SNo
int64 0
21.6k
| date
stringlengths 19
19
| heading
stringlengths 3
91
⌀ | body
stringlengths 6
38.7k
| topic
stringclasses 5
values |
---|---|---|---|---|
15,569 | 15-04-2017 16:48:01 | పాకిస్థాన్‌కు ఇరాన్ హెచ్చరిక |
ఇస్లామాబాద్ : పాకిస్థాన్, ఇరాన్ మధ్య చిచ్చు రేగింది. గ్యాంగ్‌స్టర్ ఉజయిర్ బలూచ్‌కు ఇరాన్ నిఘా సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు నిరాధారమైన వదంతులను ప్రచారం చేస్తుండటంపై ఇరాన్ మండిపడింది. కొందరు దుండగుల కార్యకలాపాలతో ఇరాన్ సంస్థలకు సంబంధాలు ఉన్నాయంటూ మీడియాలో ఇటీవల పుకార్లు వ్యాపిస్తున్నాయని, ఈ వైఖరి సరికాదని ఇస్లామాబాద్‌లోని ఇరాన్ దౌత్య కార్యాలయం ప్రకటించింది. పాకిస్థాన్‌లోని ప్రముఖ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం... సింధ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తన నివేదికను గత ఏడాది సమర్పించింది. ఉజయిర్ బలూచ్ గూఢచర్యం చేస్తున్నాడని ఆరోపించింది. సైనిక స్థావరాలు, సైనికాధికారులకు సంబంధించిన రహస్య సమాచారాన్ని విదేశీ ఏజెంట్లకు (ఇరాన్ నిఘా అధికారులకు) అందజేస్తున్నట్లు ఆరోపించింది. ఉజయిర్ ఇచ్చిన వాంగ్మూలంలో తాను చాబహార్‌లో ఇరానియన్ ఇంటెలిజెన్స్ అధికారిని కలిసినట్లు అంగీకరించాడు. పాకిస్థాన్ సైనికాధికారుల వివరాలను, కరాచీ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని తమకు అందజేయాలని ఉజయిర్‌ను ఇరాన్ అధికారి కోరినట్లు తెలిపాడు. దీనిపై ఇరాన్ స్పందించింది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మళ్ళించే లక్ష్యంతోనే ఇటువంటి నిరాధార అంశాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ఇటువంటి అవాస్తవ ప్రచారం రెండు మిత్ర, సోదర దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల విస్తరణకు అనుగుణంగా లేదని స్పష్టం చేసింది. | nation |
1,657 | 24-05-2017 01:20:42 | హైదరాబాద్‌లో టాప్ మీ సర్వీసులు | హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గుర్గావ్‌కు చెందిన స్టార్టప్ సంస్థ టాప్ మీ హైదరాబాద్‌లోనూ తన సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఆఫీసులు, కార్పొరేట్ సంస్థలు, గృహా ల్లో పనులకు అవసరమైన ఎలక్ర్టీషన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఏసీ టెక్నీషియన్లను ఈ కంపెనీ సమకూర్చుతోంది. మొబైల్ యాప్ ద్వారా వీరి సేవలను వినియోగించుకోవచ్చు. ఇప్పటికే విశాఖపట్నం, పాట్నా, జైపూర్‌లో తమ సర్వీసులను విస్తరించామని, ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశించామని టాప్ మీ డాట్ కామ్ సహ వ్యవస్థాపకుడు స్నేహాన్షు గాంధీ మంగళవారంనాడిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. తొలుత ఇక్కడి మార్కెట్లో తాము కార్పొరేట్ మెయింటెనెన్స సర్వీసులు అందిస్తామని, తర్వాత గృహ విభాగంలో సేవలను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. వచ్చే ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, చండీగఢ్, రాయ్‌పూర్, అహ్మదాబాద్, సూరత, లక్నో, ఇండోర్‌లో తమ సేవలను ఆరంభించే యోచన ఉందన్నారు. 250కి పైగా టెక్నీషియన్లు, సర్వీస్ ఇంజనీర్లు తమ వద్ద ఉన్నారని ఆయన తెలిపారు. | business |
3,120 | 17-08-2017 02:11:34 | బ్యాంకులే వడ్డీ రేట్లు తగ్గించాలి | మెజారిటీ సభ్యుల నిర్ణయం మేరకు రెపో రేటు తగ్గింపుఎంపిసి మినిట్స్ విడుదలముంబై : మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి)లోని మెజారిటీ సభ్యుల నిర్ణయం మేరకే గత ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటును 0.25 శాతం మేరకు తగ్గించినట్టు ఎంపిసి మినిట్స్ ద్వారా వెల్లడైంది. ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సారథ్యంలోని ఆరుగురు సభ్యుల ఎంపిసి ఈ నెల 1, 2 తేదీల్లో సమావేశమైన విషయం తెలిసిందే. ఇందులో మెజారిటీ సభ్యుల నిర్ణయం మేరకు రెపో రేటును 0.25శాతం మేర తగ్గించి 6 శాతానికి చేర్చారు. పరిశ్రమ, ఇతర స్టేక్‌హోల్డర్లు మరింత ఎక్కువగా వడ్డీ రేట్లను తగ్గించాలని ఓ వైపు కోరుతున్నప్పటికీ సభ్యుల నిర్ణయానికే ఆర్‌బిఐ గవర్నర్ ఓటు వేసినట్టు బుధవారంనాడు విడుదల చేసిన మినిట్స్ ద్వారా వెల్లడైంది. ఆరుగురు సభ్యుల్లో నలుగురు రెపో రేటులో 0.25 శాతం తగ్గింపునకు సూచించగా.. రవీందర్ హెచ్ ధొలాకియా మాత్రం 0.5 శాతం తగ్గించాలని కోరారు. మరో సభ్యుడు మైకేల్ దేవబ్రత పాత్ర (ఆర్‌బిఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) యథాతథ స్థితినే కొనసాగించాలని సూచించారు. కాగా సమావేశం సందర్భంగా పటేల్ మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న ఆహార ధరలు అసాధారణంగా ఉన్నాయని, రానున్న కాలంలో ఎగువకు కదిలేలా ఒత్తిడులకు అవకాశం ఉండవచ్చని హెచ్చరించారు. రెపో రేటు తగ్గించిన మేరకు బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం చాలా ముఖ్యమని, దీని వల్ల ద్రవ్యోల్బణేతర వృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడానికి ఇంకా అవకాశాలున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. బ్యాంకులు కొంత మేరకు తగ్గిన వడ్డీ రేట్లను తమ ఖాతాదారులకు బదిలీ చేశాయని, పాత రుణాలకు కూడా వడ్డీ రేట్లను తగ్గించేందుకు అవకాశం ఉందని ఆయన చెప్పారు. మరికొంతకాలం రేట్ల తగ్గింపు ఉండదు : హెచ్‌ఎస్‌బిసిద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో మరికొంతకాలం పాటు ఆర్‌బిఐ రేట్లను తగ్గించే అవకాశం ఉండకపోవచ్చని బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ హెచ్‌ఎ్‌సబిసి ఆర్థికవేత్తలు ఒక నోట్‌లో పేర్కొన్నారు. ఒకవేళ ఏడాది చివరినాటికి ద్రవ్యోల్బణం నాలుగు శాతంకన్నా దిగువ స్థాయికి చేరుకుంటే 0.25 శాతం రేట్ల తగ్గింపునకు అవకాశం ఉండవచ్చని తెలిపారు. కూరగాయల ధరల్లో పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం పెరిగిందని నోట్‌లో పేర్కొన్నారు. ఇక ఏడో వేతన సవరణ సంఘం ఫలితంగా గృహ సూచీలో పెరుగుదల నెలకొందని, వచ్చే ఆరు నెలల్లో హెచ్‌ఆర్‌ఎ ప్రభావం మరింతగా ఉండవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. జిఎ్‌సటి ప్రభావమూ ద్రవ్యోల్బణంపై పడినట్టు హెచ్‌ఎ్‌సబిసి నోట్ పేర్కొంది. | business |
21,607 | 26-09-2017 01:59:49 | భారత పర్యటనకు.. కివీస్ కోర్ టీమ్ ఎంపిక |
క్రైస్ట్‌చర్చ్: వచ్చే నెల టీమిండియాతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు తొమ్మిది మంది ప్రధాన సభ్యుల న్యూజిలాండ్ టీమ్‌ను ప్రకటించారు. మిగతా ఆరుగురిని భారత్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్-ఎ టీమ్‌ను నుంచి ఎంపిక చేయనున్నారు. కాగా, కోర్ టీమ్‌లో ఆల్ రౌండర్ జిమ్మీ నీషమ్, నీల్ బ్రూమ్‌కు చోటుదక్కలేదు. చాంపియన్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన కారణంగా వీరిపై వేటుపడింది. వన్డేల కోసం కోర్ టీమ్‌గా ఎంపిక చేసిన తొమ్మిది మందికి భారత్‌లో ఆడిన అనుభవం ఉందని కివీస్ కోచ్ మైక్ హెసన్ చెప్పాడు. మిగిలిన వారిని కివీస్-ఎ టీమ్ నుంచి ఎంపిక చేయనున్నట్టు తెలిపాడు. వచ్చే నెల 22 నుంచి మొదలుకానున్న భారత పర్యటనలో న్యూజిలాండ్ మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. న్యూజిలాండ్ టీమ్ (9 మంది): కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, కొలిన్ డి గ్రాండ్‌హోమ్, మార్టిన్ గప్టిల్, టామ్ లాథమ్, ఆడమ్ మిల్నే, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, రాస్ టేలర్. | sports |
14,194 | 26-10-2017 11:20:08 | ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్ల మృతి | న్యూఢిల్లీ: చత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బుధవారం రాత్రి జరిగిన ఈ ఎన్‌కౌంటర్లలో ముగ్గురు నక్సలైట్లు మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా బుధవారం రాత్రి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), జిల్లా పోలీసులు సంయుక్తంగా గాలింపులు చేపట్టారు. కోపెన్‌కడ్కా గ్రామ సమీపంలోని అడవిలో రాత్రి 10 గంటలకు నక్సలైట్లకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మృతిచెందిన నక్సలైట్లను ఏరియా కమిటీ సభ్యులు మహేశ్, రాకేశ్, లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్ కమాండర్ రంజిత్ పల్లెమడిలుగా గుర్తించారు. వీరిపై మొత్తం రూ.13 లక్షల వరకు రివార్డు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ముగ్గురూ బస్తర్ ప్రాంతానికి చెందిన వారేనని వెల్లడించారు. | nation |
19,521 | 14-02-2017 00:59:32 | మే 26న సచిన్ సినిమా |
ముంబై: భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ‘బయోపిక్’ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త. త్వరలోనే ఈ సినిమాను ఫ్యాన్స్ వెండి తెరపై చూడొచ్చు. తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ విడుదల తేదీని మాస్టర్ ట్విటర్‌లో సోమవారం ప్రకటించాడు. మే 26న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు సచిన్ ట్వీట్ చేశాడు. జేమ్స్ ఎర్సికిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సచిన్ తన పాత్రను తానే పోషించడం విశేషం. ఇక యువకుడిగా ఉన్న సన్నివేశాల్లో అతని కుమారుడు అర్జున్ టెండూల్కర్ మెరవనున్నాడు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఏడాది క్రితం విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది. | sports |
12,468 | 09-10-2017 17:48:41 | నిబంధనలను అతిక్రమించిన చిన్నమ్మ! | చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ జైలు నుంచి విడుదలైతే.. ఏం జరుగుతుందని రాజకీయ వర్గాలు భావించాయో.. అచ్చంగా ఇప్పుడు అదే జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ.. తన భర్త అనారోగ్యానికి గురికావడంతో 5 రోజుల పెరోల్‌పై విడుదలయ్యారు. జైలు నుంచి విడదలై చెన్నై వచ్చిన ఆమెకు తన మద్దతుదారులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. జైలు నుంచి నేరుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త నటరాజన్‌ను పరామర్శించారు. అయితే శశికళ ఈ ఐదు రోజుల వ్యవధిని తన రాజకీయ పనులను చక్కబెట్టుకోవడానికి ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. శుక్రవారం రాత్రి జైలు నుంచి విడుదలైన శశికళ.. పెరుంబాక్కంలోని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్త నటరాజన్‌ను శనివారం ఉదయం పరామర్శించారు. అటునుంచి శశికళ నేరుగా టీనగర్ హబీబుల్లా రోడ్డులోని తన మేనకోడలు నివాసానికి వెళ్లారు. అక్కడి నుంచే మళ్లీ ఆస్పత్రికి వెళ్లారు. ఈ సమయంలో ఆమె వెంట మేనల్లుడు జై ఆనంద్ కూడా ఉన్నారు. అయితే శనివారం నటరాజన్‌ను చూసేందుకు ఆస్పత్రికి వెళ్లిన సమయంలో శశిశళ పెరోల్ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పెరోల్ నిబంధనల ప్రకారం.. శశికళ కారుతో పాటు మరో మూడు వాహనాలు మాత్రమే ఆస్పత్రిలోకి అనుమతి ఉంది. అంతేకాదు.. రాజకీయ వ్యవహారల్లో పాల్గొనకూడదు. కానీ ఆమె వెంట ఏడు కార్లు వెళ్లాయని ఆరోపణలు వస్తున్నాయి. ఆయా కార్లలో తనకు మద్దతు తెలుపుతున్న ఇద్దరు ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. వారితో రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ వ్యవహారాలు చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పెరోల్‌పై విడుదలై తన నివాసానికి వెళ్లకుండా నేరుగా మేనకోడలు నివాసానికి వెళ్లడానికి పెద్దకారణమే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పెరోల్ గడువు ముగిసి జైలుకెళ్లాక.. టీనగర్ నివాసం కేంద్రంగా శశికళ తన మేనల్లుడు జై ఆనంద్ ద్వారా రాజకీయాలు నిర్వహించాలని భావిస్తున్నారట. ఈ కారణంగానే శశికళ వెంట ఎక్కువగా జై ఆనంద్ ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆస్పత్రిలోకి 7 కార్లు వెళ్లడంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన శశికళ వర్గం అధికారి ప్రతినిధి నాంజిల్ సంపత్.. శశికళ ఎవరినీ కలవకూడదు.. కానీ ఆమెను ఎవరైనా కలవవచ్చు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రోజా గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివి ప్రపంచంలో ఇంత వింతైన, విచిత్రమైన సముద్రం ఇదొక్కటే... | nation |
16,315 | 24-11-2017 13:37:25 | ‘పద్మావతి’ వివాదంలో ఘోరం... జైపూర్ కోటపై ఉరివేసుకున్న యువకుడు.. | న్యూఢిల్లీ: బాలీవుడ్ చిత్రం ‘పద్మావతి’పై కొనసాగుతున్న వివాదం ఇవాళ ఘోరమైన మలుపు తిరిగింది. పద్మావతి సినిమాకి వ్యతిరేకంగా జైపూర్ సమీపంలోని నహార్‌గఢ్ కోటపై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కోట పైభాగం నుంచి వెలుపలి వైపు అతడి మృతదేహం ఉరివేసుకుని వేలాడుతూ కనిపించండంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ‘‘పద్మావతిని వ్యతిరేకిస్తున్నా’’.., ‘‘దిష్టిబొమ్మలు తగలబెట్టడం కాదు.. మేమే చనిపోతాం...’’ అంటూ కోటరాళ్లపై నినాదాలు రాసి ఉన్నాయి. సమాచారం అందుకున్న బ్రహ్మపురి పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా ఇది ఆత్మహత్యా లేక ఎవరైనా హత్యచేసి మృతదేహాన్ని వేలాడదీశారా అన్నది ఇంకా తెలియరాలేదు. మృతుడి జేబులోని ఆధార్ కార్డు ఆధారంగా అతడిని చేతన్‌గా గుర్తించారు. అయితే ‘పద్మావతి’పై కొద్దిరోజులుగా తీవ్ర ఆందోళన చేస్తున్న రాజ్‌పుత్ కర్ణిసేన మాత్రం దీనిపై స్పందించేందుకు నిరాకరించింది. కర్ణిసేన సభ్యుడు మహిపాల్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఇది మా విధానానికి పూర్తి వ్యతిరేకం. ఇలా ప్రాణాలు తీసుకోవడం పద్ధతి కాదు.. అలాంటి చర్యలకు పాల్పడవద్దని మేము ప్రజలను కోరుతున్నాం..’’ అని పేర్కొన్నారు. తన బయోపిక్‌లో తనే నటించిన అశ్విని రాధ, చిరంజీవి కలయికలో వచ్చిన చిత్రాలెన్ని | nation |
2,519 | 19-02-2017 22:39:27 | ఫండ్స్ బజార్.. | హెచ్‌డిఎఫ్‌సి ఎంఎఫ్ హెచ్‌డిఎఫ్‌సి ఎఫ్‌ఎంపి 1143 రోజులు పేరుతో ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. డెట్/మనీ మార్కెట్ సాధనాలు, ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టి రాబడిని పెంచాలన్నది ఈ పథక ఉద్దేశం. ఆదాయం కేటగిరీలో వచ్చిన క్లోజ్ ఎండెడ్ స్కీమ్ ఇది. కొత్త ఫండ్ ఆఫర్ ఈ నెల 17వ తేదీన ప్రారంభమైంది. 27న ముగుస్తుంది. ఇందులో కనీసం 5,000 రూపాయల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఐడిఎఫ్‌సి ఎంఎఫ్ ఐడిఎఫ్‌సి క్రెడిట్ ఆపర్చునిటీస్ ఫండ్ పేరుతో దీన్ని ప్రారంభించారు. కార్పొరేట్ డెట్ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టి రిటర్నులను రాబట్టాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తెచ్చారు. ఆదాయం కేటగిరీలో వచ్చిన ఓపెన్ ఎండెడ్ పథకం. ఫిబ్రవరి 14న కొత్త ఫండ్ ఆఫర్ ప్రారంభమైంది. 27వ తేదీన ముగుస్తుంది. కనీస పెట్టుబడి 5,000 రూపాయలు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఓరియెంటెడ్ ఫండ్ -సీరిస్ 11- ప్లాన్ సి 1255 రోజులు పేరుతో ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. అధిక రేటింగ్ కలిగిన డెట్ సెక్యూరిటీలు, మనీ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టి మూలధన రక్షణ ను కల్పించాలన్నది ఈ పథక ఉద్దేశం. అంతేకాకుండా ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత పథకాల్లోనూ పెట్టుబడులు పెట్టి మూలధనాన్ని పెంచాలన్నది మరో లక్ష్యం. ఆదాయం కేటగిరీలో వచ్చిన క్లోజ్ ఎండెడ్ స్కీమ్. ఫిబ్రవరి 10న ప్రారంభమైన ఈ కొత్త ఫండ్ ఆఫర్ ఈ నెల 23వ తేదీన ముగుస్తుంది. ఇందులో కనీసం 5,000 రూపాయల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. | business |
12,421 | 15-02-2017 23:57:09 | భారత అంతరిక్ష చరిత్రలో మైలురాయి | రాష్ట్రపతి ప్రణబ్ అభినందనలు శాస్త్రవేత్తలకు సెల్యూట్: ప్రధాని చరిత్రాత్మక విజయం: సోనియా న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: గగనవీధిలో సాధించిన అద్భుత విజయంపై ఇస్రోకు రాష్ట్రప్రతి ప్రణబ్ ముఖర్జీ అభినందనలు తెలిపారు. ‘‘ఒకేసారి 104 ఉపగ్రహాలను విజయవంతంగా పంపిన ఈ రోజు భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో మైలురాయిగా నిలువనుంది’’ అని ప్రణబ్ అభివర్ణించారు. ఈ మేరకు ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్‌కు అభినందన సందేశం పంపారు. ‘‘పీఎ్‌సఎల్‌వీ-సీ37 ద్వారా రికార్డుస్థాయిలో 104 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన మీకు, మీ బృంద సభ్యులకు హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ప్రణబ్ పేర్కొన్నారు. ‘‘ఇస్రో సాధించిన ఈ అసాధారణ విజయం మన దేశం, అంతరిక్ష వైజ్ఞానిక సమాజం మరోసారి గర్వపడేలా చేసింది’’ అని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. మన శాస్త్రవేత్తలకు దేశమొత్తం సెల్యూట్ చేస్తోందని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇస్రో సాధించిన చరిత్రాత్మక విజయంతో దేశం మొత్తం మరోసారి గర్వంతో ఉప్పొంగిపోతోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా పేర్కొన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు కేరళ సీఎం పినరాయి విజయన్, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ అభినందనలు తెలిపారు. | nation |
19,689 | 22-02-2017 02:15:11 | అతడే ఒక బ్రాండ్! |
భారత క్రికెట్‌లో ఒక సంప్రదాయం ఉంది. ఒక ఆటగాడు గొప్పగా రాణిస్తుంటే అభిమానుల బ్రహ్మరథం పడతారు. అతడి నామస్మరణతో ఊగిపోతారు. ఇక వ్యాపారం గురించి చెప్పాల్సిందేమీలేదు. ఏ ఆటగాడైతే బాగా రాణిస్తున్నాడో.. కార్పొరేట్ కంపెనీలు వారివెంట పరుగులు పెట్టడం సహజం. రాయబారిగా నియమించుకుని తమ ఉత్పత్తుల ను మార్కెట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలో ఫామ్, డిమాండ్‌ను బట్టి ఎన్ని కోట్లు కుమ్మరించడానికైనా రెడీ అయిపోతాయి. గతంలో సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్, ధోనీ విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు కోహ్లీ విషయంలోనూ అదే జరుగుతోంది! కాకపోతే అది కాస్త ఎక్కువ స్థాయిలో ఉంది. విరాట్ ఇప్పుడు యూత ఐకాన్..! మార్కెట్ వర్గాల మెయిన్ టార్గెట్..! అందుకే జర్మనీకి చెందిన ఫుట్‌వేర్ సంస్థ ‘ప్యూమా’ కూడా విరాట్ కోహ్లీని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంది. ఎనిమిదేళ్ల కాలానికి తమ ఉత్పత్తులకు రాయబారిగా కొనసాగాలని ఒప్పందం కుదుర్చుకుంది. దీనికోసం ఏకంగా రూ. 110 కోట్లు చెల్లించడానికి సిద్ధమైం ది. ఒక భారత క్రీడాకారుడు సింగిల్ బ్రాండ్‌తో ఇంత భారీ ఒప్పందం కుదుర్చుకోవటం ఇదే తొలిసారి. ఈ ఒప్పందంతో జమైకా స్ర్పింటర్లు ఉసేన్ బోల్ట్, అసాఫా పావెల్, ఫుట్‌బాల్ స్టార్లు థియరీ హెన్రీ, ఒలీవర్ గెరార్డ్ సరసన కోహ్లీ నిలిచాడు. వీళ్లు కూడా ప్యూమాకు బ్రాండ్ అంబాసిడర్లే. కాగా.. ఈ సందర్భంగా బోల్ట్ కూడా విరాట్‌ను అభినందించాడు. ‘గొప్ప చాన్స్. మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇదే సరైన సమయమ’ని ట్వీట్ చేశాడు. దానికి కోహ్లీ కూడా ‘థాంక్స్ లెజెండ్. ఏదో రోజు నీ అంత వేగంగా పరుగెత్తు తానని ఆశిస్తున్నా’ అని రీ ట్వీట్ చేశాడు. విరాట్ కోహ్లీ మ్యాచ్ విన్నర్. క్రికెట్‌లో కోహ్లీ మేనియా నడుస్తోంది. గత రెండేళ్లుగా భీకర ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్ అయిన తర్వాత అతని పాపులారిటీ అమాంతం పెరిగింది. వరుసగా నాలుగు టెస్టు సిరీ్‌సల్లో డబుల్ సెంచరీలు సాధించడంతో క్రికెట్ ప్రపంచమంతా కోహ్లీ పేరు మార్మోగిపోతోంది. ధోనీ నుంచి పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించిన విరాట్ జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. దానికితోడు యూతలో విరాట్‌కు మంచి క్రేజ్ ఉంది. పైగా అతని దూకుడుతత్వాన్ని అందరూ ఇష్టపడతారు. కాబట్టి ఇదే సరైన సమయం.. తమ బ్రాండ్‌కి కోహ్లీ ప్రచారం చేస్తే జనం ఎగబడి కొనేస్తారని భావించిన వ్యాపార సంస్థలు అతని వెంటపడుతున్నాయి. ప్రస్తుతం అతడు 18 ఉత్పత్తులకు అంబాసిడర్‌గా ఉన్నాడు. మరికొన్ని సంస్థలు ఎండార్స్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. బ్రాండ్ వాల్యూ..2008లో కోహ్లీ సారథ్యంలోని అండ ర్-19 భారత జట్టు ప్రపంచకప్ గెలిచింది. దీంతో అతడు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. 2010లో టైటాన్ ఉత్పాదనల్లో ఒకటైన ఫాస్ట్‌ట్రాక్‌తో.. రూ.25 లక్షల ఒప్పందంతో మొదలైన కోహ్లీ మార్కెట్ మేని యా ఆ తర్వాత చాలా ‘ఫాస్ట్’గా సాగిపోయింది. ఎంఆర్‌ఎఫ్, పెప్సీ, మంచ్, టీవీఎస్ ఇలా అనేక కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 2014లో విరాట్ అతిపెద్ద డీల్ సాధించాడు. జర్మనీకి చెందిన ఆడిడాస్ ఏడాదికి పది కోట్లు చెల్లించేలా మూడేళ్ల కాలానికి ఎండార్స్ చేసుకుంది. స్పోర్ట్స్ ప్రొ అనే సంస్థ 2014లో అత్యంత మార్కెటబుల్ ప్లేయర్లలో రెండో వాడిగా కోహ్లీకి రేటింగ్ ఇచ్చింది. లూయిస్ హామిల్టన్ అగ్రస్థానం దక్కించుకోగా.. ఫుట్‌బాల్ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సి, స్ర్పింట్ కింగ్ ఉసేన్ బోల్ట్ సైతం విరాట్ వెనకే ఉన్నారు. కెరీర్ ఆరంభంలో లక్షలతో మొదలైన కోహ్లీ బ్రాండ్ వాల్యూ నేడు రోజుకు రూ. 4 కోట్లకు చేరుకుందని కోహ్లీ బ్రాండ్ పోర్ట్‌పోలియోను పర్యవేక్షిస్తున్న కార్నర్‌స్టోన్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ అధినేత బంటీ సజ్దే తెలిపాడు. ఇప్పుడు ఒక్కో బ్రాండ్ డీల్ ఖరీదు ఏడాదికి సగటున రూ. 10 కోట్లు ఉంది. దీపం ఉండగానే..ఫిట్‌నెస్ సమస్యల వల్ల చిన్న పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేందుకు స్టెపాథ్లాన్ లైఫ్‌స్టైల్ సంస్థతో కలిసి కోహ్లీ గతేడాది జూన్‌లో కొత్త వెంచర్‌ను మొదలుపెట్టాడు. | sports |
17,897 | 09-11-2017 01:20:47 | ఢిల్లీ ఇంకా ‘విష’మం! | వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి30 వేల మంది చనిపోవచ్చని డాక్టర్ల ఆందోళనఆదివారం వరకూ స్కూళ్లకు సెలవ్‌న్యూఢిల్లీ, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): వాయు కాలుష్యంతో దేశరాజధాని ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వాయు నాణ్యత సూచీ 500లకు గాను 484 చూపిస్తోంది. దీంతో 1952లో లండన్ నగరం ఎదుర్కొన్న పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నారు. ఆనాడు వాయు కాలుష్యానికి 4 వేల మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. అదేస్థాయిలో వాయు కాలుష్యం ఢిల్లీలో నమోదవుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే శ్వాస సంబంధ ఇబ్బందులతో ఆస్పత్రుల్లో చేరే రోగుల సంఖ్య పెరుగుతోంది. కొందరిలో ఈ లక్షణాలు ప్రమాదకర స్థాయిలో ఉండటంతో ఎయిమ్స్ వంటి ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆస్తమా వంటి జబ్బులకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నవారికి ఇవి ఇబ్బందికరమైన రోజులని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. ఢిల్లీలో వాయు కాలుష్యానికి 30 వేల మంది చనిపోయే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ సరి, బేసి విధానం!పరిస్థితిని గాడిలో పెట్టేందుకు సీఎం కేజ్రీవాల్ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరో 48 గంటలపాటు వాయుకాలుష్యం ఇలాగే తీవ్రంగా ఉంటే... ఢిల్లీలో సరి, బేసి విధానం మళ్లీ తీసుకురావడానికి ఢిల్లీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించడంతోపాటు కాలుష్యం నియంత్రణలోకి వచ్చేవరకు మెట్రో, బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించాని సుప్రీంకోర్టు నియమించిన పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ ప్రభుత్వానికి సూచించింది. ఈ సిఫారసులపై ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనీల్ బైజల్ గురువారం నిర్ణయం తీసుకోనున్నారు. పిల్లలూ..ఇంట్లో నుంచి బయటకు రాకండి!వాయుకాలుష్యం నియంత్రణపై ఏం చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని పంజాబ్, హరియాణ, రాజస్థాన్, ఢిల్లీ, యూపీ పొల్యూషన్ బోర్డులతో పాటు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డును జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశించింది. ‘‘వాయునాణ్యత తీవ్రంగా ఉంది. పిల్లలు గాలి పీల్చడానికి ఇబ్బంది పడుతున్నారు. మా ఉత్తర్వుల ప్రకారం హెలికాప్టర్లతో నీటినిందుకు స్ర్పే చేయలేదు?2 రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకొని శుక్రవారం మాకు చెప్పండి’’ అని ఎన్జీటీ ధర్మాసనం వ్యాఖ్యానించింది. వాయు కాలుష్యం వల్ల పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం విషమించే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం ఆదివారం వరకూ స్కూళ్లకు సెలవు ప్రకటించింది. పిల్లలు బయటకు రాకుండా పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కోరారు. రహదారులపై వాహనాల ఢీరహదారులపై వెళ్లేవారికి ఎదురుగా ఏం ఉందో కనిపించడం లేదు. ‘జీరో’ విజుబులిటీ ఉంది. ఫలితంగా యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 20 మంది వరకూ గాయపడ్డారు. దారి కనిపించకపోవడంతో ఆగ్రా వెళ్తోన్న ఒక స్కార్పియో నిర్మాణ పనుల కోసం వేసిన కాంక్రీ ట్ గుట్ట ఎక్కి బోల్తాపడింది. వెనుక వస్తున్న బస్సు అదే స్కార్పియోను బలంగా ఢీకొట్టింది. ఆ వెనువెంటనే మరో పది వాహనాలు బోల్తాపడ్డాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. | nation |
12,927 | 14-09-2017 18:09:56 | చైనాకు షాకిచ్చిన ట్రంప్ |
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా గట్టి నిర్ణయం తీసుకున్నారు. చైనా ప్రభుత్వంతో అనుబంధం ఉన్న కంపెనీకి అమెరికాకు చెందిన సెమీకండక్టర్ కంపెనీ అమ్మకాన్ని ట్రంప్ అడ్డుకున్నారు. జాతీయ భద్రతకు విఘాతం కలుగుతుందని చెప్తూ ఈ కంపెనీ విక్రయాన్ని నిరోధించారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ మాట్లాడుతూ లాటిస్ సెమీకండక్టర్ కార్పొరేషన్ (లాటిస్)ను చైనా వెంచర్ క్యాపిటల్ ఫండ్ కార్పొరేషన్ లిమిటెడ్ (సీవీసీఎఫ్), తదితర సంస్థలు స్వాధీనం చేసుకోవడాన్ని నిషేధిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సీవీసీఎఫ్ చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలకు చెందినది. ఈ సంస్థ పారిశ్రామిక పెట్టుబడులు, వెంచర్ క్యాపిటల్ వ్యవహారాలను నిర్వహిస్తూ ఉంటుంది. విదేశీ పెట్టుబడులపై కమిటీ సిఫారసుల మేరకు డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ ప్రకారం ట్రంప్ ఈ చర్య తీసుకున్నట్లు శాండర్స్ తెలిపారు. అమెరికన్ బిజినెస్‌ను విదేశీ నియంత్రణలోకి తీసుకెళ్ళడానికి అవకాశం కల్పించే క్రయవిక్రయాలను నిలిపివేసేందుకు, నిషేధించేందుకు ఈ చట్టం ప్రకారం దేశాధ్యక్షుడికి అధికారం ఉందన్నారు. అమెరికా కంపెనీపై నియంత్రణ సాధించే విదేశీ కంపెనీ వల్ల అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సాక్ష్యాధారాలు కనిపించినపుడు దేశాధ్యక్షుడు ఈ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారన్నారు. ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ మ్నుచిన్ స్వాగతించారు. అమెరికాలో విదేశీ పెట్టుబడుల కమిటీ చైర్మన్‌గా కూడా స్టీవెన్ వ్యవహరిస్తున్నారు. అమెరికాలోని అరెగాన్ కేంద్రంగా లాటిస్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ కంపెనీ సెమీకండక్టర్లను తయారు చేస్తుంది. కన్స్యూమర్, కమ్యూనికేషన్స్, ఇండస్ట్రియల్ మార్కెట్లలో ఈ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. | nation |
10,573 | 03-05-2017 00:23:52 | స్టార్ హీరోలు ఇమేజ్ సంకెళ్లు విడిపోతున్నాయ్! |
హీరోలంటే ఆరడుగుల అందగాళ్లు. ఎదురుగా ఒకరికి వంద మంది ఉన్నా ఒకే ఒక్క పిడిగుద్దుతో చంపేయగల ధీరులు.. అమ్మాయిల కలల రాకుమారులు.. కాసిన్ని నవ్వులు పండించి, తనవారికి ధైర్యాన్ని పంచగల సమర్థులు... ఇదంతా నిన్నటి మాట. ఇప్పుడు తెలుగు చిత్ర సీమ మారుతోంది. హీరోయిజానికి నిర్వచనాన్ని తిరగరాస్తోంది. హీరో ఆరడుగులు ఉండక్కర్లేదు. అంగపుష్టి అవసరం లేదు. పుష్టి స్థానంలో కాసింత వైకల్యం ఉన్నా డోంట్ కేర్. వైకల్యం శరీరానికే కానీ, బుద్ధికి కాదుగా... అనుకునే పాజిటివ్ దృక్పథం. సంకల్పం గొప్పదైతే ఐరావతమైనా మనముందు మోకాళ్ల ముందు కూర్చోవాల్సిందేననే తెగువ. వెరసి హీరోల పాత్రల డిజైన్‌ను రీడిజైన్ చేస్తున్నాయి. కొత్త ఉత్సాహంతో ఉర్రూతలూగిస్తున్నాయి. పెద్దా, చిన్నా తేడా లేకుండా రీల్ హీరోలందరూ ‘రియల్’ హీరోయిజాన్ని పంచే స్టోరీలను భుజాలకు ఎత్తుకుంటున్నారు.. అలాంటి ఇమేజ్ చట్రాన్ని దాటిన కొందరు హీరోలు చేస్తున్న కొత్త ప్రయత్నాలు... ‘జై లవ కుశ’లో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించనున్నారు. కె.ఎ్‌స.రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ పాత్రలో అంధుడిగా కనిపిస్తారని గాసిప్ వచ్చింది. ‘‘ఎన్టీఆర్‌గారు అంధుడిగా నటించడం లేదు. కాకపోతే ఆయన చేసే మూడు పాత్రల్లో ఓ పాత్రకు నత్తి ఉంటుంది. ఆ పాత్ర చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఎన్టీఆర్‌గారు డైలాగులు చెప్పే విధానాన్ని అభిమానించే వారు కోకొల్లలు. వారికి ఈ పాత్ర చాలా బాగా నచ్చుతుంది. ప్రేక్షకులు తప్పకుండా థ్రిల్ ఫీలవుతారు’’ అని సన్నిహిత వర్గాల సమాచారం. ఆ ముగ్గురు...సర్వేంద్రియాణాం నయనమ్ ప్రధానం అని అంటారు. కానీ పుట్టుకతో చూపును కోల్పోయినా పట్టుదలతో అనుకున్నది సాధించినవారు కోకొల్లలు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని రవితేజ ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో అంధుడిగా నటిస్తున్నారు. వైవిధ్యమైన వాచికంతో, నవ్వులతో హుషారుగా, చలాకీగా కనిపించిన రవితేజ తాజా చిత్రంలో ఎలా కనిపించనున్నారన్నది అందరికీ ఆసక్తి కలిగించే అంశం. ‘‘మన చుట్టూ చాలా మంది విజేతల కథలున్నాయి. అంధుల జట్టు క్రికెట్‌లో గెలిచిన మ్యాచ్‌లను చూసి మనమంతా గర్వపడాలి. వారి విజయాలను తలచుకున్నప్పుడు ఉత్తేజంగా అనిపిస్తుంటుంది. ‘రాజా ది గ్రేట్’ లో నటించడం చాలా హ్యాపీగా ఉంది’’ అని రవితేజ అన్నారు. ఈ చిత్రం ఇటీవల డార్జిలింగ్‌లో ఓ షెడ్యూల్ షూటింగ్ జరుపుకొంది. గోదారి తీరాన..‘ధ్రువ’ సక్సె్‌సతో జోరు మీదున్నారు రామ్‌చరణ్. ఆయన తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లుంగీ పైకి కట్టి, గళ్ల చొక్కాతో, కావడి కుండలతో నీళ్లు మోసుకుంటూ వెళ్తున్న రామ్‌చరణ్ ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వస్తోంది. ‘నెం.1 నేనొక్కడినే’లో మహేశ్‌ను గతం గుర్తుండని వ్యక్తిగా చూపించిన సుకుమార్ తాజాగా రామ్‌చరణ్ పాత్రను చూపులేని వ్యక్తిగా తీర్చిదిద్దినట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల గోదావరి జిల్లాల్లో జరిగింది. ఈ నెల్లోనే తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. నిఖిల్‌కి కొత్త కాదు!‘రెగ్యులర్ రొటీన్ చిత్రాలను చేయడానికి చాలా మంది హీరోలున్నారు. నేను వైవిధ్యమైన సినిమాలతో ముందుకు సాగితేనే ప్రేక్షకులు ఆహ్వానిస్తారు. ఆ కాన్సె్‌ప్టను మనసులో ఉంచుకునే స్ర్కిప్ట్‌లను ఎంచుకుంటున్నాను’ అని అన్నారు నిఖిల్. ఇంతకు ముందు సూర్యరశ్మిలోకి వెళితే ఒంటికి పడని వ్యక్తిగా ‘సూర్య వర్సస్ సూర్య’లో నటించారు. తాజాగా ‘కేశవ’లో అరుదైన హృదయ వ్యాధి ఉన్న వ్యక్తిగా నటిస్తున్నారు. సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. గతంలోనూ..ఇప్పుడంటే సెట్స్‌మీద ఒకేసారి నలుగురైదుగురి చిత్రాలు ఉన్నాయి కానీ, గతంలోనూ ఇలాంటి సినిమాలు రాకపోలేదు. గతేడాది వేసవికి ‘ఊపిరి’ విడుదలైనప్పుడు ప్రముఖ హీరో నాగార్జున ఆనందానికి అవధుల్లేవు. ‘‘చేతులు, కాళ్లూ కదలకుండా కేవలం కుర్చీకి అతుక్కుపోయిన వ్యక్తి పాత్రను వంశీ పైడిపల్లి చెప్పినప్పుడు నాకు సవాలుగా అనిపించింది. తప్పకుండా చేయాలనే ఆసక్తి కలిగింది. ఆ పాత్రను అంతే గొప్పగా ప్రేక్షకులు ఆదరించడం డబుల్ హ్యాపీ’’ అని అప్పట్లో ఆయన తెలిపారు. ఏది ఏమైనా స్టార్ ఇమేజ్‌ను పక్కనపెట్టి ఈ తరహా కథల్లో కనిపించడానికి హీరోలు ముందుకు రావడం అభినందనీయం. విశాల దృక్పథంతో హీరోలు ఈ తరహా స్ర్కిప్ట్‌లను అంగీకరించడం వల్ల కొత్త కథలు తెరపైకి రావడానికి అవకాశాలు గణనీయంగా ఉంటాయన్నది వాస్తవం. టైటిల్ చెబుతోంది!దర్శకత్వం మీద అభిలాషతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి అనూహ్యంగా హిట్‌లను సొంతం చేసుకున్న యువ కథానాయకుడు రాజ్‌తరుణ్. ‘ప్రయోగాలు చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను. కొత్తదనాన్ని కోరుకున్నప్పుడు తప్పకుండా ప్రయోగాలు చేయాల్సిందేనన్నది నా పాలసీ’’ అని చెప్పారు రాజ్‌తరుణ్. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘అంధగాడు’లో ఆయన అంధుడి పాత్రలో నటించారు. ఇటీవల టీజర్ విడుదలైంది. మే 26న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. | entertainment |
14,584 | 09-05-2017 17:22:05 | సీఎం కేజ్రీవాల్‌పై.. సీబీఐకి కపిల్ మిశ్రా ఫిర్యాదు | న్యూఢిల్లీ: ఆప్ మంత్రివర్గంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఉద్వాసనకు గురైన కపిల్ మిశ్రా మంగళవారం సీఎం కేజ్రీవాల్‌పై సీబీఐకి ఫిర్యాదు చేశారు. అలాగే ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌తో పాటు ఆప్ నేతలపైనా విడివిడిగా మరో రెండు ఫిర్యాదులు చేశారు. సీఎం కేజ్రీవాల్‌కు మంత్రి సత్యేంద్ర జైన్ రూ.2 కోట్ల లంచం ఇచ్చినట్లు ఆయన చేసిన ఆరోపణతో పాటు కేజ్రీవాల్ బావకు చెందిన రూ.50 కోట్ల భూ వ్యవహారం, విదేశీ టూర్ల పేరుతో పార్టీ నిధులను దుర్వినియోగం చేసిన ఆప్ నేతలపై సీబీఐకి ఫిర్యాదు చేశారు. పార్టీ నిధులు దుర్వినియోగం చేసిన ఆప్ నేతల పేర్లను బయటపెట్టకపోతే బుధవారం నుంచి నిరాహార దీక్ష చేస్తానని కపిల్ మిశ్రా హెచ్చరించారు. అలాగే కేజ్రీవాల్‌కు దమ్ముంటే ఎక్కడ నుంచైనా సరే తనపై పోటీ చేసి గెలవాలని ఆయన సవాల్ చేశారు. | nation |
15,302 | 11-11-2017 00:56:59 | పోలీస్ స్టేషన్లలో వేధింపులు.. టెస్టుల పేరుతో అవమానాలు | నిర్భయ చట్టం వచ్చినా మారని మైండ్‌సెట్..కేసు సెటిల్ చేసుకోమంటున్నపోలీసులు..ఆందోళనకల్గిస్తున్న హెచ్‌ఆర్‌డబ్ల్యూ రిపోర్టున్యూఢిల్లీ, నవంబరు 10: దేశ రాజధానిలో నిర్భయకాండ జరిగి ఐదేళ్లు కావస్తోంది. కానీ మన సమాజం మారిందా? పోలీసుల తీరులో మార్పు వచ్చిందా? బాధితులకు న్యాయం జరుగుతోందా? మైండ్‌సెట్ ఇంకా మారలేదంటోంది హ్యూమన్ రైట్స్ వాచ్ (హెచ్‌ఆర్‌డబ్ల్యూ) నివేదిక! విచారణలు, పరీక్షల పేరుతో బాధిత మహిళలకు అవమానాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. నిర్భయకాండ తర్వాత మహిళలపై లైంగిక వేధింపులు, దాడులను అరికట్టడానికి చట్టాలను కఠినతరం చేసి, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేసినా.. సంస్కరణలు కాగితాలకే పరిమితమయ్యాయని అభిప్రాయపడింది. బాధితులను కుంగదీస్తున్న టెస్టులుచాలా అత్యాచార కేసుల్లో ఐదేళ్లకుగాని పురోగతి కనిపించడం లేదని తెలిపింది. అత్యాచార బాధితులను వైద్య పరీక్షలకు పంపిన సందర్భాల్లో ఇప్పటికీ శాస్త్రీయ పద్ధతులు అనుసరించకుండా వేధింపులకు గురిచేస్తున్నారని హెచ్‌ఆర్‌ఎం రిపోర్టు వెల్లడించింది. కర్ణాటకలో 25శాతం కేసుల్లో బాధితులను మరింత కుంగదీసే విధంగానే వైద్య పరీక్షలు జరుగుతున్నాయని పేర్కొంది. అత్యాచార బాధితులకు అందించాల్సిన వైద్య సాయంపై 2014లో జారీచేసిన మార్గదర్శకాలను 9రాష్ట్రాలే అమలు చేస్తున్నాయని వివరించింది. మహిళల భద్రత కోసం రూ.3100కోట్లతో ఏర్పాటుచేసిన నిర్భయనిధి నుంచి తొలి మూడేళ్లు ఖర్చు చేయలేదని తెలిపింది. కేసు సెటిల్ చేసుకోవాలని పోలీసుల ఒత్తిడి: అత్యాచారానికి గురైన మహిళలు పోలీస్ స్టేషన్లలో ఇంకా వేధింపులు ఎదుర్కొంటున్నారనీ, వారు పేదలు, దళితులు అయితే పోలీసులు కనీసం కేసు కూడా రిజిష్టర్ చేయడం లేదని హెచ్‌ఆర్‌ఎం నివేదిక చెబుతోంది. డబ్బు తీసుకుని కేసు సెటిల్ చేసుకోవాలని బాధితురాలిపై పోలీసులు ఒత్తిడి తెస్తున్న వాస్తవం తమ పరిశోధనలో తేలిందని పేర్కొంది. మహిళల్లో పెరిగిన చైతన్యం 2012లో నిర్భయకాండ తర్వాత భారతీయ పౌర సమాజంలో మార్పు వచ్చిందని హ్యూమన్ రైట్ వాచ్ నివేదిక తెలిపింది. మహిళలు వీధుల్లోకి వచ్చి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారనీ, అరాచకాలను ప్రతిఘటిస్తున్నారని పేర్కొంది. బెంగళూరులో కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో మహిళలపై జరిగిన లైంగిక దాడులకు వ్యతిరేకంగా ‘ఐ విల్ గో ఔట్’ అంటూ జరిగిన మహిళా ప్రదర్శనలను, ఇటీవల ‘మీ టూ’ అంటూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భారతీయ మహిళలు భాగమయ్యారని ఉదహరించింది. | nation |
14,770 | 08-09-2017 09:44:41 | మాది కూడా కశ్మీర్ సమస్య లాంటిదే...! | న్యూఢిల్లీ: మయన్మార్‌ను కుదిపేస్తున్న రోహింగ్యా ముస్లింల సమస్యను కశ్మీర్ ముస్లింల సమస్యతో పోల్చుతూ మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ ఆంగ్ సాన్ సూకీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణ పౌరులు, తీవ్రవాదులకు మధ్య తేడాను స్పష్టంగా గమనించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అమాయకులైన ముస్లింలు, తీవ్రవాదుల మధ్య వ్యత్యాసం కారణంగా కశ్మీర్ కూడా తమలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నదని సూకీ వ్యాఖ్యానించారు. అణిచివేతకు గురవుతున్న రోహింగ్యాలను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ ఆమెపై వస్తున్న ఆరోపణలను సూకీ తీవ్రంగా ఖండించారు. తమ సామర్థ్యం మేర అమాయకులైన పౌరుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కృషిచేస్తున్నామన్నారు. | nation |
17,545 | 16-11-2017 01:30:11 | గాంధీ హత్యకేసు దర్యాప్తు మళ్లీ జరపాలి | సుప్రీంలో పిటిషన్‌న్యూఢిల్లీ, నవంబరు 15: మహాత్మాగాంధీ హత్య జరిగి(1948, జనవరి 30) 69 ఏళ్ళు గడిచాయి. ఆయనను హిందూ మహాసభ కార్యకర్తలైన నాథూరామ్ గాడ్సే, నారాయణ్ ఆప్టేలే హత్య చేశారని తేల్చి 1949 నవంబరు 15న ఉరితీశారు. అయితే ఇప్పటికీ ఆయన మరణంలో తేలని అంశాలు చాలా ఉండిపోయాయని డాక్టర్ పంకజ్ ఫడ్నిస్ నమ్ముతున్నారు. ఆయన పెద్ద డాక్టరే కాకుండా పరిశోధకుడు, వీర్ సావర్కర్ స్ఫూర్తి తో నెలకొల్పిన అభినవ్ భారత్ అనే సంస్థకు ట్రస్టీ కూడా! నిజానిజాలు తేల్చడం కోసం సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు. నారాయణ్ ఆప్టే పాత్ర ఇప్పటికీ మిస్టరీయేనని, ఆయన ఎక్కడ పనిచేశారో ఇప్పటికీ తేల్చలేదని ఫడ్సీస్ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘‘నాథూరామ్ గాడ్సే ఆ సాయంత్రం అతి సమీపం నుంచి గాంధీపై కాల్పులు జరిపానని, 3 బులెట్లు ఆయన శరీరంలో దిగబడ్డాయని విచారణలో చెప్పా డు. కానీ మరోబులెట్ ఉన్నట్లు కూడా వార్తలొచ్చాయి. మరో హంతకుడు కూడా ఈ దుశ్చర్యలో పాల్గొన్నాడా? విదేశీ హస్తం ఉందన్న వాదనలో నిజమెంత? దీన్ని సమగ్రంగా పరిశోధించాలి. నారాయణ్ ఆప్టే వైమానిక దళంలో పనిచేసేవారని విచారణ సమయంలో చెప్పారు. కానీ అది నిజం కాదని - కిందటేడాదే అప్పటి రక్షణమంత్రి మనోహర్ పారికర్ నాకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.’’ అని ఫడ్నిస్ తన పిటిషన్‌లో వివరించారు. ‘‘మనోహర్ పారికర్ లేఖను బట్టి నారాయణ్ ఆప్టే ఖచ్చితంగా బ్రిటిష్ వైమానిక దళం 136 స్క్వాడ్రన్‌లో పనిచేసినట్లు మనం విశ్వసించవచ్చు.. పూర్తి పరిశోధన తరువాతే ఇది ధ్రువపడుతుంది’’ అని ఫడ్నిస్ పేర్కొన్నారు. | nation |
10,696 | 08-11-2017 19:05:51 | ఎన్టీఆర్ బయోపిక్ కోసం బాలకృష్ణ ఆఫీస్.. | ఎన్టీఆర్ బయోపిక్ కోసం నిర్మాతగానూ మారుతోన్న బాలకృష్ణ ఇప్పుడు ఈ సినిమాకోసం పక్కా వాస్తుతో ఆఫీస్‌ను సిద్ధం చేస్తున్నాడట. మరోవైపు తాజాగా ఎస్వీకృష్ణారెడ్డితో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నటసింహ. ఎన్టీఆర్ బయోపిక్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు నందమూరి నటసింహ బాలకృష్ణ. ఈ సినిమాకోసం మొదటిసారి నిర్మాతగా మారుతూ 'బ్రహ్మతేజ ప్రొడక్షన్స్' పేరుతో సొంత నిర్మాణ సంస్థను కూడా స్థాపించాడు. ఇక తాజాగా నటరత్న జీవితచరిత్రతో తెరకెక్కే సినిమాకోసం ఆఫీసును స్థాపించబోతున్నాడట. పక్కా వాస్తుతో ఈ కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నాడట బాలయ్య. ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో 'జై సింహా' చిత్రంలో నటిస్తోన్న బాలకృష్ణ మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్రానికి ప్యాకప్ చెప్పేయబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనులను దగ్గరుండి పరిశీలించి తన తండ్రి జీవిత చరిత్రను పకడ్బంధీగా వెండితెరకు ఎక్కించాలనుకుంటున్నాడు నటసింహ. అయితే తాజాగా 'జై సింహా'కి ఎన్టీఆర్ బయోపిక్‌కు మధ్య గ్యాప్‌లో మరో సినిమాను పూర్తిచేస్తే బాగుంటుందని భావిస్తున్నాడట బాలయ్య. ఇటీవలే సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో ఆ చిత్రాన్ని తన 103వ సినిమాగా చేయాలనుకుంటున్నాడట. మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్‌కు దర్శకత్వం వహించే తేజ కూడా ఆ లోపులో వెంకటేశ్ సినిమాను కంప్లీట్ చేస్తాడట. మొత్తంమీద నందమూరి నటసింహ బాలకృష్ణ అస్సలు గ్యాప్ అనేదే లేకుండా వరుస సినిమాలతో హల్‌చల్ చేయబోతున్నాడన్నమాట. | entertainment |
13,114 | 11-02-2017 16:48:59 | డిపాజిట్ల వివరాలపై ఆర్బీఐ ప్రకటన | న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు చేసిన డిపాజిట్లను త్వరలోనే వెల్లడిస్తామని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రకటించింది. ముందుగా అన్ని విధాలుగా సరి చూసుకుని, అత్యంత జాగ్రత్తలు పాటిస్తూ ఈ వివరాలను ప్రకటిస్తామని తెలిపింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అనంతరం ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మాట్లాడుతూ పెద్ద నోట్ల తర్వాత తిరిగి వచ్చిన కరెన్సీ నోట్లపై తాము వెల్లడించవలసిన వివరాలు సరిచూసుకొని చెప్పవలసి ఉంటుందని, సంక్లిష్లమైన అకౌంటింగ్‌కు అనుగుణంగా ఉండాలని అన్నారు. వేలాది బ్యాంకు శాఖలు, 4000కు పైగా కరెన్సీ ఛెస్ట్‌లు ఉన్నాయని తెలిపారు. తాము బయటపెట్టే సమాచారం కేవలం అంచనా కాకూడదని చెప్పారు. భౌతికంగానూ, అకౌంటింగ్ దృష్ట్యానూ సరి చూసుకొని చెప్పవలసి ఉంటుందని వివరించారు. గతంలో ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం 2016 డిసెంబరు 10 నాటికి రూ.12.44 లక్షల కోట్ల విలువైన పాత రూ.500, రూ.1,000 నోట్లు ప్రజల నుంచి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. 2016 నవంబరు 8 నాటికి చలామణిలో ఉన్న రూ.500 నోట్లు 1,71,650 కాగా, రూ.1,000 నోట్లు 68,580. అంటే పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికి రూ.15.44 లక్షల కోట్లు చలామణిలో ఉంది. | nation |
16,772 | 21-05-2017 03:21:45 | బస్సుపై తెగిపడ్డ విద్యుత్తు తీగ | నలుగురు ఆహుతి, కొన ఊపిరితో 20మందిలఖ్‌నవ్, మే 20: ఆ బస్సు ప్రయాణికులతో గమ్యస్థానానికి వెళుతోంది. అంతలో ఒక్కసారిగా 11వేల వోల్టుల విద్యుత్తు తీగ తెగి దానిపై పడింది. అలా పడిందో లేదో హైటెన్షన్ వైరు ధాటికి మంటలు గుప్పుమన్నాయి. డ్రైవర్ నియంత్రణ కోల్పోవటంతో బస్సు విద్యుత్తు స్తంభానికి ఢీకొని పల్టీలు కొడుతూ క్షణాల్లో పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్న వాళ్లలో నలుగురు ఆర్తనాదాలు చేస్తూ మంటల్లోనే కాలి బూడిదయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాలో జస్పుర-భాథా రహదారిపై జరిగిన ఈ ఘటనలో మరో 20 మంది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. | nation |
21,574 | 18-10-2017 13:40:13 | యువరాజ్ సింగ్‌పై గృహ హింస కేసు! | న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై గృహ హింస చట్టం కింద కేసు నమోదైంది. ఆయన సోదరుడి భార్య, బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆకాంక్ష శర్మ.. యూవీ కుటుంబ సభ్యులపై కేసు పెట్టారు. కొంతకాలంగా భర్త జొరావర్‌కు ఆకాంక్ష దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఓ వివాదంపై యువరాజ్ తల్లి షబ్నం, సోదరుడు జొరావర్‌లపై ఫిర్యాదు చేయగా... వారికి మద్దతుగా ఉన్నందుకు యువీ పేరును కూడా కేసులో చేర్చారు. ఆకాంక్ష లాయర్ స్వాతి సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మరో బిడ్డను కనాలంటూ మా క్లయింట్‌పై యువీ తల్లి, ఆయన సోదరుడు ఒత్తిడి తెస్తున్నారు. యూవీ కూడా వారికి మద్దతు నిలబడ్డారు. ఇంట్లో అందరూ తన తల్లి చెప్పినట్టు వినాల్సిందేననీ.. ఆమె మాట వినని పక్షంలో ఇంట్లో స్థానం కూడా ఉండదని యువీ హెచ్చిరించారు. ప్రతి నిర్ణయానికి జొరావర్, ఆయన భార్య ఆకాంక్ష.. షబ్నం దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది...’’ అని వెల్లడించారు. ఈ కేసులో యువీ పేరును చేర్చడం వివరణ ఇస్తూ.. ‘‘భౌతికంగా హింసిస్తేనే గృహ హింస చట్టం అమలవుతుందని కాదు. మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టినా గృహ హింస కిందకే వస్తుంది...’’ అని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే జొరావర్, ఆకాంక్షలకు ఓ కుమారుడు ఉన్నాడు. ఆయన ఎవరివద్ద ఉండాలన్న దానిపైనా కేసు నడుస్తోంది. మరోవైపు తమ డబ్బులతో ఆకాంక్ష కొనుగోలు చేసిన నగలను కూడా వెనక్కి ఇప్పించాలంటూ షబ్నం ఫిర్యాదు చేసినట్టు లాయర్ స్వాతి చెబుతున్నారు. యువారాజ్ చిన్నప్పుడు ఎలా ఉండేవాడో తెలుసా? చాలా మందికి తెలియని సచిన్ అసలు పేరు | sports |
14,711 | 06-04-2017 02:16:22 | స్వార్థపరులు బెదిరిస్తున్నారు |
కిరణ్‌బేడీ చెన్నై, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): పుదుచ్చేరి నుంచి వెళ్లిపోవాలంటూ కొందరు స్వార్థపరులు తనను బెదిరిస్తున్నారని ఆ రాష్ట్ర లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలను పక్కన పెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కిరణ్‌బేడీని తొలగించాలని కోరుతూ మంగళవారం పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్, డీఎంకే, అన్నాడీఎంకే, సీపీఐ, సీపీఎం, డీపీఐల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్వారా నియమితులైన గవర్నర్ జోక్యం చేసుకోరాదని ఆ సమావేశం అభిప్రాపడింది. కానీ అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కిరణ్‌బేడీని తొలగించాలని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానంపై కిరణ్‌బేడీ తన అభిపాయ్రాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. | nation |
12,318 | 01-01-2017 16:48:14 | ఏటీఎం క్యూ వద్ద ఘర్షణ.. ఐదుగురికి తీవ్ర గాయాలు | ముజఫర్‌నగర్: ఏటీఎం క్యూ వద్ద జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో రెండు గ్రూపులు కొట్టుకోవడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. వెంటనే అక్కడకు వచ్చిన పోలీసులు రెండు గ్రూపులకు చెందిన వారిని చెదరగొట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ప్రాంతంలో పోలీస్ బలగాలను మోహరించారు. | nation |
6,375 | 27-01-2017 15:53:51 | వెంకీ.. ఏకంగా మూడు నెలలా? | సాధారణంగా చిన్న సినిమాలు రకరకాల కారణాలతో వాయిదా పడుతుండడం చూస్తుంటాం. కానీ, ఈ మధ్య స్టార్‌హీరోల సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి. అదీ నెలల పాటు వాయిదా పడుతున్నాయి. తమిళ స్టార్ హీరో సూర్య సినిమా ‘సింగం-3’ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ నెలలో విడుదల కావాల్సింది. చివరికి ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. | entertainment |
84 | 17-12-2017 00:50:33 | డిస్నీ - ఫాక్స్ డీల్ ఎవరికి ప్రయోజనం? | నేషనల్ జియోగ్రాఫిక్ లేదా డిస్కవరీ ఛానెల్స్‌లో చూపించినట్లుగా రెండు సింహాలు హోరాహోరీగా పోరాడి రాజీకొచ్చినట్లుగా ఉంది వాల్ట్ డిస్నీ- ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్‌ల మధ్య కుదిరిన ఒప్పందం. వాల్ట్ డిస్నీ, ఎబిసి న్యూస్, ఎబిసి ఎంటర్‌టైన్‌మెంట్, ఎ అండ్ ఇ నెట్‌వర్క్, డిస్నీలాండ్, మేకర్ స్టూడియో్‌సతో అమెరికా, యూర్‌పలలో వాల్ట్ డిస్నీ మీడియా రారాజుగా వెలుగుతోంది. 2016 వేల్యువేషన్ ప్రకారం.. కేవలం డిస్నీ బ్రాండ్ విలువే 36 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోని అత్యంత గొప్ప బ్రాండ్లపై ఇంట్రాబ్రాండ్ అనే సంస్థ విడుదల చేసిన సర్వే నివేదికలో డిస్నీ 13వ స్థానంలో నిలిచింది. వాల్ట్ డిస్నీ ఎంటర్‌ప్రైజ్ వేల్యూ దాదాపు 170 బిలియన్ డాలర్లు. అలాంటి డిస్నీ మీడియా నెట్‌వర్క్ భారత్‌లో మాత్రం ఈన్‌పిఎస్ , కార్టూన్ చానెళ్లకు మాత్రమే పరిమితమైంది. ఫాక్స్‌ను విలీనం చేసుకోనుండటంతో స్టార్ నెట్‌వర్క్ చానళ్లు, నేషనల్ జియోగ్రాఫిక్, ఫాక్స్ నెట్‌వర్క్ చానళ్లపైనా డిస్నీకి యాజమాన్య నియంత్రణ దక్కనుంది. అంతేకాదు కంటెంట్ నిర్మాణ సంస్థ ఎండోమాల్‌లో 35 శాతం, స్కై డిటిహెచ్‌లో 50 శాతం వాటా లభించనుంది. గతంలో డిస్నీ.. యుటీవీ చానెళ్లతోపాటు ఆ సంస్థ సినిమా నిర్మాణ వ్యాపారాన్ని సైతం కొనుగోలుచేసింది. గడిచిన మూడేళ్లలో యుటీవీ బ్యానర్‌పై డిస్నీ నిర్మించిన పలు సినిమాలు పెద్దగా ఆడకపోగా.. కొన్ని నష్టాలు పంచాయి. దాంతో డిస్నీ భారత్‌లో సినిమా నిర్మాణానికి స్వస్తి పలికింది. మరో పక్క 21 సెంచరీ ఫాక్స్ దేశీయ సినిమా నిర్మాణంలో బాగా పుంజుకొని అతిపెద్ద ఫిల్మ్ ప్రొడక్షన్ హౌజ్‌గా నిలిచింది. డిస్నీ మళ్లీ బాలీవుడ్‌లో పాగా వేయడానికి తాజాగా ఫాక్స్‌తో జరిగిన డీల్ దోహదపడనుంది. ఇక ఎఫ్‌ఎక్స్, ఫాక్స్ చానళ్లు ఆసియా మార్కెట్లో డిస్నీ ఎదుగుదలకు తోడ్పడనున్నాయి. టెక్నాలజీ కంటెంట్ కీలకంప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ, స్థానిక కంటెంట్ డిస్నీకి ప్రాణవాయువు లాంటివి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్‌కు గట్టి పోటీనిచ్చేందుకు వీలుగా డిస్నీ అమ్ముల పొదిలోకి హులుతోపాటు స్టార్ ఇండియా నిర్మించిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ‘హాట్‌స్టార్’ కూడా చేరనుంది. వీడియో ఆన్ డిమాండ్, స్ట్రీమింగ్ సేవలందించే సంస్థ హులులో ఈ రెండు మీడియా గ్రూపులు ఇప్పటికే చెరో 30 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టాయి. డిస్నీ-ఫాక్స్ విలీన సంస్థకు హులులో 60 శాతం వాటాతో నియంత్రణాధికారం లభించనుంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌తో అసంతృప్తితో ఉన్న డిస్నీ.. ఈ డీల్ తర్వాత తన కంటెంట్‌ను పూర్తిగా హులు ప్లాట్‌ఫాంకి బదిలీ చేసే అవకాశం లేకపోలేదు. అంతర్జాతీయ మీడియా దిగ్గజంగా పేరున్న రూపర్ట్ మర్దోక్ ఫాక్స్ మీడియా సామ్రాజ్యానికి యజమాని. తన తండ్రి మరణాంతరం 21 ఏట మర్దోక్.. వారసత్వంగా లభించిన అడిలాయిడ్ స్థానిక వార్తాపత్రిక ‘ది న్యూస్’ పగ్గాలు చేతపట్టారు. ఆ ఒక్క పేపర్‌తో మొదలుపెట్టి ఇంతింతై వటుడింతై అన్న చందాన ఎదిగారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, పలు రేడియో చానళ్లు, 300కు టెలివిజన్ చానళ్లు, స్టూడియోలు, సినిమా నిర్మాణ సంస్థ, డిటిహెచ్ కేబుల్ నెట్‌వర్క్‌లు ఇంకా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలతో మీడియా రంగాన్ని శాసిస్తున్నారు. 90వ దశకంలో ఆసియా కుబేరుడు, హాంకాంగ్‌కు చెందిన వ్యాపారవేత్త లీకా సింగ్ నుంచి స్టార్ టీవీ నెట్‌వర్క్‌ను కొనుగోలు చేయడం ద్వారా మర్దోక్ ఆసియా మీడియా మార్కెట్లోకి విస్తరించారు. ఈ విలీనం తర్వాత రూపర్ట్ మర్దోక్ తన వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, ఫాక్స్ న్యూస్, ఫాక్స్ స్పోర్ట్స్ ఛానెళ్ల నిర్వహణపైనే పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించనున్నారు. మరోపక్క మర్దోక్ కుటుంబం విలీన సంస్థలో అతిపెద్ద వాటాదారులవుతారు. ఇప్పటికే తన పెద్ద కొడుకు లాచలన్ మర్దోక్.. న్యూస్ కార్పొరేషన్ సహ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మరో కొడుకు జేమ్స్ మర్దోక్ రానున్నకాలంలో డిస్నీ-ఫాక్స్ విలీన సంస్థ పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుత సిఇఒ బాబ్ ఐగర్ 2021వరకు విలీన సంస్థకు సిఇఒగా కొనసాగుతారు. మర్దోక్ చతురత, దూరదృష్టి, మేధస్సుతో 50 ఏళ్లుగా మీడియా సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. పెద్ద కొడుకును న్యూస్ కార్పొరేషన్ వారసుడిగా, మరో కొడుకును డిస్నీ-ఫాక్స్ విలీన సంస్థ భవిష్యత్ సిఇఒగా పట్టం కట్టాలన్నది ఆయన ఆలోచన. ట్రంప్ సర్కారు దన్నువాల్ట్ డిస్నీ-ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్‌ల మధ్య ఒప్పందానికి అమెరికా యాంటీ ట్రస్ట్, జస్టిస్ డిపార్ట్‌మెంట్‌లు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం రంగంలోకి దిగి ఆఘమేఘాల మీద పని ప్రారంభించింది. ఈ ఒప్పందం పూర్తవడానికి కనీసం ఏడాదికాలమైనా పట్టవచ్చు. గత ఏడాది ఎటి అండ్ టి.. ప్రముఖ మీడియా సంస్థ టైమ్ వార్నర్‌ను 85 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. కానీ అమెరికా యాంటీ ట్రస్ట్ , రాజకీయవేత్తలు పరిశీలన పేరుతో ఈ ఒప్పందాన్ని ఆదిలోనే నిలిపివేశారు. 2009లో జనరల్ ఎలక్ట్రిక్ నుంచి ఎన్‌బిసి యూనివర్సల్‌ను 18.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు కాంకాస్ట్ ఒప్పందం కుదుర్చుకోగా.. ఎన్నో పరిశీలనలు, ఆడిట్లు జరిపి ఆనక పలు షరతులతో 2011లో ఆమోదం ఇచ్చారు. డిస్నీ అంటే లయన్ కింగ్ లాంటి సినిమాలు, కార్టూన్లుమిక్కీ మౌస్, పిక్సర్ వంటి కార్టూన్లు, థీమ్ పార్క్‌లు, మర్చండైజ్‌కు ప్రసిద్ధి. ఇక ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్ తన బ్యానర్‌పై టైటానిక్, అవతార్, ఎక్స్‌మెన్, ఫెంటాస్టిక్ ఫోర్ వంటి ఆల్‌టైం హిట్ సినిమాలను నిర్మించింది. వాల్ట్ డిస్నీ-ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్ మధ్య కుదిరిన డీల్ విలువ 5,200 కోట్ల డాలర్లు. అందులో 1,600 కోట్ల డాలర్లు స్టార్ ఇండియా వ్యాపారం కోసం చెల్లించనున్నట్లు అంచనా. షేర్ల మార్పిడి ద్వారా జరగనున్న ఈ ఒప్పందం ద్వారా రెండు గ్రూపులకు లాభదాయకమే. విలీనం తర్వాత ఏర్పడబోయే కంపెనీ ఏటా 2,000 కోట్ల డాలర్ల మేర ఆర్జించవచ్చని ఇరు వర్గాలు అంచనా వేస్తున్నాయి. విలీనం పూర్తయ్యాక ఫాక్స్ షేర్‌హోల్టర్లకు డిస్నీకి చెందిన 25 శాతం షేర్లు లభించనున్నాయి. డిస్నీ, ఫాక్స్ గ్రూపుల్లో కలిపి మొత్తం 80వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య కుదిరిన వ్యాపారాల విలీన ప్రక్రియ కారణంగా కనీసం 10 శాతం మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి రావచ్చు. ఫాక్స్ స్టూడియో 1998లో రూపొందించిన ది సింప్సన్ అనే ధారావాహిక కార్యక్రమంలోని ఒక ఎపిసోడ్‌లో ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్‌ను వాల్ట్ డిస్నీ కొనుగోలు చేసినట్లుగా చిత్రీకరించారు. మరో ఎపిసోడ్‌లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినట్లు కూడా ఊహాజనితంగా చూపించారు. ఈ రెండు ఎపిసోడ్‌లు ప్రసారమయ్యాక దాదాపు 20 ఏళ్ల తర్వాత ఫాక్స్‌ను డిస్నీ కొనుగోలు చేయడం, డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కావడం, అదీ ట్రంప్ హయాంలోనే ఈ డీల్ జరగడం గమనార్హం. -సునీల్ ధవళ, మాజీ వైస్ ప్రెసిడెంట్ (నేషనల్ జాగ్రఫిక్,ఫాక్స్ చానల్) | business |
19,171 | 16-07-2017 02:36:14 | నితీశ్ భేటీకి తేజస్వి డుమ్మా! | ఆర్జేడీ, జేడీయూ మధ్య మరింత పెరిగిన దూరంతేజస్వియాదవ్ రాజీనామా చేయబోరన్న ఆర్జేడీనితీశ్ తొలగించేదాకా నిరీక్షించాలని నిర్ణయంఆ తరువాత ఆర్జేడీ మంత్రులంతా రాజీనామా!కూటమి ప్రభుత్వానికి బయటినుంచి మద్దతుపట్నా/న్యూఢిల్లీ, జూలై 15: బిహార్ సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలు ఆర్జేడీ, జేడీయూ మధ్య దూరం మరింత పెరుగుతోంది. అవినీతి ఆరోపణల కారణంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వియాదవ్.. ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్న ఒత్తిడి పెరుగుతుండగా.. శనివారం ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ హాజరైన ఓ కార్యక్రమానికి తేజస్వియాదవ్ గైర్హాజరయ్యారు. విశ్వ యువ కౌశల్ దివస్ పేరిట జరిగిన ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా తేజస్వి హాజరుకావాల్సి ఉండడంతో ఆయన నేమ్‌ప్లేట్‌తోనూ టేబుల్‌ను ఏర్పాటు చేశారు. అయితే తేజస్వి గైర్హాజరుతో తొలుత నేమ్‌ప్లేట్‌ను నిర్వాహకులు మూసివేశారు. కానీ, కొద్దిసేపటి తరువాత దానిని తిరిగి ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. తేజస్వ్విని రాజీనామా చేయాలని కోరుతున్న నితీశ్‌ను ఇరుకున పెట్టేలా ఆర్జేడీ సరికొత్త వ్యూహం పన్నింది. తేజస్వి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయవద్దని, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ స్వయంగా ఆయనను పదవి నుంచి తొలగించే దాకా ఎదురుచూడాలని నిర్ణయించింది. ఒకవేళ తేజస్విని నితీశ్ తప్పిస్తే.. ఆ వెంటనే ఆర్జేడీకి చెందిన మిగిలిన 11 మంది మంత్రులూ మూకుమ్మడిగా రాజీనామా చేయాలనే నిర్ణయానికొచ్చింది. అయితే మహా కూటమి ప్రభుత్వానికి మాత్రం బయటి నుంచి మద్దతు కొనసాగించనున్నట్లు ఆ పార్గీ నేత ఒకరు వెల్లడించారు. ఈ మేరకు దాణా కుంభకోణం కేసులో సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు లాలూ బయలుదేరే ముందు పార్టీ సీనియర్ నేతల సమక్షంలో నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తేజస్వి రాజీనామా చేస్తే పార్టీ కేడర్ మనోస్థయిర్యం దెబ్బతింటుందని, తమ సరికొత్త వ్యూహంతో ఓటర్లలో సానుభూతి సంపాదించడంతోపాటు ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ కూటమి విచ్ఛిన్నం కాకుండా కూడా కాపాడుకోవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. తద్వారా 2019 లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమి ప్రయత్నాలకు ఆటంకం కలగకుండా చూడాలన్నది లక్ష్యమని వెల్లడించారు. మరోవైపు నితీశ్-లాలూ బంధం విడిపోకుండా చూసేందుకు ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. | nation |
6,459 | 18-09-2017 15:42:38 | ఫుల్ కామెడీ.. థ్రిల్లర్ మూవీ నెక్ట్స్ నువ్వే ట్రైలర్ రిలీజ్ | ఫుల్ కామెడీ.. థ్రిల్లర్ మూవీ నెక్ట్స్ నువ్వే ట్రైలర్ రిలీజ్ అయింది. ఆది హీరోగా బుల్లితెర ప్రభాకర్ దర్శకతంలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్రైలర్ అదిరిపోయే కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో కీ రోల్ బ్రహ్మాజీదిగా కనిపిస్తోంది. అమాయకత్వం.. ఏదంటే అది జరిగిపోయే క్యారెక్టర్‌లో బ్రహ్మాజీ ఒదిగిపోయారు. కమెడియన్ పృధ్వీ ఓ సీరియల్ యాక్టర్‌గా ఈ సినిమాలో కనిపించనున్నారు. వైభవి మెయిన్ హీరోయిన్‌గా యాంకర్ రష్మి సెకండ్ హీరోయిన్‌గా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ యాక్టర్స్ అంతా కలిసి ఓ హోటల్‌ను పెడతారు. దానికి వచ్చిన వారంతా అక్కడే మరణిస్తుంటారు. ఇదే కథాంశంగా సినిమా తెరకెక్కుతోంది. | entertainment |
16,206 | 23-10-2017 03:42:14 | ఏ దేశంలో ఏముంది? | సింగపూర్‌లో చూయింగ్ గమ్ పడేస్తే జరిమానా!చూయింగ్ గమ్ తింటూ పొరపాటున కిందపడేస్తే 1000 డాలర్ల జరిమానా.. గోడ అందంగా కనిపిస్తోంది కదా అని ఏదైనా రాస్తే జైలు శిక్ష! ఇవేవో ఆఫ్రికా ఖండంలో ఏదో మారుమూల దేశంలో వేసే శిక్షలు కావు. మనకు మూడున్నర గంటల దూరంలో ఉన్న సింగపూర్‌లో వేసే శిక్షలు. ఆ దేశం పేరు చెప్పగానే.. సాధారణంగా మనకు విశాలమైన రోడ్లు. పెద్ద పెద్ద భవంతులు కళ్ల ముందు మెదలుతాయి. కానీ ఇంత ఆధునిక దేశంలో సంస్కృతి, సంప్రదాయాలు బలంగా పాదుకొని ఉంటాయి. అక్కడికి వెళ్లినప్పుడు వాటిని పాటించకపోతే ఇబ్బందులు ఏర్పడతాయి. అలాంటి కొన్ని సంప్రదాయాలను చూద్దాం.. సింగపూర్‌లో చూయింగ్‌గమ్ తినడంపై నిషేధం ఉంది. దాన్ని ఇతర దేశాల నుంచి తీసుకురావటం కూడా చట్టవ్యతిరేకమే. ఎవరైనా చూయింగ్ గమ్‌ను తింటూ కానీ లేక బయట పడివేసినట్లు కానీ పోలీసులు గమనిస్తే వారికి 1000 డాలర్లు జరిమానా విధిస్తారు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సిఫారసుతో చూయింగ్ గమ్‌ను నమలవచ్చు. అయితే దానిని బయట పడవేయకూడదు.సింగపూర్‌లో ఎవరైనా టాయిలెట్‌కు వెళ్లి సరిగ్గా ఫ్లష్ చేయకపోతే వారికి 150 డాలర్ల జరిమానా విధిస్తారు.చేతిలో ఉన్న కాగితాలు ఉండలుగా చుట్టి పడేయటం.. చెత్త రోడ్ల మీద పోయటం మనకు సర్వసాధారణం. సింగపూర్‌లో అలా చేస్తే వెయ్యి డాలర్ల జరిమానా విధిస్తారు. ఇటీవల కాలంలో అలాంటి వారికి కమ్యూనిటీ సర్వీ్‌సను శిక్షగా విఽధిస్తున్నారు. అలాంటి వారు నాలుగు వారాల సామాజిక సేవ చేయాల్సి ఉంటుంది.సింగపూర్‌లో మెట్రో రైళ్లలో, బస్సుల్లో.. ఏమీ తినకూడదు. ఆ దేశంలో ఎంఆర్‌టీ (మాస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్) వ్యవస్థ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ నిషేధం అమలులో ఉంది. 2014లో స్విట్జర్లాండ్‌కు చెందిన ఒక మహిళ ఎంఆర్‌టీలో చాక్‌లెట్ తిందని 500 డాలర్ల జరిమానా విధించారు.మన దేశంలో చార్మినార్ లాంటి చారిత్రక కట్టడాలే పిచ్చిపిచ్చి రాతలతో అసహ్యంగా కనపడతాయి. పబ్లిక్ పార్కుల్లో బెంచీలు, చెట్ల కాండాల వంటివాటి సంగతి సరేసరి. కానీ.. సింగపూర్‌లో అలా చేస్తే బెత్తపు దెబ్బలతో సత్కారం చేస్తారు.- స్పెషల్ డెస్క్ | nation |
14,582 | 10-10-2017 13:26:31 | ఆరెస్సెస్ మహిళా విభాగంపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు |
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీ, ఆరెస్సెస్‌లపై విరుచుకుపడ్డారు. బీజేపీ, ఆరెస్సెస్ తమ ఆధ్వర్యంలోని సంస్థల్లో మహిళలపట్ల వివక్ష చూపుతున్నాయని దుయ్యబట్టారు. ఆరెస్సెస్ కార్యకర్తలు షార్ట్ ఖాకీ యూనిఫారం ధరిస్తూ ఉంటారని, ఈ షార్ట్స్‌ను ఆ సంస్థల్లోని మహిళలు ధరించడం ఎప్పుడైనా, ఎవరైనా చూశారా? అని ప్రశ్నించారు. గుజరాత్‌లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘‘బీజేపీ ప్రధాన సంస్థ ఆరెస్సెస్. దానిలో ఎందరు మహిళలు ఉన్నారు? షార్ట్స్ ధరించిన మహిళలున్న ఆరెస్సెస్ శాఖను ఎప్పుడైనా చూశారా? నేనైతే ఎవర్నీ అలా చూడలేదు’’ అని చెప్పారు. మహిళలు మౌనంగా ఉంటేనే అంతా బాగుంటుందని బీజేపీ, ఆరెస్సెస్ భావిస్తాయన్నారు. మహిళలు నోరు తెరిస్తే, వాళ్ళ నోరు మూయించేందుకు పరుగులు తీస్తారన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మహిళలకు సాధికారత కల్పించడంపై దృష్టి పెడుతుందని రాహుల్ అన్నారు. విద్య, ఆరోగ్య రంగాలపై కూడా దృష్టిపెడుతుందన్నారు. మీకేం కావాలో తెలుసుకోవడానికి మీతో నరేంద్ర మోదీ ఎప్పుడైనా మాట్లాడారా? అని అడిగారు. | nation |
6,383 | 08-09-2017 13:02:55 | ఫిట్‌నెస్‌తో అదరగొడుతున్న కరీనా | హీరోయిన్లు అంటే ఫిట్‌నెస్ తప్పనిసరి. అందునా స్టార్ హీరోయిన్ అయితే తప్పనిసరిగా మెయింటైన్ చెయ్యాలి. బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనా కపూర్‌కు ఇటీవల కుమారుడు జన్మించిన విషయం విదితమే. ఆ టైంలో కొంచెం ఫిట్‌నెస్ కోల్పోయిన కరీనా జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేసి మళ్లీ ఫిట్‌నెస్ సాధించారు. ఇటీవల ఈ ముద్దుగుమ్మ ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ కవర్ ఫోటో షూట‌్‌లో పాల్గొన్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరీనా గత ఏడాది కీ అండ్ కా.. ఉడ్తా పంజాబ్ మూవీల్లో నటించి మంచి హిట్ కొట్టారు. ప్రస్తుతం వీరే ది వెడ్డింగ్ మూవీలో నటిస్తున్నారు. | entertainment |
18,383 | 22-03-2017 02:29:00 | ఆ కేసు యాజమాన్య హక్కుకు సంబంధింది: ఒవైసీ | హైదరాబాద్: బాబ్రీ మసీదు కేసు అక్కడ యాజమాన్య హక్కుకు సంబంధించినదని మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అలహాబాద్ హైకోర్టు దీనిని భాగస్వామ్య కేసుగా పరిగణించి తప్పు చేసిందని, అందుకే సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారని ట్వీట్ చేశారు. బీజేపీ నేతలు ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి తదితరులపై కుట్ర అభియోగాలు మోపుతారో లేదోనని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. | nation |
7,988 | 06-06-2017 19:40:48 | నా సహనాన్ని పరీక్షించొద్దు.. హెచ్చరించిన ‘దేవసేన’ | చెన్నై: ‘దేవసేన’ అనుష్కకు కోపమొచ్చింది. తనలోని సహనం చచ్చిపోయిందని, ఇక ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. అనుష్క అంతలా హెచ్చరించడానికి కారణం గాసిప్పులే. బాహుబలి-2 తర్వాత అనుష్కపై మొదలైన గాసిప్పులు అన్నీ ఇన్నీ కావు. అనుష్క, ప్రభాస్ స్నేహం ప్రేమగా మారిందని, వారు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు షికారు చేశాయి. అనుష్కను కోడలిగా అంగీకరించేందుకు ప్రభాస్ ఇంట్లో అంగీకరించడం లేదని, దీంతో ప్రభాస్‌కు వేరే అమ్మాయిని చూస్తున్నారని ప్రచారం జరిగింది. దీంతో స్పందించిన అనుష్క.. తనకు ప్రభాస్‌కు మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని, మరేమీ లేదని తేల్చి చెప్పింది. అయినా గాసిప్పులకు బ్రేక్ పడకపోవడంతో ఈసారి కాస్తా కఠినంగా హెచ్చరించింది. తన గురించి ఉన్నవీలేనివి రాస్తే సహించేది లేదని పేర్కొంది. అవాస్తవాలు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించింది. మరి దేవసేన హెచ్చరికలకు ఇప్పటికైనా గాసిప్స్‌కు పుల్‌స్టాప్ పడుతుందో? లేదో? వేచి చూడాల్సిందే. | entertainment |
1,958 | 02-03-2017 00:16:25 | ఏది సత్యం... ఏదసత్యం |
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించి కేంద్ర గణాంకాల సంస్థ (సిఎ్‌సఒ) ప్రకటించిన గణాంకాలపై ఆర్థిక నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంకెలు వాస్తవ పరిస్థితులను ప్రతిఫలించడం లేదని వారంటున్నారు. స్వయంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బిఐ ఆర్థికవేత్తలు కూడా ఈ గణాంకాలను విశ్వసించడం లేదు. మూడో త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి రేటు 7 శాతం ఉన్నట్టు సిఎ్‌సఒ ప్రక టించిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఈ త్రైమాసికంలో వృద్ధి రేటు దెబ్బతింటుందని అంతా భావించారు. అంచనాలకు భిన్నంగా 7 శాతం వృద్ధి రేటు ఉందంటూ ప్రభుత్వం ప్రకటించడంతో ఆర్థికవేత్తలు అయోమయంలో పడ్డారు. ఈ అంకెల్లో వాస్తవికత కనిపించడంలేదని, పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని కప్పిపెట్టేవిధంగా ఉన్నాయని వారు అంటున్నారు. ఎస్‌బిఐతోపాటు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్‌లించ్, నొమురా కూడా ఒకే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. మూడో త్రైమాసికంలో వృద్ధి రేటు దూసుకుపోవడానికి ప్రధాన కారణం, గతేడాది మూడో త్రైమాసికంలో వృద్ధి రేటును దిగువముఖంగా సవరించడం.. కావచ్చని వారు చెబుతున్నారు. అదీకాకుండా చాలా కంపెనీలు, వాణిజ్య సంస్థలు తమ చేతుల్లో ఉన్న నగదు నిల్వలను అమ్మకాల రాబడిగా చూపించిఉంటాయని వారు అంటున్నారు. అన్నింటినీ మించి అధికారిక డేటా, అవ్యవస్థీకృతరంగంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని పట్టుకోలేకపోయిందని వారు చెబుతున్నారు. భారత వృద్ధి రేటు లెక్కలపై ‘‘వాస్తవాలా, కల్పితాలా’’ అన్న శీర్షికతో ఒక నివేదికను నొమురా వెలువరించింది. అధికారిక డేటా క్షేత్రస్థాయి వాస్తవపరిస్థితులను సరిగా అంచనావేయలేదనీ, వ్యవస్థీకృత రంగం నుంచి అందిన వివరాలను మాత్రమే ఆధారం చేసుకొని లెక్కలు వేశారని నొమురా పేర్కొంది. పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన తర్వాత రెండు నెలల్లో ఆర్థిక రంగంలో ఏ జరిగిందో, అధికారిక డేటా వెల్లడిస్తే బాగుండేదని ఎస్‌బిఐ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ వ్యాఖ్యానించారు. 2016 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం వృద్ధి రేటును అంచనావేసేప్పుడు అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చెప్పాల్సి ఉం టుంది. 2015 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం వృద్ధి లెక్కలను ప్రభుత్వం సవరించింది. సవరణలో భాగం గా వృద్ధి రేటును బాగా తగ్గించారు. ఈ తగ్గింపు వల్ల తాజా త్రైమాసికంలో వృద్ధి రేటు దూసుకుపోయినట్టుగా కనిపిస్తోందని ఘోష్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థికరంగంపై పడిన ప్రభావం డేటా లో ప్రతిఫలించడంలేదని ఆయన అన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల వినియోగం దెబ్బతిన్నదని, సర్వీసుల రంగంపైనా ప్రతికూల ప్రభావం పడిందని నొమురా పేర్కొంది. ఈ విషయం హై ఫ్రీక్వెన్సీ డేటాను చూస్తే తెలిసిపోతుందని నొమురా తెలిపింది. సిఎ్‌సఒ డేటాలోని వృద్ధి మెరుపులకు మూడు కారణాలను అంచనావేసింది. ఒకటి 2015 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో జిడిపి వృద్ధి రేటును 0.8 శాతం తగ్గించడం, అవ్యవస్థీకృత రంగంలోని ప్రతికూల ప్రభావాన్ని అధికారిక డేటా పట్టుకోలేకపోవడం ఆఖరుగా కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ దగ్గరున్న నగదు నిల్వలను అమ్మకాల రాబడిగా చూపించడం.. అని నొమురా పేర్కొంది. ప్రభుత్వం ప్రకటించిన వృద్ధి రేటును బట్టిచూస్తే, పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని బాగా తక్కువగా అంచనావేసినట్టు అనిపిస్తోందని కూడా వ్యాఖ్యానించింది. కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వృద్ధి రేటు అంచనాలకు ప్రాతిపదికగా ఉన్న డేటా కవరేజ్ అసమగ్రంగా ఉందని కోటక్ పేర్కొంది. నగదు ప్రధానమైన ఎస్‌ఎంఇ, అవ్యవస్థీకృత రంగాలు ఇంకా కోలుకోలేదని తెలిపింది. వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేసే 2016-17 సవరించిన అంచనాల్లోనే, నోట్ల రద్దు వల్ల ఆర్థిక రంగంలో అసలేం జరిగిందో బయటపడుతుందని కూడా కోటక్ పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు వల్ల అవినీతికి బ్రేక్ పడుతుందని, పన్నుల ఎగవేతలు తగ్గుముఖం పడతాయని అంతర్జాతీయ రేటింగ్ సంస్ధ మూడీస్ పేర్కొంది. భారత పరపతి రేటింగ్ పెంపునకు ఇది దోహదం చేస్తుందని కూడా మూడీస్ పేర్కొంది. నోట్ల రద్దు నిజానికి ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంచనావేసినప్పటికీ, ప్రతిబంధకాలను అధిగమించి భారత ఆర్థిక వ్యవస్థ ప్రోత్సాహకరమైన పనితీరు కనబర్చిందని మూడీస్ పేర్కొంది. రానున్న రోజుల్లో వినియోగం, ఇన్వెస్ట్‌మెంట్స్ పెరుగుతాయని అంచనావేసింది. అయితే కొందరు ఈ ప్రభావాన్ని భూతద్దంలో చూపిస్తూ ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశారని జైట్లీ ఆక్షేపించారు. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక రంగం కుప్పకూలుతుందని భయపెట్టారనీ, అయితే ఈ త్రైమాసికంలో వ్యవసాయ రంగం రికార్డు స్థాయిలో పురోగతి సాధించిందని మంత్రి వివరించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల నగదు లభ్యత ఒక్కసారిగా తగ్గిందనీ, ఆర్థిక రంగంలోకి కొత్త కరెన్సీని ప్రవేశపెట్టే ప్రక్రియమొదలైనప్పటికీ లిక్విడిటీ సమస్య ఆర్థిక రంగాన్ని వేధించిన మాట నిజమేనని ఆయన అన్నారు. దీనివల్లనే చాలామంది ఆర్థికరంగంపై నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉంటుందని భయపడ్డారని ఆయన చెప్పారు. అయితే తాజా గణాంకాల్లో మూడో త్రైమాసికంలో వృద్ధి రేటు 7 శాతం ఉన్నట్టుగా వెల్లడికావడంతో, భయాలన్నీ అర్ధరహితాలని తేలిపోయిందని ఆర్థికమంత్రి అన్నారు. తాను మొదటి నుంచి కూడా పన్నుల రాబడి అంకెల ఆధారంగా, ఆర్థిక వృద్ధికి ఢోకాలేదని చెబుతూనే ఉన్నానని జైట్లీ గుర్తుచేశారు. నోట్ల రుద్ద వల్ల, నగదు చలామణి ప్రధానంగా ఉండే రంగాలు, ముఖ్యంగా అవ్యవస్థీకృత రంగం కొంతమేర ప్రభావితమైందని ఆయన అన్నారు. నోట్ల రద్దు వల్ల అవ్యవస్థీకృత రం గం కూడా వ్యవస్థీకృత రంగంతో సమీకృతం కావడానికి మార్గం సుగమమైందని ఆయన చెప్పారు. ఆర్థిక రంగంలోని నగదు అంతా బ్యాంకుల్లోకి చేరినందున, ఇక వ్యయాలన్నీ ఒక వ్యవస్థద్వారా జరుగుతాయని ఆయన అన్నారు. మూడో త్రైమాసికంలో ఆర్థిక రంగంలో వృద్ధి రేటు 7 శాతం ఉందని, ఈ ఏడాది మొత్తంపై ఆర్థిక వృద్ధి 7.1 శాతం ఉండొచ్చని సిఎస్‌ఒ ప్రకటించింది. | business |
12,026 | 01-01-2017 02:57:34 | పార్టీలోకి తిరిగొచ్చినా మరోసారి అధికారం కల్ల: బీజేపీ | న్యూఢిల్లీ, డిసెంబరు 31: యూపీలో అఖిలేశ్ యాదవ్ తిరిగి అధికారంలోకి రావడం కల్ల అని బీజేపీ విమర్శించింది. అఖిలేశ్ సమాజ్‌వాదీ పార్టీలోకి తిరిగి వచ్చినా, మరోసారి అధికారంలోకి మాత్రం రాలేరని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత శర్మ వ్యాఖ్యానించారు. సమాజ్‌వాదీ పార్టీని ఇంటికి సాగనంపాలని యూపీ ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారన్నారు. | nation |
13,666 | 25-09-2017 01:36:01 | గూగుల్ మూన్ కాంటెస్ట్‌కు టీమ్‌ఇండస్ రెడీ | ప్రత్యేక గీతంతో నేడు కౌంట్‌డౌన్‌న్యూఢిల్లీ: గూగుల్ లూనార్ ఎక్స్‌ప్రైజ్ కాంటె్‌స్టలో భారత్ తరపున పాల్గొంటున్న ఏకైక జట్టు టీమ్‌ఇండస్.. సోమవారం ప్రత్యేక గీతంతో కౌంట్‌డౌన్ ప్రారంభించనుంది. ఆ పాటను మ్యూజిక్ డైరెక్టర్ రామ్‌సంపత్ కంపోజ్ చేశారు. సోనా మహాపత్ర, సనమ్ గీతాన్ని ఆలపించబోతున్నారు. గూగుల్ నిర్వహిస్తున్న లూనార్ ఎక్స్‌ప్రైజ్ పోటీలో చంద్రునిపైకి రోబోని పంపి, అక్కడి నుంచి భూమికి ఫొటోలు, వీడియోలు పంపించాల్సి ఉంటుంది. ఈ కాంటెస్ట్ ప్రైజ్‌మనీ విలువు దాదాపు రూ.195 కోట్లు. ఈ పోటీలో టీమ్‌ఇండ్‌స(భారత్), స్పేస్‌ఇల్(ఇజ్రాయెల్), మూన్‌ఎక్స్‌ప్రె్‌స(అమెరికా), సినెర్జీమూన్(ఇంటర్నేషనల్), హకుటో(జపాన్) జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. వచ్చే నెలలో రొబోటిక్ లాంచ్‌కు సంబంధించి పరీక్ష ఉంటుందని బెంగళూరుకు చెందిన టీమ్‌ఇండస్ ప్రతినిధులు చెప్పారు. దేశ్రపజలంతా ఈ ప్రాజెక్ట్‌లో భాగమై టీమ్‌ఇండస్ ను ప్రోత్సహించాలని కోరారు. | nation |
16,690 | 23-02-2017 01:31:53 | గుండె మంట మందులతో కిడ్నీకి దెబ్బ | వాషింగ్టన్, ఫిబ్రవరి 22: గుండె మంటకు వాడే ఔషధాలను దీర్ఘకాలం పాటు తీసుకుంటే మూత్రపిండాల (కిడ్నీ)పై తీవ్ర ప్రభావం పడుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో కిడ్నీ వైఫల్యం చెందే ప్రమాదం కూడా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ ట్రబుల్, అల్సర్ల వల్ల గుండె మంట వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి సందర్భాల్లో ‘ప్రోటాన్ పంప్ ఇన్‌హెబిటర్స్’ను వైద్యులు సూచిస్తారు. ప్రివేసిడ్, ప్రిలోసెక్, నెక్సియమ్, ప్రొటోనిక్స్ వంటి పేర్లతో ఈ ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ఈ మందులను వాడుతున్న 1.25 లక్షల మందిపై అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఈ మందుల వాడకం వల్ల ఎటువంటి కిడ్నీ వ్యాధుల లక్షణాలు లేనివారికి కూడా దీర్ఘకాలంలో ఆయా వ్యాధుల ముప్పు తీవ్రమైందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 10% మందికి కిడ్నీ వైఫల్యం చెందినట్లు చెప్పారు.వాషింగ్టన్, ఫిబ్రవరి 22: గుండె మంటకు వాడే ఔషధాలను దీర్ఘకాలం పాటు తీసుకుంటే మూత్రపిండాల (కిడ్నీ)పై తీవ్ర ప్రభావం పడుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో కిడ్నీ వైఫల్యం చెందే ప్రమాదం కూడా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ ట్రబుల్, అల్సర్ల వల్ల గుండె మంట వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి సందర్భాల్లో ‘ప్రోటాన్ పంప్ ఇన్‌హెబిటర్స్’ను వైద్యులు సూచిస్తారు. ప్రివేసిడ్, ప్రిలోసెక్, నెక్సియమ్, ప్రొటోనిక్స్ వంటి పేర్లతో ఈ ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ఈ మందులను వాడుతున్న 1.25 లక్షల మందిపై అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఈ మందుల వాడకం వల్ల ఎటువంటి కిడ్నీ వ్యాధుల లక్షణాలు లేనివారికి కూడా దీర్ఘకాలంలో ఆయా వ్యాధుల ముప్పు తీవ్రమైందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 10% మందికి కిడ్నీ వైఫల్యం చెందినట్లు చెప్పారు. | nation |
6,115 | 21-07-2017 07:27:21 | డ్రగ్స్ జాతీయ సమస్య | దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది: తాప్సీ..సంయమనం పాటించాలి: ప్రకాష్ రాజ్‌పూరిపై ఆరోపణలతో షాకయ్యా: వరుణ్‌తేజ్‌డ్రగ్స్ కేసు గురించి సినిమా పరిశ్రమ అభిప్రాయాలను వెల్లడిస్తోంది. పూరి జగన్నాథ్, శ్యామ్.కె.నాయుడు ‘సిట్’ ముందు హాజరయ్యాక పరిశ్రమలో కదలికలు మొదలయ్యాయి. కొందరు బాహాటంగానే మద్దతిస్తున్నారు. చార్మి ఏకంగా ‘వి సపోర్ట్ పూరి జగన్’ అని ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో కొందరు నటీనటులు స్పందించారు. డ్రగ్స్ కేవలం సినిమా పరిశ్రమనే కాక.. మొత్తం దేశాన్ని కుదిపేస్తున్న జాతీయ సమస్య అని హీరోయిన్ తాప్సీ చెప్పింది. డ్రగ్స్‌తో తాత్కాలిక ఆనందం పొందుతూ కొందరు జీవితాన్నే నాశనం చేసుకుంటున్నారని.. ఆ సమయానికి అది సంతోషం ఇచ్చినా, దీర్ఘకాలంలో చాలా సమస్యలు తీసుకొస్తుందని తెలిపింది. ఏ విషయంలోనైనా వాస్తవాలు బయటకు వచ్చేవరకు ప్రజలు, మీడియా సంయమనం పాటించాలని నటుడు ప్రకా్‌షరాజ్ ట్వీట్ చేశారు. కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, అప్పుడే ఒక అభిప్రాయానికి రాకూడదని హీరో వరుణ్‌తేజ్ అన్నాడు. తనకు తెలిసిన పూరి.. ఇతరుల ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటారని, అలాంటి వ్యక్తిపై డ్రగ్స్ ఆరోపణలు రావడం షాక్‌కు గురిచేసిందని చెప్పాడు. | entertainment |
11,019 | 01-09-2017 18:06:02 | అవినీతిలో భారత్ స్థానమేంటో తెలుసా? | న్యూఢిల్లీ: అవినీతి రహిత భారతం కోసం తపిస్తున్న ప్రధాని మోదీ కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. జర్మనీకి చెందిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ (టీఐ) అనే సంస్థ చేసిన సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఆ సర్వే ఫలితాలు ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ పత్రికలో ప్రచురితమయ్యాయి. ఆసియాలో అత్యంత అవినీతి జరుగుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని సర్వే తేల్చి చెప్పింది. ఈ విషయంలో వియత్నాం, థాయిలాండ్, పాకిస్థాన్, మయన్మార్‌లను భారత్ వెనక్కి నెట్టేసిందని వివరించింది. భారత్‌లో 69 శాతం అవినీతి ఉందని పేర్కొంది. దేశంలో ఎక్కువగా స్కూళ్లు, ఆస్పత్రులు, ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే కార్యాలయాలు, పోలీసు శాఖలో అవినీతి జరుగుతోందని సర్వే పేర్కొంది. అవినీతి నిరోధానికి ప్రధాని చేస్తున్న కృషిని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ కొనియాడింది. అవినీతిని మోదీ అంతమొందిస్తారని దేశ ప్రజలు ఎక్కువమంది నమ్ముతున్నారని పేర్కొంది. 16 దేశాల్లో 18 నెలలపాటు 20 వేల మందిని సర్వే చేయడం ద్వారా ఈ వివరాలు సేకరించినట్టు వివరించింది. కాగా, భారత్ 69 శాతం అవినీతితో అగ్రస్థానంలో ఉండగా 65 శాతంతో వియత్నాం ఆ తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది. ఇక పొరుగు దేశం పాకిస్థాన్‌లో అవినీతి కేవలం 40 శాతం మాత్రమే ఉందని సర్వేలో తేలింది. | nation |
10,490 | 25-07-2017 16:26:09 | మహిళా విలేకరిపై ప్రముఖ డైరెక్టర్ ఆగ్రహం | కంగనా రనౌత్ ఏ ముహూర్తాన వారసత్వం గురించి లేవనెత్తారో గానీ, బాలీవుడ్‌లో అది కాస్తా ఇప్పుడప్పుడే ముడివీడని వివాదంగా పరిణమించింది. ఈ వ్యవహారంపై ప్రశ్నించడంతో ఎప్పుడూ కూల్‌గా, కామ్‌గా ఉండే డైరెక్టర్ ఇంతియాజ్ అలీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారసత్వం తప్పా.. ఒప్పా..? అంటూ తరచి, తరచి అదే ప్రశ్న అడుగుతుండడంతో ఓ మహిళా విలేకరిపై అసహనం వ్యక్తం చేశారు. ‘‘సరే మీరు చెప్పేది నాకు అర్థమైంది. పదే..పదే వారసత్వం గురించి మాట్లాడుతున్నారు. వారసత్వం గురించి పక్కనపెడితే.. వారసత్వంగా వచ్చిన వాళ్లే నిలదొక్కుకుంటున్నారు అనేది మీ అభిప్రాయం అంతేనా? అయితే.. అలా జరిగితే అది తప్పా.. ఒప్పా అంటే మాత్రం తప్పే అవుతుంది’’ అంటూ మహిళా విలేకరి అడిగిన ప్రశ్నకు అసహనంగా సమాధానమిచ్చారు. అంతేకాదు.. తాము ముగ్గురు అన్నదమ్ములం ఇండస్ట్రీలో ఉన్నామని, వారసత్వంతోనే రాలేదని చెప్పారు. చివరగా తన వ్యాఖ్యలు బాధించి ఉంటే క్షమించాలని ఆ మహిళా విలేకరిని ఇంతియాజ్ అలీ కోరారు. షారూక్, అనుష్క శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన జబ్ హారీ మెట్ సెజాల్ ట్రైలర్ లాంచ్ విడుదల సందర్భంగా సోమవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన షారూక్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఈ తతంగం అంతా జరిగేటప్పుడు ఆయన కనీసం నోరు కూడా మెదపలేదు. | entertainment |
1,680 | 31-10-2017 00:13:26 | గంగవరం రేవులో దుబాయ్ కంపెనీ పాగా | రూ. 40 కోట్ల డాలర్లకు 31.5 శాతం వాటా కొనే అవకాశంపదేళ్లలోనే పది రెట్ల లాభానికి షేర్లను విక్రయించనున్న అమెరికా సంస్థహైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): తూర్పు తీరంలోని ప్రధాన రేవుల్లో ఒకటైన గంగవరం పోర్టులో ప్రధాన వాటాదారుగా ఉన్న అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్ పింకస్ తన వాటాను విక్రయించే ప్రయత్నాల్లో ఉంది. గంగవరం పోర్టులో ఈ సంస్థకు 31.5 శాతం వాటా ఉంది. ఈ మొత్తం వాటాను 30-40 కోట్ల డాలర్లకు విక్రయించేందుకు దుబాయ్ ప్రభుత్వ సంస్థ డిపి వరల్డ్‌తో చర్చలు జరుపుతున్నట్టుగా తెలిసింది. 2007లో వార్‌బర్గ్ పింకస్ సుమారు 4 కోట్ల డాలర్లతో గంగవరం పోర్ట్‌లో 31.5 శాతం వాటాను తీసుకొంది. అప్పటి ఇన్వె్‌స్టమెంట్‌తో పోలిస్తే 10 ఏళ్ల పది రెట్ల రాబడిని సంస్థ సొంతం చేసుకోనుందని చెప్పవచ్చు. నిజానికి రుపీ మారకం విలువలో చూస్తే రాబడి ఇంకా అనేక రెట్లు ఎక్కువగా ఉంది. 2007లో వార్‌బర్గ్ పెట్టుబడి మొత్తం రూ.150 కోట్లు కాగా ప్రస్తుతం సంస్థ ఆశిస్తున్న మొత్తం రూ.2,560 కోట్లపైమాటే. డివిఎస్ రాజు ప్రమోటర్‌గా ఉన్న గంగవరం పోర్ట్ దేశంలోని అత్యంత లోతైన పోర్టుల్లో ఒకటి. 21 మీటర్ల లోతు కారణంగా రెండు లక్షల డెడ్‌వెయిట్ టన్నేజ్ ఉన్న సూపర్‌కేప్ సైజ్ నౌకలు కూడా ఈ పోర్టుకు అలవోకగా రాకపోకలు సాగించే వెసులుబాటు ఉంది. ఈ పోర్టు ద్వారా ప్రస్తుతం బొగ్గు, ముడిఇనుము, ఎరువులు, లైమ్‌స్టోన్, బాక్సైట్, చక్కెర, ప్రాజెక్ట్ కార్గో, అల్యూమినియా, ఉక్కు ఉత్పత్తుల వంటి కార్గోను ఈ పోర్ట్ హ్యాండిల్ చేస్తోంది. ఈ పోర్టులో డివిఎస్ రాజు కుటుంబానికి 58.11 శాతం వా టా ఉంది. వార్‌బర్గ్ పింకస్ వాటా 31.5 శాతం పోను మిగితా వాటా అంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఈ సంస్థ వాల్యుయేషన్ ప్రస్తుతం 100-140 కోట్ల డాలర్లు ఉన్నట్టు చెబుతున్నారు. డిపి వరల్డ్‌తోపాటు గంగవరం పోర్టులో వార్‌బర్గ్‌వాటాల కో సం అదానీ పోర్ట్స్, జెఎస్‌డబ్ల్యు ఇన్‌ఫ్రా పోటీపడుతున్నాయి. దుబాయి ప్రభుత్వ సంస్థ డిపి వరల్డ్‌కు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లోని ఓడరేవుల్లో దాదాపు 77 టెర్మినల్స్ ఉన్నాయి. భారత్‌లో ఇప్పటికే ముంబైలోని జెఎన్‌పోర్ట్ ట్రస్ట్‌లో... నవసేవా గేట్‌వే టెర్మినల్, నవసేవా ఇంటర్‌నేషనల్ కంటైనర్ టెర్మినల్స్‌ను నిర్వహిస్తోంది. ముంద్రా ఇంటర్‌నేషనల్ కంటైనర్ టెర్మినల్‌ను, చెన్నై, కొచ్చిన్ పోర్టుల్లో రెండు టెర్మినల్స్‌ను వైజాగ్ పోర్ట్‌లో కంటైనర్ టెర్మినల్‌ను నిర్వహిస్తోంది. భారత్‌లో ఇప్పటి వరకు 120 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేసిన డిపి వరల్డ్ మరో 100 కోట్ల డాలర్ల పెట్టుబడికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. | business |
13,828 | 11-05-2017 01:54:43 | ఎఫ్‌బీఐ చీఫ్‌పై వేటు | ట్రంప్ సంచలన నిర్ణయంతాత్కాలిక చీఫ్ ఆండ్రూ మెకేబ్‌వాషింగ్టన్, మే 10: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్ జేమ్స్ కోమీ(56)ని బుధవారం అర్ధాంతరంగా పదవి నుంచి తొలగించి దేశవ్యాప్తంగా కలకలం రేపారు. 2016 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు రష్యాతో ట్రంప్ ప్రచార బృందం కుమ్మక్కైనట్లు వచ్చిన ఆరోపణలపై కోమీ స్వయంగా దర్యాప్తు జరుపుతున్నారు. రష్యాతో ట్రంప్ బృందానికి సంబం ధం ఉందనడానికి ఆధారాలున్నాయని ఆయన కొద్దిరోజుల క్రితమే వాంగ్మూలమిచ్చారు. ఇంతలోనే ఆయనపై ట్రంప్ వేటు వేయడం పట్ల విపక్ష డెమోక్రాట్లతో పాటు పాలక రిపబ్లికన్లు కూడా విమర్శిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌పై పోటీచేసిన డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్.. ఒబా మా హయాంలో విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటు ఈమెయిల్ ద్వారా అధికారిక కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కోమీ దర్యాప్తు చేసిన తీరును అధ్యక్షుడు ట్రంప్ తప్పుబట్టారు. రష్యాతో లింకులకు సంబంధించి తనపై దర్యాప్తు జరగడం లేదని ఆయన మూడుసార్లు తన కు చెప్పారని వెల్లడించారు. ‘ఎఫ్‌బీఐని మీరు సమర్థంగా నడపలేకపోతున్నారు. దర్యాప్తు సంస్థపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాల్సి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మిమ్మల్ని టెర్మినేట్ చేసి తొలగిస్తున్నాం. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది’ అని కోమీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. లాస్ ఏంజిలె్‌సలో ఎఫ్‌బీఐ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఎఫ్‌బీఐ చీఫ్‌కు తనను తొలగించిన విషయం తెలిసింది. అధికారులంతా నిర్ఘాంతపోయారు. కోమీ ఆరేళ్లుగా ఎఫ్‌బీఐ చీఫ్ గా పనిచేస్తున్నారు. ఆయన పదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగాల్సి ఉంది. ఆయన స్థానంలో ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ ఆండ్రూ జి.మెకేబ్‌ను తాత్కాలిక చీఫ్‌గా నియమించారు. | nation |
10,854 | 22-12-2017 19:13:20 | దాని కోసం ఎన్ని కష్టాలు పడాలో: విజయ్ దేవరకొండ | తాజాగా ఐఎండీబీ(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) వారు 2017 సంవత్సరంలో ప్రజలకు బాగా చేరువైన టాప్ 10 భారతీయ సినిమాల జాబితా ప్రకటించారు. ఇందులో రాజమౌళి తీర్చిదిద్దిన 'బాహుబలి 2 ' రెండో స్థానంలో నిలవగా.. చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన 'అర్జున్ రెడ్డి' సినిమా మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఈ రెండు సినిమాల కంటే ముందు వరుసలో (మొదటి స్థానంలో) మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా వచ్చిన తమిళ చిత్రం 'విక్రమ్ వేద' నిలిచింది. అయితే ఇక్కడ టాప్ 10 జాబితాలో మొదటి మూడు స్థానాల్లో రెండు తెలుగు సినిమాలు నిలవడం టాలీవుడ్ ఇండస్ట్రీని సంతోషపెడుతోంది. కాగా దీనిపై 'అర్జున్ రెడ్డి' హీరో విజయ్ దేవరకొండ వెంటనే స్పందిస్తూ..'భారతీయ సినిమాల్లో 'అర్జున్ రెడ్డి'ని మూడో స్థానంలో నిలబెట్టినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు దీన్ని బీట్ చేయడానికి ఎన్ని కష్టాలు పడాలో..' అని ట్వీట్ పెట్టాడు. అర్జున్‌రెడ్డి సినిమాపై ఇంట్రెస్టింగ్ క్విజ్ నటి చార్మీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? | entertainment |
7,317 | 11-11-2017 17:43:13 | మెగాఅభిమానుల సమక్షంలో 'జవాన్' మూవీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ | సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా , బివిఎస్ రవి దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'జవాన్'. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్ గా నటిస్తోంది. దేశానికే కాదు ప్రతి ఇంటికి కూడా జవాన్ వుంటాడు, వుండాలి కూడా.. దేశాన్ని ప్రాణంగా , భాద్యతగా భావించి అహర్నిశలు రక్షణ కల్పిస్తాడు ఆ జవాన్... దేశంలోని తన ఇంటిని ఇంటిలో వారిని తన గుండెల్లో పెట్టుకుని భాద్యతతో కాపాడుకుంటాడు ఈ జవాన్. అనే కాన్స్‌ప్ట్ తో సిధ్ధమైంది ఈ చిత్రం. ఇప్పటి వరకూ విడుదల చేసిన ప్రతి ప్రమెషనల్ మెటిరియల్ కి చాలా మంచి రెస్పాన్స్ రావటం యూనిట్ లో నూతనుత్సాహన్ని కలిగించింది. రీసెంట్ గా మ్యూజిక్ లో సెన్సెషన్ క్రియెట్ చేస్తూ, ట్రెండ్ కి తగ్గట్టుగా సంగీతాన్ని అందిస్తున్న ఎస్. థమన్ అందించిన ఆడియో కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా నిర్మాతలు గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ 19న హైదరాబద్ నక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో అత్యంత భారీ ఏర్పాట్ల మద్యలో మెగాఅభిమానుల సమక్షంలో అతిరథమహరధుల ఆశీర్వచనాలతో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సర్‌ప్రైజ్ గెస్ట్‌లు హజరుకానున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు బివిఎస్ రవి మాట్లాడుతూ.... 'కొంతమంది మనుషులు కలిస్తే కుటుంబం అవుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది. దేశభక్తి అనేది కిరీటం కాదు. కృతజ్ఞత ఇదే మేము టీజర్ లో చెప్పాము. ఈ డైలాగ్ విన్నవాళ్ళు చాలా మంది నాకు పర్సనల్ గా కాల్ చేసి మనసు పెట్టి రాశావు అని ప్రశంశించారు. నిజంగా ఈడైలాగ్ నేను మససు పెట్టి రాశాను అలానే సినిమా కూడా మనసు పెట్టి తీసాను. తప్పకుండా అందర్ని ఆకట్టకుంటుంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడి పాత్రలో సాయి ధరమ్ చాలా భాద్యతగా కనిపిస్తాడు. తన కుటుంబాన్ని మనోదైర్యంతో, బుద్దిబలంతో ఎలా కాపాడుకున్నాడన్నదే ఈ జవాన్ కథ. ఇది పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఎంటర్ టైనింగ్ కమర్షియల్ చిత్రం. తమన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. మెహ్రీన్ హీరోయిన్‌గా నటించింది. ప్రసన్న స్పెషల్ క్యారెక్టర్ లో నటించారు' అన్నారు. చిత్ర సమర్పకుడు దిల్ రాజు మాట్లాడుతూ.... 'సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన జవాన్ చిత్రం డిసెంబర్ 1న గ్రాండ్ గా విడుదల చేస్తున్నాము. నవంబర్ 19న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నాము. ఈ చిత్రం తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుంది. సాయిధరమ్ తేజ్ , నా కాంబినేషన్ లో మరో సూపర్‌హిట్ గా నిలుస్తుంని ఆశిస్తున్నాను' అన్నారు. | entertainment |
19,682 | 30-12-2017 03:58:58 | ధృవ్ షోరే సెంచరీ | ఢిల్లీ తొలి ఇన్నింగ్స్ 271/6ఇండోర్: ధృవ్ షోరే (256 బంతుల్లో 17 ఫోర్లతో 123 బ్యాటింగ్) అజేయ శతకంతో ఢిల్లీ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 6 వికెట్లకు 271 పరుగులు చేసింది. విదర్భతో జరుగుతున్న ఈ రంజీ ఫైనల్లో 99 పరుగులకే నాలుగు వికెట్లు పడినా హిమ్మత్ సింగ్ (72 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 66)తో కలిసి షోరే ఐదో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. క్రీజులో షోరేతో పాటు వికాస్ (5 బ్యాటింగ్) ఉన్నాడు. ఠాకరే, గుర్బానీకి రెండేసి వికెట్లు దక్కాయి. | sports |
440 | 13-04-2017 03:03:27 | లిక్విడేషన్ అర్బన్ బ్యాంకుల రుణాల వసూళ్లపై కసరత్తు | మరో ఒటిఎస్ ప్రతిపాదన సిద్ధం చేసిన సహకార శాఖ హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): లిక్విడేషన్ ప్రక్రియలో ఉన్న అర్బన్ బ్యాంకుల రుణాల వసూలు కోసం రాష్ట్ర సహకార శాఖ మరో వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఒటిఎస్) ప్రతిపాధన సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదన అమలు సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం ప్రభుత్వం.. ఆ ప్రతిపాదనను ఆర్థికశాఖకు పంపింది. రాష్ట్రంలో ప్రుడెన్సియల్, వాసవి, చార్మినార్‌లు సహా పలు అర్బన బ్యాంకులు.. ఇచ్చిన రుణాలు వసూలుగాక, డిపాజిటర్లకు తిరిగి చెల్లించలేక లిక్విడేషన్ (ఎత్తివేసే) దశకు చేరాయి. ఈ ప్రక్రియను చేపట్టిన ఉమ్మడి ఎపి ప్రభుత్వం ఆయా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారి నుంచి వడ్డీ రేట్లు తగ్గించి రుణాల వసూలు కోసం ఒటిఎస్ పథకం తీసుకువచ్చింది. అయినా రుణగ్రహీతల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆ పథకం నీరుగారిపోయింది. ఈ రుణాల వసూలు కోసం ఉన్న గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. | business |
3,465 | 23-11-2017 00:44:11 | ‘నంది’పై కొన్ని ప్రశ్నలు | మహాశయులారా!నందీ బహుమతులు ఎవరు ఎన్నినా విభేదించేవారుండవచ్చు. కాని ప్రభుత్వం వ్యక్తపరచిన రెండు విషయాల గురించి యీ ఉత్తరం. ఈ బహుమతులను విమర్శించిన వారిని మూడు సంవత్సరాల వరకు బహిష్కరిస్తారా? ఇది ఎవరి ప్రోద్బలం వలన నిబంధనలలో చోటుచేసికొన్నది! రెండవది: ఇలా విమర్శలు కొనసాగితే నంది బహుమతులు రద్దు చేస్తామని భయపెట్టడమా! ఈ బహుమతులు యివ్వడం సినిమాలకు, నటులకు దర్శకులకు కావచ్చు. వాటి వుద్దేశం – జాగ్రత్తగా ఆలోచిస్తే – చిత్రాలు మెరుగుపడతాయనీ, దాని వలన సమాజం బాగుపడుతుందనీ కదా! దీనితో ప్రభుత్వం పక్షాన ఆ అభిప్రాయాలు వెలిబుచ్చిన వారు ఏకీభవించరా? మరొక ప్రశ్న: సెలక్షన్ కమిటీలో ఉన్నవారికీ బహుమతులా! అవి వారెలా పుచ్చుకొన్నారు? ఎలా యిచ్చారు?వి.ఎ.కె.రంగారావు | editorial |
5,035 | 24-05-2017 17:28:43 | మరోసారి తమ్ముడికి హ్యాండ్ ఇవ్వనున్న సల్మాన్ | తన హిట్ మూవీ ఫ్రాంచైజీలో నటించేందుకు బాలీవుడ్ స్టార్ హీరో ఎందుకో పిల్లిమొగ్గలు వేస్తున్నాడట. తాజాగా మరో సినిమా కోసం తమ్ముడి డైరెక్షన్‌లో తెరకెక్కాల్సిన సినిమాను బడా హీరో పక్కనపెట్టాడనే గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కొల్లగొట్టే సల్మాన్ సినిమాలు షూటింగ్ స్టేజ్ నుంచే ఇండస్ట్రీవర్గాలలోనూ, మూవీ లవర్స్‌లోనూ ఆసక్తి రేపుతుంటాయి. త్వరలోనే 'ట్యూబ్ లైట్' సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్న సల్లుభాయ్... ప్రస్తుతం మరో మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే షూటింగ్‌లో ఉన్న సినిమా తరువాత సల్మాన్ నటించబోయే తదుపరి చిత్రం ఏంటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే లేటెస్ట్‌గా మరో మూవీ కోసం సల్మాన్ తన తమ్ముడికి హ్యాండ్ ఇవ్వబోతున్నాడనే పుకార్లు జోరుందుకున్నాయి. తన తమ్ముడు అర్భాజ్ ఖాన్ డైరెక్షన్‌లో 'దబంగ్ 3' సినిమా చేయాలని గతంలోనే నిర్ణయించుకున్న కండలవీరుడు, ఇప్పుడు మరో మూవీ కోసం 'దబంగ్ 3'ను పక్కన పెట్టబోతున్నాని బాలీవుడ్ వర్గాలు తెగ చెవులు కొరుక్కుంటున్నాయి. తన సెకండ్ ఇన్నింగ్స్‌కు ఫస్ట్ హిట్‌గా చెప్పుకునే 'వాంటెడ్' మూవీ సీక్వెల్ కోసం 'దబంగ్ 3' సినిమాను లైట్ తీసుకోవాలని సల్మాన్ డిసైడయినట్టు ఊహాగానాలు మొదలయ్యాయి. 'పోకిరి' రీమేక్‌గా తెరకెక్కిన 'వాంటెడ్' సినిమాను బాలీవుడ్‌లో ప్రభుదేవా తెరకెక్కించాడు. అయితే రీసెంట్‌గా 'వాంటెడ్' సినిమాకు సీక్వెల్ స్టోరీని సిద్ధం చేసిన ప్రభుదేవా... ఆ కథను సల్మాన్‌కు వినిపించాడట. 'వాంటెడ్' సీక్వెల్ స్టోరీ బాగా నచ్చడంతో 'దబంగ్ 3' ప్లేస్‌లో ఈ సినిమాను చేద్దామని ప్రభుదేవాకు చెప్పాడట సల్మాన్. అయితే 'ట్యూబ్ లైట్' కోసం 'దబంగ్ 3'ను పక్కనపెట్టిన సల్మాన్, ఇప్పుడు 'వాంటెడ్' సీక్వెల్ కోసం ఈ సినిమాను పక్కనపెట్టాలని భావిస్తుండటంతో అసలు కండలవీరుడికి 'దబంగ్ 3'లో నటించాలనే ఆలోచన లేనట్టు కనిపిస్తోందనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. | entertainment |
18,845 | 30-01-2017 01:35:02 | విత్ డ్రాయల్ పరిమితి పెంపునకు నో | న్యూఢిల్లీ, జనవరి 29: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నగదు కోసం పడుతున్న పాట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) దృష్టికి ఎన్నికల సంఘం(ఈసీ) తీసుకెళ్లింది. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో వారి కోసం నగదు వితడ్రాయల్ పరిమితిని పెంచాలని అభ్యర్థించింది. అయితే ఆర్బీఐ దీనిని తోసిపుచ్చింది. పెద్దనోట్ల రద్దు అనంతరం వారానికి రూ.24 వేలకు మించి వితడ్రా చేయడానికి వీల్లేదంటూ ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అభ్యర్థులకు ఈ పరిమితిని రూ.2 లక్షలకు పెంచాలని ఈసీ కోరింది. | nation |
18,059 | 23-03-2017 03:22:36 | సీబీఎస్‌ఈ 6-9 తరగతులకు కొత్త పరీక్ష విధానం | న్యూఢిల్లీ, మార్చి 22: గడిచిన ఏడేళ్లుగా అమలు చేస్తున్న నిరంతర, సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్ (సీబీఎస్ ఈ) మంగళం పలకబోతోంది. దీని స్థానంలో 6 నుంచి 9 తరగతులకు వరకు కొత్త పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు సీసీఈ విధానాన్ని తొలగించి యూనిఫాం సిస్టమ్ ఆఫ్ అసె్‌సమెంట్ అండ్ ఎగ్జామినేషన్ (యూఎస్ఏఈ)ను అమలు చేయనుంది. కొత్త విధానాన్ని 2017-18 విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనున్నట్లు సీబీఎస్‌ఈ పేర్కొంది. ఆ తర్వాతి విద్యాసంవత్సరం నుంచి పదో తరగతికి బోర్డు ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న సీసీఈ విధానంలోని లోపాల వల్ల విద్యార్థులు 8, 9 తరగతుల తర్వాత వేరొక పాఠశాలకు మారితే వారి పదో తరగతి మార్కులపై ప్రభావం పడుతోంది. దీనిని అధిగమించేందుకు ఈ కొత్త విధానం ఉపయోగపడుతుందని సీబీఎస్ఈ అధికారి ఒకరు చెప్పారు. సీసీఈ విధానంలో రెండు టెర్మ్‌లలో 60 శాతం మార్కులు పరీక్షల ద్వారా, మరో 40 శాతం మార్కులు ఫార్మాటివ్ అసె్‌సమెంట్ ద్వారా నిర్ధారిస్తారు. కొత్త విధానం కూడా రెండు టర్మ్‌లలోనే కొనసాగనుంది. అయితే, పరీక్షా మార్కుల వెయిటేజీ 90 శాతానికి పెరుగుతుంది. ఇందులో అర్ధవార్షిక, వార్షిక పరీక్షలకు సంబంధించి 80 మార్కులు, రెండు టర్మ్‌లలో 20 మార్కులకు నిర్వహించే పీరియాడిక్ అసెస్ మెంట్ సరాసరి నుంచి తీసే మరో 10 మార్కులు కేటాయిస్తారు. ఇక మిగిలిన 10 శాతం మార్కులను ఫార్మాటివ్ అసె్‌సమెంట్ ద్వారా నిర్ధారిస్తారు. | nation |
19,980 | 20-08-2017 05:00:29 | టైటాన్స్ గెలిచిందోచ్..! | 37-32తో ముంబాపై విజయంలఖ్‌నవ్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు గెలుపు తలుపు తట్టిం ది. వరుసగా ఎనిమిది గేముల తర్వాత టైటాన్స్ విజయం సాధించింది. శనివారం జరిగిన ఇంటర్ జోనల్ మ్యాచ్‌లో యు ముంబాపై 37-32తో గెలుపొందింది. గత కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమైన కెప్టెన్ రాహుల్ చౌదరి ముంబైపై చెలరేగి పోయాడు. 20 రైడర్లలో 13 పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు డిఫెన్స్‌లో రాణించిన సోంబీర్ 8 టాకిల్ పాయింట్లు సాధించడం విశేషం. ముంబాను టైటాన్స్ రెండుసార్లు ఆలౌటైంది. తొలి 10 నిమిషాలు ముగిసేసరికి 12-7తో ముందంజ వేసిన టైటాన్స్.. ఫస్టాఫ్ ముగిసే సరికి 19-15తో పైచేయి సాధించింది. సెకండాఫ్‌లో ముంబా గట్టిపోటీ ఇచ్చింది. షబ్బీర్ బాపు సూపర్ రైడ్‌తో ముంబై 25-27తో మ్యాచ్‌లోకి వచ్చింది. తర్వాత రైడింగ్ వెళ్లిన రాహుల్‌ను పట్టేయడంతో 27-27తో స్కోరు సమమైంది. చివరి మూడు నిమిషాల్లో ముంబా రెండోసారి ఆలౌట్ కావడంతో 37-31తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన టైటాన్స్ మ్యాచ్‌ను నెగ్గింది. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 36-29తో యూపీ యోధాపై నెగ్గింది. స్టీలర్స్ తరఫున రైడింగ్‌లో వికాస్ కండోలా, డిఫెన్స్‌లో సురేంద్ర నాడా రాణించారు. | sports |
17,440 | 26-04-2017 02:27:21 | సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృతికి రాష్ట్రపతి సంతాపం | పనాజీ, ఏప్రిల్ 25: ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ జవా న్ల మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం గోవా యూనివర్సిటీ 29వ స్నాతకోత్సవానికి హాజరైన రాష్ట్రపతి.. కార్యక్రమం ప్రారంభం సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఆయనతోపాటు రాష్ట్ర గవర్నర్ మృదు లా సిన్హా, ముఖ్యమంత్రి మనోహర్ పర్రీకర్ తదితరులు కూడా మౌనం పాటించారు. | nation |
15,475 | 23-04-2017 14:42:43 | మోదీ గురించి ముషరఫ్ ఇలా మాట్లాడారంటే నమ్మలేం... |
దుబాయ్ : పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషరఫ్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నారు. ఆయనను వరల్డ్ ఈజ్ వన్ న్యూస్ ఇంటర్వ్యూ చేసింది. ‘వరల్డ్ ఈజ్ వన్ గ్లోబల్ లీడర్‌షిప్ సిరీస్’ కోసం ఈ ఇంటర్వ్యూ చేశారు. అనేక అంశాలపై ప్రశ్నలు వేసి, ఆయన అభిప్రాయాలను రాబట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి అడిగిన ప్రశ్నకు ముషరఫ్ స్పందిస్తూ మోదీ చురుకైన నేత అని, అందుకే ఆయన నేతృత్వంలో భారతదేశం అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అన్నారు. కశ్మీరు స్వాతంత్ర్యోద్యమానికి తాను మద్దతిస్తానన్నారు. మోదీ శాంతిని కోరుకోవడం లేదని, అదే సమస్య అని అన్నారు. | nation |
12,522 | 27-11-2017 01:54:19 | సీపీఎం రిజిస్ర్టేషన్‌ను రద్దు చేయాలంటూ పిల్ | న్యూఢిల్లీ, నవంబరు 26: సీపీఎంకు రాజకీయ పార్టీగా చేసిన రిజిస్ర్టేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. సీపీఎంను రాజకీయ పార్టీగా నమోదు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం 1989, సెప్టెంబరులో జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ఈ పిల్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సి.హరిశంకర్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. జోజో జోస్ అనే సామాజిక కార్యకర్త తొలుత సీపీఎం రిజిస్ర్టేషన్‌ను రద్దు చేయాలంటూ ఈసీని ఆశ్రయించారు. సీపీఎం వక్రీకరించిన, మోసపూరిత, ఫోర్జరీ సమాచారంతో రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేయించుకుందని ఆరోపించారు. | nation |
6,118 | 25-05-2017 00:20:14 | నా ఫ్రెండ్స్ కుళ్లుకుంటున్నారు |
‘కేశవ’ చిత్రంలో చేసిన పాత్రకు వస్తున్న స్పందనతో తెగ సంబరపడుతున్నారు వెన్నెల కిశోర్. శుక్రవారం విడుదలవుతున్న నాగచైతన్య సినిమా ‘రారండోయ్.. వేడుక చూద్దాం’, జూన 9న వస్తున్న ‘అమీ తుమీ’, జూన్ 23న వచ్చే ‘డీజే’ సినిమాలు తనకు మరింత మంచి పేరు తెస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ‘‘నా కెరీర్‌కు ‘కేశవ’ సినిమా మంచి బూస్ట్‌నిచ్చింది. అందులో నా సన్నివేశాల్ని డైరెక్టర్ సుధీర్‌వర్మ మూడంటే మూడు రోజుల్లో పూర్తి చేశారు. సినిమాలో నేను కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకులు రిలీఫ్ ఫీలవడం, హాయిగా నవ్వుకోవడం చూసి ఆనందం కలిగింది’’ అని చెప్పారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ‘అమీ తుమీ’లో ఆయన కామెడీ విలనగా తొలిసారి కనిపించనున్నారు. ‘‘ఒక పెద్ద దుష్టుడికి పుట్టిన క్యూట్ దుష్టుడి పాత్ర నాది. హీరోలు అడివి శేష్, అవసరాల శ్రీనివాస్ కు ఎన్ని సీన్లున్నాయో అన్ని సీన్లు నాకూ ఉన్నాయి. ఇది నా పెళ్లికి సంబంధించిన కథ. పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వస్తానన్నమాట. నా పెళ్లయ్యేలోగా రెండు రోజుల్లో జరిగే కథ ఇది. హీరోల లవ్ స్టోరీల మధ్యలోకి నేనెందుకు వస్తాను? మా మధ్య పోటీలో ఎవరు గెలుస్తారనేది సినిమా చూసి నవ్వుకోవాల్సిందే. ఇందులో నేను చేసే కామెడీ వర్కవుట్ అయితే పూర్తి క్రెడిట్ డైరెక్టర్‌కే ఇస్తాను’’ అని తెలిపారు కిశోర్. ‘జెంటిల్‌మన’ సినిమా కోసం తొలిసారి ఆయన ఇంద్రగంటితో కలిసి పనిచేశారు. ‘అమీ తుమీ’ సినిమా సెట్స్‌మీదకు వెళ్లే మూడు నెలల ముందే డైలాగ్ వెర్షన్ సిద్ధమయ్యిందనీ, ఒక నెల రోజుల ముందు ప్రధాన ఆర్టిస్టులందరూ స్ర్కిప్టు చదివేశారనీ కిశోర్ చెప్పారు. అందువల్లే షూటింగ్ చాలా సౌకర్యవంతంగా జరిగిందని ఆయన అంటారు. పదేళ్ల కాలంలో ఆయన 150 సినిమాలు పూర్తి చేసేశారు. ‘‘అమెరికాలో ఉన్నప్పుడు వచ్చిన ప్రతి తెలుగు సినిమానీ చూసేవాడ్ని. బ్రహ్మానందంగారితో ఫొటో దిగితే చాలనుకునేవాడ్ని. అలాంటిది ఇప్పుడు ఆయనకు ఫోన్ చేసి, కలవాలనుందని చెబితే, ‘రావోయ్’ అని ఆయనచేత పిలిపించుకొనే స్థాయికి ఎదిగానంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. నాగార్జున, వెంకటేశ్ గార్ల సినిమాలు చూసి, కేరింతలు కొట్టిన నేను ఇప్పుడు వాళ్లతో కలిసి నటిస్తుంటే అమెరికాలోని నా ఫ్రెండ్స్ కుళ్లుకుంటున్నారు’’ అని నవ్వేశారు కిశోర్. | entertainment |
6,244 | 28-11-2017 20:48:45 | శ్రుతిహాసన్ పెళ్ళి చేసుకోనుందా...? | ఆ దక్షిణాది తార.. అన్ని రంగాల్లోనూ తానున్నానని చెప్పకనే చెబుతుంటుంది. దానికి తగ్గట్టుగానే అమ్మడి ప్రవర్తన ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడీ భామ తన మదర్ ల్యాండ్ చెన్నైలో ల్యాండ్ అవడంతో రకరకాల రూమర్స్ వ్యాపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా దక్షిణాది భామ..? సాధారణంగా హీరోయిన్స్‌కు అందంగా ఉండడమే ప్రథాన అర్హత. ఆ అందాలతోనే హీరోయిన్‌గా రాణిస్తారు. కానీ దక్షిణాది అందాల తార శ్రుతిహాసన్‌కు మాత్రం అందం కాకుండా మరిన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అమ్మడు పాటలు పాడగలదు, కీ బోర్డ్ ప్లే చేయగలదు. సంగీత దర్శకత్వం వహించగలదు. ఇలా పలురంగాల్లో శ్రుతి హాసన్ తన ప్రతిభను చాటుకుంది. శ్రుతిహాసన్‌కు ఇన్ని అర్హతలున్నా హీరోయిన్ గా మాత్రం ఏమంత చెప్పుకోదగ్గ స్థాయిలో విజయవంతమయిన చిత్రాలు పడలేదు. 'గబ్బర్ సింగ్' , ఆ తర్వాత కొన్ని చిత్రాలు విజయం సాధించినా.. ఆ తర్వాత శ్రుతి అంతగా రాణించలేకపోయింది. అయినా సరే ఆమెకు ఆఫర్స్ ఆగలేదు. ప్రస్తుతం ఆమె చేస్తున్న చిత్రాల కారణంగానే భారీ బడ్జెట్ చిత్రమయిన 'సంఘమిత్ర'కు ఒకేసారి అన్నిరోజులు డేట్స్ ఇవ్వలేనని గుడ్ బై చెప్పిందట. అందుకే కాబోలు అసలు నటనే తన గోల్ కాదని అంటోంది. సింగర్‌గా మారి రాక్‌స్టార్ అవ్వాలని ఉందట. ఈ నేపథ్యంలో శ్రతిహాసన్ తాజాగా లండన్ వెళ్లిందట. అక్కడ ఒక కీ బోర్డ్ కూడా కొన్నదట. తాజాగా చెన్నైవస్తోందట. తన ఫ్యామిలీని కలసి ఏదో విషయం గురించి డిస్కస్ చేయాలట. బహుశా మూలన పడ్డ శభాష్ నాయుడ్ని బయటికి తీయడమో, లేక తన బోయ్‌ఫ్రెండ్‌తో తన పెళ్లి గురించి మాట్లాడడమో.. ఏదో ఒకటి చేయడానికే శ్రుతి హాసన్ ఇండియా వచ్చిందని చెన్నై జనం చెవులు కొరుక్కుంటున్నారు. మరి శ్రుతి నిజంగా చెన్నై ఎందుకు వస్తోందో. | entertainment |
704 | 11-05-2017 02:48:50 | ఎయిర్ ఇండియా బకాయిలు చెల్లించని ప్రభుత్వం |
మార్చినాటికి రూ.451.75 కోట్ల బకాయిలు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఎయిర్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వమూ చుక్కలు చూపిస్తోంది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని వంటి వివిఐపిల పర్యటనలతోపాటు, ప్రత్యేక మిషన్ల కోసం ఎయిర్ ఇండియా సమకూరుస్తున్న ప్రత్యేక విమాన సర్వీసుల బకాయిలను ప్రభుత్వం సరిగా చెల్లించడం లేదు. ఈ పద్దుల కింద ఈ ఏడాది మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియాకు రూ.451.75 కోట్ల బకాయిలు వసూలు కావలసి ఉంది. ఇందులో కొన్ని బకాయిలు 2006 కంటే ముందు కాలానికి చెందిన బకాయిలు. సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద లోకేష్ బాత్రా అనే ఒక మాజీ అధికారి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం ఈ విషయాలు వెల్లడించింది. ఈ బకాయిలు చెల్లించండి మహా ప్రభో అంటూ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు 2014-2017 మధ్య 31 లేఖలు రాసినా ఎలాంటి స్పందనా లేదని తెలిపింది. వివిఐపిల విదేశీ పర్యటన కోసం ఎయిర్ ఇండియా మూడు బోయింగ్ 747-400 విమానాలను సిద్ధంగా ఉంచుతుంది. అవసరమైతే వీటిని అత్యవసర పరిస్థితుల్లో విదేశాల నుంచి భారతీయులను తరలించేందుకు ఉపయోగిస్తారు. బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులైనా చేయండి లేకపోతే బకాయిలైనా ఎప్పటికపుడు చెల్లించండి అని ఎయిర్ ఇండియా అధికారులు ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం నుంచి స్పందనే లేదు. | business |
8,960 | 29-05-2017 11:13:43 | ‘స్పైడర్’ రిలీజ్ డేట్ ఫిక్స్! | దాదాపు రెండేళ్లుగా షూటింగ్ దశలోనే ఉన్న సూపర్‌స్టార్ మహేష్ ‘స్పైడర్’ చిత్రం విడుదల తేదీ ఎట్టకేలకు కన్ఫామ్ అయింది. తమిళ అగ్ర దర్శకుడు మురుగదాస్ రూపొందిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకే సారి విడుదలవుతుంది. దసరా సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. విజయదశమి సందర్భంగా ‘స్పైడర్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా మహేష్‌బాబు వెల్లడించారు. అలాగే ఈ సినిమా టీజర్‌ను మహేష్ తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయబోతున్నారు. హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. | entertainment |
871 | 31-12-2017 23:15:36 | ఈ ఏడాది ‘బుల్’ షేర్లు ఇవే! | గత ఏడాది స్టాక్ మార్కెట్ మదుపరులకు మంచి లా భాలు పంచింది. బిఎస్‌ఇ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏడాది కాలంలోనే రూ.45 లక్షల కోట్లు పెరిగి రూ.152 లక్షల కోట్లకు చేరింది. కొన్ని కంపెనీల షేర్లు నిరాశ పరిచినా సెన్సెక్స్, నిఫ్టీల్లోని ఎక్కువ కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు మంచి లాభాలే పంచాయి. మరి ఈ ఏడాది ఏ కంపెనీల షేర్లు పరుగెత్తే అవకాశం ఉంది? బ్రోకరేజ్ సంస్థలు ఏ కంపెనీల షేర్లను సిఫారసు చేస్తున్నాయి? ఆంధ్రజ్యోతి ‘బిజినెస్ ప్లస్’ పాఠకుల కోసం ఆ వివరాలు.. ఆనంద్ రాఠి ఫైనాన్సియల్ సర్వీసెస్ జమ్నా ఆటోప్రస్తుత ధర రూ.80.95 టార్గెట్ ధర : రూ.95దేశంలో అతిపెద్ద లీఫ్ స్ర్పింగ్స్ ఉత్పత్తి కంపెనీ ఇది. ఆటోమొబైల్ రంగంలో వీటికి మంచి గిరాకీ ఉంది. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడడంతో భారీ, మధ్య తరహా వాణిజ్య వాహనాల వాహనాల తయారీదారులకు కలిసిరానుంది. దీంతో వచ్చే మూడేళ్లలో ఈ కంపెనీ రాబడి ఏటా 13 శాతం చొప్పున పెరిగే అవకాశం ఉంది. డాబర్ ఇండియా ప్రస్తుత ధర రూ.348.60 టార్గెట్ ధర రూ.400ఆయుర్వేదం, మూలికలు, ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, ఇతర ఉత్పత్తులు అందించే దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో డాబర్ ఇండియా ఒకటి. 2017-20 మధ్య కాలంలోనూ డాబర్ ఇండియా అమ్మకాలు ఏటా 16 శాతం చొప్పున పెరిగే అవకాశం ఉంది. దీపక్ నైట్రైట్‌ప్రస్తుత ధర రూ.231.90 టార్గెట్ ధర రూ.264వినూత్నమైన రసాయన ఉత్పత్తులు తయారు చేసే ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల్లో ఇది ఒకటి. రబ్బర్, ఫార్మా, ఆగ్రో కెమికల్స్, పేపర్, టెక్స్‌టైల్, పెట్రోకెమికల్ రంగాల్లో ఈ కంపెనీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. కంపెనీ ఇటీవలే గుజరాత్‌లోని దహేజ్ దగ్గర రెండు లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యంతో ఫెనాల్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. రెలిగేర్ సెక్యూరిటీస్‌ఏషియన్ గ్రానిటో ఇండియాప్రస్తుత ధర రూ.576.25 టార్గెట్ ధర రూ.642అన్ని వర్గాలకు తగిన ధరలతో ఈ కంపెనీ రకరకాల టైల్స్‌ను మార్కెట్ చేస్తోంది. మిగతా టైల్స్ కంపెనీలతో పోలిస్తే ఉత్పత్తి సామర్ధ్యం వినియోగంలోనూ కంపెనీ ముందుంది. 2017-2020 మధ్య కాలంలోనూ కంపెనీ ఆదాయం ఏటా 16 శాతం చొప్పున, నికర లాభం 32 శాతం చొప్పున పెరిగే అవకాశం ఉందని అంచనా. నీల్‌కమల్ ప్రస్తుత ధర రూ.1,835.75 టార్గెట్ ధర రూ.2,097మౌల్డెడ్ ప్లాస్టిక్ ఫర్నీచర్ రంగంలో నీల్‌కమల్‌కు మార్కెట్లో మంచి పేరుంది. ముడి చమురు ధర పెరుగుతున్నా బ్రాండ్ ఇమేజ్, మార్కెట్లో ఉన్న నాయకత్వ స్థానం కంపెనీకి కలిసి రానున్నాయి. అప్పుల భారం లేకపోవడం కంపెనీకి కలిసొచ్చే మరో ప్లస్ పాయింట్. భారత్ ఎలక్ట్రానిక్స్ ప్రస్తుత ధర రూ.182.05 టార్గెట్ ధర రూ.217దేశ రక్షణ బడ్జెట్ ఏటా పెరుగుతోంది. ఆయుధ వ్యవస్థలన్నిటినీ దేశంలోనే తయారు చేయడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కంపెనీ వద్ద ఇప్పటికే రూ.40,000 కోట్ల ఆర్డర్లు ఉన్నాయి. మరో రూ.13,000 కోట్ల ఆర్డర్ల కోసం కంపెనీ చర్చలు జరుపుతోంది. ఎస్‌ఎంసి ఇన్వెస్ట్‌మెంట్స్ అడ్వైజర్స్ ఎల్ అండ్ టి ప్రస్తుత ధర రూ.1,256.95 టార్గెట్ ధర రూ.1,450మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఇంజినీరింగ్ నిర్మాణ కంపెనీల్లో లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టి) దేశంలోనే అతిపెద్ద కంపెనీ. దేశ, విదేశాల్లో ఎల్ అండ్ టి అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిర్మిస్తోంది. గతి లిమిటెడ్ ప్రస్తుత ధర రూ.135.55 టార్గెట్ ధర రూ.158ఈ కంపెనీ దేశవ్యాప్తంగా సప్లయ్ చెయిన్‌కు సంబంధించి సమగ్ర సేవలు అందిస్తోంది. కొద్ది సంవత్సరాలుగా మార్కెట్లో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. అహ్లూవాలియా కాంట్రాక్ట్స్ ప్రస్తుత ధర రూ.390.05 టార్గెట్ ధర రూ.473 ఈ కాంట్రాక్ట్స్ కంపెనీ వ్యాపారం ఆశాజనకంగా కనిపిస్తోంది. కంపెనీ చేతిలో ఇప్పటికే చెప్పుకోదగ్గ స్థాయిలో ఆర్డర్లు ఉన్నాయి. | business |
19,679 | 18-05-2017 02:36:08 | మహ్మద్ నవాజ్‌పై సస్పెన్షన్ |
కరాచీ: ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అన్ని పోటీలనుంచి రెండు నెలలపాటు సస్పెండ్ చేసింది. ఇటీవల ఆసీ్‌స పర్యటన సందర్భంగా ఓ బుకీ నుంచి తనకు ఆఫర్ వచ్చిన విషయాన్ని ఆలస్యంగా బోర్డుకు తెలియజేసినందుకు ఈ చర్య తీసుకుంది. సస్పెన్షనతోపాటు రూ. 2 లక్షల జరిమానా కూడా విధించింది. | sports |
8,699 | 11-10-2017 12:15:17 | మీతో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది: రామ్‌చరణ్ | ఏడు దశాబ్దాల వయసు పూర్తి చేసుకున్నా.. అలుపన్నదే లేకుండా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తన సహచరులందరూ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనూ ఆయన ఫుల్ డిమాండ్‌లోనే కొనసాగుతున్నారు. బుధవారం అమితాబ్ జన్మదినోత్సవం. 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న అమితాబ్ మొట్టమొదటిసారి తెలుగు సినిమాలో నటించబోతున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నర్సింహారెడ్డి’ సినిమాలో అమితాబ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌తేజ్.. ఆయనకు ఫేస్‌బుక్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఎన్నో ఏళ్లుగా మీ నుంచి, మీ సినిమాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఈ రోజు నాన్నగారి కలల ప్రాజెక్టు ‘సైరా’లో మీరు భాగమవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీతో కలిసి పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంద’ని చెర్రీ ట్వీట్ చేశాడు. | entertainment |
20,052 | 03-12-2017 03:42:04 | ‘చాలెంజర్’ విజేత ఇండియా బ్లూ | ముంబై: అండర్-19 చాలెంజర్ ట్రోఫీ క్రికెట్ టోర్నీని ఇండియా బ్లూ గెలుచుకుంది. శనివారం క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా గ్రౌండ్‌లో జరిగిన ఫైనల్లో ఇండియా బ్లూ 95 పరుగుల తేడాతో శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ లెవెన్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా బ్లూ 244 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ హిమాన్షు రాణా (78), వికెట్ కీపర్ ఊర్విల్ పటేల్ (57), బడాంగె (53) హాఫ్ సెంచరీలు చేశారు. శ్రీలంక బోర్డు లెవెన్ కెప్టెన్ అయాన్ సిరివర్ధన నాలుగు, రవీందు సంజన మూడు, నువనిదు ఫెర్నాండో రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం శ్రీలంక జట్టు 45.4 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌటైంది. నిషాన్ మదుష్క (44), రవీందు సంజన (28) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. పేసర్ మవి, రథ్వ చెరో మూడేసి వికెట్లు పడగొట్టారు. మూడోస్థానం కోసం పోరులో ఇండియా గ్రీన్ (285/6) 21 పరుగులతో ఇండియా రెడ్ (264 ఆలౌట్)పై గెలుపొందింది. | sports |
15,365 | 18-07-2017 19:30:11 | బ్రేకింగ్: నితీష్‌తో తేజస్వి మంతనాలు... కాసేపట్లో ప్రకటన..! | పాట్నా: బీహార్‌లో బిగ్ డవలప్‌మెంట్ చోసుకోనుంది. మహాకూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఆర్జేడీ వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. హోటల్ భూముల కబ్జా ఆరోపణల్లో చిక్కుకున్న ఉప ముఖ్యమంత్రి, లాలూ తనయుడు తేజస్వి యాదవ్ తనంత తానుగా రాజీనామా చేయాలని నితీష్ సారథ్యంలోని జేడీయూ కొద్దిరోజులుగా కుండబద్ధలు కొడుతోంది. అలా కాకుంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్టు సంకేతాలు ఇచ్చింది. లాలూ మాత్రం మహాకూటమిని ఎవరూ ఏమీ చేయలేరని గంభీరంగా చెబుతూ వచ్చారు. బీజేపీ కుట్రలను తిప్పికొడతామన్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో సోమవారంనాడు సుదీర్ఘ మంతనాలు కూడా జరిపారు. అయితే సమావేశానంతరం లాలూ ప్రత్నామ్నాయం ఆలోచించక తప్పదన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి నితీష్‌తో డిప్యూటీ సీఎం తేజస్వి ముంగళవారం ముఖాముఖీ మాట్లాడినట్టు సమాచారం. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది సస్పెన్స్‌గానే ఉన్నా... తేజస్వి మరి కాసేపట్లోనే దీనిపై ఒక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. తాను తప్పు చేయక పోయినా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నట్టు తేజస్వి ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. | nation |
12,240 | 09-02-2017 21:47:54 | చూడండి.. అంతా నా వైపే! | చెన్నై: తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను సమర్పించిన అన్నాడిఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ప్రభుత్వం ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని కోరారు. ఐదుగురు సీనియర్ అన్నాడిఎంకే నేతలతో కలిసి గవర్నర్ కార్యాలయానికి వెళ్లిన ఆమె అరగంటపాటు అక్కడే ఉన్నారు. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో ఆమె గవర్నర్‌కు జాబితాను సమర్పించారు. జాబితాను చిరునవ్వుతో స్వీకరించిన గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుపై శశికళకు మాత్రం ఎలాంటి హామీ ఇచ్చినట్లు సమాచారం అందలేదు. అంతకు ముందే ఆపద్థర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గవర్నర్‌ను కలిసి తనను సిఎంగా కొనసాగించాలని కోరినట్లు సమాచారం. | nation |
8,338 | 24-11-2017 10:52:36 | అందుకే సెక్సీగా కనిపించాలనుకున్నా: విద్య | `రన్ రాజా రన్`, `రాజు గారి గది`, `సరైనోడు`, `నిన్ను కోరి` వంటి పలు సినిమాల్లో కామెడి పండించిన తమిళ నటి విద్యుల్లేఖా రామన్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టించింది. తన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేసి హాట్ చర్చకు తెరలేపింది. ఈ ఫోటోలను చూసిన కొంత మంది సినీ సెలబ్రిటీలు అభినందనలు చెబితే, సామాన్యులు మాత్రం విమర్శల వర్షం కురిపించారు. `హీరోయిన్ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నావా`? అని ప్రశ్నించారు. ఈ విమర్శలకు విద్య స్పందించింది. ప్రస్తుతం తాను కమెడియన్‌గా చాలా బిజీగా ఉన్నానని, తనకి హీరోయిన్‌గా కనిపించే ఉద్దేశమే లేదని తెలిపింది. అంతేకాదు తన ఫోటోలను చూసి ఆత్మవిశ్వాసం పొందిన మహిళలందరికీ `కీప్ ఇట్ గాళ్స్` అంటూ రిప్లై ఇచ్చింది. రంగు, రూపుతో సంబంధం లేకుండా మహిళలందరూ అందంగా ఉన్నామనే భావనకు లోనవ్వాలని తెలిపింది. `లావుగా ఉన్న అమ్మాయిలు సెక్సీగా ఉండలేరని ముద్ర వేసేస్తుంటారు. కానీ, నేను సెక్సీగా ఉండగలను, ఫీలవ్వగలను` అని చెప్పింది. ఇక తనను విమర్శించిన వారికి జవాబిస్తూ.. `ఒక స్త్రీ తనను తాను ప్రేమించుకోవడం ఎక్స్‌పోజింగ్ ఎందుకవుతుంది. అది చాలా సంకుచిత మనస్తత్వం. కమెడియన్లూ సెక్సీగా కనిపించగలరని చెప్పడమే నా ఉద్దేశం` అని విద్య రిప్లై ఇచ్చింది. | entertainment |
20,896 | 29-06-2017 01:21:33 | గెలుపు జోరు సాగాలి! | నేడు విండీస్‌తో భారత్ ఢీ మహిళల వరల్డ్ కప్‌టాంటన్: ఐసీసీ మహిళ ల వన్డే ప్రపంచకప్‌లో మిథాలీ సేన మరో పోరుకు సిద్ధమైంది. గురువారం జరగనున్న తమ రెండో మ్యాచ్‌లో పటిష్ఠ వెస్టిండీస్‌తో భారత మహిళల జట్టు తల పడనుంది. ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ను ఓడించిన ఆత్మవిశ్వాసంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి టోర్నీలో గెలుపు జోరు కొనసాగిం చాలని భావిస్తోంది. ఇంగ్లండ్‌పై స్మృతి (90), పూనమ్ రౌత్ (86), కెప్టెన్ మిథాలీ (71) అర్ధ సెంచరీలతో రాణించారు. ఈ మ్యాచ్‌లోనూ వీరిపై భారీ అంచనాలున్నాయి. స్పిన్నర్లు దీప్తి శర్మ, పూనమ్ యాదవ్‌తో పాటు మీడియం పేసర్ శిఖర్ పాండే చెలరేగితే ప్రత్యర్థి జట్టుకు కష్టాలు తప్పకపోవచ్చు. ఇక సీనియర్ పేసర్ జులన్ గోస్వామి ఫామ్‌లోకి రావాలని జట్టు కోరుకుంటోంది. తొలి మ్యాచ్‌లో ఆమె ఒక్క వికెట్ కూడా తీయలేదు. మరోవైపు తమ ఆరంభ మ్యాచ్‌లో ఆస్ర్టేలియా చేతిలో ఓడిన విండీస్ టోర్నీలో శుభారంభం చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. కెప్టెన్ స్టెఫాని టేలర్, ఓపెనర్ హీలీ మాథ్యూస్, డాటిన్‌తో భారత బౌలర్లకు ప్రమాదం పొంచి ఉంది. | sports |
8,152 | 21-05-2017 20:51:50 | 'సిమ్రన్' రైటర్‌ను మోసం చేసిన కంగనా | ఈ మధ్య వివాదాలకు కాస్త దూరంగా ఉంటుందని అనుకుంటున్న ఆ హాట్ బ్యూటీ, మరోసారి కాంట్రవర్సీని కొని తెచ్చుకుందని బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది... సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనే గుర్తింపు ఉన్నా... ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో అందరిలో నోళ్లలో నానడం కంగనా రనౌత్‌కు బాగా అలవాటు. హిట్టయితే సినిమాలు లేకపోతే వివాదాలతో నిత్యం వార్తల్లో ఉండే ఈ హాట్ బ్యూటీ, లేటేస్ట్‌గా మరోసారి వివాదంలో ఇరుక్కుపోయినట్టు కనిపిస్తోంది. ఓ రైటర్ టాలెంట్‌ను కంగనా సొంతం చేసుకుని అతడికి క్రెడిట్ ఇవ్వడంలేదని ప్రచారం జరుగుతోంది. దీనిపై స్వయంగా ఆ రైటర్ ఆరోపణలు చేయడంతో కంగనా టాలెంట్‌ను తొక్కేస్తుందనే గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. విషయానికొస్తే... రీసెంట్‌గా రిలీజైన కంగనా రనౌత్ కొత్త సినిమా 'సిమ్రన్'కు పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. అయితే ఐతే ఈ సినిమా టైటిల్స్‌లో అడిషనల్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ క్రేడిట్ కంగనాకు ఇవ్వడంపై రైటర్ అపూర్వ మండిపడిపోతున్నాడట. స్క్రిప్టు రాసింది తానైతే, తన పేరు కంటే ముందు ఆమె పేరును ఎలా వేస్తారంటూ ఫైర్అవుతున్నాడట. సిమ్రన్ షూటింగ్ సందర్భంగా ఆన్ సెట్స్‌లో కొన్ని మార్పులు జరిగిన మాట వాస్తవమే అయినా ఆ మాత్రానికే అడిషనల్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ క్రెడిట్ఇవ్వడం, తన పేరు కంటే ముందు ఆమె పేరు వేయడం ఏంటని తెగ ఫీలవుతున్నాడట రైటర్. ఈ సినిమా ప్రమోషన్‌లోనూ డైరెక్టర్‌తో కలిసి తానే స్క్రిప్టు రాసినట్లుగా కంగనా చెప్పుకుంటోందని ఇది తన కష్టాన్ని దోచుకోవడమే అపూర్వ బాధపడుతున్నాడు. కొన్నాళ్లనుంచి ఈ మోసాన్ని మౌనంగా భరిస్తూ వచ్చానని, ఇక ఆగలేక ఇలా ఓపెన్ అవుతున్నానని తన ఫేస్ బుక్‌లో పోస్టు చేశాడు. మరి సిమ్రన్ మూవీపై రైటర్ చేసిన కామెంట్స్‌కు కంగనా ఏ విధంగా రియాక్టవుతుందో చూడాలి. | entertainment |
15,713 | 03-01-2017 23:19:29 | పెద్ద సవాళ్లు ముందున్నాయి | న్యాయవ్యవస్థ సిద్ధమవ్వాలి వీడ్కోలు సభలో జస్టిస్ ఠాకూర్ న్యూఢిల్లీ, జనవరి 3: రిటైర్డ్ న్యాయమూర్తులకు మళ్లీ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసుకొనే అవకాశం కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేస్తే బాగుంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. బయటకు తాము న్యాయమూర్తులమే అయినా మనస్సులో న్యాయవాదులమేనన్నారు. బుధవారం తన 65వ పుట్టిన రోజున పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ ఠాకూర్ మంగళవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన వీడ్కోలు సభలో మాట్లాడారు. న్యాయవ్యవస్థ పెను సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘‘మన ముందు పెద్ద సవాళ్లున్నాయి. 3 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జడ్జిల కొరత ఉంది. అయితే, ఇంతకన్నా పెద్ద సవాళ్లు ము న్ముందు ఉన్నాయి. సైబర్ నేరాలు, మెడికో లీగల్ కేసులు, జన్యు సంబంధ, ప్రైవసీ కేసుల్లో మీరు పెద్ద సవాళ్లనే ఎదుర్కోనున్నారు’’ అన్నారు. బుధవారం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తున్న జస్టిస్ జె.ఎ్‌స.కేహార్ మాట్లాడుతూ, జస్టిస్ ఠాకూర్ దేశమంతటా పర్యటిస్తూ న్యాయవ్యవస్థ కష్టాలను తెలియజేస్తూ, దానిపట్ల ప్రజల్లో గౌరవాన్ని పెంచారన్నారు. | nation |
203 | 29-01-2017 23:34:43 | హాలీడే మీటింగ్‌లో కలిశారు.. రూ.350 కోట్ల రుణం ఇచ్చారు | మాల్యా, ఐడిబిఐ బ్యాంక్ మాజీ సిఎండిపై ఇడి నివేదిక న్యూఢిల్లీ : కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా కుట్రపూరితంగా వ్యవహరించి ఐడిబిఐ బ్యాంక్ నుంచి రెండు విడతలుగా 350 కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వెల్లడించింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నప్పటికీ ఐడిబిఐ బ్యాంక్ మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యోగేష్ అగర్వాల్‌తో విజయ్ మాల్యా భేటీ అయిన హాలీడే మీటింగ్ అనంతరం ఈ రుణం మంజూరైందని తెలిపింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఐడిబిఐ బ్యాంక్ మొత్తం 860.92 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసిన సంగతి తెలిసిందే. సంక్షోభంలో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు పక్కా ప్రణాళిక ప్రకారం ఈ రుణాలను మంజూరు చేసినట్లు విచారణలో తేలిందని ఇడి తెలిపింది. | business |
18,707 | 19-12-2017 04:03:37 | ఇక ఏటా రెండుసార్లు నీట్, జేఈఈ.. | లోక్‌సభలో ప్రభుత్వం ప్రకటన ఐదు బిల్లులను ప్రవేశపెట్టిన సర్కారున్యూఢిల్లీ, డిసెంబరు 18: విద్యార్థుల ప్రయోజనం కోసం నీట్, జేఈఈలను ఇక నుంచి ఏడాదిలో రెండుసార్లు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కుశవహ సోమవారం లోక్‌సభకు ఈ విషయం చెప్పారు. ఈ రెండు ప్రవేశ పరీక్షల నిర్వహణకు జాతీయ పరీక్షా సంస్థ(ఎన్‌టీఏ)ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలావుండగా రాష్ట్ర విశ్వవిద్యాలయాలను ఇక ఎంతమాత్రం సెంట్రల్ వర్సిటీలుగా మార్చరాదని నిర్ణయించినట్లు హెచ్చార్డీ శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ లోక్‌సభకు తెలిపారు. అయితే ఏపీ పునర్విభజన చట్టం కింద ఏపీలో ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఏపీ, తెలంగాణలలో చెరో గిరిజన వర్సిటీని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఇదిలావుండగా, ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ఐదు బిల్లులను ప్రవేశపెట్టింది. టీచర్ ట్రైనింగ్ కళాశాలలకు పాత తేదీలతో గుర్తింపునిచ్చే ఒక బిల్లు, గ్రాట్యుటీ చట్టం కింద గ్రాట్యుటీ చెల్లింపు సవరణ బిల్లు, భారతీయ అటవీ చట్టం సవరణ బిల్లు, డెంటిస్టుల సవరణ బిల్లు, ప్రజాప్రాతినిధ్య సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. | nation |
13,273 | 14-07-2017 02:14:52 | 14 ఏళ్ల తర్వాత చైనా మార్కెట్లోకి అమెరికా బీఫ్ | వాషింగ్టన్, జూలై 13: చైనాతో తన వాణిజ్య బేరసారాల కారణంగా 14 ఏళ్ల తర్వాత తొలిసారి అమెరికాకు చెందిన గొడ్డుమాంసం (బీఫ్) చైనా మార్కెట్లోకి ప్రవేశించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ వాణిజ్య ఒప్పందంతో వ్యవసాయానికి ఎంతో మేలంటూ బుధవారం ట్వీట్ చేశారు. వ్యవసాయ మంత్రి గత నెలలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారని, దీనివల్ల 250 కోట్ల బిలియన్ డాలర్ల చైనా మార్కెట్ అమెరికాకు దొరికిందన్నారు. | nation |
18,027 | 28-01-2017 03:17:49 | ఆ బడ్జెట్‌తో యూపీకి నష్టం |
లఖ్‌నవ్, జనవరి 27: కేంద్ర బడ్జెట్‌ని ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాతే ప్రవేశపెట్టాలని ప్రధాని మోదీని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ కోరారు. యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో వచ్చే నెల 4 నుంచి ఎన్నికల ప్రక్రి య మొదలవుతుండగా, వచ్చేనెల ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్‌ని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల ముందు సమర్పించే బడ్జెట్ కావడంతో జనాకర్షక పథకాలకు పెద్దపీట వేసే అవకాశం ఉన్నదని పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై స్పందించిన ఈసీ, అలాంటి స్కీంలేవీ బడ్జెట్‌లో లేకుండా చూడాలని కేంద్రానికి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అఖిలేశ్.. మోదీకి లేఖ రాశారు. | nation |
21,011 | 05-03-2017 01:03:01 | మోర్గాన్ సెంచరీ | తొలి వన్డేలో ఇంగ్లండ్ విజయం ఆంటిగ్వా: కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (107) సెంచరీతో విజృంభించడంతో వెస్టిండీస్‌తో తొలి వన్డేలో ఇంగ్లండ్ 45 పరుగులతో గెలిచి.. మూడు వన్డేల సిరీ స్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 296 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (55), బిల్లింగ్స్ (52) అర్ధ సెంచరీలతో మెరిశారు. అనంతరం క్రిస్ వోక్స్ (4/47), లిమ్ ప్లంకెట్ (4/40) దెబ్బకు.. ఆతిథ్య విండీస్ 47.2 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌటైంది. జాసన్ మహ్మద్ (72), జొనాథన్ కార్టర్ (52) హాఫ్ సెంచరీతో పోరాడినా ఓటమి తప్పలేదు. మోర్గాన్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. | sports |
14,825 | 27-09-2017 03:38:35 | ముగ్గురు దుర్గమ్మలు | ఐరాసలో పాక్‌ను దునుమాడిన అతివలుసుష్మ, ఈనామ్, పౌలోమీలకు జాతి జేజేలున్యూయార్క్, సెప్టెంబరు 26: ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ దేశాలన్నిటినీ ముగ్గురు భారతీయ మహిళలు తమ వాగ్ధాటితో విస్మయపరిచారు. ఉగ్రవాదులకు భూతల స్వర్గమైన పాకిస్థాన్‌ను అడుగడుగునా నిలదీసి.. దాని అబద్ధాలను, దుష్ప్రచారాన్ని ఐరాస సాక్షిగా ఎండగట్టి.. పాక్‌ను ‘టెర్రరిస్థాన్’గా నిరూపించడంలో కృతకృత్యులయ్యారు.వారే విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఐరాసలో భారత శాశ్వత రాయబార కార్యాలయం తొలి కార్యదర్శి ఈనామ్ గంభీర్, రాయబార కార్యాలయ కార్యదర్శి పౌలోమీ త్రిపాఠి. వీరు భారత మహిళాశక్తిని, మేధస్సును ప్రపంచ దేశాలకు చాటిచెబుతూ జేజేలు అందుకుంటున్నారు. సుష్మ 22న ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ.. ‘మన రెండు దేశాలకు ఒకేసారి స్వాతంత్య్రం లభించింది. కానీ భారత్ ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్‌లు, ఇతర విజ్ఞాన సంస్థలను ఏర్పాటు చేసింది. మీరు (పాక్) మాత్రం లష్కరే తాయిబా, జైషే మొహమ్మద్, హకానీ నెట్‌వర్క్ తదితర ఉగ్రవాద సంస్థలను తయారుచేశారు’ అని తూర్పారబట్టారు. జమ్మూకశ్మీరు భారత అంతర్భాగమని, దానిని చేజిక్కించుకోవాలనుకుంటున్న పాక్ కల ఒక్కనాటికీ నెరవేరదని తేల్చిచెప్పారు. అంతకుముందు రోజు (21న) పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీ ప్రసంగిస్తూ భారత్ తమ దేశంలో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఈనామ్ గంభీర్ మర్నాడు విరుచుకుపడ్డారు. పాకిస్థాన్‌కు ‘టెర్రరిస్థాన్’ అని నామకరణం చేసి సంచలనమే సృష్టించారు. ‘గ్లోబల్ టెర్రర్‌ను తయారుచేసి.. ఎగుమతి చేసే గొప్ప ఇండస్ట్రీతో టెర్రరిస్థాన్ అలరారుతోంది. అల్-ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్‌కు, తాలిబాన్ అధిపతి ముల్లా ఒమర్‌కు ఆశ్రయమిచ్చి.. ఉగ్రవాద బాధితురాలినని చెప్పుకోవడం విడ్డూరం’ అని ఎద్దేవా చేశారు. తర్వాతి వంతు పౌలోమీది. ఆదివారం ఐరాసలో పాక్ శాశ్వత రాయబారి మలీహా లోధీ మాట్లాడుతూ.. రక్తసిక్తంగా ఉన్న ఓ పాలస్తీనా మహిళ ఫొటోను చూపి.. భారత పెల్లెట్ గన్ కాల్పుల్లో గాయపడిన కశ్మీరీ యువతిగా పేర్కొన్నారు. దీనికి పౌలోమీ దీటుగా జవాబిచ్చారు. మలీహా ఐరాస సాక్షిగా పచ్చి అబద్ధం చెప్పారని, అది రెండేళ్ల క్రితం ప్రచురితమైన పాలస్తీనా మహిళ ఫొటో అని రుజువు చేశారు. అంతేకాదు.. పాక్ ప్రేరేపిత సీమాంత ఉగ్రవాదానికి బలై అమరుడైన కశ్మీరీ యువ సైనికాధికారి లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్ ఫొటోను ప్రదర్శించారు. | nation |
4,396 | 14-03-2017 03:28:52 | సమన్యాయ, స్ఫూర్తిదాయక బడ్జెట్ | 2017–18 ఆర్థిక సంవత్సర బడ్జెట్ మీద ముఖ్యమంత్రి ముద్ర సృష్టంగా కనిపిస్తుంది. పేదల సంక్షేమం పట్ల ఆపేక్షతో పాటు ఆదాయాన్ని పెంచే అవకాశాలు, ఉపాధి కల్పిస్తూ బంగారు తెలంగాణను సాధ్యమైనంత తొందరగా సాధించాలన్న ఆయన ఆకాంక్షను ఈ బడ్జెట్ ప్రతిబింబించింది. ఈ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తి కనిపిస్తుంది. తెలంగాణ ఏర్పాటైతే బాగుపడ్తాం అని భావించిన వారికి, ఇదిగో ఇలా బాగుపడుతున్నాం అని అడుగడుగునా ఈ బడ్జెట్ చూపింది. నిర్వహణ వ్యయం కింద రూ.61,607.20 కోట్లతో, ప్రగతి పద్దు కింద రూ. 88,038.80 కోట్లతో, మొత్తం రూ.1,49,646 కోట్ల వ్యయంతో 2017–2018 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను శాసనసభకు సమర్పించడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వరుసగా నాలుగవ సారి సమర్పించిన వార్షిక బడ్జెట్ ఏ విధంగా, ఏ కోణం లోంచి చూసినా, సందేశాత్మకంగా, స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. సమాజంలోని అన్నివర్గాల వారికి, అన్ని కులవృత్తుల వారికి, అన్ని మతాల వారికి, వివిధ రంగాలలో పనిచేస్తున్నవారికి, ప్రభుత్వంలో అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాల్సిన అన్ని శాఖలకు, అల్పాదాయ- మధ్యతరగతి ఆదాయ వర్గాల వారికి... వారూ, వీరూ అన్న తేడా లేకుండా, అందరికీ ‘సమన్యాయం అంటే ఇలా’ అన్న రీతిలో వుందీ బడ్జెట్. గత మూడు బడ్జెట్‌ల మాదిరిగానే, ఈ బడ్జెట్ కూడా పేదల సంక్షేమం పట్ల, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఉన్న నిబద్ధతను ప్రతిబింబించింది. ప్రజా జీవితంలో సుమారు నాలుగున్నర దశాబ్దాలుగా వివిధ స్థాయిలలో పనిచేసి, ప్రజల నాడి తెలుసుకున్న అనుభవంతో, అసలు-సిసలైన దార్శనికతతో, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కనుసన్నలలో, ఆయన ఆలోచనా సరళిని ప్రతిబింబించేదిగా వుందీ బడ్జెట్. సమాజంలో అనాదిగా అణగారిన దళిత, గిరిజన, మైనారిటీ, వెనుకబడిన వర్గాలను, ఎంబీసీలను ప్రత్యేకించి వుద్దేశించినదీ బడ్జెట్. దళిత, గిరిజన, వివిధ కుల వృత్తులలో వున్న ప్రజలు గతంలో ఏమనుకునేవారో కాని, ఈ బడ్జెట్ సమర్పణ తరువాత భవిష్యత్‌లో తృప్తిగా జీవనం గడపవచ్చుననే భరోసా కలిగిస్తుందీ బడ్జెట్. అణగారివున్న ఈ వర్గాల వారిని బాగుచేయాలనే చిత్తశుద్ధి, దానికి ఆచరణ సాధ్యమైన కార్యాచరణ కనిపిస్తుందీ బడ్జెట్‌లో. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి ఎలా చెందనున్నదో, స్థానిక వనరుల గుర్తింపు ఎలా జరగనుందో, యాదవులు, మత్స్యకారులు, చేనేత తదితర రంగాల కులవృత్తుల వారు, వారి-వారి రంగాల ద్వారా రాష్ట్రాన్ని గొప్ప ఆర్థిక వనరుగా ఎలా మార్చబోతున్నారో వివరిస్తుందీ బడ్జెట్. గ్రామీణ వృత్తుల బాగోగులు ఆలోచించి తద్వారా గ్రామీణ జీవన విధానంలో ఎలా మార్పు రాబోతుందో వివరిస్తుందీ బడ్జెట్. ఈ బడ్జెట్ మీద ముఖ్యమంత్రి ముద్ర సృష్టంగా కనిపిస్తుంది. పేదల సంక్షేమం పట్ల ఆపేక్షతో పాటు ఆదాయాన్ని పెంచే అవకాశాలు, ఉపాధి కల్పిస్తూ బంగారు తెలంగాణను సాధ్యమైనంత తొందరగా సాధించాలన్న ఆయన ఆకాంక్షను ఈ బడ్జెట్ ప్రతిబింబించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పదిలంగా ఉన్నంత వరకు తెలంగాణ పల్లెలు స్వయం పోషకత్వంతో సమృద్ధితో వుంటాయనే విషయం బడ్జెట్లో స్పష్టం చేయడం జరిగింది. సమైక్య పాలనలో తెలంగాణ జీవన పరిస్థితులు ఎలా విచ్ఛిన్నమయ్యాయి; వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం, కులవృత్తుల పట్ల అనాదరణ కారణంగా గ్రామీణ జీవితం ఎలా అల్లకల్లోలమయింది; వృత్తి నైపుణ్యం కలిగిన తెలంగాణ బిడ్డలు పొట్ట చేతపట్టుకుని పట్టణాలు, పరదేశాలు వెళ్ళి బతకాల్సిన దుస్థితిలోకి ఎలా నెట్టివేయబడ్డారు అనే విషయాలను వివరించి, వాళ్ల బతుకును నిలబెట్టే బడ్జెట్‌ను రూపొందించింది ప్రభుత్వం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారానే తెలంగాణ ఆర్థిక వృద్ధి ఎదుగుదల దిశగా పయనిస్తుందనే విశ్వాసం ఈ బడ్జెట్లో కనిపిస్తుంది. ఇందుకనుగుణంగా గ్రామీణ వృత్తులకు ఆర్థిక ప్రేరణనిచ్చే పథకాలను రూపొందించడం జరిగింది. అలాగే, తెలంగాణలో అపారమైన మానవ సంపద ఉన్నదనీ, కులవృత్తుల ఆధారంగా జీవనం గడుపుతూ అనువంశికంగా విశేషమైన వృత్తి నైపుణ్యం పొందిన సామాజిక వర్గాలుండడం తెలంగాణకు గొప్పవరం అనీ ఈ బడ్జెట్లో విశదమవుతుంది. గ్రామీణ జీవితం మీద అలుముకున్న విషాదాన్ని తొలగించి పల్లెల ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని సుందరతరంగా, సుసంపన్నంగా మార్చే విధానానికి తెలంగాణ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో నాంది పలికింది. 2017–18 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తి కనిపిస్తుంది. తెలంగాణ ఏర్పాటైతే బాగుపడ్తాం అని భావించిన వారికి, ఇదిగో ఇలా బాగుపడుతున్నాం అని అడుగడుగునా ఈ బడ్జెట్ చూపింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే, తెలంగాణ ప్రజలు అడుక్కు తింటారని అవాకులు- చవాకులు పేలిన అలనాటి ఆంధ్రా నాయకత్వం ఈ బడ్జెట్ చూస్తే, కేసీఆర్ నాయకత్వంలోని ఉద్యమ నాయకులు ఆనాడే అది తప్పని నొక్కి వక్కాణించిన వాదన నూటికి నూరు పాళ్లు సబబని నిరూపిస్తుందీ బడ్జెట్. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో, ఒక విధంగా చెప్పుకోవాలంటే, న్యాయంగా అంగీకరించాలంటే, పెద్ద అనిశ్చిత పరిస్థితి నెలకొని వుందనాలి. దేనికీ ప్రాతిపదిక లేదు. బడ్జెట్ ఎలా ప్రవేశపెట్టాలనే అవగాహన కూడా లేదు. అంచనాలతో తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టిందీ ప్రభుత్వం. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితి అర్థం కావాలంటే ఒక ఆర్థిక సంవత్సరం పూర్తిగా, అంటే, ఏప్రిల్ 1 నుంచి మరుసటి సంవత్సరం మార్చి 31 వరకు, రాష్ట్ర స్థితిగతులను అవగాహన చేసుకోవాలి. రాష్ట్రం పాజిటివ్ వృద్ధిలో ముందుకు సాగుతుందా, లేక, నెగెటివ్, అంటే లోటు బడ్జెట్‌లో కొనసాగుతుందా విశ్లేషణ జరగాలి. ఇది అవగాహన చేసుకోవడానికి ప్రభుత్వం ఓర్పుగా- నేర్పుగా సమీక్ష జరిపింది. ముఖ్యమంత్రి సుదీర్ఘంగా జరిపిన ఈ సమీక్షలలో, విశ్లేషణలలో, రాష్ట్రం 2015-–2016 ఆర్థిక సంవత్సరంలో కంటే, 2016–-2017 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు, భారతదేశంలో బహుశా, ఏ రాష్ట్రంలో లేనంతగా వున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో, అన్ని విషయాలను దృష్టిలో వుంచుకుని, పూర్తి పారదర్శకతతో, బడ్జెట్ ప్రతిపాదించేటప్పుడు పాటించాల్సిన అన్ని సాంప్రదాయాలకు అనుగుణంగా, కేంద్ర బడ్జెట్ కూడా దృష్టిలో వుంచుకుని రాష్ట్ర బడ్జెట్ సమర్పించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు, కేంద్ర విస్తృత విత్త విధానానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ రూపొందించబడిందనాలి. విస్తృత విత్త విధానానికి సంబంధించినంతవరకు రాష్ట్రాలన్నీ, కేంద్ర ఆలోచనా సరళికి అనుగుణంగానే వుండాలి కాని, విరుద్ధంగా వుండకూడదన్న భావన కనిపిస్తుందీ బడ్జెట్లో. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు, ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ కూడా, గతంలో వున్న ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులకు బదులుగా, కాపిటల్, రెవెన్యూ పద్దులుగా విభజించడం జరిగింది. అకౌంటింగ్‌లో కూడా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సూచనకు అనుగుణంగా కేంద్రం, రాష్ట్రాలు ఏకరూప విధానాన్ని అనుసరిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఏకరీతిన ఉండటం కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కొత్త పద్ధతిని చేపట్టింది. నిర్వహణ వ్యయానికి సంబంధించిన జీతభత్యాలు, పింఛన్లు, అప్పులు, ఉద్యోగుల కరవు భత్యం పెరుగుదల, కొత్తగా ఉద్యోగ నియామకాల ఖర్చు లాంటివి ఒక కేటగిరీ కిందకు తీసుకురావడం జరిగింది. మరో కేటగిరీ కింద వివిధ రకాల సంక్షేమ పథకాలను చేర్చింది ప్రభుత్వం. సంక్షేమ పథకాల్లో పెన్షన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, సన్న బియ్యం లాంటివి వున్నాయి. ఇక మూడోది క్యాపిటల్ వ్యయం. ఈ బడ్జెట్‌లో గమనించాల్సింది, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవలంబించిన అనేక పద్ధతుల్లో తీసుకొచ్చిన మార్పులు- చేర్పులు. ఆర్థిక శాఖ ప్రధాన భూమిక వహించే పద్ధతి కూడా మారి, సంబంధిత శాఖలు వాటి -వాటి పరిధిలో నిర్ణయాత్మక బాధ్యత వహించే తరహాలో వుందీ బడ్జెట్. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాలలో నిర్లక్ష్యానికి గురైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూ, అణగారిన ప్రజల ఆకాంక్షలను తీరుస్తూ, తెలంగాణ గత వైభవాన్ని పునరుద్ధరించే బృహత్ బాధ్యతను నెరవేర్చే దిశగా సాగిందీ బడ్జెట్. ప్రజలే కేంద్రంగా, ప్రజా సమస్యలే ఇతి వృత్తంగా పాలన సాగాలని మార్గనిర్దేశనం చేసిన ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగానే, అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు అందాలనే ఆరాటం అడుగడుగునా ఈ బడ్జెట్లో ప్రస్ఫుటమవుతుంది. బడ్జెట్ రూపకల్పనలో మార్పులు వచ్చిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో కూడా చోటుచేసుకున్న అనివార్య మార్పులకు అనుగుణంగానే, ఎస్సీ, ఎస్టీ కమిటీ సిఫారసుల మేరకు ఆయా వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం విధిగా నిధుల కేటాయింపులు ఉండే విధంగానే ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని బడ్జెట్లో చెప్పడం జరిగింది. ఇది ఒక గొప్ప పరిణామం. ఎస్సీ, ఎస్టీ సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికున్న పూర్తి నిబద్ధతకు ఇది అద్దం పడుతుంది. బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి పేర్కొన్న విషయాలలోనూ, బడ్జెట్ వివరాల్లోనూ, ప్రభుత్వ ఆశయాలు, ఆలోచనలు స్పష్టంగా ప్రతిబింబించాయి. పరిపాలనా విభాగాలు చిన్నవిగా వుంటే సామాన్యులకు ఎలా న్యాయం జరుగుతుందనే విషయాన్నీ, అధికార వికేంద్రీకరణ, పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం భారీ పాలనా సంస్కరణలు ఎందుకు తీసుకొచ్చింది అనే విషయం, తద్వారా, భౌగోళిక సామీప్యం, సాంస్కృతిక ఐక్యత, స్థానిక వనరుల సమర్థ వినియోగం జరిగి, సామాన్యుల ముంగిట్లోకి పాలన రావడాన్ని ప్రత్యేకంగా పేర్కొనడం విశేషం. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత; పాలి హౌజ్, మైక్రో ఇరిగేషన్ పథకాలకు సబ్సిడీలు; తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించడం లక్ష్యంగా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం; గొర్రెల పెంపకం; చేపల పెంపకం; చేనేత కార్మికుల సంక్షేమం; మహిళా శిశు సంక్షేమం; బ్రాహ్మణుల సంక్షేమం; రెండు పడక గదుల ఇండ్లు; విద్య; వైద్యం లాంటి పలు అంశాలను ప్రాధాన్యతల వారీగా పేర్కొనడం జరిగిందీ బడ్జెట్లో. మొత్తం మీద సందేశాత్మకం, స్ఫూర్తిదాయకం... రాష్ట్ర బడ్జెట్.వనం జ్వాలా నరసింహారావునిర్వహణ వ్యయం కింద రూ.61,607.20 కోట్లతో, ప్రగతి పద్దు కింద రూ. 88,038.80 కోట్లతో, మొత్తం రూ.1,49,646 కోట్ల వ్యయంతో 2017–2018 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను శాసనసభకు సమర్పించడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వరుసగా నాలుగవ సారి సమర్పించిన వార్షిక బడ్జెట్ ఏ విధంగా, ఏ కోణం లోంచి చూసినా, సందేశాత్మకంగా, స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. సమాజంలోని అన్నివర్గాల వారికి, అన్ని కులవృత్తుల వారికి, అన్ని మతాల వారికి, వివిధ రంగాలలో పనిచేస్తున్నవారికి, ప్రభుత్వంలో అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాల్సిన అన్ని శాఖలకు, అల్పాదాయ- మధ్యతరగతి ఆదాయ వర్గాల వారికి... వారూ, వీరూ అన్న తేడా లేకుండా, అందరికీ ‘సమన్యాయం అంటే ఇలా’ అన్న రీతిలో వుందీ బడ్జెట్. గత మూడు బడ్జెట్‌ల మాదిరిగానే, ఈ బడ్జెట్ కూడా పేదల సంక్షేమం పట్ల, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఉన్న నిబద్ధతను ప్రతిబింబించింది. ప్రజా జీవితంలో సుమారు నాలుగున్నర దశాబ్దాలుగా వివిధ స్థాయిలలో పనిచేసి, ప్రజల నాడి తెలుసుకున్న అనుభవంతో, అసలు-సిసలైన దార్శనికతతో, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కనుసన్నలలో, ఆయన ఆలోచనా సరళిని ప్రతిబింబించేదిగా వుందీ బడ్జెట్. సమాజంలో అనాదిగా అణగారిన దళిత, గిరిజన, మైనారిటీ, వెనుకబడిన వర్గాలను, ఎంబీసీలను ప్రత్యేకించి వుద్దేశించినదీ బడ్జెట్. దళిత, గిరిజన, వివిధ కుల వృత్తులలో వున్న ప్రజలు గతంలో ఏమనుకునేవారో కాని, ఈ బడ్జెట్ సమర్పణ తరువాత భవిష్యత్‌లో తృప్తిగా జీవనం గడపవచ్చుననే భరోసా కలిగిస్తుందీ బడ్జెట్. అణగారివున్న ఈ వర్గాల వారిని బాగుచేయాలనే చిత్తశుద్ధి, దానికి ఆచరణ సాధ్యమైన కార్యాచరణ కనిపిస్తుందీ బడ్జెట్‌లో. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి ఎలా చెందనున్నదో, స్థానిక వనరుల గుర్తింపు ఎలా జరగనుందో, యాదవులు, మత్స్యకారులు, చేనేత తదితర రంగాల కులవృత్తుల వారు, వారి-వారి రంగాల ద్వారా రాష్ట్రాన్ని గొప్ప ఆర్థిక వనరుగా ఎలా మార్చబోతున్నారో వివరిస్తుందీ బడ్జెట్. గ్రామీణ వృత్తుల బాగోగులు ఆలోచించి తద్వారా గ్రామీణ జీవన విధానంలో ఎలా మార్పు రాబోతుందో వివరిస్తుందీ బడ్జెట్. ఈ బడ్జెట్ మీద ముఖ్యమంత్రి ముద్ర సృష్టంగా కనిపిస్తుంది. పేదల సంక్షేమం పట్ల ఆపేక్షతో పాటు ఆదాయాన్ని పెంచే అవకాశాలు, ఉపాధి కల్పిస్తూ బంగారు తెలంగాణను సాధ్యమైనంత తొందరగా సాధించాలన్న ఆయన ఆకాంక్షను ఈ బడ్జెట్ ప్రతిబింబించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పదిలంగా ఉన్నంత వరకు తెలంగాణ పల్లెలు స్వయం పోషకత్వంతో సమృద్ధితో వుంటాయనే విషయం బడ్జెట్లో స్పష్టం చేయడం జరిగింది. సమైక్య పాలనలో తెలంగాణ జీవన పరిస్థితులు ఎలా విచ్ఛిన్నమయ్యాయి; వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం, కులవృత్తుల పట్ల అనాదరణ కారణంగా గ్రామీణ జీవితం ఎలా అల్లకల్లోలమయింది; వృత్తి నైపుణ్యం కలిగిన తెలంగాణ బిడ్డలు పొట్ట చేతపట్టుకుని పట్టణాలు, పరదేశాలు వెళ్ళి బతకాల్సిన దుస్థితిలోకి ఎలా నెట్టివేయబడ్డారు అనే విషయాలను వివరించి, వాళ్ల బతుకును నిలబెట్టే బడ్జెట్‌ను రూపొందించింది ప్రభుత్వం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారానే తెలంగాణ ఆర్థిక వృద్ధి ఎదుగుదల దిశగా పయనిస్తుందనే విశ్వాసం ఈ బడ్జెట్లో కనిపిస్తుంది. ఇందుకనుగుణంగా గ్రామీణ వృత్తులకు ఆర్థిక ప్రేరణనిచ్చే పథకాలను రూపొందించడం జరిగింది. అలాగే, తెలంగాణలో అపారమైన మానవ సంపద ఉన్నదనీ, కులవృత్తుల ఆధారంగా జీవనం గడుపుతూ అనువంశికంగా విశేషమైన వృత్తి నైపుణ్యం పొందిన సామాజిక వర్గాలుండడం తెలంగాణకు గొప్పవరం అనీ ఈ బడ్జెట్లో విశదమవుతుంది. గ్రామీణ జీవితం మీద అలుముకున్న విషాదాన్ని తొలగించి పల్లెల ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని సుందరతరంగా, సుసంపన్నంగా మార్చే విధానానికి తెలంగాణ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో నాంది పలికింది. 2017–18 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తి కనిపిస్తుంది. తెలంగాణ ఏర్పాటైతే బాగుపడ్తాం అని భావించిన వారికి, ఇదిగో ఇలా బాగుపడుతున్నాం అని అడుగడుగునా ఈ బడ్జెట్ చూపింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే, తెలంగాణ ప్రజలు అడుక్కు తింటారని అవాకులు- చవాకులు పేలిన అలనాటి ఆంధ్రా నాయకత్వం ఈ బడ్జెట్ చూస్తే, కేసీఆర్ నాయకత్వంలోని ఉద్యమ నాయకులు ఆనాడే అది తప్పని నొక్కి వక్కాణించిన వాదన నూటికి నూరు పాళ్లు సబబని నిరూపిస్తుందీ బడ్జెట్. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో, ఒక విధంగా చెప్పుకోవాలంటే, న్యాయంగా అంగీకరించాలంటే, పెద్ద అనిశ్చిత పరిస్థితి నెలకొని వుందనాలి. దేనికీ ప్రాతిపదిక లేదు. బడ్జెట్ ఎలా ప్రవేశపెట్టాలనే అవగాహన కూడా లేదు. అంచనాలతో తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టిందీ ప్రభుత్వం. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితి అర్థం కావాలంటే ఒక ఆర్థిక సంవత్సరం పూర్తిగా, అంటే, ఏప్రిల్ 1 నుంచి మరుసటి సంవత్సరం మార్చి 31 వరకు, రాష్ట్ర స్థితిగతులను అవగాహన చేసుకోవాలి. రాష్ట్రం పాజిటివ్ వృద్ధిలో ముందుకు సాగుతుందా, లేక, నెగెటివ్, అంటే లోటు బడ్జెట్‌లో కొనసాగుతుందా విశ్లేషణ జరగాలి. ఇది అవగాహన చేసుకోవడానికి ప్రభుత్వం ఓర్పుగా- నేర్పుగా సమీక్ష జరిపింది. ముఖ్యమంత్రి సుదీర్ఘంగా జరిపిన ఈ సమీక్షలలో, విశ్లేషణలలో, రాష్ట్రం 2015-–2016 ఆర్థిక సంవత్సరంలో కంటే, 2016–-2017 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు, భారతదేశంలో బహుశా, ఏ రాష్ట్రంలో లేనంతగా వున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో, అన్ని విషయాలను దృష్టిలో వుంచుకుని, పూర్తి పారదర్శకతతో, బడ్జెట్ ప్రతిపాదించేటప్పుడు పాటించాల్సిన అన్ని సాంప్రదాయాలకు అనుగుణంగా, కేంద్ర బడ్జెట్ కూడా దృష్టిలో వుంచుకుని రాష్ట్ర బడ్జెట్ సమర్పించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు, కేంద్ర విస్తృత విత్త విధానానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ రూపొందించబడిందనాలి. విస్తృత విత్త విధానానికి సంబంధించినంతవరకు రాష్ట్రాలన్నీ, కేంద్ర ఆలోచనా సరళికి అనుగుణంగానే వుండాలి కాని, విరుద్ధంగా వుండకూడదన్న భావన కనిపిస్తుందీ బడ్జెట్లో. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు, ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ కూడా, గతంలో వున్న ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులకు బదులుగా, కాపిటల్, రెవెన్యూ పద్దులుగా విభజించడం జరిగింది. అకౌంటింగ్‌లో కూడా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సూచనకు అనుగుణంగా కేంద్రం, రాష్ట్రాలు ఏకరూప విధానాన్ని అనుసరిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఏకరీతిన ఉండటం కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కొత్త పద్ధతిని చేపట్టింది. నిర్వహణ వ్యయానికి సంబంధించిన జీతభత్యాలు, పింఛన్లు, అప్పులు, ఉద్యోగుల కరవు భత్యం పెరుగుదల, కొత్తగా ఉద్యోగ నియామకాల ఖర్చు లాంటివి ఒక కేటగిరీ కిందకు తీసుకురావడం జరిగింది. మరో కేటగిరీ కింద వివిధ రకాల సంక్షేమ పథకాలను చేర్చింది ప్రభుత్వం. సంక్షేమ పథకాల్లో పెన్షన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, సన్న బియ్యం లాంటివి వున్నాయి. ఇక మూడోది క్యాపిటల్ వ్యయం. ఈ బడ్జెట్‌లో గమనించాల్సింది, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవలంబించిన అనేక పద్ధతుల్లో తీసుకొచ్చిన మార్పులు- చేర్పులు. ఆర్థిక శాఖ ప్రధాన భూమిక వహించే పద్ధతి కూడా మారి, సంబంధిత శాఖలు వాటి -వాటి పరిధిలో నిర్ణయాత్మక బాధ్యత వహించే తరహాలో వుందీ బడ్జెట్. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాలలో నిర్లక్ష్యానికి గురైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూ, అణగారిన ప్రజల ఆకాంక్షలను తీరుస్తూ, తెలంగాణ గత వైభవాన్ని పునరుద్ధరించే బృహత్ బాధ్యతను నెరవేర్చే దిశగా సాగిందీ బడ్జెట్. ప్రజలే కేంద్రంగా, ప్రజా సమస్యలే ఇతి వృత్తంగా పాలన సాగాలని మార్గనిర్దేశనం చేసిన ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగానే, అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు అందాలనే ఆరాటం అడుగడుగునా ఈ బడ్జెట్లో ప్రస్ఫుటమవుతుంది. బడ్జెట్ రూపకల్పనలో మార్పులు వచ్చిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో కూడా చోటుచేసుకున్న అనివార్య మార్పులకు అనుగుణంగానే, ఎస్సీ, ఎస్టీ కమిటీ సిఫారసుల మేరకు ఆయా వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం విధిగా నిధుల కేటాయింపులు ఉండే విధంగానే ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని బడ్జెట్లో చెప్పడం జరిగింది. ఇది ఒక గొప్ప పరిణామం. ఎస్సీ, ఎస్టీ సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికున్న పూర్తి నిబద్ధతకు ఇది అద్దం పడుతుంది. బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి పేర్కొన్న విషయాలలోనూ, బడ్జెట్ వివరాల్లోనూ, ప్రభుత్వ ఆశయాలు, ఆలోచనలు స్పష్టంగా ప్రతిబింబించాయి. పరిపాలనా విభాగాలు చిన్నవిగా వుంటే సామాన్యులకు ఎలా న్యాయం జరుగుతుందనే విషయాన్నీ, అధికార వికేంద్రీకరణ, పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం భారీ పాలనా సంస్కరణలు ఎందుకు తీసుకొచ్చింది అనే విషయం, తద్వారా, భౌగోళిక సామీప్యం, సాంస్కృతిక ఐక్యత, స్థానిక వనరుల సమర్థ వినియోగం జరిగి, సామాన్యుల ముంగిట్లోకి పాలన రావడాన్ని ప్రత్యేకంగా పేర్కొనడం విశేషం. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత; పాలి హౌజ్, మైక్రో ఇరిగేషన్ పథకాలకు సబ్సిడీలు; తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించడం లక్ష్యంగా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం; గొర్రెల పెంపకం; చేపల పెంపకం; చేనేత కార్మికుల సంక్షేమం; మహిళా శిశు సంక్షేమం; బ్రాహ్మణుల సంక్షేమం; రెండు పడక గదుల ఇండ్లు; విద్య; వైద్యం లాంటి పలు అంశాలను ప్రాధాన్యతల వారీగా పేర్కొనడం జరిగిందీ బడ్జెట్లో. మొత్తం మీద సందేశాత్మకం, స్ఫూర్తిదాయకం... రాష్ట్ర బడ్జెట్.వనం జ్వాలా నరసింహారావు | editorial |
5,981 | 02-02-2017 17:20:24 | త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరు, పవన్‌ల మల్టీస్టారర్: టీఎస్ఆర్ | మెగా అభిమానులకు చెవికింపైన వార్త ఇది. చిరంజీవికి, పవన్ కల్యాణ్‌కు చెడిందని, అన్నయ్య నుంచి తమ్ముడు విడిపోయాడని ఎన్నెన్నో మాటలు. చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమా విడుదలకు ముందు చేసిన ప్రి రిలీజ్ ఫంక్షన్‌కు పవన్ హాజరు కాలేదు. దీంతో వారి మధ్య చెడిందనే వార్తలు మరింత గుప్పుమన్నాయి. ఇక, ఆ ఫంక్షన్‌లో పవన్ నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. అయితే.. అవన్నీ ఎలా ఉన్నా.. ఇప్పుడు ఇద్దరు కలవబోతున్నారు. అన్నయ్య, తమ్ముడు కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఇద్దరితో ఓ మల్టీస్టారర్‌ను తీస్తున్నట్టు కళాబంధు టీ సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. ఇంతకీ ఆ సినిమాకు డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంకెవరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అవును వారిద్దరి భావోద్వేగాలకు తగినట్టుగా త్రివిక్రమ్ కథ సిద్ధం చేశాడని, ఆ కథతోనే సినిమాను తీస్తామని టీఎస్ఆర్ ప్రకటించారు. ‘‘గతంలో మెగాస్టార్ చిరంజీవితో 'స్టేట్ రౌడీ' వంటి ఘనవిజయం సాధించిన చిత్రాన్ని నిర్మించాను. అప్పట్లో ఆ చిత్రం నైజామ్ ప్రాంతం లో సరికొత్త రికార్డ్ సృష్టించింది . అలాగే శోభన్ బాబు, రజనీకాంత్ లతో 'జీవనపోరాటం', యువరత్న బాలకృష్ణ తో 'వంశోద్ధారకుడు', విక్టరీ వెంకటేష్ , అర్జున్, నరేష్ లతో 'త్రిమూర్తులు', 'సూర్య ఐ.పి.ఎస్.' మరియు సంస్కృతంలో 'భగవద్గీత' వంటి తదితర చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాంబినేషన్లో సినిమా నిర్మిస్తున్నాను. అరుదైన ఈ కాంబినేషన్ ఇది . మెగా బ్రదర్స్ ఇద్దరిని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కరే డైరెక్ట్ చేయగలరనేది నా నమ్మకం. త్రివిక్రమ్ ని ఈరోజు కూడా కలిసి చర్చించాను. ఆయన కూడా తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. గ్రేట్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ తో కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాను. త్వరలోనే ఈ చిత్రం గురించిన మరిన్ని విశేషాలను మీడియాతో పంచుకుంటాను’’ అని టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. టీఎస్ఆర్ ఈ మెగా మల్టీస్టారర్‌ను కన్ఫర్మ్ చేసినా.. ఇటు మెగా కాంపౌండ్ నుంచి కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి గానీ ఎలాంటి సమాచారమూ లేదు. ఇక, అన్నదమ్ముల మల్టీస్టారర్ అనగానే మెగా అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు. ఎంతైనా అన్నదమ్ములు కలిసి సినిమా చేస్తున్నారంటే.. ఆ క్రేజే వేరప్పా. అటు అభిమానులకి, ఇటు మెగా కాంపౌండ్‌కు కావాల్సిందేముంటుంది ఇంతకన్నా. | entertainment |
20,844 | 14-05-2017 03:07:14 | రైజర్స్ దర్జాగా... | ప్లే ఆఫ్‌కు చేరిన హైదరాబాద్‌లయన్సపై అలవోక విజయం డిఫెండింగ్ చాంప్ సనరైజర్స్ చెలరేగింది..! చావోరేవో తేల్చుకోవాల్సిన లీగ్ ఆఖరాటలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. గుజరాత లయన్సపై విజయ గర్జనతో దర్జాగా ప్లే ఆఫ్‌కు చేరుకుంది..! ఇషాన కిషన, డ్వేన స్మిత ధనాధన బ్యాటింగ్‌తో సగం ఓవర్లకు 105/0తో నిలిచిన లయన్సను రైజర్స్ బౌలర్లు సిరాజ్, రషీద్ తక్కువ స్కోరుకే కట్టడి చేసేయగా.. వార్నర్, విజయ్ శంకర్ జోర్‌దార్ ఆటతో లక్ష్యాన్ని ఇట్టే కరిగించేశారు..! దాంతో.. 14 మ్యాచల్లో 17 పాయింట్లతో మరే గణాంకాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ బెర్తు దక్కించుకుంది..! కాగా.. రెండేళ్ల ఐపీఎల్ ప్రస్థానాన్ని విజయంతో ముగించాలనుకున్న గుజరాతకు నిరాశే మిగిలింది..! 8 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఆ జట్టు ఐపీఎల్‌కు టాటా చెప్పింది..! కాన్పూర్: హైదరాబాద్ యువ సంచలనం మహ్మద్ సిరాజ్ (4/32), అఫ్ఘాన స్పిన మాంత్రికుడు రషీద్ ఖాన (3/34) అద్భుత బౌలింగ్‌కు కెప్టెన డేవిడ్ వార్నర్ (52 బంతుల్లో 9 ఫోర్లతో 69 నాటౌట్), విజయ్ శంకర్ (44 బంతుల్లో 9 ఫోర్లతో 63 నాటౌట్) సొగసైన బ్యాటింగ్ తోడవడంతో సన రైజర్స్ హైదరాబాద్ ఆఖరి లీగ్‌లో అలవోక విజయంతో ప్లే ఆఫ్ బెర్తు దక్కించుకుంది. శనివారం జరిగిన మ్యాచలో రైజర్స్ 8 వికెట్ల తేడాతో గుజరాతను మట్టికరిపించింది. వార్నర్, విజయ్ మూడో వికెట్‌కు అజేయంగా 133 రన్స జోడించడంతో లయన్స నిర్దేశించిన 155 పరుగుల టార్గెట్‌ను రైజర్స్ రెండు వికెట్లు కోల్పోయి మరో 11 బంతులు మిగిలుండగానే ఛేదించింది. మొదట గుజరాత 19.2 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. ఇషాన కిషన (40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 61), డ్వేన స్మిత (33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 54) మెరుపు అర్ధ శతకాలతో తొలి వికెట్‌కు 111 పరుగులు జోడించారు. కానీ.. లయన్స 49 పరుగుల తేడాతో మిగిలిన వికెట్లు కోల్పోయింది. భువనేశ్వర్ రెండు, సిద్దార్థ్ కౌల్ ఒక వికెట్ తీశారు. సిరాజ్‌కే ‘మ్యాన ఆఫ్ ద మ్యాచ’ దక్కింది. వార్నర్, విజయ్ అలవోకగా: ఛేదనను రైజర్స్ ధాటిగానే ఆరంభించింది. తొలి ఓవర్లో బౌండ్రీతో ఖాతా తెరిచిన ధవన (18) రెండో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో చెలరేగాడు. కానీ, మూడో ఓవర్లో ధవనతో పాటు హెన్రిక్స్ (4)ను అవుట్ చేసిన ప్రవీణ్ కుమార్ పర్యాటక జట్టుకు షాకిచ్చాడు. అయితే కెప్టెన వార్నర్, యువ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆరు పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద కీపర్ కార్తీక్ క్యాచ వదిలేయడంతో శంకర్ లైఫ్ దక్కించుకున్నాడు. ఇక, జట్టు స్కోరు 73/2 వద్ద అంకిత సోని బౌలింగ్‌లో వార్నర్ కీపర్‌కు క్యాచ ఇచ్చినా.. అంపైర్ అవుటివ్వకపోవడంతో అతను బతికిపోయాడు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న ఇద్దరూ క్లాసీ షాట్లతో అలరించారు. క్రమం తప్పకుండా ఫోర్లు కొట్టడంతో లక్ష్యం కరిగిపోతూ వచ్చింది. ఈ క్రమంలో వార్నర్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు శంకర్ కూడా 35 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ఐపీఎల్‌లో అతనికిదే తొలి ఫిఫ్టీ. సాంగ్వాన వేసిన 18వ ఓవర్లో విజయ్ రెండు ఫోర్లతో స్కోర్లు సమం చేయగా.. వార్నర్ మరో బౌండ్రీతో మ్యాచను ముగించేశాడు. ఇషాన, డ్వేన దంచేసినా..: తొలుత గుజరాతకు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు డ్వేనస్మిత, ఇషాన తొలి ఓవర్ నుంచే ఎడాపెడా బౌండ్రీలు కొడుతూ స్కోరును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా ఇషాన బౌండ్రీలే లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడు. భువీ వేసిన మొదటి ఓవర్లో డ్వేన, ఇషాన చెరో ఫోర్ సాధించారు. సిరాజ్ బౌలింగ్‌లో సిక్సర్ రాబట్టిన కిషన... తర్వాత కౌల్‌కు సిక్సర్, బౌండ్రీతో స్వాగతం పలికాడు. సిరాజ్ వేసిన ఐదో ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. క్రీజులో కుదురుకున్న తర్వాత స్విత.. కూడా నబీ బౌలింగ్‌లో 6, 4తో ఊపులోకొచ్చాడు. దాంతో పవర్‌ప్లేలోనే గుజరాత 61/0తో నిలిచింది. రషీద్ బౌలింగ్‌లో మరో సిక్సర్ రాబట్టిన ఇషాన 27 బంతుల్లో ఐపీఎల్‌లో తొలి అర్ధ శతకం పూర్తి చేసుకన్నాడు. అదే ఓవర్లో 6, 4 బాదిన స్మిత.. హెన్రిక్స్ బౌలింగ్‌లో రెండు ఫోర్లతో విజృంభించాడు. దాంతో సగం ఓవర్లకు 105/0తో నిలిచిన లయన్స స్కోరు సులభంగా 200 దాటేలా కనిపించింది. ఈ దశలో పర్యాటక బౌలర్లు ఒక్క సారిగా రెచ్చిపోయారు. తర్వాతి ఓవర్లోనే స్మితను ఎల్బీ చేసిన రషీద్ రైజర్స్‌కు బ్రేక్ ఇవ్వగా.. 13వ ఓవర్లో మూడు బంతుల తేడాతో కిషన, రైనా (2)ను అవుట్ చేసిన సిరాజ్ ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. అక్కడి నుంచి లయన్స ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. మరుసటి ఓవర్లో దినేశ కార్తీక్ (0), ఆరోన ఫించ (2)ను రషీద్ వెనక్కి పంపాడు. ఒక ఎండ్‌లో జడేజా (20 నాటౌట్) పోరాడుతున్నా ఫాల్క్‌నర్ (8), ప్రదీప్ సాంగ్వాన (0) సిరాజ్‌కు చిక్కారు. అంకిత సోని (0)ని సిద్దార్థ్ కౌల్, ప్రవీణ్ కుమార్ (1), మునాఫ్ పటేల్ (0)లను భువీ పని పట్టడంతో మరో నాలుగు బంతులు మిగిలుండగానే గుజరాత ఇన్నింగ్స్ ముగిసింది. గుజరాత్: డ్వేన స్మిత (ఎల్బీ) రషీద్ 54, ఇషాన (సి) నమన (బి) సిరాజ్ 61, రైనా (సి) ధవన (బి) సిరాజ్ 2, దినేశ కార్తీక్ (సి) హుడా (బి) రషీద్ 0, ఫించ (బి) రషీద్ 2, జడేజా (నాటౌట్) 20, ఫాల్క్‌నర్ (బి) సిరాజ్ 8, సాంగ్వాన (బి) సిరాజ్ 0, అంకిత (బి) కౌల్ 0, ప్రవీణ్ (బి) భువనేశ్వర్ 1, మునాఫ్ (బి) భువనేశ్వర్ 0; ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 19.2 ఓవర్లలో 154 ఆలౌట్; వికెట్ల పతనం: 1-111, 2-120, 3-120, 4-120, 5-123, 6-142, 7-142, 8-153, 9-154; బౌలింగ్: భువనేశ్వర్ 3.2-0-25-2, సిరాజ్ 4-0-32-4, సిద్దార్ధ్ కౌల్ 4-0-30-1, నబీ 3-0-17-0, రషీద్ 4-0-34-3, హెన్రిక్స్ 1-0-12-0. హైదరాబాద్: వార్నర్ (నాటౌట్) 69, ధవన (సి) ఫాల్క్‌నర్ (బి) ప్రవీణ్ 18, హెన్రిక్స్ (సి) దినేశ (బి) ప్రవీణ్ 4, విజయ్ శంకర్ (నాటౌట్) 63; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 18.1 ఓవర్లలో 158/2; వికెట్ల పతనం: 1-20, 2-25; బౌలింగ్: ప్రవీణ్ కుమార్ 4-0-22-2, సాంగ్వాన 4-0-37-0, ఫాల్క్‌నర్ 2-0-24-0, మునాఫ్ 3-0-22-0, జడేజా 3-0-19-0, అంకిత 2.1-0-31-0. | sports |
16,834 | 12-01-2017 10:52:17 | ప్రధాని మోదీ ముస్లిమ్ లకు వ్యతిరేకం కాదు... | ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సంచలన వ్యాఖ్యలున్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముస్లిమ్ లకు వ్యతిరేకం కాదని ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నరు నజీబ్ జంగ్ చెప్పారు. మైనారిటీల పట్ల మోదీ పక్షపాతం చూపిస్తారని కొందరు రాజకీయ వ్యతిరేకులు ఆరోపణలు చేస్తుంటారని ఆయన పేర్కొన్నారు. ఇటీవల లెఫ్టినెంట్ గవర్నరు పదవికి రాజీనామా చేసిన నజీబ్ జంగ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ప్రధాని మోదీతో సుధీర్ఘంగా చర్చించానని ముస్లిములతో సంబంధాలపై మోదీ ఎలాంటి వివక్ష చూపించలేదని నజీబ్ వివరించారు. 20 శాతం మంది ముస్లిములున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నజీబ్ జంగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ట్రిపుల్ తలాఖ్ విషయంలో ముస్లిమ్ లు ఆలోచించి ఈ విడాకుల పద్ధతికి స్వస్థి పలకాలని నజీబ్ సూచించారు. సివిల్ కోడ్ విషయంలో ముస్లిమ్ నేతలందరూ కూర్చొని చర్చించుకొని నిర్ణయం తీసుకోవాలని నజీబ్ జంగ్ సూచించారు. | nation |
7,189 | 06-02-2017 10:53:37 | పవన్‌కు చిరు ఫోన్? | సాధారణంగా ఇద్దరు అన్నదమ్ములు ఫోన్‌లో మాట్లాడుకుంటే పెద్ద వార్త కాదు. కానీ, మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్ మాట్లాడుకుంటే మాత్రం వారి అభిమానులకు అది పెద్ద వార్తే. మెగాస్టార్ చిరంజీవి తాజాగా పవన్‌కల్యాణ్‌కు ఫోన్ చేసి అభినందించాడట. | entertainment |
16,178 | 21-04-2017 10:04:02 | పాకిస్తాన్‌లో దారుణం: సొంత అన్నను కాల్చిచంపిన అక్కాచెల్లెళ్లు | ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు తమ సొంత అన్నను దారుణంగా కాల్చిచంపారు. పదేళ్ల క్రితం దైవదూషణకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సియాల్‌కోట్ జిల్లాలోని పర్సూర్ నగరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ ముస్లిం మతపెద్ద కుమారుడైన ఫజల్ అబ్బాస్ (45) 2004లో దైవదూషణకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై పాకిస్తాన్‌లో కఠినంగా అమలు చేసే దైవదూషణ చట్టం కింద అబ్బాస్‌పై కేసుకూడా నమోదైనట్టు సమాచారం. దీంతో అప్పట్లో దేశం నుంచి పారిపోయిన అతడు ఇటీవలే స్వదేశానికి తిరిగివచ్చాడు. ఇది తెలుసుకున్న అతడి ముగ్గురు చెల్లెళ్లు... ఇంట్లోకి ప్రవేశించి తమ తండ్రిని అబ్బాస్ గురించి అడిగారు. ఇంతలో బయటికి వచ్చిన ఫజల్ అబ్బాస్‌పై కాల్పులు జరపడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న వారు... తమ అన్న దైవదూషణకు పాల్పడినప్పడే చంపేద్దామనుకున్నామనీ, అయితే అప్పట్లో చిన్నవాళ్లం కావడంతో వదిలేశామని పోలీసులకు చెప్పినట్టు సమాచారం. కాగా దైవదూషణకు పాల్పడ్డాడంటూ మర్దాన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో మషల్ ఖాన్ అనే ఓ విద్యార్థిని కొందరు దుండగులు కొట్టిచంపిన కొద్దిరోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం. ఆ నెల 13న జరిగిన మషల్‌ఖాన్ హత్యపై ప్రస్తుతం పాకిస్తాన్ అట్టుడుకుతోంది. | nation |
2,386 | 30-08-2017 01:48:03 | ఎంఆర్‌ఎఫ్ నుంచి ప్రీమియం శ్రేణి టైర్లు | హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఎంఆర్‌ఎఫ్ లిమిటెడ్.. ఫెర్‌ఫింజా పేరుతో లగ్జరీ, ప్రీమియం శ్రేణి కార్ల టైర్లను విడుదల చేసింది. లగ్జరీ, ప్రీమియం వాహన సెగ్మెంట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఉత్పత్తులను తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది. ప్రముఖ క్రికెటర్, ఎంఆర్‌ఎఫ్ టైర్స్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ ఎబి డి విల్లిర్స్ ఈ టైర్లను మార్కెట్లోకి విడుదల చేశారు. ఫెర్‌ఫింజా శ్రేణి టైర్లకు అంతర్జాతీయ లగ్జరీ కార్ల తయారీదారుల నుంచి అమోదం కూడా లభించిందని పేర్కొంది. తొలుత దేశీయ మార్కెట్లో ఈ టైర్లను విక్రయించనున్నట్లు ఎంఆర్‌ఎఫ్ తెలిపింది. ఈ తరహా టైర్లను తీసుకురావటం తమలాంటి కంపెనీలకు ఎంతో కీలకమైనదని, అంతేకాకుండా ప్రతి ఉత్పత్తి శ్రేణిలోనూ ఉండాలని కోరుకుంటున్నట్లు ఎంఆర్‌ఎఫ్ చైర్మన్ కెఎం మమ్మెన్ తెలిపారు. ఈ లగ్జరీ టైర్ల కోసం ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. | business |
6,534 | 11-01-2017 11:18:02 | బెంగళూరులో శాతకర్ణి సందడి | అన్ని ప్రముఖ కూడళ్లలో బాలయ్య వాల్‌పోస్టర్లు, హోర్డింగ్‌లు బెంగళూరు: నందమూరి బాలకృష్ణ నటించిన వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కోసం బెంగళూరులోని ఆయన అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే నగరంలో అనేక ప్రాంతాలలో పెద్ద పెద్ద వాల్‌పోస్టర్లు, హోర్డింగ్‌లు వెలిశాయి. ఎనబికె, ఎనటిఆర్ ఫ్యాన్స అసోసియేషన్లు ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ నగరంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి. పలు దేవస్థానాలలో పూజలు నిర్వహించారు. కాగా ప్రత్యేక అన్నదానం నిర్వహించి పలువురిని శాలువాలతో సన్మానించారు. ఈ విషయాన్ని అభిమాన సంఘానికి చెందిన సురేశ బొర్రా మంగళవారం మీడియాకు వెల్లడించారు. హలసూరులోని మర్ఫీరోడ్డు సి.కాలనీలో ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద కటౌట్‌లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఇందులో నటసార్వభౌమ | entertainment |
11,489 | 06-05-2017 10:45:13 | సరిహద్దు దాటిన మరో పాక్ పిల్లాడు... నియంత్రణ రేఖ వద్ద హైడ్రామా... | జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద 12 ఏళ్ల ఓ పాకిస్తాన్ బాలుడు సరిహద్దు దాటుకుని భారత్‌లో ప్రవేశించాడు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి రాజౌలీ జిల్లాలోకి ప్రవేశించిన అతడిని అదుపులోకి తీసుకున్నట్టు శనివారం ఉదయం భారత సైన్యం ప్రకటించింది. 15 ఏళ్ల బాలుడు కూడా ఇటీవల ఇలాగే సరిహద్దు దాటివచ్చాడు. భారత సైన్యం అతడిని విచారించిన తర్వాత పాకిస్తాన్ రేంజర్లకు తిరిగి అప్పగించింది. ఈ ఘటన జరిగి ఐదురోజులుకూడా కాకముందే మరో పిల్లాడు భారత భూభాగంలోకి రావడంపై సైన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది. సరిహద్దు వద్ద భారత ఆర్మీ గస్తీని పరిశీలించడానికి... చొరబాట్లకు పాల్పడే దారులను కనిపెట్టి ఉగ్రవాదులకు సహకారం అందించడానికే చిన్నపిల్లలను పాక్ ఆర్మీ ప్రయోగిస్తున్నట్టు సైనికాధికారులు భావిస్తున్నారు. పట్టుబడిన బాలుడు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని దుంగర్ పెట్ గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. అతడి పేరు అష్ఫాక్ అలీ చౌహాన్ అనీ... బాలుడి తండ్రి బలూచిస్తాన్ రెజిమెంట్లో పాక్ సైనికుడిగా పనిచేశారని తేలింది. తదుపరి విచారణ కోసం అష్ఫాక్‌ను పోలీసులకు అప్పగించనున్నట్టు సైన్యం వెల్లడించింది. | nation |
9,649 | 01-09-2017 18:48:46 | పవన్‌కళ్యాణ్ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల | త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై పవర్స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. పవన్- త్రివిక్రమ్ సక్సెస్‌ఫుల్ కాంబో కావడం, ఇద్దరికీ పెద్దఎత్తున అభిమానాలోకం ఉండటంతో సినిమా ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్నారు. పైగా పవన్‌కళ్యాణ్‌కి ఇది 25వ సినిమా కావడంతో సినిమాపై లెక్కల్లో చూపలేనన్ని అంచనాలు నెలకొన్నాయి. కాగా రేపు (సెప్టెంబర్ 2) పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఈరోజు ఈసినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ని బయటకు వదిలారు. 'పీఎస్ పీకె#25' టాగ్‌తో ఉన్న ఈపోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటూ సోషల్‌మీడియాలో తెగచక్కర్లు కొడుతోంది. పోస్టర్‌లో పవన్ దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. అదే పోస్టర్‌లో పవన్ కోపంతో ఎటో నడిచివెళ్తున్నట్లుగా కూడా చూపించారు. దీంతో పవన్ డిఫరెంట్ లుక్ ఈసినిమాలో చూడబోతున్నాం అంటున్నారు పవన్ అభిమానులు. పవన్‌కు జంటగా కీర్తి సురేష్, అనూ ఇమ్మానుయేల్ నటిస్తున్న ఈచిత్రానికి ఇంకా టైటిల్ ఫైనల్ చేయలేదు. | entertainment |
7,912 | 18-10-2017 22:18:34 | ఇతరుల జీవితాల్లో వెలుగు నింపుదాం: రకుల్‌ప్రీత్ |
పండగల్లో దీపావళి ప్రత్యేకతే వేరు. చీకటి లాంటి చెడుపై మంచి లాంటి వెలుగు సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకొనే దీపావళి.. జీవితాల్ని ప్రకాశవంతం చేసుకోవాలనే సందేశాన్నీ ఇస్తుంది. దీపావళి అంటే చాలు.. తారలూ ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. కుటుంబంతో కలిసి ఇంటి ముందు దీపాలు వెలిగించే వాళ్లు కొందరైతే, కేరింతలు కొడుతూ పిల్లలు మతాబులు కాలుస్తుంటే, రాకెట్లను ఝామ్మంటూ ఆకాశానికి పంపిస్తుంటే.. చూసి ఆస్వాదించే వాళ్లు ఇంకొందరు. ఇప్పుడంటే పర్యావరణానికి హానికరమైన బాణసంచా కాల్చొద్దనే స్లోగన్ వచ్చింది కానీ, నిన్న మొన్నటి దాకా ధూమ్ ధామ్‌గా టపాకాయలు కాల్చడానికి ఉత్సాహం చూపించిన వాళ్లే అంతా..! ఈ దీపావళిని అందరూ హాయిగా ఆస్వాదించాలని చెబుతూనే, బాణసంచా కారణంగా ఎలాంటి ప్రమాదాలూ, ఇబ్బందులూ లేకుండా ప్రశాంతంగా, సురక్షితంగా పండగను జరుపుకోవాలని పిలుపునిస్తోంది లేడీ స్టయిల్‌స్టార్ రకుల్‌ప్రీత్. ‘‘అందరి ఇళ్ల ముందూ దీపాలు దేదీప్యమానంగా వెలుగుతుంటే లోకమంతా వెలుగుతో నిండిపోయినట్లుగా అనిపిస్తుంటుంది. నా కుటుంబంతో కలిసి ఈ పండగను జరుపుకోవడాన్ని ఎంతగా ఇష్టపడతానో! ఈ ఏడాది ఎలాంటి చప్పుళ్లు లేకుండా దీపాల పండగను జరుపుకుందాం. ఇతరుల జీవితాల్లో వెలుగును నింపుదాం. స్మైల్ అండ్ షైన్!’’ అంటోంది రకుల్. | entertainment |
17,476 | 19-05-2017 11:49:48 | ఈడీ అడిగే ప్రశ్నలను ముందుగానే తెలపాలి... కోర్టులో శశికళ పిటిషన్ | ఆంధ్రజ్యోతి, చెన్నై: విదేశీ మారకద్రవ్యం మోసం కేసుకు సంబంధించిన ప్రశ్నలను తనకు ముందుగానే తెలపాలని కోరుతూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ ఎగ్మూరు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. శశికళకు సంబంధించిన విదేశీ మారకద్రవ్యం మోసం కేసు విచారణ స్థానిక ఎగ్మూర్ కోర్టులో సాగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సాక్షుల వద్ద విచారణ ముగియడంతో శశికళ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు వీలుగా ఆమెను కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, బెంగుళూరు జైల్లో ఉన్న శశికళ అనారోగ్యంతో ఉన్నారని, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని ఆమె తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా, గురువారం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి జాకీర్‌హుస్సేన్ సమక్షంలో హాజరైన శశికళ తరపు న్యాయవాది మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆరోపణలకు సంబంధించిన ప్రశ్నలను ఈడీ అధికారులు శశికళకు ముందుగానే ఇవ్వాలని కోరారు. ఇందుకు ఈడీ తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఇరుతరపు వాదనల అనంతరం ఈ కేసు తదుపరి విచారణను వచ్చే 2వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. | nation |
18,966 | 31-01-2017 03:54:04 | మోదీ హయాంలో ఆర్థిక వ్యవస్థ పరుగులు: బీజేపీ | ఆర్థిక పరిస్థితి ఏమీ బాగా లేదన్న కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. మోదీ నాయకత్వంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదుగుతోందని, ప్రస్తుత కరంటు అకౌంటు లోటును మరికొన్ని నెలల్లోనే అధిగమిస్తామని మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. | nation |
16,481 | 25-01-2017 17:07:44 | అత్యాచారాన్ని ప్రతిఘటించిన మహిళను.. రైలు నుంచి తోసేసిన ఇద్దరు | కోల్‌కతా: అత్యాచారాన్ని ప్రతిఘటించిన ఓ మహిళను ఇద్దరు కదులుతున్న రైలు నుంచి తోసేశారు. తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఈ దారుణం జరిగింది. దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందిన 32 ఏళ్ళ పని మనిషి రాత్రి లోకల్ రైలులో ఇంటికి తిరిగి వస్తోంది. తాగిన ఇద్దరు వ్యక్తులు మహిళా బోగీలోకి ఎక్కారు. అందులోని ఒకరిద్దరు దిగిపోగానే ఆ మహిళపై అత్యాచారానికి యత్నించారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆ ఇద్దరు కలిసి కదులుతున్న రైలు నుంచి తోసేశారు. పట్టాల పక్కన పడి తీవ్రంగా గాయపడిన ఆమెను ఉదయం గమనించిన కొందరు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సుమోటో కేసుగా స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దారుణంపై కేసు నమోదు చేయాలని ఆ రాష్ట్ర మహిళా కమిషన్ బుధవారం డిమాండ్ చేసింది. | nation |
8,947 | 27-04-2017 16:15:35 | బాలయ్య కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్న బోయపాటి! | టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అవబోతోందట. ఇప్పటికే రెండు హిట్స్ అందుకున్న ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ దిశగా ప్లాన్ చేస్తోందట. మాస్ హీరోగా బాలకృష్ణకు ఉన్న ఇమేజ్‌ను రెట్టింపు చేసే విజయాలను అందించిన ఘనత దర్శకుడు బోయపాటి శ్రీనుది. ‘సింహా' వంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో బాలకృష్ణకు బడా హిట్‌ను అందించిన బోయపాటి.. 'లెజెండ్' సినిమాతో రికార్డ్స్ మోత మెగించాడు. కర్నూల్‌లో ఈ సినిమా వెయ్యిరోజులు పూర్తి చేసుకోవడం విశేషం. ఇలాంటి క్రేజీ కాంబినేషన్‌లో ఇప్పుడు మరో మూవీ రాబోతోందట. బాలకృష్ణతో మరో సినిమా కోసం బోయపాటి ఎప్పటినుంచో ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న బాలకృష్ణ కూడా బోయపాటితో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఆల్ రెడీ బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీ సిద్ధంగా ఉందట. గతంలో బాలయ్య 100వ సినిమా కోసం ఈ స్టోరీ సిద్ధం చేశాడు బోయపాటి. సో.. స్టోరీ కూడా రెడీగా ఉంది కనుక ఇక స్క్రిప్ట్ వర్క్ సిద్ధం చేయడమే ఆలస్యం. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో మూవీ చేస్తున్నాడు బోయపాటి. వచ్చే ఏడాది జూన్ నుంచి ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లే దిశగా ప్లాన్ చేస్తున్నారట. మరి.. ఇప్పటికే రెండు హిట్స్ అందుకున్న ఈ క్రేజీ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టేస్తారని ఆశిద్దాం..! | entertainment |
8,546 | 02-09-2017 21:43:30 | ప్రభాస్‌తో ఫోన్‌లో మాట్లాడా! |
ప్రభాస్ సరసన ‘సాహో’లో నాయికగా బాలీవుడ్ తార శ్రద్ధా కపూర్ నటించనున్న విషయం తెలిసిందే. ‘ఆల్ ఇండియా స్టార్’ అయిన ప్రభాస్‌తో కలిసి నటించేందుకు, అంతకంటే ముందు ఆయనను కలిసేందుకు ఆత్రుతతో ఎదురు చూస్తున్నానని అంటోంది శ్రద్ధ. ‘‘మేం ఫోన్‌లో మాట్లాడుకున్నాం. త్వరలో ఆయన్ని కలవాలనుకుంటున్నా. ‘సాహో’ నా తొలి ద్విభాషా చిత్రం. తెలుగు, హిందీలో ఏక కాలంలో చిత్రీకరిస్తున్నారు. ఇది గొప్ప కథ. నాది మహత్తరమైన పాత్ర. ఆ పాత్ర పోషించడం సవాలు లాంటిది. ఎందుకంటే రెండు భిన్నమైన భాషల్లో ఒకే సీన్‌ను ఒక దాని వెంట ఒకటి చేయాలి. ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నా. దాన్ని ఆస్వాదిస్తున్నా. మీకో విషయం తెలుసా!.. ‘నో’ అనే మాటను తెలుగులో ఎనిమిది రకాలుగా చెప్పొచ్చు’’ అని ఉత్సాహంగా చెప్పింది. సుజిత్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. | entertainment |
10,996 | 04-03-2017 01:03:11 | రైలు ప్రమాదాల వెనుక కుట్ర లేదు | ప్రధానిపై అఖిలేశ్ ధ్వజం ఘాజీపూర్: కాన్పూర్ చేరువలో రైలు ప్రమాదాలకు విద్రోహ చర్యలే కారణమన్న ప్రధాని మోదీ ప్రకటనను యూపీ సీఎం అఖిలేశ్‌యాదవ్ తప్పుబట్టారు. ఆ ప్రమాదాల వెనుక ఐఎ్‌సఐ కుట్ర లేదని స్పష్టం చేశారు. దీనిపై తనకెలాంటి సమాచారం లేదని, నిజానికి అది వాస్తవం కూడా కాదని పేర్కొన్నారు. | nation |
3,451 | 05-01-2017 02:41:55 | డిటెన్షన్ విధానం వద్దు |
పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి వరకు ‘డిటెన్షన్’ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద మానవ వనరుల మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవడం, దానికి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదించడం సరికాదు. నిర్బంధ విద్యాహక్కు చట్టం (2009) సెక్షన్ 16ను మార్పు చేయడం మరీ బాధాకరం. ‘డిటెన్షన్’ విధానం ముగిసిన అధ్యాయం లాంటిది. మధ్యలో చదువుకు స్వస్తి చెప్పే వారి (డ్రాపవుట్లు) సంఖ్య దీనివల్ల విపరీతంగా పెరుగుతుందని గత అనుభవాలు పేర్కొంటున్నాయి. విద్యార్థులలో భయాందోళనలు చెలరేగడం ఖాయం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఎంతమాత్రం సముచితంగా లేదు. ప్రముఖ విద్యావేత్తలు సైతం ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి నాన్ డిటెన్షన్ విధానాన్నే కొనసాగించాలి.- వి. కొండలరావు, పొందూరు | editorial |
18,291 | 19-05-2017 13:17:56 | న్యాయం చేస్తారా? మతం మారమంటారా?: ట్రిపుల్ తలాక్ బాధితురాలి సంచలన వ్యాఖ్యలు | ఉద్ధంసింగ్ నగర్: ‘ట్రిపుల్ తలాక్’పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగానే... మరో ముస్లిం మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ట్రిపుల్ తలాక్ విధానంతో ఒంటరిగా మారిన ఆమె... తనకు న్యాయం చేయకపోతే హిందూమతం స్వీకరిస్తానని పేర్కొంది. అదీ సాధ్యం కాకుంటే ఆత్మహత్య చేసుకునేందుకైనా తాను సిద్ధమేనని న్యాయపోరాటానికి దిగింది. బుధవారం కొత్తగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో షామిమ్ జహాన్ అనే మహిళ తనకు న్యాయం చేయాలంటూ ప్రధాని మోదీతో పాటు, సుప్రీంకోర్టుకు విన్నవించింది. గదార్‌పూర్ పోలీస్ స్టేషన్లో జహాన్ భర్త ఆసిఫ్‌కు మూడుసార్లు తలాక్ చెప్పి పోలీసుల సమక్షంలోనే విడాకులిచ్చేశాడు. ‘‘నా వ్యక్తిగత అనుభవాన్ని బట్టి.. హిందూ మతంలోకి మారిపోతే బాగుంటుందని అనిపిస్తోంది. హిందూమతంలో ఇలాంటి ఆచారం లేదు. ఒకవేళ మతం మారే అవకాశం రాకపోతే ఆత్మహత్యకయినా నేను సిద్ధమే. ఇప్పటికే చాలా బాధలు పడ్డాను’’ అని జహాన్ ఆవేదన వ్యక్తం చేసింది. 12 ఏళ్ల క్రితం జహాన్‌ను వివాహం చేసుకున్న ఆసిఫ్... నాలుగేళ్లకే విడాకులిచ్చేశాడు. పెద్దల సమక్షంలో చర్చలు జరిగిన తర్వాత మళ్లీ ఒక్కటయ్యారు. అయినప్పటికీ ఆమెపై ఆసిఫ్ వేధింపులకు దిగుతుండడంతో జహాన్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆమె భర్త పోలీస్ స్టేషన్‌కు వచ్చి అక్కడే తలాక్ చెప్పేశాడు. | nation |
8,627 | 03-06-2017 15:18:39 | ‘బాహుబలి’ గురించి అడిగితే శ్రీదేవి ఏమి చెప్పారంటే.. | దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ‘బాహుబలి’ సినిమాలోని కీలకమైన శివగామి పాత్రకు ముందుగా శ్రీదేవినే అనుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె మితిమీరిన కోరికలు కోరడంతో ఆమెను వద్దనుకుని, రమ్యకృష్ణను తీసుకున్నారు. ఆ పాత్రలో రమ్యకృష్ణ ఎంతలా చెలరేగిపోయి నటించిందో తెలిసిందే. శ్రీదేవి చాలా ఎక్కువగా డిమాండ్ చేసిందని ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పిన విషయాలు జాతీయ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. దీంతో శ్రీదేవి ఎక్కడకు వెళ్లినా.. ఆమెకు ‘బాహుబలి’ గురించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా ఓ వేడుకలో ‘శివగామి పాత్రను ఎందుకు వదిలేసుకున్నారు’ అనే ప్రశ్న శ్రీదేవికి ఎదురైంది. దానికి శ్రీదేవి ‘సమయం వచ్చినపుడు ‘బాహుబలి’ గురించి స్పందిస్తా.. ఇప్పుడేం మాట్లాడలేను’ అని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం నటిస్తున్న ‘మామ్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం త్వరలోనే మీడియా ముందుకు రాబోతున్నారు శ్రీదేవి. అప్పుడైనా ‘బాహుబలి’ గురించి మాట్లాడక తప్పదు. | entertainment |
17,952 | 28-03-2017 20:08:54 | మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఐగుదురు సీఎంలు, 14 మంది కేంద్ర మంత్రులు | న్యూఢిల్లీ: ఎన్నికలు ఏవైనా కావచ్చు, పోటీ చేయడం ఒక్కటే కాదు గెలుపు కూడా ముఖ్యమే. ఇదే సూత్రంతో అప్రమతిహత విజయాలతో దూసుకుపోతున్న భారతీయ జనతా పార్టీ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను సైతం ఈసారి ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఎంసీడీ (మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ) ఎన్నికల్లోనూ సత్తా చాటుకోవాలనుకుంటోంది. పంజాబ్, గోవా ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాన్ని పునరావృతం కానీయరాదనే పట్టుదలతో కేజ్రీవాల్ ఉన్నారు. దీంతో బీజేపీ సైతం ఆరునూరైనా గెలుపు తమదే కావాలన్న పట్టుదలతో పావులు కదుపుతోంది. ఇందుకు అనుగుణంగా పెద్దఎత్తున స్టార్ క్యాంపెయినర్లను ప్రచార బరిలోకి దింపుతోంది. ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ కీలక ప్రచారకర్త కాగా, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మరో నలుగురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 14 మంది కేంద్ర మంత్రులను కూడా చేర్చినట్టు సమాచారం. ఎన్నికల ప్రచార వ్యూహకర్తల కోర్ కమిటీలో ఇప్పటికే నలుగురు కేంద్రమంత్రులు .. నిర్మలా సీతారామన్, జితేంద్ర సింగ్, సంజీవ్ బల్యాన్, విజయ్ గోయెల్ ఉన్నారు. ఇక, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆప్ సర్కార్ విఫలమైందని, అందువల్ల ప్రజావ్యతిరేకత ఎక్కువగానే ఉందని భావిస్తున్న బీజేపీ ఈసారి ఎంసీడీ ఎన్నికల్లో కొత్త ముఖాలకే ప్రాధాన్యమిస్తున్నట్టు ప్రకటించింది. నార్త్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లలో మొత్తం 272 సీట్లుండగా, ఈసారి సిట్టింగ్ కౌన్సిలర్ల కుటుంబాలకు టిక్కెట్లు ఇవ్వరాదని పార్టీ నిర్ణయించింది. అలాగే, ఆయా వార్డుల్లో ఉండే స్థానికులనే అక్కడ అభ్యర్థులుగా నిలబెట్టాలనే కీలక నిర్ణయం కూడా తీసుకుంది. అదీగాక, ఇటీవల మహారాష్ట్ర, ఒడిశా మునిసిపల్ ఎన్నికల్లో సాధించిన విజయాలు కూడా బీజేపీలో కొత్త ఉత్సహాన్ని నింపుతున్నాయి. మొత్తం మీద ఏప్రిల్ 23న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే పరమావధిగా బీజేపీ తన వ్యూహాలకు పదునుపెడుతూపోతోంది. | nation |
19,296 | 04-02-2017 00:47:11 | నెంబర్ 1 శత్రువు కోహ్లీనే! | మెల్‌బోర్న్: భారత్‌తో త్వరలో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో ఆస్ర్టేలియాకు నెంబర్‌వన్ శత్రువు విరాట్ కోహ్లీయేనని ఆ దేశ మాజీ క్రికెటర్ మైకేల్ హస్సీ అన్నాడు. అలాగని అతన్ని మాటలతో రెచ్చగొట్టొద్దని ఆసీ్‌సకు హితవు పలికాడు. ఒకవేళ కోహ్లీని స్లెడ్జింగ్ చేస్తే అది కంగారూ జట్టుకే నష్టమని చెప్పుకొచ్చాడు. నాలుగు టెస్టుల సిరీస్ కోసం స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ర్టేలియా జట్టు భారత్‌కు రానుంది. పుణె వేదికగా ఈ నెల 23న జరిగే తొలి టెస్టుతో ఈ సిరీస్ మొదలవుతుంది. అయితే ఈ సిరీస్ కోసం వస్తున్న ఆసీస్.. టీమిండియా కెప్టెన్ కోహ్లీతో జాగ్రత్తగా ఉండాలని హస్సీ సూచించాడు. ‘విరాట్ కోహ్లీనే మా ప్రధాన శత్రువు. విరాట్‌లో పోటీతత్వం ఎక్కువ. హోరాహోరీ పోటీని ఇష్టపడతాడు. క్రీజులో కుదురుకోకముందే అతన్ని అవుట్ చేయాలి. చెలరేగే చాన్స్ ఇవ్వకూడద’ని హస్సీ అన్నాడు. మిస్టర్ క్రికెటర్‌గా పేరున్న హస్సీకి ఉపఖండం పిచ్‌లపై మంచి రికార్డు ఉంది. ఇక్కడ ఐదు అంతకంటే ఎక్కువ టెస్టులాడిన మిగతా ఆసీస్ ఆటగాళ్లకంటే హస్సీనే మెరుగైన సగటుతో పరుగులు రాబట్టాడు. కెరీర్‌లో 79 టెస్టులాడి 6235 పరుగులు చేసిన ఈ లెఫ్టాండర్ 2013లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. స్లెడ్జింగ్ చేస్తే మాకే నష్టం | sports |
19,754 | 29-06-2017 01:22:45 | విండీస్ టీమ్‌లో రెండు కొత్త ముఖాలు | చివరి మూడు వన్డేలకు కైల్, ఆంబ్రిస్ ఎంపికనార్త్ సౌండ్ (ఆంటిగ్వా): భారత్‌తో వన్డే సిరీస్‌లో 1-0తో వెనుకబడిన సమయంలో వెస్టిండీస్ జట్టులో రెండు కొత్త ముఖాలు కైల్ హోప్, సునీల్ ఆంబ్రిస్‌కు అవకాశం దక్కింది. ఐదు వన్డేల సిరీస్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌లకు 13 మంది సభ్యుల విండీస్ టీమ్‌ను బుధవారం ప్రకటించారు. జోనాథన్ కార్టర్, కెస్రిక్ విలియమ్స్ స్థానాల్లో యువ ఆటగాళ్లు కైల్ హోప్, ఆంబ్రిస్‌లు తొలిసారి జట్టుకు ఎంపికయ్యారు. విండీస్ వికెట్ కీపర్ షై హోప్ సోదరుడు కైల్ హోప్. దేశవాళీ క్రికెట్‌లో ట్రినిడాడ్ అండ్ టుబాగోకు కైల్ ప్రాతినిథ్యం వహిస్తుండగా, విండ్‌వర్డ్ ఐలాండ్స్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా ఆంబ్రిస్ రాణిస్తున్నాడు. విండీస్ జట్టు: జాసన్ హోల్డర్ (కెప్టెన్), సునీల్ ఆంబ్రిస్, దేవేంద్ర బిషు, రోస్టన్ ఛేజ్, మిగ్యువెల్ కమిన్స్, కైల్ హోప్, షై హోప్, అల్జరీ జోసెఫ్, ఇవిన్ లూయిస్, జాసన్ మహమ్మద్, ఆష్లే నర్స్, కీరన్ పావెల్, రొవ్‌మన్ పావెల్. | sports |
13,749 | 27-02-2017 02:10:35 | కర్ణాటకలో 10 వేల మంది దళిత ఉద్యోగులపై డిమోషన్ కత్తి! | బెంగళూరు, ఫిబ్రవరి 26: వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో పెను సవాల్ ఎదురైంది! ప్రభుత్వంలో పనిచేస్తున్న మొత్తం 10 వేల మంది ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సిద్దరామయ్య సర్కారు కల్పించిన రిజర్వేషన్ ఆధారిత ప్రమోషన్లు ఇప్పుడు ఆ పార్టీకి, ప్రభుత్వానికి పెను ముప్పును తెచ్చిపెట్టాయి. ఈ ప్రమోషన్లు ఎట్టి పరిస్థితిలోనూ అంగీకారయోగ్యం కావని, తక్షణమే ఆయా ఉద్యోగులకు డిమోషన్ కల్పించి వారిని యథాస్థానాల్లో నియమించాలని అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 9న ఆదేశించింది. దీంతో 2018లో ఎన్నికలకు సిద్ధమవుతున్న సిద్ద రామయ్య సర్కారు పరిస్థితి.. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయింది. | nation |
1,902 | 10-05-2017 17:37:25 | మరో ఆఫర్‌తో దూసుకొస్తున్న జియో... మూడు నెలలు ఫ్రీ! | రిలయన్స్ జియో మరో అద్భుత ఆవిష్కరణ దిశగా అడుగులు వేస్తోంది. రిలయన్స్ జియో వైఫై సర్వీసులు త్వరలో ప్రారంభం కానున్నాయి. జియో ఫైబర్ పేరుతో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జియో ఫైబర్ లాంచ్ సందర్భంగా వినియోగదారులకు ప్ర్రారంభ ఆఫర్ కింద 100 జీబీ డేటాను పూర్తి ఉచితంగా అందించనున్నట్లు తెలిసింది. నెట్ స్పీడ్ కూడా 100 ఎంబీపీఎస్‌తో పరుగులు తీయనున్నట్లు సమాచారం. మొదటి మూడు నెలలు ఈ సేవలు పూర్తి ఉచితంగా అందించాలని జియో భావిస్తోంది. ఇప్పటికే ఈ సర్వీస్‌కు సంబంధించిన ట్రైల్ టెస్ట్ పూర్తయింది. తొలుత జియో ఫైబర్ సేవలు దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో ప్రవేశపెట్టాలని రిలయన్స్ జియో యాజమాన్యం యోచిస్తోంది. ఢిల్లీ, ముంబై, పుణె, చెన్నై, జంనగర్(గుజరాత్) నగరాల్లో జియో ఈ సేవలను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత దేశమంతా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ సేవలు ఎప్పుడు నుంచి అందుబాటులోకి వస్తాయో అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. (ఇమేజ్: ఇండియా టుడే సౌజన్యంతో) | business |
10,584 | 13-04-2017 22:17:19 | అప్పట్లో నన్ను వింతగా చూసిన వాళ్లున్నారు |
సినిమా ఇప్పుడు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతోంది. రోజురోజుకీ కొత్త మార్పులు నిర్మాణరంగంలో చోటుచేసుకొంటున్నాయి. ఫిల్మ్ కనుమరుగైంది. ఇప్పుడంతా డిజిటల్ మయం. సినిమా తయారీ నుంచి విడుదల వరకూ ఏ దశలోనూ ఫిల్మ్‌తో అవసరం లేకపోవడంతో ఇప్పుడు నిర్మాతల పని సులువైంది. తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతోంది. అయితే భవిష్యత్‌ను ముందే ఊహించి పదేళ్ల క్రితమే డిజిటల్ సినిమాకు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఒకరున్నారు. ఆయన జన్నారెడ్డి జగన్నాథరెడ్డి. తెలుగులో తొలి డిజిటల్ మూవీ ‘వేగం’ తీసింది ఆయనే. ఈ నెల ఆరో తేదీకి ఆ చిత్రం విడుదలై పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చిత్రజ్యోతి ఆయనతో ప్రత్యేకంగా ముచ్చటించింది. డిజిటల్ సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టడానికి గల కారణాన్ని ఆయన వివరిస్తూ ‘ఇప్పటి పరిస్థితి వేరు కానివ్వండి.. పదేళ్ల కిత్రం ఓ కొత్త పాయింట్‌తో సినిమా తీయాలంటే అది చాలా ఖర్చుతో కూడుకొన్న వ్యవహారమే. కష్టపడి డబ్బు సమకూర్చుకొని సినిమా తీస్తే పెట్టుబడి తిరిగి వస్తుందన్న గ్యారంటీ ఉండేది కాదు. అందుకే నేను బాగా ఆలోచించి డిజిటిల్ ఫార్మెట్‌లో సినిమా తీయాలని నిర్ణయించుకొన్నాను. 2004లో కమల్‌హాసన్ ‘ముంబయి ఎక్స్‌ప్రెస్’ సినిమాని డిజిటల్ ఫార్మెట్‌లో తీశారు. డీవీ కెమెరాతో ఆ చిత్రాన్ని షూట్ చేసి, తర్వాత ఫిల్మ్‌లోకి మార్చే ప్రక్రియ అంత ఫలవంతం కాలేదు. అందుకే నేను బాగా ఆలోచించి హెచడీవీ ఫార్మెట్‌లో ‘వేగం’ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకొన్నాను. హెచ్‌డీవీ ఫార్మెట్‌లో సినిమా తీసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు కీర్తి దక్కాలనే తపనతోనే పదేళ్ల కిత్రం నేను అంత రిస్క్ చేశాను. అప్పట్లో నా వంక వింతగా చూసిన వాళ్లు లేకపోలేదు. అయినా నేను వెనకడుగు వెయ్యలేదు. ఎక్స్‌పెరిమెంటల్‌గా సినిమా ఉండకూడదని కమర్షియల్ పాయింట్ తీసుకొని ‘వేగం’ నిర్మించా. 2006 జూన్‌లో సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేసి సెన్సార్‌కి వెళ్లా. అయితే ఇది సినిమా కాదనీ, వీడియో ఫిల్మ్ అని చెప్పి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. ‘ముంబయి ఎక్స్‌ప్రెస్’ సినిమా విషయాన్ని ఉదాహరించినా సెన్సార్ ఆఫీసర్ ఒప్పుకోలేదు. దాంతో ఒక్కసారిగా నిరాశ నన్ను ఆవరించింది. సెన్సార్ సర్టిఫికెట్ ఎలా తెచ్చుకోవాలా అనే ఆలోచనలో ఉన్న నాకు సెప్టెంబర్ 2006లో విడుదలైన మలయాళ చిత్రం ‘మూనమాతరాళ్’ ఓ ఆశాకిరణంలా కనిపించింది. హెచ్‌డీవీ ఫార్మెట్‌లో నిర్మించిన తొలి భారతీయ సినిమా అది. దానికి సెన్సార్ సర్టిఫికెట్ లభించడంతో నేను పోరాటం ప్రారంబించాను. చివరకు హైదరాబాద్‌లోని సెన్సార్ ఆఫీసు నుంచి సర్టిఫికెట్ పొందగలిగాను. 2007 ఏప్రిల్ 6న సినిమా విడుదల చేశాను. ఇప్పుడు సినిమా డిజిటల్ మయం అయింది. దానికి తెలుగు తెరపై తొలి అడుగు వేసింది నేనేనని తలుచుకొంటే గర్వంగా అనిపిస్తుంది’ అన్నారు. | entertainment |