124 శాతం లాభపడింది. ప్రస్తుతం షేరు ధర 124 రూపాయల స్థాయిలో ఉంది. ఈ స్థాయిలో కూడా షేరు ఆకర్షణీయంగానే ఉందని విశ్లేషకుల అభిప్రాయం. భారత్‌లో విమానయాన రంగం శరవేగంతో దూసుకుపోతున్నది. చిన్న చిన్న పట్టణాల్లోనూ ఎయిర్‌పోర్టులు వచ్చేస్తున్నాయి. రైళ్లు బస్సుల కంటే ఇప్పుడు విమానయానమే బెటర్‌ అనే పరిస్థితిని ప్రభుత్వమే సృష్టిస్తోంది.
business
16,594
28-09-2017 13:49:59
‘బిగ్ బాస్‌‌’లో పెను సంచలనం
ముంబై : సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 11 కోసం అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వచ్చే నెల 1 నుంచి అందరినీ అలరించేందుకు బుల్లి తెర ముస్తాబవుతోంది. దీనిలో పాల్గొనే మొదటి నలుగురి పేర్లను ప్రకటించారు. ఈ సీజన్‌ బిగ్ బాస్‌ థీమ్ పడోసీ. నలుగురు పడోసీల పేర్లు ఏమిటంటే...పాట్నాలోని మసౌడీకి చెందిన జ్యోతి కుమార్, నోయిడాకు చెందిన శివానీ దుర్గా (ఆధ్యాత్మిక గురువు), న్యూఢిల్లీకి చెందిన సప్నా చౌదరి (సుప్రసిద్ధ హర్యానా రంగస్థల నృత్యకారిణి), జుబెయిర్ ఖాన్ ( అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్‌కు అల్లుడు).
nation
11,919
05-10-2017 15:11:39
‘ఉన్నో’ళ్ళకే కలిసొచ్చింది : ఫోర్బ్స్
న్యూఢిల్లీ : భారతదేశంలో ధనవంతులు మరింత ఎక్కువ సంపదను సొంతం చేసుకుంటున్నారు. ఆర్థిక వ్యవస్థలో ఒడుదొడుకుల బాధలు వారిని తాకడం లేదు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ‘ఇండియా రిచ్ లిస్ట్ 2017’ నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముఖేశ్ అంబానీ వరుసగా పదో సంవత్సరం భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆయన వ్యాపార సామ్రాజ్యం నికర విలువ రూ.2.5 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది కన్నా 67 శాతం సంపద పెరిగింది. దీంతో ఆయన ఆసియాలోని మొదటి ఐదుగురు ధనవంతుల్లో ఒకరయ్యారు. దేశంలోని 100 మంది ధనవంతుల సంపదలో 26 శాతం పెరుగుదల నమోదైంది. విప్రో చీఫ్ అజీం ప్రేమ్‌జీ గత ఏడాది కన్నా రెండు స్థానాలు ఎగబాకి ఈ ఏడాది రెండో స్థానంలో నిలిచారు. ఆయన నికర సంపద రూ. 1.23 లక్షల కోట్లు. గత ఏడాది రెండో స్థానంలో ఉన్న దిలీప్ సంఘ్వి (సన్ ఫార్మా) ఈ ఏడాది 9వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో అనిల్ అంబానీ 45వ స్థానంలో ఉన్నారు. గత ఏడాది ఆయన 32వ స్థానంలో ఉండేవారు. యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సీఈఓ ఆచార్య బాలకృష్ణన్ గత ఏడాది కన్నా ఎక్కువ సంపన్నుడయ్యారు. గత సంవత్సరం ఆయన ఈ జాబితాలో 48వ స్థానంలో ఉండేవారు, ఈ సంవత్సరం 19వ స్థానానికి ఎదిగారు. ఆయన సంపద రూ.43,000 కోట్లకు చేరింది.దేశంలో ఆర్థిక ఒడుదొడుకులు ఉన్నప్పటికీ, ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2017లో ఉన్న సంపన్నుల సంపద 26 శాతం పెరిగింది. వీరి మొత్తం సంపద రూ.31 లక్షల కోట్లకు పెరిగింది.
nation
16,549
20-06-2017 01:44:15
గిన్నిస్‌లో యోగా చైన్‌
యోగా దినోత్సవ సన్నాహకాలలో భాగంగా వేలాదిమందితో నిర్వహించిన యోగా చైన్‌ ఇది. వేలాది మంది విద్యార్థులతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద యోగా చైన్‌గా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కింది. కర్ణాటకలోని మైసూరు ప్యాలెస్‌ ఈ అరుదైన ఘనతకు వేదికైంది. -మైసూరు
nation
854
21-04-2017 03:34:44
మూడేళ్లలో బిఎస్‌ 6 ఇంధనం
రిఫైనింగ్‌లో భారత్ కింగ్‌  మరో వందేళ్లు మనదే హవా రిఫైనరీ టెక్నాలజీ సదస్సులో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం దేశమంతటా అత్యున్నత ప్రమాణాలు కలిగిన బిఎస్‌-4 ఇంధనాన్ని సరఫరా చేస్తున్నామని, 2020 నాటికి అంతకంటే మించిన నాణ్యతా ప్రమాణాలున్న బిఎస్‌-6 ఇంధనం అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన ప్రకటించారు. గురువారం విశాఖపట్నంలో రిఫైనరీ టెక్నాలజీ మీట్‌-2017ను ఆయన ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 900 మందికిపైగా శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు, సలహాదారులు పాల్గొంటున్నారు. చమురు, సహజవాయువుల మంత్రిత్వ శాఖ సారథ్యంలోని సెంటర్‌ ఫర్‌ హై టెక్నాలజీ ఈ సదస్సును హెచ్‌పిసిఎల్‌ సహకారంతో నిర్వహిస్తోంది. ముడి చమురును శుద్ధి చేయడం (రిఫైనరీ)లో భారత విశేషమైన ప్రగతి సాధించిందని, ఈ కాలాన్ని ‘‘రిఫైనరీ కాలం’’గా అభివర్ణించవచ్చునని పేర్కొన్నారు. మరో వందేళ్ల వరకు భారతదేశమే ఇందులో నంబర్‌వనగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రస్తుతం ఏడాదికి 23 కోట్ల టన్నుల క్రూడాయల్‌ను శుద్ధి చేస్తున్నామని, 2040 నాటికి దీన్ని 48 కోట్ల టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రిలయన్స ఇండసీ్ట్రస్‌ భవిష్యత్తులో గుజరాతను పెట్రో హబ్‌గా మారుస్తుందన్నారు. సొంత అవసరాలకే కాకుండా పొరుగు దేశాలైన నేపాల్‌కు కూడా పెట్రో ఇంధనాలు సరఫరా చేస్తున్నామని, త్వరలో థాయ్‌లాండ్‌, ఇండోనేషియా వంటి దేశాల్లో రిఫైనరీలు ఏర్పాటు చేసే అవకాశం వుందన్నారు. వీటికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయన్నారు. పెట్రో ఇంధనాల వినియోగంలో భారత మూడో స్థానంలో వుందని, రిఫైనరీ రంగంలో మనది నాలుగో స్థానమని చెప్పారు. బిఎస్‌-6 ఇంధన కోసం 1400 కోట్ల డాలర్లను వెచ్చిస్తున్నామన్నారు. విశాఖలో జరుగుతున్న సదస్సు రిఫైనరీ రంగంలో కొత్త ఆలోచనలకు జీవం పోస్తుందన్నారు. పెట్రో ఇంధనాలు ప్రస్తుతం మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, వాటిని సామాన్య ప్రజలు కూడా విరివిగా వినియోగించుకునే ధరల్లోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ప్రధాన్‌ ప్రకటించారు.
business
17,018
21-03-2017 02:20:55
జీవితకాలం పాటు నిషేధమే!
న్యూఢిల్లీ, మార్చి 20: నేర చరితులూ పారాహుషార్‌! తీవ్రమైన నేరాల్లో నిందితులుగా ఉన్నారా!? మీ కేసులు కోర్టుల్లో విచారణలో ఉన్నాయా!? వాటిలో దోషులుగా తేలితే మీ పని ఇక అంతే! జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉండాల్సిందే! ఎన్నికల్లో పోటీ చేయడంపై పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందే! ఎన్నికల్లో పోటీకి జీవితాంతం అనర్హులుగా మారిపోతారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రతిపాదించింది. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. తీవ్రమైన నేరాల్లో దోషులుగా తేలిన వ్యక్తులు జీవిత కాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని ప్రతిపాదించింది.  నిజానికి, ప్రస్తుత ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, రెండేళ్లు అంతకంటే ఎక్కువ సంవత్సరాలు శిక్ష పడిన దోషులు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం అమల్లో ఉంది. దీనిని ఆరేళ్లకే పరిమితం చేయకుండా, జీవితకాలం నిషేధం విధించాలని ఎన్నికల కమిషన్‌ ప్రతిపాదిస్తోంది. అలాగే, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా, ప్రజా ప్రతినిధులకు సంబంధించిన క్రిమినల్‌ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించింది. వాటి ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో సోమవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. శాసన, న్యాయ, పాలన వ్యవస్థల్లోని సభ్యులపై దాఖలైన క్రిమినల్‌ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కోరుతూ ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి, న్యాయవాది అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్న అశ్వినీ కుమార్‌ వినతికి తాము ‘వ్యతిరేకం’ కాదని ఈసీ తన అఫిడవిట్లో స్పష్టం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుల విచారణ ఏడాదిలోపులో పూర్తి చేసి, వాటిలో దోషులుగా తేలిన వారిని రాజకీయ ప్రక్రియ నుంచి జీవిత కాలం నిషేధించాలని పిటిషనర్‌ కోరారని, అందుకు కూడా తాము వ్యతిరేకం కాదని తేల్చి చెప్పింది. పిల్‌తోపాటు అందులో పిటిషనర్‌ కోరిన విజ్ఞప్తులకూ తాము వ్యతిరేకం కాదని, వాటిని పూర్తిగా సమర్థిస్తున్నామని స్పష్టం చేసింది. కాగా, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హత ఉండాలని; చట్ట సభ సభ్యులకు వయో పరిమితి ఉండాలన్న అంశాలపైనా ఈసీ స్పందించింది. ఆ రెండూ శాసన వ్యవస్థ పరిధిలోనివని, వాటిని అమలు చేయాలంటే రాజ్యాంగంలో సవరణలు చేయాల్సి ఉంటుందని వివరించింది. పిటిషనర్‌ పేర్కొన్న వివిధ అంశాలకు సంబంధించి తాము ప్రభుత్వంలోని శాసన వ్యవస్థ, న్యాయ శాఖ కార్యదర్శితో పలుసార్లు సమావేశమయ్యామని, చర్చలు జరిపామని, లా కమిషన్‌ తన నివేదికల్లో పొందుపరిచిన అత్యధిక సిఫారసులను ఆమోదించామని వివరించింది. తమ ప్రతిపాదనలు, సిఫార్సుల్లో అత్యధికం ఏళ్ల తరబడి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో ఉన్నాయని, ఇప్పటి వరకూ వాటికి ఆమోదం తెలపలేదని అఫిడవిట్‌లో ఈసీ వివరించింది. రాజ్యాంగం, చట్టం పరిధిలో రాజకీయాలను నేర రహితం చేయాలని తాము ఎప్పటి నుంచో పోరాడుతున్నామని తెలిపింది. ఎన్నికల సంస్కరణలు, రాజకీయాలను నేరరహితం చేయడానికి సంబంధించి తమ ప్రతిపాదనలు, సిఫార్సులు సుదీర్ఘకాలంగా ప్రభుత్వం వద్ద పెండింగులో ఉండడంపై విచారం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌ మళ్లీ శుక్రవారం విచారణకు రానుంది. కాగా, రాజకీయ నాయకులతోపాటు దోషులుగా తేలిన పబ్లిక్‌ సర్వెంట్లు, న్యాయ వ్యవస్థ సభ్యులు కూడా మళ్లీ ఆయా వ్యవస్థల్లోకి ప్రవేశించకుండా నిషేధం విధించాలని కూడా ఈసీ ప్రతిపాదించింది. న్యాయ, పాలనా వ్యవస్థలోని సభ్యులు కూడా పదవులు చేపట్టడానికి అనర్హులుగా ప్రకటించాలని సూచించింది. వారిపై దాఖలైన కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేయాలని అఫిడవిట్లో పేర్కొంది.
nation
7,992
08-12-2017 22:28:45
ఎప్పుడూ... ‘నిన్నే చూస్తు’!
‘‘లేడీ ప్రొడ్యూస్‌ చేస్తున్న ‘నిన్నే చూస్తు’ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది’’ అని సీనియర్‌ నటి సుహాసిని అన్నారు. శ్రీకాంత్‌, హేమలత జంటగా వీరభద్ర క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతోన్న చిత్రానికి ‘నిన్నే చూస్తు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కె.గోవర్ధనరావు దర్శకుడు. నిర్మాత హేమలతారెడ్డి మాట్లాడుతూ ‘‘తొలి షెడ్యూల్‌ని హైదరాబాద్‌, అమలాపురం పరిసరాల్లో చిత్రీకరిస్తున్నాం. కథకు చక్కగా సరిపోయే టైటిల్‌ ‘నిన్నే చూస్తు’ అని అన్నారు.
entertainment
9,867
22-03-2017 17:27:05
సన్నీ రివెంజ్ తీర్చుకుందట!
హాట్ సీన్లకే కాదు.. డాన్స్‌లోనూ ఇరగదీస్తానని పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ అంటోంది. తొలుత డాన్స్ రాక చాలా ఇబ్బంది పడిందట ఈ భామ. అయితే.. డాన్స్‌లోనూ ప్రావీణ్యం సాధించింది ఈ పోర్న్ స్టార్. అయితే ఆ కష్టానికీ ఓ కారణముందంటోంది. రయీస్ సినిమాలో షారూక్‌తో ఓ స్పెషల్ సాంగ్ చూసిన ఈ హాట్ బ్యూటీ.. ఇప్పుడు స్పెషల్ సాంగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందిట. షారూక్ సహా ఇతర స్టార్ హీరోలు సన్నీలియోన్ కోసం ఆరాటపడుతున్నారట. ఆమె హాట్ యాక్టింగ్‌కు తోడు డాన్స్‌లో ప్రావీణ్యం సంపాదించడం వెనక ఎంతో కసి దాగి ఉందట. ఈ విషయాన్ని రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన డాన్సును చూసిన వాళ్లు ఎగతాళి చేశారట. అయితే ఈ విషయంలో తాను మిగతా వారి కన్నా ఎక్కువేనని చాటేలా పట్టుదలకు పోయి మరి కసిగా డాన్స్ నేర్చుకుందట. అంతేకాదు.. ఓ డాన్స్ మాస్టర్‌ను పెట్టుకుని మరీ స్టెప్పులు నేర్చేసుకుందట. ఇప్పుడు సినిమాల్లో డాన్సులు చేస్తుండడంతో అలవాటైపోయిందట. ఎంత కష్టమైన స్టెప్పులైనా సరే.. ఇట్టే చేసేస్తుందట. ఇంకా చెప్పాలంటే తాను చేస్తున్న డాన్స్ స్వీట్ రివెంజ్‌లో భాగమేనని మురిసిపోతోందట ఈ హాట్ స్టార్. సెక్సీ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ డాన్స్ స్టార్‌గా పేరు సంపాదించడం వెనక ఎంతో శ్రమ, కసి ఉన్నాయని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది. మరి డాన్సులపై తనను అవహేళన చేసిన ఆ స్టార్ ఎవరన్నది.. మున్ముందు ఎప్పుడైనా సన్నీ రివీల్ చేస్తుందేమో చూడాలి.
entertainment
938
06-07-2017 23:47:24
హైదరాబాద్‌లో అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ సెంటర్‌
కల్యాణి గ్రూప్‌, ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ ఒప్పందంహైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌లో అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌ సిస్టమ్స్‌ మెయింటెనెన్స్‌ సెంటర్‌ను నెలకొల్పేందుకు భారత్‌ ఫోర్జ్‌ అనుబంధ సంస్థ.. కల్యాణి స్ట్రాటజిక్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (కెఎస్ఎస్ ఎల్‌), ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ (ఐఎఐ) అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌ పర్యటనలో భాగంగా భారత్‌ ఫోర్జ్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాబా కల్యాణి, ఐఎఐ ప్రెసిడెంట్‌, సిఇఒ జోసెఫ్‌ వీస్‌ ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు. భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా ప్రిసైజ్‌ అమ్యూనిషన్‌ సిస్టమ్స్‌ అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్‌ కోసం సంయుక్తంగా కార్యకలాపాలను విస్తరించాలని ఇరు కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ఎంపిక చేసిన ఎయిర్‌ డిఫెన్స్‌ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీ కోసం జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేయాలని కెఎస్ఎస్ ఎల్‌, ఐఎఐ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మేకిన్‌ ఇండియాకు అనుగుణంగా ఇజ్రాయెల్‌తో టెక్నాలజీ ఆధారిత భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు భారత్‌ ఫోర్జ్‌ సిఎండి బాబా కల్యాణి అన్నారు. భారతీయ రక్షణ రంగానికి మద్దతునిచ్చే విధంగా ప్రపంచ స్థాయి సొల్యూషన్స్‌ను దేశీయంగా ఉత్పత్తి చేయనున్నటుల ఆయన చెప్పారు. కొన్నేళ్లుగా భారత్‌ తమకు కీలకమైన మార్కెట్‌ కావటంతోపాటు మేకిన్‌ ఇండియాకు అనుగుణంగా కల్యాణి గ్రూప్‌తో జట్టు కట్టినట్లు ఐఎఐ ప్రెసిడెంట్‌ జోసెఫ్‌ వీస్‌ తెలిపారు.
business
9,205
04-09-2017 16:26:08
టీజర్‌ను మించిపోయిన రాయ్ లక్ష్మి ‘జూలీ-2’ ట్రైలర్
లక్కీ లక్కీ రాయ్.. అంటూ ఆడిపాడిన ఐటెం భామ రాయ్ లక్ష్మి ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలో బోల్డ్‌గా నటిస్తోంది. దీపక్ శివదాసని దర్శక నిర్మాణంలో తెరకెక్కుతున్న జూలీ-2 సినిమాలో రాయ్ లక్ష్మి టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌‌ను తాజాగా విడుదల చేశారు. ఇటీవల విడుదలైన టీజర్‌తో కుర్రకారును ఆకట్టుకున్న రాయ్ లక్ష్మి తాజాగా విడుదలైన ట్రైలర్‌తో యూత్‌ను హీటెక్కిస్తోంది. టీజర్‌ను మించిపోయేలా ట్రైలర్ ఉంది. ‘కాంచనమాల కేబుల్ టీవీ’ ద్వారా టాలీవుడ్‌కు పరిచమైన రాయ్ లక్ష్మి.. జూలీ-2 ద్వారా బాలీవుడ్ అరంగేట్రం చేయబోతోంది. నేహా ధూపియా టాప్‌లెస్ సీన్లు చేసిన ‘జూలీ’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘జూలీ-2’ సినిమాలో బోల్డ్‌గా నటించి బాలీవుడ్ జనాలను ఆకట్టుకునేందుకు రాయ్ లక్ష్మి ప్రయత్నిస్తోంది. బాలీవుడ్‌, అండర్‌వరల్డ్, పాలిటిక్స్‌లోని చీకటి కోణాలను బయటపెట్టేలా ఈ సినిమా కథ ఉన్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాస్టింగ్ రితి అగ్నిహోత్రి, ఆదిత్య శ్రీవాత్సవ, రవికిషన్, పంకజ్ త్రిపాఠీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా రాయ్ లక్ష్మికి ఏ మాత్రం పేరు తీసుకొస్తుందో చూడాలి. అక్టోబర్ 6న ఈ సినిమా విడుదల కానుంది.
entertainment
4,521
11-01-2017 03:25:00
బేషరతుగా విడుదల చేయాలి
తెలంగాణ ప్రజాస్వామిక వేదిక (టీడీఎఫ్‌) నిజనిర్ధారణ బృంద సభ్యులను గత డిసెంబర్‌ 26న ఛత్తీస్‌గఢ్‌ ప్రత్యేక ప్రజాభద్రతా చట్టం కింద కేసు నమోదు చేసి ప్రభుత్వాలు కుట్రపూరితంగా నిర్బంధించాయి. సాయుధ బలగాలు ఆదివాసులపై కొనసాగిస్తున్న దమననీతిని వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్న హక్కుల కార్యకర్తలపై, జర్నలిస్టులపై న్యాయవాదులపై ఈ విధమైన నిర్బంధం అమలుచేయడాన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు. టీడీఎఫ్ నిజనిర్ధారణ బృంద సభ్యులు ఏడుగురిని బేషరతుగా విడుదల చేయాలని నేడు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని బహీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో బహిరంగ సభ జరుగుతుంది.- తెలంగాణ ప్రజాస్వామిక వేదిక, హైదరాబాద్
editorial
1,965
09-02-2017 00:12:50
ప్రజారోగ్యంపై పెట్టుబడులు పెరగాలి
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దేశంలో ప్రజారోగ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్‌, బంగ్లాదేశ్‌ వంటి దేశాలతో పోల్చినా ఈ విషయంలో భారత బాగా వెనకబడి ఉందన్నారు. ఇక్కడ జరుగుతున్న బయో అసియా సదస్సు చివరి రోజైన బుధవారం జరిగిన కార్యక్రమంలో నారాయణ మూర్తి మాట్లాడారు. ప్రజారోగ్యం విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ముందుంటే ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలు బాగా వెనకబడి ఉన్నాయన్నారు. పురుటిలోనే చిన్న పిల్లలు చనిపోవడం, పోషకాహారం, టీకాల విషయంలోనూ భారత బాగా వెనకబడి ఉందన్నారు. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు ప్రజారోగ్య రంగంలో పెట్టుబడులను ప్రభుత్వాలు భారీగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం శాస్త్ర, సాంకేతిక రంగాలను మరింత చురుగ్గా ఉపయోగించుకోవాలని కోరారు.కొత్తగా వస్తున్న మొబైల్‌ యాప్స్‌ ఇందుకు ఉపయోగపడతాయన్నారు. టిబి వంటి వ్యాధులు తగ్గినా, డెంగ్యూ, చికున్‌ గున్యా, మెదడువాపు లాంటి వ్యాధులు పెరిగిపోవడం పట్ల నారాయణ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడే 35-65 ఏళ్ల మధ్య వయస్కులైన అనేక మంది చనిపోతున్నారన్నారు. నేటికాలంలో వ్యాధులతో చనిపోయే వారిలో 60 శాతం మంది ఇలాంటి వ్యాధుల బాధితులేనని చెప్పారు. వైద్య, ఆరోగ్య రంగాల్లో ప్రగతి సాధించినా, ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని నారాయణ మూర్తి అన్నారు.మూడు రోజులపాటు జరిగిన బయో ఆసియా సదస్సు సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపాయి. బయో టెక్నాలజీ, ఫార్మా రంగాల్లో రూ.3,400 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు అందాయని తెలంగాణ ఐటి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ చెప్పారు. 51 దేశాల నుంచి 1,480 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఇందులో పలువురు బహుళ జాతి ఔషధ కంపెనీల ప్రతినిధులూ ఉన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ ఫార్మా ఎగుమతులు ఆశాజనంగానే ఉన్నట్టు బయో ఆసియా సదస్సుకు హాజరైన కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ సుధాంశు పాండే చెప్పారు. ఎగుమతుల వృద్ధి రేటు గత ఏడాదిలానే ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లోనూ దాదాపుగా రెండంకెల్లో ఉంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ‘మిగతా రంగాలతో పోలిస్తే ఫార్మా ఎగుమతులు బాగానే ఉన్నాయి. గత నెల్లోనూ ఎనిమిది శాతం పెరిగాయి. కాబట్టి ఈ సంవత్సరమూ దాదాపుగా రెండంకెల వృద్ధి రేటు ఉంటుందనుకుంటున్నాం’ అన్నారు. ఎగుమతుల వృద్ధి రేటు 8-10 శాతం మధ్య ఉండే అవకాశం ఉందన్నారు.
business
15,457
12-07-2017 04:08:28
మహారాష్ట్ర ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మృతి
మహదేవపూర్‌: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని ధానో రా అటవీ ప్రాంతంలో మంగళవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం.
nation
14,000
11-04-2017 00:43:20
ఉగ్రవాదం అణచివేతపై గురి
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 10: ఉగ్రవాదం అణచివేతలో పరస్పర సహకారానికి భారత్, ఆస్ట్రే‌లియా నిర్ణయించాయి. ఈ ఒప్పందం సహా మొత్తం ఆరు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఉభయ దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, మాల్కం టర్న్‌బుల్‌ సోమవారమిక్కడి హైదరాబాద్‌ హౌస్‌లో పరస్పర ప్రయోజనకర ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. ఉగ్రవాద గ్రూపులకు ఆర్థిక సాయం చేస్తూ వారికి ఆశ్రయం కల్పిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపిచ్చారు. అయితే ఆర్థిక సహకారంపై ముందడుగు పడలేదు. కాకపోతే సమగ్ర ఆర్థిక సహకారంపై తదుపరి రౌండు చర్చలను వీలైనంత త్వరగా నిర్వహించాలని ఉభయ దేశాల అధికారులను ప్రధానులు ఆదేశించారు.  రక్షణ, వాణిజ్యం, ఇంధనం, విద్యారంగాల్లో సంబంధాలను మరింత విస్తరించాలని నిర్ణయించారు. ఆరోగ్యం, ఔషధాలు; క్రీడలు, పర్యావరణం, వాతావరణం, జీవవైవిధ్యం, పౌరవిమానయాన భద్రత, అంతరిక్ష పరిజ్ఞానంలో సహకారంపై ఒప్పందాలు కుదిరాయి. అనంతరం ఉమ్మడిగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతిసుస్థిరతలను కాపాడుకోవాలని మోదీ అన్నారు. ఉగ్రవాదం, సైబర్‌ భద్రతపై అంతర్జాతీయ వ్యూహం, పరిష్కారాలు అవసరమని అభిప్రాయపడ్డారు. భారత్‌కు వీలైనంత త్వరగా యురేనియం సరఫరా చేస్తామని టర్న్‌బుల్‌ హామీఇచ్చారు. ఇందుకోసం ఆసే్ట్రలియా పార్లమెంటులో చట్టం ఆమోదించినందుకు మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. ద్వైపాక్షిక విద్యాసహకారంలో విద్యార్థులు మార్పిడి కీలకాంశమని, ఆసే్ట్రలియాలో 60 వేల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారని గుర్తుచేశారు.  ఐదు లక్షల మంది ఆస్ట్రే‌లియన్లల భారతీయ నేపథ్యం ఉన్నవారేనని టర్న్‌బుల్‌ తెలిపారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం భారత వచ్చారు. మోదీతో కలిసి సోమవారం ఢిల్లీ మెట్రో రైలులో మండీహౌస్‌ స్టేషన్‌ నుంచి అక్షర్‌ధామ్‌ వరకు (6.7 కిలోమీటర్లు.. పావుగంట) ప్రయాణించారు. ఈ సందర్భంగా టర్న్‌బుల్‌ ప్రధానితో సెల్ఫీ తీసుకున్నారు. తూర్పు ఢిల్లీలోని స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌ ఆలయాన్ని టర్న్‌బుల్‌ మోదీతో కలిసి సందర్శించారు. అక్కడి పూజారులు వారికి పూలమాలలు వేసి స్వాగతం పలికారు. వారి చేతులకు కంకణాలు కట్టారు. ఆ కంకణాల ప్రాధాన్యాన్ని టర్న్‌బుల్‌కు మోదీ వివరించారు. గోల్ఫ్‌ కార్ట్‌ ఎక్కి ఆలయ సముదాయంలోని మరిన్ని ఆకర్షణీయ ప్రాంతాలను వారు చూశారు. ఆలయ మెట్లపై ఇద్దరూ కాసేపు కూర్చుని మాట్లాడుకున్నారు.
nation
21,372
05-02-2017 01:56:38
భారత్ విజయ జోరు
అంధుల టీ-20 ప్రపంచ కప్‌అహ్మదాబాద్‌: అంధుల టీ20 ప్రపంచ కప్‌లో భారత్ గెలుపు జోరు కొనసాగిస్తోంది. ప్రకాశ్‌ జా (99 నాటౌట్‌), కేతన్‌ పటేల్‌ (56 నాటౌట్‌) అర్ధ సెంచరీలతో రాణించడంతో భారత్ 9 వికెట్లతో శ్రీలంకపై విజయం సాధించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత లంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 186 పరుగులు చేసింది. చందన దేశప్రియ (62) అర్ధ సెంచరీ చేశాడు. అనంతరం ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ప్రకాశ్‌, కేతన్‌ పటేల్‌ హాఫ్‌ సెంచరీలతో చెలరేగడంతో.. ఆతిథ్య భారత్ 13.3 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది.
sports
7,558
27-01-2017 11:29:20
వివేక్‌ వ్యాఖ్యలపై స్పందించిన నయనతార
దక్షిణాదిలో తను నటించిన సినిమాల ప్రమోషన్లకు సైతం దూరంగా ఉంటూ అపవాదు మూటగట్టుకుంది నయనతార. ఆమె ప్రచారానికి వస్తే సినిమాకు బోలెడంత ప్రచారం లభిస్తుందని నిర్మాతలు బ్రతిమలాడినా ఆమె మాత్రం మెట్టు దిగడం లేదు. దీనిపై అనేక విమర్శలు వచ్చినా నయన పట్టించుకోవడం లేదు. అయితే కొన్ని నెలల క్రితం ‘కాష్మోరా’ విడుదలకు ముందు జరిగిన ప్రెస్‌మీట్‌లో హాస్యనటుడు వివేక్‌ ఇదే విషయమై నయనపై హాస్యధోరణిలో విమర్శలు గుప్పించారు. డైరెక్టుగా నయనతార పేరు ప్రస్తావించకపోయినా ‘హీరోయిన్లు తమ సినిమాలను ప్రమోట్‌ చేయడానికి రాకపోతే.. నిర్మాత నుంచి చివరి ఇనస్టాల్‌మెంట్‌ తీసుకోకుండా ఉండచ్చు కదా’ అని వ్యాఖ్యానించారు. ‘కాష్మోరా’లో మెయిన హీరోయినగా నటించిన నయనతారను టార్గెట్‌గా చేసుకునే వివేక్‌ ఈ వ్యాఖ్యలు చేశారని అందరికీ అర్థమైంది. అయితే దీనిపై నయనతార నుంచి ఎటువంటి స్పందనా లేదు. ఈ నేపథ్యంలో ఆమె నటిస్తున్న హీరోయిన ప్రాధాన్య చిత్రాలు ‘అరమ్‌’, ‘డోరా’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో నయనతార స్పందించింది. ప్రమోషన్లకు హాజరుకానని నిర్మాతలతో చెప్పే సినిమాల్లో నటించడానికి సంతకం చేస్తున్నానని బదులిచ్చింది.
entertainment
19,762
15-01-2017 22:19:12
మ్యాచ్ ముగిసిన తర్వాత కేదార్ జాదవ్‌తో కోచ్ కుంబ్లే ఏం మాట్లాడాడు?
పూణె: ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే భారత బ్యాటింగ్‌లో కోహ్లీ, జాదవ్ అద్భుత సెంచరీలు చేశారు. 76 బంతుల్లోనే 120 పరుగులు చేసిన కేదార్ జాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ధి మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. అయితే భారత బ్యాటింగ్ ముగిసిన తర్వాత మ్యాచ్ హీరో కేదార్ జాదవ్‌తో కోచ్ కుంబ్లే ప్రత్యేకంగా మాట్లాడారు. భుజం మీద చేయి వేసి, ఆపై చేతిలో చెయ్యి వేసి మరి ఎంతో ప్రేమగా ముచ్చటించారు. అయితే జాదవ్‌తో కుంబ్లే ఏం మాట్లాడి ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. సొంత గ్రైౌండ్‌లో అదరగొట్టడంతో కేదార్‌కు ఇప్పుడు ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో క్రేజ్ పెరిగిపోయింది. అంతా ఓడిపోతుందనుకున్న సమయంలో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనూ రాణిస్తుండటంతో కేదార్ జాదవ్ రూపంలో భారత జట్టుకు మరో అద్భుతమైన ఆల్‌రౌండర్ దొరికాడు. ముఖ్యంగా ఒత్తిడిని తట్టుకుంటూ జాదవ్ చేసిన బ్యాటింగ్ తీరు చాలా అద్భుతంగా ఉంది.
sports
18,180
24-04-2017 19:37:06
జవాన్ల త్యాగాలు వృథా పోవు : మోదీ
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఘాతుకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఇది చాలా దురదృష్టకరమైన, పిరికిపందల చర్య అని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న 26 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అశువులు బాయడంపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు. సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ధైర్యసాహసాలు ప్రశంసనీయమని, వారి త్యాగాలు ఎన్నటికీ వృథా కావని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు తన సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఎన్‌కౌంటర్ అనంతర పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు చెప్పారు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై మావోయిస్టుల ఘాతుకాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం ఖండించారు. ఈ విషయం తెలిసిన తానెంతో బాధకు గురయ్యాయని చెప్పారు. త్యాగధనులైన జవాన్లకు నివాళులర్పిస్తూ వారి కుటుంబాలకు తన సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. ఛత్తీస్‌గఢ్ ఘటన తెలిసిన వెంటనే తాను ఆవేదనకు గురయ్యాయని మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పాశవిక హత్యలకు తావులేదన్నారు.దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ల త్యాగాలు ఎంత మాత్రం వృథా కావని పేర్కొన్నారు. అటు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం సుక్మా జిల్లాలో జరిగిన దాడిని ఖండించారు. హింసతో తీవ్రవాదంపై పోరాడాలనే మన సంకల్పం ఎంత మాత్రం నీరుగారిపోదన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సాహసవీరుల త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఘాతుకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఇది చాలా దురదృష్టకరమైన, పిరికిపందల చర్య అని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న 26 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అశువులు బాయడంపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు. సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ధైర్యసాహసాలు ప్రశంసనీయమని, వారి త్యాగాలు ఎన్నటికీ వృథా కావని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు తన సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఎన్‌కౌంటర్ అనంతర పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు చెప్పారు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై మావోయిస్టుల ఘాతుకాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం ఖండించారు. ఈ విషయం తెలిసిన తానెంతో బాధకు గురయ్యాయని చెప్పారు. త్యాగధనులైన జవాన్లకు నివాళులర్పిస్తూ వారి కుటుంబాలకు తన సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. ఛత్తీస్‌గఢ్ ఘటన తెలిసిన వెంటనే తాను ఆవేదనకు గురయ్యాయని మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పాశవిక హత్యలకు తావులేదన్నారు.దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ల త్యాగాలు ఎంత మాత్రం వృథా కావని పేర్కొన్నారు. అటు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం సుక్మా జిల్లాలో జరిగిన దాడిని ఖండించారు. హింసతో తీవ్రవాదంపై పోరాడాలనే మన సంకల్పం ఎంత మాత్రం నీరుగారిపోదన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సాహసవీరుల త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
nation
14,478
05-04-2017 02:40:30
హిందుస్థానీ శాస్ర్తీయ విద్వాంసురాలు కిశోరీ అమోంకర్‌ కన్నుమూత
ముంబై, ఏప్రిల్‌ 4: ప్రముఖ హిందుస్థానీ శాస్ర్తీయ విద్వాంసురాలు కిశోరీ అమోంకర్‌(84) సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు మంగళవారం తెలిపారు. 1932, ఏప్రిల్‌ 10న జన్మించిన ఆమె..హిందుస్థానీ సంగీతంలో పేరు ప్రఖ్యాతుల సంపాదించారు. ముఖ్యంగా ‘జైపూర్‌ ఘరానా’ అనే వినూత్నమైన, విలక్షణమైన సంగీత శైలిని ఆమె సృష్టించారు. అల్లాదియా ఖాన్‌ సాబ్‌ వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న కిశోరీ.. తన తల్లి, ప్రముఖ గాయకురాలు మొగుబాయ్‌ కుర్దీకర్‌ ద్వారా ‘జైపూర్‌ ఘరానా’లో మెలకువలను ఔపోసన పట్టారు.  ఏడు దశాబ్దాలపాటు సంగీత ప్రపంచానికి విశిష్టసేవలు అందించారు. పలు చిత్రాల్లోనూ పాటలు పాడారు. తదనంతరం ‘జైపూర్‌ ఘరానా’ విధానాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. సంగీత ప్రపంచానికి ఆమె చేసిన కృషికిగాను.. 1987లో పద్మభూషణ్‌, 2002లో పద్మ విభూషణ్‌ పురస్కారాలు వరించాయి. 2010లో సంగీత నాటక అకాడెమీ సభ్యురాలిగా నియమితులయ్యారు. కిశోరీ మృతిపట్ల ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌, సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్‌, బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా, కిశోరీ భౌతికకాయానికి మంగళవారం దాదర్‌లోని హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.
nation
19,097
23-12-2017 19:12:33
పాక్ దొంగ దెబ్బ... ఓ మేజర్, ఇద్దరు సైనికులు వీర మరణం...
న్యూఢిల్లీ : దేశ సేవలో ఓ మేజర్, ఇద్దరు సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. జమ్మూ-కశ్మీరులోని కేరి సమీపంలో పాకిస్థాన్ సైన్యం ఎటువంటి హెచ్చరికలు లేకుండా దారుణంగా కాల్పులు జరిపారు. శనివారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. నియంత్రణ రేఖ వెంబడి ప్రతి రోజూ ఇరు దేశాల సైనికుల మధ్య కాల్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. శనివారం కేరి సెక్టర్‌లో120 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌కు చెందిన రెండు సిక్కు బెటాలియన్లు పహరా కాస్తున్న సమయంలో పాకిస్థాన్ సైనిక స్థావరాల నుంచి కాల్పులు జరిగాయి. ఓ సైనికాధికారి మాట్లాడుతూ పాక్ కాల్పుల్లో ఓ మేజర్, ఇద్దరు సైనికులు అమరులయ్యారని తెలిపారు. ఓ సైనికుడు గాయపడినట్లు తెలిపారు. భారత జవాన్లు దీటుగా స్పందించినట్లు చెప్పారు.
nation
11,432
29-07-2017 02:23:44
రాముడంటే కొందరికి ఎలర్జీ
‘‘కొందరికి రాముడంటే ఎలర్జీ. కానీ మరణించినపుడు రామ్‌ నామ్‌ సత్య హై అంటామని గుర్తుంచుకోవాలి. వాళ్లు ఇండోనేసియా నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అది రాముడి సంప్రదాయాలకు విలువనిచ్చే ఇస్లామిక్‌ దేశం. అక్కడ మేం ఘాట్లను పునరుద్ధరిస్తాం, రాముడి మ్యూజియం కడతాం. లోహియా పేరులో కూడా రాముడి నామం ఉంది’’- ఆదిత్యనాథ్‌, యూపీ సీఎం
nation
6,651
12-01-2017 17:54:09
దర్శకేంద్రుడు లేకుండానే మరో భక్తిరస చిత్రంలో నాగ్?
హైదరాబాద్: ఈ జనరేషన్‌లో భక్తిరస చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించడం హిరో నాగార్జున్‌కే సాధ్యమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ‘అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి’ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన త్వరలోనే ‘ఓం నమోవెంకటేశాయ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వచ్చే నెల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాతో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వానికి గుడ్‌బై చెబుతారని ఊహాగానాలు రావడంతో ఇకపై నాగ్ భక్తిరస చిత్రాలల్లో నటించడం కూడా కష్టమని చాలా మంది భావిస్తున్నారు.  అయితే దర్శకేంద్రుడు లేకుండా నాగార్జున ముఖ్య పాత్రలో మరో భక్తిరస చిత్రానికి గ్రౌండ్ వర్క్ జరుగుతోందని ఇండస్ట్రీలో గుసగుసులు వినిపిస్తున్నాయి. ‘అన్నమయ్య, శ్రీరామదాసు, ఓం నమోవెంకటేశాయ’ చిత్రాలకు మాటల రచయితగా వ్యవహరించిన భారవి, నాగార్జున హీరోగా ఇస్కాన్ ఫౌండర్ శ్రీ ప్రభుపాద జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధిన కథను నాగార్జునకు వినిపించారని, ఓం నమోవెంకటేశాయ విడుదలయిన తర్వాత నాగార్జున ఓ నిర్ణయం తీసుకుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఓం నమోవెంకటేశాయ తర్వాత కూడా నాగార్జున మరో భక్తిరస చిత్రాన్ని ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది.
entertainment
17,961
20-05-2017 02:45:10
విష్ణుప్రయాగలో విరిగిపడిన కొండచరియలు
చిక్కుకున్న 15 వేల మంది యాత్రికులుఆధ్యాత్మిక యాత్రలో అపశ్రుతి చొటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన హృషీకేశ్‌-బద్రీనాథ్‌ నడుమ.. విష్ణుప్రయాగ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయి.. 15 వేల మంది యాత్రికులు చిక్కుకుపోయినట్టు సమాచారం. సమస్యను పరిష్కరించేందుకు సరిహద్దు రహదారుల సంస్థ సిబ్బంది రంగంలోకి దిగారని.. శనివారం మధ్యాహ్నానికల్లా వాహనాల రాకపోకలు కొనసాగుతాయని చమోలీ జిల్లా కలెక్టర్‌ ఆశీష్‌ జోషి తెలిపారు. ఈలోగా.. చిక్కుకుపోయిన యాత్రికులకు కావాల్సిన సౌకర్యాలను మార్గమధ్యంలోని జోషి మఠ్‌, కర్ణప్రయాగ్‌, పిపల్‌కోటి, గోవింద్‌ఘాట్‌, బద్రీనాథ్‌ల్లో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగానే కొండచరియలు విరిగిపడ్డట్టు స్థానికులు తెలిపారు.
nation
21,616
02-01-2017 00:54:51
సూర్య నమస్కారం తప్పా?
న్యూఢిల్లీ: సూర్య నమస్కారం విషయంలో తనపై సోషల్‌ మీడియాలో రేగుతున్న విమర్శలను టీమిండియా మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ కైఫ్‌ తిప్పికొట్టాడు. ‘సూర్య నమస్కారం వల్ల దేహంలోని ప్రతి వ్యవస్థపైనా ప్రభావం పడుతుంది. ఎటువంటి ఉపకరణాలు లేకుండా చేయగల పరిపూర్ణ వ్యాయామం. నా ఫిట్‌నెస్‌ రహస్యమ’ని ట్వీట్‌ చేశాడు. ‘కసరత్తులకు.. మతానికి సంబం ధం ఏంటో అర్థం కావడం లేద’ని మహమ్మద్‌ అన్నాడు. ఇది అందరికీ ఉపయోగం అని చెప్పా డు. పేసర్‌ షమి భార్య దుస్తుల విషయంలోనూ విమర్శలు వ్యక్తం కాగా.. కైఫ్‌ అతడికి మద్దతుగా నిలిచాడు.
sports
10,261
23-02-2017 16:06:50
ఆ రికార్డు శృతి ఖాతాలో కూడా పడుతుందా?
మెగా హీరోలు చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ల సరసన నటించి మరే హీరోయిన్‌కు దక్కని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది కాజల్‌ అగర్వాల్‌. ఇలా ఒక కుటంబానికే చెందిన అందరి సరసనా నటించే అవకాశం ఏ ఇతర హీరోయిన్‌కూ ఇప్పటివరకు దక్కలేదు. అయితే ఇప్పుడు ఆ అవకాశం శృతీహాసన్‌కు కూడా దక్కబోతున్నట్టు సమాచారం.
entertainment
7,400
21-10-2017 16:34:22
ఆ హీరోతో నటించడం నా అదృష్టం: తమన్నా
చాలా కాలంగా సినీఇండస్ట్రీలో వెలిగిపోతోంది మిల్క్‌బ్యూటీ తమన్నా. దాదాపు అందరు అగ్రహీరోల సరసన ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తమిళంలో హీరో విక్రమ్ సరసన 'స్కెచ్' సినిమాలో నటిస్తోంది. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా.. హీరో విక్రమ్‌తో నటించే అవకాశం రావడం నా అదృష్టం అంటూ ఆయనను ప్రశంసల్లో ముంచెత్తింది. 'ఎల్లప్పుడూ విలక్షణ పాత్రలను ఎంచుకుంటూ విభిన్న రకాల పాత్రల్లో ఇట్టే ఒదిగిపోగల సమర్థుడు విక్రమ్. తనతో నటించడం వల్ల ఆయన నటనలో గొప్పతనాన్ని తెలుసుకున్నానని పేర్కొంది. ఎలాంటి వాతావరణంలో అయినా సరే కేటాయించిన సమయానికి షూటింగ్ స్పాట్‌కి రావడం ఆయనలో క్రమశిక్షణకు నిదర్శనం అని చెబుతూ.. ఎంతో మంది అభిమానులను కూడగట్టుకున్న అంతటి గొప్పనటుడితో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని' తెలిపింది తమన్నా.
entertainment
18,558
30-07-2017 17:23:05
'బెదరించడం ఆపేస్తే బెంగళూరు వదిలేస్తాం'
బెంగళూరు: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తమ పార్టీ పోరాడుతున్నట్టు గుజరాత్ కాంగ్రెస్ నేతలు తెలిపారు. బెంగళూరులోని రిసార్ట్‌లో క్యాంప్ చేసిన గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారంనాడు మీడియా ముందుకు వచ్చారు. తాము ఏ పరిస్థితుల్లో బెంగళూరు క్యాంప్‌కు వచ్చింది, ఎమ్మెల్యేలతో బీజేపీ సాగిస్తున్న బేరసారాలు, బెదరింపుల వ్యవహారాన్ని మీడియా ముందుంచారు. 'రాజకీయాల్లో పారదర్శకత, నిబద్ధత ఉండాలి. ఇందుకు భిన్నంగా బీజేపీ అనుచిత విధానాలను అనుసరిస్తోంది' అని గుజరాత్ కాంగ్రెస్ సీనియర్ నేత శక్తిసిన్హ్ గోహిల్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అధికార బీజేపీ సర్కార్ బెదరిస్తోందన్నారు. 'మీరే మా ఎమ్మెల్యేలను అడగండి. ఏ విధంగా వారిని బెదరిస్తున్నారో చెబుతారు. రూ.15 కోట్లు ఇస్తామని ఎరచూపినా వారు పార్టీకే కట్టుబడి ఉన్నారు. మాకు ఇక్కడ (బెంగళూరు) ఒక్క నిమిషం కూడా ఉండాల్సిన అవసరం లేదు. మమ్మల్ని వారు (బీజేపీ) బెదరించమని చెబితే చాలు' అని పాత్రికేయులతో గోహిల్ అన్నారు. ప్రజాస్వామ్యం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న తరుణంలో మీడియా యాజమాన్యాలు, ఛానెళ్లు, వార్తాపత్రికలు కలిసికట్టుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన కోరారు. ఆ బాధ్యత మీడియాపై ఉందని అన్నారు. 'మా ఎమ్మెల్యేలు మీ ముందే ఉన్నారు. ఏం జరిగిందో మీరే అడగండి' అని గోహెల్ పాత్రికేయులకు సూచించారు. గత రాత్రి నుంచి తామంతా ఇక్కడే ఒక కుటుంబసభ్యుల్లా ఉన్నామని, బీజేపీ ఆరోపణలు చేస్తున్నట్టు మాలో అంతర్గత విభేదాలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ లేవని ఆయన వివరించారు.
nation
15,932
21-03-2017 02:38:07
బ్యాంకుల అడ్డగోలు చార్జీలను ఆపాలి
న్యూఢిల్లీ, మార్చి 20: అదనపు చార్జీల వసూలుకు బ్యాంకులు తీసుకున్న నిర్ణయాలను కేంద్రం అడ్డుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశా యి. ఈ అంశంపై సోమవారం ఉభయ సభల్లో చర్చ జరిగింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) పొదుపు ఖాతాల్లో కనీస నిల్వను రూ.500 నుంచి ఏకంగా ఒకేసారి రూ.5 వేలకు పెంచడం దారుణమని సీపీఎం ఎంపీ కేకే రాగేశ్‌ అన్నారు. కనీస నిల్వ లేకపోతే జరిమానా విధించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశాన్ని రాజ్యసభలో జీరో అవర్‌ సమయంలో ఆయన చర్చకు లేవనెత్తారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 31 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడతారని రాగేశ్‌ అన్నారు.  కోట్లరూపాయల రుణం ఎగ్గొట్టే కార్పొరేట్లను వదిలి పేదలపై పడడం దారుణమన్నారు. రాగేశ్‌ వాదనను రాజ్యసభలోని ఇతర ప్రతిపక్షాలుకూడా సమర్థించాయి. ఏటీఎంల్లో వితడ్రాయల్‌పై విధిస్తున్న అదనపు చార్జీలను నిలిపేయాలని కోరాయి. ఇదే అంశంపై లోక్‌సభలో జరిగిన చర్చలో ప్రతిపక్షాల డిమాండ్లను బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ సమర్థించారు. వితడ్రాయల్‌పై కొన్ని బ్యాంకు లు విధించిన చార్జీలను రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా నగదు రహితందిశగా ప్రధాని సాధించిన విజయాల ను ఠాకూర్‌ వివరించారు. ఇప్పటివరకు కోటి మందికిపైగా భీమ్‌ యాప్‌, ఆధార్‌ అనుసంధానిత చెల్లింపులయా్‌పను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు తెలిపారు.
nation
18,913
18-06-2017 17:39:44
భారీగా నకిలీ రూ.2000 నోట్లు స్వాధీనం
కోల్‌కతా: నకిలీ రూ.2000 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని భారత్, బంగ్లా సరిహద్దు ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మాల్డాలోని సబ్దల్పూర్‌లో నకిలీ రూ.2000 నోట్లను బీఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. రూ.1.96 లక్షల విలువైన దొంగ నోట్లపై దర్యాప్తు చేస్తున్నారు. వీటిని బంగ్లాదేశ్‌లో ముద్రించి నుంచి భారత్‌లోకి అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
nation
1,232
08-06-2017 00:30:13
లెస్‌ క్యాష్‌ సిటీగా విశాఖ
అన్ని చెల్లింపులకూ ఒకటే కార్డు: నారా లోకేశ్‌విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి) : ఆరు నెలల్లో విశాఖనగరాన్ని లెస్‌ క్యాష్‌ సిటీగా మారుస్తామని రాష్ట్ర ఐటి శాఖా మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. ఇందుకోసం వీసా కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెల్లడించారు. అన్ని చెల్లింపులూ ఒకే కార్డు ద్వారా చెల్లించేందుకూ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు ఇందుకు సహకరించాలని బుధవారం జరిగిన ఒక వర్క్‌షాప్ లో కోరారు. ఐటి ద్వారా సుపరిపాలన అందిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రపంచంలోనే ముందు ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం ఈ-ఆఫీసు ద్వారా నడుస్తోందని, ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనత అని వివరించారు. స్వీడన్‌లో నగదు చెల్లింపులు కేవలం 13 నుంచి 14 శాతమే వుంటాయని, మిగిలినవన్నీ నగదు రహితమేనని పేర్కొన్నారు. విశాఖను కూడా ఆ దిశగా నడిపించే యోచనతో ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. ఇది విజయవంతం అయ్యేందుకు పరిశ్రమలు, వ్యాపారులు, బ్యాంకర్లు అంతా సహకరించాలని కోరారు. ఈ లెస్‌ క్యాష్‌ సిటీ వ్యవహారాలకు రుషికొండలోని ఫిన్‌టెక్‌ వ్యాలీ బ్యాక్‌ ఆఫీసుగా వ్యవహరిస్తుందని లోకేశ్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎపి ఐటి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జెఎ చౌదరి, ఐటి సెక్రటరీ విజయానంద్‌, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, వీసా ప్రతినిధులు, వివిధ ఐటి సంస్థల సిఇఒలు, జివిఎంసి, వుడా, ఇపిడి, ఇపిడిసిఎల్‌, పలు బ్యాంకులకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
business
14,831
16-12-2017 18:57:44
నేను కాదు...అమ్మే పోటీ చేస్తుంది...
న్యూఢిల్లీ: సోనియాగాంధీ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలి నుంచి వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారన్న ఊహాగానాలకు ప్రియాంకా గాంధీ వాద్రా శనివారంనాడు తెరదించారు. రాయబరేలీ నుంచి తన తల్లి సోనియాగాంధీనే తిరిగి పోటీ చేస్తారని ప్రియాంక వెల్లడించారు. '2019లో నేను పోటీ చేయడమనే ప్రశ్నే ఎదురుకాదు. అమ్మే పోటీ చేస్తుంది' అని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సోనియాగాంధీపై ప్రియాంక ప్రశంసలు కూడా కురిపించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా 19 ఏళ్ల పాటు ఎన్నో అవరోధాలను ఎదుర్కొని పార్టీని ముందుగు నడిపిన 'ధైర్యశాలి' మహిళ అని కొనియాడారు. ప్రస్తుత లోక్‌సభలో ఉత్తరప్రదేశ్ నుంచి రాహుల్ (అమేథీ), సోనియాగాంధీ (రాయబరేలీ) మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
nation
3,014
07-06-2017 00:51:02
ఐపిఒ, బోనస్‌, రైట్స్‌ షేర్ల లాభాలపై పన్ను లేదు
న్యూఢిల్లీ: లిస్టెడ్‌ కంపెనీల పబ్లిక్‌ ఇష్యూలు, బోనస్‌, రైట్స్‌ షేర్ల లావాదేవీల ద్వారా వచ్చే లాభాలకు దీర్ఘకాలిక మూల ధన లాభాల పన్ను (లాంగ్‌టర్మ్‌ కాపిటల్‌ గెయిన్స్‌) నుంచి ప్రభుత్వం మినహాయింపు నిచ్చింది. ఈ షేర్ల లావాదేవీలపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్‌టిటి) చెల్లించకపోయినా ఈ మినహాయింపు లభిస్తుందని స్పష్టం చేసింది. అనుబంధ సంస్థ ల మెర్జర్లు, డిమెర్జర్లు, ఎఫ్‌డిఐ నిబంధన కింద ప్రవాస భారతీయులు పెట్టే ఈక్విటీ పెట్టుబడులకు, కంపెనీలు ఉద్యోగులకు స్టాక్‌ ఆప్షన్ల కింద లేదా బహుమతిగా ఇచ్చే షేర్లకూ ఈ దీర్ఘకాలిక కాపిటల్‌ గెయిన్స్‌ పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఎల్‌టిసిజిటిని అడ్డుపెట్టుకుని కొంత మంది నల్ల ధన స్వాములు డొల్ల కంపెనీల ద్వారా దర్జాగా తమ నల్ల ధనాన్ని వైట్‌ చేసుకునేవారు. దీంతో ఎస్‌టిటి చెల్లించని షేర్ల లావాదేవీలు వేటికీ ఎల్‌టిసిజిటి కింద మినహాయింపు లభించదని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఈ మేరకు ఐటి చట్టంలోని సెక్షన్‌ 10(38)ను సవరించింది. ఈ సవరణ వల్ల 2004 అక్టోబర్‌ ఒకటి తర్వాత షేర్ల బదిలీ ద్వారా వచ్చిన రాబడికి దీర్ఘకాలిక కాపిటల్‌ గెయిన్స్‌ వర్తించాలంటే వాటిపై విధిగా ఎస్‌టిటి చెల్లించి ఉండాలి. అయితే దీని వలన నిజమైన ఇన్వెస్టర్లు ఇబ్బంది పడే అవకాశం ఉందని ఫిర్యాదులు రావడంతో లిస్టెడ్‌ కంపెనీలు ఐపిఒలు, రైట్స్‌, బోన్‌సగా జారీ చేసే షేర్లకు తాజాగా ఎల్‌టిసిజిటి నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చింది. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రవాసులు, వెంచర్‌ కాపిటల్‌ ఫండ్స్‌ ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టినప్పుడు, ఇసాప్స్‌ కింద లభించే షేర్లు, సెబి నిబంధనలకు అనుగుణంగా విలీనాలు, టేకోవర్ల సందర్భంగా చేతులు మారే షేర్లకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు, నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్జేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా, ఆర్‌బిఐ ఆమోదంతో జరిగిన షేర్ల లావాదేవీలకు కూడా బేషరతుగా మినహాయింపు లభిస్తుంది. మినహాయింపు వర్తించని, అంటే కాపిటల్‌ గెయిన్స్‌మినహాయింపు పొందాలంటే ఎస్‌టిటి చెల్లించి తీరాల్సిన లావాదేవీలను కూడా ప్రభుత్వం పేర్కొంది. గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్స్జేంజీలో తరుచుగా ట్రేడ్‌గాని ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా కొనుగోలు చేసినప్పుడు, లిస్టెడ్‌ షేర్లను గుర్తింపు పొందని స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ద్వారా కొనుగోలు చేసినప్పుడు, డిలిస్టింగ్‌ సమయంలో ఈక్విటీలను కొనుగోలు చేసినప్పుడు... ఈ లావాదేవీలపై ఎస్‌టిటి చెల్లించినవారికి మాత్రమే దీర్ఘకాలిక కాపిటల్‌ గెయిన్స్‌ పన్ను నుంచి మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.  సుప్రీంకోర్టు, హైకోర్టు, నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్జేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా, ఆర్‌బిఐ ఆమోదంతో జరిగిన షేర్ల లావాదేవీలకు కూడా బేషరతుగా మినహాయింపు లభిస్తుంది. మినహాయింపు వర్తించని, అంటే కాపిటల్‌ గెయిన్స్‌మినహాయింపు పొందాలంటే ఎస్‌టిటి చెల్లించి తీరాల్సిన లావాదేవీలను కూడా ప్రభుత్వం పేర్కొంది. గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్స్జేంజీలో తరుచుగా ట్రేడ్‌గాని ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా కొనుగోలు చేసినప్పుడు, లిస్టెడ్‌ షేర్లను గుర్తింపు పొందని స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ద్వారా కొనుగోలు చేసినప్పుడు, డిలిస్టింగ్‌ సమయంలో ఈక్విటీలను కొనుగోలు చేసినప్పుడు... ఈ లావాదేవీలపై ఎస్‌టిటి చెల్లించినవారికి మాత్రమే దీర్ఘకాలిక కాపిటల్‌ గెయిన్స్‌ పన్ను నుంచి మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
business
12,157
16-05-2017 08:26:26
గద్దె దిగనున్న నేపాల్ ప్రధాని పుష్పకమాల్
ఖాట్మండు: నేపాల్ ప్రధాని పుష్ప కమాల్ దహల్ వచ్చేవారంలో తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఆయన స్థానంలో నేపాల్ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ డ్యూబ ప్రధాని పగ్గాలు చేపడతారు. పది నెలల క్రితం దహల్, డ్యూబ మధ్య కురిదిరిన అంగీకారం ప్రకారం దహల్ తన పదవికి రాజీనామా చేయబోతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మాజీ ప్రధాని కె.పి.ఓలిని గత ఆగస్టులో పదివి నుంచి తొలగించిన తర్వాత ఈ ఇద్దరి నేతల మధ్య పదవిని పంచుకునే అంగీకారం కుదిరింది. ఖాట్మండులో రాష్ట్రీయ జనతా పార్టీ (ఆర్జేపీ) నాయకులతో దహల్ మాట్లాడుతూ తన రాజీనామా నిర్ణయాన్ని ధ్రువీకరించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్-సెంటర్) అధిపతి అయి దహల్, డ్యూబే రెండు సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు అంగీకరించారు. మొదటి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల వరకూ, రెండవది వచ్చే జనవరిలో జరిగే ప్రొవిన్షియల్, ఫెడరల్ పార్లమెంట్ ఎన్నికలు పర్వవేక్షించేందుకు అంగీకరించాయి. కాగా, దహల్ రాజానామాకు ముందే రాజ్యాంగ సవరణల విషయంలో మదేశీల డిమాండ్లను నెరవర్చేందుకు ప్రయత్నిస్తారని ఆర్జేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
nation
3,826
09-03-2017 01:26:48
స్త్రీ పురోగతే సమాజ అభ్యున్నతి
ప్రస్తుత భారతీయ సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న సామాజిక వివక్షకు కారణం హిందూ సాంప్రదాయాలేనని చాలామంది అజ్ఞానంగా వాదిస్తుంటారు. వేదకాలం నుంచి భారతీయ సమాజంలో మహిళలకు ఎంతో గౌరవం, ఆరాధన లభిస్తున్నదన్న విషయం వారు తెలుసుకోవాలి. నిజానికి మన దేశాన్నే మనం ఒక స్త్రీగా మూర్తీభవించి భారత మాతగా పేర్కొంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినాన్ని పెద్ద ఎత్తున జరుపుకున్నారు. భారత దేశంలో కూడా వివిధ రంగాల్లో విజయాలు సాధిం చిన మహిళలను సన్మానించడంతో పాటు అనేక కార్యక్రమాలను నిర్వహించారు. స్త్రీపురుష సమానత్వం, మహిళా సాధికారికత గురించి మనలో జాగరూకత కలిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయి. కాని కేవలం అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా మొక్కుబడిగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం, ఇతర రోజుల్లో మహిళా సాధికారికత గురించి కానీ, స్త్రీని సమానంగా చూడాల్సిన అవసరం గురించి కానీ గుర్తుకు రాకపోవడం సరైనదా? సమాజంలోనూ, ప్రభుత్వంలోనూ నిరంతరం మనం చేపట్టే అనేక కార్యక్రమాల్లో, మన నిత్య జీవితంలో స్త్రీల విషయంలో మన వ్యవహార శైలి ఏమిటి? అన్న ప్రశ్నలకు జవాబుల గురించి ఆలోచించవలసి ఉన్నది. నిజానికి ప్రతి రోజూ మనం సమాజంలో స్త్రీల పట్ల వివక్షతను విడనాడి, మహిళా చైతన్యం కోసం, పురుషులతో సమానంగా స్త్రీకి అవకాశాలు కల్పించడం కోసం చర్యలు తీసుకున్నప్పుడే మహిళా దినానికి సార్థకత లభిస్తుంది. మహిళా సాధికారికత లేకుండా మానవ జాతి అభ్యున్నతి సాధించలేదు.. అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంగా వాస్తవాన్ని ఉల్లేఖించారు. మహిళా అభ్యున్నతి, సాధికారికతలను సాధించాలంటే పురు షుల ఆలోచనా విధానంలో పూర్తిగా మార్పులు రావడం తప్పనిసరి. పురుషుల కంటే మహిళలు తక్కువ అన్న దృష్టితో చూడడం అనేది కొన్ని సమాజాల్లో మామూలు విషయంగా మారింది. ప్రపంచ జనాభాలో మహిళలు సగ భాగం అన్న విషయాన్ని మనం మరిచిపోతున్నాం. ఈ సగభాగం కృషి లేకుండా అన్ని రంగాల్లో అభ్యున్నతి సాధించడం సాధ్యం కాదు. కనుక తమకంటే స్త్రీలు తక్కువ అన్న దృక్పథాన్ని పురుషులు విడనాడినప్పుడే సమాజం, దేశం, ప్రపంచం అభివృద్ధి చెందుతాయి. మనకు స్వాతంత్ర్యం వచ్చి 69 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మనం స్త్రీ ల పట్ల వివక్షా దృక్పథంలో మాట్లాడుతున్నాం. బాలికా శిశు గర్భ విచ్ఛిత్తి వంటి హేయమైన పనులు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని సంగ్లి జిల్లాలో ఒక కాల్వ వద్ద గర్భ విచ్ఛిత్తి జరిగిన 18 బాలికా శిశు పిండాలను పడవేసిన సంఘటన మొత్తం దేశంలో బుద్ధి జీవులను, సరైన దృక్పథంతో ఆలోచించేవారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. పురుషులతో పాటు స్త్రీలకు విద్య, సాధికారికత, హక్కులు, అభివృద్ధిలో భాగస్వామ్యం సమానంగా లభించినప్పుడే సమాజం అన్ని విధాలా అభ్యున్నతి సాధిస్తుంది. విచిత్రమేమంటే ప్రస్తుత భారతీయ సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న సామాజిక వివక్షకు కారణం హిందూ సాంప్రదాయాలేనని చాలా మంది అజ్ఞానంగా వాదిస్తుంటారు. వేదకాలం నుంచి భారతీయ సమాజంలో మహిళలకు ఎంతో గౌరవం, ఆరాధన లభిస్తున్నదన్న విషయం వారు తెలుసుకోవాలి. హిందూ పురాణాల్లో సంపదకు అధిదేవతగా లక్ష్మిని, విద్యాధిదేవతగా సరస్వతిని, శక్తికి ప్రతిరూపంగా దుర్గను ఆరాధించారు. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా, యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలాః క్రియాః’ అని మన స్మృతులు చెప్పాయి. అంటే ‘ఎక్కడ స్త్రీలకు గౌరవం లభిస్తుందో, అక్కడ దేవ తలు పూజలందుకొంటారు. ఎక్కడ స్త్రీలకు గౌరవం లేదో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలు చేసినా ఫలితం లేదు’ అని అర్థం. నిజానికి మన దేశాన్నే మనం ఒక స్త్రీగా మూర్తీభవించి భారత మాతగా పేర్కొంటున్నాం. మన దేశంలో నదులను సరస్వతి, గంగ, యమున, గోదావరి, కావేరీ అని స్త్రీ పేర్లతో వ్యవహరిస్తున్నాం. అంటే అనాది నుంచి మనం స్త్రీలకు గౌరవాన్నిస్తున్నట్లు స్పష్టమవుతున్నది. స్త్రీల పట్ల ఆరాధనా భావం ఉన్నందువల్లనే మనం పుట్టిన దేశాన్ని మాతృభూమిగా పిలుచుకుంటున్నాం. కానీ ప్రాచీన కాలంలో స్త్రీల పట్ల ఉన్న గౌరవం, ఆరాధన, ఆధునిక నాగరికతలో లేకుండా పోతున్నది. మహిళలను తమతో సమానంగా చూడకుండా ఉండే ప్రవృత్తి పెరిగిపోతున్నది. ఇది ఆందోళనకరం. అందుకే స్త్రీల పట్ల మన ఆలోచనాధోరణి మారాలి. నాడు యుద్ధ రంగంలో వీర విజృంభణ చేసిన రాణీ లక్ష్మీబాయి నుంచి నేడు ఒకే రాకెట్‌లో 104 ఉపగ్రహాలను పంపిన ఇస్రో మహిళా శాస్త్రవేత్తల వరకు వివిధ రంగాల్లో తమకు సాటిగల వారు లేరని స్త్రీలు నిరూపిస్తున్న విషయాన్ని మనం గుర్తెరగాలి. సైన్స్, టెక్నాలజీ రంగాల్లోనే కాకుండా రాజకీయాలు, కళలు, సాహిత్యం, క్రీడలు, విద్య మొదలైన అనేక రంగాల్లో దేశం రాణించడానికి, అభ్యున్నతి చెందడానికి భారతీయ మహిళలు అద్భుతమైన కృషి చేశారు. మహిళలు ఇప్పుడు మన సాయుధ దళాల యుద్ధరంగంలో కూడా దిగారు. ఇటీవలే మన యుద్ధ విమానాలను నడిపేందుకు ముగ్గురు మహిళలు వైమానిక దళంలో చేరి దేశం గర్వపడేలా చేశారు. క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో అత్యద్భుత ప్రతిభ కనబరిచిన సానియా మీర్జా, పి. వి. సింధు, సైనా నెహ్వాల్, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్, మేరీ కామ్‌ల పేర్లు ఇవాళ ఇంటింటా వినిపిస్తుంటాయి. 1984లోనే బచేంద్రపాల్ మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించిన తొలి భారతీయ మహిళగా పేరొందారు. అనేక అవరోధాలను, అడ్డంకులను దాటి కొత్త పుంతలు తొక్కుతున్న ఇలాంటి మహిళలు అనేక మంది ఉన్నారు. ఐక్యరాజ్యసమితి 1975 మార్చి 8 నుంచీ అంతర్జాతీయ మహిళా దినాన్ని జరుపుకుంటున్నది. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ భారతీయ సమాజంలో స్త్రీల పట్ల అనుసరిస్తున్న వైఖరిలో చెప్పుకోదగ్గ మార్పు కనపడుతున్నది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం అయ్యేందుకు వారు మరింత పెద్ద ఎత్తున ప్రవేశించాల్సిన సమయం ఆసన్నమైంది. మహిళల భాగస్వామ్యం లేకుండా, దేశ అభ్యున్నతిలో వారు పాత్ర పోషించకుండా ప్రజాస్వామ్యం ఫలవంతం, సంపూర్ణం కాలేదు. ఒక స్త్రీ విద్యావంతురాలైతే మొత్తం కుటుంబం విద్యావంతం అయినట్లు లెక్క. అప్పుడు సమాజం, దేశం మొత్తం విద్యావంతంగా మారుతుంది. స్త్రీ లేకుండా పురుషుడు లేడు. ఏటేటా విద్యావంతులైన స్త్రీల సంఖ్య పెరుగుతున్న కొద్దీ శిశు మరణాలరేటు కూడా పెద్ద ఎత్తున తగ్గిపోతున్నదని ఐక్యరాజ్యసమితి 219 దేశాల సమాచారాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఒక నివేదికలో స్పష్టం చేసింది. వివిధ కార్పోరేట్ సంస్థల బోర్డుల్లో మహిళలు బోర్డు డైరెక్టర్లుగా ప్రవేశించిన తర్వాత చెప్పుకోదగ్గ ఆర్థిక ఫలితాలు వచ్చాయని 500 ఫార్చూన్ కంపెనీలను అధ్యయనం చేసిన తర్వాత ఆర్థిక సహకార, అభివృద్ది సంస్థ (ఓఇసిడి) నివేదిక పేర్కొంది. వుమన్ అన్న పదంలో మాన్ అన్న పదం కూడా ఉన్నదన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. 2014లో అధికారంలోకి వచ్చిన నాటినుంచీ మహిళలకు ఆర్థిక, సామాజిక సాధికారికత కల్పించి, వారిని తమ కాళ్లపై పై తాము నిలబడేలా చేయడం ఎన్డీఏ ప్రభుత్వం తన ప్రధాన ఎజెండాలో భాగంగా ఎంచుకున్నది. బేటీ బచావో- బేటీ పడావో, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, సుకన్యా సమృద్ధి యోజన పేర్లతో నరేంద్రమోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న మూడు ప్రధాన పథకాలు తీవ్రంగా పడిపోతున్న స్త్రీశిశు నిష్పత్తిని అరికట్టేందుకు, మహిళల సంక్షేమానికి తోడ్పడేవి. ఉజ్జ్వల పథకం క్రింద 2019 కల్లా 5 కోట్ల ఎల్‌పిజి కనెక్షన్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహిళలను వంట చెరుకు ద్వారా వండడం వల్ల వచ్చే జబ్బుల నుంచి నివారించడమే ఈ పథకం ఉద్దేశం. దీని వల్ల కాలుష్యం కూడా తగ్గిపోతుంది. అపరిశుభ్ర ఇంధనం ద్వారా వచ్చే పొగను పీల్చడం 400 సిగరెట్లను పీల్చడం కంటే ప్రమాదకరమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. సుకన్యా సమృద్ధి యోజన క్రింద బాలికలకు సురక్షితమైన భద్రతను ఏర్పర్చేందుకు కోటికి పైగా ఖాతాలను తెరిచారు. ఈ ఖాతాల్లో 11 వేల కోట్ల మేరకు నిధులు జమయ్యాయి. ఇక గర్భిణీ స్త్రీలకు సమగ్రమైన ప్రసూతి సేవలను అందించేలా ప్రధానమంత్రి సురక్షిత్ మైత్రిత్వ పథకం తోడ్పడుతుంది. ప్రసూతి ప్రయోజనాలచట్టం క్రింద మహిళా ఉద్యోగులకు లభించే సెలవును 12 వారాల నుంచి 26 వారాలకు పెంచాలని ఎన్డీఏ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.స్త్రీ పురుషుల మధ్య సమానత్వం, లింగపరమైన వివక్ష లేకుండా చూడడం అనేది దేశంలో ప్రతి పౌరుడి బాధ్యత. మహిళలకు సమానమైన పని, సమానమైన వేతనాలు, సమాన ఆస్తి, సమాన సాధికారిత సాధించడం, వారిపై అన్ని రకాల వివక్షకు తావు లేకుండా చూడడం ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలి. అయితే స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు అవుతున్నప్పటికీ, అసెంబ్లీలలో, పార్లమెంట్‌లో రిజర్వేషన్‌ను విస్తరించాల్సిన సమయం ఆసన్నమైంది. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం అనుకున్న ఫలితాలను సాధించలేదని, అక్కడ మహిళా సర్పంచ్‌ల బదులు వారి భర్తలే అధికారం చలాయిస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటివి కేవలం కొన్ని చోట్ల మాత్రమే జరుగుతున్నాయి. అన్ని చోట్లా జరుగుతున్నాయనడం వాస్తవం కాదు. ఈ పేరుతో ప్రగతి శీల మహిళా రిజర్వేషన్ బిల్లును కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అవి తమ మహిళా వ్యతిరేక వైఖరిని విడనాడి మరింత విశాల దృక్పథంతో సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రావాలి. అంతేకాదు, మతం, సాంప్రదాయ పద్ధతులు, మూడు సార్లు తలాఖ్ పేరుతో అమలు చేసే వ్యక్తిగత చట్టాలలో మహిళల పట్ల వివక్షను అంతం చేసే సమయం కూడా ఆసన్నమైంది.ముప్పవరపు వెంకయ్యనాయుడుకేంద్ర సమాచార ప్రసార, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  నిజానికి ప్రతి రోజూ మనం సమాజంలో స్త్రీల పట్ల వివక్షతను విడనాడి, మహిళా చైతన్యం కోసం, పురుషులతో సమానంగా స్త్రీకి అవకాశాలు కల్పించడం కోసం చర్యలు తీసుకున్నప్పుడే మహిళా దినానికి సార్థకత లభిస్తుంది. మహిళా సాధికారికత లేకుండా మానవ జాతి అభ్యున్నతి సాధించలేదు.. అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంగా వాస్తవాన్ని ఉల్లేఖించారు. మహిళా అభ్యున్నతి, సాధికారికతలను సాధించాలంటే పురు షుల ఆలోచనా విధానంలో పూర్తిగా మార్పులు రావడం తప్పనిసరి. పురుషుల కంటే మహిళలు తక్కువ అన్న దృష్టితో చూడడం అనేది కొన్ని సమాజాల్లో మామూలు విషయంగా మారింది. ప్రపంచ జనాభాలో మహిళలు సగ భాగం అన్న విషయాన్ని మనం మరిచిపోతున్నాం. ఈ సగభాగం కృషి లేకుండా అన్ని రంగాల్లో అభ్యున్నతి సాధించడం సాధ్యం కాదు. కనుక తమకంటే స్త్రీలు తక్కువ అన్న దృక్పథాన్ని పురుషులు విడనాడినప్పుడే సమాజం, దేశం, ప్రపంచం అభివృద్ధి చెందుతాయి. మనకు స్వాతంత్ర్యం వచ్చి 69 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మనం స్త్రీ ల పట్ల వివక్షా దృక్పథంలో మాట్లాడుతున్నాం. బాలికా శిశు గర్భ విచ్ఛిత్తి వంటి హేయమైన పనులు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని సంగ్లి జిల్లాలో ఒక కాల్వ వద్ద గర్భ విచ్ఛిత్తి జరిగిన 18 బాలికా శిశు పిండాలను పడవేసిన సంఘటన మొత్తం దేశంలో బుద్ధి జీవులను, సరైన దృక్పథంతో ఆలోచించేవారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. పురుషులతో పాటు స్త్రీలకు విద్య, సాధికారికత, హక్కులు, అభివృద్ధిలో భాగస్వామ్యం సమానంగా లభించినప్పుడే సమాజం అన్ని విధాలా అభ్యున్నతి సాధిస్తుంది. విచిత్రమేమంటే ప్రస్తుత భారతీయ సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న సామాజిక వివక్షకు కారణం హిందూ సాంప్రదాయాలేనని చాలా మంది అజ్ఞానంగా వాదిస్తుంటారు. వేదకాలం నుంచి భారతీయ సమాజంలో మహిళలకు ఎంతో గౌరవం, ఆరాధన లభిస్తున్నదన్న విషయం వారు తెలుసుకోవాలి. హిందూ పురాణాల్లో సంపదకు అధిదేవతగా లక్ష్మిని, విద్యాధిదేవతగా సరస్వతిని, శక్తికి ప్రతిరూపంగా దుర్గను ఆరాధించారు. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా, యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలాః క్రియాః’ అని మన స్మృతులు చెప్పాయి. అంటే ‘ఎక్కడ స్త్రీలకు గౌరవం లభిస్తుందో, అక్కడ దేవ తలు పూజలందుకొంటారు. ఎక్కడ స్త్రీలకు గౌరవం లేదో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలు చేసినా ఫలితం లేదు’ అని అర్థం. నిజానికి మన దేశాన్నే మనం ఒక స్త్రీగా మూర్తీభవించి భారత మాతగా పేర్కొంటున్నాం. మన దేశంలో నదులను సరస్వతి, గంగ, యమున, గోదావరి, కావేరీ అని స్త్రీ పేర్లతో వ్యవహరిస్తున్నాం. అంటే అనాది నుంచి మనం స్త్రీలకు గౌరవాన్నిస్తున్నట్లు స్పష్టమవుతున్నది. స్త్రీల పట్ల ఆరాధనా భావం ఉన్నందువల్లనే మనం పుట్టిన దేశాన్ని మాతృభూమిగా పిలుచుకుంటున్నాం. కానీ ప్రాచీన కాలంలో స్త్రీల పట్ల ఉన్న గౌరవం, ఆరాధన, ఆధునిక నాగరికతలో లేకుండా పోతున్నది. మహిళలను తమతో సమానంగా చూడకుండా ఉండే ప్రవృత్తి పెరిగిపోతున్నది. ఇది ఆందోళనకరం. అందుకే స్త్రీల పట్ల మన ఆలోచనాధోరణి మారాలి. నాడు యుద్ధ రంగంలో వీర విజృంభణ చేసిన రాణీ లక్ష్మీబాయి నుంచి నేడు ఒకే రాకెట్‌లో 104 ఉపగ్రహాలను పంపిన ఇస్రో మహిళా శాస్త్రవేత్తల వరకు వివిధ రంగాల్లో తమకు సాటిగల వారు లేరని స్త్రీలు నిరూపిస్తున్న విషయాన్ని మనం గుర్తెరగాలి. సైన్స్, టెక్నాలజీ రంగాల్లోనే కాకుండా రాజకీయాలు, కళలు, సాహిత్యం, క్రీడలు, విద్య మొదలైన అనేక రంగాల్లో దేశం రాణించడానికి, అభ్యున్నతి చెందడానికి భారతీయ మహిళలు అద్భుతమైన కృషి చేశారు. మహిళలు ఇప్పుడు మన సాయుధ దళాల యుద్ధరంగంలో కూడా దిగారు. ఇటీవలే మన యుద్ధ విమానాలను నడిపేందుకు ముగ్గురు మహిళలు వైమానిక దళంలో చేరి దేశం గర్వపడేలా చేశారు. క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో అత్యద్భుత ప్రతిభ కనబరిచిన సానియా మీర్జా, పి. వి. సింధు, సైనా నెహ్వాల్, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్, మేరీ కామ్‌ల పేర్లు ఇవాళ ఇంటింటా వినిపిస్తుంటాయి. 1984లోనే బచేంద్రపాల్ మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించిన తొలి భారతీయ మహిళగా పేరొందారు. అనేక అవరోధాలను, అడ్డంకులను దాటి కొత్త పుంతలు తొక్కుతున్న ఇలాంటి మహిళలు అనేక మంది ఉన్నారు. ఐక్యరాజ్యసమితి 1975 మార్చి 8 నుంచీ అంతర్జాతీయ మహిళా దినాన్ని జరుపుకుంటున్నది. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ భారతీయ సమాజంలో స్త్రీల పట్ల అనుసరిస్తున్న వైఖరిలో చెప్పుకోదగ్గ మార్పు కనపడుతున్నది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం అయ్యేందుకు వారు మరింత పెద్ద ఎత్తున ప్రవేశించాల్సిన సమయం ఆసన్నమైంది. మహిళల భాగస్వామ్యం లేకుండా, దేశ అభ్యున్నతిలో వారు పాత్ర పోషించకుండా ప్రజాస్వామ్యం ఫలవంతం, సంపూర్ణం కాలేదు. ఒక స్త్రీ విద్యావంతురాలైతే మొత్తం కుటుంబం విద్యావంతం అయినట్లు లెక్క. అప్పుడు సమాజం, దేశం మొత్తం విద్యావంతంగా మారుతుంది. స్త్రీ లేకుండా పురుషుడు లేడు. ఏటేటా విద్యావంతులైన స్త్రీల సంఖ్య పెరుగుతున్న కొద్దీ శిశు మరణాలరేటు కూడా పెద్ద ఎత్తున తగ్గిపోతున్నదని ఐక్యరాజ్యసమితి 219 దేశాల సమాచారాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఒక నివేదికలో స్పష్టం చేసింది. వివిధ కార్పోరేట్ సంస్థల బోర్డుల్లో మహిళలు బోర్డు డైరెక్టర్లుగా ప్రవేశించిన తర్వాత చెప్పుకోదగ్గ ఆర్థిక ఫలితాలు వచ్చాయని 500 ఫార్చూన్ కంపెనీలను అధ్యయనం చేసిన తర్వాత ఆర్థిక సహకార, అభివృద్ది సంస్థ (ఓఇసిడి) నివేదిక పేర్కొంది. వుమన్ అన్న పదంలో మాన్ అన్న పదం కూడా ఉన్నదన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. 2014లో అధికారంలోకి వచ్చిన నాటినుంచీ మహిళలకు ఆర్థిక, సామాజిక సాధికారికత కల్పించి, వారిని తమ కాళ్లపై పై తాము నిలబడేలా చేయడం ఎన్డీఏ ప్రభుత్వం తన ప్రధాన ఎజెండాలో భాగంగా ఎంచుకున్నది. బేటీ బచావో- బేటీ పడావో, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, సుకన్యా సమృద్ధి యోజన పేర్లతో నరేంద్రమోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న మూడు ప్రధాన పథకాలు తీవ్రంగా పడిపోతున్న స్త్రీశిశు నిష్పత్తిని అరికట్టేందుకు, మహిళల సంక్షేమానికి తోడ్పడేవి. ఉజ్జ్వల పథకం క్రింద 2019 కల్లా 5 కోట్ల ఎల్‌పిజి కనెక్షన్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహిళలను వంట చెరుకు ద్వారా వండడం వల్ల వచ్చే జబ్బుల నుంచి నివారించడమే ఈ పథకం ఉద్దేశం. దీని వల్ల కాలుష్యం కూడా తగ్గిపోతుంది. అపరిశుభ్ర ఇంధనం ద్వారా వచ్చే పొగను పీల్చడం 400 సిగరెట్లను పీల్చడం కంటే ప్రమాదకరమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. సుకన్యా సమృద్ధి యోజన క్రింద బాలికలకు సురక్షితమైన భద్రతను ఏర్పర్చేందుకు కోటికి పైగా ఖాతాలను తెరిచారు. ఈ ఖాతాల్లో 11 వేల కోట్ల మేరకు నిధులు జమయ్యాయి. ఇక గర్భిణీ స్త్రీలకు సమగ్రమైన ప్రసూతి సేవలను అందించేలా ప్రధానమంత్రి సురక్షిత్ మైత్రిత్వ పథకం తోడ్పడుతుంది. ప్రసూతి ప్రయోజనాలచట్టం క్రింద మహిళా ఉద్యోగులకు లభించే సెలవును 12 వారాల నుంచి 26 వారాలకు పెంచాలని ఎన్డీఏ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.స్త్రీ పురుషుల మధ్య సమానత్వం, లింగపరమైన వివక్ష లేకుండా చూడడం అనేది దేశంలో ప్రతి పౌరుడి బాధ్యత. మహిళలకు సమానమైన పని, సమానమైన వేతనాలు, సమాన ఆస్తి, సమాన సాధికారిత సాధించడం, వారిపై అన్ని రకాల వివక్షకు తావు లేకుండా చూడడం ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలి. అయితే స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు అవుతున్నప్పటికీ, అసెంబ్లీలలో, పార్లమెంట్‌లో రిజర్వేషన్‌ను విస్తరించాల్సిన సమయం ఆసన్నమైంది. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం అనుకున్న ఫలితాలను సాధించలేదని, అక్కడ మహిళా సర్పంచ్‌ల బదులు వారి భర్తలే అధికారం చలాయిస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటివి కేవలం కొన్ని చోట్ల మాత్రమే జరుగుతున్నాయి. అన్ని చోట్లా జరుగుతున్నాయనడం వాస్తవం కాదు. ఈ పేరుతో ప్రగతి శీల మహిళా రిజర్వేషన్ బిల్లును కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అవి తమ మహిళా వ్యతిరేక వైఖరిని విడనాడి మరింత విశాల దృక్పథంతో సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రావాలి. అంతేకాదు, మతం, సాంప్రదాయ పద్ధతులు, మూడు సార్లు తలాఖ్ పేరుతో అమలు చేసే వ్యక్తిగత చట్టాలలో మహిళల పట్ల వివక్షను అంతం చేసే సమయం కూడా ఆసన్నమైంది.ముప్పవరపు వెంకయ్యనాయుడుకేంద్ర సమాచార ప్రసార, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
editorial
13,318
10-03-2017 14:18:14
రేపు మాట్లాడుకుందాం : రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : ఒపీనియన్ పోల్స్‌పై ఒపీనియన్ చెప్పడానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిరాకరించారు. ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలవబోతోందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించిన నేపథ్యంలో గెలుపు తమదేనని, రేపు మాట్లాడుకుందామని ధీమాగా చెప్పారు. బిహార్‌లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పు అని రుజువైందని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమిదే ఉత్తర ప్రదేశ్ అధికార పీఠమని స్పష్టం చేశారు.
nation
11
04-05-2017 23:43:02
భగ్గుమన్న బ్యాంకు స్టాక్స్‌.. దూసుకుపోయిన సూచీలు
నిఫ్టీ మళ్లీ కొత్త రికార్డు స్థాయిఒక్కసారిగా పెరిగిన కొనుగోళ్ల మద్దతుతో గురువారం నాడు సెన్సెక్స్‌ మళ్లీ 30 వేల పాయింట్ల కీలక స్థాయిని అధిగమించింది. నిఫ్టీ కొత్త గరిష్ఠ స్థాయి 9359 పాయింట్ల వద్ద ముగిసింది. కొద్ది రోజులుగా ఆచితూచి వ్యవహరిస్తున్న దేశీ ఇన్వెస్టర్లు, ఆపరేటర్లు గురువారం నాడు మరోసారి చెలరేగారు. బ్యాంకింగ్‌ సంస్కరణల విషయంలో ముఖ్యంగా మొండిపద్దుల సమస్య పరిష్కారం విషయంలో ప్రభుత్వం పట్టుదలగా ఉండటం, ఐసిఐసిఐ బ్యాంక్‌ ఆర్థిక ఫలితాలు, కొత్త ఉక్కు విధానం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపును వాయిదా వేయడం.... గురువారంనాటి ట్రేడింగ్‌ను ప్రభావితం చేసిన ముఖ్యాంశాలు.  మొండిపద్దుల విషయంలో సెన్సెక్స్‌ 231 పాయింట్ల లాభంతో 30,126 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 47 పాయుంట్లు లాభపడింది. బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో ముమ్మరంగా లావాదేవీలు జరిగాయి. బ్యాంకింగ్‌ సూచీ పెరిగింది. జనవరి-ఏప్రిల్‌ త్రైమాసికానికి ప్రోత్సాహకరమైన ఫలితాలను ప్రకటించిన ఐసిఐసిఐ బ్యాంక్‌ షేరు 9 శాతం దూసుకుపోయింది. బ్యాంకింగ్‌ రంగాన్ని వేధిస్తున్న ఎన్‌పిఎల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం పక్కాకార్యాచరణతో ముందుకురావడం బ్యాంకింగ్‌ షేర్లను ఆకర్షణీయంగా మార్చింది. బ్యాంకింగ్‌ షేర్లు 9 శాతం వరకు లాభపడ్డాయి. బాంక్‌ నిఫ్టీ సూచీ ఆల్‌టైమ్‌ గరిష్ఠస్థాయి 22,720 పాయింట్లను తాకింది.ఐసిఐసిఐ బ్యాంక్‌ షేరు ధర 9 శాతం లాభంతో 297 రూపాయలకు దూసుకుపోయింది. ఇంట్రాడేలో ఈ షేరు ధర 52 వారాల గరిష్ఠస్థాయి 299 రూపాయలను తాకింది. తాజా ర్యాలీతో ఈ షేరు మార్కె ట్‌ క్యాపిటలైజేషన్‌ 14,711 కోట్ల రూపాయల లాభంతో 1,73,573 కోట్ల రూపాయలకు చేరింది. ఈ స్ర్కిప్‌లో ఎన్‌ఎస్ఇలోనూ, బిఎస్ఇలోనూ ట్రేడింగ్‌ పరిమాణం కూడా భారీగా పెరిగింది.కెనరా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఐడిఎ్‌ఫసి బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ భారీగా లాభపడిన షేర్లలో ఉన్నాయి.
business
18,051
29-09-2017 11:43:01
కిమ్ ఎత్తుగడతో అమెరికా మిత్రదేశాలకు దడ!
న్యూయార్క్: రోజుకో అణుబాంబు పరీక్షిస్తూ అమెరికాను మంచినీళ్లు తాగిస్తున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.. తాజాగా మరో ఎత్తుగడ వేశారా? ప్రపంచం ముందు తనను ఒంటరిగా నిలబెట్టాలనుకుంటున్న అమెరికాకు.. రివర్స్ కౌంటర్‌తో దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారా? అవుననే అంటున్నారు అమెరికా మాజీ సీనియర్ అధికారి డాక్టర్ బ్రాడ్ రాబర్ట్స్... అమెరికా నుంచి దాని మిత్రదేశాలను దూరం చేసేందుకు ఆస్ట్రేలియాపై ఉత్తరకొరియా అణుబాంబు ప్రయోగించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.అమెరికా అణు రక్షణ విభాగంలో డిప్యూటీ అసిస్టెండ్ సెక్రటరీగా పనిచేసిన రాబర్ట్స్... ఎవ్వర్నీ మాట్లాడకుండా చేసేందుకు ఆస్ట్రేలియాపై దాడిచేయడమే ఉత్తర కొరియా అధ్యక్షుడి ముందున్న అవకాశం కావచ్చునన్నారు. తన హెచ్చరికలను పెడచెవిన పెడుతున్న దేశాలను కిమ్ భయపెట్టి దారికి తెచ్చుకునే అవకాశం ఉందన్నారు.  ఒంటరిగా నిలిచిన ఉత్తర కొరియా ప్రపంచానికే ముప్పుగా తయారైందంటూ ఐక్యరాజ్య సమితి అణు అనుబంధ సంస్థ ఆందోళన వెలిబుచ్చిన నేపథ్యంలోనే రాబర్ట్స్ వ్యాఖ్యలు రావడం ప్రపంచాన్ని మరింత కలవరపెడుతోంది. ఉత్తరకొరియా వరుసబెట్టి ఆరుసార్లు అణు పరీక్షలు నిర్వహించడం ‘‘చాలా వేగవంతమైన పురోగతి’’ అని అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ డైరెక్టర్ యుకియా అమానో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం మొత్తం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
nation
21,246
11-11-2017 00:53:20
లలిత్‌ బాబుకు జాతీయ చెస్‌ టైటిల్‌
పట్నా: తెలుగు తేజం, భారత గ్రాండ్‌మాస్టర్‌ లలిత్‌బాబు జాతీ య ప్రీమియర్‌ చెస్‌ టోర్నీలో చాంపియన్‌గా నిలిచాడు. ఆల్‌ బిహార్‌ చెస్‌ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో లలిత్‌ బాబు తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 13 మంది టాప్‌ ఆటగాళ్లు ఈ టోర్నీలో తలపడ్డారు. అయితే చివరి వరకు లలిత్‌కు గట్టి పోటీగా నిలిచిన అరవింద్‌ చిదంబరం (తమిళనాడు) శుక్రవారం ఆఖరిదైన 13వ రౌండ్‌లో ఒడిశా గ్రాండ్‌మాస్టర్‌ దేబాశిష్‌ దాస్‌ చేతిలో ఓడిపోయాడు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లలిత్‌ బాబుకు టైటిల్‌ ఖాయమైంది. 12వ రౌండ్‌ వరకు లలిత్‌ బాబు, అరవింద్‌ 8.5 పాయింట్లతో సమానంగా నిలవడంతో ఆఖరి రౌండ్‌పై ఆసక్తి నెలకొంది. ఇక అరవింద్‌ (8.5) రెండో స్థానంతో సరిపెట్టుకో వాల్సి వచ్చింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ కార్తికేయన్‌ (7.5) మూడో స్థానంలో నిలిచాడు. విజేతగా నిలిచిన లలిత్‌ 2018 ప్రపంచకప్‌తో పాటు చెస్‌ ఒలింపియాడ్‌ చాంపియన్‌షిప్‌, ఏసియన్‌ కాంటినెంటల్‌ పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతిని థ్యం వహించనున్నాడు. అంతకుముందు తన చివరి రౌండ్‌లో లలిత్‌బాబు కేవలం 14 ఎత్తుల్లో స్వప్నిల్‌ ధోపడేతో డ్రాకు అంగీకరించి ఆశ్చర్య పరిచాడు. దీంతో 9 పాయింట్లతో టాప్‌లో నిలవగలిగాడు.
sports
13,812
16-09-2017 18:35:10
మోదీ ‘నవ భారతం’ ఈశాన్యం నుంచే : సీఎం
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలలుగంటున్న ‘నవ భారతం’ ఈశాన్య భారతదేశం నుంచే ప్రారంభమవుతుందని అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ చెప్పారు. ఆగ్నేయాసియా అనుసంధాన ప్రాజెక్టును ప్రభుత్వం ఇక్కడి నుంచే ప్రారంభిస్తోందని చెప్పారు. ‘యాక్ట్ ఈస్ట్’ పాలసీ ద్వారా గౌహతిని ఆగ్నేయాసియా కనెక్టివిటీ కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామన్నారు. ‘నవ భారతం’ ఈశాన్య రాష్ట్రాల నుంచే ప్రారంభమవుతుందనే విశ్వాసం తనకు ఉందన్నారు. భారతదేశ అభివృద్ధికి నూతన వాహకంగా ఈశాన్య ప్రాంతాలను తీర్చిదిద్దాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్ర రాజధాని ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులను ఆకర్షించాలని, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని చెప్పారు.
nation
7,188
04-08-2017 19:55:43
బంగారు నాణేలను బహుమతిచ్చిన విజయ్
సినిమా హిట్ అయితే దర్శకులకు భారీ బహుమతులు ఇవ్వడం ఇప్పటివరకూ చూశాం. కానీ విడుదలకు ముందే చిత్రయూనిట్ అందరికీ కానుకలు ఇస్తున్నాడు తమిళ హీరో విజయ్. విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న తమిళ చిత్రం 'మెర్సల్'. విజయ్ సరసన కాజల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్.జె.సూర్య కీలకపాత్రను పోషిస్తున్నాడు. ఎ.ఆర్.రహమాన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం ఆడియోను ఈ నెల 20న విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు పనిచేసిన యూనిట్ సభ్యులందరికీ బంగారు నాణెలను కానుకగా అందించాడట విజయ్. దాదాపు 200 మంది యూనిట్ సభ్యులు విజయ్ చేతుల మీదుగా బంగారు నాణెలు అందుకున్నట్టు తెలుస్తోంది. ఓ సినిమా హిట్ అవగానే తనకు అంతటి ఘన విజయాన్ని అందించిన దర్శకులకు బహుమతులు ఇవ్వడం మనం తెలుగులో చూస్తూనే ఉన్నాం. అయితే ఇలా సినిమా విడుదలకు ముందే యూనిట్ సభ్యులందరికీ కానుకలు ఇవ్వడం మాత్రం విజయ్‌కే చెల్లింది. పైగా ఇలా కానుకలు ఇవ్వడం విజయ్‌కు ఇదేం కొత్త కాదు. గతంలో 'పులి' సినిమా సమయంలోనూ 265 మంది యూనిట్ సభ్యులకు బంగారు నాణెలు ఇచ్చాడు విజయ్.  మొత్తానికి ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే హీరోలు ఆ సినిమాకు తనతో పాటు కష్టపడ్డ వారందరికీ ఇలా ఏదో రూపేన కానుకలు ఇచ్చి సంతృప్తి పరచడం ఆహ్వానించదగ్గ విషయమే. మరి ఈ విషయంలో విజయ్ ఫాలో అయ్యే హీరోలెందరో..!
entertainment
15,815
06-12-2017 01:23:10
వేలెత్తి చూపే విధంగా వెంకయ్య నిర్ణయం
‘రాజ్యసభ చైర్మన్‌ నిర్ణయాధికారం ప్రశ్నించడానికి వీలు లేకుండా ఉండాలి.. కానీ, శరద్‌ యాదవ్‌, అన్వర్‌ అలీలపై అనర్హతవేటు నిర్ణయం వేలెత్తి చూపే విధంగా ఉన్నది.- సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
nation
2,569
30-03-2017 23:58:09
ప్రథమార్ధం మెరుగు
ఇంట్రాడే ట్రేడింగ్‌కు ప్రారంభ స్థాయి కీలకం. అంతకన్నా దిగువన మాత్రమే షార్ట్‌ పొజిషన్లు శ్రేయస్కరం.
business
6,845
12-02-2017 22:52:05
ప్రేమెంత పనిచేస్తుందంటే...
హరికృష్ణ, అక్షతను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ జె.ఎస్.ఆర్‌. మూవీస్‌ పతాకంపై స్వీయ నిర్మాణంలో జొన్నలగడ్డ శ్రీనివాసరావు రూపొందిస్తోన్న చిత్రం ‘ప్రేమెంత పనిచేసే నారాయణ’. తొలి షెడ్యూల్‌ పూర్తిచేసుకున్న చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ ‘‘ఇది చక్కటి ప్రేమకథా చిత్రం. ఇటీవలే అరకు, పాడేరు, విశాఖ పరిసర ప్రాంతాల్లో మొదటి షెడ్యూల్‌ పూర్తిచేశాం. రెండో షెడ్యూల్‌ను ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభించాం. మార్చి తొలి వారంలోగా షూటింగ్‌ కంప్లీట్‌ చేస్తాం. మార్చి రెండో వారంలో పాటల్ని విడుదలచేసి అదే నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, ఛాయాగ్రహణం: వంశీ, ఫైట్స్‌: రామ్‌శంకర్‌, అవినాష్‌, సహ నిర్మాత: సావిత్రి జొన్నలగడ్డ, కథ, కథనం, నిర్మాణం, దర్శకత్వం: జొన్నలగడ్డ శ్రీనివాసరావు.
entertainment
9,268
14-05-2017 12:41:37
వెయ్యి కోట్లు సాధించి బాహుబలి సరసన చేరిన మరో సినిమా!
భారత సినీ చరిత్రలో వెయ్యి కోట్లు సాధించిన సినిమా ఏదంటే.. మరే ఆలోచనా లేకుండా బాహుబలి-2 అనేస్తాం. ఇప్పుడు ఆ జాబితాలో మరో సినిమా వచ్చి చేరింది. కానీ, ఆ సినిమా ఇదివరకే విడుదలైంది. విడుదలై నాలుగు నెలలు దాటిపోయింది. అదేంటి.. విడుదలైన నాలుగు నెలలకు ఆ సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్లను ఎలా సాధించింది..? ఆ సినిమా ఏంటి..? అని అనుకుంటున్నారా.. ఆ సినిమా బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించిన దంగల్. వాస్తవానికి ఆ సినిమా సాధించిన కలెక్షన్లు రూ.700 కోట్లకు కొంచెం ఎక్కువ. మరి ఇప్పుడు వెయ్యి కోట్లు ఎలా సాధించిందన్న అనుమానం రావొచ్చేమో. అయితే.. అందులో అనుమానమేమీ లేదట. ఎందుకంటే.. నాలుగు నెలలు ఆలస్యంగా చైనా, తైవాన్‌లలో దంగల్ సినిమాను ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే.           అక్కడా ఆమిర్‌కు మంచి మార్కెట్టే ఉంది. దీంతో అక్కడ కూడా ఆమిర్ దంగల్ మూవీ కాసుల వర్షం కురిపిస్తోందట. ఇప్పటిదాకా అక్కడ రూ.300 కోట్లకు పైనే వసూళ్లు సాధించిందట. దీంతో పాతవి రూ.700 కోట్లు, కొత్తవి రూ.300 కోట్లు కలిపి.. దంగల్ సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్లను సాధించిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కాగా, రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి రూ.1500 కోట్ల వైపు అడుగులు వేస్తున్న బాహుబలిని.. ఈ ఏడాది చివరి నాటికల్లా చైనాలో విడుదల చేయాలని భావిస్తున్నారట. మరి, అక్కడ కూడా బాహుబలి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందా చూడాలి. ఇక, బాలీవుడ్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారమైతే బాహుబలి సరసన వెయ్యి కోట్ల క్లబ్‌లో దంగల్ చేరినట్టే.
entertainment
11,039
06-08-2017 01:00:48
మీవల్ల నెహ్రూకు ఎన్ని ఇబ్బందులో!
శిఖరాగ్ర భేటీలో మావోను దులిపేసిన కృశ్చేవ్‌!బీజింగ్‌, ఆగస్టు 5: చైనా-రష్యాల మధ్య స్నేహ సంబంధాలు తెగిపోవడానికి 1959 నాటి భారత్‌-చైనా సరిహద్దు గొడవలే కారణమని హాంకాంగ్‌ పత్రిక ఒకటి వెల్లడించింది. ఆ ఏడాది సోవియట్‌ యూనియన్‌ అధినేత నికితా కృశ్చేవ్‌ చైనాలో పర్యటించారు. భారత్‌తో ఘర్షణలో చైనాదే తప్పని మావో జెడాంగ్‌కు మొహం మీదే చెప్పారు. భారత ప్రధాని నెహ్రూ ఏ తప్పూ చేయలేదన్నారు. ఆ సమావేశం 1959 సెప్టెంబరు నెలలో హాట్‌హాట్‌గా సాగింది. చైనా దాడి వల్ల భారత్‌లో నెహ్రూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కృశ్చేవ్‌ మండిపడ్డారు. చైనా కూడా ఏ మాత్రం తగ్గలేదు. సోవియట్‌ భారత్‌ కొమ్ము కాస్తోందని మావో ఆరోపించారు. తర్వాత చైనా అమెరికాకు దగ్గరైంది.
nation
3,107
07-03-2017 23:46:13
టాటా ‘రేస్‌మో’ స్పోర్ట్స్‌ కారు
జెనీవా: దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌.. తొలి స్పోర్ట్స్‌ కారును విడుదల చేసింది. జెనీవా అంతర్జాతీయ మోటార్‌ షోలో తొలి స్పోర్ట్స్‌ కారు రేస్‌మోను టాటా సన్స్‌ చైర్మన్‌ ఎమిరెటస్‌ సమక్షంలో టాటా సన్స్‌ కొత్త చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌, టాటా మోటార్స్‌ సిఇఒ, ఎండి గుంటెర్‌ బుట్చెక్‌ ఆవిష్కరించారు. కొత్త సబ్‌ బ్రాండ్‌ టామో కింద తొలిసారిగా రెండు సీట్ల స్పోర్ట్స్‌ కూపేను టాటా మోటార్స్‌ తీసుకువచ్చింది. రేస్‌మోతో పాటు కాంపాక్ట్‌ సెడాన్‌ విభాగంలో నెక్ట్స్‌ జెనరేషన్‌ ఉత్పత్తులైన సెడాన్‌ టైగర్‌, ఎస్‌యువి నెక్సాన్‌ను కూడా ఆటోషోలో టాటా మోటార్స్‌ విడుదల చేసింది.  టామో బ్రాండ్‌ కింద రేస్‌మోను ఆవిష్కరించటం ద్వారా టాటా మోటార్స్‌... తన గతిని మార్చుకున్నట్లు స్పష్టంగా వెల్లడించినట్లయిందని కంపెనీ సిఇఒ, ఎండి గుంటెర్‌ బుట్చెక్‌ తెలిపారు. భారత సహా ప్రపంచవ్యాప్తంగా మారుతున్న అభిరుచులకు అనుగుణంగా యూతఫుల్‌ బ్రాండ్‌గా కంపెనీ తన స్థానాన్ని పటిష్ఠం చేసుకునేందుకు కొత్త స్పోర్ట్స్‌ కారు తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, టెక్నాలజీకి అనుగుణంగా ప్రత్యేకమైన స్టైల్‌, డిజైన్‌తో రేస్‌మోను రూపొందించినట్లు ఆయన చెప్పారు.టామో బ్రాండ్‌ కింద విక్రయించనున్న ఈ స్పోర్ట్స్‌ కారును 2017-18 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లోకి విడుదల చేయాలని చూస్తున్నట్లు గుంటెర్‌ వెల్లడించారు. రియర్‌ మౌంటెడ్‌ 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌తో కూడిన రేస్‌మో.. 190 పిఎస్‌ పవర్‌తో దూసుకుపోతుందని తెలిపారు. టాటా మోటార్స్‌ పేటెంటెడ్‌ అయిన మోఫ్లెక్స్‌ మల్టీ మెటీరియల్‌ శాండ్‌విచ్‌ (ఎంఎం ఎస్‌) స్ట్రక్చర్‌.. రేస్‌మో సొంతమని ఆయన పేర్కొన్నారు. భారత మార్కెట్లో.. రేస్‌మో టాటా మోటార్స్‌కు ప్రత్యేకమైన స్థానాన్ని అందిస్తుందని భావిస్తున్నట్లు గుంటెర్‌ తెలిపారు. అడ్వాన్స్‌డ్‌ నేవిగేషన్‌, రిమోట్‌ మానిటరింగ్‌, ఎయిర్‌ అప్‌డేట్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, మైక్రోసాఫ్ట్‌ అజురే రూపొందించిన మెషిన్‌ లెర్నింగ్‌ ఈ కారు ప్రత్యేకతలని పేర్కొన్నారు. కాగా టైగర్‌ను వచ్చే ఇరవై రోజుల్లో భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్‌ మయాంక్‌ పరీఖ్‌ వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత ప్యాసింజర్‌ కార్ల విభాగంలో టాప్‌ 3 గా ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు పరీఖ్‌ తెలిపారు.
business
7,322
05-03-2017 22:46:18
‘డీజే’.. ఎందుకింత డిస్‌లైక్‌?
అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తోన్న ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్‌’ సినిమా ఫస్ట్‌లుక్‌ ఎంత ఆసక్తికరంగా అనిపించిందో, యూట్యూబ్‌లో రిలీజ్‌ చేసిన ట్రైలర్‌ కూడా అంతే ఆదరణను పొందుతోంది. అయితే ఇక్కడే కొత్త కథ మొదలైంది. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమాకూ రానన్ని ‘డిస్‌లైక్స్‌’ (అప్రియాలు) ఈ సినిమాకు నమోదయ్యాయి. ఫిబ్రవరి 23న యూట్యూబ్‌లో ట్రైలర్‌ను ఆవిష్కరిస్తే తొమ్మిది రోజుల్లో 7.7 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. 1.52 లైక్స్‌ రాగా, అనూహ్యంగా 1.37 మందికి ఇది అప్రియమని తోచింది. తెలుగు సినిమాకు సంబంధించి ఈ స్థాయి నెగటివ్‌ రెస్పాన్స్ రావడం ఓ రికార్డ్‌గా చెప్పాలి. ఫలితంగా తెలుగు చిత్రసీమలో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఈ డిస్‌లైక్స్‌ వెనుక పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్ ఉన్నారంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీన్ని పవన్ ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. కొంతకాలంగా పవన్ అభిమానులకు, బన్నీకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలాంటి వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీకి చెందిన ఏ హీరో సినిమా ఈవెంట్‌ జరిగినా, అందులో ‘పవర్‌స్టార్‌.. పవర్‌స్టార్‌’ అంటూ పవన్ ఫ్యాన్స్ కేకలు వేస్తూ రావడం బన్నీకి అసహనాన్ని కలిగించి, దానిపై ఆయన ‘చెప్పను బ్రదర్‌’ అంటూ కామెంట్‌ చేయడం తెలిసిందే. అప్పట్నించీ బన్నీపై పవన్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. అదే ఇప్పుడు ‘దువ్వాడ జగన్నాథమ్‌’ ట్రైలర్‌పై డిస్‌లైక్స్‌ రూపంలో బయటపడిందని ప్రచారం జరుగుతోంది. ఆ ట్రైలర్‌కు వస్తున్న కామెంట్స్‌ చూస్తే ఇదే విషయం అర్థమవుతోంది. ట్రైలర్‌కు 5 మిలియన వ్యూస్‌ పూర్తయినప్పుడు చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్‌ చేసిన కామెంట్‌లో శ్రీశ్రీ కవిత్వాన్ని ఉటంకించడం అందర్నీ ఆలోచనలో పడేసింది. ‘థాంక్స్‌ ఫర్‌ దట్‌ వ్యూస్‌ అండ్‌ దిస్‌ లైక్స్‌.. యద్భావం తద్భవతి’ అంటూ ట్విట్టర్‌లో స్పందించిన హరీశ్.. ‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే’ అనే శ్రీశ్రీ కవిత్వ పాదాల్ని పోస్ట్‌ చేశాడు. దాని వెనుక అంతరార్థమేమిటనే దానిపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. పూజా హెగ్డే నాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.
entertainment
8,360
12-12-2017 14:36:51
సందీప్ కిషన్ ముద్దు సీన్‌పై.. దర్శకేంద్రుడి కామెంట్
తాను, కృష్ణ 40ఏళ్లుగా ఒకే కుటుంబంలా కలిసి ఉంటామని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అన్నారు. కృష్ణ కుమార్తె మంజుల నిర్మించిన మనసుకు నచ్చింది ఫస్ట్‌లుక్ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన మాట్లాడుతూ ‘‘మామూలుగా పండక్కి గారె, పూర్ణాలు పెడతారు. పళ్లెంలో గారె, పూర్ణం పెట్టి ఒక ముక్క తినగానే ప్లేట్ లాక్కున్నట్టుంది’’ అన్నారు. అసలు ఈ మాట ఎందుకన్నారు.. అంటారా? మనసుకు నచ్చింది ఫస్ట్‌లుక్‌లో సందీప్ కిషన్ హీరోయిన్‌ని ముద్దు పెట్టుకోబోతుండగా పిక్‌ని తీయడంపై అలా సరదాగా స్పందించారు. ట్రంప్ కూతరు ఇవాంక తన పేరు పక్కన తన తండ్రి పేరును చేర్చుకోవడంతో చాలా ఫేమస్ అయిందని.. అలాగే మంజుల కూడా తన పేరును మంజుల కృష్ణగా మార్చుకుంటే తను కూడా బాగే ఫేమస్ అవుతుందన్నారు.
entertainment
1,801
03-02-2017 23:42:59
సూపర్‌ హిట్‌
ముంబై : బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బిఎస్‌ఇ) షేర్లు శుక్రవారం ఎన్‌ఎస్‌ఇలో అదరగొట్టాయి. సెబి నిబంధనల ప్రకారం బిఎస్‌ఇ తొలి ఇష్యూ షేర్లను ఎన్‌ఎస్‌ఇలో లిస్టింగ్‌ చేయగా తొలిరోజే షేరు ధర 33 శాతం దూసుకుపోయింది. దీంతో 140 ఏళ్ల చరిత్ర గల బిఎస్‌ఇ స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌ అయిన తొలి ఎక్స్ఛేంజిగా చరిత్రకెక్కింది. బిఎస్‌ఇ మార్కెట్‌ విలువ 5,750 కోట్ల రూపాయలయింది. బిఎస్‌ఇలో లిస్టింగ్‌ అయిన కంపెనీలన్నింటి మార్కెట్‌ విలువ 115 లక్షల కోట్ల రూపాయలుంది. బిఎస్‌ఇ ఇష్యూ ధర 806 రూపాయలు కాగా 34.61 శాతం వృద్ధితో 1,085 రూపాయల వద్ద లిస్టింగ్‌ అయింది. ఇంట్రాడేలో 48.88 శాతం పెరిగి 1,200 రూపాయలను తాకిన షేరు ముగింపు సమయానికి 32.65 శాతం లాభంతో 1,069.20 రూపాయల వద్ద క్లోజయింది. తమ ఎక్స్ఛేంజ్‌ అన్ని రకాల రెగ్యులేటరీ ప్రమాణాలకు కట్టుబడి పని చేస్తుందని బిఎస్‌ఇ సిఇఒ ఆశిష్ కుమార్‌ చౌహాన్‌ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ లిస్టింగ్‌తో పది సంవత్సరాల తమ కృషి ఫలించిందని ఆయన అన్నారు. తమ ఎక్స్ఛేంజీలో ఎన్‌ఎస్‌ఇ లిస్టింగ్‌ కావడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు బిఎ్‌సఇ చైర్మన్‌ సుధాకరరావు అన్నారు. ఎన్‌ఎ్‌సఇ పది వేల కోట్ల రూపాయల సమీకరణ కోసం సెబికి దరఖాస్తు సమర్పించిన విషయం విదితమే. సెబి నిబంధనల ప్రకారం స్టాక్‌ ఎక్స్ఛేంజిలు సొంత ప్లాట్‌పారం మీద లిస్టింగ్‌ కాకూడదు. బిఎస్‌ఇ లిస్టింగ్‌తో ఆ ఎక్స్ఛేంజీలో సాంప్రదాయిక బ్రోకర్ల వాటా 30 శాతం కన్నా తగ్గి 70 శాతం వాటాలు ప్రజల చేతుల్లోకి వెళ్లాయని చౌహాన్‌ అన్నారు. బిఎస్‌ఇ ఇష్యూ 51.22 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. పాలనా విధానాలు, విశ్వసనీయత, నమ్మకం ద్రవ్య, ఆర్థిక నిర్వహణకు ప్రధానమని, స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ఇందులో ముందు వరుసలో ఉండాలన్నది నిర్వివాదమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్‌ఎస్‌ఇ చైర్మన్‌ అశోక్‌ చావ్లా అన్నారు. ఈ దిశగా జరిగే ప్రయత్నంలో స్టాక్‌ ఎక్స్ఛేంజీల లిస్టింగ్‌ కీలకమైన అడుగు అని ఆయన పేర్కొన్నారు. 2016 సంవత్సరంలో 26 కంపెనీలు బిఎస్‌ఇలో లిస్టింగ్‌ అయి 26 వేల కోట్ల రూపాయలు సమీకరించిన అనంతరం 2017 సంవత్సరానికి బిఎస్‌ఇ ఇష్యూ శుభారంభం పలికిందని మార్కెట్‌వర్గాలంటున్నాయి. 2010 సంవత్సరం తర్వాత ఐపిఓలు అధిక సంఖ్యలో జారీ అయిన సంవత్సరం 2016 అని వారన్నారు. లిస్టెడ్‌ కంపెనీల సంఖ్యపరంగా బిఎస్‌ఇ ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్ఛేంజీగా చరిత్ర సృష్టించింది. మూడు వేల వరకు కంపెనీలు బిఎ్‌సఇలో లిస్టింగ్‌ అయ్యాయి. మార్కెట్‌ కాపిటలైజేషన్‌పరంగా ప్రపంచంలో పదో పెద్ద ఎక్స్ఛేంజీ ఇది. 2016 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో బిఎస్‌ఇ కన్సాలిడేటెడ్‌ లాభం 40 శాతం వృద్ధితో 52.72 కోట్ల రూపాయల కన్సాలిడేటెడ్‌ లాభం ప్రకటించింది. స్టాక్‌మార్కెట్‌ బడ్జెట్‌ ర్యాలీని కొనసాగించి మూడో రోజు కూడా లాభాలతో ముగిసింది. వచ్చే వారం ప్రకటించనున్న ద్రవ్యపరపతి విధానంలో ఆర్‌బిఐ వడ్డీ రేట్ల సడలింపు వైఖరి ప్రదర్శించవచ్చునన్న సంకేతాలు వెలువడడం కూడా మార్కెట్‌లో ఉత్సాహాన్ని నింపింది. వరుసగా రెండు రోజుల ర్యాలీ అనంతరం శుక్రవారం ప్రారంభంలో మార్కెట్‌ కాస్తంత పుల్‌బ్యాక్‌ సాధించినా చివరికి లాభాలతో ముగిసింది. ప్రధానంగా బ్యాంకింగ్‌, హెల్త్‌కేర్‌ స్టాక్‌లు మంచి ఊతం ఇచ్చాయి. గత రెండు సెషన్లలో 570.65 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ శుక్రవారం 13.91 పాయింట్ల స్వల్పలాభంతో 28,240.52 పాయింట్ల వద్ద క్లోజయింది. నిఫ్టీ 6.70 పాయింట్ల లాభంతో 8740.95 పాయింట్ల వద్ద ముగిసింది. వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 358.06 పాయింట్లు, నిఫ్టీ 99.70 పాయింట్లు లాభపడ్డాయి.
business
16,907
17-05-2017 01:56:32
ఏం సాధించారని ఉత్సవాలు?
అన్ని రంగాల్లో మోదీ సర్కారు ఘోర వైఫల్యం: రాహుల్‌ప్రభుత్వ వైఫల్యాలపై రెండేళ్లు ఉద్యమం: కాంగ్రెస్‌ప్రభుత్వం ఏ వాగ్దానం నెరవేర్చలేదు?: నిర్మలా సీతారామన్‌న్యూఢిల్లీ, మే 16: హామీలు విస్మరించడంతో పాటు అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైన మోదీ మూడేళ్ల పాలనలో ఏంసాధించారని ఉత్సవాలు జరుపుకుంటున్నా రని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం మూడేళ్లుగా రైతులను మోసం చేయడంతో వారు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, విదేశీ విధానంలో ఘోర వైఫల్యంవల్ల జవాన్లు ప్రాణాలు కోల్పోతున్నారని, ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తానన్న వాగ్దానాన్ని మర్చిపోవడంతో నిరుద్యోగ యువత తీవ్ర ఆగ్రహంతో ఉందని రాహుల్‌ ట్విట్టర్‌లో విమర్శించారు. కాగా, బీజేపీ సర్కారు వైఫల్యాలపై జాతీయ స్థాయి ఉద్యమానికి శ్రీకారం చుడ్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. యువ నేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో మిత్రపక్షాలతో కలిసి దేశం నలుమూలలా రెండేళ్ల పాటు ప్రజా ఉద్యమం నిర్వహిస్తామని కాంగ్రెస్‌ పార్టీ నేత రణ్‌దీప్‌ సుర్జేవాలా మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. నల్ల డబ్బును వెలికి తీయడం, జీఎస్టీ, ఆధార్‌, యూపీఏ ప్రభుత్వ పథకాలను కొనసాగించడం, వ్యవసాయం, డిజిటల్‌, స్కిల్‌ ఇండియా వంటి వివిధ అంశాల్లో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ పీపీటీ ద్వారా సుర్జేవాలా వివరించారు. మరోవైపు ప్రభుత్వం ఏవాగ్దానం నెరవేర్చలేదు? ప్రజలను ఏ విషయంలో మోసం చేసింది.. అంటూ రాహుల్‌ గాంధీని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించారు.
nation
418
17-07-2017 02:29:07
చెల్లించిన పన్నుపై క్రెడిట్‌ తీసుకోవచ్చా?
జిఎస్‌టిపై మీ సందేహాలు.. మా సమాధానాలు మేము వర్క్స్‌ కాంట్రాక్టు సర్వీస్‌లో ఉన్నాం. ఇంతకుముందు సర్వీస్‌ టాక్స్‌, వ్యాట్‌.. టాక్స్‌ సిస్టమ్‌లో రెండింటిలో రిజిస్ట్రేషన్‌ ఉంది. జూన్‌ 30నాటికి సుమారు రూ.40 లక్షల మెటీరియల్‌ మా వద్ద ఉంది. దీని మీద ఎక్సైజ్‌ డ్యూటీ, సిఎ్‌సటి కట్టినట్లుగా ఇన్వాయి్‌సలు ఉన్నాయి. మేము వీటి మీద కట్టిన టాక్స్‌ను క్రెడిట్‌ తీసుకోవచ్చా? - జెడి కన్‌స్ట్రక్షన్స్‌, విశాఖపట్నం సిజిఎస్‌టి యాక్ట్‌ 2017లోని సెక్షన్‌ 140, 141, 142లో వీటి గురించి వివరించారు.. నిశితంగా పరిశీలించండి.మేం అడ్వర్ట్‌టైజింగ్‌ ఏజెన్సీని నడుపుతున్నాం. పత్రికల వారు 5 శాతం జిఎస్‌టి కట్టాల్సి ఉంటుందని మెయిల్స్‌ పంపిస్తున్నారు. ఒకవేళ ఏజెన్సీ రిజిస్ట్రేషన్‌ తీసుకోకుంటే లేదా 20 లక్షల రూపాయల లోపు టర్నోవర్‌ ఉంటే ఎవరు టాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది? - శంకర్‌ రావు మీకు పత్రికల వారు పంపిన మెయిల్‌ సరైనదే. మీకు రిజిస్ట్రేషన్‌ ఉన్నా లేకున్నా పత్రిక వాళ్లకు కట్టాల్సిన బిల్లు మీద 5 శాతం జిఎ్‌సటి చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్‌ లేకుంటే మీరు క్లయింట్స్‌ నుంచి టాక్స్‌ వసూలు చేయలేరు. అలాగే పత్రిక వాళ్లకు చెల్లించిన టాక్స్‌ను ఐటిసి కింద తీసుకోలేరు. నేను సివిల్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాను. నా టర్నోవర్‌ 20 లక్షల రూపాయల లోపు ఉంది. నేను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలా? - చిట్టిబాబు 20 లక్షల రూపాయల లోపు టర్నోవర్‌ ఉన్న వారికి సాధారణంగా రిజిస్ట్రేషన్‌ అవసరం ఉండదు. టర్నోవర్‌తో సంబంధం లేకుండా కచ్చితంగా రిజిస్ట్రేషన్‌ అవసరమయ్యే కోవా లోకి మీరు వస్తారేమో చూసుకోండి. అలా వచ్చేట్లయితే మీరు కచ్చితంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు సిజిఎ్‌సటి యాక్ట్‌, 2017 లోని సెక్షన్‌ 22,23,24 లను ఒకసారి పరిశీలించగలరు. నేను ఒక టైపింగ్‌ ఇనిస్టిట్యూట్‌ నడుపుతున్నాను. నెలకు రెండు లక్షల రూపాయల వరకు వ్యాపారం చేస్తాం. ఖర్చులు పోను నెలకు 20 వేల రూపాయలు మిగులుతాయి. మేము రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలా?- మహేశ్‌  జిఎస్‌టిలో రిజిస్ట్రేషన్‌ తీసుకోవటానికి అవసరమయ్యే త్రెష్‌ హోల్డ్‌ లిమిట్‌ లెక్కించటానికి మీ అగ్రిగేట్‌ టర్నోవర్‌ తీసుకుంటారు. ఈ అగ్రిగేట్‌ టర్నోవర్‌ అంటే ఏమిటో తెలుసుకోవటానికి జూన్‌ 26,27 సంచికలు చూడగలరు.-గొండాల రాంబాబు
business
16,655
07-07-2017 00:32:52
సైన్యంలో రాజకీయ నేతలు చేరడం మంచిదే కానీ..
ప్రాదేశిక సైన్యంలో రాజకీయనేతలు చేరాలన్న ఆలోచన మంచిదే. అయితే వారు నిజంగా సైన్యంలో సాధారణ విధులు నిర్వర్తించినప్పుడే ఈ ప్రయోగం విజయవంతమవుతుంది. అలా కాకుండా చేరామన్న పేరుకి ఉంటే మాత్రం చెడు ఫలితాలు వచ్చే అవకాశముంది.- ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌
nation
10,638
10-02-2017 14:54:57
అతడితో కలిసుండడం ఓ పీడకల..: కంగనా రనౌత్
ముంబై: విశాల్ భరద్వాజ్ రూపొందిస్తున్న చిత్రం ‘రంగూన్’ షూటింగ్ సందర్భంగా బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, కంగనా రనౌత్‌ల మధ్య కోల్డ్‌వార్ జరిగినట్టుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అంతా బాగానే ఉందని షాహిద్ చెబుతుండగా... కంగీ మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ షెడ్యూల్ సందర్భంగా షాహిద్‌తో ఒకే కాటేజిలో కలిసుండడమే తనకు ఎదురైన అతిపెద్ద సమస్యగా భావిస్తున్నట్టు పేర్కొంది. ఇటీవల ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఈ బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్... ‘‘కాటేజ్ సౌకర్యాలు కూడా సరిగాలేని ఓ మారుమూల ప్రాంతంలో షూటింగ్‌కి వెళ్లాం. అక్కడ మా ఇరువురి బృందాలు కాటేజ్‌లు పంచుకోవాల్సి వచ్చింది. అతనికి స్పీకర్స్ దద్దరిల్లిపోయేలా పెద్ద పెద్ద సౌండ్స్‌తో చిత్రమైన పాటలు వినడం అలవాటు. ప్రతిరోజు ఆ హిప్ హాప్ మ్యూజిక్‌కి అదిరిపడుతూ లేవాల్సివచ్చేది. లేచిన వెంటనే రెడీ ఏదోఒకటి తిని బయటపడేదాన్ని. షాహిద్‌తో కాటేజి షేర్ చేసుకోవాల్సిరావడం నాకో పీడకల’’ అని పేర్కొంది. ముక్కుసూటిగా మాట్లాడే హీరోయిన్‌గా పేరున్న ఈ అమ్మడు... బాలీవుడ్లో కొందరు హీరోయిన్ల పట్ల వక్రబుద్ధిగా, నీచంగా ప్రవర్తిస్తారంటూ మొన్నామధ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
entertainment
12,481
10-04-2017 02:44:12
ఆర్కే నగర్‌ ఉపఎన్నిక వాయిదా
చెన్నై, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని ఆర్కే నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. జయలలిత మృతితో అనివార్యమె ౖన ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీంతో, ఓటర్లను ప్రభావితం చేయడానికి విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశాయి. సాక్ష్యాలతో సహా ధన ప్రవాహం రుజువు కావడంతో ఈ నెల 12న జరగాల్సిన ఎన్నికను వాయిదా వేస్తూ ఆదివారం అర్ధరాత్రి ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ అధికార అన్నాడీఎంకేనే రూ.89 కోట్లు పంపిణీ చేసినట్లు ఇటీవల ఐటీ అధికారులు జరిపిన తనిఖీల్లో పత్రాలు లభించాయి. ఏ వీధిలో ఎవరు ఎవరికి ఎంత డబ్బు అందజేశారో వివరాలు రాసిపెట్టి ఉన్న జాబితా కూడా అధికారులకు లభించింది. సీఎం ఎడప్పాడి పళనిస్వామితో పాటు మంత్రులు సెల్లూర్‌ రాజు, విజయభాస్కర్‌, రాజ్యలక్ష్మి, ఎమ్మెల్యే రాజన చెల్లప్ప, ప్రిసీడియం కార్యదర్శి సుధా కె.పరమశివం తదితర ప్రముఖుల పేర్లు అందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికను వాయిదా వేయాలని ఈసీ నిర్ణయించింది. ఇదిలావుండగా, విచారణ కోసం తమ కార్యాలయానికి రావాలంటూ ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌, అన్నాడీఎంకేకు మద్దతిచ్చిన సీనియర్‌ నటుడు శరతకుమార్‌, ఎంజీఆర్‌ మెడికల్‌ వర్సిటీ వైస్‌చాన్సెలర్‌ డాక్టర్‌ గీతాలక్ష్మిలకు ఐటీశాఖ సమన్లు జారీ చేసింది. రెండు రోజుల క్రితం ఈ ముగ్గురి నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు... రూ.5.5కోట్ల నగదు, కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల కీలక పత్రాలు లభ్యం కావడంతో వీరికి ఈ సమన్లు జారీ చేశారు. దీనిపై విజయభాస్కర్‌ విలేకరులతో మాట్లాడుతూ... తాను అక్రమాలకూ పాల్పడలేదని, విచారణకు హాజరవుతానని, తనకేమీ భయంలేదన్నారు.
nation
5,045
31-05-2017 02:13:22
దర్శకరత్న దాసరి అస్తమయం
చికిత్స పొందుతుండగా ఆగిన గుండె.. 4 నెలల నుంచి అనారోగ్యంరెండుసార్లు ఇన్ఫెక్షన్లు, ఆపరేషన్లు.. తొలిసారి 2 నెలల పాటు వైద్యంకోలుకున్నట్లే కోలుకుని మృత్యువు ఒడిలోకి.. సినీ పరిశ్రమ దిగ్ర్భాంతిసీఎం కేసీఆర్‌, చంద్రబాబు, వెంకయ్య, నరసింహన్‌ సంతాపంనేడు అంత్యక్రియలు.. అధికార లాంఛనాలతో నిర్వహణకు ఆదేశం50 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానం సాగించిన బహుదూరపు బాటసారి దర్శకరత్న దాసరి నారాయణ రావు ఇక లేరు. ఏడడుగుల బంధంతో బ్రహ్మముడి వేసి ఒక్కటైన దాసరి జంట సినీ రంగంలో ఆది దంపతులుగా నిలిచారు. భార్య పద్మతో అనురాగ దాంపత్యం గడిపిన దాసరి, 2011లో ఆమె ఎడబాటుతో ఒంటరిగా మారారు. అప్పటి నుంచే అనారోగ్య సమస్యలతో సతమతమైన దాసరి నారాయణరావు 75 ఏళ్ల వయసులో, నమ్మిన వారందరినీ ‘గాలివాన’లాంటి సంక్షోభంలో వదలి, మంగళవారం ఆకాశదేశానికి పయనమయ్యారు. ఆయన తెలుగు సినిమాకు ప్రేమాభిషేకం చేసిన యువరాజు. ఆయన ఎవరికి వారే యమునా తీరేగా సాగే ఇండసీ్ట్రని ఎదురులేకుండా ఏలిన నియంత. మనుషులంతా ఒక్కటేనని ఇంటి నుంచి పరిశ్రమ దాకా చాటిన సర్దార్‌ పాపారాయుడు. ఎవరికీ భయపడని బొబ్బిలి పులి. ఏ వేదికపై అయినా ఆయన నోరు తెరిస్తే ధర్మపీఠం దద్దరిల్లింది అన్నట్టే! ఇదెక్కడి న్యాయం అని జీవితాంతం నిలదీసిన ఆయనకు ఒక రాగం రెండు పాటలు తెలియవు! ఆయన అడిగిన వారికి లేదనకుండా సాయం చేసిన బోళా శంకరుడు. ఆదుకొమ్మని వచ్చినవారి కుటుంబ సమస్యల నుంచి ఆర్థిక వివాదాలదాకా పరిష్కరించిన జస్టిస్‌ చక్రవర్తి. ఎందరికో నాన్నగారు. ఇంకెందరికో ఆత్మబంధువు!! ఒసేయ్‌ రాములమ్మ రక్త చందనంతో సినిమాకు తిరుగుబాటు నేర్పిన ఉగ్రనరసింహం. సమ్మక్క, సారక్కతో తెలుగు సినిమాలో తెలంగానాన్ని వినిపించిన అడవి చుక్క!!! వెండితెరకు ఎందరో మేటి తారల్ని తయారు చేసిన మేస్ర్తి ఆయన. హీరోలకు హీరో. విలన్‌లకు విలన్‌. దర్శకుడు, నిర్మాత, నటుడు, కథా రచయిత, మాటల రచయిత, పాటల రచయిత, పత్రికాధిపతి, ప్రజాప్రతినిధి, కేంద్ర మాజీ మంత్రి... ఒకే జీవితంలో ఎన్నో పాత్రలు. బిగ్‌ స్ర్కీన్‌లోనూ ఇమడనంత విశ్వరూపం ఆయనది!!!! సినిమాల్లో తొలి డైలాగ్‌‘‘దిగ్ధంతులైన కవిపండిత ప్రకాండులకే ప్రవేశము దొరకని కవితాసమ్మేళనమునకు రాదలచితివా! కవిబ్రహ్మయని ఖ్యాతిగాంచిన మా కిలకిలశ్రీవారు నీలాంటి అర్భకులతో ప్రసంగించరు పొమ్ము’ ..సినిమాల్లో నటుడిగా దాసరి తొలి డైలాగ్‌ ఇది. ‘అందం కోసం పందెం’లో చెప్పారు. సినిమాల్లో తొలి డైలాగ్‌‘‘దిగ్ధంతులైన కవిపండిత ప్రకాండులకే ప్రవేశము దొరకని కవితాసమ్మేళనమునకు రాదలచితివా! కవిబ్రహ్మయని ఖ్యాతిగాంచిన మా కిలకిలశ్రీవారు నీలాంటి అర్భకులతో ప్రసంగించరు పొమ్ము’ ..సినిమాల్లో నటుడిగా దాసరి తొలి డైలాగ్‌ ఇది. ‘అందం కోసం పందెం’లో చెప్పారు. హైదరాబాద్‌ సిటీ, మే 30 (ఆంధ్రజ్యోతి): దర్శకరత్న దాసరి నారాయణరావు (75) కన్ను మూశారు. కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం సాయంత్రం గుండె ఆగి (కార్డియాక్‌ అరెస్ట్‌) మరణించారని వైద్యులు ప్రకటించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న దాసరిని ఇటీవల కిమ్స్‌లో చేర్పించారు. అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాస్త కోలుకున్నట్లే కనిపించినా.. తర్వాత ఆరోగ్యం విషమించింది. బతికించడానికి వైద్యులు విశ్వ ప్రయత్నం చేసినా.. ఫలించలేదు. దాసరి చనిపోయారని.. వైద్యులు ప్రకటించడానికి ముందుగానే నిర్మాత సి.కల్యాణ్‌ ఆస్పత్రి బయటకు వచ్చి ‘గురువు గారు ఇక లేరు.. కాసేపట్లో బాడీని ఇంటికి తీసుకెళ్తున్నాం..’ అని కన్నీటి పర్యంతమయ్యారు. వాస్తవానికి దాసరికి నాలుగు నెలల కిందటి నుంచే ఆరోగ్యం బాగాలేదు. జనవరి 29న ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో కిమ్స్‌లో అడ్మిట్‌ చేశారు.  ఆ సమయంలో ఆయన మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, అన్నవాహికలో ఇన్‌ఫెక్షన్‌ సమస్య ఉన్నట్లు తేలింది. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ నియంత్రించడానికి అప్పుడు ఆపరేషన్‌ చేశారు. అన్నవాహికలో వ్యర్థాలు చేరడంతో అక్కడా తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడింది. దాదాపు రెండు నెలల పాటు కిమ్స్‌లోనే చికిత్స పొందిన దాసరి.. ఆరోగ్యం మెరుగుపడడంతో మార్చి 28న డిశ్చార్జి అయ్యారు. తర్వాత కొన్నాళ్లు ఆయన బాగానే ఉన్నారు. ఇంతలో ఆరోగ్యం మళ్లీ ఆందోళనకరంగా మారింది. దీంతో ఈ నెల 15న కిమ్స్‌లో చేరారు. వైద్యులు మరోసారి అన్నవాహికకు సర్జరీ చేశారు. తర్వాత మూత్రపిండాలలో సమస్య వచ్చింది. మూత్రపిండాలకు రెండోసారి ఆపరేషన్‌ చేసినప్పటికీ ఆయన పరిస్థితి మెరుగుపడలేదు. ఆపరేషన్‌ తరువాత ఆయనకు మళ్లీ ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. ఈ సమయంలో డయాలసిస్‌ చేస్తుండగా ఆయనకు కార్డియాక్‌ అరెస్ట్‌ అయింది. సాయంత్రం 6.45 గంటలకు దాసరి చనిపోయారని వైద్యులు తెలిపారు. సర్వత్రా ఉత్కంఠదాసరి ఆరోగ్యం విషమించిందన్న సమాచారంతో తెలుగు లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సినీ, రాజకీయ, వ్యాపార ఇతర రంగాల ప్రముఖులు దాసరి ఆరోగ్యంపై ఆరా తీయటం మెదలు పెట్టారు. వీరంతా పెద్ద సంఖ్యలో కిమ్స్‌ వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించారు. మరోవైపు వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్‌ బులిటెన్స్‌ విడుదల చేస్తూ దాసరి ఆరోగ్యవార్తలను వెల్లడించారు. మొదటిసారి విడుదల చేసిన బులిటెన్‌లో అన్నవాహికకు రీకన్‌స్ట్రక్టివ్‌ శస్త్ర చికిత్స చేశామని, తర్వాత మూత్రపిండాలలో సమస్య తలెత్తిందని తెలిపారు. రెండోసారి విడుదల చేసిన బులిటెన్‌లో చికిత్స చేస్తున్న క్రమంలో సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా దాసరి తుదిశ్వాస విడిచారని ప్రకటించారు. పలువురి సంతాపం.. కన్నీటి పర్యంతంబంజారాహిల్స్‌/రాంగోపాల్‌పేట్‌/పద్మారావునగర్‌: దాసరి మృతి పట్ల అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాత్రి 9 గంటల సమయంలో దాసరి పార్థ్థీవదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నెంబరు 46లో ఉన్న ఆయన స్వగృహానికి తరలించారు. దీంతో చుట్టుపక్కల బస్తీలకు చెందిన ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున దాసరిని చివరి సారిగా చూసేందుకు వచ్చారు. పెద్ద యెత్తున సినీ ప్రముఖులు కదిలి రావడంతో ఇక్కడ కొంత ట్రాఫిక్‌ జాం నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, మంచు విష్ణు, అంబటి రాంబాబు, సురే్‌షబాబు, శివాజీరాజా, రేలంగి నర్సింహరావు, కోడి రామకృష్ణ, నారాయణరావు, విజయశాంతి, వెంకటేష్‌, జీవితారాజశేఖర్‌, రాంచరణ్‌ తదితరులు దాసరి భౌతిక కాయాన్ని సందర్శించారు. నేడు అంత్యక్రియలుదాసరికి బుధవారం అంత్యక్రియలు జరుగనున్నాయి. మొయినాబాద్‌ మండలం తోళ్లకట్ట గ్రామంలో ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉదయం పది గంటలకు ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దాసరికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని మంత్రి తలసాని వెల్లడించారు. మరోవైపు దాసరి మృతికి నివాళిగా తెలుగు సినీ పరిశ్రమ బుధవారం షూటింగ్‌లకు బంద్‌ ప్రకటించింది. నేడు షూటింగ్‌లు బంద్‌హైదరాబాద్‌: దర్శకరత్న దాసరి.. మృతి చెందడంతో తెలుగు సినీ పరిశ్రమ షూటింగ్‌లను బంద్‌ చేసింది. మంగళవారం రాత్రి దాసరి మృతి సమాచారం అందుకున్న నటీనటులు, దర్శకులు, ఇతర సినీ వర్గాలు షూటింగ్‌లను చాలించి.. హుటాహుటిన హైదరాబాద్‌కు బయల్దేరారు. దాసరి పార్థివదేహం వద్దకు వచ్చి ఆయనకు నివాళులర్పించారు. బుధవారం ఆయన అంత్యక్రియలు ఉండటంతో.. నేడు కూడా షూటింగ్‌లన్నీ బంద్‌ చేశారు. కేవలం స్థానికంగానే కాకుండా దేశ విదేశాల్లో జరుగుతున్న షూటింగ్‌లను కూడా బుధవారం ఆపేసినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇక పవన్‌కల్యాణ్‌ అయితే తన సినిమా షూటింగ్‌ను మూడు రోజులు బంద్‌ చేశారు. పవన్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ను మూడు రోజుల పాటు ఆపేసినట్లు సమాచారం. తోలుకట్ట గ్రామంతో అనుబంధం!మొయినాబాద్‌: తెలంగాణలోని మొయినాబాద్‌ మండలం తోలుకట్ట గ్రామంతో దాసరికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడ వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకుని సేద తీరేందుకు అప్పుడప్పుడూ వచ్చేవారు. ఇక కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఈ గ్రామాన్ని బాగా అభివృద్ధి చేశారు. దాసరి.. తన భార్య పద్మ బతికున్నప్పుడు వారానికి ఒకటి రెండు సార్లు ఇక్కడికి వచ్చేవారని గ్రామస్తులు తెలిపారు. పద్మ మృతి చెందడంతో ఆమె పేరున వ్యవసాయ క్షేంత్రంలో ప్రత్యేకంగా కొంత స్థలం కేటాయించి స్మారక చిహ్నంగా గార్డెన్‌ ఏర్పాటు చేశారు. అనంతరం ఆమె జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు ఇక్కడకు వచ్చేవారు. తోలుకట్ట నుంచి చేవెళ్ల వెళ్లే రోడ్డు నిర్మించి.. అంతర్గత మురుగు కాలువల నిర్మాణం కోసం రూ. 5 లక్షలు కేటాయించారని ఇక్కడి వారు తెలిపారు. ఆయన మృతి వార్త తెలిసి దిగ్ర్భాంతికి గురయ్యారు. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దాసరి అంత్యక్రియలు ఇక్కడే జరుగనున్నాయి. ఇక్కడి ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
entertainment
5,151
03-07-2017 22:52:00
పచ్చటి అందాలతో ‘ఓయ్‌.. నిన్నే’
గ్రామీణ నేపథ్యంలో నడిచే అందమైన కుటుంబ కథా చిత్రంగా ‘ఓయ్‌.. నిన్నే’ తెరకెక్కిందని నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్‌ చెప్పారు. భరత్‌, సృష్టి జంటగా నటించిన ‘ఓయ్‌.. నిన్నే’ను ఆయన ఎస్వీకే సినిమా పతాకంపై నిర్మించారు. సత్య చల్లకోటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘చిత్రీకరణ పూర్తయింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన క్యూట్‌ లవ్‌స్టోరీ ఇది. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం. నెలాఖరున చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్‌, సంగీతం: శేఖర్‌ చంద్ర.
entertainment
1,531
04-01-2017 23:51:48
పన్ను వసూళ్లు అంచనాలు మించుతాయ్‌..
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం పన్నుల వసూళ్లు తగ్గుతాయన్న భయాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తోసిపుచ్చారు. అలాంటి అవకాశమే లేదన్నారు. నిజానికి ఈ ఆర్థిక సంవత్సరం కేంద్ర ప్రభుత్వ పన్నుల వసూళ్లు బడ్జెట్‌ అంచనాలు మించిపోతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మార్చి, 2017తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా రూ.16.3 లక్షల కోట్ల రాబడి ఉంటుందని ప్రభుత్వం 2016-17 కేంద్ర బడ్జెట్‌లో పేర్కొంది. అంతకు ముందు సంవత్సరం కంటే ఇది 11 శాతం ఎక్కువ. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్లు బడ్జెట్‌ అంచనాలు మించుతాయి’ అని జైట్లీ బుధవారం విలేకరులతో చెప్పారు. గత ఏడాది నవంబర్‌ నాటికే 71.1 శాతం పరోక్ష పన్నుల వసూళ్ల లక్ష్యం సాధించినట్టు తెలిపారు. ప్రత్యక్ష పన్నుల్లోనూ డిసెంబర్‌, 2016 నాటికి 65 శాతం వసూలు చేసినట్టు చెప్పారు.
business
563
07-05-2017 01:39:32
విమాన ప్రయాణం మరింత భారం!
రెండు నెలల్లో కేంద్రానికి నివేదిక న్యూఢిల్లీ: దేశంలో విమాన ప్రయాణం మరింత భారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రూ.130గా ఉన్న ప్రయాణికుల సేవల ఫీజు (పిఎస్‌ఎఫ్‌) మరింత పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. గత 15 సంవత్సరాలుగా ఈ ఫీజు పెంచలేదు. మరోవైపు దేశంలో విమానాశ్రయాల్లో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్‌ఎఫ్‌) ద్వారా అందించే భధ్రతా సేవల ఖర్చు అనేక రెట్లు పెరిగి పోయింది. దీంతో ఇటీవల జరిగిన ఒక సమావేశంలో ఈ ఫీజు పెంచాలనే ప్రతిపాద వచ్చింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్‌ రిజిజు, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత సిన్హా, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఎ) అజిత దోవల్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం దేశంలోని 143 విమానాశ్రయాలకు కేంద్ర హోం శాఖ సిఐఎస్‌ఎఫ్‌, సిఆర్‌పిఎఫ్‌ ద్వారా భద్రత కల్పిస్తోంది. ఇందులో సిఐఎస్‌ఎఫ్‌ జీతాలకే ఏటా రూ.800 కోట్ల వరకు ఖర్చవుతోంది. ఇందులో కొంతైనా విమాన ప్రయాణికుల నుంచి వసూలు చేసే మార్గాలు చూడాలని ఈ సమావేశంలో పౌర విమానయాన శాఖను కోరారు. పౌర విమానయాన శాఖ మాత్రం ఇందుకు నో చెబుతోంది. విమానాశ్రయాల్లో భద్రత ప్రభుత్వ బాధ్యత కాబట్టి ఈ ఖర్చులను ‘భారత సంచిత నిధి’ నుంచి భరించాలని కోరింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం ఈ బరువు విమాన ప్రయాణికులపైనే వేయాలని స్పష్టం చేసింది. దీంతో రెండు నెలల్లో మంత్రులిద్దరు దీనిపై కేంద్ర ప్రభుత్వానికి సమర్పించబోతున్నారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే దేశంలో విమాన ప్రయాణం మరింత భారం కానుంది.
business
5,187
25-09-2017 10:25:35
రాణిని చూశారు.. రాజును కూడా చూడండి!
సంజయ్ లీలా బన్సాలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా డైరెక్ట్ చేస్తున్న మూవీ పద్మావతి. ఈ సినిమాలో దీపిక పదుకొణె, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల పద్మావతి ఫస్ట్ లుక్ విడుదలై అలరించిన విషయం విదితమే. అందం.. ఆహార్యం కలబోతతో రాణి అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా ఉందా ఫస్ట్ లుక్. ఇకపోతే అల్లాఉద్దీన్ ఖిల్జీ పాత్రలో రణ్ వీర్ సింగ్ నటిస్తుండగా.. పద్మావతి భర్త మహారావల్ పాత్రలో రతన్ సింగ్ అలరించనున్నారు. నిన్న రాణి పద్మావతిని పరిచయం చేసిన చిత్ర బృందం.. తాజాగా ఆమె భర్త మహారావల్ పాత్రను పరిచయం చేసింది. దేహంపై గాయాలతో రణ భూమిలో అత్యంత సాహస వీరునిగా ఆయన చూపరులను కట్టిపడేస్తున్నారు. ఇక మిగిలింది.. అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్ర ఫస్ట్ లుక్ మాత్రమే. ఆ పాత్రలో రణ్‌వీర్ ఎలా ఉండబోతున్నారోనని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
entertainment
12,579
14-03-2017 00:42:54
పర్రీకర్‌ ప్రమాణ స్వీకారానికి ‘స్టే’ గండం?
పణజీ, మార్చి 13: ప్రభుత్వ ఏర్పాటుకు పర్రీకర్‌ను గోవా గవర్నర్‌ ఆహ్వానించడంతో ఆ రాష్ట్రంలో ఉత్కంఠకు తెరపడినట్లే అనిపించిందిగానీ.. ‘ఎక్కువ సీట్లు మాకొస్తే పర్రీకర్‌నెలా సీఎంగా నియమిస్తారు?’ అంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ సుప్రీం గడప తొక్కడంతో కథ కొత్త మలుపు తిరిగింది. గోవాలో చిన్న పార్టీలన్నీ బీజేపీకి మద్దతిచ్చిన నేపథ్యంలో అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమైంది. ముఖ్యమంత్రిగా మరోసారి మనోహర్‌ పర్రీకర్‌ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ మృదులా సిన్హా తమను ఆహ్వానించారని ఆయనవెల్లడించారు. మంగళవారం సాయంత్రం తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నానని చెప్పారు. తనతోపాటు మరికొంతమంది మంత్రులుకూడా బాధ్యతలు చేపడతారని వివరించారు. ఈ నేపథ్యంలో తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర కేబినెట్‌లోకి ఎవరెవరిని, ఎంతమందిని తీసుకోవాలనేదానిపై కసరత్తు చేస్తున్నామని, తుదినిర్ణయం తీసుకున్నాక మీడియాకు వెల్లడిస్తామని పేర్కొన్నారు. తన ప్రమాణాస్వీకారోత్సవానికి రాజ్‌నాథ్‌సింగ్‌, అమితషా, గడ్కరీ తదితరులు వస్తారని ఆయన చెప్పారు. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్‌ 17, బీజేపీ 13 సీట్లు గెలుచుకోగా ఇతరులు 11 సీట్లు కైవసం చేసుకున్నారు. పర్రీకర్‌, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ మంత్రాంగంతో చిన్న పార్టీలన్నీ బీజేపీకి మద్దతివ్వడంతో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కానీ, దీనిపై గోవా సీఎల్పీ నేత చంద్రకాంత కవ్లేకర్‌ సోమవారం సాయంత్రం సుప్రీంలో పిటిషన్‌ వేశారు. పర్రీకర్‌ ప్రమాణ స్వీకారంపై స్టే విధించాలని.. ఆయన్ను సీఎంగా నియమిస్తూ గవర్నర్‌ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై అత్యవసరంగా మంగళవారం విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ అంగీకరించారు. ప్రస్తుతం హోలీ సందర్భంగా సుప్రీంకోర్టుకు వారం సెలవులు ఉన్నందున ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామన్నారు. మరోవైపు.. బీజేపీకి మద్దతివ్వాలని గోవా ఫార్వర్డ్‌ పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురూ నిర్ణయించుకోవడంతో ఆ పార్టీలో లుకలుకలు ప్రారంభమయ్యాయు. తమ సభ్యుల చర్యలకు నిరసనగా ఆ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్‌ టింబ్లే తన పదవికి రాజీనామాచేశారు. ఎన్నికల్లో తాము బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశామని.. కానీ ఇప్పుడు తమ సభ్యులు ఆపార్టీకీ మద్దతివ్వడం కలచివేస్తోందని ఆయన అన్నారు.
nation
8,991
17-03-2017 22:23:55
భయపెట్టే ‘శివలింగ’
కొరియోగ్రాఫర్‌గా, దర్శకహీరోగా తనదైన ఐడెంటిటీతో దూసుకుపోతున్న రాఘవ లారెన్స్‌ నటించిన తాజా చిత్రం ‘శివలింగ’ ఏప్రిల్‌ 14న రిలీజవుతోంది. ‘చంద్రముఖి’ వంటి సంచలన చిత్రానికి దర్శకత్వం వహించిన పి.వాసు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌కుమార్‌ నటించిన ‘శివలింగ’ చిత్రాన్ని అదే టైటిల్‌తో అభిషేక్‌ ఫిల్మ్స్‌ పతాకంపై రమేష్‌ పి.పిళ్లై నిర్మించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ‘‘కథే హీరోగా కన్నడంలో బ్లాక్‌బస్టర్‌ అయిన చిత్రమిది. పి.వాసుగారి ‘చంద్రముఖి’ ఎంతటి సెన్సేషనో తెలిసిందే. అలాగే లారెన్స్‌ ‘కాంచన’, ‘గంగ’ ఏ స్థాయిలో విజయాలు సాధించాయో తెలుసు. వాటిని మించిన కథ, కథనాలతో హారర్‌ ఎంటర్‌టైనర్‌గా ‘శివలింగ’ తెరకెక్కింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని తెలిపారు.
entertainment
14,374
12-09-2017 04:22:50
బడిలో భద్రత ఎలా?
‘రియాన్‌’లో బాలుడి హత్యపై సుప్రీంకోర్టులో పిటిషన్‌న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: దేశ రాజధాని సమీపంలోని రియాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూలు విద్యార్థి ప్రద్యుమ్న ఠాకూర్‌ (7) హత్యపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘‘ఇది ఈ ఒక్క పాఠశాలకు సంబంధించిన విషయం కాదు. ఈ సంఘటన ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుంది’’ అని తెలిపింది. ఈ హత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని, పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు బలమైన మార్గదర్శకాలు రూపొందించాలని దాఖలైన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హరియాణా డీజీపీ, సీబీఐ, సీబీఎ్‌సఈలకు కూడా నోటీసులు పంపింది. మూడు వారాల్లో స్పందన తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.  తనతో అసహజ లైంగిక చర్యకు పాల్పడేందుకు నిరాకరించడంతో స్కూలు బస్సు కండక్టర్‌ అశోక్‌ బడి ఆవరణలోని మరుగుదొడ్డిలో ప్రద్యుమ్న ఠాకూర్‌ను గొంతు కోసి చంపాడు. ఈనెల 8న జరిగిన సంఘటనతో సంచలనం సృష్టించింది. ‘‘ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు. పిల్లలను బడికి పంపితే భద్రంగా తిరిగి వస్తారా, లేదా అనే ఆందోళన నెలకొంది. పాఠశాలల్లో పిల్లల భద్రతపై మార్గదర్శకాలు రూపొందించాలి’’ అని ప్రద్యుమ్న తం డ్రి వరుణ్‌చంద్ర ఠాకూర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఈ కేసులో నిందితుడైన కండక్టర్‌ అశోక్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా... పాఠశాల లీగల్‌ విభాగం అధిపతి ఫ్రాన్సిస్‌ థామస్‌, హెచ్‌ఆర్‌ ఇన్‌చార్జి జేయస్‌ థామ్‌సలనూ అరెస్టుచేశారు.
nation
19,172
31-07-2017 00:51:59
విదేశాల్లోని నల్లధనం వెనక్కి రాలేదు
‘‘అధికార పక్షం ప్రధాన నినాదమైన ‘విదేశాల్లో దాగిన నల్లధనం వెనక్కి’ రాలేదు. పనామా పత్రాల్లో ఉన్న వారిలో ఎవర్నీ పట్టుకో లేదు. సేవల పేరుతో ప్రభుత్వం ఎన్నోపన్నులు వసూలు చేస్తున్నా దేశంలో అభివృద్ధి కనిపించడం లేదు’’-ట్విట్టర్‌లో జేడీ(యూ) సీనియర్‌ నేత శరద్‌ యాదవ్‌
nation
9,528
11-06-2017 12:00:08
హెబా పటేల్‌‌కు బంపర్ ఆఫర్..!
తెలుగులో క్రేజీ హీరోల సరసన అవకాశాలు దక్కించుకోవడంలో సక్సెస్ కాలేకపోతున్న అప్ కమింగ్ బ్యూటీ... కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమైందట... టాలీవుడ్ హిట్ మూవీ రీమేక్‌లో ఆమెకు ఛాన్స్ దాదాపు ఖాయమైందట. కొన్నేళ్ల క్రితం తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న 'హండ్రెడ్ పర్సెంట్ లవ్' సినిమాను కోలీవుడ్‌లో రీమేక్ కానుంది... ఈ రీమేక్‌లో హీరోగా జి.వి.ప్రకాశ్ ఫిక్స్ అయ్యాడు... అయితే హీరోయిన్ తమన్నా రోల్‌ని ఎవరితో రీ ప్లేస్ చేయాలనే విషయమే ఇంకా ఎటూ తేలడం లేదు. మొదట 'హండ్రెడ్ పర్సెంట్ లవ్' కోలీవుడ్ వర్షన్‌లోనూ మిల్కీ బ్యూటీనే హీరోయిన్ అని కొంతకాలం ప్రచారం జరిగినా... ఆ తరువాత ఈ ఛాన్స్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి సొంతమైందని అంతా అనుకున్నారు. కోలీవుడ్ లో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న లావణ్య త్రిపాఠి ఈ ఛాన్స్ ను వదులుకునే అవకాశం లేకపోవడంతో... ఈ సినిమా కోలీవుడ్ వర్షన్ లో లావణ్య నటించడం ఖాయమే అని చాలామంది భావించారు. అయితే ఆ ఛాన్స్ అనుకోకుండా హెబా పటేల్ సొంతమైందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆఫర్ పలకరించగానే మరో మాట ఆలోచించకుండా ఓకే చెప్పిన టాలీవుడ్ కుమారి... ఈ సినిమాకు సైన్ కూడా చేసేసిందని టాలీవుడ్ సర్కిల్స్ టాక్... కోలీవుడ్ అవకాశం కోసం హెబా కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తోందని... అందుకే ఛాన్స్ దొరకగానే ఓకే అనేసిందని అంటున్నారు. ఈ నయా మూవీ షూటింగ్ సెప్టెంబర్ లో మొదలవుతుందని సమాచారం... అయితే సుకుమార్ రికమండేషన్ కారణంగానే హెబాకు ఈ అవకాశం వచ్చిందనే వారు లేకపోలేదు...అందం మందమైతే చాలు గుడికట్టి పూజించటం సాంబారు బాబులకు అలవాటు.. మరి ఈ సినిమాతో హెబ్బా తమిళంలో జెండా పాతుతుందేమో చూడాలి.
entertainment
18,487
08-05-2017 01:38:54
కేజ్రీవాల్‌కు 2 కోట్ల లంచం
స్వయానా ఆయన చేతులతో తీసుకున్నారుగాంధీ సాక్షిగా.. నేనూ నా కళ్లతో చూశాసత్యేంద్ర జైన్‌ నా ముందే ఇచ్చారుకేజ్రీ బంధువుల భూవివాదాన్ని సత్యేంద్రే పరిష్కరించారుడబ్బులపై అప్పుడే కేజ్రీని నిలదీశాకొన్ని చెప్పకూడదని బదులిచ్చారుఆప్‌ నేత కపిల్‌ సంచలన ప్రకటనమంత్రిగా తొలగించాక ఆరోపణన్యూఢిల్లీ, మే 7: రాజకీయాలు, పాలనలో అవినీతిని ‘చీపురు’తో ఊడ్చేస్తానన్న ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ‘మరక’ అంటింది. ‘మహాత్మాగాంధీ సాక్షిగా చెబుతున్నాను. కేజ్రీవాల్‌ లంచగొండి. రెండు కోట్లు లంచం తీసుకున్నారు’ అని నిన్నటి వరకూ కేజ్రీ కేబినెట్‌ సహచరుడిగా ఉన్న కపిల్‌ మిశ్రా ఆరోపించారు. శనివారం రాత్రే కపిల్‌ను కేజ్రీవాల్‌ కేబినెట్‌ నుంచి తొలగించారు. ఆదివారం కపిల్‌ గొంతు విప్పారు. ఢిల్లీలో మహాత్మాగాంధీ సమాధిని దర్శించుకుని... అక్కడే మీడియాతో మాట్లాడారు. ‘‘పదవి కాదు ప్రాణం పోయినా... అవినీతిని సహించడం నా రక్తంలోనే లేదు. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ శుక్రవారం రూ.2 కోట్ల నగదును కేజ్రీకి అందజేశారు. సీఎం అధికార నివాసంలోనే ఇది జరిగింది. దీనికి నేను ప్రత్యక్ష సాక్షిని! ఆ డబ్బులు ఎక్కడివి, ఎందుకు ఇచ్చారు అని నేను ప్రశ్నించగా... రాజకీయాల్లో కొన్ని విషయాలు చెప్పకూడదంటూ కేజ్రీ సమాధానం దాటవేశారు. తనపై నమ్మకం ఉంచాలని కోరారు. ఆయనను నేను పూర్తిగా విశ్వసించాను. ఆయన్ను ఎవ్వరూ అవినీతి ఊబిలోకి లాగలేరని భావించాను. కానీ నా నమ్మకం తప్పని తేలింది’’ అని మిశ్రా వివరించారు. కేజ్రీవాల్‌ బంధువులకు సంబంధించిన రూ.50 కోట్ల విలువైన భూవివాదాన్ని కూడా పరిష్కరించినట్లు జైన్‌ తనకు తెలిపారని మిశ్రా వివరించారు. దీనిపై నిలదీయడంవల్లే తనను మంత్రి పదవి నుంచి తప్పించారని ఆరోపించారు. ‘ఆప్‌’లో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన రాజకీయ వ్యవహారాల కమిటీకి కూడా ఈ సమాచారం చెప్పలేదని, ఇది కేజ్రీవాల్‌ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని తెలిపారు. సీబీఐకీ చెబుతా...కేజ్రీవాల్‌పై తన ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనీల్‌ బైజాల్‌కు అందజేశానని కపిల్‌ శర్మ తెలిపారు. సీబీఐ, ఏసీబీ ముందు కూడా వివరాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రస్తుతం తన ఆరోపణలను కుమార్‌ విశ్వా్‌సలాంటి వారు విశ్వసించకపోవచ్చునని... సత్యేంద్ర జైన్‌ జైలుకు వెళ్లినప్పుడు అందరూ తనను నమ్మక తప్పదని తెలిపారు. ఆప్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక కుంభకోణాలు జరిగాయన్నారు. లగ్జరీ బస్సు స్కాం, సీఎన్‌జీ ఫిట్‌నెస్‌ పరీక్షల స్కాం చోటు చేసుకున్నాయని తెలిపారు. ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ ఎలాంటి అర్హతలు లేని తన కుమార్తెనే సలహాదారుగా నియమించుకున్నారన్నారు. షీలా దీక్షిత్‌ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన వాటర్‌ ట్యాంకర్ల కుంభకోణంలో కొన్ని పెద్ద తలకాయలు ఉన్నాయని, వారిని రక్షించేందుకే కేజ్రీ ఆ కుంభకోణంపై పెదవి విప్పడం లేదని మిశ్రా ఆరోపించారు. వాటర్‌ ట్యాంకర్ల స్కాంలోని పాత్రధారులపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తానని మిశ్రా తెలిపారు. ‘‘నేను ఆప్‌ను వీడను. ఇందులోనే ఉండి పార్టీలోని అవినీతిని తుడిచేస్తా. రెండేళ్లు మంత్రిగా ఉన్నా నాపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు’’ అని చెప్పారు. ఆప్‌లో త్వరలో మరిన్ని అసమ్మతి గళాలు వినిపిస్తాయన్నారు.  రూ.400 కోట్ల వాటర్‌స్కాం!షీలా దీక్షిత్‌ ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో ఢిల్లీ జల్‌బోర్డు 385 స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వాటర్‌ ట్యాంకులను లీజుకు తీసుకుంది. దీని వెనుక కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఆప్‌ గద్దెనెక్కిన వెంటనే ఈ స్కాంపై విచారణ జరిపి 2 నెలల్లో షీలా దీక్షిత్‌ను జైలుకు పంపుతామని ప్రకటించింది. 2012లో జరిగిన ఈ స్కాంపై 2015లో ఆప్‌ సర్కార్‌ కపిల్‌ మిశ్రా నేతృత్యంలో నిజనిర్ధారణ కమిటీని నియమించింది. వాటర్‌ ట్యాంకుల లీజులో రూ.400 కోట్ల అవినీతి జరిగిందని లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కమిటీ నివేదించింది. సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరింది. ఆ సమయంలో స్కాంలో కేవలం కాంగ్రెస్‌ ప్రముఖులే కాకుండా ఆప్‌ ప్రముఖులూ ఉన్నారని మిశ్రా.. కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. ఆప్‌ ప్రముఖులను రక్షించేందుకే స్కాం నివేదికపై చర్యలు తీసుకోవడం లేదని మిశ్రా ఆరోపించారు. ఎవరీ కపిల్‌ మిశ్రా?కపిల్‌ మిశ్రా.. ఒకప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కేజ్రీవాల్‌ అనుంగు అనుచరుడు. నేడు అదే కేజ్రీకి పక్కలో బల్లెంలా మారిన వ్యక్తి. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వహణలో జరిగిన అక్రమాలపై గళమెత్తిన మొదటి వ్యక్తి మిశ్రా. నాటి అక్రమాలపై ఆయన ‘కామన్‌ వర్సెస్‌ వెల్త్‌’ పేరుతో ఓ పుస్తకాన్ని కూడా రాశారు. ఈ పుస్తకమే ఆయన్ని కేజ్రీకి సన్నిహితుడిగా మార్చింది. కేజ్రీ నేతృత్వంలో జరిగిన ‘ఇండియా అగినెస్ట్‌ కరెప్షన్‌ మూవ్‌మెంట్‌’లో మిశ్రా కీలకంగా వ్యవహరించారు. 37 ఏళ్ల మిశ్రా ఆప్‌ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. 2015లో కరవాల్‌ నగర్‌ నుంచి మిశ్రా ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయనకు కేజ్రీ తన కేబినెట్‌లో చోటు కల్పించారు.  ఆర్కిటెక్ట్‌ నుంచి ఆరోగ్య మంత్రి వరకుఇదీ సత్యేంద్ర జైన్‌ ప్రస్థానంఆర్కిటెక్ట్‌ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చి అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తి సత్యేంద్ర జైన్‌. కేజ్రీ కేబినెట్‌లో వివాదాస్పద మంత్రిగా సత్యేంద్ర పేరుపొందారు. కేజ్రీ కేబినెట్‌లో అత్యంత ధనవంతుడు కూడా ఈయనే. అన్నా హజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంతో తమ రాజకీయ జీవితానికి పునాదులు వేసుకున్న వ్యక్తుల్లో ఈయన ఒకరు. తొలినాళ్లలో సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌(సీపీడబ్ల్యూడీ)లో పనిచేసిన సత్యేంద్ర అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా ఆర్కిటెక్చరల్‌ కన్సల్టెన్సీ సంస్థను ప్రారంభించారు. తాను నిర్వహిస్తున్న ఆరోగ్యశాఖ సలహాదారుగా తన కూతురిని నియమించుకోవడం వివాదాస్పదమైంది.  ఆప్‌కు విదేశీ నిధులపై హోంశాఖ నోటీసులుఆప్‌కు అక్రమంగా విదేశీ నిధులు అందాయన్న ఫిర్యాదుపై కేంద్ర హోంశాఖ ఆ పార్టీకి నోటీసులు జారీ చేసింది. 2013లో ఆప్‌కు విదేశీ నిధులు వస్తున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుపై హోంశాఖ స్పందించింది. విదేశీనిధులపై పూర్తి వివరాలు అందజేయాలని ఆ నోటీసులో కోరింది.
nation
5,334
19-04-2017 11:55:09
పార్టీ రూమర్లపై తారక్ ఏమన్నాడంటే...
జూనియర్ ఎన్టీఆర్‌ను ‘నవ భారత్ నేషనల్ పార్టీ’కి ఏపీ అధ్యక్షుడిగా నియమిస్తున్నామంటూ ఓ లేఖ నెట్‌లో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘జైలవకుశ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న తారక్.. ఈ విషయాన్ని అభిమానుల ద్వారా తెలుసుకుని ఓ చిరునవ్వు నవ్వేశాడట. తాను ఇటువంటి వార్తలను పట్టించుకోబోనని వారికి చెప్పాడట. అంతేగాకుండా ఎవరూ ఈ వార్తలను పట్టించుకోవద్దని, వదిలేయాలని సూచించాడట. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాల మీదేనని చెప్పాడట. తనకు ఇప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమేమీ లేదని, ఒకవేళ అలాంటి ఉద్దేశమే ఉంటే తానే స్వయంగా బహిరంగ ప్రకటన చేస్తానని అతడిని కలిసిన అభిమానులకు వివరించాడట. వేరే పార్టీని ఆధారంగా చేసుకుని రహస్యంగా రాజకీయాల్లోకి వచ్చే అవసరం తనకు లేదని వారితో కామెంట్ చేశాడట. మొత్తానికి తనపై వస్తున్న రాజకీయ ప్రచారానికి అభిమానులతో తారక్ ఇలా చెక్ పెట్టాడని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్.
entertainment
5,673
30-11-2017 16:23:49
రాణులంతా ఒకే చోట..
కంగ‌నా ర‌నౌత్ బాలీవుడ్‌లో ‘క్వీన్’ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే‌. ఈ సినిమా కంగనాకి మంచి పేరునే కాకుండా జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డును కూడా అందించింది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళంలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. తెలుగులో తమన్నా క్వీన్‌గా నటిస్తుండగా.. ‘క్వీన్’ అనే టైటిల్‌నే పెట్టారు. తమిళ వెర్షన్‌లో కాజల్ అగర్వాల్ క్వీన్‌గా నటిస్తుండగా ఆ సినిమాకు ‘ప్యారిస్ ప్యారిస్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇక మలయాళ వెర్షన్ క్వీన్‌లో మంజిమ మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తుంది. టైటిల్ ఇంకా ఖ‌రారు కావాల్సి ఉంది. ఓ బాలీవుడ్ మూవీ ఒకేసారి మూడు ద‌క్షిణాది భాష‌ల్లో రీమేక్ అవుతుండ‌టం బ‌హుశా భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇదే మొదటిసారి. ఇక విషయంలోకి వస్తే ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రీమేక్ క్వీన్‌లంతా కలిసి ఫేస్ బుక్‌లో లైవ్ నిర్వహించారు. కాజల్ అగర్వాల్, తమన్నా, మంజిమా మోహన్, పరుల్ యాదవ్‌లు ఈ వీడియోలో ఈ సినిమాకి సంబంధించిన విషయాలను షేర్ చేసుకున్నారు.
entertainment
1,770
20-02-2017 23:38:13
మైక్రోసాఫ్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌ టైఅప్‌
దేశంలోని వినియోగదారులకు అత్యుత్తమ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సర్వీసును అందించేందుకుగాను మైక్రోసా్‌ఫ్టతో ఇకామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ తన ఎక్స్‌క్లూజివ్‌ క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్‌గా మైక్రోసాఫ్ట్‌ అజూర్‌ను వినియోగించుకోనుంది. సోమవారం బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్‌ సిఇఒ సత్య నాదెళ్ల, ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ సిఇఒ బిన్సీ బన్సాల్‌ ప్రకటించారు. టెక్నాలజీతో ప్రతి భారతీయుడు, భారత కంపెనీకి సాధికారత అందించాలన్న లక్ష్యంతో ఉన్నామని, ఇందులో భాగంగానే ఫ్లిప్‌కార్ట్‌లాంటి ఇన్నోవేటివ్‌ కంపెనీలతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నామని మైక్రోసాఫ్ట్‌ సిఇఒ సత్య నాదెళ్ల తెలిపారు.    ఫ్లిప్‌కార్ట్‌ ప్రస్తుత సర్వీసులు, డేటాతో మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్‌, ఎఐ సామర్థ్యాలను జత చేయడం వల్ల ఇ-కామర్స్‌లో డిజిటల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ను వేగవంతంగా చేయడంతోపాటు నూతన కస్టమర్‌ అనుభూతులను అందించవచ్చని ఆయన చెప్పారు. మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా కస్టమర్లకు మరింత నాణ్యమైన సర్వీసులను అందించే అవకాశం ఉంటుందని ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ సిఇఒ, సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్‌ తెలిపారు.
business
11,728
08-03-2017 16:09:56
సైఫుల్లా దేశద్రోహి...అతని మృతదేహం నాకొద్దు..!
న్యూఢిల్లీ: లక్నోలోని ఠాకూర్‌గంజ్‌లో దాదాపు 12 గంటల సేపు సాగిన ఎన్‌కౌంటర్‌ అనంతరం భద్రతా దళాల కాల్పుల్లో హతమైన ఐఎస్ఐఎస్ ఉగ్రవాది సైఫుల్లా మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు అతని తండ్రి సర్తాజ్ నిరాకరించాడు. 'ఒక జాతి వ్యతిరేకి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని నేను అనుకోవడం లేదు. ఇది దేశ ప్రయోజనాలకు కూడా భంగకరం' అని సర్తాజ్ సూటిగా స్పందించారు. పనీపాట లేకుండా తిరుగుతున్నాడని కొట్టినందుకు రెండున్నర నెలల క్రితం తన కొడుకు ఇల్లు విడిచి వెళ్లిపోయాడని ఆయన తెలిపారు. అయితే గత సోమవారంనాడు తనకు ఫోన్ చేసి సౌదీ వెళ్లిపోతున్నట్టు చెప్పాడని, అదే తన కొడుకు చివరి మాటలవుతాయని తాను అనుకోలేదని వాపోయారు. కాగా, ఐఎస్ఐఎస్‌ టెర్రల్ మాడ్యూల్‌గా చెబుతున్న సర్తాజ్ యూపీలోని సుఫీ మందిరంపై దాడికి సిద్ధమవుతున్నాడని, ఇదుకు ప్రాక్టీస్‌గానే భోపాల్-ఉజ్జయిని పాసింజర్ రైలులో మంగళవారం ఉదయం పేలుడుకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. ఈ పేలుడు ఘటన అనంతరం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు అనుమానితులను మధ్యప్రదేశ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. తమ టెర్రర్ గ్రూప్‌లో తొమ్మిది మంది ఉన్నారని, ఐఎస్ఐఎస్‌ తరఫున పనిచేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని, అంతా లక్నో, కాన్పూర్‌కు చెందిన వాళ్లమేనని విచారణలో నిందితులు అంగీకరించినట్టు తెలుస్తోంది.
nation
19,065
25-08-2017 03:18:50
సుప్రీంలో శశికళ క్యురేటివ్‌ పిటిషన్‌!
చెన్నై, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ సుప్రీంకోర్టులో ఆఖరి పోరాటానికి సిద్ధమవుతున్నారు. తనకు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ ఆమె దాఖలుచేసిన రివ్యూ పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనం బుధవారం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌ వేయాలని శశికళతో పాటు శిక్ష అనుభవిస్తున్న ఇళవరసి, సుధాకరన్‌ యోచిస్తున్నారు. కేసు తుది తీర్పులో చట్టపరంగా తనకు అన్యాయం జరిగిందంటూ.. ఈ విషయాన్ని వారు సూక్ష్మాతిసూక్ష్మంగా కోర్టుకు విశదీకరించాల్సి ఉంటుంది. పైగా ఈ పిటిషన్‌ను ఒక సీనియర్‌ న్యాయవాది సర్టిఫై చేయాలి. రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చిన ధర్మాసనంలోని న్యాయమూర్తులే ఆ పిటిషన్‌ను పరిశీలించి.. అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ఆ తర్వాతే సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తుంది. ఇవన్నీ జరిగేందుకు కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
nation
21,632
01-02-2017 00:09:18
అమితాబ్‌ను అడ్డుకున్న పాలకులు
టీమిండియా ఎంపిక నేపథ్యంలో కొంత హైడ్రామా నడిచింది. సెలెక్షన్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడానికి బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్‌ చౌదరి అనర్హుడని.. కొత్తగా ఏర్పాటైన పాలకులు అడ్డుకున్నారు. అనేక మెయిల్స్‌ సంప్రదింపుల తర్వాత బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రీ సెలెక్షన్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించినట్టు బీసీసీఐ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘అమితాబ్‌ చౌదరి.. మంగళవారం ఓ హోటల్‌లో మధ్యా హ్నం 12 గంటలకు సెలెక్షన్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే వెంటనే రంగంలోకి దిగిన వినోద్‌ రాయ్‌ అండ్‌ కో .. అనర్హుడైన అమితాబ్‌ సమావేశానికి హాజరుకాకూడదని అడ్డుకుంది. దీంతో జోహ్రీనే ముంబై నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించాడ’ని తెలిపాయి. తొలిసారి సమావేశమైన అడ్మినిసే్ట్రటివ్‌ ప్యానెల్‌ను కలవడానికి జోహ్రీ ముంబై వెళ్లాడు. దీనిని బట్టి సంయుక్త కార్యదర్శిగా కొనసాగే అర్హత చౌదరికి లేదని తేలింది. బోర్డు కార్యకలాపాలు తెలిసిన వాడిగా దుబాయ్‌లో జరిగే ఐసీసీ సమావేశాల్లో బీసీసీఐ ప్రతినిధిగా మాత్రమే వ్యవహరించనున్నాడు.
sports
14,798
03-04-2017 03:01:02
దేశవ్యాప్తంగా బీఎస్‌-4 గ్రేడ్‌ ఇంధనమే!
భువనేశ్వర్‌, ఏప్రిల్‌ 2: దేశవ్యాప్తంగా ఇక నుంచి పెట్రోలు బంకుల్లో బీఎస్‌-4 గ్రేడ్‌ ఇంధనమే లభ్యం కానుంది. బీఎస్‌-3 వాహనాలపై సుప్రీం కోర్టు నిషేధం విధించడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌.. భువనేశ్వర్‌ నుంచి బీఎస్‌-4 గ్రేడ్‌ ఇంధనాన్ని ఆవిష్కరించారు. మెట్రోనగరాల్లో ఇప్పటికే బీఎస్‌-4 గ్రేడ్‌ ఇంధనం లభిస్తోంది. అయితే.. ఏప్రిల్‌ 1 నుంచి చిన్న పట్టణాల్లోనూ అందుబాటులోకి వచ్చింది.
nation
16,144
27-11-2017 09:41:09
ఆర్‌కే నగర్‌లో 2.26 లక్షల మంది ఓటర్లు
చెన్నై‌: ఆర్‌కే నగర్‌ నియోజకవర్గంలో మొత్తం 2.56 లక్షల మంది ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గానికి వచ్చే 21న ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఓటర్ల వివరాలను విడుదల చేశారు. ఆ ప్రకారం నియోజకవర్గంలో పురుషులు 1,10,202 మంది, మహిళలు 1,16,414 మంది అని మొత్తం 2,26,714 మంది ఓటర్లున్నారు. వారిలో వయస్సుల వారీగా ఓటర్ల వివరాలు...18 నుంచి 19 ఏళ్లలోపున్న వారు- 2,95620 నుంచి 29 ఏళ్లలోపున్న వారు-58,53030 నుంచి 39 ఏళ్లలోపున్న వారు-63,91340 నుంచి 49 ఏళ్లలోపున్న వారు-48,21750 నుంచి 59 ఏళ్లలోపున్న వారు-30,10369 నుంచి 69 ఏళ్లలోపున్న వారు-15,72880 ఏళ్ల పైబడిన వారు -1,284
nation
12,814
07-12-2017 15:29:53
వాళ్లిద్దరూ ఏమైపోయారో...నాకు భయంగా ఉంది : విశాల్
చెన్నై: తన నామినేషన్ పత్రాలపై సంతకాలు పెట్టిన ఇద్దరు మద్దతుదారుల జాడ ఇంకా తెలియలేదని హీరో విశాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఇద్దరినీ ఇవాళ 3 గంటల్లోగా ఈసీ ముందు ప్రవేశపెట్టాలని మీడియా ద్వారా సమాచారం అందినట్టు ఇంతకు ముందు విశాల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కేవలం రెండు గంటలు మాత్రమే సమయం ఇచ్చారనీ... ఇది ఏ మలుపు తిరుగుతుందోనని విశాల్ పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు తన నామినేషన్‌పై సంతకాలు పెట్టిన ఇద్దరి ఆచూకీ దొరక్క పోవడంతో మళ్లీ ట్విటర్ ద్వారా స్పందించారు. ‘‘ఓవైపు సమయం మించిపోతోంది.. నా నామినేషన్‌ను బలపర్చిన దీపన్, సుమతి ఎక్కడున్నారో ఇక్కడ తెలియడం లేదు. వారి క్షేమం, భద్రతపై నాకు చాలా ఆందోళనగా ఉంది...’’ అని విశాల్ ట్వీట్ చేశారు. ‘‘నా గెలుపు ఓటములతో సంబంధం లేదుగానీ... ప్రజాస్వామ్యం మాత్రం నిజంగా ఓడిపోయింది...’’ అని విశాల్ వ్యాఖ్యానించారు.
nation
18,183
21-02-2017 00:37:13
ట్విట్టర్లో కమల్‌ విశ్వరూపం!
చెన్నై, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): అమ్మలేని రాజ్యంలో నటుడు కమలహాసన్‌ రెచ్చిపోతున్నా రు. తనదైన శైలిలో తమిళనాడు రాజకీయాలపై ట్విట్టర్‌ కామెంట్లు విసురుతున్నారు. మీ ఆగ్రహాన్ని గవర్నర్‌కు ఈ-మెయిల్‌ ద్వారా చెప్పండని కోరుతూ రాజ్‌భవన్‌ ఈమెయిల్‌ ఐడీని పోస్టు చేశారు. నిజంగానే ఆయన అభిమానులు పెద్దఎ త్తున మెయిల్స్‌ పంపించారు. మొత్తంమీద ఆయన దూకుడు తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. ప్రత్యక్షంగా ఆయనపై దాడికి సిద్ధంగాలేని అన్నాడీఎంకే తన పద్ధతిలో ఇండియన నేషనల్‌ లీగ్‌ నాయకుడు ఫిర్దోస్‌తో కేసుపెట్టించింది. పళనిస్వామి అసెంబ్లీలో బలపరీక్షలో గెలిచిన సందర్భంగా హింసను ప్రేరేపించే లా కమల్‌ వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్దోస్‌ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తమిళనాట తాజా పరిణామాలపై కమలహాసనకి, బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్యస్వామికి మధ్య కొన్ని రోజులుగా ట్విట్టర్‌ యుద్ధం జరుగుతోంది. కమలహాసనను ఇడియట్‌గా సంబోధిస్తూ స్వామిచేసిన ట్వీట్‌ తీవ్ర దుమారం రేపుతోంది. కమల్‌హాసన బీజేపీలో చేరి, ఆయన ఇష్టప్రకారం ప్రభుత్వాన్ని నడిపితే మీరు అంగీకరిస్తారా?’ అం టూ అన్న ప్రశ్నకు స్వామి స్పందిస్తూ... ‘బీజేపీ గురించి నాకుతెలియదు కానీ, నేనుమాత్రం కమల్‌హాసన అని పిలుచుకునే ఎముకలేని అద్భుతమైన, స్వార్థ ఇడియట్‌ను అంగీకరించను’ అని ట్వీట్‌ చేశారు. దానికి కమల్‌ ఘాటైన జవాబిచ్చా రు. ‘‘సుసు(సుబ్రహ్మణ్య స్వామి) తమిళుల్ని పోకిరీలన్నారు. అతన్ని నేను వ్యతిరేకించనవసరం లేదు. ఆ పని ప్రజలే చేస్తారు. నేనలా మొరటు గా బదులివ్వను. పరుషమైన రాజకీయ వాగ్యుద్ధంలో ఆయన అనుభవం నన్ను మించినది.’ అని వ్యాఖ్యానించారు.
nation
17,518
24-12-2017 04:06:46
39 వేల కోట్లు చెల్లిస్తే జైలు నుంచి విడుదల
 సౌదీ యువరాజుకు ప్రభుత్వ తాఖీదురియాద్‌, డిసెంబరు 23: అవినీతి ఆరోపణలపై అరెస్ట్‌ చేసిన సౌదీ యువరాజు అల్‌ వలీద్‌ బిన్‌ తలాల్‌కు అక్కడి ప్రభుత్వం ఓ ప్రతిపాదన పెట్టింది. అతని ఆస్తిలో నుంచి కొంత సొమ్ము ప్రభుత్వానికి చెల్లించాలి.. ఆ మొత్తం ఎంతో తెలుసా? అక్షరాలా 600 కోట్ల డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు 39 వేల కోట్ల రూపాయలు. ప్రపంచంలో అత్యంత ధనికుల్లో వలీద్‌ 57వ వారు. ఆయనకు కింగ్‌డమ్‌ హోల్డింగ్‌ కంపెనీ అనే సంస్థ ఉంది. దాని మార్కెట్‌ విలువ 9 బిలియన్‌ డాలర్లు. ఆయన మొత్తం ఆస్తి 18 బిలియన్‌ డాలర్లు. అంటే ఆయన తన ఆస్తిలో మూడోవంతు పోగొట్టుకుంటేనే జైలు నుంచి విడుదలవుతాడు. ఆయన ప్రస్తుతం బేరసారాలు సాగిస్తున్నాడు గానీ సెటిల్మెంట్‌ కుదరట్లేదు. సౌదీలో జైలుపాలైన అనేకమంది యువరాజులు, సంపన్నులైన రాచబంధువులు, ప్రముఖులు పెద్ద మొత్తంలో సొమ్ము చెల్లించి బయటపడి- వేరే దేశాలకు తరలిపోతున్నారు.
nation
19,033
28-10-2017 10:27:04
ఆ పోలీసు అధికారి ఉగ్రవాదుల్లో చేరాడా?
న్యూఢిల్లీ: సెలవుపై వెళ్లిన ఓ పోలీసు అధికారి ఏకే47 పట్టుకుని సోషల్ మీడియాలో దర్శనమిచ్చాడు. వారం రోజుల క్రితమే విధుల్లో చేరాల్సి ఉండగా ఇప్పటికీ పత్తా లేకుండా పోయాడు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో అతడి వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. అతడు ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (ఎల్ఈటీ)లో చేరాడన్న ఊహాగానాలు వెల్లువెత్తుతుండడంతో... పోలీసు వర్గాలు ఆగమేఘాల మీద అతడికోసం గాలింపు చేపట్టాయి. ఇష్ఫాక్ అహ్మద్ అనే ఈ పోలీసు షోపియాన్‌లోని హెఫ్ షిర్మల్ గ్రామానికి చెందిన వాడు. అహ్మద్ 2012లో పోలీసుల విధుల్లో చేరాడనీ.. ప్రస్తుతం కతువా జిల్లాలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (పీటీసీ)లో విధులు నిర్వహిస్తున్నాడని ఓ అధికారి వెల్లడించారు.  ‘‘ఇష్ఫాక్ అహ్మద్ పీటీసీ నుంచి సెలవుపై వెళ్లాడు. ఈ నెల 23న అతడు విధుల్లో చేరాల్సి ఉన్నప్పటికీ తిరిగి రాలేదు. అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం..’’ అని సదరు సీనియర్ అధికారి పేర్కొన్నారు. కాగా ఇటీవల కాగా దాదాపు 8 మంది పోలీసులు తమ పోలీసు ర్యాంకులను వదిలేసి కశ్మీర్ మిలిటెంట్లలో కలిసిపోయారని సమాచారం.
nation
4,854
22-03-2017 18:13:06
కోహ్లీని ట్రంప్‌గా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు: అమితాబ్‌
భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై తన అక్కసును వెల్లగక్కుతున్న ఆస్ట్రేలియా మీడియాకు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ స్ట్రాంగ్‌ రిటార్ట్‌ ఇచ్చాడు. మైదానంలో కోహ్లీ అనుచిత ప్రవర్తన చేస్తున్నాడంటూ ఆరోపిస్తున్న ఆసీస్‌ మీడియా అతణ్ని విమర్శిస్తూ వరుస కథనాలు ప్రచురిస్తోంది.
entertainment
15,166
27-10-2017 16:55:28
డార్జిలింగ్ నుంచి కేంద్ర బలగాల ఉపసంహరణకు సుప్రీం అనుమతి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్, కలింపాంగ్ జిల్లాల్లో మోహరించిన 15 కంపెనీల కేంద్ర సాయుధ పారామిలటరీ బలగాల (సీఏపీఎఫ్) నుంచి 7 కంపెనీల బలగాలను ఉపసంహరించేందుకు సుప్రీంకోర్టు కేంద్రాన్ని అనుమతించింది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో ఎన్నికల విధులకు బలగాలను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నందున వాటిని ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కేంద్రం కోరింది. దీంతో 7 కంపెనీల బలగాలను ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వారంలోగా స్పందించాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది. సీఏపీఎఫ్ బలగాలను ఉపసంహరించుకోవాలన్ని కేంద్ర నిర్ణయాన్ని అంతకుముందు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కోల్‌కతా హైకోర్టులో సవాలు చేసింది. దీంతో అక్టోబర్ 27 వరకూ బలగాల ఉపసంహరణపై హైకోర్టు స్టే ఇచ్చింది. డిసెంబర్ 25 వరకూ సీఏపీఎఫ్ బలగాలను డిసెంబర్ 25 వరకూ కొనసాగించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కేంద్రాన్ని ఓ లేఖలో కూడా కోరింది. అయితే అక్టోబర్ 15న 10 కంపెనీలు, తక్కిన 5 కంపెనీల బలగాలను అక్టోబర్ 20న ఉపసంహరించనున్నట్టు పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై పశ్చిమబెంగాల్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు స్టే ఆదేశాలపై కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించడం చకచకా జరిగిపోయాయి.
nation
640
09-03-2017 23:40:51
ఫిన్‌టెక్‌ గ్లోబల్‌ హబ్‌గా విశాఖపట్నం
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): ఆర్థిక సాంకేతిక (ఫిన్‌టెక్‌) రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా విశాఖ పట్నాన్ని అభివృద్ధి చేస్తున్నామని, అందుకు అవసరమైన వాతావరణాన్ని రుషికొండ ఫిన్‌టెక్‌ వ్యాలీలో సమకూర్చామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి సలహాదారు జెఎ చౌదరి పేర్కొన్నారు. స్ర్పింగ్‌ చాలెంజ్‌ పేరుతో స్టార్టప్‌ కంపెనీలకు రెండు రోజుల సదస్సును గురువారం ఇక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మొత్తం 150 స్టార్టప్‌ కంపెనీలు ఈ సదస్సులో పాల్గొంటున్నాయని, వాటిలో 40 శాతం స్టార్ట్‌పలు 15 దేశాల నుంచి వచ్చాయన్నారు. సింగపూర్‌, స్విట్జర్లాండ్‌, జపాన్ దేశాల నుంచి ప్రముఖ సంస్థలు పాల్గొనడంతో సదస్సుకు ప్రాముఖ్యం ఏర్పడిందన్నారు. ఈ రెండు రోజుల సదస్సులో 15 కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందాలు జరుగుతాయన్నారు. ఐటి, ఐటి ఆధారిత సేవలకు ప్రాధాన్యం తగ్గిందని, సైబర్‌ సెక్యూరిటీ, ఆర్థిక విశ్లేషణలు, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీలకు ఆదరణ పెరుగుతోందని, వాటిపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. కాగా అక్టోబరులో బ్లాక్‌చెయిన టెక్నాలజీపైనా, వచ్చే ఫిబ్రవరిలో ఫినటెక్‌పైనా ప్రపంచ స్థాయి సదస్సులు నిర్వహిస్తామన్నారు. 
business
19,625
05-01-2017 00:41:45
హాండ్స్‌కాంబ్‌ సెంచరీ
ఆసీస్‌ 538/8 డిక్లేర్‌ పాక్‌ 126/2సిడ్నీ: పాకిస్థాన్‌తో మూడో టెస్ట్‌లో డేవిడ్‌ వార్నర్‌, రెన్‌షాతో పాటు పీటర్‌ హాం డ్స్‌కాంబ్‌ (110) సెంచరీతో విజృంభించాడు. పీటర్‌ శతక ప్రదర్శనతో.. ఓవర్‌నైట్‌ స్కోరు 365/3తో రెండో రోజైన బుధవారం ఆట కొనసాగించిన ఆసీస్‌ 538/8 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. పాక్‌ బౌలర్లలో రియాజ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇమ్రాన్‌ ఖాన్‌, అజర్‌ అలీ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాక్‌ ఆట చివరకు 2 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. అజర్‌ అలీ (58 బ్యాటింగ్‌), యూనిస్‌ ఖాన్‌ (64 బ్యాటింగ్‌) అజేయ అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. పాక్‌ ఇంకా 412 పరుగులు వెనకబడి ఉంది.
sports
14,074
01-12-2017 02:02:17
రైల్వే రిజర్వేషన్‌ ‘భీమ్‌’ యాప్‌లో నేటి నుంచి అమలు
న్యూఢిల్లీ, నవంబరు 30: డిజిటల్‌ లావాదేవీల్లో భారతీయ రైల్వే దూసుకెళ్తోంది. గత ఏడాది కాలంలో ఆన్‌లైన్‌ రిజర్వేషన్లు 12శాతం పెరిగాయని ప్రకటించింది. ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ..నేటి నుంచి ‘భీమ్‌’ యాప్‌ ద్వారా టిక్కెట్లు బుక్‌ చేసుకోవడానికి అనుమతించింది. ‘భీమ్‌’ యాప్‌ ద్వారా రైలు టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చు. ప్రయాణికులు శుక్రవారం నుంచి భీమ్‌ యాప్‌ను ఉపయోగించవచ్చు. కార్డులు, నగదుతో పనిలేకుండా.. ఫోన్‌ ద్వారానే టిక్కెట్లను పొందవచ్చు’ అని రైల్వే బోర్డు (ట్రాఫిక్‌) సభ్యుడు మహ్మద్‌ జంషెద్‌ తెలిపారు.  నోట్ల రద్దుకు ముందు.. దాదాపు 58శాతం రైలు టిక్కెట్లు ఆన్‌లైన్‌లో బుక్‌ అయ్యేవి. కానీ గత ఏడాది అక్టోబరు నుంచి ఆన్‌లైన్‌ రిజర్వేషన్లు 70 శాతానికి పెరిగాయని భారతీయ రైల్వే ప్రకటించింది. ‘టిక్కెట్ల రిజర్వేషన్‌ కోసం దాదాపు 3 నుంచి 5 కోట్ల మంది ప్రజలు డిజిటల్‌ చెల్లింపులకే మొగ్గుచూపుతున్నారు. కౌంటర్ల దగ్గర కూడా కేవలం 30 శాతం ప్రయాణికులే నగదుతో టిక్కెట్లు కొంటున్నారు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల కోసం అన్ని స్టేషన్లలో స్వైపింగ్‌ పరికరాలను అమర్చాం’ అని జంషెద్‌ వెల్లడించారు. రోజూ దేశంలో రూ. 80కోట్ల విలువైన ఈ-టిక్కెటింగ్‌ లావాదేవీలు జరుగుతుండగా, కౌంటర్లలో రూ.30 కోట్ల టిక్కెట్‌ కొనుగోళ్లు జరుగుతున్నాయని జంషెద్‌ వివరించారు.
nation
19,121
13-01-2017 03:02:28
ఒకవైపే ప్రింటైన 500 నోటు!
మొన్నామధ్య మధ్యప్రదేశ్‌లో రెండు వేల రూపాయల నోటుపై గాంధీ బొమ్మ కనిపించలేదు. అదేమని అడిగితే అధికారులు ప్రింటింగ్‌ లోపం అని తేల్చారు. ఇప్పుడు కూడా అదే మధప్రదేశ్‌లో ఐదొందలు నోటు ఒకవైపే ప్రింట్‌ అయ్యి వచ్చింది. ఒక ఏటీఎంలో 1500 తీసిన వ్యక్తికి అందులో రెండు నోట్లు ఒకవైపే ముద్రించి ఉండడం చూసి దిగ్ర్భాంతికి గురయ్యాడు. వెంటనే అధికారులను కలిసి ఫిర్యాదు చేయడంతో వారూ అవాక్కయ్యారు. వాటిని తీసుకుని కొత్త నోట్లు ఇచ్చి పంపారు. ఆర్‌బీఐ పంపిన నోట్లలోనే ఈ నోట్లు వచ్చినట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు.
nation
11,535
05-04-2017 16:50:59
దర్యాప్తుకు ముందే ఆరోపణలా? : ఆఫ్రికన్ రాయబారులపై సుష్మా స్వరాజ్ ధ్వజం
న్యూఢిల్లీ : భారతదేశంలో విదేశీయులకు రక్షణ కల్పించేందుకు కట్టుదిట్టమైన యంత్రాంగం ఉందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. ఇటీవల ఆఫ్రికన్లపై జరిగిన దాడుల విషయంలో ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాలని ఆఫ్రికన్ రాయబారులు నిర్ణయించడంలో ఔచిత్యమేమిటని ప్రశ్నించారు. ఆమె లోక్‌సభలో మాట్లాడుతూ ఐరాస ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు వారు పిలుపునిచ్చినప్పటికీ, ఈ దాడులు జాత్యహంకారంతో చేసినవి కాదన్నారు. ‘‘మానవ హక్కుల మండలిని ఆశ్రయిస్తామని వారు (ఆఫ్రికన్ దౌత్యవేత్తలు) చెప్పారు. భారతదేశంలో వ్యవస్థాగత లోపం ఏదైనా ఉందా? అందరు ఆఫ్రికన్ల భద్రతకు హామీనిచ్చే జాతీయ మానవ హక్కుల కమిషన్, న్యాయ వ్యవస్థ, స్వేచ్ఛాయుత పత్రికా వ్యవస్థ ఇండియాలో ఉన్నాయి’’ అని సుష్మా స్వరాజ్ అన్నారు. ఆఫ్రికన్ గ్రూప్ హెడ్ ఆఫ్ మిషన్స్ డీన్, ఎరిట్రియన్ రాయబారి అలెమ్ త్సేహయే వోల్డమరియంతో జరిగిన సమావేశంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ (విశ్రాంత) వీకే సింగ్ పాల్గొన్నారని, ఈ అంశంలో ఐక్యరాజ్య సమితి స్థాయిలో జోక్యం చేసుకోవాలన్న ఆలోచనపై భారతదేశానికిగల అభ్యంతరాన్ని తెలియజేశారని వివరించారు. గ్రేటర్ నోయిడాలో పందొమ్మిదేళ్ళ విద్యార్థి మనీష్ మాదక ద్రవ్యాలు మితిమీరి సేవించడం వల్ల మరణించినట్లు భావించిన స్థానికులు ఆగ్రహానికి గురయ్యారని సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గత నెల 27న జరిగిన సామూహిక దాడిలో కోపోద్రిక్తులైన స్థానికులు పాల్గొనగా, కొందరు దుండగులు తమకు అనుకూలంగా మలచుకున్నారని తెలిపారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు వివరించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ దాడి జాత్యహంకార కారణాల వల్ల జరిగినట్లు ఆరోపించవద్దని కోరారు. అమెరికాలో భారతీయులపై దాడులు జరిగినపుడు (దర్యాప్తు పూర్తయ్యే వరకు) తాము ఆ విధంగా ఆరోపించలేదన్నారు.
nation
19,122
03-04-2017 02:52:13
నేడూ సోదాలు!
బ్యాంకు లాకర్లపై కన్నేసిన ఈడీన్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: నల్ల కుబేరుల నల్ల ధనాన్ని తెలుపు చేయడంలో సహకరించిన డొల్ల కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు సోమవారం కూడా కొనసాగనున్నాయి. మరీ ముఖ్యంగా, మహారాష్ట్ర మాజీ మంత్రి ఛగన్‌ భుజబల్‌కు చెందిన రూ.46.7 కోట్లను తెలుపు చేసిన జగదీశ్‌ పురోహిత ఏర్పాటు చేసిన 700 డొల్ల కంపెనీలపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. పురోహిత ఇంట్లో సోదాల సందర్భంగా, వివిధ బ్యాంకుల్లో అతనికి ఉన్న లాకర్లకు సంబంధించిన పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. వాటిపై సోమవారం తనిఖీలు చేపట్టనుంది. ఇక, 20 మంది డమ్మీ డైరెక్టర్ల పేరిట పురోహిత ఏకంగా 700 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేశారు. కానీ, వాటిలో కుమాన్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సీ గ్రీన్‌ రియల్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే రెండు కంపెనీల ద్వారా రూ.46.7 కోట్ల నల్ల ధనాన్ని తెలుపు చేశాడు. 700 డొల్ల కంపెనీల్లో 550 కంపెనీలను మూసేసినా.. ఇప్పటికీ 150 డొల్ల కంపెనీలతో కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఉన్నాడు. కేవలం రెండు కంపెనీలతో ఛగన్‌ భుజబల్‌ నల్ల ధనాన్ని తెలుపు చేసిన పురోహిత.. మిగిలిన 698 కంపెనీలతో ఎవరెవరి నల్ల డబ్బును చట్టబద్ధం చేశాడు!? అనే అంశంపై ఈడీ కన్నేసింది. ‘‘ఇప్పటికీ జగదీశ్‌ 150 డొల్ల కంపెనీలను నిర్వహిస్తున్నాడు. నేరాలు చేశారని నిర్ధారించే అనేక పత్రాలు దాడుల్లో వెలుగులోకి వచ్చాయి. వాటిని మేం స్వాధీనం చేసుకున్నాం. వాటి ఆధారంగా జగదీశ్‌తో సంబంధాలున్న ఇతర వ్యక్తులపై దర్యాప్తు చేస్తున్నాం’’ అని ఈడీ వర్గాలు తెలిపాయి. అలాగే, శనివారం చేసిన దాడుల్లో ఈడీ ఏకంగా 2300 డొల్ల కంపెనీలను గుర్తించింది. ఇవన్నీ కూడా మనీ లాండరింగ్‌కు పాల్పడినవే. దాంతో, ఎవరెవరి నల్ల డబ్బు ఏయే కంపెనీల నుంచి ఎక్కడికి చేరింది!? అనే అంశంపైనా ఈడీ దర్యాప్తు చేస్తోంది.ఆ పది కంపెనీల గుట్టు విప్పండి‘నల్ల బాబుల’ గుట్టు రట్టు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. స్విస్‌ బ్యాంకుల్లో భారీగా సొమ్ము దాచారని అనుమానిస్తున్న వారి వివరాలు రాబట్టేందుకు అవకాశమున్న అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. తాజాగా పదికిపైగా సంస్థలు, వ్యక్తుల డిపాజిట్ల వివరాలు రాబట్టేందుకు గట్టి ప్రయత్నం మొదలెట్టింది. భారత ప్రభుత్వం నుంచి వస్తున్న నిరంతరాయ విజ్ఞప్తుల నేపథ్యంలో ఆ వివరాలు అప్పగించేందుకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలకు స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇరు ప్రభుత్వాల మధ్య ‘పాలనాపరమైన సహకారం’లో భాగంగా వారి ఖాతాల వివరాలను ఎందుకు ఇవ్వరాదో చెప్పాలంటూ ఆయా ఖాతాదారులకు స్విస్‌ ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. గత వారం ఒకేసారి వెళ్లిన ఈ నోటీసులకు 30 రోజుల్లోగా జవాబివ్వాల్సి ఉంటుంది. ఒకే దేశానికి చెందిన ఇంతమందికి ఒకే వారంలో నోటీసులు వెళ్లడం ఇదే ప్రథమం. నోటీసులు అందుకున్న వాటిలో రెండు లిస్టెడ్‌ జౌళి కంపెనీలు (నియో, ఎస్‌ఈఎల్‌) ఉన్నాయి. కార్పెట్ల ఎగుమతి వ్యాపారంలో ఉన్న మిర్‌ కుటుంబానికి చెందిన పలు కంపెనీలు, వ్యక్తులకు కూడా స్విస్‌ నోటీసులు అందాయి. అబ్దుల్‌ రషీద్‌ మిర్‌, అమీర్‌ మిర్‌, సబేహా మిర్‌, ముజీబ్‌ మిర్‌, తబస్సుమ్‌ మిర్‌ తదతరుల కంపెనీలూ నోటీసులు అందుకున్నాయి.
nation
19,963
24-11-2017 01:56:54
ఆడ్వాణీ క్లీన్‌స్వీప్‌
దోహా: ప్రపంచ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ పంకజ్‌ ఆడ్వాణీ రౌండ్‌రాబిన్‌ దశను విజయవంతంగా ముగించాడు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది 4-0 తో అగ్రస్థానంలో నిలిచాడు. గురువారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆడ్వాణీ బ్రెజిల్‌కు చెందిన విక్టర్‌ సర్కిస్‌ను 4-0 ఫ్రేమ్‌ల తేడాతో ఓడించాడు. 17 సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన పంకజ్‌ పోటీ చివరి ఫ్రేమ్‌లో సెంచరీ బ్రేక్‌ (138)ని సాధించాడు. ఈటోర్నీలో ఆడిన నాలుగు మ్యా చ్‌ల్లో ఆడ్వాణీ రెండు ఫ్రేమ్‌లు మాత్రమే ప్రత్యర్థులకు కోల్పో యాడు.
sports
5,407
11-07-2017 11:53:00
బాలకృష్ణ ఎనర్జీ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది: కార్తీ
ఇది ఎంజీఆర్‌, శివాజీ గణేశన్‌ల కంటే ముందే ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లను అభిమానించిన ఊరు అని, అటువంటి ఎన్టీఆర్‌ తనయుడు ఒక గొప్ప చరిత్రను మన ముందుకు తీసుకురావడం అమితానందంగా ఉందని హీరో కార్తీ అన్నారు. బాలకృష్ణ నటించిన 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తమిళ పాటలను సోమవారం రాత్రి నగరంలోని కలైవానర్‌ అరంగంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్తీ మాట్లాడారు. బాలకృష్ణలో ఎనర్టీ చూస్తుంటే తనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందని, తనతో పనిచేసే స్టంట్‌ మాస్టర్‌, డ్యాన్స్‌ మాస్టర్లు ఎనర్జీ విషయంలో బాలకృష్ణని ఉదాహరణగా చెబుతారని, ఈ వయసులోనూ అదే ఎనర్జీతో ఉండడం గొప్ప విషయమన్నారు. తెలుగు సినీ జంటల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?  కోటశ్రీనివాసరావు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
entertainment
10,596
23-10-2017 21:54:09
ఆ సినిమా నుంచి అందుకే తప్పుకొన్నా: త్రిష
హీరోయిన్‌గా సుదీర్ఘమైన కెరీర్‌ను ఆస్వాదిస్తున్న నటి త్రిష. సోమవారం ఆమె తీసుకున్న ఓ నిర్ణయం టాక్‌ ఆఫ్‌ ది కోలీవుడ్‌ అయింది. ఇంతకీ ఏంటో ఆ నిర్ణయం అని అనుకుంటున్నారా? ‘సామి2’ చిత్రం నుంచి వైదొలగడం.. ఆ విషయాన్ని నేరుగా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడమూను! ‘‘క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ కారణంగా నేను ‘సామి 2’ నుంచి తప్పుకుంటున్నాను. టీమ్‌కు గుడ్‌లక్‌’’ అని ట్వీట్‌ చేశారు త్రిష. హరి దర్శకత్వంలో విక్రమ్‌ సరసన ఆమె నటించిన ‘సామి’ 2003లో విడుదలై బాక్సాఫీస్‌ దగ్గర సందడి చేసింది. తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌ను ‘సామి స్క్వయర్‌’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్‌లో షూటింగ్‌ మొదలైంది. త్రిషతో పాటు కీర్తి సురేశ్‌ కూడా ఈ సీక్వెల్‌లో కథానాయికగా నటిస్తున్నారు. అన్నీ సవ్యంగా సాగుతున్న తరుణంలో త్రిష తాను ఆ చిత్రాన్నుంచి క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ కారణంగా వైదొలుగుతున్నట్టు పోస్ట్‌ చేయడం గమనార్హం.
entertainment
18,320
22-03-2017 02:27:19
ఏకాభిప్రాయ పరిష్కారం: కాంగ్రెస్‌
న్యూఢిల్లీ, మార్చి 21: అయోధ్య వ్యవహారంలో కాంగ్రెస్‌ ఆచితూచి స్పందించింది. ‘ఏకాభిప్రాయంతో పరిష్కరించుకుంటే శాశ్వత శాంతి చేకూరుతుంది. లేదంటే సుప్రీంకోర్టే తేల్చాలి’ అని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జెవాలా వ్యాఖ్యానించారు.న్యూఢిల్లీ, మార్చి 21: అయోధ్య వ్యవహారంలో కాంగ్రెస్‌ ఆచితూచి స్పందించింది. ‘ఏకాభిప్రాయంతో పరిష్కరించుకుంటే శాశ్వత శాంతి చేకూరుతుంది. లేదంటే సుప్రీంకోర్టే తేల్చాలి’ అని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జెవాలా వ్యాఖ్యానించారు.
nation
17,053
21-08-2017 08:24:37
"స్ర్కిప్టు ఢిల్లీది.. యాక్షన్‌ అన్నాడీఎంకేది.. ఎడప్పాడి ప్రభుత్వాన్ని కూలదోస్తాం"
చెన్నై‌: ఢిల్లీలో రూపొందించిన కథ, కథనం, మాటలు, దర్శకత్వానికి అనువుగా రాష్ట్రంలో ఈపీఎస్‌, ఓపీఎస్‌లు నటిస్తున్నారని డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ధ్వజమెత్తారు. లండన్‌ పర్యటనను ముగించుకుని ఆదివారం ఉదయం చెన్నై చేరుకున్న స్టాలిన్‌ విమానా శ్రయంలో పాత్రికేయులతో మాట్లాడారు. అన్నా డీఎంకే రెండు వర్గాల విలీనంపై ప్రధాని మోదీ కట్ట పంచాయతీ జరుపుతున్నారని గతంలో తాను చేసిన ఆరోపణలు ప్రస్తుతం నిజమయ్యాయని ఆయన పేర్కొన్నారు.  కేంద్రంలోని బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి ఎడప్పాడి వర్గం, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గం రాష్ట్ర ప్రజలను అయోమయంలోకి నెట్టి, చక్కగా నటిస్తున్నారని విమర్శించారు. జయలలిత మృతిపై న్యాయవిచారణకు ఆదేశించడం గర్హనీయమని, ఆమె మృతి చెందిన రోజు నుంచే రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తున్నాయన్నారు. జయమృతిపై సీబీఐ విచారణ జరపాలనే డీఎంకే కోరుతున్నదని చెప్పారు. జయ సమాధి వద్ద కొంగజపం చేసిన పన్నీర్‌సెల్వం కూడా సీబీఐ విచారణ కావాలని పట్టుబట్టి, ఇప్పుడు న్యాయవిచారణను స్వాగతించడం విడ్డూరంగా ఉందన్నారు. స్మారకమందిరంగా వేద నిలయం చట్టవ్యతిరేకంమాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసగృహం వేదనిలయాన్ని స్మారక మందిరంగా మార్చేందుకు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి చేపడుతున్న చర్యలు చట్ట వ్యతిరేకమని ఎం.కె. స్టాలిన్‌ ఆరోపించారు. చట్ట ప్రకారం స్మారక మందిరంగా మార్చేందుకు చర్యలు తీసుకోకుండా చట్ట వ్యతిరేకంగా సీఎం చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. జయలలిత పోయెస్‌ గార్డెన్‌ను స్మారక మందిరంగా మార్చనున్నట్టు సీఎం ప్రకటించడంపై పాత్రికేయుల అడిగిన ప్రశ్నకు స్టాలిన్‌ బదులిస్తూ, స్మారక మందిరంగా మార్చేందుకు జరుగుతున్న చర్యలను వేచిచూస్తామని, ఆ తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.  ఇదిలా ఉండగా, స్టాలిన్‌ విమర్శపై మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం స్పందిస్తూ... జయ నివాసగృహాన్ని స్మారక మందిరంగా మార్చటం చట్ట వ్యతిరేకమని చెప్పటానికి ఆయనేమీ లాయర్‌ కాదని చురక అంటించారు. ఇక జయలలిత మృతిపై న్యాయవిచారణ జరుపుతామని సీఎం చేసిన ప్రకటనను పన్నీర్‌సెల్వం స్వాగతించడంపై స్టాలిన్‌ ధ్వజమెత్తుతూ... కమీషన్‌ కోసం ఆ ‘కమిషన్‌’ను అంగీకరించారని విరుచుకుపడ్డారు. జయ మృతిపై సీబీఐ విచారణ జరపాలన్నదే డీఎంకే డిమాండ్‌ అని స్టాలిన్‌ స్పష్టం చేశారు. ఉద్యోగుల సమ్మెను పట్టించుకోని ఈపీఎస్‌...ప్రభుత్వ ఉద్యోగులు తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం సమ్మెకు పిలుపునిస్తుండగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అవేమీ పట్టించుకోకుండా, రెండు పార్టీల విలీనంపై దృష్టిసారిస్తున్నారని స్టాలిన్‌ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఆయన ఓ ప్రకటన చేశారు. ఈనెల 16న ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగుతామంటూ కరపత్రాలు పంచిపెట్టారని, ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు సమ్మె చేయనున్నారని స్టాలిన్‌ అన్నారు.  ఇటీవలే జాక్టోజియో సంఘాల ఆధ్వర్యంలో లక్షలాది మంది ఉద్యోగులు నిరసన ర్యాలీ జరిపారని, ఇంత జరిగినా ముఖ్యమంత్రి ఎడప్పాడి పదిలక్షలమంది ప్రభుత్వోద్యోగులు గురించి పట్టించుకోకుండా పార్టీ వర్గాల విలీనమే తన ధ్యేయమన్న రీతిలో ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఎంకే అండగా ఉంటుందని, ప్రజాస్వామ్యపద్ధతిలో ఎడప్పాడి ప్రభుత్వాన్ని కూలదోస్తామని స్టాలిన్‌ ఆ ప్రకటనలో శపథం చేశారు.
nation
2,520
14-10-2017 00:27:13
బిఎస్ఎన్‌ఎల్‌ 4జి రెడీ
 త్వరలో జడ్చర్ల, వైరాల్లో ప్రారంభం: అనంత రామ్‌హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎ్‌సఎన్‌ఎల్‌), తెలంగాణ సర్కిల్‌ 4జి సర్వీసులను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది ప్రయోగాత్మకంగా మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల, ఖమ్మం జిల్లా వైరాలో ఈ సర్వీసులను ప్రారభించనున్నట్లు బిఎ్‌సఎన్‌ఎల్‌ తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అనంత రామ్‌ వెల్లడించారు. శుక్రవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ రెండు ప్రాంతాల్లో 4జి సర్వీసుల పనితీరును పరిశీలించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో అదనంగా 550.. 4జి టవర్లు, 424.. 3జి టవర్లను నెలకొల్పనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా దీపావళి పండగను పురస్కరించుకుని పలు ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. దీపావళి లక్ష్మి ఆఫర్‌ కింద 290 రూపాయలు, 390 రూపాయలు, 590 రూపాయలు టాపప్‌ రీచార్జ్‌పై అదనంగా 50 శాతం టాక్‌ టైమ్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు చెప్పారు.
business
19,074
18-02-2017 01:31:18
స్టెంట్స్‌ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: గుండెపోటుకు గురైన వారికి రక్త ప్రసరణ అందించేందుకు ఉపయోగించే స్టెంట్స్‌ కృత్రిమ కొరతను సృష్టించేందుకు ప్రయత్నించే కంపెనీలపై నిఘా ఉంచుతామని, అనైతిక చర్యలకు పాల్పడే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఖరీదైన స్టెంట్స్‌ ధరలను ప్రభుత్వం ఇటీవల 85ు తగ్గించింది. దీంతో ఇప్పటివరకూ లక్షల్లో విక్రయించిన డ్రగ్‌ ఎల్యూటింగ్‌ స్టెంట్స్‌ రూ.29,600కు, బేర్‌ మెటల్‌ స్టెంట్స్‌ రూ.7,260కు లభిస్తున్నాయి. ఫలితంగా స్టెంట్స్‌ తయారీ కంపెనీలు కొత్త లేబుల్‌ అతికించాలనే సాకుతో ఆస్పత్రుల్లోని స్టెంట్స్‌ను వెనక్కి తీసుకొని కృత్రిమ కొరత సృష్టిస్తూ నల్ల బజారులో విక్రయిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే పేషెంట్లకు అవసరమైన స్టెంట్స్‌ను కొరత లేకుండా సరఫరా చేసేందుకు ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు.
nation
17,527
02-11-2017 02:53:33
మడగాస్కర్‌లో విజృంభిస్తున్న ప్లేగు
124 మంది బలి.. మరిన్ని దేశాలకు వ్యాపించే ప్రమాదం?న్యూయార్క్‌: మడగాస్కర్‌లో ప్లేగు వ్యాధి విజృంభిస్తోంది. ఆగస్టు ఒకటి నుంచి అక్టోబరు 25 వరకు 1231 మంది ఈ వ్యాధి బారిన పడగా.. 124 మంది మృతి చెందారు. ఊపిరితిత్తుల ప్లేగు కారణంగా మరణాలు పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. మడగాస్కర్‌తో వాణిజ్య, రవాణా సంబంధాలున్న 9 దేశాలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్లేగు వ్యాధి అంతరించిపోయినప్పటికీ మడగాస్కర్‌లో మాత్రం ఏటా 500 కేసులు నమోదవుతుండటం గమనార్హం. ఫమాదిహానా సంప్రదాయంలో భాగంగా మడగాస్కర్‌లో ప్రజలు సమాధులను తవ్వి తమ పూర్వీకుల అస్థిపంజరాలను బయటకు తీసి వాటితో కలిసి నృత్యాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్లేగు వ్యాధి సోకుతూ ఉంటుంది. కానీ, తాజాగా రాజధాని అంటానానారివో సహా జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్రబలడంతో బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఊపిరితిత్తుల ప్లేగు కావడంతో వేగంగా ఒకరి నుంచి మరొకరికి సోకుతోందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ప్లేగు చికిత్సకు లొంగే వ్యాధేనని ఊపిరితిత్తుల ప్లేగు మాత్రం ప్రాణాంతకమైందని పేర్కొంది. మడగాస్కర్‌తో సంబంధాలున్న ఇథియోపియా, కెన్యా, మారిషస్‌, కోమోరస్‌, మొజాంబిక్‌, సీషెల్స్‌, దక్షిణాఫ్రికా, టాంజానియా, లా రూనియన్‌(ఫ్రాన్స్‌)లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ దేశాల్లో ఇప్పటి వరకు ప్లేగు కేసులేవీ నమోదవలేదని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి తెలిపారు.
nation
6,428
24-10-2017 15:34:43
`మెర్స‌ల్‌` తెలుగు అనువాదానికి ఆటంకాలు?
త‌మిళ హీరో విజ‌య్ న‌టించిన `మెర్స‌ల్‌` జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఓ ప్రాంతీయ సినిమాను బీజేపీ నేత‌లు జాతీయ స్థాయిలో పాపుల‌ర్ చేశారు. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్ష‌కులూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా `అదిరింది` పేరుతో ఇప్ప‌టికే తెలుగులో విడుద‌ల కావాల్సి ఉంది. అయితే వేరే కార‌ణాలు విడుద‌ల వాయిదా ప‌డింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ స్నేహితుడు శ‌ర‌త్ మ‌రార్ ఈ సినిమా తెలుగు హక్కుల‌ను ద‌క్కించుకున్నారు. వ‌చ్చే శుక్ర‌వారం విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా విడుద‌ల అనుమానాస్స‌దంగా మారింది. జాతీయ స్థాయిలో వివాదాలు రేపిన ఈ సినిమాకు స‌ర్టిఫికేట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు మీన‌మేషాలు లెక్కిస్తోంద‌ట‌. విడుద‌ల‌కు ఇంకా రెండ్రోజులే స‌మయం ఉన్న‌ప్ప‌టికీ ఇంకా సెన్సార్ పూర్తి కాలేదట‌. దీంతో `అదిరింది` విడుద‌ల సందిగ్ధంగా మారింది.
entertainment
19,505
30-06-2017 00:29:58
జోరుగా.. హుషారుగా..!
ఉత్సాహంలో టీమిండియాసిరీస్‌లో 2-0 ఆధిక్యంపై గురివిండీస్‌తో మూడో వన్డే నేడుబ్యాట్స్‌మెన్‌ పరుగుల వరద పారిస్తుంటే.. బౌలర్లు ప్రత్యర్థిని చుట్టేస్తుంటే.. ఆ జట్టుకు తిరుగే ఉండదు..! ప్రత్యర్థి మరీ బలహీనంగా ఉంటే.. కనీస పోరాటమైనా చేయకుంటే.. ఏకపక్ష విజయాలతో దుమ్ము దులిపేస్తుంది..! ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న టీమిండియా పరిస్థితి కూడా ఇదే! వరుణుడి ఆటంకాలు తప్ప విండీస్‌ నుంచి ఏమాత్రం ప్రతిఘటన ఎదురవకపోవడంతో కోహ్లీసేన హవా సాగుతోంది! రెండో వన్డేలో భారీ విజయం అందించిన జోష్‌లో ఉన్న భారత్‌ కీలకమైన మూడో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించి సిరీస్‌ విజయం దిశగా మరో అడుగు ముందుకేయాలని భావిస్తోంది..! నార్త్‌ సౌండ్‌ (ఆంటిగ్వా): నాలుగు రోజుల విశ్రాంతి అనంతరం టీమిండి యా ఆతిథ్య వెస్టిండీస్‌తో మరో సమరానికి సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగే మూడో వన్డేలో కోహ్లీసేన విండీస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ఇక్కడి సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ స్టేడియం వేదిక కానుంది. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో జరిగిన రెండో వన్డేలో 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి జోరుమీదున్న కోహ్లీ సేన.. ఆంటిగ్వాలోనూ అదే ఊపు కొనసాగించి సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించాలని భావిస్తోంది. వర్షం కారణంగా తొలి వన్డే రద్దయిన సంగతి తెలిసిందే. కాగా.. సొంతగడ్డపై ఆడుతున్నప్పటికీ భారత్‌కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోతున్న జాసన్‌ హోల్డర్‌ నేతృత్వంలోని వెస్టిండీస్‌ ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఒకవేళ మూడో వన్డేలోనూ ఓడితే విండీస్‌ ఇక సిరీస్‌ ఆశలు వదులుకోవాల్సిందే. ఆతిథ్య జట్టు చివరి రెండు వన్డేల్లో సంచలన విజయం సాధిస్తే మాత్రం సిరీస్‌ డ్రా అవుతుంది. అయితే అనుభవం లేని ఆటగాళ్లతో నెట్టుకొస్తున్న విండీస్‌.. అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా ఉన్న భారత్‌ను ఏ మేరకు అడుకుంటుందో చూడాలి.  మిడిలార్డర్‌పై దృష్టి: విండీస్‌ పర్యటనలో భారత టాపార్డర్‌ దుమ్ము లేపుతోంది. ఓపెనర్లు శిఖర్‌ ధవన్‌, అజింక్యా రహానె, అలాగే విరాట్‌ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నారు. అయితే టాపార్డర్‌లో ఈ ముగ్గురూ రాణించడంతో మిడిలార్డర్‌పై వైఫ ల్యం కనిపించ లేదు. వాస్తవంగా చెప్పుకుంటే యువరాజ్‌ సింగ్‌, హార్దిక్‌ పాండ్యా తీవ్రంగా నిరాశపరిచారు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకొచ్చిన హార్దిక్‌ నాలుగు పరుగు లకే వెనుదిరగ్గా, యువీ 14 రన్స్‌ మాత్రమే చేశాడు. 2019 వన్డే వరల్డ్‌కప్‌ ను దృష్టిలో ఉంచుకొని యువకులకు చాన్స్‌ ఇవ్వాలన్న డిమాండ్లు ఎక్కువవుతున్న నేపథ్యంలో వెటరన్‌ ఆటగాడు యువరాజ్‌ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మాజీ కెప్టెన్‌ ధోనీతోపాటు కేదార్‌ జాదవ్‌ కూడా పరు గులు సాధించాలి. లేదంటే రిషభ్‌ పంత్‌ వంటి యు వ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. అసలు ఈ మ్యాచ్‌లో యువీ, ధోనీలో ఒకరికి విశ్రాం తినిచ్చి రిషభ్‌కు తొలి వన్డే చాన్స్‌ ఇస్తారని అనుకున్నారు. కానీ.. ఇంకా సిరీస్‌ ఫలితం తేలకపోవడంతో విన్నింగ్‌ టీమ్‌నే కొనసాగించే అవకాశాలున్నాయి.  ఒత్తిడిలో విండీస్‌: తొలి వన్డే వర్షార్పణమవడం, రెండో మ్యాచ్‌లో చిత్తుగా ఓడి పోవడంతో ఆతిథ్య విండీస్‌ 0-1తో వెనకబడిం ది. సిరీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే మూడో వన్డేలో తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో హోల్డర్‌ సేనపైనే ఎక్కువ ఒత్తిడి నెలకొంది. విండీస్‌ మిగతా మూడు వన్డేలకు జట్టులో రెండు మార్పులు చేసింది. కార్టర్‌, కెస్రిక్‌ విలియమ్స్‌ స్థానాల్లో కైల్‌ హోప్‌, సునీల్‌ ఆంబ్రిస్‌లను జట్టులోకి తీసుకుంది.పిచ్‌, వాతావరణంనార్త్‌ సౌండ్‌లోని వివియన్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో జరిగిన గత 15 వన్డేల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు సగటు స్కోరు 252. కాబట్టి ఈ పిచ్‌పై 300 పైచిలుకు స్కోరు ఆశించలేం. వికెట్‌ పొడిగా ఉండడంతో బ్యాట్స్‌మెన్‌ స్వేచ్ఛగా షాట్లు ఆడడం కష్టమే. కాగా.. మూడో వన్డేను కూడా వర్షం వెంటాడనుంది. శుక్రవారమిక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. కానీ.. అది మ్యాచ్‌ ఫలితంపై ప్రభావం చూపకపోవచ్చు.జట్లు (అంచనా)భారత్‌: ధవన్‌, రహానె, కోహ్లీ (కెప్టెన్‌), యువరాజ్‌, ధోనీ (వికెట్‌కీపర్‌), కేదార్‌, జాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, అశ్విన్‌, భువనేశ్వర్‌, ఉమేష్‌ యాదవ్‌వెస్టిండీస్‌: ఎవిన్‌ లెవిస్‌, కైల్‌ హోప్‌, షై హోప్‌ (వికెట్‌కీపర్‌), జాసన్‌ మహమ్మద్‌, రొస్టన్‌ ఛేజ్‌, జాసన్‌ హోల్డర్‌ (కెప్టెన్‌), రోవ్‌మన్‌ పావెల్‌/సునీల్‌ ఆంబ్రిస్‌, అష్లే నర్స్‌, అల్జరి జోసెఫ్‌, దేవేంద్రో బిషూ, మిగుయెల్‌ కమిన్స్‌.5 ర్యాంకింగ్స్‌లో టాప్‌-8లో ఉన్న టీమ్‌పై వెస్టిండీస్‌ వన్డే సిరీస్‌ విజయం సాధించి ఐదేళ్లయింది. చివరగా 2012లో న్యూజిలాండ్‌పై 4-1తో సిరీస్‌ గెలిచింది. ఆ తర్వాత 16 సిరీస్‌ల్లో ఓటమిపాలైంది.
sports
16,668
07-11-2017 16:28:18
'బ్లాక్ డే' ప్రదర్శనను కుదించిన డీఎంకే
చెన్నై: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని బుధవారంనాటికి ఏడాది అవుతున్న తరుణంలో విపక్షాలు దేశవ్యాప్తంగా ఈనెల 8న నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నాయి. తమిళనాట ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే సైతం ఇప్పటికే రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. కాగా, రాష్ట్రంలోని 8 జిల్లాలో 'బ్లాక్ డే' ప్రదర్శనలను రద్దు చేసినట్టు డీఎంకే ఒక ప్రకటనలో తెలిపింది. భారీ వర్షాలు, పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటన తెలిపింది. సోమవారంనాడు తమిళనాడు పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధిని ఆయన నివాసంలో కలుసుకున్న నేపథ్యంలో డీఎంకే ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, డీఎంకే భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ 'బ్లాక్ డే' పాటించేందుకు సన్నాహాలు చేస్తుండగా, బీజేపీ 'నల్లధనం వ్యతిరేక దినం' దేశవ్యాప్తంగా నిర్వహించనుంది. గత ఏడాది నవంబర్ 8న ప్రధాని మోదీ ఎవరూ ఊహించని విధంగా రూ.500, రూ.1000 నోట్లను తక్షణం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తదుపరి క్రమంలో కొత్త రూ.500, రూ.2000 నోట్లను ఆర్‌బీఐ విడుదల చేసింది.
nation
11,964
18-10-2017 05:07:30
ప్రేమ వ్యవహారంలో.. సోదరి హత్య?
రామచంద్రపురం, అక్టోబరు 17 : ఇంట్లోకి చొరబడి, ఒంటరిగా ఉన్న యువతిని కొట్టి చంపిన దారుణం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో జరిగింది. ఈ ఘటనలో మృతిచెందిన నందుల జయదీపిక(20) తండ్రి సత్యనారాయణ రాజు రామచంద్రపురం టీడీపీ అధ్యక్షుడు. దీపిక ప్రేమ వ్యవహారం నచ్చక.. తన కుమారుడే చంపించాడని సత్యనారాయణరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం, రామచంద్రపురంలోని కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో జయదీపిక బీటెక్‌ నాల్గో సంవత్సరం చదువుతోంది. తల్లి చిన్ననాడే చనిపోయింది. తండ్రి రాజు, సోదరుడు జయప్రకాశ్‌లు పట్టణంలో బార్‌ నడుపుతున్నారు. రోజూ అర్ధరాత్రి తరువాతే షాపు కట్టేసి వారు ఇంటికి వెళతారు. అప్పటిదాకా జయదీపిక ఒక్కతే ఇంట్లో ఉంటుంది. సోమవారం రాత్రి ఆమె ఒంటరిగా ఉండగా, కొంతమంది ఇంట్లోకి చొరబడ్డారు. ఆమెను కొట్టి..కొట్టి చంపారు. తల వెనుక, ముఖం మీద బలమైన గాయాలతో జయదీపిక పడిపోయింది. ఒంటి గంటకు ఇంటికొచ్చిన తండ్రీకొడుకులకు రక్తపుమడుగులో దీపిక కనిపించింది. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయింది. కుమారుడి మీద అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
nation