SNo
int64
0
21.6k
date
stringlengths
19
19
heading
stringlengths
3
91
body
stringlengths
6
38.7k
topic
stringclasses
5 values
4,287
06-06-2017 01:23:37
అడుగడుగునా సంక్షేమం
మహిళా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు, బ్రాహ్మణ, ఈబీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. నవ్యాంధ్రప్రదేశ్‌ 16వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌లో వున్నా సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబు ప్రభుత్వం ప్రథమ స్థానంలో వున్నది.   పేదరికం నిర్మూలిస్తేనే తప్ప దేశానికి నిజమైన స్వాతంత్ర్యం లభించి నట్లు కాదు. ప్రజాస్వామ్యం కూడా విజయవంతం కాదు. ఈ సత్యాన్ని గుర్తెరిగిన తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు సాధికారత చేకూర్చింది. సంక్షేమ రంగానికి మారుపేరుగా నిలిచింది. అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి స్వర్గీయ ఎన్టీఆర్‌ సంక్షేమ రంగానికి సరైన నిర్వచనం ఇచ్చారు. అదే బాటలో నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ, అనేక కొత్త పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించి గతంలో విజయవంతంగా అమలు చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల కష్టాలు తెలిసిన పార్టీగా దేశంలో ఎవరూ అమలు చేయని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. పేదలు కడుపునిండా తినాలనే ఉద్దేశంతో రెండు రూపాయలకే కిలో బియ్యం, నిలువ నీడ లేని వారికి పక్కా ఇళ్లు, సగం ధరకే చేనేత వస్త్రాలు, నిరాధార పేద వితంతువులకు, కూలీలకు పెన్షన్లు, ఆస్తిలో ఆడపిల్లలకు సమాన వాటా, మహిళా విశ్వవిద్యాలయం, రెవెన్యూ మండలాల ఏర్పాటు, భూమి లేనివారికి భూ వసతి, ప్రజా సదస్సులు వంటి వినూత్న పథకాలకు, నూతన సంస్కరణలకు తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేసిన ఘనత మన చంద్రన్నకే దక్కుతుంది. మహిళల పేరిట ఇళ్ల స్థలాలు, ఇళ్లు, రుణాలు, పట్టాలు. మహిళా పోలీసు స్టేషన్‌లు, ఫ్యామిలీ కోర్టులు, మహిళా కోర్టులు తెలుగుదేశం హయాంలో ఏర్పాటు చేసినవే. ఒక దళిత మహిళను అసెంబ్లీ స్పీకర్‌గా నియమించిన ఘనత కూడా చంద్రన్నకే దక్కింది. ప్రతినిత్యం ప్రజల కోసం పరితపించే చంద్రబాబే తిరుగులేని ముఖ్యమంత్రని సాక్షాత్తు కేంద్రమే కితాబిచ్చింది. సంక్షేమానికి పెద్దపీట వేసి, చిత్తశుద్ధితో మహిళా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ, ఈబీసీలను అభివృద్ధి చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. పేదరిక నిర్మూలన, సామాజిక, ఆర్థిక అసమానతలను తగ్గించడం కోసం తెలుగుదేశం ప్రభుత్వం గత మూడేళ్లుగా గణనీయమైన కృషి చేసింది. ప్రతి వర్గానికి చెందిన ప్రత్యేక అవసరాలను గుర్తించి వాటిని నెరవేర్చేందుకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌లు, ఫెడరేషన్‌లు ఏర్పాటుచేసి వాటికి సమృద్ధిగా నిధులు సమకూర్చారు. ఆయా వర్గాల అభ్యున్నతిని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు పాలకమండళ్ళను సకాలంలో నియమించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలను చేపట్టిన వెంటనే రెండో సంతకం డ్వాక్రా రుణమాఫీ పైల్‌పై చేయడం జరిగింది. ఒక్కొక్క డ్వాక్రా మహిళకు రూ.10వేలు ఆడపడుచులకు పసుపు, కుంకుమ కింద ఇవ్వదలచగా అందులో రూ.6500 కోట్లు ఇప్పటికే వారి ఖాతాల్లో వేయడం జరిగింది. ప్రతి ఇంటికి ఒక డ్వాక్రా మహిళ ఉండాలనేది చంద్రన్న లక్ష్యం. చంద్రబాబు కృషికి ఫలితంగానే సుమారు 89 లక్షల 60 వేల 207 మంది మహిళలు డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థికంగా స్థిరపడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అంగన్‌ వాడీ వర్కర్లు జీతాల రూ.3400 నుంచి రూ.7200 వరకు పెంచటం జరిగింది. గిరిపుత్రిక కళ్యాణ పథకం ‘దుల్హన్‌’ పేరుతో గిరిజన, మైనారిటీ వధువు వివాహ సమయంలో ప్రభుత్వం రూ.50వేలు ఆర్థిక సహాయం అందిస్తుంది. 3.45 లక్షల మంది గర్భిణీలు, బిడ్డలకు పాలు ఇచ్చే తల్లులకు ‘బాలామృతం’ పథకం పేరుతో షోషకాహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. పోషకాహార లోపం గల పిల్లలకు ‘గోరుముద్దలు’ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ‘దీపం’ పథకాన్ని తిరిగి పునరుద్ధరించడం జరిగింది. అన్నా క్యాంటీన్లు, ఇసుక రీచ్‌లను డ్వాక్రా మహిళలకు ఇవ్వటం జరిగింది. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని పాఠశాల విద్యను అభ్యసించే లక్షా 82వేల 556 మంది బాలికలకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ చేయడం జరిగింది. ‘అన్న సంజీవని’ పథకం కింద జెనరిక్‌ మందుల దుకాణాల బాధ్యతను మహిళలకు అప్పగించాము. సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసన, మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు, కిశోర్‌ బాలికా సంరక్షణ పథకం, గృహిణి, రోషిణి, దీపం, ముస్లిం మహిళల కోసం డ్వామ్వా పథకాలను తెలుగుదేశం ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోంది. జాతీయ మహిళా సాధికారత సదస్సును ఏర్పాటు చేసి వారి సమస్యలను వారే చర్చించుకొని పరిష్కరించే విధంగా దేశంలోనే మొట్ట మొదటి సారిగా తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో అంగరంగ వైభవంగా జరిపి దేశాన్ని ఆకర్షించగలిగింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు రెసిడెన్షియల్‌ పాఠశాలలను ప్రారంభించి దేశంలోనే ఆదర్శంగా నిలిపింది. ఎస్సీ, ఎస్టీలపై జరిగే అత్యాచారాలు, దౌర్జన్యాల కేసులు సత్వర పరిష్కారానికి 22 మొబైల్‌ కోర్టులు, 23 స్పెషల్‌ సెషన్స్‌ కోర్టులు మంజూరు చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ అధికారంలో ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ. 22,447 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ. 6,981 కోట్ల మేర దారి మళ్లించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత మూడేళ్లలోనే ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద 19,536 కోట్లు కేటాయించి ఖర్చు చేయడం జరిగింది. రాష్ట్రంలోని మైనారిటీ వర్గాలలో వున్న పేదరికాన్ని విద్య, నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం గత మూడేళ్లుగా అనేక వినూత్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. పేదరికంలో మగ్గుతున్న ముస్లిం విద్యార్థినీ విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశం కల్పించేందుకు ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్‌లో పెద్ద మొత్తాన్ని స్కాలర్‌షిప్స్‌, ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్ల కోసం కేటాయించటం జరుగుతుంది. మక్కా పుణ్య క్షేత్రాన్ని దర్శించుకునే హజ్‌ యాత్రను సులభతరం, సౌకర్యవంతం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రత్యేక చొరవ చూపుతున్నారు. విజయవాడలో కూడా ఆధునాతన హజ్‌హౌస్‌ నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంది. మేనిఫెస్టోలో హామీ మేరకు ఇమాంలకు రూ.5,000, మౌజన్‌లకు రూ.3,000 జీతాలు ఇచ్చే వినూత్న పథకం ప్రారంభించాం. కర్నూలులో ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాం. క్రిస్టియన్‌ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా 2016–-17లో 1250 మందికి రూ.12.48 కోట్లు కేటాయించారు. అదే విధంగా 590 క్రిస్టియన్‌ నిరుద్యోగ యువతకు 71 లక్షల వ్యయంతో శిక్షణ ఇవ్వడం జరిగింది. గుంటూరులో క్రిస్టియన్‌ భవన్‌ నిర్మించడం, జెరూసలెం యాత్ర పథకం క్రింద యాత్రికులకు అందించే ఆర్ధిక సహాకారం రూ. 20వేల నుంచి రూ. 40వేలకు పెంచడం జరిగింది. కాపు, బలిజ, ఒంటరి, తెలగ సంక్షేమం కోసం దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను నవ్యాంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తుంది. రాజశేఖరరెడ్డి హయాంలో కాపులకు ఇచ్చింది ‘సున్నా’. కాపులకు ఉన్న రిజర్వేషన్‌ను రద్దు చేసింది కూడా కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులే. 2004 మేనిఫెస్టోలో కాపు రిజర్వేషన్‌ ఇస్తామని వైయస్‌ ఇవ్వకుండా మోసం చేశారు. కాపుల సర్వే కోసం నిధులు కేటాయించడానికి చేతులు రాలేదు. 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటంతోనే మ్యానిఫోస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాపులకు న్యాయం చేయాలనే ఆలోచనతో 2015 సెప్టెంబర్‌ 2న ఏపి స్టేట్‌ కాపు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి రూ.187.95 కోట్లు (సబ్సిడి రూ.92కోట్లు, బ్యాంక్‌ లోన్‌ రూ.95.9కోట్లు) విడుదల చేసింది. 2016-–17లో రూ.1000 కోట్లు, 2017-–18లో మరో రూ.1000 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించటం జరిగింది. విదేశీ విద్యాదీవెన పథకం ద్వారా విద్యార్థులను ఉన్నత చదువుల నిమిత్తం ఇప్పటికే వెయ్యి మందికి పైగా విదేశాలకు పంపటం జరిగింది. విద్యోన్నతి పథకం సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు దేశంలో ప్రముఖ సంస్థల్లో చేర్పించి కోచింగ్‌ ఇప్పించారు. రాష్ట్రంలోని విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతిలో రూ.25 కోట్లతో కాపుభవన్‌ల నిర్మాణం జరగనుంది. బ్రాహ్మణ సంక్షేమానికి 2017–-18 బడ్జెట్‌లో రూ. 97 కోట్లు కేటాయించి బ్రాహ్మణ సంక్షేమం పట్ల తెలుగుదేశానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుకుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌ పర్యవేక్షణలోని ఆలయాల్లో పనిచేసే వారి కోసం ‘అర్చకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి’ బాసటగా నిలుస్తోంది. అర్చకులకు వంశపారంపర్య హక్కు కలగ జేసింది.45 లక్షలకు పైగా వితంతు, వృద్ధాప్య, వికలాంగులు, చేనేత, గీత, కళాకారులకు పెన్షన్లు రూ.1000 నుంచి రూ.1500 వరకు ఇస్తున్నది. చంద్రన్న బీమా ద్వారా 2.13 కోట్ల మందికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించింది. దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం. 1680 కోట్లు రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీగా, ఇన్సూరెన్స్‌గా అందించుట జరుగుతున్నది. 10 లక్షల మందికి పైగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి త్వరలో అందించబోతున్నది. 1.25 కోట్ల మంది తెల్ల రేషన్‌కార్డు దారులకు రేషన్‌ బియ్యం 4 కేజీల నుంచి 5 కేజీలకు పెంచడమైంది. సంక్రాంతి కానుక, రంజాన్‌ తోఫా, క్రిస్‌మస్‌ కానుక అందించడం జరుగుతుంది. రాష్ట్రం 16వేల కోట్లు లోటు బడ్జెట్‌లో వున్నా సంక్షేమ పథకాల అమలులో చంద్రన్న ప్రభుత్వం ప్రథమ స్థానంలో వున్నది. -నక్కా ఆనంద్‌బాబుసాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖా మాత్యులు
editorial
13,830
29-09-2017 09:25:56
5గురు మంత్రులకు ఉగ్రవాదులతో లింకులు
ఇస్లామాబాద్ : ఉగ్రవాదులకు పాకిస్థాన్ స్వర్గధామమని ప్రపంచం గుర్తిస్తున్న తరుణంలో మరింత దారుణమైన విషయం బయటపడింది. పాకిస్థాన్‌ను జీహాదీ మంత్రి మండలి పరిపాలిస్తోందని తెలుస్తోంది. పాక్ మీడియా సంచలనాత్మక ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికను బయటపెట్టింది. దీని ప్రకారం ఐదుగురు మంత్రులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. 37 మంది ఎంపీలకు కూడా ఉగ్రవాదంతో సన్నిహిత అనుబంధం ఉన్నట్లు సమాచారం. అయితే ఆ దేశ ప్రధాన మంత్రి అబ్బాసీ ఈ నివేదికను తోసిపుచ్చారు. ఇదంతా బూటకపు ప్రచారమని కొట్టేపారేశారు.
nation
19,830
25-05-2017 03:31:39
అశ్విన్ కు ఇంటర్నేషనల్‌ అవార్డు
ముంబై: రవిచంద్రన అశ్విన ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అందుకున్నాడు. బుధవారం ఇక్కడ సియెట్‌ క్రికెట్‌ రేటింగ్‌ ఇంటర్నేషనల్‌ అవార్డుల కార్యక్రమం జరిగింది. దిగ్గజ ఆటగాడు సునీల్‌ గవాస్కర్‌, ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన హర్ష్‌ గోయెంకా.. అశ్వినకు ఈ అవార్డు ప్రదానం చేశారు. యువ బ్యాట్స్‌మన శుభమ్‌ గిల్‌ ‘యంగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అశ్విన మాట్లాడుతూ.. చెన్నై చెపాక్‌ స్టేడియంలో గవాస్కర్‌ నుంచి తాను అందుకున్న తొలి ఆటోగ్రాఫ్‌ క్షణాలను గుర్తు చేసుకున్నాడు.
sports
744
27-09-2017 00:10:33
మారుతి వేగన్‌ ఆర్‌ @ 20 లక్షలు
న్యూఢిల్లీ: మారుతి సుజుకీ కార్లలోని బహుళ జనాదరణ పొందిన కారుగా వేగన్‌ ఆర్‌ 20 లక్షల అమ్మకాల మైలురాయిని అధిగమించింది. 1999లో వేగన్‌ ఆర్‌ మార్కెట్‌లోకి తీసుకురాగా 18 సంవత్సరాల కాలంలో ఈ ఘనత సాధించింది. మారుతి కార్లలో మారుతి 800, ఆల్టో తర్వాత ఈ మైలురాయి దాటిన మూడో కారు ఇది. వరుసగా గత పది సంవత్సరాల కాలంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఐదు మోడళ్లలో ఒకటిగా నిలిచింది. 2011 సంవత్సరంలో తొలిసారి 10 లక్షల కార్ల అమ్మకం మైలురాయిని చేరింది.
business
20,174
19-01-2017 00:49:25
నెల్లూరులో నేటి నుంచి ఖేలో ఇండియా జాతీయ స్థాయి పోటీలు
నెల్లూరు (క్యాంపస్‌): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియా జాతీయ స్థాయి పోటీలు గురువారం నెల్లూరు జిల్లా కేంద్రంలో ప్రారంభం కానున్నాయి. ఈనెల 22వ తేదీ వరకు జరిగే ఈ పోటీలను ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ప్రారంభించనున్నారు. ఖోఖో, కబడ్డీ, ఉషు క్రీడలలో అండర్‌- 14 విభాగంలో 20 రాష్ట్రాల నుంచి 700 మందికి పైగా క్రీడాకారులు, 200 మందికి పైగా కోచలు, అధికారులు పాల్గొననున్నారు. క్రీడాకారులకు బుధవారం స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు మెడికల్‌ పరీక్షలు నిర్వహించి, అర్హులైన వారికి గుర్తింపు కార్డులు ఇచ్చారు. ప్రారంభోత్సవ సభలో రాష్ట్ర మంత్రులు శిద్దా రాఘవరావు, పొంగూరు నారాయణ, కే అచ్చన్నాయుడు తదితరులు పాల్గొననున్నారు.
sports
9,381
29-10-2017 22:51:23
సూపర్‌ స్టార్స్‌ వాళ్లే
‘‘నా దృష్టిలో నిజమైన సూపర్‌స్టార్స్‌ దివ్యాంగులే’’ అని హీరో రవితేజ అన్నారు. హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో ‘రాజా ది గ్రేట్‌’ చిత్రాన్ని వికలాంగుల సంక్షేమ శాఖ డైరక్టర్‌ శైలజ ఆధ్వర్యంలో అంధుల కోసం ఆదివారం ప్రత్యేకంగా ప్రదర్శించారు. సినిమా క్లైమాక్స్‌లో ఉండగా ఆ చిత్ర హీరో రవితేజ, నిర్మాత దిల్‌రాజు, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి థియేటర్‌కు చేరుకుని వీక్షకులతో ముచ్చటించారు. ఈ చిత్రంలోని రాజా పాత్ర తనకు చాలా ఇష్టమని రవితేజ అన్నారు. ఈ చిత్ర కథకు దివ్యాంగులే స్ఫూర్తి అని దర్శకుడు చెప్పారు. రవితేజ పాత్ర ఎంతోమందికి ఆదర్శమని దిల్‌రాజు తెలిపారు. ప్రభుత్వ కార్యదర్శి జగదీశ్వర్‌, వికలాంగుల కార్పొరేషన్‌ వాసుదేవరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
entertainment
17,780
26-02-2017 01:40:54
2వేలు రంగు పోయింది!!
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: మొన్న ఢిల్లీలోని ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.2వేల నోటు స్థానంలో బొమ్మ నోట్లు రాగా.. శనివారం యూపీలోని ఓ ఏటీఎంలో రంగు వెలిసిన నోటు వచ్చింది. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేశారు. జలాలాబాద్‌కు చెందిన రితిక్‌ గుప్తా ఎస్బీఐ ఏటీఎంలో రూ.10వేలు విత్ డ్రా చేశారు. మొత్తం అయిదు 2వేల నోట్లు వచ్చాయి. వీటిలో ఒకటి రంగు వెలిసిందని అతను ఫిర్యాదు చేశాడు.
nation
630
12-05-2017 00:28:42
దూసుకుపోయిన టూ వీలర్‌ షేర్లు
అమ్మకాల ఒత్తిడి ఉన్నా సూచీలు లాభాల్లోనేస్టాక్‌ మార్కెట్లో బుల్‌ జోరు కొనసాగుతోంది. తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి ఉన్నప్పటికీ కీలక సూచీలు గురువారం నాడు కూడా స్వల్పలాభంతో కొత్త గరిష్ఠ స్థాయిని తాకాయి. సెన్సెక్స్‌ 3 పాయింట్ల లాభంతో 30250 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్ఇ 15 పాయింట్ల లాభంతో 9422 వద్ద ముగిసింది. ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ భారీ లాభాలతో ప్రారంభమై ఇంట్రాడేలో 30366 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. లాభాల స్వీకరణ కారణంగా ఆఖరులో 3 పాయింట్ల స్వల్ప లాభంతో ముగిసింది. నిఫ్టీ కూడా ఇంట్రాడేలో కొత్త ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి 9450 పాయింట్లను తాకింది. సెన్సెక్స్‌ షేర్లలో హీరో మోటార్స్‌, బజాజ్‌ ఆటో భారీగా లాభపడ్డాయి. ఈ సారి వర్షాలు బాగుంటే గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్‌ పెరుగుతుందన్న అంచనాలు ఈ షేర్లలో ర్యాలీకి కారణం. ఇన్వెస్టర్లు బుల్లిష్ గానే ఉన్నారనీ, బ్యాంక్‌ ఆఫ్‌ యూరప్‌ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో మార్కెట్లో కొంత అప్రమత్తత ఏర్పడిందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్‌తో పాటు ఆసియా వ్యాప్తంగా ఇతర కీలక మార్కెట్లు కూడా దూసుకుపోతున్నాయి. 30 సెన్సెక్స్‌ షేర్లలో 14 లాభపడ్డాయి. 16 నష్టాలతో ముగిసాయి. ఎయిర్‌టెల్‌ లాభాల స్వీకరణతో 2 శాతం నష్టపోయింది.హీరో మోటోకార్ప్‌ 4.5 శాతం, బజాజ్‌ ఆటో 3.2 శాతం పెరిగాయి. దాల్మియా భారత షేర్లు 7 శాతం లాభపడ్డాయి. క్యు4 ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటం ఈ షేర్లలో ర్యాలీకి ముఖ్య కారణం. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు ధర 6 శాతం పెరిగింది.హడ్కో ఇష్యూ 79 రెట్ల ఓవర్‌ సబ్‌స్ర్కిప్షన్‌ హడ్కో పబ్లిక్‌ ఇష్యూ 79.49 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. ఇష్యూ సైజు కేవలం 20.4 కోట్ల షేర్లు కాగా 16.22 కోట్ల షేర్లకు బిడ్స్‌ వచ్చాయి. మినీరత్నాల జాబితాలో ఉన్న హడ్కో ఇష్యూ ధర 50-60 రూపాయలుగా ఉంది.
business
12,341
07-02-2017 17:12:53
పాక్ ఏం చేస్తోందో వాళ్ళు కూడా చెప్పేశారు
వాషింగ్టన్ : ‘‘భారతదేశంపై దాడి చేసే ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ సైన్యం అండగా నిలుస్తోంది. సుస్థిరతను దెబ్బతీయడం, కశ్మీరు వివాదంపై అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని రాబట్టడమే వారి లక్ష్యం’’ అని అమెరికాలోని 10 ప్రధాన మేధో సంఘాల్లోని దక్షిణాసియా నిపుణులు చెప్పారు. ‘పాకిస్థాన్ పట్ల అమెరికా నూతన వైఖరి : సంబంధాలు తెంచుకోకుండా సహాయానికి షరతులు అమలు చేయడం’ అనే నివేదికలో ఈ వివరాలను వెల్లడించారు.  భారత్, పాక్ రాజకీయ పాలకులు శాంతి యత్నాలను ప్రారంభించిన ప్రతిసారీ ఆ ప్రయత్నాలను పాకిస్థాన్ సైన్యం దెబ్బతీసిందని ఈ నివేదిక వెల్లడించింది. 1999లో కార్గిల్ యుద్ధం సమయంలో జరిగిన సంఘటనలను ప్రస్తావించింది. భారతదేశంతో భావావరోధం ఉండటం వల్లే పాకిస్థాన్ తన భద్రత, విదేశాంగ విధానంలో భాగంగా ఉగ్రవాద బృందాలను ఉపయోగిస్తోందని పేర్కొంది. భారతదేశం వల్ల తన ఉనికికి ముప్పు ఏర్పడుతుందని పాకిస్థాన్ భావిస్తోందని తెలిపింది. అయితే పాకిస్థాన్‌కు భారతదేశం పట్ల ఉన్న భయమేమిటో స్పష్టంగా తెలియడం లేదని కూడా పేర్కొంది. ఆప్ఘనిస్థాన్‌ అంతర్జాతీయ ఉగ్రవాదానికి సురక్షిత ప్రాంతంగా మారిపోకుండా అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు పాకిస్థాన్ గండి కొడుతోందని కూడా ఈ నివేదిక పేర్కొంది. ఆఫ్ఘనిస్థాన్, సంకీర్ణ సేనలతో పోరాడే ఉగ్రవాద సంస్థలకు సహకరించే విధానాన్ని పాకిస్థాన్ మార్చుకోవడం లేదని తెలిపింది.
nation
12,409
11-02-2017 18:51:39
విగ్రహాలు, స్మారకాల జోలికి వెళ్లను..!
బిజ్నూరు: అధికారం చేజారిపోయినప్పుడే గత పాలకులకు తమ తప్పిదాలు గుర్తుకొస్తాయి. మళ్లీ ఆ పొరపాట్లు జరక్కుండా జాగ్రత్త పడుతుంటారు. బీఎస్‌పీ అధికారంలో ఉన్నప్పుడు వాడవాడలా సొంత విగ్రహాలు, పార్టీ గుర్తుతో కూడిన జెయింట్ స్టాట్యూలు, మ్యూజియంల నిర్మాణాలతో ప్రజాధనం దుర్వినియోగం చేసారన్న విమర్శలు ఎదుర్కొన్న ఆ పార్టీ పార్టీ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయవతి ఇప్పుడు స్వరం మార్చారు. ఇకముందు విగ్రహాలు, స్మారకాల ఏర్పాట్ల జోలికి వెళ్లనని, ఈసారి ప్రజలు తమ పార్టీకి అధికారమిస్తే యూపీని అభివృద్ధి బాటలో నడుపుతానని మాయావతి హామీలు గుప్పిస్తున్నారు. బిజ్నూర్‌లో శనివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రజలనుద్దేశించి మాయావతి మాట్లాడుతూ 'నేను మీకు ఓ వాగ్దానం చేస్తున్నాను. ఇక నుంచి విగ్రహాలు, మ్యూజియంల జోలికి వెళ్లను. వాటి నిర్మాణాలు అప్పటి సీఎంగా నా హయాంలోనే పూర్తయిపోయాయి. ఈసారి నా దృష్టంతా పూర్తిగా ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధిపైనే ఉంచుతాను' అని అన్నారు. అంతర్గత కలహాలతో మునిగిపోయిన సమజ్‌వాదీ పార్టీకి ఓటు వేస్తే అది మురిగిపోయినట్టేనని, బీఎస్‌పీకి ఓటు వేయడం ద్వారానే బీజేపీని చిత్తుగా ఓడించడం సాధ్యమవుతుందని అన్నారు. బీఎస్‌పీ అధికారంలో ఉండగా చేపట్టిన అన్ని పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిందని, తాము అధికారంలోకి రాగానే ఆ పథకాలన్నీ తిరిగదోడుతామని, ప్రజాసంక్షేమమే పరమావధిగా యూపీని అభివృద్ధి పట్టాలెక్కిస్తామని మాయావతి ఓటర్లకు భరోసా ఇచ్చారు.
nation
19,099
06-02-2017 02:54:37
జోరుగా జల్లికట్టు
అవనియాపురంలో 74 మందికి గాయాలుచెన్నై, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): జల్లికట్టు కోసం మూడేళ్లుగా ఎదురుచూసిన మదురై జిల్లాలోని అవనియాపు రం వాసుల నిరీక్షణకు ఆదివారం తెరపడింది. ఇక్కడ జల్లికట్టు పోటీలు జరిగాయి. అయితే ఈ జోరు ఎంతో సేపు నిలవలేదు. ఎద్దులను అదుపుచేసే ప్ర యత్నంలో 74 మంది గాయపడగా.. 17 మంది పరిస్థితి విషమంగా ఉంది. రెవెన్యూ మంత్రి ఆర్‌బీ ఉదయకుమా ర్‌ ఈ పోటీలను ప్రారంభించారు.
nation
15,309
09-08-2017 17:18:23
సావర్కర్‌పై సోనియాగాంధీ విసుర్లు
న్యూఢిల్లీ: క్విట్ ఇండియా ఉద్యమం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పార్లమెంటు ఉభయసభలు ప్రత్యేకంగా బుధవారం సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా క్విట్ ఇండియా ఉద్యమంపై అన్ని పార్టీలు తమ అభిప్రాయం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చర్చలో పాల్గొంటూ బీజేపీపై పరోక్షంగా విసుర్లు విసిరారు. బీజేపీ అభిమానించే వీడీ సావర్కర్‌ (వినాయక్ దామోదర్ సావర్కర్)ను సోనియాగాంధీ పరోక్షంగా ప్రస్తావిస్తూ '1942లో మహాత్మాగాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని కొన్ని సంస్థలు వ్యతిరేకించాయి' అని సోనియాగాంధీ విమర్శించారు. 'క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారిని మనం మరిచిపోరాదు. స్వాతంత్ర్య పోరాటంలో అలాంటి సంస్థలకు ఎలాంటి పాత్రా లేదు' అని కుండబద్ధలు కొట్టారు. స్వాతంత్ర్య పోరాటంలో అశువులు బాసిన పలువురు కాంగ్రెస్ నేతల త్యాగాలను కొనియాడారు. స్వాతంత్ర్య పోరాటంలో పండిట్ నెహ్రూ పలు సంవత్సరాలు జైలులో గడిపారని, అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు జైళ్లలోనే మరణించారని గుర్తు చేశారు. 'ఉద్యమకారులపై (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) చాలా అకృత్యాలు జరిగాయి. అయినప్పటికీ ఎవరూ వెనుకంజ వేయలేదు' అని ఉద్వేగంగా చెప్పారు. మహాత్మాగాంధీ 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించినప్పుడు హిందూ మహాసభలో సావర్కర్ ఉన్నారని, క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆయన వ్యతిరేకిస్తూ, అధికారికంగా దీన్ని బాయ్‌కాట్ చేశారంటూ చారిత్రక డాక్యుమెంట్లలో ప్రస్తావన ఉంది. దేశవ్యాప్తంగా వివిధ పదవుల్లో ఉన్న మహాసభ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనరాదని సావర్కర్ మహాసభ సభ్యులకు లేఖ రాసినట్టు రచయిత ప్రభు బాపు 2013లో రాసిన 'హిందూ మహాసభ ఇన్ కలోనియల్ నార్త్ ఇండియా, 1915-1930): కన్‌స్ట్రక్టింగ్ నేషన్ అండ్ హిస్టరీ' అనే పుస్తకంలో రాశారు. కాగా, భారత స్వాంతంత్ర్య పోరాటానికి ఉద్దేశపూర్వకంగానే హిందూ మహాసభ దూరంగా ఉందని కాంగ్రెస్ ఓ ట్వీట్‌లో పేర్కొంది.
nation
18,071
28-02-2017 18:46:57
రాహుల్ గాంధీ సభ... బాంబు కలకలం...
ఇంఫాల్ : పెను ముప్పు తప్పిందనుకోవచ్చు. భద్రతా దళాలు సకాలంలో ఓ బాంబును గుర్తించి, తక్షణమే నిర్వీర్యం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మణిపూర్ శాసనసభ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు వస్తున్న నేపథ్యంలో కనిపించిన ఈ బాంబు కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పు ఇంఫాల్ జిల్లాలోని ఖోంగ్మన్ బషిఖోంగ్ టురెల్ మపల్ ప్రాంతంలో ఓ ఇంటి ముందు మంగళవారం ఉదయం 6 గంటలకు బాంబు కనిపించింది. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభ జరిగే వేదికకు 6 కి.మీ. దూరంలో ఈ బాంబు కనిపించింది. హప్తా కంగ్జీబంగ్ మైదానంలో జరిగే ఈ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. మణిపూర్ ఎన్నికల పోలింగ్ మార్చి 4, 8 తేదీల్లో జరుగుతుంది.=
nation
19,354
10-07-2017 01:37:13
ఆస్ట్రియన్‌ గ్రాండ్‌ ప్రీ విజేత బొట్టాస్‌
స్పీల్‌బర్గ్‌: మెర్సిడెస్‌ డ్రైవర్‌ వాల్టెరీ బొట్టాస్‌ ఆస్ట్రియన్‌ గ్రాండ్‌ ప్రీ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన రేస్‌లో పోల్‌ పొజిషన్‌ నుంచి రేస్‌ ఆరంభించిన బొట్టాస్‌.. ఫెరారీ డ్రైవర్‌ సెబాస్టియన్‌ వెటల్‌ను వెనక్కు నెట్టి కెరీర్‌లో రెండో టైటిల్‌ నెగ్గాడు. నికో రోస్‌బర్గ్‌ రిటైర్మెంట్‌ తర్వాత ఫిన్‌లాండ్‌కు చెందిన బొట్టాస్‌ తొలిసారి మెర్సిడెస్‌తో జత కట్టాడు. రెడ్‌బుల్‌కు చెందిన రికార్డో మూడో స్థానం దక్కించుకోగా.. మెర్సిడెస్‌కే చెందిన మరో డ్రైవర్‌ హామిల్టన్‌ నాలుగో స్థానంలో నిలిచాడు.
sports
12,130
06-11-2017 01:37:14
తమిళ సీఎంపై వ్యంగ్య కార్టూన్‌
కార్టూనిస్ట్‌ బాలా అరెస్టుచెన్నై, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : కందువడ్డీ బాధిత కుటుంబం తిరునల్వేలి కలెక్టరేట్‌ వద్ద ఆత్మాహుతికి పాల్పడిన విషయమై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై వ్యంగ్య చిత్రం గీసిన ప్రముఖ కార్టూనిస్టు బాలాను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కూలిపనులు చేసే ఓ వ్యక్తి అప్పులపాలై కందు వడ్డీ చెల్లించలేక భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని, నిప్పంటించుకుని మరణించడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. మంటల్లో బాధితులు కాలుతుండగా ముఖ్యమంత్రి, కలెక్టర్‌, జిల్లా ఎస్పీ ఆ పక్కనే నగ్నంగా నిల్చునట్టు, తమ మర్మాంగాలకు అడ్డుగా నోట్ల కట్టలు పెట్టుకొని, కళ్లు మూసుకున్నట్టు బాలా కార్టూన్‌ గీశారు. ఈ కార్టూన్‌ను సోషల్‌ మీడియాలో పెట్టగా 38,000 మంది షేర్‌ చేశారు. లక్షలాదిమంది వీక్షించారు. దీంతో బాలాను పోలీసులు అరెస్టు చేశారు. ‘లంచాలు తీసుకొని తాము ఈ విషయంలో మౌనంగా ఉన్నట్టు ప్రజలు భావించేలా ఆ కార్టూన్‌ ఉందని కలెక్టర్‌ సందీప్‌ నండూరి పేర్కొన్నారు. బాలా తమిళ లీడింగ్‌ మేగజైన్‌లో 12 ఏళ్లు పనిచేశాడని, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ సంస్థ నుంచి బయటికి వచ్చేసి ఒక న్యూస్‌ పోర్టల్‌లో చేరాడని ఎస్పీ పి.వి.అరుణ్‌ శక్తి కుమార్‌ చెప్పారు. కార్టూన్‌ వేసేందుకు ఉపయోగించిన కంప్యూటర్‌, హార్డ్‌ డిస్క్‌, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తిరునల్వేలి కోర్టులో ఆయనను హాజరుపరచి జైలుకు తరలించారు.
nation
6,877
09-12-2017 07:52:47
అంబానీ డిన్నర్ పార్టీలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఐశ్వర్యారాయ్
ఐశ్వర్యారాయ్ బచ్చన్... గ్రేస్‌కి, అందానికి ఐకాన్. ఆమె చార్మింగ్ పర్సనాలిటీ, యాక్టింగ్ టాలెంట్‌తో అభిమానులకు ఆరాధ్య దేవతగా మారింది. ఆమె ఫ్యాషన్ ఎప్పుడూ అందరి చూపులు తనవైపు తిప్పుకునేలా ఉంటుంది. నిన్న ఐశ్వర్య రాయ్ అంబానీ ఇచ్చిన డిన్నర్ పార్టీకి ఓ అందమైన గౌన్‌లో హాజరయ్యారు. గోల్డ్ కలర్ గౌన్‌లో ఐశ్వర్య మరింత మెరిసిపోతూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. అక్కడున్నవారందరినీ చూపు తిప్పుకోనీయకుండా చేసింది. ప్రస్తుతం ఐశ్వర్య తన భర్త అభిషేక్ పక్కన హీరోయిన్‌గా నటించనుందనే వార్త బాలీవుడ్‌లో ట్రోల్ అవుతోంది. ఈ సంవత్సరంతో ఐశ్వర్య 20 సంవత్సరాల తన సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐశ్వర్య ఫన్నే ఖాన్ సినిమా షూటింగ్‌తో బిజీబిజీగా ఉంది.
entertainment
15,715
30-12-2017 01:22:59
ఈజిప్టులో చర్చిపై ఉగ్రదాడి.. 12 మంది మృతి
కైరో, డిసెంబరు 29: ఈజిప్టు రాజధాని కైరోలో ఓ చర్చిపై ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదుల కాల్పుల్లో 12మంది చనిపోయారు. హెల్వానా ప్రాంతంలోని మార్‌మినా చర్చి ప్రాంగణంలోకి శుక్రవారం ఇద్దరు ఉగ్రవాదులు చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో 12 మంది చనిపోగా, మరో 8 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. పారిపోయేందుకు ప్రయత్నించిన మరో టెర్రరిస్టును భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. అతని వద్ద నుంచి భారీగా మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
nation
6,287
28-03-2017 19:44:35
ఐఫా అవార్డ్స్‌ వేడుకలో ‘బాహుబలి’ సందడి
హైదరాబాద్: ఐఫా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు తెలుగు, తమిళ, మళయాళ, బాలీవుడ్ తారలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా ‘బాహుబలి’ సందడి చేస్తోంది. ఐఫా వేడుకకు వచ్చే అతిథులకు వర్చువల్ రియాలిటీ(వీఆర్) పరిచయం చేసేందుకు బాహుబలి టీమ్ ప్లాన్ చేసింది. ఈ వర్చువల్ రియాలిటీ(వీఆర్) అతిథులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బాహుబలి సినిమాలో వాడిన కాస్ట్యూమ్స్‌ని ప్రదర్శించారు. బాహుబలి వాడిన ఖడ్గం, కట్టప్ప బాహుబలిని చంపడానికి వాడిన ఖడ్గాన్ని, ఇతర కాస్ట్యూమ్స్‌ని ప్రదర్శించారు. ఈ కాస్ట్యూమ్స్ అతిథులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
entertainment
17,155
31-01-2017 04:11:42
రోజూ గొడవపడుతున్నారని... పిల్లలకు విషమిచ్చి చంపిన తల్లి
ముంబై, జనవరి 30: పిల్లలు అల్లరి చేస్తే తల్లిదండ్రులు మందలించడం సహజం. కానీ, తన పిల్లలు గొడవపడుతున్నారని క్షణికావేశంలో వారికి విషమిచ్చి చంపిందో తల్లి. మాతృత్వానికే మచ్చతెచ్చే ఈ ఘటన ముంబైలో నవంబరు 29న జరిగింది. సుష్మా చిలే(38) తన ఇద్దరు పిల్లలు తనూజ(15), అనూజ్‌(9)లతో కలిసి దక్షిణ ముంబైలో నివసిస్తోంది. ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. చీటికి మాటికి పిల్లలిద్దరూ గొడవపడుతూ, కొట్టుకునేవారు.       ప్రతిరోజూ ఆమె వారిని మందలించినా అల్లరి చేయడం ఆపలేదు. పరీక్షలు దగ్గరపడుతుండడంతో చదువుకోవాలని వారికి చెప్పింది. ఆమె మాటను పెడచెవిన పెట్టి వారు ఆడుకోవడానికి వెళ్లడంతో ఆవేశంలో పిల్లలకు విషమిచ్చి, తనూ తాగింది. ఈ విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగువారు వారిని ఆస్పత్రికి తరలించారు. 4 రోజుల అనంతరం పిల్లలిద్దరూ మృతి చెందగా, సుష్మకు ప్రాణాపాయం తప్పింది. పిల్లల పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు సుష్మపై హత్యకేసు నమోదు చేశారు. ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత అరెస్టు చేస్తారు.
nation
2,780
18-05-2017 01:38:33
ముకేశ్‌ మామూలోడు కాదు...
ప్రపంచ గేమ్‌చేంజర్లలో 25వ స్థానం.. జియోతో సగటు జీవికి సాధికారతన్యూయార్క్‌: ప్రపంచంలో పరిశ్రమ గతిని మార్చిన 25 మంది అగ్రస్థాయి వ్యాపార, పారిశ్రామికవేత్తల్లో రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ స్థానం దక్కించుకున్నారు. కొద్ది నెలల క్రితం రిలయన్స్‌ జియో ఆవిష్కారంతో టెలికాం రంగం దిశనే మార్చిన ఆయనకు ఫోర్బ్స్‌ పత్రిక ప్రకటించిన రెండో వార్షిక గేమ్‌ చేజింద్‌ పారిశ్రామికవేత్తల జాబితాలో స్థానం దక్కింది. ప్రస్తుతం ఉన్న స్థాయితో ఏ మాత్రం సంతృప్తి చెందకుండా పరిశ్రమతోపాటుగా కోట్లాది మంది ప్రజల జీవన గమనాన్ని పూర్తిగా కొత్త దిశకు మరలించిన పారిశ్రామిక, వ్యాపారవేత్తలను ఈ జాబితాలో చేర్చుతారు. భారతలో సామాన్యునికి ఐటిని సన్నిహితం చేసిన వాడుగా ముకేశ్‌కు ఈ స్థానం దక్కింది.  ఆయిల్‌, గ్యాస్‌ విభాగంలో దిగ్గజంగా ఉన్న ముకేశ్‌ రిలయన్స్‌ జియో పేరుతో టెలికాం మార్కెట్లోకి ప్రవేశించి అత్యంత చౌకగా వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందించడం ద్వారా పెద్ద సంచలనానికి కారణం అయ్యారని ఫోర్బ్స్‌ పత్రిక పేర్కొంది. ఆరు నెలల కాలంలోనే 10 కోట్ల కస్టమర్ల మైలురాయిని చేరడం ద్వారా టెలికాంలో కన్సాలిడేషన్‌కు బాటలు వేశారని తెలిపింది.డిజిటల్‌ కావలసిన ప్రతి ఒక్కటి డిజిటల్‌ అవుతున్నదని, ఆ విభాగంలో భారత వెనుకబడి ఉండలేదని ముకేశ్‌ చెబుతూ ఉంటారని ఉటంకించింది.  వ్యాపారంలో అద్భుత పురోగతి సాధించిన, రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించిన వారే కాకుండా షేర్‌హోల్డర్లు, ఉద్యోగుల అభ్యున్నతితో పాటు సగటు ప్రజలు నడుస్తున్న గమ్యాన్ని కూడా మార్చేస్తున్న వారిని గుర్తించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొంది. ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న వారిలో హోమ్‌ అప్లయెన్సెస్‌ కంపెనీ డేసన్‌ వ్యవస్థాపకుడు జేమ్స్‌ డేసన్‌, బ్లాక్‌రాక్‌ సహ వ్యవస్థాపకుడు లారీ ఫింక్‌, సోషల్‌ మీడియా కంపెనీ స్నాప్‌ సహ వ్యవస్థాపకుడు ఇవాన్‌ స్పీజెల్‌, సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఉన్నారు.
business
9,728
07-11-2017 11:56:20
రుద్రేశ్వరుడి సన్నిధిలో.. సినీ నటి భూమిక
వరంగల్‌: ఖుషి ఫేమ్‌ ప్రముఖ సినీ నటి భూమిక పవిత్ర కార్తీక మాస శివప్రీతికర సోమవారం హన్మకొండలోని చారిత్రక వేయి స్తంభాల ఆలయంలోని రుద్రేశ్వరుడిని దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చారు. ఆలయ అర్చకులు గంగు ఉపేంద్రశర్మ తదితరులు సాదరంగా ఆహ్వానం పలికా రు. ఆమెచే ప్రత్యేక లఘు రుద్రాభిషేకం నిర్వహింప చేసి స్వామివారి శేష వస్త్రాలను బహుకరించి ఆశీర్వదించారు. వరంగల్‌ నగరంలో కొన్ని రోజులుగా నిరవధికంగా షూటింగ్‌ నిర్వహిస్తున్న మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి (ఎంసీఏ) సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఆమె రుద్రేశ్వరుడిని దర్శించుకునేందుకు ఆలయానికి రావడం విశేషం. సోమవారం రుద్రేశ్వరాలయాన్ని దర్శించిన ప్రముఖుల్లో హన్మకొండ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్రప్రసాద్‌ కూడా ఉన్నారు.
entertainment
12,118
21-07-2017 01:29:02
మృత్యుపాశాలుగా స్పీడ్‌బ్రేకర్లు
న్యూఢిల్లీ, జూలై 20: రహదారులపై ఉన్న స్పీడ్‌ బ్రేకర్ల కారణంగా దేశవ్యాప్తంగా రోజుకు 9మంది మృత్యువాతపడుతున్నారని, 30మంది గాయాలబారిన పడుతున్నారని కేంద్రం పేర్కొంది. కేంద్ర రోడ్డురవాణా, హైవేల మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం లోక్‌సభలో రాతపూర్వకంగా వెల్లడించారు. కొత్తగా స్పీడ్‌ బ్రేకర్లు వేయొద్దని, అనధికారికంగా ఉన్న స్పీడ్‌బ్రేకర్లను వెంటనే తొలగించాలని రాష్ట్రాలకు సూచించామన్నారు. గడ్కరీ వివరాల ప్రకారం.. 2015లో స్పీడ్‌బ్రేకర్ల కారణంగా జాతీయ రహదారులపై దేశవ్యాప్తంగా 11,084 ప్రమాదాలు చోటుచేసుకోగా.. ఈ ప్రమాదాల్లో 3,409 మరణించగా.. 9,764 మంది గాయపడ్డారు.
nation
1,174
10-11-2017 00:04:23
విద్యార్థులకు ‘మైండ్‌ బాక్స్‌’ డిజిటల్‌ పాఠాలు
ఎపి, తెలంగాణ పాఠశాలలకు విస్తరణహైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వివిధ మీడియా సంస్థలకు డిజిటల్‌ సొల్యూషన్స్‌ అందిస్తున్న ఢిల్లీకి చెందిన ఎఆర్‌కె ఇన్ఫో సొల్యూషన్స్‌ కంపెనీ తన డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ సొల్యూషన్స్‌ను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తన ‘మైండ్‌బాక్స్‌ ఇండియా’ కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు విస్తరిస్తోంది. వచ్చే ఏప్రిల్‌ నుంచి రెండు రాష్ట్రాల్లోని కొన్ని పాఠశాలల్లో పిల్లల్లో సృజనాత్మకతను పెంచే డిజిటల్‌ పాఠాలు బోధిస్తామని కంపెనీ చీఫ్‌ ఎంజాయ్‌మెంట్‌ ఆఫీసర్‌ (సిఇఒ) రిషి కెమ్‌కా విలేకరులతో చెప్పారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఆరు పాఠశాలలతో కంపెనీ అవగాహన కుదుర్చుకుంది. దేశంలోని 15 నగరాల్లో 40 పాఠశాలల్లో దాదాపు 20,000 మంది విద్యార్థులకు ఆయా బోర్డుల సిలబ్‌సకు అనుగుణంగా డిజిటల్‌ పాఠాలు బోధిస్తోంది. ఇందుకోసం ఏటా ఒక్కో విద్యార్ధి నుంచి ఫీజు కింద రూ.1,000 నుంచి రూ.5,000 వసూలు చేస్తోంది. ఇప్పుడు ఎపి, తెలంగాణతోపాటు దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లోని పాఠశాలలకూ తన డిజిటల్‌ పాఠాలను విస్తరించాలని భావిస్తోంది.  ‘కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌’ పథకం ద్వారా 2050 నాటికి 50 కోట్ల మంది విద్యార్థులకు చేరువ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని కెమ్‌కా చెప్పారు. మైండ్‌బాక్స్‌ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీల విద్యార్థులకు, ఉద్యోగాలకు అవసరమయ్యే ప్రత్యేక నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తోంది. డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ సొల్యూషన్స్‌ మైండ్‌బాక్స్‌ ద్వారా గత ఏడాది కంపెనీకి రూ.7 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ఈ సంవత్సరం మరో 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని కెమ్‌కా చెప్పారు.ఎపి, తెలంగాణ పాఠశాలలకు విస్తరణహైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వివిధ మీడియా సంస్థలకు డిజిటల్‌ సొల్యూషన్స్‌ అందిస్తున్న ఢిల్లీకి చెందిన ఎఆర్‌కె ఇన్ఫో సొల్యూషన్స్‌ కంపెనీ తన డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ సొల్యూషన్స్‌ను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తన ‘మైండ్‌బాక్స్‌ ఇండియా’ కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు విస్తరిస్తోంది. వచ్చే ఏప్రిల్‌ నుంచి రెండు రాష్ట్రాల్లోని కొన్ని పాఠశాలల్లో పిల్లల్లో సృజనాత్మకతను పెంచే డిజిటల్‌ పాఠాలు బోధిస్తామని కంపెనీ చీఫ్‌ ఎంజాయ్‌మెంట్‌ ఆఫీసర్‌ (సిఇఒ) రిషి కెమ్‌కా విలేకరులతో చెప్పారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఆరు పాఠశాలలతో కంపెనీ అవగాహన కుదుర్చుకుంది. దేశంలోని 15 నగరాల్లో 40 పాఠశాలల్లో దాదాపు 20,000 మంది విద్యార్థులకు ఆయా బోర్డుల సిలబ్‌సకు అనుగుణంగా డిజిటల్‌ పాఠాలు బోధిస్తోంది. ఇందుకోసం ఏటా ఒక్కో విద్యార్ధి నుంచి ఫీజు కింద రూ.1,000 నుంచి రూ.5,000 వసూలు చేస్తోంది. ఇప్పుడు ఎపి, తెలంగాణతోపాటు దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లోని పాఠశాలలకూ తన డిజిటల్‌ పాఠాలను విస్తరించాలని భావిస్తోంది.  ‘కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌’ పథకం ద్వారా 2050 నాటికి 50 కోట్ల మంది విద్యార్థులకు చేరువ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని కెమ్‌కా చెప్పారు. మైండ్‌బాక్స్‌ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీల విద్యార్థులకు, ఉద్యోగాలకు అవసరమయ్యే ప్రత్యేక నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తోంది. డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ సొల్యూషన్స్‌ మైండ్‌బాక్స్‌ ద్వారా గత ఏడాది కంపెనీకి రూ.7 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ఈ సంవత్సరం మరో 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని కెమ్‌కా చెప్పారు.
business
19,427
26-01-2017 02:20:09
కోహ్లీకి పద్మశ్రీ
న్యూఢిల్లీ: ఫార్మాట్‌ ఏదైనా పరుగుల వరద పారిస్తూ.. భారత జట్టు విజయాల్లో మూలస్తంభంగా నిలుస్తున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ వరించింది. కోహ్లీ, ఒలింపిక్‌ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్‌, జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌తోపాటు మరో ఐదుగురు క్రీడాకారులు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికయ్యారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన అవార్డుల జాబితాలో మొత్తం ఎనిమిది మంది క్రీడాకారులకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. భారత హాకీ జట్టు కెప్టెన్‌ పీఆర్‌ శ్రీజేష్‌, డిస్కస్‌ త్రోయర్‌ వికాస్‌ గౌడ, పారాలింపియన్లు మరియప్పన్‌ తంగవేలు, దీపా మాలిక్‌, అంధుల క్రికెట్‌ టీమ్‌ సారథి శేఖర్‌ నాయక్‌లకు కూడా జాబితాలో చోటు లభించింది. మూడు ఫార్మాట్లకూ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోహ్లీ.. తన ఆటతో ఈ తరంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా గుర్తింపు పొందాడు. రియో ఒలింపిక్స్‌లో భారత పతక ఆశలు కొడిగడుతున్న సమయంలో రెజ్లర్‌ సాక్షి మాలిక్‌.. కాంస్య పతకం గెలిచి భారత ప్రతిష్ట నిలిపింది. పారాలింపిక్స్‌ హైజం్‌పలో తంగవేలు పసిడి పట్టగా, షాట్‌పుట్‌లో దీపా మాలిక్‌ రజతం సాధించింది. జిమ్నాస్ట్‌ దీప.. రియోలో పతకం నెగ్గకపోయినా తన ప్రదర్శనతో దేశ ప్రజల మదిని గెలుచుకుంది. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత విశ్వక్రీడల్లో జిమ్నాస్టిక్స్‌లో భారతకు ప్రాతినిధ్యం దక్కేలా చేసింది. భారత హాకీ జట్టుకు గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్‌ వెన్నెముకలా మారాడు. డిస్కస్‌ త్రో అంటే ముందుగా గుర్తొచ్చే పేరు వికాస్‌ గౌడ. కామన్వెల్త్‌, ఆసియా చాంపియన్‌ అయి న గౌడ.. ఒలింపిక్స్‌లో అర్హత రౌండ్‌ దాటలేక పోయాడు. అంధుల క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు శేఖర్‌ నాయక్‌. అతడి నాయకత్వంలో భారత జట్టు 2012 టీ20 వరల్డ్‌కప్‌, 2014 వన్డే ప్రపంచ కప్‌లు నెగ్గిం ది. కాగా, పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌ జాబితాలో క్రీడాకారులకు చోటుదక్కలేదు. ఈ అవార్డు తన బాధ్యతను ఎన్నో రెట్లు పెంచిందని దీప సంతోషంగా చెప్పింది. తన శిష్యురాలికి అత్యున్నత గౌరవం దక్కడంపై కోచ్‌ బిశ్వేశ్వర్‌ నంది ఆనందం వ్యక్తం చేశాడు.
sports
8,802
10-09-2017 14:16:27
ఆ డైలాగ్ విని 32 ఏళ్ల క్రితం జీవితం గుర్తొచ్చింది: పోసాని
హైదరాబాద్: ఉంగరాల రాంబాబు ట్రైలర్ చూసిన తర్వాత, అందులో ఒక డైలాగ్ ‘’భారత దేశం వెనకబడిపోతోంది డబ్బులు లేక కాదు.. మానవత్వం లేక’’ ఇది వినగానే 32 ఏళ్ల కిందట తాను మద్రాసులో భోజనం, డబ్బు కోసం ఇబ్బందిపడి ఏడ్చి, నవ్వి, బాధపడి, చనిపోదామని ఇన్ని రకాల విన్యాసాలు చేశానో... ఇప్పుడు 32 ఏళ్ల తర్వాత బాగా సంపాదించి, రేపు తనకు సినిమాలు లేకపోయినా పర్వాలేదు తన కుటుంబంతో సంతోషంగా బతుకుతాను అన్నంత సంపాదించిన తర్వాత కూడా.. ఇప్పుడు ఈ డైలాక్ విన్న తర్వాత 32 ఏళ్ల క్రితం జీవితం తనకు గుర్తుకు వచ్చిందని రచియిత, నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఆదివారం ఉంగరాల రాంబాబు సినిమా ట్రైలర్ విడుదలైంది. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎందుకంటే మానవత్వం లేదు అనేది వాస్తవమని అన్నారు. తాను, నటుడు ఆలీ ఈ మధ్యే కలిశామని, అతను తనకు 32 ఏళ్ల క్రితమే పరిచయమని, అతని వద్ద కన్నింగ్ నేచర్ లేదని, ఏ రోజూ ఆలీ ఛీటర్ అని ఎవరూ అనలేదని, ఆలీ అంత మంచి వ్యక్తి అని పోసాని కొనియాడారు. అందరినీ నవ్వించే వ్యక్తి ఆలీ అని... అలాంటి వ్యక్తి వారం రోజుల క్రితం తనదగ్గరకు వచ్చి బాధపడ్డాడని, కన్నీరు మాత్రం రాలేదని... ఆలీ చెప్పిన విషయం ఏమిటంటే ‘‘మురళీ నీకొక మాట చెబుతా విను. ఈ మధ్య ఓ సినిమా వచ్చింది. ఆ సినిమాలో నువ్వు, నేను, ఇంకొకరు మెయిన్ క్యారెక్టర్స్. ఇంకొకడు వచ్చి నీపేరు, నాపేరు పక్కనపడేసి.. వీళ్లెందుకన్నా డబ్బులు అడుగుతారు.. వేరేవాళ్లు అయితే తక్కువకు వస్తారని చెప్పాడని’’ పోసాని తెలిపారు. ఆ సినిమాలో మా ఇద్దరిని పక్కకు నెట్టి, వేరేవాళ్లకు వేషాలు ఇప్పించి, ఆ సినిమా తీయడం జరిగిందని చెప్పారు. ఇన్నేళ్ల తర్వాత ఇంకా వెన్నుపోట్లు ఉంటాయా? అంటే అదే డైలాగ్ తనకు గుర్తుకు వచ్చిందని పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. మనిషిలో ఎందుకు మానవత్వం లేకుండా పోయిందని ఆయన ప్రశ్నించారు. స్టేజిపై మాట్లాడేది వేరని, నిజజీవితంలోకి వచ్చేసరికి ఇలాంటి సంఘటనలు గుండె పగిలిపోయేంత బాధ కలిగించిందని ఆయన అన్నారు. ఈ డైలాక్ రాసిన రచయిత ‘ఐ లవ్ యూ’ అంటూ పోసాని అన్నారు. పరుచూరి ప్రసాద్ తనకు ఉంగరాల రాంబాబులో నటించమని చెప్పారని, ఈ కథ తనకు సూటబుల్ అవుతుందని చెప్పారని పోసాని అన్నారు. ఇక హీరో సునీల్ విషయానికి వస్తే ఆయన మంచి నటుడని, ఎలాంటి వ్యక్తో అందరికీ తెలిసిందేనని, కామెడీ, విలన్, సీరియస్, ట్రాజడీ, సెంటిమెంట్...ఇవన్నీ తెలిసినవాడ, సాలీడ్‌గా చేయగలినవాడు సునీల్ అని పోసాని కొనియాడారు.
entertainment
3,085
28-06-2017 00:02:20
చెన్నైలో ‘ఎయిర్‌ అంబులెన్స్‌’ సేవలు
కరీంనగర్‌, కాకినాడ, వైజాగ్‌ల్లో కూడా..ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్‌ చెన్నై (ఆంధ్రజ్యోతి): ‘గోల్డెన్‌ అవర్‌’ లోపే రోగులకి వైద్య సేవలందించే దిశగా అపోలో హాస్పిటల్స్‌ చెన్నైలోనే తొలిసారిగా ‘ఎయిర్‌ ఆంబులెన్స్‌’ సేవలను ప్రారంభించింది. ఏవియేటర్స్‌ ఎయిర్‌ రెస్క్యూ భాగస్వామ్యంతో చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు కేంద్రాలుగా మూడు హెలికాప్టర్లతో ఈ సేవలను ప్రవేశపెట్టింది. చిన్న నగరాలు మధురై, కారైకుడి, కరూర్‌, తిరుచ్చి, మైసూర్‌, తెలంగాణలోని కరీంనగర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, వైజాగ్‌ ప్రాంతాలకు కూడా ఎయిర్‌ ఆంబులెన్స్‌ సేవలు అందుబాటులోకి తెచ్చింది. చెన్నైలోని లయోలా కళాశాల ఆవరణలో తమిళనాడు ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణన్‌, అపోలో హాస్పిటల్స్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రీతా రెడ్డి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీతా రెడ్డి, ఏవియేటర్స్‌ ఎయిర్‌ రెస్క్యూ ప్రతినిధి కెప్టెన్‌ అరుణ్‌ శర్మల సమక్షంలో మంగళవారం ఎయిర్‌ ఆంబులెన్స్‌ను ప్రారంభించారు. ఎయిర్‌ ఆంబులెన్స్‌ సేవలకు ప్రజలు 155350 (ఏవియేటర్‌ ఎయిర్‌ రెస్క్యూ), 1066 (అపోలో) ఎమర్జెన్సీ నెంబర్లలో సంప్రదించవచ్చు. 250 కిలోమీటర్ల దూరానికి ఎయిర్‌ ఆంబులెన్స్‌ రవాణా ఖర్చు రూ.1.50 లక్షలు ఉంటుంది. వైద్య ఖర్చులు అదనం. ఎయిర్‌ ఆంబులెన్స్‌లో ఇద్దరు పైలట్లు, ఇద్దరు వైద్య సిబ్బంది ఉంటారు. ఒక పేషంట్‌ని తరలించే సౌకర్యం ఉంటుంది. సమాచారం ఇచ్చిన 30 నిమిషాల గరిష్ఠ వ్యవధిలోగా ఎయిర్‌ ఆంబులెన్స్‌ చేరుకుంటుంది.
business
14,103
21-10-2017 02:18:22
కాటేస్తున్న కాలుష్యం
నింగీ, నీరూ, నేలా కలుషితం.. 2015లో 91 లక్షల మంది బలిభారత్‌లోనే 25 లక్షల మంది మృతి18లక్షల మందితో రెండోస్థానంలో చైనాకలవరపెడుతున్న అధ్యయన నివేదికన్యూఢిల్లీ, అక్టోబరు 20: శ్వాసించే వాయువే మరణ శాసనం లిఖిస్తోంది. దాహం తీర్చే నీరే బతుకుల్లో నిప్పులు కురిపిస్తోంది. పంటనిచ్చే నేలా విషపూరితమవుతోంది. కాలుష్యపు కోరల్లో చిక్కుకుని నిండు జీవితాలు అర్ధంతారంగా నేలరాలుతున్నాయి. వివిధ రకాల కాలుష్యాల వల్ల 2015లో ప్రపంచవ్యాప్తంగా 91లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో భారత్‌లోనే అత్యధికంగా 25లక్షల మందిని కాలుష్యం కాటేసింది. అంటే, దేశంలోని మరణాల్లో ప్రతి ఐదో వ్యక్తిని కాలుష్య కారక వ్యాధులే బలి తీసుకుంటున్నాయి. హృద్రోగాలు, ఊపిరితిత్తుల కేన్సర్‌, పక్షవాతంతోపాటు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు (సీవోపీడీ) వంటి వ్యాధులవల్లే ఎక్కువమంది చనిపోతున్నారు. కాలుష్య ప్రభావంపై అంతర్జాతీయంగా జరిగిన సుదీర్ఘ అధ్యయనం వివరాలను లాన్సెట్‌ జర్నల్‌ గురువారం విడుదల చేసింది. ఈ అధ్యయనంలో ఐఐటీ-ఢిల్లీ, అమెరికాలోని ఐకాన్‌ మెడిసిన్‌ యూనివర్సిటీతోపాటు పలు దేశాల నిపుణులు పాల్గొన్నారు. ఈ అధ్యయనం తేల్చిందేమిటంటే... కాలుష్యంతో ప్రపంచవ్యాప్తంగా 2015లో 91 లక్షల మంది మరణించారు. మొత్తం మరణాల్లో ఇది 16 ు.ఎయిడ్స్‌, టీబీ, మలేరియా వంటి అంటు వ్యాధులు.. పొగతాగడం, ప్రకృతి విపత్తులకంటే ఎక్కువమంది కాలుష్యపు కాటువల్లే మరణిస్తున్నారు.కాలుష్యాల్లో అత్యంత ప్రమాదకరమైనది వాయు కాలుష్యమే. 2015లో వాయు కాలుష్యం వల్ల 65లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.వాయు కాలుష్యం తర్వాత అత్యధికంగా నీటి కాలుష్యం కారణంగా ప్రపంచంలో 18లక్షల మంది చనిపోయారు.కాలుష్య కారక మరణాల్లో 92ు తక్కువ, మధ్య స్థాయి ఆదాయం ఉన్న దేశాల్లోనే జరుగుతున్నాయి.పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌, పాకిస్థాన్‌, చైనా, బంగ్లాదేశ్‌, మడగాస్కర్‌, కెన్యాల్లో కాలుష్య మరణాలు ఎక్కువ.కాలుష్యంతో అత్యధికులు చనిపోతున్న దేశం భారత్‌. 2015లో ఏకంగా 25లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.18 లక్షల కాలుష్య మరణాలతో రెండో స్థానంలో చైనా.కాలుష్యం కారణంగా జరిగే ఆర్థిక నష్టం 4.6 లక్షల కోట్ల డాలర్లు! మొత్తం ప్రపంచ ఆర్థిక ఉత్పత్తిలో ఇది 6.2 ు.కేవలం సీసం (లెడ్‌) ప్రభావం వల్ల 2015లో 5 లక్షల మంది చనిపోయారు. సీసంవల్ల హైబీపీ, మూత్రపిండాల వైఫల్యంతోపాటు హృద్రోగాలు వస్తున్నాయి.1950 తర్వాత 5వేల కొత్త రసాయనాల వాడకం మొదలైంది. ఇందులో సగం రసాయనాల వల్ల తలెత్తే ప్రమాదాలపై ఎలాంటి పరీక్షలూ జరగలేదు.
nation
11,145
07-07-2017 18:20:48
ఉరితీతల్లో పాక్ రికార్డు...
లాహూర్: ఉరితీతల విషయంలో పాకిస్థాన్ రికార్డులు బద్దలుకొడుతోంది. ఖైదీల హక్కులపై పోరాడుతున్న ప్రభుత్వేతర సంస్థ 'జస్టిస్ ప్రాజెక్ట్ పాకిస్థాన్' (జేపీపీ) ఇందుకు సంబంధించిన తాజా గణాంకాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. 2014లో ఉరిశిక్షలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాత ఇంతవరకూ 465 మందిని పాకిస్థాన్‌లో ఉరితీసిట్టు జేపీపీ వెల్లడించింది. ప్రపంచంలోనే ఉరితీతల విషయంలో పాక్ ఐదో స్థానంలో ఉందని పేర్కొంది. చైనా, ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్ తర్వాత పాక్ ఐదో స్థానంలో నిలిచినట్టు జేపీపీ గణాంకాలు చెబుతున్నాయని 'డాన్' పత్రిక ఓ కథనం ప్రచురించింది. లెక్కకు మిక్కిలిగా మరణశిక్షలు అమలు చేస్తూ ఉగ్రవాదంతో సహా వివిధ నేరాలను అదుపుచేయడంలో పాక్ విఫలమైందని, రాజకీయ ఆయుధంగా మరణశిక్షలను వాడుకుంటోందని, ఖైదీలతో జైళ్లు కిక్కిరిసి పోతుండటానికి పరిష్కారంగా కూడా మరణశిక్షల అస్త్రం ఉపయోగపడుతున్న అనుమానాలు కలుగుతున్నాయని జేపీపీ విమర్శించింది. పాకిస్థాన్‌లో మరణశిక్షల ఎక్కువగా పంజాబ్ ప్రావెన్స్‌ లో అమలవుతున్నాయని, దేశంలో హత్యల శాతం 2015-2016లో 9.7 శాతం మాత్రమే తగ్గిందని తెలిపింది. ఇదే సమయంలో సింధ్ ప్రావిన్స్‌లో హత్యల శాతం సుమారు 25 శాతం తగ్గిందని పేర్కొన్నారు. పంజాబ్‌లో 382 ఉరితీతలు చోటుచేసుకోగా, సింధ్ ప్రావిన్స్‌లో 18 ఉరిశిక్షలు అమలయ్యాయన్నారు. నిజానికి ఉరితీతలపై నిషేధాన్ని ఎత్తివేయక ముందే పాకిస్థాన్‌లో హత్యా ఘటనల రేటింగ్ తగ్గుముఖం పట్టిందని, మరణశిక్షలు, నేరాల తగ్గుదలకు మధ్య పూర్తిగా విశ్వసించలేని సంబంధాలున్నాయన్న అనుమానాలకు ఈ గణాంకాలు తావిస్తున్నాయని జేపీపీ సందేహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదుల ఉరితీతలు ఎక్కువగా ఖైబర్ ఫక్తుంఖ్వాలోని మిలటరీ కోర్టులు, సింధ్‌లోని ఏటీసీల ద్వారా చోటుచేసుకుంటున్నాయని పేర్కొంది. పాకిస్థాన్‌ మూడేళ్లలో 465 ఉరిశిక్షలు అమలు చేయడంపై జేపీపీ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ సరహ్ బెలాల్ ఆందోళన వ్యక్తం చేశారు. నిరంతర ఉరిశిక్షల ద్వారా అంతర్జాతీయ మానవ హక్కుల కమిట్‌మెంట్లు, నిష్పాక్షిక విచారణా ప్రమాణాలు, దేశ చట్టాల నుంచి పాక్ వైదొలగుతున్నట్టు కనిపిస్తోందని బెలాల్ అభిప్రాయపడ్డారు.
nation
14,982
04-10-2017 04:42:33
రాక్‌లెజెండ్‌ టామ్‌ పెట్టీ హఠాన్మరణం
లాస్‌ఏంజెలిస్‌, అక్టోబరు 3: ప్రఖ్యాత అమెరికన్‌ గాయకుడు, సంగీతకారుడు, గీత రచయిత టామ్‌ పెట్టీ ఇక లేరు. ఆయన వయస్సు 66ఏళ్లు. మంగళవారం మలిబులోని సొంతింట్లో గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. సంగీత ప్రపంచంలో టామ్‌ను రాక్‌లెజెండ్‌గా చెబుతారు. టామ్‌ సోలోగా రూపొందించిన మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో ఫుల్‌ మూన్‌ ఫీవర్‌, వైల్డ్‌ ఫ్లవర్స్‌ హైవే కాంపెనియన్‌, ది లాస్ట్‌ డీజే, మోజో సంగీత ప్రియులను ఉర్రూతలూగించాయి.
nation
13,496
06-12-2017 19:43:43
సరి-బేసి విధానంపై మెట్టుదిగిన కేజ్రీ సర్కార్...
చెన్నై: వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు చేపట్టే సరి-బేసి విధానం అమలులో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఇవ్వమని ఢిల్లీ ప్రభుత్వం జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ)కు తెలిపింది. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ సర్కార్ తీసుకునే చర్యలకు సంబంధించిన ప్రణాళికను ఎన్‌జీటీకి బుధవారంనాడు ఢిల్లీ ప్రభుత్వం అందజేసింది. వాయికాలుష్యం కారణంగా ఢిల్లీ టెస్టులో శ్రీలంక ఆటగాళ్లు మాస్క్‌లు ధరించి ఇబ్బందులకు గురైన నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ వాయికాలుష్య నిరోధక కార్యాచరణను సమర్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాలుష్యం స్థాయి తీవ్ర స్థాయికి చేరుకుంటే భవన నిర్మాణాలు, ఢిల్లీలోకి ప్రవేశించే ట్రక్కులపై కూడా నిషేధం విధిస్తామని ఎన్‌జీటీకి ఢిల్లీ ప్రభుత్వం తెలియజేసింది. సరి-బేసి విధానంలో మహిళలు, ద్విచక్ర వాహనదారులకు కూడా మినహాయింపు ఇవ్వమని తేల్చిచెప్పింది. ఇటీవల ఢిల్లీ తీవ్ర కాలుష్య కోరల్లో చిక్కుకోవడంతో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇందులో భాగంగా సరి-బేసి విధానాన్ని తీసుకురావాలని ప్రయత్నించింది. అయితే మహిళలు, ద్విచక్ర వాహనదారులకు మినహాయింపులు ఇచ్చింది. ఈ మినహాయింపులపై ఎన్‌జీటీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆప్ సర్కార్ సరి-బేసి అమలుపై వెనక్కి తగ్గింది. తాజాగా శ్రీలంక టీమ్ సైతం కాలుష్య బారిన పడటంతో సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్‌జీటీ సైతం వాయికాలుష్య నిరోధానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ఇవ్వడంలో కేజ్రీవాల్ సర్కార్ చేస్తున్న జాప్యంపై గత సోమవారంనాడు మండిపడింది.
nation
5,346
21-01-2017 13:11:18
బాలయ్య గురించి రాజమౌళికి వినాయక్‌ ఏం చెప్పాడు?
నందమూరి బాలకృష్ణ దర్శకులకు పూర్తి స్వేచ్ఛనిస్తాడని, ఒకసారి కథకు ఓకే చెప్పాక ఇక ఇతర విషయాలను పట్టించుకోడని సినీ పరిశ్రమలో అందరూ చెబుతుంటారు. అలాగే సినిమా జయాపజయాలను కూడా పట్టించుకోకుండా వ్యక్తులకు గౌరవమిస్తుంటాడని అంటుంటారు. తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి వెల్లడించాడు. ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా టైమ్‌లో జరిగిన ఓ సంఘటనను ఆ చిత్ర దర్శకుడు వి.వి.వినాయక్‌ రాజమౌళికి చెప్పాడట. ఆ విషయాన్ని తాజాగా రాజమౌళి వెల్లడించాడు.
entertainment
6,110
27-01-2017 12:07:16
పవన్‌ మూడు పెళ్లిళ్ల గురించి నేను మాట్లాడలేదు: వర్మ
‘పెళ్లైన కూతుర్ని పెట్టుకుని పోర్నోగ్రఫీ చూస్తాను అని చెప్పే వర్మ గురించి నేను ఏమి మాట్లాడేది. ఒకరోజు నన్ను ఎత్తొచ్చు, ఒకరోజు నన్ను తగ్గించొచ్చు ’అని పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కౌంటర్‌ ఇచ్చాడు.  ‘ఒక అభిమానిగా పవన్‌కల్యాణ్‌ మీద ఎక్స్‌పెక్టేషన్స్‌తో మాట్లాడాను గానీ, ఆయన చేసుకున్న మూడు పెళ్లిళ్ల గురించి, అతని వ్యక్తిగత జీవితం గురించి నేనెప్పుడూ మాట్లాడలేద’ని మొదటి ట్వీట్‌ చేశాడు వర్మ. అనంతరం ‘నా జీవితం, నా లైఫ్‌స్టయిల్‌, నేనాలోచించే విధానం, దాక్కోకుండా, దాచుకోకుండా నా పుస్తకం ‘నా ఇష్టం’లో మొత్తం విప్పి విప్పి రాశాన’ని రెండో ట్వీట్‌ చేశాడు. ‘వాళ్లింట్లో వాళ్ల గురించి మాట్లాడాడని రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ను తిట్టారు. మరి, వాళ్లు వేరే ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడొచ్చా? ఇదేనా వికాసం’ అని మూడోసారి ట్వీటాడు.
entertainment
15,698
27-06-2017 03:05:52
ఇక నవంబరులోనే బడ్జెట్‌..?
2018 నుంచి ఆర్థిక సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్‌ వరకూ?మార్పుకు కేంద్రం కసరత్తున్యూఢిల్లీ, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): దేశ ఆర్థిక సంవత్సరం మారబోతోందా..? పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న నెల మారుతోందా..? 150 ఏళ్ల సంప్రదాయానికి నరేంద్ర మోదీ సర్కార్‌ స్వస్తి చెప్పనుందా...? ఈ ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వ అత్యున్నత వర్గాలు అవుననే సమాధానాలిస్తున్నాయి. ప్రస్తుతం ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 31 వరకూ ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తున్నారు. దాన్ని సాధారణ కేలండర్‌ ప్రకారం.. అంటే జనవరి 1 నుంచి డిసెంబరు 31వ తేదీకి మార్చడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే ప్రతి ఏటా ఫిబ్రవరి చివరి వారంలో ప్రవేశపెట్టే బడ్జెట్‌ను ముందుగానే నవంబర్‌లో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు సమాచారం. ప్రధాని మోదీ సూచన మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సన్నాహాలు చేస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే 2018 నుంచి ఆర్థిక సంవత్సరం మారే అవకాశం ఉంది. కాగా ఫిబ్రవరి చివరి వారంలో ప్రవేశపెట్టే బడ్జెట్‌ను ఈ ఏడాది ముందుగానే ఫిబ్రవరి మొదటి వారంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం ఆర్థిక సంవత్సరాన్ని మార్చాలని భావిస్తుండటంతో నవంబరులోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటే ఈ ఏడాది నవంబరులోనే ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక సంవత్సరాన్ని మార్చాలని మోదీ భావించిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ దీనిపై అధ్యయనం చేయడానికి అత్యున్నత కమిటీని నియమించింది. ఆ కమిటీ గత డిసెంబరులో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఆ నివేదిక ఆధారంగా ఆర్థిక శాఖ నీతి ఆయోగ్‌ అభిప్రాయాన్ని కోరగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. గతంలో ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ కూడా ఆర్థిక సంవత్సరాన్ని మార్చాలని ప్రతిపాదించింది. ఆర్థిక సంవత్సరం మార్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది.
nation
19,287
28-08-2017 02:42:35
99% నోట్లు తిరిగొచ్చాయి
న్యూఢిల్లీ, ఆగస్టు 27: నోట్ల రద్దు అనంతరం 99 శాతం రూ.1000 నోట్లు ఆర్బీఐకి తిరిగివచ్చాయి. రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెబ్‌సైట్‌లో పేర్కొన్న డేటా ఆధారంగా రూపొందిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 2017 నాటికి రూ.8,925 కోట్ల విలువైన వెయ్యి రూపాయల నోట్లు చలామణిలో ఉన్నట్లు తెలిపింది. చలా మణి అంటే రిజర్వ్‌ బ్యాంకుకు రాకుండా.. బ్యాంకుల్లోను, ప్రజల వద్ద ఉన్న నగదుగా పేర్కొంది. గతేడాది నవంబర్‌ 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత కేవలం 1.3శాతం నోట్లు మాత్రమే తిరిగి రాలేదని నివేదిక వెల్లడించింది. అయితే 500 నోట్లు ఎన్ని జమయ్యాయనే విష యాన్ని పేర్కొనలేదు. ఆర్బీఐ కూడా ఇంతవరకూ రద్దైన 500 నోట్లు ఎన్ని తిరి గి జమయ్యాయనే విషయాన్ని ఇంతవర కూ స్పష్టంచేయలేదు. రద్దైన నోట్ల విలువ 15.4లక్షల కోట్లలో.. 44 శాతం 1000 నోట్లు కాగా.. 56శాతం 500 నోట్లు ఉన్నాయి.
nation
3,252
16-06-2017 02:32:23
ఆర్‌.ఎస్‌. రావు స్మారకోపన్యాసం
రాజకీయార్ధ శాస్త్రవేత్త, మార్క్సిస్టు మేధావి, ప్రజా ఉద్యమాల మిత్రుడు ఆర్‌.ఎస్‌.రావు సంస్మరణలో గత ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జరుగుతున్న స్మారకోపన్యాస కార్యక్రమం జూన్‌ 17 (శనివారం) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌, బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రం షోయబ్‌ హాలులో జరుగనుంది. ‘ఆర్‌.ఎస్‌.రావు దృక్పథంలో ప్రజాస్వామిక హక్కులు – మరొకసారి చర్చ’ అనే అంశంపై రాజకీయార్ధిక శాస్త్రవేత్త పంకజ్‌ దత్‌ ప్రసంగిస్తారు. ఆర్‌.ఎస్‌.రావు జూన్‌ 17, 2011న అమరులైన తర్వాత ఆయన ఆలోచనలను, స్ఫూర్తిని కొనసాగించాలనే ఉద్దేశంతో ఆయన ఆలోచించిన అంశాల మీద మరింత పరిశోధన, అన్వేషణ, చర్చ సాగించి ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో వార్షిక స్మారకోపన్యాసం, స్మారక సదస్సు కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. ఈ సంవత్సరం పంకజ్‌ దత్‌ ప్రజాస్వామిక హక్కుల పట్ల ఆర్‌.ఎస్‌.రావు దృక్పథాన్ని విశ్లేషిస్తారు.- ఆర్‌.ఎస్‌.రావు మిత్రులు, బి1 కలెక్టివ్‌, వీక్షణం
editorial
10,016
16-09-2017 11:06:01
విలన్ అవతారమెత్తబోతున్న ప్రభుదేవా!
నాటి హీరోలే.. నేటి విలన్లు అన్నట్టుగా మారిపోయింది సినీ ఇండస్ట్రీ. హీరోగా ఒక వెలుగు వెలిగిన జగపతిబాబు, శ్రీకాంత్ అలా మారినవారే. కానీ శ్రీకాంత్ కాస్త డిఫరెంట్. విలన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా మారి మళ్లీ విలన్ అవతారమెత్తారు. ప్రస్తుతం వీరి బాటలోనే ప్రభుదేవా కూడా నడుస్తున్నారని టాక్. ప్రభు స్టైల్ కూడా వేరే. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా.. ఆ తరువాత డైరెక్టర్‌గా కూడా మారారు.  ప్రస్తుతం ప్రతి కథానాయకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్టు తెలుస్తోంది. తాజాగా ప్రభు గులేబకావళి, యంగ్ మంగ్ జంగ్ చిత్రాల్లో నటిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు డైరెక్ట్ చేస్తున్న మెర్కురీ మూవీలో విలన్‌గా నటిస్తున్నట్టు కోలీవుడ్ టాక్. ఈ సినిమాలో బుల్లితెర నటుడు సనత్ రెడ్డి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నట్టు కోలీవుడ్ టాక్.
entertainment
8,261
26-02-2017 17:03:26
ఆమిర్ తాజా సందేశం
‘ఆడబిడ్డ అయితేనే, మగబిడ్డ అయితేనే దేశానికి కావాల్సింది బంగారు పతాకమేగా’ అని ‘దంగల్’ చిత్రం ద్వారా గొప్ప సందేశాన్ని ఇచ్చిన బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్, ఇప్పుడు మరో సందేశం ఇచ్చాడు. ‘విజయం అనేది ఓ అబ్బాయి నుంచో, అమ్మాయి నుంచో రాదు’ అని చెబుతున్నాడు ఈ బాక్సాఫీస్ కింగ్. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. సర్దార్ గెటప్‌లో ఉన్న ఆమిర్, పక్కన ఇద్దరు యువతులతో కనిపించారు. ఈ ఫొటోపైనే ఈ సందేశం ఇంగ్లీషులో రాసుంది. అయితే ఈ కొత్త గెటప్, తాజా సందేశం.. ఆమిర్ తదుపరి చిత్రం ‘తంగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ అనే చిత్రం కోసమే అని చిత్ర సీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇది కేవలం ప్రస్తుత ప్రకటనను ఉద్దేశించినదా? లేక తన తదుపరి చిత్రం కోసమేనా? అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే!
entertainment
6,050
28-03-2017 18:21:01
కిమ్స్ ఆసుపత్రి నుంచి దాసరి డిశ్చార్జ్!
దర్శకరత్న దాసరి నారాయణరావు మంగళవారం ఆసుపత్రి నుంచి డాశ్చార్జ్ అయ్యారు. తీవ్రమైన అనారోగ్యం కారణంగా జనవరి 29న సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో దాసరి అడ్మిట్ అయిన విషయం తెలిసిందే. కిమ్స్ ఆసుపత్రి సీఈవో భాస్కర్ రావు నేతృత్వంలో దాసరికి చికిత్స చేశారు. అనంతరం ఆయనను వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచారు. ప్రస్తుతం దాసరి పూర్తిగా కోలుకోవడంతో ఆయనను డిశ్చార్జి చేసినట్లు డాక్టర్ భాస్కర్‌రావు ప్రకటించారు. దాసరి కలకాలం ఆరోగ్యంగా జీవించాలని కిమ్స్ వైద్యం బృందం ఈ సందర్భంగా ఆకాక్షించింది.
entertainment
13,188
08-07-2017 23:57:29
మాల్యాను అప్పగించండి!
నేరగాళ్ల అప్పగింత ఒప్పందం అమలుకు సహకరించండిబ్రిటన్‌ ప్రధానిని కోరిన మోదీహాంబర్గ్‌, జూలై 8: లిక్కర్‌ బ్యారన్‌ విజయ్‌ మాల్యా సహా ఆర్థిక నేరగాళ్ల అప్పగింతకు సహకరించాలని బ్రిటన్‌ ప్రధాని థెరిసా మేను భారత ప్రధాని మోదీ కోరారు. హాంబర్గ్‌లో జరుగుతున్న జి-20 సదస్సు నేపథ్యంలో ఇద్దరు నేతలు శనివారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారత్‌, బ్రిటన్‌ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నేరగాళ్ల అప్పగింత ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సహకరించాలని మోదీ కోరారు. బ్యాంకులకు సుమారు రూ.9వేల కోట్లు ఎగవేత కేసులో అరెస్టును తప్పించుకొనేందుకు మాల్యా బ్రిటన్‌లో తలదాచుకుంటున్నారు. నేరగాళ్ల అప్పగింత ఒప్పందంపై 1992లో బ్రిటన్‌, భారత్‌ సంతకాలు చేశాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరిని మాత్రమే ఈ ఒప్పందం కింద బ్రిటన్‌ భారత్‌కు అప్పగించింది.
nation
11,845
11-04-2017 00:33:13
మనోడికి పాక్‌లో ఉరి శిక్ష!
ఇస్లామాబాద్‌, ఏప్రిల్‌ 10: భారత నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్‌ జాదవ్‌కు పాకిస్థాన్‌ సైనిక కోర్టు మరణ శిక్ష విధించింది. ‘‘కులభూషణ్‌ భారత గూఢచారి. బలూచిస్థాన్‌, కరాచీలో విద్రోహ చర్యలను ప్రోత్సహించేందుకే వచ్చారు’’ అని నిర్ధారించింది. ఆయనపై పాకిస్థాన్‌ ఫీల్డ్‌ జనరల్‌ కోర్టు మార్షల్‌ కోర్టు సైనిక చట్టం కింద రహస్య విచారణ జరిపింది. అభియోగాలను ధ్రువీకరిస్తూ మరణ శిక్ష విధించింది. ఈ శిక్షను పాకిస్థాన్‌ సైన్యాధిపతి జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వా ఆమోదిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘కులభూషణ్‌ భారత గూఢచార సంస్థ (రా) ఏజెంట్‌. ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకొన్నారు’ అని పాక్‌ సైన్యం ప్రకటించింది. ‘‘ఆయన భారత నేవీలో కమాండర్‌గా పని చేస్తున్నారు. పాకిస్థాన్‌లో కుట్రలు, విద్రోహ చర్యలను ప్రోత్సహించి, దేశాన్ని అస్థిర పరిచేలా ‘రా’ పన్నిన కుట్రలను అమలు చేసేందుకే ఆయన పాకిస్థాన్‌లోకి ప్రవేశించారు’’ అని పాక్‌ సైన్యం ప్రకటించింది.కులభూషణ్‌ (46) ఇచ్చిన ‘వీడియో వాంగ్మూలం ఇదే’ అంటూ గతంలోనే పాక్‌ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘నేను... కమాండర్‌ కులభూషణ్‌ యాదవ్‌. ముంబై వాసిని. హుస్సేన్‌ ముబారక్‌ పటేల్‌ పేరుతో భారత నిఘా వర్గాల కోసం సమాచారం సేకరిస్తున్నాను. 1987లో జాతీయ రక్షణ సంస్థ (ఎన్‌డీయే)లో చేరాను. 1991 నుంచి 2001 వరకు భారత నేవీలో పని చేశాను. భారత పార్లమెంటుపై దాడి కేసుకు సంబంధించి నిఘా సమాచారాన్ని సేకరించాను. 2003లో నిఘా కార్యకలాపాల్లో భాగంగా ఇరాన్‌లోకి ప్రవేశించి... చాబహార్‌లో చిన్న వ్యాపారం మొదలుపెట్టాను. ‘రా’ ఇచ్చే చిన్న చిన్న పనుల్లో భాగంగా 2003, 2004లో పలుమార్లు కరాచీకి వచ్చి వెళ్లాను. 2013లో ‘రా’ నన్ను పూర్తిస్థాయిలో ఎంచుకుంది. నేను ‘రా’ సంయుక్త కార్యదర్శి అనిల్‌ కుమార్‌ గుప్తా మనిషిని. ఆయనకు బలూచిస్థాన్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌తో సంబంధాలున్నాయి. బలూచిస్థాన్‌ తీవ్రవాదులతో సమావేశమవుతూ... వారి సహకారంతో పలురకాల కార్యకలాపాలు నిర్వహించడమే నా ప్రధాన కర్తవ్యం. ఆపరేషన్‌లో భాగంగా సరావన్‌ సరిహద్దులు దాటి పాకిస్థాన్‌లో ప్రవేశిస్తుండగా పాక్‌ సైనికులు నన్ను అరెస్టు చేశారు’’ అని కులభూషణ్‌ అంగీకరించినట్లుగా పాక్‌ సైన్యం గతంలో ప్రకటించింది. అయితే... కులభూషణ్‌ నేవీలో పనిచేసిన మాట నిజమేనని, ఆయన ఇప్పటికే పదవీ విరమణ చెందారని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత ప్రభుత్వంతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.
nation
17,145
31-07-2017 11:18:52
అఖిలేశ్‌కి బిగ్ షాక్... బీజేపీలోకి బాబాయ్!
న్యూఢిల్లీ: ఇటీవల ముగ్గురు ఎస్పీ ఎమ్మెల్సీలు రాజీనామా చేసిన సంగతి మర్చిపోక ముందే ఆ పార్టీ సారథి అఖిలేశ్‌కు మరో బిగ్ షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. అఖిలేశ్‌ బాబాయి, ఎస్పీ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్‌కు స్వయానా తమ్ముడు శివపాల్ యాదవ్ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే కాషాయ కండువా కప్పుకునేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైనట్టు సమాచారం. అంతకు ముందు ఆయన మరో రెండు అవకాశాలపైనా మంతనాలు సాగించినట్టు వినిపించింది. బీహార్ సీఎం నితీశ్ కుమార్ పార్టీ జేడీయూలో చేరడం లేదా కొత్తపార్టీ ప్రారంభించి ఎన్డీయేకి మద్దతు పలకడంపై కూడా చర్చలు జరిపినట్టు సమాచారం. దీనిపై తన అన్న ములాయం సింగ్ యాదవ్‌తో కూడా ఆయన చర్చలు జరిపినట్టు చెబుతున్నారు.బీహార్, గుజరాత్ రాజకీయాల తర్వాత ఇప్పుడు బీజేపీ ఉత్తరప్రదేశ్‌పై గురిపెట్టిన సంగతి తెలిసిందే.. అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీని గద్దె దించిన కాషాయ నేతలు మళ్లీ ఇప్పట్లో ఆ పార్టీ కోలుకునే అవకాశం లేకుండా వ్యూహం రచించినట్టు కనిపిస్తోంది. ఇటీవల ఎస్పీకి చెందిన ఎమ్మెల్సీలు యశ్వంత్ సింగ్, బుక్కాల్ నవాబ్, మధుకర్ జైట్లీ తమ పార్టీ సభ్యుత్వానికి రాజీనామా చేసి ప్రధాని మోదీ, సీఎం యోగిలపై పొగడ్తలు కురిపించిన సంగతి తెలిసిందే. దీంతో వారు బీజేపీలో చేరడం దాదాపు ఖాయమని వినిపిస్తోంది.
nation
1,535
17-06-2017 00:53:14
ఫారెక్స్‌ నిల్వలు 38,115 కోట్ల డాలర్లు
దేశీయంగా ఫారెక్స్‌ నిల్వల మొత్తం జూన్‌ 9తో ముగిసిన వారంలో 38,115 కోట్ల డాలర్లకు చేరాయి. అంతకు ముందు వారం తో పోలిస్తే నిల్వల మొత్తంలో 1.15 కోట్ల డాలర్ల మేర తగ్గింది. అంతకుముందు వారంలో భారత్ ఫారెక్స్‌ నిల్వల మొత్తం 38,116 కోట్ల డాలర్లు. మొత్తం ఫారెక్స్‌ నిల్వల్లో భాగమైన ఫారెక్స్‌ కరెన్సీ అసెట్స్‌ తగ్గడం వల్ల జూన్‌ 9తో ముగిసిన వారంలో ఫారెక్స్‌ నిల్వలు క్షీణించినట్టు వెల్లడించింది. అమెరికా డాలర్లలో గణించే ఫా రెక్స్‌ కరెన్సీ అసెట్స్‌ను యూరో, పౌండ్‌, యెన్‌ ప్రభావితం చేస్తాయి.
business
14,463
28-04-2017 12:56:42
వ్యక్తిగత కారణాల వల్లే రైతుల ఆత్మహత్యలు: తమిళనాడు ప్రభుత్వం
న్యూఢిల్లీ: తమిళనాడులో రైతుల ఆత్మహత్యలకు కరువు మాత్రమే కారణం కాదని ప్రభుత్వం చెబుతోంది. తమిళనాడులో రైతు ఆత్మహత్యలు లేవని సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. వ్యక్తిగత కారణాల వల్లనే రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఈ అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ ప్రకటనపై రైతులు మండిపడుతున్నారు. కరువు వల్ల, పంటల్లేక అప్పులు తీర్చలేని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇలాంటి అసంబద్ధ వివరణ ఇవ్వడం సరికాదని రైతులు చెబుతున్నారు. తమిళనాడు రైతుల విషయంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా రాజకీయాలను పక్కన పెట్టి, ఆదుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
nation
6,116
27-05-2017 20:46:39
రాంగోపాల్ వర్మ మరో సంచలనం.. ట్విట్టర్‌లో చచ్చిపోయాడట!
 ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. వివాదాలకు, కామెంట్లకు మారు పేరుగా మారిన వర్మ మరోసారి అంతకంటే సంచలన విషయం చెప్పాడు. తాను ట్విట్టర్‌లో చచ్చిపోయానని, ఇదే తన చివరి ట్విటర్ అని పోస్ట్ చేశాడు. ఇన్నేళ్లపాటు తనను ఫాలో అయినందుకు ఫాలోవర్లకు నో థ్యాంక్స్ అని చెప్పి మరీ ట్విట్టర్‌ నుంచి నిష్క్రమించాడు. తొలుత రాత్రి 8 గంటలకు తానో అన్‌ప్లెజెంట్ వార్త చెబుతానని చెప్పిన ఆర్జీవీ తర్వాత అంతసేపు ఆగలేనంటూ ముందుగానే చెప్పాల్సింది చెప్పేశాడు. ఇదే తన చివరి ట్విటీ అని ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, వీడియోల రూపంలో మాట్లాడతానని పేర్కొన్నాడు. ట్విట్టర్‌లో తన మరణానికి ముందు ఇదే చివరి ట్వీట్ అని పేర్కొన్నాడు. ట్విట్టర్‌లో తాను 27-05-2009లో పుడితే 27-05-2017 తన మరణం అని పేర్కొన్నాడు. వర్మ చివరి ట్వీట్ తర్వాత ట్విట్టర్ నుంచి అతడి పేజీ మాయం కావడం గమనార్హం.
entertainment
3,655
10-06-2017 02:50:42
టెట్‌తో పాటే డీఎస్సీ నోటిఫికేషన్
తెలంగాణ ప్రభుత్వం జూలై 23న టెట్ పరీక్ష నిర్వహించి ఆగస్టు 5న ఫలితాలు విడుదల చేస్తామని షెడ్యూల్ ప్రకటించింది. టెట్ ఫలితాలు వచ్చిన వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామంటోంది. ఇలాంటి ప్రకటనలు ప్రభు త్వం చాలా చేసింది కానీ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టెట్‌తో పాటే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలి. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు ఒకేసారి విడుదల చేయడం మూలంగా కొత్తగా డీఎడ్, బీఎడ్ పూర్తి చేసినవారు టెట్‌కి ప్రిపేర్ అవుతారు. ఇదివరకే టెట్ ఉత్తీర్ణులైన 3.5 లక్షల మంది నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్లో ప్రకటించే సిలబస్‌తో డీఎస్సీకి సిద్ధమవుతారు.- ఎం. శ్రావణ్ కుమార్, పూసాల, సుల్తానాబాద్, పెద్దపల్లి జిల్లా
editorial
18,455
21-11-2017 02:59:17
ప్రజలు పులి కంటే ఆవును చూసే భయపడుతున్నారు
ప్రజలు గతంలో పులిని చూసి భయపడేవారు. ఇప్పుడు ఆవును చూసి భయపడుతున్నారు. ఇదంతా మోదీ ప్రభుత్వ చలవే. గో రక్షణ దళాలకు భయపడి సంతలోకి ఆవులను తెచ్చేందుకే భయపడుతున్నారు. మోదీ 2018లోనే లోక్‌సభ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆర్జేడీ అధినేత
nation
6,368
11-06-2017 11:25:48
యాక్టర్ మురళీ శర్మతో స్పెషల్ చిట్‌చాట్ ఈ సాయంత్రం..
యాక్టర్ మురళీ శర్మతో స్పెషల్ చిట్‌చాట్ ఆదివారం సాయంత్రం 6-30 గంటలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో చూడండి.
entertainment
4,401
25-01-2017 02:28:34
ఉమ్మడి పోరుతోనే జలసాధన
జల వివాదాలపై కోర్టు తీర్పుల కోసం చూస్తే కాలహరణం తప్ప ప్రయోజనం లేదు. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ అవార్డును వెంటనే నోటిఫై చేయించేందుకు ప్రయత్నం చేయాలి. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలలో అక్రమ ప్రాజెక్టులు, అధిక నీటి వినియోగంపై ఉమ్మడి పోరాటం చేయాలి. తద్వారా బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌లో పేర్కొన్న ‘డెసిషన్‌ ఇంప్లిమెంటేషన్‌ బోర్డ్‌’ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. కృ‌ష్ణా నదీ జలాల వివాదాలపై 1976లో ఇచ్చిన బచావత్‌ అవార్డు ఇప్పటికీ అమలులో వుంది. 2004లో ఏర్పడిన బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తొమ్మిదిన్నర సంవత్సరాలు విచారణ జరిపి 2013లో ఇచ్చిన తీర్పును అమలు కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, సుప్రీంకోర్టు ద్వారా నిలుపుదల జరిపింది. విభజన చట్టంలో పేర్కొన్న నదీజలాల పునఃపంపిణీ రెండు రాష్ట్రాలకు కాదని, నాలుగు రాష్ట్రాలనే అంశంపై తెలుగు రాష్ట్రాల వాదన వీగిపోయింది. సుప్రీంకోర్టులో తెలంగాణ వేసిన పిటీషన్‌ తిరస్కరింపబడింది. అదే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఒకవైపు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో అనుమతులు లేని అక్రమ ప్రాజెక్టుల ద్వారా అధిక నీటి వినియోగం, ఆల్మట్టి ఎత్తు పెంపు, తుంగభద్రపై కొత్తగా 3 ప్రాజెక్టులకూ, కోయినా జల విద్యుత్‌ ప్రాజెక్టుకూ సుమారు 200 టీఎంసీలు అదనంగా కేటాయింపు వలన దిగువకు నీటి విడుదల తగ్గుతుంది. నీటి చేరిక కూడా ఆలస్యమవుతుంది. వేరొకవైపున జూరాల ఆధారంగా తెలంగాణలో నీటి వినియోగం 100 టీఎంసీలకు చేరుతుంది. దీనితోపాటు శ్రీశైలం ఆధారంగా పాలమూరు–రంగారెడ్డి,- దిండి ఎత్తిపోతల పథకాల ద్వారా 150టీఎంసీల నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టులకు పథకాలు రూపొందించి పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నాల్గవ రాష్ట్రంగా మారిన ఆంధ్రప్రదేశ్‌కు గడ్డు పరిస్థితే. దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకు నీటి సరఫరా (తరలింపు)పై పెద్దఎత్తున డిమాండ్లు వున్నాయి. నీరు తరలిస్తామనే హామీలున్నాయి. పైనుంచి నీరు రాకపోతే సీమకు నీటి తరలింపు ఎలా? దీనిపై ప్రత్యేక దృష్టి ఉండాలి. దీనికి పరిష్కార మార్గం ఒక్కటే. అదే గోదావరి నీటిని పోలవరం కుడికాల్వ ద్వారా ప్రకాశం బ్యారేజ్‌ వద్దకు, అక్కడి నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆచరిస్తున్న రివర్స్‌ పంపింగ్‌ ద్వారా కృష్ణానదినే కాల్వగా ఉపయోగించుకుని పులిచింతల రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసి అక్కడి నుంచి సాగర్‌ కుడికాల్వలోకి నీటిని లిఫ్ట్‌ద్వారా తరలించుటయే. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పథకం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా రూపొందించవచ్చు కదా! ప్రస్తుతం పట్టిసీమ, మునేరు, పాలేరు, పులిచింతలల ద్వారా లభ్యమయ్యే నీటితో డెల్టా ఆయకట్టుకు నీటికొరత లేనట్లే. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీమకు నీరందించేందుకుగాను, గోదావరి, పెన్నా నదుల అనుసంధానం పథకాన్ని తెరమీదికి తెచ్చింది. ఆ ప్రాజెక్టు వివరాలు: పోలవరం నుంచి పాపికొండలలోని 80 మీటర్ల ఎత్తుకు జలాశయంలోనికి 92వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి, 340 కి.మీ. కాలువ, 24 కి.మీ. సొరంగం, 11 కి.మీ. పంపింగ్‌ మెయిన్‌ ద్వారా అనేక ఏర్లు, కృష్ణా నదిని దాటించి రావులాపురం వద్ద ఏర్పాటు చేసే 360 టీఎంసీలు సామర్థ్యం కల 240 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్‌ చేసి అక్కడి నుంచి 335 కి.మీ. దూరంలో వున్న సోమశిలకు నీటిని పంపుతారు. దీనికి కావలసిన విద్యుత్‌ 9,900 మెగావాట్లు. అంచనా వ్యయం రూ. 1,47,556 కోట్లు. ఇది సాధ్యమేనా? తెలంగాణలోని శ్రీరాంసాగర్‌ ఆయకట్టు 10 లక్షల ఎకరాలకు తీవ్ర నీటి కొరత వున్న సందర్భంలో ప్రాణహిత, చేవెళ్ళ స్థానంలో ప్రాణహిత, ఇంద్రావతి నదుల నీరు సద్వినియోగం చేసుకొనుటకు గోదావరి నదినే కాలువగా ఉపయోగించుకుని నదిపై 3 బ్యారేజ్‌లు నిర్మించి నాలుగుసార్లు నీటిని ఎత్తిపోసే విధంగా ప్రణాళిక రూపొందించి పనులు ప్రారంభించారు. కృష్ణానదిపై శ్రీశైలం ఆధారంగా పాలమూరు-–రంగారెడ్డి ఎత్తి పోతల పథకం పనులు ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయుటకు దృఢ సంకల్పంతో పనులు చేపట్టారు. కేంద్రం సహకరిస్తుండటం వలన త్వరలోనే పూర్తవుతుందనే ఆశ కలిగింది. ఈ నేపథ్యంలో గోదావరి నీరు కృష్ణా ద్వారా రాయలసీమకు తక్కువ ఖర్చుతో త్వరితగతిన పూర్తిచేసే ప్రణాళిక ఇలా ఉండాలి:– శ్రీశైలం ప్రాజెక్టును బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మార్చాలి. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలి. విభజన చట్టంలో పేర్కొన్న మిగులు జలాల ఆధారంగా చేపట్టిన 6+1 =7 ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత కేంద్రానిదే అన్న విషయంపై రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పోరాడాలి. పోలవరం కుడి కాల్వ ద్వారా కృష్ణా నదిలోనికి విడుదల చేసే కాల్వ సామర్థ్యం ప్రస్తుత 11,150 క్యూసెక్కుల నుంచి 27,500 క్యూసెక్కులకు పెంచాలి. గోదావరి డెల్టాకు నీటి అవసరం లేని సమయంలో కుడికాల్వ ద్వారా నీటిని తరలించాలి. ప్రకాశం బ్యారేజ్‌ వద్దకు చేరిన నీటి నుంచి డెల్టాకు 12,500 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుని మిగిలిన నీటిని పులిచింతల రిజర్వాయర్‌లోకి ఎత్తిపోయాలి. ప్రకాశం బ్యారేజ్‌, పులిచింతల ప్రాజెక్టుల మధ్య దూరం 87 కి.మీ. నీటి మట్టాల మధ్య వ్యత్యాసం 40 మీటర్లు మాత్రమే. కావున ఈ రెండింటి మధ్య రెండు బ్యారేజ్‌లు నిర్మించి 3 సార్లు లిఫ్ట్‌ చేసి పులిచింతల జలాశయం పూర్తిస్థాయి(175 అడుగులు)లో నిల్వచేయాలి. ఆ తరువాత పులిచింతల బ్యాక్‌వాటర్‌ నుంచి 32 కి.మీ దూరంలో వున్న సాగర్‌ కుడికాల్వలోనికి 133మీటర్ల ఎత్తుకు అనగా 90మీటర్ల మేర 10వేల క్యూసెక్కుల నీటిని లిఫ్ట్‌ చేయాలి. సాగర్‌ కుడికాల్వ ముందస్తు అవసరాలకు నాగార్జున సాగర్‌లో నిల్వ వుంచిన క్యారీ ఓవర్‌ నుంచి వినియోగించుకోవచ్చును. సాగర్‌ నుంచి అదనంగా నీరు లభ్యమైనప్పుడు కుడి కాల్వ ద్వారా 203కి.మీ. దిగువకు ఫేజ్‌–2 ద్వారా నీరు అందించే అవకాశం వుంది. బ్రిజేష్‌ కుమార్‌ అవార్డులో మిగులు జలాల నుంచి క్యారీఓవర్‌ కేటాయించిన 150 టీఎంసీలను శ్రీశైలంలో 870 అడుగుల వరకు, సాగర్‌లో 540 అడుగుల వరకు నిల్వ చేసుకునే అవకాశం వుంటుంది. శ్రీశైలం ఆధారంగా వున్న పోతిరెడ్డిపాడు, వెలిగొండ, హంద్రీ-నీవా, ముచ్చుమర్రి, గాలేరు-నగరి తెలుగు గంగ ద్వారా సీమకు నీరు తరలించి సుమారు 290 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లలోను, వేలాది చెరువులలోను నిల్వ చేసుకొనుట వలన భూగర్భ జలాలు పెరిగే అవకాశం వుంది. దీంతోపాటు తెలంగాణ ప్రాజెక్టులు కల్వకుర్తి, పాలమూరు-–రంగారెడ్డి లిఫ్ట్‌ ప్రాజెక్టుల ద్వారా నీరు తరలిస్తారనే విషయాన్ని పరిగణనలోనికి తీసుకోవాలి. సీమకు 225, సాగర్‌కు కుడి, ఎడమ కాల్వ ద్వారా 175, మొత్తం 400 టీఎంసీల నీరు కావాలి. అలాగే తెలంగాణకు సాగర్‌ ద్వారా 150, శ్రీశైలం ద్వారా 150, మొత్తం 300 టీఎంసీల నీరు అవసరం. క్యారీ ఓవర్‌గా కేటాయించిన 150 టీఎంసీలలోను గోదావరి నుంచి కేటాయించిన నీటిలోను తెలంగాణకు వాటా వున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. బచావత్‌ అవార్డ్‌ ప్రకారం కృష్ణాకు తరలించిన నీటిలో మహారాష్ట్ర, కర్ణాటలకు 43.75 శాతం నీటిని ఇవ్వాలి. కానీ పై రాష్ట్రాలు ఇప్పటికే అనేక అక్రమ ప్రాజెక్టుల ద్వారా అధిక నీటి వినియోగం జరుగుతున్న విషయాన్ని తెలుగు రాష్ట్రాలు తరలించబడే నీటిపై ఎగువ రాష్ట్రాలకు వాటా లేకుండా కలసి పోరాడి సాధించాలి. నదికి 475 కి.మీ. సరిహద్దుగా ఇరువైపులా ఆంధ్ర, తెలంగాణలో వున్నా, సమన్వయంతో పరస్పర అంగీకారంతో వ్యవహరించాలి. ఎగువ నుంచి శ్రీశైలం వద్దకు నీటి చేరిక, ఆశాజనకంగా వున్నప్పుడు అటు సీమ, ఇటు తెలంగాణ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తూ సాగర్‌కు కూడా నీటి విడుదల జరగాలి. కోర్టులో వివాదాలపై తీర్పుల కోసం చూస్తే కాలహరణం తప్ప అంతగా ప్రయోజనం లేదు. అందువల్ల ఇరు రాష్ట్రాలు వివాదాలకు తెరదించి బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ అవార్డును వెంటనే నోటిఫై చేయుటకు ప్రయత్నం చేయాలి. దీనివలన బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌లోని ‘డెసిషన్‌ ఇంప్లిమెంటేషన్‌ బోర్డ్‌’ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. ఈ ప్రణాళిక అమలులో కృష్ణా నదిపై రెండు రోడ్‌కం బ్యారేజ్‌లు (అమరావతి రాజధానికి లింక్‌లో భాగంగా) రెండు సింపుల్‌ లిఫ్ట్‌లు (10 మీటర్లు) పులిచింతల ఎడమవైపున గల విద్యుత్‌ ఉత్పత్తి టర్బయిన్లను రివర్స్‌బుల్‌ టర్బయిన్లుగా మార్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని పులిచింతల బ్యాక్‌ వాటర్‌ నుంచి కుడికాల్వ లిఫ్ట్‌ల ఏర్పాటుకు సుమారు 4వేల నుండి 5వేల కోట్లు మాత్రమే ఖర్చుతో తక్కువ కాలంలో నీటిని అందించే అవకాశం వుంది. రాయలసీమ, తెలంగాణ రాష్ట్రాల దాహార్తి తీర్చుటకు దుర్భిక్ష ప్రాంతాలకు ప్రాణాధార జలాలు అందించే అవకాశం అమలుకు అటు కేంద్రం ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు వెంటనే కార్యాచరణ చేపట్టాలి. యెర్నేని నాగేంద్రనాధ్‌అధ్యక్షులు, రైతాంగ సమాఖ్య, 9849559955
editorial
16,882
15-10-2017 13:11:31
గురుదాస్‌పూర్ లోక్‌సభ ఎన్నికల్లో అవాక్కయిన బీజేపీ
గురుదాస్‌పూర్ : లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అవాక్కయింది. కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖర్ 1,90,000పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మేజర్ జనరల్ (రిటైర్డ్) సురేశ్ ఖజురియా మూడో స్థానంలో నిలిచారు. బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత వినోద్ ఖన్నా మరణించడంతో గురుదాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించారు. పంజాబ్‌లో ఆరు నెలల క్రితం కాంగ్రెస్ అధికారం చేపట్టింది. తాజా విజయంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఘన విజయం తథ్యమని నేతలు చెప్తున్నారు.
nation
4,517
15-12-2017 00:54:19
ఆదివాసీ భాషలను కాపాడాలి!
మన దేశంలో ఎక్కువుగా మాట్లాడే ద్రావిడ భాష తెలుగు. తెలుగువారి సంస్కృతి, సాంప్రదాయాలు, భాషా గొప్పదనాలు నేడు దేశపు ఎల్లలుదాటి ప్రపంచ దేశాలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాయి. అలాగే, ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు, వారు మాట్లాడే భాషలు ప్రపంచ ప్రజల మన్ననలు అందుకుంటున్నాయి. లిపి లేనప్పటికీ మౌఖిక భాషలుగానైనా ఆదివాసీ భాషలు మనుగడ సాగిస్తున్నాయి. ఇప్పటికే భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో మణిపురి, కొంకణి, డీంగ్రీ (గిరిజనులు అధికంగా మాట్లాడేవి) భాషలు అధికార భాషలుగా గుర్తిచబడ్డాయి. మాతృ భాషల సంరక్షణలో భాగంగా నిజాం రాజు ఉస్మాన్‌ అలీఖాన్‌, ఆదివాసీల ప్రత్యేక సంస్కృతిని గుర్తించి పాఠశాల స్ధాయిలో తెలుగు లిపిలోనే శిక్షణ ఇప్పించి గోండు భాషను పరిచయం చేయించారు. ప్రముఖ ఆంత్రోపాలజిస్టు ప్రొఫెసర్‌ హైమంఢార్ఫ్‌ అప్పట్లోనే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మార్లవాయిలో గోండు పిల్లల కోసం తొలిసారిగా పాఠశాలను ఏర్పాటు చేశారు. నేడు కొద్దిమంది ఆదివాసీలు తెలంగాణలో గోండి, కోలాం, కోయ భాషలు మాట్లాడుతున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా అంతరించి పోతున్న ఆదిమ భాషలపై, వాటి లిపిపై చర్చ జరగాలి. తెలంగాణలో తెలుగుతోపాటు ఆదివాసీల మాతృ భాషలకు ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరముంది. - గుమ్మడి లక్ష్మీనారాయణ
editorial
12,781
07-08-2017 09:51:44
ఓపీఎస్‌పై హత్యాయత్నం?.. చెన్నైలో కలకలం
తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌లో కలకలంకత్తితో దూసుకొచ్చిన కార్యకర్తఅడ్డుకున్న భద్రతా దళంచిన్న ఘటనే: ఓపీఎస్‌ వ్యాఖ్యచెన్నై: తిరుచ్చి విమానాశ్రయం వద్ద మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌ సెల్వం దగ్గరకి ఓ వ్యక్తి కత్తితో దూసుకుపోవడం కలకలంరేపింది. ఇది హత్యాయత్నంగా భావించిన కార్యకర్తలు ఆ అగంతుడిని చితకబాదారు. భద్రతాదళం అప్రమత్తతతో  పెద్దప్రమాదం తప్పింది. విమానాశ్రయంలో పాత్రికేయులతో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆయనవైపు దూసుకొస్తుండడం గమనించిన కేంద్ర పారిశ్రామికదళం భద్రతాధికారి అడ్డుకున్నారు. ఆ కుదుపులో సదరు వ్యక్తి ధోవతిలో దాచి ఉంచిన కత్తి జారి నేలపై పడింది. ఆ దృశ్యాన్ని చూసిన పన్నీర్‌సెల్వం అనుచరులు అతడిని చితకబాదారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... విరుదనగర్‌ జిల్లా శివకాశిలో ఆదివారం సాయంత్రం ఎంజీఆర్‌ శతజయంతి వేడుకల సభలో పాల్గొనే నిమిత్తం పన్నీర్‌సెల్వం చెన్నై నుంచి జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో తిరుచ్చికి వెళ్లారు. ఉదయం 11 గంటలకు ఆయన తిరుచ్చి విమానాశ్రయం చేరుకున్నారు.  అన్నాడీఎంకే (పురట్చితలైవి అమ్మ) స్థానిక నాయకులు, కార్యకర్తలు పన్నీర్‌సెల్వంకు పుష్పగుచ్చాలు, పూలమాలలు, శాలువలతో ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత విమానాశ్రయం వీఐపీల ప్రవేశ ద్వారం దాటుకుని పాత్రికేయుల వద్దకు వెళ్లారు. ఆ సమయంలో పన్నీర్‌సెల్వం వెనుకనే గుర్తు తెలియని వ్యక్తి వెంబడించాడు. అతడి కదలికలపై అనుమానం వచ్చిన కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం సభ్యుడొకరు అతడిని అడ్డుకుని దూరంగా లాగాడు. ఆ ప్రయత్నంలో అతడి పంచెకట్టు సడలి పదునైన కత్తి నేలపై పడింది. అది చూసిన పార్టీ కార్యకర్తలు అతడిని చితకబాదారు.  అనంతరం భద్రతాదళం సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకొని విమానాశ్రయం పోలీసులకు అప్పగించారు. పోలీసులు జరిపిన విచారణలో ఆ వ్యక్తి తిరుచ్చి టీవీఎస్‌ టోల్‌గేట్‌కు చెందిన సోలైరాజన్‌ (48)గా తెలిసింది. అతను 30 యేళ్లుగా అన్నాడీఎంకే సభ్యత్వం కలిగి, ఎంజీఆర్‌ మండ్రం స్థానిక శాఖ నాయకుడిగాను ఉన్నాడు. అంతే కాకుండా పన్నీర్‌సెల్వంకు అతను వీరాభిమాని అని కూడా వెల్లడైంది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సోలైరాజన్‌ మాట్లాడుతూ... తాను అన్నాడీఎంకేలో 30 యేళ్ల సభ్యత్వాన్ని కలిగి ఉన్నానని, పన్నీర్‌సెల్వం తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్నారని తెలిసి అక్కడి వెళ్లానన్నారు. ఆవిన్‌ పాల కేంద్రం వద్ద తాళపు గుత్తిపాటు ఉన్న కత్తిని పొరబాటున తన నడుమువద్ద ధోవతితో కట్టుకుని వెళ్లానని చెప్పారు.  పన్నీర్‌సెల్వంతో నిలిచి సెల్‌ఫోన్‌లో సెల్ఫీ తీసుకోవాలని దగ్గరగా వెళ్లానని, ఆ లోపున భద్రతాదళం సభ్యులు నెట్టడంతో ధోవతి మడత నుండి కత్తి జారి నేలపై పడటంతో పన్నీర్‌సెల్వంను కత్తితో పొడిచేందుకు వచ్చానని అనుమానించి పార్టీ నాయకులు, కార్యకర్తలు తనపై దాడి జరిపారని వాపోయారు. అంతేకాకుండా ఈ నెలాఖరున జరుగనున్న కుమార్తె వివాహానికి పన్నీర్‌సెల్వంతో కలిసి తీయిం చుకున్న ఫోటోతో బ్యానర్‌ తయారు చేయాలనుకున్నానని, ఆ కోరికతోనే దగ్గరగా వెళ్లానని సోలై రాజన్‌ చెప్పారు. సాయం అడిగేందుకు వెళ్లాడు: సోలైరాజన్‌ భార్యసోలైరాజన్‌ అరెస్టుతో భయాందోళనకు గురైన అతని భార్య రాజేశ్వరి విలేఖరులతో మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు తన భర్త వీరాభిమాని అని, నెలాఖరులో జరిగే కుమార్తె పెళ్లికి ఆర్థిక సహాయం అడిగేందుకే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాడని చెప్పారు. సోలైరాజన్‌ సెల్‌ఫోన్‌లో ఫోటో తీయించుకునేందుకు వెళ్లానని చెబుతుండగా, అతడి భార్య ఆర్థికసహాయం కోరటానికి వెళ్లాడని చెప్పడంతో పోలీసులు అయోమయానికి గురయ్యారు.  అంతేకాకుండా కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం, రాష్ట్ర పోలీసుల భద్రత నడుమనున్న పన్నీర్‌సెల్వం వద్దకు కత్తితో వెళ్లడం నేరమని తెలిసినా సోలైరాజన్‌ ఆవిన్‌ పాల కేంద్రం వద్ద అతీగతీ లేకుండా పడి ఉన్న తాళపు గుత్తిని, కత్తిని ఎందుకు తీసుకెళ్లాడని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సోలైరాజన్‌ మానసికస్థితి బాగా లేనందువల్లే కత్తిని ధోవతిలో కట్టుకుని వెళ్లాడని మరో కథనం. ఏది ఏమైనప్పటికీ పన్నీర్‌సెల్వం వద్దకు పార్టీ కార్యకర్త కత్తితో దూసుకెళ్లడం సంచలనం కలిగించింది. ఇది చిన్న సంఘటనే: ఓపీఎస్‌ఇదిలా ఉండగా, తిరుచ్చి ఎయిర్‌ పోర్ట్‌లో జరిగిన సంఘటనని ఓపీఎస్‌ చాలా తేలికగా తీసుకున్నారు. ఇది చిన్న సంఘటనే అని, ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అధికార అన్నాడీఎంకే ప్రభుత్వంపై తాను ధర్మయుద్ధాన్ని సాగిస్తున్నానని, నీటి సమస్యను పరిష్కరించాలని, డెంగీని నియంత్రించాలని కోరుతూ పెద్దయెత్తున ఆందోళన నిర్వహించనున్నామని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా పార్టీ ఆధ్వర్యంలో పలు ఆందోళనలు జరుపుతామని పన్నీర్‌సెల్వం తెలిపారు. జయలలిత ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణం చేసింది అప్పుడే..
nation
3,633
02-08-2017 04:06:14
భాష తోడు లేని ఎడారిలో..
ఎడారి దేశాలకు జీవనోపాధికై వచ్చే తెలుగు రాష్ట్రాల గ్రామీణ మహిళలకు అరబ్బి భాషలో కనీస పరిజ్ఞానం వుండదు. స్థానికులతో మాట్లాడేటప్పుడు వీరు చెప్పేది అవతలి వ్యక్తులకు అర్థం కాదు, స్థానికులు చెప్పేది వీరికి అర్థం కాదు. ఇటువంటి పరిస్థితులలో సహజంగా జరిగే తప్పులు, పొరపాట్లు ఇరుపక్షాల వారికి అమితంగా ఇబ్బందులు కల్గిస్తున్నాయి. ఎడారిలో ప్రయాణం. వందల కిలోమీటర్ల దూరం కారు డ్రైవింగ్ చేసి అలిసిపోయాను. నడి ఎడారి సమీపంలో ఆగి సేద దీరుతున్నాను. ‘వసంతం’ సినిమాలో నాకు నచ్చిన ‘అమ్మో...’ అనే పాట వింటున్నాను. పాట ఆనందంలో ఓలలాడుతూ, అటుగా వెళ్ళుతున్న ఒక యువకుడు ఉత్సాహంగా నా కారు సమీపంలోకి వచ్చిన విషయాన్ని గమనించలేదు. పాటలు వినడం పూర్తయిన తరువాతనే అతన్ని చూశాను. నా వైపు ఆసక్తిగా, ఆశగా చూస్తున్నాడు. మర్యాదగా పలుకరించగా ‘మీరు తెలుగు వారా అన్నా’ అని అడిగాడు. అవునని సమాధానం చెప్పి, అతని యోగక్షేమాలు విచారించాను. ఎక్కడలేని సంతోషంతో కాళ్ళ మీద పడ్డాడు. చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో మాట్లాడుతున్నట్లుగా ఆ ఎడారి మిత్రుడు చెప్పాడు, అదీ మాతృభాషా ఆత్మీయత...కానీ బతుకుదెరువుకు కన్న ఊరు నుంచి వేలాది మైళ్ళ దూరం వచ్చిన వారికి స్థానిక భాష రాకపోతే అనేక సమస్యలు ఎదురవుతాయి. అవి కొన్ని సందర్భాలలో ప్రాణాలమీదకు వస్తాయి. ఈ ఎడారి దేశాలలో జీవనోపాధికై తెలుగురాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల నుంచి పలువురు మహిళలు వస్తున్నారు. వారికి పూర్తిగా తెలుగు మినహా మరే భాష వచ్చి వుండదు. కనీసం తెలిసి వుండదు. ఇటువంటి మహిళలు ఈ ఎడారి దేశాలలో ఏమైనా కేసులలో చిక్కుకొంటే ఇక వారికి దేవుడే దిక్కు. తమ గోడు వెళ్ళబోసుకోవడానికి లేదా తమపై ఆరోపణలు నిరాధారమైనవని చెప్పుకోవడానికి కూడా వారు దేవుడికి మొక్కాల్సి ఉంటుంది. న్యాయ స్థానంలో తమ భాషలో తమ వాదన వినిపించడానికి వీరికి ఆవకాశం వచ్చే సరికి జరగవల్సిన నష్టం జరిగిపోతుంది. బతుకు దాదాపుగా వ్యర్థమైపోతుంది. సరిగ్గా ఇటువంటి విపత్కర పరిస్థితిలో సౌదీ అరేబియా జైలులో కడప జిల్లా మహిళ ఒకరు ఖైదీగా మగ్గిపోతున్నారు. స్వదేశంలో అమె భర్త మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్ళిపోగా ఆ దంపతుల సంతానమైన నలుగురు చిన్నారుల జీవితాలు ఛిన్నాభిన్నమైపోయాయి. కడప జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన పుటిక కృష్ణవేణి కేవలం భాషాపరమైన సమస్యతో మూడు సంవత్సరాలుగా కటకటాల వెనుక వెక్కి వెక్కి ఏడుస్తూ కాలం వెళ్ళదీస్తోంది. ఒక ఇంట్లో పని చేయడానికి సౌదీకి వచ్చిన కృష్ణవేణి అనారోగ్యంతో ఉన్న తన యాజమాని కూతురికి మందుకు బదులుగా నీళ్ళు ఇవ్వడంతో మరణించింది. దీంతో తన కూతురి మరణానికి కృష్ణవేణి నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కృష్ణవేణి జైలు పాలయింది. 2014 ఫిబ్రవరి నుంచి ఆమె జైలులో కునారిల్లుతోంది. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్‌తో పాటు పోలీసులు కూడా తన వాదనలు విన్పించడానికి ఆమెకు పూర్తి అవకాశమిచ్చారు.  అయితే తెలుగు భాష తప్ప మరో భాష రాకపోవడంతో కృష్ణవేణి తన వాదనను వినిపించలేకపోయింది. సైగల ద్వారా చెప్పే ప్రయత్నం కూడా చేసింది. ఇలా తన వాదనను చెప్పుకోవడానికి నానా అవస్థలు పడింది. సహాయం కొరకు అల్లాడిపోయింది.జైలులో కృష్ణవేణిని కలిసిన భారతీయ ఎంబసీ అధికారులు కూడా భాషా పరమైన సమస్య కారణాన ఆమె వాదనను అర్థం చేసుకోలేకపోయారు. ఈ రకంగా రెండున్నర సంవత్సరాలుగా జైలులో మగ్గుతున్న కృష్ణవేణి కేసు గురించి జైలు అధికారులు న్యాయస్థానానికి చెప్పగా, న్యాయమూర్తులు ఆమె కేసుపై దృష్టి సారించారు. కృష్ణవేణితో ఆమె భాషలో మాట్లాడగల వ్యక్తుల గూర్చి గాలించగా కర్ణాటకకు చెందిన సయ్యద్ ముజాహీద్ అనే ఒక వ్యక్తి దొరికాడు. సయ్యద్‌ పూర్వీకులు అనంతపురం జిల్లాకు చెందిన వారు కావడంతో అతనికి తెలుగు తెలుసు. కృష్ణవేణి చెప్పిన విషయాలను అతను తెలుగు నుంచి అరబిక్‌ భాషలోకి అనువదించి న్యాయస్థానానికి నివేదించాడు. ఈ విషయాలతో నిజానిజాలు తెలుసుకున్న న్యాయమూర్తులు కృష్ణవేణిపై ఆమె యాజమాని మోపిన హత్యా నేరం ఆరోపణను త్రోసిపుచ్చారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చెప్పుకోలేక ఒక మహిళ గతంలో పూర్తిగా ఒక సంవత్సరం జైలులో మగ్గింది. భాషాపరమైన కారణాన కడప జిల్లాకు చెందిన అనసూయ అనే మహిళ కూడ సుదీర్ఘ కాలం జైలులో గడిపింది. ఒకసారి ఒక జైలులో హైదరాబాద్ నగరానికి చెందిన ఒక మహిళ, కామారెడ్డి జిల్లా తాడ్వాయి వాసి అయిన ఒక గిరిజన యువతి, తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండల వాస్తవ్యురాలు ఒకరు, కడప జిల్లా సుండుపల్లి మహిళ ఒకరు ఉండగా ఈ నలుగురి యాసలో ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించిన తోటి భారతీయ మహిళలు విస్మయం చెందారు. గల్ఫ్ దేశాలకు వచ్చే తెలుగు రాష్ట్రాల గ్రామీణ మహిళలకు అరబ్బి భాషలో కనీస పరిజ్ఞానం వుండదు. స్థానికులతో మాట్లాడేటప్పుడు వారు చెప్పేది అవతలి వ్యక్తులకు అర్థం కాదు, స్థానికులు చెప్పేది వీరికి అర్థం కాదు. ఇటువంటి పరిస్థితులలో సహజంగా జరిగే తప్పులు, పొరపాట్లు ఇరుపక్షాల వారికి అంటే అటు యజమానులకు ఇటు ప్రవాస తెలుగు మహిళలకు అమితంగా ఇబ్బందులు కల్గిస్తున్నాయి.మొహమ్మద్ ఇర్ఫాన్ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఎడారిలో ప్రయాణం. వందల కిలోమీటర్ల దూరం కారు డ్రైవింగ్ చేసి అలిసిపోయాను. నడి ఎడారి సమీపంలో ఆగి సేద దీరుతున్నాను. ‘వసంతం’ సినిమాలో నాకు నచ్చిన ‘అమ్మో...’ అనే పాట వింటున్నాను. పాట ఆనందంలో ఓలలాడుతూ, అటుగా వెళ్ళుతున్న ఒక యువకుడు ఉత్సాహంగా నా కారు సమీపంలోకి వచ్చిన విషయాన్ని గమనించలేదు. పాటలు వినడం పూర్తయిన తరువాతనే అతన్ని చూశాను. నా వైపు ఆసక్తిగా, ఆశగా చూస్తున్నాడు. మర్యాదగా పలుకరించగా ‘మీరు తెలుగు వారా అన్నా’ అని అడిగాడు. అవునని సమాధానం చెప్పి, అతని యోగక్షేమాలు విచారించాను. ఎక్కడలేని సంతోషంతో కాళ్ళ మీద పడ్డాడు. చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో మాట్లాడుతున్నట్లుగా ఆ ఎడారి మిత్రుడు చెప్పాడు, అదీ మాతృభాషా ఆత్మీయత...కానీ బతుకుదెరువుకు కన్న ఊరు నుంచి వేలాది మైళ్ళ దూరం వచ్చిన వారికి స్థానిక భాష రాకపోతే అనేక సమస్యలు ఎదురవుతాయి. అవి కొన్ని సందర్భాలలో ప్రాణాలమీదకు వస్తాయి. ఈ ఎడారి దేశాలలో జీవనోపాధికై తెలుగురాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల నుంచి పలువురు మహిళలు వస్తున్నారు. వారికి పూర్తిగా తెలుగు మినహా మరే భాష వచ్చి వుండదు. కనీసం తెలిసి వుండదు. ఇటువంటి మహిళలు ఈ ఎడారి దేశాలలో ఏమైనా కేసులలో చిక్కుకొంటే ఇక వారికి దేవుడే దిక్కు. తమ గోడు వెళ్ళబోసుకోవడానికి లేదా తమపై ఆరోపణలు నిరాధారమైనవని చెప్పుకోవడానికి కూడా వారు దేవుడికి మొక్కాల్సి ఉంటుంది. న్యాయ స్థానంలో తమ భాషలో తమ వాదన వినిపించడానికి వీరికి ఆవకాశం వచ్చే సరికి జరగవల్సిన నష్టం జరిగిపోతుంది. బతుకు దాదాపుగా వ్యర్థమైపోతుంది. సరిగ్గా ఇటువంటి విపత్కర పరిస్థితిలో సౌదీ అరేబియా జైలులో కడప జిల్లా మహిళ ఒకరు ఖైదీగా మగ్గిపోతున్నారు. స్వదేశంలో అమె భర్త మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్ళిపోగా ఆ దంపతుల సంతానమైన నలుగురు చిన్నారుల జీవితాలు ఛిన్నాభిన్నమైపోయాయి. కడప జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన పుటిక కృష్ణవేణి కేవలం భాషాపరమైన సమస్యతో మూడు సంవత్సరాలుగా కటకటాల వెనుక వెక్కి వెక్కి ఏడుస్తూ కాలం వెళ్ళదీస్తోంది. ఒక ఇంట్లో పని చేయడానికి సౌదీకి వచ్చిన కృష్ణవేణి అనారోగ్యంతో ఉన్న తన యాజమాని కూతురికి మందుకు బదులుగా నీళ్ళు ఇవ్వడంతో మరణించింది. దీంతో తన కూతురి మరణానికి కృష్ణవేణి నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కృష్ణవేణి జైలు పాలయింది. 2014 ఫిబ్రవరి నుంచి ఆమె జైలులో కునారిల్లుతోంది. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్‌తో పాటు పోలీసులు కూడా తన వాదనలు విన్పించడానికి ఆమెకు పూర్తి అవకాశమిచ్చారు.  అయితే తెలుగు భాష తప్ప మరో భాష రాకపోవడంతో కృష్ణవేణి తన వాదనను వినిపించలేకపోయింది. సైగల ద్వారా చెప్పే ప్రయత్నం కూడా చేసింది. ఇలా తన వాదనను చెప్పుకోవడానికి నానా అవస్థలు పడింది. సహాయం కొరకు అల్లాడిపోయింది.జైలులో కృష్ణవేణిని కలిసిన భారతీయ ఎంబసీ అధికారులు కూడా భాషా పరమైన సమస్య కారణాన ఆమె వాదనను అర్థం చేసుకోలేకపోయారు. ఈ రకంగా రెండున్నర సంవత్సరాలుగా జైలులో మగ్గుతున్న కృష్ణవేణి కేసు గురించి జైలు అధికారులు న్యాయస్థానానికి చెప్పగా, న్యాయమూర్తులు ఆమె కేసుపై దృష్టి సారించారు. కృష్ణవేణితో ఆమె భాషలో మాట్లాడగల వ్యక్తుల గూర్చి గాలించగా కర్ణాటకకు చెందిన సయ్యద్ ముజాహీద్ అనే ఒక వ్యక్తి దొరికాడు. సయ్యద్‌ పూర్వీకులు అనంతపురం జిల్లాకు చెందిన వారు కావడంతో అతనికి తెలుగు తెలుసు. కృష్ణవేణి చెప్పిన విషయాలను అతను తెలుగు నుంచి అరబిక్‌ భాషలోకి అనువదించి న్యాయస్థానానికి నివేదించాడు. ఈ విషయాలతో నిజానిజాలు తెలుసుకున్న న్యాయమూర్తులు కృష్ణవేణిపై ఆమె యాజమాని మోపిన హత్యా నేరం ఆరోపణను త్రోసిపుచ్చారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చెప్పుకోలేక ఒక మహిళ గతంలో పూర్తిగా ఒక సంవత్సరం జైలులో మగ్గింది. భాషాపరమైన కారణాన కడప జిల్లాకు చెందిన అనసూయ అనే మహిళ కూడ సుదీర్ఘ కాలం జైలులో గడిపింది. ఒకసారి ఒక జైలులో హైదరాబాద్ నగరానికి చెందిన ఒక మహిళ, కామారెడ్డి జిల్లా తాడ్వాయి వాసి అయిన ఒక గిరిజన యువతి, తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండల వాస్తవ్యురాలు ఒకరు, కడప జిల్లా సుండుపల్లి మహిళ ఒకరు ఉండగా ఈ నలుగురి యాసలో ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించిన తోటి భారతీయ మహిళలు విస్మయం చెందారు. గల్ఫ్ దేశాలకు వచ్చే తెలుగు రాష్ట్రాల గ్రామీణ మహిళలకు అరబ్బి భాషలో కనీస పరిజ్ఞానం వుండదు. స్థానికులతో మాట్లాడేటప్పుడు వారు చెప్పేది అవతలి వ్యక్తులకు అర్థం కాదు, స్థానికులు చెప్పేది వీరికి అర్థం కాదు. ఇటువంటి పరిస్థితులలో సహజంగా జరిగే తప్పులు, పొరపాట్లు ఇరుపక్షాల వారికి అంటే అటు యజమానులకు ఇటు ప్రవాస తెలుగు మహిళలకు అమితంగా ఇబ్బందులు కల్గిస్తున్నాయి.మొహమ్మద్ ఇర్ఫాన్ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి
editorial
9,133
30-12-2017 15:40:41
మెగాస్టార్‌తో సెట్స్ పైకి వచ్చేందుకు నయనతార రెడీ..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 151వ చిత్రంగా వస్తోంది 'సైరా నరసింహారెడ్డి'. ఇందులో చిరు సరసన నయనతార హీరోయిన్‌గా కన్ఫార్మ్ అయింది. ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తిచేశారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన పోరాట దృశ్యాలను తెరకెక్కించారు. ఇక రెండో షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరు, నయన్‌లపై ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ జరగాల్సి ఉంది. అయితే నయన్‌కి డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ మెగా ప్రాజెక్ట్ నుండి ఆమె తప్పుకుందంటూ ఇటీవల కొన్ని వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదనేది తాజా సమాచారం. ముందుగా డేట్స్ ఇచ్చినట్లుగానే ఫిబ్రవరిలో నయన్ సెట్స్ పైకి రావడానికి రెడీగా ఉందట. దీంతో ఫిబ్రవరి నెలలో చిరు, నయన్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు అంతా సిద్ధం చేస్తోందట చిత్రయూనిట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటులు అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చారిత్రాక కథాంశంతో రాబోతున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడిని కూడా అతిత్వరలో కన్ఫార్మ్ చేయనున్నారు.
entertainment
17,658
18-07-2017 02:00:20
పాత నోట్ల డిపాజిట్‌ కుదరదు: కేంద్రం
న్యూఢిల్లీ, జూలై 17: పాత నోట్లను తీసుకొనేందుకు మరోసారి అవకాశం ఇవ్వడం కుదరదని, అలా చేస్తే నోట్ల రద్దు ప్రయోజనమే దెబ్బతింటుందని సుప్రీంకోర్టుకు కేంద్రం వివరించింది. పాత నోట్లను తీసుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలంటూ సుప్రీం సూచించిన నేపథ్యంలో కేంద్రం ఈ వివరణ ఇచ్చింది. నోట్ల రద్దు అనంతరం నవంబర్‌ 10 నుంచి డిసెంబర్‌ 30వ తేదీ వరకు పాత నోట్లను జమచేసేందుకు ఇచ్చిన వ్యవధి సరిపోతుందని వివరించింది.
nation
7,241
15-08-2017 18:45:23
నేలరాలిన సినీనటుడు
చెన్నై: కోలీవుడ్ సీనియర్ నటుడు షణ్ముఖ సుందరం (77) ఈరోజు (ఆగస్టు 15) ఉదయం కన్నుమూశాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన సాలిగ్రామంలోని తన సొంత ఇంటిలో కన్నుమూశారు. 1963 లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన షణ్ముఖ సుందరం చిత్రసీమలో అంచెలంచెలుగా ఎదిగాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించాడు. 100 కు పైగా సినిమల్లో నటించిన ఈయన చివరిసారిగా శింబు నటించిన 'ఏఏఏ' సినిమాలో వెండితెర పై కన్పించాడు. ఈయన పలు టెలివిజన్ సీరియళ్ళలో సైతం నటించాడు.
entertainment
14,595
22-08-2017 04:05:02
సివిల్‌ సర్వెంట్లు ఏ రాష్ట్రాన్నైనా ఎంచుకోవచ్చు!
న్యూఢిల్లీ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): అఖిల భారత సర్వీసులకు వెళ్లే వారికి శుభవార్త. రాష్ట్రాలను ఎంచుకునే విషయంలో మరింత వెసులుబాటు కల్పించాలని కేంద్రం భావిస్తోంది. ఐఏఎస్‌, ఐపీఎ్‌సల వంటి అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యే వారు దేశంలోని ఏ రాష్ట్రాన్నైనా ఎంచుకునే వీలు కల్పించేలా కేడర్‌ నిబంధనలను సవరించనుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం దేశం మొత్తాన్ని 6 గ్రూపులుగా విభజించారు. ఏ గ్రూపువారు ఆ గ్రూపులోని రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు ఆ నిబంధనల్లో కొన్ని మార్పులు తీసుకురాబోతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను 5 జోన్లులుగా విభజిస్తారు. యుపీఎస్సీకి ఎంపికైన అభ్యర్థి తన సొంత రాష్ట్రంతో పాటు ఇతర జోన్లలోని ఒక్కో రాష్ట్రాన్ని మొదటి ప్రాధాన్యతగా ఎంపిక చేసుకోవచ్చు. అన్ని జోన్లలోని మరో రాష్ట్రాన్ని కూడా రెండో ప్రాధాన్యతగా ఎంపిక చేసుకునే వీలు కల్పించనున్నారు.
nation
20,379
08-02-2017 01:18:24
ప్రాక్టీస్‌.. ప్రాక్టీస్‌..
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): టీమిండియా ప్రాక్టీస్‌ మంత్రం జపిస్తోంది. బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టుకు ముందు తమ అస్ర్తాలకు పదును పెడుతోంది. హైదరాబాద్‌కు వచ్చిన తొలి రోజే ప్రాక్టీ స్‌లో మునిగిపోయిన కోహ్లీసేన ఆ డోస్‌ను మరింత పెంచింది. ఉప్పల్‌ స్టేడియంలో మంగళవారం భారత ఆటగాళ్లందరూ ట్రెయినింగ్‌ సెషన్‌లో పాల్గొన్నారు. ఫుట్‌బాల్‌తో మొదలైన శిక్షణ.. ఫీల్డింగ్‌, క్యాచింగ్‌... నెట్స్‌లో బౌలింగ్‌, బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌తో సీరియ్‌స్‌గా సాగింది. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాన మైదానంలోకి వచ్చిన ఆటగాళ్లు తొలుత రన్నింగ్‌, సాధారణ ఎక్సర్‌సైజ్‌లతో వామప్‌ చేశారు. ఈ లోపు కోచ్‌ కుంబ్లే, విరాట్‌, అశ్విన్‌ పిచ్‌ను పరిశీలించొచ్చారు. తర్వాత ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి.. మైదానంలో కుర్చీలను లైన్‌గా పెట్టుకొని ఫుట్‌బాల్‌ ఆడారు. సరదాగా సాగిన ఈ ప్రాక్టీస్‌లో కెప్టెన్‌ కోహ్లీ సహా ఆటగాళ్లంతా ఒకరిపై ఒకరు జోకులేసుకుంటూ, నవ్వుతూ కనిపించారు.  రహానె టెన్నిస్‌ బంతుల క్యాచ్‌లు.సహాయ సిబ్బందితో కలిసి ముకుంద్‌, సాహా, రహానె, ఉమేశ్‌ ఫీల్డింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. సాహా, ఉమేష్‌ ఎక్కువ ఎత్తులో వచ్చిన బంతులను అందుకున్నారు. విలేకరుల సమావేశం ముగించుకున్న కోచ్‌ అనిల్‌ కుంబ్లే క్యూరేటర్‌ చంద్రశేఖర్‌తో కలిసి మరోసారి పిచ్‌ను తీక్షణంగా పరిశీలించాడు. తర్వాత... టెన్నిస్‌ బంతులతో ముకుంద్‌, రహానెకు ప్రత్యేకంగా క్యాచ్‌ల సాధన చేయించాడు. కుంబ్లే.. రాకెట్‌తో బంతి ని కొడుతుండగా రహానె డైవ్‌ చేస్తూ వాటిని అందుకున్నాడు. స్లిప్‌లో మెరుగైన క్యాచింగ్‌ కోసం కుంబ్లే ఈ విధానాన్ని ఎంచుకున్నాడు. రహానె వెనక్కి తిరిగి ఉండగా.. కుంబ్లే క్యాచ్‌లు ఇస్తూ సాధన చేయించడం ఆకట్టుకుంది.  కోహ్లీ.. ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌
sports
19,126
15-02-2017 14:44:11
శశికళ అనారోగ్య లక్షణాలు ఇవేనా...
చెన్నై: సుమారు 10 రోజుల కిందట పన్నీర్ సెల్వం తమిళనాడు సీఎం పదవికి రాజీనామా చేసి, 'అమ్మ' ఆత్మ తనను నడిపించిందంటూ చెన్నై మెరీనా తీరంలోని జయలలిత సమాధి వద్దకు వెళ్ళి శశికళపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఆ వెంటనే తన రాజకీయ ఎత్తుగడలకు శ్రీకారం చుట్టారు అన్నాడీఎంకే శ్రేణుల 'చిన్నమ్మ'. అప్పటికప్పుడు రెండు మూడు బస్సులు ఏర్పాటు చేసి తన వర్గం ఎమ్మెల్యేల్ని ముందుగా చెన్నై ఎయిర్‌పోర్ట్ వద్ద ఉన్న ఒక హొటల్‌కు, ఆ తర్వాత చెన్నై నగరానికి 80 కిలోమీటర్ల దూరాన మహాబలిపురం వద్ద ఉన్న గోల్డెన్ బే రిసార్ట్స్‌కు వారిని తరలించారు. ఈ ఘట్టం నాలుగైదు రోజులపాటు కొనసాగగా శశికళ ఏ మాత్రం తీరికలేకుండా రోజుకు రెండు మూడు సార్లు 80 కిలోమీటర్ల దూరాన ఉన్న ఆ రిసార్ట్స్‌కు వెళుతూ వస్తూ ఉన్నారు. మధ్య మధ్యలో జయలలిత సమాధి వద్దకు కూడా వెళుతూ నానా హడావుడి చేశారు. ఈ క్రమంలో ఎక్కడా నీరసం ఛాయలు కూడా కనిపించని ఆమెకు ఉన్నట్టుండి అనారోగ్యం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు తమిళ ప్రజలు. శశికళకు సుప్రీంకోర్టు జైలుశిక్ష ఖరారు చెయ్యడానికి ముందు రోజు రాత్రి ఆమె రిసార్ట్స్‌లోనే బసచేసి రాత్రంతా మంతనాలు చేయడమేగాక, శిక్షపడిన రోజంతా కూడా అక్కడే ఉండి చర్చలపై చర్చలు జరిపిన సంగతిని జనం గుర్తు చేసుకుంటున్నారు. జయలలిత జీవించి ఉండగా ఆమెతో నెలల తరబడి ఆసుపత్రిలో ఉన్నప్పుడు, అక్రమాస్తుల కేసులో తీర్పు రావడానికి ముందంతా ఊహించనంతటి చురుకుగా వ్యవహరిస్తూ మంత్రాంగం నడుపుతూ వచ్చిన శశికళకు జైలు మాట ఎత్తేసరికి ఉన్నట్టుండి ఏకంగా నాలుగు వారాల సమయం కోరాల్సి వచ్చినంత అనారోగ్యం ఏమొచ్చిందని అడుగుతున్నారు. నేడు కూడా శశికళ బెంగళూరు జైలుకు వెళుతూ జయ సమాధి వద్ద ఆగి మూడు సార్లు సమాధిపై కొడుతూ ప్రతిజ్ఞలు చేసిన సంఘటనను జనం గుర్తు చేసుకుంటూ ఆమెకు ఎక్కడా అనారోగ్యం లక్షణాలు లేవని, పైగా మరింత బలంగా కనిపిస్తున్నారని, వీలైనంత సమయాన్ని దక్కించుకుని తమిళనాడును కలవరపరచడానికే ఆమె ఈ నాటకానికి తెరలేపారని వ్యాఖ్యానిస్తున్నారు. శశికళ ఇంతటితో ఆగక తనకు జైలులో అవీఇవీ కావాలంటూ పలు డిమాండ్లు కూడా చేయడం విస్మయానికి గురిచేస్తోంది. అనారోగ్యానికి గురికావడమంటే ఇదేనా అని అడుగుతున్నారు.
nation
17,572
17-02-2017 14:42:57
చిల్లర దొంగను కాను, జీపు ఎక్కనన్న శశికళ
బెంగళూరు: తమిళనాడు సీఎం పదవిపై శశికళ కన్నేసినా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆమెను పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలుకు వెళ్లేలా చేసింది. గత బుధవారంనాడు ఆమె జైలుకు రాగానే తాను అక్కడ గడపాల్సిన నాలుగేళ్ల జైలు శిక్షను ఊహించి..జీర్ణించుకోలేక పోయారట. విలాసవంతమైన జీవితానికే పరిమితమవుతూ వచ్చిన శశికళ ఓ చిల్లర దొంగలా పోలీసు జీపులో అడుగుపెట్టేందుకు ఇష్టపడ లేదు. జైలు ఆవరణలో ఆమె కాలినడకనే ఎంతదూరమైనా వెళ్లేందుకే సిద్ధపడ్డారు. అధికారులు ఆమెను జీపులో కూర్చోమన్నప్పుడు 'ఎంతదూరమైనా కాలినడకనే వస్తాను' అని తెగేసి చెప్పారట. 'నేనేమీ చిల్లర దొంగను కాను. పోలీసు జీపులో కూర్చోను. జైలు సెల్‌లో మాత్రమే కూర్చుంటాను. నేరస్థుడిలా ఓపెన్ పోలీస్ జీపులో కూర్చోలేను. దూరం ఎంతైనా ఫరవాలేదు' అని చెప్పి ఆమె నడకనే ఎంచుకున్నారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అప్పటి ఆమె పరిస్థితిని చూస్తే ఆమె చాలా కలతచెందినట్టు, కోపంతో, అసహనంతో ఉన్నట్టు కనిపించారని చెప్పారు. జయలలితతో కలిసి గతంలో తాను జైలుశిక్ష అనుభవించినప్పుడు కల్పించిన సౌకర్యాలే ఇప్పుడు కూడా ఇస్తారని శశికళ అనుకున్నారట. అప్పట్లో జయలలిత తమిళనాడు సీఎంగా ఉన్నారు. జయకు ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఆమెకు 'ఏ' గ్రేడ్ సౌకర్యాలు కల్పించారు. శశికళకు కూడా అలాంటి సదుపాయాలే ఇచ్చారు. ఈసారి మాత్రం పరిస్థితి మారిపోయింది. వీఐపీ ఖైదీగా తనకు సౌకర్యాలు కల్పించాలని శశి చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఆమె సీఎం కానందున ప్రత్యేక సౌకర్యాలు కుదరవని తేల్చిచెప్పింది. దీంతో శశికళకు ఊహించని దెబ్బ తగిలింది. బహుశా ఈ పరిణామాలన్నీ ఆమె మరిచిపోలేనందున శాంతిభద్రతల సమస్య కారణంగా జీపు ఎక్కమని పోలీసు అధికారులు చెప్పినా ఆమె సున్నితంగానే తిరస్కరించారు. సెల్ వరకూ నడిచి వెళ్లేందుకే ఆమె నిశ్చయించుకోవడంతో అధికారులు సైతం ఆమెను అనుసరించక తప్పలేదు.
nation
10,822
05-02-2017 11:55:02
ఆ సినిమాలో నేను చేద్దామనుకున్న పాత్రలో దాసరిగారిని తీసుకున్నారు: కోట
 కోట శ్రీనివాసరావు కథాకథనం(18వ భాగం)(గతవారం తరువాయి)  ఒకేఒక్కమాట!                   టి.కృష్ణగారు ఉన్నప్పుడే సుబ్బయ్యగారు దర్శకత్వం చేశారు. ముత్యాల సుబ్బయ్య లేకపోతే ఇవాళ నేను లేను. మా ఇద్దరివీ ఒకే ప్రాంతాలు కావు. ఆయనతో ముందస్తు పరిచయం లేదుగానీ, సినిమాల్లోకి నా ఎంట్రీ ఆయన నోటిమాట వల్ల జరిగింది. అందుకే ఈ హోల్‌ ఇండస్ట్రీ‌లో ముత్యాలసుబ్బయ్యగారు నాకు చాలా స్పెషల్‌.  స్పెషల్‌ చిత్రం ‘మామగారు’              అంతకుముందు ఆయన నాకు తెలియదు. అందుకే ‘అలాగా అండీ. నమస్కారం. చెప్పండి సార్‌’ అన్నా.               ‘మరి అందులో నేను చేయదగ్గ పాత్రలు ఇంకేమున్నాయో మీరే చెప్పండి సార్‌. ఏ పాత్ర చేయమంటే అదే చేస్తాను. నాకేం ఫర్వాలేదండీ’ అన్నా. నా గొంతులో నిరుత్సాహం ధ్వనించినట్టుంది, ఆయన గమనించినట్టున్నారు. ‘మీరేం ఆలోచించకండి. నిరుత్సాహపడకండి. తమిళంలో కౌండర్‌మణి చేసిన పాత్రకు మిమ్మల్ని అనుకుంటున్నాం. ముత్యాల సుబ్బయ్యగారు మీతో మాట్లాడతారు.  బాబూమోహన్‌తో నా కాంబినేషన్‌ ఘనత ఆయనదే  బాబూమోహన్‌తో దాదాపు 50 చిత్రాలు  బాబూమోహన్‌ పెక్యూలియర్‌ టైమింగ్‌!  నిజంగా భయపడ్డా!
entertainment
6,414
11-05-2017 19:05:45
'బాహుబలి'కి పనిచేసిన మూడు తరాల వ్యక్తులు
మేగ్నమ్ ఓపస్ 'బాహుబలి' సృష్టిస్తోన్న సంచలనం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం 'బాహుబలి' అనేది అంతటా ఒక బ్రాండ్‌గా మారిపోయింది. టాలీవుడ్ టు బాలీవుడ్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న 'బాహుబలి'కి.. ఒకే కుటుంబంలోని మూడేసి తరాల వ్యక్తులు పనిచేశారా? ఆ విశేషమేంటో చూద్దాం. 'బాహుబలి' ఇప్పుడు ఒక టాలీవుడ్ మూవీ అనే బ్రాండ్ నుంచి బైటకు వెళ్లిపోయి.. భారతదేశం గర్వించదగ్గ సినిమా అనిపించుకుంది. ఇండియన్ మూవీ సత్తా.. ప్రపంచానికి చాటి చెప్పిన ఈ చిత్రరాజానికి.. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల వ్యక్తులు కష్టపడ్డారని తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు. దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తే.. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించాడు. ఇక రాజమౌళి తనయుడు కార్తికేయ.. 'బాహుబలి' రెండు పార్ట్‌లకు సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. ఇలా.. రాజమౌళి మూడు తరాలు ఈ సినిమాలో పాలుపంచుకున్నాయన్నమాట. రాజమౌళి తండ్రి.. తనయుడే కాదు.. రాజమౌళి పెదనాన్న కుటుంబానికి చెందిన మూడుతరాలు కూడా.. ఈ చిత్రరాజంలో పాలుపంచుకున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు కీరవాణి. తన అద్భుతమైన పాటలతోనే కాకుండా.. తన మార్క్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో.. 'బాహుబలి' రెండు పార్ట్ లకు ప్రాణం పోశాడు కీరవాణి. ఇక ఈ చిత్రంలో కీరవాణి తండ్రి శివశక్తి దత్త పాటలు రాయగా.. కీరవాణి కుమారుడు కాలభైరవ అద్భుతమైన గీతాలను ఆలపించాడు. వీళ్లే కాకుండా.. రాజమౌళి కుటుంబంలోని ఇతర సభ్యులు రమా రాజమౌళి, వల్లి, కళ్యాణ్ కోడూరి.. సింహా కోడూరి.. రామకృష్ణ కోడూరి.. రాజా కోడూరి.. వంటి వారంతా.. 'బాహుబలి' అనే తమ కుటుంబ మహా యఙ్ఞంలో పాలుపంచుకున్నారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలవార పనిచేసిన మేగ్నమ్ ఓపస్ 'బాహుబలి-2'కి.. అంతటా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఎంతోమంది 'బాహుబలి'పై తమ ప్రేమను.. ట్వీట్స్ రూపంలో పంచుకున్నారు. అయితే.. వీటికి భిన్నంగా 'బాహుబలి'లోని అద్భుతసృష్టి మాహిష్మతి సామ్రాజ్యంలో తనకో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కావాలని.. 'బాహుబలి'పై విభిన్నంగా స్పందించాడు బాలీవుడ్ నిన్నటితరం కథానాయకుడు రిషి కపూర్. 'బాహుబలి 2' ఇంతకుముందు ఏ సినిమాకూ దక్కని వెయ్యికోట్ల క్లబ్‌లోకి చేరి.. ఇండియన్ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన సంగతి తెలిసిందే. రిలీజైన రెండో వారంలో ఈ ఘనత సాధించిన 'బాహుబలి' పార్ట్ -2.. ఇప్పుడు 1500 కోట్ల మైలు రాయిని చేరుకునేందుకు పరుగులు పెడుతోంది. మరి.. 'బాహుబలి-2' లాంగ్ రన్‌లో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.
entertainment
16,978
16-05-2017 02:52:28
పిల్లల్లో దృష్టి లోపం చదువుకు చేటు
మెల్‌బోర్న్‌, మే 15: పిల్లల దృష్టి లోపాలను సకాలంలో గుర్తించకుంటే అది వారి చదువును దెబ్బతీసే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ లోపాలను ప్రారంభంలోనే సరిదిద్దకుంటే వారి జ్ఞానార్జన సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని తాజా అధ్యయనం లో వెల్లడైందని క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ(క్యూయూటీ) పరిశోధకులు తెలిపారు. చిన్నారులను తొలిసారి స్కూలుకు పంపించే ముందు నేత్ర పరీక్షలు చేయించడం మంచిదని సూచిస్తున్నారు.
nation
9,106
06-10-2017 17:37:46
పూజా హెగ్డే ఐటంసాంగ్ వెనుక కథ ఇదేనా?
రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'రంగస్థలం 1985' చిత్రం ఐటంసాంగ్‌లో చేసే హీరోయిన్ గురించి అనేక వార్తలు మొదట్లో వినిపించాయి. బాలీవుడ్‌కి చెందిన ఓ భామ అంటూ అక్కడి వారి పేర్లు కొన్ని వినిపించినా, చివరికి ఈ అవకాశం మాత్రం మెగా హీరోయిన్ పూజా హెగ్డేని వరించింది. అఫీషియల్‌గా కూడా ఈ న్యూస్ మైత్రీ మూవీస్ బ్యానర్ రిలీజ్ చేసింది. బాలీవుడ్‌ మాదిరిగానే టాలీవుడ్‌లో కూడా హీరోయిన్‌లు ఐటంసాంగ్‌లు చేయడం ఇప్పుడు కామన్ అయిన నేపథ్యంలో పూజాకి ఈ అవకాశం రావడాన్ని సింపుల్‌గానే తీసుకున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం పూజా, ఈ ఐటంసాంగ్ చేయడానికి కారణం మరొకటి ఉందంట. విషయంలోకి వస్తే, ప్రస్తుతం చరణ్ చేస్తోన్న 'రంగస్థలం 1985' చిత్రం అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో రామ్‌చరణ్ ఓ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజాకి ఛాన్స్ ఇస్తామని చెప్పి, రంగస్థలం చిత్రంలో ఐటంసాంగ్ చేయడానికి ఒప్పించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, ఒకవేళ నిజం అయితే మాత్రం పూజాకి మరో గోల్డెన్ ఛాన్స్ లభించినట్లే.
entertainment
18,547
09-03-2017 00:38:34
ఐదు మసీదులకు బాంబు హెచ్చరికలు
వాషింగ్టన్‌, మార్చి 8: అమెరికాలోని ఐదు మసీదులకు బాంబు హెచ్చరికలతో కూడిన సందేశాలు అందాయి. ‘‘మీరు, మీ వాళ్ల కోసం మరణం ఎదురు చూస్తోంది’’ అని పేర్కొన్న హెచ్చరికలు తీవ్ర కలకలం సృష్టించాయి. దీంతో అధికారులు హుటాహుటిన ఆయా మసీదుల వద్ద పెద్ద ఎత్తున భద్రత కల్పించారు. లెగ్జింగ్‌టన్‌ మసీద్‌ బిలాల్‌కు అందిన మెయిల్‌ ఇంగ్లాండ్‌లోని షెఫ్పీల్డ్‌ నుంచి అందినట్టు అధికారులు గుర్తించారు. ‘పేలుడు పదార్ధాలను మీ మసీదుల్లో త్వరలోనే అమర్చబోతున్నాం’ అని ఆ సందేశంలో ఉండడం గమనార్హం.
nation
8,822
23-10-2017 19:05:16
అదిరిపోయే బైక్ మాధవన్ సొంతం
దక్షిణాది స్టార్ హీరో మాధవన్‌కి బైక్స్ అంటే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్. ఏ కొత్త బైక్ వచ్చినా.. దాన్ని తన బైక్ గ్యారేజ్‌లో పెట్టుకోవడానికి మాధవన్ ఆసక్తి చూపుతుంటారు. ఇప్పటికే ఎంతో ఖరీదైన టూ వీలర్స్ బీఎండబ్ల్యూ కే1600 జీటీఎల్, డ్యుకాటీ డియావెల్, యమహా వీ-మ్యాక్స్ ఆయన బైక్ గ్యారేజ్‌లో ఉన్నాయి. కాగా తాజాగా మరో కొత్త బైక్ ‘ఇండియన్ రోడ్ మాస్టర్’ని మాధవ్ తన గ్యారేజ్‌లో చేర్చుకున్నారు. థండర్ స్ట్రోక్ 111 ఇంజన్ విత్ ఎన్‌ఎం, మ్యూజిక్, నావిగేషన్ వ్యవస్థను కలిగి ఉన్నటచ్ స్క్రీన్ సిస్టమ్, ఎల్‌ఈడీ లైట్స్, బ్లూటూత్ కనెక్టివిటీ మొదలైన ఫీచర్లు కలిగిన ఈ బైక్ చూడటానికి చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది. రూ 40.45 లక్షల విలువ చేసే ఈ బైక్‌ను కొనుగోలు చేసినట్టు మాధవన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ఈ దీపావళి పండగను తన కొత్త బైక్‌తో ప్రారంభించానని, ఈ బైక్ కొనుగోలు చేయడం చాలా సంతోషంగా ఉందని మాధవన్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఆయన కొత్త బైక్ డెలివరీ వీడియోను, ఆ బైక్‌పై అతను కూర్చొని దిగిన ఫొటోలను అందరితో పంచుకున్నారు మాధవన్.
entertainment
12,722
05-01-2017 04:42:52
ఆర్బీఐ గేటు వద్ద టాప్‌లెస్‌గా..
న్యూఢిల్లీ: నోట్ల రద్దు కష్టాలకు అద్దం పట్టే దృశ్యమిది. రద్దయిన పాత నోట్లను మార్చుకోవడానికి తన చిన్నారితో సహా బుధవారం ఢిల్లీలోని ఆర్బీఐ కేంద్రానికి వచ్చిందీ మహిళ. కానీ అక్కడున్న గార్డులు కుదరదు పొమ్మన్నారు. అక్కడి నుంచి వెళ్లడానికి నిరాకరించిన ఆమెను పోలీసులు జీపులో ఎక్కించుకుని తీసుకెళ్లబోతే.. వారి నుంచి తప్పించుకుని ఆగ్రహంతో ఊగిపోయింది. పెద్దగా రోదిస్తూ తాను ధరించిన స్వెటర్‌, కమీజును విప్పేసి పైభాగంలో నగ్నంగా తయారై నిరసన తెలిపింది. తల్లి రోదిస్తుండడంతో ఆ చిన్నారి కూడా హృదయవిదారకంగా విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. ఆ తర్వాత పోలీసులు ఆమెను అక్కడి నుంచి పార్లమెంట్‌ సెంట్రల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమె తనవద్ద ఉన్న గుర్తింపు కార్డును చూపట్లేదని.. మార్చుకోవడానికి తెచ్చిన సొమ్ము ఎంతన్నదీ చెప్పట్లేదని పోలీసులు తెలిపారు.
nation
18,817
11-04-2017 17:43:39
యోగి రెండో సంచలన నిర్ణయం 'అందరికీ విద్యుత్'
లక్నో : పాలనను కొత్త పుంతలు తొక్కిస్తూ తొలి కేబినెట్ సమావేశంలోనే రైతులకు రుణ మాఫీని ప్రకటించిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారంనాడు జరిపిన రెండో కేబినెట్ సమావేశంలోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 'అందరికీ విద్యుత్' ప్రకటన చేశారు. సుమారు మూడు గంటల సేపు జరిగిన సమావేశంలో విద్యుత్ సరఫరాతో సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ ప్రకారం అందరికీ విద్యుత్ సౌకర్యంలో భాగంగా ఈనెల 14 నుంచి అన్ని జిల్లా ప్రధాన కేంద్రాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తారు. తహసిల్స్‌కు 20 గంటలు, గ్రామాలకు 18 గంటల విద్యుత్ సరఫరా జరుగుతుంది. 2018 నాటికి అందరికీ విద్యుత్ పథకం కింద ఒక అవగాహన ఒప్పందంపై మంగళవారం సంతకం చేసింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటుచేయాలని కూడా యోగి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. విద్యుత్‌పై సర్‌చార్జి చెల్లింపులను రద్దు చేశారు. రూ.10,000 మించిన బిల్లులను రైతులు నాలుగు వాయిదాల్లో చెల్లించే వీలు కల్పించారు. రోడ్లు అభివృద్ధికి సంబంధించిన కూడా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఏడు సరిహద్దు జిల్లాల అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపును ఆమోదించారు. కొద్దికాలంగా ఈ నిర్ణయం పెండింగ్‌లో ఉండగా యోగి ఆమోదముద్ర వేశారు.
nation
7,506
02-12-2017 10:25:36
ఏ బాబాయి మంచు మనోజ్‌లా బర్త్ డే విషెస్ చెప్పరేమో!
మంచు విష్ణు ముద్దుల కుమార్తెలు అరియానా, వివియానాల బర్త్ డే. ఈ ట్విన్స్‌కి సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్స్ పెడుతున్నారు. విష్ణు కూడా తమ ఏంజిల్స్ 6వ బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ తమ ఫ్యామిలీ ఫోటోతో ట్వీట్ చేశారు. మంచు మనోజ్ మాత్రం చాలా వెరైటీగా తమ లిటిల్ ఏంజిల్స్‌కి బర్త్ డే విషెస్ చెప్పారు. తాను ట్రైనింగ్ నుంచి రాగానే అరి, వివిలకు స్కూలు బంక్ కొట్టి బయట తిరగడం నేర్పిస్తారట.  "పుట్టిన రోజు శుభాకాంక్షలు మై క్యూట్ లిటిల్ ఏంజిల్స్ అరి, వివి. మీరు చాలా సంతోషంగా ఉండాలంటూ.. చాలా చాక్‌లెట్స్, ఐస్ క్రీమ్స్, టాయ్స్‌ను ప్రసాదిస్తూ మీ ఇద్దరినీ భగవంతుడు ఆశీర్వదిస్తాడు. నేను ట్రైనింగ్ నుంచి తిరిగి వచ్చాక స్కూలు బంక్ కొట్టి బాబాయితో ఎలా బయటకు వెళ్లాలో నేర్పిస్తాను" అంటూ ట్వీట్ చేశారు మనోజ్. జవాన్ డైరెక్టర్ బీవీఎస్ రవి కూడా అరి, వివిలకు ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలిపారు. హీరో శర్వానంద్ గురించి సరికొత్త సంగతులు క్విజ్‌లో ‘జై లవకుశ సినిమా’ గురించి పది ప్రశ్నలు?
entertainment
4,866
23-05-2017 23:59:06
మహిళలకు ‘మా’ క్షమాపణలు
చలపతిరావు వివాదంపై మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) వెంటనే స్పందించింది. మంగళవారం సాయంత్రం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి తమ సభ్యుడైన చలపతిరావు తరఫున మహిళలకు క్షమాపణలు తెలిపింది. ఈ సందర్భంగా ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ ‘చలపతిరావుగారు గతంలో ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదు. షూటింగ్‌ స్పాట్‌లో ఆయన అందరితోనూ సరదాగా ఉంటారు. నలుగురికీ మంచి మాటలే చెబుతుంటారు. కానీ తొలిసారిగా నోరు జారారు. తర్వాత నాకు ఫోన్ చేసి చాలా బాధపడ్డారు.మహిళల గురించి ఆయన అలా మాట్లాడటం తప్పే. ‘మా’ కూడా దీన్ని ఖండిస్తోంది. క్షమించమని ఆయన అభ్యర్థించారు. ఇకపై ఆర్టిస్టుల నుంచి ఇటువంటి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు రావని మాట ఇస్తున్నాం. ఇలాంటివి పునరావృతమైతే తక్షణం సభ్యులపై చర్చలు తీసుకొంటాం. అవసరమైతే సభ్యత్వం రద్దు చేస్తాం’ అన్నారు. ‘మా’ ప్రధాన కార్యదర్శి నరేశ్ మాట్లాడుతూ ‘ సినిమా పరిశ్రమలో మహిళలున్నారు. అందరం కలిసే పనిచేస్తాం. అయితే ఓ సభలో సభామర్యాద, సమన్యాయం పాటించడం చాలా అవసరం. ఏ కార్యక్రమైనా జోకులతోనే మొదలవుతుంది. అయితే కొంతమంది నటులు హాస్యానికీ, ఇలాంటి వ్యాఖ్యలకు మధ్య చిన్న మంచు పొర ఉంటుందని గ్రహించక అదుపు తప్పి ఏవో మాట్లాడుతుంటారు. అవి సోషల్‌ మీడియాలో దుమారం సృష్టిస్తుంటాయి. ఇది ‘మా’కు గుణపాఠం. ఇలాంటి ఇబ్బందికర వ్యాఖ్యలు చోటుచేసుకోకుండా చూడటం ‘మా’ బాధ్యత. అందుకే ‘మా’ తరఫును, చలపతిరావుగారి తరఫున క్షమించమని మహిళల్ని కోరుతున్నాం. చలపతిరావుగారు ఇప్పుడు షాక్‌లో ఉన్నారు. క్షమించమని కోరుతున్నారు. సీనియర్‌ నటుడిగా, ఇన్నేళ్ల పాటు ప్రేక్షకుల్ని అలరించిన వ్యక్తిగా ఆయన్ని క్షమించమని కోరుతున్నాం. ఆయనపై పెట్టిన కేసుల్ని కూడా వెనక్కి తీసుకోవాలని ప్రార్థిసున్నాం’ అన్నారు.
entertainment
2,678
21-03-2017 01:48:22
9100 దిగువన మరింత బలహీనం
నిఫ్టీ 9200 కన్నా దిగువనే ప్రారంభమై మైనర్‌ రియాక్షన్‌ సాధించింది. ఇంట్రాడేలో 9100 కన్నా సుదీర్ఘ కన్సాలిడేషన్‌ అనంతరం డే కనిష్ఠ స్థాయిలో ముగియడం ట్రెండ్‌లో అప్రమత్తతను సూచిస్తోంది. టెక్నికల్‌గా మార్కెట్‌ మైనర్‌ కరెక్షన్‌లో ఉంది. స్వల్పకాలిక ఓవర్‌బాట్‌ స్థితి ఉన్నందువల్ల మరింత కరెక్షన్‌ లేదా కన్సాలిడేషన్‌ అవకాశం కూడా ఉంది.
business
13,407
06-03-2017 01:36:05
మోదీ ‘పాస్‌పోర్టు’వివరాల వెల్లడికి సీఐసీ నో
న్యూఢిల్లీ: పాస్‌పోర్టు కోసం ప్రధాని మోదీ సమర్పించిన డాక్యుమెంట్ల వివరాలను వెల్లడించడం కుదరదని ప్రధాన సమాచార కమిషనర్‌(సీఐసీ) ఆర్కే మాథుర్‌ స్పష్టం చేశారు. ఆర్టీఐ కింద ఆ వివరాలు వెల్లడించాలంటూ గుజరాత ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ సభ్యుడు జీఎం చౌహాన్‌ అభ్యర్థనను తోసిపుచ్చారు.
nation
19,609
10-12-2017 01:44:39
ఇంగ్లండ్‌ క్రికెటర్‌డకెట్‌పై వేటు
పెర్త్‌: వివాదాలతో సతమతమవుతున్న ఇంగ్లండ్‌ జట్టుకు మరో సమస్య ఎదురైంది. బ్యాట్స్‌మన్‌ బెన్‌ డకెట్‌ సీనియర్‌ ఆటగాడిపై మద్యం ఒలకబోసి సస్పెండ్‌ అయ్యాడు. క్రికెట్‌ ఆస్ర్టేలియా లెవెన్‌తో రెండు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు ఓపెనర్‌గా ఎంపి కైన డకెట్‌ గురువారం రాత్రి సీనియర్‌ ఆటగాడితో వాగ్వాదంలో సహనం కోల్పోయి అతనిపై మద్యం ఒలికించాడు. దీంతో జట్టు మేనేజ్‌మెంట్‌ క్రమశిక్షణాచర్యగా వచ్చేవారం అతన్ని పెర్త్‌లో జరగునున్న మూడో టెస్టుకు దూరం పెట్టే అవకాశముంది.
sports
11,608
15-05-2017 02:41:40
23న కేంద్ర ఉద్యోగుల సమ్మె లేదు
న్యూఢిల్లీ, మే 14: ఏడవ వేతన సంఘం సిఫారసు చేసిన మేరకు భత్యాలను పెంచాలన్న డిమాండ్‌తో ఈ నెల 23న తలపెట్టిన ఒక రోజు సమ్మెను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు వాయిదా వేశాయి. వేతన సంఘం సిఫారసు చేసిన మేరకు భత్యాలు పెంచేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఈ నేపథ్యంలో సమ్మెను వాయిదా వేశామని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఓ ప్రకటనలో తెలిపింది.
nation
13,975
21-01-2017 06:35:36
ట్రంప్‌కు మోదీ అభినందనలు
న్యూఢిల్లీ, జనవరి 20: అమెరికా కొత్త అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. శుక్రవారం రాత్రి ఆయన ట్వీట్‌ చేస్తూ, అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్ఠం కావాలని, సహకారం ఇంకా విస్తృతం కావాలని ఆకాంక్షించారు.
nation
4,098
25-05-2017 03:32:38
డేటా సైన్సులకు మంచి రోజులు
డేటాసైన్సులు చదివిన వారికి 2020 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు 28 శాతం పెరగనున్నాయి. అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లలో డేటా సైంటిస్టుల కొరత వున్నందున, ఆ శాస్త్రాలు చదివే వారికి ఉద్యోగావకాశాలు పుష్కలంగా లభించనున్నాయి. ఇంజనీరింగు కోర్సులకు ఆదరణ తగ్గి కాలేజీలు మూతపడుతున్నాయి. ఉన్న కొద్ది కాలేజీల్లో ఫీజులు భారం విద్యార్థులూ, వారి తల్లి దండ్రులూ తట్టుకోలేకపోతున్నారు. పైపెచ్చు అమెరికా వెళ్లి పైచదు వులు చదవాలను కున్న వారు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ మహాశయుడు తెస్తోన్న వీసా సంస్కరణలతో భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇంటర్మీడియెట్‌ తర్వాత ఏం చదవాలన్నది విద్యార్థుల మీమాంస అయితే, తమ సంతానాన్ని ఏమి చదివించి ఎటు తిప్పాలన్నది తల్లితండ్రుల ఆందోళన. కాని పరిస్థితులు బయటికి ప్రచారమవుతున్నంత భయంకరంగా లేవు. ఇంకా అనేక కోర్సులు జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ పలుకుతు న్నాయి. కొత్త అవకాశాలు సృష్టిస్తున్నాయి. అలాంటి కోర్సుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఉస్మానియా విశ్వవిద్యాల యం గుర్తింపుపొందిన కొన్ని కళాశాలల్లో అందిస్తున్న బిఎస్‌సి లెక్కలు, సాంఖ్య శాస్త్రం, కంప్యూటర్‌ (బిఎస్‌సి మాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్సు) కోర్సు. ఈ కోర్సును దేశవిదేశాల్లో డేటా విశ్లేషణావసరాలు, పరిశోధనావసరాలు, పెరుగు తున్న ఇన్సూరెన్సు, ఫైనాన్షియల్‌ సెక్టార్లూ, అభివృద్ధిపథకాల విశ్లేషణను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ఏ కోర్సు చదవాలనుకున్నా మన దేశంలోని బిఎస్‌సి మాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్సు కోర్సులో మంచి మార్కులతో పాసైతే మంచి అవకాశాలు లభిస్తాయి.  ఐబిఎమ్‌ లాంటి బహుళ జాతి కార్పొరేట్‌ సంస్థలు ప్రపంచంలో 2020నాటికి, డేటాసైన్సులు చదివిన వారికి ఉద్యోగావకాశాలు 28శాతం పెరుగు తాయని అంచనా వేశాయి. ఫోర్‌్బ్స సంస్థ కూడా అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లలో డేటా సైంటిస్టుల కొరత వుందనీ, ఆ శాస్త్రాలు చదివే వారికి మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయని చెప్పింది. డేటా ఆధారిత నిర్ణయాల మీద పరిశ్రమల యాజమాన్యాలు, ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలూ మొగ్గు చూపుతున్నాయి. ఈ కారణంగా ప్రపంచంలో అన్ని విశ్వవిద్యాలయాలు తమ మాస్టర్స్‌, డాక్టరేట్‌ కోర్సుల్లోకి మాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్సులను చదివినవారిని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. డేటా ఆధార నిర్ణయాలు తీసుకునే ఉద్యోగాలు– ప్రొఫెషనల్‌ సర్వీసుల్లో 23శాతం, పైనాన్స్‌/ఇన్సూరెన్స్‌ రంగాల్లో 17శాతం, వస్తూత్పత్తి రంగంలో 16శాతం, సమాచార వ్యవస్థలో 10శాతం, వైద్యరంగంలో ఆరు శాతం, చిల్లర వ్యాపార రంగంలో ఆరు శాతం మేరకు వున్నాయి. డేటా వ్యవస్థల అభివృద్ధి ఉద్యోగాలు– ప్రొఫెషనల్‌ సర్వీసుల్లో 41శాతం, పైనాన్స్‌/ ఇన్సూరెన్స్‌ రంగాల్లో 14శాతం, వస్తూత్పత్తి రంగంలో 14శాతం, సమాచార వ్యవస్థలో పది శాతం, వైద్యరంగంలో ఐదు శాతం, చిల్లర వ్యాపార రంగంలో మూడు శాతం మేరకు వున్నాయి. డేటా విశ్లేషకుల ఉద్యోగాలు– ప్రొఫెషనల్ సర్వీసుల్లో 34శాతం, ఫైనాన్స్‌/ఇన్సూరెన్సురంగాల్లో 25శాతం, వస్తూత్పత్తి రంగంలో 9శాతం, సమా చార వ్యవస్థలో ఆరు శాతం, వైద్యరంగంలో 7శాతం, చిల్లర వ్యాపార రంగంలో మూడు శాతం మేరకు ఉన్నాయి. విశ్లేషణ మేనేజర్ల ఉద్యోగాలు ప్రొఫెషనల్‌ సర్వీసులలో 21శాతం, పైనాన్స్‌/ ఇన్సూరెన్స్‌ రంగాల్లో 41శాతం, వస్తూత్పత్తి రంగంలో 9శాతం, సమాచార వ్యవస్థలో 9శాతం, వైద్యరంగంలో ఆరు శాతం, చిల్లర వ్యాపార రంగంలో మూడు శాతం మేరకు వున్నాయి. విధుల విశ్లేషణ ఉద్యోగాలు– ప్రొఫెషనల్‌ సర్వీసులలో 23శాతం, ఫైనాన్స్‌/ఇన్సూరెన్స్‌ రంగా లలో 34శాతం, వస్తూత్పత్తి రంగంలో 9శాతం, సమాచార వ్యవస్థలో ఐదు శాతం, వైద్యరంగంలో ఎనిమిది శాతం, చిల్లర వ్యాపార రంగంలో నాలుగు శాతం మేరకు ఉన్నాయి. ఇక డేటా శాస్త్రవేత్తల ఉద్యోగాలు– ప్రొఫెషనల్‌ సర్వీసులలో 31శాతం, పైనాన్స్‌/ ఇన్సూరెన్స్‌ రంగాలలో 23శాతం, వస్తూత్పత్తి రంగంలో 12శాతం, సమాచార వ్యవస్థలో పది శాతం, వైద్యరంగంలో ఆరు శాతం, చిల్లర వ్యాపార రంగంలో నాలుగుశాతం మేరకు ఉన్నాయి. భారతదేశం విషయానికివస్తే ఇప్పుడిప్పుడే ఉస్మానియా తదితర విశ్వవిద్యాల యాలు మాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ కాంబినేషన్‌తో డిగ్రీ కోర్సులు ప్రారంభించాయి. దాంతోపాటు దేశంలోని ఇన్సూరెన్సు, ఫైనాన్షియల్‌, ఆర్థిక, రిటైల్‌ రంగాలు ఫలితాల విశ్లేషణ కోసం, అభివద్ధి పథకాలు రచించడం కోసం, పథకాల అమలు పర్యవేక్షణ ఫలితాల విశ్లేషణకోసం డేటా సైన్సుల్లో నిష్ణాతులైన వారిని నియమించుకుంటున్నారు. రిజర్వుబ్యాంకు, నాబార్డు, ఐడిబిఐ, ప్రభుత్వరంగ బ్యాంకులు, స్టాక్‌ఎక్స్చేం జీలు డేటా సైన్సులు చదివినవారిని ఎక్కువగా నియమించుకుంటున్నాయి. భారత ప్రభుత్వ వ్యవస్థలో ఇండియన్‌ స్టాటిస్టికల్ సర్వీసు అనే ప్రత్యేక సర్వీసే కాకుండా భారత జనాభా లెక్కల విభాగం, నీతి ఆయోగ్‌ లాంటివి డేటా సైన్సుల్లో డిగ్రీలున్న వారిని ప్రోత్సహిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రామ, మండల స్థాయి నుంచి పైదాక డేటా లేకుండా నిర్ణయాలు తీసుకోవడం అంతకంతకూ కష్టమవుతోంది. నిర్దిష్టమైన ఫలితాల సాధన కోసం, నిర్దుష్టమైన డేటా సేకరించి, విశ్లేషించి రిపోర్టులు రాయడం దినదినం అత్యవసరమవుతోంది. అంతర్జాతీయ సంస్థల విషయానికి వస్తే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధిసంస్థ (ఐఎమ్‌ఎఫ్‌), ఇంటర్నేషనల్ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లాంటి సంస్థలు ఇప్పుడు డేటా సైన్సుల్లో డిగ్రీలున్నవారి కోసం వెదుకుతున్నాయి. ఐక్యరాజ్యసమితిలోని పాపులేషన్‌ డెవలప్‌మెంట్ ఫండ్ డేటాసైన్సు చదవనివారితో నడవనే నడవదు. అదేవిధంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ, అంతర్జాతీయ సామాజిక భద్రతా అసోసియేషన్‌ లాంటి సంస్థలు మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్సు చదివినవారినే ఎక్కువగా ఉద్యోగాల్లోనికి ఆహ్వానిస్తున్నాయి. ఇప్పుడు డేటా సైన్సుల్లో ముఖ్యమైన పాఠ్యాంశాలను పరిశీలిద్దాం. మ్యాథ్స్‌ తో ప్రారంభిస్తే– మన దేశంలో డిగ్రీ స్థాయిలోనే మ్యాథ్స్‌ సక్రమంగా చదివితే అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో మాస్టర్స్‌ డిగ్రీలు సులభంగా పూర్తి చేయవచ్చు. మ్యాథ్స్‌లో నిష్ణాతులైన వారిని ఇన్సూరెన్సు కంపెనీలు విరివిగా నియమించుకుంటున్నాయి. లెక్కలు రాకుండా ఆర్థిక విశ్లేషణ సాధ్యం కాదు. ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అభివృద్ధి పనుల కోసం వెచ్చిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక విశ్లేషణ కోసం మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌ లో డిగ్రీలున్న వారిని ఉద్యోగాల కోసం ప్రోత్సహిస్తున్నాయి. స్టాటిస్టిక్స్‌ విషయానికి వస్తే జనాభా లెక్కల మొదలు, స్టాక్‌మార్కెట్ల విశ్లేషణ, చిల్లర వర్తకం, అభివృద్ధి పనుల విశ్లేషణాత్మక రిపోర్టులు రాయడం వరకు స్టాటిస్టిక్స్‌లో శిక్షణ లేనిదే పని కాదు. వాతావరణ విశ్లేషణ అయినా, భూకంపాల తీవ్రత కొలవడమైనా, రోగాల విస్తరణ అధ్యయనమైనా స్టాటిస్టిక్స్‌ ముఖ్యం. నిజానికి ఏ పనిని నిర్దిష్ట ఫలితాల కోసం విశ్లేషించాల్సి వచ్చినా స్టాటిస్టిక్స్‌ను వినియోగించినప్పుడే నిర్దుష్టమైన రిపోర్టింగ్‌ సాధ్యం. ఇక కంప్యూటర్‌ సైన్సు– కంప్యూటర్లు లేనిదే ఈ రోజుల్లో మన జీవితం ఒక అడుగైనా ముందుకు సాగదని చెప్పనవసరం లేదు. మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూ టర్‌ పరిజ్ఞానం తోడైనప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్న ఉద్యోగాల నిర్వహణ సుసాధ్యమవుతుంది. ఇక డేటా సైన్సుల కలయికతో భారతదేశం నుంచి డిగ్రీలు పొందిన వారు విదేశాలలో ఎక్కడైనా మాస్టర్స్‌ డిగ్రీ చేయవచ్చని ముందే చెప్పుకున్నాం. ఈ సబ్జెక్టుల కాంబినేషన్‌తో మంచి మార్కులతో డిగ్రీలు తీసుకున్న వారు, యూరోపియన్ విశ్వవిద్యాలయాల్లో, కొన్ని అమెరికన్‌ విశ్వవిద్యాలయాల్లో డాక్టరేట్‌ డిగ్రీలకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. డేటా సైన్సులకు ఇంత డిమాండ్‌వున్నా వాటి బోధనకు మన విశ్వవిద్యాల యాలు ఇంకా ముందుకు రావడం లేదు. ఇటీవలే వందేళ్ళు పూర్తి చేసుకున్న ఉస్మానియా కనీసం తాను ఉత్పత్తి చేసిన ప్రతిభాపాటవాలను కూడా పూర్తిగా ఉపయోగించుకోవడం లేదు. ప్రైవేటు కళాశాలలు మొక్కుబడిగా కోర్సులను తీసుకుంటున్నాయే గానీ, తమ దగ్గర బోధించే కోర్సుల భావి ఉపయోగాలను విద్యార్థులకు ఇంకా విడమర్చి చెప్పడం లేదు. విద్యార్థులు కళాశాలలకు వెళ్ళి చదువుతున్నారే గానీ, చదువుతున్న అంశంలో పట్టు సాధించుకుని తమ ఉద్యోగార్హత పరిధిని విస్తరించుకోవచ్చని తెలుసుకోలేక పోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు ముందుకొచ్చి ఒక్కో సబ్జెక్టు గురించి వివరిస్తే తప్ప ఇంటర్మీడియెట్‌ పాసైన విద్యార్థులు సరైన విద్యామార్గంలోకి పోలేరు.డాక్టర్‌ పి.మాధవరావు ఐక్యరాజ్యసమితి మాజీ సీనియర్‌ సలహాదారుఇంజనీరింగు కోర్సులకు ఆదరణ తగ్గి కాలేజీలు మూతపడుతున్నాయి. ఉన్న కొద్ది కాలేజీల్లో ఫీజులు భారం విద్యార్థులూ, వారి తల్లి దండ్రులూ తట్టుకోలేకపోతున్నారు. పైపెచ్చు అమెరికా వెళ్లి పైచదు వులు చదవాలను కున్న వారు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ మహాశయుడు తెస్తోన్న వీసా సంస్కరణలతో భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇంటర్మీడియెట్‌ తర్వాత ఏం చదవాలన్నది విద్యార్థుల మీమాంస అయితే, తమ సంతానాన్ని ఏమి చదివించి ఎటు తిప్పాలన్నది తల్లితండ్రుల ఆందోళన. కాని పరిస్థితులు బయటికి ప్రచారమవుతున్నంత భయంకరంగా లేవు. ఇంకా అనేక కోర్సులు జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ పలుకుతు న్నాయి. కొత్త అవకాశాలు సృష్టిస్తున్నాయి. అలాంటి కోర్సుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఉస్మానియా విశ్వవిద్యాల యం గుర్తింపుపొందిన కొన్ని కళాశాలల్లో అందిస్తున్న బిఎస్‌సి లెక్కలు, సాంఖ్య శాస్త్రం, కంప్యూటర్‌ (బిఎస్‌సి మాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్సు) కోర్సు. ఈ కోర్సును దేశవిదేశాల్లో డేటా విశ్లేషణావసరాలు, పరిశోధనావసరాలు, పెరుగు తున్న ఇన్సూరెన్సు, ఫైనాన్షియల్‌ సెక్టార్లూ, అభివృద్ధిపథకాల విశ్లేషణను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ఏ కోర్సు చదవాలనుకున్నా మన దేశంలోని బిఎస్‌సి మాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్సు కోర్సులో మంచి మార్కులతో పాసైతే మంచి అవకాశాలు లభిస్తాయి.  ఐబిఎమ్‌ లాంటి బహుళ జాతి కార్పొరేట్‌ సంస్థలు ప్రపంచంలో 2020నాటికి, డేటాసైన్సులు చదివిన వారికి ఉద్యోగావకాశాలు 28శాతం పెరుగు తాయని అంచనా వేశాయి. ఫోర్‌్బ్స సంస్థ కూడా అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లలో డేటా సైంటిస్టుల కొరత వుందనీ, ఆ శాస్త్రాలు చదివే వారికి మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయని చెప్పింది. డేటా ఆధారిత నిర్ణయాల మీద పరిశ్రమల యాజమాన్యాలు, ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలూ మొగ్గు చూపుతున్నాయి. ఈ కారణంగా ప్రపంచంలో అన్ని విశ్వవిద్యాలయాలు తమ మాస్టర్స్‌, డాక్టరేట్‌ కోర్సుల్లోకి మాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్సులను చదివినవారిని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. డేటా ఆధార నిర్ణయాలు తీసుకునే ఉద్యోగాలు– ప్రొఫెషనల్‌ సర్వీసుల్లో 23శాతం, పైనాన్స్‌/ఇన్సూరెన్స్‌ రంగాల్లో 17శాతం, వస్తూత్పత్తి రంగంలో 16శాతం, సమాచార వ్యవస్థలో 10శాతం, వైద్యరంగంలో ఆరు శాతం, చిల్లర వ్యాపార రంగంలో ఆరు శాతం మేరకు వున్నాయి. డేటా వ్యవస్థల అభివృద్ధి ఉద్యోగాలు– ప్రొఫెషనల్‌ సర్వీసుల్లో 41శాతం, పైనాన్స్‌/ ఇన్సూరెన్స్‌ రంగాల్లో 14శాతం, వస్తూత్పత్తి రంగంలో 14శాతం, సమాచార వ్యవస్థలో పది శాతం, వైద్యరంగంలో ఐదు శాతం, చిల్లర వ్యాపార రంగంలో మూడు శాతం మేరకు వున్నాయి. డేటా విశ్లేషకుల ఉద్యోగాలు– ప్రొఫెషనల్ సర్వీసుల్లో 34శాతం, ఫైనాన్స్‌/ఇన్సూరెన్సురంగాల్లో 25శాతం, వస్తూత్పత్తి రంగంలో 9శాతం, సమా చార వ్యవస్థలో ఆరు శాతం, వైద్యరంగంలో 7శాతం, చిల్లర వ్యాపార రంగంలో మూడు శాతం మేరకు ఉన్నాయి. విశ్లేషణ మేనేజర్ల ఉద్యోగాలు ప్రొఫెషనల్‌ సర్వీసులలో 21శాతం, పైనాన్స్‌/ ఇన్సూరెన్స్‌ రంగాల్లో 41శాతం, వస్తూత్పత్తి రంగంలో 9శాతం, సమాచార వ్యవస్థలో 9శాతం, వైద్యరంగంలో ఆరు శాతం, చిల్లర వ్యాపార రంగంలో మూడు శాతం మేరకు వున్నాయి. విధుల విశ్లేషణ ఉద్యోగాలు– ప్రొఫెషనల్‌ సర్వీసులలో 23శాతం, ఫైనాన్స్‌/ఇన్సూరెన్స్‌ రంగా లలో 34శాతం, వస్తూత్పత్తి రంగంలో 9శాతం, సమాచార వ్యవస్థలో ఐదు శాతం, వైద్యరంగంలో ఎనిమిది శాతం, చిల్లర వ్యాపార రంగంలో నాలుగు శాతం మేరకు ఉన్నాయి. ఇక డేటా శాస్త్రవేత్తల ఉద్యోగాలు– ప్రొఫెషనల్‌ సర్వీసులలో 31శాతం, పైనాన్స్‌/ ఇన్సూరెన్స్‌ రంగాలలో 23శాతం, వస్తూత్పత్తి రంగంలో 12శాతం, సమాచార వ్యవస్థలో పది శాతం, వైద్యరంగంలో ఆరు శాతం, చిల్లర వ్యాపార రంగంలో నాలుగుశాతం మేరకు ఉన్నాయి. భారతదేశం విషయానికివస్తే ఇప్పుడిప్పుడే ఉస్మానియా తదితర విశ్వవిద్యాల యాలు మాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ కాంబినేషన్‌తో డిగ్రీ కోర్సులు ప్రారంభించాయి. దాంతోపాటు దేశంలోని ఇన్సూరెన్సు, ఫైనాన్షియల్‌, ఆర్థిక, రిటైల్‌ రంగాలు ఫలితాల విశ్లేషణ కోసం, అభివద్ధి పథకాలు రచించడం కోసం, పథకాల అమలు పర్యవేక్షణ ఫలితాల విశ్లేషణకోసం డేటా సైన్సుల్లో నిష్ణాతులైన వారిని నియమించుకుంటున్నారు. రిజర్వుబ్యాంకు, నాబార్డు, ఐడిబిఐ, ప్రభుత్వరంగ బ్యాంకులు, స్టాక్‌ఎక్స్చేం జీలు డేటా సైన్సులు చదివినవారిని ఎక్కువగా నియమించుకుంటున్నాయి. భారత ప్రభుత్వ వ్యవస్థలో ఇండియన్‌ స్టాటిస్టికల్ సర్వీసు అనే ప్రత్యేక సర్వీసే కాకుండా భారత జనాభా లెక్కల విభాగం, నీతి ఆయోగ్‌ లాంటివి డేటా సైన్సుల్లో డిగ్రీలున్న వారిని ప్రోత్సహిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రామ, మండల స్థాయి నుంచి పైదాక డేటా లేకుండా నిర్ణయాలు తీసుకోవడం అంతకంతకూ కష్టమవుతోంది. నిర్దిష్టమైన ఫలితాల సాధన కోసం, నిర్దుష్టమైన డేటా సేకరించి, విశ్లేషించి రిపోర్టులు రాయడం దినదినం అత్యవసరమవుతోంది. అంతర్జాతీయ సంస్థల విషయానికి వస్తే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధిసంస్థ (ఐఎమ్‌ఎఫ్‌), ఇంటర్నేషనల్ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లాంటి సంస్థలు ఇప్పుడు డేటా సైన్సుల్లో డిగ్రీలున్నవారి కోసం వెదుకుతున్నాయి. ఐక్యరాజ్యసమితిలోని పాపులేషన్‌ డెవలప్‌మెంట్ ఫండ్ డేటాసైన్సు చదవనివారితో నడవనే నడవదు. అదేవిధంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ, అంతర్జాతీయ సామాజిక భద్రతా అసోసియేషన్‌ లాంటి సంస్థలు మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్సు చదివినవారినే ఎక్కువగా ఉద్యోగాల్లోనికి ఆహ్వానిస్తున్నాయి. ఇప్పుడు డేటా సైన్సుల్లో ముఖ్యమైన పాఠ్యాంశాలను పరిశీలిద్దాం. మ్యాథ్స్‌ తో ప్రారంభిస్తే– మన దేశంలో డిగ్రీ స్థాయిలోనే మ్యాథ్స్‌ సక్రమంగా చదివితే అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో మాస్టర్స్‌ డిగ్రీలు సులభంగా పూర్తి చేయవచ్చు. మ్యాథ్స్‌లో నిష్ణాతులైన వారిని ఇన్సూరెన్సు కంపెనీలు విరివిగా నియమించుకుంటున్నాయి. లెక్కలు రాకుండా ఆర్థిక విశ్లేషణ సాధ్యం కాదు. ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అభివృద్ధి పనుల కోసం వెచ్చిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక విశ్లేషణ కోసం మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌ లో డిగ్రీలున్న వారిని ఉద్యోగాల కోసం ప్రోత్సహిస్తున్నాయి. స్టాటిస్టిక్స్‌ విషయానికి వస్తే జనాభా లెక్కల మొదలు, స్టాక్‌మార్కెట్ల విశ్లేషణ, చిల్లర వర్తకం, అభివృద్ధి పనుల విశ్లేషణాత్మక రిపోర్టులు రాయడం వరకు స్టాటిస్టిక్స్‌లో శిక్షణ లేనిదే పని కాదు. వాతావరణ విశ్లేషణ అయినా, భూకంపాల తీవ్రత కొలవడమైనా, రోగాల విస్తరణ అధ్యయనమైనా స్టాటిస్టిక్స్‌ ముఖ్యం. నిజానికి ఏ పనిని నిర్దిష్ట ఫలితాల కోసం విశ్లేషించాల్సి వచ్చినా స్టాటిస్టిక్స్‌ను వినియోగించినప్పుడే నిర్దుష్టమైన రిపోర్టింగ్‌ సాధ్యం. ఇక కంప్యూటర్‌ సైన్సు– కంప్యూటర్లు లేనిదే ఈ రోజుల్లో మన జీవితం ఒక అడుగైనా ముందుకు సాగదని చెప్పనవసరం లేదు. మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూ టర్‌ పరిజ్ఞానం తోడైనప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్న ఉద్యోగాల నిర్వహణ సుసాధ్యమవుతుంది. ఇక డేటా సైన్సుల కలయికతో భారతదేశం నుంచి డిగ్రీలు పొందిన వారు విదేశాలలో ఎక్కడైనా మాస్టర్స్‌ డిగ్రీ చేయవచ్చని ముందే చెప్పుకున్నాం. ఈ సబ్జెక్టుల కాంబినేషన్‌తో మంచి మార్కులతో డిగ్రీలు తీసుకున్న వారు, యూరోపియన్ విశ్వవిద్యాలయాల్లో, కొన్ని అమెరికన్‌ విశ్వవిద్యాలయాల్లో డాక్టరేట్‌ డిగ్రీలకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. డేటా సైన్సులకు ఇంత డిమాండ్‌వున్నా వాటి బోధనకు మన విశ్వవిద్యాల యాలు ఇంకా ముందుకు రావడం లేదు. ఇటీవలే వందేళ్ళు పూర్తి చేసుకున్న ఉస్మానియా కనీసం తాను ఉత్పత్తి చేసిన ప్రతిభాపాటవాలను కూడా పూర్తిగా ఉపయోగించుకోవడం లేదు. ప్రైవేటు కళాశాలలు మొక్కుబడిగా కోర్సులను తీసుకుంటున్నాయే గానీ, తమ దగ్గర బోధించే కోర్సుల భావి ఉపయోగాలను విద్యార్థులకు ఇంకా విడమర్చి చెప్పడం లేదు. విద్యార్థులు కళాశాలలకు వెళ్ళి చదువుతున్నారే గానీ, చదువుతున్న అంశంలో పట్టు సాధించుకుని తమ ఉద్యోగార్హత పరిధిని విస్తరించుకోవచ్చని తెలుసుకోలేక పోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు ముందుకొచ్చి ఒక్కో సబ్జెక్టు గురించి వివరిస్తే తప్ప ఇంటర్మీడియెట్‌ పాసైన విద్యార్థులు సరైన విద్యామార్గంలోకి పోలేరు.డాక్టర్‌ పి.మాధవరావు ఐక్యరాజ్యసమితి మాజీ సీనియర్‌ సలహాదారు
editorial
16,087
01-08-2017 02:35:00
వెంకయ్యకు ఘనంగా వీడ్కోలు
న్యూఢిల్లీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రిగా రాజీనామ చేసిన ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎం.వెంకయ్యనాయుడికు ఆ శాఖ ఉద్యోగులు సోమవారం ఘనంగా వీడ్కోలు పలికారు. వెంకయ్య మాట్లాడుతూ.. మూడేళ్లలో శాఖలో అందరితో అనుబంధం పెరిగిందని, అందరికీ అభినందనలు తెలిపారు.
nation
11,891
15-11-2017 15:36:11
జింబాబ్వే అధ్యక్షుడిని కస్టడీలోకి తీసుకున్న సైన్యం
హరారే : జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబేను ఆ దేశ సైన్యం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం సైన్యం చేసిన ఓ ప్రకటనలో దేశాధ్యక్షుడు రాబర్ట్ ముగాబే, ఆయన సతీమణి తమ స్వాధీనంలో ఉన్నారని ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నామని, రాజధాని నగరంలోని వీథుల్లో గస్తీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని పేర్కొంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రసార సాధనాలను కూడా సైన్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి జరిగిన సైనిక చర్యను తిరుగుబాటుగా అందరూ భావిస్తున్నారు. అయితే సైన్యానికి మద్దతిస్తున్నవారు మాత్రం దీనిని రక్తపాతరహిత దిద్దుబాటు చర్యగా అభివర్ణిస్తున్నారు. బుధవారం ఉదయం జింబాబ్వే బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత సైన్యం అధికార ప్రతినిథి ఒకరు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ముగాబే చుట్టూ ఉన్న నేరస్థులను సైన్యం లక్ష్యంగా చేసుకుందని తెలిపారు. శాంతిభద్రతలను పునరుద్ధరిస్తామని హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు. జింబాబ్వేలో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉంది. దేశవాసులు బ్యాంకుల వద్ద పొడవైన వరుసల్లో నిలుచున్నారు. కాస్త సొమ్మునైనా తీసుకుని, చేతిలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దేశ రాజధాని హరారే నగరంలో సైనికులు కీలక ప్రాంతాల్లో గస్తీ తిరుగుతున్నారు. ముగాబే (93), ఆయన సతీమణి ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. అయితే వీరికి భద్రత కల్పించినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి చెప్పారు. ఇది మిలిటరీ టేకోవర్ కాదని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో సామాజిక, ఆర్థిక కష్టాలకు కారణమవుతున్న నేరాలకు పాల్పడుతున్నవారిని లక్ష్యంగా చేసుకున్నామని పేర్కొంది. ఈ నేరగాళ్ళు ముగాబే చుట్టూ ఉన్నారని తెలిపింది. రెచ్చగొడితే తగినరీతిలో బదులిస్తామని చెప్పింది.
nation
15,694
30-09-2017 00:45:38
ముంబై లైఫంతా లోకల్‌ రైలులోనే!
ముంబై, సెప్టెంబరు 29: విశాల నగరమైన ముంబై జనాభా దాదాపు 2.2 కోట్లు కాగా.. రోజూ సగటున 75 లక్షల మంది సబర్బన్‌ రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఎక్కువ మంది నగరానికి దూరంగా తక్కువ అద్దెలకు ఇళ్లు లభించే చోట ఉంటుంటారు. 80 కిలోమీటర్ల దూరం నుంచి రోజూ నగరానికి వచ్చి ఉద్యోగాలు చేసుకునేవారు కోకొల్లలు. కార్లు, ద్విచక్ర వాహనాలు, బస్సుల్లో అంత దూరం ప్రయాణించడం ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా ఎంతో సమయంతో కూడుకున్నది. అందుకే సబర్బన్‌ రైళ్లను ఆశ్రయిస్తారు. ముంబై సబర్బన్‌ రైల్వే రోజూ 2,342 ఎలక్ట్రికల్‌ మల్టిపుల్‌ యూనిట్‌ (ఈఎంయూ) సర్వీసులు నడుపుతుండగా.. ఉదయం 5 గంటల నుంచి 11 గంటల దాకా, మళ్లీ సాయంత్రం ఐదు గంటల నుంచి 9 గంటల దాకా ఇవి కిక్కిరిసి ఉంటాయి. రద్దీగా ఉన్నందున తర్వాతి రైలులో వెళ్దామని ఎవరూ అనుకోరు. ఎందుకంటే ప్రతి రైలులోనూ ఇదే పరిస్థితి.
nation
7,946
20-12-2017 22:54:38
‘హలో’ సినిమాకు టైటిల్ పెట్టిందెవరో తెలుసా!
విక్ర‌మ్ కుమార్ ద‌ర్శక‌త్వంలో అక్కినేని అఖిల్ నటించిన ‘హ‌లో’ మూవీ ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని ఎన్‌కన్విన్షన్ సెంటర్‌‌లో జరిగింది. ఈ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా మెగస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సినిమా టైటిల్ గురించి మాట్లాడారు. "‘హలో’ ఐడియా ఎవరిదో కానీ నిజంగా హ్యాట్సాఫ్.. ఈ రోజుల్లో హలో అనేపదం అందరి నోళ్ళలో నాని పోతోంది. అలాంటి ఈ టైటిల్ ఐడియా అనేది నిజంగా గ్రేట్.. అయినా అక్కినేని కుటుంబానికి 'హలో' తో విడదీయరాని బంధం ఉంది" అని చిరు చెప్పుకొచ్చారు. బహుశా ఈ సినిమాకు హలో అని టైటిల్ పెట్టాలన్న ఆలోచన డైరక్టర్ విక్రమ్‌కు వచ్చిండొచ్చని ఆయన వైపు చేయి చూపించగా కాదు సార్ అని డైరెక్టర్, హీరోయిన్, చిత్ర బృందం మొత్తం నాగ్‌ వైపు వేలు చూపించగా వావ్ నాగ్ అంటూ యువసామ్రాట్‌ను చిరంజీవి అభినందించారు.
entertainment
8,179
31-08-2017 16:37:04
గుండుతో నటనకు రెడీ...!
బాలీవుడ్‌లో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఆ హాట్ లేడీ ఎవరూ ఊహించని విధంగా ప్రయోగాలు చేయడానికి రెడీ అంటోంది. గ్లామర్ హీరోయిన్లు ప్రయోగాలు చేయడానికి అంతగా ఆసక్తి చూపించరు. ప్రయోగాల వల్ల కెరీర్ దెబ్బతింటుందని గ్లామర్ ఇమేజ్ తగ్గిపోతుందని భావిస్తుంటారు చాలామంది ముద్దుగుమ్మలు. కానీ తాను అలాంటి వాటిని అస్సలు లెక్క చేయనని ఓ అప్ కమింగ్ బ్యూటీ అంటోంది. తెలుగులో వచ్చిన 'లోఫర్' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన దిశా పటానీ, ఆ తరువాత ముంబైకు మకాం మార్చి పూర్తిగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. అయితే అమ్మడికి బీ టౌన్‌లో ఆశించినంత తేలికగా అవకాశాలు రావడం లేదు. కుర్ర హీరో టైగర్ ష్రాఫ్ తో ఎఫైర్ ఉందంటూ వార్తల్లో నిలవడం తప్ప ఒక మంచి ఆఫర్ దిశా ఖాతాలో పడిందనే న్యూస్ ఇప్పటివరకు రాలేదనే చెప్పొచ్చు. అయితే ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలను ఫోటో షూట్స్ ద్వారా ఆరబోస్తూ బాలీవుడ్‌లో తనకు కూడా ఫ్యూచర్ ఉందనే ధీమాను కొని తెచ్చుకుంటోంది దిశా. ఇదిలా ఉంటే రీసెంట్‌గా అమ్మడు చేసిన కామెంట్స్ చాలామందిని ఆకర్షిస్తున్నాయి. స్టోరీ నచ్చితే గుండు కొట్టించుకుని నటించడానికి కూడా సిద్ధమని దిశా పటానీ చెప్పడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి హీరోయిన్లు గుండు కొట్టించుకుని నటించడానికి ముందుకురారు. అలాంటిది దిశా పటానీ ఇలా చెప్పడానికి సాహించిందంటే ఆమె ఆల్రెడీ ఇలాంటి పాత్ర చేయడానికి కమిటైందేమో అనే ఊహాగానాలు బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తెలుగులో హీరోయిన్ పూర్ణ ఓ సినిమాలో పాత్ర కోసం గుండు కొట్టించుకోవడం విశేషం. బాలీవుడ్‌లో రాణించాలంటే అలాంటి ప్రయోగాలు తప్పదని భావించిన దిశా అలాంటి ప్రకటన ఇచ్చి ఉంటుందంటున్నారు. మరి దిశకు అలాంటి ఆఫర్ ఇచ్చేది ఎవరో చూద్దాం.
entertainment
10,508
07-05-2017 16:28:29
తిరిగి ఏమివ్వగలను.. ప్రేమ తప్ప: ప్రభాస్
అనుకున్నదే జరిగింది. ఊహలకు కూడా అందని జక్కన్న చిత్రం.. ఊహించినట్టుగానే వెయ్యి కోట్ల మార్కును దాటేసింది. మరికొన్నేళ్ల పాటు ఆ మార్కును, ఆ రికార్డును ఎవ్వరూ దరి చేరలేనంత పెద్ద రికార్డును తన పేరిట లిఖించుకుంది. వెయ్యికోట్ల కలెక్షన్లను సాధించిన తొలి భారతీయ సినిమాగా చరిత్ర పుటలకెక్కింది. ఈ విషయాన్ని ఆర్కా మీడియా అధికారికంగా ప్రకటించింది. ఇక, మన బాహుబలి ప్రభాస్ కూడా ఈ రికార్డ్‌పై స్పందించాడు. ఫేస్‌బుక్ వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ముఖ్యంగా అభిమానులు, రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపాడు.           ‘‘నాపై ఇంతటి ప్రేమాభిమానాలు కురిపించిన అభిమానులందరికీ పేరు..పేరున కృతజ్ఞతలు. దేశంలోనే కాక, ఓవర్సీస్‌లోని అభిమానులు నాపై పెట్టుకున్న అంచనాలను అందుకునేలా చాలా కష్టపడ్డాను. ఇంకా ఎక్కువ ఇచ్చేందుకే ప్రయత్నించాను. బాహుబలితో సుదీర్ఘ ప్రయాణం చేశాను. కానీ, దానిని మరచిపోయేలా చేసింది మీ అభిమానమే. అందుకే మీ అందరికీ నేనేం ఇవ్వగలను. తిరిగి ప్రేమించడం తప్ప. బాహుబలి లాంటి పెద్ద విజన్‌లో నన్ను నమ్మి అందులో భాగం చేసినందుకు రాజమౌళి గారికి కృతజ్ఞతలు. జీవితంలో ఒక్కసారే వచ్చే ఇలాంటి పాత్ర నాకు ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఆయన బాహుబలితో నా మొత్తం ప్రయాణాన్నే చాలా చాలా ప్రత్యేకం చేశారు’’ అంటూ ప్రభాస్ పోస్ట్ పెట్టాడు.
entertainment
21,487
14-07-2017 00:39:14
ఎంతో ఎదురు చూసిన సమయం !
న్యూయార్క్‌ : న్యూయార్క్‌లోని ఓ రద్దీ స్ర్టీట్‌ అది..రివ్వున వీస్తున్న చలిగాలి..నల్లటి టీషర్ట్‌, కొంచెం పైకి మడిచిన జీన్స్‌.. చేతిలో గొడుగు..పక్కన ప్రేయసి అనుష్కతో టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ నడుచుకుంటూ వెళుతున్నాడు. వర్షం వస్తే..‘శ్రీ 420’ సినిమాలో రాజ్‌కపూర్‌..నర్గీస్‌తో పాడిన ‘ప్యార్‌హువా ఇక్‌రార్‌ హువా’ అన్న పాటను పాడుకోవడానికేమో.. విరాట్‌ చేతిలో ఆ గొడుగు. అవును..సోషల్‌ మీడియాలో హల్‌చేస్తున్న ఈ ఫొటోను చూస్తే అచ్చు అలానే అనిపిస్తోంది. వెస్టిండీస్‌ పర్యటన ముగిసిన వెంటనే విరాట్‌ అమెరికాలో వాలిపోయాడు. ఐఫా అవార్డుల ప్రోగ్రాం కోసం న్యూయార్క్‌ వచ్చిన అనుష్కను అక్కడ కోహ్లీ కలుసుకున్నాడు. ఇంకేం.. దొరికిన కొద్దిపాటి సమయాన్ని ఇద్దరూ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇక తామిద్దరం కారులో ఉన్న ఓ చిత్రాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన కోహ్లీ..‘ప్రేయసి కోసం..ఎంతో ఎదురుచూసిన సమయం’ అని ఓ కామెంట్‌ దానికి జత చేశాడు.
sports
20,382
06-02-2017 01:20:41
భారత్ భారీ గెలుపు
అంధుల టీ20 వరల్డ్‌కప్‌ కొచ్చి: అంధుల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్.. 128 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత 20 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 272 పరుగులు చేసింది. సునీల్‌ (163 నాటౌట్‌) శతకం నమోదు చేయగా.. ఫర్హాన్‌ (53) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 273 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన ఆసే్ట్రలియా 18.3 ఓవర్లలో 144 రన్స్‌కే కుప్పకూలింది. ఆరుగురు ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ రనౌట్‌ కావడం విశేషం.
sports
2,330
12-01-2017 00:15:32
రూ.200 కోట్లతో ప్లాస్టిక్‌ పార్క్‌
మంఖాల్‌లో 150 ఎకరాల్లో ఏర్పాటు.. సిద్ధమైన మాస్టర్‌ ప్లాన్‌హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మంఖాల్‌ మండల పరిధిలో 150 ఎకరాల్లో ప్లాస్టిక్‌ పార్క్‌ ఏర్పాటు కానుంది. మంఖాల్‌-తుమ్మలూర్‌ మధ్యన ప్లాస్టిక్‌ పార్క్‌ కోసం సుమారు 175 ఎకరాల స్థలాన్ని గుర్తించిన ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు 150 ఎకరాలను సేకరించి అభివృద్ధి కోసం తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టిఎ్‌సఐఐసి)కి అప్పగించింది. రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే ప్లాస్టిక్‌ పార్క్‌ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. మరోవైపు ప్లాస్టిక్‌ పార్క్‌ నిర్మాణం కోసం అధికారులు మాస్టర్‌ ప్లానను సిద్ధం చేశారు. ఈ పార్క్‌ ద్వారా అదనంగా 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాల్లోని కాటేదాన, జీడిమెట్ల, చర్లపల్లి, పటానచెరు తదితర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలున్నాయి. అంతేకాకుండా రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా ప్లాస్టిక్‌ ఉత్పత్తుల సంస్థలు పనిచేస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో సుమారు 10వేలకు పైగా ప్లాస్టిక్‌ ఉత్పత్తుల యూనిట్లు పనిచేస్తున్నట్టు అంచనా. హైదరాబాద్‌ సమీపంలోని సంస్థల్లో ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్‌ ప్లేట్లు లండన్‌కు ఎగుమతి అవుతుండటం విశేషం. సుమారు రూ.200 కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో ప్లాస్టిక్‌ పార్క్‌ను అభివృద్ధి చేస్తే రూ. 500 కోట్ల నుంచి రూ.1000 కోట్ల పెట్టుబడులతో యూనిట్లను ఏర్పాటు చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఛిూఠబళ
business
4,415
17-01-2017 01:21:57
కొత్త బడ్జెట్‌ ఎలా వుండాలి?
చిన్న పట్టణాలలో మౌలిక సదుపాయాల అభివృద్దికి మరింత మదుపు; స్వయం ఉపాధి పొందుతున్నవారికి ఆదాయ పన్నులో మరింత మినహాయింపు; ప్రభుత్వరంగ సంస్థలన్నిటిలో పెట్టుబడుల ఉపసంహరణ వంటి చర్యలను ఈ ఏడాది బడ్జెట్‌లో చేపట్టాలి ప్ర‌భుత్వ వ్యయాల నాణ్యతను మెరుగుపరచడం ఎలా? కొత్త సంవత్సరంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీకి మొదటి సవాల్‌ ఇది. ప్రస్తుత డిమోనెటైజేషన్‌ వల్ల మరిన్ని ఆర్థిక లావాదేవీలు పన్ను పరిధిలోకి వస్తాయి. దీనివల్ల ప్రజల చేతుల్లో ఉండే డబ్బు తగ్గి ప్రభుత్వ బొక్కసంలోకి చేరే డబ్బు అధికమవుతుంది. రూ.10,000 నెలసరి ఆదాయంగల వ్యక్తి గతంలో నూ.2000పన్నులు చెల్లిస్తే ఇప్పుడు రూ.2500 పన్నులు చెల్లించవలసివస్తుంది. అంటే అతని ఆదాయంలో రూ.500 తగ్గిపోతుంది. సరే, తన బొక్కసానికి చేరిన డబ్బులను ప్రభుత్వం రెండు విధాలుగా ఉపయోగిస్తుంది. ఒకటి– రైల్వేలు, హైవేలు మొదలైన మౌలిక సదుపాయాల రంగంలో ప్రభుత్వ మదుపులను పెంచడం; రెండు–ప్రభుత్వ సిబ్బందికి అధిక వేతన భత్యాలను ఇవ్వడం, లేదా రఫాలే ఫైటర్‌ జెట్ విమానాల కొనుగోలు ఇత్యాది వినియోగాలని పెంపొందించడం. ఏడవ వేతన సంఘం సిఫారసుల అమలు ఫలితంగా ప్రభుత్వోద్యోగుల వినియోగం అధికమవుతుంది. రఫాలే యుద్ధ విమానాల కొనుగోలువల్ల వాటి విడిభాగాలకు డిమాండ్‌ పెరుగుతుంది. ఆ విడి భాగా లు మన దేశంలో కాక ఫ్రాన్స్‌లోనే ఉత్పత్తవుతాయన్నది గమనార్హం. దీని దృష్ట్యా అదనపు ఆదాయాన్ని యుద్ధవిమానాలు కొనుగోలుకు గాక రోడ్ల అభివృద్ది, మురుగునీటి సదుపాయాల మెరుగుదల, విద్యుత్‌ సరఫరా, గ్రామాలు, చిన్న పట్టణాలలో నెట్‌ కనెక్టివిటీని పెంపొందించడానికి వినియోగించడానికి ఆర్థిక మంత్రి అధిక ప్రాధాన్యమివ్వాలి. ప్రజలు మరింతగా ఆర్జించడానికీ, అధిక పన్నుల భారం ప్రభావాన్ని తటస్థీకరించడానికి గాను ఇటువంటి మదుపులు తోడ్పడుతాయి. భర్త ఆదాయం నుంచి భార్య రూ.1000 తీసుకుంటే భర్తకు తక్కువ డబ్బు అందుబాటులో ఉంటుంది. అయితే భార్య తాను తీసుకున్న సొమ్మును మోటార్‌ సైకిల్‌ కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తే అతని ఆనందానికి అవధులుండవు. ఎందుకంటే ఆ మోటార్‌ సైకిల్‌ను ఆఫీసుకు వెళ్ళిరావడానికి ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా ఆర్థిక మంత్రి అదనపు పన్ను రాబడిని మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగిస్తే సామాన్యులు లబ్ధి పొందుతారు. చిన్న పరిశ్రమలు చాల వరకు తమ లావాదేవీలు నగదు రూపేణా చేస్తాయి. ఈ లావాదేవీలు సైతం ఇప్పుడు పన్ను పరిధిలోకి వస్తాయి. చిన్న పరిశ్రమల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఆదాయపు పన్నులో అదనంగా రూ.2.5 లక్షల మేరకు మినహాయింపునివ్వాలి. ఎక్సైజ్‌ సుంకం (లేదా దాని స్థానంలో రానున్న జిఎస్‌టి) నుంచి మినహాయింపును కూడా పెంచాలి. చిన్న వ్యాపార సంస్థల ఖాతాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను సడలించాలి. దీనివల్ల చిన్న వ్యాపార సంస్థలు నగదు రహిత ఆర్థిక వ్యవస్థలో మనుగడ సాగించడం సాధ్యమవుతుంది. క్రూడాయిల్‌ ధర పెరుగుదల భారత్‌ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవడానికి దారి తీస్తుంది. దీని వల్ల మన ఆర్థికాభివృద్ధి మందగిస్తుంది. ఇందుకు మార్గాంతరం ఇంధన వినియోగ సాంద్రత తక్కువగా ఉండే ఉత్పత్తి పద్ధతులు, జీవన శైలిని అనుసరించడమే. చమురు వినియోగం తగ్గిపోయేందుకు క్రూడాయిల్‌పై దిగుమతి సుంకాన్ని ఇతోధికంగా పెంచాలి. ఇది, తక్షణమే ప్రజల రాబడి తగ్గుదలకు దారి తీస్తుంది. ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ఈ ధనాన్ని సేవల రంగాన్ని ప్రోత్సహించడానికి పునర్‌ ఉపయోగించవచ్చు. సేవల రంగం తక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటుంది. తయారీరంగం అభివృద్ధి విషయంలో మనం తొందరపడనవసరం లేదు. ఎందుకంటే ఈ రంగం, సేవలరంగంతో పోల్చితే పది రెట్లు అధికంగా ఇంధనాన్ని ఉపయోగించుకొంటుంది. గత పాతికేళ్ళుగా భారత ఆర్థిక వ్యవస్థ విదేశీ మదుపులతో అభివృద్ధిచెందుతోంది. అయితే ప్రపంచీకరణ పురోగతి ఇప్పుడు గణనీయంగా తగ్గిపోయింది. అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రపంచీకరణ పద్ధతులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కనుక మనం ద్వంద్వ పన్నుల తొలగింపు ఒప్పందాలు అన్నిటినీ రద్దు చేయాలి లేదా మార్చి వేయాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులలో నిరర్థక ఆస్తులు దేశ ఆర్థిక వ్యవస్థకు పెరుగుదలకు గుదిబండగా వున్నాయి. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు మొదటి ఎన్డీఏ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని ఎన్డీఏ రెండో ప్రభుత్వం కూడా ఔదలదాల్చాలి. ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ సంస్థల పునరుద్ధరణ సంకల్పాన్ని విడనాడాలి. 2017–18 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ఈ క్రింద సూచించిన ఐదు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను: 1) చిన్న పట్టణాలలో మౌలిక సదుపాయాల అభివృద్దికి మరింతగా మదుపుచేయడం; 2) స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు ఆదాయ పన్నును మరింతగా మినహాయింపు ఇవ్వడం; 3) పెట్రోలియం ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచి సేవాపన్నురేట్లను తగ్గించడం; 4) విదేశాలకు పంపించే డబ్బు పై పరిమితులను తగ్గించడం; 5) బ్యాంకులతోసహా ప్రభుత్వరంగ సంస్థలన్నిటిలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ.(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్డ్ ప్రొఫెసర్‌)
editorial
7,338
10-11-2017 20:53:17
సినిమా టైటిల్‌తోనే చియాన్ విక్రమ్ కొడుకు సంచలనం
తెలుగులో ‘అర్జున్‌రెడ్డి’ సినిమాని సొంత సినిమాలాగా దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ఒకవైపు వర్మ, మరోవైపు వి. హనుమంతరావులు కలిసి అర్జున్‌రెడ్డికి భారీ విజయాన్ని అందించారు. సినిమాలో కూడా కంటెంట్ ఉండటంతో ‘అర్జున్‌రెడ్డి’ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. తాజాగా ఈ సినిమాని చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్‌తో తమిళ్‌లో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంతోనే ధృవ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. అయితే తెలుగులో ‘అర్జున్‌రెడ్డి’గా వచ్చిన ఈ చిత్రానికి తమిళ్‌లో ఆసక్తికరమైన పేరు పెట్టి ఇప్పటి నుండే వార్తల్లో ఉండేలా చేశారు. ‘వర్మ’ అనే టైటిల్‌ని ఈ చిత్రానికి కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే ఆ వుడ్, ఈ వుడ్ అనే భేదం లేకుండా రామ్ గోపాల్ వర్మ సంచలనం అవుతున్నారు. మరి ఈ టైటిల్‌తో ఈజీగా ధృవ్ పాపులర్ అయిపోతాడంటూ.. ఈ టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత సెలబ్రిటీల నుండి వస్తున్న ఫీడ్ బ్యాక్. ‘అర్జున్‌రెడ్డి’కి తెలుగులో సందీప్ వంగా దర్శకత్వం వహించగా.. ‘వర్మ’ పేరుతో వస్తున్న ఈ చిత్రానికి బాల దర్శకత్వం వహిస్తున్నారు.
entertainment
500
17-07-2017 02:16:29
పార్లమెంటు సమావేశాలు కీలకం
‘‘ప్రస్తుతానికి మార్కెట్‌ను ప్రభావితం చేసే గణాంకాలేవీ లేవు. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, కార్పొరేట్‌ కంపెనీలు ప్రకటించే క్యు1 ఫలితాల పైనే ఈ వారంలో ఇన్వెస్టర్లు దృష్టి కేంద్రీకరించే ఆస్కారం ఉంది’’.సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారం భం కానున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక తేదీ కూడా ఇదే. వివిధ దేశీయ, విదేశాంగ విధానాల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు అస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్న తరుణంలో ప్రభుత్వం వారిని దీటుగా ఎదుర్కొనే వ్యూహాలు రచించుకుంటోంది. బెంగాల్‌ దాడులు, జమ్ము-కాశ్మీర్‌లో దాడులు, చైనా-భారత సరిహద్దు ఉద్రిక్తతలు, జిఎ్‌సటి ప్రభావం వంటి అంశాలు పార్లమెంటులో ప్రముఖంగా ప్రస్తావనకు రావచ్చు.ఈ వారం ఫలితాలు ప్రకటించనున్న కంపెనీలివే...రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌, ఎసిసి, జుబిలెంట్‌ ఫుడ్స్‌ (సోమవారం), క్రిసిల్‌, అల్ర్టాటెక్‌ సిమెంట్‌ (మంగళవారం), విప్రో, బజాజ్‌ ఆటో, కోటక్‌ మహీంద్రా బ్యాంకు, ఆర్‌బిఎల్‌ బ్యాంకు (గురువారం), అశోక్‌ లేలాండ్‌ (శుక్రవారం). రుతుపవనాల పురోగతి మార్కెట్లకు ఆనందదాయకమైన అంశం. వాతావరణ శాఖ వారాంతపు నివేదిక ప్రకారం 12వ తేదీ వరకు రుతుపవనాల వర్షపాతం దీర్ఘకాలిక సగటు కన్నా ఒక శాతం అధికంగా ఉంది.విదేశీ అంశాలకు వస్తే చైనా ద్వితీయ త్రైమాసిక జిడిపి, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, యూరోజోన్‌ వినియోగదారుల ధరల సూచి గణాంకాలు ఈ వారంలో విడుదల కానున్నాయి. యూరోజోన్‌ వడ్డీ రేట్లు నిర్ణయించేందుకు ఆరుగురు సభ్యుల యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు (ఇసిబి) కార్యనిర్వాహక బోర్డు, 16 మంది గవర్నర్ల బోర్డు సమావేశాలు గురువారం జరుగనున్నాయి. టెక్నికల్స్‌ ఇవే...నిఫ్టీ తొలిసారిగా 9900 స్థాయిని దాటింది. ఫలితంగా వారం చివరిలో కొంత లాభాల స్వీకారం జరిగింది. ఇండెక్స్‌ మరోసారి ఓవర్‌బాట్‌ స్థితికి చేరినందువల్ల గరిష్ఠ స్థాయిల్లో అప్రమత్తంగా ఉండాలి. స్థూలంగా వాతావరణం పటిష్ఠంగానే ఉన్నందు వల్ల ఈ బ్రేకౌట్‌లో 9970 వరకు వెళ్ళే ఆస్కారం ఉంది. 9820 వద్ద గట్టి మద్దతు ఉంది. బ్యాంక్‌ నిఫ్టీ ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి 23964 వద్ద దోబూచులాడుతోంది. ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్‌ రెండూ పటిష్ఠంగానే ఉన్నందు వల్ల ఈ ఇండెక్స్‌ కూడా ర్యాలీని మరింత ముందుకే కొనసాగించవచ్చు. 23,700 వద్ద మద్దతు ఉంది.ఈ వారంలో నిఫ్టీకి 10000, బ్యాంక్‌ నిఫ్టీకి 24000 తదుపరి టార్గెట్లుగా ఉంటాయి. ఈ స్థాయిలను ఇండెక్స్‌ దాటినట్టయితే మాత్రం షార్ట్‌ కవరింగ్‌ ఏర్పడవచ్చు. నిఫ్టీకి 9900 సిఇ, 9600 పిఇ వద్ద గరిష్ఠంగా ఓపెన్‌ ఇంటరెస్ట్‌ ఏర్పడుతోంది.
business
11,785
03-11-2017 10:53:43
లెఫ్టినెంట్‌ కల్నల్‌ భార్యతో రాసలీలలు.. దొరికిపోయిన కల్నల్‌
భటిండా: కామాంధుడైన ఓ కల్నల్‌ తన సబార్డినేట్‌ భార్యతో రాసలీలలు కొనసాగిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. పంజాబ్‌లోని భటిండాలో చోటుచేసుకున్న ఈ ఘటన సైన్యంలో చర్చనీయాంశమైంది. అక్టోబరు 26న లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఇంట్లో ఆయన భార్యతో ఉన్న కల్నల్‌ను మిలటరీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ వైద్య పరీక్షల నిమిత్తం భటిండాలోని సైనిక ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఇచ్చిన సమాచారంతోనే ఆయన ఇంట్లో సోదాలు చేసి వారిద్దరినీ అదుపులోకి తీసుకోవడం గమనార్హం.
nation
3,412
30-06-2017 01:54:16
క్షేత్ర వాస్తవికత
పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో దళితుల సాంఘిక బహిష్కరణకు కారకులైన ముగ్గురిని గురువారం పోలీసులు అరెస్టుచేశారు. అంబేడ్కర్‌ విగ్రహం విషయంలో గ్రామంలోని దళితులకూ, అగ్రకులస్థులకు మధ్య రేగిన వివాదం ఇది. రెండునెలలుగా రగులుతున్న వివాదంలో చర్యకు ఉపక్రమించడానికి ప్రభుత్వానికి ఇంతకాలం పట్టడం ఆశ్చర్యం కలిగించే విషయం. రెండేళ్ళక్రితం కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి గ్రామంలో రేగిన ఘర్షణ ఇప్పటికీ చల్లారకుండా నివురుగప్పిన నిప్పులా రగులుతూండటానికి కూడా బాధితులు కోరుతున్నట్టుగా ప్రభుత్వాలు న్యాయం చేయలేకపోవడమే కారణం. కులం, బలం, ఆధిపత్యం, అధికారం అన్నీ కలగలసిన వివక్ష బుసలుకొడుతుంటే రాజ్యం, రాజ్యాంగం నిష్క్రియా పరత్వానికి లోను కావడం బాధకలిగించే విషయం. రాష్ట్రపతి ఎన్నికలో దళిత అభ్యర్థులను అధికార విపక్షాలు పోటాపోటీగా నిలబెట్టిన దృశ్యానికీ, క్షేత్రస్థాయిలో దళితులు ఎదుర్కొంటున్న దుస్థితికీ ఎంతో వైరుధ్యం ఉన్న వాస్తవాన్ని ఈ సంఘటనలు తేల్చిచెబుతున్నాయి. తెలంగాణలో ఇటీవలే కులాంతర ప్రేమలు, వివాహాలకు ఆగ్రహించి దళితయువకులను హత్యచేసిన సంఘటనలు అనేకం జరిగాయి. ఇటువంటి సంఘటనల్లో క్షేత్రస్థాయిలో ఉన్న వివక్ష, ప్రభుత్వాలనుంచి కనబడుతున్న అపరిమిత ఉదాసీనత ప్రజాస్వామిక వాదులను తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. అంబేడ్కర్‌ను మేధావిగా, నాయకుడిగా, రాజ్యాంగకర్తగా పార్టీలు అభివర్ణిస్తాయి, నాయకులు కీర్తిస్తారు. కానీ, క్షేత్రస్థాయిలో ఆయన కేవలం దళితుల నాయకుడే. గరగపర్రు చెరువుగట్టున మిగతా విగ్రహాలతో పాటు అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని అక్కడి అగ్రకులాలు సహించలేకపోయాయి. చెరువుగట్టున పెట్టిన విగ్రహం రాత్రికి రాత్రి మాయం కావడం, దళితులు ధర్నాలు చేసిన తరువాత అది దొరకడం, చివరకు సబ్‌ కలెక్టర్‌ కూడా దానిని దళితులు కోరుతున్నట్టుగా చెరువుగట్టుమీద ఏర్పాటు చేయించలేక, పంచాయితీ కార్యాలయం ముందు నిలబెట్టడం వంటి పరిణామాలు దళితులకు ఆగ్రహాన్ని, అవమానాన్ని కలిగించడం సహజం. ఈ చర్య వారి ఉనికి, ఆత్మగౌరవాలతో ముడిపడిన అంశం. రాజ్యాంగకర్త విగ్రహానికే ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు రాజ్యాగ స్ఫూర్తి గురించి మాట్లాడటంలో అర్థం ఏముంటుంది? అంబేడ్కర్‌కు అవమానం జరిగిన ఈ సందర్భంలో రాజ్యాంగ యంత్రాంగం ఎవరిపక్షాన ఉండాలి? పై రెండు ఘటనల్లోనూ ప్రభుత్వాలు అంతిమంగా కొన్ని చర్యలు తీసుకొనివుండవచ్చును. కానీ, ఇందుకు దళితసమాజం ఎంతగానో పోరాడవలసి వస్తున్న మాట వాస్తవం. నెలల తరబడి వెలివేతను ఎదుర్కొంటూ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం కడుపుకాల్చుకుంటూ పోరాటాలు చేయవలసిన అవసరమూ, అగత్యమూ వారికి ఎందుకు కలిగింది? ఇటువంటి ఘటనల్లో బాధితుల దుస్థితి అనేక రోజుల తరువాత కానీ బయటిప్రపంచానికి తెలియకుండా దాగుతున్నది. సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చి, అనంతరం ప్రధాన మాధ్యమాల ద్వారా బయటప్రపంచానికి బాగా పొక్కితే తప్ప ప్రభుత్వాలు కదలడం లేదు. ఈ విధంగా ఒత్తిడి తీవ్రంగా హెచ్చిన తరువాతే ప్రభుత్వ యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించగలుగుతున్నది తప్ప తనకు తానుగా ధైర్యం చేసి కదలలేకపోతున్నది. ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యహరించడానికి బలమైన కులవ్యవస్థ అడ్డుపడుతున్నది. గ్రామాల్లోని వివక్షలు, వెలివేతలు, హత్యాకాండలకు సంబంధించిన విషయాల్లో సమస్త వ్యవస్థలూ తమను వెలివేస్తున్నాయన్న భావన దళితుల్లో బలంగా ఉన్నది. ఇది ప్రమాదకరమైన పరిణామం. ఘటనలు జరగ్గానే దళిత సంఘాలు నిరసనలు, ఉద్యమాలు చేయడం, ఎవరూ పట్టించుకోని కారణంగా అనంతరకాలంలో విపక్షాలను ఆశ్రయించవలసి రావడమో, లేదా రాజకీయపక్షాలే తమ ప్రయోజనాల కోసం వీటిని స్వీకరించడమో జరుగుతున్నది. అయితే, ఈ పరిణామాలన్నీ ఆయా ఘటనలకే పరిమితమై, తాత్కాలిక ప్రభావాన్ని మాత్రమే మిగల్చుతున్నాయి. అంతిమంగా నిచ్చెనమెట్ల కులవ్యవస్థ బలమైనది కనుక దళితులపై బీసీ కులాల నుంచి అగ్రకులాల వరకూ దాడులు సాగిస్తూనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు ఏం జరుగుతున్నదో ప్రభుత్వాలు తెలుసుకోలేకపోతే అనంతరకాలంలో పరిణామాలు తీవ్రదశకు చేరిపోతాయి. ప్రభుత్వాలు ఈ దిశగా తమ యంత్రాంగాన్ని పటిష్ఠపరచుకోవడం, సమస్య ఉత్పన్నం కాగానే రాజ్యాంగబద్ధంగా పరిష్కారానికి కృషిచేయడం అవసరం. వ్యవస్థను ప్రక్షాళించి సమూలమైన మార్పు ఎలా సాధ్యమో ఆలోచించడం అవసరం.
editorial
7,649
30-08-2017 22:26:15
త్వరలోనే గుమ్మడికాయ కొట్టబోతున్న మహేశ్
'స్పైడర్'కు త్వరలోనే గుమ్మడికాయ కొట్టేయబోతున్నాడు మహేశ్ బాబు. ప్రస్తుతం ఈ చిత్రం చివరి పాట చిత్రీకరణ యూరప్‌లో జరుగుతోంది. మహేశ్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రం 'స్పైడర్' ఈ చిత్రంతో మహేశ్ మొదటిసారి తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఒక్క పాట మినహా పూర్తియింది. ఈ పాటను రోమేనియాలో చిత్రీకరిస్తున్నారు. మహేశ్ - రకుల్‌పై డాన్స్ మాస్టర్ శోభి ఆధ్వర్యంలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ రొమాంటిక్ డ్యూయెట్ ఆన్ లొకేషన్ పిక్స్ ఇప్పుడు నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. 'స్పైడర్' చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ఠాగూర్ మధు, ఎన్.వి. ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ స్పై థ్రిల్లర్‌లో ఎస్.జె. సూర్య, భరత్ ప్రతినాయకులుగా కనిపించనున్నారు. హేరిస్ జైరాజ్ సంగీతాన్నందిస్తోన్న 'స్పైడర్' 'బూమ్ బూమ్' సాంగ్ రిలీజై మంచి రెస్పాన్స్ సాధించింది. త్వరలో మరో హై ఎనర్జిటిక్ సాంగ్ 'పుచ్చకాయ' విడుదల కాబోతుంది. దసరా కానుకగా సెప్టెంబర్ 27న 'స్పైడర్' విడుదల కానుంది. మరి 'శ్రీమంతుడు' తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ఎదురుచూస్తోన్న మహేశ్‌కు 'స్పైడర్' ఆ విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
entertainment
8,303
19-06-2017 19:47:35
ఆ హీరోలకు గాలం వేస్తున్న లావణ్య త్రిపాఠి
ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలని భావించే హీరోయిన్లు.. హీరోలతో ప్రెండ్లీ రిలేషన్ మేంటేన్ చేయడానికి అసక్తి చూపిస్తుంటారు. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి సైతం తనతో కలిసి నటించిన హీరోలతో ఎక్కువగా టచ్‌లో ఉంటుంది. అయితే తాజాగా ఇద్దరు హీరోలతో కొత్త సినిమా ట్రీజర్‌లకు క్యూ కాంప్లిమెంట్స్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మను చూసి అమ్మడి తెలివితేటలు అదుర్స్ అనిపించేలా ఉన్నాయని చెవులు కొరుక్కుంటున్నాయి సినీ వర్గాలు. రీసెంట్‌గా మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఫిదా మూవీ ట్రీజర్‌పై స్పందించింది లావణ్య. ఈ ట్రీజర్ కు సూపర్ క్యూట్ -1 అంటూ కితాబిచ్చింది. మిస్టర్ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించిన లావణ్య ఫ్యూచర్ లోనూ అతడితో నటించే చాన్స్ కోసం ఎదురు చూస్తుందంటున్నారు. ఫిదా టీజర్‌తో పాటు నాని నటించిన ‘నిన్ను కోరి’ ట్రైలర్‌పై పాజిటివ్‌గా రియాక్ట్ అయిందట ఈ హీరోయిన్. నిన్ను కోరి ట్రైలర్ బ్యూటీఫుల్ అంటూ కామెంట్స్ చేసి నాని అండ్ టీమ్‌ని ఆకర్షించే ప్రయత్నం చేసింది లావణ్య. ఇలా తను నటించిన ఇద్దరు హీరోల సినిమాలకు సంబంధించిన ట్రీజర్, ట్రైలర్‌పై పాజిటివ్‌గా కామెంట్స్ చేసిన లావణ్య త్రిపాఠి.. హీరోలతో ఫ్రెండ్లీగా ఉంటేనే నాలుగు అవకాశాలు వస్తాయనే ఫార్ములాను క్యాచ్ చేసినట్లు కన్పిస్తోందంటున్నారు. మరి ఈ ఇద్దరు హీరోల్లో ఎవరు ముందుగా మళ్లీ లావణ్యకు చాన్స్ ఇచ్చి ఆమెను ఎంకరేజ్ చేస్తారో చూద్దా..
entertainment
16,782
03-01-2017 02:32:54
సైకిల్‌.. రెండు ముక్కలు
న్యూఢిల్లీ, లఖ్‌నవూ, జనవరి 2(ఆంధ్రజ్యోతి): సమాజ్‌వాదీ పార్టీ నిట్టనిలువునా చీలిపోయింది. పార్టీకి అధ్యక్షుడిని తానేనని అఖిలేశ్‌ యాదవ్‌ ప్రకటించుకుంటే.. పార్టీగుర్తు సైకిల్‌ తనదేనని ములా యం సింగ్‌ యాదవ్‌ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. అఖిలేశ్‌ వర్గం మంగళవారం ఈసీని ఆశ్రయించనుంది. తండ్రీకొడుకులిద్దరూ శత్రువర్గాలుగా మారి పోరాటబాట పట్టారు. శివపాల్‌ యాద వ్‌, అమర్‌సింగ్‌ తదితరులు ములాయంకు మద్దతుగా నిలిస్తే రాంగోపాల్‌యాదవ్‌, కిరణ్మయినందా తదితరులు అఖిలేశ్‌ వెంట నడుస్తున్నారు. పార్టీ గుర్తుపై పోరాటానికి ములాయం సోమవారం ఉదయాన్నే ఢిల్లీ చేరుకుంటే, లండన్‌ నుంచి అమర్‌సింగ్‌, లఖ్‌నవూ నుంచి శివపాల్‌ యాదవ్‌ హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. సమాజ్‌వాదీ గుర్తు అయిన ‘సైకిల్‌’ తమదేనని ములాయం స్పష్టం చేశారు. అమర్‌సింగ్‌, జయప్రద, శివపాల్‌ యాదవ్‌ వెంటరాగా సోమవారం సాయంత్రం ఆయన ఈసీ కార్యాలయానికి వెళ్లారు. పార్టీ తనదేనని, నేతలు, ప్రజలు తమవైపే ఉన్నారని, అఖిలేశ్‌ నేతృత్వంలో ఆదివారం జరిగిన జాతీ య కార్యవర్గ సమావేశం నిర్ణయాలు చెల్లవని ఈసీకి అందజేసిన మెమోరాండంలో ములాయం స్పష్టం చేశారు. సమాజ్‌వాదీ పార్టీకి తానే జాతీయ అధ్యక్షుడినని, తనను తొలగించిన ట్లు కమిషన్‌ను ఆశ్రయించే వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకూడదని విన్నవించారు. అనంతరం విలేకరులతో మాట్లాడా రు. ‘‘తప్పు చేశానని నన్ను ఎవరూ వేలెత్తి చూపలేరు. నేను ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదు. ఎవరికీ ద్రోహమూ చేయలే దు. సైకిల్‌ గుర్తు నాదే. అది మా పార్టీ గుర్తు మాత్రమే కా దు. అది నా దస్కత కూడా’’ అని ములాయం తేల్చి చెప్పారు. కాగా, ఈసీని ఆశ్రయించే ముందు న్యాయకోవిదులతో అమర్‌సింగ్‌, శివపాల్‌ చర్చించారు. అఖిలేశ్‌ వర్గం కంటే ముందే ఈసీని ఆశ్రయించడం మంచిదని లాయర్లు అనడంతో సాయం త్రం 4.30 గంటలకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ డాక్టర్‌ నసీం జైదీని కలిశారు. అఖిలేశ్‌ వర్గానికి చెందిన పార్టీ నాయకులు ఈసీని మంగళవారం ఆశ్రయించనున్నారు. పార్టీ కార్యవర్గ సదస్సును ములాయం వాయిదా వేశారు.
nation
7,368
09-04-2017 15:21:21
మహేశ్ స్క్రిప్ట్‌లో చిరంజీవి!
మెగాస్టార్ చిరంజీవి- డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి మెగాస్టార్‌తో 'జనగణమన' పాడిస్తానంటున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడు పూరి జగన్నాథ్‌కు మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. ఇప్పటికే ఈ ఫ్యామిలీలోని పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో రెండు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో రెండు.. రామ్ చరణ్‌తో ఒకటి, వరుణ్ తేజ్‌తో ఒకటి చొప్పున.. దర్శకుడిగా సినిమాలు చేశాడు పూరి జగన్నాథ్. అయితే.. మెగా ఫ్యామిలీకి ఆధ్యుడైన చిరంజీవితో మాత్రం ఇప్పటివరకూ పూరికి సినిమా చేసే చాన్స్ రాలేదు. అయితే.. మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీకి మొదట పూరి జగన్నాథే ఆప్షన్ అనుకున్నారు. అందుకోసం చిరుకి 'ఆటోజానీ' స్క్రిప్ట్‌ను చెప్పాడు పూరి. కానీ, ఆ స్క్రిప్ట్ సెకండాఫ్ నచ్చలేదని చిరంజీవి ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశాడు.           ఇక ఆ తర్వాత మెగాస్టార్ తన 150వ చిత్రంగా 'ఖైదీ నంబర్ 150' చేయడం.. పూరి కూడా మిగతా కథానాయకులతో తన ప్రాజెక్ట్స్‌ను కంటిన్యూ చేయడం జరిగింది. చిరంజీవికి 'ఆటోజానీ' స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్టే.. మహేశ్ బాబు కోసం 'జనగణమన' సబ్జెక్ట్‌ను సిద్ధం చేశాడు పూరి జగన్నాథ్. అయితే.. మహేశ్ బాబు కాల్ షీట్స్ ఇప్పట్లో అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు 'జనగణమన' సబ్జెక్ట్‌నే ఇటీవల చిరంజీవికి చెప్పాడట ఈ డాషింగ్ డైరెక్టర్. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, దేశభక్తి ఎలిమెంట్స్‌ను పర్ఫెక్ట్‌గా మిక్స్ చేసి సిద్ధం చేసిన పూరి 'జనగణమన' స్క్రిప్ట్.. మెగాస్టార్‌ను బాగా మెప్పించిందట. దీంతో.. ఈ సబ్జెక్ట్‌కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట చిరు. మరి చిరంజీవి-పూరి ప్రాజెక్ట్ ఈసారైనా పట్టాలెక్కుతుందేమో చూడాలి.
entertainment
6,714
26-07-2017 12:06:36
స్టార్ హీరో వీడియో వైరల్.. కారణం ఆయన కూతురే..!
ముంబై: మన హీరోలు నిత్యం బిజీ షెడ్యూల్‌తో సతమతమవుతుంటారు. అసలు కుటుంబంతో కలిసి తిరగడానికి కూడా ఖాళీ లేక బాధపడుతుంటారు. ఎప్పుడైనా ఖాళీ దొరికితే కుటుంబంతో గడపాలనుకుంటారు. ఓ టాప్ హీరో దొరికిన ఖాళీ సమయాన్ని తన కూతురి కోసం కేటాయించాడు. తన గారాలపట్టి ఆడుకుంటుంటే చూస్తూ మురిసిపోయిన సదరు హీరో ఊహించని ఘటనతో షాక్ అయ్యాడు.       బాలీవుడ్‌లో టాప్ హీరోలలో ఒకడిగా వెలుగొందుతున్నాడు అక్షయ్ కుమార్. అందరిలాగే అతడికి కూడా తన పిల్లలంటే ఇష్టం. అయితే కొడుకు విదేశాలలో చదువుతుండడంతో, ఖాళీ దొరికినప్పుడల్లా కూతురితో గడుపుతుంటాడు. అందునా ఆయన భార్య కూడా విదేశీ పర్యటనకు వెళ్లడంతో.. కూతురిని స్వయంగా అతడే చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే నిటారాను ఉయ్యాల ఎక్కించాడు.. ఆమె ఊగుతుండగా ఎదురుగా నిల్చుని చూస్తూ మురిసిపోతున్నాడు. ఇంతలో ఆమె కాళ్లు అక్షయ్ ముఖానికి తగిలడంతో వెనక్కి పడబోయాడు. దీనికి సంబంధించిన వీడియోను అక్షయ్ ట్విట్టర్‌లో పెట్టాడు. ‘‘డాడీతో డే బెడిసికొట్టింది’’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. వీడియో కోసం క్లిక్ చేయండి
entertainment
4,647
08-03-2017 09:49:47
మా ఇద్దరి కాంబినేషన్‌లో త్వరలో సినిమా: ‘శతమానంభవతి’ డైరెక్టర్‌
కాకినాడ: శతమానంభవతి సినిమా డైరెక్టర్‌ సతీష్‌ వేగేశ్న మంగళవారం ఆత్రేయపురం లక్ష్మీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మల్లమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాల్లో కుంకుమ పూజలు జరిపారు. క్షత్రియ యూత్‌ ఆధ్వర్యంలో సతీష్‌ను ఘనంగా సన్మానించారు. వేగేశ్న కుటుంబీకుల ఇంట కొంతసేపు సందడి చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లాలోని మారుమూల వడ్డూరు గ్రామంలో జన్మించిన తాను ఆసక్తితో సినిమా రంగంలోకి వచ్చానన్నారు. దిల్‌ రాజు నిర్మాణంలో తాను డైరెక్టర్‌గా త్వరలో శ్రీనివాస కళ్యాణం చిత్రాన్ని తీస్తున్నామన్నారు. ఇప్పటివరకు 45 చిత్రాలకు కథ, మాటలు, స్ర్కీన్‌ప్లేగా వ్యవహరించినట్టు చెప్పారు. గబ్బర్‌సింగ్‌, అత్తిలి సత్తిబాబు, సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌, నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమొరీస్‌.. వంటి హిట్‌ చిత్రాలకు మాటలు రాశానన్నారు. ఆత్రేయపురంతో ఎంతో ఆత్మీయ బంధం ఉండటంతో ఆ ఊరు పేరుతో పాటు పుణ్యక్షేత్రాలను శతమానంభవతి సినిమాలో పెట్టినట్టు వివరించారు. పల్లెటూర్లో పుట్టడం వల్ల ఉమ్మడి కుటుంబంపై ఉన్న అంశాలను దృష్టిలో ఉంచుకుని శతమానంభవతి చిత్రాన్ని రూపొందించామన్నారు. రాజాబాబు సినిమా చిత్రీకరణలో భాగంగా ఆత్రేయపురం వచ్చానని, దీంతో సెంటిమెంట్‌గా పలు చిత్రాల్లో ఆత్రేయపురం పేరుతో సన్నివేశాలు తీసినట్టు సతీష్‌ చెప్పారు.
entertainment
8,412
01-12-2017 13:35:36
'బాహుబలి' గురించి ఊహించని విషయాన్ని వెల్లడించిన నిర్మాత
బాహుబలి మూవీ సృష్టించిన ప్రభంజనం నుంచి ఇప్పట్లో బయటపడటం కష్టమే అని భావిస్తుంటే.. బాహుబలి-3 గురించి ఎవ్వరూ ఊహించని విషయాన్ని వెల్లడించారు ఆ సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ. తాజాగా 'సీఎన్ఎన్-ఐబీఎన్' ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును వివిధ రంగాలకు చెందిన వారికి ప్రదానం చేసింది. దీనికి హాజరరైన శోభు యార్లగడ్డ బాహుబలి-3 గురించి చెప్పి బాంబ్ పేల్చారు. "బాహుబలి-3 ఉంటుందా?" అన్న ప్రశ్నకు సమాధానంగా "వెంటనే అయితే ఉండదు కానీ భవిష్యత్తులో ఉండవచ్చుష అంటూ తన మనసులో మాటను వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ తాను ఇప్పటికీ బాహుబలి సెట్స్‌లోనే ఉన్నట్టు ఫీల్ అవుతున్నానన్నారు. 'బాహుబలి' ప్రయాణం చాలా పెద్దదని.. దాని హ్యాంగోవర్ నుంచి బయటకు రావడం కష్టమన్నారు.
entertainment
12,811
21-02-2017 01:07:36
మోదీ, షా ఉగ్రవాదులు: ఎస్పీ మంత్రి
లఖ్‌నవు, ఫిబ్రవరి 20: యూపీ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు హద్దులు దాటుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ సారథి అమిత షాలు ఉగ్రవాదులు అని రాష్ట్ర మంత్రి, ఎస్పీ సీనియర్‌ నేత రాజేంద్ర చౌధరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఓట్ల కోసం వారిద్దరూ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని ధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రంలో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు’’ అని అన్నారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన చౌధరి.. బీజేపీకి రాష్ట్రంలో స్థానం లేదని, రాష్ర్టానికి అది చేసింది కూడా ఏమీలేదని విమర్శించారు.
nation
10,625
16-11-2017 17:30:02
తొలి పరాజయంతో తెగ దిగులు పడిపోతోందట..!
తొలి పరాజయం ఓ పక్క బాధపెడుతుంటే మరో సంఘటన ఆ బాధను మరింత పెంచేసిందట. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాది భామ మెహ్రీన్‌కు బోణీ బాగుంది. ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. కానీ విచిత్రంగా ఆ తర్వాత అమ్మడికి ఊహించని గ్యాప్ వచ్చేసింది. ఆరేడు సినిమా ఛాన్సులు వచ్చినా వేటిని ఎంపిక చేసుకోవాలో తేల్చుకోలేక కొన్ని అవకాశాలను వదిలేసుకుందని టాలీవుడ్ వర్గాలు చెబుతుంటాయి. అయితే క్రేజీ ప్రాజెక్ట్స్‌కు కాకుండా తనకు కాస్తంత పేరొచ్చే సినిమాలకు మెహ్రీన్ సైన్ చేసింది. అలా వచ్చిన వాటిలో 'మహానుభావుడు' సినిమా మెహ్రీన్‌కు మరో విజయాన్ని అందించింది.  'మహానుభావుడు' మూవీతో మొదలైన మెహ్రీన్ సినిమాల విడుదల పరంపరం భలే కొనసాగుతోంది. ఆ వెంటనే 'రాజా ది గ్రేట్' మూవీతోనూ మరో సక్సెస్‌ను తన కిట్‌లో వేసుకుంది మెహ్రీన్. ఇందులోనూ అమ్మడికి ప్రాధాన్యం ఉన్న పాత్రే లభించింది. ఇలా వరుసగా హ్యాట్రిక్ అందుకున్న మెహ్రీన్ తొలిసారి 'కేరాఫ్ సూర్య' మూవీతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఏ మాత్రం ప్రాధాన్యం లేని పాత్రను అసలు మెహ్రీన్ ఎందుకు అంగీకరించిందా అనే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా ద్వారా మెహ్రీన్‌కు భారీ పారితోషికమే లభించిందని, పైగా ఒక దెబ్బకు రెండు పిట్టల తరహాలో ఈ ద్విభాషా చిత్రాన్ని మెహ్రీన్ భావించిందని కొందరు చెబుతున్నారు. 'కేరాఫ్ సూర్య'కు మెహ్రీన్ అందుకున్న పారితోషికం మాట అటుంచితే తొలి పరాజయంతో తెగ దిగులు పడిపోతోందట. నిజానికి ఈ సినిమా కథంతా సందీప్ కిషన్ అతని చెల్లెలు, ఆమె ప్రియుడు మధ్యనే సాగుతుంది. కథానాయిక పాత్రకు అసలు ప్రాధాన్యమే లేదు. అయితే కమర్షియల్ యాంగిల్‌లో పాటలు పెట్టుకోవచ్చనే మెహ్రీన్‌ను తీసుకున్నారు. కానీ ప్రధమార్థంలో ఆమెపై చిత్రీకరించిన ప్రేమ సన్నివేశాలు సైతం పెద్దగా ఆకట్టుకోకపోవడంతో రెండో రోజునే తమిళనాడులో వాటిని తొలగించేశారట. దీంతో ఆమె పాత్ర మరింత అప్రధానంగా మారిపోయింది. ఈ విషయం తెలిసి అనవసరంగా 'కేరాఫ్ సూర్య' మూవీ చేశానని బాధపడుతోందట. ఏదేమైనా తొలి పరాజయం వల్ల కలిగే బాధ అంతా ఇంతా కాదని మెహ్రీన్‌ను చూస్తే అర్థం అవుతోంది.
entertainment
17,365
08-01-2017 13:44:37
వాళ్ళు పూజించేది అవినీతినే : మోదీ
బెంగళూరు : పెద్ద నోట్ల రద్దును విమర్శిస్తున్నవారిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ప్రభుత్వ నిర్ణయం ప్రజా వ్యతిరేక చర్య అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నవారిని దుయ్యబట్టారు. వీరంతా నల్లధనాన్ని, అవినీతిని పూజించేవాళ్ళని ఆరోపించారు. నల్లధనం, అవినీతి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, సమాజం తీవ్రంగా దెబ్బతింటున్నాయన్నారు. 14వ ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ఆదివారం జరిగిన సమావేశంలో మోదీ మాట్లాడారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలపై నల్లధనానికి మద్దతిచ్చేవారు బురద జల్లడం బాధాకరమని తెలిపారు. దేశాభివృద్ధిలో ప్రవాస భారతీయులు భాగస్వాములవుతుండటం సంతోషకరమని మోదీ చెప్పారు. ఎన్ఆర్ఐలు 69 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చారని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎఫ్‌డీఐకి మరో అర్థం చెప్పారు. ఎఫ్‌డీఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) అంటారని, అయితే తాను ఫస్ట్ డెవలప్ ఇండియా (మొదట భారతదేశాన్ని అభివృద్ధి చేయండి) అంటానని వివరించారు. బ్రెయిన్ డ్రెయిన్ (మేధోవలస)ను బ్రెయిన్ గెయిన్ (మేధో లాభదాయకత)గా మార్చాలనుకుంటున్నామన్నారు.
nation
1,235
26-11-2017 23:56:42
జిడిపి, ఇన్‌ఫ్రా గణాంకాలే దిక్సూచి
‘‘ఈ వారం ట్రేడర్లు ప్రధాన ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వెలువడే సంకేతాలపైనే దృష్టి కేంద్రీకరిస్తారు..’’ఈ వారం గణాంకాల వెల్లువ మార్కెట్‌ వర్గాలు, ఇన్వెస్టర్ల ముందుకురానుంది. సెప్టెంబరు నెలతో ముగిసిన రెండో త్రైమాసికం జిడిపి గణాంకాలను ప్రభుత్వం వచ్చే గురువారం మార్కెట్‌ వేళల అనంతరం ప్రకటిస్తుంది. జూన్‌ త్రైమాసికంలో జిడిపి వృద్ధిరేటు 5.7 శాతానికి దిగజారిన విషయం విదితమే. అదే రోజున ఆర్థిక రంగానికి కీలకమైన ఎనిమిది విభాగాలకు ప్రాతినిథ్యం వహించే ఇన్‌ఫ్రా రంగం అక్టోబరు నెల గణాంకాలను కూడా మార్కెట్‌వేళల అనంతరం ప్రభుత్వం ప్రకటించనుంది. పారిశ్రామికోత్పత్తి సూచీలో 40.27 శాతం వాటా ఉన్న ఇన్‌ఫ్రా రంగం సెప్టెంబరు నెలలో 5.2 శాతం వృద్ధిని సాధించిన విషయం విదితమే. జూ నవంబరు నెలలో తయారీ రంగం పనితీరుకు దర్పణం పట్టే పిఎంఐ గణాంకాలను మార్కిట్‌ ఎకనామిక్స్‌ శుక్రవారం ప్రకటించనుంది. అక్టోబరులో ఇది 50.3 పాయింట్లకు పరిమితం అయింది. శుక్రవారం నాడే నవంబరు నెల ఆటో అమ్మకాల గణాంకాలను ఆటోమొబైల్‌ కంపెనీలు ప్రకటించనున్నాయి. ఈ కారణంగా ఆటోమొబైల్‌ రంగంలోని షేర్లపై అందరి దృష్టి కేంద్రీకృతమవుతుంది.అంతర్జాతీయ సంఘటనల విషయానికి వస్తే నవంబరు నెలకు యూరోజోన్‌లో ఆర్థిక సెంటిమెంట్‌ సూచి ధోరణిని బుధవారం ప్రకటించనున్నారు. అమెరికన్‌ ఫెడరల్‌ చైర్‌పర్సన్‌ పదవి నుంచి వైదొలగుతున్న జానెట్‌ యెల్లెన్‌ సెనేట్‌లో తన వాదాన్ని వినిపించనున్నారు. నవంబరు నెలకు చైనాలో తయారీ రంగం తీరును తెలియచేసే సియాక్సిన్‌ పిఎంఐ గణాంకాలను శుక్రవారం ప్రకటించనున్నారు.ఫ్యూచర్స్‌ కాంట్రాక్టుల ముగింపు వారం కావడం వల్ల ఈ వారం మార్కెట్‌ ఆటుపోట్లలో నడిచే ఆస్కారం ఉంది. గురువారం నాడు నవంబరు కాంట్రాక్టులు రద్దయి డిసెంబరు నెల కాంట్రాక్టులు మొదలవుతాయి. టెక్నికల్స్‌ ఇవే..గత వారంలో నిఫ్టీ ఆరు సెషన్లలో తొలిసారిగా 10300-10370 పరిధిని దాటి క్లోజయింది. డెయిలీ చార్టుల్లో ఇన్‌వర్స్‌ హెడ్‌అండ్‌ షోల్డర్‌ పాటర్న్‌ను ఛేదించినందు వల్ల సరికొత్త గరిష్ఠ స్థాయి 10600 దిశగా అడుగేసేందుకు సమాయత్తం అవుతోంది. మద్దతు స్థాయి 10280. ఇదే సమయంలో బ్యాంక్‌ నిఫ్టీ పరిమిత పరిధిలోనే కదలాడింది. 25390కి పైనే తాజా కదలిక తెలుస్తుంది.
business