SNo
int64
0
21.6k
date
stringlengths
19
19
heading
stringlengths
3
91
body
stringlengths
6
38.7k
topic
stringclasses
5 values
17,098
17-12-2017 12:16:25
హెలికాప్టర్ ప్రమాదం... దేశాధ్యక్షుడి సోదరి దుర్మరణం...
న్యూఢిల్లీ : హోండురాన్ దేశ రాజధానికి సమీపంలోని పర్వత ప్రాంతాల్లో హెలికాప్టర్ కుప్పకూలింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఆ దేశాధ్యక్షుడు జువాన్ ఓర్లాండో హెర్నాండెజ్ సోదర హిల్డా హెర్నాండెజ్, మరొక ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. హెర్నాండెజ్ (51) ఆగ్రోనామీ ఇంజినీర్. ఆమె తన సోదరుని మంత్రివర్గంలో కమ్యూనికేషన్ల మంత్రిగా పని చేశారు. అంతేకాకుండా గతంలో దేశాధ్యక్షుడు పోర్ఫిరియో లోబో మంత్రివర్గంలో సాంఘికాభివృద్ధి మంత్రిగా కూడా పని చేశారు. హెర్నాండెజ్ ఆదివారం ఉదయం కమయగువాలోని తన నివాసానికి తెగుసిగల్ప అంతర్జాతీయ విమానాశ్రయంలో సైనిక హెలికాప్టర్‌లో బయల్దేరారు. దీనిలో ఆమెతో పాటు నలుగురు భద్రతా సిబ్బంది, పైలట్ ఉన్నారు. కాసేపటికే ఈ హెలికాప్టర్ అదృశ్యమైందని వాయుసేన ప్రకటించింది. అనంతరం పర్వత ప్రాంతాల్లో హెలికాప్టర్ శకలాలు కనిపించాయి. మొత్తం ఐదుగురు మరణించినట్లు గుర్తించారు.
nation
11,722
23-09-2017 19:30:40
పితృస్వామ్యంపై పోరుకు చేతులు కలిపిన క్రైస్తవ మహిళలు
కొట్టాయం : కేరళ చర్చి చరిత్రలో మునుపెన్నడూ లేని ఉద్యమం ప్రారంభమైంది. రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి ఎస్ శారదకుట్టి తెలిపిన వివరాల ప్రకారం కేథలిక్, ప్రొటెస్టెంట్, ఈస్టర్న్ చర్చి సహా రాష్ట్రంలోని చర్చిల నుంచి అభ్యుదయవాద మహిళలు ఉమ్మడి ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఇండియన్ క్రిస్టియన్ వుమెన్స్ మువ్‌మెంట్ (ఐసీడబ్ల్యూఎం) కేరళ విభాగం సమావేశం సీఎస్ఐ రిట్రీట్ సెంటర్‌లో జరిగింది. ‘మహిళల జీవితాలు ముఖ్యమైనవే’ అనే నినాదంతో క్రైస్తవ మహిళలను సమైక్యపరచడమే లక్ష్యంగా ఈ సంఘం ఏర్పాటైంది. చర్చిల్లోనూ, సమాజంలోనూ మహిళలు దోపిడీకి గురికాకుండా నిరోధించడం, పితృస్వామ్యం వల్ల అమలవుతున్న అన్యాయమైన నమ్మకాలు, ఆచారాలను పూర్తిగా మార్చడం కోసం కృషి చేస్తుంది. శారదకుట్టి మాట్లాడుతూ పితృస్వామిక వ్యవస్థ వల్ల అమలవుతున్న అన్యాయమైన విధానాలను ప్రశ్నించారు. నూతన సామాజిక వ్యవస్థను సృష్టించేందుకు మహిళలంతా చేతులు కలపాలని పిలుపునిచ్చారు. కేథలిక్ అయిన కొచ్చురాణి అబ్రహాం మాట్లాడుతూ ఈ ఉద్యమంలో కేథలిక్ మహిళలు మొదటిసారి భాగస్వాములవుతున్నారని తెలిపారు. చర్చికి సంబంధించిన ముఖ్యమైన కార్యకలాపాల్లో మహిళలకు మరింత భాగస్వామ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
nation
4,129
08-01-2017 02:09:38
సఫలమా.. విఫలమా?
పెద్ద నోట్ల రద్దు లక్ష్యం ఫలించిందా? వికటించిందా? నిర్ణయం అమలులోకి వచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఈ ప్రశ్నకు ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టమైన సమాధానం మాత్రం రావడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన 50 రోజుల గడువు ముగిసి వారం రోజులు అవుతున్నా నగదు కొరత మాత్రం తీరడం లేదు. ఇటు ప్రజలు, అటు దేశ ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలతో నిమిత్తం లేకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి మాత్రం రానున్న అయిదు రాష్ర్టల ఎన్నికలలో రాజకీయ లబ్ధి చేకూరబోతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. 86 శాతానికి పైగా చలామణిలో ఉన్న కరెన్సీని ఉన్నపళంగా రద్దు చేయడం వల్ల దుష్పరిణామాలు తలెత్తుతాయని ప్రపంచవ్యాప్తంగా తలపండిన ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నప్పటికీ, మన దేశంలోని సన్న జనం మాత్రం మోదీ నిర్ణయాన్ని సమర్థించడానికి కారణం ఏమిటి? దేశంలో పేట్రేగిపోతున్న అవినీతిని, గుట్టలుగా పేరుకుపోయిన నల్లధనాన్ని నిర్మూలించడానికి తన నిర్ణయం దోహదపడుతుందని ప్రధాని మోదీ చేసిన ప్రకటనను ప్రజలు విశ్వసించడం వల్లనే అధికార పార్టీకి రాజకీయంగా లాభించబోతున్నది.  ఆచరణలో ఈ రెండు లక్ష్యాలూ నెరవేరకపోయినా, ప్రజలు మాత్రం అవినీతి నిర్మూలన జరిగిపోయిందనీ, నల్ల డబ్బు దాచుకున్న వాళ్లు చావుదెబ్బ తిన్నారనీ భ్రమిస్తున్నారు. ఈ కారణంగానే క్షేత్ర స్థాయిలో నెలకొన్న వాస్తవ పరిస్థితులతో సంబంధం లేకుండా సాధారణ ప్రజలు బీజేపీ పట్ల ఆకర్షితులవుతున్నారు. నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తర్వాత కొద్ది రోజుల వరకు బ్యాంకులలో ‘అంత డబ్బు డిపాజిట్‌ అయ్యింది.. ఇంత డబ్బు డిపాజిట్‌ అయ్యింది’ అని లెక్కలు ప్రకటించిన రిజర్వ్‌ బ్యాంకు పాత నోట్ల డిపాజిట్‌కు గడువు ముగిసి వారం రోజులు అవుతున్నా మొత్తం ఎంత డబ్బు జమ అయ్యిందో మాత్రం చెప్పడం లేదు. అదేమంటే లెక్కలు తీస్తున్నామని అంటున్నారు. వివిధ బ్యాంకులలో డిపాజిట్‌ అయ్యే మొత్తాలను ఏ రోజుకు ఆ రోజు తెలుసుకోగలిగే సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న రిజర్వ్‌ బ్యాంకుకు ఇంకా లెక్కలు తెలియకపోవడం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం లభించడం లేదు.  రద్దు నిర్ణయం వెలువడిన నెల రోజులకే 12.5 లక్షల కోట్లు జమ అయ్యాయని ప్రకటించిన రిజర్వ్‌ బ్యాంకు ఆ తర్వాత మౌనం పాటించింది. అంటే లెక్కల్లో ఎక్కడో తేడా వచ్చిందన్న మాట! చలామణిలో ఉన్న పెద్ద నోట్లు మొత్తం వివిధ బ్యాంకులలో జమ అయి ఉండాలి. అదే జరిగి ఉంటే దేశంలో నల్లధనం లేనట్టేనని భావించవలసి ఉంటుంది. మొత్తం డబ్బు జమ అయ్యిందని ప్రకటిస్తే లేని నల్లధనం కోసం ప్రజలను ఇంత హింస పెట్టడం ఎందుకు? అన్న ప్రశ్న వస్తుందన్న ఉద్దేశంతో జమ అయిన నగదు వివరాలపై నోరు మెదపడం లేదు. అదేమంటే బ్యాంకులలో డిపాజిట్‌ చేసినదంతా వైట్‌ మనీ అని అనుకోవడానికి వీలులేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అదే నిజమనుకుందాం! ఆ లెక్కలు ఎప్పటికి తేలతాయో చెప్పాలి కదా! వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వెల్లడిస్తున్న వివరాల ప్రకారం ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. ప్రధాని మోదీ ఊహించుకున్నట్టుగా లక్షల కోట్లు ప్రభుత్వానికి మిగలలేదు. మహా అయితే 50 వేల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి దక్కవచ్చునని ఒక అంచనా ఉంది. అదే నిజమైతే ప్రధాని నిర్ణయం ఒక విఫల ప్రయోగంగా మిగిలిపోతుంది. రద్దు అయిన నోట్ల స్థానంలో ముద్రిస్తున్న కొత్త నోట్లకు దాదాపు 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. అంటే ప్రభుత్వానికి నికరంగా మిగిలేది 30 వేల కోట్ల రూపాయలకు మించి ఉండకపోవచ్చునన్న మాట! బహుశా ఈ కారణంగానే కాబోలు గత ఏడాది చివరి రోజైన డిసెంబరు 31 రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన నిస్సారంగా ఉంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని నవంబరు 8 రాత్రి ప్రకటించినప్పుడు మోదీలో ఎంతో ఆత్మవిశ్వాసం కనిపించింది. ఈ దేశాన్ని భ్రష్టాచారాల నుంచి కాపాడబోతున్న మహానుభావుడు వచ్చాడు అని ప్రజలు కూడా ఆ రోజు భ్రమించారు. నాటి ప్రకటనతో పోల్చితే డిసెంబరు 31 ప్రకటన జీవం లేనిదిగా ఉంది. నల్లధనం ప్రభుత్వం వద్దకు వెళ్లి తెల్లధనంగా మారి తమకు పంచిపెడతారని ఆశపడిన పేదలకు నిరాశే మిగిలింది. ప్రజలు నిరాశపడకుండా ఉండటానికై తాను ఏదో తాయిలాలు ఇస్తున్నట్టుగా ప్రధాని బిల్డప్‌ ఇచ్చారు. అంతే కాదు.. మోదీ ప్రసంగం ఆద్యంతం నాటకీయంగా సాగింది. ఆయా సందర్భాలలో తన మాడ్యులేషన్‌లో మార్పులు చేసి ప్రజలను రక్తి కట్టించే ప్రయత్నంచేశారు. అత్యంత కీలకమైన అంశంలో దేశ ప్రధాని హోదాలో హుందాగా ప్రసంగించవలసిన మోదీ నాటకీయతను అనుసరించడం ఆక్షేపణీయం.  ఎన్నికల ప్రచార సభలలో చేసే ప్రసంగాలకు, ప్రధానిగా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగాలకు తేడా ఉండాలి. దురదృష్టవశాత్తూ నరేంద్ర మోదీ ఈ తేడాను పాటించడం లేదు. విషయం లేనప్పుడే నాటకీయతను ఆశ్రయిస్తారు. నోట్ల రద్దు నిర్ణయం వికటించడం వల్ల కాబోలు, డిసెంబరు 31 నుంచి ఈ అంశంపై ఆయన మాట్లాడటం లేదు. నగదురహిత లావాదేవీలపై కూడా మాట్లాడటం లేదు. మాట్లాడితే వాస్తవాలు చెప్పాల్సి ఉంటుంది. అలా చెబితే తాను తీసుకున్న నిర్ణయంలోని డొల్లతనం బయటపడుతుంది. మౌనంగా ఉండిపోతే ప్రజలు భ్రమల్లోనే ఉండిపోతారు. ఈ విషయం మోదీకి మహ బాగా తెలుసు. అందుకే నోట్ల రద్దు వల్ల లాభం జరిగిందా? నష్టం జరిగిందా? అన్నది స్పష్టంచేయకుండా ప్రజలను భ్రమల్లో, ఆశల్లో విహరింపజేస్తున్నారు. అందుకే కళ్లెదుట ఆర్థిక విధ్వంసం జరుగుతున్నా మెజారిటీ ప్రజలకు అర్థంకావడం లేదు. తమకు ఇంకేదో మేలు జరుగుతుందని ఆశల పల్లకిలో విహరిస్తున్నారు. ఈ కారణంగానే ఎన్నికలు జరగనున్న రాష్ర్టాలలో.. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీనే మెజారిటీ స్థానాలు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితి ఎంతో కాలం ఉండే అవకాశం లేదు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల తలెత్తే ప్రతికూల ఫలితాల ప్రభావం ఇప్పుడిప్పుడే మొదలయ్యింది. జాతీయ స్థూల ఉత్పత్తి అర శాతం తగ్గుతోందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది.  పెద్దనోట్ల రద్దు తదనంతర పరిణామాలను పరిగణనలోకి తీసుకోకముందు ఈ గణాంకాలు రూపొందించారు. దీన్నిబట్టి మున్ముందు ఇది మరింత తగ్గుతుంది. పాత నోట్లకు పూర్తిగా కాలం చెల్లి వారం రోజులే అయినందున ప్రతికూల ఫలితాలు తెలియడానికి మరో ఒకటి రెండు నెలల సమయం పడుతుంది. నేను గతంలోనే పేర్కొన్నట్టుగా తిరుమలలో కొలువైన శ్రీవేంకటేశ్వరుడి ఆదాయం కూడా పడిపోయింది. పెద్ద నోట్లు చలామణిలో ఉన్నప్పుడు వేంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం సగటున రోజుకు మూడు కోట్ల రూపాయల వరకు ఉండేది. ప్రస్తుతం హుండీ ఆదాయం ఏ రోజూ రెండు కోట్లు దాటలేదు. తిరుమల సందర్శించే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. దేవుడి పరిస్థితిలాగే వివిధ వ్యాపారాల పరిస్థితి కూడా ఉంది.gమోదీ.. పక్కా వ్యూహం! ఇబ్బందులు మొదలైనా మెజారిటీ ప్రజలు ఇంకా ప్రధాని మోదీకి మద్దతుగా ఎందుకు ఉన్నారన్న ప్రశ్నకు సమాధానం అన్వేషించే ప్రయత్నం చేద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, ఆయన రాజకీయాలను దేశ ప్రజలే కాకుండా వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఈ కారణంగానే ఆయనను తక్కువగా అంచనా వేసుకున్నారు. మోదీ చాలా తెలివైన వ్యక్తి. అంతేకాదు తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎప్పుడు ఎవరిని వాడుకోవాలో, ఎప్పుడు వదిలేయాలో కూడా బాగా తెలిసిన వ్యక్తి. ఈ రెండు లక్షణాలూ దండిగా ఉన్న వ్యక్తి కావడం వల్లనే భారతీయ జనతా పార్టీలో సాదాసీదా స్థానం నుంచి దేశంలోని అత్యున్నత పదవి అయిన ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించగలిగారు. ఈ ప్రస్థానంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరు గురించి తెలుసుకుందాం. ఒకానొక దశలో బీజేపీ నాయకత్వం నిరాదరణకు గురైన నరేంద్ర మోదీ రాజకీయంగా నిలదొక్కుకోవడానికై విశ్వహిందూ పరిషత్‌ అధినేత ప్రవీణ్‌ తొగాడియాపై ఆధారపడ్డారు. తొగాడియా సహకారంతోపాటు లాల్‌ కృష్ణ ఆడ్వాణీ ఆశీస్సులతో గుజరాత్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకున్నారు. ముఖ్యమంత్రి పదవిని సుస్థిరం చేసుకోవడంతో పాటు అంతిమ లక్ష్యమైన ప్రధానమంత్రి పదవిని అందుకోవడానికై అప్పటి నుంచే వ్యూహరచన చేశారు.  ప్రారంభంలో అండదండలు అందించిన ప్రవీణ్‌ తొగాడియాను ముఖ్యమంత్రి అయ్యాక దగ్గరకు కూడా రానివ్వలేదు. ఇప్పుడు ఎల్‌.కె.ఆడ్వాణీతో వ్యవహరిస్తున్నట్టుగా అన్న మాట! గుజరాతీయుల మనసు గెల్చుకోవడానికి వ్యూహరచన చేస్తున్న సమయంలోనే గోద్రా మారణకాండ జరిగింది. దీన్ని ఒక అవకాశంగా మలచుకున్న నరేంద్ర మోదీ విజృంభించారు. తన చేతికి మట్టి అంటుకోకుండా చేయాల్సిందంతా చేశారు. గోద్రా మారణకాండకు ముందు కూడా గుజరాత్‌లో అయిదారు పర్యాయాలు మత కలహాలు జరిగాయి. ప్రతీ సందర్భంలోనూ ముస్లింలది పైచేయి కావడం, హిందువులు ఎక్కువగా నష్టపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో గోద్రా సంఘటనతో హిందువులలో భావోద్వేగాలు పరాకాష్ఠకు చేరాయి. అది గమనించిన నరేంద్ర మోదీ తన మదిలోని ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేయించారు. ఈ క్రమంలో తనకు ఎక్కడా రక్తపు మరక అంటకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముస్లింలపై హద్దూ అదుపూ లేని మారణకాండ సాగింది. దీంతో గుజరాత్‌లోని సగటు హిందువు గుండెల్లో నరేంద్ర మోదీ కొలువు తీరాడు. నరేంద్ర మోదీని దేశమంతా ఈసడించుకున్నా, అమెరికా వంటి దేశం ముఖ్యమంత్రి హోదాలో కూడా మోదీకి వీసా ఇవ్వడానికి నిరాకరించినా, గుజరాతీయులు మాత్రం ఆయనను ఆరాధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో మోదీకి సహకరించిన ఆనాటి హోం మంత్రి హరేన్‌ పాండ్యా ఆ తర్వాత హత్యకు గురయ్యారు. తదనంతరం బీజేపీ ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా గుజరాత్‌ హోం మంత్రి అయ్యారు. సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో అడ్డంగా దొరికిపోయిన అమిత్‌ షాను సీబీఐ అరెస్ట్‌ చేసి మూడు నెలల పాటు జైలులో పెట్టింది. ఈ దశలోనే తన మనసులోని మరో ప్లాన్‌ అమలుకు నరేంద్ర మోదీ పూనుకున్నారు. అదే ‘గుజరాత్‌ వెలిగిపోతోంది’ అనే నినాదం.  ముస్లింలు మినహా మిగతా వర్గాలన్నీ ఇతర రాష్ర్టాలకు చెందినవారి వద్ద నరేంద్ర మోదీ పాలనను అదే పనిగా పొగడటం మొదలయ్యింది. అదే సమయంలో మోదీ తరఫున కొంతమంది పూనుకుని దేశంలోని వివిధ పత్రికలలో ‘అచ్చే గుజరాత్‌’ అంటూ కథనాలు ప్రచురింపజేశారు. ఇంకేముంది గుజరాత్‌ను భూతల స్వర్గంగా మార్చేసిన నరేంద్ర మోదీ దేశ ప్రధాని అయితే దేశం కూడా వెలిగిపోతుందని దేశ ప్రజలు భావించడం మొదలయ్యింది. ఇలా ప్రతి దశలోనూ నరేంద్ర మోదీ ఒక వ్యూహం ప్రకారం పావులు కదుపుతూ ముందుకు సాగారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ ఎలా ఉండేవారని అప్పట్లో అక్కడ పనిచేసిన ఒక ఐఏఎస్‌ అధికారిని ప్రశ్నించగా, ‘‘మోదీ ఎంతో తెలివైనవాడు. తనకు ఏమి కావాలో ఆయన ఎప్పుడూ తన నోటితో చెప్పరు. కాగితంపై పెట్టరు. ఆయన తరఫున ఆయనకు నమ్మకమైన వ్యక్తి లేదా వ్యక్తులు మాత్రమే వ్యవహారాలు చక్కదిద్దుతారు. ఆదేశాలు ఇస్తూ ఉంటారు. అప్పుడూ ఇప్పుడూ మోదీ ఎక్కువగా నమ్ముతున్న వ్యక్తి అమిత్‌ షా ఒక్కరే! మోదీకి షా అత్యంత విశ్వాసపాత్రుడు’’ అని వివరించారు. మోదీ ఓకే.. మరి దేశం?ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం. పొందాలనుకున్న ప్రధానమంత్రి పదవి పొందడంతో సంతృప్తి చెందని మోదీ తన మేధస్సుకు మళ్లీ పదునుపెట్టారు. గుజరాతీయుల మనస్సుల్లో తిష్ట వేసినట్టుగా, దేశ ప్రజల గుండెల్లో కూడా కొలువు తీరాలంటే ఏమి చేయాలని ఆలోచించడం మొదలుపెట్టారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి స్వచ్ఛ భారత్‌, మేకిన్‌ ఇండియా వంటి ఎన్నో నినాదాలను జనం మీదకు వదిలినా అవేమీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మోదీ మార్క్‌ పాలనను చూపించలేకపోయారు. ఈ తరుణంలోనే ముస్లింల పట్ల గుజరాత్‌లోని హిందువులలో గూడుకట్టుకున్న ఆగ్రహావేశాలను పసిగట్టినట్టుగానే అవినీతి విషయంలో దేశ ప్రజలలో నెలకొన్న ఏహ్యభావాన్ని గమనించారు. అదే సమయంలో ధనవంతులపై పేదలకు సహజంగా ఉండే వ్యతిరేకభావం గురించి కూడా మోదీకి తెలుసు.  అవినీతిని అరికట్టడం పేరిట దేశవ్యాప్తంగా అధికారులు, మంత్రులపై దాడులు చేయిస్తే ప్రభుత్వ యంత్రాంగం వ్యతిరేకంగా మారుతుంది. దానివల్ల మొదటికే మోసం వస్తుంది. గతంలో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఒక మంత్రి, ఒకరిద్దరు ఐఏఎస్‌ అధికారులపై అవినీతి నిరోధక శాఖ అధికారులతో దాడులు చేయించారు. దానివల్ల లాభం కలగకపోగా నష్టం జరిగింది. తమ వాళ్లనే సస్పెండ్‌ చేస్తారా? అంటూ ఐఏఎస్‌ అధికారుల సంఘం అప్పట్లో ఎన్టీఆర్‌పై బహిరంగ విమర్శలకు పూనుకుంది. ఫలితంగా ఎన్టీఆర్‌ వంటి దృఢచిత్తం ఉన్న వ్యక్తి కూడా వెనకడుగు వేశారు. బహుశా ఇలాంటి అనుభవాలను తెలుసుకున్న నరేంద్ర మోదీ అవినీతిపై నేరుగా దాడికి ప్రయత్నించలేదు. అయితే అవినీతి, నల్లకుబేరులపై సామాన్య ప్రజలలో ఉన్న వ్యతిరేకభావాన్ని అస్త్రంగా చేసుకుని దేశ ప్రజల మనస్సులు కొల్లగొట్టడం ఎలా? అని ఆలోచించి పెద్దనోట్ల రద్దు అనే మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు పూనుకుని ఉంటారు. ఇంకేముంది ఆయన అనుకున్నది జరిగిపోయింది. ఆపరేషన్‌ సక్సెస్‌ బట్‌ పేషెంట్‌ డెడ్‌ అన్నట్టుగా నరేంద్ర మోదీ లక్ష్యం నెరవేరింది గానీ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. ప్రజల భావోద్వేగాలను ఒడిసి పట్టగలిగినవాడే సక్సెస్‌ఫుల్‌ రాజకీయ నాయకుడిగా వెలుగొందుతారు.  తెలంగాణలో కూడా ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని గమనించిన కేసీఆర్‌, తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట సొంత పార్టీని ఏర్పాటుచేసుకుని తెలంగాణ ప్రజలలో నిద్రాణమైన సెంటిమెంట్‌ను రాజేయగలిగారు. ఈ క్రమంలో కేసీఆర్‌ కూడా ఎంతోమందిని వాడుకున్నారు. తర్వాతి క్రమంలో వారంతా కనుమరుగయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఇదే పంథాను ఎన్నుకున్నారు. ట్రంప్‌ వంటి వాచాలుడు అమెరికా అధ్యక్షుడు అవ్వడం ఏమిటి? అని అక్కడి మేధావులు కూడా ఈసడించుకున్నారు. సగటు ప్రజల ఆలోచనలకు మేధావుల ఆలోచనలకు ఎప్పుడూ లంకె కుదరదు. అందుకే ఎగతాళికి గురైన ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడై కూర్చున్నారు. నరేంద్ర మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించినప్పుడు గుజరాత్‌ పరిణామాలను కళ్లతో చూసిన కొంతమంది మేధావులు మోదీ ప్రధానమంత్రి అయితే ‘భారతదేశంలోనే ఉండం’ అని ప్రకటనలు కూడా చేశారు. చివరకు ఏమైంది? భారతీయ జనతా పార్టీ చరిత్రలో కనీవినీ ఎరుగని మెజారిటీని నరేంద్ర మోదీ సాధించిపెట్టారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆయన పలుకుబడి అమాంతం పెరిగిపోయింది. మోదీ లక్ష్యం నెరవేరింది. ప్రస్తుతం ఆయనను అందుకోగల నాయకుడెవ్వరూ దరిదాపుల్లో లేరు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఇప్పుడు మోదీ వెలిగిపోతున్నారు. మరి దేశం కూడా వెలిగిపోతుందా? అంటే ఎవరికి వారు తెలియదు అనే సమాధానం చెబుతున్నారు. 86 శాతం చలామణిలో ఉన్న కరెన్సీని రద్దు చేయడమే కాకుండా తత్సమానమైన కరెన్సీని అందుబాటులో లేకుండా చేయడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి. ప్రజలు బ్యాంకులలో డిపాజిట్‌ చేసుకున్న డబ్బును కూడా వారు విత్‌డ్రా చేసుకోకుండా ఆంక్షలు విధించడం కూడా ఇదే మొదటిసారి.  95 శాతం నగదు లావాదేవీలు జరిగే దేశంలో నగదురహిత లావాదేవీలు అమలు చేయాలనుకోవడం కూడా ఇదే ప్రథమం. నగదురహిత లావాదేవీలు 90 శాతానికి పైగా ఉన్న దేశాలలో కూడా నల్లధనం ఉంటూనే ఉంది. నల్లధనం అంటూ లేని దేశం ఒక్కటి కూడా లేదని రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌గా పనిచేసిన డాక్టర్‌ వై.వేణుగోపాల్ రెడ్డి వంటి వారు కూడా చెబుతున్నారు. అయితే ఇంతకు ముందే పేర్కొన్నట్టు మేధావుల అభిప్రాయాలకు, సామాన్య ప్రజలకు సంబంధం ఉండదు. ప్రధాని మోదీ నిర్ణయం వల్ల తమకు ఏదో మేలు జరుగుతుందని మెజారిటీ ప్రజలు ఇంకా నమ్ముతున్నారు. వారి నమ్మకం సజీవంగా ఉన్నంతకాలం జనాదరణ విషయంలో నరేంద్ర మోదీకి తిరుగు ఉండకపోవచ్చు. గుజరాత్‌ను సుదీర్ఘకాలం ఏలినట్టుగానే దేశాన్ని కూడా తన ఏలుబడిలోనే ఉంచుకునే అవకాశం ఉంది. అయితే ఆర్థికవేత్తలు సందేహపడుతున్నట్టుగా నోట్ల రద్దు నిర్ణయం వల్ల ప్రతికూల ఫలితాలు మొదలై మంచి జరగకపోతే మాత్రం మోదీ మూల్యం చెల్లించుకుంటారు. విషాదం ఏమిటంటే ఆయన కంటే ముందు మన దేశం భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. అప్పుడు జరిగినదానికి బాధ్యత నాదే అని మోదీ ఒప్పుకొన్నా జరిగిపోయిన నష్టాన్ని పూడ్చలేం. ఏమి జరుగుతుందో చూద్దాం! యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసంhttp://www.youtube.com/abntelugutvయూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసంhttp://www.youtube.com/abntelugutv
editorial
7,075
29-05-2017 14:59:46
ఆ సినిమాతో ‘డీజే’కు పోలికలు?
స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం హరీష్‌ శంకర్‌ దర్వకత్వంలో ‘దువ్వాడ జగన్నాథమ్‌’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌, టీజర్‌ ఇంటర్నెట్‌లో ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయో తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి ఓ గ్యాసిప్‌ వైరల్‌గా ప్రచారం అవుతోంది. తమిళ అగ్రదర్శకుడు శంకర్‌ గతంలో అర్జున్‌తో తీసిన ‘జెంటిల్మన్‌’ స్ఫూర్తితో హరీష్‌శంకర్‌ ‘డీజే’ కథ రాసుకున్నాడన్నది ఆ గ్యాసిప్‌. ఆ సినిమాలో వంట బ్రాహ్మణుడిగా కనిపించే అర్జున్‌.. దొంగతనాలు చేస్తుంటాడు. ‘రాబిన్‌హుడ్‌’ తరహాలో పెద్దలను దోచుకుని పేదలను చదివిస్తుంటాడు. ఇప్పుడు ‘డీజే’ కూడా దాదాపు అదే కథాంశంతో తెరకెక్కుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బ్రాహ్మణ యువకుడిగా కనిపించే అల్లు అర్జున్‌ క్యాటరింగ్‌ చేస్తుంటాడు. అయితే సినిమా సెకెండాఫ్‌లో రాబిన్‌ హుడ్‌లా మారతాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఫస్టాఫ్‌లో అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ ఉంటుందట. సెకెండాఫ్‌లో మాత్రం ఎక్కువగా యాక్షన్‌ సీన్స్‌ ఉంటాయట. అసలు ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
entertainment
8,926
01-06-2017 11:50:47
‘మహానటి’ టీమ్‌ చాలా సంతోషంగా ఉందట!
కీర్తిసురేష్‌, సమంత ప్రధాన పాత్రధారులుగా, మహానటి సావిత్రి జీవితకథ ఆధారంగా ‘మహానటి’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సావిత్రి పాత్రధారి అయిన కీర్తి సురేష్‌ స్టిల్స్‌ కొన్ని ఇంటర్నెట్‌లోకి లీక్‌ అయ్యాయి. సావిత్రి గెటప్‌లో తీయించుకున్న ఫోటోలను తన ప్రెండ్స్‌కు పంపిందట కీర్తి సురేష్‌. ఆ క్రమంలోనే ఈ ఫోటోలు బయటకు వచ్చేశాయని సమాచారం. నిజానికి ఈ సినిమాలోని కీర్తి సురేష్‌ లుక్‌ను చివరి వరకు సీక్రెట్‌గా ఉంచాలని భావించింది చిత్ర యూనిట్‌. అయితే అనుకోని విధంగా ఇలా బయటకు వచ్చేయడం పట్ల డైరెక్టర్‌ నాగ్‌అశ్విన్‌ సీరియస్‌గా ఉన్నాడట. అయితే ఈ ఫోటోల పట్ల నెటిజన్లు చూపిస్తున్న ఆసక్తి మాత్రం చిత్ర బృందానికి సంతోషం కలిగిస్తోందట. మహానటి సావిత్రి జీవితకథను తెలుసుకోవడానికి ఎంతోమంది ఆసక్తిగా ఉన్నారని ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్న ఈ ఫోటోలు నిరూపిస్తున్నాయి.
entertainment
6,818
15-09-2017 15:28:11
'జై లవ కుశ'లో బాహుబలి బ్యూటీ స్పెషల్ సాంగ్
తెలుగు ప్రేక్షకులు జై లవకుశ మూవీ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో.. ఆ సినిమాలో 5వ పాట కోసం కూడా అంతగానే ఎదురుచూస్తున్నారు. బాహుబలి బ్యూటీ తమన్నా ఈ స్పెషల్ సాంగ్‌కి స్టెప్పులేయడం ఒక ఎత్తైతే.. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సాంగ్ కోసం టైమ్ వెచ్చించి మరీ మ్యూజిక్ అందించడం ప్రేక్షకుల్లో చాలా క్రేజ్ తీసుకొచ్చింది. ఇవాళ ఈ పాట అప్డేట్‌ను రిలీజ్ చేశారు. స్వింగ్ జరా అంటూ సాగే ఈ పాట సినిమాకే హైలెట్‌ అని చిత్ర బృందం చెబుతోంది. తమన్నా తన ట్విట్టర్ ద్వారా ఈ సాంగ్‌కు సంబంధించిన సమాచారాన్ని రివీల్ చేశారు.  ఈ స్పెషల్ సాంగ్‌కు తనను సెలక్ట్ చేసినందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ బాబీ, దేవిశ్రీకి కృతజ్ఞతలు తెలిపారు. దేవిశ్రీ కూడా "యు రాక్‌డ్ ద సాంగ్ తమన్నా.. ప్రేక్షకులు ఎన్టీఆర్, నీ డ్యాన్స్‌ని చాలా ఇష్టపడతారు." అని ట్వీట్ చేశారు. ఇక బాబీ కూడా ఈ తమన్నా ట్వీట్‌పై స్పందించారు. "ఈ స్పెషల్ సాంగ్‌ని మరింత స్పెషల్ చేసినందుకు థాంక్యూ తమన్నా" అంటూ బాబీ ట్వీట్ చేశారు. ఈ సాంగ్‌కి సంబంధించిన వీడియో ప్రివ్యూ చిత్ర బృందం ఈరోజు సాయంత్రం 5:40కి రిలీజ్ చేయనుంది.
entertainment
17,501
23-03-2017 03:20:52
బాధితుడి ట్వీట్‌..స్పందించిన సీఎం యోగి
కాన్పూర్‌, మార్చి 22: పోలీసులు పట్టించుకోకపోయినా యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ పట్టించుకున్నారు. కాన్పూర్‌లోని కల్యాణ్‌పూర్‌ ప్రాంతంలో నివాసమంటున్న బుద్ధ గౌతమ్‌ ఇటీవల హోలీ సంబరాల్లో పాల్గొనేందుకు నిరాకరించాడు. దీంతో చుట్టుపక్కలవారంతా గౌతమ్‌ కుటుంబ సభ్యులందరినీ కొట్టారు. స్థానిక పోలీసులు పట్టించుకోలేదు. తనకు జరిగిన అన్యాయాన్ని సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యనాథ్‌కు గౌతమ్‌ ట్వీట్‌ చేశాడు. ఆ ట్వీట్‌కు స్పందించిన ఆయన.. బాధితుడికి న్యాయం చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. ఆగమేఘాలమీద పోలీసులు గౌతం ఇంటికి చేరుకుని అతడు ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసుకున్నారు.
nation
19,607
16-08-2017 02:13:17
కుల్దీప్‌పై దూరదృష్టితో..!
పల్లెకెలె: భవిష్యత్‌ ఆశాకిరణం చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ విషయంలో ప్రణాళికా బద్ధంగా వ్యవహరిం చాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌లోని కీలక వ్యక్తులు భావిస్తున్నారు. అశ్విన్‌, రవీంద్ర జడేజా కౌంటీలకు ఆడనున్న నేపథ్యంలో.. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌లో కుల్దీప్‌ స్పిన్‌ విభాగా నికి ప్రాతినిధ్యం వహించనున్నాడు. 2019 వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకు ని కెప్టెన్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి, చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ లు యువ స్పిన్నర్‌ కుల్దీప్‌ను ఎంతో జాగ్రత్తగా పరిరక్షించుకోవాలనుకుం టున్నారు. ‘స్వల్ప, దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టిసారించాం. స్వదేశంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో వన్డే సిరీస్‌లు ఆడాల్సి ఉంది. అంతేకాకుండా 2019 వరల్డ్‌కప్‌ టీమ్‌ను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంద’ని ప్రసాద్‌ మంగళవారమిక్కడ మీడియాతో చెప్పాడు. ‘వెస్టిండీస్‌ టూర్‌ సందర్భంగానే అవకాశాలను పరిశీలించాలనుకున్నాం. కానీ చాంపియ న్స్‌ ట్రోఫీ తర్వాత పెద్దగా సమయం లేకపోవడంతో అది సాధ్యంకాలేదు. ఇంగ్లండ్‌లో ఆడిన జట్టునే విండీస్‌కూ పంపామ’ని ఎమ్మెస్కే తెలిపాడు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా సిరీస్‌తో మొదలుకుని ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా పర్యటనల్లో భారత్‌ కఠిన సవాళ్లను ఎదుర్కోనుంది. దీంతో అన్ని ఫార్మాట్లకూ టీమ్‌ను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రసాద్‌ చెప్పాడు.
sports
1,254
20-11-2017 23:38:16
డిసెంబరు 4 నుంచి మాల్యాపై విచారణ
 భారత్‌లో ప్రాణ హాని ఉందన్న లిక్కర్‌ కింగ్‌లండన్‌: లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా అప్పగింత కేసు డిసెంబరు 4 నుంచి లండన్‌ కోర్టులో మళ్లీ విచారణకురానుంది. ఎనిమిది రోజుల పాటు ఈ విచారణ జరగనుంది. డిసెంబరు 8న కోర్టుకు సెలవుకావడంతో 14 వరకు ఈ విచారణ జరుగుతుందని భావిస్తున్నారు. ఈ కేసు ప్రీ ట్రయల్‌ హియరింగ్‌ కోసం మాల్యా సోమవారం లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాల్యా భారత్‌లో తనకు ప్రాణ హాని ఉందని మెజిస్ట్రేట్‌కు చెప్పినట్టు సమాచారం. తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. తానేమీ తప్పు చేయలేదన్నారు. తప్పు చేసినట్టు సాక్ష్యాలు ఏమైనా ఉంటే కోర్టే ఆ విషయం తేలుస్తుందన్నారు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ పేరుతో భారతీయ బ్యాంకులకు రూ.9,000 కోట్ల వరకు టోపి పెట్టిన మాల్యా గత ఏడాది మార్చి నుంచి బ్రిటన్‌లో తలదాచుకుంటున్నారు. అధికారుల కళ్లు గప్పి దేశం విడిచి పెట్టిన మాల్యాను అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బ్రిటన్‌ను కోరింది. అక్రమ నగదు లావాదేవీల చట్టం కింద నమోదు చేసిన సాక్ష్యాలతోపాటు ఇటీవల మరిన్ని సాక్ష్యాలూ సమర్పించింది. ఈ సాక్ష్యాల ఆధారంగా బ్రిటిష్‌ క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌ (సిపిఎస్‌) మాల్యాను భారత్‌కు అప్పగించాలని కోర్టులో వాదించనుంది.
business
21,093
27-11-2017 01:32:19
కోహ్లీకి విశ్రాంతి!
స్థానం కోసం బుమ్రా, కుల్దీప్‌ మధ్య పోటీనాగ్‌పూర్‌: శ్రీలంకతో జరుగుతున్న ప్రస్తుత పోరులో కోహ్లీకి విశ్రాంతి కల్పించాలని సెలెక్టర్లు సంకల్పించారు. కాగా సోమవారం దక్షిణాఫ్రికా టూర్‌కు జట్టును ఎంపిక చేయనున్న నేపథ్యంలో అదనపు బౌలర్‌ స్థానంకోసం యార్కర్ల స్పెషలిస్ట్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, చైనామన్‌ కుల్దీప్‌ యాదవ్‌ల మధ్య పోటీ నెలకొన్నది. సోమవారం ఇక్కడ సమావేశం కానున్న సెలెక్టర్ల బృందం మొత్తం నాలుగు జట్లను ప్రకటించనున్నది. శ్రీలంకతో న్యూఢిల్లీలో డిసెంబర్‌ 2నుంచి ఆరంభం కానున్న మూడో టెస్ట్‌కు, అనంతరం జరిగే వన్డేలు, టీ-20లకు జట్లతోపాటు కీలకమైన దక్షిణాఫ్రికా సిరీస్‌కు జట్టును ప్రకటించనున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌ నుంచి విరామమెరుగక క్రికెట్‌ ఆడుతున్న కోహ్లీ విశ్రాంతి కోరుకుంటుండడంతో శ్రీలంకతో జరిగే వన్డేలకు, టీ-20లలో అతనికి విశ్రాంతి కల్పించడం దాదాపు ఖాయమైంది. అతని స్థానంలో రోహిత్‌ శర్మ సారథ్య బాధ్యతలు స్వీకరిస్తాడు. ఒకవేళ మూడో టెస్టునుంచికూడా కోహ్లీ విశ్రాంతి కోరుకుంటే అతని స్థానంలో అజింక్యా రహానె నాయకత్వం వహి స్తాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు జట్టు ఎంపికే సెలెక్టర్ల ముందున్న పెద్ద బాధ్యత. దక్షిణాఫ్రికా పరిస్థితులలో రాణించే 17మంది సభ్యుల జట్టును ఎంపిక చేయనున్నారు. నలుగురు పేసర్లు, ముగ్గురు స్పెష లిస్ట్‌ స్పిన్నర్లతో జట్టును ఎంపిక చేయాలా? లేకుంటే ఐదుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లను ఎంపిక చేయాలా? అన్నది సెలెక్టర్ల ముందున్న సమస్య. భువనేశ్వర్‌ కుమార్‌, షమి, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌లకు జట్టులో స్థానం ఖాయం. ఐదో పేసర్‌గా బుమ్రా పోటీలో ఉన్నాడు. ఢిల్లీకి చెందిన నవదీప్‌ సయాని కూడా సెలెక్టర్ల దృష్టిలో ఉన్నాడు. ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న హార్డిక్‌ పాండ్యా అయిదో పేసర్‌ స్ధానాన్ని భర్తీ చేస్తే ఒక స్పిన్నర్‌ను అదనంగా తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు అశ్విన్‌, రవీంద్ర జడేజాలకు అండగా కుల్దీప్‌, యజ్వేంద్ర చాహల్‌లలో ఒకరికి అవకాశం దక్కుతుంది. వికెట్‌ కీపర్‌గా సాహా, రిజర్వ్‌ కీపర్‌గా పార్ధివ్‌ పటేల్‌ ఎంపిక ఖాయం. శ్రీలంకతో వన్డేలకోసం మనీష్‌ పాండే, శ్రేయాస్‌ అయ్యర్‌లు జట్టులో స్థానం పొందే అవకాశాలున్నాయి. కాగా హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ టీ-20 జట్టులో స్థానం నిలబెట్టుకోవచ్చు. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా బాసిల్‌ థంపి, వాషింగ్టన్‌ సుందర్‌లను ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయంలో జట్టును ప్రకటించే అవకాశాలున్నాయి.
sports
4,331
13-05-2017 01:31:01
ఇదేనా దళిత సంక్షేమం?
ఈ మూడేండ్ల కాలంలో ఎస్సీ/ఎస్టీ అత్యాచారాల నిరోధకనేరాల కింద మొత్తం 5210 కేసులు నమోదు అయితే డీజీపీ 5,001 మాత్రమే చూపించడం జరిగింది. డీజీపీ స్థాయిలో ప్రధాన బాధ్యతలో ఉన్న అధికారిగా నేరాలను అరికట్టాల్సిన బాధ్యతను విస్మరించి కాకి లెక్కలు చెప్తూ దళిత సమాజాన్ని మోసం చేశారు. తప్పుడు సమాచారం వెల్లడించిన రాష్ట్ర డీజీపీని తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని దళిత సమాజం కోరుతున్నది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దళితుల బ్రతుకులు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. దళిత సంక్షేమమే ప్రదాన ఎజెండాగా పని చేయవలసిన తొలి తెలంగాణ ప్రభుత్వం ఆ కర్తవ్యాన్ని విస్మరించి దళితుల పట్ల సామాజిక వివక్షను, రాజకీయ అణచివేతను, భౌతికపరమైన హింసను, అహంకారపూరితమైన దౌర్జన్యాలను కొనసాగిస్తున్నది. ముఖ్యంగా ఆర్మూర్‌, మంథని, కమలాపూర్‌, సారంగాపూర్‌, ములుగు ప్రాంతాల్లో దళితులపై భయంకరమైన హత్యలు జరిగాయి. తెలంగాణ ఏర్పడిన ఈ మూడేండ్ల కాలంలోనే ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద 5,120 కేసులు నమోదయ్యాయి. ఇంకా రాజకీయ ఒత్తిళ్ళు, పోలీసుల వైఖరి, అధికార పార్టీ ప్రలోభాల వలన వెలుగులోకి రాని సంఘటనలు అనేకం ఉన్నాయి. కాగా! ఈ నేరాలకు సంబంధించి అధికారికంగా నమోదైన వార్షిక వివరాలతో కూడిన ఒక నివేదికను డీజీపీ అనురాగ్‌శర్మ విడుదల చేశారు. ఇవే వివరాలను కోరుతూ ఎంఆర్‌పీఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగ సమాచార హక్కు చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికను తీసుకున్నారు. అయితే ఈ రెండు నివేదికలలోని నేరాల సంఖ్యల్లో భారీ వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయి. వాస్తవాలను కనుమరుగు చేస్తూ డీజీపీ తన నివేదికలో నేరాల సంఖ్యను తగ్గించి చూపెట్టారు. నేరాలను తగ్గించడం అంటే నేరాల సంఖ్యను తగ్గించడం కాదు కదా! తప్పుడు వివరాలు వెల్లడించిన విషయాన్ని సమాచార హక్కు చట్టంతో సేకరించిన నివేదిక ద్వారా మందకృష్ణ మాదిగ ప్రభుత్వం, ప్రతిపక్షాల దృష్టికి తీసుకెళ్ళారు. డీజీపీ వెల్లడించిన నివేదికకూ, రాష్ట్ర ప్రభుత్వ సమాచార హక్కు చట్టం ద్వారా ఇచ్చిన నివేదికకూ మధ్య వ్యత్యాసాలను ఒకసారి పరిశీలిద్దాం. డీజీపీ నివేదిక ప్రకారం గత మూడు సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా జరిగిన నేరాల వివరాలు ఇలా ఉన్నాయి. 2014లో హత్యలు 22, అత్యాచారాలు 117, గాయపరచడం 124, గృహదహనం 1, ఇతర ఐపీసీ 603, పీసీఆర్ యాక్ట్ 3, ఎస్సీ/ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులు 354 ఉన్నాయి; అలాగే 2015లో హత్యలు 28, అత్యాచారాలు 147, గాయపరచడం 155, గృహదహనం 4, ఇతర ఐపీసీ 651, పీసీఆర్ యాక్ట్ 1, ఎస్సీ/ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులు 393 ఉన్నాయి; ఇక 2016లో హత్యలు 36, అత్యాచారాలు 169, గాయపరచడం 162, గృహదహనం 2, ఇతర ఐపీసీ 670, పీసీఆర్ యాక్ట్ 1, ఎస్సీ/ అస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులు 358 ఉన్నాయి. వీటి మొత్తం చూస్తే: 2014లో 1224, 2015లో 1379, 2016లో 1398 నేరాలు ఉన్నాయి. ఇప్పుడు దీనికి భిన్నంగా సమాచార హక్కు చట్టం నివేదిక ప్రకారం ఎస్సీ/ ఎస్టీ వ్యతిరేక నేరాల వివరాలను చూద్దాం: 2014లో హత్యలు 39, అత్యాచారాలు 133, గాయపరచడం 180, గృహదహనం 1, ఇతర ఐపీసీ 680, పీసీఆర్ యాక్ట్ 2, ఎస్సీ/ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులు 582 ఉన్నాయి; అలాగే 2015లో హత్యలు 39, అత్యాచారాలు 163, గాయపరచడం 172, గృహదహనం 1, ఇతర ఐపీసీ 748, పీసీఆర్ యాక్ట్ 0, ఎస్సీ/ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులు 530 ఉన్నాయి; ఇక 2016లో హత్యలు 42, అత్యాచారాలు 206, గాయపరచడం 216, గృహదహనం 2, ఇతర ఐపీసీ 958, పీసీఆర్ యాక్ట్ 0, ఎస్సీ/ అస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులు 480 ఉన్నాయి. వీటి మొత్తం చూస్తే: 2014లో 1617, 2015లో 1689, 2016లో 1904 నేరాలు ఉన్నాయి. పై వివరాల ప్రకారం 2014లో 39, 2015లో 39, 2016 లో 42గా మొత్తం 120 దళిత హత్యలు జరిగితే, డీజీపీ మాత్రం తన నివేదికలో 2014లో 22, 2015లో 28, 2016లో 36, మొత్తం 86హత్యలు మాత్రమే చూపెట్టారు. ఇందులో దాదాపు 34 హత్యలను కనుమరుగు చేయడం జరిగింది. ఇదే మాదిరిగా మిగతా నేరాలలోని వ్యత్యాసాలను కూడా గమనించవచ్చు. ఈ మూడేండ్ల కాలంలో ఎస్సీ/ఎస్టీ అత్యాచారాల నిరోధక నేరాల కింద మొత్తం 5210 కేసులు నమోదు అయితే డీజీపీ 5,001 మాత్రమే చూపించడం జరిగింది. డీజీపీ స్థాయిలో ప్రధాన బాధ్యతలో ఉన్న అధికారిగా జరుగుతున్న నేరాలను అరికట్టాల్సిన బాధ్యతను విస్మరించి కాకి లెక్కలు చెప్తూ దళిత సమాజాన్ని మోసం చేశారు. తప్పుడు సమాచారం వెల్లడించిన రాష్ట్ర డీజీపీని తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని దళిత సమాజం కోరుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజే దళిత సమాజం అన్యాయానికి, మోసానికి బలైంది. తెలంగాణ ఉద్యమం జరిగినన్ని రోజులు తొలి ముఖ్యమంత్రి దళితుడే అని హామీలతో నమ్మించి, తీరా రాష్ట్రం ఏర్పడగానే మాట తప్పి దళిత జాతిని మోసం చేయడం జరిగింది. కేసీఆర్ మోసాన్ని పసి గట్టిన మందకృష్ణ మాదిగ రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు నిరసన ఆందోళనకు దిగితే గత్యంతరం లేక డాక్టర్‌ రాజయ్యను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. తర్వాత ఆరు నెలలు కూడా గడవక ముందే ఏ కారణం చెప్పకుండా, ఎలాంటి ఆధారం చూపకుండా రాజయ్యను అవమానకరంగా బర్తరఫ్‌ చేసి దళితుల ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టారు. మంత్రివర్గంలో మాదిగలకు, మాలలకు స్థానం కల్పించకుండా అన్యాయం చేశారు. బహుశా! దళితుల్లో రెండు బలమైన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లేని ఏకైక మంత్రివర్గం ఇదే కావచ్చు. షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ది శాఖను సంప్రదాయానికి విరుద్ధంగా అగ్రకులానికి చెందిన మంత్రి చేతిలో పెట్టారు. బీసీ, ఎస్టీ, మైనార్టీ అభివృద్ధి శాఖలను ఆయా సామాజిక వర్గాల మంత్రులకు కేటాయించి, ఒక్క దళిత అభివృద్ధి శాఖను మాత్రమే అగ్రకులానికి చెందిన మంత్రికి కేటాయించి దళితులకు కేసీఆర్ తీరని ద్రోహం చేశారు. వీటి నుంచి దళిత సమాజం తేరుకోకముందే రాష్ట్రంలో వరుసగా దాడులు, హత్యలు, అత్యాచారాలు విజృంభిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ళలోనే మహబూబ్‌నగర్‌ జిల్లా పాతపల్లిలో నూతనంగా పెళ్ళి చేసుకొని ఆంజనేయ స్వామి గుడిలోకి ప్రవేశించిన దళిత దంపతులపై దాడిచేసి దళితులను గ్రామ బహిష్కరణ చేశారు. మెదక్‌ జిల్లా సదాశివపేట మండలం ఎల్లారం గ్రామంలో దళిత ప్రజలను ఊర్లోకి రాకుండా కంచెను అడ్డంగా వేసి సాంఘిక బహిష్కరణ చేశారు.  నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డిలోని దళితులకు సంబంధించిన 150 ఎకరాల భూమిని ఎమ్మెల్యే దర్జాగా కబ్జాచేసుకోవడం, ఆర్మూర్‌లో దళిత నాయకుడు తలారి సత్యం హత్య, అదిలాబాద్‌ జిల్లా సారంగపూర్‌ మండలం కేంద్రంలో దళిత యువతి శైలజను గ్యాంగ్‌ రేప్‌ చేసి చంపేయడం, వరంగల్‌ జిల్లా ములుగులో గిరిజన విద్యార్థినులైన ప్రియాంక, భూమికలను కిరాతకంగా నరికి చంపడం, కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరులో దళిత యువతిపై గ్యాంగ్‌ రేప్‌, పెద్దపల్లిలో పంట చేనుకు నీరు పెడుతున్న దళిత కుటుంబాన్ని పోలీసులే అసభ్య పదజాలంతో దూషించి స్టేషన్‌కు తీసుకెళ్ళి దారుణంగా కొట్టడం, మంథనిలో మధుకర్‌ హత్య, కమలాపూర్‌లో రాజేష్‌ హత్య, నిజామాబాద్‌లో ఇజ్రాయేల్‌ హత్య ఇలా వరుసగా జరుగుతున్న దారుణ సంఘటనలతో త్యాగాల తెలంగాణ నేలకు దళితుల రక్తతర్పణం నిత్యం జరుగుతూనే ఉంది. ఈ దారుణమైన నేరాలలో మెజారిటీ నిందితులుగా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులే ఉన్నారనేది జగమెరిగిన సత్యం. వారిని ప్రభుత్వమే శిక్షించకుండా కాపాడుతున్నదనేది కూడా బహిరంగ సత్యమే. తెలంగాణలోని నేటి పోలీస్‌ స్టేషన్‌లు ‘‘ఆధునిక గడీలు’’. అక్కడికి వెళ్ళిన బాధితులు పోలీసులు చెప్పినట్లే ఫిర్యాదులు రాయాలి, కేసులు పెట్టాలి, అవసరమైతే తిరిగి తీసుకోవాలి. లేదంటే బెదిరింపులు తప్పవు. ఇకనైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన విధానాలు మార్చుకొని దళితులపై జరుగుతున్న సంఘటనల మీద స్పందించాలి. దళితులపై జరుగుతున్న అనాగరిక దాడులను అరికట్టటానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. లేదంటే దళిత సమాజానికి, కేసీఆర్ ప్రభుత్వానికి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడటం ఖాయం.గోవిందు నరేష్‌ మాదిగఎం.ఎస్‌.ఎఫ్‌. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  తెలంగాణ ఏర్పడిన ఈ మూడేండ్ల కాలంలోనే ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద 5,120 కేసులు నమోదయ్యాయి. ఇంకా రాజకీయ ఒత్తిళ్ళు, పోలీసుల వైఖరి, అధికార పార్టీ ప్రలోభాల వలన వెలుగులోకి రాని సంఘటనలు అనేకం ఉన్నాయి. కాగా! ఈ నేరాలకు సంబంధించి అధికారికంగా నమోదైన వార్షిక వివరాలతో కూడిన ఒక నివేదికను డీజీపీ అనురాగ్‌శర్మ విడుదల చేశారు. ఇవే వివరాలను కోరుతూ ఎంఆర్‌పీఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగ సమాచార హక్కు చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికను తీసుకున్నారు. అయితే ఈ రెండు నివేదికలలోని నేరాల సంఖ్యల్లో భారీ వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయి. వాస్తవాలను కనుమరుగు చేస్తూ డీజీపీ తన నివేదికలో నేరాల సంఖ్యను తగ్గించి చూపెట్టారు. నేరాలను తగ్గించడం అంటే నేరాల సంఖ్యను తగ్గించడం కాదు కదా! తప్పుడు వివరాలు వెల్లడించిన విషయాన్ని సమాచార హక్కు చట్టంతో సేకరించిన నివేదిక ద్వారా మందకృష్ణ మాదిగ ప్రభుత్వం, ప్రతిపక్షాల దృష్టికి తీసుకెళ్ళారు. డీజీపీ వెల్లడించిన నివేదికకూ, రాష్ట్ర ప్రభుత్వ సమాచార హక్కు చట్టం ద్వారా ఇచ్చిన నివేదికకూ మధ్య వ్యత్యాసాలను ఒకసారి పరిశీలిద్దాం. డీజీపీ నివేదిక ప్రకారం గత మూడు సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా జరిగిన నేరాల వివరాలు ఇలా ఉన్నాయి. 2014లో హత్యలు 22, అత్యాచారాలు 117, గాయపరచడం 124, గృహదహనం 1, ఇతర ఐపీసీ 603, పీసీఆర్ యాక్ట్ 3, ఎస్సీ/ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులు 354 ఉన్నాయి; అలాగే 2015లో హత్యలు 28, అత్యాచారాలు 147, గాయపరచడం 155, గృహదహనం 4, ఇతర ఐపీసీ 651, పీసీఆర్ యాక్ట్ 1, ఎస్సీ/ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులు 393 ఉన్నాయి; ఇక 2016లో హత్యలు 36, అత్యాచారాలు 169, గాయపరచడం 162, గృహదహనం 2, ఇతర ఐపీసీ 670, పీసీఆర్ యాక్ట్ 1, ఎస్సీ/ అస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులు 358 ఉన్నాయి. వీటి మొత్తం చూస్తే: 2014లో 1224, 2015లో 1379, 2016లో 1398 నేరాలు ఉన్నాయి. ఇప్పుడు దీనికి భిన్నంగా సమాచార హక్కు చట్టం నివేదిక ప్రకారం ఎస్సీ/ ఎస్టీ వ్యతిరేక నేరాల వివరాలను చూద్దాం: 2014లో హత్యలు 39, అత్యాచారాలు 133, గాయపరచడం 180, గృహదహనం 1, ఇతర ఐపీసీ 680, పీసీఆర్ యాక్ట్ 2, ఎస్సీ/ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులు 582 ఉన్నాయి; అలాగే 2015లో హత్యలు 39, అత్యాచారాలు 163, గాయపరచడం 172, గృహదహనం 1, ఇతర ఐపీసీ 748, పీసీఆర్ యాక్ట్ 0, ఎస్సీ/ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులు 530 ఉన్నాయి; ఇక 2016లో హత్యలు 42, అత్యాచారాలు 206, గాయపరచడం 216, గృహదహనం 2, ఇతర ఐపీసీ 958, పీసీఆర్ యాక్ట్ 0, ఎస్సీ/ అస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులు 480 ఉన్నాయి. వీటి మొత్తం చూస్తే: 2014లో 1617, 2015లో 1689, 2016లో 1904 నేరాలు ఉన్నాయి. పై వివరాల ప్రకారం 2014లో 39, 2015లో 39, 2016 లో 42గా మొత్తం 120 దళిత హత్యలు జరిగితే, డీజీపీ మాత్రం తన నివేదికలో 2014లో 22, 2015లో 28, 2016లో 36, మొత్తం 86హత్యలు మాత్రమే చూపెట్టారు. ఇందులో దాదాపు 34 హత్యలను కనుమరుగు చేయడం జరిగింది. ఇదే మాదిరిగా మిగతా నేరాలలోని వ్యత్యాసాలను కూడా గమనించవచ్చు. ఈ మూడేండ్ల కాలంలో ఎస్సీ/ఎస్టీ అత్యాచారాల నిరోధక నేరాల కింద మొత్తం 5210 కేసులు నమోదు అయితే డీజీపీ 5,001 మాత్రమే చూపించడం జరిగింది. డీజీపీ స్థాయిలో ప్రధాన బాధ్యతలో ఉన్న అధికారిగా జరుగుతున్న నేరాలను అరికట్టాల్సిన బాధ్యతను విస్మరించి కాకి లెక్కలు చెప్తూ దళిత సమాజాన్ని మోసం చేశారు. తప్పుడు సమాచారం వెల్లడించిన రాష్ట్ర డీజీపీని తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని దళిత సమాజం కోరుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజే దళిత సమాజం అన్యాయానికి, మోసానికి బలైంది. తెలంగాణ ఉద్యమం జరిగినన్ని రోజులు తొలి ముఖ్యమంత్రి దళితుడే అని హామీలతో నమ్మించి, తీరా రాష్ట్రం ఏర్పడగానే మాట తప్పి దళిత జాతిని మోసం చేయడం జరిగింది. కేసీఆర్ మోసాన్ని పసి గట్టిన మందకృష్ణ మాదిగ రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు నిరసన ఆందోళనకు దిగితే గత్యంతరం లేక డాక్టర్‌ రాజయ్యను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. తర్వాత ఆరు నెలలు కూడా గడవక ముందే ఏ కారణం చెప్పకుండా, ఎలాంటి ఆధారం చూపకుండా రాజయ్యను అవమానకరంగా బర్తరఫ్‌ చేసి దళితుల ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టారు. మంత్రివర్గంలో మాదిగలకు, మాలలకు స్థానం కల్పించకుండా అన్యాయం చేశారు. బహుశా! దళితుల్లో రెండు బలమైన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లేని ఏకైక మంత్రివర్గం ఇదే కావచ్చు. షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ది శాఖను సంప్రదాయానికి విరుద్ధంగా అగ్రకులానికి చెందిన మంత్రి చేతిలో పెట్టారు. బీసీ, ఎస్టీ, మైనార్టీ అభివృద్ధి శాఖలను ఆయా సామాజిక వర్గాల మంత్రులకు కేటాయించి, ఒక్క దళిత అభివృద్ధి శాఖను మాత్రమే అగ్రకులానికి చెందిన మంత్రికి కేటాయించి దళితులకు కేసీఆర్ తీరని ద్రోహం చేశారు. వీటి నుంచి దళిత సమాజం తేరుకోకముందే రాష్ట్రంలో వరుసగా దాడులు, హత్యలు, అత్యాచారాలు విజృంభిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ళలోనే మహబూబ్‌నగర్‌ జిల్లా పాతపల్లిలో నూతనంగా పెళ్ళి చేసుకొని ఆంజనేయ స్వామి గుడిలోకి ప్రవేశించిన దళిత దంపతులపై దాడిచేసి దళితులను గ్రామ బహిష్కరణ చేశారు. మెదక్‌ జిల్లా సదాశివపేట మండలం ఎల్లారం గ్రామంలో దళిత ప్రజలను ఊర్లోకి రాకుండా కంచెను అడ్డంగా వేసి సాంఘిక బహిష్కరణ చేశారు.  నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డిలోని దళితులకు సంబంధించిన 150 ఎకరాల భూమిని ఎమ్మెల్యే దర్జాగా కబ్జాచేసుకోవడం, ఆర్మూర్‌లో దళిత నాయకుడు తలారి సత్యం హత్య, అదిలాబాద్‌ జిల్లా సారంగపూర్‌ మండలం కేంద్రంలో దళిత యువతి శైలజను గ్యాంగ్‌ రేప్‌ చేసి చంపేయడం, వరంగల్‌ జిల్లా ములుగులో గిరిజన విద్యార్థినులైన ప్రియాంక, భూమికలను కిరాతకంగా నరికి చంపడం, కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరులో దళిత యువతిపై గ్యాంగ్‌ రేప్‌, పెద్దపల్లిలో పంట చేనుకు నీరు పెడుతున్న దళిత కుటుంబాన్ని పోలీసులే అసభ్య పదజాలంతో దూషించి స్టేషన్‌కు తీసుకెళ్ళి దారుణంగా కొట్టడం, మంథనిలో మధుకర్‌ హత్య, కమలాపూర్‌లో రాజేష్‌ హత్య, నిజామాబాద్‌లో ఇజ్రాయేల్‌ హత్య ఇలా వరుసగా జరుగుతున్న దారుణ సంఘటనలతో త్యాగాల తెలంగాణ నేలకు దళితుల రక్తతర్పణం నిత్యం జరుగుతూనే ఉంది. ఈ దారుణమైన నేరాలలో మెజారిటీ నిందితులుగా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులే ఉన్నారనేది జగమెరిగిన సత్యం. వారిని ప్రభుత్వమే శిక్షించకుండా కాపాడుతున్నదనేది కూడా బహిరంగ సత్యమే. తెలంగాణలోని నేటి పోలీస్‌ స్టేషన్‌లు ‘‘ఆధునిక గడీలు’’. అక్కడికి వెళ్ళిన బాధితులు పోలీసులు చెప్పినట్లే ఫిర్యాదులు రాయాలి, కేసులు పెట్టాలి, అవసరమైతే తిరిగి తీసుకోవాలి. లేదంటే బెదిరింపులు తప్పవు. ఇకనైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన విధానాలు మార్చుకొని దళితులపై జరుగుతున్న సంఘటనల మీద స్పందించాలి. దళితులపై జరుగుతున్న అనాగరిక దాడులను అరికట్టటానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. లేదంటే దళిత సమాజానికి, కేసీఆర్ ప్రభుత్వానికి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడటం ఖాయం.గోవిందు నరేష్‌ మాదిగఎం.ఎస్‌.ఎఫ్‌. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
editorial
1,934
01-02-2017 04:00:16
ఓఎన్‌జిసి లాభంలో మూడింతల వృద్ధి
చమురు ధరలు గరిష్ఠ స్థాయిలకు చేరడంతో ఔన్‌జిసి నికర లాభం ఏకంగా మూడింతలు వృద్ధి చెంది 4,352 కోట్ల రూపాయలకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం 1,466 కోట్ల రూపాయలుగా ఉంది. క్యు3లో మొత్తం విక్రయాలు 9 శాతం పెరిగి 20,014 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. ఈ కాలంలో చమురు ఉత్పత్తి 1.9 శాతం క్షీణించి 64 లక్షల టన్నులకు చేరుకున్నప్పటికీ ఉత్పత్తి చేసిన ప్రతి బ్యారల్‌కు 51.80 డాలర్లను ఔన్‌జిసి ఆర్జించటం విశేషం. కాగా సహజ వాయువు ఉత్పత్తి మాత్రం 4.4 శాతం వృద్ధి చెంది 6.025 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లకు చేరుకుంది.
business
917
02-09-2017 13:37:33
ఎయిర్‌టెల్ వర్సెస్ జియో.. పోటా పోటీ ఆఫర్లు!
న్యూఢిల్లీ: డిజిటల్ లైఫ్‌కి డేటానే ప్రాణమంటూ దూసుకొచ్చిన జియో దెబ్బకి భారత టెలికం దిగ్గజాలు దిగొస్తున్నాయి. ‘జియో ఫోన్’ పేరిట ఫీచర్ ఫోన్లకు కూడా 4జీ టెక్నాలజీని తీసుకొస్తుండడంతో వినియోగదారులు చేజారకుండా అప్రమత్తమవుతున్నాయి. ఎయిర్‌టెల్ సైతం జియో రూ.399 ఆఫర్‌కి పోటీగా అచ్చం అదే ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఈ ఆఫర్ ప్రిపెయిడ్ యూజర్లకు... అందునా 4జీ ఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎయిర్‌టెల్ కొత్త టారిఫ్ ప్లాన్ ప్రకారం... రూ.399తో రిచార్జ్ చేసుకుంటే రోజుకు 1జీబీ డేటా చొప్పున 84 రోజుల పాటు అందుకోవచ్చు. డేటాతోపాటు అపరిమిత ఎస్టీడీ, లోకల్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. జియోతో నేరుగా ఢీకొట్టేందుకే ఎయిర్‌టెల్ ఈ ఆఫర్ తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ ఒక్క ఆఫర్ విషయంలోనే కాదు.. జియోకి పోటీగా ఇంకా అనేక డేటా ప్లాన్లను ప్రకటించినట్టు ఎయిర్‌టెల్ వెబ్‌సైట్లో చూడొచ్చు. అవికాకుండా ‘జియోఫోన్’కి పోటీగా ఎయిర్‌టెల్ రూ.2500లకే 4జీ ఫోన్‌ తీసుకురానుంది. జియో ఆఫర్ల విషయానికొస్తే.. రూ.349 ప్లాన్‌తో 56 రోజుల పాటు 20 జీబీ 4జీ డేటా లభిస్తోంది. ఇదే కాలపరిమితితో జియో రూ.309 ఆఫర్‌తో రోజుకు 1జీబీ డేటా అందిస్తోంది. అయితే జియో ఆఫర్లను పోల్చిచూడాల్సి వస్తే రూ.399 ఆఫర్ కీలకంగా కనిపిస్తోంది. ఈ ఆఫర్ కింద 84 రోజుల పాటు రోజుకు 1జీబీ 4జీ డేటా చొప్పున అందుకోవచ్చు. ఇకపోతే జియో నెట్‌వర్క్‌లో ఎప్పుడూ వాయిస్ కాల్స్, ఎస్‌ఎమ్ఎస్‌లకు చార్జీలుండవన్న సంగతి తెలిసిందే. అయితే జియో రిచార్జ్ ప్లాన్‌లను అందుకోవాలంటే రూ.99 చెల్లించి ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి జీతాలు ఎంతో తెలుసా?  15 ఏళ్ల విరామం తర్వాత ప్రధాన పాత్రలో శ్రీదేవి..
business
7,019
07-11-2017 01:14:22
పద్మావతి సినిమాపై ముదురుతున్న వివాదం
సమరం.. ఇది నమ్మకాలకు ఆధారాలకు మధ్య సమరం..!మనోభావాలకు సృజనాత్మక స్వేచ్ఛకు మధ్య యుద్ధం..!! పద్మావతి సినిమాయే కావొచ్చు. కానీ దాని వెనుక చరిత్ర ఉంది. స్ర్తీ త్యాగం ఉంది. రాజపుత్‌ల ఆత్మగౌరవం ఉంది. దానికి భంగం కల్గితే విధ్వంసమే అని వారు హెచ్చరిస్తున్నారు. అసలు ఇందులో ఉన్న అభ్యంతరకర సన్నివేశాలు ఏమిటి? రాజపుత్‌లతో దర్శకుడు భన్సాలీ సంధి చేసుకుంటారా? లేక రణానికే సై అంటారా?  రాజస్థాన్‌, నవంబరు 4 : ముహూర్తం షాట్‌కి ముందే పద్మావతి సినిమాపై వివాదం రాజుకుంది. రిలీజ్‌డేట్‌ దగ్గర పడుతున్నకొద్దీ రాజస్థాన్‌లో దాడులు, హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. రాణి పద్మావతి సొంతగడ్డ అయిన చిత్తోగఢ్‌ ఆందోళనలు, ప్రదర్శనలతో రగులుతోంది. డిసెంబరు 1న విడుదల కావాల్సిన పద్మావతి సినిమాను అడ్డుకుని తీరుతామని రాజ్‌పుత్‌ కర్ని సేన హెచ్చరించింది.  వారిద్దరి మధ్య..దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ చరిత్రను వక్రీకరించారని రాజ్‌పుత్‌లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సినిమాలో మహారాణి పద్మావతి, అల్లావుద్దీన్‌ ఖిల్జీలమధ్య లవ్‌ సీన్స్‌ ఉన్నాయన్నది వారి ప్రధాన ఆరోపణ. ఆ సన్నివేశాలను తొలగించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్‌ ఇస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో పద్మావతి షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే రాజ్‌పుత్‌ కర్ని సేన భగ్గుమంది. పద్మావతి సెట్‌ లో బీభత్సం సృష్టించింది. దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీపై దాడికి పాల్పడింది. చారిత్రక గాధలను తెరకెక్కించడంలో పేరుగాంచిన భన్సాలీపై దాడిని బాలీవుడ్‌ ఖండించింది. అసలు సినిమా రిలీజ్‌ కాకుండా తాను చరిత్రను వక్రీకరించానని ఎలా నిర్థారణకు వస్తారని ఆయన ప్రశ్నించారు. దీపికా పడుకోన్‌ రణ్‌వీర్‌సింగ్‌, షాహిద్‌కపూర్‌వంటి భారీ తారాగణంతో దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో ‘పద్మావతి’ రూపుదిద్దుకుంది. పద్మావతిని త్రీడీలో కూడా ప్రేక్షకుల మందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో భన్సాలీని మళ్లీ వివాదాలు చుట్టుముట్టాయి. పొలిటికల్‌ డ్రామారాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌సహా అనేక పట్టణాల్లో పద్మావతి సినిమాకి వ్యతిరేకంగా రాజ్‌పుత్‌లు బంద్‌ నిర్వహించారు. రిలీజ్‌కి ముందే సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించి, తమ అభ్యంతరాలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌కి కూడా ఈ సినిమా సెగ తగిలింది. వాస్తవాలను వక్రీకరించారన్న ఆరోపణల నేపథ్యంలో క్షత్రియుల కోసం ప్రీరిలీజ్‌ స్ర్కీనింగ్‌ ఏర్పాటుచేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. అంతేకాదు ‘పద్మావతి’ విడుదలను అడ్డుకోవాలని కూడా ఎన్నికల సంఘాన్ని కోరింది. అటు కాంగ్రెస్‌ కూడా రాజ్‌పుత్‌ల మనోభావాలు దెబ్బతీసేవిధంగా సినిమా ఉంటే రిలీజ్‌ను ఆపాల్సిందే అని స్పష్టంచేసింది. పద్మావతి సినిమాపై ఆందోళనల దండయాత్ర కొనసాగుతోంది. రాజస్థాన్‌, గుజరాత్‌లలో పరిస్థితి వేడెక్కింది. తమ ఆత్మగౌరవ ప్రతీక అయిన రాణి పద్మావతి చరిత్రను వక్రీకరిస్తే దేశంలో ఎక్కడా సినిమాను ఆడనివ్వమని రాజ్‌పుత్‌లు హెచ్చరిస్తున్నారు. దీంతో సినిమా రిలీజ్‌ చేయాలంటే తమకు భద్రత కావాలని రాజస్థాన్‌లో థియేటర్ల ఓనర్లు గగ్గోలు పెడుతున్నారు. మరి బాహుబలికి సమాధానమంటూ బాలీవుడ్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘పద్మావతి‘ సాఫీగా రిలీజ్‌ అవుతుందా? తన దృశ్యకావ్యాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి భన్సాలీ ఏం చేస్తారు? అన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  ‘పద్మావతి’కి ఉమాభారతి సలహా ‘చరిత్రకారులు, రాజ్‌పుత్‌లు, చిత్ర ప్రతినిధులు, సెన్సార్‌బోర్డు సభ్యులు కమిటీగా ఏర్పడి వివాద పరిష్కారానికి ఎందుకు ప్రయత్నించకూడదు? భారత స్త్రీ ఆత్మాభిమానానికి భంగం వాటిల్లితే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ నేను సహించను. పద్మావతి ఎవరు? మహారాణి పద్మావతి..రాజ్‌పుత్‌ల ఆత్మగౌరవ నినాదం. స్త్రీ స్వాభిమానానికి ప్రతీక. ఇది క్రీ.శ. 13, 14 శతాబ్దాలనాటి గాధ! ప్రేమ..వ్యామోహం..పోరాటాల కలయిక! రాజస్థాన్‌లో ప్రచారం ఉన్న కథల ప్రకారం.. సింఘాల్‌ రాజ్య యువరాణి అయిన పద్మావతి అందచందాలకు దేశంలో అనేకమంది రాజులు ముగ్ధులవుతారు. చిత్తోర్‌గఢ్‌ పాలకుడైన రతన్‌సేన్‌ ఆమెను ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు. పద్మావతి సౌందర్యం గురించి విన్న ఢిల్లీ సుల్తాన్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీ ఆమెను సొంతం చేసుకోవడానికి చిత్తోర్‌గఢ్‌పై దండెత్తుతాడు. అనేక నాటకీయ పరిణామాల మధ్య పద్మావతి భర్త రతన్‌సేన్‌ చనిపోతాడు. ఇక అల్లావుద్దీన్‌ ఖిల్జీ తమ కోటను స్వాధీనం చేసుకుంటాడనగా..అతనికి వశంకాకుండా అగ్నికి ఆహుతి అవుతుంది పద్మావతి. వందలాది రాజ్‌పుత్‌ స్త్రీలతో కలిసి అగ్నిగుండంలో ఆత్మారణ చేసుకుంటుంది.
entertainment
19,255
14-05-2017 02:30:06
ఆర్‌బీఐకి హ్యాకింగ్‌ ముప్పు
న్యూఢిల్లీ, మే 13: భారతదేశ కీలక ఆర్థిక సంస్థలైన ఆర్బీఐ, స్టాక్‌ మార్కెట్లు, జాతీయ పేమెంట్‌ కార్పొరేషన్లపై సైబర్‌ దాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ విభాగమైన భారతీయ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌(సీఈఆర్‌టీ-ఇన్‌) హెచ్చరించింది. డేటాకు ముప్పు రాకుండా ఉండటానికి ఏం చేయాలో, ఏం చేయకూడదో వివరిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటివరకు భారీ సైబర్‌ దాడికి కుట్ర జరిగిన ఆధారాలేమీ తమ దృష్టికి రాలేదని సీఈఆర్‌టీ-ఇన్‌ చెప్పింది. మాల్‌వేర్‌తో ప్రభావితమైన కంప్యూటర్లను వెంటనే నెట్‌వర్క్‌ నుంచి తొలగించాలని చెప్పింది. సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని తెలిపింది. హ్యాకర్లకు ఎలాంటి సొమ్మూ చెల్లించరాదని స్పష్టం చేసింది.
nation
292
07-08-2017 13:33:05
జియోపై పట్టుబిగిస్తున్న ఎయిర్‌టెల్.. మరో సంచలన ఆఫర్..!
న్యూఢిల్లీ:  మొబైల్ సేవలతో ఇప్పటికే ప్రత్యర్థి కంపెనీలకు కోలుకోలేని షాక్ ఇచ్చిన రిలయన్స్ జియో తాజాగా బ్రాడ్ బ్యాండ్ రంగంపైనా కన్నేసింది. భారీ ఆఫర్లతో వినియోగదారులను తనవైపు తిప్పుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే జియో అడుగుపెట్టకముందే మేల్కొన్న ఎయిర్‌టెల్... వినియోగదారులను కాపాడుకునేందుకు సంచలన ఆఫర్లతో ముందుకొచ్చింది. కొత్త వినియోగదారులకు బోనస్ డేటా ఆఫర్ కింద 1000 జీబీ అదనంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్లో పేర్కొన్న వివరాల మేరకు.. అన్నిటికంటే తక్కువ ధరకు లభించే నెలవారీ టారిఫ్ ప్లాన్ రూ.899గా ఉంది. దీనికింద నెలకు 60 జీబీ డేటా, అదనంగా సంవత్సరం పాటు 500 జీబీ డేటా అందుకోవచ్చు. స్పీడ్ 40 ఎంబీపీఎస్ వరకు లభిస్తుంది. రూ.1099 ప్లాన్‌తో నెలకు 100 జీబీ డేటా అందుకోవచ్చు. స్పీడ్ 40 ఎంబీపీఎస్. 1000 జీబీ డేటా బోనస్‌గా లభిస్తుంది. రూ.1299 ప్లాన్ తీసుకుంటే... 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెలకు 130 జీబీ డేటా లభిస్తుంది. అదనంగా 1000 జీబీ వరకు బోనస్ డేటా లభిస్తుంది. ఇక రూ.1499, రూ.1799 ప్లాన్ల కింద వరుసగా 160 జీబీ, 225 జీబీ డేటా అందుకోవచ్చు. వీటిపై కూడా 1000 జీబీ బోనస్‌గా లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఫైబర్ నెట్‌వర్క్‌ను పరీక్షిస్తున్న రిలయన్స్ జియో... దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే తన సేవలను ప్రారంభించింది. పూర్తిగా లాంచ్ చేసిన తర్వాత ఎయిర్‌టెల్ సహా ఇతర టెల్కోలు తమ డేటా ఆఫర్లను మరింత సవరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
business
17,486
30-04-2017 01:04:11
ప్రేమించాలని బలవంతం చేయలేరు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29: నాగరిక సమాజంలో పురుషాధిక్యతకు చోటు లేదని.. ప్రేమించాలంటూ ఒక మహిళను బలవంతం ఎవరూ బలవంతం చేయలేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవ్‌ టీజింగ్‌ చేయడం ద్వారా ఒక యువతి బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి కారణమైన వ్యక్తికి హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై ఆ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. శనివారం ఈ కేసు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ ఎంఎం శంతనగౌడర్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ధర్మాసనం అతడి అభ్యర్థనను తోసిపుచ్చుతూ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఆమెకు జీవించే హక్కు ఉంది. ఎవరిని ప్రేమించాలో ఎంచుకునే హక్కు ఉంది. అది ఆమె ఇష్టం. చట్టబద్ధంగా వచ్చిన ఆ హక్కును సామాజికంగా గౌరవించాలి. ‘నన్నే ప్రేమించు’ అంటూ ఎవరూ ఒక మహిళను బలవంతం చేయలేరు. అని సుప్రీం స్పష్టం చేసింది.
nation
3,980
09-01-2017 02:56:27
ఫొటోలుగా, క్లుప్తంగా...
  జాన్‌ బెర్గెర్‌ అనువాదం: రాజీవ్‌ వెలిచేటి (కళా విమర్శకుడు, నవలాకారుడు, చిత్రకారుడు, కవి జాన్‌ బెర్గెర్‌ జనవరి 2న మరణించారు. పై కవిత ఆయన పుస్తకం ’'And Our Faces My Heart, Brief as Photos’ లోనిది.)
editorial
17,692
06-05-2017 18:02:55
తొలి మహిళా న్యాయమూర్తి లీలాసేథ్ ఇకలేరు..
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ లీలాసేథ్ శనివారంనాడు స్వల్ప అస్వస్థతతో కన్నుమూశారు. ఆమె వయస్సు 86 ఏళ్లు. ఉత్తరప్రదేశ్‌ నొయిడాలోని నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. 1958లో జరిగిన లండన్ బార్ ఎగ్జామ్‌లో లీలాసేథ్ మహిళలందరిలోనూ టాపర్‌గా నిలిచారు. అనంతరం పాట్నా హైకోర్టులో లా ప్రాక్టీస్ చేసి పదేళ్ల పాటు అనేక కేసుల్లో వాదించారు. 2000లో లా కమిషన్‌కు నియమితురాలయ్యారు. ఉమ్మడి కుటుంబ ఆస్తిలో మహిళలకు సమాన హక్కులు కల్పిస్తూ రూపొందించిన హిందూ మహిళా చట్టానికి సవరణలు చేయడంలో ఆమె కీలక భూమిక పోషించారు. 1978లో ఆమె ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా జడ్జిగా నియమితులయ్యారు. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా చీఫ్ జస్టిస్‌గా కూడా ఆమె బాధ్యతలు నిర్వహించారు. ప్రముఖ రచయిత విక్రమ్ సేథ్ తల్లి అయిన లీలాసేథ్ సైతం రచనలు చేశారు.
nation
5,203
31-08-2017 20:36:49
తొలిసారి నిర్మాతగా రణవీర్ సింగ్
ఎన్టీఆర్ హీరోగా తెలుగులో మెప్పించిన 'టెంపర్' సినిమా ఇప్పుడు రణవీర్ సింగ్ హీరోగా బాలీవుడ్‌లో రీమేక్ కాబోతోంది. సౌత్ సినిమాలను హిందీలో రీమేక్ చేయడంలో దిట్ట అయిన రోహిత్ శెట్టి ఈ సినిమాను దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో హీరోగా నటించడం మాత్రమే కాక.. తానే నిర్మించబోతున్నాడట రణవీర్ సింగ్. ఇదే నిజమైతే ఈ యువహీరోకు నిర్మాతగా ఇదే తొలిచిత్రం కానుంది. 'బ్యాండ్ బాజా భారత్' చిత్రానికి తన పేరు బయటకు రాకుండా సైలెంట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించి లాభాల్లో వాటాలు అందుకున్న రణవీర్ సింగ్ తండ్రి ఇప్పుడు కొడుక్కి కూడా ఇదే సలహా ఇస్తున్నాడట.
entertainment
15,793
18-11-2017 03:07:39
పోయస్‌ గార్డెన్‌లో ఐటీ సోదాలు
భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులువెయ్యి మంది పోలీసులతో బందోబస్తుతనిఖీలు అప్రజాస్వామికం: వట్రివేల్‌, కలైరాజన్ఇదంతా ఈపీఎస్‌, ఓపీఎస్‌ల క్రుట: దినకరన్‌చెన్నై, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు మాజీ సీఎం జయలలిత నివసించిన పోయస్‌ గార్డెన్‌లోని వేదనిలయంలో ఐటీ అధికారులు తనిఖీలు జరపడం తీవ్ర సంచలనం కలిగించింది. అన్నాడీఎంకే మాజీ కార్యదర్శి శశికళ, దినకరన్‌ బంధువుల నివాసాలు, కార్యాలయాలపై వారం రోజులుగా జరుగుతున్న సోదాల నేపథ్యంలోనే ఈ తనిఖీలు జరిగాయని భావిస్తున్నారు. ఐటీశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ నేతృత్వంలో 10మంది అధికారుల బృందం శుక్రవారం రాత్రి 10గంటల సమయంలో వేదనిలయం మొదటి అంతస్తులో జయలలిత సహాయకుడు పూంగుండ్రంకు కేటాయించిన ప్రత్యేక గదిలో తనిఖీలు జరిపింది. ఆ ఒక్కగదినే తనిఖీ చేసేందుకు హైకోర్టు అనుమతివ్వడంతో ఆ మేరకు తనిఖీలు నిర్వహించారు. ఈ విషయం తెలిసిన వెంటనే అన్నాడీఎంకే కార్యకర్తలు, జయ అభిమానులు, భారీ సంఖ్యలో పోయ్‌స్‌ గార్డెన్‌కు తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో సుమారు వెయ్యి మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. వేద నిలయంలో తనిఖీలు ప్రారంభించిన అనంతరం జయా టీవీ సీఈవో వివేక్‌ను అతడి ఇంటి నుంచి పోయస్‌ గార్డెన్‌కు పిలిపించారు. ఈలోగా దినకరన్‌ వర్గ మద్దతుదారులు కలైరాజన్‌, వెట్రివేల్‌ అక్కడకు చేరకుని ఐటీ దాడులను తీవ్రంగా ఖండించారు. జయలలిత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కేంద్రం ప్రవర్తిస్తోందని, ఇది అప్రజాస్వామికమని విమర్శించారు.  అదే సమయంలో శశికళ తరపు న్యాయవాది సెందూర్‌ పాండియన్‌ కూడా అక్కడకు చేరుకుని తనను లోపలకు అనుమతించాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే అధికారులు మాత్రం వివేక్‌ను మాత్రమే లోపలికి అనుమతించారు. ఈ వ్యవహారంపై దినకరన్‌ స్పందిస్తూ ఈ తనిఖీలు ఈపీఎస్‌, ఓపీఎ్‌సల క్రుట అని, జయ పేరు చెప్పుకుని పబ్బం గడుపుతున్న వారిరువురూ జయ మరణించిన తరువాత కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. జయలలిత నివసించిన వేదనిలయం తమకు ఆలయం వంటిదని, అక్కడ ఐటీ తనిఖీలు జరపడం అన్యాయమంటూ అన్నాడీఎంకే కార్యకర్తలు ఆక్రోశం వ్యక్తం చేశారు. కాగా, వేదనిలయంలో ఐటీ దాడులు జరగడం దాదాపు 21 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
nation
13,367
17-01-2017 00:01:40
త్రిషకు భద్రత కల్పించండి
పోలీస్‌ కమిషనర్‌కు తల్లి ఉమ విజ్ఞప్తి ‘పెటా’ను నిషేధించాలి: స్టాలిన్‌ డిమాండ్‌ జంతువులపై దయ జాతి వ్యతిరేకమా: పెటా చెన్నై, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): జల్లికట్టు వ్యవహారంలో తమ కుమార్తె, నటి త్రిషకు బెదిరింపులు వస్తున్నాయని, ఆమెకు భద్రత కల్పించాలని త్రిష తల్లి ఉమ సోమవారం చెన్నై నగర పోలీస్‌ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. పెటా సంస్థలో ఉన్న త్రిష జల్లికట్టుకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు ట్విటర్‌లో వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. అయితే తన ట్విటర్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని, తాను జల్లికట్టుకు వ్యతిరేకం కాదని త్రిష వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో త్రిష తల్లి ఉమాకృష్ణన మీడియాతో మాట్లాడుతూ.. తమిళ సంప్రదాయ సాహస క్రీడ జల్లికట్టుకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, త్రిష పలు భాషల చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉందని, ఆమె ఎన్నడూ పెటా సంస్థకు మద్దతుగా ప్రచారం చేయలేదని అన్నారు. కాగా, తమిళ సంస్కృతికి వ్యతిరేకంగా పనిచేస్తున్న జాతి వ్యతిరేక సంస్థ పెటాను తక్షణమే రద్దు చేయాలని డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంకే స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. భారత జంతు సంక్షేమ సంస్థను కూడా రద్దు చేసి, రాష్ట్ర ప్రతినిధులకు సభ్యత్వం ఉండేలా కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. మరోవైపు స్టాలిన్‌ డిమాండ్‌ను పెటా సంస్థ తీవ్రంగా ఖండించింది. జంతువులపై ప్రేమ, దయ చూపడం జాతి వ్యతిరేకమవుతుందా అని పెటా ఇండియా సంస్థ వెటర్నరీ డైరెక్టర్‌ మణిలాల్‌ వల్లియాతే ప్రశ్నించారు.
nation
837
02-11-2017 23:15:01
నాట్కో లాభంలో 27 శాతం వృద్ధి
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో నాట్కో ఫార్మా ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి గాను కన్సాలిడేటెడ్‌ నికర లాభం 27.5 శాతం వృద్ధి చెంది 84.4 కోట్ల రూపాయలుగా నమోదైందని నాట్కో ఫార్మా వెల్లడించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 66.2 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం రాబడులు 471.1 కోట్ల రూపాయల నుంచి 432.20 కోట్ల రూపాయలకు తగ్గినట్లు కంపెనీ తెలిపింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో జెనరిక్‌ ఒసాల్టామివిర్‌ ఔషధాన్ని వన్‌ టైమ్‌ ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేయటంతో రాబడులు పోల్చలేమని పేర్కొంది. సమీక్షా కాలంలో కంపెనీ ఇపిఎస్‌ 4.82 రూపాయలుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 3.78 రూపాయలుగా ఉంది. కాగా సెప్టెంబరుతో ముగిసిన ఆరు నెలల కాలానికి గాను కంపెనీ మొత్తం రాబడులు 816.60 కోట్ల రూపాయల నుంచి 880.90 కోట్ల రూపాయలకు పెరిగాయి. ఇదే సమయంలో నికర లాభం 113.70 కోట్ల రూపాయల నుంచి 178.10 కోట్ల రూపాయలకు పెరిగింది. ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో బిఎ్‌సఇలో కంపెనీ షేరు ఒక దశలో 1,010 రూపాయల స్థాయిని తాకి చివరకు 2.28 శాతం లాభంతో 996.70 రూపాయల వద్ద స్థిరపడింది.
business
7,642
12-12-2017 19:41:31
‘విజయ్ అందువల్లే ఆత్మహత్య చేసున్నాడనేది నిజమే అయితే..’
హైదరాబాద్ : విజయ్ సాయితో తనకు ఉన్న బంధం మర్చిపోలేనిదని నటుడు, నిర్మాత, డైరక్టర్ రవిబాబు అన్నారు. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయంపై మాట్లాడ్డానికి ఇది సమయం కాదని, కానీ విజయ్ సూసైడ్ చేసుకునే వ్యక్తి కాదని, ఏం జరిగిందో అతనికీ, దేవుడికే తెలియాలని అన్నారు. నిన్న ఉదయం ఓ టీవీ ఛానల్‌లో స్క్రోలింగ్ చూశానని, విజయ్‌కు సినిమా అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని చూశానని, ఒక వేళ విజయ్ సినిమా అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవడమే నిజం అయితే, ఫిలిం ఇండస్ట్రీలో ఏ ఆర్టిస్టుకు, టెక్నిషియన్స్‌కు ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీపై ఉందని రవిబాబు పేర్కొన్నారు. తమ వాళ్లను తాము ఎంకరైజ్ చేసుకుని, వాళ్లను బతికించుకుంటే ఇండస్ట్రీ బాగుంటుందని రవిబాబు అభిప్రాయపడ్డారు. ఇంకెవరికీ ఇలాంటివి జరగకూడదాని ఆయన అన్నారు. విజయ్ చేసిన పని ఇంకెవరూ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయ్ ఆదివారం రాత్రి తనకు ఫోన్ చేసి ఉంటే ఇలా జరిగి ఉండేదికాదని, ఎవరికైనా ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఒక్కసారి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులతో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని, పరిష్కారం కాకపోయినా, సొల్యూషన్ దొరుకుతుందని రవిబాబు అభిప్రాయపడ్డారు. అంతేగానీ దయ చేసి ఇలాంటి పని మాత్రం ఎవరూ చేయవద్దని, ‘సూసైడ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్’ అని రవిబాబు పేర్కొన్నారు.
entertainment
7,186
12-02-2017 12:46:37
గడ్డిపోచ కాదు.. గడ్డపార!
పలు కారణాలతో వాయిదా పడిన విన్నర్ థియేట్రికల్ ట్రైలర్ ఆదివారం విడుదలైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోంది. గుర్రపు పందేలను సినిమా బ్యాక్‌డ్రాప్‌గా ఎంచుకున్నాడు డైరెక్టర్. ఇక, సినిమాలో సాయిధరమ్ ఓ చాలెంజింగ్ రోల్‌లో నటిస్తున్నాడు. ట్రైలర్‌లో సాయిధరమ్ కొత్త లుక్‌లో కనిపించాడు. సాయిధరమ్ పలికిన డైలాగులు కూడా బాగానే పేలాయి. ‘ఖాళీ లాండ్ కనిపిస్తే గేదెలు కాయాలి.. లేదంటే గొర్రెలు పెంచుకోవాలి. కానీ గుర్రపు పందేలు పెట్టాలనుకోవడం ఏంట్రా’, ‘పీకేస్తే అంత తేలిగ్గా వచ్చేందుకు నేనేం గడ్డిపోచను కాదు.. గడ్డపారను. దిగిపోద్ది’ అన్న డైలాగులు సినిమా స్టామినాను తెలియజేస్తున్నాయి. ఇక, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌తో సాయి టీజింగ్ సీన్లు కూడా బాగానే పండినట్టు కనిపిస్తోంది. హార్స్ రేస్‌లను చూపించిన విధానం కూడా బాగుంది. మొత్తానికి రేసుగుర్రంలా కనిపిస్తున్న సాయిధరమ్ విన్నర్.. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24న ప్రేక్షకులకు మంచి ఫీస్ట్‌నే అందించేలా ఉంది.
entertainment
14,287
31-01-2017 05:04:02
టెక్సాస్‌ మసీదు పునర్నిర్మాణానికి రూ.5.28 కోట్లు
అమెరికన్ల ఆన్‌లైన్‌ విరాళాలు హ్యూస్టన్‌, జనవరి 30: టెక్సాస్‌ రాష్ట్రంలో శనివారం తగలబడిన ఇస్లామిక్‌ సెంటర్‌ ఆఫ్‌ విక్టోరియా మసీదు పునర్నిర్మాణానికి అమెరికన్లు ఒక్కటై ముందుకు కదిలారు. ఆన్‌లైన్‌ ద్వారా రూ.5.28 కోట్ల విరాళాలు పోగుచేశారు. కాగా, మసీదు శిథిలాల మధ్యే ఆదివారం పలువురు ముస్లింలు ప్రార్థనలు జరిపారు. తమ ప్రాంగణాల్లో ప్రార్థనలు జరుపుకోవాలంటూ నాలుగు చర్చిలు ముస్లింలను ఆహ్వానించడం విశేషం.
nation
434
05-12-2017 00:32:21
భారత్‌లో కొత్త ప్లాంట్ల ఏర్పాటు
ఈ ఏడాది రూ.14,000 కోట్ల రాబడివచ్చే ఏడాది నాటికి 100 ఎంఐ హోం స్టోర్లుషామీ వైస్‌ ప్రెసిడెంట్‌ మనూ జైన్‌ వెల్లడి హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షామీ భారత మార్కెట్లో దూసుకుపోతోంది. ఈ ఏడాది జూలై-అక్టోబరు మధ్య కాలంలో ఏకంగా 92 లక్షల స్మార్ట్‌ఫోన్లను విక్రయించి రికార్డు సృష్టించినట్లు షామీ వైస్‌ ప్రెసిడెంట్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనూ జైన్‌ వెల్లడించారు. సోమవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రికార్డు స్థాయి విక్రయాలతో భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నట్లు చెప్పారు. స్మార్ట్‌ఫోన్‌ విక్రయాల్లో రెడ్‌మీ నోట్‌ 4 రికార్డులను తిరగరాసిందని, ఈ ఒక్క ఈ ఫోన్‌ విక్రయాలు దాదాపు 50 లక్షల యూనిట్లుగా ఉన్నాయని తెలిపారు. 2016లో కంపెనీ మొత్తం విక్రయాలు 72 లక్షల యూనిట్లుగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కాగా 2016లో కంపెనీ 7,200 కోట్ల రూపాయల రాబడులను ఆర్జించిందని, 2017లో ఇది 14,000 కోట్ల రూపాయలకు చేర నుందని జైన్‌ చెప్పారు. ఇందుకు తగ్గట్టుగానే ఈ ఏడాది ఇప్పటి వరకు మార్కెట్లోకి 8 కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయటం ద్వారా ఈ మార్కును అందుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే రెడ్‌మీ నోట్‌ 5ఎ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. బుధవారం నుంచి ఈ ఫోన్‌ విక్రయాలు ప్రారంభం కానున్నాయన్నారు. భిన్న ఉత్పత్తుల్లోకి..భారత్‌లో మరిన్ని స్మార్ట్‌ఫోన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు జైన్‌ తెలిపారు. కొత్త ప్లాంట్ల ద్వారా అదనంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవటంతో పాటు ఎంఐ బ్రాండ్‌ కింద ఎయిర్‌ ఫ్యూరిఫైయర్‌ ఉత్పత్తులు, ఎలక్ర్టానిక్‌ ఉత్పత్తుల విభాగంలోకి అడుగుపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం షామీ... ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో రెండు స్మార్ట్‌పోన్‌ తయారీ ప్లాంట్లను కలిగి ఉండగా ఇటీవలి కాలంలో నోయిడాలో పవర్‌ బ్యాంకుల కోసం ప్రత్యేకంగా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు భారత మార్కెట్లో 3,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్లు జైన్‌ పేర్కొన్నారు. ప్లాంట్ల విస్తరణ, నెట్‌వర్క్‌ కార్యకలాపాలు తదితరాల కోసం ఈ మొత్తాలను వెచ్చించినట్లు జైన్‌ తెలిపారు. అయితే కొత్త ప్లాంట్ల ఏర్పాటు, సర్వీస్‌ సెంటర్లు, ఆర్‌ అండ్‌ డి సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి ఎంతమేరకు పెట్టుబడులు పెట్టాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని మనూ జైన్‌ చెప్పారు. ఆఫ్‌లైన్‌ విక్రయాలపై ఫోకస్‌కంపెనీ విక్రయాల్లో ఆన్‌లైన్‌ వాటా 50 శాతానికి పైగా ఉందని, అయితే ఆఫ్‌లైన్‌ మార్కెట్లో పట్టు పెంచుకోవాలనే లక్ష్యంతో ఎంఐ హోమ్‌ స్టోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 13 హోమ్‌ స్టోర్స్‌ను ఏర్పాటు చేయగా వచ్చే ఏడాది నాటికి వీటిని 100కు చేర్చాలని నిర్ణయించినట్లు జైన్‌ వెల్లడించారు. వీటితో పాటు దేశవ్యాప్తంగా పదిహేను నగరాల్లో 1000 ప్రెఫర్డ్‌ పార్ట్‌నర్‌షిప్‌ స్టోర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కంపెనీ మొత్తం విక్రయాల్లో ఆఫ్‌లైన్‌ వాటా 20 శాతంగా ఉందని, ఏడాది కాలంలో దీన్ని 30 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మనూ జైన్‌ తెలిపారు.
business
17,263
14-01-2017 00:19:54
నగదు తీస్తే వాత!
‘క్యాష్‌ ట్యాక్స్‌’ ప్రతిపాదన ఓకే అయితే ఈ బడ్జెట్‌లోనే!మళ్లీ తెరపైకి బీసీటీటీ న్యూఢిల్లీ, జనవరి 13: సంపాదిస్తే పన్ను. ఖర్చు పెడితే పన్ను. కొంటే పన్ను. తింటే పన్ను. ఇప్పటికే ఉన్న రకరకాల పన్నులతోపాటు మరో ‘పన్ను పీకుడు’కు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం! అది... నగదు తీస్తే పన్ను! అంటే... ‘క్యాష్‌ ట్యాక్స్‌’. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించే పేరిట... ‘నగదు తీస్తే వాతలు పెట్టాలనే ప్రతిపాదన కేంద్రం ముందుకొచ్చినట్లు తెలిసింది. కేంద్రం ఆమోద ముద్ర వేస్తే... ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుంది. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనలో ‘మంచి-చెడు’లను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది. బ్యాంకు ఖాతా నుంచి నిర్దిష్ట మొత్తానికి మించి వితడ్రా చేస్తే పన్ను (బ్యాంకింగ్‌ క్యాష్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ - బీసీటీటీ) విధించాలనే ప్రతిపాదన కూడా ఇప్పటికే ఉంది. యూపీఏ హయాంలో నాలుగేళ్లపాటు ఈ పన్ను వసూలు చేశారు. దీనిని మళ్లీ విధించాలని కూడా భావిస్తున్నారు. ‘‘నగదు లావాదేవీలను సాధ్యమైనంతగా తగ్గించడమే ప్రభుత్వ ధ్యేయం. దీనికోసం పలు రకాల ప్రతిపాదనలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి’’ అని ఒక ఉన్నతాధికారిని ఉటంకిస్తూ ఓ ఆంగ్ల వార్తా పత్రిక కథనం ప్రచురించింది. నగదు పన్ను విధింపుపై ‘రాజకీయంగా అత్యున్నత స్థాయి’లోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆ అధికారి తెలిపారు. దీనివల్ల నల్లధనాన్ని కూడా నియంత్రించ వచ్చునని మరో అధికారి తెలిపారు. నల్లధనంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కూడా ఇలాంటి సిఫారసు చేసిందని చెప్పారు. వ్యక్తులు రూ.3 లక్షలకు మించి నగదు లావాదేవీలు నిర్వహించరాదని... రూ.15 లక్షలకు మించి నగదు ఎవ్వరూ దగ్గర పెట్టుకోవద్దని ‘సిట్‌’ సిఫారసు చేసినట్లు వివరించారు. పార్థసారథి శోమ్‌ అధ్యక్షతన పన్నుల్లో సంస్కరణల నిమిత్తం వేసిన వేసిన కమిషన్‌ (టార్క్‌) కూడా బీసీటీటీని తిరిగి ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది. పెద్దనోట్ల రద్దు దెబ్బకు ఇప్పటికే డిజిటల్‌ లావాదేవీలు భారీగా పెరిగాయి. నవంబరు నెలతో పోల్చితే... డిసెంబరులో 43% అధికంగా జరిగాయి.
nation
15,418
26-02-2017 21:11:31
పాకిస్థాన్‌లో తగ్గిన.. మహాశివరాత్రి సందడి
పెషావర్: పాకిస్థాన్‌లో ఈసారి మహాశివరాత్రి సందడి కాస్త తగ్గింది. భద్రతా కారణాల నేపథ్యంలో పాక్‌లోని హిందువులు మూడు రోజుల వేడుకను ఒక రోజుకు కుదించుకున్నారు. మనేష్రా‌లో 1500 ఏళ్ళనాటి శివాలయం ఉంది.  మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడకు పెద్ద సంఖ్యలో హిందూ భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది సుమారు 700 మంది ఉపవాసం ఉన్నారు. శివలింగానికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే భద్రతా కారణాల వల్ల మూడు రోజుల వేడుకను ఒక రోజుకు కుదించారు.
nation
11,967
17-10-2017 14:28:09
చైనా సరిహద్దుల్లో మోదీ దీపావళి!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను చైనా సరిహద్దుల్లో జరుపుకోనున్నారు. ఈ నెల 20న ఉత్తరాఖండ్‌లోని కేథార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించనున్న ఆయన.... భారత భద్రతా దళాలు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బందితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొననున్నట్టు సమాచారం. 2013 తరహా వరదల వల్ల కేథార్‌నాథ్ ఆలయానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఆలయం చుట్టూ రక్షణగా గోడ నిర్మించనున్నారు. దీపావళి మరుసటి రోజు ప్రధాని ఇక్కడికి వచ్చి ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు చెబుతున్నారు. కాగా గత ఐదునెలల్లో ప్రధాని మోదీ కేథార్‌నాథ్ వెళ్లడం ఇది రెండోసారి. శీతాకాల విరామం అనంతరం భక్తుల కోసం ఆలయాన్ని తెరవగానే ప్రధాని మోదీ కేథార్‌నాథుడిని దర్శించుకున్నారు. మళ్లీ శీతాకాలం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయన మరోసారి సందర్శనకు వెళుతుండడం విశేషం. అయితే ఆయన పర్యటనపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
nation
18,596
05-05-2017 19:36:32
దక్షిణాసియా శాటిలైట్ ప్రయోగం విజయవంతంపై.. సభ్య దేశాల హర్షం
న్యూఢిల్లీ: పొరుగు దేశాలకు భారత్ గొప్ప బహుమతిగా పేర్కొనే దక్షిణాసియా శాటిలైట్ ప్రయోగం విజయవంతంపై సార్క్ సభ్య దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. పాకిస్థాన్ మినహా మిగతా దేశాల అధినేతలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ ప్రయోగాన్ని తిలకించిన అనంతరం ప్రసంగించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసినా భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాంతంలో కొత్త సహకారానికి ఇది నాంది పలుకుతుందని ఆమె అన్నారు. జీశాట్ 9 విజయంతో ప్రాంతీయ సహకారం ఆవశ్యకత మరింత పెరిగిందని ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కొనియాడారు. చర్చలు, చర్యల మధ్య ఓ వారధి ఏర్పండిందని ఆయన అభిప్రాయపడ్డారు. సరిహద్దుల ద్వారా సహకారం కుదరకపోతే.. ఆకాశ మార్గాన అది సాధ్యమవుతుందన్న నమ్మకం ఏర్పడిందన్నారు. దక్షిణాసియా శాటిలైట్ ప్రయోగం పట్ల శ్రీలంక అధ్యక్షుడు సిరిసేనా భారత్‌కు అభినందనలు తెలిపారు. సభ్య దేశాల మధ్య సంబంధాలు, సహకారాన్ని ఇది మరింత పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కొండ ప్రాంతమైన తమ దేశంలో సమాచార సేవలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని నేపాల్ ప్రధాని పుష్క కమల్ దహల్ అన్నారు. ఉపగ్రహ ప్రయోగం ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే అన్నారు. దక్షియాసియా శాటిలైట్ ప్రయోగం, పొరుగు దేశాల పట్ల భారత విధానాన్ని చాటుతోందని మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ కొనియాడారు. భారత్ ఆశిస్తున్న సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ ఆకాంక్ష నెరవేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
nation
21,404
27-12-2017 01:49:28
విజేత గోవా
కోల్‌కతా : సీనియర్‌ మహిళా వన్డే లీగ్‌ ప్లేట్‌ గ్రూప్‌ ఫైనల్లో గోవా 37 పరుగుల తేడాతో బెంగాల్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. ఈడెన్‌ గార్డెన్స్‌లో మంగళ వారం జరిగిన ఫైనల్లో గోవా తమ స్వల్ప స్కో రు(147)ను రక్షించుకునే ప్రయత్నంలో బెంగాల్‌ను 110 పరుగులకే ఆలౌట్‌ చేసింది. బెంగాల్‌ ఇన్నింగ్స్‌లో పరిమితరాయ్‌ (42), దీప్తి శర్మ(16) ఫర్వాలేదనిపించారు. సంతోషి రాణె(3/24), సునంద ఎత్రేకర్‌(3/13) విజృంభణతో బెంగాల్‌ కుప్పకూలింది.
sports
11,909
23-03-2017 03:24:18
సంపద సృష్టీ ముఖ్యమే
న్యూఢిల్లీ, మార్చి 22: సమాజంలోని అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందకుంటే ఆ ప్రగతికి అర్థమే లేదని కేంద్ర సమాచార ప్రసార, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. సంపద పంపిణీ ఎంత ప్రధానమో.. సంపద సృష్టి కూడా అంతే కీలకమని తేల్చిచెప్పారు. బుధవారమిక్కడ ఆలిండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) నిర్వహించిన జాతీయ నాయకత్వ సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘సంపద పంచాలంటే ముందు సంపద సృష్టించుకోవాలి. లేదంటే రుణగ్రస్తులమై దివాలా తీస్తాం. ప్రపంచంలో చాలా దేశాలు, ప్రభుత్వాలు ఇలాగే అప్పులపాలయ్యాయి. సంపదను సృష్టించుకోకపోతే మనం పేదరికాన్ని మాత్రమే పంపిణీ చేయగలం’ అని పేర్కొన్నారు. ఎకానమీలో పదేళ్లలో జపాన్‌ను భారత అధిగమిస్తుందని, అసలైన పోటీ చైనా, భారత మధ్యే ఉంటుందని చెప్పారు. సమ్మిళిత అభివృద్ధి ఎజెండాకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నోట్ల రద్దు దరిమిలా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి లభించిన భారీ విజయానికి ప్రాధాన్యం ఏర్పడిందని చెప్పారు. ప్రజలంతా అభివృద్ధిని కాంక్షిస్తున్నారనడానికి ఇది రుజువన్నారు. నోట్ల రద్దును ఆర్థిక నిపుణులు, రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయని గుర్తుచేశారు. అయినా ప్రజలు దానిని పూర్తిగా సమర్థించారని చెప్పారు. ప్రజాతీర్పును చూసిన తర్వాతైనా విపక్షాలు నకారాత్మక రాజకీయాలు మాని.. నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలని హితవు పలికారు. ‘పార్లమెంటు సజావుగా నడుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇతరులను విమర్శించడానికి, వారి తప్పులను వేలెత్తిచూపేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వాన్ని విమర్శించడం.. పార్లమెంటును అడ్డుకోవడం వేర్వేరు’ అని వెంకయ్య పేర్కొన్నారు.
nation
12,875
22-01-2017 02:06:30
ట్విట్టర్‌లో టాప్‌గా...
అమెరికా ప్రజలు మెచ్చిన నేత.. ట్విట్టర్‌ రారాజుగానూ దూసుకెళుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన 12 గంటల్లోనే భారీగా కొత్త ట్విట్టర్‌ అనుచరులను సంపాదించుకొన్నారు. పదవీ ప్రమాణం చేసే సమయంలోనే, ప్రభుత్వ అధికార ట్విట్టర్‌ ‘పోటస్‌44’ బటన్‌ని పూర్వ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా.. ట్రంప్‌కు అందించారు. ఆ సమయంలో 1.39 కోట్ల మంది అనుచరులను కలిగిన ఈ ట్విట్టర్‌కు.. ఇప్పుడు అదనంగా రెండు లక్షల మంది జతకలిసి.. మొత్తం 1.41 కోట్లకు అనుచరులు పెరిగారు.
nation
7,707
01-10-2017 23:42:18
ప్రతి సింగర్‌కీ.. ఆ అనుభవం ఉంటుంది: పర్ణిక
పర్ణిక పేరు ప్రస్తావించగానే ఫేస్‌బుక్‌ ప్రియులంతా... ‘ఓ ఆమెనా.. పాత పాటల్ని చక్కగా పాడి ఫేస్‌బుక్‌లో పెడుతుంది...!’ అంటారు. యూ ట్యూబ్‌ ఫాలోయర్స్‌ ‘మాకెందుకు తెలీదు... మొన్నేగా ‘అయిగిరి నందిని’ పాట చూశాం. అద్భుతం’ అంటారు. సంగీత ప్రియులు ఆమె స్వరంలో పలికే వెస్ట్రన్‌, ఫోక్‌ పాటలను గుర్తు చేసుకుంటారు. తన సంగీత జ్ఞానంతో సోషల్‌ మీడియా, సినిమాల ద్వారా అభిమానులను సంపాదించుకున్న పర్ణిక మాటల్లోని పదనిసలు.. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే! మా నాన్న భాస్కర్‌. ప్రైవేట్‌ ఉద్యోగి. ఆర్టిస్ట్‌గా సినిమాలు కూడా చేస్తున్నారు. అమ్మ శోభకు కూడా కళలంటే ఇష్టం. పెళ్లితంతులో ఉపయోగపడే పలు వస్తువులను రూపొందిస్తుంటారు. నా చిన్నతనంలో ఇంట్లో పలువురు పిల్లలకు మా నాన్నమ్మ కర్ణాటక సంగీతం నేర్పుతుండేవారు. నాక్కూడా తొలిగురువు నాన్నమ్మే. ఆమె దగ్గర మొదట బలవంతంగా నేర్చుకున్నప్పటికీ, పదో తరగతికి వచ్చేసరికి సంగీతంపై ఆసక్తి పెరిగింది. వెంటనే రామాచారిగారి శిష్యరికంలో లలిత సంగీతం నేర్చుకున్నా. సినిమా పాటలను పాడే వైనం, అందులో అనుపానులు తెలుసుకుంది ఆయన దగ్గరే. ఆ అనుభవం ఎన్నో బహుమతులు తెచ్చిపెట్టింది. ఆ ప్రోత్సాహంతో పలు టీవీ చానెళ్లలో యాంకర్‌గా కూడా చేశా. ‘సరిగమప’, ‘బోల్‌ బేబీ బోల్‌’ కార్యక్రమాల వల్ల మంచి గుర్తింపు వచ్చింది. ఒక వైపు పాడుతూనే, మరోవైపు బీఎస్సీ మైక్రో బయాలజీ పూర్తి చేశా.నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే! మా నాన్న భాస్కర్‌. ప్రైవేట్‌ ఉద్యోగి. ఆర్టిస్ట్‌గా సినిమాలు కూడా చేస్తున్నారు. అమ్మ శోభకు కూడా కళలంటే ఇష్టం. పెళ్లితంతులో ఉపయోగపడే పలు వస్తువులను రూపొందిస్తుంటారు. నా చిన్నతనంలో ఇంట్లో పలువురు పిల్లలకు మా నాన్నమ్మ కర్ణాటక సంగీతం నేర్పుతుండేవారు. నాక్కూడా తొలిగురువు నాన్నమ్మే. ఆమె దగ్గర మొదట బలవంతంగా నేర్చుకున్నప్పటికీ, పదో తరగతికి వచ్చేసరికి సంగీతంపై ఆసక్తి పెరిగింది. వెంటనే రామాచారిగారి శిష్యరికంలో లలిత సంగీతం నేర్చుకున్నా. సినిమా పాటలను పాడే వైనం, అందులో అనుపానులు తెలుసుకుంది ఆయన దగ్గరే. ఆ అనుభవం ఎన్నో బహుమతులు తెచ్చిపెట్టింది. ఆ ప్రోత్సాహంతో పలు టీవీ చానెళ్లలో యాంకర్‌గా కూడా చేశా. ‘సరిగమప’, ‘బోల్‌ బేబీ బోల్‌’ కార్యక్రమాల వల్ల మంచి గుర్తింపు వచ్చింది. ఒక వైపు పాడుతూనే, మరోవైపు బీఎస్సీ మైక్రో బయాలజీ పూర్తి చేశా. కోరస్‌తో ప్రారంభించా...తమ్మారెడ్డి భరద్వాజగారు దర్శకత్వంలో మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందించిన ‘పోతేపోనీ’ సినిమాకు కోరస్‌ పాడించేందుకు రామాచారిగారు నన్నూ, గీతామాధురినీ పంపించారు. సినిమాల కోసం గళం విప్పడం అదే తొలిసారి. నా గొంతు బావుందని అందరూ మెచ్చుకున్నారు. దాంతో ట్రాక్స్‌, కోరస్‌, రీ-రికార్డింగ్‌ పాడే అవకాశాలు వచ్చాయి. మురళీధర్‌ సంగీతంలో ‘పరారే’ సినిమాలో పాడిన ‘గరమ్‌ గరమ్‌ ఘాటు మసాలా’ పాటకు నేపథ్య గాయనిగా తొలిసారి నా పేరు చూసుకున్నా. ‘బ్రహ్మానందం డ్రామా కంపెనీ’, ‘పోటుగాడు’ చిత్రాలతో గుర్తింపు వచ్చింది. ఓ రోజు చక్రిగారు పిలిచి ‘దూసుకెళ్తా’లో ‘పిల్లందంకేకా కేకా’ పాట పాడించారు. ‘మోహన్‌బాబుగారికి నీ వాయిస్‌ నచ్చితేపాట ఓకే అయినట్టే’ అని చెప్పారు. అయితే అదే పాటను బాలీవుడ్‌ సింగర్‌తో పాడిస్తున్నారని తెలిసి కాస్త నిరాశ కలిగింది. కానీ ఓ రోజు చక్రిగారి ఆఫీస్‌ నుంచి ఫోన్‌ చేసి నా పూర్తి పేరు, కరెక్ట్‌ స్పెల్లింగ్‌ చెప్పమని అడిగారు. ఆ క్షణాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేను. మణిశర్మగారి సంగీతంలో ‘రచ్చ’, ‘బాలు’, ‘వరుడు’ సినిమాలకు కోరస్‌, రీరికార్డింగ్‌ పాడాను. ‘ఖతర్నాక్‌’ నుంచి ‘బాహుబలి’ వరకు కీరవాణిగారి దగ్గర బ్యాగ్రౌండ్‌ వర్క్‌ చేస్తున్నాను. కోటిగారు కూడా నన్ను చాలా ప్రోత్సహించారు. ఇప్పటిదాకా 60 పాటలు, దాదాపు 500 సినిమాలకు రీరికార్డింగ్‌, కోరస్‌ పాడా. షోలు చాలానే చేశా. నన్ను చూడగానే ఎవరికైనా మెలోడీ సింగర్‌నని అనిపిస్తుంది. అయితే నా బలం ఫోక్‌, వెస్ట్రన్‌ పాటలే.  రీరికార్డింగ్‌ ముచ్చట్లు!‘బాహుబలి-2’ దండాలయ్యా పాటను కీరవాణిగారు డిఫరెంట్‌గా రికార్డ్‌ చేశారు. దూరం నుంచి వినబడే వాయిస్‌కు మైక్‌ మధ్యలో పెట్టి.. రీ సౌండ్‌ కోసం ఫస్ట్‌ ఫ్లోర్‌లో కొందరినీ, కింద ఫ్లోర్‌ కొందరినీ ఉంచి పాడించారు. అదొక కొత్త అనుభూతినిచ్చింది. తమన్‌గారి సంగీతంలో లైవ్‌ రికార్డింగ్‌లో 20, 25 మంది వయొలిన్‌ కళాకారులు ఒక్కసారిగా వాయిస్తుంటే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. మా జనరేషన్‌ వాళ్లకు ఇలాంటివి అరుదుగా కనిపిస్తుంటాయి.  గుర్తింపు తెచ్చిన పాటలు పిల్లందంకేకా కేకా (దేనికైనా రెడీ) బాడీగార్డ్‌ టైటిల్‌ సాంగ్‌ గరమ్‌గరమ్‌ చిలకా (రభస) మరి నిజమే (గ్రీకువీరుడు) దియా దియా దిల్‌ తస్సదియ్యా (నిప్పు)గుర్తింపు తెచ్చిన పాటలు పిల్లందంకేకా కేకా (దేనికైనా రెడీ) బాడీగార్డ్‌ టైటిల్‌ సాంగ్‌ గరమ్‌గరమ్‌ చిలకా (రభస) మరి నిజమే (గ్రీకువీరుడు) దియా దియా దిల్‌ తస్సదియ్యా (నిప్పు) ప్చ్‌.. మిస్‌ అయ్యా!‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’లో ‘నీ చేపకళ్లు’ పాటను దేవిశ్రీ ప్రసాద్‌గారు నాతోనే పాడించారు. నా వాయిస్‌ సూట్‌ కాలేదనుకుంటా! తర్వాత చిన్మయితో పాడించారు. అది ఓకే అయి ఉంటే ‘పవన్‌కల్యాణ్‌గారికి ఓ పాట పాడాను’ అని చెప్పుకునేదాన్ని. ప్చ్‌.. మిస్‌ అయ్యా. నేను అందుబాటులో లేక మిస్‌ అయిన పాటలు కొన్ని అయితే... పాడిన తర్వాత తీసేసిన పాటలు మరి కొన్ని. ప్రతి సింగర్‌కి ఈ అనుభవం ఉంటుంది. పాటను ఫైనల్‌ చేయడం అనేది పూర్తిగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ చేతిలో కూడా లేదు. దర్శకనిర్మాతల ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది.  నిత్యనూతనం..!ఒకప్పుడు ఒక సింగర్‌ సినిమాలో 3, 4 పాటలు పాడేవారు. ఇప్పుడలా లేదు. ప్రతి పాటకూ కొత్తస్వరాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. కాబట్టి ఇండస్ట్రీలో ఎంత మంది సింగర్లు ఉన్నా అందరికీ అవకాశాలు వస్తున్నాయి. మరోవైపు రీరికార్డింగ్స్‌, టీవీ షోలు, కాన్సెర్టులు.. ఇలా ఏదో ఒక పనితో బిజీగానే ఉంటున్నారు. కొందరైతే ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న ఇండిపెండెంట్‌ మ్యూజిక్‌ మీద కూడా ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు.  నేనూ ఓ ప్రయత్నం చేశా...గత ఏడాది దసరాకు ‘అయిగిరి నందిని’(ద విమెన్‌ పవర్‌) అని ఫ్యూజన్‌ చేశా. నా నుంచి వచ్చిన మొదటి ఆల్బమ్‌ అది. యూ ట్యూబ్‌, సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దానికి వచ్చిన స్పందనతో మరో ఆల్బమ్‌ చెయ్యాలన్నంత ఉత్సాహం పెరిగింది.  ఆ కిక్కేవేరప్ప...గాయనిగా ఎన్ని షోలు చేసినా, రియాలిటీ షోల్లో పాడినా... సినిమాలో పాట పాడిన అనుభూతి ముందు దిగదుడుపే. స్టేజ్‌ షోల్లో ‘నా పాటలే పాడతాను’ అని కూర్చొంటే కుదరదు. నలుగురికీ నచ్చిన పాటలు పాడాలి, నలుగురూ పాడినవి పాడాలి. కాబట్టి నేను సంకుచితంగా ఉండను. స్టేజ్‌ ఎక్కానంటే నాలో ఎనర్జీ వంద రెట్లు పెరిగిపోతుంది. మామూలుగా ఉండే పరిణికకూ, షోల్లో పాడే పరిణికకూ చాలా తేడా కనిపిస్తుంది.  నన్ను అడిగారు!‘గొడవ’, ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ సినిమాల్లో నటించమని అడిగారు. కానీ ఎందుకో నేను అప్పుడు అంగీకరించలేదు. డీసెంట్‌ క్యారెక్టర్‌ అయి ఉండి, నేను చెయ్యగలను అనిపిస్తే భవిష్యత్తులో చేస్తాను. ఇప్పుడైతే అలాంటి ప్లాన్స్‌ ఏమీ లేవు. - ఆలపాటి మధు
entertainment
5,432
17-11-2017 15:40:45
కొత్త హీరోయిన్‎తో రాజ్‎తరుణ్..!
యంగ్ హీరో రాజ్‎తరుణ్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు. ఏకంగా పెద్ద సంస్థలో ఒక సినిమా చేసి పెద్ద సినిమాలకు పోటీగా నిలబెట్టనున్నాడు. టాలీవుడ్ యంగ్ హీరోల్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నరాజ్‎తరుణ్ ఆ ట్యాగ్‎ను క్రమంగా చెరిపేసుకుంటూ వచ్చాడు. గత చిత్రాలైన 'అంధగాడు', 'కిట్టుఉన్నాడు జాగ్రత్త' వరుసగా నిరాశపరచడంతో ఇప్పుడు పూర్తిగా డిఫెన్స్‎లో పడ్డాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అతడి అదృష్టం పడిందో ఏమో కానీ 'ఉయ్యాల జంపాల' తర్వాత అన్నపూర్ణ బ్యానర్‎లో మరోసినిమా బాకీ పడ్డ రాజ్‎తరుణ్ ఇప్పుడు ఆ సినిమాను 'రంగుల రాట్నం'గా రిలీజ్‎కు రెడీ చేస్తున్నాడు. రాజ్‎తరుణ్ హీరో కాబట్టి సినిమా లో-బడ్జెట్‎లో పూర్తయిందనుకుంటే పొరపాటే. ఈ సినిమా గ్రాండియర్‎‏‎గా ఉండేలా కాస్త భారీగానే ఖర్చుపెట్టారట. కాకపోతే అడ్వాన్స్ అప్పటిది కాబట్టి రాజ్‎తరుణ్ పారితోషికమే కాస్త తగ్గి ఉండొచ్చని అనుకుంటున్నారు.  కొత్త దర్శకురాలితో కొత్త హీరోయిన్‎తో నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'రారండోయ్ వేడుక చూద్దాం' మాదిరిగా ఈ సినిమా సందడిగా కలర్‎ఫుల్‎గా వుండాలని నాగ్ చెప్పారట. కథా పరంగా మూడు నాలుగు మ్యారేజ్ ఎపిసోడ్స్ ఉండటంతో, ఖర్చుకు వెనకాడకుండా మంచి అవుట్ ఫుట్ వచ్చేలా చూశారట. ప్రతి సీన్ గ్రాండ్ లుక్‎తో ఉండేలా చూడటంతో, ఫస్టు కాపీకే నాలుగు కోట్ల వరకూ ఖర్చు అయిందని అంటున్నారు. వచ్చే సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయడానికి ఇప్పటినుంచి ప్రయత్నాలు మొదలెట్టారు. రాజ్‎తరుణ్‎కు మొదటి విజయాన్నిచ్చిన అన్నపూర్ణ సంస్థ రంగుల రాట్నంతో దాన్ని రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.
entertainment
14,423
26-05-2017 13:31:59
రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరణ!
న్యూఢిల్లీ: ఇటీవల హింసాత్మకంగా మారిన సహరన్పూర్ గ్రామాలను సందర్శించేందుకు అక్కడి పోలీసులు విపక్షాలకు అవకాశం ఇవ్వడంలేదు. ఇప్పటికే బీఎస్పీ నేత మాయావతికి అనుమతి నిరాకరించిన పోలీసులు తాజాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా అనుమతి నిరాకరించారు. శనివారం సహారన్పూర్ వెళ్లేందుకు ఆయన ముందుగానే షెడ్యూల్ ఖరారు చేసుకోగా.. శుక్రవారం ఆయనకు అనుమతి నిరాకరిస్తూ యూపీ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ‘‘సహారన్పూర్‌లో పర్యటించేందుకు రాహుల్ గాంధీకి అనుమతి లేదు’’ అని శాంతి భద్రతల విభాగం ఏడీజీ ఆదిత్య మిశ్రా వెల్లడించారు. దళితులు, ఠాగూర్‌ వర్గాల మధ్య విభేధాలు రావడంతో సహారన్పూర్‌లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు మొబైల్ ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలను నిలిపివేశారు. ఇప్పటికే దీనిపై కేంద్ర హోంశాఖ యూపీ ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. కాగా సహాన్పూర్‌లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితి నెలకొంటున్నదనీ.. దీన్ని జీర్ణించుకోలేకే కొందరు హింసకు కట్రపన్నారని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
nation
20,169
23-05-2017 17:21:44
జహీర్ ఖాన్‌ను కోచ్‌గా తీసుకోండి : హర్భజన్
న్యూఢిల్లీ : టీమిండియా హెడ్ కోచ్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీ కలిసి తాజాగా బీసీసీఐని ఒక ఫాస్ట్ బౌలింగ్ కోచ్ కావాలని కోరారు. ఈ నేపథ్యంలో భారత వెటరన్ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయంపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. భారత జట్టుకు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్ అయితే బాగుంటుందని చెప్పాడు.  ప్రస్తుతం భారత క్రికెట్‌కు ఫాస్ట్ బౌలర్ల రూపంలో అద్భుతమైన ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, జాస్ప్రిత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, ఇషాంత్ శర్మ అదరగొడుతున్నారు. వీరితో పాటు యువ క్రికెటర్లు సిద్ధార్ద్ కౌల్, జయ్‌దేవ్ ఉనడ్కట్, మహ్మద్ సిరాజ్, బాసిల్ తంపి వంటివారు కూడా తాజాగా ముగిసిన ఐపిఎల్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసి సెలక్షన్ కమిటీకి కఠిన పరీక్ష పెడుతున్నారు.
sports
15,551
07-02-2017 02:02:49
చిన్నమ్మకు చుక్కెదురు
చెన్నై, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలనుకున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. మంగళవారం ఉదయం నిర్వహించ తలపెట్టిన ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమం రద్దయింది. అక్రమాస్తుల కేసులో కోర్టు తీర్పు ఇచ్చే వరకూ వేచి చూడాలని గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు నిర్ణయించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సోమవారం ఉదయం నుంచే నాటకీయంగా జరిగిన వరుస పరిణామాలు ఆమెకు ప్రతికూలంగా మారాయి.      నిజానికి, ముఖ్యమంత్రి పదవికి పన్నీరు సెల్వం చేసిన రాజీనామాను ఢిల్లీలో ఉండే సోమవారం ఉదయం గవర్నర్‌ ఆమోదించేశారు! దాంతో, శశికళ ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమమైందని అన్నాడీఎంకే వర్గాలు భావించాయి. మెరీనా తీరంలోని మద్రాస్‌ యూనివర్సిటీ సెంటినరీ హాలులో ఏర్పాట్లు చేశాయి. అయితే, పన్నీర్‌ రాజీనామాను ఆమోదించిన గవర్నర్‌.. శాసనసభాపక్ష నేతగా శశికళను ఎన్నుకున్నట్లు ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లేఖను ఇచ్చేందుకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. అదే సమయంలో, జయలలిత అక్రమాస్తుల కేసును విచారిస్తున్న సుప్రీం ధర్మాసనం.. వారం రోజుల్లోనే ఈ కేసులో తీర్పును వెలువరిస్తామని ప్రకటించింది. ఆ కేసులో రెండో నిందితురాలిగా శశికళ ఉండడంతో ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్‌ రాజ్యమేలింది. అయినా, రాత్రికి గవర్నర్‌ చెన్నై వస్తారని, ఆయన్ని కలిసి ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను ఇవ్వాలని అన్నాడీఎంకే సీనియర్లు తమ పార్టీ కార్యాలయంలోనే రాత్రి పొద్దుపోయే వరకూ ఎదురు చూశారు! అయినా, గవర్నర్‌ నుంచి స్పందన లేదు. దాంతో, నిరాశగా వెళ్లిపోయారు. కేంద్రం ఆదేశాలతో ఢిల్లీ వెళ్లిన గవర్నర్‌ విద్యాసాగర్‌ రావ్‌ అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత మార్పుపై సోమవారం ఢిల్లీ పెద్దలతో కూలంకషంగా చర్చించారు. రూ.66.65 కోట్ల అక్రమాస్తుల కేసులో జయతోపాటు నిందితురాలిగా ఉన్న శశికళ కేసుపై వారంలోపు తీర్పు వెలువరిస్తామని సుప్రీం కోర్టు ప్రకటించడంతో, ఏమి చేయాలనే అంశంపై అటార్నీ జనరల్‌ సలహా కోరారు. ఆయన సూచన మేరకు ఆ కేసు తీర్పు వెలువడిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇప్పటికిప్పుడు శశికళ చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయిస్తే.. వారం రోజుల్లోపే కోర్టు ఆమెకు వ్యతిరేకంగా తీర్పునిస్తే.. మళ్లీ కొత్త సీఎంను ఎన్నుకోవాల్సి ఉంటుంది.       ఇప్పటికే మూడు నెలల్లో ముగ్గురు సీఎంలు వచ్చారంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారం వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్నాడీఎంకే వర్గాలకు సమాచారం అందింది. గవర్నర్ అటు నుంచి అటే ముంబై వెళ్లిపోయారు. కోయంబత్తూరులో మంగళవారం జరగాల్సిన యూనివర్సిటీ స్నాతకోత్సవాన్ని కూడా వాయిదా వేశారు. ఇక, విశ్రాంతి కోసం ఊటీ వెళ్లడం, అక్కడి నుంచే గవర్నర్‌ హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. దాంతో, ఊటీలోనే ఉన్న తన కుటుంబాన్ని కూడా ముంబైకి తీసుకువచ్చేయాలని అధికారులకు గవర్నర్‌ స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.  నంబరు 2 శశికళ  శశికళకు వ్యతిరేకంగా రాజ్‌భవన ముట్టడి  ముఖ్యమంత్రి శశికళ పేరుతో ట్విటర్‌ ఖాతా: ప్రభుత్వాధికారుల అత్యుత్సాహం  మంత్రి పదవి పట్ల పన్నీర్‌ విముఖత!  కమల్‌ ట్వీట్‌.. ఎవరికి చురక?  ‘మన్నార్గుడి మాఫియా’ పట్ల మోదీకి సదభిప్రాయం లేదు
nation
20,888
21-10-2017 02:07:08
జడ్చర్లకు స్పోర్ట్స్‌ స్కూల్‌ కావాలి
 మంత్రి లక్ష్మారెడ్డికి శాట్స్‌ చైర్మన్‌ విన్నపంహైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలని మంత్రి లక్ష్మారెడ్డికి శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి విన్నవించారు. జడ్చర్ల స్టేడియంలో రూ. 90 లక్షలతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు లక్ష్మారెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో స్పోర్ట్స్‌ స్కూల్స్‌ ఉన్నాయని, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు ఉమ్మడిగా ఒక స్పోర్ట్స్‌ స్కూల్‌ ఉంటే మంచిదని సందర్భంగా మంత్రికి శాట్స్‌ చైర్మన్‌ విన్నవించారు. ఇందుకు సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుందన్నారు. 200 మంది క్రీడాకారులకు ఈ స్కూల్‌ అందుబాటులోకి వస్తే మంచి అథ్లెట్లను తయారు చేయవచ్చని వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.
sports
6,297
25-09-2017 22:08:02
ఊటీ‌లో బన్నీ ఏం చేయబోతున్నాడంటే...
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఊటీలో విహరించబోతున్నాడు. బన్నీ 'నా పేరు సూర్య' తర్వాతి షెడ్యూల్‌ను అక్కడే ప్లాన్ చేశారట. 'దువ్వాడ జగన్నాథం' తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం 'నా పేరు సూర్య'. 'నా ఇల్లు ఇండియా' అనే ట్యాగ్ లైన్‌తో రాబోతున్న ఈ సినిమా ద్వారా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారుతున్నాడు. దేశభక్తి కథాంశంతో మిలటరీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం. ఇటీవలే హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక తర్వాతి షెడ్యూల్‎ను ఊటీలో ప్లాన్ చేశారట. అక్కడ చిత్రంలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో లగడపాటి శ్రీధర్ నిర్మాతగా మెగా బ్రదర్ నాగబాబు సహ నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన అను ఇమ్మాన్యుయెల్ కథానాయికగా నటిస్తుండగా సీనియర్ హీరోలు అర్జున్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాకోసం బాలీవుడ్ మ్యూజికల్ డ్యూయో విశాల్-శేఖర్ సంగీతాన్ని సమకూర్చబోతున్నారు. వచ్చే యేడాది ఏప్రిల్ 27న సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి గత ఏడాది సమ్మర్‌కు 'సరైనోడు' తో సూపర్ హిట్ అందుకున్న బన్నీ.. వచ్చే సంవత్సరం సమ్మర్ కి ఈ సినిమాతోనూ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.
entertainment
9,206
12-02-2017 16:05:57
ఆనాడే ఆత్మహత్య చేసుకుందామనుకున్నా: పవన్
ఇప్పుడంటే ఓ పవర్‌స్టార్‌ను చూస్తున్నాం. కానీ, పవన్ అనుకున్నఓ పనిని చేసుంటే ఆ పవర్ స్టార్‌ను చూసి ఉండలేకపోయే వాళ్లమేమో. అవును.. పవన్ కల్యాణ్ ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడట. ఆ విషయాలను స్వయంగా పవన్ కల్యాణ్ వెల్లడించాడు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం.. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో పవన్ ప్రసంగించాడు. ఇండియన్ కాన్ఫరెన్స్ 2017 సందర్భంగా  దాదాపు గంటసేపు మాట్లాడిన పవన్.. తన బాల్యం, విద్య, సామాజిక అవగాహన, సినిమాలు, రాజకీయాల్లో తన అనుభవాలను పంచుకున్నాడు. చదువులో తానెప్పుడూ వెనకేనని, చదువు అస్సలు అబ్బేదే కాదని వెల్లడించాడు. పుస్తకాల్లో ఉన్నదానికి సమాజంలో జరుగుతున్నదానికి చాలా తేడాలను చిన్నప్పుడే గమనించానని, అది చూసి విపరీతమైన విసుగు పుట్టేదని చెప్పాడు. ఒకానొక దశలో తన అన్న చిరంజీవి లైసెన్స్‌డ్ గన్‌తో కాల్చుకుని చనిపోదామనుకున్నానని పవన్ వెల్లడించాడు. అదృష్టం కొద్దీ కుటుంబ సభ్యుల కౌన్సెలింగ్‌తో ‘ఆత్మహత్య’ ఆలోచనలను విరమించుకున్నానని షాకింగ్ విషయాన్ని తెలిపాడు. ఆ తర్వాత నెమ్మది..నెమ్మదిగా సమాజంపై అవగాహన పెంచుకున్నానని చెప్పాడు. కాగా, జనసేన పార్టీ ఎప్పుడూ జాతీయ సమగ్రతకే ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడించాడు.
entertainment
1,035
16-12-2017 00:28:18
ఈ నోట్‌బుక్‌ ధర రూ.7 లక్షలు
భారత మార్కెట్లోకి ఏసర్‌ ప్రిడేటర్‌ 21ఎక్స్‌ప్రపంచంలో తొలి కర్వ్‌డ్‌ స్ర్కీన్‌ నోట్‌బుక్‌న్యూఢిల్లీ: పర్సనల్‌ కంప్యూటర్ల తయారీ సంస్థ ఏసర్‌.. ‘ప్రిడేటర్‌ 21 ఎక్స్‌’ పేరుతో హై ఎండ్‌ గేమింగ్‌ నోట్‌బుక్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.6,99,999. వంపుతో(కర్వ్‌) కూడిన స్ర్కీన్‌ దీని ప్రత్యేకత. ఐ ట్రాకింగ్‌ టెక్నాలజీతో అనుసంధానించబడి, 2560గీ1080 రిజొల్యూషన్‌ కలిగిన 21 అంగుళాల ఐపిఎస్‌ డిస్‌ప్లే గేమింగ్‌ ఔత్సాహికులకు అత్యద్భుతమైన అనుభూతిని కల్గించనుందని ఏసర్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌, కన్జ్యూమర్‌ బిజినెస్‌ హెడ్‌ చంద్రహాస్‌ పాణిగ్రాహి అన్నారు.  ‘ప్రిడేటర్‌ 21 ఎక్స్‌’ గేమింగ్‌ నోట్‌బుక్‌లు ప్రపంచవ్యాప్తంగా 500 యూనిట్లు మాత్రమే అందుబాటులో తెచ్చామని, భారత్‌లో కంపెనీ ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఆఫర్‌ చేస్తున్నట్లు ఏసర్‌ వెల్లడించింది. ఈ నోట్‌బుక్‌లో డ్యూయల్‌ ఎన్‌విడియా జిఇఫోర్స్‌ జిటిఎక్స్‌ 1080 గ్రాఫిక్స్‌ కార్డ్‌, ఏడో జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ7-7820హెచ్‌కె ప్రాసెసర్‌, 64 జిబి డిడిఆర్‌-2400 మొమొరీ వంటి ఫీచర్లను పొందుపర్చారు.
business
13,190
15-11-2017 03:02:57
నన్ను కొట్టి ఒప్పించారు
‘రియాన్‌’ నిందితుడి ఆరోపణ న్యూఢిల్లీ, నవంబరు 14: గుర్గావ్‌ రియాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ హత్య కేసులో మరో అనూహ్య మలుపు! ప్రద్యుమన్‌ మర్డర్‌ కేసులో జువైనల్‌ నిందితుడు మాట మార్చాడు. నేరం అంగీకరించాలని దర్యాప్తు అధికారులు తీవ్రంగా కొట్టారని, అందుకే ప్రద్యుమన్‌ను హత్యచేసినట్టు ఒప్పుకొన్నానని చెప్పాడు. అధికారులు బలవంతంగా తన నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారని సీబీఐ బృందం, చిన్నారుల పరిరక్షణ సంస్థ అధికారి ఎదుట జువైనల్‌ నిందితుడు పేర్కొన్నట్టు తెలిసింది. ఈ హత్య కేసులో కీలక ఆధారాలు గల్లంతుకావడమో.. తప్పుగా చూపెట్టడమో జరిగిందని సీబీఐ నిర్ధారణకు వచ్చింది.
nation
13,481
19-01-2017 15:42:51
వీసా సంస్కరణలకు బ్రిటన్ ససేమిరా
లండన్ : భారతీయులకు వీసా జారీ విధానాన్ని సంస్కరించేందుకు బ్రిటన్ ప్రధాన మంత్రి థెరెసా మే ససేమిరా అంటున్నారు. ఫలితంగా బ్రెగ్జిట్ తర్వాత అమలుకావాల్సిన అత్యంత ముఖ్యమైన వ్యాపార భాగస్వామ్య ప్రాజెక్టుల్లో ఒకటి ప్రమాదంలో పడుతోంది. బ్రెగ్జిట్ తర్వాత యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటపడుతుండటంతో బ్రిటన్ ఇతర దేశాలను భాగస్వాములుగా చేర్చుకోవడానికి అవకాశం ఉంది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారీ ఆర్థిక వ్యవస్థగల భారతదేశంలో ఆమె పర్యటించారు. ఆమె యూరప్ బయట జరిపిన విదేశీ పర్యటనల్లో భారతదేశమే మొదటిది కావడం విశేషం. తనతో పాటు పెద్ద సంఖ్యలో వ్యాపార ప్రతినిధులను ఆమె తీసుకొచ్చారు. వాణిజ్య ఒప్పందంపై బుధవారం ప్రతిష్ఠంభన ఏర్పడటంతో సీనియర్ డిప్లొమేట్స్, భారత ప్రభుత్వ అధికారులు ఓ హెచ్చరిక చేశారు. వీసా ఆంక్షలను సంస్కరించేందుకు థెరెసా మే నిరాకరించడం వల్ల ఆమె ఆశలపై నీళ్ళు జల్లుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వలసవిధానంపై భారతదేశ ప్రభుత్వ సలహాదారు ఇరుదయ రాజన్ మాట్లాడుతూ వస్తువులు, సేవలు, పెట్టుబడులు స్వేచ్ఛగా రావడం నుంచి ప్రజల రాకపోకలు స్వేచ్ఛగా జరగడాన్ని వేరు చేయలేమని స్పష్టం చేశారు. బ్రిటన్‌కు భారతదేశం చాలా ముఖ్యమైనదని తెలిపారు. తెలివైనవారిపై, వారు విద్యార్థులైనా, నిపుణులైన కార్మికులైనా, ఆంక్షలు విధించడం బ్రిటన్‌కు శ్రేయస్కరం కాదన్నారు. బ్రిటన్‌లో భారతదేశ హై కమిషనర్ యశ్వర్ధన్ కుమార్ సిన్హా మాట్లాడుతూ వీసాల సమస్య ఇంకా పరిష్కారం కాలేదన్నారు. ఐటీ వంటి రంగాల నుంచి దేశంలోకి విద్యార్థులను, వర్కర్లను అనుమతించడంలో ఇతర దేశాల విషయంలో బ్రిటన్ అవలంబిస్తున్న వైఖరితో విభేదించారు. భారతదేశంలో విద్యార్థులను ఆకర్షించేందుకు అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వంటి దేశాలు చురుగ్గా ప్రయత్నిస్తున్నాయన్నారు. ఈ దేశాలకు వెళ్ళే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. అదే సమయంలో బ్రిటన్‌లో భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటికేడు తగ్గుతోందన్నారు. భారతదేశం నుంచి మంచి విద్యార్థులను ఏవిధంగా ఆకర్షించాలో బ్రిటన్ ఆలోచించవలసిన అవసరం ఉందన్నారు. భారతీయ విద్యార్థులు 2011-12లో 29,900 రాగా, 2015-16 నాటికి 16,745కు తగ్గిందన్నారు. ఐటీ వర్కర్లపై వీసా ఆంక్షల ప్రభావం గురించి కూడా సిన్హా మాట్లాడారు. సిలికాన్ వ్యాలీలోని భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ స్థానిక, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల వృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. అదేవిధంగా బ్రిటన్, భారతదేశం పరస్పర ప్రయోజనాల కోసం చర్యలు తీసుకోవాలన్నారు. వీసాల గురించి అందుకే ప్రస్తావిస్తున్నట్లు తెలిపారు. ఇదిలావుండగా వీసా నిబంధనల సడలింపు సమీప భవిష్యత్తులో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. థెరిసా మే హోం శాఖ కార్యదర్శిగా పనిచేసిన సమయంలోనే వీసా విధానాన్ని కట్టుదిట్టం చేశారు. నవంబరులో ఆమె భారతదేశంలో పర్యటించినపుడు ప్రస్తుత వీసా విధానాన్ని మార్చేది లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
nation
7,655
07-01-2017 15:01:16
నాగ్‌ సినిమాలో సమంత?
కొడుకులిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్న ప్రస్తుత తరుణంలో కూడా అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘ఓం నమోవేంకటేశాయ’ సినిమాలో నటిస్తున్న నాగ్‌.. ఆ తర్వాత ‘రాజుగారి గది-2’లో చేయబోతున్నాడు. టీవీ యాంకర్‌ ఓంకార్‌ దీనికి దర్శకుడు.
entertainment
11,780
27-12-2017 16:17:25
మహాదయి జలాల కోసం నిరసనలు
బెంగళూరు : మహాదయి ప్రాజెక్టును అమలు చేయాలనే డిమాండ్ నిరసనల రూపందాల్చుతోంది. కర్ణాటక రైతు సేన బుధవారం ఆందోళన కార్యక్రమాలను ప్రారంభించింది. మహాదయి నదికి ఉప నదులు కలశ, బందూరీలపై ఆనకట్టలను నిర్మించాలని డిమాండ్ చేసింది. గవర్నర్, ముఖ్యమంత్రి, తదితరులకు వినతి పత్రాలను సమర్పించాలని నిర్ణయించింది. కలశ, బందూరీలపై ఆనకట్టలను నిర్మిస్తే ఉత్తర కర్ణాటకలోని కరవు పీడిత ప్రాంతాలకు నీరు అందుతుంది. 7.56 టీఎంసీల నీటిని మళ్ళించేందుకు వీలవుతుంది. కర్ణాటక రైతు సేన బంద్‌కు పిలుపునిచ్చింది. దీనికి ఉత్తర కర్ణాటకతోపాటు కన్నడ సంఘాలు కూడా మద్దతిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ శాఖ కూడా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించింది. కాంగ్రెస్ ఈ సమసపై రాజకీయం చేస్తోందని ఆరోపించింది. అయితే కర్ణాటక రైతు సేన నేతలు ఐదు రోజుల నుంచి రాష్ట్ర బీజేపీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో ఉత్తర కర్ణాటక రైతులు పాల్గొంటున్నారు.
nation
20,851
07-07-2017 02:29:22
గుణతిలక, డిక్‌వెల్లా శతకాలు
 జింబాబ్వేపై లంక రెండో విజయంహంబన్‌తోట: ధనుష్క గుణతిలక (116), నిరోషన్‌ డిక్‌వెల్లా (102) సెంచరీలతో రాణించడంతో.. జింబాబ్వే తో మూడో వన్డేలో శ్రీలంక 8 వికెట్లతో నెగ్గి 2-1తో సిరీస్‌లో ఆధిక్యం సాధించింది. గురువారమిక్కడ జరిగి న ఈ మ్యాచ్‌లో తొలుత జింబాబ్వే 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. హామిల్టన్‌ మసకద్జా (111) సెంచరీతో సత్తా చాటాడు. అనంతరం భారీ లక్ష్యాన్ని లంక 2 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 16 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఉపుల్‌ తరంగ (44 నాటౌట్‌) రాణించాడు.
sports
762
19-09-2017 02:18:46
బిఎస్‌ఎన్‌ఎల్‌ నూతన టారిఫ్‌ ప్లాన్‌
నెల రోజులు అపరిమిత ఉచిత కాల్స్‌విజయవాడ (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగంలోని భారత సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్‌ఎన్‌ఎల్‌‌) మరో ల్యాండ్‌లైన్‌ టారిఫ్‌ ప్లాన్‌ను ఆవిష్కరించింది. విజయవాడ బిఎస్‌ఎన్‌ఎల్‌ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో జనరల్‌ మేనేజర్‌ కె దామోదరరావు ఈ ప్లాన్‌ వివరాలను వెల్లడించారు. రూ.349 టారీఫ్ తో ప్రారంభించిన ఈ ప్లాన్‌ ద్వారా ఖాతాదారులు ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ ద్వారా నెల రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అపరిమిత వాయిస్‌ కాల్స్‌ అందుకోవచ్చని చెప్పారు.  ఇంకా ప్రతిరోజు రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకు దేశవ్యాప్తంగా ఉన్న ఏ నెట్‌వర్క్‌కు అయినా ఉచిత కాల్స్‌ చేసుకోవచ్చన్నారు. అలాగే ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌ ఫోన్లకు ఉచితకాల్స్‌ చేసుకోవచ్చన్నారు. ఈ ప్లాన్‌ వినియోగదారులకు ఇన్‌స్టలేషన్‌ చార్జీలు ఉండవని తెలిపారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పటికే పలు పథకాల ద్వారా నైట్‌టైమ్‌ ఫ్రీ కాల్స్‌తోపాటు, రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకు ఉచిత కాల్స్‌ అందించిన విషయాన్ని గుర్తు చేశారు.  ప్రస్తుతం ల్యాండ్‌లైన్‌ కనెక్షన్‌ ద్వారా అందుబాటులో ఉన్న పలు పథకాల టారీఫ్ లను, సౌకర్యాలనూ వివరించారు. మొబైల్‌ ఫోన్లను వాడుతున్న వారు వచ్చే ఫిబ్రవరిలోపు తమ ఆధార్‌, వేలిముద్రలతో సహా నమోదు చేయించుకోవాలని బిఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు కోరారు. లేకపోతే కనెక్షన్లు రద్దవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎస్‌ఎన్‌ఎల్‌ హెచ్‌ఆర్‌ జనరల్‌ మేనేజర్‌ జి నాగేశ్వర్రావు, కన్స్యూమర్‌ మొబైల్‌ ప్రాజెక్టు జనరల్‌ మేనేజరు జాన్‌ క్రిసోస్తమ్‌ పాల్గొన్నారు.
business
12,272
27-03-2017 01:28:14
సుప్రీం, హైకోర్టు జడ్జిల వేతనాలు 2 రెట్లు!
న్యూఢిల్లీ, మార్చి 26: సుప్రీం కోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సహా న్యాయమూర్తుల వేతనాలు 200% పెరగనున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు కేంద్రం పచ్చజెండా ఊపినట్టు సమాచారం. దీంతో వేతనాల పెంపునకు సంబంధించిన సవరణ బిల్లును పార్లమెంటులో ఆమోదం పొందాల్సి ఉండడంతో న్యాయశాఖ మంత్రి ఆదిశగా చర్యలు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి 7వ వేతన సంఘం సిఫారసు చేసిన నేపథ్యంలో తమకూ వేతనాలను పెంచాలని న్యాయమూర్తులు కోరారు. ఈ క్రమంలో కొన్ని నెలల కిందట వేతనాలు ఎంత పెంచాలన్న విషయంపై ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనాన్ని రూ.3 లక్షలకు పెంచాలని కమిటీ సిఫారసు చేసింది. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం సుప్రీం ప్రధా న న్యాయమూర్తికి రూ.2.8 లక్షలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రూ.2.5 లక్షలు, న్యాయమూర్తులకు రూ.2.25 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది.
nation
19,663
18-12-2017 16:59:33
వాళ్లతో మమ్మల్ని పోల్చొద్దు ప్లీజ్: చాహల్
న్యూఢిల్లీ: మిడిల్ ఓవర్లలో ఇరగదీస్తున్న టీమిండియా లెఫ్టార్మ్ చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్, రైట్ ఆర్మ్ లెగ్‌బ్రేక్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్‌లు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆదివారం విశాఖలో శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలోనూ వీరిద్దరూ చెలరేగిపోయారు. చెరో మూడు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం చాహల్ మాట్లాడుతూ.. ‘‘మిడిల్ ఓవర్లలో ఎటాక్ చేయడమే మా పని’’ అని పేర్కొన్నాడు. అప్పుడు శ్రీలంక ఒత్తిడిలో ఉందని, తమకు వికెట్లు కావాలని అన్నాడు. చాహల్ బౌలింగ్‌కు సదీర సమరవిక్రమ, ఏంజెలో మాథ్యూస్, థిసారా పెరీరా బాధితులవగా, ఉపుల్ తరంగ, నిరోషన్ డిక్‌వెల్లా, అకిల దనంజయలను కుల్దీప్ పెవిలియన్ పంపాడు. గత కొన్నేళ్లుగా అద్భుతంగా రాణిస్తున్న వీళ్లిద్దరూ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాను పోటీ నుంచి వెనక్కి నెట్టారు. అయితే వారిద్దరితో తమను పోల్చడంపై మాత్రం చాహల్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశాడు. అశ్విన్, జడేజాలు గత ఐదారేళ్లుగా జట్టు కోసం ఎంతో చేశారని, వారితో తమను పోల్చడం సరికాదని చాహల్ పేర్కొన్నాడు. తాము నాలుగైదేళ్ల నుంచే ఆడుతున్నామని, కాబట్టి వారితో నన్ను, కుల్దీప్‌‌ను పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డాడు. టెస్ట్ క్రికెట్ ఆడాలనేది ప్రతి ఒక్కరి కల అని పేర్కొన్న చాహల్ ప్రస్తుతం తాను దక్షిణాఫ్రికా టూర్ గురించి ఆలోచించడం లేదని, తన దృష్టంతా శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌పైనే ఉందని చాహల్ వివరించాడు.
sports
5,541
26-12-2017 22:57:49
బోల్డ్‌ బ్యూటీ!
అందం చూడవయా... ఆనందించవయా అన్నారు. అందులోనూ బాలీవుడ్‌ స్టార్‌ కరీనా కపూర్‌ లాంటి ముద్దుగుమ్మలు ఇలా బ్రైట్‌ కలర్స్‌లో జిగేల్‌మంటుంటే... ఎవరు మాత్రం చూపు తిప్పుకోగలరు! మొన్నామధ్య బిడ్డకు జన్మనిచ్చిన కరీనా... మళ్లీ గ్లామర్‌ ఫీల్డ్‌ను ఊపేసేందుకు సిద్ధమవుతోంది. ముంబైలో ఇటీవల జరిగిన తన ఆడపడుచు, బాలీవుడ్‌ తార సోహా అలీఖాన్‌ పటౌడీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలోనిదీ ఫొటో. రెడ్‌ కలర్‌... కీహోల్‌ నెక్‌... తళుకుమనే ఎంబ్రయిడరీ హంగులద్దిన డ్రెస్‌లో బోల్డ్‌గా మెరిసిపోతోందీ బ్యూటీ. చాలా కాలం తరువాత విభిన్నమైన లుక్స్‌తో మతి పోగొడుతున్న కరీనా ఫొటో చూసి నెటిజనులు ఫిదా అవుతున్నారు. లక్షల్లో లైక్‌లు... వేలల్లో షేరింగ్‌లు... సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు హిట్‌ ‘బొమ్మ’!
entertainment
5,273
26-05-2017 00:22:32
మనుషులతో దెయ్యాల సరదా ఆట
శ్రీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘రా.. రా..’ చిత్రం జూన్ ప్రథమార్ధంలో విడుదలకు సిద్ధమవుతోంది. విజి చెర్రీస్‌ విజన్ నిర్మించగా, అదే యూనిట్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాజియా నాయికగా నటించారు. నిర్మాణానంతర పనులు పూర్తయిన సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘ఇది హాస్యం మేళవించిన హారర్‌ థ్రిల్లర్‌. మనుషులకు, దెయ్యాలకు మధ్య సాగే సరదా ఆటలు సగటు ప్రేక్షకుడ్ని వినోదాల తీరంలో విహరింపజేస్తాయి. ఈ తరహా సినిమా చేయడం నాకిదే తొలిసారి’’ అన్నారు. ఇటీవల చిరంజీవి ఆవిష్కరించిన మోషన పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందనీ, త్వరలోనే టీజర్‌, పాటలను విడుదల చేస్తామనీ నిర్మాత విజయ్‌ తెలిపారు.
entertainment
6,114
03-06-2017 15:41:11
పులిని గొడుగుతో చంపేశాడట!
వంశీ సినిమాల్లో చమత్కారాలకు లోటేం ఉండదు. ఆయన గత సినిమాలను చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. తాజాగా వచ్చిన వంశీ సినిమా ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’లోనూ అలాంటి ఓ సటైరే ఇప్పుడు నెట్‌లో వైరల్ అయింది. ఆ జోక్ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ఆ జోకేంటి..? అంటే.. ‘పులిని గొడుగుతో చంపడం’! అదెలా సాధ్యమనుకుంటున్నారా..? అయితే.. సినిమాలో కృష్ణ భగవాన్‌తో ఓ ముసలాయన చర్చలోకి వెళ్లాల్సిందే. ఆ ముసలాయన కృష్ణభగవాన్ వద్దకు వెళ్లి ‘‘ఒరే నాకు ఈ వయసులో పెళ్లేంటి అన్నావు కదా.. ఇప్పుడు చూశావా..? మా ఆవిడకు రెండో నెల’’ అన్నాడట. వెంటనే కృష్ణభగవాన్ ఆ ముసలాయనకు సటైర్ వేస్తూ సమాధానం చెప్తాడు. ‘‘నాకో స్నేహితుడు ఉండేవాడు. వాడికి వేట అంటే ఇష్టం. ఓ రోజూ వేటకు వెళుతూ కంగారులో గన్‌కు బదులు గొడుగు తీసుకెళ్లాడు. అడవిలో పులిని ఆ గొడుగుతోనే కాల్చి చంపేశాడు’’ అని చెప్తాడట. అప్పుడు ఆ ముసలాయన ‘‘గొడుగుతో పులిని ఎలా చంపుతాడు.. పక్కన ఉన్నవాడు ఎవడో గన్‌తో చంపి ఉంటాడు’’ అని అంటాడు. అయితే.. అందులోని అసలు ‘డబుల్ మీనింగ్ డైలాగ్’ అర్థమై ప్రేక్షకులు భళ్లున నవ్వేస్తున్నారు మరి. సుమంత్ అశ్విన్, అనీషా ఆంబ్రోస్ హీరో..హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను మధుర శ్రీధర్ నిర్మించారు. మణిశర్మ స్వరాలు సమకూర్చారు.
entertainment
5,820
28-07-2017 20:39:00
సాయిధరమ్ తేజ్ నాన్‌స్టాప్ డాన్స్..!
వెండితెరపై మెగా ఫ్యామిలీ హీరోలు డాన్సులు చేస్తున్నారంటే చాలు.. అభిమానుల ఈలలతో థియేటర్లు హోరెత్తిపోతాయి. చిరంజీవితో మొదలుకొని రామ్ చరణ్, అల్లు అర్జున్ డాన్సులు ఇప్పటికే ప్రేక్షకలోకాన్ని మెప్పించి అలరిస్తుండగా తాజాగా ఆ కోవలోకి మరో మెగా ఫ్యామిలీ కుర్రాడు వచ్చిచేరాడు. అతనే సాయి ధరమ్ తేజ్. ఈ కుర్రహీరో ఇటీవలే సుప్రీమ్ సినిమాలో 'అందం విందోళం..ఆధరం తాంబూలం' పాటతో ప్రేక్షకలోకానికి తన స్టెప్పుల్లో స్టైల్ ఎలాఉంటుందో పరిచయం చేశాడు. అంతేకాకుండా తాను చేస్తున్న అన్ని సినిమాల్లో డాన్స్ పై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నాడు. అయితే సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'జవాన్'. ఈ సినిమాలో ఆయన తన స్టెప్పులతో ఇరగదీస్తున్నాడని తెలిసింది. ఒక పాట కోసం సింగల్ షాట్ లో బోలెడన్ని స్టెప్పులతో అక్కడున్న వారందరినీ ఆశ్చర్య పరిచాడట. ఒక నిమిషంపాటు ఆగకుండా డాన్స్‌చేసి అందరినీ మాయలో పడేశాడట. ఈపాటలో సాయిధరమ్ తేజ్ స్టెప్పులు అత్యత్బుతంగా వచ్చాయని, వెండితెరపై ఈడాన్స్ చూసిన ప్రతీ ఒక్కరూ సాయిధరమ్ ని అభినందించడం ఖాయం అంటున్నారు యూనిట్ సభ్యులు. చిత్రానికి బీవీఎస్ రవి దర్శకత్వం వహిస్తుండగా.. మొహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తోంది.
entertainment
5,086
13-12-2017 12:27:59
అనుష్క డైలీ ఏం చేస్తుందంటే....
ముంబై: బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ రెండు రోజుల క్రితం క్రికెటర్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే! ఈ జంట ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అనుష్క ఫిట్‌నెస్‌గా ఉండేందుకు యోగాతో పాటు వ్యాయామ ప్రక్రియలను అవలంబిస్తుంది. బ్రేక్ ఫాస్ట్: రెండు గుడ్లు(కేవలం వైట్ పార్ట్), ఒక గ్లాసు ఫ్రూట్ జ్యూస్మిడిల్ స్నాక్: చీజ్ టోస్ట్, నిమ్మరసం, కొబ్బరి నీరులంచ్: పప్పు, రెండు రొట్టెలు, సలాడ్, ఇంటి దగ్గర వండిన కూరలుఈవినింగ్: సీజనల్ ఫ్రూట్, ప్రొటీన్, ఒక గ్లాసు పాలుఅనుష్క జంక్‌ఫుడ్ అస్సలు తీసుకోదుజంక్ ఫుడ్‌తినడం వలన చర్మం కూడా దెబ్బతింటుందని ఆమె భావన.అనుష్క రోజుకు రెండు సార్లు యోగా చేస్తుంది. శరీరాన్ని, మనసును శుభ్రపరచుకోవడానికి యోగా ఉపకరిస్తుందని అనుష్క చెబుతుంది.
entertainment
8,170
27-09-2017 11:21:00
స్పైడర్ రివ్యూ
స‌మ‌ర్ప: ఠాగూర్ మ‌ధునిర్మాణ సంస్థలు: ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తారాగ‌ణం: మ‌హేష్, ర‌కుల్ ప్రీత్‌, ఎస్‌.జె.సూర్య‌, భ‌ర‌త్ త‌దిత‌రులుఎడిటింగ్: శ్రీక‌ర్ ప్రసాద్‌ఫైట్స్: పీట‌ర్ హెయిన్స్‌సంగీతం: హేరిష్ జైరాజ్‌సినిమాటోగ్రఫీః సంతోష్ శివ‌న్‌నిర్మాతః ఎన్‌.వి. ప్రసాద్‌క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగ‌దాస్‌ ఇటు క్లాస్‌, అటు మాస్ ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న హీరోల్లో మ‌హేష్ ముందు వ‌రుస‌లో ఉంటారు. అందుకే మ‌హేష్ మూవీ రిలీజ్ అవుతుందంటే భారీ ఎక్సెపెక్టేష‌న్స్ ఉంటాయి. తుపాకీ, క‌త్తి సినిమాల‌తో పాటు ప‌లు హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ఎ.ఆర్.మురుగ‌దాస్‌. స్టాలిన్ త‌ర్వాత మ‌రే తెలుగు సినిమాను డైరెక్ట్ చేయ‌ని మురుగ‌దాస్ మ‌హేష్ హీరోగా తెలుగులో తెర‌కెక్కించిన సినిమా స్పైడ‌ర్‌. కాగా ఈ సినిమా తెలుగు, త‌మిళంలో ఏక కాలంలో రూపొందింది.  మ‌హేష్‌కు తొలి త‌మిళ స్ట్రయిట్ మూవీ. స్పై థ్రిల్లర్‌గా రూపొందిన స్పైడ‌ర్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అందుకు మ‌హేష్ హీరో కావ‌డం ఒక కార‌ణ‌మైతే, మ‌రో కార‌ణం మురుగ‌దాస్ ద‌ర్శకత్వం. ఇక దర్శకుడు ఎస్‌.జె.సూర్య విల‌న్‌గా న‌టించాడు. ఇంత భారీ అంచనాలు న‌డుమ విడుద‌లైన స్పైడ‌ర్ మ‌హేష్ అభిమానుల‌ను ఆకట్టుకుందా? హీరోయిజాన్ని టాప్ రేంజ్‌లోఎలివేట్ చేసే ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్, మ‌హేష్‌ను తెర‌పై ఎలా చూపించాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా కథేంటో చూద్దాం.. క‌థః శివ (మ‌హేశ్‌) ఇంట‌లిజెన్స్ బ్యూరోలో ప‌నిచేస్తుంటాడు. షూటింగ్‌లో ప్రావీణ్యం ఉన్నప్పటికీ త‌ప్పులు జ‌ర‌గ‌క‌ముందే తెలుసుకుని వారిని కాపాడ‌టంలో ఆత్మసంతృప్తి ఉంద‌ని న‌మ్ముతాడు. ఆ ప్రకారం త‌న అవ‌స‌రాల‌కు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ల‌ను సిద్ధం చేసుకుంటాడు. ప‌బ్లిక్ మాట్లాడే ప్రైవేట్ ఫోన్ల ద్వారా కొన్ని ప‌దాలు వినిపిస్తే త‌న‌కు అల‌ర్ట్ వ‌చ్చేలా రెండు సాఫ్ట్‌వేర్‌ల‌ను సిద్ధం చేసుకుంటాడు. ఆ ప్రకార‌మే కొంద‌రిని కాపాడుతుంటాడు. ఈ ప‌నిలో అత‌నికి మ‌రో ముగ్గురు స్నేహితులు సాయం చేస్తుంటారు. ఓ సారి ఇత‌నికి సాయం చేయ‌బోయి పోలీస్ ఉద్యోగం చేస్తున్న స్నేహితురాలు ప్రాణాల‌ను పోగొట్టుకుంటుంది. దాంతో దానికి కార‌కులెవ‌ర‌నే విష‌యాన్ని ఆరాతీస్తాడు. భైర‌వుడు (ఎస్‌.జె.సూర్య‌), అత‌ని త‌మ్ముడు (భ‌ర‌త్‌) గురించిన విష‌యాలు అప్పుడే వెలుగులోకి వ‌స్తాయి. ఇత‌రుల ఏడుపు విని ఆనందాన్ని అనుభ‌వించే ఆ సోద‌రుల బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? జ‌నాల ఏడుపులు విన‌డానికి వాళ్లు ఎంత దూరానికైనా తెగిస్తారా? హాస్పిట‌ల్‌లో ఉన్న పేషెంట్స్ ప్రాణాల‌తో భైర‌వుడు ఎలా ఆడుకున్నాడు. ఆ ఆట నుంచి జ‌నాల‌ను కాపాడ‌టానికి శివ‌కు చార్లీ (ర‌కుల్ ప్రీత్ సింగ్‌) ఎలా సాయం చేసింది? ఇంత‌కూ శివ‌కు, చార్లీకి ప‌రిచ‌యం ఎలా జ‌రిగింది? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌రం. ప్లస్ పాయింట్స్: మ‌హేష్ న‌ట‌న సినిమాకు ప్ర‌ధాన బ‌లం. అలాగే హరీష్ జైరాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మెప్పించింది. ముఖ్యంగా విల‌న్‌, హీరో మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. ప్రీ క్లైమాక్స్ సీన్‌లో విల‌న్‌ను ప‌ట్టుకునే సంద‌ర్భంలో రియాలిటీ షో లాంటి స‌న్నివేశం, రోల‌ర్ కోస్టర్ ఫైట్ సీన్ బావుంది. సంతోష్ శివ‌న్ సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించ‌న‌క్కర్లేదు. ప్రతీ స‌న్నివేశాన్ని ఎంతో రిచ్‌గా చూపించారు సంతోష్ శివ‌న్‌. మైన‌స్ పాయింట్స్:ఆర్‌.మురుగ‌దాస్ సినిమాల్లో బ‌ల‌మైన క‌థ, క‌థ‌నం ఉంటాయి. ఈ సినిమాలో అవి క‌న‌ప‌డ‌వు. ప్రేక్షకుల‌ను ఆస‌క్తితో క‌ట్టిప‌డేసే స‌న్నివేశాల‌ను అందంగా మ‌ల‌చ‌గ‌ల ద‌ర్శకుడు మురుగదాస్ ఈ సినిమాలో ఒక‌టి రెండు సన్నివేశాలు మిన‌హా ర‌క్తి క‌ట్టించ‌లేక‌పోయాయి. హీరోయిన్ ర‌కుల్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. బ‌ల‌మైన ఎమోష‌న్స్ క‌న‌ప‌డ‌వు. అలాగే పాట‌లు ఒక్కటి కూడా ఆక‌ట్టుకోదు. విశ్లేష‌ణఃమ‌హేష్ ఎప్పటిలా త‌న‌దైన న‌ట‌న‌తో అల‌రించాడు. ఎప్పటిలా ఎన‌ర్జిటిక్ పెర్ఫామెన్స్‌, న‌ట‌న‌తో ఆకట్టుక‌న్న మ‌హేష్ తెర‌పై చాలా హ్యాండ్‌స‌మ్‌గా క‌న‌ప‌డ్డాడు. విల‌న్‌తో క్లైమాక్స్ ముందు జ‌రిగే సంభాష‌ణ స‌న్నివేశంతో పాటు విల‌న్‌ను పోలీసులకు లేడీస్ ప‌ట్టించే స‌న్నివేశంలో కూడా మ‌హేష్ న‌ట‌న మెప్పిస్తుంది. ఇంత‌కు ముందు చెప్పిన‌ట్లు ర‌కుల్ పాత్రకు పెద్ద ప్రాధాన్యం క‌న‌ప‌డ‌లేదు. కేవ‌లం పాట‌ల‌కు మాత్రమే ప‌రిమితం అయ్యింది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్ర విల‌న్‌గా న‌టించిన ఎస్‌.జె.సూర్య‌. పూర్తి స్థాయి విల‌న్‌గా ఎస్‌.జె.సూర్య న‌ట‌న మెప్పించింది. ఒక సైకిక్ ప్రశ్నగా సూర్య హావ‌భావాలు మెప్పిస్తాయి. అలాగే భ‌ర‌త్ పాత్ర ప‌రిమిత‌మే అయినా, ఉన్నంతలో త‌న పాత్రకు న్యాయం చేశాడు భ‌ర‌త్‌. ఇజ జ‌య‌ప్రకాష్‌, షియాజీ షిండే వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. మ‌హేష్ స్నేహితులుగా ప్రియ‌ద‌ర్శి, ఆర్‌.జె.బాలాజీ ఓకే. ఇక టెక్నిక‌ల్ టీం విష‌యానికి వ‌స్తే, ద‌ర్శకుడు ఎ.ఆర్‌.మురుగదాస్ బ‌ల‌మైన క‌థ‌ను రాసుకోలేదు. ఎస్‌పిడి అనే మాన‌సిక రోగం చుట్టూ ఓ క‌థ‌ను రాసుకున్నాడు. దాని చుట్టూ ఓ స్పై మూవీ చేయ‌డం, అది కూడా మురుగ‌దాస్ వంటి ద‌ర్శకుడు సినిమాను తెరకెక్కించ‌డం కాస్తా ఆశ్చర్యానికి లోను చేసేదే. సంతోష్ శివ‌న్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. నిర్మాత పెట్టిన ఖ‌ర్చును సంతోష్ శివ‌న్ త‌న కెమెరాతో బంధించిన తీరు బావుంది. హరీష్ జైరాజ్ ట్యూన్స్ బాలేవు. ట్యూన్స్ త‌గ్గ సాహిత్యం కుద‌రలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. సినిమాను ఓసారి చూడొచ్చు. బోట‌మ్ లైన్: `స్పైడర్‌`...ఓకే అనిపించే స్పై థ్రి‌ల్లర్‌రేటింగ్: 2/5 స్పైడర్ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ‘శ్రియను ఆ సినిమాలో అనవసరంగా తీసుకున్నారు’
entertainment
4,759
06-11-2017 23:57:06
పద్మావతి సినిమాపై ముదురుతున్న వివాదం
సమరం.. ఇది నమ్మకాలకు ఆధారాలకు మధ్య సమరం..!మనోభావాలకు సృజనాత్మక స్వేచ్ఛకు మధ్య యుద్ధం..!! పద్మావతి సినిమాయే కావొచ్చు. కానీ దాని వెనుక చరిత్ర ఉంది. స్ర్తీ త్యాగం ఉంది. రాజపుత్‌ల ఆత్మగౌరవం ఉంది. దానికి భంగం కల్గితే విధ్వంసమే అని వారు హెచ్చరిస్తున్నారు. అసలు ఇందులో ఉన్న అభ్యంతరకర సన్నివేశాలు ఏమిటి? రాజపుత్‌లతో దర్శకుడు భన్సాలీ సంధి చేసుకుంటారా? లేక రణానికే సై అంటారా? రాజస్థాన్‌, నవంబరు 6: ముహూర్తం షాట్‌కి ముందే పద్మావతి సినిమాపై వివాదం రాజుకుంది. రిలీజ్‌డేట్‌ దగ్గర పడుతున్నకొద్దీ రాజస్థాన్‌లో దాడులు, హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. రాణి పద్మావతి సొంతగడ్డ అయిన చిత్తోగఢ్‌ ఆందోళనలు, ప్రదర్శనలతో రగులుతోంది. డిసెంబరు 1న విడుదల కావాల్సిన పద్మావతి సినిమాను అడ్డుకుని తీరుతామని రాజ్‌పుత్‌ కర్ని సేన హెచ్చరించింది. వారిద్దరి మధ్య..దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ చరిత్రను వక్రీకరించారని రాజ్‌పుత్‌లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సినిమాలో మహారాణి పద్మావతి, అల్లావుద్దీన్‌ ఖిల్జీలమధ్య లవ్‌ సీన్స్‌ ఉన్నాయన్నది వారి ప్రధాన ఆరోపణ. ఆ సన్నివేశాలను తొలగించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్‌ ఇస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో పద్మావతి షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే రాజ్‌పుత్‌ కర్ని సేన భగ్గుమంది. పద్మావతి సెట్‌లో బీభత్సం సృష్టించింది. దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీపై దాడికి పాల్పడింది. చారిత్రక గాధలను తెరకెక్కించడంలో పేరుగాంచిన భన్సాలీపై దాడిని బాలీవుడ్‌ ఖండించింది. అసలు సినిమా రిలీజ్‌ కాకుండా తాను చరిత్రను వక్రీకరించానని ఎలా నిర్థారణకు వస్తారని ఆయన ప్రశ్నించారు. దీపికా పడుకోన్‌ రణ్‌వీర్‌సింగ్‌, షాహిద్‌కపూర్‌వంటి భారీ తారాగణంతో దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో ‘పద్మావతి’ రూపుదిద్దుకుంది. పద్మావతిని త్రీడీలో కూడా ప్రేక్షకుల మందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో భన్సాలీని మళ్లీ వివాదాలు చుట్టుముట్టాయి.   పొలిటికల్‌ డ్రామారాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌సహా అనేక పట్టణాల్లో పద్మావతి సినిమాకి వ్యతిరేకంగా రాజ్‌పుత్‌లు బంద్‌ నిర్వహించారు. రిలీజ్‌కి ముందే సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించి, తమ అభ్యంతరాలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌కి కూడా ఈ సినిమా సెగ తగిలింది. వాస్తవాలను వక్రీకరించారన్న ఆరోపణల నేపథ్యంలో క్షత్రియుల కోసం ప్రీరిలీజ్‌ స్ర్కీనింగ్‌ ఏర్పాటుచేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.  అంతేకాదు ‘పద్మావతి’ విడుదలను అడ్డుకోవాలని కూడా ఎన్నికల సంఘాన్ని కోరింది. అటు కాంగ్రెస్‌ కూడా రాజ్‌పుత్‌ల మనోభావాలు దెబ్బతీసేవిధంగా సినిమా ఉంటే రిలీజ్‌ను ఆపాల్సిందే అని స్పష్టంచేసింది. పద్మావతి సినిమాపై ఆందోళనల దండయాత్ర కొనసాగుతోంది. రాజస్థాన్‌, గుజరాత్‌లలో పరిస్థితి వేడెక్కింది. తమ ఆత్మగౌరవ ప్రతీక అయిన రాణి పద్మావతి చరిత్రను వక్రీకరిస్తే దేశంలో ఎక్కడా సినిమాను ఆడనివ్వమని రాజ్‌పుత్‌లు హెచ్చరిస్తున్నారు. దీంతో సినిమా రిలీజ్‌ చేయాలంటే తమకు భద్రత కావాలని రాజస్థాన్‌లో థియేటర్ల ఓనర్లు గగ్గోలు పెడుతున్నారు. మరి బాహుబలికి సమాధానమంటూ బాలీవుడ్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘పద్మావతి‘ సాఫీగా రిలీజ్‌ అవుతుందా? తన దృశ్యకావ్యాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి భన్సాలీ ఏం చేస్తారు? అన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  ‘పద్మావతి’కి ఉమాభారతి సలహా ‘చరిత్రకారులు, రాజ్‌పుత్‌లు, చిత్ర ప్రతినిధులు, సెన్సార్‌బోర్డు సభ్యులు కమిటీగా ఏర్పడి వివాద పరిష్కారానికి ఎందుకు ప్రయత్నించకూడదు? భారత స్త్రీ ఆత్మాభిమానానికి భంగం వాటిల్లితే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ నేను సహించను. - ఉమాభారతి, కేంద్ర మంత్రి  పద్మావతి ఎవరు? మహారాణి పద్మావతి..రాజ్‌పుత్‌ల ఆత్మగౌరవ నినాదం. స్త్రీ స్వాభిమానానికి ప్రతీక. ఇది క్రీ.శ. 13, 14 శతాబ్దాలనాటి గాధ! ప్రేమ..వ్యామోహం..పోరాటాల కలయిక! రాజస్థాన్‌లో ప్రచారం ఉన్న కథల ప్రకారం.. సింఘాల్‌ రాజ్య యువరాణి అయిన పద్మావతి అందచందాలకు దేశంలో అనేకమంది రాజులు ముగ్ధులవుతారు. చిత్తోర్‌గఢ్‌ పాలకుడైన రతన్‌సేన్‌ ఆమెను ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు.  పద్మావతి సౌందర్యం గురించి విన్న ఢిల్లీ సుల్తాన్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీ ఆమెను సొంతం చేసుకోవడానికి చిత్తోర్‌గఢ్‌పై దండెత్తుతాడు. అనేక నాటకీయ పరిణామాల మధ్య పద్మావతి భర్త రతన్‌సేన్‌ చనిపోతాడు. ఇక అల్లావుద్దీన్‌ ఖిల్జీ తమ కోటను స్వాధీనం చేసుకుంటాడనగా..అతనికి వశంకాకుండా అగ్నికి ఆహుతి అవుతుంది పద్మావతి. వందలాది రాజ్‌పుత్‌ స్త్రీలతో కలిసి అగ్నిగుండంలో ఆత్మారణ చేసుకుంటుంది.
entertainment
7,262
11-07-2017 11:22:10
సోషల్‌మీడియాలో ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రంతో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. భారత్‌లో అత్యంత ప్రభావితమైన పిన్న వయస్కుల జాబితాలో ప్రభాస్ ఆరోస్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’తో జాతీయస్థాయి నటుడిగా మారిన ప్రభాస్.. ఆ సినిమా మొదటి భాగం విడుదలై రెండేళ్లయిన సందర్భంగా సోషల్‌మీడియాలో ఎమోషనల్ పోస్ట్ ఒకటి చేశాడు. ప్రభాస్ చేసిన ఆ పోస్ట్‌పై అభిమానులు కూడా అంతే ఉద్వేగంతో ప్రతిస్పందిస్తున్నారు. భారత సినీ పరిశ్రమలో తనను ఉన్నత స్థానంలో నిలిబెట్టిన రాజమౌళికి, సినీ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు ప్రభాస్. ‘‘నాకెంతో ప్రత్యేకమైన సినిమా ‘బాహుబలి ది బిగినింగ్’ విడుదలై రెండేళ్లు పూర్తయింది. కానీ సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. చిత్ర యూనిట్ మొత్తం ఒక తపనతో పడిన కష్టం నా జ్ఞాపకాల తెరముందు స్పష్టంగా కనిపిస్తోంది. నా కెరీర్‌ను మహోన్నతమైన స్థాయికి తీసుకెళ్లిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదని భావిస్తున్నాను. ‘బాహుబలి’ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా మనందరినీ వెనకుండి నడిపించిన రాజమౌళికి మనం రుణపడి ఉంటాం.’’ అని ప్రభాస్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
entertainment
13,422
05-12-2017 08:00:54
మెట్రోరైలు,బస్సుల్లో ప్రయాణించేందుకు ఉమ్మడి మొబిలిటీ కార్డు
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ప్రయాణికులకు ఢిల్లీ మెట్రోరైలు, ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌లు కొత్త సంవత్సరం బహుమతి ఇవ్వనున్నాయి. ప్రయాణికులు ఢిల్లీ మెట్రోరైలు, ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా ఉమ్మడిగా ఒక మొబిలిటీ కార్డును తీసుకురానున్నాయి. మెట్రోరైలు, బస్సుల మధ్య కనెక్టివిటీని పెంచడంతోపాటు వాటిని అనుసంధానం చేసి మొబిలిటీ కార్డును తీసుకువస్తామని ఢిల్లీ రవాణాశాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ వెల్లడించారు. మెట్రోరైలు, బస్సు సర్వీసుల మధ్య సమన్వయం కోసం తాము రెండు విభాగాల అధికారులతో మూడు సమావేశాలు ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. మెట్రోరైలు, బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా ఉమ్మడిగా ఒకే టికెట్టు పెట్టాలనే నిర్ణయం చాలా ఏళ్లుగా పెండింగులో ఉండగా ప్రస్థుతం ఆచరణ రూపం దాల్చనుంది. లండన్, హాంగ్ కాంగ్, సీయోల్ నగరాల్లో లాగా ఉమ్మడి మొబిలిటీ కార్డును ప్రవేశపెట్టాలని ఢిల్లీ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది.
nation
17,325
17-12-2017 05:11:27
నా భర్త చివరి కోరిక తీర్చండి
నకిలీ స్టాంపుల ద్వారా నా భర్త(అబ్దుల్‌ కరీం తెల్గీ) అక్రమంగా సంపాదించిన డబ్బుతో కూడబెట్టిన మొత్తం ఆస్తులను ప్రభుత్వం తీసుకోవాలి. ఆయన చివరి కోరిక మేరకు ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులతో పాటు బినామీ ఆస్తులను దేశ ప్రయోజనాలకు ఉపయోగించాలి.కోర్టులో పిటిషన్‌ వేసిన తెల్గీ భార్య
nation
14,228
14-05-2017 12:43:44
'డొల్ల కంపెనీలతో నల్లధనాన్ని వైట్‌గా మార్చిన కేజ్రీవాల్'
న్యూఢిల్లీ: ఆప్ బహిష్కృత నేత కపిల్ మిశ్రా మరోసారి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 'తప్పిదాల' చిట్టా విప్పారు. పలు విషయాలు బహిర్గతం చేశారు. కేజ్రీవాల్, ఆప్ నేతల విదేశీ పర్యటనలు, ఇతర స్కామ్‌లపై సంచలన విషయాలు బయటపెట్టారు. ఐదుగురు ఆప్ ఎమ్మెల్యేల విదేశీ పర్యటన వివరాలు బయటపెట్టాలన్న డిమాండ్‌పై తన నివాసంలోనే ఐదురోజులుగా సత్యాగ్రహ దీక్ష చేస్తున్న కపిల్ మిశ్రా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, కేజ్రీవాల్‌ డొల్ల కంపెనీలు పెట్టి నల్లధనాన్ని వైట్‌గా మార్చారని, ఎన్నికల సంఘానికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ హవాలా లావాదేవీలు జరిపారని, నల్లధనంతో సంబంధాలున్నాయని అన్నారు. డొల్ల కంపెనీల నుంచి ఆప్‌కు డొనేషన్లు వచ్చేవన్నారు. రూ.45 కోట్లు డిపాజిట్ అయితే, ఆప్ మాత్రం కేవలం రూ.19 కోట్లే పార్టీ వెబ్‌సైట్‌లో చూపిందన్నారు. విరాళాల విషయంలో ఎన్నికల కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. కేజ్రీవాకు అక్రమంగా వందలాది కంపెనీలున్నాయన్నారు. ఆ కంపెనీల ఖాతాల్లో కోట్లాది రూపాయలు కూడా ఉన్నట్టు చెప్పారు. మొహల్లా క్లినిక్ కుంభకోణంలోనూ ఆప్ నేతల పాత్ర ఉందని ఆరోపించారు. కాగా, ప్రెస్‌మీట్‌ పూర్తికాగానే మిశ్రా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
nation
13,556
25-09-2017 02:52:20
స్కూలులో బాలికపై గ్యాంగ్‌ రేప్‌?
బాధితురాలి వాట్సప్‌ లేఖతో కలకలంచండీగఢ్‌, సెప్టెంబరు 24: అది ఓ విద్యార్థిని రాసిన లేఖలా ఉంది.. కానీ, ఆమె ఎవరో తెలియదు! పాఠశాల కార్యాలయ గదిలో తనపై గ్యాంగ్‌ రేప్‌ జరిగిందని ఆ అజ్ఞాత బాలిక రాసింది. అఘాయిత్యానికి ఒడిగట్టారంటూ ఇద్దరు సిబ్బంది పేర్లనూ పేర్కొంది. వాట్స్‌పలో సర్క్యులేట్‌ అవుతున్న ఈ లేఖ కలకలం రేపుతోంది! దాని ప్రకారం.. హరియాణాలోని గోహానా నగరంలో ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ దారుణం చోటు చేసుకుంది! బాధితురాలు ఎవరో తెలియకపోయినా.. కేసు తీవ్రత దృష్ట్యా, ఆ లేఖ ఆధారంగా నిందితులు స్కూల్‌ బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుఖ్బీర్‌, అకౌంటెంట్‌ కరణ్‌వీర్‌లను పోలీసులు అరెస్టు చేశారు.  ‘‘నేను ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. నా ఫ్రెండ్‌ వారించింది. మేం క్లాస్‌ టీచర్‌ ద్వారా ప్రిన్సిపాల్‌కు చెప్పాం. ‘‘ఇలాంటివి జరుగుతుంటాయి’’ అని ప్రిన్సిపాల్‌ అన్నారు. స్కూల్‌ డైరెక్టర్‌కు చెబుదామనుకున్నా ఉపయోగం లేదని అనిపించింది. దాంతో మీకు రాస్తున్నా మోదీ అంకుల్‌. నా జీవితాన్ని నాశనం చేశారు’’ అంటూ ఉన్న ఆ లేఖ అందర్ని కదిలించింది. పాఠశాలలోని సీసీటీవీల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
nation
19,610
27-08-2017 03:27:43
సిరీస్‌పై గురి
ఉత్సాహంలో భారత్‌శ్రీలంకకు చావోరేవోనేడు మూడో వన్డేతొలి వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా రెండో మ్యాచ్‌లో ఓటమి అంచుల్లోంచి అద్భుతంగా గట్టెక్కింది...! అదే జోరులో వన్డే సిరీస్‌నూ ఖాతాలో వేసుకునేందుకు మరో విజయం దూరంలో నిలిచింది..! మూడో మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ పట్టేస్తే.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో మరిన్ని ప్రయోగాలు చేసుకోవచ్చు..! మరోవైపు ఆతిథ్య లంకకు ఇది చావోరేవో పోరు! సిరీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే.. ఆ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే..! మరి గత పోరులో భారత్‌ను ఓడించినంత పనిచేసి.. ఏకపక్షంగా సాగుతున్న ఆటలో ఆసక్తి రేపిన ఆ జట్టు.. గెలిచి సిరీస్‌లో నిలుస్తుందో లేదో చూడాలి..! పల్లెకెలె: వరుసగా రెండు వన్డేలు నెగ్గిన ఉత్సాహం లో ఉన్న టీమిండియా సిరీస్‌ను ఖాతాలో వేసుకునేం దుకు రెడీ అయింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో ఆదివారం జరిగే మూడో వన్డేలో భారత్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన ఇక్కడే సిరీస్‌ పట్టేసి మిగతా రెండు మ్యాచ్‌ల్లో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని చూస్తోంది. ఇదే మైదానంలో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌ 131/7 స్కోరుతో ఓటమి ప్రమాదాన్ని తప్పించుకొని పర్యటనలో అజేయంగా కొనసాగుతోంది. ఇక లంక కెప్టెన్‌ తరంగ, ఓపెనర్‌ గుణతిలక సేవలు కోల్పోయింది. గుణతిలకకు గాయం కాగా, స్లో ఓవర్‌రేట్‌ కారణంగా కెప్టెన్‌ తరంగపై ఐసీసీ రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్‌ వేటు వేయడం ఆతిథ్య జట్టును దెబ్బతీసింది. ప్రయోగం కొనసాగిస్తారా..రెండు రోజుల విరామం అనంతరం మళ్లీ ఇదే మైదానంలో బరిలోకి దిగుతున్న భారత్‌ విజయ జోరు కొనసాగించాలని చూస్తోంది. అయితే, గత మ్యాచ్‌లో లాగే ప్రయోగాలు కొనసాగిస్తుందా లేదా చూడాలి. ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ అయితే ప్రయోగాలు కొనసాగిస్తామని స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్‌లో నెగ్గితే తర్వాతి రెండు వన్డేల్లో స్వేచ్ఛగా ప్రయోగాలు చేసుకునే వీలుంటుంది. ఇక, తుది జట్టు విషయానికొస్తే మోకాలి గాయంతో గత మ్యాచ్‌ మధ్యలోనే వైదొలిగిన హార్దిక్‌ పాండ్యా ఆడేది అనుమానంగా మారింది. గాయం చిన్నదే అని, అతను ఫిట్‌నెస్‌తో ఉన్నాడని మేనేజ్‌మెంట్‌ చెబుతోంది. అయినా.. అతణ్ణి ఆడించి రిస్క్‌ తీసుకోకూడదని భావిస్తే మాత్రం కుల్దీప్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌లో ఒకరు తుది జట్టులోకి వచ్చే చాన్స్‌ ఉంది. మనీష్‌ పాండే మరోసారి బెంచ్‌కు  పరిమితం కాక తప్పదు. గాడిలో పడేనా..గత మ్యాచ్‌లో భారత్‌కు గట్టి పోటీ ఇవ్వడం లంక జట్టులో ఆత్మవిశ్వాసం నింపేదే. తక్కువ స్కోరును కాపాడుకునే ప్రయత్నంలో ధనంజయ అసాధారణ స్పెల్‌ మ్యాచ్‌ గమనాన్ని మార్చేసింది. లంక అదే ఊపు కొనసాగించి ఉంటే ఫలితం వారికి అనుకూలంగా వచ్చి ఉండేది. అయితే ఓడినా.. పోటీ ఇచ్చామన్న సంతృప్తితో ఈ మ్యాచ్‌కు సిద్ధమైన ఆ జట్టుకు అంతలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ భుజానికి గాయం కావడంతో ఓపెనర్‌ గుణతిలక కనీసం పది రోజులు ఆటకు దూరమయ్యాడు. ఇక, స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా కెప్టెన్‌ తరంగపై రెండు వన్డేల నిషేధం పడింది. దాంతో, దూకుడుగా ఆడే దినేష్‌ చాందిమల్‌ జట్టులోకి వచ్చాడు. తరంగ లేకపోవడంతో వైస్‌ కెప్టెన్‌ చమర కపుగెదర జట్టును నడిపించను న్నాడు. ఇక, గుణతిలక స్థానంలో జట్టులోకొచ్చిన లాహిరు తిరిమన్నె.. మరో ఓపెనర్‌ నిరోషన్‌ డిక్‌వెలాతో ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశం ఉంది. మాజీ సారథి మాథ్యూస్‌ నుంచి లంక భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది. ఇక, రెండో వన్డేలో అద్భుత ప్రదర్శన చేసిన ధనంజయపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. కానీ, సీనియర్‌ పేసర్‌ మలింగతో పాటు మిగతా బౌలర్లు పూర్తిగా విఫలమ య్యారు. ఏ ఒక్కరి ప్రదర్శనతోనో విజయం సాధించలే మని లంకకు గత మ్యాచ్‌లో తెలిసొచ్చింది. జట్లు (అంచనా)భారత్‌: రోహిత్‌, ధవన్‌, కోహ్లీ, రాహుల్‌, కేదార్‌, ధోనీ (కీపర్‌), హార్దిక్‌/ కుల్దీప్‌/ శార్దూల్‌, అక్షర్‌, భువనేశ్వర్‌, చాహల్‌, బుమ్రా. శ్రీలంక: డిక్‌వెలా (కీపర్‌), తిరిమన్నె, కుశాల్‌ మెండిస్‌, చాందిమల్‌, మాథ్యూస్‌, సిరివర్దన, కపుగెదెర (కెప్టెన్‌), చమీర, ధనంజయ, విశ్వ , మలింగ. పిచ్‌/వాతావరణంపల్లెకెలె పిచ్‌లో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. గత మ్యాచ్‌లో మాదిరిగా పేస్‌తో పాటు స్పిన్నర్లకూ అనుకూలిస్తుంది. క్రీజులో నిలిస్తే పరుగులూ వస్తాయి. ఇక, ఈ మ్యాచ్‌కూ వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఆదివారం కొద్దిపాటి వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ చెబుతోంది.
sports
12,858
08-05-2017 01:46:09
300 కోట్ల ముడుపులు
మంత్రులకు శేఖర్‌రెడ్డి చెల్లింపుచర్య తీసుకోండి.. సీఎంకు ఐటీ లేఖఎడప్పాడి ప్రభుత్వానికి ‘డైరీ’ గండం ఎమ్మెల్యేలు, అధికారులకూ నజరానాలు శేఖర్‌ రెడ్డి డైరీలో అవినీతి జాతకాలుచెన్నై, మే 7 (ఆంధ్రజ్యోతి): వందలు కాదు.. వేలు కాదు.. కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయి. ఇసుక క్వారీలు.. కాంట్రాక్టులు దక్కించుకొనేందుకు తమిళనాడు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు నల్లకుబేరుడు శేఖర్‌ రెడ్డి పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించారు. వాటి విలువ అక్షరాలా రూ.300 కోట్లకు పైమాటే. తాను ఎవరెవరికి.. ఎప్పుడెప్పుడు.. ఎంత మొత్తం ఇచ్చానన్న విషయాలను శేఖర్‌ రెడ్డి తన డైరీలో అక్షరం పొల్లుపోకుండా రాసుకున్నారు. ఇప్పుడు ఆ డైరీ తమిళనాట కలకలం రేపుతోంది.  పెద్దనోట్ల రద్దు సందర్భంగా గత ఏడాది డిసెంబరు 8న శేఖర్‌రెడ్డి నివాసగృహాలు, కార్యాలయాలు, క్వారీలలో ఐటీ అధికారులు దాడులు చేశారు. రూ.147 కోట్ల విలువైన రద్దయిన నోట్లను, రూ.34 కోట్ల విలువైన కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదుతోపాటు 178 కేజీల బంగారు కడ్డీలు సైతం పట్టుబడ్డాయి. వీటిపై ప్రస్తుతం సీబీఐ విచారణ జరుపుతోంది. ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సమయంలో శేఖర్‌రెడ్డి ఇంట్లో ఓ డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో తమిళ రాజకీయ ప్రముఖుల జాతకాలన్నీ నిక్షిప్తమై ఉంది. మంత్రులు మొదలు ఎమ్మెల్యేలు, అధికారుల వరకు ప్రతి ఒక్కరికీ తాను ఎంతెంత మొత్తం ముడుపులు ఇచ్చానో శేఖర్‌ రెడ్డి వివరంగా ఆ డైరీలో రాసుకున్నారు. వీటిని లెక్కగట్టిన ఐటీ అధికారులు సుమారు రూ.300 కోట్లకుపైగా ముడుపులు చేతులు మారినట్లు నిర్ధారించారు. దీంతో సదరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐటీ శాఖ.. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి లేఖ రాసినట్లు విశ్వసనీయ సమాచారం. ఎడప్పాడి సర్కార్‌ ఉక్కిరిబిక్కిరిఅన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో చెన్నై టి.నగర్‌కు చెందిన పారిశ్రామికవేత్త శేఖర్‌రెడ్డి హవాకు ఎదురులేకుండా పోయింది. ఇసుక క్వారీలు.. ప్రజాపనుల శాఖ కాంట్రాక్టులు అన్నీ ఆయన చేయి దాటిపోయేవి కావు. దీంతో శేఖర్‌ రెడ్డి కోట్లకు పడగలెత్తారు. ఇసుక క్వారీలు, కాంట్రాక్టులు దక్కించుకొనేందుకు సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు ఆయన కోట్లాది రూపాయలను ముడుపులుగా ఇచ్చారు. ఇదే విషయాన్ని తన డైరీలో రాసుకున్నారు. తాజాగా.. శేఖర్‌రెడ్డి నుండి ముడుపులు పుచ్చుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులపై అవినీతి నిరోధక విభాగం ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.  ఈ లేఖ పళనిస్వామి ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎం ఎలా స్పందిస్తారన్న దానిపై ప్రభుత్వ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆ లేఖలో పేర్కొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఎవరన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో రూ.100 కోట్ల వరకూ సాక్షాత్తు మంత్రులే పంపిణీ చేసినట్లు ఐటీ శాఖకు లభించిన పక్కా ఆధారాలతో ఎడప్పాడి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో.. శేఖర్‌రెడ్డి డైరీ వ్యవహారం వెలుగుచూడటం ఎడప్పాడి సర్కార్‌ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టనుంది.
nation
9,753
27-08-2017 22:40:35
ఇక.. నిర్మాత అవతారంలో..
బాలీవుడ్‌ అందాల నటి మాధురి దీక్షిత్‌ నేనే ఇప్పుడు నిర్మాతగా మారుతున్నారు. ఆర్‌ ఎన్‌ ఎం మూవింగ్‌ పిక్చర్స్‌ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ పతాకంపై ఆమె త్వరలో ఓ మరాఠీ చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు. స్వప్ననీల్‌ జయకర్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. సొంత చిత్రం గురించి మాధురి మాట్లాడుతూ ‘‘మా ఆర్‌ ఎన్‌ ఎం మూవింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌తో సినిమా రంగంలో అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉంది. యోగేశ్‌ వినాయక్‌ జోషి ఈ చిత్ర కథను చాలా చక్కగా తీర్చిదిద్దారు. సకుటుంబంగా చూసే విధంగా తెరకెక్కిస్తాం. చాలా చక్కటి టీమ్‌ ఈ సినిమా కోసం పనిచేస్తోంది. త్వరలోనే సెట్స్‌మీదకు వెళ్తాం’’ అని అన్నారు. బాలీవుడ్‌ నటీమణులు అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా ఇప్పటికే నిర్మాణరంగంలో అడుగుపెట్టిన సంగతి విదితమే.
entertainment
1,299
13-07-2017 00:27:46
వోల్వో ‘వి90 క్రాస్‌ కంట్రీ’
ధర రూ.60 లక్షలున్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన కార్ల కంపెనీ వోల్వో కార్స్‌ దేశీయ మార్కెట్లోకి మరో కొత్త కారును తెచ్చింది. వి90 క్రాస్‌ కంట్రీ పేరుతో తెచ్చిన ఈ కారును బుధనాడిక్కడ వోల్వో ఆటో ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ టామ్‌ వాన్‌ బోన్స్‌డోర్ఫ్‌ విడుదల చేశారు. దీని ధర 60 లక్షల రూపాయలు (ఎక్స్‌షోరూమ్‌). ట్విన్‌ టర్బో డీజిల్‌ ఇంజన్‌ కలిగిన ఈ కారు 235 హెచ్‌పిల శక్తిని వెలువరిస్తుంది. రాడార్‌ ఆధారిత భద్రతా సదుపాయాలు ఈ కారులోని ప్రధాన ఫీచర్లలో ఒకటి. పాదచారులు, సైకిలిస్టులు, వాహనాలు, జంతువులు కారుకు ఎదురుగా వస్తే హెచ్చరించడంతోపాటు ఆటో బ్రేక్‌ వేసే వ్యవస్థ ఈ కారులో ఉంది. మరిన్ని హైబ్రిడ్‌ కార్లు తెస్తాం...హైబ్రిడ్‌ కార్లపై జిఎస్‌టిని పెంచడం పట్ల టామ్‌ వాన్‌ బోన్స్‌డోర్ఫ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిఎ్‌సటి నిరుత్సాహ పరిచినప్పటికీ రానున్న కాలంలో భారత మార్కెట్లోకి మరిన్ని హైబ్రిడ్‌, ఎలక్ర్టిక్‌ కార్లను తెస్తామని చెప్పారు. 2019 నుంచి విడుదల చేసే అన్ని కొత్త మోడళ్లు ఎలక్రిక్‌ మోటార్‌ను కలిగి ఉంటాయని, అప్పటికి తాము ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజన్‌ (ఐసిఇ)కు స్వస్తి పలకనున్నట్టు ఇటీవలే వోల్వో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేసే కొత్త వాహనాలను భారత మార్కెట్లోకి వీలైనంత త్వరగా తెస్తామని టామ్‌ చెప్పారు. జిఎ్‌సటి పెరిగినంత మాత్రాన పర్యావరణానికి అనుకూలమైన వాహనాలను తయారు చేయాలన్న తమ నిర్ణయం మారదని, రానున్న కాలంలో మరిన్ని ఎలక్ర్టిక్‌, హైబ్రిడ్‌ కార్లను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. 2019 నుంచి 2021 వరకు ఐదు ఎలక్ర్టిక్‌ కార్లను విడుదల చేయనున్నట్టు వోల్వో ప్రకటించింది. వీటిని అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత వీలైనంత త్వరగా భారత మార్కెట్లోకి తీసుకువస్తామని టామ్‌ చెప్పారు.
business
13,446
06-03-2017 20:09:51
'మోదీ వృద్ధుడయ్యారు...రెస్టు ఇద్దాం'
లక్నో: యూపీలో యువనాయకత్వానికి పట్టం కడితే అభివృద్ధి చేసి చూపిస్తామని, జాతీయ రాజకీయాల్లోనూ మార్పు ఖాయమని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఊదరగొడుతున్న సమాజ్‌వాదీ-కాంగ్రెస్ కూటమి మరో అడుగు ముందుకు వేసి మోదీకి వార్దక్యం మీద పడిదంటూ కొత్త వాదన అందుకుంది. జాన్‌పూర్‌లో సోమవారం జరిగిన ప్రచార సభలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రధాని మంత్రి పెద్దవారిగా (ముసలితనం) మారిపోతున్నారని, ఉత్తరప్రదేశ్‌కు యువనేతనే పాలకుడిగా తెచ్చుకుందామని అన్నారు. తాను ఇదే విషయం అఖిలేష్‌కు సూచించినట్టు కూడా రాహుల్ తెలిపారు. మోదీ పెద్దవారైపోతున్నారని, ముఖ్యమంత్రి పగ్గాలు నువ్వు (అఖిలేష్) తీసుకుంటే ఆయనకు (మోదీ) కొద్దిపాటి రెస్టు దొరుకుతుందని, ఆ విధంగా మోదీజీ ఎంతోకొంత సాయం చేయాలని కోరానని రాహుల్ పేర్కొన్నారు. మోదీ తరపు చెప్పే 'అచ్చేదిన్'‌పై కూడా రాహుల్ చమత్కరించారు. 'అచ్చే దిన్' సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని, ఇక చూడాలనుకున్నా ఆ సినిమా జనాలకు కనిపించదని అన్నారు.
nation
13,387
09-05-2017 09:17:22
కేజ్రివాల్‌కి షాక్...బద్ధ శత్రువే విచారణాధికారి!
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసు అధికారి ఎంకే మీనా... ఈయనకు మించిన ‘‘అవినీతిపరుడు’’ మరొకరు లేరంటూ అరవింద్ కేజ్రివాల్, ఆమాద్మీ పార్టీ నేతలు ఒకప్పుడు దుమ్మెత్తిపోశారు... ఢిల్లీ ఏసీబీ చీఫ్‌గా ఆయన నియామకమే అక్రమమని, సర్వీస్ రూల్స్‌కి విరుద్ధమని పోరాడారు... ఢిల్లీ ప్రభుత్వంపై పెత్తనం చెలాయించేందుకే కేంద్రం ఆయనను నియమించిందంటూ ఆరోపించారు... ఆయనపై శాఖాపరమైన విచారణ జరిపించాలని ప్రయత్నించారు... ఆధారాలు లేకుండా కేజ్రివాల్ తనపై ఆరోపణలు చేస్తే కోర్టులో పిటిషన్ వేస్తానంటూ మీనన్ సైతం అంతే స్థాయిలో స్పందించారు... ఇదంతా రెండేళ్ల క్రితం... సీన్ కట్ చేస్తే...  ఇప్పుడు కేజ్రివాల్‌పై వస్తున్న ‘లంచం’ ఆరోపణలను అదే అధికారి దర్యాప్తు జరపనున్నట్టు సమాచారం.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్.... ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ నుంచి రూ.2 కోట్లు లంచం తీసుకుంటుండగా తాను చూశానని ఆప్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయన సోమవారం ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ జనరల్ అనిల్ బైజల్‌ను కలిసి కేజ్రివాల్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ గవర్నర్ సదరు ఆరోపణలపై విచారణ చేపట్టాల్సిందిగా మీనన్‌ను ఆదేశించినట్టు చెబుతున్నారు.దీనిపై మిశ్రాను మీడియా స్పష్టత కోరగా.. ‘‘కపిల్ మిశ్రా వాగ్మూలాన్ని మేము నమోదు చేస్తాం... తర్వాత చట్టం తన పని తాను చేస్తుంది...’’ అని పేర్కొన్నారు. కాగా అవినీతిపై సంచలన ఆరోపణలు చేస్తూ తన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకున్న అరవింద్ కేజ్రివాల్... అదే అవినీతి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కోవడం విశేషం.
nation
16,695
30-10-2017 10:08:05
ఆధార్ ఇవ్వలేదని విద్యార్థిపై టీచర్ కిరాతకం
న్యూఢిల్లీ: ఆధార్ కార్డు వివరాలు ఇవ్వలేదన్న పాపానికి పదేళ్ల విద్యార్థిపై ఓ స్కూల్ టీచర్ కిరాతకానికి పాల్పడ్డారు. మోకాళ్లు విరగ్గొట్టి ఆస్పత్రిపాలయ్యేందుకు కారణమైన ఆ టీచర్‌పై పోలీసులు ఇవాళ కేసు నమోదు చేశారు. పుణెలోని చించ్వాడ్‌ మౌర్య శిక్షణ్ శాంతా హైస్కూల్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.... గత కొద్ది వారాల క్రితం సదరు స్కూల్లో విద్యార్ధుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఓ యాప్ తయారు చేశారు. అందులో ఎన్‌రోల్‌మెంట్ కోసం విద్యార్ధుల యూఐడీ నంబర్లు తీసుకురావాల్సిందిగా అడిగారు. అయితే పదేళ్ల ఓ బాలుడు ఆధార్ నంబర్ తేలేకపోవడంతో టీచర్ ఆగ్రహంతో ఊగిపోయారు. మోకాళ్లక వెనుక కొట్టడంతో విద్యార్ధి తీవ్రంగా గాయపడ్డాడు.  తొలుత తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పేందుకు కూడా భయపడ్డాడు. కనీసం నడవలేకపోతుండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పాడు. మోకాని వెనుకవైపు లోపల బలమైన గాయాలు కావడంతో ఇన్ఫెక్షన్ వచ్చింది. దీంతో వైద్యులు అతడికి శస్త్రచికత్స చేశారు. ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నాడనీ... తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చించ్వాడ్ పోలీసు అధికారి వెల్లడించారు. ఆదివారం పాఠశాలకు సెలవు అయినందున సోమవారం స్కూల్‌కి వెళ్లి విచారణ జరుపుతామని పేర్కొన్నారు.
nation
8,617
16-01-2017 15:18:12
పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకొనే వార్త!
సంక్రాంతి సందర్భంగా ఆల్రెడీ అందరూ పండుగ చేసుకున్నారు.. పవన్ అభిమానులే ప్రత్యేకంగా పండుగ చేసుకోవడం ఏంటి? శివరాత్రి దాకా ఏ పండుగలూ లేవు కదా అని అనుకుంటున్నారా? అసలు విషయం తెలిస్తే జనసేనాని ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారేమో!. ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఏ హీరోకూ రాని అవకాశం పవన్‌కు వచ్చింది. ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం అందింది. ఫిబ్రవరిలో జరగబోయే ‘ఇండియా కాన్ఫరెన్స్ 2017’లో ప్రసంగించే అరుదైన గౌరవం పవన్‌కు దక్కింది. దక్షిణాది హీరోల్లో ఇప్పటివరకు కమల్‌హాసన్‌కు మాత్రమే ఈ అరుదైన గౌరవం దక్కింది. అయితే ఇప్పుడు కమల్ తర్వాత ఆ అవకాశం పవన్‌కు రావడంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు. ‘పవనిజం’ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో అభిమానులు ఈ విషయాన్ని పొందుపరిచారు.
entertainment
15,501
10-05-2017 16:54:21
ఐటీ ఉద్యోగులకు షాక్... 2వేల మందిని ఇంటికి పంపే యోచనలో ఇన్ఫోసిస్
ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఐటీ కంపెనీలు భారతీయ ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమయ్యాయి. కాగ్నిజెంట్ కంపెనీ భారతీయ ఉద్యోగులకు మొండి చెయ్యి చూపించి రోజులు కూడా గడవక ముందే మరో దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కూడా భారతీయ ఐటీ ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరాంతానికి మొత్తం 2వేల మంది భారతీయ ఉద్యోగులను ఇన్ఫోసిస్ తొలగించనున్నట్లు సమాచారం. అంతేకాదు, రానున్న రెండేళ్లలో 10వేల మంది అమెరికన్లకు అవకాశం కల్పించాలని ఇన్ఫోసిస్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 9వందల మంది ఉద్యోగులకు ఇన్ఫోసిస్ పింక్ స్లిప్స్‌ను చేతిలో పెట్టినట్లు సమాచారం. నైపుణ్య లోపం నెపంతో వారిని విధుల్లోంచి తొలగించాలని ఈ ఐటీ సంస్థ యోచిస్తోంది. అమెరికాలో మరో నాలుగు సెంటర్స్‌ను కూడా ఈ సంస్థ ప్రారంభించాలని భావిస్తోంది. విప్రో కూడా ఇదే బాటలో నడవనున్నట్లు తెలుస్తోంది. ఆరు వందల మంది ఉద్యోగులను విప్రో శాశ్వతంగా విధుల్లోంచి తొలగించనుంది. దీంతో అమెరికాలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పేలా లేదు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై మొదట పెదవి విరిచిన ఐటీ కంపెనీలు చివరికి అదే బాటలో నడుస్తున్నాయి. ఇక నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యం కల్పించాలని ఐటీ సంస్థలన్నీ ఓ నిర్ణయానికొచ్చాయి.
nation
18,159
25-11-2017 00:34:30
12 గంటల్లో 4 రైలు ప్రమాదాలు
3 ఉత్తరప్రదేశ్‌లో... ఒకటి ఒడిసాలోఏడుగురి మృతిమృతుల్లో ఆరేళ్ల బాలుడు, తండ్రిపట్టాలు తప్పిన ‘వాస్కోడగామా’బొలెరోను ఢీకొట్టిన లోకల్‌ రైలురైలు నుంచి విడిపోయిన ఇంజన్‌పట్టాలు తప్పిన గూడ్సు రైలులఖ్‌నవ్‌, నవంబరు 24: ఉత్తరప్రదేశ్‌, ఒడిసా రాష్ట్రాల్లో 12 గంటల వ్యవధిలో 4 రైలు ప్రమాదాలు సంభవించాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయంలోపు జరిగిన ఈ దుర్ఘటనల్లో ఏడుగురు మరణించగా, 11 మంది గాయపడ్డారు. ఒక్క యూపీలోనే మూడు ప్రమాదాలు జరిగాయి. వాస్కోడగామా ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు, అతని తండ్రి, ఓ గుర్తు తెలియని వ్యక్తి మరణించారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. గోవా నుంచి పట్నా వెళుతున్న ఈ రైలు... శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో యూపీలోని మాణిక్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో ఆగి, బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదం సంభవించింది. మొత్తం 13 కోచ్‌లు పట్టాలు తప్పాయి. పట్టాలు విరిగిపోవడం ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు.  ఎమర్జెన్సీ బ్రేక్స్‌ ఫెయిలవడం కూడా ప్రమాదానికి కారణమై ఉండవచ్చన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ ప్రమాదంపై రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రైల్వే, రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి నష్ట పరిహారం ప్రకటించాయి. గురువారం రాత్రి యూపీలోని అమేథీ సమీపంలో కాపలా లేని రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద లోకల్‌ రైలు పెళ్లి బృందం పయనిస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  మాణిక్‌పూర్‌ ప్రమాదం జరిగిన రెండు గంటల్లోపే ఒడిసాలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. పారాదీప్‌ నుంచి కటక్‌ వెళుతున్న ఈ రైలు శుక్రవారం ఉదయం 5.55 గంటలకు గోరఖ్‌నాథ్‌-రఘునాథ్‌పూర్‌ మధ్య ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు. యూపీలో జమ్ము-పట్నా అర్చన ఎక్స్‌ప్రెస్‌ ఇంజన్‌ రైలు నుండి రెండుసార్లు విడిపోయింది. మొదట శుక్రవారం తెల్లవారుజామున 2.35 గంటలకు ఈ ఘటన జరిగింది. ఇంజన్‌ను రైలుకు బిగించి 3.17 గంటలకు గీన్ర్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 5.25 గంటలకు మళ్లీ ఇంజిన్‌ వేరుపడింది. రెండు గంటల పాటు సీనియర్‌ అధికారులు, సిబ్బంది మరమ్మతులు చేసి క్లియరెన్స్‌ ఇచ్చారు. ఈ ప్రమాదాల కారణంగా పలు మార్గాల్లో రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
nation
19,394
07-03-2017 02:28:50
కోహ్లీ గౌరవం కోల్పోతున్నాడు
స్లెడ్జింగ్‌పై ఇయాన్‌ హీలీ అసహనం మెల్‌బోర్న్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్లెడ్జింగ్‌కు పాల్పడడాన్ని ఆస్ర్టేలియా మాజీ వికెట్‌ కీపర్‌ ఇయాన్‌ హీలీ తప్పుబడుతున్నాడు. ఆసీస్‌ ఆటగాళ్లను స్లెడ్జింగ్‌ చేస్తున్న కోహ్లీ తన గౌరవాన్ని కోల్పోతున్నాడని హీలీ అన్నా డు.బెంగళూరు టెస్టు రెండో రోజు కోహ్లీ-ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. యువ బ్యాట్స్‌మన్‌ రెన్‌షాకు కూడా ‘టాయిలెట్‌ బ్రేక్‌’ను గుర్తు చేశాడు. దీనిపై హీలీ అసహనం వ్యక్తం చేశాడు. ‘నేను చూసిన బ్యాట్స్‌మెన్‌లో కోహ్లీనే అత్యుత్తమం అని గతంలోనే చెప్పాను. అతనంటే నాకు చాలా గౌరవం. కానీ.. స్టీవ్‌ స్మిత్ తో అతడు ప్రవర్తించిన తీరు ఆమోదయోగ్యం కాదు. కోహ్లీ తన చర్యల ద్వారా గౌరవాన్ని కోల్పోతున్నాడ’ని హీలీ చెప్పాడు.
sports
19,189
21-04-2017 02:52:50
భారీ ఉగ్ర దాడికి కుట్ర పది మంది ఐఎస్‌ తీవ్రవాదుల అరెస్టు!
ముంబై/లఖ్‌నవ్‌, ఏప్రిల్‌ 20: దేశంలో భారీస్థాయి ఉగ్రవాద దాడికి ఐఎస్‌ తీవ్రవాద సంస్థ పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పది మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టుచేశారు. మరో ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ స్పెషల్‌ సెల్‌, యూపీ, మహారాష్ట్ర ఉగ్రవాద అణచివేత దళాలు, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, బిహార్‌ పోలీసులు గురువారం ముంబ్రా (మహారాష్ట్ర), జలంధర్‌ (పంజాబ్‌), నార్కటియాగంజ్‌ (బిహార్‌), బిజ్నోర్‌, ముజఫర్‌నగర్‌ (యూపీ)లలో ఉమ్మడి ఆపరేషన్లు చేపట్టాయి. ఈ సందర్భంగా ఐఎస్‌ ఖొరసాన్‌ మాడ్యూల్‌ కుట్రను ఛేదించినట్లు యూపీ ఏటీఎస్‌ ఐజీ అసీమ్‌ అరుణ్‌ నోయిడాలో ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆ మాడ్యూల్‌కు చెందిన నలుగురిని.. ముఫ్తీ ఫైజాన్‌, తన్వీర్‌ (బిజ్నోర్‌); నిజాం శంషాద్‌ అహ్మద్‌ (ముంబ్రా-థానే), ముజామిల్‌ (జలంధర్‌)లను అరెస్టు చేశామని తెలిపారు. ఐఎ్‌సకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో ఆరుగురు అనుమానితులను కస్టడీలోకి తీసుకుని.. నోయిడాలో ప్రశ్నిస్తున్నారు. పోలీసుల ఉమ్మడి ఆపరేషన్‌లో కేంద్ర భద్రతా సంస్థలు కీలక పాత్ర పోషించాయి. మార్చి 7న లఖ్‌నవ్‌లో జరిగిన ఎన్‌కౌంటరులో ఖొరసాన్‌ మాడ్యూల్‌కు చెందిన ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఆ సందర్భంగా దొరికిన డాక్యుమెంట్ల ఆధారంగా గురువారంనాటి ఆపరేషన్‌ నిర్వహించారు.
nation
501
24-02-2017 23:34:40
పవన విద్యుత్‌లో భారీగా తగ్గిన రేట్లు
పవన విద్యుత రేట్లు రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ప్రభుత్వ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన వేలంలో పాల్గొన్న బిడ్డర్లు ప్రాజెక్టులను గెలుచుకునేందుకు ఒక్కో యూనిట్‌కు 3.46 రూపాయలను కోట్‌ చేశారు. గిగాబైట్‌ సామర్ధ్యంగల పవన విద్యుత ప్రాజెక్టులను కార్పొరేషన్‌ వేలానికి పెట్టగా, ఇందులో పాల్గొన్న ఐదు కంపెనీలు కనిష్ఠస్థాయి టారిఫ్‌లనే కోట్‌ చేశా యి.  కొద్ది రోజుల క్రితమే సౌరవిద్యుత టారిఫ్‌ కూడా యూనిట్‌కు 3 రూపాయల కంటే తక్కువ స్థాయికి పడిపోయిన విషయం తెలిసిందే. దేశంలో విద్యుత కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో స్వచ్ఛ ఇంధన వనరులపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. సౌర విద్యుత, పవన విద్యుత రంగాల్లో భారీ లక్ష్యాలను పెట్టుకున్న ప్రభుత్వం 2022 నాటికి 175 గిగాబైట్ల రెన్యువబుల్‌ ఎనర్జీ సామర్ధ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ విధ్యంసానికి హేతువుగా ఉన్న వాయువులకు చెక్‌పెట్టేందుకు ప్రభుత్వం క్లీన్‌ ఎనర్జీపై దృష్టి సారించిన విషయం తెలిసిందే.
business
7,615
01-05-2017 00:04:43
వేసవికి ‘దర్శకుడు’
సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకంపై ‘కుమారి 21ఎఫ్‌’ తర్వాత రూపొందుతున్న చిత్రం ‘దర్శకుడు’. ఈ చిత్రం వీడియో పోస్టర్‌ని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌, ఛాయాగ్రాహకుడు రత్నవేలు, దర్శకుడు సుకుమార్‌ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని సుకుమార్‌తో కలిసి బీఎన్‌సిఎస్‌పి విజయ్‌కుమార్‌, థామస్‌ రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి నిర్మిస్తున్నారు. అశోక్‌, ఈషా జంటగా నటిస్తున్నారు. హరిప్రసాద్‌ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వేసవికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, కెమెరా: ప్రవీణ్‌ అనుమోలు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రమేశ్‌ కోలా.
entertainment
11,557
31-05-2017 21:42:57
కూలిన సుఖోయ్ 30 యుద్ధ విమానంలోని ఇద్దరు పైలట్లు మృతి
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌ అటవీప్రాంతంలో ఇటీవల కూలిన సుఖోయ్ 30 యుధ్ధ విమానంలోని ఇద్దరు పైలట్లు మృతి చెందినట్లు భారత వాయు సేన బుధవారం అధికారికంగా ప్రకటించింది. మే 23న తేజ్‌పూర్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన ఫైటర్ ప్లేన్ చైనా సరిహద్దులో కూలిపోయింది. మే 26న దట్టమైన అడవిలో దీని శకలాలు గుర్తించారు. ఆదివారం అతి కష్టంమీద రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని బ్లాక్ బాక్స్‌ను వెలికి తీశారు.  అయితే ఇద్దరి పైలట్ల జాడ తెలియలేదు. కొద్ది దూరంలో రక్తపు మరకలున్న పైలట్ల బూట్లు లభించాయి. దీంతో బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషించిన ఎయిర్ ఫోర్స్ అధికారులు, స్క్వాడ్రన్ లీడర్ డి.పంకజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ ఎస్ అచ్యుదేవ్ ప్రమాదం నుంచి తప్పించుకోలేక చనిపోయినట్లు బుధవారం వెల్లడించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని వారు తెలిపారు.
nation
3,958
25-11-2017 00:56:18
పాక్‌ ‘మానవత్వం’
తమ నిర్బంధంలో ఉన్న భారతీయుడు కులభూషణ్‌ జాదవ్‌ను కలుసుకోవడానికి అతని తల్లిని, భార్యను అనుమతిస్తామని గతవారం పాకిస్థాన్‌ ప్రభుత్వం ప్రకటించడం ఉభయదేశాల మధ్య దౌత్యరంగంలో చిన్న కదలికను కలిగించింది. భారతీయ గూఢచర్య సంస్థ ‘రా’ ఏజెంటుగా తమదేశంలో విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణపై విచారించి పాకిస్థాన్‌ సైనిక న్యాయస్థానం జాదవ్‌కు ఈ ఏడాది ఏప్రిల్‌లో మరణశిక్ష విధించింది. శిక్ష నిలుపుదలను కోరుతూ భారత్‌ వేసిన పిటిషన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం స్పందించి, స్టే ఇచ్చింది. జాదవ్‌ను కలుసుకోవడానికి పాక్‌లోని భారతీయ దౌత్యసిబ్బందిని అనుమతించాలని ఇప్పటికి పదమూడుసార్లు అభ్యర్థించింది. దేనికీ పాకిస్థాన్‌ సానుకూలంగా స్పందించలేదు. కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి అనుమతించమని అడిగినా అంగీకరించలేదు. ఉన్నట్టుండి, గత వారం ‘మానవతా కారణాలతో’ పాకిస్థాన్‌ జాదవ్‌ను కలుసుకోవడానికి అతని తల్లి, భార్యకు అనుమతిని ప్రకటించింది. పాకిస్థాన్‌ ‘ఔదార్య’ ప్రకటనపై భారత్‌ ఆచితూచి స్పందించింది. పాక్‌ అనుమతిని స్వాగతిస్తూనే, అనేక సందేహాలను వ్యక్తం చేసింది. జాదవ్‌ను కలుసుకోవడానికి వెళ్లే అతని కుటుంబసభ్యుల భద్రత మాటేమిటని అడిగింది. వారిని కూడా అరెస్టు చేయరని, ప్రశ్నించరని ఏమి నమ్మకమని నిలదీసింది. జాదవ్‌ తల్లి, భార్యలతో పాటు దౌత్య ప్రతినిధిని కూడా అనుమతించాలని డిమాండ్‌ చేస్తోంది. జాదవ్‌ కుటుంబసభ్యుల ప్రాణాలకు, భద్రతకు పాకిస్థాన్‌ సార్వభౌమిక వాగ్దానం చేయాలని కోరుతోంది. ఈ డిమాండ్లకు పాకిస్థాన్‌ ప్రతిస్పందన ఇంకా రావలసి ఉన్నది. భారత, పాకిస్థాన్‌ దేశాల మధ్య పరస్పర గూఢచర్య ఆరోపణలు దీర్ఘకాలంగా ఉన్నవే. ఐఎస్‌ఐ ఏజెంట్లుగా భారత్‌లోనూ, ‘రా’ ఏజెంట్లుగా పాకిస్థాన్‌లోనూ కొందరిని పట్టుకోవడం, వారిపై వ్యాజ్యాలు నడపడం దాయాది దేశాల మధ్య జరుగుతూ వస్తోంది. అంతర్జాతీయ గూఢచర్యం నిర్వహించే సంస్థలు, తమ ప్రతినిధులు ఇతర దేశాల్లో పట్టుబడినప్పుడు, వారు తమవారు కాదని, తమకు సంబంధం లేదని నిరాకరించడమూ ఆనవాయితీగా వస్తున్నదే. భారతదేశంలో అనేక విధ్వంస కార్యక్రమాల్లో పాల్గొన్న అనేకమంది ఉగ్రవాదుల విషయంలో పాకిస్థాన్‌ అదే వైఖరి అనుసరించింది. చనిపోయినవారి మృతదేహాలను కూడా తీసుకోవడానికి ముందుకు రాలేదు. నిరంతరం ఉద్రిక్త సంబంధాలలో ఉండే దేశాల మధ్య గూఢచర్యం సహజమే కావచ్చును కానీ, అనేక సందర్భాలలో అమాయకులను కూడా విదేశీ ఏజెంట్లుగా చిత్రించి, లోకానికి ప్రదర్శించడం కూడా జరుగుతూ ఉంటుంది. భారతజాతీయుడైన సరబ్‌జిత్‌ సింగ్‌ విషయంలో పాక్‌ వ్యవహరించిన తీరు కొన్నేళ్ల కిందట వివాదానికి దారితీసింది. అతను తానొక సాధారణ రైతును మాత్రమేనని వాదించగా, భారత్‌ గూఢచారి అని పాకిస్థాన్‌ ఆరోపించింది. విధించిన మరణశిక్షను అమలుచేయడానికి సాహసించలేదు కానీ, లాహోర్‌ జైలులో తోటిఖైదీల దాడిలో సరబ్‌జిత్‌ మరణించడానికి అనువైన పరిస్థితులను పాకిస్థానే కల్పించింది. పోయిన ఏడాది బెలూచిస్తాన్‌లో అరెస్టు చేసిన కులభూషణ్‌ జాదవ్‌ ఒకప్పుడు భారత నావికాదళంలో పనిచేసిన మాట నిజమే కానీ, అతను స్వచ్ఛంద పదవీ విరమణ చేసి తప్పుకున్నాడని, అతనితో భారత భద్రతావ్యవస్థకు ఎటువంటి సంబంధమూ లేదని ఇండియా వాదిస్తున్నది. స్వచ్ఛంద విరమణ తరువాత ఇరాన్‌కు వెళ్లి చిన్న వ్యాపారిగా అవతారమెత్తిన జాదవ్‌ అక్కడి నుంచి తప్పుడు గుర్తింపుతో పాకిస్థాన్‌ వచ్చి వెడుతున్నాడని, బెలూచిస్తాన్‌లో వేర్పాటువాదులతో సంబంధాలు పెట్టుకున్నాడని పాక్‌ అంటున్నది. కశ్మీర్‌లో హింసాకాండకు పాకిస్థాన్‌ అందిస్తున్న తోడ్పాటును దృష్ఠిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ మధ్య కాలంలో బెలూచిస్థాన్‌ సమస్యను అంతర్జాతీయ వేదికల మీద ప్రస్తావించడం గుర్తు తెచ్చుకుంటే, జాదవ్‌ను అరెస్టు చేసిన సమయం, సందర్భం అర్థం చేసుకోవచ్చు. జాదవ్‌ ఏజెంటా కాదా అన్న చర్చను ప్రభుత్వాలకు వదిలివేస్తే, అతనిపై విచారణ న్యాయబద్ధంగా జరిగేట్టు, అతని ప్రాణానికి హాని జరగకుండాను చూడవలసిన బాధ్యత అయితే భారత్‌ మీద ఉన్నది. భారత దౌత్య అధికారులతో అతను మాట్లాడకుండా, కుటుంబసభ్యులను కలవనీయకుండా చేయడం, విచారణ ఏకపక్షంగా జరిగిందన్న అనుమానాలకు తావిస్తున్నది. జాదవ్‌ సమస్యను అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకువెళ్లి భారత్‌ సరిగా వ్యవహరించింది ప్రపంచం దృష్టికి వివాదం వెళ్లడంతో పాక్‌ ఖంగుతిన్నది. కోర్టు ఆదేశాలను కాదని, శిక్షను అమలుచేసే సాహసం చేయలేదు. ప్రస్తుతం అతనితో కుటుంబసభ్యుల భేటీకి అనుమతించడం కూడా అంతర్జాతీయ సమాజం దృష్టిలో చట్టబద్ధ వ్యవహారసరళిని పాటిస్తున్నట్టు చెప్పడానికే అనుకోవాలి. ఎందుకు చేసినప్పటికీ, పాకిస్థాన్‌ అనుమతి ఆహ్వానించదగినది. ఈ అంశంలో ఏర్పడిన వెసులుబాటును ఉభయదేశాల మధ్య చర్చలలో ఏర్పడిన ప్రతిష్ఠంభనను సడలించడానికి ఉపయోగించుకోవడంలో తప్పులేదు. అయితే, బొంబాయి దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ను నిర్బంధం నుంచి పాక్‌ కోర్టు విడుదల చేయడం, అందుకు పరోక్షంగా ప్రాసిక్యూషన్‌ సహకరించడం– ఉభయదేశాల మధ్య సంబంధాలలో ఏర్పడిన కొత్త అడ్డంకి. సయీద్‌ విడుదలపై అమెరికా తీవ్రంగా అభ్యంతరం చెప్పడం, పాక్‌కు ప్రపంచంలో కొరవడుతున్న మద్దతును సూచిస్తుంది.
editorial
2,728
30-09-2017 00:28:29
ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్‌
ట్రేడింగ్‌ చివర్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో శుక్రవారం బిఎస్‌ఇ సూచీ సెన్సెక్స్‌ ఫ్లాట్‌గా ముగిసింది. విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్ పిఐ)ర్ల అమ్మకాలు కొనసాగాయి. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డిఐఐ), రిటైల్‌ ఇన్వెస్టర్లు మాత్రం కొనుగోళ్లు కొనసాగించారు. దీంతో 1.24 పాయింట్ల స్వల్ప లాభంతో సెన్సెక్స్‌ 31283 వద్ద, 19.65 పాయింట్ల లాభంతో నిఫ్టీ 9788 వద్ద ముగిశాయి. అయితే వారమంతటినీ పరిగణనలోకి తీసుకుంటే ఈ వారంలో సెన్సెక్స్‌ 638.72 పాయింట్లు (రెండు శాతం), నిఫ్టీ 175.80 పాయింట్లు (1.76 శాతం) నష్టపోయాయి.  ఈ ఏడాది ద్రవ్య లోటుని బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా 3.2 శాతం వద్దే కట్టడి చేస్తామన్న అధికారుల ప్రకటన మార్కె ట్‌కు కొద్దిగా ఊరట నిచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌ అక్టోబర్‌ 4న ఆర్‌బిఐ ప్రకటించే ద్రవ్య, పరపతి విధాన సమీక్ష కోసం ఎదురు చూస్తోంది. పండగల సీజన్‌ అమ్మకాలు బాగున్నట్టు వార్తలు రావడంతో బజాజ్‌ ఆటో, ఎం అండ్‌ ఎం, మారుతి సుజుకీ, టాటా మోటార్స్‌, హీరో మోటోకార్ప్‌ వంటి ఆటోమొబైల్‌ కంపెనీల షేర్లు 2.34 శాతం వరకు లాభపడ్డాయి. భారతి ఎయిర్‌టెల్‌, అదానీ పోర్ట్స్‌, కోల్‌ ఇండియా, పవర్‌ గ్రిడ్‌ షేర్లూ మంచి లాభాలతో ముగిశాయి. విప్రో, టిసిఎస్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్స్‌ మాత్రం అమ్మకాల ఒత్తిడితో నీరసించాయి. రియల్టీ, మెటల్‌, కన్స్యూమర్‌ డ్యూరబుల్‌ కంపెనీల షేర్లకీ కొనుగోళ్ల మద్దతు లభించింది. భారీ లాభాల్లో లవబుల్‌ లింగరీ షేర్లు బైబ్యాక్‌ వార్తలతో లవబుల్‌ లింగరీ షేర్లు భారీ లాభాలతో ముగిశాయి. బిఎస్‌ఇలో శుక్రవారం ఈ కంపెనీ షేర్లు 19.75 శాతం లాభంతో రూ.244.85 వద్ద ముగిశాయి. ఎసిఎంఇ సోలార్‌ నుంచి రూ.2,200 కోట్ల ఐపిఒత్వరలో మరో సోలార్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు రాబోతోంది. ఎసిఎంఇ సోలార్‌ హోల్డింగ్‌ కంపెనీ రూ.2,200 కోట్లు ఐపిఒ ద్వారా సమీకరించేందుకు అనుమతించాలని సెబికి దరఖాస్తు చేసింది. రుణాల చెల్లింపుతోపాటు, వ్యాపార విస్తరణ కోసం కంపెనీ ఈ పబ్లిక్‌ ఇష్యూకి సిద్దమవుతోంది.  పవర్‌ గ్రిడ్‌కు ఐసిఐసిఐ బ్యాంక్‌ టర్మ్‌ లోన్‌ఐసిఐసిఐ బ్యాంక్‌ నుంచి పవర్‌ గ్రిడ్‌ కంపెనీ రూ.3,270 కోట్ల టర్మ్‌ లోన్‌ తీసుకోబోతోంది. ఇందుకు సంబంధించిన ఒప్పందం కూడా పూర్తయినట్టు తెలిపింది. వ్యాపార విస్తరణ కోసం ఈ నిధులను ఉపయోగించనున్నట్టు పేర్కొంది. ఆల్‌టైమ్‌ హైలో అశోక్‌ లేలాండ్‌ షేర్లుఅశోక్‌ లేలాండ్‌ కంపెనీ షేర్లు శుక్రవారం ఆల్‌టైమ్‌ హైకి చేరాయి. కంపెనీ జారీ చేసే రుణ పత్రాలకు ఇక్రా మంచి రేటింగ్‌ ఇచ్చిందన్న వార్తలతో బిఎస్‌ఇలో ఈ కంపెనీ షేర్లు 5.26 శాతం లాభంతో రూ.123.05 వద్ద ముగిశాయి. దీంతో గత ఆరు నెలల్లో అశోక్‌ లేలాండ్‌ షేర్లు ఇన్వెస్టర్లకు 42 శాతం లాభాలు పంచినట్టయింది. లాభాల్లో గెయిల్‌ షేర్లుపైప్‌లైన్ల ద్వారా సరఫరా చేసే గ్యాస్‌కు ఒకే ధర నిర్ణయించబోతున్నారన్న వార్తలతో గెయిల్‌ ఇండియా షేర్లకు గిరాకీ ఏర్పడింది. దీంతో బిఎస్‌ఇలో ఒక దశలో ఈ షేరు ఎనిమిది శాతం వరకు పెరిగి రూ.428కి చేరింది. చివరికి 5.79 శాతం లాభంతో రూ.419.10 వద్ద ముగిసింది.
business
20,471
10-08-2017 01:38:34
తొలి రౌండ్‌లో సైనా, సింధుకు బై
 వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత ఏస్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధుకు తొలి రౌండ్‌లో బై లభించింది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో 21న ప్రారంభం కానున్న ఈ టోర్నీ డ్రాను బుధవారం ప్రకటించారు. సింధు నాలుగో సీడ్‌గా బరిలోకి దిగనుంది. ఇక సైనా 12వ సీడ్‌గా అదృష్టాన్ని పరీక్షించు కోనుంది. భారత షట్లర్లకు టాప్‌ సీడ్‌ అకానె యమగుచి (జపాన్‌), రచనోక్‌ ఇంటనాన్‌ (థాయ్‌ లాండ్‌), సన్‌ యు (చైనా), కరోలినా మారిన్‌ (స్పెయిన్‌), నజోమి ఒకుహర నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే క్వార్టర్స్‌ వరకు సైనా, సింధుకు ఎదురుండకపోవచ్చు. ఇక పురుషుల సింగిల్స్‌లో ఇండోనేసియా, ఆస్ర్టేలియా ఓపెన్‌ విజేత కిడాంబి శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌, అజయ్‌ జయరామ్‌, సమీర్‌ వర్మ బరిలోకి దిగనున్నారు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి-సుమిత్‌ రెడ్డి, సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి, మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి, మిక్స్‌డ్‌లో ప్రణవ్‌ జెర్రీ చోప్రా-సిక్కిరెడ్డి జోడీలు పోటీపడనున్నాయి.
sports
10,000
09-07-2017 00:30:02
‘వైశాఖం’వచ్చేస్తోంది!
హరీశ్‌, అవంతిక జంటగా ఆర్‌.జె.సినిమాస్‌ పతాకంపై రూపొందిన ‘వైశాఖం’ ఈ నెల 21న విడుదల కానుంది. జయ.బి. దర్శకత్వం వహించిన చిత్రమిది. నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ ‘‘మా చిత్రం ఫస్ట్‌ కాపీ సిద్ధమైంది. అన్ని పనులు పూర్తి చేసి ఈ నెల 21న విడుదల చేస్తాం. సకుటుంబంగా చూడదగ్గ ప్రేమకథా చిత్రంగా మలిచాం. మా థియేట్రికల్‌ ట్రైలర్‌కి, డి.జె.వసంత్‌ అందించిన సంగీతానికి అద్భుతమైన స్పందన వస్తోంది. త్వరలోనే ట్రిపుల్‌ ప్లాటినమ్‌ డిస్క్‌ ఫంక్షన్‌ నిర్వహిస్తాం. మా థీమ్‌ టీజర్‌కి మూడు మిలియన్లకి పైగా వ్యూస్‌ రావడం ఆనందంగా ఉంది. బిజినెస్‌ పరంగానూ మంచి క్రేజ్‌ను తెచ్చుకుంది ‘వైశాఖం’. ప్రతి ఏరియా నుంచి నలుగురైదుగురు బయ్యర్లు మంచి ఆఫర్లతో వస్తున్నారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: వాలిశెట్టి వెంకట సుబ్బారావు, లైన్‌ ప్రొడ్యూసర్‌: బి.శివకుమార్‌.
entertainment
21,168
31-01-2017 02:37:29
బంగ్లా టెస్ట్‌లో సాహా రీఎంట్రీ!
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్ట్‌లో బెంగాల్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌ తర్వాత గాయంతో జట్టుకు దూరమైన సాహా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. ఇరానీ కప్‌లో డబుల్‌ సెంచరీతో సాహా సత్తాచాటాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎంపిక చేయనున్న 15 మంది సభ్యుల బృందంలో సాహాకు చోటు ఖాయంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 9న ఈ మ్యాచ్‌ మొదలుకానుంది. మరో వికెట్‌కీపర్‌ పార్థివ్‌ పేరు కూడా పరిశీలనకు రానుంది.
sports
264
22-06-2017 00:17:27
జిఎస్టి ఫైలింగ్‌పై భయాలొద్దు
నెలకు ఒక రిటర్న్‌ చాలున్యూఢిల్లీ: జిఎస్టి రిటర్న్‌లపై వ్యక్తమవుతున్న భయాలపై ప్రభు త్వం స్పష్టత ఇచ్చింది. రిటైల్‌ వ్యాపారులు, బి2సి వ్యాపార సంస్థలేవీ నెలకు ఒకటి కంటే ఎక్కువ రిటర్న్‌లు ఫైల్‌ చేయాల్సిన అవసరం లేదని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హ స్ముఖ్‌ అధియా ప్రకటించారు. వీరం తా ఇపుడున్న విధంగానే నెలకు ఒక రిటర్న్‌ ఫైల్‌ చేస్తే సరిపోతుందన్నారు. వీరు నెల నెలా ఇన్వాయి్‌సల వారీగా వివరాలు తమ రిటర్న్‌లలో పేర్కొనాల్సిన అవసరమూ లేదని స్పష్టం చేశారు. ఈ రిటర్న్‌ల ఫైలింగ్‌ విధానమూ తేలిగ్గా పారదర్శకంగా ఉంటుందన్నారు. అమ్మకాల ఇన్‌వాయిస్‌ వివరాలు అప్‌లోడ్‌ చేశాక మరుసటి నెల 10వ తేదీకల్లా జిఎ్‌సటి రిటర్న్‌-1 జనరేట్‌ అవుతుందని చెప్పారు.
business
13,333
24-03-2017 01:09:21
జవాను చెంప ఛెళ్లుమనిపించిన యువతి
చెన్నై, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): వాగ్వివాదంలో తనపై చేయి వేసిన సీఐఎస్ ఎఫ్‌ జవాను చెంప ఛెళ్లుమనిపించిందో యువతి. బుధవారం సాయంత్రం విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. అహ్మదాబాద్‌కు చెందిన ముగ్గురు విద్యార్థినులు పరిశోధనల కోసం ఇటీవల చెన్నై వచ్చారు. స్వస్థలానికి తిరిగి వెళ్లేందుకు విమానాశ్రయం వచ్చిన ఆ ముగ్గురినీ 4వ గేటు వద్ద సీఐఎస్ ఎఫ్‌ జవాను నిలిపాడు. అయితే తమ టిక్కెట్‌ను అధికారులు తనిఖీ చేశారని, అప్పటికే ఆలస్యమైనందున తమను వదిలేయాలంటూ వారు అభ్యర్థించారు. అతను మొండికేయడంతో వాగ్వివాదం నెలకొని ఈ ఉదంతం చోటుచేసుకుంది.
nation
4,980
27-12-2017 22:30:15
పెద్దాయన చెప్పారని మార్చుకున్నా
‘‘ఒక రోజు నేను దిల్‌రాజు ఆఫీసులో ఉంటే ఓ పెద్దాయన వచ్చి నా పూర్తి పేరు అడిగితే ‘వేణు శ్రీరామ్‌’ అన్నాను. ఇంటిపేరు ‘శ్రీరామ్‌’ని ముందు పెట్టుకోమని సూచించారు. ఆయన మాటల్లో పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ ఉన్నాయి. వెంటనే నా పేరును శ్రీరామ్‌ వేణు అని మార్చుకున్నాను’’ అని చెప్పారు శ్రీరామ్‌ వేణు. ఇటీవల విడుదలైన ‘ఎంసీఏ’కు ఆయనే దర్శకుడు. 2017లో నిర్మాత దిల్‌రాజు అందుకున్న ఆరో హిట్‌ అది. నాని, సాయిపల్లవి జంటగా నటించారు. ఈ సినిమా గురించి శ్రీరామ్‌ వేణు మాట్లాడుతూ ‘‘మాది కూడా మిడిల్‌ క్లాసే. కొన్ని విషయాలను ఎన్నిసార్లు చెప్పినా అం దంగా అనిపిస్తాయి. నేను, నా తమ్ముడు చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. నాకు పెళ్లయిన తర్వాత తమ్ము డు కాస్త ఇబ్బందిపడటాన్ని గమనించాను. ఆ విషయాలు చాలా క్యూట్‌గా అనిపించాయి. అందుకే వాటినే ఆధారంగా చేసుకుని కథ అల్లాను. తొలి సినిమాకు, రెండో చిత్రానికీ మధ్య నాకు చాలా గ్యాప్‌ వచ్చింది. నా తదుపరి సినిమా ఏంటనేది త్వరలో చెబుతాను. రవితేజగారితో ఇంతకు ముందు ఓ సినిమా చేయాల్సింది.. కానీ కుదరలేదు. భవిష్యత్తులో తప్పకుండా చేస్తాను’’ అని చెప్పారు.
entertainment
1,888
02-02-2017 23:50:08
విశాఖలో నౌకా వాణిజ్య సదస్సు
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): విశాఖ మరో వాణిజ్య సదస్సుకు వేదికవుతోంది. తూర్పు తీరంలో వ్యాపారాభివృద్ధి కోసం ఈ నెల 9-10 తేదీల్లో నౌకా వాణిజ్య సదస్సు జరగనుంది. ‘వ్యాపార వ్యూహాల పునఃప్రారంభం’ పేరుతో జరిగే ఈ రెండు రోజుల సదస్సుకు దేశ, విదేశాల నుంచి సుమారు 300 మంది ప్రతినిధులు హాజరవుతారని సదస్సును నిర్వహిస్తున్న ‘మారిటైమ్‌ గేట్‌వే’ ప్రతినిధులు చెప్పారు. ఆంధ్రప్రదేశ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండసీ్ట్ర కూడా ఈ సదస్సుకు సహకరిస్తోంది. స్థానిక తాజ్‌ గేట్‌వే హోటల్‌లో జరిగే ఈ సదస్సుకు అదానీ, కృష్ణపట్నం పోర్టు, కాంకర్‌, ఇనల్యాండ్‌ వాటర్‌ వేస్‌ అథారిటీ, సెంచురీ ఫ్లైబోర్డ్స్‌, గంగవరం పోర్టు, విశాఖపట్నం పోర్టు, శ్రవణ్‌ షిప్పింగ్‌, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన ఆఫ్‌ ఇండియా, కోల్‌కతా పోర్టు లాజిస్టిక్‌ ప్లేయర్లుగా హాజరవుతాయి. నేపాల్‌, బంగ్లాదేశ, శ్రీలంక దేశాలూ ఉత్సాహంగా ఈ సదస్సులో పాల్గొంటున్నాయని మారిటైమ్‌ గేట్‌వే ప్రతినిధులు చెప్పారు. పొరుగు దేశాలతో అత్యుత్తమ సంబంధాలు, తీరప్రాంత నౌకా రవాణా ద్వారా సరకు రవాణా సామర్థ్యం పెంపు, మారుమూల ప్రాంతాల్లో హాట్‌ స్పాట్స్‌ గుర్తింపు తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చ జరుగుతుందన్నారు.
business
6,938
20-11-2017 08:12:47
మెహ్రీన్ లేదా..? వెళ్లిపోయిందా?.. మంచిదేలే..: సాయి ధరమ్
జవాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. జవాన్ సినిమాలోని కొన్ని సీన్స్‌లో నటించేందుకు తన అనుభవం సరిపోలేదని.. ఆ సమయంలో ప్రసన్న చాలా చాలా హెల్ప్ చేశారన్నారు. జవాన్ సినిమాలో ప్రసన్న ప్రతి నాయకుడి పాత్ర పోషించారు. ఇక మెహ్రీన్ గురించి సాయి ధరమ్ మాట్లాడుతూ ఆమె తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి గోల్డెన్ లెగ్ అన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన మెహ్రీన్ తేజు మాట్లాడే సమయానికి వెళ్లిపోయింది. అప్పుడు కొందరు మెహ్రీన్ వెళ్లిపోయింది అనగానే.. "మెహ్రీన్  లేదా? వెళ్లిపోయిందా? అనుకున్నాను.. మంచిదేలెండి వెళ్లిపోతే" అని సరదాగా నవ్వుతూ అన్నారు. ఆమె ఈ సినిమాకు చాలా సపోర్టివ్‌గా వర్క్ చేసిందన్నారు. తన ఇంతకుముందు సినిమాల్లాగే ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నానన్నారు.
entertainment
8,766
02-12-2017 06:46:25
వీడియో వైరల్: మానుషీ.. దేవునిదే భారం: ‘రక్షకుడు’ హీరోయిన్
మిస్ వరల్డ్- 2017 కిరీటం దక్కించుకున్న మానుషీ చిల్లర్ భారత్ తిరిగి వచ్చిక బిజీగా మారిపోయింది. తాజాగా మానుషీ చిల్లర్‌కు చెందిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మానుషీ చిల్లర్‌తో పాటు బాలీవుడ్ హీరోయిన్ సుస్మితాసేన్ కనిపిస్తోంది. కాగా ఈ వీడియో మానుషి మిస్ వరల్డ్‌గా ఎంపిక అవకముందునాటిదిగా తెలుస్తోంది. ఈ వీడియోలో మానుషి, సుస్మితలు ఒక ఫ్లయిట్‌లో మాట్లాడుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా సుస్మిత.. మానుషితో ‘నువ్వు నీ తరపున బెస్ట్ పెర్ఫెర్మెన్స్ ఇవ్వు... తరువాత భగవంతునిపై భారం వదిలిపెట్టు’ అని చెబుతున్నట్టు ఉంది. కాగా మానుషి భారత్ తిరిగివచ్చిన తరువాత ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సుస్మితకు బర్త్ డే విషెస్ చెప్పింది. సుస్మిత గతంలో హీరో నాగార్జునతో ‘రక్షకుడు’ సినిమాలో జోడీగా నటించింది.                                బాలీవుడ్ జంకీ సౌజన్యంతో...
entertainment
10,681
14-08-2017 20:17:18
ఎన్టీఆర్ కు అల్లు అర్జున్ పాటంటే చాలా ఇష్టమట !
ఎన్టీఆర్, అల్లుఅర్జున్... ఇప్పటి యంగ్ స్టార్లలో వీరిద్దరికున్న క్రేజ్ గురించి  స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరు హీరోలు ఎవరికివారే సాటి. నటన, డాన్సుల్లో ఇద్దరూ పోటీపడుతూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. అయితే తాజాగా ఎన్టీఆర్ 'బిగ్‌బాస్' లో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. అల్లుఅర్జున్ హీరోగా నటించిన 'ఆర్య 2' సినిమాలో మిస్టర్ పర్ఫెక్ట్ పాటంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. అంతేకాదు ఆ పాటలోని మూడు లైన్లు పాడి కూడా వినిపించాడు.ఆదివారం రోజున బిగ్‌బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కల్పన ఆర్య 2 సినిమాలోని మిస్టర్ పర్ఫెక్ట్ పాట పాడింది. ఈ పాట విన్న ఎన్టీఆర్ తనకు ఈ పాటలోని 'మ్యాన్ హోల్ లాంటి మైండ్ వీడిదండోయ్..చీటండోయ్..ఛీపండోయ్.. గజిబిజి పజిలండోయ్..' అనే లైన్ అంటే మరీ ఇష్టమని అన్నాడు. ప్రస్తుతం పోటాపోటీగా సినిమాలు చేస్తూ విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ హీరోల్లో.. ఎన్టీఆర్ తనకు అల్లుఅర్జున్ సినిమాలోని పాట ఇష్టమని చెప్పడంతో ఇద్దరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
entertainment
11,245
16-11-2017 03:35:06
పారిశుధ్య కార్మికులు మరణిస్తే పరిహారమివ్వాల్సిందే
న్యూఢిల్లీ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): పనిచేస్తున్న సమయంలో మ్యానువల్‌ పారిశుధ్య కార్మికులు మరణిస్తే సంబంధిత కాంట్రాక్టర్‌ లేదా పనికి పిలిచినవారు నష్టపరిహారం చెల్లించడం తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు చట్టానికి సవరణలు చేయాలని కేంద్ర సామాజిక న్యాయశాఖ నిర్ణయం తీసుకున్నది. పని చేస్తుండగా మరణిస్తే బాధితుడి కుటుంబానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని చెల్లిస్తున్నాయి. దీనికి తోడుగా మరో రూ.10 లక్షలు పని చేయించుకునే వ్యక్తులు చెల్లించాలని ప్రభుత్వం పేర్కొన్నది.
nation
6,865
24-09-2017 22:27:49
నెగటివ్‌గా మాట్లాడకండి..
పాకిస్థానీ నటి మహీరాఖాన్‌, బాలీవుడ్‌ నటుడు రణబీర్‌ కపూర్‌ న్యూయార్క్‌లోని హోటల్‌లో సిగిరెట్‌ తాగుతూ ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దాంతో నెటిజన్లు అదే పనిగా మహీరాను ట్రాల్‌ చేస్తున్నారు. ఆమె ధరించిన బ్యాక్‌లెస్‌ డ్రెస్‌ గురించి కొందరు మతపరమైన విమర్శలు చెయ్యగా.. మరి కొందరు అభిమానులు మద్దతుగా నిలిచారు. దీనిపై రణబీర్‌ స్పందించారు. ‘‘గత కొన్ని నెలలుగా మహీరా నాకు తెలుసు. ఆమె సాధించిన విజయాలకు నేను అభిమానినయ్యా. ఓ మహిళ అని కూడా ఆలోచించకుండా ఆమె ఫొటోలపై కొందరు కామెంట్లు చేస్తున్నారు. అది సరికాదు. దయచేసి నెగటివ్‌గా మాట్లాడటం ఆపి దేవుడిచ్చిన ప్రశాంతమైన జీవితాన్ని ఆనందంగా గడపండి’’ అని తెలిపారు. సిగిరెట్టు తాగడమే కాదు.. ఇలా ఎదుటివారిని అసహ్యించుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరమే అని కూడా ఆయన సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు.
entertainment
4,039
23-02-2017 03:46:28
నిన్న.. బాసులు; నేడు... కేసులు; రేపు.. దోషులు
ఇప్పుడు దేశంలో వరసబెట్టి, వివిధ కుంభకోణాలను విచారించిన దర్యాప్తు సంస్థల అధినేతలు తామే అవినీతి కేసుల్లో నిందితులుగా తేలడం, ఒకప్పుడు తాము శాసించిన సంస్థల చేతిలోనే దర్యాప్తునకు లోనవ్వడం జరుగుతున్న పరిణామం. రెండు నెలల క్రితం బొగ్గు కుంభకోణంలో అనుమానిత పాత్ర వహించినందుకు మాజీ సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా నిందితుడిగా తేలగా, నేడు అదే కుర్చీలో ఆయనకు ముందు వెలగబెట్టిన ఏపీ సింగ్ వేరే అవినీతి కేసులో నిందితుడు. ఇవి కాక ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్లో ముఖ్య అధికారి జేపీ సింగ్, మరో ఇద్దరు ఐఏఎస్ సీనియర్ అధికారులు పెద్ద స్థాయి కుంభకోణాల్లో నిందితులుగా దర్యాప్తునకు గురికావడం విశేషం. ఇలా వరసగా వారాల వ్యవధిలో పెద్దతలకాయలు నిందితులుగా కేసులెదుర్కోవడం శుభసూచకం. తద్వారా ఎంత పెద్దపదవులు వెలగబెట్టినా తప్పు చేస్తే చట్టానికి చిక్కడం తప్పదన్న సంకేతంతో కొంత మంచి జరగవచ్చు.ఇంకో వైపు చూస్తే అవినీతి ఇంత విచ్చలవిడి స్థాయిలో ఉందా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకా జరగాల్సిన వ్యవస్థాగత సంస్కరణల అవసరాన్ని పట్టి చూపిస్తుందీ పరిణామం. ప్రజలకు చెందిన పార్కులోకి విహారానికొచ్చిన రాజు, ఓ పండ్ల చెట్టుని చూసి, ఆశ పడి ఓ పండుని తెంపితే, ఆ తరువాత ఆయన అనుచరులు ఆ చెట్టు ఆకుల్ని కూడా మిగలనివ్వరని లోకోక్తి. అంటే బాధ్యత గల పైస్థాయి అధికారులు తప్పు చేస్తే, కింది సిబ్బంది వెయ్యి తప్పులు చెయ్యడానికి వెనుకాడరని అర్థం. ఆ స్థాయిలో నిజాయితీ, పదవులు చేపట్టిన అందరి నుంచి ఆశించలేం కాబట్టి తప్పులు జరగకుండా వ్యవస్థనే తీర్చిదిద్దుకోవాలి. పారదర్శకత, జవాబుదారీతనం పెరిగేలా, తప్పులకు వెంటనే శిక్షపడేలా అధికారిక సంస్థల్లో అంతర్గత వ్యవస్థ ఉండాలి. ఆ దిశగా కృషి చేసినప్పుడే అవినీతిని కట్టడి చెయ్యడం వీలౌతుంది. దానికిదే సరైన సమయం.- డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం‌
editorial
5,873
26-09-2017 11:59:09
జైలు నుంచి విడుదలయినట్లు ఉంది: అర్చన
70 రోజుల తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడంపై ఫైనల్ కంటెస్టెంట్ అర్చన సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల హైదరాబాద్ చేరుకున్న ఆమె.. ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ముచ్చటించారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ షో విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.       ‘‘ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు జైలులో ఉన్నట్లు ఉండేది.. ఇప్పుడు జైలు నుంచి బయటికి వచ్చినట్లు ఉంది. ఒక కొత్త అర్చనగా బయటికి వచ్చినట్లు అనిపించింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. అసలు బిగ్ బాస్‌ షో ఇంత సక్సెస్ అవుతుందని అసలు ఊహించలేదు. నా పట్ల జనాలు స్పందన చూస్తుంటే అద్భుతంగా ఉంది. ఇన్ని రోజులు ఒక యాక్టర్‌గా చూసిన ప్రజలు.. ఇప్పుడు వాళ్లింట్లో ఒకమ్మాయిగా చూస్తున్నారు. ఇదోక గొప్ప అనుభవం. అసలు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లేటప్పుడు ఇన్ని రోజులు ఉంటా అని నేనే అనుకోలేదు.’’ అని అర్చన చెప్పుకొచ్చారు.
entertainment
21,012
11-05-2017 00:49:41
దక్షిణాఫ్రికాకు వస్తారా లేదా?
డిసెంబర్‌లో సిరీస్ లో పాల్గొనండిలేదంటే ఐపీఎల్‌ నుంచి మా వాళ్లు వెనక్కిబీసీసీఐకి సీఎస్ఏ హెచ్చరికసమాధానం అవసరం లేదు: సీఈవో జోహ్రీముంబై: ఐసీసీలో ఆదాయ పంపిణీ, పరిపాలనా వ్యవస్థలో మార్పులను అడ్డుకోవడంలో దెబ్బతిన్న బీసీసీఐని దొరికిందే అదునుగా వివిధ దేశాలు కవ్విస్తున్నాయి. ద్వైపాక్షిక సిరీస్ ల ఒప్పందం ఉల్లంఘించినందుకు నష్టపరిహారం చెల్లించాలని పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) నోటీసులు ఇవ్వగా, తాజాగా.. క్రికెట్‌ సౌతాఫ్రికా (సీఎ్‌సఏ) హెచ్చరింపులకు దిగింది. డిసెంబర్‌లో సౌతాఫ్రికాతో సిరీస్‌తో ఆడకుంటే ఐపీఎల్‌ నుంచి తమ ఆటగాళ్లను ఉపసంహరించుకుంటామని చెబుతోంది. ఈ మేరకు తమతో సిరీ స్‌కు అంగీకరించాలని కోరుతూ సీఎ్‌సఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ హరూన లోర్గాట్‌ బీసీసీఐ సీఈవోకు లేఖ రాశాడు. అప్పుడే దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఐపీఎల్‌లో కొనసాగేందుకు అనుమతిస్తామని తెలిపాడు. అయితే, బోర్డు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. లోర్గాట్‌ నుంచి విజ్ఞాపన వచ్చింది నిజమేనన్న బోర్డు సీఈవో రాహుల్‌ జోహ్రీ దానికి సమాధానం ఇవ్వకూడదని నిర్ణయించినట్టు తెలిపాడు. ఇప్పుడు సీఎ్‌సఏతో మాట్లాడాల్సిన అవరసరమే లేదని, సమయం వచ్చినప్పుడు సమాధానం ఇస్తామని జోహ్రీ స్పష్టం చేశాడు. వాస్తవానికి భారత వచ్చే జనవరిలో దక్షిణాఫ్రికాలో పర్యటించే అవకాశముందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. కానీ, సౌతాఫ్రికా మాత్రం డిసెంబర్‌లోనే సిరీస్‌ జరగాలని, బాక్సింగ్‌ డే టెస్టు రోజే అది మొదలవ్వాలని కోరుకుంటోంది. నవంబర్‌లో న్యూజిలాండ్‌తో సిరీస్‌: నవంబర్‌లో న్యూజిలాండ్‌తో స్వదేశంలో సిరీ్‌సకు బీసీసీఐ ఆమోదం తెలిపినట్టు సమాచారం. అదే నెలలో భారతలో పాక్‌ పర్యటించాల్సి ఉంది. అది జరగదు కనుక ఆ స్థానాన్ని న్యూజిలాండ్‌తో భర్తీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సిరీస్‌ ముగిశాక టీమిండియా.. దక్షిణాఫ్రికా బయల్దేరే అవకాశం ఉంది. కాగా, శ్రీలంకకు స్వాతంత్య్రం లభించి ఏడు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఈ జూలైలో లంకలో సిరీస్‌ ఆడతామని బీసీసీఐ ఆఫర్‌ చేసింది.
sports
16,803
15-02-2017 23:52:27
ఈ ప్రయోగం రికార్డు కోసం కాదు!!
సామర్థ్యం పెంచుకునేందుకే: ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్‌ వెల్లడి శ్రీహరికోట, (సూళ్లూరుపేట) ఫిబ్రవరి 15 : ఒకేసారి 104 ఉపగ్రహాలను రోదసిలోకి పంపడం ప్రపంచ రికార్డు కోసం కాదని, ఇది ఇస్రో సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు చేసిన ప్రయోగమని ఇస్రో చైర్మన ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా చిన్న చిన్న ఉపగ్రహాల వినియోగమే ఎక్కువగా ఉంటుందన్నారు. వివిధ ఏజెన్సీలు, చిన్న చిన్న ఉపగ్రహాలు తయారుచేసి రోదసిలోకి ప్రవేశ పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయని చెప్పారు. అందుకే ఆ ఏజెన్సీల అవసరాలకు తగినట్లు పీఎ్‌సఎల్‌వీ సామర్ధ్యాన్ని పెంచుతున్నామన్నారు. పీఎ్‌సఎల్‌వీ రాకెట్‌కి 1800 కిలోల ఉపగ్రహాలను తీసుకెళ్లే సామర్ధ్యం ఉంటుందన్నారు. ఓ 700, లేక 800 కిలోల బరువు కలిగిన ఒక ఉపగ్రహాన్నే ఈ రాకెట్‌తో ప్రయోగించకుండా, మిగిలిన బరువును చిన్న చిన్న ఉపగ్రహాలతో నింపి ప్రయోగించాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు. డిమాండ్‌ను బట్టి పీఎ్‌సఎల్‌వీ రాకెట్‌ను ఎక్కువ ఉపగ్రహాలతో సిద్ధం చేస్తామన్నారు. భవిష్యత్తులో 200 చిన్న ఉపగ్రహాలు కూడా ప్రయోగించే అవకాశం ఉంటుందన్నారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రెండు ఉపగ్రహాలను ప్రయోగించనున్నామని.. వీటిలో ఒకటి సార్క్‌ దేశాల కోసమని కిరణ్‌కుమార్‌ తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని వివరించారు. జీఎ్‌సఎల్‌వీ మార్క్‌ 2 సార్క్‌ ఉపగ్రహాన్ని, జీఎ్‌సఎల్‌వీ మార్క్‌3 జీశాట్‌ 19 ఉపగ్రహాన్ని పంపుతాయని తెలిపారు. 2014 నవంబరులో సార్క్‌ దేశాల సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఆ దేశాల కోసం ఓ ఉపగ్రహాన్ని భారత బహుమానంగా ఇస్తుందని తెలిపారు. 2018 మొదటి త్రైమాసికానికల్లా చంద్రయాన్‌ 2ను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
nation
1,180
12-04-2017 23:35:01
4జికి మారితే 4జిబి ఉచిత డేటా
ముంబై: రిలయన్స్‌ జియో ‘ధన్‌ ధనా ధన్‌’ ఆఫర్‌ నేపథ్యంలో వొడాఫోన్‌ అప్రమత్తమైంది. 4జి సర్వీసులకు మారే కస్టమర్లకు ఉచితంగా 4జిబి డేటాను ఇవ్వనున్నట్టు బుధవారం ప్రకటించింది. దీని కాలపరిమితి పది రోజులు. వొడాఫోన్‌ సూపర్‌ నెట్‌ 4జికి మారే ముంబైలోని కస్టమర్లకే ఇది వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. వొడాఫోన్‌ స్టోర్లు, మినీ స్టోర్లు, మల్టీ బ్రాండ్‌ స్టోర్లలో 4జి సిమ్‌లను అందుబాటులో ఉంచినట్టు పేర్కొంది. ఆర్‌జియో ధన్‌ ధనా ధన్‌ ఆఫర్‌ను ప్రకటించిన మరుసటి రోజే వొడాఫోన్‌ ఈ ఆఫర్‌ను ప్రకటించడం విశేషం.
business
9,646
21-11-2017 19:23:29
నా తొలి సినిమాకి కష్టాలు ఫేస్ చేశాను: త్రివిక్రమ్ శ్రీనివాస్
ఇటీవల నాగశౌర్య, రష్మిక నటించిన ఛలో మూవీ టీజర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ విడుదల కార్యక్రమంకు మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరై.. టీజర్‌ని విడుదల చేశారు. త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. తన శిష్యుడి చిత్ర టీజర్‌ని విడుదల చేసిన త్రివిక్రమ్ తన తొలి చిత్ర అనుభవాలను ఈ వేదికపై షేర్ చేసుకున్నారు. ఈ వేడుకలో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘‘నాకు సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడటం ఇష్టం ఉండదు. నేను ఏం మాట్లాడాలనుకున్నా.. అది సినిమాల్లోనే డైలాగ్స్ రూపంలో మాట్లాడేస్తుంటాను. అందుకే సినిమా వేదికలపై విసిగించను. ఇక ఈ సినిమా దర్శకుడు వెంకట్ నాకు చాలా పరిచయం ఉన్న ఇష్టమైన వ్యక్తి. గురుశిష్యులు అనాలి అంటే అది చాలా పెద్దమాట. ఇవాళ గురువులు అనేవారు ఎవ్వరూ లేరు. నేర్పించేవాళ్లు అంతకంటే లేరు. వెంకీ ప్రయాణంలో నేను కూడా ఉన్నానంతే. చాలా ప్రయాణం చేసిన తర్వాత వెంకీ నా వద్దకు వచ్చాడు. ఆయన ప్రయాణంలో నేను ఒక మజిలీ అంతే. నా వద్ద చేరిన తర్వాత ఇలా సొంతంగా సినిమా చేయడం నాకు సంతోషం కలిగించే విషయం. తొలిసారి దర్శకత్వం చేసిన దర్శకుడు బాధలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. తొలి సినిమా తీసి విడుదల చేయడం చాలా కష్టం. అలాంటి కష్టం నేను అనుభవించాను. నేను కథ, మాటలు రాసిన తొలి సినిమా ‘స్వయంవరం’కి ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆ సినిమాను నిర్మించి విడుదల చేయడానికి నిర్మాతలు చాలా కష్టపడ్డారు. సినిమా హాళ్లలో ఆ సినిమా ఎన్ని రోజులు నడిచిందో.. ప్రివ్యూ థియేటర్లలో కూడా అన్ని రోజులు నడిచింది. ఈ సినిమాని ఎంతమందికి చూపించామో లెక్కే లేదు. ప్రతి డిస్టిబ్యూటర్‌కి షో వేసి ఆ సినిమా చూపించాల్సి వచ్చింది. ఇలాంటి అనుభవాన్ని నా తొలి సినిమాకి ఫేస్ చేశాను. అయితే వెంకీకి అలాంటి సమస్య లేదు. ఈ సినిమా వెనుక సినిమా అంటే ఫ్యాషన్ ఉన్న నిర్మాత సాయి కొర్రపాటిగారు ఉన్నారంటూ’’ త్రివిక్రమ్ ఈ వేదికపై తన తొలి చిత్ర అనుభవాలను తెలిపారు.
entertainment
8,842
17-02-2017 12:10:26
బన్నీ బ్రాహ్మణ లుక్ నెట్‌లో లీక్!
ప్రస్తుతం బన్నీ హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘డీజే-దువ్వాడ జగన్నాథం’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఓ పాత్ర బ్రాహ్మణుడిగా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ బన్నీ బ్రాహ్మణుడి గెటప్‌లో ఉన్న ఓ ఫొటో నెట్‌లో లీకైంది. సెట్స్‌లో బన్నీ బ్రాహ్మణుడి ఫొటో ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది. బ్రాహ్మణుడి గెటప్‌లో ఉన్న బన్నీని సినీ అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. బ్రాహ్మణుడిగా బన్నీ ఒదిగిపోయాడని కొనియాడుతున్నారు. స్టైలిష్ స్టార్ ఎంతో నిబద్ధతతో చేస్తున్నాడని ప్రశంసిస్తున్నారు. కాగా, వాస్తవానికి డీజే ఫస్ట్‌లుక్ శనివారం విడుదల కాబోతోంది. ఆ ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇప్పుడు నెట్‌లో లీకైన దానికన్నా ఇంకా చాలా బాగుంటుందని, బన్నీ అభిమానులను నిరాశపరచదని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.
entertainment
8,149
10-02-2017 19:39:35
అగ్రహీరోకే షాక్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి
ఏడాదికిపైగా సినిమాలకు దూరంగా ఉన్న మాస్ హీరో రవితేజ.. నిన్నగాకమొన్నే మళ్లీ సినిమాలు స్టార్ట్ చేశారు. ఎంతోకాలంగా కథల ఎంపిక విషయంలో ఆలస్యం చేసిన రవితేజ ఎట్టకేలకు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు కమిట్ అవ్వడంతో రవితేజ ఈజ్ బ్యాక్ అని సినీవర్గాలు భావించాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ‘రాజా ది గ్రేట్’. విక్రమ్ సిరికొండ డైరెక్షన్‌లో ‘టచ్ చేసి చూడు’ సినిమాలో నటించబోతున్న మాస్ మహారాజ ఈ రెండు సినిమాలను సాధ్యమైనంత తొందరగా ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడని ప్రచారం జరిగింది. అయితే రవితేజ మళ్లీ తన సత్తా చూపడానికి సిద్ధమవుతున్న సమయంలోనే అప్ కమింగ్ బ్యూటీ ఆయనకు షాక్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంటున్న అందాల భామ లావణ్య త్రిపాఠి.. రవితేజ నయా మూవీ ‘టచ్ చేసి చూడు’లో సెకండ్ హీరోయిన్ చాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమాకు డేట్స్ అడ్జట్స్ చేయలేక ఇబ్బంది పడుతున్న లావణ్య ‘టచ్ చేసి చూడు’ నుంచి డ్రాప్ అయినట్లు వార్తలు వినిపించాయి. సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించడం ఇష్టం లేకే అమ్మడు ఇలా చేసిందని కొందరు అంటుంటే.. నాగచైతన్య నయా మూవీ కోసమే లావణ్య రవితేజ సినిమాను వదులుకుందని మరికొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఏదేమైనా మళ్లీ వరుస సినిమాలతో సందడి చేయాలని భావించిన రవితేజకు ఆదిలోనే హీరోయిన్ హ్యాండ్ ఇవ్వడం నిజంగా ఆలోచించదగ్గ విషయమే.
entertainment