SNo
int64
0
21.6k
date
stringlengths
19
19
heading
stringlengths
3
91
body
stringlengths
6
38.7k
topic
stringclasses
5 values
12,461
11-03-2017 11:08:48
ఈ ఫలితాలు ఏం చెబుతున్నాయి?
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలపై విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం... హిందీ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో మిత్రుడిని వెనక్కు లాగారు. ఆయన నాయకత్వ లక్షణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నరేంద్ర మోదీ ప్రభంజనం గతం కన్నా ఎక్కువగా ఉంది. ప్రాంతీయ పార్టీల నేతలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కుల, మత సమీకరణలకు కాలం చెల్లింది. ముస్లిం ఓట్లు చీలినట్లు స్పష్టమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో కుల సమీకరణలు బీజేపీకి అనుకూలించాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలు బీజేపీకి శుభ సంకేతాలు పంపిస్తున్నాయి.
nation
11,627
11-08-2017 11:21:33
వెంకయ్య తెలుగు మాటలు సూపర్ ఫాస్ట్ : మోదీ
న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజ్యసభ చైర్మన్ స్థానంలో ఆసీనులయ్యారు. శుక్రవారం రాజ్యసభ కార్యకలాపాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు స్వాగతం పలికారు. స్వతంత్ర భారతదేశంలో జన్మించిన వ్యక్తి ఉప రాష్ట్రపతి అయ్యారని మోదీ కొనియాడారు. వెంకయ్య నాయుడుకు రాజ్యసభ  కార్యకలాపాల గురించి సంపూర్ణంగా తెలుసునని, అటువంటి నేత ఉపరాష్ట్రపతి కావడం సంతోషమని చెప్పారు. విద్యార్థి దశలో జయప్రకాశ్ నారాయణ్ పిలుపు మేరకు సుపరిపాలన కోసం పోరాడారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థి నేతగా ప్రజా జీవితాన్ని ప్రారంభించి, విధాన సభ, రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం చాలా బలమైనదన్నారు. నేటి భారతదేశంలో గ్రామీణ, పేద, అణగారిన వర్గాలవారు ఉన్నత పదవుల్లో ఉన్నారన్నారు. ఇది ప్రజాస్వామ్య పరిణతిని తెలియజేస్తోందని, భారతీయులందరికీ గర్వకారణమని చెప్పారు. ఇదంతా మన పూర్వీకుల గొప్పదనమన్నారు. వెంకయ్య నాయుడు తెలుగులో మాట్లాడితే సూపర్‌ఫాస్ట్‌గా ఉంటుందని, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మాట్లాడగలరని ప్రశంసించారు. గ్రామీణాభివృద్ధి కోసం ఆయన చాలా కృషి చేశారని, ప్రధానమంత్రి సడక్ యోజనను ఆయనే రూపొందించారన్నారు. వ్యవసాయ రంగంలో సమస్యలను ఆయన బాగా అర్థం చేసుకోగలరన్నారు. రైతుల కష్టాల గురించి ఆయనకు బాగా తెలుసునన్నారు. న్యాయవాది మాదిరిగా ఇప్పటి వరకు మనతో కలిసి ఉన్న వ్యక్తి ఇప్పుడు న్యాయమూర్తి స్థానంలో ఆసీనులయ్యారన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల జీతం ఎంతో తెలుసా?  రానా రాజకీయ ఎంట్రీపై తల్లిదండ్రులు ఏమన్నారంటే..
nation
16,551
04-03-2017 01:35:34
యూపీలో 6 జిల్లాల సెంటిమెంట్‌
అక్కడ పైచేయి సాధించిన వారిదే సీఎం పీఠం..1996 నుంచి కొనసాగుతున్న నమ్మకం
nation
3,272
21-07-2017 03:32:27
భాషా నివేదికకు విలువేది?
తెలుగు భాషను ఉద్ధరించేందుకు సలహాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. శాసనసభ ఉప సభాపతి తెలుగు భాషాభిమాని మండలి బుద్ధ ప్రసాద్‌ అధ్యక్షతన భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, ప్రభుత్వ మీడియా సలహాదారు మొదలైన వారు సభ్యులుగా ఏర్పడిన ఆ కమిటీ కొన్నాళ్లు కష్టపడి ఒక నివేదికను రూపొందించింది. వివిధ ప్రదేశాలు, రాష్ట్రాలు తిరిగి గడువు దాటిన తరువాత ఆ నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించారు. అయితే ఈ లోపే ప్రభుత్వం తెలుగుభాషను నిర్వీర్యం చేసే చర్యలను చేపట్టింది. గడువు లోపల నివేదిక ఇవ్వలేదన్న కారణాన్ని ప్రభుత్వం సాకుగా చూపింది. దీన్ని బట్టి ఇదంతా ముందుగా రచించిన రహస్య ప్రణాళిక ప్రకారం జరుగుతోందని అనిపిస్తోంది. ప్రజాధనాన్ని ఖర్చు చేసి తయారు చేసిన నివేదకకు విలువేది? ప్రభుత్వం తానే నియమించిన కమిటి ఇచ్చిన నివేదికను సంబంధిత కమిటీ గడువు దాటి సమర్పించిందన్న సాకుతో పక్కన బెట్టడమంటే, ఆ కమటీని అగౌరవపరిచినట్లు కాదా? ఇంత జరిగినా కమిటీ సభ్యులు మాత్రం కిమ్మనకుండా కూర్చోవడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం నివేదికను అంగీకరించినా అందులోని అంశాలు తెలుగు భాష పరిపుష్టికి ఏ మాత్రం దోహదం చేసేలా లేవని సందేహాలు వెలువడుతున్నాయి. ఏది ఏమైనా తెలుగు భాషకు తెలుగునాట ఇలా అవమానం జరగడం చారిత్రక తప్పిదమవుతుంది.- ఉప్పలపు శేషునాథ్‌, పి.నైనవరం, కృష్ణా జిల్లా
editorial
5,080
30-12-2017 18:21:47
త్రిషలా ఎవరూ చేసి ఉండరేమో..?
చెన్నై బ్యూటీ త్రిష న‌టిగానే కాదు సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్య‌క్తి కూడా. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా దాదాపు అందరి హీరోలతో నటించిన ఈ భామకి.. ఇప్పుడు టాలీవుడ్‌లో మాత్రం సినిమా అవకాశాలు లేవు. కానీ కోలీవుడ్‌లో మాత్రం తన హవా చాటుతూనే ఉంది. ప్రస్తుతం యూనిసెఫ్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్న త్రిష.. ప్ర‌జ‌ల‌లో అవ‌గాహాన క‌లిపించేందుకు అప్పుడ‌ప్పుడు ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాలు చేప‌డుతూనే ఉంది. ‘పెటా’ ద్వారా జంతువుల‌ సంర‌క్ష‌ణ బాధ్య‌త‌ని కూడా తీసుకుంది.  అయితే రీసెంట్‌గా ఈ భామ త‌మిళ‌నాడులోని కాంచీపురం ప‌ట్ట‌ణంలో గ‌ల వ‌డ‌నెమ్మెలి గ్రామంలో టాయిలెట్స్‌, పారిశుద్యంకి సంబంధించి జ‌నాల‌లో అవ‌గాహాన క‌లిపించేందుకు అక్క‌డికి వెళ్లింది. టాయిలెట్ నిర్మాణంలో తానూ ఓ చేయి వేసింది. వీటిపై ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న క‌లిగించేలా అక్క‌డి వారికి వివ‌రించింది. నిజంగా త్రిషలా ఇటువంటి ప్రచారం ఇప్పటి వరకు ఎవరు చేసిఉండరేమో అన్నంతగా అక్కడి ప్రజలతో ఆమె కలిసిపోయింది. త్రిష రాక‌తో గ్రామ ప్ర‌జ‌లు చాలా సంతోషం వ్య‌క్తం చేశారు.  ఇక త్రిష సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఈ మ‌ధ్య ఎక్కువ‌గా లేడి ఓరియెంటెడ్ పాత్ర‌ల‌కి సంబంధించిన సినిమాలనే త్రిష ఒప్పుకుంటుంది. త్రిష ప్ర‌స్తుతం తమిళంలో నాలుగు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తోంది. ఆమె నటించిన ‘మోహిని, హేజూడ్’ చిత్రాల ట్రైలర్లు తాజాగా విడుదలై, ప్రేక్షకుల నుండి మంచి రెస్సాన్స్‌ని రాబట్టుకుంటున్నాయి.
entertainment
290
14-01-2017 01:33:23
చైనాతో పెరిగిన భారత వాణిజ్య లోటు
బీజింగ్‌ : భారత్, చైనా ద్వైపాక్షిక వాణిజ్యంలో చైనానే పై చేయి సాధిస్తోంది. చైనా నుంచి భారత్‌కు ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇదే తరుణంలో భారత్ నుంచి చైనాకు ఎగుమతులు తగ్గుతున్నాయి. ఫలితంగా గత ఏడాదిలో భారత్ వాణిజ్య లోటు ఏకంగా 4,656 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇదే కాలంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం 2.1 శాతం మేర తగ్గి 7,100 కోట్ల డాలర్లకు చేరుకుంది. చైనా ఎగుమతులు 0.2 శాతం పెరిగి 5,833 కోట్ల డాలర్లకు చేరింది. ఇక వివిధ రంగాల వారీగా భారత ఎగుమతుల వివరాలు వెల్లడికావాల్సి ఉంది. 2015 సంవత్సరంతో పోల్చితే చైనాకు భారతదేశ ఎగుమతులు 12 శాతం తగ్గి 1,176 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. 2015 సంవత్సరంలో భారతఎగుమతులు 1,338 డాలర్లుగా ఉన్నాయి. అంతకు ముందు ఏడాదిలో 1,640 కోట్ల డాలర్ల ఎగుమతులు జరిగాయి.
business
19,125
22-09-2017 10:38:23
మతి భ్రమించిన ట్రంప్‌కి గుణపాఠం తప్పదు : కిమ్ జోంగ్ ఉన్
న్యూయార్క్ : ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్ దూకుడు కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆయన మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఉత్తర కొరియా ఆయుధాల కార్యక్రమాలపై అమెరికా తాజా ఆంక్షలను విధించిన కాసేపటికే కిమ్ జోంగ్ ఉన్ స్పందిస్తూ డొనాల్డ్ ట్రంప్‌కు మతి భ్రమించిందన్నారు . తమ దేశాన్ని బెదిరించిన ట్రంప్‌ తగిన మూల్యం చెల్లించేలా చేస్తామని హెచ్చరించారు. ఉత్తర కొరియా అణ్వాయుధ, క్షిపణి కార్యక్రమాలపై అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి వస్తోంది. అయినప్పటికీ ఉత్తర కొరియా ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. పైగా మరింత రెచ్చగొడుతోంది. ట్రంప్, కిమ్ పరస్పరం వాగ్యుద్ధం చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితిలో మంగళవారం డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఉత్తర కొరియాను సర్వనాశనం చేయడం తప్ప తమకు మరో మార్గం లేదన్నారు. దీనిపై కిమ్ స్పందిస్తూ చరిత్రలో అత్యంత భారీ స్థాయిలో ప్రతిదాడి గురించి పరిశీలిస్తామన్నారు. తమ అణ్వాయుధ కార్యక్రమం సరైనదేనని ట్రంప్ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయన్నారు. ట్రంప్ ఊహకందని ఫలితాన్ని పొందుతారని హెచ్చరించారు. అయితే తదుపరి తీసుకోబోయే చర్య ఏమిటో ఆయన వివరించలేదు. ‘‘మతి భ్రమించిన, సత్తువలేని అమెరికా ముసలోడిని నేను కచ్చితంగా అగ్గితో లొంగదీస్తాను’’ అని కిమ్ అన్నారు. కిమ్ అత్యంత అరుదుగా ఇచ్చిన ఈ ప్రకటనను ప్రభుత్వ వార్తా సంస్థ కేసీఎన్ఏ ప్రచురించింది.
nation
10,099
13-12-2017 23:05:12
వారిని విస్మరిస్తే ఎలాంటి పనులు జరుగవ్: తలసాని
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (‘మా’) 25 వ‌సంతాలు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా శివాజీ రాజా అధ్య‌క్ష‌త‌న ఏర్పాటైనా ‘మా’ నూత‌న కార్య వ‌ర్గం సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌లో క‌ర్టైన్ రైజ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సీనియ‌ర్ న‌టీమ‌ణులు జ‌మున‌, శార‌ద‌, జ‌యప్ర‌ద‌, జ‌య‌సుధ చేతుల మీదుగా జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న జ‌రిగింది. సంగీత దర్శ‌కుడు కోటీ అండ్ టీమ్ మ్యూజిక‌ల్ నైట్... తార‌ల ఫ్యాష‌న్ షోతో వేడుక‌కు నూత‌న శోభ తీసుకొచ్చారు. ఇదే వేదిక‌పై సీనియ‌ర్ న‌టీమ‌ణులు రోజా ర‌మ‌ణి, జ‌య‌సుధ‌, ప్ర‌భ‌ల‌కు మంత్రి త‌ల‌సాని, శార‌ద‌, జ‌య‌ప్ర‌ద చేతుల మీదుగా ఘ‌నంగా స‌న్మానం జ‌రిగింది. అలాగే తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్, తెలంగాణ ఎఫ్ డి.సీ చైర్మ‌న్ రామ్మోహ‌న‌రావు, ఏపీ ఎఫ్ .డి.సీ చైర్మ‌న్ అంబికా కృష్ణ‌ల‌ను ‘మా’ ఘ‌నంగా స‌న్మానించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ మాట్లాడుతూ.. ‘‘1993లో స్థాపించిన ‘మా’ దిన దిన అభివృద్ధి చెంది ఈరోజు మంచి స్థానంలో ఉంది. క‌ళమాత‌ల్లికి కుల‌మ‌త ప్రాంతీయ బేధాలుండ‌వు. ఇక్క‌డ అంతా ఒక్క‌టేన‌ని నిరూపించారు. ‘మా’ మంచి కార్య‌క్ర‌మాల‌తో ముందుకు వెళ్తోంది. వాళ్ల‌కు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా స‌హ‌కారం అందిస్తుంది. ‘మా’ సొంత భ‌వ‌నం, గోల్డేజ్ హోమ్ నిర్మాణానికి కావాల్సిన స్థ‌లాన్ని ప్ర‌భుత్వం నుంచి ఇప్పిస్తాం. ఇవి రాజ‌కీయ మాట‌లు కాదు.. చెప్పింది చెప్పిన‌ట్లు చేసి చూపిస్తా. అలాగే పేద క‌ళాకారుల‌కు మేజ‌ర్ ట్రీట్‌మెంట్‌కు కావాల్సిన భారీ మొత్తాన్ని కూడా సిఏం రిలీఫ్ ఫండ్ నుంచి వ‌చ్చేలా చూస్తా. ఏదైనా స‌హాయం కావాలంటే న‌న్ను వెంట‌నే సంప్ర‌దించచ్చు. అలాగే చిత్ర‌పురి కాల‌నీలో ఇప్పటికే కొంత మంది సొంతిళ్ల‌ను కల్గి ఉన్నారు. ఇంకొంత మందికి రావాల్సింది ఉంది. వాళ్ల‌కు వ‌చ్చే విధంగా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. వాళ్ల‌తో పాటు సినిమా జ‌ర్న‌లిస్టుల‌ను కూడా క‌లుపుకుని మందుకు వెళ్తే మంచిద‌ని భావిస్తున్నా. అలాగే సినిమా షూటింగ్‌ల‌కు సంబంధించి ఇప్ప‌టికే అనుమ‌తులు సుల‌భంగా వ‌చ్చేలా జీవో జారీ చేసాం. ప్ర‌భుత్వ‌మే ఆన్‌లైన్ టిక్కెటింగ్ అందుబాటులోకి తీసుకొస్తుంది. శివాజీ రాజా, న‌రేష్‌ల‌ను ఉప‌యోగించుకుంటే అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డ‌తారు. విస్మ‌రిస్తే.. ఎలాంటి ప‌నులు జ‌రుగ‌వు. ఇప్ప‌టికే వీళ్లిద్ద‌రు ‘మా’ కు ఎన్నో మంచి కార్య‌క్ర‌మాలు చేశారు. మ‌రింత మంచి ప్లానింగ్‌లో ముందుకు వెళ్తున్నారు. ఈ ఫంక్ష‌న్‌లో నేను కూడా భాగ‌మ‌వ్వ‌డం సంతోషంగా ఉంది’’ అని అన్నారు.
entertainment
14,330
06-12-2017 01:52:21
యోగి విరాళం 5 కోట్లు
న్యూఢిల్లీ, డిసెంబరు 5: ఓఖీ తుఫాన్‌ బాధితుల సహాయార్థం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధికి రూ. 5 కోట్ల విరాళం ఇచ్చారు. సీఎం సహాయ నిధి నుంచి రూ. 5 కోట్ల చెక్కును మోదీకి యోగి మంగళవారం అందజేసినట్టు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ యోగిని ట్విటర్‌లో ప్రశంసించారు.
nation
16,571
25-02-2017 13:13:18
కశ్మీర్‌ను భారత్ అన్యాయంగా ఆక్రమించుకుందట: సెలవిచ్చిన పాక్ అధ్యక్షుడు
ఇస్లామాబాద్: కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ మరోమారు అక్కసు వెళ్లగక్కింది. చట్టవిరుద్ధంగా కశ్మీర్‌ను ఆక్రమించుకున్న భారత్ ఇకనైనా ఆ పనులకు పుల్‌స్టాప్ పెట్టాలని పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ కోరారు. ఈ విషయంలో భారత్ ఆలస్యం చేసే కొద్దీ ప్రాంతీయ స్వేచ్ఛ‌కు అది పెను విపత్తుగా మారుతుందని హెచ్చరించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో హుస్సేన్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ప్రజల మనోభావాలను గౌరవించి, ఆ భూభాగంపై చట్టవిరుద్ధ ఆక్రమణలను ఆపాలని కోరారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వివాద పరిష్కారంలో జాప్యం జరిగితే అది పెను విపత్తకు దారి తీసే ప్రమాదం ఉందని, ప్రాంతీయ శాంతికి అది విఘాతంగా మారుతుందని హుస్సేన్ అభిప్రాయపడ్డారు.
nation
498
20-01-2017 23:31:00
శాంతా బయోకు ఫిక్కీ అవార్డు
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : సనోఫీ కంపెనీ.. శాంతా బయోటెక్నిక్స్‌.. క్వాలిటీ, ఎక్సలెన్స్‌ విభాగంలో ప్రతిష్ఠాత్మకమైన ఫిక్కీ అవార్డును గెలుచుకుంది. మిడ్‌ సైజ్‌ కేటగిరీలో శాంతా బయో.. క్వాలిటీ, ఎక్సలెన్స్‌ విభాగంలో ప్రథమ బహుమతిని గెలుచుకుంది. నాణ్యత విషయంలో శాంతా బయో ఎక్కడా కూడా రాజీపడదని, ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఈ విషయంలో ఇదే పంథాను అవలంబిస్తారని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సిఒఒ మహేష్‌ భగత అన్నారు.
business
4,107
16-05-2017 02:39:03
స్విస్ ఛాలెంజ్ .... స్వచ్ఛమే!
అమరావతి నిర్మాణం మీద ప్రతిపక్షాలకు ఇంకా సందేహాలు వుంటే, కోర్టుకు వెళ్ళవచ్చు. అయితే ఈసారి బినామీలతో కాకుండా, స్వయంగా ప్రతిపక్షమే వెళ్తే మంచిది. కోర్టు మొట్టికాయలు వాళ్ళే తినాలి కాబట్టి..!!మూడు లక్షలకు పైగా ఉద్యోగాలు, రాష్ట్ర స్థూల ఉత్పత్తికి సాలుకి 1.15 లక్షల కోట్లు అదనపు జోడింపు, ప్రభుత్వ ఖజానాకి పదివేల కోట్లు పన్నుల రూపేణా రాబడి. ఇదంతా కేవలం 1691ఎకరాల్లోనే! మూడు దశల్లో!! ఎక్కడ?అమరావతి స్టార్ట్ అప్ ఏరియాలో! సాధ్యమా? సుసాధ్యమే అంటున్నారు చంద్రబాబు..! అంతే కాదు, ఇంతకు ముందు తాను ఇదే లాంటి ప్రయోగం, కొంచం తక్కువ స్థాయిలో చేసిన, హైదరాబాదు హైటెక్ సిటీలోని, రహేజా మైండ్ స్పేస్ చూడమంటున్నారు! ఇదంతా అబద్ధం అంటూ స్విస్స్ చాలెంజ్ పద్ధతిలో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు పనిగట్టుకొని రాజధాని మీద బురద వేస్తున్నాయి. కొంచంసేపు సమయం వెచ్చించి, అమరావతిలో మందడం గ్రామం దగ్గర నిన్న, సోమవారం స్విస్స్ చాలెంజ్ పద్ధతిలో అభివృద్ధి కోసం శంఖుస్థాపన చేయబడిన ‘స్టార్ట్ అప్ ఏరియా’ లోని వివరాలను కొంచంసేపు పరిశీలిద్దాం. ప్రపంచ స్థాయి కంపెనీలను అమరావతికి తేవడం అనే లక్ష్యంతో, మూడు లక్షల ఉద్యోగాల కల్పన, మౌలిక సదుపాయాల ఏర్పాటు, అంతర్జాతీయ క్వాలిటీ నిర్మాణాలు, లివింగ్ స్పేస్, బిజినెస్ పార్కులు, ఐటీ పార్కులు, బీటీ పార్క్, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ ఏర్పాటుతో పాటు, 3 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి, 30 లక్షల మందికి పరోక్ష ఉపాధి లభించే విధంగా ఒక ‘స్టార్ట్ అప్’ నగరాన్ని నిర్మించేందుకు సింగపూర్ కన్సార్టియంతో, స్విస్స్ చాలెంజ్ టెండర్ ప్రక్రియ ద్వారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడిన “అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ తో ఒప్పందం కుదుర్చుకొని 1691 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో, 3 దశల్లో, 15 సంవత్సరాల్లో అమరావతి నగర అభివృద్ధికి ఒప్పందం కుడుర్చుకోన్నాము. దీనిలో ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పరేషన్ ద్వారా 42 % వాటా, సింగపూర్ కన్సార్టియంకు 58% వాటా వుంటుంది. ఇదీ స్థూలంగా ప్రాజెక్టు ముఖ చిత్రం. ప్రతిపక్షాల ఆరోపణ ఏంటి అంటే, ప్రైవేటు కంపెనీలతో అమరావతిని స్టార్ట్ అప్ ఏరియాని కట్టిస్తున్నారు అని. ఇది పూర్తిగా ఇలాంటి సంస్థలపై ఏ మాత్రం అవగాహన లేని ఆరోపణ. నిజానికి ఈ కన్సార్టియంలో మూడు కంపెనీలు వున్నాయి. అసెండాస్, సేంబ్ కార్ప్, సింగ్ బ్రిడ్జ్. ఈ మూడు కంపెనీల్లో సింగపూర్ ప్రభుత్వానికి 75 శాతం వాటా వుంది. ప్రైవేటు కంపెనీల్లో సింగపూర్ ప్రభుత్వానికి వాటా ఎలా వుంటుంది అనుకొనే వారికి, ఇది నిజమే అని తెలుసుకోవాలి. మన దేశంలా కాకుండా సింగపూర్ ప్రభుత్వాలు, ప్రైవేటు కంపెనీల్లో కూడా పెట్టుబడి పెడుతాయి. సింగపూర్ ప్రధానంగా, ‘టేమాసేక్ హోల్డింగ్స్’, ‘జీఐసి హోల్డింగ్స్’ అనే సంస్థల ద్వారా ఇతర ప్రైవేటు కంపనీలలో పెట్టుబడులు పెడుతుంది. వీటిని సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్స్ అంటారు. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కార్పరేషన్‌తో స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఒప్పదం కుదుర్చుకొన్న మూడు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది ఈ సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్స్. అంటే, ఒక విధంగా చెప్పాలంటే, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకొంది సింగపూర్ ప్రభుత్వం. అమరావతిలోని స్టార్టప్ ప్రాజెక్టు రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం లాంటిది. అమరావతిని ప్రైవేటు సంస్థలకు ఇచ్చేస్తున్నారు అనేది ఇంకొక ఆరోపణ. ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి సేకరించింది 33,000 ఎకరాలు, దానికి అదనంగా ప్రభుత్వ అటవీ భూములు. వీటిలో సింగపూర్ కన్సార్షియంకు మాస్టర్ డెవలపర్ గా ఇచ్చేది 1691 ఎకరాలు. అంటే, రైతుల దగ్గర తీసుకొన్నది మాత్రమే లెక్క వేసుకొంటే కూడా, 5 శాతం మాత్రమే. ఈ అయిదు శాతం భూమిని చూపించి అమరావతిని సింగపూర్ కి అమ్మేస్తున్నారు అనడం ఎంత అన్యాయం కదా. ఈ స్టార్ట్ అప్ ఏరియా అనేది అవసరం లేదు, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే అనేది ఇంకో అభియోగం. విస్తృత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించడంతోపాటు పన్నుల్లో వాటా రూపేణా ప్రభుత్వానికి, పెరగబోయే భూముల విలువల రూపేణా అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు రాజధాని రైతులకు భారీ లబ్ధి చేకూర్చాలన్నది ఈ స్టార్టప్‌ ఏరియా ప్రతిపాదన. ఈ స్టార్ట్ అప్ ఏరియా ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీగా అభివృద్ధి చెందితే, ఆ ప్రభావం అమరావతి అంతటిపై పడి, రాజధాని నగరం వేగంగా నిర్మితమయ్యేందుకు అవకాశం వుంటుంది.  దీన్ని ఒక మాడల్ గా చూపించి అమరావతిలోకి మిగతా పెట్టుబడిదారులను ఆకర్షించవచ్చని ఆలోచన. ఇక రియల్ ఎస్టేట్ అనే అవకాశమే లేదు. ఉదాహరణలో చెప్పాలంటే, ఈ స్టార్ట్ అప్ ఏరియా రాజధాని నిర్మాణం కానే కాదు. హైదరాబాదులో హైటెక్ సిటీ తెలిసిన వారికి రహేజా మైండ్ స్పేస్ తెలిసే వుంటుంది. ఒకప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే ఆ నూట యాభై ఎకరాల జాగాని రహేజాకు ఇచ్చింది, అటూఇటూగా ఇప్పటి స్టార్ట్ అప్ ఏరియా ప్రాతిపదికనే. ఆ రోజు కూడా ఇదేలాంటి ఆరోపణలు చేసారు. ఈ రోజు అక్కడ, కొందామన్న కూడా, ఒక మిల్లీమీటర్ జాగా కూడా దొరుకదు. రహేజాలోకి వచ్చిన సంస్థల ప్రభావంతో ఇప్పుడు అది నిండిపోయి, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ కూడా పూర్తిగా నిండి పోయింది హైదరాబాదులో. అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించే హైదరాబాదు లోని ‘హైటెక్స్’ కూడా ఇలాంటి ప్రాజెక్టే. హైదరాబాద్‌కు హైటెక్ సిటీ ఎలా ఆయువు అయిందో, అమరావతికి ఈ స్టార్ట్ అప్ ఏరియా అలా అవుతుందని అంచనా. అమరావతిని మాస్టర్ డెవలపర్ గా సింగపూర్ కంపెనీలకి ఇవ్వడం ఎందుకు? ప్రభుత్వమే చెయ్యచ్చు కదా అనేది ఇంకొందరి వాదన. పలుదేశాల్లోని పారిశ్రామికవేత్తలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, సింగపూర్ ప్రభుత్వ అండదండలు వుంటాయి కాబట్టి, ఆ స్థాయిలో తమ ప్రభావం చూపుతూ, అమరావతిలోని వున్న విజ్ఞానం, చదువుకొన్న మాన్ పవర్, రానున్న ఇతర సంస్థలు, గ్రోత్ రేటు, భవిష్యత్‌ అవకాశాలు, ప్రపంచ స్థాయి కంపెనీల రాక, మౌలిక సదుపాయాలు, క్వాలిటీ నిర్మాణాలు, లివింగ్ స్పేస్‌లాంటి పాజిటివ్ పాయింట్స్ చెప్తూ, మార్కెట్ చెయ్యడం ఈ సంస్థల ప్రాధాన వ్యాపారం. అమెరికాకు వెళ్లి చంద్రబాబు వ్యాపార అవకాశాలు తెచ్చారని చెప్పి, ఎల్లకాలం ఆయన్ని అమెరికాలోనే ఉండమని చెప్తే, ఇక్కడ పరిపాలన చెయ్యాలి కదా! అందుకని, ఆ స్థాయిలో వ్యాపారం అభివృద్ధి చెయ్యాలి కాబట్టి, మన రాష్ట్రం తరఫున ఈ సంస్థలు చేస్తాయన్నమాట. ఇక ఈ సంస్థల శక్తి యుక్తులు చూస్తే, ఈ కన్సార్టియంకి రూ. 50,000 కోట్ల విలువ చేసే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుల అనుభవం వుంది. మన దేశంలోని చెన్నై, బెంగళూరులలో నిర్మాణ అనుభవంతో పాటుగా, 19 దేశాల్లో ఆఫీసులు కలిగి, ఇప్పటి దాకా 5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం చేసిన ట్రాక్ రికార్డ్ వుంది. ఈ సంస్థలు చంద్రబాబు బినామీలు, వారితో మిలాకత్ అయ్యి అవినీతి చేస్తున్నారు, అందుకోసమే స్విస్ చాలెంజ్ పెట్టారు అని ఇంకొక అర్ధం లేని ఆరోపణ. ప్రభుత్వం టెండర్ల ప్రక్రియని పూర్తి పారదర్శకతతో చేసింది. ‘రిక్వెస్ట్ ఫార్ ప్రపోజల్’ ప్రక్రియని 47 ప్రధాన విదేశీ ఎంబెసీలకు పంపింది. 105 దేశాలకు పంపింది. అన్నీ అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురించారు. కావాల్సిన సమయం 45 రోజులు ఇచ్చారు. ఇదే రకమైన అనుభవంతో, ఇంకెవరైనా వస్తే కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. అమరావతి భూములను ప్రైవేటు వారికి ఇచ్చేస్తున్నారు అని ఇంకొకరి అవగాహనా రాహిత్యం. 6.8 కిలోమీటర్ల పరిధిలోని ఈ స్టార్టప్ నగరం మొదటి ఫేజ్ లో 651ఎకరాల్లో నిర్మాణం చేస్తారు. ఆ నిర్మాణాలు, వాటిని అంతర్జాతీయ సంస్థలకి, 70 శాతం అమ్మకం పూర్తి అయిన తర్వాతే, రెండవ ఫేజ్ లో 514 ఎకరాల స్థలం ఇవ్వబడుతుంది. దానిలో 70 శాతం పూర్తి అయిన తర్వాతనే చివరి ఫేజ్ లోని 521 ఎకరాలు ఇవ్వబడుతాయి. సింగపూర్ సంస్థతో కేవలం జీపీఏ మాత్రమే జరుగుతుంది. భూమి మీద యాజమాన్య హక్కు ఇవ్వబడదు. భూమి మీద చేసిన నిర్మాణాలకు సిఆర్డీఏ మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తుంది.  అందువలన ప్రభుత్వానికి దీని మీద సంపూర్ణ కంట్రోల్ వుంటుంది. ఈ భూమిలో ఈక్విటీని, గతంలో హైదరాబాద్ రహేజా మైండ్ స్పేస్లో , రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం చేసినట్టుగా ప్రభుత్వ ఈక్విటీని తగ్గించి/ వారికే అమ్మేసి, క్విడ్ ప్రో కొ పద్ధతిలో వేరే చోట పెట్టుబడులు, లేదా ధన మార్పిడి లాంటి వాటికి వీలు లేదు. ఆ మేరకు ముందుగానే చట్టంలో పెట్టారు. అంటే ప్రభుత్వం భవిష్యత్తులో ఈక్విటీ అమ్మే వీలు లేదు. అంటే, ఇరు వర్గాలకీ డబ్బు మార్పిడి జరిగే అవకాశం లేదు. అందువలన అవినీతికి ఆస్కారం లేదు. ఇక భూమి ఇచ్చిన రైతులకి లాభం ఎలా అంటే, భూమినిచ్చిన రైతుకు లాభం చేకూర్చే విధంగా ఎకరం విలువ నాలుగు కోట్లు రిజర్వ్ ధరగా నిర్ణయించడం జరిగింది. ఒకవేళ భూమిని తక్కువ అమ్మిన పక్షంలో కూడా ఆ ధర యొక్క బేధాన్ని వుమ్మడి అకౌంట్లోనే జమ చెయ్యాలి. ఎందుకంటే ప్రభుత్వం, కన్సార్టియం ఇద్దరు భాగస్తులు కాబట్టి. మొదటి ఫేజ్ లో నాలుగు కోట్లు ధర నిర్ణయం వలన, రైతులకు సంపద సృష్టిస్తాం అనే మాటని ప్రభుత్వం నిలబెట్టుకొంది. ప్రభుత్వానికి తక్కువ శాతం లాభం అని ఇంకొక వాదన. కానీ పైన చెప్పిన 42 శాతంకి అదనంగా కాకుండా స్థూల విక్రయంలో మళ్ళీ ప్రభుత్వానికి కన్సార్టి యం లాభం చెల్లించాలి. మొదటి ఫేజ్లో 5శాతం, రెండవ ఫేజ్లో 8.5 శాతం, మూడవ ఫేజ్లో 12.5 శాతంగా వుంటుంది. ఈ మొత్తం మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం 2100 కోట్లు పెడుతుండగా, అమరావతి డెవలప్మెంట్ కార్పరేషన్ 222 కోట్లు పెడుతుంటే, సింగపూర్ కన్సార్టియం 306 కోట్లు పెడుతోంది. పన్నులు, జీడీపీలను లెక్క వేసుకొంటె సరాసరి ప్రభుత్వానికి 57 శాతం రాబడి వస్తుందని అంచనా. మొత్తం మీద ‘స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు’ వలన నగదు రూపంలో ప్రభుత్వానికి రూ.1246 కోట్లు (53 శాతం), సింగపూర్‌ కన్సార్టియానికి రూ.1105 కోట్లు (47 శాతం) ఆదాయాల వాటా లభిస్తుంది. అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలను పొందడంద్వారా రూ.2118 కోట్లు ప్రభుత్వానికి సమకూరుతుంది. మొత్తంగా ఈ ప్రాజెక్టుతో ప్రభుత్వానికి రూ.3364 కోట్లు (75.3 శాతం), సింగపూర్‌ కన్సార్టియానికి 24.7 శాతం ఆదాయం లభిస్తుంది. స్థూలంగా 3 లక్షల ఉద్యోగాలు, పదివేల కోట్ల పన్ను రాబడి, 1.15 లక్షల కోట్లు స్థూల రాష్ట్ర ఉత్పత్తికి జోడింపు. తొలి మూడేళ్లలో చేపట్టనున్న 8.07 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు అభివృద్ధి చోదకంగా ఉపయోగపడతాయి కాబట్టి, ఈ స్టార్ట్ అప్ ఏరియా బయట కూడా పలు సంస్థలు వచ్చే అవకాశం వుంది. అమరావతి నిర్మాణం మీద ప్రతిపక్షాలకు ఇంకా సందేహాలు వుంటే, కోర్టుకు వెళ్ళవచ్చు. అయితే ఈసారి బినామీలతో కాకుండా, స్వయంగా ప్రతిపక్షమే వెళ్తే మంచిది. కోర్టు మొట్టికాయలు వాళ్ళే తినాలి కాబట్టి..!!----­­నీలాయపాలెం విజయకుమార్ తెలుగుదేశం పార్టీమూడు లక్షలకు పైగా ఉద్యోగాలు, రాష్ట్ర స్థూల ఉత్పత్తికి సాలుకి 1.15 లక్షల కోట్లు అదనపు జోడింపు, ప్రభుత్వ ఖజానాకి పదివేల కోట్లు పన్నుల రూపేణా రాబడి. ఇదంతా కేవలం 1691ఎకరాల్లోనే! మూడు దశల్లో!! ఎక్కడ?అమరావతి స్టార్ట్ అప్ ఏరియాలో! సాధ్యమా? సుసాధ్యమే అంటున్నారు చంద్రబాబు..! అంతే కాదు, ఇంతకు ముందు తాను ఇదే లాంటి ప్రయోగం, కొంచం తక్కువ స్థాయిలో చేసిన, హైదరాబాదు హైటెక్ సిటీలోని, రహేజా మైండ్ స్పేస్ చూడమంటున్నారు! ఇదంతా అబద్ధం అంటూ స్విస్స్ చాలెంజ్ పద్ధతిలో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు పనిగట్టుకొని రాజధాని మీద బురద వేస్తున్నాయి. కొంచంసేపు సమయం వెచ్చించి, అమరావతిలో మందడం గ్రామం దగ్గర నిన్న, సోమవారం స్విస్స్ చాలెంజ్ పద్ధతిలో అభివృద్ధి కోసం శంఖుస్థాపన చేయబడిన ‘స్టార్ట్ అప్ ఏరియా’ లోని వివరాలను కొంచంసేపు పరిశీలిద్దాం. ప్రపంచ స్థాయి కంపెనీలను అమరావతికి తేవడం అనే లక్ష్యంతో, మూడు లక్షల ఉద్యోగాల కల్పన, మౌలిక సదుపాయాల ఏర్పాటు, అంతర్జాతీయ క్వాలిటీ నిర్మాణాలు, లివింగ్ స్పేస్, బిజినెస్ పార్కులు, ఐటీ పార్కులు, బీటీ పార్క్, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ ఏర్పాటుతో పాటు, 3 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి, 30 లక్షల మందికి పరోక్ష ఉపాధి లభించే విధంగా ఒక ‘స్టార్ట్ అప్’ నగరాన్ని నిర్మించేందుకు సింగపూర్ కన్సార్టియంతో, స్విస్స్ చాలెంజ్ టెండర్ ప్రక్రియ ద్వారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడిన “అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ తో ఒప్పందం కుదుర్చుకొని 1691 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో, 3 దశల్లో, 15 సంవత్సరాల్లో అమరావతి నగర అభివృద్ధికి ఒప్పందం కుడుర్చుకోన్నాము. దీనిలో ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పరేషన్ ద్వారా 42 % వాటా, సింగపూర్ కన్సార్టియంకు 58% వాటా వుంటుంది. ఇదీ స్థూలంగా ప్రాజెక్టు ముఖ చిత్రం. ప్రతిపక్షాల ఆరోపణ ఏంటి అంటే, ప్రైవేటు కంపెనీలతో అమరావతిని స్టార్ట్ అప్ ఏరియాని కట్టిస్తున్నారు అని. ఇది పూర్తిగా ఇలాంటి సంస్థలపై ఏ మాత్రం అవగాహన లేని ఆరోపణ. నిజానికి ఈ కన్సార్టియంలో మూడు కంపెనీలు వున్నాయి. అసెండాస్, సేంబ్ కార్ప్, సింగ్ బ్రిడ్జ్. ఈ మూడు కంపెనీల్లో సింగపూర్ ప్రభుత్వానికి 75 శాతం వాటా వుంది. ప్రైవేటు కంపెనీల్లో సింగపూర్ ప్రభుత్వానికి వాటా ఎలా వుంటుంది అనుకొనే వారికి, ఇది నిజమే అని తెలుసుకోవాలి. మన దేశంలా కాకుండా సింగపూర్ ప్రభుత్వాలు, ప్రైవేటు కంపెనీల్లో కూడా పెట్టుబడి పెడుతాయి. సింగపూర్ ప్రధానంగా, ‘టేమాసేక్ హోల్డింగ్స్’, ‘జీఐసి హోల్డింగ్స్’ అనే సంస్థల ద్వారా ఇతర ప్రైవేటు కంపనీలలో పెట్టుబడులు పెడుతుంది. వీటిని సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్స్ అంటారు. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కార్పరేషన్‌తో స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఒప్పదం కుదుర్చుకొన్న మూడు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది ఈ సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్స్. అంటే, ఒక విధంగా చెప్పాలంటే, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకొంది సింగపూర్ ప్రభుత్వం. అమరావతిలోని స్టార్టప్ ప్రాజెక్టు రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం లాంటిది. అమరావతిని ప్రైవేటు సంస్థలకు ఇచ్చేస్తున్నారు అనేది ఇంకొక ఆరోపణ. ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి సేకరించింది 33,000 ఎకరాలు, దానికి అదనంగా ప్రభుత్వ అటవీ భూములు. వీటిలో సింగపూర్ కన్సార్షియంకు మాస్టర్ డెవలపర్ గా ఇచ్చేది 1691 ఎకరాలు. అంటే, రైతుల దగ్గర తీసుకొన్నది మాత్రమే లెక్క వేసుకొంటే కూడా, 5 శాతం మాత్రమే. ఈ అయిదు శాతం భూమిని చూపించి అమరావతిని సింగపూర్ కి అమ్మేస్తున్నారు అనడం ఎంత అన్యాయం కదా. ఈ స్టార్ట్ అప్ ఏరియా అనేది అవసరం లేదు, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే అనేది ఇంకో అభియోగం. విస్తృత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించడంతోపాటు పన్నుల్లో వాటా రూపేణా ప్రభుత్వానికి, పెరగబోయే భూముల విలువల రూపేణా అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు రాజధాని రైతులకు భారీ లబ్ధి చేకూర్చాలన్నది ఈ స్టార్టప్‌ ఏరియా ప్రతిపాదన. ఈ స్టార్ట్ అప్ ఏరియా ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీగా అభివృద్ధి చెందితే, ఆ ప్రభావం అమరావతి అంతటిపై పడి, రాజధాని నగరం వేగంగా నిర్మితమయ్యేందుకు అవకాశం వుంటుంది.  దీన్ని ఒక మాడల్ గా చూపించి అమరావతిలోకి మిగతా పెట్టుబడిదారులను ఆకర్షించవచ్చని ఆలోచన. ఇక రియల్ ఎస్టేట్ అనే అవకాశమే లేదు. ఉదాహరణలో చెప్పాలంటే, ఈ స్టార్ట్ అప్ ఏరియా రాజధాని నిర్మాణం కానే కాదు. హైదరాబాదులో హైటెక్ సిటీ తెలిసిన వారికి రహేజా మైండ్ స్పేస్ తెలిసే వుంటుంది. ఒకప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే ఆ నూట యాభై ఎకరాల జాగాని రహేజాకు ఇచ్చింది, అటూఇటూగా ఇప్పటి స్టార్ట్ అప్ ఏరియా ప్రాతిపదికనే. ఆ రోజు కూడా ఇదేలాంటి ఆరోపణలు చేసారు. ఈ రోజు అక్కడ, కొందామన్న కూడా, ఒక మిల్లీమీటర్ జాగా కూడా దొరుకదు. రహేజాలోకి వచ్చిన సంస్థల ప్రభావంతో ఇప్పుడు అది నిండిపోయి, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ కూడా పూర్తిగా నిండి పోయింది హైదరాబాదులో. అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించే హైదరాబాదు లోని ‘హైటెక్స్’ కూడా ఇలాంటి ప్రాజెక్టే. హైదరాబాద్‌కు హైటెక్ సిటీ ఎలా ఆయువు అయిందో, అమరావతికి ఈ స్టార్ట్ అప్ ఏరియా అలా అవుతుందని అంచనా. అమరావతిని మాస్టర్ డెవలపర్ గా సింగపూర్ కంపెనీలకి ఇవ్వడం ఎందుకు? ప్రభుత్వమే చెయ్యచ్చు కదా అనేది ఇంకొందరి వాదన. పలుదేశాల్లోని పారిశ్రామికవేత్తలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, సింగపూర్ ప్రభుత్వ అండదండలు వుంటాయి కాబట్టి, ఆ స్థాయిలో తమ ప్రభావం చూపుతూ, అమరావతిలోని వున్న విజ్ఞానం, చదువుకొన్న మాన్ పవర్, రానున్న ఇతర సంస్థలు, గ్రోత్ రేటు, భవిష్యత్‌ అవకాశాలు, ప్రపంచ స్థాయి కంపెనీల రాక, మౌలిక సదుపాయాలు, క్వాలిటీ నిర్మాణాలు, లివింగ్ స్పేస్‌లాంటి పాజిటివ్ పాయింట్స్ చెప్తూ, మార్కెట్ చెయ్యడం ఈ సంస్థల ప్రాధాన వ్యాపారం. అమెరికాకు వెళ్లి చంద్రబాబు వ్యాపార అవకాశాలు తెచ్చారని చెప్పి, ఎల్లకాలం ఆయన్ని అమెరికాలోనే ఉండమని చెప్తే, ఇక్కడ పరిపాలన చెయ్యాలి కదా! అందుకని, ఆ స్థాయిలో వ్యాపారం అభివృద్ధి చెయ్యాలి కాబట్టి, మన రాష్ట్రం తరఫున ఈ సంస్థలు చేస్తాయన్నమాట. ఇక ఈ సంస్థల శక్తి యుక్తులు చూస్తే, ఈ కన్సార్టియంకి రూ. 50,000 కోట్ల విలువ చేసే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుల అనుభవం వుంది. మన దేశంలోని చెన్నై, బెంగళూరులలో నిర్మాణ అనుభవంతో పాటుగా, 19 దేశాల్లో ఆఫీసులు కలిగి, ఇప్పటి దాకా 5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం చేసిన ట్రాక్ రికార్డ్ వుంది. ఈ సంస్థలు చంద్రబాబు బినామీలు, వారితో మిలాకత్ అయ్యి అవినీతి చేస్తున్నారు, అందుకోసమే స్విస్ చాలెంజ్ పెట్టారు అని ఇంకొక అర్ధం లేని ఆరోపణ. ప్రభుత్వం టెండర్ల ప్రక్రియని పూర్తి పారదర్శకతతో చేసింది. ‘రిక్వెస్ట్ ఫార్ ప్రపోజల్’ ప్రక్రియని 47 ప్రధాన విదేశీ ఎంబెసీలకు పంపింది. 105 దేశాలకు పంపింది. అన్నీ అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురించారు. కావాల్సిన సమయం 45 రోజులు ఇచ్చారు. ఇదే రకమైన అనుభవంతో, ఇంకెవరైనా వస్తే కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. అమరావతి భూములను ప్రైవేటు వారికి ఇచ్చేస్తున్నారు అని ఇంకొకరి అవగాహనా రాహిత్యం. 6.8 కిలోమీటర్ల పరిధిలోని ఈ స్టార్టప్ నగరం మొదటి ఫేజ్ లో 651ఎకరాల్లో నిర్మాణం చేస్తారు. ఆ నిర్మాణాలు, వాటిని అంతర్జాతీయ సంస్థలకి, 70 శాతం అమ్మకం పూర్తి అయిన తర్వాతే, రెండవ ఫేజ్ లో 514 ఎకరాల స్థలం ఇవ్వబడుతుంది. దానిలో 70 శాతం పూర్తి అయిన తర్వాతనే చివరి ఫేజ్ లోని 521 ఎకరాలు ఇవ్వబడుతాయి. సింగపూర్ సంస్థతో కేవలం జీపీఏ మాత్రమే జరుగుతుంది. భూమి మీద యాజమాన్య హక్కు ఇవ్వబడదు. భూమి మీద చేసిన నిర్మాణాలకు సిఆర్డీఏ మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తుంది.  అందువలన ప్రభుత్వానికి దీని మీద సంపూర్ణ కంట్రోల్ వుంటుంది. ఈ భూమిలో ఈక్విటీని, గతంలో హైదరాబాద్ రహేజా మైండ్ స్పేస్లో , రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం చేసినట్టుగా ప్రభుత్వ ఈక్విటీని తగ్గించి/ వారికే అమ్మేసి, క్విడ్ ప్రో కొ పద్ధతిలో వేరే చోట పెట్టుబడులు, లేదా ధన మార్పిడి లాంటి వాటికి వీలు లేదు. ఆ మేరకు ముందుగానే చట్టంలో పెట్టారు. అంటే ప్రభుత్వం భవిష్యత్తులో ఈక్విటీ అమ్మే వీలు లేదు. అంటే, ఇరు వర్గాలకీ డబ్బు మార్పిడి జరిగే అవకాశం లేదు. అందువలన అవినీతికి ఆస్కారం లేదు. ఇక భూమి ఇచ్చిన రైతులకి లాభం ఎలా అంటే, భూమినిచ్చిన రైతుకు లాభం చేకూర్చే విధంగా ఎకరం విలువ నాలుగు కోట్లు రిజర్వ్ ధరగా నిర్ణయించడం జరిగింది. ఒకవేళ భూమిని తక్కువ అమ్మిన పక్షంలో కూడా ఆ ధర యొక్క బేధాన్ని వుమ్మడి అకౌంట్లోనే జమ చెయ్యాలి. ఎందుకంటే ప్రభుత్వం, కన్సార్టియం ఇద్దరు భాగస్తులు కాబట్టి. మొదటి ఫేజ్ లో నాలుగు కోట్లు ధర నిర్ణయం వలన, రైతులకు సంపద సృష్టిస్తాం అనే మాటని ప్రభుత్వం నిలబెట్టుకొంది. ప్రభుత్వానికి తక్కువ శాతం లాభం అని ఇంకొక వాదన. కానీ పైన చెప్పిన 42 శాతంకి అదనంగా కాకుండా స్థూల విక్రయంలో మళ్ళీ ప్రభుత్వానికి కన్సార్టి యం లాభం చెల్లించాలి. మొదటి ఫేజ్లో 5శాతం, రెండవ ఫేజ్లో 8.5 శాతం, మూడవ ఫేజ్లో 12.5 శాతంగా వుంటుంది. ఈ మొత్తం మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం 2100 కోట్లు పెడుతుండగా, అమరావతి డెవలప్మెంట్ కార్పరేషన్ 222 కోట్లు పెడుతుంటే, సింగపూర్ కన్సార్టియం 306 కోట్లు పెడుతోంది. పన్నులు, జీడీపీలను లెక్క వేసుకొంటె సరాసరి ప్రభుత్వానికి 57 శాతం రాబడి వస్తుందని అంచనా. మొత్తం మీద ‘స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు’ వలన నగదు రూపంలో ప్రభుత్వానికి రూ.1246 కోట్లు (53 శాతం), సింగపూర్‌ కన్సార్టియానికి రూ.1105 కోట్లు (47 శాతం) ఆదాయాల వాటా లభిస్తుంది. అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలను పొందడంద్వారా రూ.2118 కోట్లు ప్రభుత్వానికి సమకూరుతుంది. మొత్తంగా ఈ ప్రాజెక్టుతో ప్రభుత్వానికి రూ.3364 కోట్లు (75.3 శాతం), సింగపూర్‌ కన్సార్టియానికి 24.7 శాతం ఆదాయం లభిస్తుంది. స్థూలంగా 3 లక్షల ఉద్యోగాలు, పదివేల కోట్ల పన్ను రాబడి, 1.15 లక్షల కోట్లు స్థూల రాష్ట్ర ఉత్పత్తికి జోడింపు. తొలి మూడేళ్లలో చేపట్టనున్న 8.07 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు అభివృద్ధి చోదకంగా ఉపయోగపడతాయి కాబట్టి, ఈ స్టార్ట్ అప్ ఏరియా బయట కూడా పలు సంస్థలు వచ్చే అవకాశం వుంది. అమరావతి నిర్మాణం మీద ప్రతిపక్షాలకు ఇంకా సందేహాలు వుంటే, కోర్టుకు వెళ్ళవచ్చు. అయితే ఈసారి బినామీలతో కాకుండా, స్వయంగా ప్రతిపక్షమే వెళ్తే మంచిది. కోర్టు మొట్టికాయలు వాళ్ళే తినాలి కాబట్టి..!!----­­నీలాయపాలెం విజయకుమార్ తెలుగుదేశం పార్టీ
editorial
18,111
05-03-2017 00:02:06
కంపెనీలకు కష్టాలే..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. అన్నంతపనీ చేస్తున్నారు..! తాజాగా ప్రీమియం హెచ్‌1బీ వీసాలను ఆరు నెలల పాటు రద్దు చేస్తూ.. ఐటీ కంపెనీలపై ముఖ్యంగా భారతపై పెద్ద బాంబు వేశారు. ఈ అత్యవసర వీసా లేకుంటే.. అమెరికాలో తమ క్లైంట్లకు ఎదురయ్యే అత్యవర సమస్యలు, పరిస్థితులను చక్కదిద్దలేమని ఐటీ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ఈ వీసాల రద్దు ప్రభావం మన ఐటీ కంపెనీలపై తీవ్రంగా ఉంటుందని.. ఒకటి రెండు త్రైమాసికాల పాటు.. వీటికి ప్రతికూల ఫలితాలు ఎదురుకావొచ్చని నిపుణులు అంటున్నారు. వాస్తవానికి ప్రీమియం హెచ్‌1బీ.. సాధారణ హెచ్‌1బీ వీసా లాంటిదే.. కాకుంటే చాలా త్వరగా ప్రాసెస్‌ చేస్తారు. ఈ వీసాకు దరఖాస్తు చేస్తే.. వీసా వచ్చేదీ రానిదీ కేవలం 15 నుంచి 30 రోజుల్లో తేలిపోతుంది. అయితే దీనికి అందరూ దరఖాస్తు చేయలేరు. ఈ ప్రీమియం వీసా కోసం ఉద్యోగం ఇచ్చిన లేకుంటే.. సదరు నిపుణుల సేవలు కోరుకుంటున్న కంపెనీయే దరఖాస్తు చేయాలి. హెచ్‌1బీ వీసా లాగా ఈ ప్రీమియం వీసాకు వ్యక్తిగతంగా దరఖాస్తు చేయలేం. అమెరికాలోని కంపెనీలు కొన్ని అత్యవసర సేవలు, ప్రాజెక్ట్‌లు, ప్రణాళికల కోసం విదేశాల నుంచి ప్రతిభావంతులను అత్యవసరంగా రప్పించాల్సి ఉంటుంది. అలాంటపుడు వారు సదరు విదేశీయునికి వేగంగా హెచ్‌1బీ వీసా అందించేందుకు ఈ ప్రీమియం ప్రాసెస్‌ మార్గాన్ని అనుసరిస్తారు. ఇందుకోసం ప్రత్యేక ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అమెరికాలోని తమ క్లైంట్‌కు సమస్యలు వచ్చినపుడు.. అత్యవసర సమావేశాలు నిర్వహించాల్సి వచ్చినపుడు ఈ ఫాస్ట్‌ ప్రాసెస్‌ వీసాల ద్వారా నిపుణులు అక్కడకు వెళ్లేవారు. ఈ వీసాలను కూడా హెచ్‌1బీ మొత్తం వీసాల పరిమితికి లోబడే ఇస్తారు. పైగా వీటికీ లాటరీ ఉంటుంది. ఒకవేళ ఈ వీసాను 15 రోజుల్లో ప్రాసెస్‌ చేయలేకపోతే.. ఈ వీసా కోసం చెల్లించిన రుసుమును వాపస్‌ ఇచ్చేస్తారు. ఈ వీసా కోసం 1225 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.  సాధారణంగా అమెరికాలో కంపెనీలు తీవ్రమైన ఆర్థిక నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉన్నపుడు ఈ వీసా ద్వారా ప్రతిభావంతులను విదేశాల నుంచి తీసుకొస్తాయి. హెచ్‌1బీ ప్రీమియం.. వీసాలను ఏపిల్ర్‌ 3 నుంచి ఆరు నెలల పాటు రద్దు చేశారు. అంటే భారతలోని కంపెనీలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కనీసం ఆరు నెలలు తమ ఉద్యోగులను అత్యవసర పరిస్థితుల్లోనూ అక్కడకు పంపలేవు. ఇది ఆయా కంపెనీలకు శరాఘాతం కానుంది. ఎందుకంటే దేశంలోని దాదాపు అన్ని ప్రముఖ ఐటీ కంపెనీలూ.. అమెరికాలోని కంపెనీలకు.. క్లైంట్లకు సేవలు అందిస్తుంటాయి. అక్కడ ఏ సమస్య వచ్చినా ఈ సంస్థలు తమ నిపుణులను అత్యవసరంగా అక్కడకు పంపి.. తమ క్లైంట్‌లకు ఆర్థికంగా నష్టం జరుగకుండా చూస్తుంటాయి. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంటాయి. దీంతో అవి అనుకున్న ఆర్థిక లక్ష్యాలు, లాభాలను సాధించడానికి వీలుంటుంది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అక్కడ ఏదైనా సమస్య వస్తే.. దాన్ని వెంటనే పరిష్కరించే వెసులుబాటు ఉండదు. ఈ పరిస్థితి వల్ల ఒకటి రెండు త్రైమాసికాల పాటు ఐటీ కంపెనీలు అనుకున్న లాభాలను సాధించలేకపోవచ్చు. వాటి ఆదాయంపై ప్రీమియం రద్దు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఏదైనా సమస్య వస్తే.. అక్కడే ఉన్న నిపుణులపై ఆధారపడాల్సి ఉంటుంది. అక్కడున్న నిపుణులను తమ క్లైంట్‌ వద్దకు పంపి.. ఆ సమస్య పరిష్కరించాల్సి ఉంటుంది. - సెంట్రల్‌ డెస్క్‌
nation
15,533
13-10-2017 17:15:50
ఎన్నికల సంఘం నిర్ణయం వెనుక మోదీ : కాంగ్రెస్
న్యూఢిల్లీ : గుజరాత్ శాసనసభ ఎన్నికల షెడ్యూలును ప్రకటించకపోవడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం నిర్ణయం వెనుక ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉందని ఆరోపించింది. మోదీ తాయిలాలు ప్రకటించేందుకు ఎన్నికల నియమావళి అడ్డు తగలకుండా చేయడానికే జాప్యం జరుగుతోందని ఆరోపించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిథి రణదీప్ సింగ్ సుర్జీవాలా ఓ ట్వీట్‌లో ‘‘మోదీ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాలకు తగినట్లుగా హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల షెడ్యూలుతోపాటు గుజరాత్ శాసనసభ ఎన్నికల షెడ్యూలును కూడా ప్రకటించకుండా వాయిదా వేసేందుకు ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెస్తున్నట్లు కనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు. మోదీ ఈ నెల 16న గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌‌లో బహిరంగ సభలో పాల్గొనబోతున్నారని, ఆ సభలో తాయిలాలు ప్రకటించబోతున్నారని, అందువల్లే ఎన్నికల షెడ్యూలు ప్రకటనలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ఈ విధంగా తాయిలాలను ప్రకటించడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని తెలిపారు. ఎన్నికల సమరాంగణాన్ని అన్ని పక్షాలకు సమానావకాశాలు ఉండేవిధంగా చేయవలసిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనన్నారు.
nation
21,579
03-03-2017 02:19:40
ఐపీఎల్‌పై అనిశ్చితి!
ఆర్థిక ఇక్కట్లలో రాష్ట్ర క్రికెట్‌ సంఘాలుబోర్డు నుంచి అందని అడ్వాన్స్‌లునిధులు లేకపోతే లీగ్‌కు ఆతిథ్యమివ్వలేంఐపీఎల్‌ కమిటీకి స్పష్టీకరణ!  చూస్తుండగానే ఐపీఎల్‌ ప్రస్థానం దశాబ్దానికి చేరుకుంది..! పదో సీజన్‌ను అంగరంగవైభవంగా నిర్వహించాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి..! ఒకటికి ఎనిమిది ఆరంభ వేడుకలు జరపాలని బీసీసీఐ పాలకులు చెబుతున్నారు..! ఈ సారి ఎనిమిది నగరాల్లోనూ ప్రారంభోత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు..! కానీ, వేడుకల మాట దేవుడెరుగు.. అసలు లీగ్‌ జరుగుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..! బోర్డు నుంచి ఇంకా అడ్వాన్స్‌లు అందకపోవడంతో తాము మ్యాచ్‌లు నిర్వహించలేమని ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్ర సంఘాలు చెప్పడంతో లీగ్‌పై అనిశ్చితి నెలకొంది..!ముంబై: ఐపీఎల్‌ పదో సీజన్‌ కోసం ఎదురుచూస్తున్న ఆటగాళ్లకు, అభిమానులకు ఇది కాస్త ఆందోళన కలిగించే విషయ మే. ఈ సీజన్‌ ఐపీఎల్‌ నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. ఈ లీగ్‌కు ఆతిథ్యం ఇచ్చే వివిధ రాష్ట్ర క్రికెట్‌ సంఘాలు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో పడడమే ఇందుకు కారణం. ఐపీఎల్‌ నిర్వహణ కోసం బీసీసీఐ వెంటనే అడ్వాన్సు ఇవ్వకపోతే మ్యాచ్‌లు నిర్వహించలేమని సంఘా లు.. ఐపీఎల్‌ కమిటీకి తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. ఆతిథ్య రాష్ట్ర సంఘాలతో ఐపీఎల్‌ కమిటీ మంగళవారం సమావేశమైంది. ఐపీఎల్‌కు ముందు ఈ సమావేశం జరగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో మనుగడే ప్రశ్నార్థకం చేసుకున్న వివిధ రాష్ట్ర సంఘాలు.. ఐపీఎల్‌ కమిటీ ముందు తమ నిస్సహాయతను వ్యక్తం చేశాయి.  బోర్డు వెంటనే నిధులు విడుదల చేయకపోతే మ్యాచ్‌లు నిర్వహించలేమని తేల్చి చెప్పాయి. సాధారణంగా ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇచ్చే సంఘాలు ఒక్కో మ్యాచ్‌కు రూ. 60 లక్షల గ్రాంట్‌ను అందుకుంటాయి. ఇందులో రూ. 30 లక్షలు ఐపీఎల్‌ ఫ్రాంచైజీ నుంచి మిగతా సగం బీసీసీఐ నుంచి పొందుతాయి. ఈ మొత్తాన్ని రాష్ట్ర సంఘాలు.. మ్యా చ్‌, ప్రాక్టీస్‌ ఖర్చులకు వెచ్చిస్తాయి. ఇందులో.. ఫ్లడ్‌లైట్లు, మైదానం సన్నద్ధత, గ్రౌండ్‌ స్టాఫ్‌, కో-ఆర్డినేషన్‌ తదితరాలు ఉంటాయి. గతంలో బీసీసీఐ నుంచి ముందుగా కొంత మొత్తం అడ్వాన్స్‌గా పొందేవి. మిగతా.. లీగ్‌ సమయంలో లేదా ముగిశాక అందుకునేవి.  కానీ, లోధా కమిటీ సిఫారులకు అంగీకారం తెలిపేంతవరకూ రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ నిధులు ఇవ్వకూడదని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇందుకోసం లోధా కమిటీ నిర్దేశించిన తుది గడువు ఈ నెల ఒకటితోనే ముగిసింది. కానీ, దీనికి సమ్మతంగా లేని రాష్ట్ర సంఘాలు.. మార్గదర్శకాలపై పూర్తి స్పష్టతనివ్వాలని సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశాయి. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వాల్సి ఉంది. అప్పటిదాకా బోర్డు, రాష్ట్ర సంఘాలు ఏమీ చేయలేని పరిస్థితి. ఇక, తమ ఖాతాలను స్తంభింపజేయడంతో న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌, ఆసే్ట్రలియాతో సిరీ్‌సలకు ముందు రాష్ట్ర సంఘాలు ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నాయి. అయితే, నిధులు లేకపోతే మ్యాచ్‌లు జరపలేమన్నాయి. దీనికి స్పందించిన సుప్రీం.. ఆయా మ్యాచ్‌లను నిర్వహించే రాష్ట్ర సంఘాలకు వేర్వేరుగా నిధులు విడుదల చేయాలని బోర్డును ఆదేశించింది. ఇప్పటికైతే ఏ మ్యాచ్‌ ఆగకపోయినా బోర్డు నుంచి ఇం కా పెద్ద మొత్తం నిధులు నిలిచిపోవడం క్రికెట్‌ పరిపాలనను దెబ్బ తీస్తోంది.  తమకు రావాల్సిన కోట్ల రూపాయలు బోర్డు తన వద్దే ఉంచుకుందని, దాంతో తమకు తీవ్రమైన నిధుల కొరత ఏర్పడిందని కర్ణాటక క్రికెట్‌ సంఘం (కేఎ్‌ససీఏ) అధికారి ఒకరు చెప్పారు. బోర్డు నిధులను ఆపేయడం అన్ని స్థాయిల మ్యాచ్‌లనూ ప్రభావితం చేస్తుందన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే తాము కనీసం జూనియర్‌ స్థాయి దేశవాళీ మ్యాచ్‌లను నిర్వహించలేని దుస్థితికి దిగజారుతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాటల్లో కొంత నిజం ఉందనిపిస్తోంది. దానికి, భారత అండర్‌-19 ఆటగాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులనే ఉదాహరణగా చెప్పొచ్చు.  గత నెలలో ఇంగ్లండ్‌తో యూత సిరీస్‌ సందర్భంగా మ్యాచ్‌ అలవెన్సులు రాకపోవడంతో భారత అండర్‌-19 ప్లేయర్లు హోటల్‌లో తినలేని పరిస్థితి ఏర్పడింది. అల్పాహారం కోసం ముంబైలోని రైల్వే క్యాంటీన్‌కు వెళ్లారు. ఇక, బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) మ్యాచ్‌ల కోసం భారీగా ఖర్చు అవుతోందని కేఎ్‌ససీఏ అధికారులు చెబుతున్నారు. ఆ మొత్తాన్ని బోర్డు తొందరగా చెల్లించకపోతే ఈ వేసవిలో ఎన్‌సీఏకు సహకారం అందించలేమని స్పష్టం చేశారు. సాధారణంగా యువకుల శిక్షణకు వేసవి నెలలు చాలా కీలకం. ఈ సమయంలో అకాడమీలో పలు కార్యక్రమాలు కీలక దశలో ఉంటాయి. కానీ, ఈ సారి వాటిపై ప్రభావంపడే అవకాశాలున్నాయి.
sports
1,764
16-11-2017 08:10:28
మీ ఎస్బీఐ ఖాతాకు ఆధార్ నంబరు లింక్ ఎలా చేయాలంటే...
ముంబై : దేశంలో అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులు ఈ ఏడాది డిసెంబరు 31వతేదీలోగా తమ ఆధార్ నంబరును అనుసంధానించకుంటే ఖాతా లావాదేవీలను నిలిపివేస్తామని అధికారులు హెచ్చరించారు. ఖాతాదారులు ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, స్టేట్ బ్యాంకు ఎనీవేర్ మొబైల్ యాప్, ఏటీఎం, బ్యాంకు బ్రాంచీల ద్వారా తమ ఆధార్ నంబరును అనుసంధానం చేసుకోవచ్చని ఎస్బీఐ అధికారులు చెప్పారు. ఆధార్ నంబరును ఖాతాను అనుసంధానం చేసుకోవడం ద్వారా డిజిటల్ లైఫ్ ఉపయోగాలు పొందవచ్చని ఎస్బీఐ తన ట్విట్టర్ లో పేర్కొంది. ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ క్లిక్ చేసి మీ యూజర్ నేమ్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేశాక ఈ-సర్వీసుపై క్లిక్ చేయండి. అనంతరం ‘లింక్ యువర్ ఆధార్ నంబరు’ లింక్ ను క్లిక్ చేసి ప్రొఫైల్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి. అనంతరం ఆధార్ నంబరు ఎంటర్ చేస్తే మీ ఎస్బీఐ ఖాతాకు మీ ఆధార్ అనుసంధానం అయినట్లేనని బ్యాంకు అధికారులు వివరించారు.ఇంటర్‌నెట్ బ్యాంకింగ్‌తోపాటు మొబైల్ యాప్, ఏటీఎం, బ్యాంకు బ్రాంచీల్లోనూ మీ ఖాతాకు ఆధార్ నంబరును అనుసంధానించుకోవచ్చని ఎస్బీఐ అధికారులు వివరించారు.
business
10,397
29-10-2017 03:31:48
హరితేజ ‘ఫిదా’
‘బిగ్‌బాస్‌’ హరితేజకు బ్రేక్‌ తో పాటు ఆమె కెరీర్‌కు మంచి కిక్‌ ఇచ్చిందనడంలో సందేహం లేదు. 70 రోజుల పాటు తన వ్యక్తిత్వాన్ని, టాలెంట్‌ను ప్రపంచానికి చూపించడానికి ‘బిగ్‌బాస్‌’ హరితేజకు మంచి చాన్స్‌ ఇచ్చింది. ‘బిగ్‌బా్‌స’కు ముందు హరితేజ ఓ సాధారణ నటి. ‘దమ్ము’, ‘అఆ’, ‘డీజే’ వంటి చిత్రాల్లో కూడా నటించారు. కానీ ‘బిగ్‌బాస్‌’ తర్వాత ఓ సెలబ్రిటీ. ఆమెకు కిరీటం ఇవ్వకపోయినా బోల్డెంత క్రేజ్‌ తీసుకొచ్చిందా షో. అందుకే అవకాశాలు ఇప్పుడు హరితేజ ముంగిట్లో వాలుతున్నాయి. తాజాగా ఆమె యాంకర్‌గా రీ- ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా స్టార్స్‌తో చిట్‌ చాట్‌ చేస్తున్నారు. అదే జెమినీ చానల్‌లో ప్రసారమవుతున్న ‘ఫిదా’. సినీ ప్రముఖుల దగ్గరకే వెళ్లి వాళ్ల లైఫ్‌ స్టయిల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసే కార్యక్రమం ఇది. ఇప్పటివరకూ నటి మంచు లక్ష్మీ ప్రసన్న, కథానాయిక రకుల్‌ ప్రీత్‌సింగ్‌లను ఇంటర్వ్యూ చేశారు. తాజాగా అఖిల్‌ ఇంటర్వ్యూ కూడా రానుంది. రానురాను హరితేజ ఖాతాలో ఇంకెన్ని అవకాశాలు పడతాయో చూడాలి!
entertainment
3,630
10-01-2017 01:39:11
అఖిలేష్‌ దూకుడు
అఖిలేష్‌ యాదవ్‌తో తనకు విభేదాలు లేవనీ, ఆయన రాష్ట్రముఖ్యమంత్రి, తాను పార్టీ అధినేతనని ములాయం సింగ్‌ యాదవ్‌ సోమవారం వ్యాఖ్యానించారు. పాతికేళ్ళ క్రితం తాను స్థాపించిన సమాజ్‌వాదీ పార్టీ అధినాయకత్వ హోదానీ, పార్టీ గుర్తు సైకిల్‌నూ తనకు దక్కించమంటూ ఢిల్లీ వచ్చి ఎన్నికల సంఘాన్ని వేడుకున్నారాయన. రాజకీయ కుటుంబాల్లో వారసత్వ పోరాటాలు సహజమే కానీ, యూపీలో జరుగుతున్నది పూర్తి భిన్నమైనది. హోదా, గుర్తు రెండూ నీవి కావు పొమ్మన్నాడు ఆయన పుత్రరత్నం. తండ్రీకొడుకుల మధ్య స్పర్థలు లేవనీ, ఒకే ఒక్కడి కారణంగా పార్టీలోనే సమస్యలు పుట్టుకొచ్చాయని ములాయం అంటున్నారు. అఖిలేష్‌ వర్గమూ ఈ రచ్చకంతా ఒకే ఒక్కడు కారణమని అంటున్నది. ములాయం ప్రకారం ఆ వ్యక్తి రామ్‌గోపాల్‌ యాదవ్‌. అఖిలేష్‌ ప్రకారం అతడు అమర్‌సింగ్‌. సమస్య త్వరలోనే సమసిపోతుందన్న ములాయం వ్యాఖ్య నిజానికి అర్థంలేనిది. ఎన్నికల సంఘాన్ని కలిసి వచ్చి ఆయన నాలుగుముక్కలు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అమర్‌సింగ్‌ వెనుకనే నిలబడి ఉన్నారు. పార్టీ చీలిపోయిందని ములాయం ఒప్పుకోకపోవడం సహజం. డిసెంబరు 30న తాను రామ్‌గోపాల్‌ యాదవ్‌ను ఆరేళ్ళపాటు సస్పెండు చేశాను కనుక, సదరు వ్యక్తి ఆధ్వర్యంలో జనవరి 1న జరిగిన జాతీయస్థాయి సమావేశం చెల్లదని ములాయం వాదన. ఈ సమావేశంలో ఓ రెండువందల మందికి పైగా ఎమ్మెల్యేలూ, ఎంపీలు, వందలాది నాయకులూ కార్యకర్తలూ అఖిలేష్‌కు మద్దతు ప్రకటిస్తూ, ఆయనను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. శనివారం ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియచేస్తూ రామ్‌గోపాల్‌ యాదవ్‌ ఆరుపెట్టెలనిండా లక్షన్నర డాక్యుమెంట్లు సమర్పించారు. దీనికి రెండురోజుల ముందు అఖిలేష్‌ ఏర్పాటుచేసిన సమావేశానికి 229 మంది ఎమ్మెల్యేలలో 220 మంది హాజరయ్యారు.  ములాయం ఢిల్లీ వస్తున్న సందర్భంగా ఆయన ఢిల్లీ నివాసంలో ఉన్న పెద్ద పోస్టర్‌లో రామ్‌గోపాల్‌ యాదవ్‌ ఉన్న భాగాన్ని మాత్రమే చింపివేసి కార్యకర్తలు జాగ్రత్తపడ్డారు కానీ, పార్టీ యావత్తూ ఆయన గుప్పిట దాటిపోయిందన్నది వాస్తవం. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు ఆరంభం కావడానికి సరిగ్గా నెలరోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో, సైకిల్‌ గుర్తు దక్కడం అఖిలేష్‌ వర్గానికి అత్యంత ముఖ్యం. తమకు ఖాయంగా ఆ గుర్తు దక్కుతుందని అఖిలేష్‌వర్గం విశ్వసిస్తున్నప్పటికీ, ములాయం వాదనతో ఏకీభవించి ఎన్నికల సంఘం ఆ గుర్తు ఆయనకే దఖలు పరచిన పక్షంలో కొంత ఇబ్బంది తప్పదు. కాంగ్రెస్‌తో పొత్తు ఖాయం కావడానికి ఈ గుర్తు అఖిలేష్‌కు ఎంతో ఉపకరిస్తుంది. ‘బ్రాండ్‌ అఖిలేష్‌’ అని ఆయన పక్షం నాయకులు ఎంత గొప్పకుపోతున్నా, ఇంత తక్కువ సమయంలో కొత్త గుర్తును ప్రజలకు పరిచయం చేసుకోవడం, ఓట్లు దానికే పడేట్టు చూసుకోవడం అంత తేలికైన విషయం కాదు. గుర్తు సంగతి వేగంగా తేల్చండని అఖిలేష్‌ వర్గం ఎన్నికల సంఘంపై ఒత్తిడిపెడుతున్నా, నామినేషన్ల ప్రక్రియ ఆరంభమయ్యే 17వ తేదీలోగా దీనిని నిర్ణయించడం ఎన్నికల సంఘానికి కష్టమైన పని. అందువల్ల, సైకిల్‌ను పక్కనపడేసి, ఇరుపక్షాలకూ కొత్త గుర్తులిచ్చే అవకాశాలే అధికంగా ఉన్నాయి. అయినప్పటికీ, ఈ వివాదం అఖిలేష్‌కు కొత్త ఊపిరినిచ్చిన మాట వాస్తవం. అంతవరకూ మోస్తూ వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ఆయన తప్పించుకున్నాడు. శాంతిభద్రతలు, పాలనాపరమైన వైఫల్యాలకు తాను కాక, తనమీద పెత్తనం చేస్తున్న ఈ పెద్దలే కారణమని ఆయన పరోక్షంగా ప్రజలకు చెప్పగలిగాడు. వారి కబంధహస్తాలనుంచి బయటపడిన ఒక యువనేతగా అతడు భవిష్యత్తులో చక్కని పాలన అందించగలుగుతాడని ప్రజలు విశ్వసించవచ్చు.  నేను పార్టీ అధినేతను, నా కుమారుడు ముఖ్యమంత్రి అంటూ ములా యం చేసిన వ్యాఖ్య పార్టీకి బలమైన ఓటుబ్యాంకుగా ఉన్న ముస్లింలు, యాదవులకు ఉపశమనాన్నిస్తుంది. తండ్రీకొడుకులు విడిపోలేదనీ, ములాయం ముఖ్యమంత్రి పక్షానే ఉన్నారన్న భావన వారికి కలిగేందుకు ఇది ఉపకరిస్తుంది. రాష్ట్రంలో పార్టీ ప్రతిష్ఠ క్రమంగా దిగజారిపోతున్న తరుణంలో కొన్ని దుష్టశక్తులను వదల్చుకోవడానికీ, పార్టీపై పూర్తి పట్టు కుమారుడికి కట్టబెట్టడానికీ తండ్రీకొడుకులు ఇద్దరూ కలసి ఈ నాటకం ఆడుతున్నారన్న విశ్లేషణలూ లేకపోలేదు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే సమాజ్‌వాదీపార్టీ హఠాత్తుగా ఈ వివాదానికి తెరతీసిందని ప్రధానంగా బీజేపీ, అడపాదడపా బీఎస్పీ కూడా విమర్శిస్తున్నాయి. ఈ విమర్శలూ విశ్లేషణల్లో నిజమెంత అన్నది అటుంచితే, ఈ నాలుగు నెలల కాలంలో అఖిలేష్‌ తండ్రిచాటు బిడ్డడి నుంచి అత్యంత డైనమిక్‌ నాయకుడిగా మారిపోయారు.  పార్టీ సమావేశాల్లో పెద్దల కాళ్ళకు వినయంగా నమస్కరిస్తూనే, మరొకపక్కన ఘాటైన వ్యాఖ్యలతో ఏకిపారేయడం మొదలుకొని, ఇప్పుడు ఏకంగా పార్టీనే హస్తగతం చేసుకోవడంలో ఆయన ప్రదర్శించిన ధైర్యం, వేగం ఆయన పట్ల ఉన్న అంచనాలను మార్చింది. పార్టీకంటే ఆయన పేరే ఇప్పుడు అధికంగా మారుమోగుతున్నది. అయినప్పటికీ, రేపు సైకిల్‌గుర్తు దక్కకపోతే ఎంత స్కోరు సాధించగలరన్నది అసలు ప్రశ్న.
editorial
10,855
13-10-2017 17:51:36
రాజాకి క్లీన్ సర్టిఫికెట్.. గ్రేట్ కదా!
రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రాజా ది గ్రేట్'. రవితేజ అంధునిగా నటించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ సభ్యుల నుండి క్లీన్ యు/ఏ సర్టిఫికెట్‌తో పాటు, ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెహరీన్ హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రంలో రవితేజకి తల్లిగా సీనియర్ నటి రాధిక నటించారు.
entertainment
6,661
10-02-2017 11:34:05
తనయుడితో రీఎంట్రీ ఇవ్వనున్న నందమూరి హరికృష్ణ
నందమూరి హరికృష్ణ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ముఖానికి రంగేసుకోబోతున్నాడు. తనయుడు కళ్యాణ్ రామ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడట హరికృష్ణ...నందమూరి కథానాయకుడు హరికృష్ణ దాదాపు పన్నిండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత.. మళ్లీ సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. 'సీతారామరాజు', 'లాహిరి లాహిరి లాహిరిలో', 'సీతయ్య' వంటి హిట్ సినిమాలలో కథానాయకుడిగా నటించిన హరికృష్ణ.. ఇప్పుడు తన తనయుడు కళ్యాణ్ రామ్ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడట.                  'లాహిరి లాహిరి లాహిరిలో..'ని హరికృష్ణ,భానుప్రియ  నటరత్న నందమూరి తారకరామారావు వారసత్వంగా నటనను ప్రారంభించిన హరికృష్ణ.. తన కెరీర్ లో ఇంత లాంగ్ గ్యాప్ తీసుకోవడం ఇది రెండోసారి. పదేళ్ల వయసులోనే నటనను ప్రారంభించిన హరికృష్ణ.. బాలనటుడిగా 60, 70లలోనే 'శ్రీకృష్ణావతారమ్', 'తల్లా పెళ్లామా', 'తాతమ్మకల', 'రామ్ రహీమ్', 'దానవీర శూరకర్ణ' వంటి చిత్రాల్లో పలు ప్రాధాన్యతగల పాత్రలతో మెప్పించాడు. 1977లో విడుదలైన చిత్రరాజం 'దానవీర శూరకర్ణ' తర్వాత.. దాదాపు ఇరవై సంవత్సరాల గ్యాప్ తీసుకున్న హరికృష్ణ.. మోహన్ బాబు 'శ్రీరాములయ్య' సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు.కథానాయకుడిగా సోలో హిట్స్ అందించిన నందమూరి హీరో హరికృష్ణ.. ఇప్పుడు తనయుడు కళ్యాణ్ రామ్ సినిమాలో కీలక పాత్రలో అలరించనున్నాడట. పవన్ సాదినేని దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా రూపొందే చిత్రంలో.. హరికృష్ణకోసం ప్రత్యేకంగా ఓ పాత్రను రూపొందించారట. మొత్తంమీద.. ఎవ్వరిమాటా వినని ఈ సీతయ్య.. మరోసారి వెండితెరపై తన రౌద్రరూపాన్ని ప్రదర్శిస్తాడేమో చూడాలి.నందమూరి హరికృష్ణ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ముఖానికి రంగేసుకోబోతున్నాడు. తనయుడు కళ్యాణ్ రామ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడట హరికృష్ణ...నందమూరి కథానాయకుడు హరికృష్ణ దాదాపు పన్నిండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత.. మళ్లీ సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. 'సీతారామరాజు', 'లాహిరి లాహిరి లాహిరిలో', 'సీతయ్య' వంటి హిట్ సినిమాలలో కథానాయకుడిగా నటించిన హరికృష్ణ.. ఇప్పుడు తన తనయుడు కళ్యాణ్ రామ్ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడట.                  'లాహిరి లాహిరి లాహిరిలో..'ని హరికృష్ణ,భానుప్రియ  నటరత్న నందమూరి తారకరామారావు వారసత్వంగా నటనను ప్రారంభించిన హరికృష్ణ.. తన కెరీర్ లో ఇంత లాంగ్ గ్యాప్ తీసుకోవడం ఇది రెండోసారి. పదేళ్ల వయసులోనే నటనను ప్రారంభించిన హరికృష్ణ.. బాలనటుడిగా 60, 70లలోనే 'శ్రీకృష్ణావతారమ్', 'తల్లా పెళ్లామా', 'తాతమ్మకల', 'రామ్ రహీమ్', 'దానవీర శూరకర్ణ' వంటి చిత్రాల్లో పలు ప్రాధాన్యతగల పాత్రలతో మెప్పించాడు. 1977లో విడుదలైన చిత్రరాజం 'దానవీర శూరకర్ణ' తర్వాత.. దాదాపు ఇరవై సంవత్సరాల గ్యాప్ తీసుకున్న హరికృష్ణ.. మోహన్ బాబు 'శ్రీరాములయ్య' సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు.కథానాయకుడిగా సోలో హిట్స్ అందించిన నందమూరి హీరో హరికృష్ణ.. ఇప్పుడు తనయుడు కళ్యాణ్ రామ్ సినిమాలో కీలక పాత్రలో అలరించనున్నాడట. పవన్ సాదినేని దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా రూపొందే చిత్రంలో.. హరికృష్ణకోసం ప్రత్యేకంగా ఓ పాత్రను రూపొందించారట. మొత్తంమీద.. ఎవ్వరిమాటా వినని ఈ సీతయ్య.. మరోసారి వెండితెరపై తన రౌద్రరూపాన్ని ప్రదర్శిస్తాడేమో చూడాలి.
entertainment
9,116
30-05-2017 18:23:11
సైఫ్ అలీ ఖాన్ కూతురు కోసం పోటీ పడుతున్న డైరెక్టర్స్
శ్రీదేవి కూతుర్ని వెండితెరకు పరిచయం చేయడానికి పోటీపడిన బాలీవుడ్ డైరెక్టర్స్, ఇప్పుడు మరో స్టార్ డాటర్ విషయంలో తీవ్రంగా పోటీపడుతున్నారట. ఇంతకీ బాలీవుడ్ బడా డైరెక్టర్స్‌ను మెప్పిస్తోన్న ఆ స్టార్ డాటర్ ఎవరు? హీరోల కొడుకులను హీరోలుగా ఇంట్రడ్యూస్ చేయడానికి ఎంతో మంది డైరెక్టర్స్ ఆసక్తి చూపించడం చూస్తూ ఉంటాం. అయితే.. ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ హీరో కూతుర్ని పరిచయం చేయడానికి తెగ పోటీపడుతున్నారట అగ్ర దర్శకులు. ఆ స్టార్ డాటర్ ఎవరో కాదు. సైఫ్ అలీ ఖాన్ గారాల పట్టి సారా అలీ ఖాన్. సారా అరంగేట్రం కోసం బాలీవుడ్, ఇప్పుడు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తోంది. ఈ ముద్దుగుమ్మను హీరోయిన్‌గా పరిచయం చేయడానికి తహతహలాడిపోతున్నారు బాలీవుడ్ దర్శకులు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్.. మొదట సారాను 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2' తో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ చేద్దామనుకున్నాడు. అయితే.. ఇప్పుడు షారుఖ్ తనయుడిని వెండితెరకు పరిచయం చేసే బాధ్యత కూడా తనపైనే ఉందికాబట్టి.. షారుఖ్ కొడుకుతోనే సైఫ్ కూతుర్ని హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ చేద్దామనుకుంటున్నాడట కరణ్ జోహార్. కరణ్ జోహార్ ఇంట్రడ్యూస్ చేసే లోపే సారాను పరిచయం చేసే క్రెడిట్ తానే కొట్టేయాలని భావిస్తున్నాడట మరో డైరెక్టర్ అభిషేక్ కపూర్. సుశాంత్ రాజ్ పుత్ హీరోగా తెరకెక్కించబోయే ‘కేదార్ నాథ్’ సినిమాలో సారా అలీ ఖాన్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడట. మరి.. కరణ్ జోహార్ - అభిషేక్ కపూర్ ఇద్దరిలో ఎవరికి సారా‌ను హీరోయిన్‌గా పరిచయం చేసే ఛాన్స్ దక్కుతుందో చూడాలి.
entertainment
11,279
17-03-2017 18:31:06
‘పెద్ద వివాదంలో సియాచిన్ సమస్య అంతర్భాగం’
న్యూఢిల్లీ : సియాచిన్ సమస్యకు పరిష్కరం పెద్ద వివాదంలో అంతర్భాగమని పాకిస్థాన్‌కు భారతదేశం స్పష్టం చేసింది. భారత్‌‌లో ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతివ్వడం సహా ఇది భారీ వివాదమని తెలిపింది. సియాచిన్ సమస్య పరిష్కారం కోసం ఇరు దేశాల రక్షణ శాఖ కార్యదర్శుల నేతృత్వంలో 13సార్లు చర్చలు జరిగినట్లు రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాశ్ భామ్రే లోక్‌సభకు తెలిపారు. భారతదేశంలో ఉగ్రవాదానికి పాకిస్థాన్ సహకరించడం సహా సియాచిన్ హిమానీశైలం సమస్య పరిష్కారం కూడా భారీ వివాదంలో భాగమని ఆ దేశానికి తెలిపినట్లు వివరించారు. సియాచిన్‌ వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని ప్రభుత్వం గుర్తించిందని సుభాశ్ తెలిపారు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన రణరంగంగా సియాచిన్‌కు పేరుందని, అవసరమైన స్థాయిలో బలగాలను మోహరించామని చెప్పారు. రాడార్లు, మానవ రహిత గగనతల వాహనాల నిఘా ఏర్పాటు చేశామన్నారు.
nation
9,212
15-09-2017 22:22:24
తమన్నా.. అదరగొట్టావ్‌!
‘జై లవ కుశ’ చిత్రంలో తమన్నా ‘సింగ్‌ జరా..’ అంటూ సాగే ప్రత్యేక పాటలో హీరో తారక్‌తో కలిసి స్టెప్పులేశారు. ఈ సందర్భంగా ‘‘అమేజింగ్‌ సాంగ్‌ ‘స్వింగ్‌ జరా’లో నర్తించే అవకాశం ఇచ్చిన దర్శకుడు బాబీ, హీరో తారక్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కు థాంక్స్‌. ‘బెస్ట్‌ ఆఫ్‌ ద బెస్ట్‌’ అయిన ఈ ముగ్గురితో కలిసి పనిచేయడాన్ని బాగా ఆస్వాదించా. 21న విడుదల వుతున్న ‘జై లవ కుశ’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని తమన్నా తెలిపారు. ఆమెను సంగీత దర్శకుడు దేవి ప్రశంసించారు. ‘‘హే.. థాంక్యూ డియర్‌ తమన్నా! ‘స్వింగ్‌ జరా’ పాటలో నువ్వు అదరగొట్టావు! నీ, తారక్‌ డాన్స్‌ని జనం ఇష్టపడతారు’’ అని ట్వీట్‌ చేశారు.
entertainment
3,341
06-08-2017 23:09:23
ఇషికవ తకుబొకు తంకాలు కొన్ని
‘ఇషికవా టకుబొకు తన లోతైన జపానీ గొంతుతో గానం చేస్తున్నాడు... ‘‘నేనొక దుఃఖభాజనుడ్ని. నేను బలహీ నుడ్ని. కానీ నా చేతిలో ఒక అద్వితీయమైన భయం కరఖడ్గం ఉంది. నేను యుద్ధం చేయకపోతే దాన్ని నేను సహించలేను. కానీ నేను జయించలేకపోతున్నాను. అంటే ఇక మరణమే నాకు శరణమన్న మాట. కానీ నాకు చావంటే పరమరోత. నాకు చావడం ఇష్టం లేదు. మరి బ్రతకటం ఎలా?’’ ’(శేషేంద్ర ‘ఆధునిక మహాభారతం’, 1985) ఇషికవ తకుబొకు (1886-1912) జపానులోని ఒక పల్లెటూళ్లో పుట్టాడు. చదువు మధ్యలోనే ఆగిపో యింది. ప్రేమించిన అమ్మాయిని పందొమ్మిదో ఏట పెళ్లి చేసుకున్నాడు. రకరకాల ఉద్యోగాలు చేశాడు. ఏ ఉద్యోగంలో స్థిరంగా ఉండలేకపోయాడు. దారిద్య్రం, అనారోగ్యం, కాపురంలో కలతలు, తండ్రి పలాయనం, తల్లి మరణం- నానాటికి జీవితం దుర్భరమైపోయింది. ఇరవయ్యేడో ఏట క్షయతో కన్నుమూశాడు. మొదట కాల్పనికవాది అయిన తకుబొకు తర్వాత స్వాభావికవాదిగా మారి, చివరికి సామ్యవాది అయ్యాడు. ఒక సందర్భంలో సాహిత్య సృజనని మాస్టర్బేషన్‌తో పోల్చిన తకుబొకు కవిత్వంతోపాటు కథలు, నవలలు, వ్యాసాలు, డైరీలు కూడా రాశాడు. అతని కవిత్వంలో అధిక భాగం తంకాలే. ""His popularity, however, seems to depend less on his poetry than on the life that produced it అంటాడు మకొతొ ఉయెద. తకుబొకు తంకాలు కొన్ని చూడండి:నా మిత్రులంతా నా కంటె ఉన్నతంగా కనిపించిన రోజుఇంటికి పువ్వుతో వచ్చిమా ఆవిడపై ప్రేమ చూపానుఆమె ఒడిలో తలపెట్టుకున్నపుడు సైతంనా ఆలోచనలన్నీనా గురించేబాట పక్క కుక్క దీర్ఘంగా ఆవులించిందిదాన్ని అనుకరించానుఈర్ష్యతోకళ్లు మూసుకున్నానుమనస్సులో ఏమీ మెదలలేదుఒంటరితనంతో మళ్లీ కళ్లు తెరిచానుఒక్క క్షణం నా అస్వస్థతను మర్చిపోయిఎద్దులా రంకె వేయడానికి ప్రయత్నించానుమా ఆవిడా, పాపా ఇంట్లో లేనప్పుడుతిట్టాను,ఏడుస్తూ నిద్రపోయింది పాపకొద్దిగా నోరు తెరిచి నిద్రిస్తున్న తన ముఖాన్ని స్పృశించానుపరిచయం, అనువాదం  గాలి నాసరరెడ్డి
editorial
16,272
03-04-2017 02:32:11
యువశక్తి మన దేశబలం
ఆలోచనకు సంకల్పం తోడవ్వాలి: మోదీ ఆదిభట్ల, ఏప్రిల్‌ 2: దేశానికి ఉన్న అతి పెద్ద శక్తి యువతరం మాత్రమేనని, ప్రపంచంలో ఏ దేశానికి లేని గొప్ప వరం మనకే సొంతమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. మనకున్న గొప్ప ఆలోచనలకు బలమైన సంకల్పం తోడైతే ప్రపంచం నివ్వెరపోయేలా నూతన ఆవిష్కరణలు సాధ్యమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని సీవీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో రెండు రోజుల పాటు కొనసాగిన ‘స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌-2017’ గ్రాండ్‌ ఫినాలే సదస్సు ఆదివారం ముగిసింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, అఖిల భారత సాంకేతిక మండలి సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల విద్యార్థులు హాజరయ్యారు. సదస్సు ముగింపు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పరవళ్లు తొక్కుతున్న యువతరం తమ మేధస్సుకు పదును పెట్టి నూతన ఆవిష్కరణలు సాధించే దిశగా కృషి చేయాలని ప్రధాని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నవ సంకల్పాన్ని ప్రోత్సహించి దేశ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేయాలనే లక్ష్యంతోనే స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. యువత తమ వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్నారని ప్రశంసించారు. ఈ తరం యువకులు ఉద్యోగాలు అర్థించే స్థాయి నుంచి, ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదిగారని అభినందించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత బీవీఆర్‌.మోహన్‌ రెడ్డి, సీవీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల చైర్మన్‌ సీవీ.రాఘవతో పాటు, పలువురు విద్యార్థులు, అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
nation
10,740
11-03-2017 11:16:07
పూరీ సినిమాకు బాలయ్య రెమ్యునరేషన్ ఎంతో తెల్సా?
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ 101వ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ ఆసక్తికర కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం బాలయ్యకు భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారట. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి ముందు బాలయ్య 5 నుంచి 7 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అయితే క్రిష్ తెరకెక్కించి చారిత్రక చిత్రం 50 కోట్ల క్లబ్‌లో చేరడంతో రెమ్యునరేషన్ పెంచాలని బాలయ్య నిర్ణయించుకున్నాడట. సినిమాలపై బాలయ్యకున్న అంకితభావాన్ని చూసి ఆయన అడిగిన రెమ్మునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు కూడా సిద్ధమయ్యారట. బాలయ్యతో పూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పూర్తి బడ్జెట్ రూ. 35 కోట్లు అయితే అందులో బాలయ్యకు రూ. 10 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన 25 కోట్ల రూపాయలనే ఇతర నటీనటులకు, సిబ్బందికి రెమ్యునరేషన్‌గా ఇవ్వడంతో పాటు సినిమా నిర్మాణానికి ఉపయోగించాలని నిర్మాతలు భావిస్తున్నారట. అతితక్కువ కాలంలో సినిమా తీసే దర్శకుడిగా పూరీకి పేరుంది. అదీకాకుండా ఈ సినిమాలో హీరోయిన్‌తో పాటు అందరినీ కొత్తవాళ్లనే తీసుకుంటున్నారు. ఐదేఅయిదు నెలల్లో క్వాలిటీతో కూడిన అవుట్‌పుట్‌ను పూరీ అందిస్తాడని నిర్మాత ఆనంద్ ప్రసాద్ భావిస్తున్నారు. అంతా అనుకున్నట్టే జరిగితే తమ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్‌ రూ. 15 కోట్లను ఆర్జిస్తుందని, థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ. 40 కోట్లు, ఆడియో/వీడియో రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్ కూడా కలుపుకుని రూ. 12 కోట్లు వచ్చే అవకాశం ఉందని నిర్మాత లెక్కలు వేసుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.
entertainment
8,738
19-11-2017 12:09:08
‘లెజెండ్’కు అవార్డు ఇవ్వడంలోనే అభ్యంతరం: డైరెక్టర్ శంకర్
హైదరాబాద్: నంది అవార్డుల వివాదంపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నగరంలోని దసపల్లా హోటల్‌లో ఓపెన్ డిబేట్ కార్యక్రమం జరుగుతోంది. ఈ డిబేట్‌లో పాల్గొన్న దర్శకుడు శంకర్ మాట్లాడుతూ.. నంది అవార్డుల వివాదం విషయంలో ‘లెజెండ్’ సినిమా పైనే ఎక్కువ ప్రభావం ఉందని చెప్పారు.  ‘‘బాలకృష్ణ గారికి అవార్డు ఇవ్వడంలో పెద్దగా ఎవరికీ అభ్యంతరం లేదు. ఆ సినిమాకే బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఇవ్వడం కూడా అభ్యంతరం లేదు. కానీ, బెస్ట్ సినిమా అనేసరికి చాలా మంది అభ్యంతరం చెబుతున్నారు. అంటే ఆ సినిమాలో ఎక్కువ వైలెన్స్ ఉంది కదా.. మీరు చంపండి అని ప్రోత్సహిత్సారా? అని చాలామందికి కలిగే ప్రశ్న. అదొక్కటే తప్ప మిగతా ఏమీ నాకు భిన్నంగా కనపడలేదు.’’ అని డైరెక్టర్ శంకర్ చెప్పారు. ముఖ్యమంత్రికి సూటి ప్రశ్న వేసిన తెలుగు హీరో  భర్త రితేష్‌తో జెనీలియా పెళ్లికి ముందే చేసిందట!
entertainment
14,152
16-10-2017 04:25:00
బెంగళూరు అతలాకుతలం!
115 ఏళ్లలో గరిష్ఠ వర్షపాతం.. రెండు నెలలుగా వానలుఇప్పటికే 1615 మిల్లీమీటర్లు.. మరింత పెరిగే అవకాశంబెంగళూరు, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): బెంగళూరును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుంభవృష్టితో ముంచెత్తుతున్నాయి. గత 61 రోజుల్లో 52 రోజులపాటు నగరంలో కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 14వ తేదీ వరకూ 1,615 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 2005 సీజన్‌లో నగరంలో 1,606.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ప్రస్తుతం దాన్ని మించడంతోపాటు... 115 ఏళ్లలో అత్యధిక స్థాయిలో వర్షం రావడం గమనార్హం. అంతేకాదు... మరింత వర్షం కురిసే అవకాశముందని కర్ణాటక వాతావరణ పరిశోధనశాఖ డైరెక్టర్‌ రమేశ్‌బాబు వెల్లడించారు. వాతావరణపరంగా బెంగళూరుకు ఉన్న ప్రత్యేకతలే ఇందుకు కారణమంటున్నారు. నైరుతి రుతు పవనాల వల్ల ఇప్పటి వరకూ వర్షాలు కురిశాయి. ఈశాన్య రుతుపవనాలతోనూ మధ్య కర్ణాటక ప్రాంతంలో వర్షాలు కురుస్తాయి. దీని పరిధిలోనే బెంగళూరు కూడా ఉంది. ఇంకా దాదాపు రెండున్నర నెలల సీజన్‌ ఉన్నందున భారీ వర్షాలు తప్పవని చెప్తున్నారు. ప్రస్తుతం రాజాజీ నగర్‌కు అనుబంధమైన కురబరహళ్ళిలో కాలువలో కొట్టుకుపోయినవారిలో ఇరువురి మృతదేహాలు లభించగా మరొకరి దేహం కోసం గాలింపులు సాగుతున్నాయి. నగరంలో ఎన్‌డీఆర్‌ఎఫ్, సివిల్‌ డిఫెన్స్‌, అగ్నిమాపకశాఖతోపాటు బీబీఎంపీ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.  రబ్బరు పడవను కొనుక్కున్నారు!వర్షాలకు రోడ్లు కాలువలను తలపిస్తుండడంతో... బెంగళూరుకు చెందిన ఓ కుటుంబం ముగ్గురు ప్రయాణించే ఒక పడవను కొనుక్కున్నారు. సహాయం కోసం సహాయ బృందాల కోసం ఎదురుచూడకుండా పడవను ఉపయోగించవచ్చనే రబ్బరు బోటును కొనుగోలు చేశామని డాక్టర్‌ శాలినీ చెప్పారు.
nation
11,865
07-04-2017 22:01:33
ఆప్ ప్రధాన కార్యాలయానికి కేటాయించిన.. భవనం రద్దు!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఆప్ ప్రధాన కార్యాలయానికి కేటాయించిన భవనాన్ని ఆయన రద్దు చేసినట్లు ఆ పార్టీ ప్రతినిధి సంజయ్ సింగ్ శుక్రవారం తెలిపారు. ఆప్‌పై మీకు అంత శతృత్వం ఎందుకు, ఏం నేరం చేశామని ఆయన ప్రశ్నించారు.  ఢిల్లీలో అధికారంలో ఉన్న తమను పని చేసుకోకుండా ఎందుకు ఇలా చేస్తాన్నారని సంజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ చెత్త రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కార్యాలయం దీన్ని అధికారికంగా ధృవీకరించలేదు.
nation
7,573
12-12-2017 11:30:03
అనిల్ రావిపూడితో బాలయ్యబాబు..!
నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో నందమూరి అభిమానులకు కనువిందు చేస్తున్నారు. ఇటీవలే 'పైసావసూల్' సినిమాతో దుమ్మురేపిన ఈయన తాజాగా 'జై సింహా' అంటూ ప్రేక్షకులముందుకు రాబోతున్నారు. బాలకృష్ణ 102వ చిత్రంగా కే.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య సరసన యనతార, నటాషా జోషి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 12న దేశవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి గత కొద్దిరోజుల టాలీవుడ్ వర్గాల్లో పలు వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ నెక్స్ట్ ప్రాజెక్ట్ సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఉంటుందని, అందుకు సంబందించిన పనులు కూడా వేగవంతం చేశారని చెప్పుకున్నారు. ఇదిలా ఉండగానే తాజాగా బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. బాలయ్య తన తర్వాతి సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడని ఆ వార్త సారాంశం. ఈ ప్రాజెక్ట్ దిల్‌రాజు నిర్మాణంలో ఉండనుందని, ఇందుకు సంబందించిన పూర్తి వివరాలు అతిత్వరలో ప్రకటించనున్నారని సమాచారం. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది ఓ క్లారిటీ అయితే రాలేదు కానీ.. వరుస సినిమాలు చేస్తున్న బాలయ్యను చూసి ఆయన అభిమానులు మాత్రం తెగ సంబరపడిపోతున్నారు.
entertainment
1,121
27-07-2017 00:39:25
లాభాల్లో ఓరియంట్‌ సిమెంట్‌
సికె బిర్లా గ్రూప్‌నకు చెందిన ఓరియంట్‌ సిమెంట్‌ లిమిటెడ్‌ 2017-18 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నష్టాల నుంచి బయట పడింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.7.56 కోట్లు నష్టపోయిన ఈ కంపెనీ ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.38.92 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం 30 శాతం పెరిగి రూ.656.73 కోట్లకు చేరింది. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే రూ.1,946 కోట్లతో రెండు సిమెంట్‌ కంపెనీల కొనుగోలు కోసం ఒప్పందాలపై సంతకాలు చేసినట్టు తెలిపింది.
business
20,100
11-08-2017 01:46:34
చమీర, గమగెలకు పిలుపు
భారత్‌తో మూడో టెస్టుకు లంక జట్టు ప్రకటన కాండీ: గాయాల కారణంగా భారత్‌తో మూడో టెస్టుకు దూరమైన స్పిన్నర్‌ రంగన హెరాత్‌, పేస ర్‌ నువాన్‌ ప్రదీప్‌ల స్థానంలో పేసర్లు దుష్మంత చమీర, లహిరు గమగెలను శ్రీలంక జట్టులోకి తీసుకుంది. కాగా.. పేలవ ప్రదర్శన చేస్తున్న దనుష్క గుణతిలకను జట్టు నుంచి తప్పించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో శనివారం మొదలయ్యే ఆఖరి టెస్టుకు శ్రీలంక జట్టులో ఈ మూడు మార్పులు చోటుచేసుకున్నా యి. చమీర, గమగె ఎంపికతో లంక జట్టులో పేసర్ల సంఖ్య నాలుగుకి చేరింది. శ్రీలంక జట్టు వివరాలు: చాందిమల్‌ (కెప్టెన్‌), తరంగ, కరుణరత్నె, కుశాల్‌ మెండిస్‌, మాథ్యూస్‌, తిరిమన్నె, ధనంజయ డిసిల్వ, డిక్‌వెలా (వికెట్‌కీపర్‌), దిల్‌రువాన్‌ పెరీర, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, చమీర, గమనె, సండకన్‌, పుష్పకుమార.
sports
8,656
24-05-2017 16:43:27
మరోసారి శ్రీనువైట్లకు ఛాన్స్ ఇస్తున్న రామ్
ప్లాపుల్లో ఉన్న దర్శకులను ఏ హీరో కూడా పట్టించుకోడు. అయితే.. రామ్ మాత్రం ప్లాపుల్లో ఉన్న దర్శకుడితో సినిమాకు సై అన్నాడట. ఆ దర్శకుడు తనకు గతంలో ఓ బంపర్ హిట్ ఇవ్వడమే అందుకు కారణమట. ఇంతకూ ఎవరా దర్శకుడు..? 'విన్నర్' సినిమాతో వరుస ప్లాపుల నుంచి బయటపడి విజేత అవుదామనుకున్న శ్రీనువైట్ల ఆశలు అడియాశలే అయ్యాయి. దీంతో సక్సెస్‌కు మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలెవరు శ్రీనువైట్ల వైపు చూడటంలేదు. దీంతో మరోసారి యువహీరోలతోనే హిట్ కొట్టాలనే ప్రయత్నాల్లో ఉన్నాడట శ్రీనువైట్ల. ఈ నేపథ్యంలో తనకు గతంలో 'రెడీ' వంటి భారీ హిట్ ఇచ్చిన శ్రీనువైట్లతో సినిమాకు రామ్ సై అన్నాడనే ప్రచారం సాగుతోంది. ఇటీవల స్టోరీ లైన్ వినిపించిన శ్రీనువైట్లకు రామ్ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. 'నేను శైలజ'తో విజయాన్ని ఇచ్చిన కిశోర్ తిరుమల దర్శకత్వంలో ప్రస్తుతం నటిస్తున్నాడు రామ్. గతంలో 'కందిరీగ'తో హిట్ ఇచ్చాడని ప్లాపుల్లో ఉన్న సంతోష్ శ్రీనివాస్‌కు 'హైపర్' మూవీ ఛాన్సిచ్చాడు రామ్. సో... సక్సెస్ ఫెయిల్యూర్స్‌ను పక్కనపెట్టి అంతకుముందు తనకు విజయాలు ఇచ్చిన దర్శకులతో మరోసారి అవకాశం ఇచ్చే రామ్, ఇప్పుడు శ్రీనువైట్లకు కూడా ఇలాగే మరో ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు. మరి ఈ కొత్త ప్రాజెక్ట్‌పై క్లారిటీ రావాలంటే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే..!
entertainment
15,509
21-05-2017 13:47:34
ఆరెస్సెస్ ముస్లిం విభాగం సరికొత్త నిర్ణయం
లక్నో : రంజాన్ మాసంలో శుక్రవారాల్లో ఇఫ్తార్ విందులివ్వాలని ఆరెస్సెస్ ముస్లిం విభాగం నిర్ణయించింది. గోవులను కాపాడాలనే సందేశాన్ని వ్యాపింపజేసేందుకు ఆవు పాలు, వాటి ఉత్పత్తులను మాత్రమే అందజేయబోతోంది. గో మాంసాన్ని తినడం వల్ల వ్యాధులు ప్రబలుతాయని తెలియజేస్తోంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ముస్లిం రాష్ట్రీయ మంచ్ జాతీయ సహ సమన్వయకర్త మహిరాజ్ ధ్వజ్ సింగ్ మాట్లాడుతూ రోజా పాటించేవారు గ్లాసు ఆవు పాలతో ముగించడం ఇదే తొలిసారి అని తెలిపారు. రంజాన్ సందర్భంగా ఉత్తర ప్రదేశ్‌లో ప్రతి శుక్రవారం ఇఫ్తార్ విందును ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ముస్లిం మత పెద్దలు కూడా ఆవు పాలు శ్రేష్ఠమైనవని అంగీకరిస్తున్నారని తెలిపారు. ఆవు పాలతో ఆయుర్వేద మందులను తయారు చేస్తారన్నారు. గో మాంస భక్షణం వల్ల రకరకాల వ్యాధులు వస్తాయన్నారు. 2002లో అప్పటి ఆరెస్సెస్ చీఫ్ కేఎస్ సుదర్శన్ చొరవ మేరకు ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఏర్పడింది.
nation
19
04-11-2017 23:54:42
62 డాలర్ల ఎగువకు ముడిచమురు ధర
మరింత పెరగనున్న పెట్రో ధరలుపొంచి ఉన్న ద్రవ్యోల్బణం ముప్పుముంబై: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర కొన్ని రోజులుగా పెరుగుతోంది. దీంతో ముడిచమురును అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న భారత్‌ వంటి దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ బ్రెంట్‌ రకం ముడిచమురు ధర 62 డాలర్ల స్థాయిలో కదలాడుతోంది. రానున్న కాలంలో ఇది మరింతగా పెరగవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ముడిచమురును ఉత్పత్తి చేస్తున్న గల్ఫ్‌ తదితర దేశాలు ఉత్పత్తిని క్రమంగా మరింత నియంత్రిస్తున్నాయి. ముడిచమురు ధర తక్కువగా ఉన్నందు వల్ల ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ముడిచమురు ధర పెరిగే విధంగా సప్లయ్‌ని నియంత్రిస్తున్నాయి. మన దేశం పెట్రో ఇంధనాల కోసం 80-85 శాతం మేరకు ముడిచమురు దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ముడిచమురు ధర పెరిగితే పెట్రో ఉత్పత్తుల ధరలు వెంటనే పెరిగే అవకాశం ఉంది. ఇంధనాల ధర పెరిగితే దాని ప్రభావం విస్తృతంగా ఉండనుంది.  లీటరు పెట్రోల్‌ ధర రూపాయి పెరిగితే టోకు ధరల ద్రవ్యోల్బణం 0.02 శాతం, డీజిల్‌ ధర రూపాయి పెరిగితే ద్రవ్యోల్బణం 0.07 శాతం మేర పెరిగే అవకాశం ఉంటుంది. ద్రవ్యోల్బణం పెరిగితే భారత రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను పెంచేందుకే ప్రాధాన్యం ఇవ్వనుంది. వడ్డీ రేట్లు అధికంగా ఉండటం వల్ల పెట్టుబడుల భారం అధికం అవుతోందని ఇప్పటికే పరిశ్రమవర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. వడ్డీ రేట్లు మరింత పెంచితే కంపెనీల పెట్టుబడులు తగ్గి ఉత్పత్తి క్షీణించడానికి అవకాశం ఉంటుంది.
business
8,930
13-04-2017 22:07:07
‘కత్తి’ రీమేక్‌ మొదట నా దగ్గరకే వచ్చారు
హీరో విజయ్‌ నాకు మంచి స్నేహితుడు. ‘పొన్నియన్ సెల్వన్’లో ఇద్దరం కలిసి నటించాల్సి ఉంది. మిస్సయింది. ‘రెండు వారాల్లో లుక్‌ టెస్ట్‌ ఉంది. చెన్నైకి రావాల్సి ఉంటుంది’ అని మణిరత్నం సార్‌ చెప్పారు. నేను చాలా ఆతృతతో ఎదురుచూశాను. కానీ, ఊహించని విధంగా ఆ సినిమా ప్రారంభం కాలేదు. నేను, విజయ్‌ కలిసి నటించడానికి కథ చాలా ముఖ్యం. అంతకంటే ముఖ్యంగా మా ఇద్దర్నీ హ్యాండిల్‌ చేయగలిగే దర్శకుడు కావాలి. చెన్నైలో దాదాపు 25 ఏళ్లున్నాను. హైదరాబాద్‌కి వెళ్లి 15 ఏళ్లే అయ్యింది. సెయింట్‌ బీడ్స్‌లో చదివేటప్పుడు సూర్య, కార్తీ, కార్తిక్‌రాజా, యువన్ నా క్లాస్‌మేట్స్‌. నేను సూపర్‌స్టార్‌ కృష్ణ కొడుకునని చాలా మందికి తెలీదు. నేనూ చెప్పలేదు. ఆ రోజుల్లో మణిరత్నంగారి ‘దళపతి’ విడుదలైంది. మా స్కూల్‌ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా షో వేశారు. అందులో సినిమాటోగ్రఫీ చూసి ఆశ్చర్యపోయాను. ఈ రోజు అదే సినిమాగ్రాఫర్‌ సంతోష్ శివన్ నేను నటిస్తున్న ‘స్పైడర్‌’కి సినిమాటోగ్రఫీ అందించడం చాలా సంతోషంగా ఉంది. మొదటి నుండి నాకు రీమేక్‌లపై నమ్మకం లేదు. రీమేక్‌ చేయకూడదని నిర్ణయించుకున్నా. ఒక సినిమాని చూసి అదే కథలో నటించాలంటే ఉత్సాహం ఉండదు. షూటింగ్‌కి వెళ్లామంటే ఏదైనా కొత్తగా అనిపించాలి. రెండు, మూడు సార్లు రీమేక్‌ చేద్దామని ప్రపోజల్స్‌ వచ్చాయి. ‘కత్తి’ (చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్‌ 150’కి మాతృక) నా దగ్గరకే వచ్చింది. ఇది దర్శకుడి సినిమా. మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తేనే చేస్తానని చెప్పాను. అప్పుడు ఆయన హిందీలో బిజీగా ఉన్నారు. దాంతో కుదరలేదు. ‘స్పైడర్‌’ స్పెషల్‌ ‘శ్రీమంతుడు’లో నటిస్తున్నప్పుడు మురుగదాస్‌ వచ్చి గంటన్నరపాటు కథ చెప్పారు. విన్న వెంటనే ఓకే చెప్పేశాను. ఆ రోజు ఆయన ఏం చెప్పారో, అలాగే స్ర్కీన్‌పై చూపిస్తున్నారు. అలాంటి సత్తా చాలా తక్కువ మంది దర్శకులకు మాత్రమే ఉంటుంది. ఆయన తీసిన ‘రమణ’, ‘కత్తి’ సినిమాలు ఒక ఎత్తు. ‘గజిని’, ‘తుపాకి’ మరో ఎత్తు. ఈ సినిమా రెండో కోవకి చెందినది. ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది. -ఆంధ్రజ్యోతి, చెన్నై
entertainment
9,630
07-03-2017 15:57:57
కమల్ హాసన్ ఉమనైజర్‌గా ఎలా..?: నాజర్
ఆంధ్రజ్యోతి: మాతృదేవోభవ సినిమాలో తన క్యారెక్టర్ గురించి నాజర్ ప్రస్తావించారు. తన కెరీర్‌లోనే ఆ సినిమా చాలా ముఖ్యమైందన్నారు. కమల్ హాసన్‌తో తన అనుబంధం గురించి కూడా ఆయన తెలిపారు. ఆడవాళ్లకు మాత్రమే సినిమా గురించి నాజర్ మాట్లాడుతూ ఇంత పెద్ద హీరో ఉమనైజర్‌గా ఎలా చేయగలరా అనిపించిందన్నారు. తను వెళ్లి కమల్‌ని అడగ్గా నేను కాదు ఉమనైజర్‌గా నువ్వే చేయాలని తెలిపారన్నారు. ఇంకా ఆయన చెప్పిన విశేషాల కోసం పై లింక్‌ను క్లిక్ చేయండి.
entertainment
18,508
12-03-2017 01:44:51
ఇంటిపోరులో ఓడినా..
 కుమారుడి వరుసయ్యే అఖిలేశ్‌ చేతిలో ఇంటిపోరులో ఓటమిపాలయిన ములాయం సింగ్‌ యాదవ్‌ తమ్ముడు, ఎస్పీ నేత శివపాల్‌ సింగ్‌ యాదవ్‌ ఎన్నికల పోరులో మాత్రం గెలుపుని దక్కించుకొన్నారు. రాష్ట్రమంతా బీజేపీ సునామీ వీచినా..జస్వంతనగర్‌ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోగలిగారు. సమీప బీజేపీ అభ్యర్థి మనీశ్‌ యాదవ్‌ పాత్రేపై 52,616 ఓట్లతో గెలిచారు. ఎస్పీ వివాదాస్పద నేత ఆజమ్‌ ఖాన్‌ వరసగా తొమ్మిదోసారి రామ్‌పూర్‌ సిటీ స్థానం గెలుచుకొన్నారు. అంతేకాదు, తన కుమారుడు అబ్దుల్లా ఆజమ్‌నీ గెలిపించుకొన్నారు. స్వార్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసిన అబ్దుల్లా.. సమీప బీఎస్పీ అభ్యర్థిపై గెలిచి, తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. ఆయన తండ్రి ఆజమ్‌, సమీప బీజేపీ అభ్యర్థి శివ బహదూర్‌ సక్సేనాపై 47,000 ఆధిక్యతతో గెలిచారు.
nation
17,586
27-03-2017 02:15:26
అత్యంత ప్రభావశీలుర జాబితాలో మోదీ
న్యూయార్క్‌, మార్చి 26: ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలుర జాబితాలో తొలి 100 మందిలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి చోటు దక్కిం ది! ప్రముఖ పత్రిక ‘టైమ్‌’ ప్రపంచవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా రూపొందించే ఈ వార్షిక జాబితాను వచ్చే నెలలో విడుదల చేయనుంది. కళాకారులు, రాజకీయవేత్తలు, చట్టసభల సభ్యులు, శాస్త్రజ్ఞులు, సాంకేతిక నిపుణులు, వ్యాపార వేత్తలు ఇలా పలు విభాగాల నుంచి ప్రభావశీలురైన వ్యక్తులను ఎంపిక చేస్తుంది. టైమ్‌ తాజా జాబితాలో మోదీతోపాటు మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఆయన కుమార్తె ఇవాంక, అల్లుడు, వైట్‌ హౌస్‌ సీనియర్‌ సలహాదారుడు జరేద్‌ కుష్నెర్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే, చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌, పోప్‌ ఫ్రాన్సిస్‌, యూట్యూబ్‌ సీఈవో సుశాన్‌ వోజ్‌సికి ఉన్నారు.
nation
7,457
22-07-2017 23:00:15
సెట్స్‌లో...బర్త్‌డే సందడి
తీరికలేని షెడ్యూళ్లతో బిజీ బిజీగా ఉండే స్టార్లు ఏ మాత్రం అవకాశం లభించినా తమ కుటుంబంతో గడిపేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఎన్టీఆర్‌ కూడా అందుకు మినహాయింపు కాదు. తనయుడు అభయ్‌రామ్‌తో వీలున్నప్పుడల్లా ఆడుకుంటూ, అతనితో కలిసి తీయించుకొన్న ఫొటోలు షేర్‌ చేసుకోవడమంటే ఆయనకు బాగా ఇష్టం. శనివారం అభయ్‌రామ్‌ మూడో పుట్టిన రోజు. ఎన్టీఆర్‌ ప్రస్తుతం పూణేలో ఉంటూ ఓ వైపు ‘బిగ్‌ బాస్‌’ షోతో, మరో వైపు ‘జై లవకుశ’ షూటింగ్‌తో తీరిక లేకుండా ఉన్నారు. దాంతో అభయ్‌రామ్‌ను తీసుకొని కుటుంబం పూణేకు వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడ కొడుకుతో తీయించుకొన్న ఫొటోను తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా పంచుకొన్న ఎన్టీఆర్‌.. ‘‘నా సంతోషానికి (అభయ్‌రామ్‌కు) హ్యాపీ బర్త్‌డే. ఎల్లప్పుడూ మీ ఆశీర్వచనాలు మాకు వరం. అందరికీ కృతజ్ఞతలు’’ అంటూ పోస్ట్‌ చేశారు.
entertainment
1,745
18-02-2017 23:24:18
భిన్న రంగాల్లోకి భెల్‌
ప్రభుత్వ రంగంలోని భారీ విద్యుదుత్పత్తి ఉపకరణాల తయారీ సంస్థ అయిన భారత హెవీ ఎలకి్ట్రకల్స్‌ లిమిటెడ్‌ (బిహెచ్‌ఈల్‌).. ట్రాన్స్‌పోర్టేషన్‌, ఎలకి్ట్రక్‌ వాహనాల విభాగాల్లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. నానాటికీ విద్యుత రంగంలో పెనుమార్పులు వస్తుండటంతో భిన్న రంగాల్లోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఎలకి్ట్రక్‌ వాహనాల తయారీ సహా కీలకమైన మెట్రో రైల్‌ ఎండ్‌ టు ఎండ్‌ సొల్యూషన్స్‌ రంగాల్లోకి అడుగుపెట్టాలని భావిస్తోంది. ఈ రంగాల్లోకి ప్రవేశించే యోచనతోనే అశోక్‌ లేలాండ్‌, టాటా మోటార్స్‌ లిమిటెడ్‌తో బిహెచ్‌ఈల్‌ ఒప్పందం కూడా కుదుర్చుకుంది.  ఎలకి్ట్రక్‌ బస్సుల కోసం అవసరమైన ప్రొపల్షన్‌ సిస్టమ్‌ను రూపొందించేందుకు ఈ సంస్థలతో జట్టు కట్టింది. మరోవైపు మెట్రో రైల్‌ లోకోమోటివ్స్‌ తయారీ కోసం హిటాచీ ట్రాన్స్‌పోర్టేషన్‌ సిస్ట మ్స్‌, మిత్సుబుషి హెవీ ఇండసీ్ట్రస్‌, స్కోడా ట్రాన్స్‌పోర్టేషన్‌తో సాంకేతిక భాగస్వామ్యాన్ని కుదుర్చుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి బస్సుల కోసం పర్మనెంట్‌ మాగ్నెట్‌ మోటార్‌ను సిద్ధం చేయాలని భావిస్తోంది. అనంతర కాలంలో కార్లు, ద్విచక్ర వాహనాలకు అవసరమైన మోటార్లను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో అంతర్గత జల రవాణా (ఇన్‌లాండ్‌ వాటర్స్‌)పై ప్రభు త్వం దృష్టి సారిస్తుండటంతో చిన్న నౌకల కోసం ప్రొపల్షన్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.  నేషనల్‌ ఎలకి్ట్రక్‌ మొబిలిటీ మిషన్‌ ప్లాన్‌, ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ హైబ్రిడ్‌ అండ్‌ ఎలకి్ట్రక్‌ వెహికల్స్‌ (ఫేమ్‌) కింద 2020 నాటికి 60 లక్షల ఎలకి్ట్రక్‌, హైబ్రిడ్‌ వాహనాలను రహదారులపైకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుండటంతో బిహెచ్‌ఈల్‌ సాధ్యమైనంత త్వరగా ఈ వాహనాల ఉత్పత్తిని చేపట్టాలని చూస్తోంది. అశోక్‌ లేలాండ్‌తో కలిసి చిన్న వాహనాలు, టాటా మోటార్స్‌ భాగస్వామ్యంతో ఎలకి్ట్రక్‌ బస్సులను తయారు చేయాలని భెల్‌ యోచిస్తోంది. మరోవైపు దేశీయంగా మెట్రో రైల్‌ ప్రాజెక్టులు పెరిగిపోతుండటంతో మెట్రో కోచ్‌ల తయారీలోకి సాధ్యమైనంత త్వరగా ప్రవేశించాలని చూ స్తోంది. ఝాన్సీ ప్లాంట్‌లో మెట్రో రైల్‌ కోచ్‌లను త యారు చేసేందుకు త్వరలోనే టెక్నికల్‌ కొలాబరేష న్‌ కుదుర్చుకోనుంది. ఏటా 400 కోచ్‌లను ఈ ప్లాం ట్‌లో ఉత్పత్తి చేసేందుకు భెల్‌ ప్రణాళికలు రచిస్తోంది.
business
18,061
08-05-2017 18:53:51
కశ్మీర్‌లో చురుగ్గా 200 మంది టెర్రరిస్టులు
శ్రీనగర్: కశ్మీర్‌లో 200 మంది ఉగ్రవాదులు చురుగ్గా ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. వీరిలో 95 మందికి పైగా కశ్మీర్ యువకులు గత ఏడాది కాలంలో చేరినవారే. కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్‌జేఎం గిల్లాని ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. కశ్మీర్‌ లోయలో చురుగ్గా పనిచేస్తున్న ఉగ్రవాదుల్లో 110 మంది స్థానికులు కాగా తక్కినవారు విదేశీయులేనని చెప్పారు. బయటశక్తులే కొందరు విద్యార్థులను డబ్బులతో ప్రలోభపెట్టి రాళ్లు రువ్వే ఘటనలకు ప్రోత్సహిస్తున్నారని వివరించారు. దక్షిణ కశ్మీర్‌లో ఇటీవల వరుసగా జరుగుతున్న బ్యాంకు దోపిడీల ఘటనలపై స్పందిస్తూ, ఈ ఘటనల్లో లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉన్నట్టు దర్యాప్తు వివరాలను బట్టి తెలుస్తోందన్నారు. సోషల్ మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధం ప్రభావం నెలరోజులు పూర్తి కాగానే సమీక్షించడం జరుగుతున్నారు. ఆ తర్వాత తిరిగి సోషల్ మీడియా సేవలను పునరుద్ధరించే అవకాశాలున్నాయని గిల్లానీ తెలిపారు.
nation
8,562
27-06-2017 19:13:02
కొత్త ఉత్సాహాన్నిస్తున్న చెర్రీ పోరాట సన్నివేశాలు
టాలీవుడ్ ప్రేక్షకులను 80ల లోకంలోకి తీసుకెళ్లబోతున్న చెర్రీ-సుకుమార్... అప్పటి మధుర స్మృతులతో పాటూ పోరాటాలను కూడా కళ్లకు కట్టబోతున్నారట. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'రంగస్థలం 1985' రోజుకో విశేషాన్ని మోసుకొస్తూ.. ప్రేక్షకులకు సినిమాపై నెలకొన్న ఆసక్తిని పట్టుసడలనివ్వడంలేదు. తాజాగా ఈ సినిమాలో పోరాట సన్నివేశాలకు సంబంధించిన అప్‌డేట్ మెగా ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. సినిమా టైటిల్, థీమ్‌కు తగ్గట్లుగానే చిత్రంలో ఫైటింగ్స్ కూడా అప్పటి కాలానికి తగ్గట్లుగానే ఉండబోతున్నాయట. నేటి చిత్రాల్లో బీభత్సకాండను తలపించకుండా.. చెర్రీ పాత్రకు తగ్గట్లు ఫైట్స్ ఉండబోతున్నాయట. మరోవైపు 'రంగస్థలాని'కి కొత్త అందాలు అద్దబోతున్న సమంత... అప్పటికాలానికి తగ్గట్లు మారిపోయింది. తన కొత్త లుక్‌కు సంబంధించి రోజుకో హింట్ ఇస్తున్న సామ్... ఆ మధ్య కేవలం కాళ్లను మాత్రమే రివీల్ చేసింది. తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా బ్యాక్ సైడ్ లుక్స్‌ను చూపించింది. ఏమైనా అమ్మడు లంగా ఓణిలో జడకు రిబ్బన్‌తో అచ్చమైన పల్లెటూరి చుక్కలా మెరిసిపోతుందని ప్రత్యేకించి చెప్పక్కరలేదు. మరోవైపు బుల్లితెర బ్యూటీ అనసూయ కూడా 'రంగస్థలం' టీమ్‌లో చేరేందుకు సిద్ధమైందట. మరి... ఇంతగా మురిపిస్తున్న 'రంగస్థలం 1985' ప్రేక్షకులను ఏ రీతిన అలరిస్తుందో చూడాలి.
entertainment
18,710
16-02-2017 02:38:47
గడువిచ్చే ప్రసక్తే లేదు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో లొంగిపోవడానికి నాలుగు వారాల గడువు కావాలంటూ అన్నాడీఎంకే అధినేత వి.కె.శశికళ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇందులో ఎలాంటి ఆదేశం ఇవ్వదలచుకోలేదని, తీర్పులో ఎలాంటి మార్పులు ఉండబోవని జస్టిస్‌ పి.సి.ఘోష్‌, జస్టిస్‌ అమితవ్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. ‘‘క్షమించాలి. మేం చెప్పదలచుకున్నదంతా ఆ భారీ తీర్పు కాపీలో చెప్పేశాం. ఒక్క పదం కూడా మార్చేది లేదు’’ అని స్పష్టం చేసింది. శశికళకు ఆరోగ్యం బాగోలేదని, చక్కబెట్టాల్సిన అంశాలున్నాయని, ఆమెకు మరో నాలుగు వారాల గడువు కావాలని ఆమె న్యాయవాది అభ్యర్థించారు. ధర్మాసనం కనీసం కేసును లిస్టింగ్‌ చేయడానికి కూడా నిరాకరించింది. ‘‘తక్షణమే’’ లొంగిపోవాలని తీర్పులో ప్రత్యేకంగా చెప్పామని, దాని అర్థమేమిటో సీనియర్‌ న్యాయవాది అయిన తులసికి తెలిసే ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
nation
6,820
18-05-2017 23:51:37
తీవ్రవాదా...పోరాట యోధుడా?
‘తమిళ ఈలం కోసం 33 ఏళ్లు పోరాడిన వేలు పిళ్లై ప్రభాకరన్ ను చాలా మంది ఓ తీవ్రవాదిగానే చూశారు. కొంతమంది మాత్రం ఆయనో పోరాట యోధుడని కీర్తించారు. భగత్ సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌, సుభాష్‌ చంద్రబోస్‌, చెగువేరా, క్యాస్ట్రో.. ఇలా ఎవరైనా సరే ఆ సమయంలో తీవ్రవాదులుగానే పరిగణించారు. కానీ ఆ యా దేశాల స్వాతంత్ర్యానంతరం వారిని స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించారు. శ్రీలంకలో ఒకవేళ ప్రత్యేక తమిళ రాజ్యం ఏర్పడి ఉంటే ప్రభాకరన్ ను దేశభక్తుడనేవారా.. తీవ్రవాదిగానే భావించేవారా.. 33 ఏళ్ల సుదీర్ఘ సాయుధ పోరాటం చేసి ప్రభాకరన్ పాత్రను మనోజ్‌ అద్భుతంగా పోషించారు’ అన్నారు దర్శకుడు అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి. మంచు మనోజ్‌ ద్విపాత్రాభినయం చేసిన ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మనోజ్‌ ఎల్‌టీటీఈ కమాండర్‌ పాత్ర పోషించారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం పోస్టర్‌ సామాజిక మాధ్మమాల్లో ట్రెండ్‌ క్రియేట్‌ చేసిందనీ, ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్ స్టాగ్రామ్‌లో లక్షల మంది వీక్షించారనీ యూనిట్‌ సభ్యులు తెలిపారు. సినిమాలోని వార్‌ ఎపిసోడ్‌, పతాక సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని చెప్పారు. షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రసుతం పోస్ట్‌ ప్రొడక్షన్ దశలో ఉంది. జూన్ లో ఆడియోను, సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. మనోజ్‌ సరసన అనీషా అంబ్రోస్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అజయ్‌, జెన్నిఫర్‌, సుహాసిని, మురళీమోహన్, పోసాని ఇతర ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: వీకే రామరాజు, సంగీతం: శివ ఆర్‌ నందిగాం, స్ర్కీన్ ప్లే: గోపీమోహన్, నిర్మాతలు: ఎస్‌.ఎన్.రెడ్డి, ఎన్.లక్ష్మీకాంత్.
entertainment
8,847
10-11-2017 13:56:21
ఒక్కడు మిగిలాడుకి రేటింగ్ అడగొద్దు: కత్తి మహేశ్
మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఒక్కడు మిగిలాడు సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. సినీ విమర్శకుడు కత్తి మహేశ్ కూడా ఈ సినిమా చూశాడు. ఈ సినిమాకు రేటింగ్ ఎంతివ్వొచ్చని కత్తి మహేశ్‌ను అడగ్గా మంచి సినిమాలకు రేటింగ్ అడగొద్దంటూ సమాధానమిచ్చాడు.  రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సాగే కథగా ఒక్కడు మిగిలాడు గురించి చెప్పాడు. భావోద్వేగంతో నిండిన సినిమాలను చూడాలని ఆసక్తికనబర్చే వారికి ‘ఒక్కడు మిగిలాడు’ తప్పక నచ్చుతుందని కత్తి మహేశ్ చెప్పాడు. మొదటి సినిమా తీసిన డైరెక్టర్‌లా అనిపించలేదని, సీరియస్‌గా సాగే సినిమాను ఎక్కడా తడబడకుండా తెరకెక్కించాడని కత్తి మహేశ్ కొనియాడాడు.
entertainment
12,454
08-09-2017 01:49:56
పాక్‌ను తిట్టే కంటే ‘కశ్మీరు’ను రాజకీయంగా పరిష్కరించుకోవాలి
‘‘ పాకిస్థాన్‌ను తిట్టడం కంటే కశ్మీరు అంశాన్ని భారత్‌ రాజకీయ, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలి. నియంత్రణ రేఖ వద్ద భారత్‌ అమాయక ప్రజలను చంపుతోంది. శాంతికి భారత్‌ ఒక అవకాశం ఇవ్వాలి’’-భారత్‌కు పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఖమర్‌ సూచన
nation
20,218
09-12-2017 11:01:35
విరాట్ పెళ్లికి వెళ్లేది వీళ్లిద్దరేనా..?
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వివాహం డిసెంబర్ 12న ఇటలీలో జరుగనుందని ప్రస్తుతం వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కాగా శుక్రవారం కుటుంబంతో సహా అనుష్క ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమివ్వడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే ఈ వివాహానికి సంబంధించి మరో వార్త ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. విరాట్ తన వివాహానికి కేవలం ఇద్దరు క్రికెటర్లను మాత్రమే ఆహ్వానించాడట. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, విధ్వంసక ఆటగాడు యువరాజ్ సింగ్‌లకు విరాట్ వివాహ ఆహ్వానం అందినట్లు సమాచారం. భారత జట్టు శ్రీలంకతో జరిగే వన్డే, టీ-20 సిరీస్‌తో బిజీగా ఉండటంతో విరాట్ సచిన్, యువీలతో పాటు తన బాల్య మిత్రులు కొందరిని వివాహానికి ఆహ్వానించాడట. కోహ్లీ పెళ్లి మూడు నెలల క్రితమే ప్లాన్ చేశారని, విరాట్, అనుష్కల కుటుంబాలు కావాలనే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని విరాట్ సన్నిహితుడు మెన్స్ ఎక్స్‌పీకి తెలిపారు. అయితే అనుష్క కూడా బాలీవుడ్‌లో తనకు అత్యంత సన్నిహుతలైన షారుఖ్‌ ఖాన్, అదిత్య చోప్రా, అమీర్ ఖాన్, మనీష్ శర్మలను మాత్రమే పెళ్లికి ఆహ్వానించిందట. డిసెంబర్ చివర్లో విరుష్క జంట ముంబయిలో రిసెప్షన్ పార్టీ ఇవ్వనుందట. అయితే ఈ రిసెప్షన్‌కి టీమిండియా జట్టుతో సహా బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు.  మాస్టర్, యూవీల ఫొటో చూస్తే.. : క్విజ్ ప్రపంచ కప్ గురించి పది ప్రశ్నలు: చెప్పేదెవరు? తప్పేదెవరు?
sports
20,510
14-01-2017 19:33:28
వీఐపీ ప్రచారకర్తలుగా అశ్విన్, రోహిత్ శర్మ..
న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మలను ప్రముఖ లగేజీ ఉత్పత్తుల సంస్థ వీఐపీ ప్రచారకర్తలుగా నియమించుకుంది. ఆ సంస్థకు చెందిన బ్రాండ్ అరిస్ట్రోక్రాట్‌కు ప్రచారకర్తలుగా ఈ క్రికెటర్లు  ఉంటారు. ఈ మేరకు వివరాలను సదరు సంస్థ వెల్లడించింది. తాము కొత్త లోగోతో తమ బ్రాండ్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నామని రోహిత్, అశ్విన్‌ల ద్వారా తమ బ్రాండ్‌ యువతకు మరింత దగ్గరౌతుందని వారు తెలిపారు.
sports
11,308
26-04-2017 02:25:04
భారత్‌లో నక్సల్స్‌ రక్తపాతం
హింసాత్మక సంస్థల్లో ప్రపంచంలో నాలుగోస్థానం: అమెరికా న్యూఢిల్లీ: మావోయిస్టులు భారత్‌లో నెత్తుటేరులు పారిస్తున్నారని అమెరికా పేర్కొంది. వీరిని తీవ్ర హింసావాదులుగా అభివర్ణించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే తాలిబన్లు అత్యధిక హింసాత్మకంగా ప్రవరిస్తూ తొలిస్థానంలో ఉన్నారని అమెరికా విదేశాంగ శాఖ నివేదిక తెలిపింది. రెండో స్థానంలో ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌), మూడోస్థానంలో బోకో హరామ్‌ తీవ్రవాదులున్నారని, నాలుగోస్థానంలో మావోయిస్టులున్నారని పేర్కొంది. ఇందుకు గణాంకాలను కూడా వెల్లడించింది. తాజాగా సోమవారం ఛత్తీ్‌సగఢ్‌లో మావోయిస్టుల దాడిలో చనిపోయిన వారితో కలుపుకొంటే 13 ఏళ్లలో (2004 నుంచి) 1914 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. ఉగ్రవాదుల హింస కంటే మావోయిస్టుల హింసే అధికంగా ఉందని వివరించింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడుల్లో 1369 మంది, ఈశాన్య రాష్ర్టాల్లో 609 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
nation
4,266
22-06-2017 03:17:59
రుణ మీమాంస
వ్యవసాయ సంక్షోభం కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతాంగం తమ సమస్యల పరిష్కారం కోసం పోరాట బాట పట్టింది. మొన్న తమిళనాడు రైతులు ఢిల్లీలో వినూత్న రీతిలో నిరసన ప్రదర్శనలు నిర్వహించడం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రైతాంగం కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) పెంపు, పూర్తి రుణమాఫీ, కరెంట్‌ బిల్లుల మాఫీ తదితర డిమాండ్ల సాధన కోసం ధర్మాగ్రహాన్ని ప్రదర్శించడం వంటివి పాలకులకు హెచ్చరికగా నిలిచాయి. ప్రస్తుతం ముంచుకొస్తున్న వ్యవసాయ సంక్షోభం వల్ల విశాలమైన గ్రామీణ ప్రజానీకం నుంచి పెరుగుతున్న ఒత్తిడితో మహారాష్ట్ర, పంజాబ్‌, కర్ణాటక రాష్ట్రాలు పూర్తి లేదా పాక్షిక రుణ మాఫీలను వరుసగా ప్రకటించవలసి వస్తున్నది. మధ్యప్రదేశ్, హర్యానా, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లోనూ రైతుల ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాలూ రుణమాఫీ దిశగా అడుగులేస్తున్నాయి. సగటున ప్రతి 41 నిమిషాలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో, రాజకీయ పార్టీలు రుణమాఫీని ఒక నినాదంగా ముందుకు తెచ్చాయి. 2008లో యూపీఏ రుణమాఫీ, ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ ముందుకు తెచ్చిన రుణమాఫీ నినాదం రైతాంగం మద్దతు కూడగట్టేందుకు ఉపకరించాయి. అయితే, నిస్సహాయ స్థితిలో దుర్మరణం పాలవుతున్న రైతాంగం దేశవ్యాప్తంగా శాంతియుత ప్రదర్శనలతోనూ, అక్కడక్కడ విధ్వంసక చర్యల ద్వారా తమ బాధల్ని, అంసతృప్తిని ప్రదర్శించడం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. దేశంలో మరో వ్యవసాయక ఉపద్రవం సంభవించే ప్రమాదం పొంచి ఉంది. దేశంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభానికి వాతావరణ మార్పుతో ఏర్పడిన దుర్భిక్ష పరిస్థితులు ఉత్ప్రేరకాలే కానీ, ప్రధాన కారణం మాత్రం రైతుకు వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడమేనని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అయితే, ఆర్థిక యాజమాన్య పద్ధతులు తెలియని, మార్కెట్ నియమాలపై అవగాహన లేని రైతులు చేస్తున్న రుణాలే ఈ సంక్షోభానికి అసలు కారణమా? ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో రుణ మాఫీ ప్రకటించిన నేపథ్యంలో రైతుల రుణాలను మాఫీ చేయడం రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమనీ, కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రుణాలను మాఫీ చేయబోదనీ, ఆ మాఫీలను భర్తీ చేయబోమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టంగా చెబుతున్నారు. భవిష్యత్‌ ఆర్థిక లక్ష్యాల సాధనకు రుణాల మాఫీ అవరోధం అవుతుందని అన్నారు ఆయన. రుణ మాఫీ వల్ల ‍సంక్షోభ పరిస్థితులు చక్కబడతాయా? రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయా? అనేది చర్చనీయాంశమే. ఉత్తరప్రదేశ్‌ రూ.36 వేల కోట్ల రూపాయలు, మహారాష్ట్ర రూ.30 వేల కోట్లు, పంజాబ్‌ రూ.24వేల కోట్లు, కర్ణాటక రూ. 8వేల కోట్లు రుణాలను మాఫీ చేస్తున్నాయి. దీంతో రుణాల మాఫీ హామీల విలువ లక్ష కోట్ల రూపాయలు దాటిపోయింది. రైతాంగం ఉద్యమిస్తున్న మిగిలిన రాష్ట్రాల్లో కూడా రుణాలను మాఫీ చేసినట్లయితే రుణాల మాఫీ మొత్తం రూ.3.1 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. దాంతో రుణ మాఫీ మొత్తం జాతీయ స్థూల ఉత్పత్తిలో 2.6 శాతంగా ఉండటం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడే ప్రమాదం ఉందని కేంద్రం బలంగా వాదిస్తోంది. గత తొమ్మిదేళ్ళ కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు ఐదు కోట్ల మంది రైతులకు రూ. 88,988 కోట్లు రుణాల్ని మాఫీ చేసాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా నిలువరించేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల రుణాలను మాఫీ చేస్తున్నాయి. రుణాలు మాఫీ చేస్తున్న రాష్ట్రాల్లో వీటివల్ల ద్రవ్యలోటు మూడు శాతం మించి (8 లక్షల కోట్లు పైగా) పోతుంది. తెలుగు రాష్ట్రాల్లో రుణ మాఫీ ఒకేసారి కాకుండా విడతలు విడతలుగా ఇవ్వడం వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురైంది. దేశంలో రెండు హెక్టార్ల కంటే తక్కువగా వ్యవసాయ భూమి ఉన్నవారు 3.28 కోట్ల మంది ఉన్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు వంటి ఉత్పత్తి కారకాల వాణిజ్య సంస్థలు, ప్రైవేట్ వడ్డీవ్యాపారులు, దళారులు, అగ్రి బిజినెస్‌ కార్పొరేట్‌ సంస్థలు రైతాంగాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. హరిత విప్లవంతో అన్నపూర్ణగా రెండు దశాబ్దాలకు పైగా విలసిల్లిన పంజాబ్‌ రాష్ట్రం నేడు అన్నదాతల ఆక్రందనలతో మరుభూమిగా మారితే, దేశవ్యాప్త పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దానికి తోడు వ్యవసాయోత్పత్తుల వాణిజ్యాన్ని స్టాక్‌ మార్కెట్‌లో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ పరిధిలోకి ప్రభుత్వం తీసుకురావడం మూలాన అంతర్జాతీయ మార్కెట్‌ జూదానికి మన రైతాంగం దివాలా తీస్తోంది. నష్టదాయకమైన చిన్న కమతాల సాగు స్థానంలో పెద్ద కమతాల సేద్యాన్ని ఉనికిలోకి తీసుకురావడం ద్వారా అంటే కార్పొరేట్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ రంగ సంక్షోభాన్ని నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు వ్యవసాయ జనాభాను 58 శాతం నుంచి 38 శాతానికి తగ్గించి ఇతర రంగాల్లోకి వలసపోయేలా ప్రభుత్వమే పథకాలు రూపొందించడం చూస్తే కేంద్రం రహస్య అజెండాను అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయాల్లోనూ చెక్కుచెదరక, దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్థంభంగా నిలిచి, కొనుగోలు శక్తిగల సుస్థిర మార్కెట్‌ను అందించే సామర్థ్యం గల స్థానిక వ్యవసాయక సమాజాన్ని పరిరక్షించుకోవల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. రుణమాఫీలు తాత్కాలిక ఉపశమనాలుగా, ఎన్నికల ఎత్తుగడలుగా మాత్రమే ఉపకరిస్తాయి. వాటికితోడుగా, ఉత్పత్తికారకాల సబ్సిడీలు అందించడం, గిట్టుబాటు ధరలు రైతాంగానికి దక్కేలా కేంద్రమే ఒక జాతీయ విధానాన్ని రూపొందించి, దాన్ని కచ్చితంగా అమలయ్యేలా చూడాలి.
editorial
12,393
25-02-2017 01:00:56
స్టెంట్ల ‘భారం’పై ఎన్‌పీపీఏ గుర్రు
 అధిక ధరలకు విక్రయిస్తున్న ఆస్పత్రులకు షోకాజ్‌ నోటీసులు న్యూఢిల్లీ/ముంబై, ఫిబ్రవరి 24: స్టెంట్లను ప్రభుత్వం నిర్దేశించిన దాని కన్నా అధిక ధరలకు విక్రయిస్తున్న పలు ఆస్పత్రులకు జాతీయ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ(ఎన్‌పీపీఏ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. పలు కంపెనీలు, ఆస్పత్రుల్లో స్టెంట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఎన్‌పీపీఏకు ఫిర్యాదులు అందాయి. దీంతో వాటిపై ప్రాథమిక పరిశీలన జరిపి ఆ ఫిర్యారుల్లో వాస్తవాలను నిర్ధారించుకుని షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు ఎన్‌పీపీఏ తెలిపింది. దక్షిణ ఢిల్లీలోని మాక్స్‌ హెల్త్‌కేర్‌, ముంబైలోని లీలావతి ఆస్పత్రి, ఫరీదాబాద్‌లోని మెట్రో ఆస్పత్రి, చండీగఢ్‌లోని పీజీఐ, బరేలీలోని రామ్మూర్తి ఆస్పత్రికి ఈ నోటీసులు పంపినట్లు వెల్లడించింది. కాగా స్టెం ట్లపై తాము ఎటువంటి అధిక చార్జీలను వసూ లు చేయడం లేదని మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ సంస్థ, లీలావతి ఆస్పత్రి స్పష్టం చేశాయి.
nation
3,314
22-01-2017 22:56:15
మా నాన్న రైతు
 వెంకటేష్‌ పైడికొండల 81215 33112
editorial
20,232
11-04-2017 23:16:40
ఢిల్లీ డేర్‌డెవిల్స్ భారీ విజయం..
పుణె : రైజింగ్ పుణె సూపర్‌జెయింట్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 97 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 206 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పుణె జట్టు వరుసగా వికెట్లను కోల్పోయింది. 16.1 ఓవర్లలో 108 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. టాస్ ఓడి తొలి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఢిల్లీ ఆటగాడు సంజూ శాంసన్ విజృంభించి ఆడి ఐపిఎల్-2017లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. 63 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. టాస్ నెగ్గి మొదటిగా బౌలింగ్ ఎంచుకున్న పుణె బోల్తా కొట్టింది. స్కోర్ వివరాలు..ఢిల్లీ డేర్‌డెవిల్స్ : ఆదిత్య తారె 0, శ్యామ్ బిల్లింగ్స్ 24, సంజూ శాంమ్సన్ 102, రిషభ్ పంత్ 31, కోరీ అండర్సన్ 2(నాటౌట్), క్రిస్ మోరిస్ 38(నాటౌట్).. మొత్తం : 205/4(నిర్ణీత 20 ఓవర్లకు). రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ : అజింక్య రహానె 10, మయంక్ అగర్వాల్ 20, డుప్లెసిస్ 8, రాహుల్ త్రిపాఠి 10, బెన్ స్టోక్స్ 2, ధోనీ 11, భాటియా 16, దీపక్ చహర్ 14, ఆడమ్ జంపా 5, అశోక్ దిండా 7, ఇమ్రాన్ తహీర్ 0(నాటౌట్). మొత్తం : 108/10(16.1 ఓవర్లలో)
sports
13,947
12-11-2017 23:58:09
ఏ పార్టీకీ మద్దతివ్వను.. పార్టీ పెట్టే ఆలోచనా లేదు: ప్రకాశ్‌రాజ్‌
బెంగళూరు, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చేది లేదని, పార్టీ పెట్టే ఆలోచన కూడా తనకు లేదని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ వెల్లడించారు. ఒక పౌరుడిగా ప్రశ్నించే హక్కును ఎప్పటికీ మానుకోనని, ఎవరు బెదిరించినా భయపడేది లేదన్నారు. ఆదివారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌, గిల్డ్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘మీట్‌ ది ప్రెస్‌’లో ఆయన మాట్లాడారు. నటుడిగా పేరు సంపాదించుకొని రాజకీయాల్లోకి రావడాన్ని వ్యతిరేకిస్తానని, అది ఎవరైనా కావచ్చన్నారు. కమల్‌హాసన్‌ అయినా, మరొకరయినా... ఏ రాజకీయ పార్టీకీ మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. తనకు జెండా, అజెండా రెండూ లేవని, తన వ్యాఖ్యలన్నింటికీ ప్రతిసారి సమాధానం ఇచ్చుకుంటూ పోలేనన్నారు. తన గురించి సరిగ్గా అర్థం చేసుకోకుండా విమర్శించవద్దని ప్రకాశ్‌రాజ్‌ కోరారు.
nation
16,496
26-10-2017 04:44:01
విమానాల్లో ల్యాప్‌టాప్‌పై నిషేధం
న్యూఢిల్లీ, అక్లోబరు 25: విమాన ప్రయాణికులు ఇక నుంచి ల్యాప్‌టా్‌పలు వంటి పెద్ద ఎలకా్ట్రనిక్‌ పరికరాలను తమ వెంట తీసుకెళ్లరాదని అంతర్జాతీయ విమానయాన సంస్థ స్పష్టం చేసింది. అందులోని బ్యాటరీ కాలిపోతే ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉంటుందన్న భయంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత విమానయాన సంస్థ కూడా అమలు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఎలకా్ట్రనిక్‌ పరికరాల బ్యాటరీలు కాలిపోయి పొగ వ్యాపించినట్లు ఫిర్యాదు అందిన వెంటనే ప్రమాదాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైమానిక సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తున్నారు. గత వారం ఢిల్లీ - ఇండోర్‌ విమానంలో ఓ ప్రయాణికుడి మొబైల్‌ ఫోన్‌ నుంచి పొగలు రావడంతో వైమానిక సిబ్బంది అప్రమత్తమై ప్రమాదాన్ని నివారించగలిగారు.
nation
2,108
07-10-2017 01:49:33
4 వీల్‌ డ్రైవ్‌ సిస్టమ్‌తో హ్యుండయ్‌ టక్సన్‌
ధర రూ.25.19 లక్షలున్యూఢిల్లీ: హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా 4 వీల్‌ డ్రైవ్‌ (4డబ్ల్యుడి) సిస్టమ్‌తో కూడిన ప్రీమియం ఎస్‌యువి టక్సన్‌ను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 25.10 లక్షల రూపాయలు (ఎక్స్‌షోరూమ్‌, ఢిల్లీ). టాప్‌ ఎండ్‌ డీజిల్‌ వేరియంట్‌లో మాత్రమే 4డబ్ల్యుడి సిస్టమ్‌ అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త వేరియంట్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి.
business
1,507
03-04-2017 23:45:18
ట్రేడింగ్‌ తొలి రోజే ‘లాభాల’ రికార్డ్‌
ముంబై: ఆర్థిక సంవత్సరం తొలి ట్రేడింగ్‌ రోజే బిఎస్ఇ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్ఇ నిఫ్టీ సూచీలు రికార్డు స్థాయిలో ముగిశాయి. సెన్సెక్స్‌ 289.72 పాయింట్ల లాభంతో 29910 పాయింట్ల వద్ద, నిఫ్టీ 64.10 పాయింట్ల లాభంతో 9237 వద్ద ముగిశాయి. నిక్కీ పారిశ్రామిక ఉత్పత్తి సూచి (పిఎంఐ) ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరడం, త్వరలోనే జిఎ్‌సటి సాకారమవుతుందన్న అంచనాలు, అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవడం... సెంటిమెంట్‌ను పెం చాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 నెలల గరిష్ఠ స్థాయికి పెరగడం కూడా మార్కెట్‌కు కలిసి వచ్చింది. క్యాపిటల్‌ గూడ్స్‌, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, బ్యాంకింగ్‌, కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌, ఆటో కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఎక్కువగా కనిపించాయి. సెన్సెక్స్‌ షేర్లలో రిలయన్స్‌ ఇండసీ్ట్రస్‌, ఎల్‌ అండ్‌ టి, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరెటరీస్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, గెయిల్‌, హెచ్‌డిఎ్‌ఫసి, ఏషియన్‌ పెయింట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, మారుతి సుజుకీ, హెచ్‌యుఎల్‌, అదానీ పోర్ట్స్‌, సన్‌ ఫార్మా షేర్లు మంచి లాభాలతో ముగిశాయి. ప్రమోటర్లు-మేనేజ్‌మెంట్‌ మధ్య నెలకొన్న తాజా వివాదంతో ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్‌ షేర్లు 1.5 శాతం వరకు నష్టపోయాయి. రిలయన్స్‌ జియోతో మ రింత పోటీ ఉంటుందన్న అంచనాలతో ఎయిర్‌టెల్‌, ఐడియా షేర్లూ నష్టాలతోనే ముగిశాయి.  జాతీయ, రాష్ట్ర ప్రధాన రహదార్లపై మద్యం అమ్మకాలను సుప్రీం కోర్టు నిషేధించిన నేపథ్యంలో లిక్కర్‌ కంపెనీల షేర్లు డీలా పడ్డాయి. యునైటెడ్‌ స్పిరిట్స్‌ షేరు ధర దాదాపు ఆరు శాతం వరకు నష్టపోయింది. రేడియో ఖైతాన్‌, గ్లోబస్‌ స్పిరిట్స్‌ వంటి కంపెనీల షేర్లూ నష్టాలతోనే ముగిశాయి.  నష్టాల్లో యూనిటెక్‌ షేర్లు  ఏషియన్‌ పెయింట్స్‌ చేతికి శ్రీలంక కంపెనీ
business
21,461
15-10-2017 01:49:08
పాఠాలు నేర్వాల్సిందే!
చిన్నస్వామిలో అధునాతన సబ్‌ ఎయిర్‌ డ్రైనేజీ సిస్టమ్‌ కోసం అయిన ఖర్చు సుమారుగా 4.5 కోట్లు. దేశంలో మిగతా అంతర్జాతీయ స్టేడియాల్లో ఇలాంటి సదుపాయల కల్పనకు దాదాపు 220 కోట్లు అవసరం అవుతుంది. కనీసం.. తరచూ మ్యాచ్‌లు జరిగే 10-15 మైదానాలను మార్చినా కూడా మహా అయితే 65 కోట్లకు మించదు. కేవలం ప్రసార హక్కుల ద్వారానే వేల కోట్లు అర్జించే బోర్డుకు ఇది పెద్ద లెక్క కాబోదు..!.‘చుక్క వర్షం లేకపోయినా మైదానం తడిగా ఉందని మ్యాచ్‌ను రద్దు చేశారు. దీనికన్నా అవమానం మరొకటి ఉంటుందా?’ ‘హెచ్‌సీఏ సదుపాయాలు దరిద్రంగా ఉన్నా యి. క్రీడా స్పృహే లేని అధికారులు.. అందమైన ఆటను నాశనం చేస్తున్నారు. బీసీసీఐ సిగ్గుపడాలి’. ఇది.. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరగాల్సిన ఆస్ట్రేలియా-భారత్‌ మూడో టీ-20 రద్దయిన తర్వాత సోషల్‌ మీడియాలో అభిమానులు వ్యక్తం చేసిన ఆగ్రహం..! ఎప్పుడూ అవినీతి ఆరోపణలు.. ఆర్థిక కుంభకోణాలు.. జట్ల ఎంపికలో పక్షపాతం విమర్శలతో వార్తల్లో నిలిచే హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వలేక తలదించుకున్నది..! రోజంతా ఎండకాచినా.. ముప్పై వేల మంది ప్రేక్షకులు స్టేడియంలో ఉండ గా.. అరగంట ముందే ఆటగాళ్లను పంపించి.. మ్యాచ్‌ రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది..! ఈ దెబ్బకు హైదరాబాద్‌కు అంతర్జాతీయ మ్యాచ్‌ కేటాయించాలంటే బీసీసీఐ ఆలోచించే పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు వస్తున్నాయి..! భాగ్యనగరం అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడ మే అరుదైన విషయం. మొదలైన పుష్కర కాలానికి గానీ టీ-20ని నిర్వహించే భాగ్యం దక్కలేదు. అలాంటప్పుడు నిర్వాహకులు ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహణ బాధ్యత తీసుకోవాలి. కానీ, హెచ్‌సీఏ మాత్రం నిర్లక్ష్యంతో నిలువునా ముంచేసింది. ఆట రద్దయినా.. కనీసం ట్రోఫీ అందజేసే కార్యక్రమమైనా నిర్వహించకపోవడం హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ ను మరింతగా వేధిస్తోంది. క్రికెటర్ల భద్రతపై శ్రద్ధ పెట్టడం లో తప్పులేదు కానీ.. అభిమానుల మనోభావాలను, ఆకాంక్షలను ఎందుకు పట్టించుకోలేదన్నదే అసలు ప్రశ్న.! వర్షం పడి ఆగినా ఎవరూ ఇంతగా బాధపడేవాళ్లు కాదేమో! వాస్తవానికి వివాదాలతో సావాసం చేసే హెచ్‌సీఏకు బీసీసీ ఐ మ్యాచ్‌లు కేటాయించడమే తక్కువ. ఎందుకంటే ఈ స్టేడియంలో జరిగినవి 4 టెస్టులు.. 5 వన్డేలే.! గత పాలకుల అవినీతి ధనదాహంలో పడి మాకు మ్యాచ్‌లు ఇవ్వండి అని డిమాండ్‌ చేసే పరిస్థితే లేకపోయింది. పొరుగునే ఉన్న విశాఖపట్టణం తరచూ ఆతిథ్యం ఇస్తున్నా.. మన పరిస్థితి మారడం లేదు. గత పాలకులు అవినీతిలో మునిగారని.. తాము ఆ మకిలిని కడిగేస్తామంటూ ఎన్నికల్లో గెలిచి వచ్చిన కొత్త కార్యవర్గం కనీసం మ్యాచ్‌ నిర్వహణనే చేయలేకపోయింది. ఎంత వర్షం వచ్చినా ఎదుర్కొంటామన్న వారు అసలు సమయంలో చేతులెత్తేశారు.  ఇప్ప టికే లోటు బడ్జెట్‌తో బండి లాగిస్తున్న హెచ్‌సీఏ ఈ మ్యాచ్‌ రద్దు ఫలితంగా మరింత డీలా పడిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతోంది. టిక్కెట్ల విక్రయంతో నాలుగున్నర కోట్లు ఖజానాకు చేరుతాయని పాలకులు చెప్పారు. దాన్ని క్రికెట్‌ అభివృద్ధికే ఖర్చు చేస్తామని ప్రకటనలూ ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఆ మొత్తం తిరిగిచ్చేయాలి. పైపెచ్చు సదుపాయాల కల్పన, భద్రత, ఆహారం, రవాణా ఖర్చులకు కోటి రూపాయాలు జేబు నుంచి చెల్లించాల్సి ఉంటుంది. మ్యాచ్‌కు రూ. 9 కోట్ల బీమా చేయించామని వారు చెబుతున్నా.. అందులో ఎంత వస్తుందో చెప్పలేం! మార్పు అనివార్యం..: హైదరాబాద్‌ టీ-20 రద్దు నిర్వాహకుల వైఫల్యంతోపాటు స్టేడియం మౌలిక వసతుల్లో లోటుపాట్లను బహిర్గతం చేసింది. దేశంలోని మిగతా వేదికల సదుపాయాల గురించి బీసీసీఐ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలోని 49 అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాల్లో పుణెతో పాటు చెన్నైల్లో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో అయితే కర్ణాటక క్రికెట్‌ సంఘం (కేఎస్‌సీఏ) అత్యాధునిక డ్రైనేజీ, అవుట్‌ఫీల్డ్‌ను ఏర్పాటు చేసుకుంది.  ప్రపంచంలో అత్యుత్తమమైన ఈ సబ్‌ఎయిర్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవడం ఆ సంఘం ఆఫీస్‌ బేరర్ల దూరదృష్టికి నిదర్శనం. సాధారణ డ్రైనేజీతో పోల్చితే 36 రెట్లు వేగంగా నీళ్లను బయటకు పంపిస్తుంది. వర్షం ఆగిన నిమిషాల్లో మైదానాన్ని సిద్ధంగా ఉంచుతుంది. అంతేకాదు ఆ సంఘం మురుగు నీటి శుద్ది కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. దాని వల్ల మండు వేసవిలోనూ రోజూ రెండు మిలియన్‌ లీటర్ల శుద్ది చేసిన నీరు మైదానంతో పాటు జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) అవసరాలకు సమకూర్చుకుంటోంది. ప్రతీ సంఘం దీన్ని పాటించేలా చేయడంతో పాటు స్టేడియం పైకప్పుపై సోలార్‌ ప్యానెళ్లు అమర్చితే.. విద్యుత్‌ ఖర్చులు కూడా కలిసొస్తాయి.  దశాబ్ద కాలంగా పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు ప్రధానంగా ముంబై, కోల్‌కతా, ఢిల్లీతో పాటు గోవా, విశాఖపట్నం, కొచ్చి, కటక్‌, హైదరాబాద్‌ ఆతిథ్యం ఇస్తున్నాయి. అన్నీ ఎప్పుడో ఒకసారి వర్ష ప్రభావితమైనవే. దాని వల్ల వందల కోట్ల రూపాయాల నష్టం వాటిల్లింది. అందువల్ల.. అన్ని రాష్ట్ర సంఘాలు కేఎస్‌సీఏను చూసి నేర్చుకోవాలి. అధునిక డ్రైనేజీ, అవుట్‌ ఫీల్డ్‌ను ఏర్పా టు చేసుకోవాలి. నిధులు దండిగా ఉన్న బీసీసీఐ అందుకు తగిన చొరవ తీసుకోవాలి. అవసరమైన నిధులు ఇవ్వాలి. అందుకే ఈ టీ-20 మ్యాచ్‌ను చూసైనా హెచ్‌సీఏ, బీసీసీఐ పాఠాలు నేర్వాల్సిందే..! ఎందుకంటే ఒక్క బంతి పడకుండా ఆట రద్దయితే టిక్కెట్ల డబ్బులు తిరిగిస్తారమో కానీ, ఎన్నో వ్యవప్రయాలకోర్చి స్టేడియానికి వచ్చిన ప్రేక్షకుల శ్రమ.. వారి విలువైన సమయాన్ని ఎవరూ తిరిగి ఇవ్వలేరు..!  (ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
sports
1,567
01-09-2017 23:54:32
మార్చికల్లా రూ.5,100 కోట్ల బీమా వ్యాపారం
ఎల్‌ఐసి సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ లక్ష్యంహైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ముగిసేనాటికి 5,100 కోట్ల రూపాయల నూతన బీమా ప్రీమియంను సాధించాలన్న లక్ష్యం నిర్దేశించుకున్నట్టు ఎల్‌ఐసి సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ జోనల్‌ మేనేజర్‌ టిసి సుశీల్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు చివరినాటికే 1,500 కోట్ల రూపాయల ప్రీమియం వ్యాపారాన్ని నమోదు చేసుకున్నామని, నిర్దేశిత ప్రీమియం లక్ష్యాన్ని సాధించే అవకాశ ం ఉందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కొత్తగా 36 లక్షల పాలసీలను లక్ష్యంగా చేసుకోగా.. ఇప్పటికే 9.1 లక్షల బీమా పాలసీలను జారీ చేసినట్టు శుక్రవారంనాడిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో సుశీల్‌ కుమార్‌ తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 27.88 లక్షల బీమా పాలసీల ద్వారా 5,092 కోట్ల రూపాయల నూతన బీమా ప్రీమియం వ్యాపారాన్ని సాధించినట్టు చెప్పారు. ఇది తాము లక్ష్యంగా నిర్దేశించుకున్నదానికన్నా అధికమని తెలిపారు. ఇదే ఆర్థిక సంవత్సరంలో సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ మొత్తం ప్రీమియం ఆదాయం 46,500 కోట్ల రూపాయలు దాటిందని, ఇప్పటి వరకు 4.4 కోట్ల పాలసీలను జారీ చేసినట్టు ఆయన తెలిపారు. క్రితం ఆర్థిక సంవత్సరంలో 24,68,204 మెచ్యూరిటీ క్లెయిమ్‌లను సెటిల్‌ చేశామని, వీటి విలువ 9,820 కోట్ల రూపాయలని ఆయన పేర్కొన్నారు. ఇదేకాలంలో 1,51,785 డెత్‌ క్లెయిమ్‌లను సెటిల్‌ చేశామని, వీటి మొత్తం 1,731.92 కోట్ల రూపాయలని తెలిపారు. స్పెషల్‌ రివైవల్‌ క్యాంపెయిన్‌ కింద ప్రీమియం చెల్లించకుండా నిలిచిపోయిన పాలసీలను తిరిగి పునరుద్ధరించుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ పరిధిలోకి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాలు వస్తాయని, ఈ జోన్‌లో 1.62 లక్షల మంది ఏజెంట్లు పని చేస్తున్నారని తెలిపారు. ఎల్‌ఐసి ఆవిర్భవించి 61 ఏళ్లు పూర్తయిందని, ఇన్నేళ్ల కాలంలో జీవిత బీమా వల్ల కలిగే ప్రయోజనాన్ని ప్రజలకు మరింత చేరువ చేసినట్టు ఆయన చెప్పారు.
business
3,486
06-04-2017 00:37:39
సిరియా రాక్షసం!
సిరియాలోని ఇద్లిబ్‌ ప్రాంతంలో మంగళవారం విషరసాయనాలతో యుద్ధవిమానాలు దాడి జరిపి వంద మందిని చంపివేసిన ఘటన అత్యంత అమానుషమైనది. మరణించిన వారిలో చిన్నారులు అధికంగా ఉండటమూ, వారంతా నురగలు కక్కుతూ గిలాగిలా కొట్టుకొని మరణిస్తున్న దృశ్యాలను చూసి యావత్‌ ప్రపంచం నిర్ఘాంతపోయింది. ఈ దాడిలో మరొక ఐదువందలమంది తీవ్ర విషప్రభావానికి గురైనందున మరణాల సంఖ్య పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇది సిరియా అధ్యక్షుడు బషర్‌ పనేనంటూ బ్రిటన్‌ కేంద్రంగా పనిచేస్తున్న సిరియా మానవ హక్కుల సంస్థ వాదిస్తున్నది. అమెరికా సహా దాని మిత్రదేశాలన్నీ సిరియాపైన, రష్యాపైన ఘాటైన విమర్శలు చేస్తున్నాయి. ఈ ఘటనకు ఒకరోజు ముందే రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ భూగర్భ రైల్లో ఆత్మాహుతి దాడి జరిగి 10 మందికి పైగా మరణించిన నేపథ్యంలో దీనిని కక్షసాధింపు చర్యగా కొందరు అభివర్ణిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం తనను తప్పుపట్టడమూ, మరొకపక్కన ఐక్యరాజ్యసమితి హడావుడిగా సమావేశం కావడంతో సిరియా ప్రభుత్వం ఈ దాడిలో తన బాధ్యత లేదనీ, తిరుగుబాటుదారులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అంటున్నది. అయితే, బషర్‌ ఎన్నడూ మాటకు కట్టుబడే మనిషి కాదు కనుక సిరియా వాదనను ఎవరూ విశ్వసించడం లేదు. 2013లో ఒకేమారు 1400 మందిని విషవాయువుతో చంపివేసి, అనంతరం అమెరికా సైనికచర్య నుంచి బయటపడటానికి రసాయనిక ఆయుధాల నిషేధ ఒప్పందంపై బషర్‌ సంతకం చేసినప్పటికీ, విషరసాయనాల ఉత్పత్తిని నిలిపిందీ లేదు, వాడకాన్ని ఆపిందీ లేదు. ఆ తరువాత రెండేళ్లలో మూడునాలుగుసార్లు తిరుగుబాటు దారుల ఆధీనంలోని ప్రాంతాలపై సిరియా ప్రభుత్వం రసాయనికదాడులు జరిపినట్టు ఐక్యరాజ్యసమితి తేల్చింది. బషర్‌ అల్‌ అసద్‌ అనుకూల సైన్యం గతవారమే హమా ప్రావిన్సుపై ఈ రకమైన దాడి జరిపితే, అనేకమంది విలవిల్లాడుతూ ఆసుపత్రుల పాలైనారు. ప్రస్తుత దాడికి సిరియా పాలకుడు కారణం కాదనీ, ఈ ఘటన అనంతరం కూడా బషర్‌ విషయంలో తమ వైఖరిలో ఏ మార్పూ లేదని రష్యా ప్రకటించింది. ఈ దాడి జరిగిన మర్నాడే అదేప్రాంతంలో సిరియా యుద్ధవిమానాలు ఒక ఆయుధాగారాన్ని ధ్వంసం చేశాయనీ, ఇక్కడ ఉగ్రవాదులు బాంబులతో పాటు విషరసాయనాలు తయారుచేస్తున్నారని రష్యా ప్రకటించింది.ఆరేళ్ళ సిరియా యుద్ధంలో నిజం సమాధి అవుతూనే ఉన్నది.  మానవత్వం ఎప్పుడో మంటగలిసిపోయింది. మొన్నటివరకూ అమెరికా, రష్యాలు చెరొకవైపునా మోహరించి ఎడాపెడా దాడులతో వందలాది మంది అమాయకుల ప్రాణాలు తీశాయి. అలెప్పో స్వాధీనం పేరిట ఎంతటి విధ్వంసమూ, జనహననమూ సాగిందో తెలియంది కాదు. అమెరికా వెనుకంజవేసి కార్యక్షేత్రాన్ని పూర్తిగా రష్యాకు, సిరియాకు వదిలేసిన తరువాత అర్థంలేని యుద్ధానికి ఒక దారీతెన్నూ ఏర్పడివుండవచ్చునేమో కానీ, బషర్‌ దూకుడుకు అడ్డులేకుండా పోయింది. ఇద్లిబ్‌ ఘటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్యమనస్కంగానే ఖండిస్తూ, ఈ పాపానికి మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కారకుడన్నారు. సిరియాలో ఒబామా కొంతకాలం యుద్ధం చేసి, 2015లో రష్యా ప్రవేశంతో వెనక్కుతగ్గిన మాట తెలిసిందే. కానీ, ట్రంప్‌ ఆదినుంచీ సిరియాలో అమెరికా జోక్యాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ‘అమెరికా బొక్కసానికి భారం తప్ప అక్కడ నీకు ఒరిగేదేమీ లేదు’ అని ట్వీట్లు చేశేవారు. ఇస్లామిక్‌స్టేట్‌ అంతానికే ప్రాధాన్యం ఇచ్చి అసద్‌ను అధికారం నుంచి దించే లక్ష్యాన్ని పూర్తిగా వదులుకోవాలని ఇటీవలే తీర్మానించుకున్నారు. ఈ విషయాన్నే బషర్‌ యుద్ధనేరాలను విచారిస్తున్న ఐక్యరాజ్యసమితికి కూడా తెలియచేశారు. రష్యాకు ఈ విధంగా రుణం తీర్చుకుంటున్నారన్న విమర్శలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. యుద్ధవిరమణ చేసిన అమెరికా, ఇలా విస్పష్టంగా బషర్‌ పక్షాన నిలిచినప్పుడు రష్యా–సిరియా జోడీ ఆగడాలకు హద్దుపద్దూ ఉండదన్నది విమర్శకుల వాదన. రష్యాకు ఉగ్రదాడులు కొత్తేమీకాదు. చెచెన్‌ తిరుగుబాటుదారులు అనేకం చేశారు. కానీ, సెయింట్‌పీటర్స్‌ బర్గ్‌ భూగర్భరైల్లో సోమవారం జరిగిన ఆత్మాహుతిదాడి సిరియాలో రష్యావీరంగానికి ప్రతీకారంగా జరిగినట్టు చెబుతున్నారు. ఈ దాడికి బాధ్యులంటూ రష్యా ఇప్పటికే ఆరుగురు ఇస్లామిక్‌స్టేట్‌ అనుచరులను అరెస్టుచేసింది. భూగర్భరైల్లో వాడిన బాంబులు సిరియాలో తయారైనట్టు కథనాలున్నాయి. సిరియాలో అడుగుపెట్టిన తరువాత రష్యా ఇస్లామిక్‌ స్టేట్‌కు లక్ష్యంగా మారిపోయింది. అదే ఏడాది ఈజిప్టు విమానాన్ని కూల్చివేసి 225 మంది రష్యన్‌ టూరిస్టులను చంపివేసింది. ఇప్పటికే అవినీతి ఆరోపణలను, నిరసనలను చవిచూస్తున్న పుతిన్ వచ్చే ఏడాది నాలుగోసారి అధ్యక్షుడు కావాలనుకుంటున్న తరుణంలో సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ ఘటన ఆయనకు కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతుంది. సిరియా విషయంలో రష్యా వైఖరిపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. సెయింట్‌పీటర్స్‌ బర్గ్‌ దాడికి ప్రతీకారంగానే ఇద్లిబ్‌ ఘటన జరిగిందని కొందరు చేస్తున్న విశ్లేషణలు పూర్తిగా కొట్టిపారేయలేనివి.
editorial
2,912
07-05-2017 01:12:27
ఎన్‌సిసికి రూ.499 కోట్ల పుణె మెట్రో ఆర్డర్‌
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన ఎన్‌సిసి లిమిటెడ్‌.. పుణె మెట్రో నుంచి తొలి నిర్మాణ కాంట్రాక్టును గెలుచుకుంది. మెట్రో రైల్‌ నిర్మాణంలో భాగంగా 10.75 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్‌ మెట్రో రైల్‌ వయాడక్ట్‌లను ఎన్‌సిసి నిర్మించాల్సి ఉంటుంది. ఈ కాంట్రాక్టు విలువ 499 కోట్ల రూపాయలు. ఈ ఆర్డర్‌ కోసం ఆఫ్కాన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, గాయత్రి ప్రాజెక్ట్స్‌, మహారాష్ట్ర మెట్రో రైల్‌ కార్ప్‌ జాయింట్‌ వెంచర్‌ సంస్థ మేజర్‌ బ్రిడ్జ్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ పోటీపడ్డాయి. నాగ్‌పూర్‌ మెట్రోకు బిడ్‌ కోట్‌ చేసిన తరహాలోనే ఎన్‌సిసి.. పుణె మెట్రోకు కూడా కాంపిటీటివ్‌ ధరతో బిడ్‌ను కలిసి వచ్చిం ది. కాగా నాగ్‌పూర్‌ మెట్రో ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎన్‌సిసి ఆర్డర్‌ను గతంలో చేజిక్కించుకుంది. కాగా పుణె మెట్రోకు సంబంధించిన ఆర్డర్‌ను ఎన్‌సిసి గెలుచుకోవటంతో త్వరలోనే పింప్రీ చించ్వాడ్‌-రేంజ్‌ హిల్స్‌ మార్గంలో నిర్మాణ పనులను ప్రారంభించనుంది. మొత్తం 11,420 కోట్ల రూపాయల విలువైన పుణె మెట్రో ప్రాజెక్ట్‌ను భారత ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన మహా మెట్రో నిర్వహిస్తోంది. మొత్తం రెండు కారిడార్లలో ఈ ప్రాజెక్ట్‌ను మహా మెట్రో అభివృద్ధి చేస్తోంది.
business
18,835
04-08-2017 17:45:39
'దేశం పేరు కూడా మార్చేయండి'
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో అతి పురాతనమైన 'ముఘల్‌సరాయ్' రైల్వేస్టేషన్‌కు పేరు మార్చాలనే ఆలోచనపై పార్లమెంటులో శుక్రవారంనాడు వివాదం చెలరేగింది. దేశ పటాన్ని కూడా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ విపక్ష సభ్యులు రాజ్యసభలో గలభా సృష్టించారు. 'ముఘుల్ సరాయ్' రైల్వేస్టేషన్‌కు పేరుమార్చి బీజేపీ సిద్ధాంతకర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పేరు పెట్టాలంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనిపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ రాజ్యసభలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ భౌగోళిక స్వరూపాన్ని బలవంతంగా మార్చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని, దశాబ్దాల నాటి పాత స్టేషన్‌ పేరు మార్చాలనుకుంటున్నారని, న్యూఢిల్లీ పేరు మార్చేందుకు కూడా వెనుకాడేలా కనబడటం లేదని ఆయన తప్పుపట్టారు. దీంతో రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ పీజే కురియన్ జోక్యం చేసుకుంటూ వేరే నిబంధన కింద ఆ అంశంపై చర్చ‌ను చేపట్టాల్సి ఉంటుందన్నారు. దీంతో సమాజ్‌వాది పార్టీ సభ్యులు నినాదాలు చేస్తూ సభమధ్యలోకి దూసుకుపోయారు. దీంతో సభ ఒకసారి వాయిదా పడింది. మాయావతి బీఎస్‌పీకి చెందిన ఎంపీలు సైతం సమాజ్‌వాదీ పార్టీ సభ్యుల ఆందోళనకు బాసటగా నిలిచారు. ఈస్ట్ ఇండియా కంపెనీ 1862లో హౌరా నుంచి ఢిల్లీకి రైలు మార్గాన్ని అనుసంధానిస్తూ ముఘల్‌సరాయ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసారు. దీనిపై రాజ్యసభలో జరిగిన ఆసక్తికరమైన చర్చలో పేరు మార్పు నిర్ణయాన్ని వ్యతిరేకించిన అగర్వాల్...'దేశం పేరు కూడా మార్చేయండి' అంటూ దూకుడు ప్రదర్శించారు. స్వాతంత్ర్య పోరాటంతో ఏమాత్రం సంబంధం లోని వారి పేర్లను ప్రసిద్ధ కట్టడాలు, రోడ్లకు పెడుతుండటంపై పలువురు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు కూడా కేంద్రాన్ని తప్పుపట్టారు. కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి ఇందుకు స్పందిస్తూ 'మొఘల్స్ పేరుతో ఉన్న స్టేషన్లనే వాళ్లు కోరుకుంటున్నారు. పండిట్ దీన్‌దయాళ్‌ను కాదు. ఈ ఆలోచనే తప్పు' అన్నారు. ఇది దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్‌ను అవమానించడమేనని పేర్కొన్నారు. ముంబైలోని విక్టోరియా టెర్మినస్ పేరును కూడా ఛత్రపతి శివాజీ టెర్మినల్‌గా మార్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పట్టువదలని ప్రతిపక్ష సభ్యులు 'అప్పుడు దేశం పేరు కూడా మార్చేయండి. దేశానికి ఆయన (దీన్‌దయాళ్) ఏం చేశారు' అని నిలదీశారు. నఖ్వి ఏమాత్రం తడబడకుండా...ఆయన ఒక మేథావి...కావాలంటే చరిత్ర చదువుకోండి అంటూ విపక్ష సభ్యులకు సలహా ఇచ్చారు.
nation
20,137
18-01-2017 00:52:54
ఆసీస్‌ స్పిన్‌ సలహాదారుగా శ్రీరామ్‌
మెల్‌బోర్న్‌: భారత పర్యటనకు ఆస్ర్టేలియా పకడ్బందీగా సిద్ధమవుతోంది. భారత్‌లోని స్పిన్‌ వికెట్లను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇక్కడ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కోవడంతోపాటు మెరుగైన స్పిన్‌ బౌలింగ్‌ ప్రదర్శన చేసేందుకు ఇద్దరు అనుభవజ్ఞులను క్రికెట్‌ ఆస్ర్టేలియా (సీఏ) స్పిన్‌ సలహాదారులుగా నియమించుకుంది. భారత మాజీ స్పిన్నర్‌ శ్రీరామ్‌ శ్రీధరన్‌ తమ జట్టుకు స్పిన్‌ కన్సల్టెంట్‌గా నియమించినట్టు సీఏ మంగళవారం తెలిపింది. అలాగే ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్‌ మాంటీ పనేసర్‌తో ఓ వారం రోజులపాటు ఆసీస్‌ స్పిన్నర్లకు మెళకువలు చెప్పించనున్నట్టు తెలిపింది. టీమిండియా తరఫున 8 వన్డేలాడిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ శ్రీధరన్‌ గతేడాది భారత, శ్రీలంకల్లో పర్యటించిన ఆస్ర్టేలియా జట్టుకు సలహాదారుడిగా వ్యవహరించాడు. ‘భారతలోని పరిస్థితులపై శ్రీధరన్‌కు పూర్తి అవగాహన ఉంది. అలాగే మా ఆటగాళ్ల సామర్థ్యం కూడా అతనికి తెలుస’ని ఆసీస్‌ టీమ్‌ పెర్ఫార్మెన్స్‌ మేనేజర్‌ పాట్‌ హోవర్డ్‌ తెలిపాడు. కాగా.. 2012లో భారతపై సిరీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్‌ పనేసర్‌ కూడా ఆసీస్‌కు ఒక వారం పాటు స్పిన్‌ పాఠాలు చెప్పనున్నాడు. బ్రిస్బేన్‌లో జరిగే క్యాంప్‌లో పనేసర్‌ ఆస్ర్టేలియా ఆటగాళ్లకు కొన్ని చిట్కాలు చెప్పనున్నాడు. కాగా.. భారతతో టెస్టు సిరీస్‌ కోసం ఆసీస్‌ జట్టు ఫిబ్రవరిలో ఇక్కడకు రానుంది.
sports
18,959
18-07-2017 01:29:00
నల్లేరుపై నడకే
వెంకయ్య విజయం ఖాయం.. 395 ఓట్లు సాధిస్తే చాలు!ఎన్డీఏ పక్షాలకు 412 ఓట్లు.. మరికొన్ని క్రాసయ్యే అవకాశంలోక్‌సభలో తిరుగులేని మెజార్టీ.. విపక్షం అవకాశాలు మృగ్యంన్యూఢిల్లీ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడి విజయం నల్లేరుపై నడక కానుంది. విపక్షాల అభ్యర్థిగా గోపాల్‌కృష్ణ గాంధీ బరిలో నిలిచినా వెంకయ్య గెలుపుపై ఎలాంటి ప్రభావం చూపబోవడం లేదు. రాష్ట్రపతి ఎన్నికకు భిన్నంగా కేవలం పార్లమెంటు ఉభయ సభల సభ్యులకు మాత్రమే ఈ ఎన్నికలో ఓటు హక్కు ఉంటుంది. ఈ క్రమంలో లోక్‌సభ, రాజ్యసభలోని ఎన్డీఏ పక్షాల సభ్యులు ఓటు వేసినా.. వెంకయ్య విజయం సాధిస్తారు.  లోక్‌సభలో 545, రాజ్యసభలో 245 మంది.. మొత్తం 790 మంది ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. 66(1) ప్రకరణ ప్రకారం నామినేటెడ్‌ సభ్యులతో సహా నైష్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదలాయింపు పద్ధతిలో ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఒక్కో సభ్యుడికి ఒక్కో ఓటు మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన 396 ఓట్లు సాధించిన వారు గెలుపొందుతారు. అయితే ప్రస్తుతం రాజ్యసభ్యలో రెండు, లోక్‌సభలో రెండు ఖాళీలు ఉండటంతో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటి 395 సాధిస్తే చాలు. ఎన్‌డీఏ పార్టీలకు ప్రస్తుతం లోక్‌సభలో 338 సీట్లు, రాజ్యసభలో 74 సీట్లు ఉన్నాయి. అంటే 412 సీట్ల సొంత బలం ఉంది. అంటే విజయానికి ఢోకా లేదన్నమాట. రాజ్యసభలోనే ఆధిక్యంఓటమి తప్పదని తెలిసినా కాంగ్రెస్‌ బరిలో నిలిచేందుకు తహతహలాడుతోంది. అందుకే ఎన్డీయే అభ్యర్థిని ప్రకటించక ముందే విపక్షాలను ఒక తాటిపైకి తెచ్చి గాంధీ మనవడు గోపాల్‌కృష్ణ గాంధీని బరిలోకి దింపింది. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో వేచి చూసే ధోరణి అవలంబించడంతో దళిత అభ్యర్థిగా కోవింద్‌ని ఎంపిక చేసిన ఎన్డీయే... కాంగ్రె్‌సపై ఆధిపత్యం సాధించింది. కాంగ్రెస్‌ చివరకు భాగస్వామిగా ఉన్నా జేడీయూని కూడా దూరం చేసుకోవాల్సి వచ్చింది. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా తృణమూల్‌, ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ, వాపపక్షాలు తదితర పార్టీలతో చర్చించి ఎన్డీయే కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించి, యుద్ధానికి సిద్ధమైంది. దూరమైన జేడీయూ మనసును కూడా గెలుచుకుని మద్దతు కూడగట్టింది. 18 విపక్షాలకు రెండు సభల్లో 248 ఓట్ల బలం ఉంది. ఒక్క రాజ్యసభలోనే వాటికి ఆధిక్యం ఉంది. ఇక ఎన్డీయే విషయానికి వస్తే, తమ కూటమిలో పార్టీలు ఓటేస్తేనే సులభంగా మ్యాజిక్‌ ఫిగర్‌ సాధించగలుగుతుంది. ఇక ఆధిక్యాన్ని పెంచేందుకు అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌, బీజేడీ, వైసీపీ వంటి పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ఎటూ మొగ్గు చూపని పార్టీలు చివరి క్షణంలో కాంగ్రెస్‌ వైపు మళ్లినా, విపక్షాల అభ్యర్థికి మహా అయితే మరో 30 ఓట్లు వచ్చే వీలుంది. ఇప్పటి వరకు 4 సార్లు ఏకగ్రీవందేశంలో ఇప్పటి వరకు 4సార్లు ఉప రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. 1952, 57లో సర్వేపల్లి రాధాకృష్ణన్‌. 1979లో హిదాయతుల్లా, ఆ తర్వాత 1987లో శంకర్‌దయాళ్‌శర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఇప్పటివరకు జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో, 1992లో కేఆర్‌ నారాయణన్‌ అత్యధికంగా 700 ఓట్లు సాధించి విజయ దుంధుబి మోగించారు. అప్పుడు రెండో స్థానంలో ఉన్న కాక జోగిందర్‌సింగ్‌కు కేవలం ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. తొలిసారి ఎన్‌డీఏ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఎన్నికలో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన సుశీల్‌ కుమార్‌ షిండే, బీజేపీ అభ్యర్థి షెకావత్‌ చేతిలో ఓడిపోయినా 305 ఓట్లు సాధించడం విశేషం. ఇప్పటివరకు ఓడిపోయిన వారందరిలో షిండేనే అత్యధికంగా ఓట్లు సాధించారు.
nation
19,964
19-04-2017 03:26:41
ఢిల్లీ ఛేజింగ్‌ చేయాలి..! :రవిశాస్త్రి
తమ బ్యాట్స్‌మెన్‌ నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీగా పరుగులు ఆశిస్తోంది. డేవిడ్‌ వార్నర్‌పై ఆధారపడి ఎలాగొలా లాక్కొస్తున్నా.. డిఫెండింగ్‌ చాంప్‌ మాత్రం ఇప్పటి వరకు ఆశించిన స్థాయి ప్రదర్శన చేయలేదు. ధవన్‌, యువరాజ్‌ మరింత నిలకడగా రాణించాల్సి ఉంది. హెన్రిక్స్‌ ఫర్వాలేదనిపిస్తున్నా.. కీలక సమయాల్లో సత్తాచాటాలి. ఫ్లడ్‌లైట్స్‌ వెలుతురులో బంతి చక్కగా బ్యాట్‌పైకి వస్తుంది కాబట్టి నైట్‌ మ్యాచ్‌ల్లో ఛేదనకే ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఫీల్డర్లు తప్పులు చేయడానికి ఆస్కారం కూడా ఉంది. ఇక ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. యువ బ్యాట్స్‌మెన్‌ జట్టును నడిపిస్తుండగా.. లక్ష్యాన్ని కాపాడుకునే సమయంలో జహీర్‌ ఖాన్‌ సహచరులకు తగిన సహకారం అందిస్తున్నాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ లో ఢిల్లీ సెకండ్‌ బ్యాటింగ్‌ తీసుకుంటుందని భావిస్తున్నా. హైదరాబాద్‌ బౌలింగ్‌లో కూడా కొంత అనిశ్చితి ఉంది. భువనేశ్వర్‌, రషీద్‌ ఖాన్‌ రాణిస్తున్నా.. ముస్తాఫిజుర్‌ ఆందోళన కలిగిస్తున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో యువీ ఒక్క బంతి కూడా వేయలేదు. రిషభ్‌ పంత, రషీద్‌ మధ్య ఆసక్తికర పోరు నడిచే అవకాశం ఉంది. అయితే పటిష్ట బౌలింగ్‌ లైనప్‌ కలిగిన ఢిల్లీ, రైజర్స్‌ మఽధ్య పోరు ఎలా ఉంటుందో! -(టీసీఎమ్‌)
sports
4,967
04-01-2017 09:40:13
నాలుగు సినిమాల మధ్య సంక్రాంతి పందెం!
  ఈ సారి చెప్పుకోదగ్గ విశేషమేమంటే ఇద్దరు సీనియర్‌ అగ్ర నటులకు మైలురాళ్లవంటి సినిమాలు ఒకదానితో ఒకటి బాహాబాహీ తలపడుతుండటం. వాటిలో ఒకటి చిరంజీవి కమ్‌ బ్యాక్‌ ఫిల్మ్‌ ‘ఖైదీ నంబర్‌ 150’, మరొకటి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. మేరు పర్వతాల్లాంటి ఈ సినిమాలు అత్యధిక శాతం థియేటర్లను ఆక్రమించుకుంటుంటే, వాటి మధ్య చిన్న సినిమాల్ని విడుదల చేయాలని సాహసించేదెవరు! ఆశ్చర్యకరంగా ఆ సాహసాన్ని ఇద్దరు నిర్మాతలు చేస్తున్నారు. ఒకరు దిల్‌ రాజు, మరొకరు చదలవాడ శ్రీనివాసరావు. శర్వానంద్‌ హీరోగా తను నిర్మించిన ‘శతమానం భవతి’ని రాజు రిలీజ్‌ చేస్తుంటే, ఆర్‌. నారాయణమూర్తిని టైటిల్‌ రోల్‌లో చూపిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య’ను శ్రీనివాసరావు విడుదల చేస్తున్నారు. ఈ రెండింటికి ఎన్ని థియేటర్లు అందుబాటులో ఉంటాయన్నది ఆసక్తికరం  మూడోసారి ‘ఖైదీ’‘ఖైదీ’ టైటిల్‌ చిరంజీవికి బాగానే కలిసొచ్చింది. ఆ టైటిల్‌తో వచ్చిన సినిమాతోటే యాక్షన హీరోగా సరికొత్త ట్రెండ్‌కు ఆయన నాంది పలికారు. ఆయనకు స్టార్‌డమ్‌ తెచ్చింది ఆ సినిమానే. ఆ తర్వాత ‘ఖైదీ నెంబర్‌ 786’తోనూ ఆయన అలరించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ‘ఖైదీ నంబర్‌ 150’ అవతారమెత్తారు. ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ తర్వాత చాలా కాలం పాటు కెమెరా ముందుకు రాని చిరంజీవి అతిథి పాత్రల్లో ‘మగధీర’, ‘బ్రూస్‌లీ’ సినిమాల్లో కనిపించారు. హీరోగా కమ్‌ బ్యాక్‌ సినిమా కోసం చాలా కాలం వేచిచూసిన ఆయన ఎన్నో కథలు విన్నారు. అవేవీ నచ్చక తమిళ హిట్‌ ఫిల్మ్‌ ‘కత్తి’ రీమేక్‌కు గ్రీన సిగ్నల్‌ ఇచ్చారు. ఒక ప్రాంతంలో అన్యాయానికి గురైన రైతుల పక్షాన పోరాడే వ్యక్తి కథ ఆయనకు నచ్చింది. పైగా ద్విపాత్రాభినయం చేసే అవకాశం. చాలా కాలం తర్వాత హీరోగా చేస్తున్న సినిమాకు ఉండే అంచనాలు నిలవాలంటే ఇదే సరైన సబ్జెక్టని ఆయన భావించారు. అలా తొమ్మిదేళ్ల సుదీర్ఘ కాలానంతరం కథానాయకుడిగా సెట్స్‌పై అడుగుపెట్టి ‘ఖైదీ నంబర్‌ 150’ చేశారు చిరంజీవి. చిత్రమేమంటే ‘ఖైదీ నెంబర్‌ 786’ కూడా ‘అమ్మన కోవిల్‌ కిళకలే’ అనే తమిళ హిట్‌ సినిమాకు రీమేకే. ఇప్పుడు కూడా రీమేక్‌నే నమ్ముకొన్న ఆయన.. దర్శకత్వ బాధ్యతల్ని వి.వి. వినాయక్‌కు అప్పగించారు. తమిళ ‘రమణ’ను ‘ఠాగూర్‌’గా తీర్చిదిద్ది, తనకు ఘన విజయాన్ని అందించిన వినాయక్‌పై మరోసారి నమ్మకముంచారు చిరంజీవి. ఆయన సరసన నాయికగా ఎవరు చేస్తారనేది అందరిలోనూ ఉత్కంఠను కలిగించగా, ఆ అవకాశాన్ని తన కుమారుడు రామ్‌చరణ్‌ సరసన ‘మగధీర’, ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రాల్లో నటించిన కాజల్‌ అగర్వాల్‌కు కల్పించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు కూర్చిన పాటల్లో ఆయన ఆహార్యం, ట్రెండీగా ఆయన చేసిన డాన్స చూశాక ఆయనలో మునుపటి ఉత్సాహం, ఉత్తేజం ఏమాత్రం తగ్గలేదనిపిస్తోంది. ఈ నెల 7న గుంటూరులో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్‌ ఫంక్షన జరిపేందుకు నిర్మాత రామ్‌చరణ్‌ అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన కంపెనీ పతాకంపై నిర్మించిన ‘ఖైదీ నంబర్‌ 150’ ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా 2500 స్ర్కీన్స్‌లో విడుదలవుతోంది.  మైలురాయి ‘శాతకర్ణి’చిన్న చిన్న ముక్కలుగా విడిపోయిన గణతంత్ర రాజ్యాలన్నింటినీ ఏకం చేయాలనే తలంపుతో యుద్ధాలు చేసి, అఖండ భారతావనిని నెలకొల్పిన ఓటమి ఎరుగని యోధుడు.. తల్లిపేరును ముందుంచుకొని స్త్రీకి గౌరవాన్ని కల్పించిన తొలి చక్రవర్తి.. ఉగాది పండుగకు కారకుడైన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కథను తెరకెక్కించాలనే తలంపు ఓ దర్శకుడికి రావడమే గొప్ప విషయం. ఆ తలంపును స్వల్ప కాలంలోనే నిజం చేసుకొన్న ఆ దర్శకుడు క్రిష్‌. మనందరికీ అరకొరగా తెలిసిన శాతకర్ణి చరిత్రను కూలంకషంగా అధ్యయనం చేసి, కేవలం 80 రోజుల లోపునే చిత్రీకరణను పూర్తిచేసి, అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. శాతకర్ణి పాత్రను తను వినా మరో నటుడు చేయలేడనే ఆయన అభిమతానికి వాస్తవరూపమిచ్చారు బాలకృష్ణ. వాస్తవానికి తన వందో సినిమాగా కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రైతు’ చేద్దామని అప్పటికే దాదాపుగా నిర్ణయించుకొన్నారు బాలకృష్ణ. కానీ శాతకర్ణి కథను క్రిష్‌ నోటి నుంచి విన్న ఆయన.. మైలురాయిలాంటి సినిమాకు సాంఘిక కథాంశం కంటే శాతకర్ణి వంటి చారిత్రక కథాంశమైతే మరింత శోభనిస్తుందనే అభిప్రాయానికి వచ్చేసి, దాన్నే ఎంచుకొన్నారు. సెట్స్‌పైకి వెళ్లకముందే శాతకర్ణి పాత్రను సొంతం చేసుకొన్నారు. శాతకర్ణిగా బాలకృష్ణ ఆహార్యం, ఆ వేషంలో ఆయన హావభావాలు, ఆయన నోటి నుంచి చురకత్తుల్లా వస్తున్న మాటలను ట్రైలర్‌లో చూసిన వాళ్లంతా.. ఓ గొప్ప సినిమా తమముందుకు రాబోతోందనే అభిప్రాయానికి వచ్చేశారు. దృశ్యపరంగానూ ఉన్నత స్థాయిలో కనిపిస్తున్న ఈ సినిమాలో శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీగా బాలీవుడ్‌ సీనియర్‌ నటి హేమమాలిని నటించడం మరో విశేషం. తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాగా ఇప్పటికే అంచనాలు పెంచుతున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఈ నెల 11 లేదా 12న ప్రపంచవ్యాప్తంగా 1200 పైగా థియేటర్లలో వస్తోంది. సెన్సార్‌ పూర్తైన తర్వాత గురువారం అధికారికంగా విడుదల తేదీని ప్రకటిస్తారు.  అల్లాటప్పా వెంకట్రామయ్య కాదుఆర్‌. నారాయణమూర్తి సినిమా అంటే అది ఏ తరహాలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈసారి ఆయన చేసిన సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. అదేమంటే.. చాలా కాలంగా సొంత సినిమాల్లో తప్ప బయటి బేనర్‌లో సినిమా చెయ్యని, ధవళ సత్యం దర్శకత్వంలో ‘భీముడు’ చేశాక మళ్లీ ఇప్పటివరకూ స్వీయ దర్శకత్వంలో తప్ప మరో దర్శకుడితో పనిచెయ్యని ఆయన.. ఆ కట్టుదాటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్‌ బేనర్‌లో, దాని అధినేత చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘హెడ్‌కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య’ చేశారు. అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ అంశంతో పాటు మరో అంశం కూడా ఉంది. అది.. ఇప్పటివరకూ సమాజంలోని ఏదో ఒక బాధిత వర్గానికి ప్రతినిథిగానో, తిరుగుబాటుదారునిగానో, విప్లవవీరునిగానో నటిస్తూ వచ్చిన ఆయన తొలిసారి కథానాయకుడిగా పోలీస్‌ పాత్రను చేశారు. నీతి నిజాయితీలే ప్రాణంగా బతికే వెంకట్రామయ్య అనే పోలీస్‌ కానిస్టేబుల్‌ - తన విధి నిర్వహణలో అడ్డంకులు సృష్టించిన అవినీతిపరుల భరతం పట్టడానికి ఏం చేశాడనేది ఈ సినిమా కథాంశం. ‘నల్ల డబ్బు’ గురించి కూడా ఈ సినిమాలో చర్చించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం.. నారాయణమూర్తి సరసన జయసుధ నటించడం. ఆ ఇద్దరి జోడీ స్టిల్స్‌ ఇప్పటికే మంచి ప్రాచుర్యం పొందడమే కాక, సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ నెల 12న విడుదలవుతున్న ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతుందో చూడాల్సిందే.  ఇది దిల్‌ రాజు సినిమా మార్కెట్‌ అంచనాలు, ప్రేక్షకుల అభిరుచులు, ఆసక్తులు కనిపెట్టడంలో మిగతా నిర్మాతలకంటే దిల్‌ రాజు ఓ అడుగు ముందుంటారు. అలాంటిది రెండు భారీ, క్రేజీ సినిమాల మధ్యలో తన సినిమా ‘శతమానంభవతి’ని విడుదల చేస్తుండటం సినీ వర్గాల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. సినిమా విడుదలకు ‘టైమింగ్‌’ చాలా ముఖ్యమని నమ్మే ఆయన సంక్రాంతికి తన చిత్రాన్ని విడుదల చేయాలని ముందుగానే సంకల్పించుకున్నారు. ఈ సీజనలో ఎన్ని సినిమాలు వచ్చినా, బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారనేది ఆయన నమ్మకం. అందుకే శర్వానంద్‌, అనుపమ పరమేశ్వరన జంటగా నిర్మించిన ‘శతమానంభవతి’ని సంక్రాంతి రోజున.. అంటే 14న విడుదల చేస్తున్నారు. రచయితగా ఎక్కువమందికి తెలిసిన వేగేశ్న సతీశ చెప్పిన ఫ్యామిలీ స్టోరీ బాగా నచ్చి, ఆయన దర్శకత్వంలోనే ఈ చిత్రాన్ని నిర్మించారు రాజు. అదివరకు ‘దొంగల బండి’ అనే ఫ్లాప్‌ సినిమా తీసినప్పటికీ సతీశపై ఆయన నమ్మకముంచారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకొనే రీతిలోనే చిత్రాన్ని కంటికింపుగా మలచడంలో సతీశ సక్సెస్సయ్యారని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. ఇప్పటి వరకూ తను చేసిన పాత్రలకు భిన్నమైన పాత్రలో, ఓ పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో శర్వానంద్‌ నటించిన ఈ సినిమాను ఏమాత్రం తక్కువ అంచనాలు వేయడానికి వీలులేదు. దిల్‌ రాజు సినిమా అనే ప్రచారం ఈ చిత్రానికి పెద్ద బలం.
entertainment
18,476
17-05-2017 18:05:35
‘సోనియా వ్యక్తిగత మనీ లాండరర్ చిదంబరమే’
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరంపై బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి ఘాటైన ఆరోపణలు చేశారు. చిదంబరం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యక్తిగత మనీ లాండరర్ అని పేర్కొన్నారు. చిదంబరం తన కుమారునికి లబ్ధి కలిగేవిధంగా విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) అనుమతులను మంజూరు చేశారని మరోసారి చెప్పారు. ‘‘చిదంబరం చాలా అవినీతిపరుడని చెప్పవచ్చు. సోనియా గాంధీకి కూడా మనీలాండరర్‌ ఆయనే. పదవీ ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసిన ప్రమాణానికి విరుద్ధంగా ప్రతి చట్టాన్నీ ఆయన తుంగలో తొక్కుతున్నారు. తన కుమారుడు లంచాలు తీసుకోవడానికి వీలుగా ఎఫ్ఐపీబీ అనుమతులిచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి మంత్రులు ఇలాంటి పనులు చేయకుండా ఉండేవిధంగా ఇలాంటివారిపై విచారణ జరగాలి’’ అని స్వామి అన్నారు. చిదంబరం తన కుమారునికి లబ్ధి కలిగేవిధంగా చట్టవిరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగానే సుమారు 16 ఎఫ్ఐపీబీ అనుమతులిచ్చారని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో కొందరు అధికారులు చిదంబరానికి అనుకూలంగా ఉన్నారని, వారి నియామకాలను తాను వ్యతిరేకించానని, అయినప్పటికీ అదే అధికారులు కావాలని అరుణ్ జైట్లీ పట్టుబట్టారని సుబ్రహ్మణ్యం స్వామి చెప్పారు. సీబీఐ దాడులతో తన గొంతు నొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చిదంబరం చేసిన ఆరోపణలపై సుబ్రహ్మణ్యం స్వామి స్పందిస్తూ ‘‘ఆయనకున్న గళం ఏమిటి? ఆయన పరిశోధనాత్మక వ్యాసాలు రాస్తారు, మేధావి కాదు. న్యాయవాదిగా ఆయన పనితీరు కేవలం స్టే ఆర్డర్లు తేవడానికే పరిమితం. ఎలాంటి కారణం లేకుండా తనకు తాను భుజకీర్తులు తొడుక్కోవడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆయన రాతల మీద మాకు ఆసక్తి లేదు’’ అన్నారు. ‘‘ప్రభుత్వాన్ని ఖండిస్తూ, చిర్రుబుర్రులాడటం ఎందుకు? నేరారోపణల్లో సారం లేదని నిరూపించుకోండి’’ అని సలహా ఇచ్చారు. సీబీఐ మంగళవారం చిదంబరం, ఆయన కుమారుడు కార్తిలకు సంబంధించిన ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎఫ్ఐపీబీ అనుమతులకు సంబంధించిన కేసుల్లో ఈ దాడులు జరిగాయి.
nation
20,577
22-01-2017 18:16:28
రహానె‌ను ఊరించి.. ఉసూరుమనించింది..
కోల్‌కతా : టీమిండియా ఓపెనర్ అజింక్య రహానె అద‌ృష్టం ఎంతోసేపు నిలువలేదు. మూడో వన్డేలో శిఖర్ ధావన్ స్థానంలో చివరి క్షణంలో జట్టులోకి వచ్చాడు రహానె. తొలి ఓవర్‌లో క్రిస్ వోక్స్ వేసిన బంతి రహానె గ్లవ్స్ తాకి వికెట్ కీపర్ బట్లర్ చేతుల్లోకి వెళ్లింది. ఎవ్వరూ అప్పీల్ చేయకపోవడంతో రహానె‌కు ‘లైఫ్’ దొరికినట్లయింది. రీప్లే‌లో మాత్రం గ్లవ్స్‌కు తగలడం స్పష్టంగా కనిపించింది. బతుకు జీవుడా అని బయటపడ్డా... రెండో ఓవర్‌లోనే విల్లే రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. ఆ ఓవర్‌లో నాలుగో బంతిని ఆడడానికి రహానె తడబడగా.. ఆఫ్ వికెట్‌ను భళ్లున తాకింది.
sports
13,413
17-05-2017 15:37:13
భారత్‌పై చైనా సంపన్నుడి ప్రశంసలు
బీజింగ్ : భారతదేశ ఆర్థిక శక్తిని చైనా సంపన్నుడు, వాండా గ్రూప్ అధిపతి వాంగ్ జియాన్లిన్ ప్రశంసించారు. చైనా ఆధ్వర్యంలో జరిగిన బెల్ట్ అండ్ రోడ్ ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో తన గ్రూప్ కంపెనీలు చేపట్టబోతున్న కార్యకలాపాలను వివరించారు. ఈ సమావేశానికి భారతదేశం గైర్హాజరైన సంగతి తెలిసిందే.  వాండా గ్రూప్ కంపెనీలు ముఖ్యంగా రియల్ ఎస్టేట్, డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు, ఫిలిం ఇండస్ట్రీలలో పెట్టుబడులు పెడతాయి. వాంగ్ చైనా వ్యాపార దిగ్గజాల్లో అత్యంత విశిష్ఠ స్థానంలో ఉన్నారు. వన్ బెల్ట్, వన్ రోడ్ సమావేశంలో ఆయన టూరిజం ప్రాజెక్టులపై మాట్లాడుతూ తన గ్రూపు భారతదేశంలో కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. ‘బెల్ట్ అండ్ రోడ్’ వెంబడి అభివృద్ధి చెందుతున్న, అత్యధిక జనాభాగల దేశాలు ఉన్నాయన్నారు. ఉదాహరణలను వివరిస్తూ... 130 కోట్ల జనాభాగల భారతదేశం జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. ప్రజల సగటు వయసు 26 సంవత్సరాలని తెలిపారు. 26 కోట్ల జనాభాగల ఇండోనేషియా ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉందన్నారు. ఈ దేశ జనాభా సగటు వయసు 26 సంవత్సరాల కన్నా తక్కువేనన్నారు.  పర్యాటక మౌలిక సదుపాయాల్లో ఈ దేశాలు వెనుకబడి ఉన్నాయన్నారు. పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఈ దేశాలు ఉత్తమ అవకాశాలను కల్పిస్తున్నాయన్నారు. తన గ్రూపు పారిస్‌లో 8 లక్షల చదరపు మీటర్ల ప్రాజెక్టును చేపట్టిందన్నారు. అదేవిధంగా భారతదేశంలో ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్‌లో వాండా ఇండస్ట్రియల్ న్యూ సిటీని చేపట్టామన్నారు. 11 లక్షల చదరపు కిలోమీటర్ల భూమిలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు తెలిపారు. దీనిలో మాన్యుఫాక్చరింగ్ పార్క్, సాంస్కృతిక పర్యాటక పార్క్, నివాస ప్రాంతం ఉంటాయన్నారు. ఈ భూమిలో 70 శాతం వరకు మాన్యుఫాక్చరింగ్, కల్చరల్ టూరిజం పార్క్‌‌ల కోసం వినియోగిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 1 లక్షమందికి ఉపాధి లభిస్తుందన్నారు. భారతదేశంలోని ఇన్వెస్ట్‌మెంట్ ప్రాజెక్టుల్లో ఇదే పెద్దదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాన్యుఫ్యాక్చరర్లను, మరీ ముఖ్యంగా చైనా మాన్యుఫ్యాక్చరర్లను, ఆకర్షించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా పథకాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు కూడా ఇది దోహదపడుతుందన్నారు.  పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరు గుండా చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ వెళ్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారతదేశం ‘వన్ బెల్ట్, వన్ రోడ్’ సమావేశానికి హాజరు కాలేదు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఈ నెల 14న ఈ సమావేశాలను ప్రారంభించారు. 29 దేశాల నేతలు పాల్గొనగా, భారతదేశం గైర్హాజరైంది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలు హాజరయ్యాయి.
nation
12,544
14-11-2017 16:06:37
రియాన్ టీనేజర్‌పై నెలరోజుల ముందే సీబీఐ వల!
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏడేళ్ల ప్రద్యుమన్ హత్య కేసులో.. ఇటీవల అరెస్టైన సీనియర్ విద్యార్ధి, అతడి కుటుంబంపై నెలరోజుల ముందే నిఘా పెట్టినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. నిందితుడి కదలికలన్నీ పసిగట్టి, పూర్తి ఆధారాలు చేజిక్కిన తర్వాతే అదుపులోకి తీసుకున్నట్టు ఓ అధికారి వెల్లడించారు. కోర్టు డాక్యుమెంట్లలో పేర్కొన్న వివరాల మేరకు... ప్రద్యుమన్ ఠాకూర్ హత్యకు గురైన 20 రోజుల తర్వాత సెప్టెంబర్ 28న సీబీఐ అధికారులు నిందితుడి ఇంటిపై దాడిచేశారు. ఇంటి ఆవరణలోని పలు వస్తువులు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. చివరికి నవంబర్ 8న టీనేజర్‌ని అరెస్టు చేశారు. కాగా ఈ కేసులో కేవలం నిందితుడిపైనే కాకుండా.. ఈ కేసును కప్పిపెట్టేందుకు ప్రయత్నించిన అందరిపైనా దర్యాప్తు అధికారులు నిఘా వేసినట్టు చెబుతున్నారు.  ‘‘నిందితుడిని గుర్తించేందుకు సీసీటీవీ ఫూటేజీలు మాకు బాగా ఉపయోగపడ్డాయి. అందుకే నిందితుడి ఇంటిపై దాడిచేశాం. అయితే ఈ కేసులో ఇంకా ఎంతమంది ప్రమేయం ఉంది.. ఆధారాలు మాయం చేసేందుకు, కేసును కప్పిపెట్టేందుకు ఎవరెవరు ప్రయత్నిస్తున్నారో గుర్తించేందుకు మేము అతడిని అరెస్టు చేయకుండా ఆలస్యం చేశాం...’’ అని సీబీఐ అధికారి ఒకరు వెల్లడించారు. కేసులో ఇతర కుట్రదారులను గుర్తించేందుకు నిందితుడి కుటుంబ సభ్యులు, గురుగ్రామ్ పోలీసులు, రియాన్ స్కూల్ యాజమాన్యానికి చెందిన ఫోన్లన్నిటినీ సీబీఐ అధికారులు ట్యాప్ చేసినట్టు సమాచారం. అయతే సదరు అధికారులపై చర్యలు తీసుకుంటారా లేదా అన్నదానిపై సీబీఐ నోరు మెదపడంలేదు.
nation
1,184
31-03-2017 00:05:22
ఎస్‌బిఐ రూ.3,300 కోట్ల సమీకరణ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) డాలర్‌ బాండ్ల జారీ ద్వారా 50 కోట్ల డాలర్లు (రూ.3,300 కోట్లు) సమీకరించింది. మధ్యకాలిక రుణపత్రాల జారీ ద్వారా నిధులు సమీకరించే ప్రయత్నంలో భాగంగా మూడేళ్ల కాలపరిమితి గల ఈ బాండ్లు ఎస్‌బిఐ జారీ చేసింది. లండన్‌ శాఖ ద్వారా ఈ విక్రయం చేపట్టినట్టు బ్యాంకు తెలిపింది. వీటిని సింగపూర్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ద్వారా ట్రేడింగ్‌ చేయనున్నట్టు బ్యాంకు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే జనవరి 17వ తేదీన నిర్వహించిన ఇష్యూ ద్వారా ఐదేళ్ల కాలపరిమితి గల బాండ్లను లండన్‌ శాఖ నుంచి జారీ చేసి 50 కోట్ల డాలర్లు సమీకరించింది.
business
14,200
15-03-2017 02:34:17
గోవా పీఠంపై పర్రీకర్‌!
పనాజీ, మార్చి 14: మనోహర్‌ పర్రీకర్‌ (61) గోవా ముఖ్యమంత్రిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ మృదులా సిన్హా.. ఆయనతోపాటు మరో తొమ్మిది మంది మంత్రులతో ప్రమాణం చేయించారు. బీజేపీ నుంచి ఇద్దరు, మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ నుంచి ఇద్దరు, గోవా ఫార్వర్డ్‌ పార్టీ నుంచి ముగ్గురు, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలను మంత్రులను తీసుకున్నారు. అంతకు ముందు పర్రీకర్‌ ప్రమాణ స్వీకారాన్ని నిలిపి వేయించాలని కాంగ్రెస్‌ విఫలయత్నం చేసింది. గవర్నర్‌ ప్రభుత్వం ఏర్పాటుకు పర్రీకర్‌ను ఆహ్వానించడాన్ని సవాలు చేస్తూ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్‌ నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అయితే, 16వ తేదీ ఉదయం 11 గంటలకు శాసనసభలో బలపరీక్ష జరగాలని ఆదేశించింది. కాంగ్రెస్‌ సందేహాలన్నింటికీ సభలోనే సమాధానాలు దొరుకుతాయని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గురువారమే బల నిరూపణ చేసుకుంటానని గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పర్రీకర్‌ అన్నారు. ఆయన గోవా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. ఆదివారమే ఆయన గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. గవర్నర్‌ అందుకు అంగీకరించారు. మంగళవారం రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో పదవీ స్వీకార ప్రమాణం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ పర్రీకర్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. గోవా ప్రాంతీయ పార్టీలు చొరవ తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తనను కోరితేనే వచ్చానని పర్రీకర్‌ తెలిపారు. బలపరీక్ష నెగ్గుతామని, ఐదేళ్లు ప్రభుత్వం కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బల పరీక్ష అనంతరం మంత్రులకు శాఖలు కేటాయిస్తామన్నారు. కాంగ్రెస్‌కు తగినంత మంది ఎమ్మెల్యేల బలం ఉంటే గవర్నర్‌ను కలవకుండా ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు. నెలరోజుల్లో సంకీర్ణ ప్రభుత్వ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక వెల్లడిస్తామన్నారు. తనకు 22 మంది ఎమ్మెల్యేల బలం ఉందని తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమితషా, వెంకయ్యనాయుడు, నితిన్‌ గడ్కరీ హాజరయ్యారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 17 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. 13 సీట్లకు పరిమితమైన అధికార పక్షం బీజేపీ చిన్నా చితకా పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 17 సీట్ల కాంగ్రెస్‌ నలుగురు సభ్యుల మద్దతు సాధిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగేది. అధిష్ఠాన పరిశీలకులు సీఎల్పీ నేత ఎన్నికకు సమయం తీసుకోవడంతో బీజేపీ వేగంగా స్పందించి, అధికారాన్ని చేజిక్కించుకుంది. సుప్రీంకోర్టులో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిసి అతి పెద్ద పార్టీగా తమకు మొదట అవకాశం ఇవ్వాలని కోరారు. గవర్నర్‌ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు 12వ తేదీనే లేఖ రాశామని కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. మెజారిటీ లేకుండానే తమను ఆహ్వానించలేదనడం హాస్యాస్పదమని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. సుప్రీంలో చుక్కెదురయ్యాక కూడా కాంగ్రెస్‌ పార్లమెంటు సమావేశాల్ని అడ్డుకొనే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు.
nation
18,017
08-10-2017 23:34:01
భూమి అంతానికి 15 ముహూర్తం: డేవ్‌ మీడ్‌
న్యూఢిల్లీ, అక్టోబరు 8: డూమ్స్‌ డే.. భూమి అంతమయ్యే రోజు. దీని గురించి సిద్ధాంతకారులు ఇప్పటివరకు చాలా తేదీలను చెప్పుకొచ్చారు. అవన్నీ వచ్చాయి.. వెళ్లాయి. కానీ వారు చెప్పిన వినాశనం మాత్రం జరగలేదు. కాగా, మళ్లీ ఇప్పుడు ఓ కొత్త తేదీని నిర్ణయించారు. అక్టోబరు 15.. అంటే ఇంకో వారంలోనే భూమి అంతం ప్రారంభమవుతుందని.. అప్పట్నుంచి ఏడేళ్ల వ్యవధిలో భూమి అంతమైపోతుందని అంటున్నారు. ప్లానెట్‌ ఎక్స్‌ లేదా నిబిరు గ్రహం ఢీకొట్టడంతోపాటు, ప్రకృతి విపత్తులు సంభవించడం వల్ల భూమి అంతమవుతుందని డూమ్స్‌డే సిద్ధాంతకారుడు డేవ్‌ మీడ్‌ చెబుతున్నాడు. మెక్సికో భూకంపం, టెక్సాస్‌ వరదలు, కరీబియన్‌, ఫ్లోరిడాల్లో వచ్చిన హరికేన్లు ఇందుకు సూచనేనని అంటున్నాడు. అయి తే.. సెప్టెంబరు 23నే ఇది భూమి దగ్గరకి వస్తుందని డేవ్‌ తొలుత చెప్పినా అది జరగలేదు.
nation
2,377
24-03-2017 00:02:10
2025 నాటికి దేశీ ఐటి రంగం 35 వేల కోట్ల డాలర్లకు..
 ఇన్నోవేషన్‌ హబ్‌గా హైదరాబాద్‌..
business
2,579
22-05-2017 01:25:46
స్టాక్‌ మార్కెట్లో ‘ఎల్‌ఐసి’ కల్పతరువులు
ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) స్టాక్‌ మార్కెట్లో అతిపెద్ద బుల్‌ ఆపరేటర్‌. ఈ సంస్థ స్టాక్‌మార్కెట్లో భారీ ఎత్తున లాభాలు సంపాదిస్తోంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ మార్కెట్లలో ఎల్‌ఐసి 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. ఇదే కాలంలో షేర్ల లావాదేవీల ద్వారా 19,000 కోట్ల రూపాయల లాభం పొందింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. ఎల్‌ఐసి నిఫ్టీ 50లోని 42 షేర్లలో పెట్టుబడులు పెట్టింది. ఇందులో మెజారిటీ షేర్లు లాభాలుపంచాయి. తొమ్మిది స్టాక్స్‌లో ఎల్‌ఐసికి 10 శాతానికి పైగా వాటా ఉంది. గరిష్ఠంగా ఐటిసిలో 16.26 శాతం వాటాను ఎల్‌ఐసి కలిగి ఉంది. ఎల్‌ఐసి పెట్టుబడులు పెట్టిన షేర్లు ఇప్పటికే జోరుగా పెరుగుతున్నాయి. 2017లో ఎల్‌ఐసి ఇన్వెస్ట్‌ చేసిన షేర్లలో 24 షేర్లు ఇప్పటికే సెన్సెక్స్‌ కంటే మించి రాబడులను సాధించాయి. స్టాక్‌ మార్కెట్లో షేర్లను పికప్‌ చేయడంలో ఎల్‌ఐసికి ఉన్న అనుభవం దృష్ట్యా సాధారణ ఇన్వెస్టర్లు ఈ షేర్లపై ఒక కన్నేసి ఉంచడం మంచిది. వివిధ కంపెనీల్లో ఎల్‌ఐసికి ఉన్న వాటా, ఈ ఏడాది జనవరి నుంచి ఈ వాటాల విలువలో వృద్ధి శాతం ఈ విధంగా ఉంది.
business
10,190
10-06-2017 16:53:45
‘రంగస్థలం 1985’ టైటిల్‌ వెనుక అంత కథ ఉందా?
మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ పీరియాడిక్‌ లవ్‌స్టోరీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడూ నవ్యతకు పెద్దపీట వేసే సుకుమార్‌ తన సినిమాకు ‘రంగస్థలం 1985’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. విడుదలైన కొద్ది సేపటికే వరల్డ్‌వైడ్‌ ట్రెండ్‌లలో 45వ స్థానంలో నిలిచింది ఈ టైటిల్‌. తన సినిమాకు ‘రంగస్థలం 1985’ అనే టైటిల్‌ను సుకుమార్‌ ఎందుకు పెట్టారో తెలియదు కానీ.. మెగా ఫ్యాన్స్‌ మాత్రం ఈ టైటిల్‌కు కొత్త భాష్యం చెబుతున్నారు. ఈ టైటిల్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఈ టైటిల్‌లో మొదటి రెండు పదాలు, చివరి పదం కలిపితే ‘రామ్‌’ అని వస్తుంది. అది చెర్రీ పేరులోని మొదటి పదం. ఇక ఈ టైటిల్‌లో ఈ సినిమా హీరోయిన్‌ సమంత పేరు కూడా ఉంది. ఈ టైటిల్‌లోని పలు అక్షరాలను కలిపితే సమంత పేరు వస్తుంది. ఇక 1985వ సంవత్సరంలోనే రామ్‌చరణ్‌ జన్మించాడు. ఇలా ఈ టైటిల్‌ గురించి మాట్లాడుకుంటున్నారు మెగా అభిమానులు.
entertainment
10,922
06-05-2017 07:41:34
‘పీకే’ను దాటిన ‘బాహుబలి 2’
అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా విశ్లేషకుల ప్రశంసలు‘బాహుబలి’తో నా ప్రయాణం పూర్తయింది’-రాజమౌళిచిత్రబృందంతో కలసి ప్రస్తుతం లండన్ లో ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్న రాజమౌళి ‘బాహుబలి’తో తన ప్రయాణం పూర్తయిందని వెల్లడించారు. ఇక ఈ ప్రచారంతో ‘బాహుబలి’ సినిమా సిరీస్‌ పూర్తయినట్లేనని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. చిత్రం గొప్ప విజయం సాధించిన సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ చిత్రబృందంతో కలసి దిగిన ఫొటోని ట్విటర్‌ దారా పంచుకొన్నారు.  భారతీయ సినీ యవనికపై కొత్త చరిత్ర ఆవిష్కృతం కానున్నది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల గ్రాస్‌ను సాధించనున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచేందుకు ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ఉరకలు వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా సగర్వంగా తల ఎత్తుకొని నిలుచుంది. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్త వసూళ్ల (గ్రాస్‌) పరంగా అగ్రస్థానంలో ఉన్న అమీర్‌ఖాన్‌ సినిమా ‘పీకే’ను అది వెనక్కు నెట్టి వేసింది. ‘పీకే’ జీవిత కాల వసూళ్లు రూ. 769 కోట్లు కాగా, గురువారం నాటికే ‘బాహుబలి 2’ వసూళ్లు రూ. 887 కోట్ల (గ్రాస్‌) మార్కును అందుకున్నాయి. వీటిలో ఒక్క హిందీ వెర్షన్‌ దేశీయ వసూళ్లే రూ. 335 కోట్లు (గ్రాస్‌). ఇక తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్‌ల దేశీయ వసూళ్లు రూ. 387 కోట్లు కాగా, ఓవర్సీస్‌ వసూళ్లు రూ. 165 కోట్లు. వారాంతాల్లోనే కాకుండా పని దినాల్లోనూ ఈ సినిమా అనూహ్యమైన వసూళ్లు సాధిస్తున్న తీరు చూస్తుంటే అతి త్వరలోనే రూ. 1000 కోట్ల వసూళ్ల మార్కును దాటడం ఖాయంగా కనిపిస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతున్న ‘బాహుబలి 2’ ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా లేదు. రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డుల్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.         ఇప్పటివరకూ దేశీయ సినిమా రికార్డులంటే హిందీ సినిమాకే సొంతమని భావించేవాళ్లను దిగ్భ్రమకు గురిచేస్తూ ఒక దక్షిణాది సినిమా కూడా రికార్డుల్ని సృష్టించగలదని ‘బాహుబలి 1’ నిరూపిస్తే, ఇప్పుడు ‘బాహుబలి 2’ దాన్ని మరింత ఎత్తుకు తీసుకుపోతోంది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల్లో అమీర్‌ఖాన్‌ సినిమాలు ‘పీకే’ (రూ. 769 కోట్లు), ‘దంగల్‌’ (716 కోట్లు), సల్మాన్‌ఖాన్‌ సినిమా ‘బజ్‌రంగీ భాయీజాన్‌’ (రూ. 629 కోట్లు) తొలి మూడు స్థానాల్లో ఉండగా, వాటన్నింటినీ ఒకే దెబ్బతో వెనక్కు నెట్టేసింది ‘బాహుబలి 2’. ఒక్క హిందీ వెర్షన్‌ విషయం తీసుకున్నా ఈ సినిమాది సరికొత్త రికార్డే. విడుదలైన తొలి వారానికి సంబంధించి మునుపటి హిందీ సినిమాల రికార్డుల్ని ఈ సినిమా తుడిచి పెట్టింది. నెట్‌ వసూళ్లపరంగా తొలి వారం రికార్డు ఇప్పటివరకూ సల్మాన్‌ సినిమా ‘సుల్తాన్‌’ (రూ. 208.82 కోట్లు) పేరిట ఉండగా, దాన్ని రూ. 247 కోట్ల (నెట్‌)తో ‘బాహుబలి 2’ అధిగమించేసింది. విశేషమేమంటే ఇది హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ కావడం. ఒక డబ్బింగ్‌ సినిమా స్ట్రయిట్‌ హిందీ సినిమాల.. అదీ ఖాన్‌ త్రయం సినిమాల రికార్డుల్ని దాటేస్తుందని ఎవరైనా, ఎపుడైనా ఊహించారా! మే 12న అమితాబ్‌ బచ్చన్‌, రామ్‌గోపాల్‌వర్మ కాంబినేషన్‌ సినిమా ‘సర్కార్‌ 3’ వచ్చేలోగా ఈ సినిమా ఇంకెన్ని రికార్డుల్ని దాటేస్తుందో, ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
entertainment
1,071
16-03-2017 23:04:24
ఐసిఐసిఐ బ్యాంకు
ప్రైవేటు రంగంలోని అతి పెద్ద బ్యాంకు ఐసిఐసిఐ ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ప్రాతిపదికన బేసెల్‌ 3 బాండ్ల జారీ ద్వారా 3425 కోట్ల రూపాయలు సమీకరించనుంది. బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపిందని రెగ్యులేటరీ సందేశంలో తెలిపింది.
business
19,759
17-10-2017 01:40:18
సెలెనకు మూడు స్వర్ణాలు
షర్మ్‌ ఈ షేఖ్‌ (ఈజిప్ట్‌): భారత యువ టీటీ క్రీడాకారిణి సెలెన సెల్వకుమార్‌ ఈజిప్ట్‌ జూనియర్‌, కేడెట్‌ ఓపెన్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీలో మూడు స్వర్ణ పతకాలతో సత్తాచాటింది. ఇప్పటికే టీమ్‌ స్వర్ణం నెగ్గిన సెలెనా సింగిల్స్‌, డబుల్స్‌లోనూ విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన జూనియర్‌ బాలికల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌సీడ్‌ సెలెన 11-5, 12-10, 8-11, 6-11, 11-3, 6-11, 11-4తో రెండో సీడ్‌ మార్వ అల్హోడెబీ (ఈజిప్ట్‌)పై విజయం సాధించింది. అలాగే జూనియర్‌ బాలికల డబుల్స్‌ తుది పోరులో సెలెన-ఈథర్‌ (నైజిరియా) జోడీ 11-8, 12-10, 9-11, 8-11, 11-9తో బదావి (ఈజిప్ట్‌)-పపాడిమిత్రియు (గ్రీక్‌)ద్వయంపై నెగ్గింది.
sports
1,536
23-10-2017 02:21:59
బజాజ్‌ను అధిగమించిన హోండా
నెంబర్‌ 2 స్థానం కైవసం న్యూఢిల్లీ: బైక్‌ల అమ్మకాలపరంగా బజాజ్‌ ఆటోను హోండా మోటార్‌సైకిల్‌ ఓవర్‌టేక్‌ చేసింది. దీంతో దేశీయ మార్కెట్లో రెండో అతిపెద్ద బైక్‌ల కంపెనీగా హోండా అవతరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం (ఏప్రిల్‌-సెప్టెంబర్‌)లో హోండా 10,48,143 మోటార్‌సైకిళ్లను దేశీయ మార్కెట్లో విక్రయించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే అమ్మకాల్లో 19.8 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. కాగా బజాజ్‌ ఆటో 10,10,559 వాహనాలను విక్రయించి.. 10.45 శాతం క్షీణతను నమోదు చేసింది. ఫలితంగా బజాజ్‌ను హోండా అధిగమించే అవకాశం ఏర్పడిందని భార త ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చర్స్‌ అసోసియేషన్‌ (సియామ్‌) వెల్లడించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో హోండా 8,74,852 వాహనాలను విక్రయించగా.. బజాజ్‌ 11,28,425 వాహనాలను విక్రయించింది. ఇక మార్కెట్‌ లీడర్‌ హీరో మోటోకార్ప్‌ తన సత్తాను కొనసాగిస్తోంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఈ కంపెనీ 33,44,292 మోటార్‌సైకిళ్లను విక్రయించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో (30,34,504) పోల్చితే అమ్మకాల్లో 10.2 శాతం వృద్ధి నమోదైంది. స్కూటర్‌ సెగ్మెంట్లో తన రెండో స్థానాన్ని కోల్పోయింది. ఈ స్థానాన్ని టీవీఎస్‌ మోటార్‌ కైవసం చేసుకుంది. ఏప్రిల్‌-సెప్టెంబర్‌ 4,43,321 స్కూటర్లను హీరో మోటోకార్ప్‌ విక్రయించింది. ఇదేకాలంలో టీవీఎస్‌ స్కూటర్ల అమ్మకాలు 41.3 శాతం పెరిగి 4,00,804 యూనిట్ల నుంచి 5,66,362 యూనిట్లకు పెరిగాయి. ప్రథమార్ధంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీ 3,78,304 మోటార్‌సైకిళ్లను విక్రయించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే వృద్ధి 23.17 శాతంగా ఉంది.
business
9,494
22-01-2017 09:40:30
నచ్చకపోతే స్టార్ హీరో అయినా నో చెప్పేస్తా..!
 హన్సిక హవా తగ్గింది అంటున్నారు ఏకీభవిస్తారా?  టాలీవుడ్‌ బాట పట్టినట్టున్నారు?  యువకథానాయకులతో చేయడానికి కారణం?  ఫేస్‌బుక్‌ అభిమానులు మీకే ఎక్కువ అంటారు?  జీవితంలో మరిచిపోలేని అనుభవం?
entertainment
21,066
08-09-2017 02:22:40
విండీస్‌ 123 ఆలౌట్‌
స్టోక్స్‌కు ఆరు వికెట్లుఇంగ్లండ్‌తో మూడో టెస్టులండన్‌: ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ (6/22) విజృంభించడంతో వెస్టిండీస్‌ కుప్పకూ లింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం ఇక్కడ మొదలైన ఆఖరి టెస్టులో.. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 123 పరుగులకే ఆలౌటైంది. కీరన్‌ పావెల్‌ (39) టాప్‌ స్కోరర్‌. ఓ దశలో 78/2తో మెరుగైన స్థితిలో ఉన్న హోల్డర్‌ సేనను స్టోక్స్‌ హడలెత్తించాడు. ఆరు వికెట్లు పడగొట్టి విండీస్‌ పతనాన్ని శాసించాడు. జేమ్స్‌ ఆండర్సన్‌, రొలాండ్‌ జోన్స్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ తొలి రోజు ఆట చివరకు 19 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. కుక్‌ (10), స్టోన్‌మన్‌ (1), రూట్‌ (1), వెస్లీ (8) విఫలమయ్యారు. కీమర్‌ రోచ్‌, హోల్డర్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.
sports
3,278
24-06-2017 01:39:29
నేతన్నపై ఔదార్యమేదీ?
ఏపీలోనే వెయ్యి కోట్ల రూపాయల నూలు అమ్మకం జరుగుతోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం జూలై 1 నుంచి నూలు మిల్లులు ఉత్పత్తి చేసే దారంపై 5 శాతం జీఎస్టీ విధిస్తారు. ఫలితంగా ఏపీలోని సొసైటీలు, మగ్గాల కార్మికులపై ఏటా రూ. 50 కోట్లు అదనపు భారం పడబోతోంది. రూ.500కు విక్రయించే చీర జూలై 1 నుంచి వినియోగదారుడికి చేరేసరికి రూ. 100 పైగా పెరుగుతోంది. దీంతో కొనుగోలు చేసేవారు వెనకడుగేసే ప్రమాదం ఉంది. చేనేత ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉంది. వరుస ప్రభుత్వాలు సృష్టించిన విలయంలో నేతన్న బయటకు రాలేక... అందులో ఇమడ లేక చచ్చిపోతున్నాడు. ప్రభుత్వాలకు మాత్రం నేతన్న ఓట్లు కావాలి కానీ... నేతన్న సంక్షేమ మాత్రం అక్కర్లేదు. వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి చూపిస్తున్న నేతను పాలకులు బలిపీఠం ఎక్కిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నేతన్న ఓట్లతో గద్దెనెక్కిన తెలుగుదేశం ప్రభుత్వం... ఇప్పుడు చేనేత సంక్షేమాన్ని మరచి... నేతన్నలపై కేంద్రం కత్తిగడితే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఎన్నో సమస్యలపై తక్షణం స్పందించే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతన్నల విషయంలో మాత్రం పట్టీపట్టనట్టుగా ఉన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాలు చేనేతతో ప్రయోజనం పొందుతున్నాయ్. తొలుత కుల వృత్తిగా మాత్రమే ఉన్న చేనేత ఇప్పుడు అగ్రవర్ణాలకు, సమాజంలోని ఇతర కులాలకు సైతం ఉపాధి కల్పిస్తున్నాయ్. ప్రపంచ వ్యాప్తంగా చేనేతకు ఆదరణ లభిస్తున్నా... మన పాలకులకు మాత్రం అవి వినపడవు. కనపడవు. మగ్గం ముక్కలై... నేతన్న అకారణంగా మృత్యుఒడికి చేరుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ లెక్కల ప్రకారమే పదుల సంఖ్యలో నేతన్నలు బలవన్మరణం చెందుతున్నారు. ఎన్నో కష్టాలతో నేతను సాగు చేస్తున్న కార్మికులపై ఇప్పుడు జీఎస్టీ పోటుపడింది. నేతన్న ఉపాధి లభించక నడిరోడ్డుపై పడుతుంటే... నేతన్నకు పని కల్పించాల్సిన మాష్టర్ వీవర్లు వస్త్రాలు అమ్ముకోలేక సతమతమైపోతున్నారు. తక్కువ ధరకు నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్న చేనేతపై ఇప్పటికే పవర్ లూమ్ పిడుగు శరాఘాతమైంది. తాజాగా వస్తున్న కార్పొరేట్, ఈ కామర్స్ సంస్థలు సైతం నేతన్న తయారుచేసిన వస్త్రాలను కొనేందుకు సవాలక్ష కొర్రీలు పెడుతున్నాయ్. ఇప్పుడు జీఎస్టీ ద్వారా వస్త్రాలపై 5 శాతం పన్ను వేయడం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపెట్టబోతోంది. అదే సమయంలో నేతన్నకు నూలే ముడి సరకు. ఇప్పుడు చిలప నూలుపై 5 శాతం జీఎస్టీతో అది మార్కెట్లోంచి కార్మికుడి చెంతకు చేరే సరికి సుమారు 10 శాతానికి పైగా పెరగనుంది. దీంతో వస్త్రాల తయారీ వ్యయమవుతుంది. సామాన్యులు నేత వస్త్రాలు కొనుగోలు చేయడం కష్టతరమవుతుంది. దర్జీ కులం నుంచి వచ్చారని చెప్పుకునే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. చేనేతల వస్త్రాలను విదేశీ ప్రముఖలకు అందించడం కాదు... ఆ బట్టల తయారీ వెనుక ఉన్న శ్రమను ఆయన గుర్తించాలి. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్న పాలకులు... మొద్దు నిద్ర వదలాలి. చేనేత కుటుంబాలను ఆదుకోవాలి. చేనేతను వదిలేస్తున్న కుటుంబాలు ఆ వృత్తిపై ప్రేమ లేక వదిలిపెట్టడం లేదు. ఎన్నాళ్లీ వృత్తి... ఎన్నేళ్లీ వృత్తి... అన్న వేదన మాత్రం పడలేకపోతున్నాడు. డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు. ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే కావాలనుకుంటాడు... ప్రొఫెసర్ కొడుకు ప్రొఫెసర్ అవ్వాలనుకుంటాడు. రైతు కొడుకు వ్యవసాయం వద్దంటున్నాడు... అలాగే నేతన్న కొడుకు సైతం నేత పని వద్దంటున్నాడు. దీని కారణం... పాలకుల విధానాలే. రైతన్నను ధ్వంసం చేస్తున్న పాలకులు ఇప్పుడు చేనేతపై కత్తిగట్టారు. నేతన్న నడ్డివిరిచి... అంపశయ్యపై పడుకోబెట్టిన పాలకులు... ఇప్పుడు నేతను స్మశానవాటికలో వదిలేయాలని అనుకుంటున్నారు. తాజాగా పెంచిన చిలప నూలు ప్రభావం మూలిగే నక్కపై తాటిపండు చందంలా ఉంది. తాజా నిర్ణయంతో ఏపీలోనే చేనేత రంగంపై రూ. 50 కోట్లపైగా భారం పడనుంది. నూలు తక్కువ ధరకు లభిస్తుంటేనే మనుగడ కష్టసాధ్యమైన తరుణంలో జీఎస్టీ భారం తమ జీవన మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుందని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడ్డాయి. కూలీ దొరక్క... దొరికినా చాలీచాలని వేతనాలతో నేతన్నల ఆకలి కేకలు ప్రభుత్వాలకు విన్పించడం లేదు. ఏపీలో 850, తెలంగాణలో 530 చేనేత సొసైటీలు క్రియాశీలంగా ఉన్నాయి. వాటితోపాటు సొంతంగా మగ్గాలపై పనిచేసేవారి సంఖ్య 3 లక్షలని జౌళి శాఖ రికార్డులు చెబుతుంటే... వాస్తవానికి మాష్టర్ వీవర్ల వద్ద పనిచేస్తున్న లక్షలాది మంది చేనేత కార్మికుల బతుకు దినదిన గండం నూరేళ్ల ఆయుష్సన్న చందంగా మారింది. ఏ రోజు ఎలాంటి నిర్ణయం తమపై ప్రభావం చూపెడుతుందోనన్న బెంగ వారిని భయపెడుతోంది. కారణం ఏదైనా సరే అది అంతిమంగా కార్మికుడి నడ్డి విరుస్తోంది.తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లోని మిల్లుల నుంచి నూలు దారం ఏపీ, తెలంగాణకు దిగుమతి అవుతోంది. కిలో దారం ధర వెయ్యి రపాయల నుంచి నాణ్యతను బట్టి పది వేల వరకూ ఉంటుంది. చేనేతతో పాటు మరమగ్గాలపై తయారయ్యే వస్త్రంతో కలిపితే ఏటా వేల కోట్ల రూపాయల చిలప నూలు రెండు రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తుంటే... ఏపీలోనే వెయ్యి కోట్ల రూపాయల నూలు అమ్మకం జరుగుతోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం జూలై 1 నుంచి నూలు మిల్లులు ఉత్పత్తి చేసే దారంపై 5 శాతం జీఎస్టీ విధిస్తారు. ఫలితంగా ఏపీలోని సొసైటీలు, మగ్గాల కార్మికులపై ఏటా రూ. 50 కోట్లు అదనపు భారం పడబోతోంది. ముడిసరుకుపై జీఎస్టీ 5 శాతం పడటంతో ఇకపై రూ.500కు విక్రయించే చీర జూలై 1 నుంచి వినియోగదారుడికి చేరే సరికి రూ. వంద రూపాయలకు పైగా పెరుగుతోంది. దీంతో కొనుగోలు చేసేవారు వెనకడుగేసే ప్రమాదం ఉంది. నేతన్నలకు రుణమాఫీతో సాంత్వన చేకూర్చిన తెలుగుదేశం ప్రభుత్వం... అది పూర్తిస్థాయిలో నేతన్న ప్రయోజనాలు కాపాడాలి. రైతుకు రుణమాఫీ ఒక్కటే ఏవిధంగా పరిష్కార మార్గం కాదో... నేతన్నకు అంతే. లక్షల మంది నేతన్నలుంటే... వేల సంఖ్యలో మాఫీ జరిగిన ఘటన మనం ప్రభుత్వ రికార్డుల ద్వారా తెలుసుకుంటున్నాం. ఇప్పటికే చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసాం. రాష్ట్ర జనాభాలో చేనేతలు 15 శాతానికి పైగా ఉన్నారు. 50 నియోజకవర్గాల్లో చేనేతల ఓట్లే ఆయా పార్టీలకు కీలకం. అయితే ఎన్నికల్లో ఓట్లేయించుకుంటున్నారు కానీ... ఆ తర్వాత మాత్రం నేతన్న మొహాన్ని కూడా పాలకులు చూడటం లేదు. నేతన్నల విషయంలో ముఖ్యమంత్రి ఔదార్యం ప్రదర్శించాలి. లేకుంటే రాజకీయ పార్టీలపై నేతన్న ఆగ్రహాన్ని చవిచూడాల్సిందే...మాడిశెట్టి శివ శంకరయ్యరచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాంగ సంఘం ప్రధాన కార్యదర్శిచేనేత ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉంది. వరుస ప్రభుత్వాలు సృష్టించిన విలయంలో నేతన్న బయటకు రాలేక... అందులో ఇమడ లేక చచ్చిపోతున్నాడు. ప్రభుత్వాలకు మాత్రం నేతన్న ఓట్లు కావాలి కానీ... నేతన్న సంక్షేమ మాత్రం అక్కర్లేదు. వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి చూపిస్తున్న నేతను పాలకులు బలిపీఠం ఎక్కిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నేతన్న ఓట్లతో గద్దెనెక్కిన తెలుగుదేశం ప్రభుత్వం... ఇప్పుడు చేనేత సంక్షేమాన్ని మరచి... నేతన్నలపై కేంద్రం కత్తిగడితే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఎన్నో సమస్యలపై తక్షణం స్పందించే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతన్నల విషయంలో మాత్రం పట్టీపట్టనట్టుగా ఉన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాలు చేనేతతో ప్రయోజనం పొందుతున్నాయ్. తొలుత కుల వృత్తిగా మాత్రమే ఉన్న చేనేత ఇప్పుడు అగ్రవర్ణాలకు, సమాజంలోని ఇతర కులాలకు సైతం ఉపాధి కల్పిస్తున్నాయ్. ప్రపంచ వ్యాప్తంగా చేనేతకు ఆదరణ లభిస్తున్నా... మన పాలకులకు మాత్రం అవి వినపడవు. కనపడవు. మగ్గం ముక్కలై... నేతన్న అకారణంగా మృత్యుఒడికి చేరుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ లెక్కల ప్రకారమే పదుల సంఖ్యలో నేతన్నలు బలవన్మరణం చెందుతున్నారు. ఎన్నో కష్టాలతో నేతను సాగు చేస్తున్న కార్మికులపై ఇప్పుడు జీఎస్టీ పోటుపడింది. నేతన్న ఉపాధి లభించక నడిరోడ్డుపై పడుతుంటే... నేతన్నకు పని కల్పించాల్సిన మాష్టర్ వీవర్లు వస్త్రాలు అమ్ముకోలేక సతమతమైపోతున్నారు. తక్కువ ధరకు నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్న చేనేతపై ఇప్పటికే పవర్ లూమ్ పిడుగు శరాఘాతమైంది. తాజాగా వస్తున్న కార్పొరేట్, ఈ కామర్స్ సంస్థలు సైతం నేతన్న తయారుచేసిన వస్త్రాలను కొనేందుకు సవాలక్ష కొర్రీలు పెడుతున్నాయ్. ఇప్పుడు జీఎస్టీ ద్వారా వస్త్రాలపై 5 శాతం పన్ను వేయడం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపెట్టబోతోంది. అదే సమయంలో నేతన్నకు నూలే ముడి సరకు. ఇప్పుడు చిలప నూలుపై 5 శాతం జీఎస్టీతో అది మార్కెట్లోంచి కార్మికుడి చెంతకు చేరే సరికి సుమారు 10 శాతానికి పైగా పెరగనుంది. దీంతో వస్త్రాల తయారీ వ్యయమవుతుంది. సామాన్యులు నేత వస్త్రాలు కొనుగోలు చేయడం కష్టతరమవుతుంది. దర్జీ కులం నుంచి వచ్చారని చెప్పుకునే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. చేనేతల వస్త్రాలను విదేశీ ప్రముఖలకు అందించడం కాదు... ఆ బట్టల తయారీ వెనుక ఉన్న శ్రమను ఆయన గుర్తించాలి. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్న పాలకులు... మొద్దు నిద్ర వదలాలి. చేనేత కుటుంబాలను ఆదుకోవాలి. చేనేతను వదిలేస్తున్న కుటుంబాలు ఆ వృత్తిపై ప్రేమ లేక వదిలిపెట్టడం లేదు. ఎన్నాళ్లీ వృత్తి... ఎన్నేళ్లీ వృత్తి... అన్న వేదన మాత్రం పడలేకపోతున్నాడు. డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు. ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే కావాలనుకుంటాడు... ప్రొఫెసర్ కొడుకు ప్రొఫెసర్ అవ్వాలనుకుంటాడు. రైతు కొడుకు వ్యవసాయం వద్దంటున్నాడు... అలాగే నేతన్న కొడుకు సైతం నేత పని వద్దంటున్నాడు. దీని కారణం... పాలకుల విధానాలే. రైతన్నను ధ్వంసం చేస్తున్న పాలకులు ఇప్పుడు చేనేతపై కత్తిగట్టారు. నేతన్న నడ్డివిరిచి... అంపశయ్యపై పడుకోబెట్టిన పాలకులు... ఇప్పుడు నేతను స్మశానవాటికలో వదిలేయాలని అనుకుంటున్నారు. తాజాగా పెంచిన చిలప నూలు ప్రభావం మూలిగే నక్కపై తాటిపండు చందంలా ఉంది. తాజా నిర్ణయంతో ఏపీలోనే చేనేత రంగంపై రూ. 50 కోట్లపైగా భారం పడనుంది. నూలు తక్కువ ధరకు లభిస్తుంటేనే మనుగడ కష్టసాధ్యమైన తరుణంలో జీఎస్టీ భారం తమ జీవన మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుందని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడ్డాయి. కూలీ దొరక్క... దొరికినా చాలీచాలని వేతనాలతో నేతన్నల ఆకలి కేకలు ప్రభుత్వాలకు విన్పించడం లేదు. ఏపీలో 850, తెలంగాణలో 530 చేనేత సొసైటీలు క్రియాశీలంగా ఉన్నాయి. వాటితోపాటు సొంతంగా మగ్గాలపై పనిచేసేవారి సంఖ్య 3 లక్షలని జౌళి శాఖ రికార్డులు చెబుతుంటే... వాస్తవానికి మాష్టర్ వీవర్ల వద్ద పనిచేస్తున్న లక్షలాది మంది చేనేత కార్మికుల బతుకు దినదిన గండం నూరేళ్ల ఆయుష్సన్న చందంగా మారింది. ఏ రోజు ఎలాంటి నిర్ణయం తమపై ప్రభావం చూపెడుతుందోనన్న బెంగ వారిని భయపెడుతోంది. కారణం ఏదైనా సరే అది అంతిమంగా కార్మికుడి నడ్డి విరుస్తోంది.తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లోని మిల్లుల నుంచి నూలు దారం ఏపీ, తెలంగాణకు దిగుమతి అవుతోంది. కిలో దారం ధర వెయ్యి రపాయల నుంచి నాణ్యతను బట్టి పది వేల వరకూ ఉంటుంది. చేనేతతో పాటు మరమగ్గాలపై తయారయ్యే వస్త్రంతో కలిపితే ఏటా వేల కోట్ల రూపాయల చిలప నూలు రెండు రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తుంటే... ఏపీలోనే వెయ్యి కోట్ల రూపాయల నూలు అమ్మకం జరుగుతోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం జూలై 1 నుంచి నూలు మిల్లులు ఉత్పత్తి చేసే దారంపై 5 శాతం జీఎస్టీ విధిస్తారు. ఫలితంగా ఏపీలోని సొసైటీలు, మగ్గాల కార్మికులపై ఏటా రూ. 50 కోట్లు అదనపు భారం పడబోతోంది. ముడిసరుకుపై జీఎస్టీ 5 శాతం పడటంతో ఇకపై రూ.500కు విక్రయించే చీర జూలై 1 నుంచి వినియోగదారుడికి చేరే సరికి రూ. వంద రూపాయలకు పైగా పెరుగుతోంది. దీంతో కొనుగోలు చేసేవారు వెనకడుగేసే ప్రమాదం ఉంది. నేతన్నలకు రుణమాఫీతో సాంత్వన చేకూర్చిన తెలుగుదేశం ప్రభుత్వం... అది పూర్తిస్థాయిలో నేతన్న ప్రయోజనాలు కాపాడాలి. రైతుకు రుణమాఫీ ఒక్కటే ఏవిధంగా పరిష్కార మార్గం కాదో... నేతన్నకు అంతే. లక్షల మంది నేతన్నలుంటే... వేల సంఖ్యలో మాఫీ జరిగిన ఘటన మనం ప్రభుత్వ రికార్డుల ద్వారా తెలుసుకుంటున్నాం. ఇప్పటికే చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసాం. రాష్ట్ర జనాభాలో చేనేతలు 15 శాతానికి పైగా ఉన్నారు. 50 నియోజకవర్గాల్లో చేనేతల ఓట్లే ఆయా పార్టీలకు కీలకం. అయితే ఎన్నికల్లో ఓట్లేయించుకుంటున్నారు కానీ... ఆ తర్వాత మాత్రం నేతన్న మొహాన్ని కూడా పాలకులు చూడటం లేదు. నేతన్నల విషయంలో ముఖ్యమంత్రి ఔదార్యం ప్రదర్శించాలి. లేకుంటే రాజకీయ పార్టీలపై నేతన్న ఆగ్రహాన్ని చవిచూడాల్సిందే...మాడిశెట్టి శివ శంకరయ్యరచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాంగ సంఘం ప్రధాన కార్యదర్శి
editorial
11,956
02-07-2017 03:40:06
మిలిటెంట్‌ లష్కరీ ఎన్‌కౌంటర్‌
హతమైన మరో ఉగ్రవాదిశ్రీనగర్‌, జూలై 1: జమ్మూకశ్మీరులో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తాయిబా సీనియర్‌ కమాండర్‌, మరో మిలిటెంటు హతమయ్యారు. అనంత్‌నాగ్‌ జిల్లాలోని డయాల్‌గమ్‌లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో చిక్కుకుని ఇద్దరు పౌరులుకూడా ప్రాణాలు కోల్పోయారు. లష్కరే తాయిబా కమాండర్‌ బషీర్‌ లష్కరీ ఈ ఎదురు కాల్పుల్లో హతమయ్యాడని పోలీసులు చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌లో తాహీరా(44) అనే మహిళ, షాదాబ్‌ అహ్మద్‌ చోపన్‌ (21)అనే యువకుడుకూడా ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ నేతృత్వంలోని జమాత్‌ ఉద్‌ దవా కు చెందిన తెహ్రీక్‌ ఈ ఆజాదీ జమ్ము, కశ్మీర్‌(టీఏజేకే)పై పాక్‌ నిషేధం విధించింది.
nation
15,561
09-11-2017 03:56:56
వాయిదాకు రాకపోతే..మాల్యా ‘ప్రకటిత అపరాధి’! : ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ, నవంబరు 8: లిక్కర్‌ కింగ్‌ విజయమాల్యాపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగా వాయిదాలకు రాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. డిసెంబరు 18న వాయిదాకు రాకుంటే ‘ప్రకటిత అపరాధి’గా భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మాల్యాపై గతంలోనే ఓపెన్‌ ఎండ్‌ నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్‌ జారీ అయిందని, కానీ దానిని అమలు చేయడం సాధ్యపడకపోవడంతో చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకోవాలని ఈడీ తరపు లాయర్‌ కోర్టును అభ్యర్థించారు. దాంతో గతంలో మాల్యాకు ఇచ్చిన కొన్ని ఉపశమనాలను కోర్టు రద్దు చేసింది. కాగా, ‘ప్రకటిత అపరాధి’గా నిర్ధారిస్తే మాల్యాపై పత్రికల్లో ఆ మేరకు ప్రకటనలు కూడా ఇస్తారు. ఆస్తులు స్వాధీనం చేసుకుని అమ్మకానికి తీసుకొచ్చే వీలుంది.
nation
17,330
23-07-2017 15:35:39
భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న గుజరాత్
గాంధీనగర్: భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతలమవుతోంది. వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. రెండు రోజులుగా కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. సురేంద్రనగర్ జిల్లాలోని చోటీలాల్‌లో 24 గంటల్లో ఏకంగా 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజ్‌కోట్, మోట్‌బీ, జునాఘాట్ సహా వివిధ ప్రాంతాలు వర్షాలతో తడిసిముద్దవుతున్నాయి.
nation
9,949
05-06-2017 13:56:14
బన్నీ ఫ్యాన్స్.. గుర్తుపెట్టుకోండి.. సాయంత్రం 7.30!
అల్లు అర్జున్, హరీష్ శంకర్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం డీజే(దువ్వాడ జగన్నాథం). ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ ఓ సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకున్నాడు. ఇవాళ సాయంత్రం 7.30 నిమిషాలకు డీజే ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. దీంతో బన్నీ అభిమానులు సినిమా ట్రైలర్‌ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటలు ఇప్పటికే విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ రెండు పాటల్లో హీరోహీరోయిన్‌పై సాగే గీతంపై వివాదం నెలకొనడంతో డైరెక్టర్ హరీష్ శంకర్ వివరణ ఇచ్చిన విషయం విదితమే. డీజే టీజర్‌ను డిజ్‌లైక్‌ల వివాదం చుట్టుమట్టడంతో ట్రైలర్‌ ఎలా ఉంటుందోనని బన్నీ ఫ్యాన్స్‌తో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డీజే సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. డీజే(దువ్వాడ జగన్నాథం) సినిమా జూన్ 23న థియేటర్లలో సందడి చేయనుంది.
entertainment
15,331
29-07-2017 02:05:53
వర్సిటీల్లో కెమెరాలు!
ర్యాగింగ్‌ కట్టడికి యూజీసీ చిట్కాన్యూఢిల్లీ, జూలై 28: విద్యార్థుల వెర్రిచేష్టలకు ఇక ఫుల్‌స్టాప్‌! వర్సిటీల్లో ర్యాగింగ్‌ భూతాన్ని తరిమేసే చర్యల్లో భాగంగా వారిపై నిరంతర నిఘా ఏర్పాటు కానుంది. వర్సిటీలు, హాస్టళ్లలోని కీలక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) సూచించింది. అలారం బెల్స్‌ కూడా ఏర్పాటు చేయాలని, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని వైస్‌చాన్సలర్లకు రాసిన లేఖలో పేర్కొంది. సీనియర్లు ర్యాగింగ్‌ చేస్తున్నారని, లైంగికవేధింపులకు పాల్పడుతున్నారని, వర్సిటీ ఆవరణలో నిత్యం మద్యపానం చేస్తున్నారంటూ భోపాల్‌లోని నేషనల్‌ లా ఇన్‌స్టిట్యూట్‌ యూనివర్సిటీ(ఎన్‌ఎల్‌ఐయూ) విద్యార్థులు ఇద్దరు యాంటీ ర్యాగింగ్‌ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో యూజీసీ తాజా ఆదేశాలిచ్చింది. హాస్టళ్లు, తదితర కీలక ప్రదేశాల్లో కెమెరాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ ఆదేశాలు పాటించని వర్సిటీలపై తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అలాగే ర్యాగింగ్‌ కట్టడికి షార్ట్‌ఫిల్మ్స్‌, డాక్యుమెంటరీలు ప్రదర్శించాలని, విద్యార్థులకు కౌన్సిలింగ్‌ నిర్వహించాలని తెలిపింది.
nation
15,324
13-06-2017 17:20:12
జమ్మూకశ్మీర్‌ విద్యార్థులకు.. ఆర్మీ చీఫ్ అభినందన
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు చెందిన సూపర్ 40 విద్యార్థులను ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అభినందించారు. ఆ రాష్ట్రానికి చెందిన 40 మంది పేద విద్యార్థులు ఆర్మీ సహాయంతో ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ కోసం ఢిల్లీలో శిక్షణ ఇచ్చారు. ఇందులో 28 మంది మెయిన్స్‌లో 9 మంది అడ్వాన్స్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మంగళవారం ఈ విద్యార్థులను అభినందించారు. ఉన్నత విద్యాభాస్యంతో జమ్మూకశ్మీర్‌కు సేవ చేయాలని వారికి సూచించారు. ఐఐటీ ప్రవేశ పరీక్ష‌కు 2013-14లో సూపర్ 30 పేరుతో జమ్మూకశ్మీర్‌కు చెందిన 30 మందికి శిక్షణ ఇవ్వగా గత ఏడాది 40 మంది పేద విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఈ ఏడాది ఈ సంఖ్యను 50కు పెంచనున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
nation
427
23-09-2017 02:30:46
అకౌంటెంట్ల నైపుణ్యాల అభివృద్ధిపై ఎసిసిఎ దృష్టి
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రపంచీకరణ, ఆటోమేషన్‌తోపాటు వ్యాపార అవసరాలు శరవేగంగా మారుతున్న నేపథ్యంలో అకౌంటెంట్ల నైపుణ్యాలను మరింతగా అభివృద్ధి పరచుకోవాల్సిన అవసరం ఉందని అసోసియేషన్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ సర్టిఫైడ్‌ అకౌంటెంట్స్‌ (ఎసిసిఎ) ఇంటర్నేషనల్‌ డెవల్‌పమెంట్‌ హెడ్‌ సాజిద్‌ ఖాన్‌ తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన కోర్సులను తాము అందిస్తున్నామని, వీటి ద్వారా అకౌంటెన్సీ విద్యను అభ్యసించే వారి నైపుణ్యాలు పెరగడంతోపాటు అంతర్జాతీయంగా వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు.  ఎసిసిఎ అర్హత సాధించడం వల్ల విద్యార్థులు, చార్టర్డ్‌ అకౌంటెన్సీ పూర్తి చేసిన వారు మరింతగా నైపుణ్యాలను అభివృద్ధి పరచుకునే అవకాశం ఉంద ని శుక్రవారంనాడిక్కడ విలేకరులతో అన్నారు. మూడేళ్ల కోర్సు పూర్తి చేసిన తర్వాత ఎసిసిఎ సభ్యులుగా మారవచ్చని, ఈ కోర్సుకు 1.50 లక్షల రూపాయల వరకు ఫీజు ఉంటుందని చెప్పారు. తమ కోర్సును విద్యార్థులకు అందించేందుకు ఇప్పటికే 80కిపైగా విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్‌ ఇనిస్టిట్యూట్లతో ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. వీటిలో ఎపి, తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో 10 వేల మంది ఎసిసిఎ కోర్సును అభ్యసిస్తున్నారని, ఇప్పటికే 1,500 మంది దేశవిదేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకున్నారని తెలిపారు. ఉద్యోగాలు కల్పించే వారి అవసరాలను గుర్తిస్తూ తమ కరికులమ్‌లో మార్పులు చేర్పులు చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రపంచీకరణ, డిజిటల్‌ టెక్నాలజీ, రెగ్యులేటరీ సంస్థల నుంచి ఒత్తిడులు, వ్యాపారాల నుంచి అంచనాలు పెరిగిపోతుండటం వంటి పరిణామాల నేపథ్యంలో ఇందుకు అనుగుణంగా అకౌంటెంట్లలో నైపుణ్యాలను వృద్ధి పరుస్తున్నామని తెలిపారు.
business
19,388
11-04-2017 01:08:06
లిన్‌ కొనసాగేది అనుమానమే!
న్యూఢిల్లీ: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ లిన్‌ ఐపీఎల్‌-10లో కొనసాగేది అనుమానంగా ఉంది. ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో లిన్‌ భుజం గాయానికి గురికావడంతో వెంటనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఆస్ర్టేలియాకు చెందిన క్రిస్‌ లిన్‌ ఎడమ చేతి భుజానికి గాయం కావడం రెండేళ్ల కాలంలో ఇది మూడోసారి. తాజా గాయం కూడా తీవ్రమైనదే అని తెలుస్తోంది.
sports
6,219
29-10-2017 15:25:18
చిరు నాగబాబు మధ్యలో పవన్..
కొణిదెల హీరోలు చిరంజీవి, నాగబాబు మధ్యలో పవన్ కూర్చొని ఉన్న ఓ ఫోటో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోను ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకున్నాడు. ఈ రోజు కొణిదెల నాగబాబు పుట్టినరోజు సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ ఫోటోతో కొణిదెల ఫ్యామిలీపై అభిమానాన్ని చాటుకున్నాడు సదరు అభిమాని. చాలా కాలం క్రిందట ఎంతో ఆనందంగా ముగ్గురు అన్నదమ్ములు ఓ క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తున్నప్పటి ఫోటో ఇది. ఇందులో ముగ్గురు సోదరులతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హాస్యానికి రారాజు బ్రహ్మానందం కూడా ఉండటం మెగా అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. 1961వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని మొగల్తూరు గ్రామంలో జన్మించిన నాగబాబుకు ఇది 57 వ పుట్టినరోజు. 1988 నుండి సినిమా రంగంలో ఉత్సాహంగా ఉంటూ యాక్టర్‌గా, నిర్మాతగా, టీవీ షోస్ ద్వారా కూడా రాణిస్తున్నారు. పవన్ కల్యాణ్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివి చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేసిన పొలిటీషియన్
entertainment
10,827
15-01-2017 12:44:33
అమెరికాలో శాతకర్ణి తర్వాతే ఖైదీ!
రెండు భారీ చిత్రాలు సంక్రాంతి బరిలో నువ్వా..నేనా అన్నంత పోటీగా నిలిచాయి. ఆ రెండు సినిమాలూ విజయవంతంగా దూసుకుపోతున్నాయి. ఆ రెండు చిత్రాలేవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో. అవును బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి, మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. శాతకర్ణి కంటే ఒక్క రోజు ముందు వచ్చిన ఖైదీ.. బాహుబలి తొలి రోజు రికార్డును గల్లంతు చేసి.. ఇండస్ట్రీలో ఇప్పటికీ తన స్టామినా ఏమీ తగ్గలేదని నిరూపించాడు. ఇటు బాలయ్య కూడా తన కత్తి వాడి ఎప్పటికీ తగ్గదని శాతకర్ణిగా ప్రూవ్ చేశాడు. అయితే.. ఒకచోట మాత్రం శాతకర్ణి కన్నా ఖైదీ వెనకబడ్డాడు. అమెరికా బాక్సాఫీస్ వద్ద ఖైదీని శాతకర్ణి బీట్ చేశాడు. గౌతమిపుత్ర శాతకర్ణి కన్నా ఒక్క రోజు ముందే వచ్చినా.. అక్కడ ఇప్పటిదాకా కలెక్షన్లలో గౌతమిపుత్ర శాతకర్ణిని ఖైదీనంబర్ 150 దాటలేకపోయింది. సంక్రాంతి పండుగ రోజు అంటే శనివారం ఒక్కరోజు అక్కడ ఖైదీ నంబర్ 150.. 45 వేల డాలర్లు (సుమారు రూ.30.65 లక్షలు) కలెక్షన్లు సాధిస్తే గౌతమిపుత్ర శాతకర్ణి 49 వేల డాలర్లు (సుమారు రూ.33.40 లక్షలు) కలెక్షన్లను సాధించింది. ఇక, కొన్ని థియేటర్లలోనే విడుదలైన శర్వానంద్ శతమానం భవతి 12 వేల డాలర్లను సాధించింది.
entertainment
9,501
01-01-2017 23:13:09
‘ద్యావుడా’ టీజర్‌
శాన్వి క్రియేషన్స్, అమృతసాయి ఆర్ట్స్‌ క్రియేషన్స్ పతాకంపై సాయిరాం దాసరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ద్యావుడా’. జి.హరికుమార్‌ నిర్మాత. భాను, శరత్, జై, అనూష, హరిణి, కారుణ్య నటీనటులు. ఆదివారం ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో ఈ చిత్రం మోషన పోస్టర్‌ను వంశీ చాగంటి, టీజర్‌ను రాజ్‌ కందుకూరి విడుదల చేశారు. ‘‘టైటిల్‌ పాజిటివ్‌గా ఉంది. టీజర్‌ చూశాక అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ సినిమా తీసినట్లుంది’’ అని రాజ్‌ కందుకూరి అన్నారు. ‘‘లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్న మూడు జంటలు ఓ పామ్‌హౌ్‌స్‌‌‌కి వెళ్లినప్పుడు దేవుడు వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చాడు అన్న భిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. త్వరలో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాత చెప్పారు.
entertainment
16,674
18-07-2017 15:30:21
పసిప్రాణం బలితీసుకున్న తెల్లారే పాకిస్తాన్ వికృత క్రీడ
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లోని భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ సైనిక మూకల వికృత క్రీడ కొనసాగుతోంది. ఓ జవాను సహా అభంశుభం తెలియని బాలికను పొట్టనబెట్టుకున్న తెల్లారే పాక్ సైన్యం కవ్వింపులకు దిగింది. మంగళవారం మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దు గ్రామాల్లో అలజడి సృష్టించింది. నియంత్రణ రేఖను అనుకుని ఉన్న రాజౌరీ, పూంచ్ సెక్టార్లలో మోర్టార్ షెల్స్ ప్రయోగిస్తూ వరుస కాల్పులకు తెగబడింది. తాజా సంఘటనలతో అప్రమత్తంగా ఉన్న భారత బలగాలు దాయాది సైన్యానికి ధీటుగా జవాబు చెబుతున్నాయి. ఉద్రిక్తపరిస్థితుల దృష్ట్యా ఇళ్లనుంచి బయటికి రాకూడదంటూ అధికారులు ఇప్పటికే స్థానికులను అప్రమత్తం చేశారు. భారత సైన్యంతో సమన్వయం కోసం ఫీల్డ్ ఎడ్వైజర్లను నియమించినట్టు రాజౌరీ డిప్యూటీ కమిషనర్ షాహిద్ ఇక్బాల్ చౌదరి వెల్లడించారు.
nation
14,941
04-08-2017 04:20:49
నోటా ఎత్తివేతకు సుప్రీంకోర్టు నో
రాజ్యాంగబద్ధతను పరిశీలించనున్న బెంచిన్యూఢిల్లీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికలలో ‘నోటా’ను అనుమతిస్తూ ఎన్నికల సంఘం(ఈసీ) ఇచ్చిన నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు తిరస్కరించింది. గుజరాత్‌ కాంగ్రెస్‌ నేత శైలేష్‌ పర్మార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఈ ఆదేశాలిచ్చింది. అయితే ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌ రాజ్యాంగబద్ధతను తాము పరిశీలిస్తామని బెంచి పేర్కొంది. కాంగ్రెస్‌ తరఫున సీనియర్‌ లాయర్లు కపిల్‌ సిబల్‌, ఏఎం సింఘ్వీ, హరీన్‌ రావల్‌ వాదించారు. నోటా నిబంధన వల్ల అవినీతికి ప్రోద్బలమిచ్చినట్లవుతుందని సిబల్‌ చేసిన వాదనతో బెంచి అంగీకరించలేదు. కాంగ్రెస్‌ నేతనుద్దేశించి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 2014 జనవరిలోనే ఈసీ ఇలాంటి నోటిఫికేషన్‌ జారీ చేయగా, ఇంత ఆలస్యంగా ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నారని ప్రశ్నించింది.
nation
5,262
06-02-2017 13:37:34
చిరంజీవిలో గ్రేస్‌ ఏ మాత్రం తగ్గలేదు: కే విశ్వనాథ్‌
కమ్‌బ్యాక్‌ మూవీ ‘ఖైదీ నెంబర్‌ 150’ ఘనవిజయంతో మంచి ఉత్సాహంలో ఉన్న మెగాస్టార్‌ చిరంజీవికి మరో అరుదైన దిగ్గజం నుంచి ప్రశంసలు లభించాయి. చిరంజీవితో ‘స్వయంకృషి’, ‘ఆపద్బాంధవుడు’ వంటి సినిమాలు తెరకెక్కించిన దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ ఇటీవల ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమాను డైరెక్టర్‌ వీవీ వినాయక్‌తో కలిసి చూశారు.
entertainment
1,255
17-10-2017 02:13:03
కేజీ డి6పై ఆర్‌ఐఎల్‌ సవరించిన పెట్టుబడుల ప్రణాళిక
న్యూఢిల్లీ: కృష్ణ-గోదావరి (కేజీ) డి-6 క్షేత్రంలో సహజ వాయువు ఉత్పత్తి కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యుకెకు చెందిన బిపి పిఎల్‌సి సవరించిన పెట్టుబడుల ప్రణాళికను సమర్పించాయి. ఈ మేరకు నాలుగు డీప్‌ సీ శాటిలైట్‌ గ్యాస్‌ క్షేత్రాలైన డి-2,6,19, 22లను అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికను ఆర్‌ఐఎల్‌, బిపి సిద్ధం చేశాయి. ఈ క్షేత్రాలతో పాటు డి-29, డి-30 క్షేత్రాల్లో కూడా పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నాయని ఈ వ్యవహారంతో సంబంఽధమున్న వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది జూన్‌లో కేజీ డి 6 క్షేత్రంలో సహజ వాయువు ఉత్పత్తి కోసం 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆర్‌ఐఎల్‌, బిపి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆరు శాటిలైట్‌ క్షేత్రాలను ఒకేసారి అభివృద్ధి చేయనుండగా డి-34 లేదా ఆర్‌ సిరిస్‌, డి-55 (ఎంజె) క్షేత్రాలకు వేర్వేరు పెట్టుబడుల ప్రణాళికలను సమర్పించిందని ఆ వర్గాలు తెలిపాయి.
business
5,362
29-10-2017 22:59:39
తండ్రిగా తనయుడు..!
తెలుగువారి ఆరాధ్య నటుడు నందమూరి తారకరామారావు బయోపిక్‌ ‘ఎన్టీఆర్‌’ గురించి తాజాగా ఆసక్తికరమైన అంశం బయటికొచ్చింది. ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. మరి హరికృష్ణ పాత్రలో ఎవరు నటిస్తారా? అనే ఆసక్తి గత కొన్నాళ్లుగా సినీ ప్రియుల్లో ఉంది. ఇప్పుడు అందుకు సమాధానం దొరికింది. తేజ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో తాజాగా నందమూరి కల్యాణ్‌రామ్‌ పేరు చేరింది. నందమూరి హరికృష్ణ పాత్రను ఆయన తనయుడు నందమూరి కల్యాణ్‌రామ్‌ తెరమీద పోషించనున్నట్టు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుకానుంది. నందమూరి బాలకృష్ణతో కలిసి సాయి కొర్రపాటి, విష్ణు ఇందుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
entertainment