SNo
int64 0
21.6k
| date
stringlengths 19
19
| heading
stringlengths 3
91
⌀ | body
stringlengths 6
38.7k
| topic
stringclasses 5
values |
---|---|---|---|---|
13,577 | 23-09-2017 02:58:11 | గాంధీ, నెహ్రూ ఎన్నారైలే! | ప్రవాసులు కొత్త ఆలోచనలు తెచ్చారువారి సేవకు తగిన గుర్తింపు లభించలేదున్యూయార్క్ సమావేశంలో రాహుల్‌న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: స్వతంత్రోద్యమంలో ప్రముఖ నేతలంతా ప్రవాస భారతీయులేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఎన్నారైల ఉద్యమం నుంచే కాంగ్రెస్ పార్టీ పుట్టిందని చెప్పారు. ‘‘మహాత్మాగాంధీ ప్రవాస భారతీయుడు. నెహ్రూ ఇంగ్లండ్‌లో చదువుకొని వచ్చారు. అంబేడ్కర్, ఆజాద్, పటేల్... వీళ్లంతా ఏదో ఒక దశలో ఎన్నారైలే’’ అన్నారు. గురువారం ఆయన న్యూయార్క్‌లో కాంగ్రెస్ ఎన్నారై విభాగం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘వాళ్లంతా బయటి ప్రపంచాన్ని చూశారు. దేశానికి తిరిగి వచ్చినపుడు అక్కడి ఆలోచనలను వినియోగించి దేశాన్ని మార్చేశారు. దేశాభివృద్ధికి కృషి చేసిన అలాంటి ఎన్నారైలు ఎందరో. వారి సేవలకు గుర్తింపు లభించాల్సి ఉంది’’ అన్నారు. విదేశాల్లో ఉన్నంత మాత్రాన మాతృదేశాభివృద్ధికి ఎన్నారైలు చేసిందేమీ లేదని భావించాల్సిన అవసరం లేదని, నిజానికి వారు దేశానికి వెన్నెముకగా నిలిచారని చెప్పారు. భారత్ ఆలోచనను ప్రతిబింబించే వారంతా భారతీయులేనన్నారు. రెండు వారాల అమెరికా పర్యటనలో విద్యార్థులు, రాజకీయ నాయకులు సహా సమాజంలోని అన్ని వర్గాల వారితో మాట్లాడానని, అందరూ దేశంలో ఇటీవలి పరిణామాలపై, ముఖ్యంగా పెరుగుతున్న అసహనంపై ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కళాశాలల నుంచి 30 వేల మంది పట్టాలతో బయటకు వెళితే అందులో 450 మందికి మాత్రమే చెప్పుకోదగ్గ ఉద్యోగాలు దొరుకుతున్నాయని తెలిపారు. | nation |
15,492 | 28-03-2017 05:05:56 | బీజేపీలోకి భర్తృహరి మెహతాబ్! | న్యూఢిల్లీ, మార్చి 27(ఆంధ్రజ్యోతి): దక్షిణాదిలో బలపడాలని చూస్తోన్న బీజేపీ.. ఈ దిశగా చర్యల్లో వేగం పెంచింది. ఒడిసాలో అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ) సీనియర్ నాయకుడు, పార్లమెంటరీ పార్టీ నేత భర్తృహరి మెహతాబ్ ను పార్టీకి తీసుకోనున్నట్లు సమాచారం! ఒడిసాకు రెండుసార్లు సీఎంగా పనిచేసిన హరేకృష్ణ మెహతాబ్ కుమారుడైన భర్తృహరి.. కటక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎన్నికయ్యారు. విశేష అనుభవం, సమస్యలపై అవగాహన, చర్చల్లో స్పష్టత ఉన్న ఆయన్ను పార్టీలోకి తీసుకునేందుకు బీజేపీ అగ్రనాయకత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికలతోపాటే 147 సీట్లున్న ఒడిసా అసెంబ్లీకి కూడా 2019లో ఎన్నికలు జరుగనున్నాయి. కొద్ది వారాల కిందట వెలువడిన పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. గతేడాది డిసెంబరులోనే తన కుమారుడు లోక్‌రంజన మెహతాబ్‌కు, బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తమ్ముడి కుమార్తె సాక్షితో వివాహం జరిపించారు. ఢిల్లీలో వైభవంగా జరిగిన ఈ పెళ్లికి ప్రధాని మోదీ, రాజ్‌నాథ్, స్పీకర్ సుమిత్రా మహాజన సహా బీజేపీ అగ్రనాయకత్వం హాజరైంది. అప్పటి నుంచే బీజేపీ-భర్తృహరి మధ్య సంబంధాలు బలపడుతున్నాయని తెలుస్తోంది. 20 ఏళ్ల తర్వాత ఈసారి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏప్రిల్ 15, 16 తేదీల్లో భువనేశ్వర్‌లో జరగనుండడం కూడా గమనార్హం. | nation |
19,654 | 11-05-2017 00:44:46 | మనోహర్ రాజీనామా వెనక్కి..! |
మనసు మార్చుకున్న శశాంక్ ఐసీసీ చైర్మనగా కొనసాగడానికి ఓకేన్యూఢిల్లీ: బీసీసీఐను ఏమార్చి దెబ్బకొట్టడంలో విజయం సాధించిన శశాంక్ మనోహర్.. ఐసీసీ చైర్మనగా పూర్తికాలం పదవిలో కొనసాగనున్నాడు. రాజీనామాపై మనసు మార్చుకున్న మనోహర్.. వచ్చే ఏడాది జూన వరకు ఐసీసీ చైర్మనగా కొనసాగనున్నాడు. స్వతంత్ర చైర్మనగా శశాంక్ పదవీకాలం ముగిసే వరకు కొనసాగుతాడని ఐసీసీ ధ్రువీకరించింది. వ్యక్తిగత కారణాలతో గత మార్చిలో ఐసీసీ చైర్మన పదవి నుంచి వైదొలుగుతున్నట్టు మనోహర్ రాజీనామా లేఖను పంపించాడు. అయితే జానలో ఐసీసీ వార్షిక సర్వ సభ్య సమావేశం వరకు కొనసాగమని కోరడంతో అంగీకరించాడు. ఐసీసీ ఆదాయ పంపిణీ నమూనా, పాలక విధానంలో మార్పుల విషయంలో మనోహర్ చేసిన ప్రతిపాదనలు బీసీసీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ‘బిగ్-3’ విధానాన్ని రద్దు చేయడానికి మనోహర్ కంకణం కట్టుకున్నాడు. కొత్త నమూనా అమలైతే భారత బోర్డు ఆదాయం తగ్గిపోనుంది. భారీ నష్టం వచ్చే ఈ ప్రతిపాదనను బోర్డు వ్యతిరేకించింది. ఈ ప్రతిపాదనలు వీగిపోయేందుకు తెరవెనుక వ్యూహం కూడా సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో మనోహర్ రాజీనామా చేస్తున్నట్టు హఠాత్తుగా ప్రకటించాడు. బీసీసీఐ మాట నెగ్గుతుందని, భవిష్యత్తులో కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతాయని ముందే ఊహించిన శశాంక్ ఇలా రాజీనామా చేశాడని ఉహాగానాలు వెలువడ్డాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించిన శశాంక్..గత నెల దుబాయ్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశాల్లో బీసీసీఐకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నూతన విధానానికి అనుకూలంగా ఐసీసీ ఫుల్‌మెంబర్లు ఓటింగ్ చేశారు. దీంతో బీసీసీఐ ఏకాకిగా మిగిలింది. భారతకు మద్దతుగా నిలుస్తామని భరోసా ఇచ్చిన బంగ్లాదేశ, జింబాబ్వే బోర్డులు చివరల్లో ప్లేటు మార్చాయి. ఇదంతా మనోహర్ కారణంగానే జరిగిందని బీసీసీఐ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. భారత బోర్డుకు వ్యతిరేకంగా మిగిలిన బోర్డులను ఏకం చేయడంలో శశాంక్ చతురత ప్రదర్శించాడు. మనవేలితో మన కన్నే పొడిచిన నేపథ్యంలో పూర్తిస్థాయి సంస్కరణలు అమలయ్యే వరకు మనోహర్ చైర్మనగా కొనగాలని మిగతా సభ్యదేశాలు కోరడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ చైర్మనగా మనోహర్‌కు ఇప్పట్లో ఎదురే ఉండకపోవచ్చు. ఇదే కొనసాగితే మరో టర్మ్‌కు కూడా గట్టిపునాది వేసుకున్నట్టే. | sports |
15,986 | 20-06-2017 18:23:28 | జైల్లో ఉన్న శశికళను.. మరోసారి కలిసిన దినకరన్ | బెంగళూరు: అన్నాడీఎంకే ప్రధాన ఉప కార్యదర్శి టీటీవీ దినకరన్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళను మరోసారి కలిశారు. మంగళవారం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఆమెతో ములాఖత్ అయ్యారు. పార్టీ గుర్తు కోసం ఈసీ అధికారులకు లంచం ఇవ్వజూపిన ఆరోపణలతో జైలుకెళ్ళి బెయిల్‌పై విడుదలైన దినకరన్, బెంగళూరు జైలులో శశికళను కలవడం ఇది మూడోసారి. మంగళవారం ఆమెను జైలులో కలిసిన వారిలో ఆ పార్టీ సీనియర్ నేత, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై కూడా ఉన్నారు. శశికళతో జైలులో ములాఖత్ తర్వాత దినకరన్ మీడియాతో మాట్లాడారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు అన్నాడీఎంకే మద్దతుపై శశికళ నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డీఎంకేపై ఆయన మండిపడ్డారు. తమ శతృవు ప్రభుత్వంతో పాటు పార్టీని అస్థిర పరిచేందుకు ప్రయత్నిస్తోందని దినకరన్ ఆరోపించారు. | nation |
3,782 | 01-02-2017 00:03:28 | వడివడిగా పోలవరం | పోలవరం ప్రాజెక్టులో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పొడవు 1.75 కిలోమీటర్లు. దేశంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల కంటే ఇదే అతి పెద్దది. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు వీలుగా దీనిని నిర్మిస్తారు. ఈ ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌కు దిగువన రాతి పొరల్లో డయాఫ్రాం వాల్‌ను నిర్మిస్తారు. పోలవరం నిర్మాణ పనుల్లో వేగం పెరుగుతోంది. ఇప్పటికే కాంక్రీట్ పనులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం డయాఫ్రాం పనుల ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన డయాఫ్రాంవాల్, క్రస్ట్‌గేట్ల నిర్మాణ పనుల పనులను నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్నారు. పోలవరం నిర్మాణంతో 80లక్షల హెక్టార్ల అదనపు ఆయకట్టుకు నీరివ్వాలన్నది చంద్రబాబు సంకల్పం. పోలవరం నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మారుతుంది. 2019 నాటికి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందన్న విశ్వాసం ప్రభుత్వంలో వ్యక్తమవుతోంది. ఇప్పటికే పట్టిసీమ ద్వారా పూర్తిస్థాయిలో నీరు అందడంతో- పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మంచి వరి దిగుబడులు సాధించడంతో రైతుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. గోదావరి నీటితో గతంకన్నా అధిక స్థాయిలో దిగుబడులు రావడంతో రైతులు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. కృష్ణాజిల్లా పెదపారుపూడి సందర్శనకు వెళ్లిన మంత్రి దేవినేని ఉమను పొలం వద్దకు తీసుకెళ్లి ధాన్యం రాశుల వద్ద పూజలు చేయించారు. అదే విధంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా సాగు, తాగునీటి ప్రయోజనాలు కలిగించే విధంగా గోదావరి నది ఎడమ గట్టుపై తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద నిర్మించతలపెట్టిన ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ చేశారు. రూ.1638 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ పథకం నుంచి ఏటా వరద సమయంలో 120 రోజుల్లో 35–-40 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు. ఈ పథకంతో ఏలేరు ఆయకట్టు, పిఠాపురం బ్రాంచి కాలువ కింద ఉన్న 87,000 ఎకరాలకు నీటి స్థిరీకరణ జరుగుతుంది. ఎడమ కాలువ కింద రెండు జిల్లాల్లోని 2.15 లక్షల ఎకరాల ఆయకట్టుకు కూడా కొంత నీరు అందించవచ్చని అధికారులు అంటున్నారు. విశాఖ పారిశ్రామిక అవసరాలకు, వివిధ గ్రామాల తాగునీటి అవసరాలకు 10 టీఎంసీల వరకు వినియోగించనున్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల, కొండవీటి వాగు వరద ఎత్తిపోత పథకాల టెండర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ ఆమోదం కూడా తెలిపింది. పురుషోత్తపట్నం పథకానికి రూ.1483.71 కోట్లతో టెండర్లు పిలవగా 4.55 శాతం అధికానికి కోట్ చేసిన మేఘా ఇంజినీరింగు కంపెనీ ఎల్1గా నిలిచింది. ఏడాది కాలంలోనే పట్టిసీమ ప్రాజెక్టు పూర్తిచేసి సాగు నీరందించిన చంద్రబాబు, నవ్యాంధ్రుల భవిషత్తుకు పునాది, జీవనాడి అయిన పోలవరం లాంటి అతి భారీ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి నడుం బిగించారు. పోలవరం 70ఏళ్ల నాటి కల. సాగునీరు, తాగునీరు, విద్యుదుత్పత్తి వంటి విస్తృత ప్రయోజనాలున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం దశాబ్దాల తరబడి కాగితాలకే పరిమితమైపోయింది. బహుళ ప్రయోజనకారి అయిన ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ కాలం గడిపేశారు గత పాలకులు. చంద్రబాబు కార్యదీక్షతో ముందుకు కదిలి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తనతో కలసి వచ్చేలా చేశారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా తెప్పించడంలోనూ, నాబార్డ్ ద్వారా నిధులు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించడంలోనూ చంద్రబాబు సాధించిన విజయం అసామాన్యమైనది. ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అనుమతులూ సాధించి, ఏడు దశాబ్దాలుగా గత పాలకులు చేయలేని పనిని రెండేళ్లలో చేసి చూపించారు. విభజన చట్టం ద్వారా జాతీయ హోదా పొందిన ఈ ప్రాజెక్టుకు తొలివిడతగా సుమారు రూ.2వేల కోట్లు రుణం అందడంతో పనులు వేగం పుంజుకున్నాయి. ప్రధానంగా కాంక్రీట్ పనులకు డిసెంబరు 30న నాంది పలికారు. డయాఫ్రాం వాల్ నిర్మాణం పనుల ప్రారంభానికి సన్నాహకంగా గైడ్ వాల్ నిర్మాణ పని బాధ్యతను ఎల్ అండ్ టీ బావర్ సంస్థకు అప్పగించారు. పోలవరం ప్రాజెక్టులో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పొడవు 1.75 కిలోమీటర్లు. దేశంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల కంటే ఇదే అతి పెద్దది. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు వీలుగా దీనిని నిర్మిస్తారు. ఈ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌కు దిగువన రాతి పొరల్లో డయాఫ్రాం వాల్‌ను నిర్మిస్తారు. ఈ వాల్‌లో ఎలాంటి వంకరలూ ఉండకూడదు. దీని నిర్మాణంలో సాంకేతిక పరిజ్ఞానం, అవగాహన, నైపుణ్యం అవసరం. ఈ స్థాయిలో నిర్మాణ నైపుణ్యం కలిగిన సంస్థలు ప్రపంచంలో రెండే ఉన్నాయి. అందులో జర్మనీకి చెందిన బావర్ ఒకటి. అందుకే ఏపీ ప్రభుత్వం ఈ సంస్థ సేవలను వినియోగించుకునేందుకు సిద్ధమైంది. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం కోసం రాతి పొరలు తగిలేదాకా వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కోసారి 100 మీటర్లలోతుకూ వెళ్లాల్సి ఉంటుంది. రాతిపొర తగిలాక 5 మీటర్ల వరకూ లోతుకు వెళ్లాలి. అక్కడి నుంచి డయాఫ్రాం వాల్ నిర్మాణం జరగాలి. ఇందుకు అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలను విదేశాల నుంచి ఇప్పటికే తెప్పించారు. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన మరో నిర్మాణం క్రస్ట్‌గేట్లు. 16 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తు కలిగిన 48 క్రస్ట్గేట్లు ఏర్పాటు చేస్తారు. ఇవి దేశంలోనే అతి పెద్దవి. ఈ గేట్లు పూర్తిగా హైడ్రాలజీ సిస్టమ్‌తో కూడి రిమోట్ కంట్రోల్‌తో పని చేస్తాయి. ఈ గేట్ల కోసం 15,000 మెట్రిక్ టన్నుల స్టీల్ అవసరం అవుతుంది. ఈ స్టీల్‌ను నేరుగా సరఫరా చేసేందుకు బిలాయ్, విశాఖ స్టీల్ ప్లాంట్లు అంగీకరించాయి. డయాఫ్రాం వాల్ నిర్మాణ పనులు చేపడుతున్న ఎల్ అండ్ టీ బావర్ కంపెనీ దీనిని ఎన్ని రోజుల్లో ఎలా పూర్తిచేయనున్నదీ పూర్తిస్థాయి ప్రణాళికను కమిటీకి సమర్పించింది. పోలవరం పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని కేంద్ర జలసంఘం ఛైర్మన్ జి.ఎస్.ఝా సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ప్రతి సోమవారాన్ని పోల‘వారం’గా మార్చి అధికారులతో వర్చువల్ రివ్యూలు నిర్వహిస్తున్నారు. 2016 నవంబర్ నాటికి ప్రాజెక్టుపై దాదాపు రూ.8682.43 కోట్లను ఖర్చు చేశారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించేనాటికే ఈ ప్రాజెక్టుపై దాదాపుగా రూ.3133.75 కోట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టింది. పోలవరం నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్‌కు ఇక ఎదురే ఉండదు. ఈ ప్రాజెక్టు తెలుగుజాతికి వరం. జాస్తి గోపాల ప్రసాద్(నేడు పోలవరం డయాఫ్రాం పనుల ప్రారంభం) పోలవరం నిర్మాణ పనుల్లో వేగం పెరుగుతోంది. ఇప్పటికే కాంక్రీట్ పనులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం డయాఫ్రాం పనుల ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన డయాఫ్రాంవాల్, క్రస్ట్‌గేట్ల నిర్మాణ పనుల పనులను నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్నారు. పోలవరం నిర్మాణంతో 80లక్షల హెక్టార్ల అదనపు ఆయకట్టుకు నీరివ్వాలన్నది చంద్రబాబు సంకల్పం. పోలవరం నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మారుతుంది. 2019 నాటికి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందన్న విశ్వాసం ప్రభుత్వంలో వ్యక్తమవుతోంది. ఇప్పటికే పట్టిసీమ ద్వారా పూర్తిస్థాయిలో నీరు అందడంతో- పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మంచి వరి దిగుబడులు సాధించడంతో రైతుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. గోదావరి నీటితో గతంకన్నా అధిక స్థాయిలో దిగుబడులు రావడంతో రైతులు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. కృష్ణాజిల్లా పెదపారుపూడి సందర్శనకు వెళ్లిన మంత్రి దేవినేని ఉమను పొలం వద్దకు తీసుకెళ్లి ధాన్యం రాశుల వద్ద పూజలు చేయించారు. అదే విధంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా సాగు, తాగునీటి ప్రయోజనాలు కలిగించే విధంగా గోదావరి నది ఎడమ గట్టుపై తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద నిర్మించతలపెట్టిన ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ చేశారు. రూ.1638 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ పథకం నుంచి ఏటా వరద సమయంలో 120 రోజుల్లో 35–-40 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు. ఈ పథకంతో ఏలేరు ఆయకట్టు, పిఠాపురం బ్రాంచి కాలువ కింద ఉన్న 87,000 ఎకరాలకు నీటి స్థిరీకరణ జరుగుతుంది. ఎడమ కాలువ కింద రెండు జిల్లాల్లోని 2.15 లక్షల ఎకరాల ఆయకట్టుకు కూడా కొంత నీరు అందించవచ్చని అధికారులు అంటున్నారు. విశాఖ పారిశ్రామిక అవసరాలకు, వివిధ గ్రామాల తాగునీటి అవసరాలకు 10 టీఎంసీల వరకు వినియోగించనున్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల, కొండవీటి వాగు వరద ఎత్తిపోత పథకాల టెండర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ ఆమోదం కూడా తెలిపింది. పురుషోత్తపట్నం పథకానికి రూ.1483.71 కోట్లతో టెండర్లు పిలవగా 4.55 శాతం అధికానికి కోట్ చేసిన మేఘా ఇంజినీరింగు కంపెనీ ఎల్1గా నిలిచింది. ఏడాది కాలంలోనే పట్టిసీమ ప్రాజెక్టు పూర్తిచేసి సాగు నీరందించిన చంద్రబాబు, నవ్యాంధ్రుల భవిషత్తుకు పునాది, జీవనాడి అయిన పోలవరం లాంటి అతి భారీ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి నడుం బిగించారు. పోలవరం 70ఏళ్ల నాటి కల. సాగునీరు, తాగునీరు, విద్యుదుత్పత్తి వంటి విస్తృత ప్రయోజనాలున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం దశాబ్దాల తరబడి కాగితాలకే పరిమితమైపోయింది. బహుళ ప్రయోజనకారి అయిన ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ కాలం గడిపేశారు గత పాలకులు. చంద్రబాబు కార్యదీక్షతో ముందుకు కదిలి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తనతో కలసి వచ్చేలా చేశారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా తెప్పించడంలోనూ, నాబార్డ్ ద్వారా నిధులు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించడంలోనూ చంద్రబాబు సాధించిన విజయం అసామాన్యమైనది. ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అనుమతులూ సాధించి, ఏడు దశాబ్దాలుగా గత పాలకులు చేయలేని పనిని రెండేళ్లలో చేసి చూపించారు. విభజన చట్టం ద్వారా జాతీయ హోదా పొందిన ఈ ప్రాజెక్టుకు తొలివిడతగా సుమారు రూ.2వేల కోట్లు రుణం అందడంతో పనులు వేగం పుంజుకున్నాయి. ప్రధానంగా కాంక్రీట్ పనులకు డిసెంబరు 30న నాంది పలికారు. డయాఫ్రాం వాల్ నిర్మాణం పనుల ప్రారంభానికి సన్నాహకంగా గైడ్ వాల్ నిర్మాణ పని బాధ్యతను ఎల్ అండ్ టీ బావర్ సంస్థకు అప్పగించారు. పోలవరం ప్రాజెక్టులో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పొడవు 1.75 కిలోమీటర్లు. దేశంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల కంటే ఇదే అతి పెద్దది. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు వీలుగా దీనిని నిర్మిస్తారు. ఈ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌కు దిగువన రాతి పొరల్లో డయాఫ్రాం వాల్‌ను నిర్మిస్తారు. ఈ వాల్‌లో ఎలాంటి వంకరలూ ఉండకూడదు. దీని నిర్మాణంలో సాంకేతిక పరిజ్ఞానం, అవగాహన, నైపుణ్యం అవసరం. ఈ స్థాయిలో నిర్మాణ నైపుణ్యం కలిగిన సంస్థలు ప్రపంచంలో రెండే ఉన్నాయి. అందులో జర్మనీకి చెందిన బావర్ ఒకటి. అందుకే ఏపీ ప్రభుత్వం ఈ సంస్థ సేవలను వినియోగించుకునేందుకు సిద్ధమైంది. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం కోసం రాతి పొరలు తగిలేదాకా వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కోసారి 100 మీటర్లలోతుకూ వెళ్లాల్సి ఉంటుంది. రాతిపొర తగిలాక 5 మీటర్ల వరకూ లోతుకు వెళ్లాలి. అక్కడి నుంచి డయాఫ్రాం వాల్ నిర్మాణం జరగాలి. ఇందుకు అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలను విదేశాల నుంచి ఇప్పటికే తెప్పించారు. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన మరో నిర్మాణం క్రస్ట్‌గేట్లు. 16 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తు కలిగిన 48 క్రస్ట్గేట్లు ఏర్పాటు చేస్తారు. ఇవి దేశంలోనే అతి పెద్దవి. ఈ గేట్లు పూర్తిగా హైడ్రాలజీ సిస్టమ్‌తో కూడి రిమోట్ కంట్రోల్‌తో పని చేస్తాయి. ఈ గేట్ల కోసం 15,000 మెట్రిక్ టన్నుల స్టీల్ అవసరం అవుతుంది. ఈ స్టీల్‌ను నేరుగా సరఫరా చేసేందుకు బిలాయ్, విశాఖ స్టీల్ ప్లాంట్లు అంగీకరించాయి. డయాఫ్రాం వాల్ నిర్మాణ పనులు చేపడుతున్న ఎల్ అండ్ టీ బావర్ కంపెనీ దీనిని ఎన్ని రోజుల్లో ఎలా పూర్తిచేయనున్నదీ పూర్తిస్థాయి ప్రణాళికను కమిటీకి సమర్పించింది. పోలవరం పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని కేంద్ర జలసంఘం ఛైర్మన్ జి.ఎస్.ఝా సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ప్రతి సోమవారాన్ని పోల‘వారం’గా మార్చి అధికారులతో వర్చువల్ రివ్యూలు నిర్వహిస్తున్నారు. 2016 నవంబర్ నాటికి ప్రాజెక్టుపై దాదాపు రూ.8682.43 కోట్లను ఖర్చు చేశారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించేనాటికే ఈ ప్రాజెక్టుపై దాదాపుగా రూ.3133.75 కోట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టింది. పోలవరం నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్‌కు ఇక ఎదురే ఉండదు. ఈ ప్రాజెక్టు తెలుగుజాతికి వరం. జాస్తి గోపాల ప్రసాద్(నేడు పోలవరం డయాఫ్రాం పనుల ప్రారంభం) | editorial |
4,148 | 14-10-2017 01:54:23 | ‘రామప్ప’ రక్షణకు ‘చలో పాలంపేట’ |
కాకతీయుల శిల్పకళా వైభవానికి మచ్చుతునక అయిన రామప్ప నిర్మాణాలు, పరివార కట్టడాలు ఒక్కొక్కటీ కూలిపోతున్నాయి. లోగడ కూలి శిథిలావస్థకు చేరిన నిర్మాణాలు అలాగే ఉండగా కొత్తగా శిథిలమవుతున్న శిల్ప సంపద ఎంతో మిగిలి ఉంది. ఉమ్మడి పాలనలో రామప్ప కట్టడానికి దగ్గరలో నుండి సొరంగం తవ్వడానికి వాడిన పేలుడు పదార్థాల వల్ల రామప్ప కట్టడం ఆకులా గడగడ వణికిపోయింది. అప్పటి నుండి ఆలయంపై నుండి వర్షం నీరు కారి పడిపోతున్నా పట్టించుకోలేదు. మొన్న ప్రహరీగోడ కూలిపోయినా గుర్తించలేదు. రామప్ప నిర్మాణాల చుట్టూ కాలువలలో నీరు చేరిపోయింది. ఆ కాలువల పూడిక తీసివేయడం లేదు. దాని పునాదికి విఘాతం కలుగుతున్నది. ఎవరూ పట్టించకోవడం లేదు. కొద్దిరోజుల క్రితమే రామప్ప ప్రాకారం గోడ కూలిపోయింది. పందులు, పశువులు ఆలయంలోకి చొరబడుతున్న దృశ్యం ప్రజలను విస్మయాందోళనలకు గురిచేస్తున్నది. యునెస్కో వారసత్వ హోదా కోసం నివేదిక తయారుచేస్తున్నారని తెలుస్తోంది. అది వస్తుందా రాదా అనేది తదుపరి విషం. వచ్చే నాటికి రామప్ప నిలిచి ఉంటుందా అనేది సందేహంగా ఉంది. కళ్ళముందు ఎనిమిది వందల ఏళ్ళ కళా సంపద కనుమరుగవువుతున్నది. కాబట్టి రామప్ప పరిరక్షణ చర్యలు వెంటనే చేపట్టాలని కవులు, రచయితలు, అక్టోబర్ 15న ఆదివారం ఉదయం పన్నెండు గంటలకు ‘రామప్పను రక్షించండి’ అనే నినాదంతో జయధీర్ తిరుమలరావు నేతృత్వంలో పాలంపేట తరలివెళ్ళాలని పిలుపునిస్తున్నాం. తెలంగాణ సాంస్కృతిక వారసత్వం సంపద కాపాడుకోవడం కోసం కలాలు గళమెత్తాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో వెంటనే చొరవ చూపాలని కోరుతున్నాం.గుండవరం వేణుగోపాలరావు, నల్లెల రాజయ్య, పాపోలు పద్మ, గాగోజు నాగభూషణం - తెలంగాణ రచయితల వేదిక, రామప్ప పరిరక్షణ వేదిక కాకతీయుల శిల్పకళా వైభవానికి మచ్చుతునక అయిన రామప్ప నిర్మాణాలు, పరివార కట్టడాలు ఒక్కొక్కటీ కూలిపోతున్నాయి. లోగడ కూలి శిథిలావస్థకు చేరిన నిర్మాణాలు అలాగే ఉండగా కొత్తగా శిథిలమవుతున్న శిల్ప సంపద ఎంతో మిగిలి ఉంది. ఉమ్మడి పాలనలో రామప్ప కట్టడానికి దగ్గరలో నుండి సొరంగం తవ్వడానికి వాడిన పేలుడు పదార్థాల వల్ల రామప్ప కట్టడం ఆకులా గడగడ వణికిపోయింది. అప్పటి నుండి ఆలయంపై నుండి వర్షం నీరు కారి పడిపోతున్నా పట్టించుకోలేదు. మొన్న ప్రహరీగోడ కూలిపోయినా గుర్తించలేదు. రామప్ప నిర్మాణాల చుట్టూ కాలువలలో నీరు చేరిపోయింది. ఆ కాలువల పూడిక తీసివేయడం లేదు. దాని పునాదికి విఘాతం కలుగుతున్నది. ఎవరూ పట్టించకోవడం లేదు. కొద్దిరోజుల క్రితమే రామప్ప ప్రాకారం గోడ కూలిపోయింది. పందులు, పశువులు ఆలయంలోకి చొరబడుతున్న దృశ్యం ప్రజలను విస్మయాందోళనలకు గురిచేస్తున్నది. యునెస్కో వారసత్వ హోదా కోసం నివేదిక తయారుచేస్తున్నారని తెలుస్తోంది. అది వస్తుందా రాదా అనేది తదుపరి విషం. వచ్చే నాటికి రామప్ప నిలిచి ఉంటుందా అనేది సందేహంగా ఉంది. కళ్ళముందు ఎనిమిది వందల ఏళ్ళ కళా సంపద కనుమరుగవువుతున్నది. కాబట్టి రామప్ప పరిరక్షణ చర్యలు వెంటనే చేపట్టాలని కవులు, రచయితలు, అక్టోబర్ 15న ఆదివారం ఉదయం పన్నెండు గంటలకు ‘రామప్పను రక్షించండి’ అనే నినాదంతో జయధీర్ తిరుమలరావు నేతృత్వంలో పాలంపేట తరలివెళ్ళాలని పిలుపునిస్తున్నాం. తెలంగాణ సాంస్కృతిక వారసత్వం సంపద కాపాడుకోవడం కోసం కలాలు గళమెత్తాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో వెంటనే చొరవ చూపాలని కోరుతున్నాం.గుండవరం వేణుగోపాలరావు, నల్లెల రాజయ్య, పాపోలు పద్మ, గాగోజు నాగభూషణం - తెలంగాణ రచయితల వేదిక, రామప్ప పరిరక్షణ వేదిక | editorial |
1,795 | 02-11-2017 23:16:11 | దివీస్ విశాఖ యూనిట్‌పై ఎఫ్‌డిఎ ఆంక్షల ఎత్తివేత | హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న యూనిట్-2పై అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి (యుఎస్ ఎఫ్‌డిఎ) విధించిన ఇంపోర్ట్ అలర్ట్‌ను ఎత్తివేయనుందని దివీస్ లేబొరేటరీస్ వెల్లడించింది. యూనిట్-2పై జారీ చేసిన హెచ్చరిక లేఖను కూడా ఉపసంహరించుకోనుందని తెలిపింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజీలకు పంపిన లేఖలో దివీస్ లేబొరేటరీస్ పేర్కొంది. అయితే ఇందుకు సంబంధించిన ఏ ఇతర వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఈ నిషేధాన్ని యుఎస్ఎఫ్‌డిఎ ఎప్పటిలోగా ఎత్తివేస్తుందనేది కూడా దివీస్ పేర్కొనలేదు. ఈ ఏడాది మార్చిలో విశాఖలోని యూనిట్-2ను తనిఖీ చేసిన యుఎస్ ఎఫ్‌డిఎ.. 99-32, 66-40 క్లాజుల కింద ఇంపోర్ట్ అలర్ట్‌ను జారీ చేసింది. అలాగే గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ (జిఎంపి) నిబంధనలకు అనుగుణంగా లేకపోవటంతో హెచ్చరిక లేఖను కూడా జారీ చేసింది. | business |
11,184 | 19-08-2017 04:21:26 | మహిళా ఎమ్మెల్సీ చెయ్యి పట్టుకుని... | కర్ణాటకలో కాంగ్రెస్ నేత ఒకరు... అదె పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్సీ పట్ల అసభ్యకరంగా వ్యవహరించి కెమెరా కంటికి చిక్కాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారనాడు బెంగళూరులో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ వీణ, స్థానిక నేత రమేశ్ ఈ కార్యక్రమంలో పాల్గొని పక్కపక్కనే కూర్చొన్నారు. మరో నేత ప్రసంగిస్తున్న సమయంలో వీణ చేతిమీద చేయివేసిన రమేశ్ గట్టిగా నొక్కాడు. దీంతో అవాక్కయిన వీణ అతడి చేతిని విదిలించుకుంది. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కాగా ఈ ఘటనపై వీణ మాట్లాడుతూ.. తన పట్ల రమేశ్ అసభ్యంగా ప్రవర్తించడం నిజమేనని, చేయిపట్టుకుని చిక్కిపోయావేమిటి అంటూ అతడు అసభ్యంగా వ్యాఖ్యానించాడని వెల్లడించింది. | nation |
17,245 | 12-11-2017 03:33:15 | హోటల్ బిల్లు తగ్గదు! | న్యూఢిల్లీ: ‘ఏసీ, నాన్ ఏసీ రెస్టారెంట్ల బిల్లుపై జీఎస్టీని 5శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నా అది వినియోగదారుడికి ఉపయోగపడదు. ఎందుకంటే.. జీఎస్టీ తగ్గించిన కౌన్సిల్ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను తొలగించింది. దీంతో ఆ ఐటీసీ అర్హత తొలగించినందున రేట్లు పెంచాలని రెస్టారెంట్ల యాజమాన్యాలు యోచిస్తున్నాయి. | nation |
3,685 | 28-04-2017 02:52:27 | రూ.10 నాణేలపై స్పష్టత ఇవ్వాలి! |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పది రూపాయల నాణేలు చెల్లవనే వదంతులు జోరుగా సాగుతున్నాయి. నెల రోజులుగా ఈ పరిస్థితి ఉంది. రూ.10 నాణేలను తీసుకునేందుకు వ్యాపారులు వెనుకంజ వేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లోని కండెక్టర్స్ సైతం ఈ నాణెలను తీసుకోవడం లేదు. మేము చిల్లర రూరంలో తిరిగి ఇస్తుంటే ప్రయాణీకులు తీసుకోవడంలేదని వీరి వాదన. విద్యుత్ ఛార్జీలు కట్టించుకొనే వారు కూడా వీటిని స్వీకరించడం లేదు. బ్యాంకులు సైతం వీటిని స్వీకరించడంలేదు. దీంతో వినియోగదారులు, బ్యాంకు సిబ్బంది మధ్య వాగ్వివాదం నెలకొంటుంది. నాణెం స్వీకరించమంటూ బ్యాంకులు, దీనిపై ఎటువంటి ప్రకటన చేయకపోవడమేమిటని వినియోగదారులు పరసర్ప ఆరోపణలు గందరగోళ పరిస్థితులకు దారితీస్తున్నాయి. బ్యాంకుల్లోనే వీటిని స్వీకరించకపోవడంతో ఇది కాస్త దావనంలా వ్యాపించడంతో పది నాణెం కాస్త విశేషంగా మారిపోయింది. ఆర్‌బీఐ సైతం ఎటువంటి ప్రకటన చేయకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. గత కొన్ని రోజులుగా వెలువడుతున్న వదంతుల దృష్ట్యా పది రూపాయల నాణేలు తీసుకొనేందుకే భయపడుతున్నారు. దినపత్రికల్లో, టీవీ మాధ్యమాల్లో ఈ విషయమై అవగాహన కలుగజేస్తున్న చాలా మంది తీరులో మాత్రం మార్పు రావడం లేదు. చాప కింద నీరులా ఈ వదంతి ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పాకుతుంది. ఇప్పటికైనా బ్యాంకు అధికారులు, ప్రభుత్వం స్పందించి ఈ వదంతులపై స్పష్టత ఇవ్వాలి. ఈ నాణెలు చెల్లుబాటవుతాయని అవగాహన కలుగజేయాలి.- కల్యాణ్ కుమార్, ఈమెయిల్ ద్వారా | editorial |
13,696 | 21-01-2017 00:29:16 | జల్లికట్టుకు కేంద్రం ఓకే | న్యూఢిల్లీ/చెన్నై, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టు నిర్వహణకు అవకాశమివ్వాలంటూ నాలుగు రోజులుగా తమిళనాట పెల్లుబుకుతున్న నిరసనలను ఉపశమింపజేసేందుకు రాష్ట్రప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్సు ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఆమోదించింది. తిరిగి రాష్ట్రప్రభుత్వానికి పంపింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం, న్యాయ, పర్యావరణ మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, రవిశంకర్ ప్రసాద్, అనిల్ మాధవ్ దవేలతో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే, బీజేపీ నేతలు ఢిల్లీలో జరిపిన చర్చలు ఫలించాయి. న్యాయపరమైన అడ్డంకులు ఎదురుకాకుండా కేంద్రం శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేసింది. తమిళ ప్రజలు జల్లికట్టు క్రీడపై భావోద్వేగంతో ఉన్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్య పరిష్కారం దిశగా సంప్రదింపులు జరుపుతున్నాయని, దీనిపై వెలువరించాల్సిన తీర్పును వాయిదావేయాలని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టును శుక్రవారం అభ్యర్థించారు. వారంపాటు తన తీర్పు వాయిదాకు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్.భానుమతిలతో కూడిన ధర్మాసనం ఇందుకు అంగీకరించింది. ఇంకోవైపు.. గురువారం ప్రధానిని కలిసిన సెల్వం శుక్రవారం ఉదయం న్యాయ నిపుణులతో, కేంద్రమంత్రులతో చర్చలు జరిపారు. అనంతరం ఢిల్లీలో, చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్రం గతం లో పశువులపై క్రూరత్వ నిరోధక చట్టానికి రాష్ట్రప్రభుత్వం సవరణ చేస్తుందని, తద్వారా జల్లికట్టుకు మార్గం సుగమం చేస్తుందని తెలిపారు. ముసాయిదా ఆర్డినెన్సును సిద్ధంచేసి కేంద్ర హోంశాఖకు పంపామని, అది అంగీకరించగానే.. రాష్ట్రపతి ఆమోదానికి పంపుతుందన్నారు .మరోవైపు, జల్లికట్టుకు మద్దతుగా, పెటాకు వ్యతిరేకంగా తమిళనాడు వ్యాప్తంగా డీఎంకే శుక్రవారం రైల్‌రోకో నిర్వహించింది. 5 వేల మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు స్టాలిన ప్రకటించారు. కాగా, జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేసేందుకు తమిళనాడు రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్సులో కేంద్ర పర్యావరణ, న్యాయశాఖలు కొన్ని మార్పులు సూచించి హోంశాఖకు పంపించాయి. రాత్రికి దానిని ఆమోదించి తమిళనాడు సర్కారుకు పంపినట్లు హోంశాఖ ప్రతినిధి తెలిపారు. | nation |
12,179 | 19-09-2017 03:07:26 | వైమానిక వీరునికి ఘనంగా వీడ్కోలు | న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: వైమానిక దళ ‘మార్షల్’ అర్జన్‌సింగ్‌కు ప్రభుత్వం ఘనవీడ్కోలు పలికింది. సోమవారం ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్‌స్వ్కేర్ శ్మశానవాటికలో ఆయనకు అధికార లాంఛనాలతో సిక్కు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించింది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, హర్దీ్‌పసింగ్ పూరి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ సీనియర్ నేత ఆడ్వాణీ, త్రివిధ దళాల అధిపతులు, ప్రముఖులు హాజరయ్యారు. వైమానిక దళంలో అసాధారణ సేవలు అందించిన ఈయనకు నివాళిగా సుఖోయ్ యుద్ధ విమానాలు, వైమానిక దళ హెలికాప్టర్లు గగనంలో ‘ఫ్లై పాస్ట్’ నిర్వహించాయి. అర్జన్‌సింగ్ మృతికి సంతాపసూచకంగా రాష్ట్రపతి భవన్‌తో సహా ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండాను అవతనం చేశారు. | nation |
1,695 | 28-02-2017 00:43:05 | జిఎంఆర్ చత్తీస్‌గఢ్ ఎనర్జీలో రుణదాతలకు షేర్లు |
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జిఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (జిఐఎల్) అనుబంధ సంస్థ జిఎంఆర్ చత్తీస్‌గఢ్ ఎనర్జీ లిమిటెడ్ (జిసిఈల్).. రుణదాతల కన్సార్షియానికి మెజారిటీ ఈక్విటీ షేర్లను కేటాయించినట్లు వెల్లడించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) నిబంధనలకు లోబడి వ్యూహాత్మక రుణ పునర్ వ్యవస్థీకరణ (ఎస్‌డిఆర్)కు అనుగుణంగా రుణదాతలకు ఈక్విటీ షేర్ల కేటాయింపును జిసిఈల్ చేపట్టిందని పేర్కొంది. వడ్డీతో కలుపుకుని మొత్తం రుణ భారం 8,800 కోట్ల రూపాయలుండగా 52.4 శాతం వాటాలు కలిగిన రుణదాతల కన్సార్షియానికి 2,992 కోట్ల రూపాయల మొత్తానికి సమానమైన ఈక్విటీ షేర్లను కన్వర్ట్ చేసినట్లు జిఎంఆర్ ఇన్‌ఫ్రా తెలిపింది. మిగిలిన 47.6 శాతం వాటాలు జిఎంఆర్ చేతుల్లో ఉండనున్నాయి. ఈక్విటీ కన్వర్షన్‌తో సంస్థ మొత్తం రుణ భారం 5,800 కోట్ల రూపాయలకు తగ్గనుంది. కాగా రుణదాతల కన్సార్షియం చేతిలో 2,992 కోట్ల రూపాయల ఈక్విటీ ఉండనుండగా జిఎంఆర్ గ్రూప్ చేతిలో 2,721 కోట్ల రూపాయల ఈక్విటీ ఉండనుంది. | business |
12,789 | 09-04-2017 02:27:01 | ఎంపీ స్థానాలు పెరగాలి! | న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియను మరింత బలోపేతం చేసేందుకు బలమైన ఎన్నికల సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. శనివారం ఢిల్లీలో జరిగిన ‘ఎన్నికలు-ఆర్థిక సంస్కరణలు’ అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. దేశం లో పెరిగిన జనాభాకు అనుగుణంగా పార్లమెంటు స్థానాల సంఖ్యను పెంచేందుకు న్యాయపరమైన అంశాలపై దృష్టి సారించాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. తక్కువ ఎంపీలు ఉన్న పార్టీ కూడా అధికారపార్టీతో సమానంగా హక్కులను అనుభవిస్తోందని, అలాంటి పార్టీలకు ఏ బాధ్యత ఉండటం లేదని, ఈ పరిస్థితిలో మార్పు రావాల్సి ఉం దని చెప్పా రు. పార్లమెంటులో 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్దేశించిన సంఖ్యలో ఎంపీలు ఉన్నారని, దీనికి కారణం మనం చేసుకున్న చట్టాలేనని వ్యాఖ్యానించారు. 128 కోట్ల మంది ప్రజలకు.. 80 కోట్ల మంది ఓటర్లకు కేవలం 543 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహించడం సరికాదని చెప్పారు. ‘ప్రజాభిప్రాయానికి పెద్ద పీట వేయాలంటే మ రింత మంది ఎంపీలు అవసరం. దానికి అవసరమైన సంస్కరణలకు ఇదే సరైన సమయం’ అన్నారు. బ్రిటన్‌లో 600 మంది ఎంపీలు ఉన్నారని, పలు రెట్ల జనాభా ఉన్న భారతలో మరింత మంది ఎంపీలు ఉండటంలో తప్పులేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు సరైన స మయంలో బలమైన ఎన్నికలు సంస్కరణలు చేయాలని సూచించారు. సంకీర్ణ ప్రభుత్వాలను.. తరచూ ఎన్నికలు జరగడాన్ని అడ్డుకోవాలంటే ఎన్నికల సంస్కరణలు అవశ్యమన్నారు. | nation |
6,636 | 08-04-2017 11:41:06 | తమిళ సినిమాలో సరికొత్త ప్రయోగం చేసిన తెలుగు నటి | మలయాళంలో నటఆరంగేట్రం చేసి, తమిళ సినిమాలో స్థిరంగా రాణిస్తున్న తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. కెరీర్ ప్రారంభంలో హోమ్లీ పాత్రల్లో మెప్పించిన ఐశ్వర్య ‘కాక్కాముట్టై’తో నటిగా మరో స్థాయికి చేరుకుంది. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కోలీవుడ్‌లో ప్రత్యేక ముద్ర వేసుకున్న ఐశ్వర్య ప్రస్తుతం మలయాళంలో ‘సగావు’ అనే చిత్రంలో నటిస్తోంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంలో నివిన పౌలి హీరో. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఈ చిత్రంలో ఐశ్వర్య 65 ఏళ్ల బామ్మ పాత్రలో నటించింది. నటనపరంగా ఈ చిత్రం తనకు మంచి పేరు తీసుకువస్తుందని ఐశ్వర్య ఆశిస్తోంది. | entertainment |
3,172 | 04-11-2017 00:42:17 | ఆల్వోజెన్ ఔషధానికి ఆమోదం | నాట్కో వెల్లడిహైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అమెరికా మార్కెట్లో ఇన్‌ఫ్లుయెంజా చికిత్సలో వినియోగించే ఒసెల్టామివిర్ ఫాస్ఫేట్ పౌడర్‌ను మార్కెట్ చేసేందుకు మార్కెటింగ్ భాగస్వామి ఆల్వోజెన్‌కు అనుమతి లభించిందని నాట్కో ఫార్మా వెల్లడించింది. ఒసెల్టామివిర్ ఫాస్ఫేట్‌కు సంబంధించి ఆల్వోజెన్ తుది అనుమతిని అందుకోవటమేకాకుండా తత్సమానమైన జెనరిక్‌ను తొలిసారిగా మార్కెట్లోకి తీసుకురానుందని తెలిపింది. నోటి ద్వారా తీసుకునే ఈ పౌడర్‌ను 6 ఎంజి/ఎంఎల్ రూపంలో అమెరికా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు పేర్కొంది. గత ఏడాది డిసెంబరులో ఆల్వోజెన్ ఈ ఔషధానికి సంబంధించి జెనరిక్‌ను అమెరికా మార్కెట్లోకి తీసుకువచ్చింది. | business |
10,544 | 01-11-2017 12:15:39 | శివ బాలాజీ, నవదీప్‌తో మల్టీ స్టారర్ మూవీ? | బిగ్‌బాస్ షో కంటెస్టంట్స్ అంతా ఆ షో తర్వాత చాలా బిజీ అయ్యారు. ముఖ్యంగా విన్నర్ శివ బాలాజీ, నవదీప్ తదితరులకు ఆఫర్లు వెదుక్కుంటూ వస్తున్నాయి. ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ శివబాలాజీ, నవదీప్‌తో మల్టీస్టారర్ మూవీ చేసేందుకు రెడీ అవుతోందని సమాచారం. ఈ సినిమాను ఓ అప్‌కమింగ్ డైరెక్టర్ డైరెక్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. శివ బాలాజీ, నవదీప్ ఇద్దరూ కథ విన్నారని టాక్. ఇంకా వారి నిర్ణయాన్ని మాత్రం వెల్లడించలేదని తెలుస్తోంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే.. సినిమా త్వరలోనే ప్రారంభమవుతుందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శివబాలాజీ తను నటించి.. నిర్మించిన సినిమా 'స్నేహమేరా జీవితం'ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. | entertainment |
8,395 | 24-05-2017 14:34:15 | అఖిల్ సినిమా ఆగిపోవడానికి కారణమేంటో తెలుసా? | వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ‘అఖిల్’ సినిమాతో అరంగేట్రం చేశాడు అక్కినేని అఖిల్. అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా అఖిల్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో రెండో సినిమా చేయడానికి రెండేళ్లపాటు ఆలోచించాడు. చివరికి క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్.కె.కుమార్ డైరెక్షన్‌లో తన రెండో సినిమాను మొదలుపెట్టాడు.విదేశీ స్టంట్ కొరియోగ్రాఫర్ల పర్యవేక్షణలో ఇటీవల హైదరాబాద్‌లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో, మెట్రో రైల్ ప్రాజెక్టులో ఈ సినిమాకు సంబంధించిన కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఇప్పుడు ఆ సినిమా షూటింగ్‌ను ఆపేశారట. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల సినిమా షూటింగ్ ఆపేశారనుకుంటున్నారేమో! కాదు.. హీరోయిన్ దొరక్క ఆ సినిమాను ఆపేశారట. ఇప్పటి వరకు ఈ సినిమాకు హీరోయిన్ దొరకలేదు. ఇప్పుడు తెలుగులో ఉన్న టాప్ హీరోయిన్‌లెవరూ అఖిల్ పక్కన సెట్ కారు. ఎందుకంటే వారందరి కంటే అఖిల్ వయసులో చిన్నవాడు. బాలీవుడ్ బ్యూటీలు కూడా తెలుగులో చేయడానికి అంగీకరించడం లేదు. దీంతో మరోసారి ఓ కొత్త అమ్మాయిని పరిచయం చేయాలని భావిస్తోందట చిత్ర యూనిట్. ఇప్పటికే ఆడిషన్స్ నిర్వహించిన నలుగురు అమ్మాయిలను ఫైనలైజ్ చేశారట. వాళ్లలో ఒకర్ని సెలెక్ట్ చేసి మళ్లీ షూటింగ్ ప్రారంభిస్తారట. అప్పటివరకు షూటింగ్‌కు బ్రేక్‌ఇస్తారట. | entertainment |
191 | 14-03-2017 23:52:40 | బ్రోకరేజ్ సంస్థలు ఏం చెబుతున్నాయి... | ఎన్‌పిఎల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల బ్యాంకింగ్ షేర్లలో దూకుడు ఉంటుందని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ అభిప్రాయపడింది. యస్ బ్యాం క్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, మారుతి సుజుకీ, సన్ ఫార్మా, భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండియన్ ఆయిల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, పవర్‌గ్రిడ్ షేర్లపై బ్రోకింగ్ సంస్థ రెలిగేర్ విశ్వాసంతో ఉంది. మిడ్ క్యాప్‌లో ఇంద్రప్రస్థ గ్యాస్, టాటా కమ్యూనికేషన్స్, టొరెంట్ ఫార్మా, ర్యాలీస్ ఇండియా, వి మార్ట్, ఇంజినీర్స్ ఇండియా, ఎంఎం ఫైనాన్షియల్ సర్వీసెస్, రెప్కో హోమ్ ఫైనాన్స్‌పై దృష్టి పెట్టొచ్చని కూడా రెలిగేర్ సూచించింది. నిర్మల్ బంగ్ నివేదిక ప్రకారం.....ఆటోమొబైల్స్: ద్విచక్ర వాహనాల డిమాండ్ ఇంకా బలహీనంగానే ఉంది. కార్ల విషయంలో మాత్రం డిమాండ్ బలంగా ఉంది. పలు మోడల్స్‌లో మారుతి సుజుకీ ఆర్డర్ల బ్యాక్‌లాగ్ సమస్యను ఎదుర్కొంటున్నది. ఈ రంగంలో రెండంకెల వృద్ధి రేటు కొనసాగే అవకాశం ఉంది. ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే, రానున్న నెలల్లో విక్రయాలు పుంజుకునే అవకాశం ఉంది. ఏప్రిల్-మే నెలల్లో అమ్మకాలు పుంజుకుంటే కొత్త ఆర్థిక సంవత్సరానికి ఈ పరిశ్రమ కూడా రెండంకెల వృద్ధి రేటును అందుకునే అవకాశం ఉంది.సిమెంట్: డీలర్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం డిమాండ్ ఇంకా బలహీనంగానే ఉంది. రానున్న రోజుల్లో ధరలు కూడా పెద్దగా పెరగకపోవచ్చు. మౌలిక వసతుల రంగంలో ప్రభు త్వ వ్యయం మరింత పెరిగితే కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంటుంది. అప్పుడు ధరల్లో కదలికకు అవకాశం ఉంది. విద్యుత్ వినియోగ ఉపకరణాలు: పెద్ద నోట్ల రద్దు దెబ్బకు కుంగిన డిమాండ్ మళ్లీ క్రమంగా పుంజుకుంటున్నది. దీర్ఘకాలికంగా అమ్మకాల్లో మంచి వృద్ధికి అవకాశం ఉంది. | business |
2,934 | 04-09-2017 00:19:07 | ఇందిరా ఐవిఎఫ్ రూ.250 కోట్ల పెట్టుబడి | మార్చి నాటికి మరో 25 ఐవిఎఫ్ క్లినిక్స్ ఏర్పాటుహైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్) : ఇన్‌ఫెర్టిలిటీ క్లినిక్ సంస్థ ఇందిరా ఐవిఎఫ్ కార్యకలాపాలను పెద్ద ఎత్తున విస్తరించేందుకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికల్లా ఐవిఎఫ్ క్లినిక్‌ల సంఖ్యను 50కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇందిరా ఐవిఎఫ్ చైర్మన్ అజయ్ ముర్దియా, డైరెక్టర్ నితిజ్ ముర్దియా వెల్లడించారు. ఆదివారం నాడిక్కడ 25వ ఐవిఎఫ్ క్లినిక్‌ను ప్రారంభించిన సందర్భంగా అజయ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో తమకు ఇది తొలి క్లినిక్ అని చెప్పారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ కేంద్రంగా ఇందిరా ఐవిఎఫ్ ఉత్తరాది మార్కెట్లో కార్యకలాపాలు సాగిస్తుండగా కొద్దికాలం క్రితమే దక్షిణాది మార్కెట్లోకి అడుగుపెట్టినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే చెన్నై, బెంగళూరుల్లో ఐవిఎఫ్ క్లినిక్‌లను నిర్వహిస్తుండగా తాజాగా హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. 7 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తె క్లోజ్డ్ వర్కింగ్ చాంబర్ ఐవిఎఫ్ టెక్నాలజీని దేశంలో తొలిసారిగా ఉపయోగిస్తున్నది ఇందిరా ఐవిఎఫ్ అని వివరించారు. ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవిఎ్‌ఫ)కు తోడుగా ఎప్పటికప్పుడు అధునాతన చికిత్సలను అందుబాటులో తీసుకురావటం ద్వారా ఫెర్టిలిటీ రేటు 70 శాతం వరకు సాధిస్తున్నట్లు చెప్పారు. కాగా కార్యకలాపాల విస్తరణలో భాగంగా తెలంగాణలోని వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం నగరాలతో పాటు తమిళనాడులోని ఈరోడ్, కోయంబత్తూరు, తిరుచ్చి, మధురై, కర్ణాటకలోని రాయ్‌చూర్, దావణగారె నగరాలకు విస్తరించనున్నట్లు డైరెక్టర్ నితిజ్ ముర్దిజా చెప్పారు. ఈ ఏడాది రూ.500 కోట్ల టర్నోవర్‌గత ఆర్థిక సంవత్సరంలో ఇందిరా ఐవిఎఫ్ 259 కోట్ల రూపాయల రాబడులను ఆర్జించిందని సంస్థ చైర్మన్ అజయ్ వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 500 కోట్ల రూపాయల రాబడులను ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. కాగా నిధుల సమీకరణ కోసం ప్రైవేట్ ఈక్విటీ సంస్థలతో చర్చలు సాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందిరా ఐవిఎ్‌ఫలో పిఇ సంస్థలకు 20 శాతం వాటాను విక్రయించటం ద్వారా 750 కోట్ల రూపాయలు సమీకరించాలని చూస్తున్నట్లు చెప్పారు. సంవత్సరాంతం నాటికల్లా నిధుల సమీకరణ పూర్తయ్యే అవకాశం ఉందని అజయ్ తెలిపారు. | business |
8,162 | 24-04-2017 13:50:34 | ఆఖరికి ‘అయ్యా.. నన్ను ఒగ్గేయండయ్యా’ అన్న రాజమౌళి | అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘బాహుబలి-2’ సినిమా విడుదలకు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. మామూలుగా ఓ భాషలో విడుదయ్యే సినిమాకే బోల్డెంత టెన్షన్ పడిపోతుంటారు దర్శక, నిర్మాతలు. అలాంటిది వివిధ భాషల్లో దేశవ్యాప్తంగా విడుదల కాబోతున్న సినిమా అంటే ఇంకెంత టెన్షన్ ఉంటుంది. ఇలాంటి సమయంలో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చేసిన ట్వీట్ రాజమౌళికి చిరాకు తెప్పించిందో ఏమిటో.. ‘అయ్యా.. నన్ను ఒగ్గెయండయ్యా’ అంటూ ట్వీట్ చేశాడు. గతంలో రాజమౌళితో తీయించుకున్న ఓ ఫోటోను షేర్ చేసిన వర్మ.. ‘ఈ ఫోటోలో నేను అసహ్యంగా ఉన్నాను. రాజమౌళి అందంగా ఉన్నాడు’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు బాలీవుడ్ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ స్పందించాడు. ‘మీరు ఇద్దరూ గొప్ప దర్శకులనడంలో సందేహం లేదు. అయితే ఈ ఫోటోలో మీరిద్దరూ అసహ్యంగానే ఉన్నార’ని ట్వీట్ చేశాడు కమాల్. దీంతో రాజమౌళికి చిర్రెత్తుకొచ్చింది. ‘మీరు చాలా బాగా చెప్పారు. అందరూ మీ అంత, షారూక్ అంత అందంగా ఉండలేర’ని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. దానికి స్పందించిన కమాల్.. ‘నేను అందంగా ఉన్నానన్న విషయం నాకు తెలుసు. షారూక్ గురించి మాత్రం చెప్పలేన’ని ట్వీట్ చేశాడు. ఆ తర్వాత రామ్‌గోపాల్ వర్మ స్పందిస్తూ.. ‘ఆ విషయం ప్రపంచం మొత్తం అంగీకరిస్తుంద’ని చెప్పాడు. ఆ తర్వాత రాజమౌళి ‘అయ్యా.. నన్ను ఒగ్గెయండయ్యా’ అంటూ ట్వీట్ చేశాడు. | entertainment |
20,103 | 15-05-2017 01:40:48 | క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు | చీరాల : ప్రకాశం జిల్లా చీరాలలోని ఓ రెస్టారెంట్‌ను కేంద్రంగా చేసుకుని క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఎనిమిది మంది సభ్యుల ముఠాను పోలీసులు శనివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. వారి నుంచి ఎనిమిది సెల్‌ఫోన్లు, రూ. 97,250 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని సోమవారం కోర్టుకు హాజరుపర్చనున్నారు. | sports |
15,165 | 02-01-2017 01:27:23 | వృద్ధులకు ఉచితంగా చేతికర్రలు, కళ్లజోళ్లు! |
న్యూఢిల్లీ, జనవరి 1: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వృద్ధులకు చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం అమలు చేయనున్నది. ఈ పథకం కింద వృద్ధులకు నిత్య జీవనంలో ఉపయోగపడే చేతికర్రలు, కళ్లజోళ్లు, కట్టుడుపళ్లు, వినికిడి పరికరాలు ఉచితంగా అందజేయనున్నది. ఈ నెల నుంచి మార్చి వరకు ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల్లోని రెండు జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించనుంది. ప్రతి జిల్లాలో కనీసంగా వెయ్యి మందికి లబ్ధి చేకూర్చేలా ఈ వినూత్న పథకాన్ని అమలు చేస్తారు. ఈ మేరకు లబ్ధిదారులను గుర్తించాలని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి తవర్‌చంద్ గెహ్లాట్ ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ లబ్ధిదారులను గుర్తించాలని, వినికిడి పరికాలు, కృత్రిమ దంతాల ఏర్పాటుకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆ లేఖలో కేంద్రం సూచించింది. అవసరమైన పరికరాలు సరఫరా చేసే ఏజెన్సీలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎల్‌ఎంసీవో) గుర్తించనుంది. | nation |
1,622 | 17-09-2017 00:01:45 | సోమవారం గూగుల్ తేజ్ విడుదల | న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న డిజిటల్ పేమెంట్ వ్యాపారాన్ని అందిపుచ్చుకునేందుకు అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సిద్ధమైంది. ఇందుకోసం ‘తేజ్’ పేరుతో మొబైల్ ఆధారిత పేమెంట్ యాప్ విడుదల చేస్తోంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఈ యాప్‌ను విడుదల చేస్తారు. వాట్సప్, ఫేస్‌బుక్ కూడా మొబైల్ ఆధారిత పేమెంట్ యాప్‌లను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. | business |
3,618 | 22-01-2017 23:12:13 | ఆత్రేయ పాటలు కావాలి |
- పి.యస్.రెడ్డి | editorial |
3,276 | 03-05-2017 02:27:56 | ‘గురుకుల’ పరీక్షా కేంద్రం హైదరాబాద్ ఒక్కటే అంటే ఎలా? |
తెలంగాణ గురుకుల టీజీటీ, పీజీటీ, పీడీ పోస్టులకు మే 31న నిర్వహిస్తున్న ప్రాథమిక పరీక్షకు కేవలం హైదరాబాద్‌ను మాత్రమే పరీక్షా కేంద్రంగా ఏర్పాటుచేశారు. అందువల్ల నిరుద్యోగ అభ్యర్థులకు తీవ్ర అసౌక్యర్యం కలుగుతున్నది. ఆదిలాబాద్, ఖమ్మం వంటి సుదూర ప్రాంతాల వారు ఒకటి, రెండు రోజల ముందే హైదరాబాద్‌కు చేరుకోవాల్సి రావడం అభ్యర్థులపై తీవ్రమైన ఆర్థికభారం పడే అవకాశం ఉంటుంది. ఎన్నో జాతీయస్థాయి పరీక్షలను హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, వరంగల్ వంటి నగరాల్లో నిర్వహిస్తున్నారు. అయితే ఈ పరీక్షలను కేవలం హైదరాబాద్‌లోనే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఏ మాత్రం సమంజసంగా లేదు. టీఎస్‌పీఎస్సీ వారు నిరుద్యోగ యువతీ యువలకులకు కలిగే ఇబ్బందులను, అసౌకర్యాన్ని గుర్తించి గురుకుల పరీక్షలను అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలి.- అలాజ్‌పూర్ లక్ష్మీనారాయణ, సిద్ధిపేట | editorial |
3,573 | 09-03-2017 23:50:45 | అమరావతి! అదొక బ్రాండ్ | రాజధాని పరిసర ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అమరావతి పేరు వినిపిస్తోంది. ఏ వ్యాపారం మొదలుపెట్టినా దానికి అమరావతి పేరును జోడిస్తున్నారు. తాత్కాలిక రాజధాని పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం, అమరావతి రాజధాని అడ్మినిస్ట్రేటివ్ భవనాలకు శంకుస్థాపన జరగడం వచ్చే రోజుల్లో అమరావతి పేరు మరింత విస్తృతం కానుంది. సర్వం అమరావతి పేరు మార్మోగనుంది. తెలుగు ప్రజల జీవితాలకు సరికొత్త వెలుగులు అద్దనుంది. అమరావతి అంటే ఆత్మీయత, అమరావతి అంటే అభివృద్ధి, అమరావతి అంటే అభిమానం, అమరావతి అంటే అదృష్టం, అమరావతి అంటే తెలుగుజాతి ఆత్మ. అవును ఇప్పుడు తెలుగు ప్రజలు కోరుకుంటున్నదదే. అమరావతి రాజధాని నగరం దేశంలోనే నెంబర్ 1గా నిలవాలన్నది తెలుగు ప్రజల అభిమాతం. అమరావతి పేరు ఇప్పుడు మార్మోగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో ఆటుపోట్లతో పాలన ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడగులు వేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా సచివాలయం నిర్మించుకోవడం, అసెంబ్లీ నిర్మించుకోవడం తాజాగా కృష్ణానదిపై రెండస్తుల ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం తెలుగునేలపై సరికొత్త చరిత్ర ఆవిష్కరిస్తోంది. అమరావతి అంటే అలనాడు ఇంద్రుడు ఏలిన రాజ్యం. ఇప్పుడు తెలుగు ప్రజల రాజధానీ నగరంగా భాసిల్లనుంది. తెలుగు ప్రజల వెలుగు దివ్వెగా వెలుగుతున్న అమరావతి దివ్యకాంతుల తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయని ప్రతిఒక్కరూ భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఏ జిల్లాకు వెళ్లినా, ముఖ్యపట్టణమైనా, నగరమైనా, గ్రామమైనా... ఎక్కడకు వెళ్లినా అమరావతి నాదం మార్మోగుతోంది. అమరావతి తమకు బ్రాండ్ క్రియేట్ చేస్తోందని తెలుగు ప్రజలు విశ్వసిస్తున్నారు. అంతర్జాతీయ సొబగులు దిద్దుకుంటూ నిర్మితమవుతున్న ఆధునిక నగరం అమరావతి ఇప్పుడు ఓ బ్రాండ్‌గా ఖ్యాతి పొందుతోంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా వేనోళ్ల కీర్తి పొందుతున్న నగరంగా అమరావతి కొత్త చరిత్రకు నాంది పలుకుతోంది. హిందూ, బౌద్ధ సంస్కృతికి ఆలవాలమైన అమరావతి రాజధాని ప్రకటనతోనే దేశంలోనూ, అటు అంతర్జాతీయ పటంలోనూ తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంటోంది. అమరావతి ఓ ట్రేడ్ మార్క్ సింబలై పోయింది. అమరావతి ఒక బిజినెస్ మోడల్ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి ఓ బిజినెస్ సింబల్‌గా విరాజిల్లుతోంది. కన్‌స్ట్రక్షన్‌కు స్వర్గధామంగా మారుతోంది. విద్యా కేంద్రానికి ఆయువుపట్టుగా మారబోతోంది. పరిశ్రమల రాకతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు నిలయంగా మారనుంది. పరమశివుడు అమరేశ్వరునిగా కొలువైన దివ్యధామానికి సమీపంలో ఏర్పాటు చేస్తున్న కొత్త రాజధాని ఇప్పుడు ఓ బ్రాండ్ సింబల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. నాడు శాతవాహనుల కాలంలో విరాజిల్లిన అమరావతి రాబోయే కాలంలో ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యమైన, అత్యుత్తమ రాజధాని నగరంగా రూపుదిద్దుకుంటుందని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది పాలకుల, రాజకీయ నాయకుల మాటే కాదు... ఇది ప్రజల మాట. అది కూడా ఎక్కడి వారి మాటో కాదు... అమరావతి ప్రజల మాట. అవును ఇప్పుడు రాజధాని పరిసర ప్రాంత ప్రజలు అమరావతి జపం చేస్తున్నారు. అవునండీ అమరావతి కలల సౌధం ఆవిష్కృతం కాక ముందే వారు తమ అమరావతితో తాము అనుకున్న కార్యక్రమాలను ఎంచక్కా చేసుకుంటున్నారు. అవును రాజధాని పరిసర ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అమరావతి పేరు వినిపిస్తోంది. ఏ వ్యాపారం మొదలుపెట్టినా దానికి అమరావతి పేరును జోడిస్తున్నారు. ఏకంగా 200కు పైగా వ్యాపార నిర్వాహకులు ఇప్పుడు అమరావతి పేరుతో తమ వ్యాపార వాణిజ్య కార్యక్రమాలను సాగిస్తున్నారు. వారందరిదీ ఒకటే మాట, ఒకటే పేరు. రియల్ వెంచర్లు, హోటళ్లు, రిసార్టులు, ఆసుపత్రులు, ట్రావెల్స్, షాపింగ్ మాల్స్ ఏవైనా కానివ్వండి, బ్రాండ్ నేమ్ ఒక్కటే అమరావతి. అమరావతి. అవును వ్యాపారం ఏదైనా సరే, ఆ వ్యాపారం అమరావతి పేరు చుట్టూనే తిరుగుతోంది. స్థానిక ప్రజలకు ఇప్పుడు అమరావతి ఫీవర్ పట్టుకొంది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నప్పుడు సైబరాబాద్, హైదరాబాద్ పేరు ఇంటా, బయట మార్మోగేది. ఇప్పుడు అమరావతి పేరు అదే విధంగా పేరు ప్రఖ్యాతులు పొందుతోంది. రాష్ట్ర రాజధానిగా నిర్మితమవుతున్న అమరావతి నగరానికి సమీప ప్రాంతాల్లో నివశించే ప్రజలు ఇప్పుడు అమరావతి బాటలో నడుస్తున్నారు. వ్యాపారం చిన్నదైనా, పెద్దదైనా పేరు మాత్రం అమరావతి ఉండేలా చూసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏడాదిన్నర క్రితం రాజధాని నగరంగా అమరావతి పేరు ప్రకటించక ముందు మనకు అమరావతి పట్టణం మాత్రమే తెలుసు. కాని ఇప్పుడు అమరావతి పేరుతో వెలిసిన వ్యాపార, వాణిజ్య సముదాయాలకు లెక్కే లేదు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లా ప్రాంత ప్రజల్లో రాజధాని క్రేజ్ పెరుగుతూ వస్తోంది. దానికి చిహ్నమే అమరావతి పేరుతో వెలుస్తున్న దుఖాణాలు. అమరావతి పేరు పెట్టుకోవడం వల్ల తమ వ్యాపారాలకు మంచి మైలేజ్ వస్తుందని భావనలో స్థానికులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన అమరావతి షాపింగ్ ఫెస్టివల్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ ఫెస్టివల్‌లో నగర యువత పెద్ద ఎత్తున పాల్గొంది. కార్పోరేట్ కంపెనీల ఉత్పత్తులను భారీ డిస్కౌంట్లకు ఇవ్వడంతో పాటు, సంగీత, నృత్య కార్యక్రమాలు ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు ఆర్టీసీ అమరావతి పేరుతో ప్రత్యేక బస్ సర్వీసులను నడుపుతోంది. అటు ప్రైవేటు ట్రావెల్స్ సైతం అమరావతి పేరుతో సర్వీసులను నిర్వహిస్తున్నాయి. స్థానికులు, రాజకీయవేత్తలు, వ్యాపార వేత్తలు అందరూ మా రాజధాని పేరుతో మేం వ్యాపారాలు చేస్తే తప్పేంటి? రాజధానికి మరింత ఊతమొస్తుందన్న నమ్మకంతోనే అమరావతి పేరు పెట్టుకున్నామని ప్రజలు చెప్తున్నారు. అమరావతి పేరు పెట్టుకోవడం ద్వారా తాము ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మద్దతిస్తున్నామన్న సంకేతాలను వారు ఇస్తున్నారు. అమరావతి పేరు కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పట్టణాలకే కాదు, రాష్ట్రంలోని పలు ప్రధాన పట్టణాల్లో ఇప్పుడు ఈ పేరు రోజు రోజుకూ పాపులర్ అవుతూ వస్తోంది. తాత్కాలిక రాజధాని పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం, అమరావతి రాజధాని అడ్మినిస్ట్రేటివ్ భవనాలకు శంకుస్థాపన జరగడం వచ్చే రోజుల్లో అమరావతి పేరు మరింత విస్తృతం కానుంది. సర్వం అమరావతి పేరు మార్మోగనుంది. తెలుగు ప్రజల జీవితాలకు సరికొత్త వెలుగులు అద్దనుంది.శివప్రసాద్ లేళ్లసీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఏ జిల్లాకు వెళ్లినా, ముఖ్యపట్టణమైనా, నగరమైనా, గ్రామమైనా... ఎక్కడకు వెళ్లినా అమరావతి నాదం మార్మోగుతోంది. అమరావతి తమకు బ్రాండ్ క్రియేట్ చేస్తోందని తెలుగు ప్రజలు విశ్వసిస్తున్నారు. అంతర్జాతీయ సొబగులు దిద్దుకుంటూ నిర్మితమవుతున్న ఆధునిక నగరం అమరావతి ఇప్పుడు ఓ బ్రాండ్‌గా ఖ్యాతి పొందుతోంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా వేనోళ్ల కీర్తి పొందుతున్న నగరంగా అమరావతి కొత్త చరిత్రకు నాంది పలుకుతోంది. హిందూ, బౌద్ధ సంస్కృతికి ఆలవాలమైన అమరావతి రాజధాని ప్రకటనతోనే దేశంలోనూ, అటు అంతర్జాతీయ పటంలోనూ తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంటోంది. అమరావతి ఓ ట్రేడ్ మార్క్ సింబలై పోయింది. అమరావతి ఒక బిజినెస్ మోడల్ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి ఓ బిజినెస్ సింబల్‌గా విరాజిల్లుతోంది. కన్‌స్ట్రక్షన్‌కు స్వర్గధామంగా మారుతోంది. విద్యా కేంద్రానికి ఆయువుపట్టుగా మారబోతోంది. పరిశ్రమల రాకతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు నిలయంగా మారనుంది. పరమశివుడు అమరేశ్వరునిగా కొలువైన దివ్యధామానికి సమీపంలో ఏర్పాటు చేస్తున్న కొత్త రాజధాని ఇప్పుడు ఓ బ్రాండ్ సింబల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. నాడు శాతవాహనుల కాలంలో విరాజిల్లిన అమరావతి రాబోయే కాలంలో ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యమైన, అత్యుత్తమ రాజధాని నగరంగా రూపుదిద్దుకుంటుందని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది పాలకుల, రాజకీయ నాయకుల మాటే కాదు... ఇది ప్రజల మాట. అది కూడా ఎక్కడి వారి మాటో కాదు... అమరావతి ప్రజల మాట. అవును ఇప్పుడు రాజధాని పరిసర ప్రాంత ప్రజలు అమరావతి జపం చేస్తున్నారు. అవునండీ అమరావతి కలల సౌధం ఆవిష్కృతం కాక ముందే వారు తమ అమరావతితో తాము అనుకున్న కార్యక్రమాలను ఎంచక్కా చేసుకుంటున్నారు. అవును రాజధాని పరిసర ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అమరావతి పేరు వినిపిస్తోంది. ఏ వ్యాపారం మొదలుపెట్టినా దానికి అమరావతి పేరును జోడిస్తున్నారు. ఏకంగా 200కు పైగా వ్యాపార నిర్వాహకులు ఇప్పుడు అమరావతి పేరుతో తమ వ్యాపార వాణిజ్య కార్యక్రమాలను సాగిస్తున్నారు. వారందరిదీ ఒకటే మాట, ఒకటే పేరు. రియల్ వెంచర్లు, హోటళ్లు, రిసార్టులు, ఆసుపత్రులు, ట్రావెల్స్, షాపింగ్ మాల్స్ ఏవైనా కానివ్వండి, బ్రాండ్ నేమ్ ఒక్కటే అమరావతి. అమరావతి. అవును వ్యాపారం ఏదైనా సరే, ఆ వ్యాపారం అమరావతి పేరు చుట్టూనే తిరుగుతోంది. స్థానిక ప్రజలకు ఇప్పుడు అమరావతి ఫీవర్ పట్టుకొంది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నప్పుడు సైబరాబాద్, హైదరాబాద్ పేరు ఇంటా, బయట మార్మోగేది. ఇప్పుడు అమరావతి పేరు అదే విధంగా పేరు ప్రఖ్యాతులు పొందుతోంది. రాష్ట్ర రాజధానిగా నిర్మితమవుతున్న అమరావతి నగరానికి సమీప ప్రాంతాల్లో నివశించే ప్రజలు ఇప్పుడు అమరావతి బాటలో నడుస్తున్నారు. వ్యాపారం చిన్నదైనా, పెద్దదైనా పేరు మాత్రం అమరావతి ఉండేలా చూసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏడాదిన్నర క్రితం రాజధాని నగరంగా అమరావతి పేరు ప్రకటించక ముందు మనకు అమరావతి పట్టణం మాత్రమే తెలుసు. కాని ఇప్పుడు అమరావతి పేరుతో వెలిసిన వ్యాపార, వాణిజ్య సముదాయాలకు లెక్కే లేదు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లా ప్రాంత ప్రజల్లో రాజధాని క్రేజ్ పెరుగుతూ వస్తోంది. దానికి చిహ్నమే అమరావతి పేరుతో వెలుస్తున్న దుఖాణాలు. అమరావతి పేరు పెట్టుకోవడం వల్ల తమ వ్యాపారాలకు మంచి మైలేజ్ వస్తుందని భావనలో స్థానికులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన అమరావతి షాపింగ్ ఫెస్టివల్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ ఫెస్టివల్‌లో నగర యువత పెద్ద ఎత్తున పాల్గొంది. కార్పోరేట్ కంపెనీల ఉత్పత్తులను భారీ డిస్కౌంట్లకు ఇవ్వడంతో పాటు, సంగీత, నృత్య కార్యక్రమాలు ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు ఆర్టీసీ అమరావతి పేరుతో ప్రత్యేక బస్ సర్వీసులను నడుపుతోంది. అటు ప్రైవేటు ట్రావెల్స్ సైతం అమరావతి పేరుతో సర్వీసులను నిర్వహిస్తున్నాయి. స్థానికులు, రాజకీయవేత్తలు, వ్యాపార వేత్తలు అందరూ మా రాజధాని పేరుతో మేం వ్యాపారాలు చేస్తే తప్పేంటి? రాజధానికి మరింత ఊతమొస్తుందన్న నమ్మకంతోనే అమరావతి పేరు పెట్టుకున్నామని ప్రజలు చెప్తున్నారు. అమరావతి పేరు పెట్టుకోవడం ద్వారా తాము ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మద్దతిస్తున్నామన్న సంకేతాలను వారు ఇస్తున్నారు. అమరావతి పేరు కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పట్టణాలకే కాదు, రాష్ట్రంలోని పలు ప్రధాన పట్టణాల్లో ఇప్పుడు ఈ పేరు రోజు రోజుకూ పాపులర్ అవుతూ వస్తోంది. తాత్కాలిక రాజధాని పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం, అమరావతి రాజధాని అడ్మినిస్ట్రేటివ్ భవనాలకు శంకుస్థాపన జరగడం వచ్చే రోజుల్లో అమరావతి పేరు మరింత విస్తృతం కానుంది. సర్వం అమరావతి పేరు మార్మోగనుంది. తెలుగు ప్రజల జీవితాలకు సరికొత్త వెలుగులు అద్దనుంది.శివప్రసాద్ లేళ్లసీనియర్ జర్నలిస్ట్ | editorial |
2,985 | 12-05-2017 00:26:17 | లండన్‌లో ఎన్‌హెచ్‌ఎఐ మసాలా బాండ్లు | లండన్: భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఎఐ) మౌలిక వసతుల రంగానికి అవసరమైన నిధుల సమీకరణ లక్ష్యం గా లండన్ స్టాక్ ఎక్స్ఛేంజిలో రూపాయి మారకపు మసాలా బాండ్లు విడుదల చేసింది. ఈ సంస్థ మసాలా బాండ్లు జారీ చేయడం ఇదే ప్రథమం. భారత రవాణా, షిప్పింగ్, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి ఈ బాండ్ల జారీకి గుర్తుగా ఎక్స్ఛేంజీలో గంట మోగించారు. త్వరిత వృద్ధిని సాధిస్తున్న భారత్ మౌలిక వసతుల రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, ఆ రంగానికి అంతర్జాతీయ ఇన్వెస్టర్ల మద్దతు అవసరమని గడ్కరీ ఈ సందర్భంగా అన్నారు. ఎఎఎ రేటింగ్ ఉన్న ఎన్‌హెచ్‌ఎఐ అత్యంత పటిష్ఠమైన సంస్థ అని, ఆ సంస్థ చేతిలో పలు భారీ ప్రాజెక్టులున్నాయని ఆయన చెప్పారు. తమ ప్రాజెక్టులేవైనా ఆర్థికంగా లాభసాటి అని, ఇన్వెస్టర్లకు మంచి లాభాలు కురిపిస్తాయని తాను భరోసా ఇవ్వగలనని ఆయన తెలిపారు. | business |
9,845 | 03-11-2017 07:56:51 | సౌందర్యరాశి...సనా దువా బికినీ ధరించిన వేళ... | ఎఫ్‌బీబీ ఫెమీనా మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ ఇండియా 2017 గా నిలిచిన సనా దువా బికినీ ధరించి అభిమానులను కనువిందు చేసింది. నల్ల కళ్లు...గోధుమరంగు జుట్టుతో పరిపూర్ణ అందంతో మరింత ఆకర్షణీయంగా ఈ ముద్దు గుమ్మ నిలచింది. బికినీ భామ అయిన సనా దువా తన అందంతో యువతను ఉర్రూతలూగించింది. తెల్ల బికినీతో ఫోటోజెనిక్ హాట్ భామగా సనా ఆకట్టుకుంది. | entertainment |
13,254 | 30-05-2017 02:46:45 | రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కేబినెట్ విస్తరణ |
మొదలైన మోదీ-షా కసరత్తు.. ఎన్నికల కేబినెటే లక్ష్యంయువ మంత్రులకు పదోన్నతి.. ఎన్నికల రాష్ట్రాలకు ప్రాధాన్యంకేబినెట్లోకి సీఎంలు?.. ఒక ముఖ్యమంత్రికి రక్షణ శాఖ న్యూఢిల్లీ, మే 29 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారైంది. రాష్ట్రపతి ఎన్నికల తరువాత ఏ క్షణాన్నైనా కేబినెట్‌ను విస్తరించాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే కేబినెట్‌ను ప్రక్షాళన చేస్తారని, పార్టీ కోసం పనిచేసిన రాష్ట్ర నేతలకు చోటు దక్కే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం మోదీ కేబినెట్‌లో 74 మంది మంత్రులు ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం 82 మంది మంత్రులు కేబినెట్‌లో ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకూ సహాయ మంత్రులుగా సమర్థంగా పని చేస్తున్న మంత్రులకు పదోన్నతులు కల్పించి, కొంతమంది సీనియర్ మంత్రులను పార్టీ పనుల కోసం కేబినెట్ నుంచి తొలగించాలని మోదీ-షా ద్వయం భావిస్తున్నట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేబినెట్‌లో భారీ మార్పులు, చేర్పులు చేపట్టడానికి మోదీ, అమితషాలు కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రదాన్, నిర్మలా సీతారామన్, మనోజ్‌సిన్హా, నఖ్వీలకు పదోన్నతులు తథ్యమని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కల్‌రాజ్ మిశ్రాలాంటి వృద్ధులను తొలగించి యువకులకు స్థానం కల్పించాలని భావిస్తున్న మోదీ 2018లో ఎన్నికలు జరిగే కర్ణాటక, గుజరాత, హిమాచల్ ప్రదేశ్‌లకు కేబినెట్‌లో ఎక్కువ అవకాశం ఇస్తారని సమాచారం. బీజేపీకి చెందిన సీఎంలను కేబినెట్‌లోకి తెచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని, కీలకమైన రక్షణ శాఖను ఒక సీఎంకు అప్పగించాలని మోదీ భావిస్తున్నారని తెలిసింది. భగవత్ తో అమిత్ షా రహస్య చర్చలుఅమిత్ షా సోమవారం ఆరెస్సెస్ అధిపతి మోహన్ భగవతతో చర్చలు జరిపారు. రెండున్నర గంటలపాటు జరిగిన ఈ భేటిలో చర్చించిన అంశాలు బయటకు వెల్లడికాలేదు. అంతకుముందు భగవత, అమిత ఢిల్లీ నుంచి ఒకే విమానంలో నాగ్‌పూర్‌కు చేరుకున్నారు. ఆ వెంటనే అమితషా బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. | nation |
2,368 | 08-03-2017 23:39:07 | కస్టమర్ల కోసం కెవిబి మూడు కొత్త టెక్ సర్వీసులు |
కోయంబత్తూరు: కస్టమర్లకు ప్రయోజనం కలిగించే మూడు కొత్త టెక్నాలజీ సర్వీసులను కరూర్ వైశ్యా బ్యాంకు (కెవిబి) బుధవారం విడుదల చేసింది. వీటిలో ఒకటైన ఫాస్టాగ్‌ను ఎన్‌హెచ్‌ఎఐకి చెందిన ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీతో కలిసి ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రీలోడెడ్ టాగ్స్‌ను వాహనాలకు అమర్చుతారు. ఫలితంగా టోల్ ప్లాజాల వద్ద క్యూలో వేచి ఉండకుండానే తమ టోల్ మొత్తాన్ని ఆటోమెటిగ్గా చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ టాగ్స్ దేశవ్యాప్తంగా పని చేస్తాయి. రెండోది.. యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ). దీని ద్వారా వివిధ బ్యాంకుల ఖాతాలను ఒక యాప్ ద్వారా అనుసంధానం చేసుకుని వివిధ చెల్లింపుల కోసం వినియోగించుకోవచ్చు. మూడోది భారత బిల్ పేమెంట్ సిస్టమ్ (బిబిపిఎస్). దీని ద్వారా అన్ని రకాల యుటిలిటీ బిల్లులను చెల్లించవచ్చు. ఇవి తమ కస్టమర్లకు ఎంతగానో ఉపయోగపడతాయని కెవిబి మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ కె వెంకటరామన్ తెలిపారు. | business |
12,309 | 02-02-2017 04:50:36 | ఈ బడ్జెట్ అందరినీ తప్పుదోవ పట్టించేలా ఉంది : మమతా బెనర్జీ | ఈ బడ్జెట్ అందరినీ తప్పుదోవ పట్టించేలా ఉంది. పూర్తిగా అంకెల గారడీ. అంతా అస్పష్టత. ఈ బడ్జెట్‌కు తగిన కార్యాచరణ, దూరదృష్టి లేదు. - మమతా బెనర్జీ | nation |
10,892 | 28-03-2017 12:08:05 | మెగా ట్యాగ్ వద్దంటున్న బన్నీ! | స్టార్ స్టేటస్‌తో దూసుకుపోతున్న మెగాహీరోల్లో ముందుంటాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అయితే.. మెగా ట్యాగ్ మాత్రం తనకొద్దు అంటున్నాడట అల్లు అర్జున్. సోషల్ మీడియా చేతిలోకి వచ్చాక ప్రతి విషయంపైనా చర్చ జోరుగా సాగుతోంది. స్టైల్‌కు పెట్టింది పేరు అల్లు అర్జున్. అందుకే స్టైలిష్ స్టార్ అంటూ అతడికి బిరుదు ఇచ్చేశారు. ఈ స్టైలిష్ స్టార్ బిరుదుపైనే మెగా అభిమానులు చర్చలు మొదలు పెట్టేశారు. స్టైలిష్ స్టార్‌కు ముందు బన్నీ.. ‘మెగా’ ట్యాగ్‌ను తగిలించుకుని ‘మెగా స్టైలిష్ స్టార్’గా మారితే బాగుంటుందని అభిమానులు ఆకాంక్షించారు. అయితే.. బన్నీ మాత్రం అందుకు సిద్ధంగా లేడని మెగా కాంపౌండ్‌కు సన్నిహితులు అంటున్నారట. అసలు ఆ విషయం గురించి బన్నీ ఆలోచించట్లేదని, మెగా స్టైలిష్ స్టార్‌పై వస్తున్న వార్తలన్నీ నిరాధారమని తేల్చేశారట. సొంతంగా ఓ ఫ్యాన్స్ బేస్‌ను ఏర్పాటు చేసుకునేందుకు గానూ అల్లు అర్జున్ ‘మెగా ఫ్యాన్స్’ బృందం నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నాడని కొంతకాలంగా ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బన్నీ మాత్రం ఆ కామెంట్లపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా చిరంజీవికి తానెంత పెద్ద అభిమానో నిర్మొహమాటంగా చెప్పాడు బన్నీ. కానీ, ‘చెప్పను బ్రదర్’ అన్న ఒకే ఒక్క కామెంట్‌తో పవన్ అభిమానులకు బద్ద శత్రువుగా మారిపోయాడు అల్లు అర్జున్. ఆ వివాదం ఎఫెక్ట్ బన్నీ తాజా చిత్రం దువ్వాడ జగన్నాథం సినిమా టీజర్‌పై ఎంతలా పడిందో అర్థం చేసుకోవచ్చు. ఆ కాంట్రవర్సీలన్నిటిపై మాత్రం బన్నీ సైలెంట్‌గానే ఉన్నాడు. కొంత మంది మాత్రం మెగా ఫ్యామిలీ నుంచే వచ్చిన అల్లు అర్జున్ మెగా హీరోనే అవుతాడని, అలాంటప్పుడు మెగా అనే ట్యాగ్ ఎందుకని అభిప్రాయపడుతున్నారు. | entertainment |
14,909 | 01-08-2017 17:49:12 | మాజీ దోస్త్ నితీశ్‌పై నిప్పులు చెరిగిన లాలు | న్యూఢిల్లీ: మాజీ దోస్త్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ నిప్పులు చెరిగారు. అధికార దాహంతో అలమటిస్తున్న ఆయన వేగంగా రంగులు మార్చేస్తుంటారని, ఒక క్యాంపు నుంచి మరో క్యాంపునకు దూకేస్తుంటారని ఆరోపించారు. ‘‘నితీశ్ ఓ పాల్తు రామ్. అధికారం కోసం పార్టీలు మార్చేస్తారు. అధికారం కోసం ఎన్నిసార్లు పార్టీ మారారో లెక్కేలేదు’’ అని మీడియా సమావేశంలో దుమ్మెత్తి పోశారు. బీజేపీతో జతకట్టడానికి ముందు కూడా మోదీని నితీశ్ విమర్శించారని, ఇప్పుడేమో 2019 ఎన్నికల్లో మోదీని ఢీకొనే మొనగాడే లేడని అంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నితీశ్ తన శక్తి ఏపాటిదో గుర్తెరిగితే మంచిదని హితవు పలికారు. గతంలో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో, ఓసారి లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైన విషయాన్ని నితీశ్ మర్చిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు. అసలు నితీశ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాను అంగీకరించలేదని, అయితే ములాయం చెప్పడంతో అంగీకరించానని లాలా పేర్కొన్నారు. | nation |
19,265 | 28-07-2017 02:30:15 | భార్య శ్రావణ సుందరి.. భర్త చీరల చోరుడు | రాయ్‌పూర్: కాలనీలో నిర్వహించే ‘శ్రావణ సుందరి’ పోటీల్లో భార్య అందంగా కనపడాలని దొంగగా మారాడో టీచరు! రూ.56 వేల విలువ చేసే రెండు డిజైనర్ చీరల్ని దొంగిలించాడు. ఛత్తీస్ గఢ్‌లోని బిలాస్ పూర్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఆ టీచరు పేరు శ్రీకాంత్‌గుప్తా. శ్రావణమాసంలో స్థానిక మహిళలకు నిర్వహించే ‘సావన్ సుందరి’ పోటీల్లో భార్య ధరించేందుకు అతడు రెండు డిజైనర్ చీరల్ని దొంగిలించాడు. కానీ.. షాపులో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఓ వారం తర్వాత అతడి ఇంటికి వెళ్లి చీరలు స్వాధీనం చేసుకుని.. అతణ్ని, భార్యను, బావమరిదిని శ్రీకృష్ణజన్మస్థానానికి పంపారు. | nation |
14,418 | 28-06-2017 02:00:33 | సాగుపై పిడుగు | రైతుకు భారం కానున్న జీఎస్‌టీఎరువుల పన్ను భారం రెట్టింపుట్రాక్టర్లపైనా అదనపు బాదుడుపరికరాలపై ఏకంగా 28 శాతండెయిరీ, పౌల్ట్రీ వ్యవసాయేతరాలేపాలీహౌస్ సేద్యం బేజారుఒక్క పంటలపైనే పన్ను లేకుండా చేసిన కేంద్ర ప్రభుత్వం రైతుకు సంబంధించిన ఇతర అన్ని విషయాల్లో ఎడాపెడా జీఎ్‌సటీని బాదేసింది. ఎరువులు, పురుగు మందుల నుంచి పరికరాల వరకూ ఏ ఒక్క విషయంలోనూ ఊరట మిగలకుండా చేసింది. చిన్న సన్నకారు రైతుల్ని కూడా వదల్లేదు. ఇనుప నాగళ్లు, గుంటకలు మొదలుకుని పంటకు వాడే ఎరువులు, పురుగుల మందులను వెదజల్లే స్ర్పేయర్ల వరకూ అన్నింటి ధరలూ జీఎ్‌సటీ దెబ్బకు పెరగనున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ యాంత్రీకరణపై అమలయ్యే జీఎస్టీ రైతన్నకు మరింత భారం కాబోతోంది. ప్రస్తుతం సాగులో ఇనుప నాగళ్లు, ఇనుప గుంటక, గొర్రుల వాడకమే ఎక్కువగా ఉంది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద వ్యవసాయ శాఖ వీటిని సబ్సిడీపైపంపిణీ చేస్తూ ఉన్నా ఎక్కువ శాతం రైతులు బయటనే కొంటున్నారు. వీటిపై 5 శాతంగా ఉన్న పన్ను జీఎస్టీ అమలైన తర్వాత 12 శాతానికి చేరుకోనుంది. దాంతో ఒక్కో ఉపకరణంపై రూ.200కు పైనే ధర పెరిగే అవకాశం ఉంది. నాలుగైదు ఉపకరణాలు కొంటే వెయ్యి వరకు భారం పెరుగుతుంది. ట్రాక్టర్లకు పరికరాలను అమర్చి పురుగు మందులను చల్లడం ఇటీవల కాలంలో పెరిగింది. చిన్న, సన్నకారు రైతులు మాత్రం స్ర్పేయర్లనే వాడుతున్నారు. రాష్ట్రంలో తైవాన్ స్ర్పేయర్ల వాడకమే ఎక్కువగా ఉంది. వ్యవసాయ శాఖ ఏటా 10 వేల తైవాన్ పవర్ స్ర్పేయర్లను సబ్సిడీపైన సరఫరా చేస్తూ ఉంది. వీటిపై ఐదు శాతం ఉన్న వ్యాట్ స్థానంలో 28 శాతం జీఎ్‌సటీ వచ్చి చేరింది. 28 వేలుగా ఉన్న స్ర్పేయర్ల ధర 36 వేల వరకు పెరగనుంది. పెరిగే జీఎస్టీ భారం అంతిమంగా రైతులు భరించాల్సి వస్తుంది. సబ్సిడీపై ఇచ్చే స్ర్పేయర్లలో కొంత ప్రభుత్వమూ భరించాల్సి వస్తుంది. ఎరువులూ బరువేఎరువులు, పురుగు మందులు కూడా రైతులకు భారం కానున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక శాతం ఎక్సైజ్, 5 శాతం వ్యాట్ కలిపి ఆరు శాతమే పన్ను పడుతోంది. జీఎస్టీలో 12 శాతం వసూలు చేయనున్నారు. దాంతో, యూరియా బస్తాకు రూ.36; డీఏపీకి రూ.120; 20:20 కాంప్లెక్స్ ఎరువులకు రూ.106; పొటా్‌షపై రూ.70 పెరగనుంది. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే ఖరీఫ్ సీజన్లో లక్షన్నర టన్నుల రసాయన ఎరువుల వాడకం ఉంటుంది. రబీలో మరో 40 వేల టన్నుల వాడకం ఉంటుంది. జీఎస్టీ కారణంగా ఏటా ఒక్క రంగారెడ్డి జిల్లా రైతులపైనే రూ.50 కోట్ల భారం అదనంగా పడనుంది. ఎరువులు, పురుగు మందుల కొనుగోలుకు వచ్చే ఖరీఫ్ నుంచి రూ.4000 ప్రభుత్వం ఇస్తుందని సంతోషపడుతున్న రైతులకు, జీఎస్టీ పిడుగుపాటులా మారింది. ఇక, క్రిమి సంహారక మందులు అతి స్వల్పంగా పెరగనున్నాయి. అంతేనా, ఇప్పటి వరకూ సేంద్రియ ఎరువులకు ఎటువంటి పన్ను లేదు. కానీ, జీఎస్టీలో 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెబుతున్న సర్కారు దానిపైనా పన్ను వేయడం దారుణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న, సన్నకారు రైతులు ఇల్లు గడవటానికి పంట ఆదాయం సరిపోక వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లోనూ కష్టపడుతున్నారు. అందులో డెయిరీ, కోళ్ల పెంపకం ఉన్నాయి. ఇప్పుడు డెయిరీ, కోళ్ల రైతులను జీఎస్టీ రైతుగా పరిగణించడం లేదు. ఈ ఉత్పత్తులపై ఐదు శాతం జీఎస్టీ భారం పడనుంది. సర్కారు 75 శాతం సబ్సిడీ భరిస్తున్నా పాలీహౌస్ పథకం జీఎస్టీ దెబ్బతో మరింత బరువు కానుంది. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పాలీహౌ్‌సపైన ప్రస్తుతం వ్యాట్ 5 శాతం మేరకు ఉంది. జీఎస్టీ అమలయ్యాక పన్ను 12 శాతానికి చేరుకోనుంది. ఎకరా ఖర్చు 34 లక్షల నుంచి 52 లక్షల వరకూ పెరగనుంది. సర్కారు యూనిట్ ధరను పెంచకుండా ఉంటే రైతుపై మరింత భారం పెరిగే అవకాశం ఉంది. ట్రాక్టర్‌కు కొంత ఊరటకొత్తగా వచ్చే జీఎస్టీలో వ్యవసాయ ట్రాక్టర్లపైన పన్నును 12 శాతం మేరకు పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రాక్టర్లపైన వ్యాట్ 5 శాతం ఉంటే.. ఎక్సయిజ్, సేవా తదితర పరోక్ష పన్నులు 6.5 శాతంగా ఉన్నట్లు ఆగ్రోస్ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ కలిపితే ట్రాక్టర్లపై పన్ను భారం 11.5 శాతంగా ఉంటుంది. పరోక్ష పన్నులు రద్దు అవుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంటే, పెరిగే భారం 0.5 శాతం మాత్రమే. రోటవేటర్లు, చెరువు, వరి కోత యంత్రాలకు జీఎస్టీతో పన్ను భారం ఏడు శాతం మేరకు పెరిగింది. రోటవేటర్ల ఖరీదు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఉన్నా.. చెరుకు కోత యంత్రం కోటి వరకు, వరి కోత యంత్రం రూ.20 లక్షల వరకూ ఉంటుంది. వీటిపై 7 శాతం పన్ను పెరిగినా ధర లక్షల్లోనే పెరుగుతుంది. రైతు ఎవరు?జీఎ్‌సటీ చట్టం వ్యవసాయదారుడు అంటే ఎవరు అన్నది తేల్చింది. దున్నగలిగే వాడిదే వ్యవసాయం అన్నట్లుగా సూత్రీకరించింది. జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్లలో వ్యవసాయదారులకు పన్ను మినహాయింపును చట్టం ఇచ్చింది. వ్యక్తిగా గాని, ఒక కుటుంబంగానీ భూమిని స్వయంగా సాగు చేసుకుంటూ ఉంటే వారిని వ్యవసాయదారులుగా పరిగణిస్తారు. కూలీలతో తన పర్యవేక్షణలోగానీ, తన కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో గానీ వ్యవసాయం చేయించుకున్నా వారిని వ్యవసాయదారులుగానే పరిగణిస్తారు. ఇతర వ్యక్తులు సదరు భూమిని లీజు పద్ధతిలో సాగు చేసుకుంటే అది జీఎ్‌సటీ పరిధిలో భూమి యజమాని వ్యవసాయం కిందకు రాదు. అలాంటి వారు వ్యవసాయ ఉత్పత్తులు అమ్మితే.. వాటికి జీఎ్‌సటీ మినహాయింపు ఉండబోదు. కార్పొరేటు కంపెనీలు.. రైతులతో కాంట్రాక్టు వ్యవసాయం చేయించి.. ఆ ఉత్పత్తులపై పన్ను మినహాయింపును పొందాలనుకుంటే జీఎ్‌సటీ కింద కుదరదు. డెయిరీ ఫార్మింగ్, పౌల్ట్రీలనూ వ్యవసాయేతర రంగాలుగానే జీఎస్‌టీ చట్టం గుర్తించింది. పాలపైన 3ు మేరకు పన్ను పెరగనుంది. ప్రస్తుతం పాలపైన వ్యాట్‌ను 2% మేరకు వసూలు చేస్తున్నారు. చట్టంలో దాన్ని 5% మేరకు పెంచారు. ఎరువుల పైన పన్ను రెట్టింపు కాగా.. పురుగు మందులపైన ఒకటి నుంచి 2% మేరకు పెరగనుంది. | nation |
478 | 20-08-2017 23:00:25 | మార్చి నాటికి మరో మూడు విమానాలు | ట్రూజెట్ వెల్లడిముంబై: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్.. వచ్చే ఏడాది మార్చి నాటికి విమానాల సంఖ్యను 8కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. టర్బో మేఘా ఎయిర్‌వేస్ ప్రమోట్ చేసిన ట్రూజెట్.. ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) కింద ఇప్పటికే 18 రూట్లను చేజిక్కించుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం రోజుకు నిర్వహిస్తున్న 31 విమాన సర్వీసులను సంవత్సరాంతం నాటికి యాభైకి చేర్చాలని చూస్తోంది. ప్రస్తుతం ఐదు ఎటిఆర్ విమానాలతో ట్రూజెట్ సేవలందిస్తుండగా ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి విమానాల సంఖ్యను ఏడెనిమిదికి పెంచాలని చూస్తున్నట్లు టర్బో మేఘా ఎయిర్‌వేస్ మేనేజింగ్ డైరెక్టర్ వి ఉమేష్ తెలిపారు. ఉడాన్‌లో భాగంగా రీజినల్ ఎయిర్ కనెక్టివిటీ (ఆర్‌సిఎస్) పథకం కింద వచ్చే నెలలో 18 రూట్లలో విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ పథకం కింద ఇప్పటికే హైదరాబాద్-కడప, హైదరాబాద్-నాందేడ్, నాందేడ్- ముంబై రూట్లలో విమాన సర్వీసులను ప్రారంభించినట్లు ఉమేష్ తెలిపారు. రానున్న శీతాకాలంలో కొత్త విమాన సర్వీసులు లేదా డెస్టినేషన్లకు సర్వీసులు ప్రారంభించే యోచనేదీ లేదని ఆయన చెప్పారు. అయితే ఆర్‌సిఎస్ రూట్లలో మాత్రం సెప్టెంబరులో మాత్రం కొత్త విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకురాన్నుట్లు ఆయన పేర్కొన్నారు. | business |
19,367 | 16-11-2017 11:37:04 | సానియా పక్కన లేనందుకు చింతిస్తున్నా...: షోయబ్ | న్యూఢిల్లీ: భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా బుధవారం 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. పుట్టినరోజు సందర్భంగా ఆమె భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మలిక్ ట్విటర్ వేదికగా ఓ స్వీట్ మెసేజ్ పోస్టు చేశాడు. ప్రియమైన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూనే... ఈ సందర్భంగా తన పక్కనలేనందుకు ఆమెను మిస్ అవుతున్నట్టు పేర్కొన్నాడు. ‘‘అందమైన నా భార్యకు అద్భుతమైన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు... నిన్ను మిస్ అవుతున్నాను...’’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా సానియా పుట్టినరోజు సందర్భంగా సినీ, క్రీడారంగానికి చెందిన పలువురు ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. భారత బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా సానియాకు శుభాకాంక్షలు తెలిపాడు. మాజీరాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సానియా అవార్డు అందుకుంటున్న ఫోటోను పెడుతూ.. ‘‘హ్యాపీ బర్త్‌డే సానియా మీర్జా... సానుకూల దృక్పథం, జీవితం మీద ప్రేమ కారణంగానే ఒడిదుడుకులను ఎదుర్కొంటూ టెన్నిస్ కెరీర్‌లో అలాంటి ఉన్నత విజయాన్ని అందుకున్నారు..మీరు నిజంగా గ్రేట్ ఫ్రెండ్...’’ అని వ్యాఖ్యానించాడు. షోయబ్, రైనాలతో పాటు ఫరాఖాన్, రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సానియాకు శుభాకాంక్షలు చెప్పారు. | sports |
11,499 | 08-01-2017 18:17:27 | వివేకానంద గురించి ఎవరికీ తెలియని నిజం | న్యూఢిల్లీ: స్వామి వివేకానంద పేరు చెప్పగానే 124 సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత మహాసభలో ఆంగ్లంలో ఆయన చేసిన అనితరసాధ్యమైన ప్రసంగం గుర్తుకు వస్తుంది. ముందుగా ప్రిపేర్ చేసిన ప్రసంగపాఠం కూడా లేకుండా...అమెరికా దేశపు ప్రియ సహోదరులారా...అంటూ ఆయన ప్రసంగం మొదలుపెట్టినప్పుడు మూడు నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లతో మహాసభ దద్దరిల్లిపోయిన ఘట్టం చిరస్మరణీయం. ఆంగ్ల భాషలో ఆయన చేసిన ప్రసంగానికి అమెరికా ప్రజానీకం నీరాజనాలు పట్టింది. అయితే బ్రిటిష్ ఆంగ్లంలో అంతటి పట్టున్న వివేకానందకు చదువుకునే రోజుల్లో మాత్రం మూడు యూనివర్శిటీల్లో ఆంగ్ల సబ్జెక్ట్‌లో యావరేజ్ మార్కులే వచ్చాయట. 19వ శతాబ్దానికి చెందిన భారతీయ యోగిపుంగవుడు స్వామి వివేకానందపై రాసిన ఓ సరికొత్త పుస్తకంలో ఈ విషయాలున్నాయి. 'ది మోడ్రన్ మంక్ : వాట్ వివేకానంద మీన్స్ టు అజ్ టుడే' అనే పేరుతో రచయిత హిండోల్ సేన్‌గుప్తా రాసిన ఈ పుస్తకాన్ని పెంగ్విన్ సంస్థ ప్రచురించింది. నేటి ఆధునిక భారతానికి కూడా వివేకానంద మార్గం ఆచరణీయమంటూ రచయిత ఇందులో ఆయనను కొనియాడారు. ఒక డబ్బున్న లాయర్ కుటుంబంలో పుట్టిన వివేకానంద కలకత్తాలోని మెట్రోపాలిటన్ ఇన్‌స్టిట్యూట్ స్కూలుతో సహా పలు పేరున్న విద్యాసంస్థల్లో చదవు అభ్యసించారని, అందువల్లే బ్రిటిష్ ఫ్లూయన్సీతో ఆంగ్లంలో రాయడం, మాట్లాడటం ఆయనకు బాగా వచ్చిందని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. అయితే వివేకానంద ప్రతిభ ఆయన మార్కుల్లో ప్రతిఫలించలేదని, ముఖ్యంగా ఆంగ్లంలో మార్కులు ఇందుకు నిదర్శనమని రచయిత పేర్కొన్నారు. ఇందుకుగాను ఆయన మూడు యూనివర్శిటీ ఎగ్జామినేషన్స్ (ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) మార్కులు ఉటంకించారు. సెంట్రల్ లెవెల్‌లో ఇంగ్లీషులో వివేకానందకు 47 శాతం మార్కులు రాగా, ఎఫ్ఏ (ఫస్ట్ ఆర్ట్స్ స్టాండర్డ్..ఆతర్వాత ఇంటర్మీడియట్ ఆర్ట్ లేదా ఐఏగా వ్యవహరించారు)లో 46 శాతం, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ)లో 56 శాతం మార్కులు వచ్చాయి. అలాగే లెక్కలు, సంస్కృతంలో కూడా వివేకానంద యావరేజ్ మార్కులే తెచ్చుకున్నట్టు ఆ గ్రంథంలో రచయిత పేర్కొన్నారు. | nation |
6,673 | 13-09-2017 19:47:43 | సీనియర్, జూనియర్ మల్టీస్టారర్ ఖరారు | టాలీవుడ్‌లోని ఆ సీనియర్ హీరో, యంగ్ హీరో కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ ప్రాజెక్టు ఓకే అయ్యిందని సినీ జనం చర్చించుకుంటున్నారు. తెలుగులోని కొందరు సీనియర్ హీరోలు మల్టీస్టారర్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వెంకటేశ్, నాగార్జున వంటి అగ్ర హీరోలు ఈ విషయంలో మిగతా వాళ్ల కంటే కాస్త ముందున్నారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకవైపు సోలో హీరోగా నటిస్తూనే మరోవైపు మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్నారు వెంకటేశ్, నాగార్జున. లేటెస్ట్‌గా హీరో నాగార్జున మరో మల్టీస్టారర్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వరుస హిట్స్‌తో మంచి జోష్ మీదున్న నానితో కలసి నటించేందుకు నాగార్జున ఓకే చెప్పారని తెలుస్తోంది. 'భలే మంచి రోజు', 'శమంతకమణి' సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య... వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా చేయబోతున్నాడని సమాచారం. ఈ కాంబినేషన్ కోసం తయారు చేసుకున్న కథను, నాగార్జున, నానికి వినిపించిన శ్రీరామ్ ఆదిత్య తన స్టోరీతో ఆ ఇద్దరిని ఒప్పించాడని ఇండస్ట్రీ టాక్. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు తమ కొత్త సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. 'రాజు గారి గది 2' షూటింగ్ పూర్తయినా ప్రస్తుతం నాగార్జున తన తనయుడు అఖిల్ రెండో సినిమా 'హలో' నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఇక యంగ్ హీరో నాని కూడా ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ ఉన్నాడు. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌లోని సినిమా సెట్స్ మీదకు వెళ్లేబోయేది వచ్చే ఏడాదే అని సినీజనం చర్చించుకుంటున్నారు. మొత్తానికి 'భలే మంచి రోజు', 'శమంతకమణి' సినిమాలతో దర్శకుడిగా తానేంటో ప్రూవ్ చేసుకున్న శ్రీరామ్ ఆదిత్యకు ఇది మరో మంచి అవకాశం అని చెప్పకతప్పదు. మరి ఈ సారి మల్టీస్టారర్ ఏమవుతుందో చూడాలి. | entertainment |
7,974 | 16-08-2017 19:59:56 | అమెరికాలో రొమాంటిక్ థ్రిల్లర్ | చంద్రకాంత్, రాధికా మెహరోత్రా జంటగా నటించిన సినిమా ‘ప్రేమ ఎంత మధురం – ప్రియురాలు అంత కఠినం’. అమెరికాలో అత్యధిక భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాను రఘురాం రొయ్యూరుతో కలిసి స్వీయ దర్శకత్వంలో గోవర్ధన్ నిర్మించారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను నిర్మాత బెక్కెం వేణు ఆవిష్కరించారు. ఇదో రొమాంటిక్ థ్రిల్లర్మూవీ అని గోవర్థన్ తెలిపారు. | entertainment |
11,640 | 21-02-2017 15:03:57 | మార్కెట్లోకి కొత్త రూ.1000 నోట్లు | ముంబై: ఇటీవలే రద్దు చేసిన వెయ్యి రూపాయల స్థానే కొత్త సిరీస్ వెయ్యి రూపాయల నోట్లను మళ్లీ ప్రవేశపెట్టేందుకు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నాయి. గత ఏడాది నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. రద్దయిన నోట్ల స్థానే కొత్త రూ.500, రూ.2,000 నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టింది. కాగా, ఇప్పుడు కొత్త సిరీస్ రూ.1000 నోట్లను ప్రవేశపెట్టేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఆర్బీఐకు చెందిన ఓ అధికారి సమాచారం ప్రకారం, రూ.1000 నోట్ల ముద్రణ ఇప్పటికే ప్రారంభమైంది. కొత్త సిరీస్ వెయ్యి రూపాయల నోట్లను మొదట్లో ఈ ఏడాది జనవరిలోనే తీసుకురావాలని అనుకున్నప్పటికీ రూ.500 నోట్ల సరఫరా ఆవశ్యకత ఎక్కువగా ఉండటంతో ఆ ప్రయత్నం వాయిదా పడింది. అయితే కొత్త రూ.1000 నోట్లను మార్కెట్లోకి అధికారికంగా ఎప్పుడు విడుదల చేస్తారనేది ఇంకా స్పష్టం కాలేదు. కాగా, జనవరి 27 నాటికి రూ.2000, రూ.500 నోట్లతో సహా సర్క్యులేషన్‌లో రూ.9.92 లక్షల కోట్లు ఉన్నట్టు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ ఈనెల 8న తెలిపారు. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన నోట్ల విలువ ఎంతనే సమాచారం ఆర్బీఐ ఇంకా వెల్లడించలేదు. | nation |
11,827 | 20-03-2017 03:52:29 | గోరఖ్‌నాథ్.. రాజకీయ మఠం | గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ మఠ్... గోరక్షనాథుడి ధ్యాన మందిరం. శైవం, బౌద్ధాల కలయిక అయిన నాథ్ సంప్రదాయంలో గోరక్షనాథుడు గొప్ప గురువు. ఈ సంప్రదాయాన్ని అనుసరించేవారు కులమత భేదాలను పాటించరు. గోరఖ్‌నాథ్ మఠాల్లో బ్రాహ్మణేతరులు పూజారులుగా ఉంటారు. ప్రస్తుతం ఆ మఠానికి మహంతుగా ఉన్న యోగి ఆదిత్యనాథ్.. ఒక ఠాకూర్. అలాగే గోరఖ్‌నాథ్ మఠం చాలా దశాబ్దాలుగా రాజకీయంగా క్రియాశీలంగా ఉంటోంది. గతంలో ఈ మఠానికి మహంతుగా వ్యవహరించిన దిగ్విజయ్ నాథ్ 1920లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా చౌరీచౌరా(గోరఖ్‌పూర్ జిల్లా)లో నిర్వహించిన సహాయ నిరాకరణ ఉద్యమం హింసాత్మకం కావడంలో కీలకపాత్ర పోషించిన దిగ్విజయ్‌నాథ్‌ను బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేశారు. చౌరీచౌరా ఘటనగా చరిత్రకెక్కిన ఆ ఘటనలో ముగ్గురు పౌరులు, 23 మంది పోలీసులు మరణించడం.. దీంతో మహాత్మాగాంధీ తన సహాయనిరాకరణ ఉద్యమాన్ని అర్ధంతరంగా ముగించాల్సి రావడం తెలిసిందే. స్వాతంత్య్రం వచ్చాక.. గాంధీజీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసినందుకు దిగ్విజయ్ అరెస్ట్ అయ్యారు. 9 నెలల జైలు శిక్ష అనుభవించారు. 1949లో అఖిల భారతీయ రామాయణ మహాసభలో చేరి.. తొమ్మిదిరోజులపాటు రామచరిత మానస పారాయణలో, బాబ్రీ మసీదులో సీతారాముల విగ్రహాల ప్రతిష్ఠలో కీలకపాత్ర పోషించారు. 1967లో ఆయన హిందూ మహాసభ తరఫున గోరఖ్‌పూర్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన శిష్యుడు అవైద్యనాథ్. ఆయన.. 1962, 1967, 1969, 1974, 1977 సంవత్సరాల్లో మణిరామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1970లో స్వతంత్ర అభ్యర్థిగా గోరఖ్‌పూర్ లోక్‌సభ సీటు నుంచి పోటీ చేసి గెలుపొందారు. మళ్లీ 1989లో హిందూ మహాసభ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. 1991, 1996ల్లో అదే సీటు నుంచి బీజేపీ తరఫున పోటీచేసి గెలుపొందారు. ఆయన శిష్యుడే ఆదిత్యనాథ్. ఆదిత్యనాథ్ జన్మనామం.. అజయ్ సింగ్ బిష్త్. 1972లో జన్మించిన ఆయన తన 21వ ఏట (1993లో) అవైద్యనాథ్‌కు శిష్యుడయ్యారు. సన్యాసిగా మారి గోసంరక్షణ చేపట్టారు. ఆయనను 1998లో తన వారసుడిగా అవైద్యనాథ్ ప్రకటించారు. అప్పటికి ఆదిత్యనాథ్ వయసు 26 ఏళ్లు. ఎంపీగా ఐదుసార్లు ఎన్నికైన ఆయన సభలో చాలా చురుగ్గా వ్యవహరిస్తారు. ప్రస్తుత సభలో అంటే.. 2014 మార్చి నుంచి 2017 మార్చి కాలాన్నే పరిగణనలోకి తీసుకుంటే ఆయన 284 ప్రశ్నలు లేవనెత్తారు. 55 చర్చల్లో పాల్గొని, మూడు బిల్లులు ప్రవేశపెట్టారు. అందులో కీలకమైనవి.. ఉమ్మడి పౌర స్మృతి, గోవధ నిషేధం. | nation |
423 | 04-09-2017 00:26:27 | సాధారణ నిస్తేజం | (సోమవారానికి)తిథి : భాద్రపద శుద్ధ త్రయోదశి నక్షత్రం : శ్రవణం, ధనిష్టపుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు, కుంభ, మీన, రాశులవారు అప్రమత్తంగా ఉండాలి. నిఫ్టీ : 9917.90 (+33.50)ట్రెండ్ మార్పు వేళలు : 11.15ధోరణి : గ్రహగతులను బట్టి నిలకడగా ప్రారంభమై 10 గంటల వరకు అదే ధోరణిలో ట్రేడవుతూ ఆ తర్వాత ముగింపు వరకు నిస్తేజంగానే ఉండవచ్చు.ట్రేడింగ్ వ్యూహం...నిఫ్టీ ఫ్యూచర్స్ 10.15 సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి)కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్‌లా్‌సతో షార్ట్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవాలి.ఇంట్రాడే ట్రేడింగ్‌కు ప్రారంభ స్థాయి కీలకం. అంతకన్నా దిగువన మాత్రమే షార్ట్ పొజిషన్లు శ్రేయస్కరం. నిరోధ స్థాయిలు : 10015, 10050 మద్దతు స్థాయిలు : 9935, 9900గమనిక : ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నికల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచన. మార్కెట్ వాస్తవిక కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. | business |
10,865 | 30-09-2017 18:38:16 | సంక్రాంతిపై కన్నేసిన అనుష్క | చాలాకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతోందట. సంక్రాంతి బరిలో ఓసారి విజయం సాధించిన ఆ అందాల భామ మరోసారి సేమ్ సీన్ రిపీట్ చేస్తుందా? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. 'బాహుబలి 2' తరువాత సోలో హీరోయిన్‌గా ఏ సినిమా కమిటవ్వలేదు అనుష్క. లావు తగ్గిన తరువాతే కొత్త సినిమాలకు ఓకే చెప్పాలని బొమ్మాళి భావిస్తోందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు చాలాకాలం క్రితం అనుష్క కమిటైన 'భాగమతి' సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిపై క్లారిటీ వచ్చిందట. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని నిర్మాతలు డిసైడయ్యారట. సంక్రాంతి బరిలో బాలకృష్ణ, పవన్, మహేశ్ బాబు నిలుస్తారని చాలా రోజులు నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే మహేశ్ బాబు 'భరత్ అనే నేను' సంక్రాంతి బరి నుంచి తప్పుకుందని తేలిపోవడంతో భాగమతి సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్స్ పెండింగ్‌లో ఉండటంతో సంక్రాంతి నాటికి సినిమాను రిలీజ్‌కు సిద్ధం చేయాలని భావిస్తున్నారట. అనుష్కకు స్టార్ డమ్‌ను తెచ్చిపెట్టిన లేడీ ఓరియెంటెడ్ సినిమా అరుంధతి కూడా సంక్రాంతి సీజన్‌లోనే విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో సంక్రాంతి సీజన్‌పై కన్నేసిన 'భాగమతి' కూడా 'అరుంధతి' రేంజ్‌లో సక్సెస్ అవుతుందని యూనిట్ భావిస్తోంది. మరి వారి ఆశలు ఎంత వరకూ నెరవేరుతాయో చూడాలి. | entertainment |
21,576 | 10-02-2017 00:00:50 | ద్వంద్వ ప్రయోజన వలలో గంగూలీ, ద్రావిడ్? | ముంబయి: భారత మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్‌ల ద్వంద్వ ప్రయోజన అంశం మరోమారు తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టు నియమించిన నలుగురు సభ్యుల పాలకుల కమిటీ (సీఓఏ) వీరిద్దరినీ ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అండర్-19, ఇండియా-ఎ జట్లకు కోచ్‌గా ఉన్న ద్రావిడ్ ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు మెంటార్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. అలాగే బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడయిన గంగూలీ బీసీసీఐ టెక్నికల్ కమిటీ చైర్మన్‌గా, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పనిచేస్తున్నాడు. | sports |
8,980 | 19-11-2017 12:52:53 | ముగ్గురు ప్రముఖ సినీ నటులపై నిషేధం? | సినిమా షూటింగ్‌లకు సహకరించకుండా నిర్మాతలను ఇబ్బందిపెడుతున్న ముగ్గురు తారలపై నిషేధం విధించే దిశగా తమిళ నిర్మాతల మండలి యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ‘ఏఏఏ’ చిత్ర నిర్మాత మైఖేల్ రాయప్పన్ ఫిర్యాదు మేరకు శింబు, ‘24ఆమ్ పులికేశి’ నిర్మాత శంకర్ ఫిర్యాదు మేరకు హాస్యనటుడు వడివేలు, ‘సామి2’ నిర్మాత ఫిర్యాదు మేరకు నటి త్రిషలపై చర్యలు తీసుకొనేందుకు నిర్మాతల మండలి సిద్ధమవుతుందని కోలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు. వీరి చర్యల కారణంగా నిర్మాతలకు తీవ్ర నష్టం కలుగుతోందని, పదేపదే ఇలాంటి తప్పులు చేస్తున్న ఆ ముగ్గురిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్మాతలు కోరుతున్నారట. వడివేలు, త్రిషల కంటే శింబుపైనే అభియోగాలు ఎక్కువ ఉన్నట్టు సమాచారం. కన్న తండ్రినే అరెస్ట్ చేయించిన ప్రముఖ హీరో చిరంజీవితో కలిసి దేవ కన్యగా శ్రీదేవి నటించిన సినిమా? | entertainment |
9,984 | 26-12-2017 16:14:59 | మళ్లీ మాట తప్పిన వర్మ! |
సంచలన దర్శకుడ రామ్‌గోపాల్ వర్మ ఇటీవలి కాలంలో సినిమాల కంటే ఇతర విషయాల ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. బోల్డ్ కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు రూపొందించడం, సోషల్ మీడియా ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా వర్మ లైమ్‌లైట్‌లో ఉంటున్నాడు. ఇటీవలి కాలంలో ఆయన సినిమాలేవీ ప్రజాదరణ పొందలేదు. అలాంటి టైమ్‌లో నాగార్జున ఓ సినిమా చేసే అవకాశం ఇచ్చాడు. మంచి ఫామ్‌లో ఉన్న నాగార్జున మరోసారి వర్మను నమ్మాడు. దీంతో ఆ సినిమాను వర్మ సీరియస్‌గా తీసుకున్నాడు. నాగ్ సినిమా పూర్తయిపోయేవరకు వేరే విషయాల గురించి ఆలోచించనని ప్రకటించాడు. అయితే నాగ్ తన తనయుడు అఖిల్ `హలో` సినిమాతో బిజీగా ఉండడంతో వర్మ మళ్లీ వివాదాలపై దృష్టిపెట్టాడు. కడప ఫ్యాక్షనిస్టుల నేపథ్యంతో వెబ్ సిరీస్ మొదలెట్టాడు. ఇటీవలే ట్రైలర్ కూడా విడుదలైంది. దీంతో వర్మ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. దీంతో నాగ్ సినిమా ప్రారంభోత్సవ సమయంలో ఇచ్చిన మాటను వర్మ తప్పాడని గుసగుసలు వినబడుతున్నాయి. తెలుగులో సినిమాలే చేయనని ప్రకటించిన వర్మ ఆ తర్వాత సినిమాలు చేసి మాట తప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ నాగార్జునకు ఇచ్చిన మాట కూడా తప్పి తాను మాటమీద నిలబడే మనిషిని కాదని మరోసారి నిరూపించుకున్నాడు. | entertainment |
16,535 | 23-05-2017 19:36:04 | ‘ఐటీ రంగంలో 25 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి’ |
న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం చల్లని కబురు చెప్పారు. నాలుగైదేళ్ళలో ఐటీ రంగంలో అదనంగా 20-25 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఈ రంగంలో ఉద్యోగాలు తగ్గుముఖం పట్టాయన్న ఆరోపణలను తిరస్కరించారు. రవిశంకర్ ప్రసాద్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఐటీ రంగంలో ఉద్యోగాలు తగ్గుతున్నాయనడాన్ని తాను పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ రంగం పటిష్ఠంగా ఉందన్నారు. డిజిటల్ ఎకానమీ వస్తే ఎంత ప్రగతి ఉంటుందో మీరే చూస్తారన్నారు. భారతీయ ఐటీ కంపెనీలు 80 దేశాల్లోని 200 పట్టణాలకు విస్తరించినట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా 40 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయన్నారు. పరోక్షంగా 1.3 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. ఈ పరిశ్రమ పురోగతి సాధిస్తోందని, రానున్న నాలుగైదేళ్ళలో 20-25 లక్షల ఉద్యోగాలు అదనంగా వస్తాయని నాస్‌కామ్ అంచనా వేసిందని తెలిపారు. భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ రానున్న ఐదు నుంచి ఏడేళ్ళలో రూ.600 లక్షల కోట్లకు చేరుతుందని తెలిపారు. | nation |
19,809 | 04-12-2017 04:03:50 | శ్రీవారి సేవలో మిథాలీ | తిరుమల: టీ20 వరల్డ్‌కప్ చాలెంజింగ్‌గా ఉంటుందని భారత్ మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్కొంది. ఆదివారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె కుటుంబ సమేతంగా పాల్గొంది. ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, లడ్డూ, ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడింది. ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌ను చేర్చాలనే అంశంపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని, వచ్చే ఏడాది జరిగే టీ 20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతామని తెలిపింది. అలాగే జనవరిలో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుందని తెలిపింది. | sports |
2,858 | 07-04-2017 04:21:48 | పీసీలు, మొబైల్ ఫోన్లపై ఈ ఏడాది వ్యయం 60,000 కోట్ల డాలర్లు | గార్ట్‌నర్ అంచనా న్యూఢిల్లీ: పర్సనల్ కంప్యూటర్లు (పీసీ), మొబైల్ ఫోన్లపై ఈ ఏడాదిలో వినియోగదారుల ఖర్చు 60,000 కోట్ల డాలర్ల (రూ.39 లక్షల కోట్లు)కు చేరుకునే అవకాశం ఉందని పరిశోధనా సంస్థ గార్ట్‌నర్ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాదిలో వీటిపై వినియోగదారుల వ్యయం 58,720 కోట్ల డాలర్లుగా ఉందని, ఈ ఏడాదిలో ఇది 59,913 కోట్ల డాలర్లకు, 2019 సంవత్సరంలో 62,716 కోట్ల డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. అయితే పీసీలు, అల్ర్టా మొబైల్స్, మొబైల్ ఫోన్ల అమ్మకాలు 230 కోట్ల యూనిట్ల్లు ఉండవచ్చని, గత ఏడాదితో పోల్చితే ఇది దాదాపు సమానమని తెలిపింది. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ల సగటు ధరను రెండు శాతం మేర పెంచే అవకాశం ఉందని, ఇందుకు రెండు కారణాలున్నాయని పేర్కొంది. మొబైల్ ఫోన్లలో వినియోగించే విడిభాగాల ధరలు పెరుగుతూనే ఉన్నాయని తెలిపింది. దీంతో పీసీలు, మొబైల్ ఫోన్ల ధరలు ప్రియమవుతున్నాయని పేర్కొంది. వినియోగదారులు విలువ, అధిక క్వాలిటీ కలిగిన ఫోన్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపింది. చవక ఉత్పత్తులను కొనుగోలు చేయడంకన్నా తమ లైఫ్‌స్టైల్‌కు తగిన వాటిని కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోందని గార్ట్‌నర్ రీసెర్చ్ డైరెక్టర్ రంజిత అత్వాల్ తెలిపారు. కాగా వినియోగదారుల వ్యయంలో 67 శాతం వాటా మొబైల్ ఫోన్లదే కావడం విశేషం. ఇది 2017 సంవత్సరంలో 40,000 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని అంచనా. ఇక పీసీల (డెస్క్‌టాప్స్, లాప్‌టా్‌ప్స)పై వ్యయం 16,335 కోట్ల డాలర్లకు చేరుకోనుంది. అల్ర్టామొబైల్స్‌పై వ్యయం 3628 కోట్ల డాలర్లుగా ఉండనుంది. ఈ ఏడాదిలో 26.5 కోట్ల పీసీలు, 16.1 కోట్ల అల్ర్టా మొబైల్స్, 191 మొబైల్ ఫోన్లు అమ్ముడయ్యే అవకాశం ఉందని గార్ట్‌నర్ నివేదిక అంచనా వేస్తోంది. | business |
6,513 | 13-06-2017 08:32:38 | ‘బాషా’ సీన్ రిపీట్! | ఇండియన్ సిల్వర్‌స్ర్కీన్ పై ‘బాషా’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ‘బాషా’ ట్రెండ్‌ను ఫాలో అయ్యి ఆ తరువాత ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. ఇప్పటికీ ఆ సినిమాను చూస్తే రజనీ అభిమానులు ఉర్రూతలూగి పోతారు. అంతగా సినీ ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించిన ఈ చిత్రంలోని పలు సన్నివేశాలు చాలా చిత్రాల్లో రిపీట్ అవ్వడం చూస్తేనే ఉన్నాయి. అయితే ‘బాషా’లో ఒక కీలక సన్నివేశాన్ని రజనీకాంత్ తాజాచిత్రం ‘బాషా’లోను రిపీట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు కథలూ ముంబై బ్యాక్‌డ్రాప్‌కి చెందినవే కాగా, ‘బాషా’ లో వినాయక చతుర్ధికి సంబంధించిన సన్నివేశం తరహాలోనే ‘కాలా’ లోను చిత్రీకరిస్తున్నారట. కథలో కీలక సమయంలో ఆ సన్నివేశాలు వస్తాయని సమాచారం. ధనుష్ నిర్మాతగా పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ‘కాలా’లో ఇప్పటికే ముంబై లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలో చెన్నైలో రెండో షెడ్యూల్ ప్రారంభ మవుతుంది. | entertainment |
11,852 | 16-12-2017 15:12:00 | రాహుల్‌కు మన్మోహన్ దీవెన | న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దీవెనలు అందించారు. రాహుల్ నాయకత్వంలో పార్టీ కీర్తి ప్రతిష్టలు సమున్నత స్థాయికి చేరుకుంటాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గత 19 ఏళ్లుగా పార్టీకి ఏకతాటిపై నడిపించిన సోనియాగాంధీకి కూడా మన్మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. 'సోనియాజీ పార్టీ పగ్గాలు రాహుల్‌కు అప్పగించారు. పార్టీ నాయకత్వాన్ని 19 ఏళ్ల పాటు ఏకతాటిపై నడిపిన సోనియాజీకి మనందరి తరఫున అభినందనలు తెలుపుతున్నాను. పార్టీ నూతన అధ్యక్షుడిగా రాహుల్ అంకితభావంతో పనిచేసి పార్టీ ప్రతిష్టను ఉన్నత శిఖరాలకు చేరుస్తారని ఆశిస్తున్నాను. రాహుల్‌కు నా తరఫున, పార్టీ కార్యకర్తల తరఫున శుభాభినందనలు' అని మన్మోహన్ అన్నారు. రాజకీయాల్లో కొన్ని అవాంఛనీయ ధోరణులు చోటుచేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో రాహుల్ పార్టీ పగ్గాలు చేపట్టారని మన్మోహన్ గుర్తు చేశారు. రాజకీయ భయాలపై ఆశావహ రాజకీయాలు పైచేయి కావాలని, అలాంటి ఆశావహ రాజకీయాలను రాహుల్ పాదుకొలుపుతారని విశ్వసిస్తున్నట్టు మన్మోహన్ పేర్కొన్నారు. | nation |
16,057 | 28-07-2017 16:52:10 | శశికళ పదవిపై పిల్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు | న్యూఢిల్లీ: అన్నాడీఎంకే తాత్కాలిక జనరల్ సెక్రటరీ పదవిలో శశికళను కొనసాగించకుండా చూడాలని ఆమ్ ఆద్మీ పార్టీ తమిళనాడు విభాగం కన్వీనర్ వాసిగారన్ వేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు శుక్రవారంనాడు తోసిపుచ్చింది. ఆమెను పదవిలో కొనసాగించాలా వద్దా అనేది రాజకీయ నాయకులు తీసుకోవాల్సిన నిర్ణయమని, దోషిగా శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి నుంచి సలహాలు తీసుకోవద్దని ముఖమంత్రిని కానీ, మంత్రులను కానీ తాము ఆదేశించలేమని అత్యున్నత న్యాయ స్థానం స్పష్టం చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో శశికళకు శిక్ష పడటంతో అన్నాడీఎంకేలో ఆమెకున్న పదవిని సమీక్షించాలని గత ఏప్రిల్‌లో ఆప్ తమిళనాడు విభాగం ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ ప్రతినిధి బృందం ఈసీకి మెమొరాండం సైతం సమర్పించింది. లిలీ థామస్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌ను పరిగణనలోకి తీసుకుని అధికార అన్నాడీఎంకేలో శశికళ పదవికున్న రాజ్యాంగబద్ధతను పరిశీలించాలని కోరింది. 'శశికళ ప్రస్తుతం అధికార అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి, ఇతర మంత్రులు ఆమె (శశికళ) క్యాంపులోని వారే. దోషిగా తేలిన ఓ వ్యక్తి అలాంటి పదవిలో ఎలా కొనసాగుతారు?' అని వాసిగారన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన తర్వాత కూడా పలు పార్టీల నేతలు ఉన్నత పదవుల్లో కొనసాగుతుండటంపై రాజ్యంగబద్ధతను కూడా ఆప్ ప్రతినిధి బృందం ప్రశ్నించింది. | nation |
15,990 | 01-09-2017 10:06:27 | సంకేతాలు గ్రహాంతరవాసులవా? | 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరాన ఉన్న కుబ్జ పాలపుంత నుంచి రేడియో విస్ఫోటాలు15 ఎఫ్‌ఆర్‌బీలను గుర్తించినభారతీయ శాస్త్రజ్ఞుడువ్యోమనౌక స్టార్ట్ చేయడానికివాడిన తరంగాలు కావచ్చు: నిపుణులుఆ పేలుళ్లు జరిగే నాటికి మన సౌరవ్యవస్థ వయసు 200 కోట్ల ఏళ్లుభూమ్మీద ఏక కణ జీవులు మాత్రమే ఉన్న సమయమదిబెంగళూరు: ఎక్కడో 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరాన.. రోదసిలో ఉన్న ఒక కుబ్జ పాలపుంత నుంచి 15 రేడియో పేలుళ్ల సంకేతాలు! ఏమిటవి? మనకన్నా తెలివైన గ్రహాంతరవాసులెవరో తమ వ్యోమనౌకలను స్టార్ట్ చేయడానికి ఉపయోగించిన అత్యంత శక్తిమంతమైన కాంతిపుంజాలేనా? అంటే.. అయ్యే అవకాశం ఉందంటున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు. ‘బ్రేక్ త్రూ లిజన్’ పేరిట గ్రహాంతరజీవుల కోసం 100 మిలియన్ డాలర్లతో చేపట్టిన అన్వేషణ ప్రాజెక్టులో భాగంగా.. భారత్‌కు చెందిన విశాల్ గజ్జర్ అనే ఖగోళ శాస్త్రజ్ఞుడు వెస్ట్ వర్జీనియాలోని గ్రీన్‌బ్యాంక్ టెలిస్కోపు ద్వారా జరిపిన ఐదు గంటల పరిశీలనలో ఈ రేడియో సంకేతాలను గుర్తించారు. ఈ సంకేతాలు వెలువడినప్పుడు మన సౌరవ్యవస్థ వయసు 200 కోట్ల సంవత్సరాలని బ్రేక్ త్రూ లిజన్ ప్రాజెక్టు నిర్వాహకులు తెలిపారు. ఆ సమయానికి మన భూమ్మీద ఏక కణ జీవులు మాత్రమే ఉన్నాయని.. ఆ ఏక కణ జీవులు బహు కణ జీవులుగా పరిణామం చెందడానికి మరో 100 కోట్ల ఏళ్లు పట్టిందని వివరించారు. నిజానికి ఈ ఫాస్ట్ రేడియో బరస్ట్స్ (ఎఫ్‌ఆర్‌బీ- రేడియో సంకేతాల)ను గుర్తించడం ఇదే తొలిసారి కాదు. 2012 నవంబరు 2న ఆస్ట్రేలియాలో పార్క్స్ టెలిస్కోప్ ద్వారా గుర్తించారు. ఆ రేడియో సంకేతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియకపోయినా.. ఆ చోటుకు ‘ఎఫ్‌ఆర్‌బీ 121102’ అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఇది పదేపదే సంకేతాలు వెలువరిస్తున్నందున దీన్ని ‘రిపీటర్’గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సంకేతాలు 300కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న డ్వార్ఫ్ గెలాక్సీ నుంచి వస్తున్నట్టు గత ఏడాదే గుర్తించారు. తాజాగా ఆగస్టు 26న విశాల్ గజ్జర్.. అక్కడి నుంచి వచ్చిన 15 బర్‌స్ట్సను గుర్తించారు. గతంతో పోలిస్తే వీటి తరంగ దైర్ఘ్యం చాలా ఎక్కువగా ఉందని బ్రేక్ త్రూ లిజన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆండ్రూ సైమన్ తెలిపారు. ఏమిటీ ‘బ్రేక్ త్రూ లిజన్ ప్రాజెక్ట్’?గ్రహాంతరజీవుల అన్వేషణ కోసం మార్క్ జుకెర్‌బెర్గ్, స్టీఫెన్ హాకింగ్, యూరీ మిల్నర్ రూ.640 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు ఇది. ప్రాజెక్టులో భాగంగా వారు వెస్ట్ వర్జీనియాలోని గ్రీన్ బ్యాంక్ రేడియో టెలిస్కోప్, హామిల్టన్ పర్వతంపై ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ ప్లానెట్ ఫైండర్, ఆస్ట్రేలియాలోని పార్క్స్ రేడియో టెలిస్కోపును వినియోగించుకుంటున్నారు. | nation |
9,670 | 02-03-2017 12:02:30 | ఆయన ఆశీస్సుల వల్లే ఈ స్థాయికొచ్చాం: జబర్దస్త్ రాంప్రసాద్, సుధీర్ | తిరుమల: వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే తాము ఈ స్థాయికి వచ్చామని జబర్దస్త్ నటులు రాంప్రసాద్, సుడిగాలి సుధీర్ అన్నారు. బుధవారం సాయంత్రం వీరిద్దరూ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రాంప్రసాద్ మాట్లాడుతూ జబర్దస్త్ కార్యక్రమం వల్లే తాము ఉన్నతస్థాయికి చేరుకున్నామన్నారు. సుధీర్ మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి ఉచిత దర్శనంలో వేచి ఉండి శ్రీవారిని దర్శించుకుని వెళ్లేవాడినని, జబర్దస్త్‌తో గుర్తింపు రావడంతో ఇప్పుడు మంచి దర్శనం లభించిందన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్లే తాము గొప్పస్థాయికి చేరుకుంటున్నామన్నారు. ఆలయం వెలుపల రాంప్రసాద్, సుధీర్‌ను చూడటానికి పలువురు ఉత్సాహం చూపారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. అంతకుముందు ఏపీ సీఐడీ ఐజీ అమితగర్గ్, తమిళ, తెలుగు సినీనటుడు అజయ్‌రత్నం వేంటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. | entertainment |
1,505 | 26-09-2017 01:55:55 | కొనసాగుతున్న నష్టాలు | సెన్సెక్స్ 296 పాయింట్ల పతనంఅంతర్జాతీయ పరిణామాల ప్రభావం వల్ల స్టాక్ మార్కెట్లో షేర్ల ధరల పతనం కొనసాగుతోంది. సోమవారం నాడు సెన్సెక్స్ 296 పాయింట్ల నష్టంతో ముగిసింది. నిఫ్టీ మళ్లీ 9900 పాయింట్ల దిగువకు పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి అమ్మకాల తాకిడి తీవ్రంగా ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 542 పాయింట్ల శ్రేణిలో ఆటుపోట్లను చవిచూసింది. ప్రారంభం క్రితం ముగింపు కంటే ఎగువనే మొదలైనా కొద్ది క్షణాల్లోనే నష్టాల్లోకి జారిపోయింది. ఇంట్రాడేలో 32016 పాయింట్ల గరిష్ఠ స్థాయిని, 31474 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. ఆఖరులో 31626 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్ భారీగా నష్టపోయింది. ఎం అండ్ ఎం, ఐటిసి, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ తో సహా సెన్సెక్స్‌లోని 23 షేర్లు నష్టాలతో ముగిసాయి. ఔన్‌జిసి క్రితం స్థాయిలోనే ముగిసింది. కోల్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్, టిసిఎస్ లాభాలతో ముగిశాయి. నిఫ్టీ 91 పాయింట్ల నష్టంతో 9872 వద్ద ముగిసింది. అమెరికా, ఉత్తరకొరియా మధ్య రగులుతున్న ఉద్రిక్తతల ప్రభావం మార్కెట్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. గతవారం సెన్సెక్స్ 500 పాయింట్లు పైగా నష్టపోయింది. షాపర్స్ స్టాప్‌కు అమెజాన్ కిక్కు అంతర్జాతీయ ఇకామ్ దిగ్గజం అమెజాన్‌కు వాటాలను విక్రయిస్తున్న వార్తలతో షాపర్స్ స్టాప్ షేరు 20 శాతం లాభపడింది. ఈ షేరు ధర 499 వద్ద ముగిసింది. షాపర్స్ స్టాప్‌లో 5 శాతం వాటాను 179 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసేందుకు అమెజాన్ ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అదరగొట్టిన కెపాసిటీ ఇన్‌ఫ్రా కెపాసిటీ ఇన్‌ఫ్రా షేర్లు సోమవారం భారీ లాభాలతో లిస్టయ్యాయి. ఇటీవలనే ఇష్యూకు వచ్చిన ఈ కంపెనీ 250 రూపాయలకు షేర్లను ఆఫర్ చేయగా, 60 శాతం ప్రీమియంతో రూ.399 వద్ద లిస్టయి అదరగొట్టింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ ఒత్తిడి వల్ల ఆఖరులో రూ.342 వద్ద ముగిసింది. ఆఫర్ ధర కంటే ఇది 37 శాతం ఎక్కువ. బిఎ్‌సఇలో 34 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. పబ్లిక్ ఇష్యూ ద్వారా ఈ కంపెనీ 400 కోట్ల రూపాయలను సమీకరించంది. నోవార్టిస్ షేర్ల బైబ్యాక్ ఔషధ దిగ్గజం నోవార్టిస్ సుమారు 231 కోట్ల రూపాయలతో షేర్ల బైబ్యాక్ చేపట్టనుంది. మొత్తం 34.5 లక్షల షేర్లను సంస్థ కొనుగోలు చేస్తుంది. మొత్తం ఈక్విటీలో ఇది 12.26 శాతం వాటాకు సమా నం. 5 రూపాయల ముఖ విలువచేసే ఒక్కో షేరును గరిష్టంగా 670 రూపాయల రేటుతో కొనుగోలు చేస్తారు. బైబ్యాక్ ప్రతిపాదనను బోర్డు ఆమోదించినప్పటికీ షేర్ హోల్డర్ల ఆమోదం కూడా పొందాల్సి ఉందని సంస్థ వెల్లడించింది. | business |
1,582 | 31-03-2017 00:35:56 | పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న సైయెంట్ ఫౌండర్ బివిఆర్ మోహన్ రెడ్డి |
న్యూఢిల్లీ: గురువారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంటున్న సైయెంట్ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి. ఇంజనీరింగ్ ఆర్ అండ్ డి విభాగంలో మోహన్ రెడ్డి చేసిన విశేష కృషికి గుర్తింపుగా ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. | business |
4,005 | 16-07-2017 00:31:51 | ఇంతకూ అభివృద్ధి ఎంత? | ఈ దేశానికి వృద్ధాప్యం రాకుండా పచ్చగా నిగనిగలాడేట్టు చేయవచ్చు. అందుకు, అభివృద్ధిరేటు యావ తగ్గించుకుంటే చాలు. మన పూర్వీకుల మాదిరిగానే నిరాడంబర జీవితానికి అలవాటుపడటం నేర్చుకోవాలి.అభివృద్ధిరేటుపై అధికార, విపక్ష నేతలు ఎప్పుడూ వాదులాడుకుంటూనే ఉంటారు. రెండంకెల అభివృద్ధి అనో, వృద్ధిరేటు పడిపోయిందనో వాదనలు వినిపిస్తూంటాయి. ఇంతకూ ప్రస్తుతం వృద్ధిరేటు రెండు అంకెల్లో ఉందా, మూడు అంకెల్లో ఉందా? దేశంలో ఏం జరుగుతోంది? మానవ చరిత్ర తెలిసిన దగ్గర నుంచి సమాజాభివృద్ధి పురోగమనంలోనే ఉన్నది. పాత రోజుల్లో ప్రకృతివనరులను జాగ్రత్తగా వినియోగించుకుంటూ అభివృద్ధిపథంలో పయనించారు. అప్పట్లో వ్యవసాయరంగం, దాని అనుబంధ రంగాలదే అభివృద్ధిరేటులో ప్రధానపాత్ర. అభివృద్ధి నిదానంగా జరిగింది. ఎంతో మంది విదేశీయులు భారతదేశాన్ని రత్నగర్భగా భావించి దండయాత్రలు చేశారు. కానీ పారిశ్రామిక విప్లవం ప్రపంచ ముఖచిత్రాన్ని మార్చేసింది. వేల సంవత్సరాలుగా రక్షించుకున్న సహజవనరుల భక్షణ ఆరంభమైంది. పారిశ్రామిక, గనులరంగం ప్రకృతికిశాపంగా మారాయి. ప్రస్తుతం సహజవనరుల భక్షణ రేటే అభివృద్ధిరేటు. సుఖసంతోషాలు కాక, విలాసజీవితమే అభివృద్ధికి చిహ్నం. నిజానికి, దేశంలో ఉండే అన్ని కుటుంబాలు కడుపునిండా తిని, కంటినిండా నిద్రపోగలగడమే దేశాభివృద్ధికి చిహ్నం. కానీ, కొన్ని కుటుంబాలు కోట్లాది రూపాయలతో తులతూగుతుంటే, అనేకం ఆకలితోనూ, అప్పులతోనూ జీవిస్తున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. అందరికీ వెలుగునివ్వని ఆ వృద్ధిరేటు ఎంత ఉంటేనేమి? భూమిపైన, భూగర్భంలోనూ ఉన్న వనరులు పెట్టుబడిదారులు మింగేస్తున్నారు. ఇనుము, మాంగనీస్, బాక్సైట్, పెట్రోలియం తోడేస్తున్నారు. కొండలు, గుట్టలు, సున్నపురాళ్ళు, గ్రానైట్, మార్బల్ మాయమైపోతున్నాయి. ప్రకృతివనరుల తరుగుదలే ఇప్పుడు వృద్ధిరేటుగా మారింది. చైనా రెండంకెల వేగంతో పరిగెడుతున్నది కనుక దానికంటే వేగంగా పరుగుతీయాలంటున్నారు. జనాన్ని ఈ మాయలో, ఈ యావలో ముంచి, వేలసంవత్సరాలుగా మన పూర్వీకులు కాపాడిన వనరులను నాయకులు, అధికారులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఒక ముఠాగా ఏర్పడి కొల్లగొడుతున్నారు. బొగ్గు ఏర్పడాలంటే ఐదువేల ఏళ్ళు పడుతుంది. కానీ, హరించడానికి వందేళ్ళు చాలు. సహజవనరులను ఇలా తోడేస్తే వచ్చే తరాలు ఏం చేయాలి? మ్యూజియంలో చూడటం తప్ప వాళ్ళు సృష్టించలేరు కదా? సహజవనరుల దోపిడీని భవిష్యత్తు తరాలకు చేస్తున్న ద్రోహంగానే చూడాలి తప్ప, అభివృద్ధిరేటు అనడం అమానుషం. ప్రభుత్వాలు తమకు అందిన అధికారిక సమాచారం ఆధారంగా వృద్ధిరేటును లెక్కిస్తాయి. కానీ, అనధికారిక గణాంకాలు ఇంకా ఎక్కువ వృద్ధిరేటునే సూచిస్తాయి. ‘గాలి’ కంపెనీలు ఇనుపఖనిజాన్ని తెగతవ్వేసి, ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించి, విదేశాలకు అనధికారికంగా ఎక్కువ ఎగుమతి చేశాయి. ప్రభుత్వానికి చూపింది 10శాతం, తవ్వింది 200శాతం. బొగ్గు, సున్నపురాయి, గ్రానైట్, మార్బల్, బాక్సైట్ అన్నింటా ఇదేస్థితి. ప్రభుత్వాలకు లెక్కచూపని ఈ వనరుల దోపిడీ అంతా నల్లధనంగా మారింది. కనుక, దేశంలో వృద్ధిరేటు నాయకులు వాదించుకుంటున్నట్టుగా రెండంకెల్లో కాక, మూడంకెల్లో ఉందని గట్టిగా చెప్పుకోవచ్చు. ఆర్థిక సంస్కరణల కారణంగా మరో వందేళ్ళలో ప్రకృతి వనరులంటూ లేకుండాపోతాయి. ప్రస్తుతం మన అభివృద్ధి యవ్వనం లాంటిది. అభివృద్ధి చెందిన దేశాలు నిండు యవ్వనంతో నిగనిగలాడుతుంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు యవ్వనంలోకి అడుగుపెడుతున్నాయి. వందేళ్ళ తరువాత ప్రపంచదేశాలకు వృద్ధాప్యం వస్తుంది. ఈ దేశం కూడా ప్రకృతి వనరులు నశించిపోయి వృద్ధవనితలాగా దర్శనమిస్తుంది. ఈ దేశానికి వృద్ధాప్యం రాకుండా అది పచ్చగా, యవ్వనంతో నిగనిగలాడేట్టు చేయాలి. అందుకు, అభివృద్ధిరేటు యావ తగ్గించుకుంటే చాలు. మన పూర్వీకుల మాదిరిగానే నిరాడంబర జీవితానికి అలవాటుపడటం నేర్చుకోవాలి. ఆడంబరం పెరుగుతున్నకొద్దీ వనరులు తగ్గిపోతుంటాయి కనుక, కొన్ని త్యాగాలు తప్పవు. భావి తరాలకోసం ప్రకృతి వనరులను కాపాడవలసిన బాధ్యత మనందరిదీనూ. ‘స్వచ్ఛభారత్’ మాదిరిగా, పొదుపునూ, నిరాడంబరతనూ ప్రోత్సహించే నినాదం ఇప్పుడు అవసరం.బాచిన రామాంజనేయులుఅభివృద్ధిరేటుపై అధికార, విపక్ష నేతలు ఎప్పుడూ వాదులాడుకుంటూనే ఉంటారు. రెండంకెల అభివృద్ధి అనో, వృద్ధిరేటు పడిపోయిందనో వాదనలు వినిపిస్తూంటాయి. ఇంతకూ ప్రస్తుతం వృద్ధిరేటు రెండు అంకెల్లో ఉందా, మూడు అంకెల్లో ఉందా? దేశంలో ఏం జరుగుతోంది? మానవ చరిత్ర తెలిసిన దగ్గర నుంచి సమాజాభివృద్ధి పురోగమనంలోనే ఉన్నది. పాత రోజుల్లో ప్రకృతివనరులను జాగ్రత్తగా వినియోగించుకుంటూ అభివృద్ధిపథంలో పయనించారు. అప్పట్లో వ్యవసాయరంగం, దాని అనుబంధ రంగాలదే అభివృద్ధిరేటులో ప్రధానపాత్ర. అభివృద్ధి నిదానంగా జరిగింది. ఎంతో మంది విదేశీయులు భారతదేశాన్ని రత్నగర్భగా భావించి దండయాత్రలు చేశారు. కానీ పారిశ్రామిక విప్లవం ప్రపంచ ముఖచిత్రాన్ని మార్చేసింది. వేల సంవత్సరాలుగా రక్షించుకున్న సహజవనరుల భక్షణ ఆరంభమైంది. పారిశ్రామిక, గనులరంగం ప్రకృతికిశాపంగా మారాయి. ప్రస్తుతం సహజవనరుల భక్షణ రేటే అభివృద్ధిరేటు. సుఖసంతోషాలు కాక, విలాసజీవితమే అభివృద్ధికి చిహ్నం. నిజానికి, దేశంలో ఉండే అన్ని కుటుంబాలు కడుపునిండా తిని, కంటినిండా నిద్రపోగలగడమే దేశాభివృద్ధికి చిహ్నం. కానీ, కొన్ని కుటుంబాలు కోట్లాది రూపాయలతో తులతూగుతుంటే, అనేకం ఆకలితోనూ, అప్పులతోనూ జీవిస్తున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. అందరికీ వెలుగునివ్వని ఆ వృద్ధిరేటు ఎంత ఉంటేనేమి? భూమిపైన, భూగర్భంలోనూ ఉన్న వనరులు పెట్టుబడిదారులు మింగేస్తున్నారు. ఇనుము, మాంగనీస్, బాక్సైట్, పెట్రోలియం తోడేస్తున్నారు. కొండలు, గుట్టలు, సున్నపురాళ్ళు, గ్రానైట్, మార్బల్ మాయమైపోతున్నాయి. ప్రకృతివనరుల తరుగుదలే ఇప్పుడు వృద్ధిరేటుగా మారింది. చైనా రెండంకెల వేగంతో పరిగెడుతున్నది కనుక దానికంటే వేగంగా పరుగుతీయాలంటున్నారు. జనాన్ని ఈ మాయలో, ఈ యావలో ముంచి, వేలసంవత్సరాలుగా మన పూర్వీకులు కాపాడిన వనరులను నాయకులు, అధికారులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఒక ముఠాగా ఏర్పడి కొల్లగొడుతున్నారు. బొగ్గు ఏర్పడాలంటే ఐదువేల ఏళ్ళు పడుతుంది. కానీ, హరించడానికి వందేళ్ళు చాలు. సహజవనరులను ఇలా తోడేస్తే వచ్చే తరాలు ఏం చేయాలి? మ్యూజియంలో చూడటం తప్ప వాళ్ళు సృష్టించలేరు కదా? సహజవనరుల దోపిడీని భవిష్యత్తు తరాలకు చేస్తున్న ద్రోహంగానే చూడాలి తప్ప, అభివృద్ధిరేటు అనడం అమానుషం. ప్రభుత్వాలు తమకు అందిన అధికారిక సమాచారం ఆధారంగా వృద్ధిరేటును లెక్కిస్తాయి. కానీ, అనధికారిక గణాంకాలు ఇంకా ఎక్కువ వృద్ధిరేటునే సూచిస్తాయి. ‘గాలి’ కంపెనీలు ఇనుపఖనిజాన్ని తెగతవ్వేసి, ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించి, విదేశాలకు అనధికారికంగా ఎక్కువ ఎగుమతి చేశాయి. ప్రభుత్వానికి చూపింది 10శాతం, తవ్వింది 200శాతం. బొగ్గు, సున్నపురాయి, గ్రానైట్, మార్బల్, బాక్సైట్ అన్నింటా ఇదేస్థితి. ప్రభుత్వాలకు లెక్కచూపని ఈ వనరుల దోపిడీ అంతా నల్లధనంగా మారింది. కనుక, దేశంలో వృద్ధిరేటు నాయకులు వాదించుకుంటున్నట్టుగా రెండంకెల్లో కాక, మూడంకెల్లో ఉందని గట్టిగా చెప్పుకోవచ్చు. ఆర్థిక సంస్కరణల కారణంగా మరో వందేళ్ళలో ప్రకృతి వనరులంటూ లేకుండాపోతాయి. ప్రస్తుతం మన అభివృద్ధి యవ్వనం లాంటిది. అభివృద్ధి చెందిన దేశాలు నిండు యవ్వనంతో నిగనిగలాడుతుంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు యవ్వనంలోకి అడుగుపెడుతున్నాయి. వందేళ్ళ తరువాత ప్రపంచదేశాలకు వృద్ధాప్యం వస్తుంది. ఈ దేశం కూడా ప్రకృతి వనరులు నశించిపోయి వృద్ధవనితలాగా దర్శనమిస్తుంది. ఈ దేశానికి వృద్ధాప్యం రాకుండా అది పచ్చగా, యవ్వనంతో నిగనిగలాడేట్టు చేయాలి. అందుకు, అభివృద్ధిరేటు యావ తగ్గించుకుంటే చాలు. మన పూర్వీకుల మాదిరిగానే నిరాడంబర జీవితానికి అలవాటుపడటం నేర్చుకోవాలి. ఆడంబరం పెరుగుతున్నకొద్దీ వనరులు తగ్గిపోతుంటాయి కనుక, కొన్ని త్యాగాలు తప్పవు. భావి తరాలకోసం ప్రకృతి వనరులను కాపాడవలసిన బాధ్యత మనందరిదీనూ. ‘స్వచ్ఛభారత్’ మాదిరిగా, పొదుపునూ, నిరాడంబరతనూ ప్రోత్సహించే నినాదం ఇప్పుడు అవసరం.బాచిన రామాంజనేయులు | editorial |
18,372 | 18-01-2017 02:38:00 | ఉమ్మడి ఆస్తులపై సమాచారమివ్వండి: కేంద్రం | న్యూఢిల్లీ, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ఏపీ విభజన చట్టం షెడ్యూల్ 9లోని సంస్థల పంపకాలపై కేంద్ర హోం శాఖ నిర్వహించిన సమావేశం అసంపూర్ణంగా ముగిసింది. మంగళవారమిక్కడ కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి(కేంద్ర-రాష్ట్ర సంబంధాలు) దిలీ్‌పకుమార్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. రోడ్డు రవాణా సంస్థ, పాడిపరిశ్రమాభివృద్ధి, ఆగ్రో ఇండసి్ట్రయల్ డెవల్‌పమెంట్, ఫుడ్ కార్పొరేషనల ఆస్తుల విభజనపై చర్చించారు. గత సమావేశంలో.. 9వ షెడ్యూల్ సంస్థలకు 2 రాషా్ట్రల్లో ఉన్న ఆస్తుల వివరాలను నిర్ణీత నమూనాలో తమకు సమర్పించాలని హోం శాఖ సూచించింది. తెలంగాణ మాత్రం కేవలం సంస్థల కేంద్ర కార్యాలయాల సమాచారాన్నే అందజేసింది. దీంతో ఆయా సంస్థల పూర్తి వివరాలు ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. | nation |
5,845 | 16-06-2017 11:56:33 | రాజమౌళి కోసం తారక్ ఇంత సాహసం చేస్తాడా..? | మూవీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ దర్శకుడి నెక్ట్స్ మూవీలో నటించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడట టాలీవుడ్ క్రేజీ హీరో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి ఆ దర్శకుడిని వదిలిపెట్టొద్దని స్టార్ హీరో డిసైడయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. 'బాహుబలి 2' తరువాత బాలీవుడ్‌లోనూ తనకు ఫుల్ క్రేజ్ వచ్చినా... టాలీవుడ్‌లోనే తన తదుపరి సినిమా అని ప్రకటించాడు రాజమౌళి. నిర్మాత దానయ్యతో తన నెక్ట్స్ ప్రాజెక్టు ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ సినిమాలో హీరో ఎవరనే విషయంలో జక్కన్న ఒక చిన్న హింట్ కూడా ఇవ్వకపోవడంతో.. ఆయన తదుపరి సినిమా హీరో ఎవరనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే రాజమౌళి తదుపరి సినిమాలో నటించేందుకు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో పాటు రాజమౌళికి ఎంతో సన్నిహితుడైన హీరో ఎన్టీఆర్ పోటీ పడుతున్నట్టు గుసగుసలు మొదలయ్యాయి. బన్నీ, రాజమౌళి కాంబినేషన్ సెట్ చేసేందుకు నిర్మాత అల్లు అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నాడని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. అయితే రాజమౌళిని ఎలాగైనా మిస్ చేసుకోవద్దని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా గట్టిగానే ట్రై చేస్తున్నాడని కొందరు చర్చించుకుంటున్నారు. తనకు 'స్టూడెంట్ నంబర్ వన్', 'సింహాద్రి', 'యమదొంగ' వంటి హిట్స్ ఇచ్చిన రాజమౌళితో నాలుగోసారి సినిమా చేయాలని ప్రయత్నిస్తున్న తారక్... నిర్మాతల వైపు నుంచి కథ నడిపిస్తున్నాడట. దానయ్య దగ్గర తన డేట్స్ ఉండడం ఎన్టీఆర్‌కి కలిసొచ్చే అంశమని సమాచారం. అవసరమైతే రాజమౌళి సినిమా కోసం అంతకుముందు ఒప్పుకున్న సినిమాలను పెండింగ్‌లో పెట్టడానికి యంగ్ టైగర్ రెడీగా ఉన్నాడట. అంతేకాదు జక్కన్నతో సినిమా కోసం రెండు, మూడేళ్లు మరో సినిమా చేయకుండా వెయిట్ చేసేందుకు తారక్ సై అంటున్నాడని టాక్. మొత్తానికి దర్శకధీరుడు రాజమౌళి ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని టాలీవుడ్ క్రేజీ హీరో డిసైడయినట్టు అర్థమవుతోంది. మరి యంగ్ టైగర్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. | entertainment |
18,813 | 19-09-2017 03:16:30 | గోవాలో బహిరంగ మద్యపాన నిషేధం | పానాజి, సెప్టెంబరు 18: బహిరంగ ప్రదేశాల్లో మద్యపానాన్ని నిషేధించాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. మద్యం దుకాణాల చుట్టుపక్కల బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా తాగుతూ కనిపిస్తే ఆ దుకాణాలకు జరిమానాలు విధిస్తామని లేదా లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ‘ఎవరైనా మద్యం తాగాలనుకుంటే లోపల తాగాలి. పబ్లిక్ ప్రదేశాల్లో కాదు’ అని చెప్పారు. గత ఏడాదే బీచ్‌లు, గుర్తించిన కొన్ని ప్రదేశాల్లో మద్యపానాన్ని ప్రభుత్వం నిషేధించింది. | nation |
19,044 | 25-05-2017 19:14:04 | ప్రధాని మోదీని కలిసిన.. మమతా బెనర్జీ | న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. గురువారం పీఎంవో కార్యాలయానికి వెళ్ళి ఆయనతో భేటీ అయ్యారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, రాష్ట్రానికి అందాల్సిన నిధులు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానితో చర్చించినట్లు మమతా బెనర్జీ తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల గురించి ఎలాంటి చర్చ జరగలేదని ఆమె అన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాదిరిగా అందరికీ ఆమోదమైన వ్యక్తిని రాష్ట్రపతిగా ఎన్నుకుంటే మంచిదని మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో ఎలాంటి హింస లేదని బీజేపీ, సీపీఎం దీన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆమె అన్నారు. గురువారం జరిగిన ఆందోళనలో బీజేపీ కార్యకర్తలు పోలీసులతో పాటు మహిళలను కొట్టారని, ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారని మమతా బెనర్జీ విమర్శించారు. | nation |
1,065 | 06-05-2017 00:40:52 | వేదఘోషల నగరి..ఆధునిక ధన్వంతరి.. | తిరుపతిలో కేన్సర్ ఆస్పత్రిప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్న టాటా ట్రస్ట్‌వేదిక్ విశ్వవిద్యాలయం పక్కన 25 ఎకరాల స్థలం కేటాయింపురూ.140 కోట్లతో ఏర్పాటు.. రెండేళ్లలో అందుబాటులోకిఒప్పందం కుదుర్చుకున్న టిటిడి, టాటా ట్రస్ట్‌తిరుమల (ఆంధ్రజ్యోతి): వేదఘోష వినిపించే ప్రాచ్య విశ్వవిద్యాలయం ఒకవైపు, వైద్యో నారాయణుడిని ఉపాసించే పాశ్చాత్య కేన్సర్ వైద్యశాల మరోవైపు! తిరుపతిని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పానికి సాకార రూపమిది! నిన్న అరవిందో నేత్ర వైద్యశాల, ఇప్పుడు టాటా కేన్సర్ ఆస్పత్రి.. ఈ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అంతర్జాతీయంగా అత్యున్నత ఆరోగ్య కేంద్ర కూడలిగా మలిచే కృషి ఊపందుకొంది. ఈ ప్రాచీన సంస్కృతీనగరిని ఆధునిక ధన్వంతరిగా తీర్చిదిద్దే క్రమంలో మరో కీలక అడుగుపడింది. మరో పదిహేను రోజుల్లో అధునాతన ప్రమాణాలతో తిరుపతిలో అరబిందో నేత్ర వైద్యశాల నిర్మాణం మొదలు అవుతుండగా.. శుక్రవారం అంతర్జాతీయ ప్రమాణాలతో కేన్సర్ ఆస్పత్రిని నిర్మించడానికి టాటా ట్రస్టు ముందుకొచ్చింది. శుక్రవారం ఉదయం నిజపాద సేవలో శ్రీవేంకటేశ్వర స్వామిని టాటా ట్రస్టు మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరమణన్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించిన ఒప్పంద పత్రాలపై (ఎంఒయు) టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, టాటా ట్రస్టీ ఆర్కే కృష్ణ కుమార్ సమక్షంలో వెంకటరమణన్, టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సాంబశివరావు సంతకాలు చేశారు. తిరుపతిని మెడికల్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ఇఒ తెలిపారు. అందులోభాగంగా అరవిందో నేత్ర వైద్యశాలవారు ప్రపంచస్థాయి ప్రమాణాలతో త్వరలోనే ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభించనున్నారని తెలిపారు.తిరుపతిలో కేన్సర్ ఆస్పత్రి పెట్టాలని టాటా ట్రస్ట్ నిర్ణయించడం సంతోషకరమన్నారు. ‘‘టాటా ట్రస్టు ఇప్పటికే ముంబై, కోల్‌కతాల్లో కేన్సర్ వైద్యశాలలు నిర్వహిస్తోంది. ఇప్పుడు తిరుపతికి తన సేవలను విస్తరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో కేన్సర్ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. తిరుపతి ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ సమీపంలో ఆస్పత్రి నిర్మాణానికి 25 ఎకరాల టిటిడి స్థలాన్ని లీజు ప్రతిపాదికన కేటాయించనున్నాం’’ అని ఇఒ తెలిపారు. కేన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి రూ.140 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశామన్న ఆయన.. అందులో వంద కోట్లు టాటా ట్రస్టు సమకూరుస్తుందని, మిగిలిన రూ.40 కోట్లను దాతల నుంచి విరాళాలుగా సేకరిస్తామని వివరించారు. భవిష్యత్‌లో శ్రీవారి ఆశీస్సులతో మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఒకటిన్నర ఏడాదిగా శ్రీవారి భక్తులకు దర్శనం, గదుల కేటాయింపులు, లడ్డూల పంపిణీలో టిటిడి పారదర్శకంగా సేవలు అందించడానికి టాటా కన్సల్టెన్సీ (టిసిఎస్) సంపూర్ణమైన సహకారం అందిస్తోందని గుర్తుచేశారు. కేన్సర్ చికిత్సలో కీలక అడుగు: టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటును, రోగులకు సేవలందించడానికి తమకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ అన్నారు. ఇందుకు సహకరించిన టిటిడి ఇఒ సాంబశివరావుకు కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతిలో కేన్సర్ ఆస్పత్రి నిర్మించడానికి టిటిడితో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందని టాటా ట్రస్టు ఎండి వెంకటరమణన్ పేర్కొన్నారు. కేన్సర్ చికిత్స విషయంలో మరో కీలక అడుగు పడిందని అభిప్రాయపడ్డారు. రెండేళ్లలోపు అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యశాల నిర్మాణ పనులు పూర్తిచేసి కేన్సర్ రోగులకు అందుబాటులో తీసుకొస్తామని తెలిపారు. కేన్సర్‌పై టాటాల పోరుకేన్సర్‌పై జరుగుతున్న పోరుతో ముడిపడిన పేరు టాటాలు. ఇప్పుడు 125వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకొంటున్న టాటా ట్రస్టులు ప్రతిఫలాపేక్ష లేకుండా పేదలు, రోగులకు మానవతా సాయం అందిస్తున్నాయి. ఏడాదికి వేలాదిమందిని బలిగొంటున్న కేన్సర్ నుంచి దేశాన్ని రక్షించడం కోసం దశాబ్దాలుగా పాటుపడుతున్నాయి. కేన్సర్ రోగుల కోసం 1941లో కోల్‌కతాలో కేన్సర్ మెమోరియల్ సెంటర్‌ని ఏర్పాటుచేశారు. దేశవ్యాప్తంగా కేన్సర్ వ్యాధిపై అవగాహన, చికిత్స, నివారణ కోసం అనేక మార్గాల్లో ఈ ట్రస్టులు ప్రయత్నిస్తున్నాయి. రోగులకు ఉచిత చికిత్స, మందులు, వసతి అందించడం దగ్గర నుంచి కేన్సర్ పీడిత ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించడం ద్వారా టాటా ట్రస్టుల సేవలు విస్తరించాయి. పలు ఆస్పత్రులకు నాణ్యత కలిగిన ఖరీదైన పరికరాలను విరాళంగా అందిస్తున్నాయి. ఈ అంశంపై జరుగుతున్న పరిశోధనలకు ఆర్థిక తోడ్పాటుని అందిస్తున్నాయి. ఈ క్రమంలో 2011లో కోల్‌కతాలో టాటా మెడికల్ సెంటర్‌ని నెలకొల్పారు. అనంతరం ముంబైకీ తమ సేవలను విస్తరించారు. 106 కేన్సర్ ఆస్పత్రులతో ఏర్పడిన నేషనల్ గ్రిడ్‌లో టాటా ట్రస్టు భాగస్వామి. పెద్ద నగరాల్లోని సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల మొదలు తండాల్లోని ప్రాథమిక వైద్యశాల వరకు.. కేన్సర్‌కు నాణ్యమైన చికిత్స, దానికి అవసరమైన ఆధునిక పరికరాలను అందిస్తున్నాయి. ఇప్పుడు తిరుపతిలో నెలకొల్పుతున్న ఆస్పత్రిలో కేన్సర్‌కు సమగ్ర నవ్య చికిత్సా పద్ధతి అందుబాటులోకి రానుంది. | business |
18,306 | 03-05-2017 03:07:50 | సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి | కేంద్రానికి ఏకే ఆంటోనీ సూచనమీ చేతికున్న గాజులు తీయండిప్రధాని మోదీకి కపిల్ సిబల్ సవాల్‌న్యూఢిల్లీ, మే 2: భారత జవాన్ల తలలు వేరు చేసిన పాకిస్థాన్‌పై తగిన చర్య తీసుకునేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సూచించారు. నియంత్రణ రేఖ వెంబడి భద్రతపైనా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ఈ ఘటన భారత సైన్యం పరువు, ప్రతిష్ఠ, నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు. ‘‘ఈ అంశాన్ని నేను రాజకీయం చేయాలనుకోవడం లేదు. కానీ, నేను ఎనిమిదేళ్లపాటు రక్షణ మంత్రిగా ఉన్నాను. ఇటువంటి ఘటన అప్పుడు ఒక్కటే జరిగింది. కానీ, ఈ మూడేళ్లలోనే ఇటువంటి ఘటనలు మూడు జరిగాయి’’ అని తప్పుబట్టారు. కాగా, మోదీ సర్కారుపై కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాఉ సంబంధించి దానికో విధానం లేదని దుయ్యబట్టారు. ‘‘మీ చేతికున్న గాజులు తీసేసి, మీరేం చేయగలరో చేసి చూపించండి’’ అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి తీవ్రంగా వ్యాఖ్యానించారు. ‘‘యూపీఏ ప్రభుత్వ హయాంలో ‘మన్మోహన్ సింగ్‌కు గాజులు పంపించాలా?’ అని అప్పట్లో ఓ మహిళా ఎంపీ అడిగారు. ఆ ఎంపీ ఇప్పుడు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీకి ఇప్పుడు ఆమె గాజులు పంపగలరా!?’’ అని స్మృతి ఇరానీని ఉద్దేశించి సిబల్ ప్రశ్నించారు. ‘‘ఇదేమి ప్రభుత్వం!? ఈయనేమి ప్రధాన మంత్రి? వీళ్ల చర్యలను పాక్ ఎప్పటికీ పట్టించుకోదని ఎప్పుడు తెలుసుకుంటారు?’’ అని దుయ్యబట్టారు. పాకిస్థాన్‌పై చర్యలు తీసుకునే విషయంలో ప్రతిపక్షాల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా సూచించారు. | nation |
15,487 | 26-11-2017 03:25:55 | నాన్నకు ప్రేమతో.. | విధులకు వెళ్లాడనే అనుకుంటున్నాంఆయన వస్తువులు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి26/11 ఉగ్రదాడిలో అమరుడైన అధికారి తుకారాం కూతురుముంబై, నవంబరు 25: ఒక్క లాఠీ.. పాకిస్థాన్ నీచబుద్ధిని రోడ్డు కీడ్చిం ది. ఒక్కలాఠీ.. ముంబైపై తెగబడిన ముష్కరమూకపై తిరగబడింది. ఒక్క లాఠీ.. కసబ్ తూటాలతో ఒంటరిగా పోరాడి ఉగ్రవాదిని పట్టించింది. ఆ ఒక్కలాఠీ.. ముంబైపై లష్కరే ఉగ్రకుట్రకు సజీవ ఆధారాన్ని అప్పగించిం ది. ఆ ఒక్క లాఠీయే తుకారాం ఓంబ్లే! ముంబైలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన యోధుడు. కసబ్ ఏకే 47కు కేవలం లాఠీతో ఎదురెళ్లి పట్టుకున్న నిజమైన హీరో! 2008 నవంబరు 26 రాత్రి.. ముంబైలో చొరబడిన 10 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ముంబైలోని డీబీ మార్క్, చౌపాటీ, మరీన్ డ్రైవ్ ప్రాంతాల్లో మారణహోమం సృష్టించారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది చనిపోయాడు. పక్కనే ఉన్న కసబ్ చనిపోయినట్టు నటించాడు. ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారనుకున్న సమయంలో లేచి మళ్లీ కాల్పులతో విరుచుకుపడ్డాడు. 40 అడుగుల దూరంలో డ్యూటీలో ఉన్న తుకారాం ఓంబ్లే అక్కడికి వెళ్లాడు. కసబ్‌పై లాఠీ విసిరి ఒక్క ఉదుటున పట్టుకున్నాడు. తన శరీరంలోకి 5తూటాలు పేల్చినా.. కొన ఊపిరి వరకూ కసబ్‌ను వదలకుండా పోరాడాడు. తుకారాం త్యాగమే ముంబై దాడుల్లో పాక్ ప్రమేయాన్ని, హఫీజ్ సయీద్ కుట్రను ఎండగట్టేలా చేసింది. నాన్న వస్తాడు26/11 దాడి జరిగి ఆదివారానికి సరిగ్గా తొమ్మిదేళ్లు. అదే రోజు తుకారాం ఓంబ్లే కూడా అమరుడయ్యాడు. మనిషి లేకపోవచ్చు. కానీ ఆదర్శం నిలిచే ఉంటుంది. ఓంబ్లే కుమార్తె వైశాలి తండ్రి ఆదర్శాలను కొనసాగిస్తోంది. ఎంఈడీ చదివిన ఆమె..మురికివాడల్లోని పిల్లలకు చదువుచెబుతోంది. ‘మా నాన్న మా మధ్య లేకుండా ఉండలేరు. ఎప్పటికైనా ఇంటికి తిరిగివస్తారు’ అంటూ తుకారాం కూతురు వైశాలి చెబుతున్న మాటలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. ‘మా నాన్న ఎప్పటికైనా ఇంటికి తిరిగి వస్తారు. ఆయన భౌతికంగా మా మధ్య లేకపోయినా మా మనసుల్లో ఎప్పటికీ ఉంటారు. ఇప్పటికీ నాన్న విధులకు వెళ్లాడనే అనిపిస్తుంది. నాన్న ఉపయోగించిన వస్తువులు ఇప్పటికీ ఆయన పెట్టిన చోటే ఉన్నాయి. ఆయన చేసిన త్యాగం చాలా గొప్పది. నాన్న చేసిన త్యాగానికి మా కుటుంబం ఎంతో గర్వపడుతోంది’ అంటూ కన్నీటిపర్యంతమైంది వైశాలీ. మరోవైపు ప్రజల్లో మార్పు రావాలని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో భాగంగా భద్రతా బలగాలు, పోలీసులు ప్రాణాలు కోల్పోతున్నారంటే అది వారి కుటుంబానికే కాదు.. దేశానికి కూడా నష్టమే అని అన్నారు. ‘పోలీసులు, భద్రతాబలగాలు త్యాగాల పేరుతో ఇంకెన్నాళ్లు ప్రాణాలు కోల్పోవాలి. ఈ వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క పౌరుడు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి విపత్తులు ఎదురైనప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి’ అంటూ ఆమె పిలుపునిచ్చారు. పేద పిల్లలకు ట్యూషన్లు చెబుతూ తండ్రి మరణాన్ని మరచిపోయే ప్రయత్నం చేస్తోంది. కానీ మరచిపోవడానికి నాన్న జ్ఞాపకం కాదు. జీవితం! | nation |
17,566 | 15-08-2017 05:33:49 | కార్తీ చిదంబరానికి చుక్కెదురు | ‘లుక్ ఔట్ నోటీసు’పై స్టే రద్దు చేసిన సుప్రీంకోర్టుచెన్నై, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): విదేశీ మారకద్రవ్య మోసం కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం సహా నలుగురికి సీబీఐ జారీ చేసిన ‘లుక్ ఔట్ నోటీసు’పై మద్రాసు హైకోర్టు జారీ చేసిన స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం రద్దు చేసింది. దీనితో తమ విచారణకు హాజరుకావాలంటూ కార్తీ చిదంబరం సహా నలుగురికి సోమవారం సీబీఐ ఆదేశాలు జారీ చేసింది. | nation |
159 | 06-07-2017 23:20:45 | దక్కన్ క్రానికల్‌పై దివాలా పిటిషన్ | ఆమోదించిన ఎన్‌సిఎల్‌టిహైదరాబాద్: బ్యాంకులకు భారీ ఎత్తున రుణాలు బకాయి పడిన దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌కు వ్యతిరేకంగా కెనరా బ్యాంకు దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదించింది. బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణాలు సమీకరించి చెల్లింపుల్లో చేతులెత్తేసిన దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు కోర్టుల్లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. కంపెనీని ఎత్తేసి, ఆస్తులు విక్రయించి తమ బకాయిలు చెల్లించాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్లపై విచారణ ఇంకా కొలిక్కి రాలేదు. ఈ లోగా హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) కెనరా బ్యాంకు పిటిషన్‌ను విచారణకు స్వీకరించడంతోపాటు ఇంటీరియం రెజొల్యూషన్ ప్రొఫెషనల్ (ఐఆర్‌పి)ని నియమించాల్సిందిగా కూడా సూచించినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన దివాలా చట్టం కింద కెనరా బ్యాంక్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినట్టు తెలిసింది. ఈ కొత్త దివాలా చట్టం కిందనే ఎన్‌సిఎల్‌టి వ్యవస్థను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. హైకోర్టుల్లోని కంపెనీ కోర్టులు, నాలుగు ప్రాంతాల్లో ఉన్న కంపెనీ లా బోర్డుల స్థానంలో ఎన్‌సిఎల్‌టిలను ఏర్పాటు చేశారు. బ్యాంకింగ్ రంగానికి పెను శాపంగా మారిన మొండిపద్దుల సమస్య పరిష్కారం కోసం ఏర్పాటైన ఈ కొత్త వ్యవస్థ కింద 12 బడా మొండిపద్దుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. దక్కన్ క్రానికల్ రుణాల వసూలుకు దీర్ఘకాలంగా పోరాడుతున్న కెనరా బ్యాంకు ఇప్పుడు ఈ కొత్త చట్టాన్ని ఉపయోగించుకోవడం, ట్రి బ్యునల్ సానుకూలంగా స్పందించడం దక్కన్ క్రానికల్‌కు అనూహ్యమైన ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. అప్పులు చెల్లించలేక చేతులెత్తేసిన కంపెనీలను దివా లా కంపెనీలుగా వ్యవహరిస్తారు. అసాధారణ పరిస్థితుల్లో... అంటే బకాయిల వసూలు ఇక అసాధ్యమని తేలిన పక్షంలో అలాంటి కంపెనీల ఆస్తులను విక్రయించి రుణసంస్థల బకాయిలను జమకడుతారు. కెనరా బ్యాంక్ దాఖలు చేసిన ఇన్‌సాల్వెన్సీ పిటిషన్ను ఆమోదించిన ట్రిబ్యునల్, తదుపరి చర్యలపై తన నిర్ణయాన్ని జూలై 11న వెల్లడించనున్నట్టు తెలిపింది. ఏదైనా కంపెనీకి వ్యతిరేకంగా ఇన్‌సాల్వెన్సీ అభ్యర్ధనను అంగీకరిస్తే, మారటోరియం ప్రకటించడంతోపాటు, కార్పొరేట్ ఇన్‌సాల్వెన్సీ ప్రక్రియను ప్రారంభించడం, దీని పర్యవేక్షణకు నిపుణుల నియామకం..వంటి పలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దివాలా చట్టం ప్రకారం చర్యలకు ఉ పక్రమిస్తే, ట్రిబ్యునల్ నియమించే పర్యవేక్షకుడు దివా లా కంపెనీకి అప్పులిచ్చిన సంస్థలన్నింటి నుంచి అభ్యర్ధనలను స్వీకరిస్తారు. మారటోరియం (సాధారణంగా 180 రోజులు ఉంటుంది) కాలంలో కంపెనీ నిర్వహణ పూర్తిగా పర్యవేక్షుల చేతిలోనే ఉంటుంది. ఈ సమయంలోనే కంపెనీ ఆస్తులమ్మి రుణ సంస్థల బకాయిలు చెల్లించాలా లేక కొత్త మేనేజ్‌మెంట్ సారధ్యంలో కంపెనీని పునరుద్ధరించాలా.. అన్న విషయం కూడా పర్యవేక్షకుడు నిర్ణయిస్తాడు. దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ బ్యాంకులకు దాదాపు రూ.4,000 కోట్ల వరకు బకాయి పడినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. కెనరా బ్యాంక్‌కు చెల్లించాల్సిన మొత్తమే రూ.700 కోట్ల వరకు ఉంది. | business |
429 | 30-10-2017 00:09:53 | బ్యాంకింగ్ ప్యాకేజీతో జిడిపికి ఊతం | ఏడు శాతానికి చేరనున్న వృద్ధి రేటున్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల(పిఎస్‌బి) పునఃమూ లధనీకరణ కోసం ప్రభుత్వం ప్రకటించిన రూ.2.11 లక్షల కోట్ల ప్యాకేజీ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్నీ ముందుకు నెడుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతంగా ఉండే జిడిపి వృద్ధి రేటు 2018-19లో ఏడు శాతానికి చేరే అవకాశం ఉందని అంబిట్ క్యాపిటల్ అనే బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది. బ్యాంకుల పరపతి వృద్ధి రేటూ ఏడు శాతం వరకు పెరిగి 15 శాతానికి చేరే అవకాశం ఉందని తెలిపింది. ‘ఈ రెండు పరిణామాలతో పారిశ్రామిక, సేవల రంగాలు గాడిలో పడతాయి. ఫలితంగా 2017-18లో 5.8 శాతంగా ఉండే జిడిపి వృద్ధి రేటు 2018-19లో ఏడు శాతానికి చేరే అవకాశం ఉంది’ అని తన నివేదికలో పేర్కొంది. వ్యవసాయ రంగం వృద్ధి రేటూ ప్రస్తుత 1.5 శాతం నుంచి 4.2 శాతానికి చేరవచ్చని అంచనా వేసింది. వచ్చే ఏడాదిన్నర కాలంలో 14 ఎన్నికలు ఉన్నందున, ద్రవ్యలోటు కట్టడికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అంత జాగ్రత్తగా ఉండక పోవచ్చని కూడా అంబిట్ క్యాపిటల్ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ద్రవ్య లోటులో ప్రభుత్వం ఇప్పటికే 96 శాతం నిధులను ఖర్చు చేసిన విషయాన్ని గుర్తు చేసింది. ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వం ఎన్నడూ ఇంత వేగంగా ద్రవ్య లోటు నిధులను ఖర్చు చేయలేదని తెలిపింది. దీంతో పిఎ్‌సబిల పునర్ వ్యవస్తీకరణకు అవసరమైన నిధలు కోసం ద్రవ్య లోటు లక్ష్యాన్నీ సవరించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎల్‌ఐసిపైనే భారం !మరోవైపు పిఎస్‌బిల మూలధనీకరణ భారంలో కొంత, ప్రభుత్వ నిర్వహణలోని ఎల్‌ఐసిపై వేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ సమయంలో ఇబ్బందులు ఎదురైనపుడు గతంలోనూ ఎల్‌ఐసి ఇలానే ప్రభుత్వాన్ని ఆదుకుంది. ఇప్పుడు పిఎ్‌సబిలకు మూలధనం అందించడంలో భాగంగా రూ.58,000 కోట్లు వాటాల విక్రయం ద్వారా, మరో రూ.1.35 లక్షల కోట్లు మూలధన రుణ పత్రాల(బాండ్ల) జారీ ద్వారా సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో కొంత భాగాన్ని ఎల్‌ఐసి నెత్తిన రుద్దాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. | business |
4,618 | 02-12-2017 21:18:14 | అందుకే ధనుష్ అసంతృప్తిగా ఉన్నాడా..? | ఒక స్టార్ హీరో సినిమాను అదే హీరో నటించిన మరో సినిమా అడ్డుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. కోలీవుడ్ సూపర్ స్టార్ విషయంలో ప్రస్తుతం ఇదే జరుగుతోందట. రజనీకాంత్ హీరోగా సౌతిండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న'2.ఓ' సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడొస్తుందనే విషయంలో ఎవరికీ అంతగా క్లారిటీ లేదు. నిజానికి ఈ ఏడాది దీపావళికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా సాంకేతిక కారణాల వల్ల జనవరి 26కు వాయిదా వేస్తున్నట్టు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమాను ఏప్రిల్ బరిలో నిలపబోతున్నారని వార్తలు వినిస్తున్నాయి. దీంతో ఏప్రిల్‌లో అయినా ఈ సినిమా విడుదల ఉంటుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది. '2.ఓ' సంగతి ఎలా ఉన్నా ఈ సినిమా తరువాత సెట్స్ మీదకు వెళ్లి షూటింగ్ పూర్తి చేసుకున్న రజనీకాంత్ మరో నయా మూవీ 'కాలా' విడుదలను '2.ఓ' అడ్డుకుంటోందని కోలీవుడ్ వర్గాలతో పాటు రజనీకాంత్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నిజానికి '2.ఓ' రిలీజైన తరువాత 'కాలా'ను విడుదల చేస్తే 'కాలా' బిజినెస్ రేంజ్ మరింత పెరుగుతుందని రజనీకాంత్‌తో పాటు చిత్ర నిర్మాత అయిన హీరో ధనుష్ భావించారు. '2.ఓ' జనవరిలో వచ్చేస్తే 'కాలా'ను సమ్మర్‌లో నిలపాలని భావించిన ధనుష్ ఇప్పుడు '2.ఓ' కూడా సమ్మర్‌కు వాయిదా పడటంపై అసంతృప్తితో ఉన్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కాస్త ఆలస్యమైన 'కాలా'ను '2.ఓ' తరువాతే విడుదల చేయాలని రజనీకాంత్ భావిస్తుండటంతో రజనీకాంత్ 'కాలా'ను '2.ఓ' అడ్డుకుంటోందనే కామెంట్స్ పడిపోతున్నాయి. ఒక వేళ '2.ఓ' రిలీజ్ మరింత ఆలస్యమైతే ఈ లోగా కాలా ధియేటర్లలోకి వచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.. | entertainment |
21,532 | 21-08-2017 02:39:31 | టీమిండియాకు ఎప్పటికీ మద్దతు |
ముంబై: ఎటువంటి పరిస్థితుల్లోనైనా తన మద్దతు టీమిండియాకేనని సచిన్ టెండూల్కర్ అన్నాడు. జట్టు అంచనాల మేర రాణించినా.. రాణిం చకపోయినా తన మద్దతు మాత్రం ఎప్పటికీ మారదని స్పష్టంచేశాడు. ‘పురుషుల జట్టయినా మహిళల జట్టయినా వారికి ఎల్లప్పుడూ నా శుభాశీస్సులుంటాయ’ని ముంబై హాఫ్ మార థాన్‌ను ఆదివారం ఇక్కడ ప్రారంభించిన అనంతరం సచిన్ తెలిపాడు. | sports |
16,743 | 01-12-2017 20:33:34 | ముస్లింలను వర్థిల్లనివ్వాలి : బరాక్ ఒబామా | న్యూఢిల్లీ : భారతీయ ముస్లింలను పెంచి, పోషించవలసిన అవసరం ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారు. భారతీయులుగా భావిస్తున్న ముస్లింలను వర్థిల్లేలా చేయాలన్నారు. లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ ఈ భావజాలాన్ని బలోపేతం చేయాలన్నారు. తాను 2015లో అమెరికా అధ్యక్షుడి హోదాలో భారతదేశానికి వచ్చినపుడు ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడానని తెలిపారు. మత సహనం, మతాన్ని ఆచరించే స్వేచ్ఛ ఉండాలని గట్టిగా చెప్పానన్నారు. చాలా సందర్భాల్లో దీనికి విరుద్ధంగా జరుగుతోందని, అయితే ఇది ప్రస్తుతం యూరోపు, అమెరికా, కొన్నిసార్లు ఇండియాలో ప్రధానంగా వినిపిస్తోందని చెప్పారు. భారతీయ ముస్లింలను ఆయన ప్రశంసించారు.భారతీయ ముస్లింలు తమను తాము భారతీయులుగా భావిస్తున్నారన్నారు. వారు విజయవంతమయ్యారని చెప్పారు. కొన్ని ఇతర దేశాల్లో దురదృష్టవశాత్తూ ఈ విధంగా లేదన్నారు. | nation |
18,437 | 21-10-2017 20:22:55 | రౌడీ షీటర్, పోలీసుల పోరాటం |
బెంగళూరు : రౌడీ షీటర్ రాజదురైకి పోలీసులు గట్టిగా బుద్ధి చెప్పారు. అరెస్టును తప్పించుకునేందుకు తమపై దాడికి తెగబడిన రాజదురైపై కాల్పులు జరిపారు. బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ అధికారుల కథనం ప్రకారం పీన్యాకు సమీపంలోని సోలదేవనహళ్ళిలో ఈ సంఘటన జరిగింది. ఓ ఏడాది క్రితం నమోదైన హత్య కేసులో నిందితుడైన రాజదురైను అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్ళారు. వీరిని చూసిన రాజదురై పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసు హెడ్‌కానిస్టేబుల్ నరసింహ మూర్తిపై కత్తితో దాడి చేసి, గాయపరిచాడు. ఇన్‌స్పెక్టర్ ప్రకాశ్ రాథోడ్ వెంటనే అప్రమత్తమై రాజదురైపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో గాయపడిన నరసింహమూర్తితోపాటు రాజదురైకి స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. | nation |
12,721 | 27-11-2017 02:37:32 | పాక్ 70 ఏళ్లలో చేయలేనిది.. బీజేపీ మూడేళ్లలో చేసింది | ‘‘దేశ ప్రజల్లో మతపరమైన విభేదాలు సృష్టించడానికి పాకిస్థాన్ 70 ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. అయినా ఆ దేశానికి చెందిన ఐఎ్‌సఐ ఏజెంట్లు విఫలమయ్యారు. కానీ, బీజేపీ మాత్రం మూడేళ్లలోనే ఆ పని చేసేసింది. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పాలి. అక్కడ ఆమ్‌ఆద్మీ పార్టీ గెలిచేలా ఉంటే ఓటేయండి. లేదంటే మరో పార్టీ అభ్యర్థికి వేయండి.’’ అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి | nation |
6,559 | 24-02-2017 15:09:13 | బాహుబలి-2 మోషన్ పోస్టర్ వచ్చేసింది! | బాహుబలి-2లో ప్రభాస్ లుక్‌ను విడుదల చేసి.. బాహుబలి అభిమానులకు పండుక కానుక ఇచ్చిన రాజమౌళి వెంటనే బాహుబలి-2 మోషన్ పోస్టర్‌ను విడుదల చేశాడు. తన ఫేస్‌బుక్‌లో ఆ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశాడు. వాస్తవానికి ఏప్రిల్ 28నే సినిమా విడుదల కావాల్సి ఉంది. దీంతో సినిమాకు ఉన్న టైం కేవలం రెండు నెలలు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నా.. ఇప్పటిదాకా టీజర్‌ను కూడా విడుదల చేసే పరిస్థితి లేదు. ఆ లోటు కనిపించకుండా ఎప్పటికప్పుడు జక్కన్న సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్‌ను ఇస్తూనే ఉన్నాడు. రాజమౌళి విడుదల చేసిన ప్రభాస్ తాజా లుక్‌లోనూ, మోషన్ పోస్టర్‌లోనూ.. ఇంతకముందు ప్రభాస్, అనుష్క పోస్టర్‌లో వచ్చిన లోపాలు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు టాలీవుడ్ జక్కన్న. | entertainment |
16,242 | 21-12-2017 00:51:57 | రూపానీకే చాన్స్ | నేడు గుజరాత్ సీఎం ఎంపికరేసులో కేంద్రమంత్రి మన్‌సుఖ్‌హిమాచల్‌లో జేపీ నడ్డా, జైరామ్ ఠాకూర్‌ల మధ్య పోటీన్యూఢిల్లీ, డిసెంబరు 20: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో బీజేపీ శాసనసభా పక్ష నేత ఎంపిక గురువారం జరుగుతుంది. కేంద్ర పరిశీలకులుగా అరుణ్ జైట్లీ, పార్టీ ప్రధానకార్యదర్శి సరోజ్ పాండే అహ్మదాబాద్ వెళుతున్నారు. వారు బీజేపీ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపి నేతను లాంఛనంగా ఎంపిక చేస్తారు. ఇప్పటివరకూ వినిపిస్తున్న పేర్ల ప్రకారం- ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ రూపానీయే మళ్ళీ సీఎం అయ్యే సూచనలున్నాయి. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ పేరు వినిపించినా- తాను రేసులో లేనేలేనని, అసలు తన పేరెందుకొచ్చిందో అర్థం కావట్లేదని ఆమె వ్యాఖ్యానించారు. విజయ్ రూపానీ పట్ల కేంద్ర నాయకత్వానికి పూర్తి సానుకూలత లేదు. బీజేపీ మెజారిటీ తగ్గిపోడానికి ఆయన పాలనే కారణమని అమిత్ షా- మోదీలిద్దరూ భావిస్తున్నారు. అయినా గత్యంతరం లేక ఆయననే ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది. కొన్నాళ్లపాటు ఆయననే సీఎంగా కొనసాగించి మార్చేద్దామని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. యూపీలో మాదిరిగా ఆకస్మికంగా ఎవరూ ఊహించని వ్యక్తిని సీఎం పదవిపై కూర్చోపెట్టవచ్చని వార్తలొచ్చినా- సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రయోగాలొద్దని అమిత్ షా భావిస్తున్నట్లు సమాచారం. కాగా, నితిన్ పటేల్‌తో పాటు పటీదార్ సామాజికవర్గానికి చెందిన కేంద్రమంత్రి మన్‌సుఖ్ మండవియా కూడా సీఎం రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గుజరాత్‌లో బీజేపీ- మేజిక్ ఫిగర్ (92) కంటే కేవలం 7 సీట్లు మాత్రమే ఎక్కువ గెల్చుకోగలిగింది. అటు హిమాచల్‌ప్రదేశ్‌లో ధుమల్ ఓడిపోవడంతో కేంద్ర మంత్రి జేపీ నడ్డా, జైరామ్ ఠాకూర్‌లలో ఎవరో ఒకరిని సీఎం పదవి వరించే అవకాశాలున్నాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, నరేంద్రసింగ్ తొమర్‌లు కేంద్ర పరిశీలకులుగా సిమ్లా వెళుతున్నారు. | nation |
16,843 | 14-08-2017 16:10:08 | కార్తీ....దేశం విడిచి వెళ్లొద్దు : సుప్రీం హుకుం | న్యూఢిల్లీ: అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ విచారణకు హాజరుకాకుండా విదేశీ పర్యటనలకు వెళ్లొద్దని అత్యున్నత న్యాయస్థానం సోమవారంనాడు ఆదేశించింది. కార్తీని విచారణకు హాజరు కావాల్సిందిగా మే 18, మే 21 తేదీల్లో సీబీఐ ఆదేశించింది. అయితే కార్తీ చిదంబరం మాత్రం తనపై వచ్చిన ఆరోపణలన్నీ రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవేనంటూ విచారణకు హాజరుకాకుండా ముఖం చాటేశారు. తనపై ఉన్న కేసును మద్రాసు హైకోర్టులో సవాలు చేసినందున తీర్పు వచ్చేంతవరకూ వేచిచూడాలని కూడా సీబీఐని ఆయన కోరారు. కార్తీపై ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ కాగా ఆ ఆదేశాలను హైకోర్టు స్తంభింపజేసింది. అయితే సుప్రీంకోర్టు సోమవారంనాడు ఇచ్చిన ఆదేశాలతో హైకోర్టు ఆదేశాలు రద్దు అయ్యాయి. తన క్లయింట్‌కు విదేశాలకు వెళ్లే ఆలోచన లేదంటూ కార్తీ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు నివేదించారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి జీఎస్ ఖెహర్ స్పందించారు. 'గతంలో విదేశాలకు వెళ్లేందుకు కొందర్ని అనుమతించి మేము పొరపాటు చేశాం. అలా విదేశాలకు వెళ్లినవారు ఇప్పటికీ తిరిగిరాలేదు. మళ్లీ ఆ పొరపాటు చేయలనుకోవడం లేదు' అని సీజేఐ వ్యాఖ్యానించారు. | nation |
1,973 | 09-09-2017 00:56:54 | మార్కెట్లోకి మహీంద్రా ఇ-రిక్షా ‘ఆల్ఫా మినీ’ | ధర రూ.1.12 లక్షలుఒకసారి చార్జింగ్‌తో 85 కిలోమీటర్ల ప్రయాణంన్యూఢిల్లీ : మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం).. మార్కెట్లోకి ఎలకా్ట్రనిక్ రిక్షాను విడుదల చేసింది. ఇ-ఆల్ఫా మినీ పేరుతో ఈ ఎలక్ట్రిక్ రిక్షాను మహీంద్రా మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర 1.12 లక్షల రూపాయలు (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్). శుక్రవారం నాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఎం అండ్ ఎం మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా ఇ-రిక్షాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంపెనీ ఇప్పటికే ప్యాసింజర్ వాహన విభాగంలో ఇ-వెరిటో, ఇ20 ప్లస్‌తో ఎలక్ర్టిక్ వాహనాలను విక్రయిస్తోందని, తాజాగా ఆల్ఫా మినీతో త్రి చక్ర వాహన విభాగంలోకి అడుగుపెట్టినట్లు ఆయన చెప్పారు. 120 ఎహెచ్ బ్యాటరీ, ఐదు సీట్లతో కూడిన ఇ-ఆల్ఫా మినీ... ఒకసారి చార్జింగ్‌తో 85 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని మహీంద్రా తెలిపింది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ఆల్ఫా ప్రయాణించనుంది. కాగా ఎలక్ట్రిక్ పోర్టుఫోలియోను మరింతగా విస్తరించాలని చూస్తున్నామని, ఇందులో భాగంగానే ఈ విభాగంలో మరిన్ని ఉత్పత్తులను తీసుకురానున్నట్లు పవన్ గోయెంకా తెలిపారు. ఎలక్ట్రిక్ వాహన విభాగం కోసం మహీంద్రా ఇప్పటికే 500 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టిందని, రానున్న రోజుల్లో మరో 600 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్లు గోయెంకా వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి నెలకు 500 యూనిట్లుగా ఉందని, రానున్న నెలల్లో దీన్ని 1,000 యూనిట్లకు, వచ్చే కొన్నేళ్లలో ఐదు వేల యూనిట్లకు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. కాగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఉత్పత్తులను ఎలక్ట్రిక్ విభాగంలోకి మార్చే అంశంపై కూడా కంపెనీ ఆలోచన చేస్తోందని గోయెంకా వివరించారు. | business |
1,594 | 18-04-2017 23:36:21 | ఒన్‌జిసిని మించిన ఎస్‌బిఐ | ఇండెక్స్‌లు డీలా పడినా ఎస్‌బిఐ షేర్లు మాత్రం మంగళవారం చురుగ్గా ట్రేడయ్యాయి. దీంతో బిఎస్‌ఇలో ఎస్‌బిఐ షేర్లు మార్కెట్ విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) ఒన్‌జిసిని మించి పోయింది. ఇప్పటి వరకు అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఒన్‌జిసి రికార్డు ఇపుడు ఎస్‌బిఐ పరమైంది. ట్రేడింగ్ ముగిసేసరికి బిఎస్‌ఇలో ఎస్‌బిఐ షేరు 0.17 శాతం స్వల్ప లాభంతో రూ.290.15 దగ్గర ముగిసింది. దీంతో ఎస్‌బిఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,35,307 కోట్లకు చేరింది. ఒన్‌జిసి మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో పోలిస్తే ఇది రూ.2,961.97 కోట్లు ఎక్కువ. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఎస్‌బిఐ షేర్లు 16 శాతం లాభపడితే, ఒన్‌జిసి షేర్లు నాలుగు శాతం నష్టపోయాయి. ఎస్‌బిఐతో పాటు ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్రా బ్యాంక్, పిఎన్‌బి, ఓరియంటల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు ఒకటి నుంచి నాలుగు శాతం లాభాలతో ముగిశాయి. భారత స్టాక్ మార్కెట్లు వరసగా నాలుగో రోజూ నష్టాలతో ముగిశాయి. లాభాలతోనే ప్రారంభమైనా మధ్యాహ్నాన్నానికి ఇండెక్స్‌లు అంతర్జాతీయ భయాలతో నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 94.56 పాయుంట్ల నష్టంతో 29319 దగ్గర, నిఫ్టీ 34.15 పాయింట్ల నష్టంతో 9105 దగ్గర క్లోజయ్యాయి. అమెరికా, ఆస్ట్రేలియా భారత ఐటి నిపుణులకు ఇచ్చే వీసాల ను కట్టుదిట్టం చేయడం, అమెరికా-ఉత్తర కొరియాల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించినా,ఆగస్టు నుంచి ఎల్‌నినో ప్రభావం ఉంటుందన్న అంచనాలు మార్కెట్‌ను వెంటాడాయి. జూన్ 8న మధ్యంతర ఎన్నికలకు వెళుతున్నట్టు బ్రిటిష్ ప్రధాని చేసిన ప్రకటన కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ట్రేడింగ్ చివర్లో రియల్టీ, మెటల్, ఎనర్జీ, టెలికాం, హెల్త్‌కేర్ కంపెనీలు నష్టాల బాట పట్టాయి. | business |
9,913 | 22-07-2017 18:50:05 | మహేష్..25 కోట్ల శాటిలైట్ రైట్స్..? | మహేష్ బాబు హీరోగా కొరటాలశివ దర్శకత్వంలో వస్తున్న కొత్తసినిమా 'భరత్ అనే నేను'. ఒకవైపు మహేష్ అభిమానులు సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఆతృతగా ఉండగా..మరోవైపు సినిమా మాకంటే మాకే కావాలంటూ శాటిలైట్ రైట్స్ కోసం టీవీ చానళ్ళు పోటీపడుతున్నాయి. ఇందుకోసం సినిమా నిర్మాత డి వీ వీ దానయ్యను సంప్రదించగా..ఆయన ఒక్కో భాషలో.. విడివిడిగా 25 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడని టాలీవుడ్ వర్గాలనుండి సమాచారం. అయితే సినిమా కోసం ఇంత చెల్లించేందుకు కూడా టీవీ చానెళ్లు సిద్దపడుతున్నాయని అంటున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ వ్యవహారం పూర్తయిపోతుందట. మునుపెన్నడూ ఏ సినిమాకు కూడా ఇంత భారీ మొత్తంలో శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోలేదు. ఒకవేళ 20 నుండి 25 కోట్ల డీల్ గనుక జరిగితే ఇప్పటివరకు ఇదే తెలుగు సినిమాల్లోకెల్లా అతిపెద్ద డీల్ కానుంది.ప్రస్తుతం మహేష్, బాలీవుడ్ భామ ఖైరాఅద్వానీ పై హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2018 జనవరి 11న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. | entertainment |
9,356 | 05-09-2017 20:04:52 | నగ్మా.. కమల్‌హాసన్ భేటీపై సర్వత్రా ఆసక్తి | సోమవారం (సెప్టెంబర్ 4) సాయంత్రం నగ్మా.. కమల్‌హాసన్ ఇంటికి వెళ్లి అతన్ని కలవడం ప్రస్తుతం హాట్‌టాపిక్ అయింది. తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారిన ఈ తరుణంలో సీనియర్ నటి, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ అయిన నగ్మా కమల్‌ని కలిసిందంటే.. ఇందులో ఖచ్చితంగా ఏదో దాగి ఉంటుందని తమిళ తంబీల్లో చర్చలు మొదలయ్యాయి. పైగా ఇటీవలే కమల్‌హాసన్ తన రాజకీయ ప్రవేశం గూర్చి చిన్న హింట్ ఇచ్చాడు. కనుకనే నగ్మా ఆయనను కలిసిఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు తమిళతంబీలు. ఇదిలాఉంటే మే నెలలో నగ్మా.. సూపర్ స్టార్ రజినీకాంత్‌ని కూడా భేటీ అయ్యింది. అయితే మేము ఎలాంటి రాజకీయ చర్చల కోసం భేటీ కాలేదు కేవలం నటులమనే ఫ్రెండ్లీ దృక్పధంతో రజినీని కలిశానని నగ్మా అప్పట్లో స్పష్టంచేసింది. కాగా అప్పుడు రజినీ.. ఇప్పుడు కమల్.. ఇలా వరుస భేటీలతో నగ్మా ఏదో ప్లాన్ చేస్తోందని సర్వత్రా ఆసక్తి మొదలైంది. | entertainment |
19,719 | 10-01-2017 01:51:31 | ట్వీట్లకు నోట్లొస్తున్నాయ్ | న్యూఢిల్లీ: కెరీర్ ఆసాంతం వీరబాదుడు ఆటతో ప్రేక్షకులను విశేషంగా అలరించిన భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక ట్విటర్‌లో అభిమానులతో తన అభిప్రాయాలను పంచుకుంటున్నాడు. తన మార్కు ట్వీట్లతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మంచి హాస్య ప్రియుడైన సెహ్వాగ్.. సహచర క్రికెటర్ల పుట్టిన రోజులు, వివిధ అంశాలపై సెటైర్లు, జోకులు సంధిస్తూ చేసే ట్వీట్లతో ట్విటర్ కింగ్‌గా మారిపోయాడు. దీంతో, ఏడాది కాలంలో అతని అభిమానులు, ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరిగింది. అయితే, టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన తన ట్వీట్లతో సెహ్వాగ్ డబ్బు కూడా సంపాదిస్తున్నాడట. గత ఆరు నెలల్లో తన ట్వీట్లతో దాదాపు రూ. 30 లక్షలు సంపాదించానని ఓ ఆంగ్ల పత్రికకు సెహ్వాగ్ స్వయంగా తెలిపాడు. తన ట్వీట్లు వైరల్‌గా మారడంతో ఆటోమేటిక్‌గా స్పాన్సర్లు తనను కలుస్తున్నారన్నాడు. ‘నేను ట్విటర్‌లోకి వచ్చి జోకులు షేర్ చేయగానే వాటికి భారీ స్పందన వస్తోంది. నా ఫాలోవర్ల సంఖ్య పెరుగుతోంది. నా పోస్టులు కొన్నింటికి వేలాది రీ ట్వీట్లు వస్తున్నాయి. ట్వీట్లకు ఎక్కువ షేర్స్ రావడంతో స్పాన్నర్ల నుంచి నగదూ వస్తోంద’ని చెప్పుకొచ్చాడు. భారత జట్టు ఆడే మ్యాచ్‌లకు హిందీ కామెంటరీ టీమ్‌లోనూ సెహ్వాగ్ భాగస్వామిగా ఉన్నాడు. వీరూ కామెంటరీని సహ వ్యాఖ్యాతలు ఎంతో మెచ్చుకుంటారు. | sports |
8,115 | 26-07-2017 16:13:17 | 2 ఫ్రెండ్స్ కామెడీ | ప్రేమకన్నా స్నేహం గొప్పది అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రం 2 ఫ్రెండ్స్ (ట్రూ లవ్). ముళ్లగూరు లక్ష్మీదేవి సమర్పణలో అనంతలక్ష్మి క్రియేషన్స్ బానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జీఎల్‌బీ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నారు. వరంగల్, బెంగళూరు, అనంతపురంలలో సినిమాకు సంబంధించిన మేజర్ షూటింగ్ పూర్తి చేశామని, ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ చేస్తున్నామని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఫిల్మ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ బిల్డింగులో కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, వై.విజయ, శ్రీలక్ష్మి, కన్నడ కమెడియన్ సాదు కోయిల్‌లపై కామెడీ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నామని చెప్పారు. కన్నడలో వెయ్యి సినిమాలకు పైగా నటించిన సాదు కోయిల్ తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటారని, నిర్మాత అందిస్తున్న సహకారంతో నాన్‌స్టాప్ షెడ్యూల్ చేస్తున్నామని వివరించారు. నేడు యువత ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోందని, కాలేజీ రోజుల్లోనే వారి భవిష్యత్ నిర్దేశకత్వం అవుతుందని నిర్మాత ముళ్లగూరు అనంతరాముడు చెప్పారు. ప్రేమకంటే స్నేహమే గొప్పదన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. తమ సంస్థలో ఇది తొలి చిత్రమని, వినోదంతో పాటు అంతర్లీనంగా యువతకు సందేశం ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రానికి కథ, మాటలు, సంగీతాన్ని పోలూర్ ఘటికా చలం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా టి.సురేందర్‌రెడ్డి పనిచేస్తున్నారు. ఫొటోల కోసం క్లిక్ చేయండి | entertainment |
19,772 | 27-12-2017 01:56:09 | సింధు, శ్రీకాంత్‌లకు ఘనసన్మానం |
న్యూఢిల్లీ, (ఆంధ్రజ్యోతి): బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌లను దేశ రాజధానిలోని ఉమ్మడి ఏపీ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఢిల్లీలోని తెలుగు సంఘాలు ఘనంగా సత్కరించాయి. సింధు, శ్రీకాంత్‌లకు ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ బొబ్బిలి వీణలను బహూకరించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారిద్దరు భవన్ ఆవరణలోని షటిల్ కోర్టులో స్కూల్ పిల్లలతో కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. ఈ సందర్భంగా పివీ సింధు మాట్లాడుతూ ఢిల్లీలో తెలుగువారి సన్మానం ఊహించలేదని, తనను సన్మానించినందుకు కృతజ్ఞతలు తెలిపింది. కాగా, ఢిల్లీలో సన్మానం అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఇది మరిచిపోలేని అనుభూతిని కలిగించిందని కిడాంబి శ్రీకాంత్ పేర్కొన్నాడు. ఈ ఏడాది ఎంతో గొప్పగా సాగిందని, వచ్చే ఏడాది సూపర్‌సిరీస్ టోర్నీలతోపాటు కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో పాల్గొనాల్సి ఉందని, వీటిలో టైటిల్స్ గెలిచి దేశ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేస్తానన్న ఆశాభావం వ్యక్తంచేశాడు. | sports |
794 | 04-10-2017 23:42:48 | మార్కెట్‌కు ‘ఆర్‌బిఐ’ బూస్ట్ | ముంబై: ఆర్‌బిఐ పరపతి, ద్రవ్య విధాన సమీక్ష స్టాక్ మార్కెట్‌కు బూస్ట్‌లా పని చేసింది. దీంతో వరుసగా నాలుగో రోజూ ఇండెక్స్‌లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 174.33 పాయింట్ల లాభంతో 31671 వద్ద, నిఫ్టీ 55.40 పాయింట్ల లాభంతో 9914 వద్ద క్లోజయ్యాయి. ఇప్పుడుకాకపోయినా, ఈ ఏడాది చివరికైనా ఆర్‌బిఐ రెపో రేటు తగ్గిస్తుందనే అంచనాలు, ఆగస్టులో కీలకమైనా ఎనిమిది రంగాల్లో ఐదు నెలల గరిష్ఠ వృద్ధి రేటు 4.5 శాతం నమోదైందన్న వార్తలు సెంటిమెంట్ పెంచాయి. హెల్త్‌కేర్, ఎఫ్‌ఎంసిజి, ఆయిల్ అండ్ గ్యాస్, పి ఎస్‌యు, రియల్టీ, బ్యాంకింగ్ షేర్లు మంచి లాభాలతో ముగిశాయి. అయితే భారతి ఎయిర్‌టెల్ వంటి టెలికాం షేర్లలో మాత్రం అమ్మకాల ఒత్తిడి కనిపించింది. హట్సన్ ఆగ్రో షేర్లకు గిరాకీఎస్‌బిఐ మ్యూచువల్ ఫండ్ 10.05 లక్షల షేర్లు కొనుగోలు చేసిందన్న వార్తలతో చెన్నైకు చెందిన హట్సన్ ఆగ్రో షేర్లకు భారీగా గిరాకీ ఏర్పడింది. దీంతో బిఎ్‌సఇలో ఈ కంపెనీ షేర్లు ఒక దశలో 18 శాతం వరకు పెరిగాయు. అయితే చివరికి 11.04 శాతం లాభంతో రూ.777.30 వద్ద క్లోజయ్యాయి. నేడు ప్రతాప్ స్నాక్స్ లిస్టింగ్‌ఇటీవల పబ్లిక్ ఇష్యూకు వచ్చిన ప్రతాప్ స్నాక్స్ గురువారం స్టాక్ మార్కెట్లో లిస్టవుతోంది. రూ.482 కోట్ల సమీకరణ కోసం సెప్టెంబర్ 22-26 మధ్య రూ.930-938 ప్రైస్ బ్యాండ్‌లో కంపెనీ జారీ చేసిన ఐపిఒ 47.39 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్ అయింది. దీంతో గురువారం ప్రతాప్ స్నాక్స్ కంపెనీ షేర్లు మంచి ప్రీమియంతోనే లిస్టవుతాయని భావిస్తున్నారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ ఐపిఒకు మంచి స్పందనబిడ్డింగ్ ప్రారంభమైన తొలి రోజే గోద్రెజ్ ఆగ్రోవెట్ పబ్లిక్ ఇష్యూ 52 శాతం సబ్‌స్ర్కైబ్ అయింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ 1,157 కోట్ల రూపాయలు సమీకరించాలనుకుంటోంది. బార్బిక్యూ నేషన్ ఐపిఒపై సెబి వేటుపబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.700 కోట్లు సమీకరించాలన్న బార్బిక్యూ నేషన్ ప్రయత్నాలపై క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి నీళ్లు జల్లింది. ఈ సంవత్సరం ఆగస్టులో కంపెనీ ఫైల్ చేసిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ పరిశీలనను పక్కనబెట్టింది. గతంలో జరిగిన కొన్ని ఉల్లంఘనల దృష్ట్యా సెబి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఉల్లంఘన బార్బిక్యూ నేషన్ విషయంలో జరిగిందా? లేక అనుబంధ కంపెనీల విషయంలోనా? అనే విషయం సెబి వెల్లడించలేదు. | business |
16,841 | 01-03-2017 01:49:29 | యవ్వనంగా ఫీలవ్వండి.. యవ్వనంగా కనిపించండి | ‘‘నేనెప్పుడూ నా వయసుకన్నా ఓ పదేళ్లు తక్కువగానే ఉన్నట్లు భావిస్తుంటాను. నేను యవ్వనంగా కనిపించడం వెనుక రహస్యం ఇదే. ఈ విధానాన్ని మీరూ అలవర్చుకోండి.. ముసలివాళ్లమని ఎప్పుడూ భావించకండి. మనిషి జీవితంలో వృద్ధాప్య దశ తప్పదు. కానీ మనం ఎప్పుడూ యవ్వనంలోనే ఉన్నట్లుగా ఫీలవ్వాలి. రాజకీయాల్లో సాధారణంగా వయసుపైపడిన వారే ఉంటారు. ఈ విధానాన్ని యువత మార్చాలి. వారు రాజకీయాల్లోకి ప్రవేశించాలి’’ - హేమ మాలిని, బాలీవుడ్ నటి, ఎంపీ | nation |
2,322 | 29-09-2017 00:31:20 | జిఎస్‌టితో జీవన్మరణం.. రక్షించండి | జైట్లీకి ఎగుమతి సంఘాల వేడుకోలున్యూఢిల్లీ: జిఎస్‌టి పోటుతో చావు బతుకుల్లో ఉన్న తమను ఆదుకోవాలని వాణిజ్య వస్తువుల ఎగుమతిదారులు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. జిఎస్‌టి నెట్‌వర్క్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలతో తమకు రావలసిన పన్ను చెల్లింపుల రిఫండ్‌లలో అసాధారణ జాప్యం జరుగుతోందన్నారు. దీంతో నగదుకు తీవ్ర కొరత ఏర్పడి పన్నులు చెల్లించేందుకు అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోందని జైట్లీకి ఫిర్యాదు చేశారు. రిఫండ్‌ల విధానాన్ని త్వరితం చేయడంతో పాటు, గతంలోలా ఎగుమతి వస్తువులను పూర్తి గా పన్ను పోటు నుంచి మినహాయించాలని కోరారు. రిఫండ్‌ల జాప్యంతో చిన్న ఎగుమతిదారుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. నిధుల కొరతతో వారు కొత్త ఎగుమతి ఆర్డర్లు కూడా తీసుకునే స్థితిలో లేరని భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఫియో) జైట్లీకి తెలిపింది. దీంతో వచ్చే త్రైమాసికంలో ఎగుమతుల వృద్ధి రేటు మరింత మందగించే ప్రమాదం ఉందని తెలిపింది. ముఖ్యంగా టైల్స్, హస్తకళా వస్తువులు, వస్త్రాలు, వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు బాగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఎగుమతి వస్తువుల ఉత్పత్తి కోసం దిగుమతి చేసుకునే ముడి పదార్ధాలపై ఐజిఎ్‌సటి పూర్తిగా ఎత్తివేయాలని కూడా ఎగుమతి సంఘాలు కోరాయి. జిఎస్‌టి వసూళ్లపై ఆందోళన నిరాధారంజిఎస్‌టి ఆదాయాలపై ఇన్వెస్టర్లలో కొంత అసహనం ఏర్పడిందన్న అంశాన్ని ప్రస్తుతం మార్కెట్లలో ఏర్పడిన పతనం సూచిస్తున్నదని, కాని అలాంటి ఆందోళనలు నిరాధారమని బ్రోకరేజి సం స్థ యుబిఎస్ పేర్కొంది. పూర్తి సంవత్సరం ఆదాయాలు ప్రభుత్వ బడ్జెట్ అంచనాలకు దీటుగానే ఉండవచ్చునని తాజా నివేదికలో తెలిపింది. 2017- 18 ఆర్థిక సంవత్సరం నెలవారీ జిఎస్‌టి ఆదాయం నెలకి ఎనిమిది శాతం పెరుగుతుందని భావించినా ప్రస్తుత వసూళ్లు సరైన దిశలోనే ఉన్నట్టు భావించవచ్చునని పేర్కొంది. వాస్తవానికి వృద్ధి, ఆదాయాల్లో రికవరీ విషయంలో గత మూడేళ్లుగా చాలా మంది ఇన్వెస్టర్ల కన్నా అప్రమత్తంగా వ్యవహరించామని తెలిపింది. జిఎస్‌టి ఆదాయాలు ఆశించిన స్థాయికన్నా తక్కువగానే ఉంటాయన్న ఆందోళనలకు ప్రభుత్వం వివరణ ఇస్తూ.. ఎగుమతిదారులు తమ ఎగుమతుల విలువలో 66 శాతం డ్యూటీ డ్రాబ్యాక్ కింద నిర్వహిస్తారని, వారి వర్కింగ్ క్యాపిటల్ ఎక్కడా బ్లాక్ కాలేదనేందుకు ఇది సంకేతమని తెలిపింది. రిఫం డ్, క్రెడిట్ క్లెయిమ్‌లన్నింటినీ తగ్గించినా కూడా పూర్తి ఏడాదికి ఆదాయాలు బడ్జెట్ అంచనాలకు దీటుగానే ఉంటాయని యుబిఎస్ చెబుతోంది. | business |
1,845 | 16-08-2017 01:51:24 | పిఎస్‌యు బ్యాంకులకు రూ.92 వేల కోట్ల టోపీ | ఎగ్గొట్టిన విల్‌ఫుల్ డిఫాల్టర్లున్యూఢిల్లీ : గడచిన ఆర్థిక సంవత్సరం (2016- 17) ముగిసే నాటికి విల్‌ఫుల్ డిఫాల్టర్ల (ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగ్గొట్టిన వారు) రుణాలు 20 శాతం మేర పెరిగాయని ప్రభుత్వ రంగ బ్యాంకులు వెల్లడించాయి. మార్చి చివరి నాటికి ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టినవారు సుమారు 9,000 మంది ఉండగా వారు ఎగ్గొట్టిన మొత్తం 92 వేల కోట్ల రూపాయలకు పైగానే ఉందని తెలిపాయి. 2016 మార్చి నాటికి కావాలని ఎగ్గొట్టిన రుణాలు 76,685 కోట్ల రూపాయలుగా ఉండగా 2017 మార్చి నాటికి అవి 20.4 శాతం పెరిగి 92,376 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. వార్షిక ప్రాతిపదికన చేస్తే విల్‌ఫుల్ డిఫాలర్ల సంఖ్య 10 శాతం పెరిగింది. 2016 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 8,167 మంది విల్‌ఫుల్ డిఫాల్టర్లు ఉండగా 2017 మార్చి చివరి నాటికి ఈ సంఖ్య 8,915కు చేరుకుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 8,915 విల్‌ఫుల్ డిఫాల్ట్ కేసుల్లో 1,914 మందిపై బ్యాంకులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశాయి. వీరు తీసుకున్న రుణాల మొత్తం 32,484 కోట్ల రూపాయలుగా ఉంది. 2016-17 కాలంలో దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ, దాని అనుబంధ బ్యాంకులు మొత్తం 81,683 కోట్ల రూపాయలను రైటాఫ్ చేయటం గమనార్హం. గడచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఇదే గరిష్ఠ మొత్తం కావటం విశేషం. 2017 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి పద్దులు 5.02 లక్షల కోట్ల రూపాయల నుంచి ఏకంగా 6.41 లక్షల కోట్ల రూపాయలకు దూసుకుపోయాయి. అయితే పరిస్థితి చేయిదాటిపోతుండటంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) కఠిన నిబంధనలు రూపొందించి పక్కాగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటోంది. | business |
21,129 | 27-11-2017 03:54:42 | విజేతలు లక్ష్యసేన్, తనిష్క | హైదరాబాద్(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): గోపీచంద్ అకాడమీలో ఆదివారం జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ సిరీ్‌స పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్యసేన్ 21-15, 17-21, 21-17తో ఈహాన్ చాంగ్‌పై గెలుపొందగా, మహిళల సింగిల్స్‌లో తనిష్క 17-21, 22-20, 21-18తో శిఖా గౌతమ్‌పై గెలుపొందారు. పురుషుల డబుల్స్‌లో అరుణ్ జార్జి-సన్యం శుక్లా జోడీ 21-19, 21-15తో ఫ్రాన్సిస్ ఆల్విన్-కె.నందగోపాల్ ద్వయంపై గెలుపొందగా, మహిళల డబుల్స్‌లో సరిదేవి చిత్ర-యుజియా జిన్ 20-22, 17-21, 21-17తో జీ లిన్ లిమ్-జెన్ యాప్‌లపై విజయం సాధించారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో టాన్ జీ చెన్-లియు హింగ్ హో 21-19, 21-13తో రోహన్ కపూర్-కుహూ గర్గ్‌లపై గెలుపొందారు. | sports |
21,326 | 28-08-2017 05:36:21 | శభాష్..సింధు | (ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)పూసర్ల వెంకట సింధు.. 22 ఏళ్ల ఈ తెలుగుతేజం ప్రపంచ బ్యాడ్మింటన్ ఇప్పటికే ఓ సంచలనం.. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు దూసుకురావడం ద్వారా మరోసారి విశ్వవేదికపై మెరిసింది. ఫైనల్లో ఆమె విజయం సాధించకపోయి ఉండొచ్చు కానీ తుదిపోరు లో ఆమె చూపిన పోరాటం అనన్య సామాన్యం. ఇప్పటివరకూ భారత క్రికెట్ జట్టు ఆడే ఫైనల్ మ్యాచ్‌లకే అభిమానులు టీవీలకు అతుక్కుపోయే దృశ్యాలు కనిపించేవి. కానీ ఇప్పుడు బ్యాడ్మింటన్ పోటీలను అంతకంటే ఉత్కంఠగా అభిమానులు తిలకిస్తున్నారంటే అందుకు కారణం సిఽంధు అనడంలో అతిశయోక్తి లేదు. మన క్రీడాభిమానుల దృక్పఽథాన్ని అలా మార్చేసింది ఆమె. ఇంత కీర్తి ప్రతిష్ఠలు సింధుకు దక్కడం వెనుక 14 ఏళ్ల కఠోర శ్రమ ఉంది. ఎనిమిదేళ్ల ప్రాయంలో బ్యాడ్మింటన్‌వైపు పడిన ఆమె అడుగులు నిరంతర సాధనతో, అసమాన పట్టుదలతో, అలుపెరగని శ్రమతో ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో నేటి రజతం సహా రెండు కాంస్యాలు, ఒలింపిక్స్‌లో మరో రజతంతో ఖ్యాతినార్జించే స్థాయికి దారి తీశాయి. ఆల్‌ఇంగ్లండ్ చాంపియన్ పుల్లెల గోపీచంద్ స్ఫూర్తిగా బ్యాడ్మింటన్‌ను ఎంచుకున్నానని చెప్పే సింధు..అదే గోపీచంద్ గురువుగా ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఒక్కో శిఖరాన్ని అధిరోహిస్తుండడం విశేషం. 17 ఏళ్ల వయస్సులో 2012లో డబ్ల్యూబీఎఫ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లో ప్రవేశించడంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది సింధు. అనంతరం వరల్డ్ బ్యాడ్మింటన్‌పై ఆమె వేస్తూ వస్తున్న ముద్ర చెరగలేనిది. డబ్ల్యూబీఎఫ్ ర్యాంకింగ్స్ లో గత ఏప్రిల్‌లో అత్యుత్తమంగా రెండో స్థానానికి చేరిన సింధు ప్రస్తుతం సాధిస్తున్న విజయాలు చూస్తే టాప్‌నకు చేరుకొనే రోజులు ఎంతో దూరంలో లేవు కూడా. ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో నాలుగో ర్యాంక్‌తో బరిలోదిగిన ఆమెపై యావత్ భారత్ అభిమానులు పెట్టుకున్న ఆశలు అన్నీఇన్నీకావు. ఈ ఏడాది ఆమె గెలిచిన టైటిళ్లు, కరోలినా మారిన్, సన్ యూలాంటి హేమాహేమీ క్రీడాకారిణులను ఓడించిన తీరుచూస్తే గ్లాస్గోలో ఆమె మరో చరిత్ర సృష్టించడం ఖాయం అనిపించింది. ఫైనల్ వరకూ ఆమె ఆటతీరు గమనిస్తే భారత్ బ్యాడ్మింటన్‌లో మరో సువర్ణాధ్యా యం లిఖించడం ఇక లాంఛనమే అన్న అంచనాలకు వచ్చేశాం. కానీ ఫైనల్లో జపాన్ అమ్మాయి నొజోమి ఒకుహారా..సింధుతో తీసిపోని విధంగా ఆడింది. అయినా సింధు ఏదశలోనూ వెనక్కు తగ్గలేదు. శాయశక్తులా పోరాడింది. త్రుటిలో విజయం చేజారింది. కానీ అభిమానుల మది గెలుచుకుంది. ఈ పరాజయానికి చిం తించాల్సిన పనిలేదు. ఈ ఓటమి వచ్చే ప్రపంచ చాంపియన్‌షిప్స్ టైటిల్ విజయానికి నాంది. ఈ చాంపియన్‌షిప్స్‌లో అద్భుతంగా రాణించిన సింధు, సైనా, శ్రీకాంత్, సాయిప్రణీత్ సహా భారత ఆటగాళ్లం తా భవిష్యత్‌లో భారత బ్యాడ్మిం టన్‌ను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చడం ఖాయం. | sports |
20,634 | 08-06-2017 20:22:03 | విరాట్ కొహ్లీని మాకిచ్చేయండి - పాకిస్థాన్ | ఎలాంటి ముందస్తు పొలిటికల్ పర్మిషన్ లేకుండా సర్జికల్ స్ట్రయిక్స్‌తో మన దాయాది దేశం పాకిస్థాన్‌ను చిత్తుగా...చెడామడా వాయించేందుకు మనకున్న ఒకే ఒక గొప్ప అవకాశం క్రికెట్. అందుకే భారతీయులందరూ పాక్‌తో మ్యాచ్ వుందంటే చాలు...అన్ని పనులు పక్కనబెట్టి ఒకే ఒక్క పనిని పెట్టుకుంటారు ... అదే పాకిస్థాన్‌ను ఓడించడం. గ్రౌండ్‌లో ఆడుతోంది పదకొండు మందితో కూడిన భారత్ ఆటగాళ్ల టీం అనుకోవడం కేవలం భ్రమ మాత్రమే. ఆ మ్యాచ్‌ను తిలకించే ప్రతి ఒక్క భారతీయుడు క్రికెట్ కిట్ ధరించి తన ఆత్మను గ్రౌండ్‌లో దింపుతాడు. వాళ్లని చావు దెబ్బతీయడానికి సిద్ధంగా వుంటాడు. మనమే కాదు యావత్ ప్రపంచం కూడా ఇలాంటి టెన్షన్‌తో కూడిన క్రికెట్‌ను కేవలం భారత్ - పాక్‌ల మధ్య మాత్రమే తిలకించగలదన్నది ఎవరైనా తమ పక్కన కుండ వుంటే బద్ధలు కొట్టి మరీ చెప్పొచ్చు. ఇక అసలు విషయానికి వస్తే...మొన్న జరిగిన ఐసీసీ వన్ డే మ్యాచ్ పోరులో...మన చేతిలో చిత్తుగా చతికిలపడ్డ దాయాది పాకిస్థాన్ ఆటగాళ్లను అక్కడి మీడియా ఏకి పారేస్తోంది. భారత్ చేతిలో ఓటమిని భరించలేని ఈ కౌరవులు కృష్ణుడు లాంటి మన విరాట్ ఒక్కడిని వారికిచ్చేయాలని, బదులుగా వాళ్ల కౌరవ సైన్యాన్ని...అదేనండి క్రికెట్ టీంని తోలుకు పొమ్మంటూ ట్విట్టర్ ద్వారా తమ అక్రోశాన్ని వెళ్లగక్కింది. ఆ తర్వాతి మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికాని ఓడించినప్పటికీ పాపం పాక్ క్రికెటర్లకు వారి దేశ పౌరులనుంచి మాత్రం ఎలాంటి పొగడ్తలు రాలేదు. ఆ తర్వాత సదరుట్వీట్‌ను అక్కడి ఒకానొక జర్నలిస్ట్ తొలగించారనుకోండి. కానీ ఎంతైనా పాక్...చింత చచ్చినా పులుపు చావని దేశం కదా. | sports |
1,152 | 31-10-2017 00:14:17 | ఆర్ కామ్‌లో రుణదాతలకు మెజారిటీ వాటా | న్యూఢిల్లీ: అనిల్ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్ కామ్)పై ప్రమోటర్ల పట్టు తప్పుతోంది. వ్యూహాత్మక రుణ పునర్ వ్యవస్థీకరణ(ఎస్‌డిఆర్)లో భాగంగా కంపెనీ ఈక్విటీలో 51 శాతాన్ని రుణదాతలు తీసుకుంటున్నారు. ఇందుకోసం కంపెనీలు రుణాలు ఇచ్చిన దేశ, విదేశీ రుణదాతలు తమ రుణాల్లో రూ.7,000 కోట్లను ఈక్విటీగా మార్చుకోబోతున్నారు. దాదాపు రూ.45,000 కోట్ల రుణ భారం ఉన్న ఈ కంపెనీ నష్టాలు తట్టుకోలేకి వచ్చే నెలాఖరుకు 2జి, 3జి టెలికాం సేవలు నిలిపివేయనుంది. మిగతా రుణా న్ని టెలికాం టవర్లు, రియల్ ఎస్టేట్ ఆస్తులు అమ్మి చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. | business |
16,531 | 18-10-2017 19:31:31 | మంచి పనిని విమర్శించే వాళ్లు ఎప్పుడూ ఉంటారు: యోగి | న్యూఢిల్లీ: అయోధ్యను రామరాజ్యం చేయాలన్నదే తమ సంకల్పమని, ప్రపంచానికి దీపావళిన అందించిన ఘనత అయోధ్యకు దక్కుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అయోధ్యలో దీపావళి వేడుకలను బుధవారంనాడు ఆయన ప్రారంభించారు. యోగితో పాటు గవర్నర్ రామ్‌నాయక్ దీపాలు వెలిగించి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, మంచి పని చేసిన ప్రతిసారి విమర్శించే వాళ్లు ఈ దేశంలో ఎప్పుడూ ఉంటారని, అయోధ్యకు నేను వచ్చినా, రాకపోయినా వారు ప్రశిస్తూనే ఉంటారని తన విమర్శకులకు చురకలు వేశారు. వస్తే ఎందుకు వచ్చావని, రాకుండే భయపడే అయోధ్యకు రాలేదని వారు విమర్శించడం పరిపాటేనని అన్నారు. ఈ సందర్భంగా అయోధ్యలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద లబ్దిదారులకు ఇళ్ల కేటాయింపు లెటర్లను ముఖ్యమంత్రి, గవర్నర్ కలిసి అందజేశారు. అంతకుముందు యోగి రాక సందర్బంగా అయోధ్యలో ఆయన ఘనంగా, సంప్రదాయబద్ధంగా ఆహ్వానం లభించింది. రాముడు, సీత, లక్ష్మణ వేషధారులు హెలికాప్టర్‌లో రాగా, పుష్కవర్షం కురిపిస్తూ మరో హెలికాప్టర్ ఆ వెనువెంటే వచ్చింది. సీతారామలక్ష్మణ వేషధారులకు ముఖ్యమంత్రి పూలదండలు వేసి హారతులు పట్టారు. గవర్నర్‌తో పాటు యోగి మంత్రివర్గ సహచరులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం యోగి, తదితరులు సరయూ నది ఒడ్డున దీపాలు వెలిగించడంతో ఇందులో పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు. 2 లక్షల దీపాలు వెలిగించడమే లక్ష్యంగా వేలాది మంది విద్యార్థులు ఈ దీపోత్సవ్‌లో పాల్గొన్నారు. సరయూ నదికి 'మహాఆరతి' ఇవ్వడం ద్వారా ఉత్సవ శోభ పతాక స్థాయికి చేరుతుంది. గిన్నెస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా అయోధ్యలో ఈ దీపావళి ఉత్సవాలను యోగి సర్కార్ చేపట్టింది. | nation |
19,587 | 06-12-2017 01:56:44 | ఫుట్‌బాలర్లకూ కాలుష్యం సెగ |
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం సెగ క్రికెటర్లకే కాదు ఫుట్‌బాలర్లనూ తాకింది. ఇండి యన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో పోటీపడుతున్న ఫుట్‌బాలర్లు మంగళవారం ముఖానికి మాస్క్‌లు ధరించి ప్రాక్టీస్ చేశారు. ఐఎస్‌ఎల్‌లో భాగంగా ఇక్కడి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం ఢిల్లీ డైనమోస్, జెంషెడ్‌పూర్ ఎఫ్‌సీ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం ఇరుజట్లలోని కొందరు ఆటగాళ్లు మంగళవారం స్టేడియంలో ప్రాక్టీస్ కోసం వచ్చారు. కాలుష్యం కారణంగా ఫుట్‌బాలర్లు మాస్క్‌లు ధరించి ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. కాగా, ప్రాక్టీస్‌లో మా ఆటగాళ్లు మాస్క్‌లు ధరించినా, బుధవారం జరిగే మ్యాచ్‌లో మాత్రం అవి లేకుండానే బరిలోకి దిగుతారని ఢిల్లీ డైనమోస్ కోచ్ మిగుల్ ఏంజెల్ తెలిపాడు. | sports |
141 | 13-10-2017 01:35:49 | ఆస్ర్టో వ్యూ : ముగింపు సెషన్ బుల్లిష్ | తిథి: ఆశ్వయుజ బహుళ నవమి నక్షత్రం: పుష్యమిభరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు, సింహ, ధనుస్సు రాశులవారు అప్రమత్తంగా ఉండాలి. నిఫ్టీ: 10096.40 (+111.60) టెండ్ మార్పు వేళలు: 9.30, 1.13, 1.29 ధోరణి: గ్రహగతులను బట్టి నిస్తేజంగా ప్రారంభమై 2.15 వరకు అదే ధోరణిలో ఉంటూ తదుపరి ముగింపు వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.ట్రేడింగ్ వ్యూహం: నిఫ్టీ ఫ్యూచర్స్ 9.30 సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి) కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్‌లా్‌సతో షార్ట్ పొజిషన్లు తీసుకుని 2 గంటల సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 2.30 తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.ఇంట్రాడే ట్రేడింగ్‌కు ప్రారంభ స్థాయి కీలకం. అంతకన్నా దిగువన మాత్రమే షార్ట్ పొజిషన్లు శ్రేయస్కరం. నిరోధ స్థాయిలు: 10135, 10170మద్దతు స్థాయిలు: 10055, 10020గమనిక: ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నికల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచన. మార్కెట్ వాస్తవిక కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. - డా.భువనగిరి అమరనాథశాస్ర్తిwww.thefinanciala strologer.blogspot.in | business |
3,500 | 12-09-2017 02:45:44 | సత్తెనపల్లి విజయవ్యూహం... నియోజకవర్గం అభివృద్ధికి నిర్వచనం | సత్తెనపల్లి నియోజకవర్గం మరుగుదొడ్లు, శ్మశానాలు, మురికి తొలగింపులపై ప్రత్యేక దృష్టి సారించింది. మిగతా అభివృద్ధి పనులను కొనసాగిస్తూనే ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణం, శ్మశానాల ఆధునికీకరణ, ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవటం అనే మూడింటిని ఉద్యమ స్థాయిలో చేపట్టింది. ప్రజలు సహకరించటం అంటే అన్ని వర్గాల ప్రజలు సహకరించటమే. ఇంతమందికి ఇలా ఎన్నో విధాల మేలు జరిగింది కనుకనే సత్తెనపల్లి నియోజకవర్గం ప్రత్యేకత సాధించింది. సత్తెనపల్లి విజయ సూత్రం, మంత్రం కులమతాలకూ, రాజకీయాలకూ అతీతంగా అన్ని గ్రామాలకూ, అన్ని ఇళ్లకూ పథకాలను అమలుజరిపి అభివృద్ధి ఫలాలను అందించటమే. ఈ ఘనత- నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు చెందుతుంది. దేశం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రణాళికా రచన, దానిని అమలు జరిపే కృషి జరుగుతుంది, రాష్ట్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి బాధ్యత వహిస్తుంది. జిల్లా పరిషత్తులు ప్రభుత్వం సమకూర్చే నిధులతో స్థానిక అభివృద్ధి కోసం పథకాలు అమలుచేస్తాయి. అట్టడుగున పంచాయతీ వరకు ఇదే విధానం కొనసాగుతుంది. జాతీయ స్థాయి నుంచి దిగువన పంచాయతీ వరకు ప్రజలు ఎన్నుకొన్న ప్రతి నిధులు అధికార పీఠాలలో ఉండి పరిపాలనా యంత్రాంగం పనిని పర్యవేక్షిస్తారు. తమకు కావలసిన, ప్రజోపయోగకరమైన పనులను అధికారులకు చెప్పి చేయించుకొంటారు. లోక్‌సభకు, శాసనసభలకు ఎన్నికయ్యే ప్రతినిధులు తమకు ప్రభుత్వం ఇచ్చే ‘నియోజకవర్గం నిధుల’ను వెచ్చించి అభివృద్ధి కృషిలో భాగస్వాములవుతారు. ఎన్నికైన ప్రతి ప్రజాప్రతినిధీ ఏవో కొన్ని మంచి పనులు చేయకపోతే తిరిగి ప్రజల ముందుకుపోయి ఓట్లు అడగలేరు. అందువల్ల ప్రజా ప్రతినిధులు ప్రజలు కోరే అభివృద్ధి పనుల అమలు కోసం అవసరమైతే మంత్రుల సహాయం కూడా పొందుతారు. కొన్ని పనులు అవుతాయి. గ్రామాలకు మంచినీటి సదుపాయం, పాఠశాలలకు భవనాల నిర్మాణం, ప్రజలకు వైద్యవసతి, రోడ్లు వేయించటం మొదలైనవి ప్రజలు హర్షించే ఇలాంటి మంచిపనులు. ఇవన్నీ భారీ స్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుజరిపే పథకాలకు అదనం. భారీ పథకాల వల్ల మొత్తం దేశానికీ, రాష్ర్టాలకూ, ప్రతి ఊరికీ, ప్రతి సామాజిక వర్గానికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎంతో కొంత మేలు జరుగుతుంటుంది. కాని, ఈ మేలు ఎక్కడో దూరం నుంచి పొందిన అనుభూతి ప్రజలకు కలుగుతుంది. ప్రత్యక్షంగా లబ్ధి పొందినప్పుడు కలిగే సంతృప్తి ఇందులో ఉండదు. తమ ఎమ్మెల్యే గారు స్వయంగా ప్రయత్నించి తమ ఊరికి ఒక చిన్న పశువుల ఆస్పత్రిని తెప్పించినప్పుడు కలిగే ఆనందం నియోజకవర్గంలో ఒక భారీ పరిశ్రమ స్థాపించినప్పుడు కలగదు. ప్రజాప్రతినిధులు ఇది తెలిసే తమ నియోజకవర్గాల్లో ఇదంతా తమ కోసమే అని ప్రజలకు అనిపించే పనుల కోసం ప్రయత్నిస్తారు. కొంతవరకు కృతకృత్యులౌతారు. కాని, సాధారణంగా వారు చేసే కృషి ఫలితాలన్నీ ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ నేరుగా అందవు. అసలు, ప్రతి ఎంపీ, ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ లాభించే పనులు చేయించటం సాధ్యం కాదేమో, అందులోనూ రోజులు, నెలల్లో విస్తృతంగా పనులు జరిపించటం సాధ్యం కాదేమో అని గతానుభవాలను బట్టి అనిపిస్తుంది. అలా కాదు, ‘సాధ్యమవుతుంది’ అని గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి శాసనసభ (ఏపీ) నియోజకవర్గం నిరూపించింది. ఇదొక అపూర్వ ప్రయోగం. ఇలా మరెక్కడా జరగలేదు కనుకనే యూనిసెఫ్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రయోగాన్ని అధ్యయనం చేయటానికి ప్రతినిధులను ప్రచారం లేకుండా పంపించాయి. విదేశీ దౌత్యాధికారులు సైతం ఆసక్తి చూపారు. గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ జాతీయ స్థాయిలో ఒక రికార్డుగా నమోదు చేసింది.ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ అభివృద్ధిని చేసి చూపించటం ఎలా సాధ్యమైందనేది తెలుసుకోవలసిన వ్యూహం. అభివృద్ధి గురించి మాట్లాడుకొనేటప్పుడు సాధారణంగా మరుగుదొడ్లను గురించి ప్రస్తావనలు రావు. అల్పమైన, అసహ్యకరమైన విషయంగా చాలామంది మనస్సులలో ఒక ముద్ర ఏర్పడి ఉంటుంది. కాని, అది ప్రతి ఒక్కరికి అవసరమైన సౌకర్యం. పట్టణాలలో గృహనిర్మాణం జరిగేటప్పుడే మరుగుదొడ్ల ఆలోచనలు చేసి, తగిన విధంగా సౌకర్యాలు కల్పించుకొంటారు. కాని, గ్రామాలలో ఎప్పటినుంచో ఉన్న పాత ఇళ్లలో, పూరిపాకలలో మరుగుదొడ్ల సౌకర్యం ఉండదు. కాని పల్లెలలోనూ ఇప్పుడిప్పుడే ఒకింత మార్పు వస్తున్నది. కొత్త ఇళ్లల్లో మరుగుదొడ్లను ఏర్పాటు చేసుకొంటున్నారు. కానీ, ఈ మార్పు చాలదు. చాలా ఇళ్లకు, ముఖ్యంగా పేదల పూరిండ్లకు నేటికీ అది అందుబాటులో లేని సౌకర్యమే. కాలకృత్యాల కోసం గ్రామాల్లో చెరువుకట్టకో, రహదార్ల పక్కకో, మరో బాహ్య ప్రదేశానికో పోవటం సర్వసాధారణం. ముఖ్యంగా ఆడవాళ్లు ఎన్నో అవస్థలు పడుతుంటారు. ఇది స్ర్తీల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య అని పంచాయతీ పెద్దలకూ శాసనకర్తలకూ తెలుసు. ఐనా, అలవాటుపడిపోయిన సమస్యలెమ్మని పట్టించుకోరు. పట్టణాలలోనూ, కొన్ని గ్రామాలలోనూ ఒకటో రెండో ‘సులభ్ శౌచాలయాలు’ (పబ్లిక్ లెట్రిన్స్) కొత్తగా ఏర్పడ్డాయి. కాని, నిర్వహణ లోపం వల్లనేమి అలవాటులేని ప్రజల వైముఖ్యం వల్లనేమి ఎక్కువ భాగం నిరుపయోగంగా ఉంటున్నాయి. మరుగుదొడ్ల ఏర్పాటు మొదటి అంశం.అసహ్యకరం అనుకొని మరుగుదొడ్లను గురించి మాట్లాడుకోకపోవటం వలెనే, భయంవల్ల కొందరూ, అశుభం అనుకోవటం వల్ల మరికొందరూ శ్మశానాలను గురించి మాట్లాడరు. ప్రతి ఒక్కరు తుదకు చేరవలసిన చోటు అదేనని అందరికీ తెలుసు. ఐనా, శ్మశానాలను బాగుచేసుకొందామనే ఆలోచనలు రావు, వచ్చినా ఎవరికి వారు మనకెందుకు లెమ్మనుకొంటారు. సమష్టి ప్రయత్నాలు చేయరు. ఇది రెండవది. మరొకటి, పల్లెసీమలో పారిశుద్ధ్యలోపం. మురికి వాతావరణం వల్ల జబ్బులు వస్తుండటం అందరికీ తెలిసిన సంగతే. ఎవరి ఇంటిని వారు శుభ్రంగా ఉంచుకుంటారేమోగాని వీధులు, పరిసరాలను గురించి పట్టించుకోరు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గం మరుగుదొడ్లు, శ్మశానాలు, మురికి తొలగింపులపై ప్రత్యేక దృష్టి సారించింది. మిగతా అభివృద్ధి పనులను కొనసాగిస్తూనే ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణం, శ్మశానాల ఆధునికీకరణ, ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవటం అనే మూడింటిని ఉద్యమ స్థాయిలో చేపట్టింది. ఉద్యమ రూపకర్త స్థానిక శాసనసభ్యుడైన స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఈ కార్యక్రమాలను ప్రారంభించే ముందు పెద్ద బహిరంగ సభ జరిపి ప్రజలను చైతన్యపరచటం వల్లా, మారని వారెవరైనా ఉంటే స్థానిక నాయకులు వచ్చి చెప్పటం వల్లా, నియోజకవర్గంలో గుణాత్మకమైన మార్పు వచ్చి, నవ్య వాతావరణం నెలకొన్నది. కేవలం మూడున్నర నెలల వ్యవధిలో సత్తెనపల్లి, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో సుమారు ఇరవై కోట్ల రూపాయల ఖర్చుతో దాదాపు ఇరవై ఒక్క వేల మరుగుదొడ్లను నిర్మించారు. ఈ నాలుగు మండలాలూ, ఇంకా నరసరావుపేట, రొంపిచర్ల మండలాలలోనూ 398 శ్మశానాలను ఆధునికీకరించారు. శ్మశానాల రూపురేఖలు మారిపోయాయి. హిందూ శ్మశానాలకు స్వర్గపురాలని పేరుపెట్టారు. అంత్యక్రియలు జరపటానికైనా, తరువాత జరిగే కర్మకాండ కోసమైనా ఉపయోగపడే విధంగా సౌకర్యాలు ఏర్పడ్డాయి. యజ్ఞశాలను పోలిన దహనవాటికలు నిర్మించారు. స్నానాల కోసం నీటి వసతి కల్పించారు, దుస్తులు మార్చుకోవటానికి గది కట్టించారు. ఉద్యానమనిపించే విధంగా చెట్లు, మొక్కలు పెంచారు. శ్మశానం చుట్టూ గోడ, పవిత్రప్రదేశమని స్ఫురింపజేసే ప్రవేశద్వారం నిర్మించారు. ఇవిగాక శ్మశానానికి వెళ్లే దోవను చక్కని రోడ్డుగా మార్చారు. అంత్యక్రియలు చూడవచ్చే బంధుజనం కోసం బెంచీలు ఏర్పాటు చేసారు. ఏ మతంవారి శ్మశానాలు వారికి ఉన్నాయి కనుక అన్నింటినీ వారివారి విశ్వాసాలకు తగిన రీతిలో ఆధునికీకరించారు. నియోజకవర్గం అంతటా పారిశుద్ధ్య కార్యక్రమం అమలు జరిగింది. స్వచ్ఛమేవ జయతే అంటూ ప్రజలు స్వచ్ఛందంగా అభివృద్ధి కృషిలో పాల్గొన్నారు. స్వచ్ఛ సత్తెనపల్లి రూపొందింది. ఒక విశేషం ఏమిటంటే– ప్రధాన మంత్రి మోదీ జాతీయ స్థాయిలో ప్రకటించిన స్వచ్ఛభారత్ ఉద్యమానికి చాలా ముందే సత్తెనపల్లి నియోజకవర్గంలో స్వచ్ఛసాధన కార్యక్రమం మొదలై దేశానికి మార్గదర్శకమైంది. ప్రధానమంత్రి కార్యాలయం ప్రతినిధి ఒకరు నియోజకవర్గాన్ని చూసి వెళ్లారు. మంచి ఎక్కడున్నా ఎవరు చేసినా చూసి హర్షించవలసిందే, అనుసరించవలసిందే. రక్షిత మంచినీటి సదుపాయం, గ్రామాల్లో సిమెంటు రోడ్లు, వైద్య సౌకర్యాలు, చెరువు పూడిక తీయటం, ఇంకుడు గుంతలు, చెట్లు పెంచటం ఇతర నియోజకవర్గాల్లో కూడా జరుగుతుంటాయి గాని సత్తెనపల్లిలో అమలుజరిగినవి కొన్ని ప్రత్యేకతలను సంతరించుకొన్నాయి. ఉదాహరణకు పూడికతీయటంతో పాటు చెరువు కట్టలను అందంగా తీర్చిదిద్ది, ప్రజలు సాయంత్రం వేళ వాహ్యాళికి వెళ్లి కూర్చునే విధంగా (హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ నమూనాలో) ఆకర్షణీయం చేసారు. ఐదంటే ఐదు రోజుల్లో యాభైవేల ఇంకుడు గుంతలు తవ్వించారు. ప్రతి గ్రామంలోనూ ఆర్.ఓ. (రివర్స్ ఆస్మోసిస్) యంత్రాలను ఏర్పాటుచేసి త్రాగునీరు వసతి కల్పించారు. గ్రామాల్లో చాలాకాలం నిర్లక్ష్యానికి గురైన ఎస్సీ, ఎస్టీ కాలనీల కోసం ఒక్కొక్క గ్రామానికి ఇరవై లక్షల రూపాయల వంతున కేటాయించారు. ఇంత భారీ మొత్తాలు మునుపెన్నడూ ఇవ్వలేదు. సత్తెనపల్లి మునిసిపాలిటీ రాష్ట్రం మొత్తంలోకి ఆదర్శ (మోడల్) పురపాలక సంఘంగా ఎంపికైంది. చిన్న పట్టణమైనా వీధి దీపాలుగా ఎల్‌ఈడీ లైట్లూ, వాకింగ్ ట్రాక్, పార్కులు, సర్వత్రా పచ్చదనం, అతిథిగృహాలు, ఆటస్థలం, కళాశాలలకు కొత్త భవనాలు, కొత్తదనంతో వావిలాల ఘాట్, వందపడకల ఆస్పత్రి (విస్తరణలో) మొదలైనవి మునిసిపాలిటీకి గుర్తింపు తెచ్చాయి. ఇన్ని పథకాలకు, కార్యక్రమాలకు డబ్బు లేకపోవటం ప్రతిబంధకం కాలేదు. ప్రభుత్వం ఇచ్చిన గ్రాంటులు, శాసనసభ్యుడి నియోజకవర్గ నిధులు, ఇవిగాక డాక్టర్ కోడెల శివప్రసాదరావు మిత్రుల నుంచి, అభిమానుల నుంచి సేకరించిన విరాళాలు ధనం లేదనే సమస్య తలెత్తకుండా చేసాయి. ఈ కృషిలో ఆయనకు కుటుంబ సహకారం కూడా ఉంది. గ్రామాల్లో ఆర్.ఓ. ప్లాంటులను ఏర్పాటు చేసింది డాక్టర్ కోడెల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ శివప్రసాదరావు గారి కుమారుడు డాక్టర్ శివరామకృష్ణ. ఆయన సత్తెనపల్లిలోనే గాక, శివప్రసాదరావు గారికి దీర్ఘకాలంగా అనుబంధం ఉన్న నరసరావుపేట నియోజకవర్గంలో సైతం గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. వేలాది మందికి చికిత్స జరిగింది. మెరుగైన చికిత్స కోసం అవసరమైతే పెద్ద ఆస్పత్రులకు పంపేటట్లు సహాయం చేసారు. ప్రజలు సహకరించటం అంటే అన్ని వర్గాల ప్రజలు సహకరించటమే. ఇంతమందికి ఇలా ఎన్నో విధాల మేలు జరిగింది కనుకనే సత్తెనపల్లి నియోజకవర్గం ప్రత్యేకత సాధించింది.సత్తెనపల్లి విజయంగా ‘అమరావతి మీడియా సొల్యూషన్స్’ సంస్థ తన ప్రచురణలో అభివర్ణించిన ఈ ఘనత– నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు చెందుతుంది. సత్తెనపల్లి విజయ సూత్రం, మంత్రం కులమతాలకూ, రాజకీయాలకూ అతీతంగా అన్ని గ్రామాలకూ, అన్ని ఇళ్లకూ, వారాలలోనో, నెలలలోనో పథకాలను అమలుజరిపి అభివృద్ధి ఫలాలను అందించటమే.పొత్తూరి వెంకటేశ్వరరావుసీనియర్ పాత్రికేయులు దేశం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రణాళికా రచన, దానిని అమలు జరిపే కృషి జరుగుతుంది, రాష్ట్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి బాధ్యత వహిస్తుంది. జిల్లా పరిషత్తులు ప్రభుత్వం సమకూర్చే నిధులతో స్థానిక అభివృద్ధి కోసం పథకాలు అమలుచేస్తాయి. అట్టడుగున పంచాయతీ వరకు ఇదే విధానం కొనసాగుతుంది. జాతీయ స్థాయి నుంచి దిగువన పంచాయతీ వరకు ప్రజలు ఎన్నుకొన్న ప్రతి నిధులు అధికార పీఠాలలో ఉండి పరిపాలనా యంత్రాంగం పనిని పర్యవేక్షిస్తారు. తమకు కావలసిన, ప్రజోపయోగకరమైన పనులను అధికారులకు చెప్పి చేయించుకొంటారు. లోక్‌సభకు, శాసనసభలకు ఎన్నికయ్యే ప్రతినిధులు తమకు ప్రభుత్వం ఇచ్చే ‘నియోజకవర్గం నిధుల’ను వెచ్చించి అభివృద్ధి కృషిలో భాగస్వాములవుతారు. ఎన్నికైన ప్రతి ప్రజాప్రతినిధీ ఏవో కొన్ని మంచి పనులు చేయకపోతే తిరిగి ప్రజల ముందుకుపోయి ఓట్లు అడగలేరు. అందువల్ల ప్రజా ప్రతినిధులు ప్రజలు కోరే అభివృద్ధి పనుల అమలు కోసం అవసరమైతే మంత్రుల సహాయం కూడా పొందుతారు. కొన్ని పనులు అవుతాయి. గ్రామాలకు మంచినీటి సదుపాయం, పాఠశాలలకు భవనాల నిర్మాణం, ప్రజలకు వైద్యవసతి, రోడ్లు వేయించటం మొదలైనవి ప్రజలు హర్షించే ఇలాంటి మంచిపనులు. ఇవన్నీ భారీ స్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుజరిపే పథకాలకు అదనం. భారీ పథకాల వల్ల మొత్తం దేశానికీ, రాష్ర్టాలకూ, ప్రతి ఊరికీ, ప్రతి సామాజిక వర్గానికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎంతో కొంత మేలు జరుగుతుంటుంది. కాని, ఈ మేలు ఎక్కడో దూరం నుంచి పొందిన అనుభూతి ప్రజలకు కలుగుతుంది. ప్రత్యక్షంగా లబ్ధి పొందినప్పుడు కలిగే సంతృప్తి ఇందులో ఉండదు. తమ ఎమ్మెల్యే గారు స్వయంగా ప్రయత్నించి తమ ఊరికి ఒక చిన్న పశువుల ఆస్పత్రిని తెప్పించినప్పుడు కలిగే ఆనందం నియోజకవర్గంలో ఒక భారీ పరిశ్రమ స్థాపించినప్పుడు కలగదు. ప్రజాప్రతినిధులు ఇది తెలిసే తమ నియోజకవర్గాల్లో ఇదంతా తమ కోసమే అని ప్రజలకు అనిపించే పనుల కోసం ప్రయత్నిస్తారు. కొంతవరకు కృతకృత్యులౌతారు. కాని, సాధారణంగా వారు చేసే కృషి ఫలితాలన్నీ ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ నేరుగా అందవు. అసలు, ప్రతి ఎంపీ, ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ లాభించే పనులు చేయించటం సాధ్యం కాదేమో, అందులోనూ రోజులు, నెలల్లో విస్తృతంగా పనులు జరిపించటం సాధ్యం కాదేమో అని గతానుభవాలను బట్టి అనిపిస్తుంది. అలా కాదు, ‘సాధ్యమవుతుంది’ అని గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి శాసనసభ (ఏపీ) నియోజకవర్గం నిరూపించింది. ఇదొక అపూర్వ ప్రయోగం. ఇలా మరెక్కడా జరగలేదు కనుకనే యూనిసెఫ్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రయోగాన్ని అధ్యయనం చేయటానికి ప్రతినిధులను ప్రచారం లేకుండా పంపించాయి. విదేశీ దౌత్యాధికారులు సైతం ఆసక్తి చూపారు. గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ జాతీయ స్థాయిలో ఒక రికార్డుగా నమోదు చేసింది.ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ అభివృద్ధిని చేసి చూపించటం ఎలా సాధ్యమైందనేది తెలుసుకోవలసిన వ్యూహం. అభివృద్ధి గురించి మాట్లాడుకొనేటప్పుడు సాధారణంగా మరుగుదొడ్లను గురించి ప్రస్తావనలు రావు. అల్పమైన, అసహ్యకరమైన విషయంగా చాలామంది మనస్సులలో ఒక ముద్ర ఏర్పడి ఉంటుంది. కాని, అది ప్రతి ఒక్కరికి అవసరమైన సౌకర్యం. పట్టణాలలో గృహనిర్మాణం జరిగేటప్పుడే మరుగుదొడ్ల ఆలోచనలు చేసి, తగిన విధంగా సౌకర్యాలు కల్పించుకొంటారు. కాని, గ్రామాలలో ఎప్పటినుంచో ఉన్న పాత ఇళ్లలో, పూరిపాకలలో మరుగుదొడ్ల సౌకర్యం ఉండదు. కాని పల్లెలలోనూ ఇప్పుడిప్పుడే ఒకింత మార్పు వస్తున్నది. కొత్త ఇళ్లల్లో మరుగుదొడ్లను ఏర్పాటు చేసుకొంటున్నారు. కానీ, ఈ మార్పు చాలదు. చాలా ఇళ్లకు, ముఖ్యంగా పేదల పూరిండ్లకు నేటికీ అది అందుబాటులో లేని సౌకర్యమే. కాలకృత్యాల కోసం గ్రామాల్లో చెరువుకట్టకో, రహదార్ల పక్కకో, మరో బాహ్య ప్రదేశానికో పోవటం సర్వసాధారణం. ముఖ్యంగా ఆడవాళ్లు ఎన్నో అవస్థలు పడుతుంటారు. ఇది స్ర్తీల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య అని పంచాయతీ పెద్దలకూ శాసనకర్తలకూ తెలుసు. ఐనా, అలవాటుపడిపోయిన సమస్యలెమ్మని పట్టించుకోరు. పట్టణాలలోనూ, కొన్ని గ్రామాలలోనూ ఒకటో రెండో ‘సులభ్ శౌచాలయాలు’ (పబ్లిక్ లెట్రిన్స్) కొత్తగా ఏర్పడ్డాయి. కాని, నిర్వహణ లోపం వల్లనేమి అలవాటులేని ప్రజల వైముఖ్యం వల్లనేమి ఎక్కువ భాగం నిరుపయోగంగా ఉంటున్నాయి. మరుగుదొడ్ల ఏర్పాటు మొదటి అంశం.అసహ్యకరం అనుకొని మరుగుదొడ్లను గురించి మాట్లాడుకోకపోవటం వలెనే, భయంవల్ల కొందరూ, అశుభం అనుకోవటం వల్ల మరికొందరూ శ్మశానాలను గురించి మాట్లాడరు. ప్రతి ఒక్కరు తుదకు చేరవలసిన చోటు అదేనని అందరికీ తెలుసు. ఐనా, శ్మశానాలను బాగుచేసుకొందామనే ఆలోచనలు రావు, వచ్చినా ఎవరికి వారు మనకెందుకు లెమ్మనుకొంటారు. సమష్టి ప్రయత్నాలు చేయరు. ఇది రెండవది. మరొకటి, పల్లెసీమలో పారిశుద్ధ్యలోపం. మురికి వాతావరణం వల్ల జబ్బులు వస్తుండటం అందరికీ తెలిసిన సంగతే. ఎవరి ఇంటిని వారు శుభ్రంగా ఉంచుకుంటారేమోగాని వీధులు, పరిసరాలను గురించి పట్టించుకోరు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గం మరుగుదొడ్లు, శ్మశానాలు, మురికి తొలగింపులపై ప్రత్యేక దృష్టి సారించింది. మిగతా అభివృద్ధి పనులను కొనసాగిస్తూనే ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణం, శ్మశానాల ఆధునికీకరణ, ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవటం అనే మూడింటిని ఉద్యమ స్థాయిలో చేపట్టింది. ఉద్యమ రూపకర్త స్థానిక శాసనసభ్యుడైన స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఈ కార్యక్రమాలను ప్రారంభించే ముందు పెద్ద బహిరంగ సభ జరిపి ప్రజలను చైతన్యపరచటం వల్లా, మారని వారెవరైనా ఉంటే స్థానిక నాయకులు వచ్చి చెప్పటం వల్లా, నియోజకవర్గంలో గుణాత్మకమైన మార్పు వచ్చి, నవ్య వాతావరణం నెలకొన్నది. కేవలం మూడున్నర నెలల వ్యవధిలో సత్తెనపల్లి, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో సుమారు ఇరవై కోట్ల రూపాయల ఖర్చుతో దాదాపు ఇరవై ఒక్క వేల మరుగుదొడ్లను నిర్మించారు. ఈ నాలుగు మండలాలూ, ఇంకా నరసరావుపేట, రొంపిచర్ల మండలాలలోనూ 398 శ్మశానాలను ఆధునికీకరించారు. శ్మశానాల రూపురేఖలు మారిపోయాయి. హిందూ శ్మశానాలకు స్వర్గపురాలని పేరుపెట్టారు. అంత్యక్రియలు జరపటానికైనా, తరువాత జరిగే కర్మకాండ కోసమైనా ఉపయోగపడే విధంగా సౌకర్యాలు ఏర్పడ్డాయి. యజ్ఞశాలను పోలిన దహనవాటికలు నిర్మించారు. స్నానాల కోసం నీటి వసతి కల్పించారు, దుస్తులు మార్చుకోవటానికి గది కట్టించారు. ఉద్యానమనిపించే విధంగా చెట్లు, మొక్కలు పెంచారు. శ్మశానం చుట్టూ గోడ, పవిత్రప్రదేశమని స్ఫురింపజేసే ప్రవేశద్వారం నిర్మించారు. ఇవిగాక శ్మశానానికి వెళ్లే దోవను చక్కని రోడ్డుగా మార్చారు. అంత్యక్రియలు చూడవచ్చే బంధుజనం కోసం బెంచీలు ఏర్పాటు చేసారు. ఏ మతంవారి శ్మశానాలు వారికి ఉన్నాయి కనుక అన్నింటినీ వారివారి విశ్వాసాలకు తగిన రీతిలో ఆధునికీకరించారు. నియోజకవర్గం అంతటా పారిశుద్ధ్య కార్యక్రమం అమలు జరిగింది. స్వచ్ఛమేవ జయతే అంటూ ప్రజలు స్వచ్ఛందంగా అభివృద్ధి కృషిలో పాల్గొన్నారు. స్వచ్ఛ సత్తెనపల్లి రూపొందింది. ఒక విశేషం ఏమిటంటే– ప్రధాన మంత్రి మోదీ జాతీయ స్థాయిలో ప్రకటించిన స్వచ్ఛభారత్ ఉద్యమానికి చాలా ముందే సత్తెనపల్లి నియోజకవర్గంలో స్వచ్ఛసాధన కార్యక్రమం మొదలై దేశానికి మార్గదర్శకమైంది. ప్రధానమంత్రి కార్యాలయం ప్రతినిధి ఒకరు నియోజకవర్గాన్ని చూసి వెళ్లారు. మంచి ఎక్కడున్నా ఎవరు చేసినా చూసి హర్షించవలసిందే, అనుసరించవలసిందే. రక్షిత మంచినీటి సదుపాయం, గ్రామాల్లో సిమెంటు రోడ్లు, వైద్య సౌకర్యాలు, చెరువు పూడిక తీయటం, ఇంకుడు గుంతలు, చెట్లు పెంచటం ఇతర నియోజకవర్గాల్లో కూడా జరుగుతుంటాయి గాని సత్తెనపల్లిలో అమలుజరిగినవి కొన్ని ప్రత్యేకతలను సంతరించుకొన్నాయి. ఉదాహరణకు పూడికతీయటంతో పాటు చెరువు కట్టలను అందంగా తీర్చిదిద్ది, ప్రజలు సాయంత్రం వేళ వాహ్యాళికి వెళ్లి కూర్చునే విధంగా (హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ నమూనాలో) ఆకర్షణీయం చేసారు. ఐదంటే ఐదు రోజుల్లో యాభైవేల ఇంకుడు గుంతలు తవ్వించారు. ప్రతి గ్రామంలోనూ ఆర్.ఓ. (రివర్స్ ఆస్మోసిస్) యంత్రాలను ఏర్పాటుచేసి త్రాగునీరు వసతి కల్పించారు. గ్రామాల్లో చాలాకాలం నిర్లక్ష్యానికి గురైన ఎస్సీ, ఎస్టీ కాలనీల కోసం ఒక్కొక్క గ్రామానికి ఇరవై లక్షల రూపాయల వంతున కేటాయించారు. ఇంత భారీ మొత్తాలు మునుపెన్నడూ ఇవ్వలేదు. సత్తెనపల్లి మునిసిపాలిటీ రాష్ట్రం మొత్తంలోకి ఆదర్శ (మోడల్) పురపాలక సంఘంగా ఎంపికైంది. చిన్న పట్టణమైనా వీధి దీపాలుగా ఎల్‌ఈడీ లైట్లూ, వాకింగ్ ట్రాక్, పార్కులు, సర్వత్రా పచ్చదనం, అతిథిగృహాలు, ఆటస్థలం, కళాశాలలకు కొత్త భవనాలు, కొత్తదనంతో వావిలాల ఘాట్, వందపడకల ఆస్పత్రి (విస్తరణలో) మొదలైనవి మునిసిపాలిటీకి గుర్తింపు తెచ్చాయి. ఇన్ని పథకాలకు, కార్యక్రమాలకు డబ్బు లేకపోవటం ప్రతిబంధకం కాలేదు. ప్రభుత్వం ఇచ్చిన గ్రాంటులు, శాసనసభ్యుడి నియోజకవర్గ నిధులు, ఇవిగాక డాక్టర్ కోడెల శివప్రసాదరావు మిత్రుల నుంచి, అభిమానుల నుంచి సేకరించిన విరాళాలు ధనం లేదనే సమస్య తలెత్తకుండా చేసాయి. ఈ కృషిలో ఆయనకు కుటుంబ సహకారం కూడా ఉంది. గ్రామాల్లో ఆర్.ఓ. ప్లాంటులను ఏర్పాటు చేసింది డాక్టర్ కోడెల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ శివప్రసాదరావు గారి కుమారుడు డాక్టర్ శివరామకృష్ణ. ఆయన సత్తెనపల్లిలోనే గాక, శివప్రసాదరావు గారికి దీర్ఘకాలంగా అనుబంధం ఉన్న నరసరావుపేట నియోజకవర్గంలో సైతం గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. వేలాది మందికి చికిత్స జరిగింది. మెరుగైన చికిత్స కోసం అవసరమైతే పెద్ద ఆస్పత్రులకు పంపేటట్లు సహాయం చేసారు. ప్రజలు సహకరించటం అంటే అన్ని వర్గాల ప్రజలు సహకరించటమే. ఇంతమందికి ఇలా ఎన్నో విధాల మేలు జరిగింది కనుకనే సత్తెనపల్లి నియోజకవర్గం ప్రత్యేకత సాధించింది.సత్తెనపల్లి విజయంగా ‘అమరావతి మీడియా సొల్యూషన్స్’ సంస్థ తన ప్రచురణలో అభివర్ణించిన ఈ ఘనత– నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు చెందుతుంది. సత్తెనపల్లి విజయ సూత్రం, మంత్రం కులమతాలకూ, రాజకీయాలకూ అతీతంగా అన్ని గ్రామాలకూ, అన్ని ఇళ్లకూ, వారాలలోనో, నెలలలోనో పథకాలను అమలుజరిపి అభివృద్ధి ఫలాలను అందించటమే.పొత్తూరి వెంకటేశ్వరరావుసీనియర్ పాత్రికేయులు | editorial |
20,140 | 15-10-2017 01:40:49 | ఫిలిప్స్, ఆస్టల్‌కు పిలుపు |
మరో ఆరుగురి పేర్లు ప్రకటించిన కివీస్‌భారత్‌తో వన్డే సిరీస్‌కు జట్టు ఎంపికముంబై: భారత్-ఎతో జరిగిన అనధికారిక టెస్టు, వన్డే సిరీస్‌ల్లో రాణించిన న్యూజిలాండ్-ఎ టీమ్ ఆటగాళ్లు గ్లెన్ ఫిలిప్స్, టాడ్ ఆస్టల్ అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్ధమయ్యారు. భారత్‌తో జరిగే వన్డే, టీ-20 సిరీస్‌ల్లో పాల్గొనే న్యూజిలాండ్ జట్టులో ఫిలిప్స్, ఆస్టల్ చోటు దక్కించు కున్నారు. టీమిండియాతో ఈనెల 22న మొదలయ్యే వన్డే సిరీస్‌లో పాల్గొనే జట్టులోని తొమ్మిది మంది పేర్లను గతంలోనే ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు శనివారం మరో ఆరుగురి పేర్లను వెల్లడించింది. ఫిలిప్స్, ఆస్టల్‌తోపాటు హెన్రీ నికోల్స్, మాట్ హెన్రీ, కొలిన్ మన్రో, జార్జ్ వర్కర్ కూ డా వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత్-ఎ తో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న వన్డే సిరీస్‌లో పాల్గొంటు న్న వీరంతా ఆదివారం జరిగే ఐదో వన్డే ముగియగానే కేన్ విలియమ్స్ సేనతో కలుస్తారు. ఈ పర్యటన కోసం విలియ మ్సన్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల బృందం శుక్రవారమే భారత్ చేరుకున్న సంగతి తెలిసిందే. కాగా.. వన్డే సిరీస్ అనంతరం జరిగే మూడు టీ-20ల సిరీస్‌లో పాల్గొనే జట్టును కూడా కివీస్ ప్రకటించింది. న్యూజిలాండ్ వన్డే జట్టు: విలియమ్సన్ (కెప్టెన్) టాడ్ ఆస్టల్, గ్లెన్ ఫిలిప్స్, ట్రెంట్ బౌల్ట్, గ్రాండ్‌హోమ్, మార్టిన్ గప్టిల్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, ఆడమ్ మిల్నె, కొలిన్ మన్రో, శాంట్నర్, టిమ్ సౌథీ, రాస్ టేలర్, జార్జ్ వర్కర్. టీ-20 జట్టు: విలియమ్సన్ (కెప్టెన్), టాడ్ ఆస్టల్, గ్లెన్ ఫిలిప్స్, ట్రెంట్ బౌల్ట్, టామ్ బ్రూస్, గ్రాండ్‌హోమ్, మార్టిన్ గప్టిల్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, ఆడమ్ మిల్నె, కొలిన్ మన్రో, శాంట్నర్, టిమ్ సౌథీ, ఇష్ సోధి. | sports |
18,605 | 11-04-2017 12:48:47 | బీజేపీకి ఆ సామర్థ్యం లేదు : రాబర్ట్ వాద్రా |
న్యూఢిల్లీ : భారత మాజీ నేవీ ఉద్యోగి కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్థాన్ మరణ శిక్ష విధించడంపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా స్పందిస్తూ పాకిస్థాన్‌తో వ్యవహరించే విషక్ష్ంలో బీజేపీ ప్రభుత్వానికి సరైన సామర్థ్యం లేదని పేర్కొన్నారు. జాదవ్‌కు మరణ శిక్ష విధించినందుకు నిరసనగా 12 మంది పాకిస్థానీ ఖైదీలను తిరిగి ఆ దేశానికి పంపించాలన్న నిర్ణయాన్ని నిలిపేశారని, పాకిస్థాన్ అదుపులో ఉన్న భారతీయుల కోసం మనం చేయగలిగినది ఇంతేనా? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. | nation |
7,122 | 14-12-2017 18:11:29 | ‘గ్యాంగ్’ కోసం తొలిసారి సూర్య అలా చేశారు.. | ‘గజని’తో తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా స్టార్‌డమ్‌ని పెంచుకుని తరువాత వచ్చిన సింగం సీక్వెల్స్‌తో వరుస విజయాలు సాధించి టాలీవుడ్‌లో తనకంటూ ఓ ట్రేడ్ బిజినెస్‌ని సెట్ చేసుకున్న హీరో సూర్యకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. సూర్య నటించిన ప్రతీ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ అంతే భారీగా విడుదలవుతుంది. తాజాగా జ్ఞానవేళ్ రాజా నిర్మాతగా సూర్య కథానాయకుడిగా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందించిన "తాన సెరంధ కూటమ్" అనే తమిళ చిత్రాన్ని తెలుగులో యు.వి. క్రియేషన్స్ సంస్థ "గ్యాంగ్" పేరుతో సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 12న రిలీజ్ చేయనుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదల చేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ టీజర్‌ని విడుదల చేశారు. విడుదల చేసిన కొన్ని గంటల్లోనే హ్యూజ్‌గా మిలియన్ వ్యూస్.. రెండు లక్షల లైక్స్ రావటం విశేషం. అంతేకాకుండా సోషల్ మీడియాలో ట్రెండింగా నిలవడంతో యూనిట్ మెంబర్స్ ఆనందంగా ఉన్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. ‘బాహుబలి’ చిత్రంతో నేషనల్ స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్న రమ్యకృష్ణ అలాగే సీనియర్ నటుడు కార్తీక్ కీలక పాత్రలు పోషించారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతమందించారు. జనవరి 12, 2018న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు యువి క్రియేషన్స్ నిర్మాతలు ప్రమోద్, వంశీ ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాతలు ప్రమోద్, వంశీ మాట్లాడుతూ.. ‘‘తెలుగు, తమిళ భాషల్లో సూర్యకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ఆయన తమిళంలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నటించిన చిత్రాన్ని తెలుగులో ‘గ్యాంగ్’ పేరుతో మా యువి క్రియేషన్స్ బ్యానర్లో భారీగా రిలీజ్ చేస్తున్నాము. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఆకట్టుకుందో దాన్ని మించి ఫస్ట్ లుక్ టీజర్ ఆకట్టుకుంది. ఫస్ట్ టైమ్ టీజర్‌లో సూర్యగారు తెలుగులో డబ్బింగ్ చెప్పటం తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఆయన మాటలు చాలా ముద్దుగా వుండటంతో టీజర్‌ని రిపీట్ మోడ్‌లో చూస్తున్నారు. అనిరుధ్ సంగీతమందించిన పాటలు చాలా బాగా వచ్చాయి. కీర్తి సురేష్ నటన హైలైట్‌గా నిలుస్తుంది. కార్తిక్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కనిపిస్తారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు. | entertainment |
6,104 | 12-12-2017 17:44:46 | నితిన్.. ‘గుర్తుందా శీతాకాలం’! | నితిన్ హీరోగా పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నారా రోహిత్ ‘రౌడీ ఫెలో’ చిత్రంతో దర్శకుడిగా మారిన లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథను అందిస్తున్నారు. నితిన్‌తో ‘లై’ చిత్రంలో నటించిన మేఘా ఆకాష్ ఈ చిత్రంతో మరోసారి నితిన్‌తో జోడీ కడుతోంది. రీసెంట్‌గా అమెరికాలో షూటింగ్ జరుపుకుని వచ్చిన ఈ చిత్రం.. మరో షెడ్యూల్‌కి రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి చిత్ర యూనిట్ ఓ ఆసక్తికరమైన టైటిల్‌ని రిజిస్టర్ చేయించినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘‘గుర్తుందా శీతాకాలం” అనే డిఫరెంట్ టైటిల్‌ని ఈ సినిమా కోసం రిజిస్టర్ చేయించారంట. అయితే చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఈ టైటిల్‌పై ఎటువంటి సమాచారం రాలేదు. సోషల్ మీడియాలో కూడా ఈ టైటిల్ హల్‌చల్ చేస్తుంది. ఈ చిత్రానికి ఎస్. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. | entertainment |