SNo
int64
0
21.6k
date
stringlengths
19
19
heading
stringlengths
3
91
body
stringlengths
6
38.7k
topic
stringclasses
5 values
4,447
24-12-2017 00:37:36
మోదీ కూడా ఇంతేనా!?
నాయకుడిపై అనుమానం రానే కూడదు. ఒక్కసారి అనుమానం వస్తే ప్రతి సందర్భంలోనూ అనుమానిస్తూనే ఉంటారు. 2జీ స్పెక్ట్రమ్‌ విషయంలో ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదే! కేసు నీరుగారిపోవడం వెనుక నరేంద్ర మోదీ పాత్ర ఉందో లేదో తెలియదు! అయినా ఉందనే ప్రజలు నమ్ముతున్నారు. ప్రజల నమ్మకాన్ని కోల్పోవడం అంటే అపజయం కాచుకుని ఉన్నట్టే! గుజరాత్‌లో గెలుపు వల్ల మోదీకి వ్యక్తిగతంగా మైలేజీ రాకపోగా డ్యామేజీ జరిగింది. పులి మీద పుట్రలా 2జీ స్పెక్ట్రమ్‌ కేసు తీర్పు వచ్చిపడింది. 2జీ కేసులో తీర్పు పుణ్యమా అని ఇకపై దేశంలో అవినీతి అనేది ప్రచారాస్త్రం కాబోదు. కాంగ్రెస్‌ పాలనలో అవినీతి జరిగిందని చెప్పలేని పరిస్థితికి ఇప్పుడు మోదీ వచ్చారు. దీనివల్ల తన పాలనలో అవినీతి లేదు అని గొప్పగా చెప్పుకొనే అవకాశం కూడా కోల్పోయారు. పాలకులకు, నిందితులకు మధ్య డీల్‌ కుదిరితే దర్యాప్తు ఒకలా, డీల్‌ కుదరకపోతే మరొకలా ఉంటే అవినీతిపరుల గురించి మాట్లాడే అర్హత నరేంద్ర మోదీకే కాదు– ఎవరికీ ఉండదు. అవినీతి, కుంభకోణాలు ఆటలో అరటిపండులా మారిపోతున్నాయి. ఎవరో ఆట మొదలుపెడతారు, మరెవరో ఆట ముగిస్తారు! మధ్యలో జనాన్ని పిచ్చివాళ్లను చేస్తారు. 2జీ కేసులో దర్యాప్తు మధ్యలో సీబీఐ ఆసక్తి కోల్పోయింది అని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యకు సమాధానం తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు లేదా? ఉంటే న్యాయమూర్తి వ్యాఖ్య నిజమా? కాదా? అన్నది స్పష్టంచేయాలి. తీర్పుపై అప్పీలు చేసినంత మాత్రాన ఒరిగేది ఏమి ఉంటుంది?  గజం మిథ్య– పలాయనం మిథ్య! 2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణంపై సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో స్పెక్ట్రమ్‌ వేలంలో అక్రమాలకు పాల్పడటం ద్వారా లక్షా 76 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని నాటి కాగ్‌ డైరెక్టర్‌ జనరల్‌ వినోద్‌రాయ్‌ లెక్క తేల్చినప్పుడు దేశ ప్రజలంతా గుడ్లు తేలేశారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ–2 హయాంలో అంతా అవినీతేనని ప్రజలు భావించారు. ఫలితమే నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. ప్రధాని మోదీ దేశం నుంచి అవినీతిని పారదోలతారనీ, దేశాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తారనీ ప్రజలంతా నమ్మారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో నరేంద్ర మోదీ కూడా అవినీతి గురించి దేశ విదేశాలలో పదేపదే ప్రస్తావించారు. ఇప్పుడు 2జీ స్పెక్ట్రమ్‌ వ్యవహారంపై కోర్టు తీర్పు తర్వాత ఎన్నో సందేహాలు! ఎందుకంటే ఈ కుంభకోణం జరిగిందని యూపీఏ ప్రభుత్వం నింద భరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు జరిగిందంతా ప్రధాని మోదీ హయాంలోనే కావడంతో ఇప్పుడు ఎన్నో సందేహాలు! అదే సమయంలో దేశ ప్రజలలో నిస్పృహ! ఏ వ్యవస్థను నమ్మాలో– ఏ నాయకుడిని నమ్మాలో తెలియని అయోమయ పరిస్థితి! 2జీ స్పెక్ట్రమ్‌ కేసులో ప్రాసిక్యూషన్‌ అంటే సీబీఐ ఆసక్తి కోల్పోయిందని సీబీఐ కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య ఆందోళన కలిగించక మానదు. ఈ వ్యవహారంలో లక్షా 76 వేల కోట్ల రూపాయలు కాకపోయినా ఎంతో కొంత అవినీతి జరిగిందని ప్రజలంతా నమ్మారు. ఎందుకంటే లబ్ధి పొందిన కంపెనీల నుంచి నిందితురాలైన కనిమొళికి చెందిన టెలివిజన్‌ కంపెనీలోకి నిధులు ప్రవహించాయని సీబీఐ చెప్పింది. విచారణ సందర్భంగా ఆరోపణలను రుజువు చేయలేకపోవడం వల్ల కాంగ్రెస్‌కు రాజకీయ ప్రయోజనం కలిగి ఉండవచ్చు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం ఆత్మరక్షణలో పడింది. వీటన్నింటికీ మించి దేశమే వంచనకు గురైంది. అవును.. అధికారంలో ఎవరున్నా మనమంతా వంచనకు గురవుతూనే ఉన్నాం.  ప్రధాన రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుతున్న ఆటలో ప్రజలే వంచితులవుతున్నారు. స్పెక్ట్రమ్‌ కేసులో అవాస్తవాలను, కల్పితాలను పోగేశారనీ, ఆరోపణలను రుజువు చేయడంలో దర్యాప్తు సంస్థ దారుణంగా విఫలమైందనీ, ప్రాసిక్యూషన్‌ తీరు నిరాసక్తంగా ఉందనీ సీబీఐ కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పవలసిన సంస్థలు మౌనం దాల్చాయి. ఫలితంగా ప్రజల వేళ్లన్నీ కేంద్ర ప్రభుత్వం వైపే తిరిగాయి. ఎందుకంటే సీబీఐ గానీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో పనిచేస్తున్నాయి. సీబీఐ పంజరంలో చిలకలా మారిందని గతంలో సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారి ఆదేశాలకు అనుకూలంగా ఈ దర్యాప్తు సంస్థలు ఆడుతుంటాయని ప్రజలందరికీ తెలిసిందే! తాజా తీర్పు పర్యవసానాలకు ఎవరు బాధ్యత వహించాలన్నదే ఇప్పుడు ప్రశ్న! దేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణంగా ప్రచారం పొందిన 2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణం విషయంలోనే దర్యాప్తు సంస్థలు నిరాసక్తత ప్రదర్శిస్తే మిగతా కేసుల గతి ఏమిటి? ఈ కేసులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు తప్పు అయితే ఆ విషయాన్ని ఎవరూ ఎందుకు గట్టిగా చెప్పలేకపోయారు? సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసులో కిందిస్థాయి న్యాయమూర్తి ఆషామాషీగా తీర్పు ఇవ్వగలరా? నేరాన్ని రుజువు చేయడంలో దర్యాప్తు సంస్థలు ఎందుకింత ఘోరంగా విఫలం అయ్యాయి? కేసు తుస్సుమనడానికి కారకులు ఎవరు? వంటి ఎన్నో ప్రశ్నలు ప్రజల మెదళ్లను తొలుస్తున్నాయి. తీర్పు తర్వాత నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మాత్రం తాను ఆత్మస్తుతి చేసుకోదలుచుకోలేదని హుందాగా వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున స్పందించిన ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మాత్రం కాంగ్రెస్‌ పార్టీ సంబరాలు చేసుకోనక్కర్లేదని నిష్టూరం పోయారు. ఈ తీర్పు ఇలా రావడానికి ఎవరు కారణమో, ఎందుకో తెలియదు గానీ, దీనివల్ల కాంగ్రెస్‌ పార్టీకి నైతిక స్థయిర్యం పెరిగిందని చెప్పవచ్చు. ఈ పరిణామం ఆ పార్టీకి రాజకీయంగా కూడా టానిక్‌లా పనిచేస్తుంది. తమపై ఇంతకాలం తప్పుడు నిందారోపణలు చేశారని కాంగ్రెస్‌ నాయకులు చెప్పుకోకుండా ఎందుకుంటారు. ఈ వ్యవహారంలో కుంభకోణం జరిగిందా? లేదా? అన్నది న్యాయస్థానాలలో రుజువు చేయవలసిన బాధ్యత ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపైనే ఉంది. ఈ కేసు వల్ల రాజకీయంగా లబ్ధి పొందింది కూడా ఆ పార్టీనే కదా! తీర్పుకన్నా తీర్పులో భాగంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇప్పుడు దేశ ప్రజల దృష్టిలో కాంగ్రెస్‌పార్టీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తేడా లేదు! దర్యాప్తు సంస్థలు నిరాసక్తత ప్రదర్శించడానికి ప్రధానమంత్రి కారణమో కాదో తెలియదు గానీ, సగటు ప్రజలు మాత్రం ఆయననే అనుమానిస్తున్నారు. ద్రవిడ మోదీ కజగం!యాథృచ్ఛికంగానే కావచ్చుగానీ ఇటీవలే నరేంద్ర మోదీ చెన్నై పర్యటన సందర్భంగా డీఎంకే అధినేత కరుణానిధిని పరామర్శించడం, ఢిల్లీలో తన నివాసానికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలని సూచించడం ప్రజల అనుమానాలకు ఊతమిస్తోంది. స్పెక్ట్రమ్‌ కేసులో నిందితురాలైన కనిమొళి డీఎంకే అధినేత కూతురు కావడం, మరో ప్రధాన నిందితుడు, నాటి కేంద్ర మంత్రి ఎ.రాజా డీఎంకే నాయకుడు కావడం వల్ల ప్రధానమంత్రి పాత్ర ఉండి ఉంటుందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. తీర్పు తర్వాత సోషల్‌ మీడియాలో వెల్లువెత్తిన సెటైర్లు దేశ ప్రజల మనోగతానికి అద్దం పడుతున్నాయి. ఇప్పుడు డీఎంకేఅంటే ద్రవిడ మున్నేట్ర కజగం కాదు– ద్రవిడ మోదీ కజగం అని కొందరు చేసిన వ్యాఖ్య ప్రధాని మోదీ వ్యక్తిత్వానికి మచ్చగా మారింది. దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి జాడ్యాన్ని వదిలించే సత్తా ఉన్న నాయకుడు నరేంద్ర మోదీ అని దేశ ప్రజలు నిజంగా నమ్మారు. యూపీఏ పాలన అంతా అవినీతిమయమని చిరాకుపడి, ఆయనను ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. ఈ నమ్మకంతోనే గత మూడున్నరేళ్లుగా మోదీ తీసుకున్న అన్ని నిర్ణయాలనూ సమర్థించారు. ఆయా రాష్ర్టాలలో జరిగిన ఎన్నికలలో అనుకూలంగా తీర్పు ఇచ్చారు. పెద్దనోట్లను రద్దు చేసినా, హడావుడిగా జీఎస్టీ అమలుచేసినా అవినీతిని హరింపజేయడానికే ప్రధానమంత్రి సదరు నిర్ణయాలు తీసుకున్నారని భావించి కష్టాలను సైతం ఓర్చుకుని అండగా నిలబడ్డారు. ఇప్పుడు అదే ప్రజలు ఈ తీర్పు తర్వాత అదే నరేంద్ర మోదీపై సెటైర్లు వేస్తున్నారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ‘ఇక జగన్మోహన్‌రెడ్డి వంతు... ఆయన కూడా నిర్దోషి అని కోర్టులు తీర్పు ఇస్తాయి. ఎందుకంటే దర్యాప్తు సంస్థలు ఆధారాలు ఇవ్వలేవు కనుక’ అని సోషల్‌ మీడియాలో ప్రచారమైన వ్యాఖ్య ప్రజలలో నెలకొన్న నిరాశా నిస్పృహలకు నిదర్శనం కాదా! ‘బంద్‌ కరో ఏ నాటక్‌’ అని మరికొందరు అన్నారంటే ప్రజలలో గూడుకట్టుకున్న అసమ్మతి, ఆవేదన తెలియడం లేదా? ఈ వ్యాఖ్య ఎవరు చేశారో గానీ ఎంతకాలం ఈ నాటకాలు అని ప్రశ్నించుకోవలసిన తరుణం ఆసన్నమైంది. అవినీతికి సంబంధించిన కేసులు ఇలా నీరుగారిపోవడం వల్లనే అవినీతికి పాల్పడినవారు కూడా దర్జాగా ఎన్నికలలో పోటీ చేయగలుగుతున్నారు. అధికార అందలాలు అందుకుంటున్నారు.  ప్రజలమైన మనం మాత్రం పిచ్చోళ్లుగా మిగిలిపోతున్నాం. 2జీ స్పెక్ట్రమ్‌ కేసులో లక్షా 76 వేల కోట్ల రూపాయల అవినీతి జరగకపోయినా, ఎంతో కొంత అవినీతి జరగలేదా? ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకపోయినా ఒక కేంద్ర మంత్రిని, ఒక ఎంపీని జైలులో ఎందుకు పెట్టినట్టు? వారిని అరెస్ట్‌ చేసినప్పుడు వారిపై ఉన్న నేరారోపణను రుజువు చేయగలమా? లేదా? అన్న విషయం దర్యాప్తు సంస్థలకు తెలియదా? సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల ప్రతిష్ఠ ఏమి కావాలి? ఇలా అయితే ఈ దేశంలో అవినీతికి పాల్పడటం హక్కుగా మారదా? ఈ మధ్య చెన్నైలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తమ నివాస గృహాలపై దాడులు చేయడంపై శశికళ వర్గానికి చెందిన దినకరన్‌ స్పందిస్తూ, ‘మేము మాత్రమే అవినీతికి పాల్పడ్డామా? మిగతా వారంతా మహాత్మాగాంధీ వారసులా?’ అని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ తీర్పు తర్వాత ఎవరైనా ఇదే ప్రశ్న వేస్తారు.  ఎంత భారీ స్థాయిలో అవినీతికి పాల్పడినా ఏ తప్పూ చేయలేదని బుకాయించగలరు? బుకాయించే అవసరం కూడా లేదు– ఎందుకంటే వారు నిర్దోషులని తీర్పులు వచ్చేలా దర్యాప్తు సంస్థలే చూసుకుంటాయి. ఏదిఏమైనా అవినీతి అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకుని దేశ విదేశాలలో ఖ్యాతిని పెంచుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇప్పుడు ఆ అస్త్రం కూడా లేకుండా పోయింది. ఇకపై జరగనున్న ఎన్నికలలో ఆయన ఏ అంశాన్ని ఎత్తుకుంటారో చూడాలి. నరేంద్ర మోదీ రూపంలో ప్రజలలో ఇప్పటివరకు ఉన్న ఆశ కూడా ఇప్పుడు పోయింది. ఈయన కూడా ఇంతేనా? అని సగటు గృహిణి కూడా వ్యాఖ్యానించే పరిస్థితి ఇప్పుడు దేశంలో ఉంది. పాలకులకు ప్రజల మనోభావాలతో పనిలేదు. వారి రాజకీయ అవసరాలు వారివి! వాటికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఆ క్రమంలోనే ప్రజలలో ఆశలు రేకెత్తిస్తారు. అవసరం తీరాక ఆశలపై నీళ్లు పోస్తారు. మూలనపడిన చిన్నాచితక కేసులను కూడా వెలికితీసి రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెడుతున్నారే! 2జీ వంటి కేసులోనే తీర్పు ఇలా రావడానికి కారణమైన వారు ఏ మొహం పెట్టుకుని కొత్తగా కేసులు పెడతారు? అయినా అవినీతి అనేది ఈ దేశంలో ఒక మిథ్య! జరిగినట్టు ఉంటుంది కానీ జరగదనుకోవాలి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా ఇకపై తల ఎగరేసి తిరగవచ్చు. కోర్టు తీర్పు అనేది కేవలం సర్టిఫికెట్‌ మాత్రమే! ఆ సర్టిఫికెట్‌ కావాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్నవారితో సఖ్యతగా మెలిగితే చాలు. అంతా పైవారే చూసుకుంటారు. కేసులు కూడా రాజకీయ కారణాలతో నమోదు కావడమే అన్నింటికీ మించిన విషాదం.  కర్ణాటకకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకుడిని కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఒత్తిడి తెచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాడు అధికారంలో ఉన్న దివంగత రాజశేఖర్‌రెడ్డి స్వయంగా పూనుకుని ఆ నాయకుడిపై ఒత్తిడి తెచ్చారు. అయినా సదరు నాయకుడు లొంగలేదు. దీంతో ఆగ్రహించిన అప్పటి ఢిల్లీ పెద్దలు ఆయన మైనింగ్‌ అక్రమాలకు పాల్పడినట్టు సీబీఐతో కేసు నమోదు చేయించారు. మన దగ్గర జగన్మోహన్‌రెడ్డి విషయమే తీసుకుందాం! ఆయన బుద్ధిగా కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగి, సోనియాగాంధీకి విధేయత ప్రదర్శించి ఉంటే సీబీఐ కేసుల్లో ఇరుక్కునేవాడు కాదన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే! ఈ రెండు సందర్భాలలోనూ సదరు వ్యక్తులు తప్పు చేశారా? లేదా? అని కాకుండా రాజకీయ కారణాలే వారిపై కేసులు నమోదు కావడానికి కారణమయ్యాయి. అక్రమాలకు పాల్పడినా, రాజకీయంగా ఉపయోగపడితే కేసులు కూడా ఉండవన్న మాట!  న్యాయస్థానాల జోక్యంతో కేసులు నమోదు అయినా తర్వాత కాలంలో రాజకీయ ప్రయోజనం ఉందనుకుంటే సదరు కేసులను నీరుగారుస్తారు. 2జీ స్పెక్ట్రమ్‌ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఉండకపోతే అసలు కేసే నమోదు అయ్యేది కాదు. యూపీఏ హయాంలో కేసు నమోదు అయితే ఎన్‌డీఏ హయాంలో తీర్పు వచ్చింది. జగన్మోహన్‌రెడ్డితో పాటు కర్ణాటక బీజేపీ నాయకుడిపై కూడా యూపీఏ హయాంలోనే కేసులు నమోదయ్యాయి. ఎన్‌డీఏ హయాం వచ్చినా ఇంకా వారిపై తీర్పులు రాలేదు. తీర్పులు ఎప్పుడు వస్తాయో తెలియదు. జరుగుతున్న తంతును చూస్తే డీల్‌ కుదరలేదని భావించవలసి ఉంటుంది. పాలకులకు, నిందితులకు మధ్య డీల్‌ కుదిరితే దర్యాప్తు ఒకలా, డీల్‌ కుదరకపోతే మరొకలా ఉంటే అవినీతిపరుల గురించి మాట్లాడే అర్హత నరేంద్ర మోదీకే కాదు– ఎవరికీ ఉండదు. అవినీతి, కుంభకోణాలు ఆటలో అరటిపండులా మారిపోతున్నాయి. ఎవరో ఆట మొదలుపెడతారు, మరెవరో ఆట ముగిస్తారు! మధ్యలో జనాన్ని పిచ్చివాళ్లను చేస్తారు. 2జీ కేసులో దర్యాప్తు మధ్యలో సీబీఐ ఆసక్తి కోల్పోయింది అని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యకు సమాధానం తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు లేదా? ఉంటే న్యాయమూర్తి వ్యాఖ్య నిజమా? కాదా? అన్నది స్పష్టంచేయాలి. తీర్పుపై అప్పీలు చేసినంత మాత్రాన ఒరిగేది ఏమి ఉంటుంది? అక్కడ కూడా ఆసక్తి చూపుతారన్న గ్యారంటీ ఏమి ఉంది? మన దేశంలో ప్రజలకు ఉన్నది ఓటు హక్కు మాత్రమే! మిగతా ఏ హక్కులూ లేవనుకోవాలి. ఏ రాజకీయ పార్టీ ఎక్కువ రసవత్తరంగా నాటకం ప్రదర్శిస్తే ఆ పార్టీకి ఓటేసి బాధ్యత తీరిందనుకుంటాం. అలా ఎందుకు జరిగింది? ఇలా ఎందుకు జరిగింది? అని ప్రశ్నించడం వ్యర్థమే అవుతుంది. తాజా తీర్పు పుణ్యమా అంటూ కేసులలో చిక్కుకున్న వారిలో ఆత్మస్థైర్యం పెరిగింది. డీల్‌ కుదుర్చుకుంటే నిరాసక్తత ప్రదర్శించడానికి దర్యాప్తు సంస్థలు సిద్ధంగా ఉంటాయి కదా! మనకు తెలిసిన జగన్మోహన్‌రెడ్డి, గాలి జనార్ధన్‌రెడ్డి ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటూ ఉండి ఉండవచ్చు. డీల్‌ కుదిరితే ఏమవుతుందో జగన్మోహన్‌రెడ్డి కేసులో ఇదివరకే కొంత రుజువయ్యింది. ఆయనకు బెయిల్‌ రావడానికి ముందు తాము దాఖలు చేసిన చార్జ్‌షీట్‌కు భిన్నంగా కొన్ని సంస్థలలో క్విడ్‌ప్రోకో జరగలేదని సీబీఐ అధికారులే స్వయంగా అఫిడవిట్‌ దాఖలు చేశారు. దీంతో ఆయనకు బెయిల్‌ లభించింది. ఇంతకాలానికి ఇప్పుడు ఎక్కడ ఏమి బెడిసికొట్టిందో తెలియదు గానీ క్విడ్‌ప్రోకో జరగలేదని తాము దాఖలు చేసిన అఫిడవిట్‌ను ఉపసంహరించుకుంటున్నామంటూ సీబీఐ మరొక కొత్త అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఎటొచ్చీ రాజకీయంగా ఏ మాత్రం ఉపయోగం లేనివారు మాత్రం అవినీతికి పాల్పడిన సందర్భాలలో శిక్షకు గురవుతారు. దీన్నిబట్టి ఎవరు అవినీతికి పాల్పడవచ్చు, ఎవరు అవినీతికి పాల్పడకూడదో నిర్ణయించుకోవలసింది కూడా సదరు వ్యక్తులే! దేశం ఏమయ్యేట్టు?ఈ విషయం అలా ఉంచితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అచ్చే దిన్‌ పోతున్నట్టుగా అనిపిస్తోంది. తాజా పరిణామాలు ఈ అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. గుజరాత్‌ ఎన్నికలలో ఆయన సాంకేతికంగా గెలిచినా నైతికంగా ఓడిపోయారు. 2జీ స్పెక్ట్రమ్‌ కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉన్నా, లేకపోయినా సీబీఐ కోర్టు తీర్పు అలా రావడానికి ఆయన ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తోంది. ఇటీవలి కాలంవరకు నరేంద్ర మోదీ కీర్తిప్రతిష్ఠలు ఆకాశమే హద్దుగా పెరిగినా, ఇటీవలి కాలంలో తిరుగుముఖం పట్టాయని చెప్పవచ్చు. గుజరాత్‌ ఎన్నికలలో విజయం సాధించడానికై ప్రధానమంత్రి స్థాయినే కాకుండా, ఆయన తన వ్యక్తిత్వాన్ని కూడా దిగజార్చుకున్నారు. గుజరాత్‌లో అత్తెసరు మెజారిటీతో బయటపడటానికి ఏమి చేసిందీ తెలుసు కనుకే ఈ విజయం వెనుక ఎంతో కష్టం ఉందని చెబుతూ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నరేంద్ర మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. గుజరాత్‌లో గెలుపు కోసం ప్రధాన రాజకీయపార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు అనుసరించిన ఎత్తుగడలు రాజకీయాలలో విలువలు ఆశించేవారికి రోత పుట్టించాయి.  ఒక రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ, కాలం కలిసివస్తే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్న రాహుల్‌గాంధీ ముఖాముఖి తలపడ్డారు. ఒకరు మతవాదాన్ని నెత్తికెత్తుకోగా, మరొకరు కులవాదాన్ని అందిపుచ్చుకున్నారు. ఇద్దరూ కలిసి భిన్నత్వంలో ఏకత్వంలా సాగిపోతున్న భారతదేశంలో మతతత్వాన్ని, కులతత్వాన్ని రెచ్చగొట్టారు. గుజరాత్‌లో దళితులు, పాటీదారులు, బీసీలను రాహుల్‌గాంధీ అక్కున చేర్చుకోగా, గుజరాతీయులలో మరో పర్యాయం హిందూ మనోభావాలను ప్రేరేపించే ప్రయత్నం నరేంద్ర మోదీ చేశారు. ఈ దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి, ప్రధానమంత్రి అవుదామనుకునే ఏ అభ్యర్థి కూడా ఇంతకు మునుపు ఇలా వ్యవహరించలేదు. ఈ ఖ్యాతి నరేంద్ర మోదీ, రాహుల్‌గాంధీకే దక్కింది. అంత ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులే తమ రాజకీయ ప్రయోజనాల కోసం కుల– మత తగవులను రెచ్చగొడితే, భిన్నత్వంలో ఏకత్వం ఏమి కావాలి? దేశ సమగ్రత, సమైక్యత ఏమి కావాలి? అని ఆలోచనాపరులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎవరి ఆవేదన ఎలా ఉన్నా ఆ ఇద్దరు నాయకులకు గుజరాత్‌ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. అందుకే వారు అంతలా దిగజారి ఉంటారు. గుజరాత్‌లో నరేంద్ర మోదీకి ఓటమి అనే ఎదురు దెబ్బ తగలాలని చాలామంది కోరుకున్నారు. గుజరాత్‌లో ఓడిపోతే తాను బలహీనపడిపోతానన్న విషయం నరేంద్ర మోదీకి అందరికన్నా ఎక్కువ తెలుసు. అందుకే ఆయన సర్వశక్తులూ ఒడ్డటమే కాకుండా సరికొత్త ఎజెండాను తెరపైకి తెచ్చారు.  22 సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా ఆరో పర్యాయం గెలవడం సామాన్యమైన విషయం కాదని బీజేపీ నాయకులు చెప్పుకొంటున్నారు. అయితే వారు తెలుసుకోవలసింది ఇంకొకటి ఉంది. 22 సంవత్సరాలుగా అధికారంలో లేకపోయినా కాంగ్రెస్‌ పార్టీ 80 స్థానాలను గెల్చుకోవడం కూడా సామాన్యమైన విషయం కాదు. కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉన్నందువల్లనే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్నా క్యాష్‌ చేసుకోలేకపోయిందన్నది వాస్తవం. ఇప్పుడున్న రాజకీయాలలో అధికారం లేకపోతే బతకలేని స్థితిలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆర్థిక వనరుల విషయంలో బీజేపీ ముందు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్‌ పార్టీ నిలబడలేకపోయింది. మూడున్నరేళ్ల క్రితం పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ఈ దుస్థితి ఎందుకంటే, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తులు ఆర్థికంగా లాభపడతారు. పార్టీ కాదు. ఇప్పుడు బీజేపీ విషయంలో అలా కాదు. పార్టీనే ఆర్థికంగా పటిష్ఠంగా ఉంది. గుజరాత్‌లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని నిధులు సమకూర్చినవారు చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఈ వెసులుబాటు లేకపోవడం కూడా ఆ పార్టీ ఓటమికి ఒక కారణం. గుజరాత్‌ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని మెట్లు దిగజారగా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కొన్ని మెట్లు పైకి ఎగబాకారు. గుజరాత్‌ ఎన్నికలు జరిగే వరకు రాహుల్‌గాంధీని పప్పు అనే ప్రజలు కూడా భావించారు. ఆయన నాయకత్వంలో తమకు భవిష్యత్తు ఉంటుందా? అని కాంగ్రెస్‌ శ్రేణులు దిగాలుగా ఉండేవి. అలాంటి రాహుల్‌గాంధీ గుజరాత్‌లో తిరుగులేని శక్తిగా ఉన్న నరేంద్ర మోదీని ఎదుర్కొని నిలబడటం ఆషామాషీ కాదు. అలవోకగా గెలవవలసిన గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ముచ్చెమటలు పట్టించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఓటమికి సాకులు వెతకకుండా ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పడం ద్వారా రాహుల్‌గాంధీ పరిణతి ప్రదర్శించారు. మొత్తంమీద ఆయన నాయకత్వంపై కాంగ్రెస్‌ శ్రేణులకు ఇప్పుడిప్పుడే భరోసా ఏర్పడుతోంది. మున్ముందు ఆయన ప్రదర్శించే పరిణతిని బట్టి కాంగ్రెస్‌ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.  ఇక ప్రధాని నరేంద్ర మోదీ విషయానికి వస్తే దేశంలో కాంగ్రెసేతర నాయకులెవరికీ లభించని ఆదరణ అలనాడు లభించింది. ప్రజలు ఆయనపై అంతులేని నమ్మకాన్ని పెట్టుకున్నారు. మోదీ పదేళ్లపాటు అధికారంలో కొనసాగితే దేశం బాగుపడుతుందని ఆశించారు. అయితే జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆందోళనకరంగా ఉంటున్నాయి. 2019లో జరిగే ఎన్నికలలో కూడా మోదీకే అధికారం అని మొన్నటివరకు అందరూ భావించారు. ఇప్పుడు గుజరాత్‌ ఫలితాల తర్వాత వారిలో ఈ అభిప్రాయం మారుతోంది. సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనే అంత వ్యతిరేకత ఉంటే మిగతా రాష్ర్టాలలో పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇంతలోనే అంత మార్పు ఎందుకు? అన్న విషయంలో ప్రధానమంత్రి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒంటెత్తు పోకడలు, నియంతృత్వానికి తావు ఉండదు. కానీ నరేంద్ర మోదీలో ఈ రెండు లక్షణాలూ పుష్కలంగా ఉన్నాయి. పార్టీలో, ప్రభుత్వంలో ఏమి జరుగుతున్నదో ఎవరికీ ఏమీ తెలియని పరిస్థితి కల్పించారు. అనుకున్నదే తడవుగా ముందూ– వెనుకా ఆలోచించకుండా పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఫలితమే ఇప్పుడు ప్రతికూల పవనాలు వీయడం మొదలయ్యింది.  ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్‌ పార్టీ 18 రాష్ర్టాలలో అధికారంలో ఉండగా, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆ రికార్డును బద్దలుకొట్టిందనీ, 19 రాష్ర్టాలలో అధికారంలో ఉందనీ ప్రధాని మోదీ గొప్పగా ప్రకటించుకున్నారు. అయితే సంఖ్యాపరంగా ఇది వాస్తవం కావచ్చు గానీ అసలు విషయం వేరే ఉంది. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ర్టాలు ఏర్పడలేదు. ఈ మూడు రాష్ర్టాలు మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌లో కలిసి ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే బీజేపీ ఇప్పుడు 16 రాష్ర్టాలలోనే అధికారంలో ఉన్నట్టు! ఇందిరాగాంధీని మించిపోవాలంటే మరో మూడు రాష్ర్టాలను బీజేపీ తన ఖాతాలో వేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులలో అది సాధ్యమా? అన్న సందేహాలు నెలకొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి రాజస్థాన్‌, హరియాణ, మధ్యప్రదేశ్‌లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని చెబుతున్నారు. దక్షిణాదిన ఆ పార్టీకి ఇంకా పట్టు చిక్కలేదు. తమిళనాడులో పాగా వేయడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయి. తాజాగా 2జీ స్పెక్ట్రమ్‌ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెడకు చుట్టుకుంటోంది. దేశ ప్రజలందరూ ఆయనను అనుమానంగా చూస్తున్నారు. డీఎంకేతో దోస్తీ కోసమే కేసును నీరుగార్చారని ప్రజలలో విస్తృతంగా వ్యాపించింది. 2జీ కేసు వల్ల కాంగ్రెస్‌ పార్టీ గత ఎన్నికలలో భారీగా నష్టపోయింది. ఇప్పుడు న్యాయస్థానం ఆ కేసును కొట్టేయడంతో భారతీయ జనతా పార్టీకి కూడా నష్టం జరిగే ప్రమాదం ఉంది. 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీని ఆరాధించిన ప్రజలే ఇప్పుడు అనుమానంగా చూస్తున్నారు. ఎన్నికలలో గెలుపు కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారతారని మోదీపై వ్యాఖ్యలు చేస్తున్నారు.  గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఈ లక్షణాలు ఉండేవి. ఇప్పుడు అవే లక్షణాలను భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా నరేంద్ర మోదీ వంటబట్టించుకుంటున్నారని ప్రజలు నమ్ముతున్నారు. దొందూ దొందే అయితే మోదీ ప్రత్యేకత ఏమిటి? నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏమి సాధించారో ఇప్పటికీ చెప్పలేని స్థితిలో ఉంది మోదీ ప్రభుత్వం. గుజరాత్‌ ఎన్నికలలో అభివృద్ధి నినాదం మాయమై మతవాదం తెరపైకి వచ్చింది. ఫలితాల తర్వాత మాత్రం గుజరాత్‌లో అభివృద్ధికే ప్రజలు పట్టంకట్టారని ఇదే మోదీ చెప్పుకొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఉచ్ఛారణకు కూడా నోచుకోని అభివృద్ధి అనే పదం ఫలితాల తర్వాత మాత్రమే మోదీ నోటి వెంట వెలువడటాన్ని ప్రజలు గమనించారు. నాయకుడిపై అనుమానం రానే కూడదు. ఒక్కసారి అనుమానం వస్తే ప్రతి సందర్భంలోనూ అనుమానిస్తూనే ఉంటారు. 2జీ స్పెక్ట్రమ్‌ విషయంలో ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదే! కేసు నీరుగారిపోవడం వెనుక నరేంద్ర మోదీ పాత్ర ఉందో లేదో తెలియదు! అయినా ఉందనే ప్రజలు నమ్ముతున్నారు. ప్రజల నమ్మకాన్ని కోల్పోవడం అంటే అపజయం కాచుకుని ఉన్నట్టే! గుజరాత్‌లో గెలుపు వల్ల మోదీకి వ్యక్తిగతంగా మైలేజీ రాకపోగా డ్యామేజీ జరిగింది. పులి మీద పుట్రలా 2జీ స్పెక్ట్రమ్‌ కేసు తీర్పు వచ్చిపడింది. తన వ్యక్తిత్వం, విశిష్టతపై ప్రజలలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి నరేంద్ర మోదీ వెంటనే చర్యలు తీసుకోని పక్షంలో వచ్చే ఎన్నికల నాటికి ఆయన ప్రభ మరింత మసకబారుతుంది. రాజకీయ ప్రత్యర్థులను కేసులలో ఇరికించుకుంటూ పోవడం వల్ల కలిగే ప్రయోజనం ఎంతోకాలం నిలవదు. అధికారంలో ఉన్నవారు వ్యవహరించే తీరు, తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రమే ప్రజాభిప్రాయం అటూఇటూ మారుతుంటుంది. 2జీ కేసులో తీర్పు పుణ్యమా అని ఇకపై దేశంలో అవినీతి అనేది ప్రచారాస్త్రం కాబోదు. కాంగ్రెస్‌ పాలనలో అవినీతి జరిగిందని చెప్పలేని పరిస్థితికి ఇప్పుడు మోదీ వచ్చారు. దీనివల్ల తన పాలనలో అవినీతి లేదు అని గొప్పగా చెప్పుకొనే అవకాశం కూడా కోల్పోయారు. ఏదిఏమైనా ఇప్పటివరకు దేశాన్ని పాలించినవారందరిలోకి నరేంద్ర మోదీ భిన్నమైన, విశిష్టత కలిగిన వ్యక్తి అని మనందరం భావించాం! ఇప్పుడు మాత్రం ‘ఓస్‌ మోదీ కూడా ఇంతేనా?’ అని అందరూ కాకపోయినా చాలామంది అభిప్రాయపడుతున్నారు! గజం మిథ్య– పలాయనం మిథ్య! 2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణంపై సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో స్పెక్ట్రమ్‌ వేలంలో అక్రమాలకు పాల్పడటం ద్వారా లక్షా 76 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని నాటి కాగ్‌ డైరెక్టర్‌ జనరల్‌ వినోద్‌రాయ్‌ లెక్క తేల్చినప్పుడు దేశ ప్రజలంతా గుడ్లు తేలేశారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ–2 హయాంలో అంతా అవినీతేనని ప్రజలు భావించారు. ఫలితమే నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. ప్రధాని మోదీ దేశం నుంచి అవినీతిని పారదోలతారనీ, దేశాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తారనీ ప్రజలంతా నమ్మారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో నరేంద్ర మోదీ కూడా అవినీతి గురించి దేశ విదేశాలలో పదేపదే ప్రస్తావించారు. ఇప్పుడు 2జీ స్పెక్ట్రమ్‌ వ్యవహారంపై కోర్టు తీర్పు తర్వాత ఎన్నో సందేహాలు! ఎందుకంటే ఈ కుంభకోణం జరిగిందని యూపీఏ ప్రభుత్వం నింద భరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు జరిగిందంతా ప్రధాని మోదీ హయాంలోనే కావడంతో ఇప్పుడు ఎన్నో సందేహాలు! అదే సమయంలో దేశ ప్రజలలో నిస్పృహ! ఏ వ్యవస్థను నమ్మాలో– ఏ నాయకుడిని నమ్మాలో తెలియని అయోమయ పరిస్థితి! 2జీ స్పెక్ట్రమ్‌ కేసులో ప్రాసిక్యూషన్‌ అంటే సీబీఐ ఆసక్తి కోల్పోయిందని సీబీఐ కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య ఆందోళన కలిగించక మానదు. ఈ వ్యవహారంలో లక్షా 76 వేల కోట్ల రూపాయలు కాకపోయినా ఎంతో కొంత అవినీతి జరిగిందని ప్రజలంతా నమ్మారు. ఎందుకంటే లబ్ధి పొందిన కంపెనీల నుంచి నిందితురాలైన కనిమొళికి చెందిన టెలివిజన్‌ కంపెనీలోకి నిధులు ప్రవహించాయని సీబీఐ చెప్పింది. విచారణ సందర్భంగా ఆరోపణలను రుజువు చేయలేకపోవడం వల్ల కాంగ్రెస్‌కు రాజకీయ ప్రయోజనం కలిగి ఉండవచ్చు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం ఆత్మరక్షణలో పడింది. వీటన్నింటికీ మించి దేశమే వంచనకు గురైంది. అవును.. అధికారంలో ఎవరున్నా మనమంతా వంచనకు గురవుతూనే ఉన్నాం.  ప్రధాన రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుతున్న ఆటలో ప్రజలే వంచితులవుతున్నారు. స్పెక్ట్రమ్‌ కేసులో అవాస్తవాలను, కల్పితాలను పోగేశారనీ, ఆరోపణలను రుజువు చేయడంలో దర్యాప్తు సంస్థ దారుణంగా విఫలమైందనీ, ప్రాసిక్యూషన్‌ తీరు నిరాసక్తంగా ఉందనీ సీబీఐ కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పవలసిన సంస్థలు మౌనం దాల్చాయి. ఫలితంగా ప్రజల వేళ్లన్నీ కేంద్ర ప్రభుత్వం వైపే తిరిగాయి. ఎందుకంటే సీబీఐ గానీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో పనిచేస్తున్నాయి. సీబీఐ పంజరంలో చిలకలా మారిందని గతంలో సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారి ఆదేశాలకు అనుకూలంగా ఈ దర్యాప్తు సంస్థలు ఆడుతుంటాయని ప్రజలందరికీ తెలిసిందే! తాజా తీర్పు పర్యవసానాలకు ఎవరు బాధ్యత వహించాలన్నదే ఇప్పుడు ప్రశ్న! దేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణంగా ప్రచారం పొందిన 2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణం విషయంలోనే దర్యాప్తు సంస్థలు నిరాసక్తత ప్రదర్శిస్తే మిగతా కేసుల గతి ఏమిటి? ఈ కేసులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు తప్పు అయితే ఆ విషయాన్ని ఎవరూ ఎందుకు గట్టిగా చెప్పలేకపోయారు? సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసులో కిందిస్థాయి న్యాయమూర్తి ఆషామాషీగా తీర్పు ఇవ్వగలరా? నేరాన్ని రుజువు చేయడంలో దర్యాప్తు సంస్థలు ఎందుకింత ఘోరంగా విఫలం అయ్యాయి? కేసు తుస్సుమనడానికి కారకులు ఎవరు? వంటి ఎన్నో ప్రశ్నలు ప్రజల మెదళ్లను తొలుస్తున్నాయి. తీర్పు తర్వాత నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మాత్రం తాను ఆత్మస్తుతి చేసుకోదలుచుకోలేదని హుందాగా వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున స్పందించిన ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మాత్రం కాంగ్రెస్‌ పార్టీ సంబరాలు చేసుకోనక్కర్లేదని నిష్టూరం పోయారు. ఈ తీర్పు ఇలా రావడానికి ఎవరు కారణమో, ఎందుకో తెలియదు గానీ, దీనివల్ల కాంగ్రెస్‌ పార్టీకి నైతిక స్థయిర్యం పెరిగిందని చెప్పవచ్చు. ఈ పరిణామం ఆ పార్టీకి రాజకీయంగా కూడా టానిక్‌లా పనిచేస్తుంది. తమపై ఇంతకాలం తప్పుడు నిందారోపణలు చేశారని కాంగ్రెస్‌ నాయకులు చెప్పుకోకుండా ఎందుకుంటారు. ఈ వ్యవహారంలో కుంభకోణం జరిగిందా? లేదా? అన్నది న్యాయస్థానాలలో రుజువు చేయవలసిన బాధ్యత ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపైనే ఉంది. ఈ కేసు వల్ల రాజకీయంగా లబ్ధి పొందింది కూడా ఆ పార్టీనే కదా! తీర్పుకన్నా తీర్పులో భాగంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇప్పుడు దేశ ప్రజల దృష్టిలో కాంగ్రెస్‌పార్టీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తేడా లేదు! దర్యాప్తు సంస్థలు నిరాసక్తత ప్రదర్శించడానికి ప్రధానమంత్రి కారణమో కాదో తెలియదు గానీ, సగటు ప్రజలు మాత్రం ఆయననే అనుమానిస్తున్నారు. ద్రవిడ మోదీ కజగం!యాథృచ్ఛికంగానే కావచ్చుగానీ ఇటీవలే నరేంద్ర మోదీ చెన్నై పర్యటన సందర్భంగా డీఎంకే అధినేత కరుణానిధిని పరామర్శించడం, ఢిల్లీలో తన నివాసానికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలని సూచించడం ప్రజల అనుమానాలకు ఊతమిస్తోంది. స్పెక్ట్రమ్‌ కేసులో నిందితురాలైన కనిమొళి డీఎంకే అధినేత కూతురు కావడం, మరో ప్రధాన నిందితుడు, నాటి కేంద్ర మంత్రి ఎ.రాజా డీఎంకే నాయకుడు కావడం వల్ల ప్రధానమంత్రి పాత్ర ఉండి ఉంటుందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. తీర్పు తర్వాత సోషల్‌ మీడియాలో వెల్లువెత్తిన సెటైర్లు దేశ ప్రజల మనోగతానికి అద్దం పడుతున్నాయి. ఇప్పుడు డీఎంకేఅంటే ద్రవిడ మున్నేట్ర కజగం కాదు– ద్రవిడ మోదీ కజగం అని కొందరు చేసిన వ్యాఖ్య ప్రధాని మోదీ వ్యక్తిత్వానికి మచ్చగా మారింది. దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి జాడ్యాన్ని వదిలించే సత్తా ఉన్న నాయకుడు నరేంద్ర మోదీ అని దేశ ప్రజలు నిజంగా నమ్మారు. యూపీఏ పాలన అంతా అవినీతిమయమని చిరాకుపడి, ఆయనను ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. ఈ నమ్మకంతోనే గత మూడున్నరేళ్లుగా మోదీ తీసుకున్న అన్ని నిర్ణయాలనూ సమర్థించారు. ఆయా రాష్ర్టాలలో జరిగిన ఎన్నికలలో అనుకూలంగా తీర్పు ఇచ్చారు. పెద్దనోట్లను రద్దు చేసినా, హడావుడిగా జీఎస్టీ అమలుచేసినా అవినీతిని హరింపజేయడానికే ప్రధానమంత్రి సదరు నిర్ణయాలు తీసుకున్నారని భావించి కష్టాలను సైతం ఓర్చుకుని అండగా నిలబడ్డారు. ఇప్పుడు అదే ప్రజలు ఈ తీర్పు తర్వాత అదే నరేంద్ర మోదీపై సెటైర్లు వేస్తున్నారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ‘ఇక జగన్మోహన్‌రెడ్డి వంతు... ఆయన కూడా నిర్దోషి అని కోర్టులు తీర్పు ఇస్తాయి. ఎందుకంటే దర్యాప్తు సంస్థలు ఆధారాలు ఇవ్వలేవు కనుక’ అని సోషల్‌ మీడియాలో ప్రచారమైన వ్యాఖ్య ప్రజలలో నెలకొన్న నిరాశా నిస్పృహలకు నిదర్శనం కాదా! ‘బంద్‌ కరో ఏ నాటక్‌’ అని మరికొందరు అన్నారంటే ప్రజలలో గూడుకట్టుకున్న అసమ్మతి, ఆవేదన తెలియడం లేదా? ఈ వ్యాఖ్య ఎవరు చేశారో గానీ ఎంతకాలం ఈ నాటకాలు అని ప్రశ్నించుకోవలసిన తరుణం ఆసన్నమైంది. అవినీతికి సంబంధించిన కేసులు ఇలా నీరుగారిపోవడం వల్లనే అవినీతికి పాల్పడినవారు కూడా దర్జాగా ఎన్నికలలో పోటీ చేయగలుగుతున్నారు. అధికార అందలాలు అందుకుంటున్నారు.  ప్రజలమైన మనం మాత్రం పిచ్చోళ్లుగా మిగిలిపోతున్నాం. 2జీ స్పెక్ట్రమ్‌ కేసులో లక్షా 76 వేల కోట్ల రూపాయల అవినీతి జరగకపోయినా, ఎంతో కొంత అవినీతి జరగలేదా? ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకపోయినా ఒక కేంద్ర మంత్రిని, ఒక ఎంపీని జైలులో ఎందుకు పెట్టినట్టు? వారిని అరెస్ట్‌ చేసినప్పుడు వారిపై ఉన్న నేరారోపణను రుజువు చేయగలమా? లేదా? అన్న విషయం దర్యాప్తు సంస్థలకు తెలియదా? సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల ప్రతిష్ఠ ఏమి కావాలి? ఇలా అయితే ఈ దేశంలో అవినీతికి పాల్పడటం హక్కుగా మారదా? ఈ మధ్య చెన్నైలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తమ నివాస గృహాలపై దాడులు చేయడంపై శశికళ వర్గానికి చెందిన దినకరన్‌ స్పందిస్తూ, ‘మేము మాత్రమే అవినీతికి పాల్పడ్డామా? మిగతా వారంతా మహాత్మాగాంధీ వారసులా?’ అని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ తీర్పు తర్వాత ఎవరైనా ఇదే ప్రశ్న వేస్తారు.  ఎంత భారీ స్థాయిలో అవినీతికి పాల్పడినా ఏ తప్పూ చేయలేదని బుకాయించగలరు? బుకాయించే అవసరం కూడా లేదు– ఎందుకంటే వారు నిర్దోషులని తీర్పులు వచ్చేలా దర్యాప్తు సంస్థలే చూసుకుంటాయి. ఏదిఏమైనా అవినీతి అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకుని దేశ విదేశాలలో ఖ్యాతిని పెంచుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇప్పుడు ఆ అస్త్రం కూడా లేకుండా పోయింది. ఇకపై జరగనున్న ఎన్నికలలో ఆయన ఏ అంశాన్ని ఎత్తుకుంటారో చూడాలి. నరేంద్ర మోదీ రూపంలో ప్రజలలో ఇప్పటివరకు ఉన్న ఆశ కూడా ఇప్పుడు పోయింది. ఈయన కూడా ఇంతేనా? అని సగటు గృహిణి కూడా వ్యాఖ్యానించే పరిస్థితి ఇప్పుడు దేశంలో ఉంది. పాలకులకు ప్రజల మనోభావాలతో పనిలేదు. వారి రాజకీయ అవసరాలు వారివి! వాటికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఆ క్రమంలోనే ప్రజలలో ఆశలు రేకెత్తిస్తారు. అవసరం తీరాక ఆశలపై నీళ్లు పోస్తారు. మూలనపడిన చిన్నాచితక కేసులను కూడా వెలికితీసి రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెడుతున్నారే! 2జీ వంటి కేసులోనే తీర్పు ఇలా రావడానికి కారణమైన వారు ఏ మొహం పెట్టుకుని కొత్తగా కేసులు పెడతారు? అయినా అవినీతి అనేది ఈ దేశంలో ఒక మిథ్య! జరిగినట్టు ఉంటుంది కానీ జరగదనుకోవాలి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా ఇకపై తల ఎగరేసి తిరగవచ్చు. కోర్టు తీర్పు అనేది కేవలం సర్టిఫికెట్‌ మాత్రమే! ఆ సర్టిఫికెట్‌ కావాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్నవారితో సఖ్యతగా మెలిగితే చాలు. అంతా పైవారే చూసుకుంటారు. కేసులు కూడా రాజకీయ కారణాలతో నమోదు కావడమే అన్నింటికీ మించిన విషాదం.  కర్ణాటకకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకుడిని కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఒత్తిడి తెచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాడు అధికారంలో ఉన్న దివంగత రాజశేఖర్‌రెడ్డి స్వయంగా పూనుకుని ఆ నాయకుడిపై ఒత్తిడి తెచ్చారు. అయినా సదరు నాయకుడు లొంగలేదు. దీంతో ఆగ్రహించిన అప్పటి ఢిల్లీ పెద్దలు ఆయన మైనింగ్‌ అక్రమాలకు పాల్పడినట్టు సీబీఐతో కేసు నమోదు చేయించారు. మన దగ్గర జగన్మోహన్‌రెడ్డి విషయమే తీసుకుందాం! ఆయన బుద్ధిగా కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగి, సోనియాగాంధీకి విధేయత ప్రదర్శించి ఉంటే సీబీఐ కేసుల్లో ఇరుక్కునేవాడు కాదన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే! ఈ రెండు సందర్భాలలోనూ సదరు వ్యక్తులు తప్పు చేశారా? లేదా? అని కాకుండా రాజకీయ కారణాలే వారిపై కేసులు నమోదు కావడానికి కారణమయ్యాయి. అక్రమాలకు పాల్పడినా, రాజకీయంగా ఉపయోగపడితే కేసులు కూడా ఉండవన్న మాట!  న్యాయస్థానాల జోక్యంతో కేసులు నమోదు అయినా తర్వాత కాలంలో రాజకీయ ప్రయోజనం ఉందనుకుంటే సదరు కేసులను నీరుగారుస్తారు. 2జీ స్పెక్ట్రమ్‌ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఉండకపోతే అసలు కేసే నమోదు అయ్యేది కాదు. యూపీఏ హయాంలో కేసు నమోదు అయితే ఎన్‌డీఏ హయాంలో తీర్పు వచ్చింది. జగన్మోహన్‌రెడ్డితో పాటు కర్ణాటక బీజేపీ నాయకుడిపై కూడా యూపీఏ హయాంలోనే కేసులు నమోదయ్యాయి. ఎన్‌డీఏ హయాం వచ్చినా ఇంకా వారిపై తీర్పులు రాలేదు. తీర్పులు ఎప్పుడు వస్తాయో తెలియదు. జరుగుతున్న తంతును చూస్తే డీల్‌ కుదరలేదని భావించవలసి ఉంటుంది. పాలకులకు, నిందితులకు మధ్య డీల్‌ కుదిరితే దర్యాప్తు ఒకలా, డీల్‌ కుదరకపోతే మరొకలా ఉంటే అవినీతిపరుల గురించి మాట్లాడే అర్హత నరేంద్ర మోదీకే కాదు– ఎవరికీ ఉండదు. అవినీతి, కుంభకోణాలు ఆటలో అరటిపండులా మారిపోతున్నాయి. ఎవరో ఆట మొదలుపెడతారు, మరెవరో ఆట ముగిస్తారు! మధ్యలో జనాన్ని పిచ్చివాళ్లను చేస్తారు. 2జీ కేసులో దర్యాప్తు మధ్యలో సీబీఐ ఆసక్తి కోల్పోయింది అని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యకు సమాధానం తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు లేదా? ఉంటే న్యాయమూర్తి వ్యాఖ్య నిజమా? కాదా? అన్నది స్పష్టంచేయాలి. తీర్పుపై అప్పీలు చేసినంత మాత్రాన ఒరిగేది ఏమి ఉంటుంది? అక్కడ కూడా ఆసక్తి చూపుతారన్న గ్యారంటీ ఏమి ఉంది? మన దేశంలో ప్రజలకు ఉన్నది ఓటు హక్కు మాత్రమే! మిగతా ఏ హక్కులూ లేవనుకోవాలి. ఏ రాజకీయ పార్టీ ఎక్కువ రసవత్తరంగా నాటకం ప్రదర్శిస్తే ఆ పార్టీకి ఓటేసి బాధ్యత తీరిందనుకుంటాం. అలా ఎందుకు జరిగింది? ఇలా ఎందుకు జరిగింది? అని ప్రశ్నించడం వ్యర్థమే అవుతుంది. తాజా తీర్పు పుణ్యమా అంటూ కేసులలో చిక్కుకున్న వారిలో ఆత్మస్థైర్యం పెరిగింది. డీల్‌ కుదుర్చుకుంటే నిరాసక్తత ప్రదర్శించడానికి దర్యాప్తు సంస్థలు సిద్ధంగా ఉంటాయి కదా! మనకు తెలిసిన జగన్మోహన్‌రెడ్డి, గాలి జనార్ధన్‌రెడ్డి ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటూ ఉండి ఉండవచ్చు. డీల్‌ కుదిరితే ఏమవుతుందో జగన్మోహన్‌రెడ్డి కేసులో ఇదివరకే కొంత రుజువయ్యింది. ఆయనకు బెయిల్‌ రావడానికి ముందు తాము దాఖలు చేసిన చార్జ్‌షీట్‌కు భిన్నంగా కొన్ని సంస్థలలో క్విడ్‌ప్రోకో జరగలేదని సీబీఐ అధికారులే స్వయంగా అఫిడవిట్‌ దాఖలు చేశారు. దీంతో ఆయనకు బెయిల్‌ లభించింది. ఇంతకాలానికి ఇప్పుడు ఎక్కడ ఏమి బెడిసికొట్టిందో తెలియదు గానీ క్విడ్‌ప్రోకో జరగలేదని తాము దాఖలు చేసిన అఫిడవిట్‌ను ఉపసంహరించుకుంటున్నామంటూ సీబీఐ మరొక కొత్త అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఎటొచ్చీ రాజకీయంగా ఏ మాత్రం ఉపయోగం లేనివారు మాత్రం అవినీతికి పాల్పడిన సందర్భాలలో శిక్షకు గురవుతారు. దీన్నిబట్టి ఎవరు అవినీతికి పాల్పడవచ్చు, ఎవరు అవినీతికి పాల్పడకూడదో నిర్ణయించుకోవలసింది కూడా సదరు వ్యక్తులే! దేశం ఏమయ్యేట్టు?ఈ విషయం అలా ఉంచితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అచ్చే దిన్‌ పోతున్నట్టుగా అనిపిస్తోంది. తాజా పరిణామాలు ఈ అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. గుజరాత్‌ ఎన్నికలలో ఆయన సాంకేతికంగా గెలిచినా నైతికంగా ఓడిపోయారు. 2జీ స్పెక్ట్రమ్‌ కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉన్నా, లేకపోయినా సీబీఐ కోర్టు తీర్పు అలా రావడానికి ఆయన ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తోంది. ఇటీవలి కాలంవరకు నరేంద్ర మోదీ కీర్తిప్రతిష్ఠలు ఆకాశమే హద్దుగా పెరిగినా, ఇటీవలి కాలంలో తిరుగుముఖం పట్టాయని చెప్పవచ్చు. గుజరాత్‌ ఎన్నికలలో విజయం సాధించడానికై ప్రధానమంత్రి స్థాయినే కాకుండా, ఆయన తన వ్యక్తిత్వాన్ని కూడా దిగజార్చుకున్నారు. గుజరాత్‌లో అత్తెసరు మెజారిటీతో బయటపడటానికి ఏమి చేసిందీ తెలుసు కనుకే ఈ విజయం వెనుక ఎంతో కష్టం ఉందని చెబుతూ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నరేంద్ర మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. గుజరాత్‌లో గెలుపు కోసం ప్రధాన రాజకీయపార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు అనుసరించిన ఎత్తుగడలు రాజకీయాలలో విలువలు ఆశించేవారికి రోత పుట్టించాయి.  ఒక రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ, కాలం కలిసివస్తే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్న రాహుల్‌గాంధీ ముఖాముఖి తలపడ్డారు. ఒకరు మతవాదాన్ని నెత్తికెత్తుకోగా, మరొకరు కులవాదాన్ని అందిపుచ్చుకున్నారు. ఇద్దరూ కలిసి భిన్నత్వంలో ఏకత్వంలా సాగిపోతున్న భారతదేశంలో మతతత్వాన్ని, కులతత్వాన్ని రెచ్చగొట్టారు. గుజరాత్‌లో దళితులు, పాటీదారులు, బీసీలను రాహుల్‌గాంధీ అక్కున చేర్చుకోగా, గుజరాతీయులలో మరో పర్యాయం హిందూ మనోభావాలను ప్రేరేపించే ప్రయత్నం నరేంద్ర మోదీ చేశారు. ఈ దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి, ప్రధానమంత్రి అవుదామనుకునే ఏ అభ్యర్థి కూడా ఇంతకు మునుపు ఇలా వ్యవహరించలేదు. ఈ ఖ్యాతి నరేంద్ర మోదీ, రాహుల్‌గాంధీకే దక్కింది. అంత ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులే తమ రాజకీయ ప్రయోజనాల కోసం కుల– మత తగవులను రెచ్చగొడితే, భిన్నత్వంలో ఏకత్వం ఏమి కావాలి? దేశ సమగ్రత, సమైక్యత ఏమి కావాలి? అని ఆలోచనాపరులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎవరి ఆవేదన ఎలా ఉన్నా ఆ ఇద్దరు నాయకులకు గుజరాత్‌ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. అందుకే వారు అంతలా దిగజారి ఉంటారు. గుజరాత్‌లో నరేంద్ర మోదీకి ఓటమి అనే ఎదురు దెబ్బ తగలాలని చాలామంది కోరుకున్నారు. గుజరాత్‌లో ఓడిపోతే తాను బలహీనపడిపోతానన్న విషయం నరేంద్ర మోదీకి అందరికన్నా ఎక్కువ తెలుసు. అందుకే ఆయన సర్వశక్తులూ ఒడ్డటమే కాకుండా సరికొత్త ఎజెండాను తెరపైకి తెచ్చారు.  22 సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా ఆరో పర్యాయం గెలవడం సామాన్యమైన విషయం కాదని బీజేపీ నాయకులు చెప్పుకొంటున్నారు. అయితే వారు తెలుసుకోవలసింది ఇంకొకటి ఉంది. 22 సంవత్సరాలుగా అధికారంలో లేకపోయినా కాంగ్రెస్‌ పార్టీ 80 స్థానాలను గెల్చుకోవడం కూడా సామాన్యమైన విషయం కాదు. కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉన్నందువల్లనే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్నా క్యాష్‌ చేసుకోలేకపోయిందన్నది వాస్తవం. ఇప్పుడున్న రాజకీయాలలో అధికారం లేకపోతే బతకలేని స్థితిలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆర్థిక వనరుల విషయంలో బీజేపీ ముందు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్‌ పార్టీ నిలబడలేకపోయింది. మూడున్నరేళ్ల క్రితం పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ఈ దుస్థితి ఎందుకంటే, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తులు ఆర్థికంగా లాభపడతారు. పార్టీ కాదు. ఇప్పుడు బీజేపీ విషయంలో అలా కాదు. పార్టీనే ఆర్థికంగా పటిష్ఠంగా ఉంది. గుజరాత్‌లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని నిధులు సమకూర్చినవారు చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఈ వెసులుబాటు లేకపోవడం కూడా ఆ పార్టీ ఓటమికి ఒక కారణం. గుజరాత్‌ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని మెట్లు దిగజారగా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కొన్ని మెట్లు పైకి ఎగబాకారు. గుజరాత్‌ ఎన్నికలు జరిగే వరకు రాహుల్‌గాంధీని పప్పు అనే ప్రజలు కూడా భావించారు. ఆయన నాయకత్వంలో తమకు భవిష్యత్తు ఉంటుందా? అని కాంగ్రెస్‌ శ్రేణులు దిగాలుగా ఉండేవి. అలాంటి రాహుల్‌గాంధీ గుజరాత్‌లో తిరుగులేని శక్తిగా ఉన్న నరేంద్ర మోదీని ఎదుర్కొని నిలబడటం ఆషామాషీ కాదు. అలవోకగా గెలవవలసిన గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ముచ్చెమటలు పట్టించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఓటమికి సాకులు వెతకకుండా ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పడం ద్వారా రాహుల్‌గాంధీ పరిణతి ప్రదర్శించారు. మొత్తంమీద ఆయన నాయకత్వంపై కాంగ్రెస్‌ శ్రేణులకు ఇప్పుడిప్పుడే భరోసా ఏర్పడుతోంది. మున్ముందు ఆయన ప్రదర్శించే పరిణతిని బట్టి కాంగ్రెస్‌ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.  ఇక ప్రధాని నరేంద్ర మోదీ విషయానికి వస్తే దేశంలో కాంగ్రెసేతర నాయకులెవరికీ లభించని ఆదరణ అలనాడు లభించింది. ప్రజలు ఆయనపై అంతులేని నమ్మకాన్ని పెట్టుకున్నారు. మోదీ పదేళ్లపాటు అధికారంలో కొనసాగితే దేశం బాగుపడుతుందని ఆశించారు. అయితే జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆందోళనకరంగా ఉంటున్నాయి. 2019లో జరిగే ఎన్నికలలో కూడా మోదీకే అధికారం అని మొన్నటివరకు అందరూ భావించారు. ఇప్పుడు గుజరాత్‌ ఫలితాల తర్వాత వారిలో ఈ అభిప్రాయం మారుతోంది. సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనే అంత వ్యతిరేకత ఉంటే మిగతా రాష్ర్టాలలో పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇంతలోనే అంత మార్పు ఎందుకు? అన్న విషయంలో ప్రధానమంత్రి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒంటెత్తు పోకడలు, నియంతృత్వానికి తావు ఉండదు. కానీ నరేంద్ర మోదీలో ఈ రెండు లక్షణాలూ పుష్కలంగా ఉన్నాయి. పార్టీలో, ప్రభుత్వంలో ఏమి జరుగుతున్నదో ఎవరికీ ఏమీ తెలియని పరిస్థితి కల్పించారు. అనుకున్నదే తడవుగా ముందూ– వెనుకా ఆలోచించకుండా పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఫలితమే ఇప్పుడు ప్రతికూల పవనాలు వీయడం మొదలయ్యింది.  ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్‌ పార్టీ 18 రాష్ర్టాలలో అధికారంలో ఉండగా, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆ రికార్డును బద్దలుకొట్టిందనీ, 19 రాష్ర్టాలలో అధికారంలో ఉందనీ ప్రధాని మోదీ గొప్పగా ప్రకటించుకున్నారు. అయితే సంఖ్యాపరంగా ఇది వాస్తవం కావచ్చు గానీ అసలు విషయం వేరే ఉంది. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ర్టాలు ఏర్పడలేదు. ఈ మూడు రాష్ర్టాలు మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌లో కలిసి ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే బీజేపీ ఇప్పుడు 16 రాష్ర్టాలలోనే అధికారంలో ఉన్నట్టు! ఇందిరాగాంధీని మించిపోవాలంటే మరో మూడు రాష్ర్టాలను బీజేపీ తన ఖాతాలో వేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులలో అది సాధ్యమా? అన్న సందేహాలు నెలకొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి రాజస్థాన్‌, హరియాణ, మధ్యప్రదేశ్‌లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని చెబుతున్నారు. దక్షిణాదిన ఆ పార్టీకి ఇంకా పట్టు చిక్కలేదు. తమిళనాడులో పాగా వేయడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయి. తాజాగా 2జీ స్పెక్ట్రమ్‌ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెడకు చుట్టుకుంటోంది. దేశ ప్రజలందరూ ఆయనను అనుమానంగా చూస్తున్నారు. డీఎంకేతో దోస్తీ కోసమే కేసును నీరుగార్చారని ప్రజలలో విస్తృతంగా వ్యాపించింది. 2జీ కేసు వల్ల కాంగ్రెస్‌ పార్టీ గత ఎన్నికలలో భారీగా నష్టపోయింది. ఇప్పుడు న్యాయస్థానం ఆ కేసును కొట్టేయడంతో భారతీయ జనతా పార్టీకి కూడా నష్టం జరిగే ప్రమాదం ఉంది. 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీని ఆరాధించిన ప్రజలే ఇప్పుడు అనుమానంగా చూస్తున్నారు. ఎన్నికలలో గెలుపు కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారతారని మోదీపై వ్యాఖ్యలు చేస్తున్నారు.  గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఈ లక్షణాలు ఉండేవి. ఇప్పుడు అవే లక్షణాలను భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా నరేంద్ర మోదీ వంటబట్టించుకుంటున్నారని ప్రజలు నమ్ముతున్నారు. దొందూ దొందే అయితే మోదీ ప్రత్యేకత ఏమిటి? నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏమి సాధించారో ఇప్పటికీ చెప్పలేని స్థితిలో ఉంది మోదీ ప్రభుత్వం. గుజరాత్‌ ఎన్నికలలో అభివృద్ధి నినాదం మాయమై మతవాదం తెరపైకి వచ్చింది. ఫలితాల తర్వాత మాత్రం గుజరాత్‌లో అభివృద్ధికే ప్రజలు పట్టంకట్టారని ఇదే మోదీ చెప్పుకొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఉచ్ఛారణకు కూడా నోచుకోని అభివృద్ధి అనే పదం ఫలితాల తర్వాత మాత్రమే మోదీ నోటి వెంట వెలువడటాన్ని ప్రజలు గమనించారు. నాయకుడిపై అనుమానం రానే కూడదు. ఒక్కసారి అనుమానం వస్తే ప్రతి సందర్భంలోనూ అనుమానిస్తూనే ఉంటారు. 2జీ స్పెక్ట్రమ్‌ విషయంలో ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదే! కేసు నీరుగారిపోవడం వెనుక నరేంద్ర మోదీ పాత్ర ఉందో లేదో తెలియదు! అయినా ఉందనే ప్రజలు నమ్ముతున్నారు. ప్రజల నమ్మకాన్ని కోల్పోవడం అంటే అపజయం కాచుకుని ఉన్నట్టే! గుజరాత్‌లో గెలుపు వల్ల మోదీకి వ్యక్తిగతంగా మైలేజీ రాకపోగా డ్యామేజీ జరిగింది. పులి మీద పుట్రలా 2జీ స్పెక్ట్రమ్‌ కేసు తీర్పు వచ్చిపడింది. తన వ్యక్తిత్వం, విశిష్టతపై ప్రజలలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి నరేంద్ర మోదీ వెంటనే చర్యలు తీసుకోని పక్షంలో వచ్చే ఎన్నికల నాటికి ఆయన ప్రభ మరింత మసకబారుతుంది. రాజకీయ ప్రత్యర్థులను కేసులలో ఇరికించుకుంటూ పోవడం వల్ల కలిగే ప్రయోజనం ఎంతోకాలం నిలవదు. అధికారంలో ఉన్నవారు వ్యవహరించే తీరు, తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రమే ప్రజాభిప్రాయం అటూఇటూ మారుతుంటుంది. 2జీ కేసులో తీర్పు పుణ్యమా అని ఇకపై దేశంలో అవినీతి అనేది ప్రచారాస్త్రం కాబోదు. కాంగ్రెస్‌ పాలనలో అవినీతి జరిగిందని చెప్పలేని పరిస్థితికి ఇప్పుడు మోదీ వచ్చారు. దీనివల్ల తన పాలనలో అవినీతి లేదు అని గొప్పగా చెప్పుకొనే అవకాశం కూడా కోల్పోయారు. ఏదిఏమైనా ఇప్పటివరకు దేశాన్ని పాలించినవారందరిలోకి నరేంద్ర మోదీ భిన్నమైన, విశిష్టత కలిగిన వ్యక్తి అని మనందరం భావించాం! ఇప్పుడు మాత్రం ‘ఓస్‌ మోదీ కూడా ఇంతేనా?’ అని అందరూ కాకపోయినా చాలామంది అభిప్రాయపడుతున్నారు!
editorial
13,903
19-10-2017 02:36:50
ఒడిసాలో బాణసంచా పేలుడు.. ఆరుగురి మృతి
ఒడిసాలోని బాలాసోర్‌ జిల్లా బాహబల్‌పూర్‌లో మందుగుండు సామగ్రి విస్ఫోటం ఆరుగురి ప్రాణాలను బలిగొంది. మరో 9మంది తీవ్ఠ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నారు. అనుమతి లేని బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించడంతో ఈ ఘోర విషాదం చోటు చేసుకుంది. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమై చెల్లాచెదురుగా పడ్డాయి. విస్ఫోటం తీవ్రతకు ఫ్యాక్టరీ భవనం శిథిలమైంది. ఊరంతా ఉలిక్కిపడింది.
nation
17,746
12-04-2017 18:23:22
కుల్‌భూషణ్‌ను ఉరితీస్తే తీవ్ర పరిణామాలు..
న్యూఢిల్లీ: భారత నావికాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌పై విధించిన మరణశిక్షను తక్షణం రద్దు చేయకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజె కురియన్ పాకిస్థాన్‌ను బుధవారంనాడు హెచ్చరించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలకు తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా పాక్‌ తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవలసి ఉంటుందని మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు. 'కుల్‌భూషణ్‌కు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు లేవు. అన్నీ కల్పిత ఆరోపణలే. ఇలాంటి చర్య వల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలు తీవ్ర చిక్కుల్లో పడతాయని, అందువల్లే తమకే ఎక్కువ సమస్యలు ఎదురవుతాయనే విషయం పాక్‌కు బాగా తెలుసు' అని కురియన్ వ్యాఖ్యానించారు. పాక్ చర్యకు ప్రతిగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్లమెంటు సభ్యులంతా ప్రభుత్వానికి అండగా ఉంటారని అన్నారు. మరోవైపు, కుల్‌భూషణ్‌ను వెంటనే ఉరితీయబోవడం లేదని, 60 రోజుల్లోగా ఆర్మీ కోర్టుకు ఆయన అప్పీల్ చేసుకోవచ్చని పాక్ పేర్కొంది. అయితే, ఆర్మీ చట్టం 1952లోని 131 సెక్షన్ ప్రకారం, ఇలాంటి సందర్భాల్లో 60 రోజల్లో కాకుండా 40 రోజుల్లోనే అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
nation
5,895
22-08-2017 17:53:58
విజయ్ దేవరకొండ చేతికి చిక్కిన శర్వానంద్ సినిమా
వరుస విజయాల్లో ఉన్న హీరో ఓ డిఫరెంట్ సబ్జెక్ట్‌కు నో చెప్పాడట. అదికాస్తా మరో యంగ్ హీరో చేతికి చిక్కింది. ఓ హీరో కాదనుకున్న సబ్జెక్ట్‌ను ఏరికోరి ఎంచుకున్న ఆ మరో హీరోకు ఇప్పుడది హిట్‌ను ఇస్తుందా అనేది హాట్ టాపిక్. విజయ్ దేవరకొండ అనగానే 'పెళ్లిచూపులు' సినిమా వెంటనే గుర్తొస్తుంది. 'ఎవడే సుబ్రహ్మణ్యం' సహా అప్పటికే మరో రెండు చిత్రాల్లో నటించినప్పటికీ గుర్తింపును అందించింది మాత్రం 'పెళ్లిచూపులు' సినిమానే. ఈ సినిమా తర్వాత 'ద్వారక' అనే మరో చిత్రంలో నటించినప్పటికీ నిరాశనే మిగిల్చింది. ఇక త్వరలో 'అర్జున్ రెడ్డి' అనే సినిమాతో జనం ముందుకొస్తున్నాడు ఈ యంగ్ హీరో. సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఫస్ట్ లుక్ మొదలు ట్రైలర్ వరకూ ఇప్పటివరకూ వచ్చిన ప్రచారాస్త్రాలన్నీ సినిమాపై బోలెడు క్యూరియాసిటీ పెంచేశాయి. అసలు అంచనాలకు అంతుచిక్కనంత క్వశ్చన్ మార్క్‌గా ఉంది 'అర్జున్ రెడ్డి' క్యారెక్టర్. ఇంత డిఫరెంట్‌గా ఈ క్యారెక్టర్ ను క్రియేట్ చేసింది. అసలు విజయ్ దేవరకొండ కోసమే కాదట. ఓ హీరో సినిమా మరో హీరో చేతికి చిక్కడం కామన్. 'అర్జున్ రెడ్డి' సినిమాను కూడా తొలుత శర్వానంద్ తో చేయాలనుకున్నాడట దర్శకుడు సందీప్ రెడ్డి. శర్వానంద్‌కు కథ కూడా వినిపించాడట కానీ కారణాంతరాల వల్ల ఈ సినిమాలో నటించలేదు. అది కాస్తా.. విజయ్‌కు చేరింది. సబ్జెక్ట్ డిఫరెంట్‌గా ఉండి తెగ నచ్చేయడంతో ఈ సినిమాలో నటించాడు విజయ్ దేవరకొండ. మరి శర్వానంద్ ఎందుకు కాదనుకున్నాడో, విజయ్ ఎందుకు కనెక్ట్ అయ్యాడో తెలియాలంటే.. ఈ నెల 25 వరకూ ఆగాల్సిందే..!
entertainment
9,840
11-09-2017 02:56:17
అన్నదమ్ములందరికీ ‘జై లవ కుశ’ అంకితం
‘‘ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో గానీ ఈ జన్మలో ఇంతమంది అభిమానుల ప్రేమ, అభిమానం, వాత్సల్యం దక్కింది. మరో జన్మంటూ ఉంటే అప్పుడు నా కన్నవారి రుణం తీర్చుకుంటాను. ఈ జన్మకు మాత్రం అభిమానులతో ఉండిపోతాను’’ అని ఎన్టీఆర్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జై లవ కుశ’. బాబీ (కె.ఎ్‌స.రవీంద్ర) దర్శకుడు. నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మాత. ఆదివారం శిల్పకళావేదికలో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ కార్యక్రమం జరిగింది. దర్శకులు వి.వి.వినాయక్‌, సుకుమార్‌, కొరటాల శివ ట్రైలర్‌ విడుదల చేశారు. ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘‘మంచి కొడుకుగా, తమ్ముడిగా, భర్తగా తండ్రిగా ఉండటానికి ప్రయత్నిస్తాను కానీ ఫ్యాన్స్‌ దగ్గర మాత్రం ప్రయత్నం ఉండదు. మీకు నచ్చేవరకూ, గర్వంగా తలెత్తుకు తిరిగే వరకూ పోరాడుతూనే ఉంటా. మంచి చిత్రాలు తీసి మీ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తా.  ఈ సినిమా విషయానికొస్తే.. జై, లవ, కుశ.. ఈ మూడింటిలో ఏ పాత్ర లేకపోయినా ఈ సినిమాకు అర్థం లేదు. దేవుడు చల్లగా చూశాడు.. అభిమానులు ప్రోత్సహిస్తున్నారు.. నా దర్శకులు ఫోక్‌స్డగా ఉన్నారు కాబట్టే ఈ స్థాయిలో ఉన్నాను. ఈ మూడింటిలో ఏది తక్కువైనా ‘జై లవకుశ’ సినిమా ఉండేది కాదేమో! ‘అభిమానులు గర్వంగా చెప్పుకునేలా ఉండాలి, ఎంత బాగా తీశారని అమ్మానాన్న అనుకోవాలి, అద్భుతమైన సినిమా తీశామని మనిద్దరం అనుకోవాలి’ అని అన్నయ్యతో చెప్పా. బాబీ కథ చెప్పాక మా డ్రీమ్‌ అంతా ఈ కథలోనే ఉందనిపించింది. వారం రోజులు తర్వాత ఇద్దరు ఆప్తులకు ఈ కథ చెప్పాం. వాళ్లకీ బాగా నచ్చింది. సినిమా హిట్‌ అయితే ఆ ఇద్దరూ ఎవరో బయటికి చెప్తా. సినిమా బాగుంటుందనీ, మా కుటుంబంతో పాటు అభిమానులు గర్వించేలా ఉంటుందనీ నమ్ముతున్నా. బాబీకి బిడ్డలాంటి సినిమా ఇది. అతని నమ్మకమే మా మొదటి సక్సెస్‌. దేవిశ్రీప్రసాద్‌ నాకు ఎప్పుడూ మంచి పాటలే ఇస్తాడు. ‘జై లవకుశ’ అందరి గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకుంటుందన్న నమ్మకం ఉంది. ప్రపంచంలోని అన్నదమ్ములందరికీ ఈ సినిమా అంకితం’’ అని అన్నారు. ‘దానవీర శూరకర్ణ’ గుర్తొచ్చిందికల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘‘బాబీ టైటిల్‌తో సహా పది నిమిషాల కథ చెప్పగానే ‘దానవీర శూరకర్ణ’ గుర్తొచ్చింది. తాతగారు నటించిన ఆ సినిమాను ఇంకొకరు టచ్‌ చేయకూడదని నా వ్యక్తిగత అభిప్రాయం. అంత గొప్ప కథను తారక్‌ తప్ప మరో నటుడు చెయ్యలేడనిపించింది. తనకి కథ చెప్పి ‘ఈ పాత్ర నువ్వు తప్ప మరొకరు చెయ్యలేరు’ అన్న తర్వాత కూడా వారంరోజులు ఆలోచించాడు. కాలికి దెబ్బ తగిలిన విషయం కూడా పట్టించుకోనంతగా క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్‌ అయిపోయాడు. అవుట్‌పుట్‌ చూశాక ‘దానవీర శూరకర్ణ’ తరహా హిట్‌ అవుతుందని తమ్ముడికి చెప్పాను. బాబీ డైరెక్షన్‌ ఎందుకన్నవారంతా ఆశ్చర్యపోతారు. నాకూ, తమ్ముడికి డబ్బు ముఖ్యం కాదు. రిలేషన్‌ ముఖ్యం. అతనికి నేషనల్‌ అవార్డ్‌ వస్తుందని నమ్మకం’’ అని తెలిపారు. హరికృష్ణ మాట్లాడుతూ ‘‘బ్యానర్‌కు ఎన్టీఆర్‌గారి పేరు పెట్టి.. ఆయన పేరున్న జూ.ఎన్టీఆర్‌తో సినిమా ఎప్పుడు చేస్తారు’ అని స్వర్గీయ జానకీరామ్‌ ఈ సినిమాకు బీజం వేశాడు. నాన్నగారి ఆశీస్సులు ఎప్పుడూ మాకుంటాయి. అభిమానుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది’’ అని అన్నారు. ‘‘రావణ క్యారెక్టర్‌ చెయ్యడానికి తారక్‌ చాలా హోమ్‌వర్క్‌ చేశాడు. మూడు పాత్రల్ని విభిన్నంగా చేశాడు. తమ్ముడికి అన్న ఇస్తున్న కానుక ఈ సినిమా. అన్నదమ్ములిద్దరూ వాళ్ల తండ్రికి ఇస్తున్న కానుక’’ అని వినాయక్‌ అన్నారు. ‘‘తారక్‌లో టన్నుల కొద్దీ నటన ఉంది. దాన్లో ఒక లోటా మాత్రమే నేను తీసుకున్నా. పరిశ్రమలో ఆయన గొప్ప నటుడని కాలర్‌ ఎగరేసి చెప్పొచ్చు. నా కలను సినిమా రూపంలో తెరకెక్కించడానికి వెన్నెముకగా నిలిచారు తారక్‌’’ అని బాబీ చెప్పారు.
entertainment
1,558
07-01-2017 00:51:04
నాట్కో కేన్సర్‌ ఔషధానికి ఎఫ్‌డిఎ ఆమోదం
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొన్ని రకాల కేన్సర్‌ వ్యాధుల చికిత్సలో వినియోగించే బెండాముస్టైన్‌ హైడ్రోక్లోరైడ్‌ ఇంజక్షన్‌కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి (యు‌ఎస్‌ఎఫ్‌డి‌ఎ) నుంచి అనుమతి లభించిందని నాట్కో ఫార్మా వెల్లడించింది. ఈ ఔషధ జెనరిక్‌ వెర్షన్‌ కోసం పేరా గ్రాఫ్‌- 4 కింద అబ్రివేటెడ్‌ న్యూడ్రగ్‌ అప్లికేషన్‌ (అండా)కు ఎఫ్‌డిఎ నుంచి తుది ఆమోదం అందుకున్నట్లు తెలిపింది. బెండాముస్టైన్‌ హైడ్రోక్లోరైడ్‌ పౌడర్‌ 25 ఎంజి/వైయల్‌, 100 ఎంజి/వైయల్‌ (సింగిల్‌ డోసేజ్‌)కు ఈ అనుమతి లభించిందని పేర్కొంది. అమెరికాలో మార్కెటింగ్‌ భాగస్వామి బ్రెకెన్‌ రిడ్జ్‌ ఫార్మాసుటికల్‌ ఇంక్‌ ద్వారా 2019 నవంబర్‌ 1న ఈ ఔషధాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నాట్కో తెలిపింది. ఫస్ట్‌ టు ఫైల్‌ డేట్‌కు లోబడి పేరాగ్రాఫ్‌ -4 కింద ఇరు సంస్థలు ఈ అండాను ఎఫ్‌డిఎకు దాఖలు చేశాయి. కాగా ఈ ఔషధానికి సంబంధించి ఇతర అండా ఫస్ట్‌ ఫైలర్స్‌తో కలిసి 180 రోజుల విక్రయ హక్కులను పంచుకునే అవకాశం లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు నాట్కో తెలిపింది. ప్రస్తుతం అమెరికా మార్కెట్లో టెవా కంపెనీ సెఫాలోన్‌.. ట్రెండా బ్రాండ్‌ కింద బెండాముస్టైన్‌ హైడ్రోక్లోరైడ్‌ ఇంజక్షన్‌ను విక్రయిస్తోంది. ఈ ఔషధాన్ని ప్రాణాంతక లింఫోసైటిక్‌ లుకేమియా (సిఎల్‌ఎల్‌), నాన్‌ హోడ్గ్కిన్‌ లింఫోమా వ్యాధి చికిత్సలో వినియోగిసున్నారు. 2016 నవంబరు నెలతో ముగిసిన పన్నెండు నెలల కాలానికి గాను అమెరికా మార్కెట్లో ట్రెండా ఔషధ విక్రయాలు 13.3 కోట్ల డాలర్లుగా ఉన్నాయి.
business
11,938
29-07-2017 01:57:30
మొగుళ్లంటే చులకనా!
సంపాదనలో మూడొంతులు భరణమా?అనాలోచిత ఆదేశాలు వద్దు: హైకోర్టుచెన్నై, జూలై 28: ‘‘మొగుళ్లంటే నిరాయుధులు, నిస్సహాయులు కాదు! భార్యకు చెల్లించాల్సిన భరణంపై అనాలోచితంగా ఆదేశాలు ఇవ్వొద్దు’’ అని కింది కోర్టులను మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది. వృద్ధులైన తన తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత కూడా పురుషుల పై ఉంటుందని గుర్తుంచుకోవాలని సూచించింది. ‘‘ఇవేవీ పట్టించుకోకుండా మాజీ భార్యకు తన సంపాదనలో మూడింట రెండొంతులు భరణంగా ఇచ్చేయం డి అంటూ ఆదేశాలిస్తే కుదరదు’’ అని న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎంటీ టీకరామన్‌ పేర్కొన్నారు. నెలకు 10,500 సంపాదించే వ్యక్తి తన మాజీ భార్య, కుమారుడికి 7000 భరణంగా చెల్లించాలని ఆదేశించిన కింది కోర్టు తీర్పును తోసిపుచ్చారు. ‘‘3500తో ఆయన ఎలా బతుకుతాడు? వృద్ధుడైన తన తండ్రి బాగోగులు ఎలా చూస్తాడు. విడాకులు తీసుకున్న భార్యకు భరణం ఇవ్వాలని చెబుతున్న చట్టం వృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాలని కూడా చెబుతోంది’’ అని జడ్జి పేర్కొన్నారు.
nation
9,642
07-02-2017 23:21:32
అమ్మ ఆత్మగా మారితే..
మానస్‌, అఖిల, నీహారిక, మేఘన, నవీన్ నటీనటులుగా సంపతరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దెయ్యమా మజాకా’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాత. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల కోడి రామకృష్ణ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘వీకెండ్‌ పార్టీలో తప్ప తాగిన మైకంలో ఉన్న యువత కారుతో ఢీకొట్టి ఓ కుటంబాన్ని బలి తీసుకోవడంతో నాలుగేళ్ళ చిన్నారి అనాధ అవుతుంది. తన బిడ్డ అనాథ కాకూడదని ఆ చిన్నారి తల్లి ఆత్మగా మారుతుంది. ఆ క్రమంలో జరిగిన పరిణామాల సమాహారమే ఈ సినిమా’’ అని తెలిపారు. ‘‘ఫస్ట్‌ కాపీ సిద్దంగా ఉంది. త్వరలో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: నవనీత్ చారి, సమర్పణ: ఫణిరాజ్‌.
entertainment
12,224
14-12-2017 12:06:53
ఓటు వేసిన హార్దిక్ పటేల్
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్‌ ప్రధాన పార్టీలకు కీలకం కావడంతో ఆయా పార్టీల నేతలు ఉదయం నుంచే పోలింగ్ బూత్‌లకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచిన పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) నేత హార్దిక్ పటేల్ ప్రభావం ఓటర్లపై ఎలా ఉంటుందోనని సర్వత్రా చర్చ జరుగుతున్న తరుణంలో ఆయన వీరంగామ్‌లోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌సిన్హ్ సోలంకి ఆనంద్‌లోని 2011వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఓటేశారు. మరో కాంగ్రెస్ నేత శక్తిసిన్హ్ సోలంకి గాంధీనగర్‌లో ఓటు వేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ మెహసాన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి బీబీ స్వైన్ సైతం గాంధీనగర్‌లో ఓటు వేశారు.
nation
526
25-11-2017 02:07:19
రూ.312కే గో ఎయిర్‌ టిక్కెట్‌!
ముంబై: చౌక ధరల విమానయాన సేవల సంస్థ గో ఎయిర్‌.. పరిమితకాలానికి భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా హైదరాబాద్‌, ఢిల్లీ, కొచ్చి, బెంగళూరు, చెన్నైతో సహా 7 నగరాల నుంచి సంస్థ నడిపే విమాన సర్వీసుల వన్‌ వే టిక్కెట్‌ ధర కనిష్ఠంగా రూ.312 (పన్నులు అదనం) నుంచి మొదలవుతుందని తెలిపింది. శుక్రవారం నుం చే ప్రారంభమైన ఈ ఆఫర్‌ ఈ నెల 29 వరకు అందుబాటులో ఉంటుందని, ఎవరు ముందు టిక్కెట్‌ బుక్‌ చేసుకుంటే వారికే ముందుగా సీట్ల కేటాయింపు జరపనున్నట్లు గో ఎయిర్‌ స్పష్టం చేసింది. ఈ ఆఫర్‌లో బుక్‌ చేసుకునే టిక్కెట్ల ద్వారా వచ్చే నెల 1 నుంచి వచ్చే అక్టోబరు 28 మధ్యలో ప్రయాణం చేయవచ్చు.
business
10,884
30-12-2017 18:03:25
ఆ విషయంలో సమంత తర్వాత స్థానం కాజల్‌దే..
ఈ యేడాది సూపర్ సక్సెస్ రేట్‌ను అందుకున్న ఓ స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియా సెర్డ్చ్ లిస్ట్‌లోనూ టాప్ ప్లేస్‌లో నిలిచింది. అంతేకాదు అమ్మడు పాల్గొన్న ఈవెంట్ ఫోటోలను చూడటానికీ కుర్రకారు తహతహ లాడారట.  ముంబాయి చిన్నది కాజల్ టాలీవుడ్ బాట పట్టి చూస్తుండగానే పదేళ్ళు గడిచిపోయాయి. కెరీర్ పరంగా మధ్యలో కాస్తంత ఎత్తుపల్లాలను చవిచూసినా ఈ యేడాది మాత్రం సూపర్ ట్రాక్ రికార్డ్‌తో దూసుకుపోయింది. చిరంజీవి రీ-ఎంట్రీ మూవీ 'ఖైదీ నంబర్ 150' తో మొదలైన ఆ విజయ పరంపర ద్వితీయార్థంలోనూ కొనసాగింది. యేడాది చివరకు వచ్చేసరికీ సహజంగా ఏయే భామలు, ఏయే విభాగాల్లో నంబర్ వన్ పొజిషన్‌ను ఎంజాయ్ చేశారనే రికార్డులను కొందరు వెలికి తీస్తుంటాయి. ఆ రకంగా సమంత గురించి నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేశారని తెలిసింది. అయితే ఫోటోల సెర్చింగ్ విషయంలో మాత్రం కాజల్ అగర్వాల్ అగ్రస్థానంలో నిలిచిందట.  ఇప్పటికీ నెటిజన్ల అభిమానాన్ని కాజల్ పొందటానికి కారణం లేకపోలేదు. గత యేడాది పెద్దంత విజయాలను అందుకోలేకపోయిన కాజల్, ఈ సంవత్సరం తెలుగు, తమిళ భాషల్లో రెండు గ్రాండ్ సక్సెస్‌లను తన కిట్లో వేసుకుంది. అంతేకాదు తెలుగులో తేజ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన కాజల్, మళ్ళీ ఇంతకాలానికి ఆయన దర్శకత్వంలో నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' సైతం చక్కని విజయాన్ని అందుకుంది. తమిళంలో కాజల్ నటించిన 'వివేకం' మంచి ఓపెనింగ్స్ సాధించగా, 'మెర్సల్' సూపర్ హిట్ అయ్యింది. ఈ రెండు సినిమాలు తెలుగులోనూ అనువాదమయ్యాయి. దాంతో కాజల్ ఫోటోలను నెట్‌లో చూసేందుకు కుర్రకారు తెగ తపించేశారట. విశేషం ఏమంటే.. కాజోల్ పాల్గొన్న రెండు ఈవెంట్స్‌కు సంబంధించిన ఫోటోల గురించి కుర్రకారు విపరీతంగా సెర్చ్ చేశారని గణాంకాలు చెబుతున్నాయి. వరుస విజయాలు లభించడంతో కాజల్ కొత్తగా కొన్ని ప్రాడక్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ ఛాన్స్ కొట్టేసింది. ఆ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అమ్మడు తనదైన శైలిలో వస్త్రధారణ చేసుకుంటుంది. అది కూడా నెటిజన్ల సెర్చ్‌కు కారణమని తెలుస్తోంది. ఆ మధ్య మైంత్ర స్నీకర్స్ ఈవెంట్‌కు హాజరైన కాజల్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రస్‌లో అదరగొట్టేసింది. ఆ ఈవెంట్ కోసం నెటిజన్లు విపరీతంగా సెర్చ్ చేశారట. అలానే కాజల్ వింబుల్డన్ 2017 వేడుకలోనూ హాట్‌‌గా కనిపించడంతో ఆ ఫోటోల కోసం కూడా సెర్చింజన్లకు కుర్రాళ్ళు పనిచెప్పారట. సక్సెస్‌ఫుల్‌గా ఈ యేడాదికి వీడ్కోలు పలుకుతున్న కాజల్ వచ్చే ఏడాది కూడా ఇదే హవా చూపిస్తుందేమో చూడాలి.
entertainment
7,954
26-08-2017 17:35:54
నందమూరి హీరోతో తమన్నా..!
నందమూరి కళ్యాణరామ్ ఓ వైపు 'జై లవకుశ' సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం కాజల్‌తో ' ఎంఎల్‌ఏ' సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న ఈయన ఆసినిమా తర్వాత ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్, కూల్‌బ్రీజ్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న మరోచిత్రంలో నటించేందుకు సిద్దమవుతున్నాడు. ఈ చిత్రానికి జయేంద్ర దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఈసినిమాలో హీరోయిన్‌గా మిల్క్‌బ్యూటీ తమన్నాను తీసుకోనున్నారని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొద్ది రోజుల్లో రానుందని తెలిసింది. ఇటీవల వచ్చిన బాహుబలి సినిమా తర్వాత తమన్నా తమిళ సినిమా షూటింగుల్లో బిజీ అయిపోయింది. దీనితో పాటు ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్‌లో సైతం పాల్గొంటున్న ఈమె తాజాగా కళ్యాణ్‌రామ్ సరసన తెలుగుతెరపై మరోసారి మెరిసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసిందని అంటున్నారు.
entertainment
7,987
22-11-2017 10:58:48
కొద్దిసేపట్లో విమానం బయలుదేరబోతుండగా రజనీ ఎంట్రీ ఇవ్వడంతో..
చెన్నై: తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అనుకోకుండా ఆరో తరగతి విద్యార్థులతో విమానంలో ప్రయణించారు. తమతోపాటు రజనీ ప్రయాణించడంతో ఆ చిన్నారులు పట్టరాని సంతోషంతో విమానం అదిరేలా గెంతులేశారు. తంజావూరు జిల్లా కుంభకోణం సమీపం అమ్మాసత్రం ప్రాంతంలోని ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బాలబాలికలకు ఇండికో సంస్థ తమ విమానంలో చెన్నై నుండి బెంగళూరు ఉచితం ప్రయాణించే అవకాశం కల్పించింది. ఆ మేరకు సుమారు 50 మంది బాలబాలికలు ఆ విమానం ఎక్కారు. ఇక కాసేపట్లో బయలుదేరబోతుందనగా ఉన్నట్టుండి ఆ విమానంలోకి తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఎక్కారు. రజనీ లోపలికి అడుగుపెట్టగానే సూపర్‌ స్టార్‌ సూపర్‌స్టార్‌ అంటు చిన్నారులు బిగ్గరగా కేకలు పెట్టారు. రజనీతో కలిసి ప్రయాణించే అదృష్టం కలిగిందంటూ చిన్నారులు సంతోషించారు. రజనీకాంత్‌ కూడా ఆ చిన్నారులతో బెంగుళూరు దాకా ప్రయాణిస్తూ వారికి హితోక్తులు చెప్పారు. పెద్దలను, గురువులను తల్లిదండ్రులను గౌరవించాలని, మంచి మార్కులతో ఉత్తీర్ణులై దేశానికి సేవ చేయాలని దారి పొడవునా చిన్నారులో ఆయన ఓపికగా కబుర్లాడారు. ఆ విమానం బెంగుళూరు విమానాశ్రయం చేరుకున్న తర్వాత కూడా రజనీకాంత్‌ ఆ చిన్నారులంతా విమానం నుండి దిగి వచ్చేంతదాకా వేచి ఉండి అందరికీ టాటా చెప్పి చేతులూపుకుంటూ వెళ్లారు. చిన్నారులు సైతం రజనీకీ బైబై అంటే చేతులూపి తమ సంతోషాన్ని వ్యక్తంచేశారు. రజినీకాంత్‌ ఎదుగుదలకు సాయికుమారే కారణమే..  ముఖ్యమంత్రికి సూటి ప్రశ్న వేసిన స్టార్ హీరో
entertainment
13,346
22-03-2017 02:43:13
నారదా స్టింగ్‌లో మమతకు షాక్‌
న్యూఢిల్లీ, మార్చి 21: నారదా స్టింగ్‌ ఆపరేషన్‌ కేసులో మమతా బెనర్జీ సర్కారుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ, సీబీఐ దర్యాప్తు కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. దీనిపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు జరిపించాల్సిందిగా కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మమత సర్కారు దాఖలు చేసిన ప్రత్యేక అప్పీలు ‘దురదృష్టకరమని’ పేర్కొంటూ... ఈ వ్యాజ్యం అన్ని విధాల తిరస్కరించదగినదని సీజే ఖేహర్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
nation
20,707
28-10-2017 02:56:42
ఫైనల్‌ కిక్‌
సమ ఉజ్జీల సమరంపట్న్ఠాగుజరాత్‌ ఫైనల్‌ నేడుప్రొ కబడ్డీ లీగ్‌ - 5ప్రొ కబడ్డీ లీగ్‌లో ఫైనల్‌కు వచ్చిన ప్రతీసారీ పట్నా పైరేట్స్‌కు ఎదురులేదు.. అద్భుత ఆల్‌రౌండ్‌ షోతో కచ్చితంగా కప్‌ను ఎగరేసుకుపోవడమే వారికి తెలుసు... గత రెండు సీజన్లలోనూ ఇలాగే విజేతగా నిలుస్తూ ప్రత్యర్థులను వణికిస్తున్న పట్నా ఈసారీ అదే స్థాయిలో ఆడి తుది పోరుకు చేరింది. ఈ సీజన్‌లో టాప్‌ రైడర్‌గా కొనసాగుతున్న పర్దీప్‌ నర్వాల్‌ అండతో వరుసగా మూడో టైటిల్‌ సాధించాలన్న పట్టుదలతో ఉంది.ఇక వచ్చీ రావడంతోనే ఏకంగా ఫైనల్‌కు చేరిన గుజరాత్‌ ఫార్చూన్‌జెయింట్స్‌ తొలిసారిగా చాంపియన్‌ కావాలని ఆశిస్తోంది. ఆడిన 22 మ్యాచ్‌ల్లో ఏకంగా 15 విజయాలతో ఈ జట్టు తాజా సీజన్‌లో ఆధిపత్యం ప్రదర్శించింది. నిలకడైన విజయాలతో డిఫెండింగ్‌ చాంపియన్‌ పట్నా పైరేట్స్‌కు సవాల్‌ విసురుతోంది. ఈనేపథ్యంలో రెండు అత్యంత పటిష్టమైన జట్ల మధ్య జరిగే సమరం ప్రొకబడ్డీ లీగ్‌కు ‘ఫైనల్‌’ టచ్‌ ఇస్తుందనడంలో సందేహం లేదు...చెన్నై: మూడు నెలలపాటు దేశవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగిస్తోన్న ప్రొ కబడ్డీ లీగ్‌ ఐదో సీజన్‌ ఆఖరి అంకానికి చేరుకుంది. చెన్నై వేదికగా శనివారం జరిగే ఫైన ల్‌ పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ పట్నా పైరే ట్స్‌తో.. తొలిసారిగా లీగ్‌లో ఆడుతున్న గుజరాత్‌ ఫార్చూన్‌జెయింట్స్‌ అమీతుమీ తేల్చుకోనుంది. రెండు జట్లు కూడా అన్ని రంగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తుండడంతో పాటు ఉరకలెత్తే ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. గురువారం జరిగిన రెండో క్వాలిఫయర్‌లో బెంగాల్‌ వారియర్స్‌ను 47-44 తేడాతో పట్నా ఓడించి ఫైనల్‌కు చేరగా.. తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌ జట్టు కూడా బెంగాల్‌పైనే 42-17తో ఘనవిజయం సాధించింది. సూపర్‌ స్టార్‌ రైడర్‌గా పేరు తెచ్చుకున్న పర్దీప్‌ ఈ ఒక్క సీజన్‌లోనే ఓవరాల్‌గా 350 పాయింట్లు ఖాతాలో వేసుకుని భీకర ఫామ్‌లో ఉండగా... గుజరాత్‌ మాత్రం ఒక్కరిపై కాకుండా సమష్టి ఆటతీరుతో ఇక్కడి దాకా వచ్చింది. తుది పోరులోనూ ఇదే రీతిన ఆడి పట్నాకు చెక్‌ పెట్టాలని భావిస్తోంది. పట్నా తాము ఆడిన 22 మ్యాచ్‌ల్లో 10 విజయాలు, ఏడు ఓటములతో జోన్‌-బిలో రెండో స్థానంలో ఉండగా గుజరాత్‌ మాత్రం 15 విజయాలు, నాలుగు ఓటములతో జోన్‌-ఎలో అగ్రస్థానం దక్కించుకుంది. పర్దీప్‌ అండగా...పర్దీప్‌ కూతకు వెళ్లాడంటే గంపగుత్తగా పాయింట్లు పట్నా ఖాతాలో పడాల్సిందే.. ఈ సీజన్‌ను గమనిస్తున్న అభిమానులకు ఈ విషయం తెలిసే ఉంటుంది. తమ చివరి మ్యాచ్‌లో కూడా తను ఏకంగా 23 పాయింట్లతో చెలరేగి జట్టును ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు. హరియాణాతో జరిగిన ప్లేఆఫ్‌ మ్యాచ్‌లోనైతే 34 రైడింగ్‌ పాయింట్లతో రికార్డు సృష్టించాడు. ఇక కీలక పోరులోనూ తను ఇదే రీతిన చెలరేగితే గుజరాత్‌ ఆశలకు గండిపడినట్టే! మోను గోయత్‌, వికాస్‌ జగ్లాన్‌.. పర్దీప్‌కు అండగా నిలవనున్నారు. డిఫెన్స్‌లోనూ చక్కటి ఆటతీరును కనబరుస్తున్న పట్నా ఎలాంటి పొరపాట్లకు తావీయకుండా ఫైనల్లో నెగ్గి హ్యాట్రిక్‌ టైటిల్‌ సాధించాలని భావిస్తోంది. సమష్టి మంత్రంతో ముందుకు..తొలిసారిగానే అయినా గుజరాత్‌ జట్టు ఆరంభం నుంచే ఆకట్టుకునే ప్రదర్శనతో రాణించింది. ఇరాన్‌ డిఫెండర్‌ ఫాజెల్‌ అత్రాచలి జట్టుకు ప్రధాన ఆకర్షణగా ఉన్నాడు. సుకేశ్‌ హెగ్డేతోపాటు సచిన్‌ తుది పోరులో మెరుగైన ఆటతీరును కనబరచాలని గుజరాత్‌ శిబిరం ఆశిస్తోంది. జట్టు ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ ఆటగాళ్లంతా రాణిస్తూ తమ వంతు పాత్రను పోషించగలిగారు. కలిసికట్టుగా ఆడితే అన్ని మ్యాచ్‌లూ సులువుగానే కనిపిస్తాయని కెప్టెన్‌ ఫాజెల్‌ చెబుతున్నాడు. జట్టుపై నమ్మకముంచి తమ ప్రణాళికలను సరిగ్గా అమలుపరిస్తే ప్రత్యర్థి ఎవరనేది అనవసరమని అన్నాడు.
sports
12,200
20-12-2017 04:32:51
స్థిరాస్తి లావాదేవీల్లో ఆధార్‌ తప్పనిసరి కాదు: కేంద్రం
న్యూఢిల్లీ, డిసెంబరు 19: స్థిరాస్తి క్రయ, విక్రయాల్లో ఆధార్‌కార్డు అనుసంధానాన్ని తప్పనిసరి చేసే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం తెలిపారు. అయితే, గ్రామాల్లో ఆస్తుల లావాదేవీల్లో ఆధార్‌ కార్డును అనుసంధానించేందుకు గల అవకాశాలపై అభిప్రాయాలు చెప్పాలని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కోరిందన్నారు.
nation
4,012
13-11-2017 00:05:35
ఎవళ్ళమో మనం
1 మిత్రుడు ఆప్యాయంగా మిగిల్చిన భోజనం వాటాని అమితానందంతో భుజిస్తాను. అది నాకిచ్చే బలం శాశ్వతం. పరిచయస్థుల్లారా మిమ్మల్లందరినీ ఆహ్వానిస్తున్నాను ఈ శీతాకాలం నాటి చల్లని సమీరాలతో పాటూ. విస్మృతిలోకి ప్రయాణం చేసిన ఆటవిక తెగల సారాయి నా దగ్గరుందని మీకు తెలియజేస్తున్నాను. 2 నా ఆశ మీద నాకు ఏ హక్కులూ లేకుండానే వస్తాను. గదిలో ముడిచివేసి వున్న కుర్చీల గురించి ఆందోళన చెందను. దహనాన్ని నిర్జన ప్రాంతంలో వదలి వచ్చేసి మీ కరచాలనపు బలిష్ఠమైన ఎముకకు బందీనైపోతాను. 3 ముందు మీకు నేను ఆగంతకుల, శత్రువుల జాబితాలో కనిపిస్తాను బహుశా. పశ్చాత్తాపం మిమ్మల్ని దహనం చేస్తున్నప్పుడు నేను మరింక కనిపించను, మరెన్నటికీ. ఎవరు సూర్యకాంతం పువ్వుల మైదానంలో నిశ్చింతగా, వెల్లకిలా పడుకుని నిదురిస్తున్నారు? ఎవరు సాయంసంధ్యలోకి కరిగిపోయారు? చిత్రకొండ గంగాధర్‌దాదాపు ఆరేళ్ళుగా సాహిత్య మిత్రులకు ఆచూకీ తెలియకుండా దూరమైన చిత్రకొండ గంగాధర్‌ (అసలు పేరు బొడ్డు గంగాధర్‌) చనిపోయి చాలా కాలమైందని ఇటీవలే తెలిసింది. ఈ కవిత ఆయన 1997లో రాసింది.
editorial
184
17-03-2017 23:34:11
మరో శిఖరంపై నిఫ్టీ
ముంబై : మార్కెట్లో చోటు చేసుకున్న సరికొత్త ఆశావహ స్థితి సూచీలను కొత్త శిఖరాల దిశగా పరుగులు తీయిస్తోంది. శుక్రవారం వారాంతపు ట్రేడింగ్‌ రోజున నిఫ్టీ మరో కొత్త శిఖరాన్ని చేరగా సెన్సెక్స్‌ స్వల్ప లాభంతో ముగిసింది. మార్కెట్లో లిక్విడిటీ కూడా విశ్వాసం అత్యున్నత స్థాయిలో నిలిచేందుకు దోహదపడింది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం తర్వాత దేశీయ మార్కెట్లోకి విదేశీ నిధుల వెల్లువ కొనసాగుతోంది. జిఎస్‌టి కౌన్సిల్‌ మరో రెండు బిల్లులకు ఆమోదం తెలపడంతో వాటిని పార్లమెంటులోను, రాష్ర్టాల శాసనసభల్లోను ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం కావడం మార్కెట్లో కొనుగోళ్ల జోరు పెరగడానికి దోహదపడింది. ఒక దశలో నిఫ్టీ కీలక స్థాయి 9200ని దాటి 9218.40 పాయింట్లను తాకింది. ఇది చారిత్రక గరిష్ఠ స్థాయి. చివరికి 6.35 పాయింట్ల లాభంతో 9160.05 పాయుంట్ల వద్ద మరో చారిత్రక గరిష్ఠ స్థాయిలో క్లోజయింది. సెన్సెక్స్‌ 63.14 పాయింట్లు లాభపడి 29,648.99 పాయింట్ల వద్ద క్లోజయింది. రేడియో సిటీ ఎఫ్‌ఎం చానల్‌ను నిర్వహించే జాగరణ్‌ గ్రూప్‌నకు చెందిన మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌ షేర్లు లిస్టింగ్‌ అయిన తొలి రోజునే విజయఢంకా మోగించాయి. ఈ షేరు బిఎస్‌ఇలో ఆఫర్‌ ధర 333 రూపాయలకన్నా 26 శాతం ప్రీమియంపై 420 రూపాయల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 368 రూపాయల కనిష్ఠ స్థాయిని కూడా తాకినప్పటికీ చివరికి 373.15 రూపాయల వద్ద క్లోజయింది. ఎన్‌ఎస్‌ఇలో 24 శాతం ప్రీమియంతో 413 రూపాయల వద్ద ప్రారంభమై చివరికి 372 రూపాయల వద్ద క్లోజయింది. ఐపిఒ 39 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది.
business
5,579
24-05-2017 15:58:25
చిరంజీవి 'ఉయ్యాలవాడ'లో సల్మాన్ ఖాన్...?
మెగాస్టార్ చిరంజీవి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో చిరు చిత్రానికి క్రేజ్ తెచ్చేందుకు తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ హీరోని ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకొస్తున్నారట. చిరంజీవి కథానాయకుడిగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'. 18వ శతాబ్దానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు కథతో తెరకెక్కుతోన్న ఈ హిస్టారికల్ మూవీని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాడట నిర్మాత రామ్ చరణ్. అందుకోసమే ఆ ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ను తీసుకురాబోతున్నాడట. చరణ్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా చిరంజీవి రీఎంట్రీ మూవీ 'ఖైదీ నంబర్ 150'లోనే నటించడానికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. కానీ.. 'ఖైదీ..' మూవీలో సల్లూభాయ్‌కి సరైన రోల్ లేక ఆ విషయాన్ని పక్కన పెట్టేశాడట చరణ్. అయితే ఇప్పుడు 151వ సినిమాలో ఎలాగైనా సల్మాన్ ఖాన్‌ను నటింపజేయాలని తద్వారా జాతీయ స్థాయిలో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రానికి క్రేజ్ తీసుకురావాలని నిర్మాత చరణ్ ఆలోచనట. మరోవైపు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రంకోసం మెగా ప్రొడక్షన్ హౌజ్ లైకా ప్రొడక్షన్స్‌తో చేతులు కలపబోతున్నాడట ప్రొడ్యూసర్ రామ్ చరణ్. ప్రస్తుతం రజనీకాంత్ 'రోబో 2.0'తో పాటు కమల్ హాసన్ 'శభాష్ నాయుడు' వంటి చిత్రాలను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' కి కూడా ఈ నిర్మాణ సంస్థ పంపిణీ రంగంలో సపోర్ట్ అందించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 'ఉయ్యాలవాడ..'కోసం లైకాతో టై అప్ అవుతున్నాడట చెర్రీ. మొత్తం మీద ఈ చిత్రం చిరంజీవి పుట్టిన రోజు ఆగస్ట్ 22న ప్రారంభోత్సవాన్ని జరుపుకోనుందట. మరి 'బాహుబలి' రేంజ్‌లో తన సినిమాను జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లడానికి భారీ ప్రయత్నాలు చేస్తోన్న చిరు.. ఆ విషయంలో ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.
entertainment
4,479
25-04-2017 03:25:44
ఏర్పేడు బలిదానాల సాక్షిగా ఇప్పుడైనా ఆలోచిద్దాం
మునగలపాళెం గ్రామాన్ని మృత్యుమయం చేసిన సంఘటనకు కంటతడి పెట్టని వారు లేరు. నిష్పాక్షికంగా విచారిస్తే ఈ దుర్మార్గ సంఘటనకు కారణాలు బయటకు వస్తాయి. తగిన శిక్షలూ పడుతాయి. అయితే, ఇటువంటి పెను సంఘటనలు జరిగినపుడు వ్యవస్థలోని లోపాలు ఏమిటో బయటపడుతూ ఉంటాయి. కడుపు దేవే దుఖంతోనే వాటి గురించి కూడా మనం ఆలోచించాలి. తమ బతుక్కి ఆధారం అయిన సేద్యానికి సమస్య వచ్చిందనే కదా మునగలపాళెం రైతులు అంత ఎండపూట ఇంటికొకరు లెక్కన రోడ్ల మీదకు వచ్చారు. ఇసుక తోడేస్తున్నారయ్యా, ఆపండయ్యా అని అధికారుల చుట్టూ తిరిగారు. ఏడాదికి పైగా వేడుకుంటున్నా ఎవరూ ఎందుకు పట్టించుకోలేదు? దక్షిణ గంగగా పేరు పొందిన స్వర్ణముఖి నది గర్భాన్ని గుల్లచేస్తున్నా ఉపేక్షించడం వల్లే కదా రైతులకు ఈ పరిస్థితి ఏర్పడింది. 15 మరణాల కన్నీళ్లు ముంచెత్తుతున్న ఈ సమయంలో అయినా సమస్య మూలాల గురించి మాట్లాడుకోకపోతే పరిహారాలే తప్ప పరిష్కారాలు ఎన్నటికీ లభించవు. ఇన్ని బలిదానాల సాక్షిగా అయినా స్వర్ణముఖికి పునరుజ్జీవం ఆశించడం అత్యాశ కాదనుకుంటాను. ఇక, తాగి నడిపిన వ్యక్తికి వాహనాన్ని నడిపే అర్హత కూడా లేదని తేలింది. దారి సుంకం వసూలు చేసే టోల్‌గేట్‌లు, తగిన పత్రాలున్నాయా లేదా అని పరిశీలించి పంపే చెక్‌పోస్టుల్లో చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ రెండు అతిక్రమణలనీ అరికట్టవచ్చు. ఈ ప్రదేశాల్లో బ్రీత్‌ ఎనలైజర్‌లు పెట్టి, హెవీ వెహికల్స్‌ నడిపే డ్రైవర్లకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తే వందల వేల ప్రాణాలు కాపాడినట్లే. అలాగే జాతీయ రహదారుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి గనుక ప్రతి టోల్‌ప్లాజా దగ్గరా కనీసం పది నుంచి ఇరవై బెడ్లు ఉండే ఫస్ట్‌ ఎయిడ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రమాదాలు జరిగినపుడు గాయపడ్డ వారిని ఎలా హేండిల్‌ చేయాలనేది చాలా ముఖ్యం. ఎముకలు, వెన్నెముక విరిగిన వారిని జాగ్రత్తగా తరలించాలి. హడావుడిలో దుప్పట్లలో మూటల్లాగా ఎత్తి వేసేస్తుంటారు. అందువల్ల వారు జీవితాంతం అంగవైకల్యంతో మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది.  చాలాసార్లు అచేతనంగా ఉన్నవారిని పట్టించుకోకుండా, బాధతో అరుస్తున్న పేషెంట్లనే ముందుగా తరలించే ప్రయత్నం చేస్తుంటారు. సంఘటన స్థలంలోని ఎమోషన్స్‌ మీద ఆధారపడి కాకుండా గాయాల తీవ్రతను బట్టి ప్రాథమిక చికిత్స అందించి తరలించేలా సిబ్బందికి శిక్షణ ఉండాలి. ఇక రోజూ అరవై డెబ్బయి వేల మంది యాత్రికులు సందర్శించే తిరుపతిలో పెద్ద ప్రమాదం జరిగితే ముప్పయి నలబై మందికి తక్షణ చికిత్స అందించగలిగిన అత్యవసర వైద్య వ్యవస్థ లేకపోవడం పెద్ద లోటు. గాయాలను బట్టి ఒకరికి రుయాలో, మరొకరికి స్విమ్స్‌లో చికిత్స చేస్తుంటారు. మరీ తీవ్రంగా ఉంటే వేలూరు, చెన్నైలకు రెఫర్‌ చేసేస్తుంటారు. అన్ని విభాగాలూ తక్షణం స్పందించి వైద్యం అందించగలిగే ఒక్క కేంద్రాన్ని కూడా 60 సంవత్సరాల చరిత్ర గల మెడికల్‌ కాలేజీ ఉన్న తిరుపతిలో ఇప్పటికీ ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం. ఏర్పేడు సంఘటన వంటివి జరిగినపుడు ఈ లోటు మరీ తెలుస్తోంది. ఇన్ని వేల మంది యాత్రీకులు వచ్చే తిరుపతిలో తగిన ట్రామాకేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసే బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకోవాలి. దేవుడి కోసం వచ్చే భక్తులకు ఆపద వస్తే అందించే సేవ కూడా మాధవ సేవే కదా!- డాక్టర్‌ కృష్ణప్రశాంతిసీనియర్‌ ఫిజిషీయన్‌, తిరుపతి
editorial
274
14-06-2017 23:37:36
మరో రెండు డుకాటీ సూపర్‌ బైక్స్‌
ధర రూ.7.77 లక్షల నుంచి రూ.12.6 లక్షలు..న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన సూపర్‌ బైక్‌ల తయారీ కంపెనీ డుకాటీ.. మాన్‌స్టర్‌ 797, మల్టీస్ర్టాడా 950 పేర్లతో రెండు బైక్‌లను బుధవారం విడుదల చేసింది. వీటి ధర వరుసగా 7.77 లక్షలు, 12.6 లక్షల రూపాయలు (ఎక్స్‌షోరూమ్‌, ఢిల్లీ)గా ఉంది. ఈ ఏడాదిలో మరో మూడు కొత్త మోడళ్లను విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. వీటి మూలంగా భారతలో మంచి వృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుందని డుకాటీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవి అవలూరు తెలిపారు. కొత్తగా విడుదల చేసిన రెండు బైక్‌లతో అన్ని ధరల్లోనూ తమ కంపెనీ పోటీనివ్వడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. అంతేకాకుండా మార్కెట్‌ వాటాను పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. కొత్త బైక్‌లతో భారతలో డుకాటీ బైక్‌ల సంఖ్య 19కి పెరిగిందన్నారు. హైదరాబాద్‌, కోల్‌కతా, చెన్నైలో మరో మూడు డీలర్‌షిప్ లను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ధర రూ.7.77 లక్షల నుంచి రూ.12.6 లక్షలుమాన్‌స్టర్‌ 797 యూరో 4 నిబంధనలకు అనుగుణంగా ఉంది. ఎయిర్‌ కూల్డ్‌ 803 సిసి ఇంజన్‌, ఎల్‌ఇడి లైట్లు, ఎల్‌సిడి స్ర్కీన్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక మల్టీస్ర్టాడాలో 937 సిసి ఇంజన్‌ ఉంది.
business
19,696
28-04-2017 02:23:40
సమరమే మార్గమా!
చాంపియన్స్‌ ట్రోఫీపై నీలి నీడలుతిరుగుబాటు దిశగా భారత బోర్డు?ఎస్‌జీఎంలో కీలక నిర్ణయంఒంటరిగా బీసీసీఐ: పాలనా పరమైన నిర్మాణాత్మక మార్పులు కోసం నిర్వహించిన ఓటింగ్‌లో బీసీసీఐ 1-9తో ఓడగా, ఆదాయ పంపిణీ నమూనా మార్పుల ఓటింగ్‌లో 2-8తో పరాజయం పాలైంది. ‘బిగ్‌ త్రీ’ మోడల్‌ను తిరస్కరిస్తూ ఐసీసీ సభ్యదేశాలు ఓటింగ్‌ చేశాయి. ఈ కారణంగా 2015 నుంచి 2023 వరకు ఐసీసీ నుంచి బీసీసీఐకి అందే వాటా సగానికి అంటే రూ. 1879 కోట్లకు పడిపోనుంది. దీన్ని భారత్ బోర్డు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వాస్తవంగా ఐసీసీ ఆదాయంలో 80 శాతం భారత్ నుంచి వస్తుంది. దీని ఆధారంగా ఎక్కువ వాటా అడిగితే తప్పేంటని ప్రశ్నిస్తోంది.తక్షణ కర్తవ్యం..: ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో భారత ముందుంది ఒక్కటే మార్గం. అది మెంబర్స్‌ పార్టిసిపేషన్స్‌ అగ్రిమెంట్‌ (ఎంపీఏ). దీని ఆధారంగా ఐసీసీని నిలదీయాలని బోర్డు వ్యవహారాల్లో తలపండిన పెద్దలు సలహా ఇస్తున్నారు. దీని ప్రకారం చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి తప్పుకునే హక్కు బీసీసీఐకి ఉంటుంది. ఎందుకులే అనుకుంటే సవరణలకు అనుకూలంగా.. ఇచ్చింది తీసుకుంటే సరిపోతుంది. అయితే చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి తప్పుకునే ప్రతిపాదనను మాత్రం కమిటీ ఆఫ్‌ అడ్మినిసే్ట్రటర్స్‌ (సీవోఏ) తీవ్రంగా విభేదిస్తోంది. ఐసీసీ సమావేశాలకు హాజరైన బీసీసీఐ ప్రతినిధులు తిరిగి రాగానే ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర సంఘాలు సన్నాహాలు చేస్తున్నాయి. కాగా, చాంపియన్స్‌ ట్రోఫీకి డెడ్‌లైన్‌ ముగిసినా భారత జట్టును ఇంకా ప్రకటించలేదు. ఐసీసీలో జరిగిన దానిపై సీవోఏ హెడ్‌ వినోద్‌ రాయ్‌ అసంతృప్తిగా ఉన్నారు. భవిష్యత కార్యాచరణ కోసం ఎస్‌జీఎం ఏర్పాటుకు అనుమతిస్తున్నట్టు తెలిపారు. .భారత్‌కు కలిగే నష్టం?: చాలా వరకు రాష్ట్ర సంఘాలు చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి తప్పుకోవాలనే అంటున్నాయి. ఎస్‌జీఎంలో కూడా ఈ తీర్మానానికే కట్టుబడి ఉన్నాయని చెబుతున్నాయి. ఒకవేళ టీమిండియా తప్పుకుంటే చాంపియ న్స్‌ ట్రోఫీ కళ తప్పుతుంది. ఇది ఐసీసీకి భారీ నష్టం. ఇందుకు ప్రతిగా ఐసీసీ మిగతా సభ్య దేశాలను భారతతో క్రికెట్‌ ఆడొద్దని ఆదేశించవచ్చు. ఐపీఎల్‌కు విదేశీ ఆటగాళ్లూ దూరం కావచ్చు. ఇదే జరిగితే బీసీసీఐతోపాటు భారత క్రికెట్‌కూ నష్టం తప్పదు.కొత్త ఆదాయ పంపిణీ నమూనా ప్రకారం భారత బోర్డుకు అందే వాటా కంటే అదనంగా మరో రూ. 650 కోట్లు ఇచ్చేందుకు ఐసీసీ సుముఖంగా ఉన్నట్టు సమాచారం. రూ. 2500 కోట్ల ప్రతిపాదనను ఐసీసీ విరమించుకోలేదని దుబాయ్‌లో ఉన్న బీసీసీఐ అధికారి తెలిపాడు. అయితే, ఫైనల్‌ ఆఫర్‌గా రూ. 2886 కోట్లిస్తే అంగీకారం తెలపాలని దుబాయ్‌లో ఉన్న బీసీసీఐ ప్రతినిధులు భావిస్తున్నట్టు తెలిపాడు.
sports
12,466
03-05-2017 03:09:50
కశ్మీరులో మరో బ్యాంకుపై దాడి
తలకు తుపాకి పెట్టి రూ.65 వేలు దోపిడీశాంతి భద్రతలపై రాజ్‌నాథ్‌తో గవర్నర్‌ భేటీశ్రీనగర్‌, మే 2: బ్యాంకుల మీద కశ్మీరీ ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. సోమవారం బ్యాంకు వ్యానుపై దాడిలో ఐదుగురు పోలీసులు సహా ఏడుగురు చనిపోగా మంగళవారం కుల్గాం జిల్లాలో ఏకంగా బ్యాంకు శాఖపైనే దాడి చేశారు. ఓ ఆగంతకుడు బ్యాంకు క్యాషియర్‌ తలపై తుపాకి గురిపెట్టి అతని దగ్గరున్న 65 వేల క్యాష్‌ను తీసుకొని వెళ్లిపోయాడు. సోమవారం బ్యాంకు వ్యానుపై దాడి చేసినపుడు అందులో డబ్బులు కూడా లేవు. పోలీసులను, బ్యాంకు గార్డులను వ్యానులోంచి బయటకు లాగి చంపేశారు. జమ్మూ కాశ్మీరు గవర్నర్‌ ఎన్‌.ఎన్‌.వోరా మంగళవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. 40 నిమిషాల భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో శాంతి భద్రతల మీద చర్చ జరిగింది. ఏప్రిల్‌ 9 లోక్‌సభ ఉప ఎన్నికల నాటి నుంచి కశ్మీరు లోయ హింసతో రగులుతోంది. గత ఏడాది జూలైలో హిజిబుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది బుర్హాన్‌ వానీ ఎన్‌కౌంటర్‌ అనంతరం నాలుగు నెలలపాటు కశ్మీరు లోయ హింసలో మునిగిపోయింది. మరోపక్క కశ్మీరులో పరిస్థితిపై తక్షణమే ఐరాస, ఇతర అంతర్జాతీయ సంస్థలు దృష్టి సారించాలని పాకిస్థాన్‌ పిలుపునిచ్చింది. కశ్మీరు స్వాతంత్య్ర పోరాటాన్ని ఉగ్రవాదంగా ముద్రవేసే ప్రయత్నంలో భారత విఫలమైందని ప్రధాని షరీ్‌ఫకు సలహాదారు సత్రాజ్‌ అజీజ్‌ అన్నారు.
nation
2,636
21-12-2017 23:40:53
ఎవరి వ్యూహం ఏంటి..?
‘సుప్రీం’ తన తీర్పు సమీక్షించుకుంటుందా?.. టెలికాం కంపెనీలకు లైసెన్సులు పునరుద్ధరిస్తారా?.. 2జి వ్యవహారంలో కోర్టు తీర్పుతో అన్నీ శేషప్రశ్నలేన్యూఢిల్లీ : యుపిఎ హయాంలో కేటాయింపులు జరిగిన 2జి స్పెక్ట్రమ్‌ లైసెన్సుల వ్యవహారంలో అవకతవకలేవీ జరగలేదంటూ ఆ కేసులో నిందితులుగా అభియోగాలు మోస్తున్న 19 మందిని స్పెషల్‌ కోర్టు నిర్దోషులుగా ప్రకటించడం ఇటు ప్రభుత్వ వర్గాల్లోను, అటు కార్పొరేట్‌ వర్గాల్లోను కలకలానికి దారితీసింది.  ఈ కేసులో కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన వారిలో మాజీ టెలికాం మంత్రి ఎ రాజా, డిఎంకె నాయకురాలు కనిమొళితో పాటు అడాగ్‌, ఎస్సార్‌, యునిటెక్‌ వంటి వ్యాపార దిగ్గజాల ప్రతినిధులు కూడా ఉన్నారు. 2008లో జరిగిన స్పెక్ట్రమ్‌ కేటాయింపుల వ్యవహారంలో పలు అవకతవకలు జరిగాయంటూ 2012 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఎనిమిది టెలికాం కంపెనీలకు చెందిన 122 లైసెన్సులు రద్దు చేసిన విషయం విదితమే. నార్వేకు చెందిన టెలినార్‌ ఎఎస్‌ఎ, యుఎఇకి చెందిన ఎటిసలాట్‌, రష్యాకు చెందిన సిస్టెమా కంపెనీ జాయిం ట్‌ వెంచర్‌ భాగస్వాములుగా ఉన్న కంపెనీలు కూడా లైసెన్సులు రద్దయిన వాటిలో ఉన్నాయి. ఆ తర్వాత 2011 ఏప్రిల్‌లో ఆ వ్యవహారంపై సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్లు ఈ కేసులో చార్జిషీట్లు దాఖలు చేశాయి. ఆ కేసులో విచారణ పూర్తి చేసిన స్పెషల్‌ కోర్టు అభియోగాలు మోస్తున్న వారందరినీ నిర్దోషులుగా ప్రకటించడం తీవ్ర సంచలనానికి దారి తీసింది.  2జి వ్యవహారంలో అవకతవకలేవీ జరగలేదని స్పెషల్‌ కోర్టు ప్రకటించిన నేపథ్యంలో రద్దయిన 122 లైసెన్సులను పునరుద్ధరిస్తారా అన్నది ప్రస్తుతం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ స్పెషల్‌ కోర్టు తీర్పు ఆధారంగా ఆయా కంపెనీలు రివ్యూ పిటిషన్లు దాఖలు చేస్తే సుప్రీంకోర్టు తన తీర్పును సమీక్షించుకుంటుందా, లైసెన్సుల పునరుద్ధరణ ఎంతవరకు సాధ్యం, స్పెషల్‌ కోర్టు తీర్పు ఆధారంగా ఎవరి వ్యూహం ఏమిటి అనేవన్నీ ఇప్పుడు అందరిలోనూ ప్రశ్నలుగా మారాయి. దీనిపై స్పందించిన కార్పొరేట్‌ కంపెనీలన్నీ ఆ కేసులో తమ ప్రతినిధులను నిర్దోషులుగా ప్రకటించడం పట్ల హర్షం ప్రకటించగా యుపిఎ ప్రభుత్వ పెద్దలందరూ తాము ఏ తప్పూ చేయలేదన్న విషయం కోర్టు తీర్పుతో స్పష్టమైందని వాదిస్తున్నారు. దర్యాప్తు సంస్థల వ్యూహం తర్వాతే మా నిర్ణయం ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారంలో ప్రభుత్వ స్పందన భిన్నంగా ఉంది. స్పెషల్‌ కోర్టు తీర్పుపై దర్యాప్తు సంస్థలు ఏ వైఖరిని అనుసరిస్తాయి, ఆ తీర్పుపై ఎగువ కోర్టులో సవాలు చేస్తాయా అన్న అంశాన్ని బట్టి లైసెన్సుల పునరుద్ధరణ వ్యవహారాన్ని పరిశీలించాల్సి ఉం టుందని టెలికాం మంత్రి మనోజ్‌ సిన్హా చెప్పారు. కోర్టు తీర్పు ఎలా ఉన్నప్పటికీ యుపిఎ ప్రభుత్వ హయాంలో ఎంతో విలువైన స్పెక్ట్రమ్‌ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని, ఆ వ్యవహారం పూర్తిగా అవినీతిమయం అన్నదే తమ ప్రభుత్వ అభిప్రాయమని సిన్హా వ్యాఖ్యానించారు. ఆ లైసెన్సుల జారీలో భారీ అవకతవకలు జరిగాయని ప్రభుత్వ అధీనంలోని కేంద్ర నిఘా సంస్థ (సివిసి) స్వయంగా తేల్చి చెప్పిన విషయం ఆయన గుర్తుచేశారు. 2001లో అనుసరించిన ‘మొదట వచ్చిన వారికి మొదటి అవకాశం’ విధానాన్ని 2008 సంవత్సరంలో ‘మొదట వచ్చిన వారి నుంచి మొదటి చెల్లింపు స్వీకరణ’గా మార్చారని ఆయన చెప్పారు. 2001 విధానం కింద మొదట దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యతా క్రమంలో మొదటి కేటాయింపు జరపాల్సి ఉండగా తమకు అనుకూలమైన వారికి కేటాయింపులు చేయడం లక్ష్యంగా 2008లో ఎవరు ముందుగా డబ్బు కడితే వారికే కేటాయించడంగా విధానం మార్చారని ఆయన వ్యాఖ్యానించారు.  ‘‘ఎంతో విలువైన సహజ సంపదను ప్రభుత్వం కొంతమందికి కానుకగా సమర్పించింది’’అని 2012లో అత్యున్నత న్యాయస్థానం తన ఉత్తర్వులో వ్యాఖ్యానించడం కూడా ఆ వ్యవహారంలో జరిగిన అవకతవకలకు దర్పణం పడుతున్నదని సిన్హా అన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వేలం ద్వారా స్పెక్ట్రమ్‌ కేటాయింపుల విధానం అమలు పరచడం వల్ల 10 శాతం ఆదాయం అదనంగా సమకూరిందని, పా త విధానాలు లోపభూయిష్టమన్న వి షయానికి ఈ రాబడులే నిదర్శనమని ఆయన అన్నారు.   వేలం ప్రక్రియ ద్వారా స్పెక్ట్రమ్‌ విక్రయించినందుకు 2015 సంవత్సరంలో 1.09 లక్షల కోట్ల రూపాయలు, 2016 సంవత్సరంలో 65,789 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని, అదే యుపిఎ ప్రభుత్వ హయాంలో అనుసరించిన కేటాయింపుల విధానం వల్ల సమకూరిన సొమ్ము 2012లో 9,407 కోట్ల రూపాయలు, 2013లో 3,539 కోట్ల రూపాయలు, 2014లో 61,162 కోట్ల రూపాయలు అని సిన్హా వివరించారు. టెలికాం కంపెనీల హర్షంస్పెక్ట్రమ్‌ వ్యవహారంలో తాము ఏమీ తప్పు చేయలేదని, ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని కోర్టు తీర్పు నిరూపించిందని ఆ కేసు తో సంబంధం ఉన్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొన్న కార్పొరేట్‌ కంపెనీలు వ్యాఖ్యానించాయి.  2జి స్పెక్ట్రమ్‌ కేసులో తమ కంపెనీకి చెందిన ముగ్గురు అత్యున్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లను నిర్దోషులుగా ప్రకటించినందుకు రిలయన్స్‌ అడాగ్‌ హర్షం ప్రకటించింది. ఆ కంపెనీకి చెందిన గౌతమ్‌ దోషి, సురేంద్ర పిపారా, హరి నాయర్‌ ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఆ ముగ్గురినీ నిర్దోషులుగా ప్రకటించడం పట్ల హర్షం ప్రకటిస్తూ అడాగ్‌ ఒక సంక్షిప్త ప్రకటన విడుదల చేసింది. రవి రుయా, అన్షుమన్‌ రుయాలను నిర్దోషులుగా ప్రకటించడం పట్ల ఎస్సార్‌ గ్రూప్‌ హర్షం ప్రకటించింది. స్పెక్ట్రమ్‌ వ్యవహారంలో తమ వైఖరి సమర్థనీయమేనని ఆ తీర్పు నిరూపించిందని ఎస్సార్‌ సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. 2జి స్పెక్ట్రమ్‌ వ్యవహారంలో తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడకపోయినా దానికి మూల్యం చెల్లించుకోవలసి వచ్చిందని యునిటెక్‌ ఎండి సంజయ్‌ చంద్ర అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై అభియోగాలు మోపడం వల్ల తమ కంపెనీ ఆర్థిక స్థితి దెబ్బ తిన్నదని, తమ ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందని సంజయ్‌ వ్యాఖ్యానించారు.
business
9,839
31-07-2017 09:58:48
బిగ్‌బాస్ పెనాల్టీ వ్యవహారంపై అసలు విషయం బయటపెట్టిన సంపూ
తెలుగులో అంచనాలకు మించిన టీఆర్‌పీ రేటింగ్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న షో బిగ్‌బాస్. ఇతర భాషల్లో ఈ షో ముందే మొదలైనప్పటికీ, తెలుగులో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. జూనియర్ ఎన్టీఆర్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ షో ద్వారానే ఎన్టీఆర్‌ తొలిసారిగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే, బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇటీవలే సంపూ బయటికొచ్చిన సంగతి తెలిసిందే. సంపూ బయటకు రావడంతో రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. సంపూ బిగ్ బాస్ షో రూల్స్‌ను అతిక్రమించడంతో లక్షల్లో జరిమానా విధించినట్లు వార్తలొచ్చాయి.  అయితే ఈ ఊహాగానాలకు సంపూర్ణేష్ బాబు తెర దించాడు. పెనాల్టీ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని సంపూ ట్వీట్ చేశాడు. అవన్నీ పుకార్లు మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌ను సంపూర్ణేష్ బాబు పొగడ్తలతో ముంచెత్తాడు. మనకో కష్టమొచ్చినప్పుడు, మన సమస్యల్లో భుజం తట్టినవాడే నిజమైన హీరో అని, ఎన్టీఆర్ అన్న గారే తనకు బిగ్‌బాస్ అని ట్వీట్ చేశాడు. ప్రేక్షక దేవుళ్లకు సంపూ క్షమాపణలు చెప్పాడు. ఇంతటి అవకాశాన్నిచ్చిన బిగ్ బాస్ వారికి, స్టార్ మా ఛానల్ వారికి, ఛానల్ సిబ్బందికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సంపూర్ణేష్ బాబు ట్వీట్ చేశాడు.           ఈ టాప్ హీరోలు విలన్‌గా నటించిన సినిమాలేవో చెప్పండి.. రూ.10వేల నగదు బహుమతులు గెలవండి
entertainment
8,493
05-07-2017 14:37:50
తమ్ముడు భరత్‌ ఇంటికి వెళ్లిన రవితేజ!
మాస్‌మహారాజ్‌ రవితేజ తమ్ముడు భరత్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే భరత్‌ మరణం కంటే అతని అంత్యక్రియలకు రవితేజ హాజరుకాకపోవడమే పెద్ద వార్తగా మారింది. భరత్‌ అంత్యక్రియలకు రవితేజ హాజరుకాకపోవడం, తర్వాతి రోజే షూటింగ్‌కు వెళ్లిపోవడం కొన్ని రోజులపాటు హాట్‌ చర్చలకు దారి తీసింది. దాని గురించి ఓ ఇంటర్వ్యూలో రవితేజ క్లారిటీ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. కాగా, భరత్‌ అంత్యక్రియల తర్వాత జరగాల్సిన పనులు ప్రస్తుతం మాదాపూర్‌లోని భరత్‌ ఇంట్లో జరుగుతున్నాయట. చనిపోయే వరకు భరత్‌ నివసించిన ఇంట్లోనే ఆ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారట. ఈ కార్యక్రమాల కోసం రవితేజ ప్రతీరోజూ మాదాపూర్‌లోని తమ్ముడి ఇంటికి వస్తున్నాడట. రవితేజతోపాటు అతని కుటుంబసభ్యులందరూ ఈ కార్యక్రమాలకు హాజరవుతున్నట్టు తెలుస్తోంది.
entertainment
5,482
25-04-2017 15:38:08
గ్లామర్ రోల్స్‌కు నో చెబుతున్న హీరోయిన్!
గ్లామర్ రోల్స్‌తోనే ఎక్కువగా పాపులర్ అయిన ఓ బ్యూటీ.. ఉన్నట్టుండి ఇప్పడు ఓ విషయంలో కండిషన్స్ అప్లై అంటోందట. నాగార్జున సరసన 'బాస్' సినిమాలో నటించిన పూనమ్ బజ్వా గుర్తుందా..? తెలుగులో అతి కొద్ది సినిమాలకే ఫేడవుట్ అయిన పూనమ్.. ఆ తర్వాత తమిళ, మలయాళ చిత్రసీమలపై దృస్టి సారించింది. సోలో హీరోయిన్‌గా పెద్దగా చాన్సులు రాకపోయినా వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ సరైన సక్సెస్ కోసం ట్రై చేస్తోంది. ప్రస్తుతం తమిళంలో 'కుప్పతు రాజా' అనే సినిమాలో నటిస్తోంది పూనమ్ బజ్వా. డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ అంతా చీరకట్టులో పద్ధతిగా కనిపించబోతోందట పూనమ్.           మరి.. ఈ సినిమా ప్రభావమో మరేదైనా కారణమో కానీ ఉన్నట్టుండి గ్లామర్ రోల్స్ విషయంలో ఈ ముద్దుగుమ్మ ఓ కఠిన నిర్ణయానికి వచ్చేసిందట. ఇకపై గ్లామర్ రోల్స్‌లో నటించకుండా.. కేవలం డీసెంట్‌గా కనిపించే పాత్రలకే ఓకే చెప్పాలన్న నిర్ణయానికి వచ్చిందట పూనమ్ బజ్వా. నిజానికి గ్లామర్ రోల్స్‌లో నటించడం వల్లే ఇన్నాళ్లూ కెరీర్ నెట్టుకుంటూ వచ్చిన పూనమ్.. ఇప్పుడిలా నో చెప్పడం తమిళ తంబీలను ఆశ్చర్యపరుస్తోంది. పైగా.. కొత్తగా వచ్చే భామలంతా గ్లామర్ షోస్‌కు గేట్లు ఎత్తేస్తున్న తరుణంలో పూనమ్ నో చెబితే అవకాశాలు కష్టమంటున్నారు. మరి.. ఈ విషయంలో పూనమ్ పునరాలోచించుకుంటుందేమో చూద్దాం..!
entertainment
10,692
29-08-2017 18:20:27
300 సినిమాలు పూర్తి చేశాడు
సంవత్సరానికొకటి. రెండు సంవత్సరాలకొకటి చొప్పున సినిమాలు చేసే నేటితరం హీరోలకు పెద్ద షాక్ ఇచ్చాడు ఓ సీనియర్ హీరో. ఇటీవలే తన కెరీర్‌లో ఏకంగా 300 సినిమాలను పూర్తిచేసుకున్నాడట ఆ హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. నేటితరం హీరోలు తమ కెరీర్‌లో 50 సినిమాల మైలురాయిని దాటడం కూడా ఎంతో కష్టంగా కనిపిస్తోంది. అలాంటిది ఈ ఏడాది సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి తమ కెరీర్‌లో 100వ, 150వ చిత్రాల్ని పూర్తిచేసుకున్నారు. ఇక ఇదే ఏడాది మరో సీనియర్ హీరో సురేశ్ కూడా 300 చిత్రాలను పూర్తిచేసుకున్నాడట. తమిళంలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న 'పార్టీ' చిత్రం సురేశ్‌కు 300వ చిత్రమట. తెలుగు వాడైన సురేశ్ 1981లో తమిళ చిత్రం ‘పన్నీర్ పుష్పంగళ్'తో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో చిత్రాల్లో హీరోగా నటించాడు. ఎనిమిది, తొమ్మిది దశకాల్లో సురేశ్ హీరోగా నటించిన పలు చిత్రాలు విజయాల్ని సాధించాయి. ఎంతోమంది సీనియర్ హీరోల మాదిరే సురేశ్ కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా టర్న్ అయ్యాడు. ఇప్పుడు వరుసగా అగ్ర కథానాయకుల చిత్రాల్లో ఇంపార్టెంట్ రోల్స్‌లో కనిపిస్తున్నాడు. మునుముందు కూడా సహాయ నటుడిగా ఈ సీనియర్ హీరో అగ్రస్థానంలో నిలుస్తాడేమో చూడాలి.
entertainment
2,422
24-08-2017 01:25:32
రిలయన్స్‌ క్యాపిటల్‌ ఇసాప్‌లు
ఆర్థిక సర్వీసుల సంస్థ రిలయన్స్‌ క్యాపిటల్‌ ఉద్యోగులకు 300 కోట్ల రూపాయల విలువ గల ఇసాప్‌లు ప్రకటించింది. ప్రతిభావంతులైన ఉద్యోగులు కంపెనీ వదిలిపోకుండా నిలబెట్టుకోవడం లక్ష్యంగా ఇసాప్‌లు ప్రకటిస్తారు. వివిధ విభాగాల్లో ఎంపిక చేసిన 500 మంది ఉద్యోగులకు ఇసా్‌పలు ఇవ్వనున్నట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అన్మోల్‌ అంబానీ ప్రకటించారు. రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ ఎఎంసి, రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, రిలయన్స్‌ సెక్యూరిటీ్‌సకు చెందిన సభ్యులకు ఈ స్కీమ్‌లో భాగంగా 9.21 లక్షల షేర్లు ఇస్తారు. దీనికి కంపెనీల బోర్డులు ఇప్పటికే ఆమోదం తెలిపాయి.
business
10,434
31-05-2017 12:41:02
దాసరి మరణంపై రజినీ, కమల్ ఆవేదన
దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కమల్ హాసన్, రజినీకాంత్‌లు దాసరి మృతిపై ట్విట్టర్ ద్వార స్పందించారు. ఆయన మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. దాసరి నారాయణరావుగారు తనకు ప్రియమైన వ్యక్తి అని, తన మంచి కోరుకునే సన్నిహిత మిత్రుడని రజినీకాంత్ ట్విట్టర్ ద్వారా సంతాపం ప్రకటించారు. భారత్‌లోని గొప్ప దర్శకుల్లో దాసరి ఒకరని, ఆయన మరణం మొత్తం భారతీయ సినీ పరిశ్రమకే తీరని లోటని ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ దాసరి నారాయణరావు కుటుంబానికి రజినీ సానుభూతి తెలిపారు. కాగా, దాసరితో ఉన్న అనుబంధాన్ని కమల్ హాసన్ గుర్తు చేసుకున్నారు. దాసరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్టు ట్వీట్ చేశారు. తెలుగు సినిమాకు ఆయన మరణం తీరని లోటన్నారు. దాసరి ఎప్పుడూ కె.బాలచందర్ గారిని అభిమానించేవారని అన్నారు. యాద్గార్ సినిమా షూటింగ్ సందర్భంగా దాసరి నారాయణరావుగారు, సంజీవ్ కుమార్ గారితో గడిపిన రోజులు మరువలేనివని కమల్ అన్నారు.
entertainment
1,001
26-01-2017 01:25:23
ఓడ రేవుల రంగంలోకి టాటా గ్రూపు
ఒడిశా రేవు ప్రాజెక్టులో మెజారిటీ వాటా న్యూఢిల్లీ: టాటా గ్రూపు ఓడ రేవుల రంగంలోకి ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో చెన్నైకి చెందిన క్రియేటివ్‌ పోర్ట్‌ డెవల్‌పమెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (సిపిడిపిఎల్‌), సిఐ మెగా ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు ఏర్పాటు చేసే సువర్ణరేఖ నౌకాశ్రయం ఈక్విటీలో 51 శాతం వాటా తీసుకుంటోంది. ఇందుకోసం బుధవారం టాటా గ్రూపుకు చెందిన టాటా స్టీల్‌ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఒడిశాలోని కళింగనగర్‌లో ఏర్పాటు చేసిన స్టీల్‌ ప్లాంట్‌ ఎగుమతి దిగుమతులకు ఈ ఓడ రేవు ప్రాజెక్టులో వాటా ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే టాటా స్టీల్‌ ఈ నౌకాశ్రయ ప్రాజెక్టు కోసం ఎంత పెట్టుబడి పెడుతోంది వెల్లడించలేదు. 2006లోనే ఈ ప్రాజెక్టును తలపెట్టినా వివిధ కారణాల వలన పనుల ప్రారంభం కాలేదు. టాటా గ్రూపు ప్రవేశంలో ప్రాజెక్టు నిర్మాణం ఊపందుకుంటుందని భావిస్తున్నారు. టాటా గ్రూపు దేశంలోని ఒక నౌకాశ్రయ ప్రాజెక్టు ఈక్విటీలో వాటా తీసుకోవడం ఇదే మొదటిసారి.
business
13,701
16-02-2017 00:21:37
మందుల చీటీలకూ ఆడిట్‌!
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: యాంటీ బయాటిక్‌, యాంటీ వైరల్‌ మందులకు సైతం లొంగకుండా సూక్ష్మజీవులు అత్యంత శక్తిమంతంగా మారడాన్ని (యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌-ఏఎంఆర్‌) కేంద్రం అతిపెద్ద సవాలుగా పేర్కొంది. ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 22న ఒక ప్రచారోద్యమాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఏఎంఆర్‌ సవాల్‌ను సమర్థంగా నిరోధించే వ్యూహాల రూపకల్పనలో నాలుగు కేంద్ర మంత్రిత్వ శాఖలు పాలుపంచుకోనున్నాయి. వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ, పర్యావరణ శాఖతో పాటు.. రసాయనాలు ఎరువుల శాఖలోని ఫార్మాస్యూటికల్స్‌ విభాగం కూడా ఈ పరిధిలోకి వస్తుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.  ఏఎంఆర్‌ సమస్యను ఎదుర్కొనే క్రమంలో భాగంగా.. ప్రిస్ర్కిప్షన్‌ ఆడిట్‌ (వైద్యులు రాసే మందుచీటీల పరిశీలన) చేయాలని భావిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సీకే మిశ్రా చెప్పారు. కూడా యోచిస్తున్నట్టు ఆయన చెప్పారు. అయితే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల చీటీల పరిశీలన సాధ్యమేగానీ దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉండే ప్రైవేటు ఆస్పత్రుల్లో అది అంత సులభమైన పని కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై తాము ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. అలాగే.. ఏఎంఆర్‌పై ఇప్పటికే మూడు కమిటీలు పనిచేస్తున్నాయని.. సవివరమైన మార్గదర్శకాలను ఆ కమిటీలు రూపొందిస్తున్నాయని వచ్చే నెల నాటికి ఆ మార్గదర్శకాలు తమకు అందే అవకాశం ఉందని మిశ్రా పేర్కొన్నారు.  ‘ఈ సమస్యను ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. దీనికి సంబంధించిన విధానాలను అత్యంత కఠినంగా రూపొందించనుంది’ అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే రాజస్థాన్‌లో ప్రతి ఆస్పత్రిలో రోగులకు వైద్యులు రాసే మందుల చీటీలను ఆన్‌లైన్‌లో భద్రపరుస్తారని మిశ్రా తెలిపారు. వాటన్నిటినీ పరిశీలించడం వల్ల యాంటీబయాటిక్‌ మందులను ఏ స్థాయిలో వాడుతున్నారో తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 3, 4వ తరం యాంటీబయాటిక్‌ మందుల విక్రయాల రికార్డులను మందులషాపులు మూడేళ్లపాటు ఉంచాలని.. నిబంధనలను ఉల్లంఘించేవారి షాపుల లైసెన్సులను రద్దు చేస్తామని మరో అధికారి హెచ్చరించారు.
nation
15,431
09-01-2017 03:27:06
దుండగుడిపై లంఘించి.. నసీరుద్దీన్‌షా ప్రాణాలు కాపాడి..
న్యూఢిల్లీ, జనవరి 8: దాడుల నుంచి హీరోయిన్‌నో, స్నేహితుడినో రక్షించడం.. ఆ క్రమంలో దుండగులతో ఫైట్లు చేయడం.. ఇలా తెరమీద హీరో చేసే రకరకాల ఫీట్లు మనకు తెలిసినవే! ఇవే సాహసాలు ఓ నటుడు నిజ జీవితంలోనూ చేస్తే.. సిసలైన హీరోనే అనిపించుకుంటాడు అవునా? ఇటీవల కన్నుమూసిన విలక్షణ నటుడు ఓంపురి తన ప్రాణస్నేహితుడు నసీరుద్దీన్‌ షాను ఓ ప్రాణాంతక దాడి నుంచి రక్షించేందుకు ఈ తరహా ఫీట్‌ చేశారట. ఈ విషయాన్ని నసీరుద్దీన్‌ తన ఆత్మకథ ‘అండ్‌ దెన్‌ వన్‌ డే’ పుస్తకంలో ప్రస్తావించారు. తనతో స్నేహం చెడిన ఓ వ్యక్తి తనపై దాడిచేస్తే, ఓంపురి జంప్‌ చేసి మరీ అతణ్ని అడ్డుకున్నారని.. రక్తమోడుతున్న తనను పోలీసు వాహనంలోనే ఆస్పత్రికి తీసుకెళ్లారని తన ఆత్మకథలో రాసుకున్నారు.  1977లో ‘భూమిక’ అనే సినిమా చిత్రీకరణ జరుగుతున్న రోజుల్లో ముంబైలో డిన్నర్‌ కోసం హోటల్‌కు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందట. ఆ హోటల్లో ఓంపురి, నసీర్‌ ఓ టైబుల్‌ దగ్గర కూర్చుకున్నప్పుడు జస్పాల్‌ అనే వ్యక్తి వచ్చి వారి వెనుకే కూర్చుకున్నాడట. ‘‘ఆ రోజు నాకు బాగా గుర్తు. ఓంపురి, నేను ఇద్దరం తింటూ మాట్లాడుకుంటుండగా.. నా వీపు మధ్యలో ఎవరో చరిచినట్లుగా అనిపించింది. నేను లేచేంతలోనే ఓం బిగ్గరగా అరుస్తూ నా వెనుక వైపు వచ్చేశాడు. వెనక్కి తిరిగి చూస్తే.. జస్పాల్‌ చేతిలో చిన్నపాటి చాకు నుంచి బొట్లు బొట్లుగా రక్తం కారుతోంది. జస్పాల్‌ మరోసారి దాడిచేసేలోపే ఓం సహా అక్కడే ఉన్న మరో ఇద్దరు కలిసి అతడిని ఒడిసిపట్టుకున్నారు.  అప్పటికే రక్తంతో నా వెనుక వెపు చొక్కా అంతా తడిపోయింది. గాయం తాలుకు బాధ అధికమవుతోంది. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఓం చేసిన ప్రయత్నాన్ని హోటల్‌ మేనేజర్‌ అడ్డుకున్నారు. పోలీసులు వచ్చేదాకా తరలించవద్దంటూ వాదులాడాడు. పోలీసు వాహనం వచ్చీరాగానే ఓం హుటాహుటిన నన్ను దానిలో ఎక్కించి తాను లోపలికి దూకేశాడు. ఓం ఈ తీరును పోలీసులు ఆక్షేపించారు. తర్వాత అదే వాహనంలోనే జుహూలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ రోజు ఓంపురి తోడుగా ఉండటం వల్లే నా ప్రాణాలు నిలిచాయి’’ అని నసీర్‌ పుస్తకంలో రాశాడు.
nation
18,777
22-04-2017 23:54:10
జలాశయంపై థర్మాకోల్‌ షీట్లు
చెన్నై, ఏప్రిల్‌ 22: తమిళనాడులో గత 140 ఏళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో తాండవిస్తున్న కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది. భానుడి భగభగలతో జలాశయాల్లో నీరు ఆవిరైపోకుండా ఉండేందుకు ఆ రాష్ట్ర సహకారశాఖ మంత్రి సెళ్లూర్‌ రాజు వినూత్నంగా ఆలోచించారు. ఆయన ఆలోచన మేరకు రూ.10లక్షల విలువైన థర్మాకోల్‌ షీట్లను వైగై జలాశయంపై పరిచేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని మంత్రి విలేకరులను ఆహ్వానించారు. విలేకరుల సమక్షంలో తానే మొదటగా షీట్లను పరిచేందుకు సెళ్లూర్‌ రాజు సిద్ధమయ్యారు. అయితే ఆయన ప్రయత్నానికి వాయుదేవుడు గండికొట్టాడు. బలంగా వీచిన గాలుల ధాటికి షీట్లు ఎగిరిపోయాయి. ప్రకృతి సహకరించక తన పథకం దెబ్బతిందని, చాలా దేశాల్లో ఇదే తరహాలో జల నష్టాన్ని అడ్డుకున్నారని ఆయన చెప్పారు.
nation
15,590
18-07-2017 01:58:38
ప్రత్యేక విమానంలో ఢిల్లీకి జేసీ
రూ.7 లక్షలు వెచ్చించి చార్టర్డ్‌ విమానంలో ఢిల్లీకివిమాన సంస్థలకు క్షమాపణ చెప్పేందుకు విముఖతన్యూఢిల్లీ, జూలై 17(ఆంధ్రజ్యోతి): విమానయాన సంస్థలు నిషేధం విధించడంతో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కావడం, రాష్ట్రపతి ఎన్నికను పురస్కరించుకుని ఆయన రూ.7 లక్షలు వెచ్చించి చార్టర్డ్‌ ఫ్లైట్‌ను సొంతంగా బుక్‌ చేసుకొని విజయవాడ నుంచి ఢిల్లీ వచ్చారు. ఉదయం తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జేసీతో మాట్లాడిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. కేంద్రమంత్రి సుజనాచౌదరిని పిలిచి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూడాలన్నారు.  టీడీపీ వారే విమానయాన శాఖ మంత్రిగా ఉన్నందున వారితోనే మాట్లాడాలన్నారు. అయితే, క్షమాపణ లేఖ ఇచ్చేందుకు జేసీ సిద్ధంగా లేకపోవడంతోనే నిషేధం కొనసాగుతున్నట్లు సమాచారం. కాగా, దేశీయ విమానయాన సంస్థలు తనపై నిషేధం విధించడాన్ని సవాల్‌ చేస్తూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నిషేధంపై స్టే ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే, మధ్యంతర స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వివరణ తీసుకోకుండా ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి, విమానయాన సంస్థలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు ఈమెయిల్‌ ద్వారా పంపడానికి అనుమతించింది. స్పీడ్‌ పోస్టులో కూడా పంపాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీ భట్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.  దివాకర్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది డీవీ సీతారామమూర్తి వాదించారు. పిటిషనర్‌ ఎంపీగా ఉన్నారని, ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున విమానయానంపై నిషేధం విధించడం సరికాదని అన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్‌ నడుపుతున్న బస్సుల్లో దురుసుగా వ్యవహరించి తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేవారిని అనుమతించరని, అలాంటిది విమాన సంస్థలు భద్రతకు సంబంధించి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు.
nation
2,192
18-11-2017 00:29:37
రూపాయిదీ అదే జోరు
ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి కూడా ఈక్విటీల జోరునే కొనసాగించింది. అమెరికన్‌ డాలర్‌ మారకంలో ఒక్క రోజులోనే 31 పైసలు పెరిగి 65.01 రూపాయల వద్ద క్లోజయింది. ఇది వారం రోజుల గరిష్ఠ స్థాయి. ఆరు వారాల కాలవ్యవధిలో ఒకే రోజు రూపాయి ఇంత భారీగా లాభపడడం కూడా ఇదే ప్రథమం. ఇంట్రాడేలో భారత కరెన్సీ 64.60 రూపాయల స్థాయిని తాకింది. కాని రూపాయి పరుగులను అదుపు చేసేందుకు పిఎ్‌సబిల ద్వారా ఆర్‌బిఐ జోక్యం చేసుకోవడం రూపాయిని నిలువరించింది. దేశీయ ఈక్విటీల్లో ర్యాలీ భారత కరెన్సీకి కూడా అనూహ్యమైన ఊపు ఇచ్చింది. ఒక్క డాలరు మారకంలోనే కాకుండా పౌండ్‌ స్టెర్లింగ్‌, యూరో మారకాల్లో కూడా రూపాయి మంచి వృద్ధిని నమోదు చేసింది. ఒక్క జపాన్‌ యెన్‌తో మాత్రమే స్వల్పంగా నష్టపోయింది.
business
7,175
01-11-2017 19:04:30
లావణ్య త్రిపాఠికి బిగ్ షాక్
ఏమైందో ఏమో తెలియదు కానీ కొన్ని నెలలుగా ఆ అందాల రాక్షసికి కాలం కలసి రావడం లేదు. ఒక వైపు వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న బ్యూటీకి తాజాగా కొత్త కష్టం వచ్చిపడిందట. ఒక్కోసారి హీరోయిన్లు కెరీర్ పరంగా వరుస ఇబ్బందులు ఎ దుర్కొంటుంటారు. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉందని సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలలుగా వరుస ఫ్లాపులను చవిచూసిన ఈ ముద్దుగుమ్మ తన కొత్త సినిమా 'ఉన్నది ఒక్కటే జిందగీ'పై ఆశలు పెట్టుకుంది. అయితే ఈ సినిమా కూడా యావరేజ్‌గానే ఉందని టాక్ కూడా రావడంతో లావణ్య హిట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి కొనసాగుతోందని కొందరు చర్చించుకుంటున్నారు. ఆమె నటించిన సినిమాల సంగతి ఎలా ఉన్నా కొత్తగా అమ్మడికి మరో కష్టం వచ్చిందని తెలుస్తోంది. ఆ మధ్య 'హండ్రెడ్ పర్సెంట్ లవ్' తమిళ రీమేక్‌లో నటించేందుకు ఒప్పుకుని ఆ తరువాత తప్పుకున్న లావణ్యకు తమిళ నిర్మాతల మండలి భారీగా జరిమానా విధించిందట. లావణ్యతో అప్పటికే కొన్ని సీన్లు చిత్రీకరించిన దర్శకనిర్మాతలు ఆమె హఠాత్తుగా ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో బాగా నష్టపోవాల్సి వచ్చిందట. ఇదే విషయమై చిత్ర నిర్మాతలు తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేయగా ఆమెకు భారీ మొత్తంలో జరిమానా విధించినట్టు వార్తలు జోరందుకున్నాయి. దీనిపై లావణ్య త్రిపాఠి అధికారికంగా స్పందించకపోయినప్పటికీ ఆమెకు కోలీవుడ్‌లో ఇబ్బందులు తప్పకపోవచ్చని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు లావణ్య కూడా ప్రయత్నాలు మొదలుపెట్టిందనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా కెరీర్ పరంగా లావణ్య త్రిపాఠికి కష్టాలన్నీ కట్టకట్టుకువచ్చినట్టే కనిపిస్తోంది.
entertainment
7,802
10-10-2017 23:23:48
ఎన్టీఆర్‌ జీవితం ఓ మహాభారతం!
                           - రాంగోపాల్‌ వర్మరాజకీయాలకు అతీతంగా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెలిపారు. చిత్ర నిర్మాత రాకేష్‌ రెడ్డి సొంతూరైన చిత్తూరు జిల్లా పలమనేరులో మంగళవారం మధ్యాహ్నం వర్మ విలేకరులతో మాట్లాడారు. నిర్మాత రాకేష్‌ రెడ్డి పలమనేరు నియోజకవర్గ వైసీపీ సయన్వయకర్తల్లో ఒకరు. ఈ నేపథ్యంలో రాకేష్‌ రెడ్డి టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను తెరకెక్కించడానికి ముందుకు రావడంతో ఈ చిత్రం రాజకీయ రంగు పులుముకుంది.  ఈ సందర్భంగా రాంగోపాల్‌ వర్మ మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర మహాభారతంలోని 18 పర్వాలు లాంటిదని అందులో ఒక భాగాన్నే చిత్రంగా మలుస్తున్నాన్నన్నారు. మిగిలిన పర్వాలు తాను తీయబోనని మరెవరైనా తీసుకొనే అవకాశం ఉంటుందన్నారు. రాకేష్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చినప్పుడు ఆయన వైసీపీలో ఉన్న సంగతి తనకు తెలియదన్నారు. రాజకీయాలకు అతీతంగానే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నానన్నారు. ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి అడుగు పెట్టిన నాటి నుంచి ఈ కథ ప్రారంభమవుతుందని, ఆయన మృతి చెందిన సంఘటనతో చిత్రం ముగుస్తుందన్నారు. ఒక భాగంలోనే ఈ సంఘటలన్నీ ప్రేక్షకులకు చూపించనున్నామన్నారు.  వైశ్రాయ్‌ హోటల్‌లో జరిగిన రాజకీయ సంఘటనలను పెద్దగా చూపిస్తారా అన్న విలేకరుల ప్రశ్నకు అన్నీ సమానంగానే ఉంటాయన్నారు. లక్ష్మీపార్వతి పాత్రలో నగరి ఎమ్మెల్యే రోజా నటిస్తారా అన్న ప్రశ్నకు నటీనటులను ఎంపిక ఇంకా చేయలేదని బహుశా రోజా కూడా సినిమాలో ఉండవచ్చన్నారు. ఈ చిత్రాన్ని 2018 ఫిబ్రవరిలో ప్రారంభించి అక్టోబర్‌లో విడుదల చేస్తామన్నారు. ఎన్నికలకు దగ్గర్లో విడుదల చేయడంపై ఇది రాజకీయ కుట్రగా పలువురు భావిస్తున్నారన్న ప్రశ్నకు.. సినిమా పూర్తయిన తరువాత దాచిపెట్టుకొని విడుదల చేసే అవకాశం ఉండదని, ఎప్పుడు పూర్తయితే అప్పుడే విడుదల చేస్తామని, ఎన్నికలకూ, సినిమాకూ సంబంధం లేదనీ తెలిపారు. నిర్మాత రాకేష్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘తాను రామ్‌గోపాల్‌ వర్మతో ముంబాయికి వెళ్లి లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ కథ విన్న తరువాత ధైర్యం, నమ్మకం కలిగిందన్నారు.  ఎంత బడ్జెట్‌నైనా పెట్టడానికి వెనకాడనని, ఎవరి బెదిరింపులకు భయపడకుండా తాను ఈ చిత్రాన్ని నిర్మిస్తానని చెప్పారు. తాను వైసీపీలో ఉన్నంత మాత్రాన సినీ వ్యాపారం చేయకూడదని ఎక్కడా లేదన్నారు. ఇదో వ్యాపారంలాంటిదని తనకు లిక్కర్‌, కన్‌స్ట్రక్షన్‌ వ్యాపారాలు ఉన్నాయని సినీ రంగం కూడా వ్యాపారంలాంటిదేనని తెలిపారు. - ఆంధ్రజ్యోతి, పలమనేరు
entertainment
6,171
20-04-2017 19:32:12
బద్రి షూటింగ్ సమయంలో విషాద వార్త విన్నా: రేణుదేశాయ్
బద్రి సినిమా రిలీజై నేటికి 17 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ నటించిన విషయం తెలిసిందే. బద్రి షూటింగ్ సమయంలో జరిగిన ఓ విషాద వార్తను రేణుదేశాయ్ ట్విట్టర్ ద్వారా గుర్తుచేసుకొని కన్నీటిపర్యంతమయ్యారు. తను షూటింగ్‌లో ఉండగా ఓ ఫోన్ కాల్ వచ్చిందని.. అది ఓ విషాద వర్త అని.. అది విని ఏడ్చారని చెప్పారు. అంత విషాదాన్ని మనసులో ఉంచుకొని షూటింగ్‌లో పాల్గొన్నారని తెలిపారు. అయితే షూటింగ్ సమయంలో కంటతడి పెట్టిన ఫొటోను రేణు దేశాయ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ సమయంలో బాధను దిగమింగుకున్నప్పటికీ కళ్లలో నీళ్లు తిరుగాయని.. అందుకు సాక్షం ఈ ఫొటోనే అని చెప్పారు. ఆ బాధకు కారణం తన ఫ్రెండ్ చనిపోవడమేనన్నారు. తన ఫ్రెండ్ పుణేలో రోడ్డుప్రమాదానికి గురై మృతి చెందిందని.. ఆ విషయాన్ని ఫోన్‌కాల్ ద్వారా తెలిసిందని చెప్పారు. ఆ బాధను మనసులో పెట్టుకొని బద్రి షూటింగ్‌లో పాల్గొన్నట్లు రేణుదేశాయ్ తెలిపారు.
entertainment
9,837
11-08-2017 17:19:59
‘లై’ మూవీపై పబ్లిక్ టాక్ ఇదే...
నితిన్ హీరోగా నటించిన ‘లై’ మూవీ సక్సెస్‌ఫుల్‌గా ధియేటర్స్‌లో ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించగా, సంగీతం మణిశర్మ అందించారు. మేఘా ఆకాష్‌, అర్జున్, ర‌వికిష‌న్‌, నాజ‌ర్‌, శ్రీ‌రామ్‌, సురేష్‌, అజ‌య్‌, పృథ్వీ, బ్ర‌హ్మాజీ, మ‌ధుసూధ‌న్‌, రాజీవ్‌క‌న‌కాల‌, పూర్ణిమ త‌దిత‌రులు నటించారు. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. దీనిపై ప్రేక్షకుల స్పందన తెసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.
entertainment
19,011
08-03-2017 20:45:07
ఐదుగురు ఉగ్రవాదులను.. ఉరి తీసిన పాక్
ఇస్లామాబాద్: కరుడుగట్టిన ఐదుగురు ఉగ్రవాదులను పాకిస్థాన్ బుధవారం ఉరి తీసింది. ఓ కారాగారంలో మరణ శిక్షను అమలు చేసినట్లు పాక్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఐదుగురు తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులుగా తెలిపాయి. పాక్‌లో ఉగ్రదాడులకు పాల్పడిన వీరిని రెండు నెలల కిందట మూతపడిన ఆర్మీ కోర్టు దోషులుగా ఖరారు చేసి మరణశిక్ష విధించింది. 2014లో పాక్‌కు చెందిన తాలిబాన్ ఉగ్రవాదులు ఆర్మీ స్కూల్‌పై దాడి చేసి చిన్నారులతో పాటు 150 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనతో ప్రత్యేక ఆర్మీ కోర్టులను ఏర్పాటు చేసిన పాక్ ప్రభుత్వం రెండేళ్ళ కాలంలో 400 మందికిపైగా ఉగ్రవాదులకు మరణ శిక్షలు విధించి అమలు చేసింది.
nation
17,446
25-03-2017 15:26:07
చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఈసీ షాక్...
చెన్నై: ఆర్కే నగర్ నియోజకవర్గం ఉపఎన్నిక ఏప్రిల్‌లో జరుగునున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ శనివారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై నగర పోలీస్ కమిషనర్‌ ఎస్.జార్జిని బదిలీ చేసింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం సీబీసీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఉన్న కరణ్ సిన్హాను కొత్త పోలీస్ కమిషనర్‌‌గా నియమించింది. ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజవర్గంలో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరగాలంటే పోలీస్ కమిషనర్‌ను బదిలీ చేయాలంటూ డీఎంకే ఒక పిటిషన్‌ ఈసీ వద్ద దాఖలు చేసింది. డీఎంకే ఎంపీలు టీకేఎస్ ఇళాంగోవన్, ఆర్ఎస్ భారతి, తిరుచ్చి శివతో కూడిన ప్రతినిధి బృందం ఈనెల 17న ఈసీని కలిసి ఫిర్యాదు చేసింది. అధికార అన్నాడీఎంకేకు అనుకూలంగా పోలింగ్‌ను చెన్నై పోలీస్ కమిషనర్ జార్జి ప్రభావితం చేసే అవకాశాలున్నాయని ఆ పిటిషన్‌లో డీఎంకే ఎంపీల బృందం ఆరోపించింది. ఈ నేపథ్యంలో జార్జిని బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలిచ్చింది.
nation
6,071
17-04-2017 11:32:47
అనుష్క హీరోయిన్ కాదు.. హీరో: ప్రభాస్
ఆంధ్రజ్యోతి: బాహుబలి టీం ప్రభాస్, రానా, అనుష్క ఏబీఎన్‌తో కాసేపు చిట్ చాట్ చేశారు. సరదా సరదా సాగిన ఈ చిట్ చాట్‌లో ముగ్గురూ వారి అభిప్రాయాలను పంచుకున్నారు. సైజ్ జీరో సినిమా గురించి.. బాహుబలి గ్యాప్‌లో ఒక హీరోయిన్ ఫ్యాట్ అవడం, తగ్గడం.. అంత రిస్క్ ఎందుకు చేశారని యాంకర్ అడగ్గా.. ప్రభాస్ కల్పించుకుని హీరోయిన్ కాదు కదా.. అనుష్క హీరో అని జోక్ చేశారు. తనకు సైజ్ జీరో చేస్తున్నప్పుడు అదో రిస్క్ అనిపించలేదని.. తర్వాత అనిపించిందని అనుష్క తెలిపారు. భల్లాలదేవ క్యారెక్టర్‌కు వైఫ్ గురించి ఆసక్తికర చర్చ జరిగింది. దీనిని వీడియోలో చూడండి.
entertainment
19,313
03-07-2017 09:57:26
విమెన్ క్రికెట్‌పై వెటకారం
ఇస్లామాబాద్: వరల్డ్ కప్ టోర్నమెంట్స్‌లో మహిళా మ్యాచ్‌లకు ఓవర్లు కుదించాలంటూ సలహా ఇచ్చి చిక్కుల్లో పడ్డాడు పాక్ జట్టు మాజీ కోచ్ వఖార్ యూనిస్. ఆయన వ్యాఖ్యలు వివక్షాపూరితంగా ఉన్నాయంటూ నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కొద్దిరోజుల క్రితం ఐసీసీకి వఖార్ ఓ ట్వీట్ చేస్తూ, మహిళల ప్రపంచ కప్‌లో ఇరుజట్ల ఓవర్లూ 50 నుంచి 30 చేయాలని, 20 ఓవర్లు కుదించాలని సూచన చేశారు. అయితే తన ప్రతిపాదనకు కారణమేమిటనేది ఆ ట్వీట్‌లో ఆయన వివరించలేదు. పాక్‌ జట్టుకు ఉత్తమ ఫాస్ట్ బౌలర్లను అందించారన్న మంచి పేరున్న వఖార్ వ్యాఖ్యలు ఆయన ఫ్యాన్స్‌ని సైతం ఆగ్రహానికి గురిచేశాయి. వఖార్ తన వ్యాఖ్యలు ద్వారా మహిళల పట్ల వివక్ష చూపారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో వఖార్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తన వ్యాఖ్యల ఉద్దేశం అది కాదంటూ మరో ట్వీట్ చేశారు. తక్కువ ఓవర్లుంటే వేగంతో పాటు ఆడియెన్స్ కూడా పెరుగుతాయని, కాంపటీటివ్ క్రికెట్‌గా కూడా మంచి పేరు వస్తుందన్నదే తన సూచన వెనుక ఉన్న ఉద్దేశమన్నారు. మహిళల పట్ల తనకు ఎలాంటి చిన్నచూపూ లేదని సంజాయిషీ ఇచ్చుకున్నారు.
sports
16,569
10-01-2017 17:54:02
ఆఫ్ఘన్ పార్లమెంట్ సమీపంలో ఆత్మాహుతి దాడి
కాబూల్: ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లో ఉన్న పార్లమెంట్ సమీపంలో రెండు పేలుళ్లు జరిగాయి. ఇందులో ఒకటి ఆత్మాహుతి దాడి కాగా మరొకటి కారుబాంబు దాడి. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. పార్లమెంట్ భవనాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఘటనా స్థలాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ పార్లమెంట్‌ను భారత్ నిర్మించింది.
nation
9,165
09-12-2017 22:25:34
చిట్టిబాబు లుక్‌ అదిరింది!
గళ్ల లుంగీ, రంగుల బనీన్‌, డిజైన్‌ షర్ట్‌, మెళ్లో తువాలు.. టోటల్‌గా ఇదీ చిట్టిబాబు గెటప్‌. తూర్పు గోదావరి జిల్లాలో ఇలాంటి గెట్‌పలో చాలా మంది కనిపిస్తుంటారు. విలక్షణమైన కథలు, పాత్రలతో వైవిధ్యమైన చిత్రాలు రూపొందించే దర్శకుడు సుకుమార్‌, అందుకేనేమో విలేజ్‌ బ్యాక్‌డ్రా్‌పలో తను తీస్తున్న ‘రంగస్థలం’ లో రామ్‌చరణ్‌ని ఇలా చూపించనున్నారు. కొత్త తరహా పాత్రలను పోషించడానికి ఉత్సాహం చూపించే రామ్‌చరణ్‌ ఈ పక్కా మాస్‌ గెట్‌పలో చక్కగా వదిగారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ ‘రంగస్థలం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘మా సినిమాలో చిట్టిబాబుగా నటిస్తున్న రామ్‌చరణ్‌గారికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశాం. ఆయన మాస్‌ యాక్టింగ్‌, సమంత గ్లామర్‌ ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేస్తాయి. వారిద్దరూ ఇంతకు ముందెన్నడూ చేయని విభిన్న పాత్రలు చేస్తుండటంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఐదు రోజుల టాకీ, రెండు పాటలు మినహా చిత్రం పూర్తయింది. ఈ నెల్లో టాకీ పార్ట్‌నీ, జనవరిలో పాటలను చిత్రీకరిస్తాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసి, మార్చి 30న సినిమాను విడుదల చేస్తాం’ అని తెలిపారు.
entertainment
8,245
25-09-2017 11:55:09
వరుసగా మూడు సార్లు అందుకున్న ఘనత తారక్‌దే!
జై లవకుశ మూవీ సక్సెస్‌తో జోష్‌లో ఉన్న తారక్‌కు మరో హ్యాపీ న్యూస్ అందింది. వరుసగా మూడుసార్లు రూ.50కోట్ల షేర్‌ను అందుకున్న ఘనత తారక్‌ను వరించింది. మొదటి నాలుగు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ.40కోట్ల షేర్‌ను రాబట్టిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.50కోట్ల షేర్ విలువను దాటేసింది. నాలుగు రోజుల్లోనే ఇంత కలెక్షన్లను సాధించిందంటే త్వరలో రూ.100కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి చేరుకోవడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రానికి జై పాత్ర చాలా ప్లస్ అయింది. విడుదలకు ముందు నుంచే ఈ పాత్రపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా జై క్యారెక్టరైజేషన్ ఉండటంతో ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ సాయంత్రం జై లవకుశ సక్సెస్ మీట్‌ను చిత్ర యూనిట్ జరుపుకోనుంది.
entertainment
20,833
24-02-2017 02:15:09
సమీర్‌ వర్మకు కెరీర్‌ బెస్ట్‌
న్యూఢిల్లీ: భారత యువ షట్లర్‌ సమీర్‌ వర్మకు కెరీర్‌లో ఉత్తమ ర్యాంక్‌ దక్కింది. తాజా బీడబ్ల్యూఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో సమీర్‌ ఏకంగా 11 స్థానాలు ఎగబాకి 23వ ర్యాంక్‌లో నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఐదో ర్యాంక్‌ పదిలం చేసుకోగా.. సైనా నెహ్వాల్‌ తొమ్మిది నుంచి పదో ర్యాంక్‌కు పడిపోయింది. ఇటీవల జరిగిన సయ్యద్‌ మోదీ గ్రాండ్‌ ప్రీ టోర్నీలో సమీర్‌ విజేతగా నిలిచాడు.
sports
14,774
14-10-2017 02:24:26
బ్లూవేల్‌పై సర్కారు సమాధానమివ్వాలి
న్యూఢిల్లీ, అక్టోబరు 13: అనేక మంది ఆత్మహత్యలకు కారణమైన ఇంటర్నెట్‌ గేమ్‌ బ్లూవేల్‌పై సుప్రీంకోర్టు ప్రభుత్వ సమాధానం కోరింది. చిన్న పిల్లలు బ్లూవేల్‌ బారినపడకుండా ఒక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ధర్మాసనం కోరింది. సీజే జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ముందు శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చింది.
nation
20,590
31-12-2017 23:27:34
సచిన్‌, యువీ ‘2018’ పార్టీ
న్యూఢిల్లీ: 2017 వెళ్లిపో యింది.. 2018 వచ్చేసింది. అంద రూ సంబరాల్లో మునిగి తేలుతు న్నారు. అయితే, సచిన్‌ టెండూల్కర్‌ మాత్రం న్యూ ఇయర్‌ వేడుకలను ఓరోజు ముందుగానే జరుపుకున్నా డు. యువరాజ్‌ సింగ్‌, మాజీ క్రికెటర్‌ అజిత్‌ అగార్కర్‌లతో కలిసి సచిన్‌ పార్టీ చేసుకున్నాడు. ఈ పార్టీ వేడుకల ఫొటోలను యువరా జ్‌ సింగ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ‘లవ్లీ నైట్‌..గ్రేట్‌ ఫన్‌.. థ్యాంక్స్‌ సచిన్‌’ అని యువీ ఆ ఫొటోల కింద కామెంట్‌ చేశాడు.
sports
17,988
21-06-2017 04:35:12
మీకు నా మద్దతు ఉండదు
సోనియాకు నితీశ్‌ ఫోన్‌..రాష్ట్రపతి ఎన్నిక విషయంలో జేడీయూ నేత, బిహార్‌ సీఎం విపక్షాలకు షాక్‌ ఇచ్చారు. మంగళవారం ఆయన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాకు ఫోన్‌ చేసి రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాలు సూచించే అభ్యర్థికి మద్దతు ఇవ్వలేనని స్పష్టం చేశారు. బిహార్‌ గవర్నర్‌గా పనిచేసిన రామ్‌నాథ్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించేందుకు తనకు తగిన కారణాలు కూడా కనిపించడం లేదని ఆయన సోనియాతో వ్యాఖ్యానించినట్లు సమాచారం.
nation
4,177
27-10-2017 00:50:35
కాలుష్యం కోరల్లో భారత్‌
పర్యావరణ కాలుష్యం కారణంగా సంభవిస్తున్న మరణాల సంఖ్యలో భారత్, ప్రపంచంలో మొదటి స్థానంలో నిలవడం బాధాకరం. అంతర్జాతీయ వైద్య ఆరోగ్య జర్నల్ లాన్సెట్ అధ్యయనం మేరకు 2015లో ప్రపంచవ్యాప్తంగా కాలుష్య ఫలిత మరణాలు 90 లక్షలైతే, అందులో 25 లక్షలు భారత దేశంలోనే జరిగాయి. అంటే మన దేశం వాటా 28 శాతం. మన దేశంలో జరిగిన అన్ని మరణాల్లో ఈ తరహా మరణాలు పాతిక శాతం. ముఖ్యంగా వాయు, జల కాలుష్యం భారత్‌ని పట్టి పీడిస్తుంది. ఈ ఉపద్రవంపై దేశం మేల్కోవాల్సి ఉంది. ప్రజల్లో అవగాహన లేకపోవడంతో బాటు, గల్లీ నుండి ఢిల్లీ వరకు పాలనా వైఫల్యమూ ముఖ్యకారణమే. ఇప్పుడు కావాల్సింది కాలుష్య నియంత్రణ మాత్రమే కాదు, కాలుష్య నివారణ. అందుకు తగ్గ సమగ్ర వ్యూహం. ప్రస్తుతానికి స్వచ్ఛ భారత్ అన్నది ఒక చిన్న అడుగు మాత్రమే. కాలుష్య రహిత దేశంగా తయారవ్వడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.- డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం
editorial
7,789
18-12-2017 17:31:36
ఈసారి టైటిల్ సాంగ్ ప్రోమోతో ఆకట్టుకున్న నాని
డ‌బుల్ హ్యాట్రిక్ హీరో నాచురల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రాబోతున్న సినిమా 'ఎంసీఏ'. 'మిడిల్ క్లాస్ అబ్బాయి' అనే టాగ్‎లైన్‎తో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‎పై రూపొందించారు. దిల్‎రాజు పుట్టినరోజు సందర్బంగా నిన్న డిసెంబర్ 17న 'ఫ్యామిలీ పార్టీ సాంగ్ ట్రైలర్' బయటకు వదిలిన చిత్రయూనిట్ తాజాగా కొద్దిసేపటి క్రితమే 'ఎంసీఏ టైటిల్ సాంగ్ ప్రోమో' ను విడుదల చేసింది. 'వీధి చివర ఉంటాదో టీ కొట్టు.. ఆడ మేం తాగే టీఏమో వన్ బై టూ..' అంటూ ఎంతో నాచురల్ లిరిక్స్‎తో సాగిపోతున్న ఈ పాటను నాచురల్ లొకేషన్స్‎లో చిత్రీకరించారు. నిజ జీవితంలో మిడిల్ క్లాస్ అబ్బయిల తీరు ఎలా ఉంటుందనేది ఈ పాటలో పొందుపరిచారు. దేవి శ్రీ అందించిన సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. శ్రీరామ్ వేణు ద‌ర్శక‌త్వంలో దిల్‌రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో నాని సరసన ఫిదా బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‎గా నటించగా వదిన గా భూమిక ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. భారీ అంచనాల నడుమ డిసెంబ‌ర్ 21న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
entertainment
6,671
13-04-2017 17:28:11
జెమినీ గణేషన్ పాత్రలో ఎవరు?
 ఈ రోల్‌ కోసం పాపులర్‌ నటుణ్ని తీసుకోవాలని నాగ్‌ అశ్విన్ అనుకుంటున్నాడట. జెమినీ గణేషన్ తమిళుడు కాబట్టి.. ఈ రోల్‌ కోసం ఓ తమిళ స్టార్‌ యాక్టర్‌ను తీసుకోవాలనుకుంటున్నాడట. ఈ పాత్రకు ఎవరు సూటవుతారనే విషయంలో తర్జనభర్జనలు పడుతున్నారట. అన్ని రకాల ఎమోషన్స్ పలికించడంతోపాటు, యువకుడిగా, ముసలివాడిగా తెరపై కనిపించాల్సి ఉంటుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వేట సాగిస్తోందట చిత్రబృందం.
entertainment
13,980
13-10-2017 02:20:30
కేజ్రీవాల్‌ కారు పోయింది!
న్యూఢిల్లీ, అక్టోబరు 12: కార్లు పోవడం కొత్త కాదుగానీ.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కారు పోతే మాత్రం అది వార్తే! అందునా పరిపాలనకు కేంద్రమైన సచివాలయంలోనే పోతే.. అది కచ్చితంగా చెప్పుకోదగిన వార్తే!! గురువారం ఢిల్లీలో అదే జరిగింది. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ చాలాకాలంపాటు వాడిన నీలి రంగు మారుతీ వేగన్‌ ఆర్‌ సచివాలయంలో పోయింది. అయితే, ప్రస్తుతం ఆ కారును ఆయన వాడట్లేదు. 2014 నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ మీడియా సమన్వయకర్త వందన సింగ్‌ ఆ కారును వినియోగిస్తున్నారు. దాన్ని కాస్తా ఎవరో దొంగిలించడంతో వందన సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
nation
2,124
27-03-2017 23:27:40
ఈ బైక్‌ ధర రూ.19.92 లక్షలు
న్యూఢిల్లీ : భారత మార్కెట్లోకి మరో సూపర్‌ బైక్‌ విడుదలైంది. ఇటలీకి చెందిన డుకాటి కంపెనీ తన లిమిటెడ్‌ ఎడిషన్‌ ‘డుకాటి డయావెల్‌ డీజిల్‌’ బైక్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. ఢిల్లీలో ఈ బైక్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.19.92 లక్షలు. డీజిల్‌ లైసెన్సింగ్‌ క్రియేటివ్‌ డెరెక్టర్‌ అండ్రియా రోసోతో కలిసి డుకాటి డిజైన్‌ సెంటర్‌ ఈ బైక్‌ను అభివృద్ధి చేసింది. ప్రత్యేకంగా ఆర్డర్‌ ఇవ్వడం ద్వారా దేశంలోని డుకాటి డీలర్ల ద్వారా ఈ బైక్‌ను కొనుగోలు చేయవచ్చని డుకాటి ఇండియా ఎండి రవి అవలూర్‌ చెప్పారు.
business
8,983
29-03-2017 16:44:06
ఇంటికి వెళ్తే జయలలిత లేరు. శశికళ ఉన్నారు: జయసుధ
 ‘జయలలితగారి వందో సినిమాలో నేను కూడా నటించాను. ఆ ఒక్క సినిమాలోనే ఆవిడతో కలిసి నేను నటించాను. అయినా, నన్ను ఆవిడ చాలా ప్రేమగా చూసుకునేవారు. ఒకసారి ఊటీలో ఆవిడ సినిమా షూటింగ్‌, నా సినిమా షూటింగ్‌ పక్కపక్కనే జరుగుతున్నప్పుడు బాగా మాట్లాడుకునే వాళ్లం. ఆ సమయంలోనే ఒకసారి నాకు బాగా జ్వరం వచ్చింది. అప్పుడు నాతో మా నాన్న మాత్రమే ఉన్నారు. హోటల్‌ రూమ్‌లో నన్ను పడుక్కోబెట్టి నీటిలో చిన్న క్లాత్‌ ముంచి నా నుదుటిపై రాసేవారు మా నాన్న. అలా కొద్దిసేపు రాసి బయటకు వెళ్లారు. అప్పుడే ఎవరి ద్వారానో నాకు జ్వరమని తెలుసుకున్న జయలలిత నా రూమ్‌కు వచ్చి పరామర్శించారు. టేబుల్‌ మీద ఉన్న నీటిని మార్చి మా నాన్న చేసినట్టే గుడ్డతో నా నుదుటిపై రాశారు. మా నాన్న తిరిగి వచ్చేవరకు జయలలిత నాకు తోడుగానే ఉన్నారు. ఆ తర్వాత 2004-05లో నావి వరుస సినిమాలు ఫ్లాపై ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నాను. అప్పుడు తమిళ్‌లో ఓ సీరియల్‌ చేద్దామనుకున్నాను. జయలలితగారికి చెందిన జయ టీవీలో ఆ సీరియల్‌ ప్రసారం చేయాలనుకున్నాం. కానీ, మాకు స్లాట్‌ దొరకలేదు. అప్పుడు జయలలితగారి సహాయం తీసుకుందామనుకున్నాం. కానీ, ఆవిడ అపాయింట్‌మెంట్‌ దొరకలేదు. అప్పుడు వేరే వారితో ఆవిడకు సమాచారం చేరవేశాం. అప్పుడు ఇంటికి రమ్మని పిలుపు వచ్చింది. ఇంటికి వెళ్తే జయలలిత లేరు. శశికళ ఉన్నారు. ఆవిడ ‘అమ్మ అంతా చెప్పారు. మీకేం ఇబ్బంది లేద’ని మాకు భరోసా ఇచ్చారు.  ఇటీవలి కాలంలో తమిళనాడులో జరిగిన దక్షిణాది చిత్ర పరిశ్రమ వేడుకలో కూడా జయలలిత నన్ను గుర్తు పెట్టుకున్నారు. జాబితాలో నా పేరు లేకపోయినా నన్ను తమిళ సీమ నిర్వహించిన వేడుకకు ఆహ్వానించార’ని తెలిపింది జయసుధ.
entertainment
18,567
30-04-2017 03:26:14
సీట్ల పెంపు ఎలా?
జిల్లా దాటొద్దు... ఒకే ఎంపీ స్థానంలో ఉండాలి!నిబంధనలకు లోబడి కూర్పు ఎలా?పార్లమెంటును యూనిట్‌గా చేయాలా?జిల్లాను యూనిట్‌గా చేయాలా?‘సవరణ’పై కేంద్రం కసరత్తుతెలంగాణలో జిల్లాల పెంపుతో సమస్యలోక్‌సభ స్థానం యూనిట్‌ కోసం వినతిన్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కసరత్తు చేస్తున్న కేంద్రం ముందు కొత్త ప్రశ్నలు నిలుస్తున్నాయి. వాటికి సమాధానాల కోసం అన్వేషణ సాగుతోంది. కొత్త అసెంబ్లీ స్థానాలను ఏర్పాటు చేయడానికి లోక్‌సభ స్థానాన్ని యూనిట్‌గా తీసుకోవాలా? లేక జిల్లాను యూనిట్‌గా తీసుకోవాలా? అన్న అంశంపై కేంద్రం తర్జన భర్జన పడుతోంది. ఈ విషయంలో న్యాయపరమైన చిక్కులను తొలగించేందుకు తగిన సలహాలు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ న్యాయశాఖ అధికారులను ఆదేశించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. విభజన చట్టంలోని సెక్షన 26 ప్రకారం తెలంగాణలో 119నుంచి 153 అసెంబ్లీ స్థానాలు, ఏపీలో 175నుంచి 225 స్థానాలను పెంచుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170 ప్రకారం 2026వరకూ సీట్ల పెంపుపై కసరత్తు చేయలేమంటూ ఎన్నికల కమిషన్‌ చేతులెత్తేసింది. దీంతో కేంద్రం ‘సవరణ’ కసరత్తు ప్రారంభించింది. సెక్షన 26ను మాత్రమే సవరించాలా? లేక రాజ్యాంగ సవరణ చేయాలా? అన్న అంశాలతో కేబినెట్‌ నోట్‌ను హోంశాఖ సిద్ధం చేస్తోంది. ఈ తరుణంలో అనేక ఇతర సమస్యలు తెరపైకి వచ్చాయి. గతంలో 2001 జనాభా లెక్కల ప్రకారం 2002 పునర్విభజన చట్టంతో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల పునర్విభజన జరిగింది. ఇప్పుడు 2011 జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చినందున నియోజకవర్గాల పెంపునకు ఈ అంశం కూడా ఒక అడ్డంకిగా మారనుంది. నిజానికి, ఏ నియోజకవర్గ పునర్విభజన అయినా జనాభా ప్రాతిపదికనే జరగాల్సి ఉంది. మొత్తం రాష్ట్ర జనాభా సంఖ్యను అసెంబ్లీ స్థానాల సంఖ్యతో భాగించి ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రామాణిక జనాభా నిర్ణయిస్తారు. ఇది పదిశాతం అటూ ఇటూగా ఉండొచ్చు. ఒక పార్లమెంటు నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో ఉండొచ్చు. కానీ, ఒక అసెంబ్లీ పరిధి ఒక జిల్లాలోనే ఉండాలనే నిబంధన ఉంది. అంతేకాదు... ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌ ఒకే పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉండాలి. వెరసి... రెండు జిల్లాల్లో విస్తరించిన పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లను పెంచడం ఎలా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఉదాహరణకు... ఆంధ్రప్రదేశ్‌లో అరకు పార్లమెంటు నాలుగు జిల్లాల పరిధిలో ఉంది. ఇలా ఏపీలో 9 పార్లమెంటు స్థానాలు ఒకటికంటే ఎక్కువ జిల్లాల్లో విస్తరించాయి. ఇక... అసెంబ్లీ సెగ్మెంట్‌ ఒకే జిల్లాల పరిధిలో ఉండాలనే నిబంధన తెలంగాణ విషయంలో మరింత సమస్యాత్మకంగా మారింది. అక్కడ జిల్లాలో 10 నుంచి 31కి పెరగడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో లోక్‌ సభ నియోజకవర్గాన్నే యూనిట్‌గా చేసుకుని అసెంబ్లీ స్థానాలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. ఏపీ కూడా ఇదే ఆశిస్తోంది. అయితే... ఇది కుదరకపోవచ్చని కేంద్రం చెబుతున్నట్లు సమాచారం. ఏమిటి పరిష్కారం...విభజన చట్టంలోని సెక్షన 26(1) సబ్‌క్లాజ్‌ (సి) ప్రకారం పార్లమెంటు నియోజకవర్గాల సరిహద్దులు, ప్రాంతాలను అవసరాన్ని బట్టి మార్చుకోవవచ్చు.పార్లమెంటు పరిధిలోనే అసెంబ్లీ స్థానాలను ఏడు నుంచి తొమ్మిది చేయాలంటే చట్ట సవరణలో ఈ విషయాన్ని చేర్చాల్సిన అవసరం ఉంది.2011 జనాభా లెక్కల ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న అంశాన్నీ స్పష్టంగా పేర్కొనాలి.ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ స్థానాలు ఆయా జిల్లాల్లో క్లస్టర్‌గా వచ్చినప్పుడు వాటిని జిల్లాల్లోని అన్ని ప్రాంతాలకు పంపిణీ చేయాలని కూడా కొత్త చట్టంలో స్పష్టంగా పేర్కొనాలి.ఎన్నికల కమిషన్‌ కోరుతున్నట్లుగా పునర్విభజనకు కాలపరిమితి విధించాలి. చట్ట సవరణ జరిగిన 9 నెలల్లోపే సీట్ల పెంపు జరిగితే అందరికీ వెసులుబాటు ఉంటుంది.రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను పునర్విభజన ప్రక్రియలో ఎక్స్‌అఫిషియో సభ్యునిగా చేర్చుతూ చట్ట సవరణ చేయాల్సి ఉంది.ఇదీ నిపుణుల మాట...కొత్తగా వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు వేర్వేరు జిల్లాల్లోకి వెళ్లకుండా, ఒకే లోక్‌సభ సెగ్మెంట్‌లో ఉండేలా చూడటం కష్టమేమీ కాదని కొందరు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్కో ఎంపీ స్థానంలో ఏడు లోక్‌సభ స్థానాలున్నాయి. వీటిని 9కి పెంచాల్సి ఉంది. ఉదాహరణకు... చిత్తూరు జిల్లా తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి ఐదు సెగ్మెంట్లు చిత్తూరు జిల్లాలో, రెండు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. నియోజకవర్గాల పెంపులో భాగంగా... చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్న ఐదింటిని ఆరుకు పెంచవచ్చు. నెల్లూరు జిల్లాలోని రెండు నియోజకవర్గాలను మూడుకు పెంచే అవకాశముంది. ఈ పద్ధతినే మిగిలిన అసెంబ్లీ స్థానాలకూ వర్తింప చేయవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు!
nation
15,332
04-02-2017 00:42:39
ఎన్నారై గుండెల్లో రైళ్లు
టెక్సాస్‌లో బీమా కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్న శ్రీనివా్‌సకు వారం రోజులుగా కునుకులేదు. ఈ మధ్యే అక్కడ సొంత ఇల్లు కొనుక్కున్నాడు. భార్య, ఇద్దరు చిన్న పిల్లలు. అమెరికాలో స్థిరపడి హాయిగా జీవించాలని కలలు కన్నాడు. కానీ ఇప్పుడు ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో తెలియని పరిస్థితి. అసలు అమెరికాలో ఉంటామా? ప్రేమగా కొనుక్కున్న ఇల్లు తెగనమ్మి ఇండియాకు తిరిగి వచ్చేయాల్సి వస్తుందా అని శ్రీనివాస్‌ భయపడుతున్నాడు. రాజమండ్రిలో ఉంటున్న శ్రీనివాస్‌ తల్లిదండ్రులు కొడుకు భవిష్యత్ గురించిన ఆందోళనతో వణికిపోతున్నారు.          హైదరాబాద్‌లోని నిజాంపేటకు చెందిన శ్రీధర్‌ అమెరికాలోని డాలస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఈ మధ్యే పెళ్లి కుదిరింది. మార్చి 4న ముహూర్తం. 15 కల్లా భార్యతో కలిసి అమెరికా తిరిగివెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడు పెళ్లి కోసం అమెరికా నుంచి హైదరాబాద్‌ వస్తే అక్కడ ఉద్యోగానికే ఎసరు వచ్చే ప్రమాదం ఏర్పడింది. దీంతో అతడి తల్లిదండ్రులు పెళ్లిని పెండింగ్‌లో పెట్టారు.         అమెరికాలోని భారతీయులు, వారిలో అధిక సంఖ్యలో ఉన్న తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు ఇప్పుడు ట్రంప్‌ గండం వచ్చిపడింది! అమెరికాకు భారీ వలసల్ని అరికట్టేందుకు ట్రంప్‌ కొరడా ఝళిపిస్తున్నారు. హెచ్1బీ వీసాల జారీకి కనీస వేతన పరిమితిని రెండింతలు పెంచే బిల్లును ఇప్పటికే ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు చట్టరూపం లభిస్తే హెచ్1బీ వీసాలు ఉన్న వారిలో 80 శాతం మంది ఉద్యోగాలకు ఎసరు వస్తుంది. దీంతో పాటు ఇతర ఆంక్షలు అమలైతే లక్షల మంది తెలుగువారి ‘డాలర్‌ డ్రీమ్స్‌’ కరిగిపోవడం ఖాయమనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.         అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లేవారు రెండో సంవత్సరం నుంచి అక్కడే ఏదో చిన్న ఉద్యోగం చేస్తుంటారు. అలా వచ్చిన ఆదాయం ఖర్చులకు సరిపోతుంది. ఇంటి నుంచి డబ్బు తెప్పించుకునే పని లేకుండా స్వార్జనతో చదువుకుని, ఉద్యోగం వచ్చాక.. అమెరికా వచ్చేందుకు చేసిన అప్పులను తీర్చడంతో పాటు కుటుంబానికి వారు కొండంత అండగా ఉంటున్నారు. ఇప్పుడు వారిపై ట్రంప్‌ ఆంక్షలు విధిస్తారనే ప్రచారం సాగుతోంది.అమెరికాలో చదువు పూర్తయ్యాక ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) రూపంలో రెండేళ్ల పాటు అక్కడ ఉద్యోగం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఆలోగా హెచ్1బీ సంపాదించి అమెరికాలో మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు భారతీయులు. హెచ్1బీ వచ్చిన ఐదేళ్ల తరువాత గ్రీన్‌కార్డు దక్కించుకుని, ఆ తరువాత అమెరికా పౌరసత్వం పొందిన తెలుగువారు వేల సంఖ్యలో ఉన్నారు. ఈ ప్రక్రియ అంతటికీ పునాదిగా చెప్పుకొనే ఓపీటీ వ్యవధిని ఏడాదికి కుదిస్తారనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే చదువు పూర్తి కాగానే ఉద్యోగం సంపాదించాలి. ఉద్యోగం రాకుంటే భారతకు తిరిగి వచ్చేయాల్సి ఉంటుంది. ఆస్తులు కుదువపెట్టి, ఇంట్లో ఆడవాళ్ల బంగారం తాకట్టుపెట్టి.. అప్పులు చేసి.. రూ.లక్షలకు లక్షలు ఖర్చు చేసి అమెరికా వెళ్లి.. చదువు పూర్తయ్యాక అక్కడ ఉద్యోగం గ్యారెంటీ లేకపోతే భవిష్యత్తు ఏమవుతుందోనని భారతీయ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.భార్యాభర్తల్లో ఒకరికి హెచ్1బీ వీసా ఉంటే మరొకరు ఇంతకాలం వర్క్‌పర్మిట్‌తో అమెరికాలో ఉద్యోగం చేసుకునేవారు. ఇకపై వీసాలున్న వారి భాగస్వామికి ఇచ్చే ఉద్యోగాలపై ఆంక్షలు విధించాలని ట్రంప్‌ ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం ఉంది. ఇది కూడా ప్రవాస భారతీయుల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుందని భావిస్తున్నారు.- తోటకూర ప్రసాద్‌, తానా మాజీ అధ్యక్షుడు
nation
6,246
10-04-2017 16:21:13
ఫోన్‌ అనుకుని రిమోట్‌ తెచ్చేశాడు: రమారాజమౌళి
వైఫల్యం అన్నదే లేకుండా వరుస విజయాలు సాధించడం అన్నది ఎంతటి దర్శకుడికైనా సాధ్యం కాదు. అయితే రాజమౌళి రూటే సెపరేటు. ఇప్పటి వరకు రాజమౌళి తీసిన సినిమాలన్నీ హిట్లే. దీని వెనుక ఆయన శ్రమ, పట్టుదల ఎంత ఉందనేది అందరికీ తెలిసిందే. అన్ని వేళల్లోనూ సినిమా గురించే ఆలోచించే రాజమౌళి సాధారణంగా ఎలా ఉంటాడో వివరించింది ఆయన సతీమణి రమ.  ‘ఇంట్లో ఉన్నప్పుడు కూడా రాజమౌళి వేరే ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఒకసారి కీరవాణి ఇంటికి వెళ్లి.. అక్కణ్నుంచి వచ్చేటపుడు తన ఫోన్‌ అనుకుని వారి టీవీ రిమోట్‌ తెచ్చేశాడు. అలాగే వేరొకరి ఇంటికి వెళ్లి వారి కార్‌ తాళాలు తెచ్చేశాడు. ఇలాంటి విచిత్రమైన పనులు ఎన్నో చేస్తుంటాడు. ఇంట్లో ఏదైనా కనబడకపోతే అందరూ రాజమౌళి జేబులు చెక్‌ చేస్తుంటారు. అయితే సినిమా విషయంలో మాత్రం రాజమౌళి చాలా స్ట్రిక్ట్‌. తను అనుకున్నది వచ్చేవరకు పనిచేస్తూనే ఉంటాడ’ని చెప్పింది రమారాజమౌళి.
entertainment
11,223
10-04-2017 20:34:29
రాహుల్‌కు కాంగ్రెస్‌పై ఆసక్తి లేదు.. 2019లో 20 సీట్లు కూడా రావు..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పార్టీపై ఎలాంటి ఆసక్తి, సీరియస్ లేదని ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన విశ్వజిత్ రాణే విమర్శించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా రావని ఆయన ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేసి గెలిచిన విశ్వజిత్ రాణే, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుతో పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గోవా సీఎం పారికర్ సమక్షంలో ఇటీవల ఆయన బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ లాంటి అసమర్థ నేత ఉన్నారని, ఆ పార్టీని గెలిపించిన రాష్ట్రం, ప్రజల పట్ల ఆయనకు ఎలాంటి శ్రద్ధ, ఆసక్తి లేదని విశ్వజిత్ రాణే విమర్శించారు. గోవాలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించినా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడానికి రాహుల్ అనాసక్తే కారణమని ఆయన ఆరోపించారు.
nation
2,702
02-11-2017 23:31:36
పొగాకు బోర్డు ఛైర్మన్‌ వెంకటేష్‌ బదిలీ
గుంటూరు (ఆంధ్రజ్యోతి): పొగాకు బోర్డు ఛైర్మన్‌ టి వెంకటే్‌షను బదిలీ చేస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం రాత్రి ఆదేశాలు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌ ఐఎఎస్‌ క్యాడర్‌కు చెందిన వెంకటేష్‌ 6-7 నెలల క్రితం డెప్యుటేషన్‌పై పొగాకు బోర్డు ఛైర్మన్‌గా వచ్చారు. యుపిలో సీనియర్‌ ఐఎఎస్‌ అధికారిగా ఉన్న వెంకటేష్ ను తిరిగి యుపికి బదిలీ చేస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఇన్‌ఛార్జ్‌ ఛైర్మన్‌గా కార్యదర్శి అద్దంకి శ్రీధర్‌ బాబును నియమిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
business
6,762
24-01-2017 18:40:22
తల్లికి అస్వస్థత.. హుటాహుటిన షూటింగ్ నుంచి ఆస్పత్రికి అగ్రహీరో
ముంబై: బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్.. తాను నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ బాద్షాహో మూవీ షూటింగ్‌ను రద్దు చేసుకుని హుటాహుటిన తిరిగి ముంబై చేరుకున్నాడు. తల్లి వీణా ఆరోగ్యం విషమించిందన్న వార్త తెలియడంతో నిర్మాతల అనుమతి తీసుకుని ముంబై వచ్చాడు. అయితే అజయ్ షూటింగ్‌లో పాల్గొనేందుకు శుక్రవారం రోజే రాజస్థాన్లోని జోధ్పూర్కు వెళ్లాడు. ఇంతలోనే ఫోన్ రావడంతో వెనుదిరిగాడు. వారం రోజుల నుంచి ఛాతీ సంబంధిత వ్యాధితో వీణాను ముంబైలోని శాంటా క్రజ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం రోజున రాజస్థాన్ నుంచి వచ్చిన అజయ్ గత రెండురోజుల నుంచి తల్లి వద్దే ఆస్పత్రిలోనే ఉంటున్నాడు. వీణా తిరిగి కోలుకున్న అనంతరం అజయ్ దేవగణ్ మళ్లీ షూటింగ్‌లో పాల్గొననున్నాడు.
entertainment
12,445
12-06-2017 15:07:10
టూరిస్టులూ వెళ్లిపోండి...జీజేఎం అల్టిమేటం
డార్జిలింగ్: ప్రత్యేక గోర్ఖాలాండ్ రాష్ట్రం డిమాండ్‌పై గోర్ఖా జన్‌ముక్తి మోర్చా (జీజేఎం) ఇచ్చిన నెలరోజుల ప్రభుత్వ కార్యాలయ బంద్ సోమవారం ప్రారంభమైంది. దీంతో డార్జిలింగ్ హిల్ స్టేషన్ నిర్మానుష్యంగా మారింది. బంద్ కారణంగా పలు హోటళ్లు మూతపడ్డాయి. కొద్దిపాటి వాహనాలు మాత్రమే రోడ్లపైకి వచ్చాయి. ఇక్కడి నుంచి బయలుదేరే టాయ్ ట్రైన్ నిలిచిపోయింది. బంద్‌ నుంచి రవాణా, హోటల్స్‌, స్కూళ్లు, కాలేజీలను మినహాయించారు. మార్కెట్లు, ప్రైవేటు కార్యాలయాలు మూతపడగా, కొండ ప్రాంతాల్లో ఎక్కడచూసినా జీజేఎం పార్టీ జెండాలు ఎగురుతున్నాయి. మరోవైపు బంద్ సందర్భంగా భారీగా భద్రతా దళాలను డార్జిలింగ్ తదితర ప్రాంతాల్లో మోహరించారు. బైజన్‌బరి బ్లాక్‌లోని ఫుల్‌బజార్‌లో ఉన్న బీడీఓ కార్యాలయానికి సోమవారం ఉదయం నిప్పు పెట్టేందుకు ప్రయత్నించిన 8 మంది జీజేఎం కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, పరిస్థితి ఇంతవరకూ ప్రశాంతంగానే ఉందని, ప్రజలు కార్యాలయాలకు వెళ్తున్నారనీ, పాఠశాలల్లో హాజరు కూడా మామూలుగానే ఉందని డార్జిలింగ్ జిల్లా మేజిస్ట్రేట్ జోషి దాస్ గుప్తా తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఆర్మీని కూడా అందుబాటులో ఉంచినట్టు చెప్పారు.రెండ్రోజులు మాత్రమే బ్యాంకులు...టూరిస్టులూ వెళ్లిపోండిఆర్థిక పరమైన లావాదేవీలు నిలిచిపోయేలా చూడటం ద్వారా పాలనావ్యవస్థను స్తంభింపజేయాలని భావిస్తున్న జీజేఎం బ్యాంకులకు అల్టిమేటం ఇచ్చింది. వారంలో రెండు రోజులు మాత్రమే బ్యాంకులు తెరవాలని ఆదేశించింది. అవాంఛనీయ సంఘటనలకు అవకాశాలున్నందున కొండ ప్రాంతాలను విడిచివెళ్లాల్సిందిగా టూరిస్టులను జీజేఎం అధ్యక్షుడు బిమల్ గురుంగ్ కోరారు. బంద్‌లో పాల్గొనాలని, కార్యాలయాలకు వెళ్లద్దని ప్రజలకు తమ పార్టీ విజ్ఞప్తి చేసినట్టు జీజేఎం ప్రధాన కార్యదర్శి రోషన్ గిరి తెలిపారు. సాయంత్రం టార్చ్ ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. బెంగాలీ భాషను పాఠశాలల్లో బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపిస్తూ జీజేఎం ఇటీవల నిరసనలకు దిగడం, పోలీసులను ఆందోళనకారులపై విరుచుకుపడటంతో డార్జిలింగ్, కలింపాగ్, కుర్సెయాంగ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
nation
4,635
07-04-2017 12:23:24
జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. ఉత్తమ తెలుగు చిత్రంగా..
న్యూఢిల్లీ: 64వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. జనతా గ్యారేజ్ సినిమాకు ఒక అవార్డు, పెళ్లి చూపులు సినిమాకు రెండు అవార్డులు దక్కడం విశేషం. చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ కొట్టి నిర్మాతకు కాసుల వర్షం కురిపించిన సినిమా పెళ్లి చూపులు. ఈ సినిమా దర్శకుడు ఇటీవల ఐఫా అవార్డ్ జరిగిన సందర్భంగా పెళ్లి చూపులు సినిమాను చిన్న చూపు చూశారని కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచి, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఆవేదనలో అర్థం ఉందని పెళ్లి చూపులు సినిమా చాటి చెప్పినట్లయింది.  జాతీయ ఉత్తమ నటుడు- అక్షయ్‌కుమార్‌ (రుస్తుం)ఉత్తమ సామాజిక చిత్రం- పింక్‌ఉత్తమ సహాయనటుడు- జైరా వసీంఉత్తమ హిందీ చిత్రం-నీర్జాఉత్తమ సామాజిక చిత్రం- పింక్‌ఉత్తమ సహాయనటుడు- జైరా వసీంఉత్తమ హిందీ చిత్రం-నీర్జాఉత్తమ తెలుగుచిత్రం-పెళ్లిచూపులుఉత్తమ సంభాషణలు- తరుణ్‌ భాస్కర్‌ (పెళ్లి చూపులు) ఉత్తమ ప్రజాదరణ చిత్రం- శతమానం భవతి ఉత్తమ నృత్య దర్శకుడు- రాజు సుందరం (జనతా గ్యారేజ్‌)ఉత్తమ సంగీత దర్శకుడు- బాపు పద్మనాభ (కన్నడ)బెస్ట్‌ స్పెషల్‌ ఎఫెక్ట్‌- శివాయ్‌ఉత్తమ కన్నడ చిత్రం- రిజర్వేషన్‌ఉత్తమ తమిళ చిత్రం- జోకర్‌ఉత్తమ బెంగాళీ చిత్రం- బిసర్జన్‌ఉత్తమ సహాయనటుడు- జైరా వసీం (దంగల్‌)ఉత్తమ ఫైట్‌ మాస్టర్‌- పీటర్‌ హెయిన్స్‌ఉత్తమ బాలల చిత్రం- ధనక్‌ ఉత్తమ కన్నడ చిత్రం- రిజర్వేషన్‌ఉత్తమ తమిళ చిత్రం- జోకర్‌ఉత్తమ బెంగాళీ చిత్రం- బిసర్జన్‌ఉత్తమ సహాయనటుడు- జైరా వసీం (దంగల్‌)ఉత్తమ ఫైట్‌ మాస్టర్‌- పీటర్‌ హెయిన్స్‌ఉత్తమ బాలల చిత్రం- ధనక్‌
entertainment
1,744
30-09-2017 00:23:46
వడ్డీ రేట్ల తగ్గింపు అనుమానమే..
పొంచి ఉన్న ద్రవ్యోల్బణ ప్రమాదండిసెంబరు వరకు ఇదే పరిస్థితిన్యూఢిల్లీ: వచ్చే నెల 3-4 తేదీల్లో జరిగే సమావేశంలో భారత రిజర్వు బ్యాంకు ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) వడ్డీ రేట్ల తగ్గింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకునే సూచనలు కనిపించడం లేదు. ఆగస్టు రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇప్పటికే 3.4 శాతానికి చేరింది. చమురు ధరల సెగతో ఇది ముందు ముందు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో కీలకమైన రెపో రేటు తగ్గింపుకు ఆర్‌బిఐ సాహసించక పోవచ్చని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ తన తాజా నివేదికలో పేర్కొంది.  ఈ సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో భారత జిడిపి వృద్ధి రేటు మూడేళ్ల కనిష్ఠ స్థాయి 5.7 శాతానికి పడిపోయింది. నీరసించిన వృద్ధి రేటు ను గాడిలో పెట్టాలంటే వడ్డీ రేట్లు తగ్గించడంతో పాటు, ఏదో ఒక ప్యాకేజీ ప్రకటించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. నేరుగా అడగక పోయినా వడ్డీ రేట్లు ఇంకా ఎక్కువగానే ఉన్నట్టు అధికార వర్గాలు పరోక్షంగా ఆర్‌బిఐతో చెబుతున్నాయి. అయినా సరే అక్టోబర్‌ 3-4 తేదీల్లో జరిగే సమావేశంలో ఆర్‌బిఐ కీలకమైన రెపో రేటు తగ్గించక పోవచ్చని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా. ద్రవ్యోల్బణం మరింత పైకి!ఆగస్టులో జరిగిన ఎంపిసి సమావేశం రెపో రేటును 6.25 శాతం నుంచి ఆరు శాతానికి తగ్గించింది. ద్రవోల్బణం పరిస్థితిని బట్టి మరింత తగ్గించే విషయం ఆలోచిస్తామని ఆర్‌బిఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ అప్పుడే చెప్పారు. అయితే జూన్‌లో 1.5 శాతం, జూలైలో 2.36 శాతం ఉన్న ద్రవ్యోల్బణం ఆగస్టులో 3.36 శాతానికి ఎగబాకింది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇది 4.5 శాతం నుంచి ఐదు శాతం వరకు ఎగబాకే ప్రమాదం ఉందని పరపతి రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్‌ అంచనా. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బిఐ లక్ష్యంగా పెట్టుకున్న 2-6 శాతంలోపే ఉంది.  అయితే మళ్లీ ప్రారంభమైన చమురు ధరల సెగ, మూల ధన ఖాతా లోటు (సిఎడి) ఆర్‌బిఐని భయపెడుతున్నాయి. దీంతో వృద్ధి రేటు మరింత దెబ్బతినకుండా ఆర్‌బిఐ అత్యంత జాగ్రత్తగా పరపతి విధానాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఏర్పడిందని ఇండియా రేటింగ్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ సౌమ్యజిత్‌ నియోగి చెప్పారు. తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆర్‌బిఐ వచ్చే నెల జరిగే సమావేశంలోనేగా, ఈ ఏడాది డిసెంబర్‌ వరకు రెపో రేటు తగ్గించకపోవచ్చని ఆర్థి క నిపుణులు భావిస్తున్నారు. పడిపోయిన వృద్ధి రేటును మళ్లీ పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం ఏదైనా ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తే, దాని ఫలితాలను అంచనా వేశాకే రెపో రేటు తగ్గింపుపై ఎంపిసి ముందుకు వెళుతుందని అంచనా. జైట్లీతో ఆర్‌బిఐ గవర్నర్‌ పటేల్‌ సమావేశంమరోవైపు ఆర్‌బిఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో సమావేశమయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థ తాజా పరిస్థితి, వడ్డీ రేట్ల తగ్గింపు కోసం పెరుగుతున్న డిమాండ్లు, ద్రవోల్బణంపై ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు సమాచారం. అయితే సమావేశం తర్వాత బయటికి వచ్చిన పటేల్‌ విలేకరులతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అయితే ఎంపిసి సమావేశం తీసుకునే నిర్ణయాలను అక్టోబర్‌ 4న మధ్యాహ్నం 2.30 గంటలకు తమ వెబ్‌సైట్‌లో ఉంచుతామని ఆర్‌బిఐ తెలిపింది.
business
3,712
23-12-2017 00:46:49
సంగీత ఋషి సుసర్ల దక్షిణామూర్తి శాస్ర్తి
19వ శతాబ్ది తొలిపాదానికే తెలుగునాట త్యాగరాజ కృతులు ఇంటింటా ప్రశస్తి పొందటానికి సుసర్ల దక్షిణామూర్తి శాస్ర్తి ప్రధాన కారకులు. సుసర్ల దక్షిణామూర్తి శాస్ర్తిగారు కాలినడకన తంజావూరు చేరి త్యాగరాజ కృతులు నేర్చి ఉండకపోతే, బహుశా తెలుగు వారికి త్యాగబ్రహ్మ ఇంత సన్నిహితుడు కాగలిగి ఉండేవారు కారేమోననుకుంటాను.‍‍ శివుడు డమరుకాన్ని మోగిస్తుంటే, విష్ణువు పెద్దడోలుని వాయిస్తుంటే, బ్రహ్మగారు తాళం వేస్తుంటే నర్తనం చివరి దశలో శివుని ఢక్క నుండి, నవపంచవారం– పద్నాలుగు దరువులున్న నాదం ఏర్పడింది. ఆ 14 దరువుల్నీ ఆకళింపు చేసుకున్న పాణిని మహాశయుడు ఒక్కో దరువు నుండి ఒక్కో అక్షరాన్ని సూత్రీకరించాడు. ఈ సూత్రాలనే మహేశ్వర సూత్రాలు లేదా శివసూత్రాలు అన్నాడాయన. నాదం నుండి వర్ణాలు (అక్షర సముదాయాలు) పుట్టాయి. నాదం నుండి స్వరాలు (సప్తస్వర సముదాయాలు) పుట్టాయి. సంగీత సాహిత్యాలకు మూలం నాదమే! త్యాగరాజస్వామిని నాదబ్రహ్మ అన్నారందుకే! ‘‘సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం’’ అని కదా ఆర్యోక్తి. కృతి అనేది అటు సంగీతానికీ, ఇటు సాహిత్యానికీ వర్తించే పదం. సాహిత్య కృతులు, సంగీత కృతులు రెండింటిలోనూ సమాన ప్రతిభా సంపన్నత కలిగిన మహనీయులకు కర్ణాటక సంగీతంలో కొదవ లేదు. తెలుగు భాష సంగీత ప్రధానమైందని ప్రపంచం అంతా అంగీకరించింది. కర్ణాటక సంగీతానికి ఆయువుపట్టుగా నిలిచిన తెలుగు భాష భారతీయ ప్రాచీన సంగీత కళను ఇన్నేళ్లుగా నిలుపుకుంటూ వచ్చింది. సామవేద జనితమైన సంగీతం ఉత్తరాదిన మొగలుల ప్రభావంతో మార్పులు చెంది హిందుస్తానీ సంగీతంగా ప్రచారంలోకి వస్తున్న కాలంలో సంగీతమయమైన భాషా సౌలభ్యం కలిగిన తెలుగువారు తెలుగు, సంస్కృత భాషల్లో కృతులు, గీతాలు, వర్ణాలు, స్వరజతులు, జతిస్వరాలు, రాగమాలికలు ఎన్నింటినో వెలయిస్తూ అనేక నూతన రాగాలతో భారతీయ సంగీతాన్ని అభివృద్ధిలోకి తీసుకువచ్చారు. పదాలు, జావళీలు, తిల్లానాలు వంటివి వెలిశాయి. త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్ర్తి ప్రభృతులు ఈ కర్ణాటక సంగీతాన్ని సుసంపన్నం చేశారు. విజయనగర సామ్రాజ్య కాలంలోనూ, దాక్షిణాత్య యుగంలోనూ జరిగిన ఈ సంగీత పరిణామాల కారణంగా ఇది కర్ణాటక సంగీతం అయ్యిందని కొందరు, కర్ణపేయమైన సంగీతం కాబట్టి కర్ణాటక సంగీతం అని మరికొందరు అభిప్రాయపడ్తున్నారు. ఎవరైనా కర్ణాటక సంగీతం నేరవాలంటే తెలుగు భాష తెలిసి ఉండాలనే భావన సంగీత వేత్తల్లో ఉంది. త్యాగరాజాదుల రచనలు, రాగాలే ఇందుకు కారణం. ఋషి కాలేనివాడు ‘కృతి’ రచన చేయలేడనేది కేవలం నమ్మకం కాదు, నిజం. గానవిద్యా గురుకులపతి సుసర్ల దక్షిణామూర్తి శాస్ర్తి గారు ఒక సంగీత ఋషి.. సుప్రసిద్ధులైన సంగీత విద్వాంసులు, తెలుగునాట త్యాగరాజ స్వామి వారి గురు శిష్యపరంపరకు ఆద్యులు. త్యాగరాజు సంగీత సంప్రదాయాన్ని ఆంధ్ర దేశానికి తీసుకువచ్చిన తొలి సంగీత విద్యాబోధకులు. వేదం, సంస్కృతం చదివారు. సంగీత, సాహిత్యాల అధ్యయనపరులు. అసమాన ప్రజ్ఞాధురీణులు. 16వ శతాబ్ది చివరి పాదంలో తమిళ దేశానికి తరలి పోవటానికి కారణాలు చారిత్రక మైనప్పటికి, తమిళ నేలమీద తెలుగు వారే పాలకులుగా ఉండటంతో ఎందరో లబ్ద ప్రతిష్టులైన పండితులు, సాహితీమూర్తులు వాగ్గేయకారులు, తెలుగు సారస్వతాన్ని చక్కగా పండించగలిగారు.కృష్ణానది తీరంలోని పెదకళ్ళేపల్లి (కదళీపురం) అగ్రహారంలో గంగాధర శాస్ర్తి, లక్ష్మాంబ దంపతులకు దక్షిణామూర్తి శాస్ర్తి 1860లో జన్మించారు. స్వగ్రామంలోనే కొంతకాలం వేదం, సంస్కృతం అభ్యసించారు. సంగీతాన్ని మరింతగా అభ్యసించాలనే కోరికతో తంజావూరు కాలినడకన వెళ్ళి, అక్కడ త్యాగరాజ స్వామికి శిష్యులు, బంధువులైన మానాంబు చావడి వేంకట సుబ్బయ్య గారిని ఆశ్రయించారు. అనేక మెళకువలను నేర్చారు. సుమారు రెండు సంవత్సరాలు సంగీతం అభ్యసించి వీణ కుప్పయ్యర్‌, వారి కుమారులు ముత్యాలపేట త్యాగయ్య వద్ద గీతాలు, వర్ణాలు, పాఠాలు అభ్యసించారు. పట్నం సుబ్రహ్యణ్య అయ్యర్‌, మహా వైద్యనాథ అయ్యర్‌, ఫ్లూట్‌ శరభశాస్ర్తి తంజావూరులో వీరికి సహాధ్యాయులు. అనతికాలంలోనే సుసర్లవారు తమిళనాడులో ప్రసిద్ధ సంగీత విద్వాంసుడిగా ఎదిగారు. అక్కడి సంగీత ప్రముఖులు తంజావూరులోనే ఉండిపోవలసిందిగా కోరినప్పటికీ ఆయన స్వస్థలానికి తిరిగివచ్చి, త్యాగయ్య గారి సంగీత సంప్రదాయాన్ని తరువాతి తరం భావి సంగీత వేత్తలకు అందించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అనేకమంది శిష్యులకు గురుకుల పద్ధతిలో భోజన వసతులు ఏర్పాటుచేసి సంగీత విద్యాదానం చేశారు. ఆయన శిష్యుల్లో గాయకసార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య, చల్లపల్లి సీతారామయ్య, చిట్టా పురుషోత్తమ శాస్ర్తి, రాజనాల వెంకటప్పయ్య, ద్వివేదుల లక్ష్మణశాస్ర్తి లాంటివారు ప్రసిద్ధ సంగీత విద్వాంసులయ్యారు. సుసర్లవారి కుమారుడు కృష్ణబ్రహ్మం, ఆయన సోదరుని కుమారుడు సుసర్ల గంగాధరశాస్ర్తి కూడా ప్రసిద్ధ సంగీతవేత్తలే! సద్గురు శ్రీ త్యాగరాజస్వామి, వారి శిష్యుడు మానాంబుచావడి వెంకట సుబ్బయ్య, వారి నుండి సుసర్ల దక్షిణామూర్తి శాస్ర్తి, వారి శిష్యుడు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, వారి శిష్యుల్లో ప్రముఖులైన డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, హరినాగభూషణం, అన్నవరపు రామస్వామి, నల్లాన్‌ చక్రవర్తుల కృష్ణమాచారి, నేతి శ్రీరామశర్మ, దాలిపర్తి పిచ్చిహరి ఇలా ఐదు తరాల పాటు సంగీత గురుశిష్య పరంపర కొనసాగుతోంది. సినీ సంగీత ప్రపంచంలో సుసర్లగా ప్రసిద్ధులైన సుసర్ల దక్షిణామూర్తి వీరి మనుమడే! తాత మనుమలిద్దరూ ప్రసిద్ధ సంగీత విద్వాంసులే కావటంతో తాత సుసర్ల, మనుమడు సుసర్లగా విశ్లేషికులు వ్యవహరిస్తుంటారు. 19వ శతాబ్ది తొలిపాదానికే తెలుగునాట త్యాగరాజ కృతులు ఇంటింటా ప్రశస్తి పొందటానికి సంగీత ఋషి సుసర్ల దక్షిణామూర్తి శాస్ర్తి ప్రధాన కారకులు. బహుశా సుసర్ల దక్షిణామూర్తి శాస్ర్తిగారు కాలినడకన తంజావూరు చేరి త్యాగరాజ కృతులు నేర్చి ఉండకపోతే, తెలుగు వారికి త్యాగబ్రహ్మ ఇంత సన్నిహితుడు కాగలిగి ఉండేవారు కారేమోననుకుంటాను. కారణ జన్ముడైన ఒక్కో మహానుభావుడు ఒక్కో ప్రయోజనాన్ని నెరవేర్చటానికి అవతరిస్తారు. తెలుగు నేలపైన నిజాం పాలనలో సారస్వత శూన్యం ఏర్పడిన కాలంలో త్యాగబ్రహ్మ తంజావూరు రాజ్యంలో మరాఠా ప్రభువుల ఏలుబడిలో ఉన్న కాలంలో అవతరించి సంగీత శాస్ర్తాన్ని సుసంపన్నం చేశారు. త్యాగయ్య గారి తరువాత ఓ ఐదారు దశాబ్దాల పాటు త్యాగరాజ కీర్తనలు మరుగునపడిపోతుండగా, వృద్ధాప్యంలో ఉన్న త్యాగరాజు వారి శిష్యులను ఆశ్రయించి, వారి నుంచి నేరుగా సంగీత విద్యను పొంది ఆ మహావిద్యను తెలుగు నేలమీదకు తీసుకువచ్చి ప్రతిష్టించిన సుసర్ల వారికి తెలుగు జాతి రుణపడి ఉంది. 1917 భాద్రపద మాసంలో సుసర్లవారు స్వర్గస్థులయ్యారు. అప్పటి నుండి వారి జయంతి, వర్ధంతి ఉత్సవాల్ని పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, వారి తరువాత వారి శిష్యులూ నిర్వహిస్తూ వస్తున్నారు. ఇది వారి 100వ వర్ధంతి. ఈ సందర్భంగా పెదకళ్ళేపల్లి గ్రామంలో వారి విగ్రహ ప్రతిష్ఠాపన చేయటం, సంగీత ప్రపంచానికి వారు చేసిన సేవలను సంస్మరించుకోవటం వారికి నిజంగా ఇవ్వదగిన నివాళి.డాక్టర్‌ మండలి బుద్ధప్రసాద్‌ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి(డిసెంబర్‌ 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ చేతులమీదుగా సుసర్ల వారి విగ్రహావిష్కరణ)శివుడు డమరుకాన్ని మోగిస్తుంటే, విష్ణువు పెద్దడోలుని వాయిస్తుంటే, బ్రహ్మగారు తాళం వేస్తుంటే నర్తనం చివరి దశలో శివుని ఢక్క నుండి, నవపంచవారం– పద్నాలుగు దరువులున్న నాదం ఏర్పడింది. ఆ 14 దరువుల్నీ ఆకళింపు చేసుకున్న పాణిని మహాశయుడు ఒక్కో దరువు నుండి ఒక్కో అక్షరాన్ని సూత్రీకరించాడు. ఈ సూత్రాలనే మహేశ్వర సూత్రాలు లేదా శివసూత్రాలు అన్నాడాయన. నాదం నుండి వర్ణాలు (అక్షర సముదాయాలు) పుట్టాయి. నాదం నుండి స్వరాలు (సప్తస్వర సముదాయాలు) పుట్టాయి. సంగీత సాహిత్యాలకు మూలం నాదమే! త్యాగరాజస్వామిని నాదబ్రహ్మ అన్నారందుకే! ‘‘సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం’’ అని కదా ఆర్యోక్తి. కృతి అనేది అటు సంగీతానికీ, ఇటు సాహిత్యానికీ వర్తించే పదం. సాహిత్య కృతులు, సంగీత కృతులు రెండింటిలోనూ సమాన ప్రతిభా సంపన్నత కలిగిన మహనీయులకు కర్ణాటక సంగీతంలో కొదవ లేదు. తెలుగు భాష సంగీత ప్రధానమైందని ప్రపంచం అంతా అంగీకరించింది. కర్ణాటక సంగీతానికి ఆయువుపట్టుగా నిలిచిన తెలుగు భాష భారతీయ ప్రాచీన సంగీత కళను ఇన్నేళ్లుగా నిలుపుకుంటూ వచ్చింది. సామవేద జనితమైన సంగీతం ఉత్తరాదిన మొగలుల ప్రభావంతో మార్పులు చెంది హిందుస్తానీ సంగీతంగా ప్రచారంలోకి వస్తున్న కాలంలో సంగీతమయమైన భాషా సౌలభ్యం కలిగిన తెలుగువారు తెలుగు, సంస్కృత భాషల్లో కృతులు, గీతాలు, వర్ణాలు, స్వరజతులు, జతిస్వరాలు, రాగమాలికలు ఎన్నింటినో వెలయిస్తూ అనేక నూతన రాగాలతో భారతీయ సంగీతాన్ని అభివృద్ధిలోకి తీసుకువచ్చారు. పదాలు, జావళీలు, తిల్లానాలు వంటివి వెలిశాయి. త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్ర్తి ప్రభృతులు ఈ కర్ణాటక సంగీతాన్ని సుసంపన్నం చేశారు. విజయనగర సామ్రాజ్య కాలంలోనూ, దాక్షిణాత్య యుగంలోనూ జరిగిన ఈ సంగీత పరిణామాల కారణంగా ఇది కర్ణాటక సంగీతం అయ్యిందని కొందరు, కర్ణపేయమైన సంగీతం కాబట్టి కర్ణాటక సంగీతం అని మరికొందరు అభిప్రాయపడ్తున్నారు. ఎవరైనా కర్ణాటక సంగీతం నేరవాలంటే తెలుగు భాష తెలిసి ఉండాలనే భావన సంగీత వేత్తల్లో ఉంది. త్యాగరాజాదుల రచనలు, రాగాలే ఇందుకు కారణం. ఋషి కాలేనివాడు ‘కృతి’ రచన చేయలేడనేది కేవలం నమ్మకం కాదు, నిజం. గానవిద్యా గురుకులపతి సుసర్ల దక్షిణామూర్తి శాస్ర్తి గారు ఒక సంగీత ఋషి.. సుప్రసిద్ధులైన సంగీత విద్వాంసులు, తెలుగునాట త్యాగరాజ స్వామి వారి గురు శిష్యపరంపరకు ఆద్యులు. త్యాగరాజు సంగీత సంప్రదాయాన్ని ఆంధ్ర దేశానికి తీసుకువచ్చిన తొలి సంగీత విద్యాబోధకులు. వేదం, సంస్కృతం చదివారు. సంగీత, సాహిత్యాల అధ్యయనపరులు. అసమాన ప్రజ్ఞాధురీణులు. 16వ శతాబ్ది చివరి పాదంలో తమిళ దేశానికి తరలి పోవటానికి కారణాలు చారిత్రక మైనప్పటికి, తమిళ నేలమీద తెలుగు వారే పాలకులుగా ఉండటంతో ఎందరో లబ్ద ప్రతిష్టులైన పండితులు, సాహితీమూర్తులు వాగ్గేయకారులు, తెలుగు సారస్వతాన్ని చక్కగా పండించగలిగారు.కృష్ణానది తీరంలోని పెదకళ్ళేపల్లి (కదళీపురం) అగ్రహారంలో గంగాధర శాస్ర్తి, లక్ష్మాంబ దంపతులకు దక్షిణామూర్తి శాస్ర్తి 1860లో జన్మించారు. స్వగ్రామంలోనే కొంతకాలం వేదం, సంస్కృతం అభ్యసించారు. సంగీతాన్ని మరింతగా అభ్యసించాలనే కోరికతో తంజావూరు కాలినడకన వెళ్ళి, అక్కడ త్యాగరాజ స్వామికి శిష్యులు, బంధువులైన మానాంబు చావడి వేంకట సుబ్బయ్య గారిని ఆశ్రయించారు. అనేక మెళకువలను నేర్చారు. సుమారు రెండు సంవత్సరాలు సంగీతం అభ్యసించి వీణ కుప్పయ్యర్‌, వారి కుమారులు ముత్యాలపేట త్యాగయ్య వద్ద గీతాలు, వర్ణాలు, పాఠాలు అభ్యసించారు. పట్నం సుబ్రహ్యణ్య అయ్యర్‌, మహా వైద్యనాథ అయ్యర్‌, ఫ్లూట్‌ శరభశాస్ర్తి తంజావూరులో వీరికి సహాధ్యాయులు. అనతికాలంలోనే సుసర్లవారు తమిళనాడులో ప్రసిద్ధ సంగీత విద్వాంసుడిగా ఎదిగారు. అక్కడి సంగీత ప్రముఖులు తంజావూరులోనే ఉండిపోవలసిందిగా కోరినప్పటికీ ఆయన స్వస్థలానికి తిరిగివచ్చి, త్యాగయ్య గారి సంగీత సంప్రదాయాన్ని తరువాతి తరం భావి సంగీత వేత్తలకు అందించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అనేకమంది శిష్యులకు గురుకుల పద్ధతిలో భోజన వసతులు ఏర్పాటుచేసి సంగీత విద్యాదానం చేశారు. ఆయన శిష్యుల్లో గాయకసార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య, చల్లపల్లి సీతారామయ్య, చిట్టా పురుషోత్తమ శాస్ర్తి, రాజనాల వెంకటప్పయ్య, ద్వివేదుల లక్ష్మణశాస్ర్తి లాంటివారు ప్రసిద్ధ సంగీత విద్వాంసులయ్యారు. సుసర్లవారి కుమారుడు కృష్ణబ్రహ్మం, ఆయన సోదరుని కుమారుడు సుసర్ల గంగాధరశాస్ర్తి కూడా ప్రసిద్ధ సంగీతవేత్తలే! సద్గురు శ్రీ త్యాగరాజస్వామి, వారి శిష్యుడు మానాంబుచావడి వెంకట సుబ్బయ్య, వారి నుండి సుసర్ల దక్షిణామూర్తి శాస్ర్తి, వారి శిష్యుడు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, వారి శిష్యుల్లో ప్రముఖులైన డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, హరినాగభూషణం, అన్నవరపు రామస్వామి, నల్లాన్‌ చక్రవర్తుల కృష్ణమాచారి, నేతి శ్రీరామశర్మ, దాలిపర్తి పిచ్చిహరి ఇలా ఐదు తరాల పాటు సంగీత గురుశిష్య పరంపర కొనసాగుతోంది. సినీ సంగీత ప్రపంచంలో సుసర్లగా ప్రసిద్ధులైన సుసర్ల దక్షిణామూర్తి వీరి మనుమడే! తాత మనుమలిద్దరూ ప్రసిద్ధ సంగీత విద్వాంసులే కావటంతో తాత సుసర్ల, మనుమడు సుసర్లగా విశ్లేషికులు వ్యవహరిస్తుంటారు. 19వ శతాబ్ది తొలిపాదానికే తెలుగునాట త్యాగరాజ కృతులు ఇంటింటా ప్రశస్తి పొందటానికి సంగీత ఋషి సుసర్ల దక్షిణామూర్తి శాస్ర్తి ప్రధాన కారకులు. బహుశా సుసర్ల దక్షిణామూర్తి శాస్ర్తిగారు కాలినడకన తంజావూరు చేరి త్యాగరాజ కృతులు నేర్చి ఉండకపోతే, తెలుగు వారికి త్యాగబ్రహ్మ ఇంత సన్నిహితుడు కాగలిగి ఉండేవారు కారేమోననుకుంటాను. కారణ జన్ముడైన ఒక్కో మహానుభావుడు ఒక్కో ప్రయోజనాన్ని నెరవేర్చటానికి అవతరిస్తారు. తెలుగు నేలపైన నిజాం పాలనలో సారస్వత శూన్యం ఏర్పడిన కాలంలో త్యాగబ్రహ్మ తంజావూరు రాజ్యంలో మరాఠా ప్రభువుల ఏలుబడిలో ఉన్న కాలంలో అవతరించి సంగీత శాస్ర్తాన్ని సుసంపన్నం చేశారు. త్యాగయ్య గారి తరువాత ఓ ఐదారు దశాబ్దాల పాటు త్యాగరాజ కీర్తనలు మరుగునపడిపోతుండగా, వృద్ధాప్యంలో ఉన్న త్యాగరాజు వారి శిష్యులను ఆశ్రయించి, వారి నుంచి నేరుగా సంగీత విద్యను పొంది ఆ మహావిద్యను తెలుగు నేలమీదకు తీసుకువచ్చి ప్రతిష్టించిన సుసర్ల వారికి తెలుగు జాతి రుణపడి ఉంది. 1917 భాద్రపద మాసంలో సుసర్లవారు స్వర్గస్థులయ్యారు. అప్పటి నుండి వారి జయంతి, వర్ధంతి ఉత్సవాల్ని పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, వారి తరువాత వారి శిష్యులూ నిర్వహిస్తూ వస్తున్నారు. ఇది వారి 100వ వర్ధంతి. ఈ సందర్భంగా పెదకళ్ళేపల్లి గ్రామంలో వారి విగ్రహ ప్రతిష్ఠాపన చేయటం, సంగీత ప్రపంచానికి వారు చేసిన సేవలను సంస్మరించుకోవటం వారికి నిజంగా ఇవ్వదగిన నివాళి.డాక్టర్‌ మండలి బుద్ధప్రసాద్‌ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి(డిసెంబర్‌ 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ చేతులమీదుగా సుసర్ల వారి విగ్రహావిష్కరణ)
editorial
160
31-03-2017 00:19:18
హోండా మోటార్స్‌ కొత్త స్కూటర్‌ డియో
న్యూఢిల్లీ: హోండా మోటార్‌ సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఎస్‌ఐ) బిఎస్‌ 4 ప్రమాణాలతో డియో కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. హైదరాబాద్‌లో దీని ఎక్స్‌షోరూమ్‌ ధర 49,132 రూపాయలు. అన్ని వాతావరణ పరిస్థితుల్లోను చక్కని విజిబులిటీ కోసం ఆటోమేటిక్‌ హెడ్‌లాం్‌పను దీనిలో అమర్చారు. అలాగే ప్రస్తుతం మార్కెట్‌లో ఉ న్న మోడల్‌తో పోల్చితే ఎంతో కొత్తగా కనిపించే ఈ స్కూటర్‌లో మొబైల్‌ చార్జింగ్‌ పోర్ట్‌ను కూడా ఏర్పాటు చేశారు. 2002లో ప్రవేశపెట్టిన ఈ డియో స్కూటర్‌ అమ్మకాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా 17.5 లక్షలు చేరాయి. ఈ మోడల్‌ పూర్తిగా కొత్తగా ఉంటుందని, ఎల్‌ఇడి పొజిషన్‌ ల్యాంప్‌, డ్యుయెల్‌టోన్‌ కలర్‌ బాడీ, మరింత ఆకర్షణీయంగా కనిపించే స్పోర్ట్‌ గ్రాఫిక్స్‌తో రెండు కొత్త రంగుల్లో కూడా ఇది అందుబాటులో ఉంటుందని కంపెనీ వైస్‌ప్రెసిడెంట్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) యద్విందర్‌ సింగ్‌ గులేరియా చెప్పారు.
business
17,944
12-12-2017 15:04:06
అంబాజీ దేవాలయంలో మోదీ ప్రత్యేక పూజలు
అహ్మదాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం బనస్కాంత జిల్లాలోని అంబాజీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన సబర్మతి రివర్‌ఫ్రంట్ నుంచి సీప్లేన్‌లో మెహసానాలోని ధరోయి వరకు వెళ్ళారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అంబాజీ దేవాలయానికి వెళ్ళారు. తిరిగి ఆయన సబర్మతికి మళ్ళీ సీప్లేన్‌లోనే ప్రయాణించారు. గుజరాత్‌లో సీప్లేన్‌లో ప్రయాణించిన తొలి ప్రయాణికుడిగా మోదీ రికార్డు సృష్టించారు.
nation
9,030
12-05-2017 15:36:05
అజిత్ 'వివేగమ్' మూవీ టీజర్‌కు విశేష స్పందన
అజిత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న 'వివేగమ్' మూవీ టీజర్ వచ్చేసింది. హాలీవుడ్ యాక్షన్ మూవీని తలపించే రీతిలో అదరగొట్టేస్తోంది ఈ టీజర్...   కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా రూపొందుతున్న తమిళ చిత్రం 'వివేగమ్'... ఇప్పటికే అజిత్‌తో వీరం.. వేదాళమ్ వంటి సూపర్ హిట్స్ అందించిన శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక కాజల్ అగర్వాల్, అక్షరా హాసన్ హీరోయిన్స్ గాను వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో ఆకట్టుకున్న ఈ మూవీకి సంబందించి తాజాగా టీజర్‌ను విడుదల చేశారు... బుధవారం విడుదలైన ఈ టీజర్‌కు అభిమానులతో పాటు సినీజనాల నుంచి సూపర్బ్ అప్లాజ్ లభిస్తోంది. అజిత్ కాసేపు ఆర్మీ ఆఫసీర్‌గా.. మరికాసేపు మోస్ట్ వాంటేడ్ క్రిమినల్‌గా కనిపిస్తోన్న ఈ టీజర్ చూస్తుంటే.. సినిమాలో అజిత్ ద్విపాత్రాభినయం చేశాడేమో అనిపిస్తోంది. ఎక్కువభాగం ఫారిన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం హాలీవుడ్ యాక్షన్ సినిమాలను మరపించేలా ఉంది. నెవర్ గివ్ అప్ అనే మోటోతో అజిత్ చెప్పిన డైలాగ్స్.. టీజర్‌కు హైలెట్.... ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు టీజర్ చివర్లో రివీల్ చేశారు.... సో టీజర్‌లో మోస్ట్ స్టైలిష్‌గా కనిపిస్తోన్న అజిత్.. ఏమేమి సాహసాలు చేశాడో తెలియాలంటే ఆగస్టు వరకూ ఆగాల్సిందే..!
entertainment
2,200
25-03-2017 23:45:25
స్వల్పంగా తగ్గిన బంగారం
న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో బలహీన ట్రెండ్‌, దేశీయంగా జువెలర్స్‌ నుంచి డిమాండ్‌ తగ్గడంతో శనివారం దేశ రాజధాని మార్కెట్లో పది గ్రాముల బంగారం (99.9 శాతం స్వచ్ఛత) ధర 20 రూపాయలు తగ్గి 29,330 రూపాయలకు చేరుకుంది. వెండి ధర మాత్రం కిలోకు 425 రూపాయలు పెరిగి 41,800 రూపాయలకు చేరుకుంది. పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి వెండికి డిమాండ్‌ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌ విషయానికొస్తే.. న్యూయార్క్‌ మార్కెట్లో శుక్రవారం ఔన్స్‌ బంగారం ధర 0.14 శాతం తగ్గి 1,242.90 డాలర్లకు చేరింది.
business
2,286
28-01-2017 00:25:08
ఒక్కసారిగా దిగొచ్చిన బంగారం,వెండి ధరలు
ముంబై: దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. వరుసగా మూడో రోజూ ముంబై మార్కె ట్లో బంగారం ధర తగ్గింది. శుక్రవారం నాడు 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాముల పసిడి ధర క్రితం ముగింపుతో పోల్చితే 420 రూపాయలు తగ్గి 29,275 రూపాయల నుంచి 28,855 రూపాయలకు చేరుకుంది. ఇది రెండు వారాల కనిష్ఠ స్థాయి ధర కావడం గమనార్హం. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి 29,125 రూపాయల నుంచి 28,705 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర ఏకంగా 520 రూపాయలు తగ్గి 40,410 రూపాయల నుంచి 40,890 రూపాయలకు చేరుకుంది. ఇది రెండు వారాల కనిష్ఠ స్థాయి ధర. శుక్రవారం ఉదయం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 0.5 శాతం మేర పడిపోయింది. ఈ ప్రభావం దేశీయ బులియన్‌ మార్కెట్‌పైనా పడింది. జువెలర్స్‌ నుంచి డిమాండ్‌ తగ్గడం కూడా ధరల్లో క్షీణతకు దారితీసింది. అంతర్జాతీయ మార్కె ట్లో ఔన్స్‌ బంగారం ధర 1,184 డాలర్ల స్థాయిలో ఉండగా.. ఔన్స్‌ వెండి ధర 16.72 డాలర్లుగా ఉంది.
business
10,730
13-05-2017 16:30:22
పాటలు పాడటంలోనూ ముందుంటున్న మన హీరోలు
అదుర్స్ అనిపించేలా స్టెప్పులేయడమే కాదు..... అబ్బుర పరచేలా పాటలు పాడటంలోనూ ముందుంటున్నారు మన హీరోలు. ఇప్పటికే చాలామంది ఈ వరుసలో ముందుండగా.. లేటెస్ట్‌గా తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ బాలకృష్ణ కూడా పాట పాడేశాడు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ పాటలు పాడిన మన హీరోలెవరో చూసేద్దాం... ఇటీవల మన టాలీవుడ్‌లో హీరోలు పాటలు పాడటం ఎక్కువగా కనిపిస్తోంది. హీరోతో పాట పాడిస్తే సినిమాకు అదో స్పెషల్ అట్రాక్షన్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ విషయంపై అమితాసక్తి చూపిస్తున్నారు దర్శకనిర్మాతలు. సంగీత దర్శకులు సైతం సై అంటుండడంతో ఇప్పుడు హీరోలూ సింగర్స్‌గా సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ వరుసలో నందమూరి బాలకృష్ణ కూడా చేరారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో తొలిసారి పాట పాడారు బాలకృష్ణ. అనూప్ సంగీత సారధ్యంలో భాస్కరభట్ల సాహిత్యం అందించిన 'మామ ఎగ్ పెగ్ లావో' అంటూ సాగే మాస్ సాంగ్‌ను పాడారు బాలకృష్ణ. గతంలో 'మేము...సైతం' అనే కార్యక్రమంలోనూ సరదాగా స్టేజ్‌పై కాసేపు పాటలు పాడినప్పటికీ.. సినిమా కోసం పాట పాడటం మాత్రం బాలయ్యకు ఇదే మొదటిసారి. ఇక మరో సీనియర్ స్టార్ వెంకటేశ్ కూడా ఇదే ఏడాది సింగర్‌గా ఎంట్రీ ఇవ్వడం మరో స్పెషల్ అట్రాక్షన్. 'గురు' సినిమా కోసం జింగిడి జింగిడి అనే పాట పాడారు వెంకటేశ్. ఒకప్పుడు నాగయ్య, అక్కినేని వంటి వారు సింగర్స్‌గానూ మెప్పించగా.. తన సొంత చిత్రాల్లో ఘంటసాలతో కొన్ని చోట్ల గొంతు కలిపారు ఎన్టీఆర్. ఆ తర్వాత తరం హీరోలు సింగింగ్‌పై పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే.. ఆ తర్వాత తరం నటుడు చిరంజీవి మాత్రం సింగర్ గానూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. 'మాస్టర్', 'మృగరాజు' చిత్రాలలో చిరు పాడిన పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. నలుగురు సీనియర్ స్టార్స్‌లో చిరు తర్వాత పాట పాడింది నాగార్జునే. తండ్రి ఏఎన్నార్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని... పాటతోనూ తన సరదా తీర్చుకున్నాడు నాగ్. వై.వి.యస్. చౌదరి దర్శకత్వంలో రూపొందిన 'సీతారామరాజు' చిత్రంలో... సిగరెట్ గురించి పాట పాడిన నాగార్జున.. రీసెంట్‌గా 'నిర్మలా కాన్వెంట్'లోనూ ఓ లవ్ సాంగ్ పాడి అభిమానులకు ఆనందం పంచాడు. జూనియర్స్ సంగతెలా ఉన్నా.. మన నలుగురు సీనియర్ హీరోలు ఫస్ట్ టైమ్ పాడిన పాటలన్నింటికి మధ్య ఓ పోలిక ఉంది. చిరంజీవి టీ తాగమంటూ పాట పాడితే.. నాగార్జున సిగరెట్ స్మోకింగ్ గొప్పతనాన్ని తొలిపాటలో వివరించాడు. ఇక వెంకీ మరో అడుగు ముందుకేసి ఆల్కహాల్ పై ఫస్ట్ సాంగ్ పాడగా.. ఇప్పుడు బాలకృష్ణ సైతం ఏక్ పెగ్ ఏస్కోమంటున్నాడు. ఇలాంటి పాటల బదులు కాస్తంత మంచి పాటలు పాడితే బాగుండేదనే విమర్శలూ లేకపోలేదు. పాటలు పాడటం జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో కామన్ అయిపోయింది. గతంలో కీరవాణి స్వరసారధ్యంలో 'యమదొంగ'లో పాడిన తారక్.. దేవిశ్రీ సంగీతంలో 'అదుర్స్' అనిపించాడు. ఇక ఆమధ్య 'రభస'లో రాకాసి రాకాసీ అంటూ టీజింగ్ సాంగ్ పాడటంతో పాటు 'నాన్నకు ప్రేమతో'లో ఫాలో ఫాలో అంటూ తన ఫాలోయింగ్ పెంచుకున్నాడు. పునీత్ రాజ్‌కుమార్ సినిమా కోసం ఎన్టీఆర్ కన్నడలోనూ ఓ పాట పాడటం విశేషం. ఇక ఈ తరం హీరోల్లో ఎన్టీఆరే కాదు.. పవన్ కూడా పాటలు పాడటంలో ముందున్నాడు. కాకపోతే... పవన్ ఎక్కువగా పాడేవి హాఫ్ బీట్ సాంగ్సే. 'తమ్ముడు', 'ఖుషీ' చిత్రాల్లో బిట్ సాంగ్స్ పాడిన పవన్... తాను డైరెక్ట్ చేసిన 'జానీ' సినిమాలో... రెండు ఫుల్ సాంగ్స్‌ను పాడేశాడు. ఆ తర్వాత... 'గుడుంబా శంకర్', 'పంజా', 'గబ్బర్ సింగ్', అత్తారింటికి దారేది' చిత్రాల్లోని పాటల్లో తాను కూడా గొంతు కలిపాడు పవన్. కోలీవుడ్ హీరోల్లో శింబు, ధనుష్, సిద్ధార్థ్ వంటి వారంతా ప్రొఫెషనల్ సింగర్స్ తరహాలో పాటలు పాడేస్తున్నారు. అప్పట్లో 'మల్లన్న'లో పాటలు పాడిన విక్రమ్ ఇటీవల 'స్కెచ్' మూవీలో ఓ పాట పాడాడు. ఇక టాలీవుడ్ యంగ్ హీరోలు సైతం ఈ విషయంలో ఆసక్తి చూపిస్తున్నారు. అల్లరి నరేశ్, నారా రోహిత్, సందీప్ కిషన్ వంటి హీరోలంతా సింగర్స్‌గానూ అదృష్టం పరిక్షించుకుంటున్నారు. మొన్నామధ్య రవితేజ సైతం నోటంకి అంటూ తమన్ మ్యూజిక్‌లో సింగర్ గా ఎంట్రీ ఇచ్చేశాడు. మొత్తానికి.. సీనియర్స్, జూనియర్స్ అనే తేడా లేకుండా హీరోలంతా పాటలు పాడేస్తున్నారు. మరి.. ఈ వరుసలో ఇంకెవరెవరూ నిలుస్తారో చూడాలి!!
entertainment
6,299
27-02-2017 22:04:33
నందమూరి, మెగా ఫ్యామిలీ మధ్య మరోసారి బిగ్ ఫైట్!
సంక్రాంతి తరువాత టాలీవుడ్‌లో మరో బడా క్లాష్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాదిలోనే మరోసారి నందమూరి, మెగా ఫ్యామిలీ హీరోలు టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద బడా ఫైట్‌కు రెడీ అవుతున్నారట. ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం.150’, బాలకృష్ణ నటించిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రాలు టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద ఒక్కరోజు గ్యాప్‌లో విడుదలై పెద్ద సెన్సేషన్ క్రియేట్‌ చేశాయి. అయితే ఈ రెండు సినిమాను సంక్రాంతిని క్యాష్ చేసుకుని సక్సెస్ సాధించాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఈ ఏడాది నందమూరి హీరో ఎన్టీఆర్, మెగా ఫ్యామిలీ కథానాయకుడు పవన్ కళ్యాణ్ చిత్రాలు ఒకేరోజు విడుదలకు ముస్తాబవుతున్నాయట! ఎన్టీఆర్, బాబి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘జై లవకుశ’ చిత్రం ఆగస్టు 11న విడుదలకు ముస్తాబవుతుందట. ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటించే ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ను జూన్, జులై వరకు పూర్తిచేసి ఆగస్టు 11న రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశాడట ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్. ఇక అదేరోజున పవన్, త్రివిక్రమ్ సినిమా కూడా రిలీజ్ కానుందట. పవన్ సినిమా కోసం ఇప్పటికే బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న త్రివిక్రమ్.. త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్తాడట. ఒకే షెడ్యూల్‌లో కంటిన్యూగా షూటింగ్ పూర్తిచేసి ఆగస్టులో విడుదలకు ప్లాన్ చేస్తున్నారట. ఆగస్టు రెండో వారంలో ఎక్కువ సెలవులు రావటంతో ఆగస్టు 11నే పవన్, త్రివిక్రమ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తున్నారట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ స్టార్ హీరోస్ చిత్రాలు ఒకేరోజు విడుదలయితే జరిగే నష్టం అంతాఇంతా కాదు. దీనిని దృష్టిలో పెట్టుకుని పవన్, ఎన్టీఆర్ సినిమాల నిర్మాతలు తమ చిత్రాల రిలీజ్ డేట్స్ మార్చుకుంటారో లేక అదే రోజు విడుదల చేసి పోటీకి దిగుతారో చూడాలి.
entertainment
3,531
02-05-2017 01:25:19
బంగారు భవితకై ‘భగీరథుల’ ఎదురుచూపు
వడ్డించేవాడు మనవాడైతే, ఏ బంతిలో ఉంటే ఏం? సమైక్య పాలన అంతమై స్వయం పాలనను ఆస్వాదిస్తున్న అనేక మంది మదిని ప్రస్తుతం గెలిచి నిలిచిన ఆలోచన అది. స్వరాష్ట్రం సిద్ధించాక ప్రస్తుత పాలకులు కులాలవారీగా, కులవృత్తుల ఆధారంగా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కంకణబద్ధులై కార్యరూపాన్ని ప్రకటించి అమలుచేసే దిశగా అడుగులు పడుతుండటంతో ముందువరుసలో ఉన్న వారి ముఖాల్లో ఇప్పటికే చిరునవ్వులు చిందుతూండగా, ‘ఎలాగో వడ్డన జరుగుతోంది, చివరి బంతిలోనైనా చియ్యకూర బువ్వనే తింటాంలే’ అని అనుకుంటూ అనేక తెగలు తెగ సంబరపడి పోతున్నాయి. అందులో ఒకటి సగర(ఉప్పర) జాతి. యాదవ సోదరుల ఒక్కో కుటుంభానికి 21 గొర్రెలు; నాయి బ్రాహ్మణులకు 25వేల మోడ్రన్‌ క్షవరశాలలు; గీత కార్మికులకు 5కోట్ల ఈత, తాటి వనం పెంపకం; పద్మశాలీల సంక్షేమానికి 1250 కోట్లు; మత్స్యకారులకు 1000 కోట్లు; రజకులు; వడ్రంగి, కమ్మరి, విశ్వకర్మ తదితర పంచకులాలకు 200 కోట్లు... ఇలా ఎన్నో కులాలకు వారి వృత్తుల ఆధారంగా ఆర్థికంగా ప్రోత్సాహకాలను ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం సగరులను (ఉప్పరులను) కూడా ఖచ్చితంగా ఆదుకుంటుందనే విశ్వాసాన్ని ఆ సంఘ ప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు. సమైక్య పాలనలో ఉనికి లేని ఉప్పరులుగా ఐదు దశాబ్ధాల పాటు అడుగడుగునా దగా పడ్డ సంచార జాతి సగర జాతి. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో అట్టడగున ఉన్న కులం ఏదైనా ఉందా అంటే దానిని అసలైన చిరునామాగా దీనిని చూపించొచ్చేమో! నాటి కృతయుగం నుంచి నేటి కలియుగం వరకు కార్యసాధకుడిగా చరిత్రపుటల్లో నిలిచిన భగీరథుడు మరెవరో కాదు యావత్‌ సగర జాతికి ఆరాధ్య గురువు. అకుంఠిత దీక్షతో నాడు గంగను తెచ్చి చరిత్రలో నిలిచిన భగీరథుడి పేరుతో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికి జలసిరిని కురిపించే తాగు నీటి పథకానికి మిషన్‌ భగీరథగా నామకరణం చేయడం పట్ల ఆయన వంశస్తులు అమితానందపడ్డారు. ఘన చరిత్ర కల్గిన భగీరథుడి వంశస్తులు నేడు కడుదీయనీయ పరిస్థితుల్లో జీవనయానాన్ని సాగిస్తున్నారు. సంచారజాతిగా పొట్ట చేతబట్టుకొని ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్లి నిర్మాణరంగ కార్మికులుగా కాలం వెళ్లదీస్తున్నారు. పాలమూరులో అయితే ఇప్పటికీ గుంపులు కట్టి ఉత్తర భారతదేశానికి వలసపోతున్న దయనీయస్థితి. మొదట ఉప్పు తయారీదారులుగా ఉన్న ఉప్పరులు కాలక్రమేణా నిర్మాణరంగ కార్మికులుగా రూపాంతరం చెందారు. దేశంలో సగరులను ఒక్కో పేరుతో పిలుస్తారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సగర(ఉప్పర)లుగా పిలవడమే కాదు బీసీ–డీ గ్రూపు సీరియల్‌ నెంబర్‌ 31గా చేర్చి గత పాలకులు తీరని నష్టాన్ని చేశారు. సంచార తెగలుగా ఎస్టీ జాబితాలో ఉండాల్సిన సగరులను తీసుకెళ్లి బీసీ–డీలో చేర్చడాన్ని అప్పటి మురళీధర్‌, అనంతరామన్‌ కమిషన్‌లు కూడా తప్పు పట్టాయి. నిర్మాణరంగాన్ని కులవృత్తిగా ఎంచుకున్న ఈ జాతిని అధికారికంగా గుర్తించే పాలకులు మాత్రం లేకుండా పోయారు. సమైక్య పాలనలో ఐదు దశాబ్దాల పాటు ఉనికి లేని ఉప్పరులుగా మరుగునపడ్డ సగరులను మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపునందుకొని వెళ్లిన తెలంగాణ రాష్ట్ర సగర సంఘ నాయకులు రాష్ట్రంలో దాదాపు 15 లక్షల జనాభా కలిగిన సగరుల సమస్యలను సీఎంకు నివేదించారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో పూర్తిగా వెనుకబడ్డ సగరులను ప్రభుత్వం తరఫున ఆదుకోవాలంది. దీంతో సగరులను నిర్మాణ రంగ కార్మికులుగా గుర్తించే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈఎండీ (ధరావత్తు) లేకుండా ప్రభుత్వరంగ నిర్మాణ పనులను సగరులకు కేటాయించే ఫైల్‌ ప్రస్తుతం సచివాలయంలో చివరి అంకంలో ఉన్నట్లు సమాచారం. ఈ జీవో వస్తే ఆర్థికంగా ఈ జాతిని ప్రభుత్వం ఆదుకున్నట్లు అవుతుంది. దీంతోపాటు చెట్టు ఎక్కి కల్లుగీసే గీత కార్మికులకు తాజాగా ప్రభుత్వం ప్రమాద బీమాను డబుల్‌ చేసింది. అదే విధంగా గోవా కట్టెలపై నిర్మాణ పనులు చేసే సగరులకు కూడా ప్రమాద బీమా, పెన్షన్‌ విధానాన్ని కూడా ప్రభుత్వం త్వరలోనే తీసుకురాగలదనే నమ్మకంతో ఉన్నారు. తాజాగా బసవేశ్వర లాంటి గొప్ప వ్యక్తుల జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఏ విధంగా అయితే అధికారికంగా నిర్వహిస్తున్నదో అదేవిధంగా భగీరథుడి జయంతి ఉత్సవాలను కూడా భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించగలదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, నేడు అనగా వైశాఖ శుద్ధ సప్తమి (మంగళవారం) రవీంద్రభారతిలో భగరథుడి జయంతిని ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర సగర సంఘం సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం సగరుల సమస్యలన్నింటినీ తప్పక తీర్చగలదనే అచంచలమైన విశ్వాసంతో....అస్కాని మారుతీసాగర్‌తెలంగాణ రాష్ట్ర సగర విద్యావంతుల వేదిక కన్వీనర్‌(నేడు భగీరథ జయంతి)
editorial
3,481
06-09-2017 04:33:04
తిరోగమిస్తున్న భారత్
బీజేపీ గడిచిన మూడేళ్ళలో కేవలం రాజకీయాలు, మీడియా ప్రకటనలకే పరిమితం అయ్యిందే తప్పా, దేశ అభివృద్ధికి సంబంధించి తగిన కార్యాచరణను రూపొందించడంలో పూర్తిగా విఫలం చెందింది. అధికారమే పరమావధిగా కుట్రపూరిత, దిగజారుడు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోంది. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పాలన కొనసాగిస్తూ భావి తరాలకు ఏమని సంకేతాలకు ఇవ్వాలనుకుంటుంది? కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి మూడేళ్ల మూడు నెలలు పూర్తి అయ్యాయి. ‘మేం అధికారంలోకి వస్తే నల్లధనం వెనక్కి తెస్తాం, అవినీతిని నిర్మూలిస్తాం, తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని అరికడతా’మని ఊదరగొట్టిన బీజేపీ, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఇప్పటికీ నల్లధనం వెనక్కి తీసుకురాలేదు. అవినీతి పెరిగిందే కానీ తగ్గలేదు. జీఎస్టీ పేరుతో పన్ను విధానాన్ని సరళీకృతం చేస్తామని దానిని మరింత జఠిలం చేయడంతో పాటు దేశంలో లౌకికవాదం ముసుగులో మతతత్వ ఘర్షణలకు తెరలేపింది. గడిచిన మూడేళ్ళలో కేవలం రాజకీయాలు, మీడియా ప్రకటనలకే పరిమితం అయ్యిందే తప్పా, దేశ అభివృద్ధికి సంబంధించి తగిన కార్యాచరణను రూపొందించడంలో పూర్తిగా విఫలం చెందింది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అచ్చం కేంద్ర ప్రభుత్వంలాగే వ్యవహరిస్తుంది. లేనిది ఉన్నట్లుగా ప్రజలకు ఒక అభూత కల్పన కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర పాలకులిద్దరూ నిమగ్నమయ్యారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి.  దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అదీ కాకుండా ఉత్తర భారతంలో బలంగా ఉంది. కాబట్టి దక్షిణ భారత్‌తో పాటు, మిగతా రాష్ట్రాల్లో కూడా తమ పార్టీ జెండాతో పాటు కాషాయ ఎజెండాను కూడా అమలు చేయటంపై దృష్టి సారిస్తుంది. దీనికి అనుగుణంగా ఆయా రాష్ట్ర రాజకీయాల్లో సమయానుకూలంగా పావులు కదుపుతోంది. తమిళనాడు సీఎం జయలలిత మృతి తర్వాత అక్కడ రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన కమలనాథులు ఎప్పటికప్పుడు తమ వంతు పావులు కదిపారు. ఏకంగా కేంద్ర మంత్రివర్యులు వెంకయ్యనాయుడు చెన్నైలో రెండు రోజులు ఉండి జయలలిత అంత్యక్రియల వరకు అక్కడే మకాం వేశారు. కానీ అనూహ్యంగా తమిళ రాజకీయాలు మారిపోయాయి. అన్నా డీఎంకే రెండుగా చీలి పన్నీరు, పళని వర్గాలు ఏర్పడ్డాయి. అనతికాలంలోనే ఈ రెండు వర్గాలు ఒక్కటయ్యాయి. విడిపోవడానికి మేము కారణం కాదు అని చెప్పుకునే వాళ్లు, కలిసాక మాత్రం తమ ప్రమేయం ఉందని ప్రచారం చేసుకుంటున్నారు.  ఆర్ఎస్ఎస్ అండదండలతో కేరళలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బీజేపీ, మొన్నటి ఎన్నికల్లో ఒక్క సీటుతో తమ ఖాతాను తెరిచింది. ఎలాగో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేం కాబట్టి అక్కడ అశాంతి వాతావరణాన్ని సృష్టించి రాష్ట్రపతి పాలన తేవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. కానీ అదీ కూడా నెరవేరక చతికిలపడింది. ఢిల్లీ సీఎం అభ్యర్థిగా ఓడిపోయిన కిరణ్ బేడీని, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించింది. కానీ ఆమెకు, స్థానిక సీఎంకు అస్సలు పొసగడంలేదు. అక్కడ కూడా అశాంతిని రాజేసి, ఎలాగైనా అధికారం చేబూనాలని ఎత్తులు వేసింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటూ గవర్నర్ పదవికి కూడా మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా నేపథ్యంలో హైడ్రామా నడుమ రాత్రికి రాత్రే బీజేపీ మద్దతునిచ్చి నితీశ్‌ను మళ్లీ గద్దెనెక్కించారు. ఇలా బీజేపీ అధికారంలో లేని ఏ రాష్ట్రాన్ని చూసినా ఏదో ఒక మెలిక పెడ్తూ అధికారానికై అర్రులు చాస్తుంది.  ఇక తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టిన కమల దళపతి అమిత్ షా ఇక్కడ తరుచుగా పర్యటిస్తున్నారు. తెలంగాణకి కేంద్రం లక్ష కోట్లు ఇచ్చిందని ప్రకటించారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం తమకు ఏం ఇవ్వలేదని అమిత్ షాకి సవాల్ కూడా విసిరారు. కానీ వీరు ఇద్దరు ఆడుతున్న రాజకీయ నాటకంలో సాధారణ ప్రజానీకం బలైపోతున్నది. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి టీడీపీతో బీజేపీ దోస్తీ కట్టింది. కానీ హోదాతో ఏపీకి ఒరిగేదేమీ లేదంటూ ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు. మరి ప్యాకేజీతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం మేలు జరిగిందో కేంద్రంలో ఉన్న బీజేపీ చెప్పాల్సిన అవుసరం ఉన్నది. 1980లో ఏర్పాటైన బీజేపీకి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఏమాత్రం ప్రాతినిధ్యం లేదు. కానీ ఇప్పుడు ఎక్కడలేని దేశభక్తిని చాటుతూ దేశ వ్యాప్తంగా ‘తిరంగ యాత్రలు’ చేపడుతున్నారు. అంతేకాక ఇతరుల దేశభక్తిని శంకిస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమవడమే కాక, ప్రతి యేడాది రెండు కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామనే విషయంలో కూడా ఘోరంగా విఫలమైంది. ఈ యేడాది ఐటీ రంగం సుమారు లక్ష ఉద్యోగాలు కోల్పోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పారిశ్రామిక రంగంలోనూ ఆశించిన ఫలితాలు లేవు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’, ‘స్టార్టప్‌ ఇండియా’, ‘డిజిటల్‌ ఇండియా’ ఇలా చాలా చెప్పారు. కానీ ఈ మూడేండ్లలో ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రాలేదు. దేశంలో రైతాంగాన్ని ఆదుకోవడంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం మీనవేషాలు లెక్కించిందే తప్పా ఏనాడు రైతు సమస్యలకు సరైన పరిష్కార మార్గం చూపలేదు. స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని ఎన్నికల సమయంలో ప్రగల్భాలు పలికారు. నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు అయ్యింది. దీంతో సామాన్యుడి నడ్డి విరిగినట్టయ్యింది. ఆ గాయం మానక ముందే జీఎస్టీ పేరుతో ‘వన్ నేషన్ వన్ ట్యాక్స్’ అంటూ కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. అధిక జీఎస్టీ స్లాబ్స్‌తో మధ్య తరగతి ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. బీజేపీకి ఓట్లువేసి అధికారం కట్టబెట్టింది ఈ మధ్యతరగతి వారే.  అదేవిధంగా చిన్నాచితకా కలిపి మొత్తం 15వేల కంపెనీలు మూతపడ్డాయి. దీని పర్యవసానంగా లక్షలాది మంది ఉపాధి పోయి రోడ్డున పడ్డారు. యూపీఏ హయాంలో 2008–09లో 2.55లక్షల ఉద్యోగాలు, 2010–2011లో అత్యధికంగా 4.82 కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. కానీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 2014–2015లో 3.57 లక్షలు, 2016–17లో కేవలం 1.87 లక్షల ఉద్యోగాలు మాత్రమే కల్పించి గొప్పలు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా నరేంద్ర మోదీ 2014 మే నెలలో ప్రధాని పదవి చేపట్టిన నాటి నుంచి 2017 మే వరకు 44 దేశాల్లో పర్యటించారు. ఆయన పర్యటనలకు అయిన ఖర్చు అక్షరాల రూ.275కోట్లు. 27 ట్రిప్‌లు, 119 రోజులు విదేశాల్లో పర్యటించి దేశానికి ఒరగబెట్టిందేమీ లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ బీజేపీ నేతలు మాత్రం ఆయన విదేశీ పర్యటనల వల్లే భారత పతాకం అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడుతోందని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. విదేశాల నుంచి పెట్టుబడులు తెప్పించేందుకు ఇక్కడ కార్మిక చట్టాలను కొన్నింటిని రద్దు చేయగా, మరికొన్నింటిని బలహీనపర్చారు. మరి పెట్టుబడులన్నా వచ్చాయా అంటే అదీ లేదు. కొన్ని దేశాల నుంచి పెట్టుబడులు వచ్చినప్పటికీ అవి కూడా నామమాత్రమే. ఇక మరి బీజేపీ సాధించింది ఏమంటే.. అధికారమే పరమావధిగా కుట్రపూరిత, దిగజారుడు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పాలన కొనసాగిస్తూ రేపటి తరానికి ఏమని సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారో పాలకులకే తెలియాలి.ఇందిరాశోభన్ పోశాలటీపీసీసీ అధికార ప్రతినిధి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి మూడేళ్ల మూడు నెలలు పూర్తి అయ్యాయి. ‘మేం అధికారంలోకి వస్తే నల్లధనం వెనక్కి తెస్తాం, అవినీతిని నిర్మూలిస్తాం, తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని అరికడతా’మని ఊదరగొట్టిన బీజేపీ, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఇప్పటికీ నల్లధనం వెనక్కి తీసుకురాలేదు. అవినీతి పెరిగిందే కానీ తగ్గలేదు. జీఎస్టీ పేరుతో పన్ను విధానాన్ని సరళీకృతం చేస్తామని దానిని మరింత జఠిలం చేయడంతో పాటు దేశంలో లౌకికవాదం ముసుగులో మతతత్వ ఘర్షణలకు తెరలేపింది. గడిచిన మూడేళ్ళలో కేవలం రాజకీయాలు, మీడియా ప్రకటనలకే పరిమితం అయ్యిందే తప్పా, దేశ అభివృద్ధికి సంబంధించి తగిన కార్యాచరణను రూపొందించడంలో పూర్తిగా విఫలం చెందింది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అచ్చం కేంద్ర ప్రభుత్వంలాగే వ్యవహరిస్తుంది. లేనిది ఉన్నట్లుగా ప్రజలకు ఒక అభూత కల్పన కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర పాలకులిద్దరూ నిమగ్నమయ్యారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి.  దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అదీ కాకుండా ఉత్తర భారతంలో బలంగా ఉంది. కాబట్టి దక్షిణ భారత్‌తో పాటు, మిగతా రాష్ట్రాల్లో కూడా తమ పార్టీ జెండాతో పాటు కాషాయ ఎజెండాను కూడా అమలు చేయటంపై దృష్టి సారిస్తుంది. దీనికి అనుగుణంగా ఆయా రాష్ట్ర రాజకీయాల్లో సమయానుకూలంగా పావులు కదుపుతోంది. తమిళనాడు సీఎం జయలలిత మృతి తర్వాత అక్కడ రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన కమలనాథులు ఎప్పటికప్పుడు తమ వంతు పావులు కదిపారు. ఏకంగా కేంద్ర మంత్రివర్యులు వెంకయ్యనాయుడు చెన్నైలో రెండు రోజులు ఉండి జయలలిత అంత్యక్రియల వరకు అక్కడే మకాం వేశారు. కానీ అనూహ్యంగా తమిళ రాజకీయాలు మారిపోయాయి. అన్నా డీఎంకే రెండుగా చీలి పన్నీరు, పళని వర్గాలు ఏర్పడ్డాయి. అనతికాలంలోనే ఈ రెండు వర్గాలు ఒక్కటయ్యాయి. విడిపోవడానికి మేము కారణం కాదు అని చెప్పుకునే వాళ్లు, కలిసాక మాత్రం తమ ప్రమేయం ఉందని ప్రచారం చేసుకుంటున్నారు.  ఆర్ఎస్ఎస్ అండదండలతో కేరళలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బీజేపీ, మొన్నటి ఎన్నికల్లో ఒక్క సీటుతో తమ ఖాతాను తెరిచింది. ఎలాగో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేం కాబట్టి అక్కడ అశాంతి వాతావరణాన్ని సృష్టించి రాష్ట్రపతి పాలన తేవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. కానీ అదీ కూడా నెరవేరక చతికిలపడింది. ఢిల్లీ సీఎం అభ్యర్థిగా ఓడిపోయిన కిరణ్ బేడీని, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించింది. కానీ ఆమెకు, స్థానిక సీఎంకు అస్సలు పొసగడంలేదు. అక్కడ కూడా అశాంతిని రాజేసి, ఎలాగైనా అధికారం చేబూనాలని ఎత్తులు వేసింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటూ గవర్నర్ పదవికి కూడా మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా నేపథ్యంలో హైడ్రామా నడుమ రాత్రికి రాత్రే బీజేపీ మద్దతునిచ్చి నితీశ్‌ను మళ్లీ గద్దెనెక్కించారు. ఇలా బీజేపీ అధికారంలో లేని ఏ రాష్ట్రాన్ని చూసినా ఏదో ఒక మెలిక పెడ్తూ అధికారానికై అర్రులు చాస్తుంది.  ఇక తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టిన కమల దళపతి అమిత్ షా ఇక్కడ తరుచుగా పర్యటిస్తున్నారు. తెలంగాణకి కేంద్రం లక్ష కోట్లు ఇచ్చిందని ప్రకటించారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం తమకు ఏం ఇవ్వలేదని అమిత్ షాకి సవాల్ కూడా విసిరారు. కానీ వీరు ఇద్దరు ఆడుతున్న రాజకీయ నాటకంలో సాధారణ ప్రజానీకం బలైపోతున్నది. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి టీడీపీతో బీజేపీ దోస్తీ కట్టింది. కానీ హోదాతో ఏపీకి ఒరిగేదేమీ లేదంటూ ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు. మరి ప్యాకేజీతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం మేలు జరిగిందో కేంద్రంలో ఉన్న బీజేపీ చెప్పాల్సిన అవుసరం ఉన్నది. 1980లో ఏర్పాటైన బీజేపీకి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఏమాత్రం ప్రాతినిధ్యం లేదు. కానీ ఇప్పుడు ఎక్కడలేని దేశభక్తిని చాటుతూ దేశ వ్యాప్తంగా ‘తిరంగ యాత్రలు’ చేపడుతున్నారు. అంతేకాక ఇతరుల దేశభక్తిని శంకిస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమవడమే కాక, ప్రతి యేడాది రెండు కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామనే విషయంలో కూడా ఘోరంగా విఫలమైంది. ఈ యేడాది ఐటీ రంగం సుమారు లక్ష ఉద్యోగాలు కోల్పోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పారిశ్రామిక రంగంలోనూ ఆశించిన ఫలితాలు లేవు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’, ‘స్టార్టప్‌ ఇండియా’, ‘డిజిటల్‌ ఇండియా’ ఇలా చాలా చెప్పారు. కానీ ఈ మూడేండ్లలో ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రాలేదు. దేశంలో రైతాంగాన్ని ఆదుకోవడంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం మీనవేషాలు లెక్కించిందే తప్పా ఏనాడు రైతు సమస్యలకు సరైన పరిష్కార మార్గం చూపలేదు. స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని ఎన్నికల సమయంలో ప్రగల్భాలు పలికారు. నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు అయ్యింది. దీంతో సామాన్యుడి నడ్డి విరిగినట్టయ్యింది. ఆ గాయం మానక ముందే జీఎస్టీ పేరుతో ‘వన్ నేషన్ వన్ ట్యాక్స్’ అంటూ కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. అధిక జీఎస్టీ స్లాబ్స్‌తో మధ్య తరగతి ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. బీజేపీకి ఓట్లువేసి అధికారం కట్టబెట్టింది ఈ మధ్యతరగతి వారే.  అదేవిధంగా చిన్నాచితకా కలిపి మొత్తం 15వేల కంపెనీలు మూతపడ్డాయి. దీని పర్యవసానంగా లక్షలాది మంది ఉపాధి పోయి రోడ్డున పడ్డారు. యూపీఏ హయాంలో 2008–09లో 2.55లక్షల ఉద్యోగాలు, 2010–2011లో అత్యధికంగా 4.82 కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. కానీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 2014–2015లో 3.57 లక్షలు, 2016–17లో కేవలం 1.87 లక్షల ఉద్యోగాలు మాత్రమే కల్పించి గొప్పలు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా నరేంద్ర మోదీ 2014 మే నెలలో ప్రధాని పదవి చేపట్టిన నాటి నుంచి 2017 మే వరకు 44 దేశాల్లో పర్యటించారు. ఆయన పర్యటనలకు అయిన ఖర్చు అక్షరాల రూ.275కోట్లు. 27 ట్రిప్‌లు, 119 రోజులు విదేశాల్లో పర్యటించి దేశానికి ఒరగబెట్టిందేమీ లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ బీజేపీ నేతలు మాత్రం ఆయన విదేశీ పర్యటనల వల్లే భారత పతాకం అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడుతోందని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. విదేశాల నుంచి పెట్టుబడులు తెప్పించేందుకు ఇక్కడ కార్మిక చట్టాలను కొన్నింటిని రద్దు చేయగా, మరికొన్నింటిని బలహీనపర్చారు. మరి పెట్టుబడులన్నా వచ్చాయా అంటే అదీ లేదు. కొన్ని దేశాల నుంచి పెట్టుబడులు వచ్చినప్పటికీ అవి కూడా నామమాత్రమే. ఇక మరి బీజేపీ సాధించింది ఏమంటే.. అధికారమే పరమావధిగా కుట్రపూరిత, దిగజారుడు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పాలన కొనసాగిస్తూ రేపటి తరానికి ఏమని సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారో పాలకులకే తెలియాలి.ఇందిరాశోభన్ పోశాలటీపీసీసీ అధికార ప్రతినిధి
editorial
10,931
09-05-2017 23:48:11
మూడు భాషల్లోనూ.. మ్యూజికల్‌ హిట్‌
‘సువర్ణసుందరి’ కి షష్టిపూర్తితెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లో ఉత్తమ చిత్రాలను నిర్మించిన సంస్థల్లో ‘అంజలీ పిక్చర్స్‌’ ఒకటి. ఆ రోజుల్లో నాయికగా సూపర్‌స్టార్‌డమ్‌ను చవి చూసిన అంజలీదేవి ఆమె భర్త, సంగీత దర్శకుడు ఆదినారాయణరావుతో కలసి ఈ సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థ నిర్మించిన చిత్రాల్లో ‘సువర్ణసుందరి’ తలమానికం. తన కెరీర్‌ ప్రారంభంలో అంటే 1944 నుండి 1951 వరకూ 20కి పైగా జానపద చిత్రాల్లో నటించి, జానపద నాయకునిగా పేరొందిన అక్కినేని నాగేశ్వరరావు తదనంతర కాలంలో రెండే రెండు జానపదాల్లో నటించడం గమనార్హం. వాటిల్లో ‘సువర్ణసుందరి’ ఒకటి. అయితే ఈ సినిమాలో నటించడానికి అక్కినేని మొదట అంగీకరించలేదు. కారణం హీరోకు ఇందులో అంత ప్రాముఖ్యం లేకపోవడమే. అప్పటికే పలు జానపద చిత్రాల్లో నాయికగా విజయవిహారం చేస్తున్న అంజలీదేవి ఇమేజ్‌కు అనుగుణంగా ‘సువర్ణసుందరి’ చిత్రకథ రూపొందింది. తప పాత్రకు ప్రాధాన్యం లేకపోయినా అంజలి, ఆదినారాయణరావుతో ఉన్న సాన్నిహిత్యం, అంతకు ముందు అంజలీ పిక్చర్స్‌ నిర్మించిన ‘పరదేశి’, ‘అనార్కలి’ చిత్రాల్లో నటించడం వల్ల వారి అభ్యర్థనని కాదనలేక ఈ చిత్రంలో నటించారు అక్కినేని. వేదాంతం రాఘవయ్య ఈ చిత్రానికి దర్శకుడు. దేశబహిష్కరణకు గురైన ఓ రాజకుమారుడు, దేవలోకనర్తకి సువర్ణసుందరిని ప్రేమించడం, అతని కారణంగా ఆమె గర్భవతి కావడం, దాంతో దేవరాజు ఆమెకు శాపమివ్వడం, తత్ఫలితంగా నాయకుడు, సువర్ణసుందరిని గుర్తు పట్టకపోవడం, ఆ తరువాత మరో శాపానికి గురై హీరో రోజులో సగభాగం స్త్రీగా కనిపించడం, చివరకు వారి పుత్రుని కారణంగానే సువర్ణసుందరికి, ఆమె భర్తకు శాపవిమోచనం కలగడంతో కథ సుఖాంతమవుతుంది. ఈ చిత్రానికి సముద్రాల సీనియర్‌, జూనియర్ల సాహిత్యం, ఆదినారాయణ రావు సంగీతం పెద్ద ఎస్సెట్స్‌. ఇందులోని పాటలన్నీ అలరిస్తాయి. ‘‘జగదీశ్వరా...పాహి పరమేశ్వరా...’’, ‘‘పిలువకురా...’’, ‘‘హాయి హాయిగా ఆమని సాగే...’’ పాటలు నేటికీ వీనులవిందు చేస్తాయి. హాస్యనటులైన రేలంగి, రమణారెడ్డి, బాలకృష్ణ ఇందులో ప్రతినాయకులుగా నటించడం విశేషం! బాలనటునిగా బాబ్జీ (జెమినీగణేశన్‌, పుష్పవల్లి కుమారుడు, నటి రేఖ అన్న) అభినయం కూడా ఆకట్టుకుంటుంది. తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా రూపొందింది. తమిళంలో జెమినీగణేశన్‌ హీరోగా నటించారు. రెండు చిత్రాలూ ఒకే రోజు (మే 10, 1957)విడుదలయ్యాయి. భారీ వ్యయంతో నిర్మించిన ఈ చిత్రానికి మొదటి రెండు వారాలు కలెక్షన్లు లేకపోవడంతో అంజలీదేవి, ఆదినారాయణరావు నిరాశకు గురయ్యారు. అయితే మూడో వారం నుంచి ప్రేక్షకాదరణ పెరిగింది. ఆ సమయంలోనే ‘మాయాబజార్‌’ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఆ సినిమా టిక్కెట్లు దొరకని వాళ్లు ‘సువర్ణసుందరి’ చూడడానికి వచ్చేవారు. దాంతో ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాను హిందీలో తీసే ఆలోచన మొదట నిర్మాతలకు లేదు. తెలుగు పాటలు విని ముగుఽ్ధరాలైన గాయని లతా మంగేష్కర్‌ ‘ ఈ చిత్రాన్ని హిందీలో తీస్తే పాటలన్నీ నేనే పాడతాను’ అన్నారట. అయితే సినిమా కోసం వేసిన సెట్స్‌ అన్నీ అప్పటికే తీసెయ్యడంతో , మళ్లీ భారీ సెట్స్‌ వేసి హిందీలో తీయడానికి ఆదినారాయణరావు వెనకాడారు. . అయితే ‘మీరు ఎంత ఖర్చు పెట్టి తీసినా హిందీ చిత్రం తప్పకుండా విజయవంతమవుతుంది’ అని లత అభయం ఇవ్వడంతో ఆదినారాయణరావు ధైర్యంగా ముందడుగు వేశారు. పాటలు పాడిన తర్వాత లతా మంగేష్కర్‌ పారితోషికం తీసుకోవడానికి అంగీకరించలేదట. అయితే ఊరికే పాడించుకోవడం ఇష్టం లేక పాటకు రెండు వేల రూపాయలు ఇచ్చారట ఆదినారాయణరావు. ‘సువర్ణ్‌ సుందరి’ పేరుతో 1958లో విడుదలైన హిందీ చిత్రంలోనూ అక్కినేనే హీరోగా నటించారు. ఏయన్నార్‌ నటించిన ఏకైక హిందీ చిత్రమిదే కావడం విశేషం. మూడు భాషల్లోనూ అంజలిదేవి నాయికగా నటించారు. ఈ చిత్రంలో కాంచన నాగకన్యగా తళుక్కున అలా మెరుస్తారు. ఆమె తెరపై కనిపించిన తొలి చిత్రమిదే. తరువాత ఇదే సంస్థ అక్కినేనితోనే నిర్మించిన ‘భక్త తుకారాం’లో ఆమె ఓ ముఖ్య భూమిక పోషించారు. ఈ చిత్రం ఫస్ట్‌ బ్యాచ్‌లో 13 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. సెకండ్‌ బ్యాచ్‌ వగైరాలు కలుపుకుని 20కి పైగా కేంద్రాలలో వందరోజులు ఆడింది. ఐదు కేంద్రాలలో రజతోత్సవం కూడా జరుపుకుంది. 1958 నవంబర్‌ 7న ‘సువర్‌్ణ్‌ సుందరి’ హిందీలో విడుదలయింది. నౌషాద్‌, సి.రామచంద్ర వంటి హేమాహేమీలయిన సంగీత దర్శకులు రాజ్యం ఏలుతున్న ఆ సమయంలో ఈ చిత్రానికి ఆదినారాయణరావు సమకూర్చిన సంగీతం ఉత్తరాది వారిని కూడా అలరించడం విశేషం. తెలుగు ప్రేక్షకులను రెండున్నర దశాబ్దాలు విశేషంగా అలరించిన ఈ చిత్రం నెగెటివ్‌లు సరైన ఆలనాపాలనా లేకపోవడం వల్ల చాలాకాలం క్రితమే పాడయి పోయాయి. ఇది అభిరుచిగల తెలుగు ప్రేక్షకులకు బాధాకరమైన విషయం. అలనాటి కళాఖండాలను పరిరక్షించుకోవడంలో పొరుగు రాషా్ట్రల స్ఫూర్తితో మన పరిశ్రమ, ప్రభుత్వం నడుంబిగించినట్లయితే ఇలాంటి అపురూప చిత్రాలను భవిష్యత్‌ తరాలకు అందించవచ్చు.
entertainment
2,085
25-08-2017 02:37:44
జైడస్‌ క్యాడిలా ఔషధానికి ఎఫ్‌డిఎ ఆమోదం
న్యూఢిల్లీ: రక్తపోటు చికిత్సకు ఉపయోగించే కాండెసార్టన్‌ సిలెగ్జెటిల్‌ టాబ్లెట్లకు యుఎస్‌ ఎఫ్‌డిఎ నుంచి తుది ఆమోదం లభించినట్టు జైడస్‌ క్యాడిలా తెలిపింది. 4 ఎంజి, 8 ఎంజి, 16 ఎంజి, 32 ఎంజి డోసుల్లో ఈ టాబ్లెట్లను కంపెనీ మార్కెట్‌ చేయనుంది. అహ్మదాబాద్‌లోని మొరైలా యూనిట్‌లో ఈ టాబ్లెట్లను కంపెనీ తయారు చేయనుంది.
business
2,722
14-01-2017 01:32:10
ఎగుమతులు నాల్గో నెలలోనూ ఎగువకే..
న్యూఢిల్లీ : భారత ఎగుమతుల్లో జోరు కొనసాగుతోంది. డిసెంబర్‌లో ఎగుమతులు 5.72 శాతం పెరిగి 2,390 కోట్ల డాలర్లకు చేరాయి. దీంతో వరుసగా నాల్గో నెలలోనూ ఎగుమతులు వృద్ధిని నమోదు చేసుకున్నట్టయింది. అంతకు ముందు ఏడాది డిసెంబర్‌లో 2,260 కోట్ల డాలర్ల ఎగుమతులు జరిగాయి. 2016 డిసెంబర్‌లో భారత 3,425 కోట్ల డాలర్ల దిగుమతులు చేసుకుంది. దీంతో వాణిజ్య లోటు 1,036 కోట్ల డాలర్లుగా నమోదైంది. డిసెంబర్‌లో చమురు దిగుమతులు 764.5 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. అంతకు ముందు ఏడాది ఇదే నెల దిగుమతులతో (1,461 కోట్ల డాలర్లు) పోల్చితే 14.61 శాతం పెరిగాయి. చమురేతర దిగుమతులు 2,660.8 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. ఏప్రిల్‌-డిసెంబర్‌ మధ్యకాలంలో ఎగుమతులు 0.75 శాతం మేర పెరిగి 19,880 కోట్ల డాలర్లకు చేరాయి. ఇదేకాలంలో దిగుమతులు 7.42 శాతం క్షీణించి 27,530 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.
business
11,491
27-03-2017 10:56:32
ప్రభుత్వఆసుపత్రిలో వృద్ధురాలిని వీధికుక్కలు చంపి తిన్నవేళ...
భోపాల్ : అనారోగ్యంతో వైద్యం చేయించుకునేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన 70 ఏళ్ల ఓ వృద్ధురాలిని వీధికుక్కలు లాక్కెళ్లిపోయి పీక్కు తిన్న దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్ ఘఢ్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జరిగింది. బిస్మిల్లాబాయి అనే 70 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్యం పాలై చికిత్స చేయించుకుందామని రాజ్ ఘడ్ ప్రభుత్వ ఆసుపత్రికి ఈ నెల 22వతేదీన వచ్చింది. చికిత్స చేయించుకుంటూ వృద్ధురాలు తప్పిపోయి ఆసుపత్రి వెనుక ఆవరణలోకి వెళ్లింది. అంతే అక్కడ మాటు వేసిన వీధికుక్కలు ఒక్కసారిగా వృద్ధురాలిపై దాడి చేసి కరచి ఆమెను ఏడు అడుగుల దూరం లాక్కెళ్లి చంపి తిన్నాయి. తలతో పాటు శరీరం పైభాగం ముక్కలు మిగిలాయి. ఈ దారుణాన్ని చూసిన పారిశుద్ధ్య కార్మికులు విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వృద్ధురాలిని కుక్కలు లాక్కెళ్లి చంపి తిన్నాయని కొత్వాలీ పోలీసు స్టేషను ఇన్ చార్జి ముఖేష్ గౌర్ చెప్పారు. కాగా ఆసుపత్రి నుంచి వృద్ధురాలు అదృశ్యమైన ఘటనను తాము చూడలేదని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అంటున్నారు. వృద్ధురాలిని కుక్కలు చంపి తిన్న ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది.
nation
1,964
03-01-2017 23:17:08
సువెన్‌ ఔషధానికి పేటెంట్లు
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : కేంద్ర నాడీ మండల వ్యాధుల చికిత్సలో వినియోగించే ఔషధానికి యురేషియా, నార్వేల నుంచి పేటెంట్లను అందుకున్నట్లు సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ వెల్లడించింది. ఈ వ్యాధుల చికిత్సలో ఉపయోగించే న్యూ కెమికల్‌ ఎంటైటిస్‌ (ఎన్‌సిఇ)కు గాను ఇరు దేశాల నుంచి ఒక్కో పేటెంట్‌ లభించిందని పేర్కొంది. ఈ పేటెంట్లు వరుసగా 2032, 2025 వరకు చెల్లుబాటులో ఉంటాయని సువెన్‌ తెలిపింది. సువెన్‌ ఇప్పటి వరకు యురేషియా నుంచి 20, నార్వే నుంచి 6 పేటెంట్లను అందుకుంది.
business
5,566
03-03-2017 11:34:13
అలాంటి వారిపై ఒక కన్నేసి ఉంచాం: అల్లు అరవింద్
మచిలీపట్నం: ప్రేక్షకులను ఆకర్షించేలా జిల్లాలో ఎంపిక చేసిన థియేటర్లను పునర్నిర్మిస్తున్నామని సినీ నిర్మాత త్రిజీ కన్వీనర్‌ అల్లు అరవింద్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక సిరివెంకట్‌, సిరికృష్ణ థియేటర్లను అల్లు అరవింద్‌ కూలం కషంగా పరిశీలించారు. సీట్లు, కెమెరా, సౌండ్‌ సిస్టం, పిక్చర్‌, మరుగుదొడ్లు పరిశీలించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న థియేట ర్లలో ప్రతి అంశాన్ని కూలంకషంగా వేమూరి బాలు తో చర్చించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ను బాలు, వేమూరి లక్ష్మీ నాగేశ్వరరావు, చిరంజీవి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌, అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో అరవింద్‌ మాట్లాడారు. సినిమాలపై ప్రేక్షకులకు మళ్ళీ ఆదరణ పెరిగేందుకు సినిమా థియేటర్లను మెరుగుపరుస్తున్నామన్నారు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, గుడివాడ, విజయవాడల్లో ఆరు థియేటర్లను పునర్నిర్మించామన్నారు. ఈ థియేటర్లలో టుకె సిస్టమ్‌ ప్రవేశపెట్టామన్నారు. అధునాతన యంత్రాలతో సౌండ్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టామన్నారు. తెరలో క్వాలిటీ ఉండే విధంగా ఈ థియేటర్లలో ఏర్పాటు చేశామన్నారు. థియేటర్లను ఏసీ చేస్తూ, కుటుంబ సభ్యులతో ప్రేక్షకులు వచ్చి ఆనందించేలా తీర్చిదిద్దుతున్నామ న్నారు. థియేటర్లు సరిగా లేక ప్రేక్షకులు సినిమాలు సరిగా చూడటం లేదని తమ అధ్యయనంలో తేలిందన్నారు. ఇందుకుగాను ఎంపిక చేసిన థియేటర్లను నూతన టెక్నాలజీతో తిర్చిదిద్దుతున్నామన్నారు. పట్టణాల్లో దగ్గర ఉన్న థియేటర్లు సరిగా లేక సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఏసీ థియేటర్లలో సినిమాలు చూస్తున్నారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సింగిల్‌ స్ర్కీన్‌ మల్టిప్లెక్స్‌ థియేటర్లుగా రూపొందిస్తున్నామన్నారు. ఈదిశలో జిల్లాలో ముందుగా సిరికృష్ణ, సిరివెంకట్‌ థియేటర్లను తీర్చిదిద్దామన్నారు. అదేరీతిలో విజయవాడ రాజ్‌, యువరాజ్‌ థియేటర్లను తీర్చిదిద్దుతామన్నారు. మరుగుదొడ్లు సరిగా లేక మహిళలు సినిమా హాళ్ళకు రావడానికి ఇబ్బందులు పడుతు న్నారని, థియేటర్లలో మరుగుదొడ్లు సక్రమంగా నిర్వహించాలన్నారు. గతంలో సినిమాలు శతదినోత్సవాలు, అర్థ శతదినోత్సవాలు చేసుకునేవన్నారు. ఇప్పుడు అందుకు భిన్నంగా ఎక్కువ థియేటర్లలో సినిమా రిలీజ్‌ చేస్తూ రెండు, మూడు వారాలలోనే పెట్టుబడితో సహా లాభాన్ని గడించే విధంగా రూటు మార్చామన్నారు. ఉభయ తారకంగా డిస్ర్టిబ్యూటర్లకు, ప్రేక్షకులకు అనుకూలంగా చలన చిత్ర వ్యవస్థలో మార్పులు తెస్తున్నామన్నారు. టీవీ వంటి ఎన్ని మాధ్యమాలు పెరిగినా మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని కొందరు పైరసీతో నిర్మాతలకు గండి కొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని, దీనిపై ఒక కన్నువేసి ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో బన్ని వాసు, లక్ష్మణరావు, బ్రహ్మాజీ, ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ సభ్యులు కూరాటి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తిబాబు అల్లు అరవింద్‌ను మొదటి షో ఫ్యాన్స్‌కు ఇవ్వాలని కోరారు. బందరులో ఖైదీ నెంబరు 150 సినిమాకు రికార్డుస్థాయి కలెక్షన్లు వచ్చాయని తెలిపారు.
entertainment
10,149
11-06-2017 11:43:33
డీజే టీమ్ అడిగితే.. చిరంజీవి కాదనలేకపోయారట!
స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌కు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేరళలో కూడా భారీగా అభిమాన గణం ఉంది. బన్నీ తాజా చిత్రం ‘దువ్వాడజగన్నాథమ్‌’ కోసం ఆయన అభిమానులే కాకుండా ఇతర హీరోల ఫ్యాన్స్‌ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమా టీజర్‌, పాటలు ఇప్పటికే మంచి రెస్పాన్స్‌ దక్కించుకున్నాయి. ‘దువ్వాడ జగన్నాథమ్‌’ ఆడియో ఫంక్షన్‌ ఈ రోజు (ఆదివారం) సాయంత్రం హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ ఆడియో ఫంక్షన్‌కు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారట. ఇటీవలె చైనా నుంచి వచ్చిన చిరంజీవి తాజాగా దాసరి నారాయణరావు సంస్మరణ సభలో పాల్గొన్న విషయం తెలిసిందే. ‘డీజే’ టీమ్‌ కూడా తమ ఆడియో వేడుకకు ఆహ్వానించడంతో చిరంజీవి కాదనలేకపోయారట. బాలకృష్ణ క్విజ్ ఆడండి. రూ.10 వేల బహుమతులు గెలుచుకోండి? ఈ 20 మంది సినిమా హీరోల సొంత ఊర్లు ఏవో తెలుసా? ఈ 20 మంది హీరోలు మొట్టమొదట నటించిన సినిమాలు ఏవో చెప్పగలరా?బాలకృష్ణ క్విజ్ ఆడండి. రూ.10 వేల బహుమతులు గెలుచుకోండి? ఈ 20 మంది సినిమా హీరోల సొంత ఊర్లు ఏవో తెలుసా? ఈ 20 మంది హీరోలు మొట్టమొదట నటించిన సినిమాలు ఏవో చెప్పగలరా?
entertainment
6,827
21-10-2017 17:49:47
చేనేత కార్మికుల ఇంటికి వెళ్లిన ప్రముఖ నటి
అనంతపురం : హీరోయిన్ పూనమ్ కౌర్ అనంతపూర్ జిల్లాలోని చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేనేత పరిశ్రమ బ్రాండ్ అంబాసిడర్ అయిన ఈమె అనంతపురం జిల్లా లోని సోమందేపల్లిలో ఇంటింటికీ వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా అక్కడి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆమె చేనేత కారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈ రోజు ఆమె పుట్టినరోజు కావడంతో అక్కడి ప్రజలు, విద్యార్థులు ఆమెకు శుభాకాంక్షల వెల్లువ కురిపించారు.
entertainment
3
11-08-2017 01:52:00
ఆస్ర్టో వ్యూ : ద్వితీయార్ధం నిస్తేజం
తిథి : శ్రావణ బహుళ చతుర్థి నక్షత్రం : ఉత్తరాభాద్రభరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు, మేష, సింహ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి. నిఫ్టీ : 9820.25 (- 87.80)ట్రెండ్‌ మార్పు వేళలు : 11.52ధోరణి : గ్రహగతులను బట్టి నిలకడ/నిస్తేజంగా ప్రారంభమై 9.45 నుంచి 11.45 మధ్యలో రికవరీ సాధించి ఆ తర్వాత ముగింపు వరకు కూడా నిస్తేజంగా ట్రేడ్‌ కావచ్చు. ట్రేడింగ్‌ వ్యూహం...నిఫ్టీ ఫ్యూచర్స్‌ 10 గంటల సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి)కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్‌లా్‌సతో లాంగ్‌ పొజిషన్లు తీసుకుని 11.45 సమయానికి క్లోజ్‌ చేసుకోవాలి. 12 గంటల తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్‌ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయానికి క్లోజ్‌ చేసుకోవాలి. ఇంట్రాడే ట్రేడింగ్‌కు ప్రారంభ స్థాయి కీలకం. అంతకన్నా దిగువన మాత్రమే షార్ట్‌ పొజిషన్లు శ్రేయస్కరం.నిరోధ స్థాయిలు: 9860, 9895 మద్దతు స్థాయిలు: 9780 9745- డా.భువనగిరి అమరనాథశాస్ర్తిwww.thefinancialastrologer.blogspot.in
business
5,094
05-10-2017 20:34:55
పవన్ 25వ చిత్రం 'స్పైడర్‌'నే ఫాలో అవుతోందా?
టైటిల్ అనౌన్స్ చేయకముందు మహేష్, మురగదాస్ సినిమా టైటిల్‌గా చాలా పేర్లు వినిపించాయి. 'అభిమన్యు, సంభవామి, మర్మం' ఇలా ఎవరికి నచ్చిన టైటిల్‌ని వారు పెట్టేసి నెట్ మాయాజాలంలో పాపులర్ చేశారు. ఆ తర్వాత 'స్పైడర్' అనే టైటిల్ కూడా ఇలానే వచ్చింది. అన్ని టైటిల్స్‌ని చిత్ర యూనిట్ గమనిస్తూనే ఉన్నా, టైటిల్‌ని మాత్రం అనౌన్స్ చేయలేదు. సినిమా మొత్తం షూటింగ్ పూర్తయిన తర్వాత చిత్ర టైటిల్ 'స్పైడర్' అంటూ అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. సేమ్ టు సేమ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం విషయంలో కూడా చిత్ర యూనిట్ ఇదే పద్ధతిని ఫాలో అవుతోంది. ప్రస్తుతం పీఎస్‌పీకే 25 చిత్రంగా పరిగణనలో ఉన్న ఈ చిత్రం మొదలైనప్పుడే ఫ్యాన్స్ పోస్టర్స్‌ని తయారు చేసి నెట్ మాయాజాలంలో వదిలారు. 'గోకుల కృష్ణుడు, ఇంజనీర్ బాబు, దేవుడు, దేవుడే దిగివచ్చినా' వంటి అనేక పేర్లు ఈ చిత్రం విషయంలో వినిపించాయి. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజున విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ తర్వాత కొత్త కొత్త టైటిల్స్ పుట్టుకొచ్చాయి. ఈ పోస్టర్ ప్రకారం ఈ చిత్రానికి 'అజ్ఞాతవాసి' టైటిలే కరెక్ట్ అని అందరూ అభిప్రాయానికి వచ్చేశారు. దీపావళి రోజున ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ని అఫీషియల్‌గా విడుదల చేస్తారని వార్తలు వస్తున్నా, 'స్పైడర్' లాగానే చివరికి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్‌నే చిత్ర యూనిట్ ఫిక్స్ చేస్తుందనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.టైటిల్ అనౌన్స్ చేయకముందు మహేష్, మురగదాస్ సినిమా టైటిల్‌గా చాలా పేర్లు వినిపించాయి. 'అభిమన్యు, సంభవామి, మర్మం' ఇలా ఎవరికి నచ్చిన టైటిల్‌ని వారు పెట్టేసి నెట్ మాయాజాలంలో పాపులర్ చేశారు. ఆ తర్వాత 'స్పైడర్' అనే టైటిల్ కూడా ఇలానే వచ్చింది. అన్ని టైటిల్స్‌ని చిత్ర యూనిట్ గమనిస్తూనే ఉన్నా, టైటిల్‌ని మాత్రం అనౌన్స్ చేయలేదు. సినిమా మొత్తం షూటింగ్ పూర్తయిన తర్వాత చిత్ర టైటిల్ 'స్పైడర్' అంటూ అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. సేమ్ టు సేమ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం విషయంలో కూడా చిత్ర యూనిట్ ఇదే పద్ధతిని ఫాలో అవుతోంది. ప్రస్తుతం పీఎస్‌పీకే 25 చిత్రంగా పరిగణనలో ఉన్న ఈ చిత్రం మొదలైనప్పుడే ఫ్యాన్స్ పోస్టర్స్‌ని తయారు చేసి నెట్ మాయాజాలంలో వదిలారు. 'గోకుల కృష్ణుడు, ఇంజనీర్ బాబు, దేవుడు, దేవుడే దిగివచ్చినా' వంటి అనేక పేర్లు ఈ చిత్రం విషయంలో వినిపించాయి. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజున విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ తర్వాత కొత్త కొత్త టైటిల్స్ పుట్టుకొచ్చాయి. ఈ పోస్టర్ ప్రకారం ఈ చిత్రానికి 'అజ్ఞాతవాసి' టైటిలే కరెక్ట్ అని అందరూ అభిప్రాయానికి వచ్చేశారు. దీపావళి రోజున ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ని అఫీషియల్‌గా విడుదల చేస్తారని వార్తలు వస్తున్నా, 'స్పైడర్' లాగానే చివరికి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్‌నే చిత్ర యూనిట్ ఫిక్స్ చేస్తుందనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
entertainment
5,121
26-02-2017 08:40:26
విశాఖలో సందడి చేసిన హీరోయిన్ ప్రణీత
విశాఖపట్నం/ సిరిపురం, ఫిబ్రవరి 25: బొంగరలాంటి కళ్లు తిప్పింది.. ఉంగరాలంటి జుట్టు తిప్పిందంటూ.. తన సొగసుతో ‘అత్తారింటికీ దారేది’ చిత్రంలో హీరో పవన్‌కల్యాణ్‌తో అమ్మో..బాపుగారి బొమ్మో... అనిపించిన నటి ప్రణీత శనివారం నగరంలో సందడి చేశారు. ఏయూ స్నాతకోత్సవ మందిరంలో క్వీన్జ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌, కంచి కామాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇతి-2017 (ఆంధ్రా) ఫ్యాషన్‌ షోలో డిజైనర్‌ దుస్తులు ధరించిన ప్రణీత క్యాట్‌వాక్‌తో అందరినీ ఆకట్టుకుంది. సంప్రదాయ, పాశ్చాత్య, ఆధునిక, అధునాతన వస్ర్తాలంకరణతో ఈ ప్రదర్శన సాగింది. వివిధ రకాల దుస్తులు ధరించిన ముద్దుగుమ్మలు తమ ముచ్చటైన నడకతో ఆహూతులను అలరించారు. క్వీన్జ్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన 32 మంది ఫ్యాషన డిజైనర్స్‌ 64 డిజైన్లలో రూపొందించిన కంచి, ధర్మవరం, ఖాదీ, పొందూరు, మంగళగిరి తదితర పట్టు, కాటన వస్ర్తాలను ధరించిన మోడల్స్‌ ర్యాంప్‌పై హొయలొలికించారు. ఈ ఫ్యాషన షోను రైల్వే డీఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దైనందిన జీవితంలో ఫ్యాషన్ ఒక భాగమన్నారు.    నేడు ఫ్యాషన్ మంచి వ్యాపార రంగంగా విస్తరించిందని, వస్ర్తాల నుంచి సౌందర్య సాధనాలు, మ్యాగజైన్లు.. ఇలా ఎన్నో రకాలుగా వ్యాపారం ఈ రంగంలో పెరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ సతీమణి శోభనా శృతి, మావూరి రాజేశ్వరి, కీర్తన మనోజ్‌, జిజా వైస్‌రాజ్‌, పూనంషా, సుష్మా, మిశ్రా వాలెంటినా, క్వీన్జ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ షాను అరవింద్‌ పాల్గొన్నారు. కార్యక్రమానికి రాజ్‌మతాజ్‌ ఈవెంట్‌ ప్రతినిధి మీనాక్షి అధ్యక్షత వహించారు. అనంతరం కూచుపూడి అంబిక తన నాట్య ప్రదర్శనతో ప్రేక్షులను మంత్ర ముగ్ధులను చేశారు. ఈ ప్రదర్శన ద్వారా వచ్చిన ఆదాయాన్ని గిరిజనుల విద్యాభివృద్ధికి వెచ్చించనున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, విశాఖ చెందిన మోడల్స్‌ ఫ్యాషన షోలో పాల్గొన్నారు.
entertainment
19,812
12-07-2017 13:39:46
దాదాకి ఇష్టం లేకపోయినా... అందుకే ఒప్పుకున్నాడట!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేయడం సీఏసీ సభ్యుడు సౌరబ్ గంగూలీకి ఇష్టం లేదా? మిగతా సభ్యుల ఒత్తిడి మేరకు అయిష్టంగానే ఒప్పుకున్నాడా? అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. మంగళవారం రాత్రి రసవత్తర హైడ్రామా నడుమ కోచ్ ఎంపిక జరిగిన విషయం తెలిసిందే. వీరేంద్ర సెహ్వాగ్, రవిశాస్త్రిల మధ్య కోచ్ పదవికోసం తీవ్ర పోటీ నెలకొన్నట్టు సమాచారం. టీమిండియా మాజీ కెప్టెన్, క్రెకెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యుడు సౌరబ్ గంగూలికి రవిశాస్త్రి ఎంపిక అస్సలు ఇష్టం లేదని చెబుతున్నారు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ గట్టిగా పట్టుబట్టడంతో రవిశాస్త్రికి మార్గం సుగమమైనట్టు సమాచారం. సీఏసీ సభ్యులైన సచిన్ టెండూల్కర్, సౌరబ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లు మంగళవారం రాత్రి కెప్టెన్ విరాట్ కోహ్లీకి కాన్ఫరెన్స్ కాల్ చేసినప్పుడు అతడు శాస్త్రికే గట్టి మద్దతు తెలిపినట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కుంబ్లే రాజీనామా చేసిన తర్వాత రవిశాస్త్రినే టీమిండియా కోచ్‌గా ఎంపిక చేస్తే బాగుంటుందని కోహ్లీ బాహాటంగానే చెప్పిన విషయం తెలిసిందే.
sports
16,713
02-08-2017 09:49:09
బ్రేకింగ్ న్యూస్... కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న రిసార్టుపై ఐటీ దాడులు!
న్యూఢిల్లీ: గుజరాత్ ఎమ్మెల్యేలు బసచేస్తున్న బెంగళూరు రిసార్టులో ఆదాయ పన్ను శాఖ అధికారులు అకస్మిక సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో కనకపుర ప్రాంతంలోని కర్నాటక ఇంధన శాఖ మంత్రి డీకే శివకుమార్ ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించారు. మరో వారం రోజుల్లో రాజ్యసభ ఎన్నికలున్న నేపథ్యంలో... గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరకుండా కాపాడుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం వారిని బెంగళూరులోని ఇగ్లిటన్ రిసార్టుకు తరలించిన సంగతి తెలిసిందే. వారికి బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఫోన్లు కూడా దూరంపెట్టారు. బుధవారం ఉదయం నుంచే ఐటీ అధికారులు ఎమ్మెల్యేలు బస చేస్తున్న గదులు, రికార్డులన్నీ క్షణ్ణంగా పరిశీలించినట్టు సమాచారం.‘ముందస్తు ప్రణాళిక’ ప్రకారమే బీజేపీ తమ ఎమ్మెల్యేలను ‘దొంగిలించేందుకు’ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో ఆరోపించింది. అయినప్పటికీ గుజరాత్ రాజ్యసభ అభ్యర్థి అహ్మద్ పటేల్ విజయం సాధించేందుకు అవసరమైన ఎమ్మెల్యేల బలం తమకు ఉందని స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే రిసార్టుపై ఐటీ దాడులు నిర్వహించడం గమనార్హం. మరోవైపు ఐటీ దాడులు నిజమేనని కర్నాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు.గుజరాత్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు ఆపార్టీకి షాకిచ్చి బీజేపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుండగా కాంగ్రెస్‌కు 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ఆరుగులు గుడ్‌బై చెప్పడంతో కాంగ్రెస్ బలం 51కి తగ్గిపోయింది. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి పటేల్ విజయం సాధించాలంటే 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరముంటుంది. అయితే ఇద్దరు అభ్యర్థులకు సరిపడా బలమున్న బీజేపీ... ముగ్గుర్ని నిలబెడుతున్నట్టు ప్రకటించింది. దీంతో రాజ్యసభ ఎన్నికల కోసం తమ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.15 కోట్లు చెల్లించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోంది.
nation
15,231
28-03-2017 20:49:28
రూ.500, రూ.2000 నకిలీ నోట్లు ముద్రిస్తున్న.. ముఠా అరెస్ట్
భువనేశ్వర్: నకిలీ నోట్లు ముద్రిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆరు లక్షల ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఒడిషాలో మంగళవారం ఇది వెలుగుచూసింది.  బార్‌గఢ్‌లో కొత్త రూ.500, రూ.2000 నకిలీ నోట్లు ముద్రిస్తున్న గ్యాంగ్‌ను ఒడిషా పోలీసులు పట్టుకున్నారు. పూర్తిగా, సగం ముద్రించిన ఆరు లక్షల విలువైన ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారు.
nation
19,919
10-03-2017 02:14:54
బంగ్లా 312 ఆలౌట్‌
గాలె: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆతిథ్య శ్రీలంకకు భారీ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 133/2తో మూడోరోజైన గురువా రం ఆట కొనసాగించిన బంగ్లాదేశ్‌ 312 పరుగులకు ఆలౌటైంది. ముష్ఫికర్‌ రహీమ్‌ 85, మిరాజ్‌ 41 పరుగులు చేశారు. దిల్‌రువాన్‌ పెరీర, హెరాత మూడేసి వికెట్లు పడగొట్టారు. కాగా వర్షం కారణంగా ఆట చివరి సెషన్‌ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. 182 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం అందుకున్న శ్రీలంక శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించనుంది.
sports
856
05-06-2017 00:18:54
రూపాయిన్నరకేయూనిట్‌ సౌర విద్యుత్ !
న్యూఢిల్లీ : దేశంలో సౌర విద్యుత ధర మరింత దిగొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మేలో బద్లా సోలార్‌ పార్కు ప్రాజెక్టు కోసం జరిగిన బిడ్డింగ్‌లో కంపెనీలు యూనిట్‌కు రూ.2.44 కోట్‌ చేశాయి. మున్ముందు యూనిట్‌ సౌర విద్యుత కోసం కంపెనీలు రూ.1.5 కంటే తక్కువ ధర కోట్‌ చేయవచ్చని పరిశ్రమవర్గాల అంచనా. ప్రస్తు తం ధర్మల్‌ విద్యుత కేంద్రాల నుంచి సరఫరా చేసే విద్యుత కోసం ఎన్‌టిపిసి కోట్‌ చేస్తున్న రూ.3.3 కంటే ఇది చాలా తక్కువ.
business
17,881
26-11-2017 00:20:49
మోదీ ఆలింగనాల దౌత్యం విఫలం: రాహుల్‌
న్యూఢిల్లీ, నవంబరు 25: ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి తీవ్రస్థారులో విరుచుకుపడ్డారు. లష్కరే తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ పాక్‌ ప్రభుత్వ నిర్భందం నుంచి విడుదల కావడంతో ప్రధాని మోదీ ‘హగ్‌ప్లోమసీ’ (ఆలింగనాల దౌత్యం) విఫలమైందని మండిపడ్డారు. ‘నరేంద్రబాయ్‌.. మీ మాటలు చెల్లలేదు. ముంబై దాడి సూత్రధారి బయటకొచ్చేశాడు. లష్కరే నుంచి పాక్‌ మిలటరీ నిధులను ట్రంప్‌ వేరు చేశారు.  మీ ఆలింగనాల దౌత్యం విఫలమైంది’ అని ట్విటర్‌లో వంగ్యాస్త్రాలు సంధించారు. అర్జెంటుగా మరిన్ని ఆలింగనాలు కావాలంటూ మరింత వ్యంగ్యంగా ట్వీట్‌ను ముగించారు. కాగా, రాహుల్‌ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. మన్మోహన్‌ సమయంలో పాక్‌ను ఉగ్రబాధిత దేశంగా చూస్తే...మోదీ హయాంలో పాక్‌ను టెర్రరిస్థాన్‌ అని ప్రపంచ వేదికలపై ఎండగట్టామని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహరావు చెప్పారు. టెర్రరిజం విషయంలో పాక్‌ను ఏకాకి చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు.
nation
12,290
24-04-2017 11:07:51
‘హైకోర్టు జడ్జి’ అనుకుని.. మోసపోయిన దినకరన్?
న్యూఢిల్లీ: ఏఐఏడీఎంకే డిప్యూటీ చీఫ్ టీటీవీ దినకరన్‌ ఎన్నికల సంఘం అధికారికి భారీగా లంచం ఇవ్వజూపిన కేసులో... ఢిల్లీ పోలీసులు తవ్వినకొద్దీ విస్మయం కలిగించే విషయాలు వెలుగు చూస్తున్నాయి. దినకరన్‌కు మధ్యవర్తిగా చెబుతున్న సుకేశ్ చంద్రశేఖర్... తాను హైకోర్టు జడ్జిననీ, పార్టీ ‘రెండాకుల’ గుర్తును గెలుచుకునేందుకు ఈసీ అధికారులను ఒప్పించగలనని దినకరన్‌ను నమ్మించినట్టు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 16న చంద్రశేఖర్‌ను పోలీసులు అరెస్టు చేయగా.. దీనికి 20 గంటల ముందు కూడా దినకరన్ చంద్రశేఖర్‌తో మాట్లాడినట్టు అధికారులు చెబుతున్నారు.  ఈ కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచి పోలీసులు శనివారం నుంచి దినకరన్‌ను విచారిస్తున్నారు. శనివారం ఏడుగంటలపాటు ప్రశ్నించగా.. ఆదివారం 11 గంటల పాటు ప్రశ్నించారు. ఎంత ప్రశ్నించినప్పటికీ సుకేశ్ చంద్రశేఖర్ తనకు తెలియదనే దినకరన్ చెబుతున్నట్టు సమాచారం. చంద్రశేఖర్ హైకోర్టు జడ్జి అని నమ్మడం వల్లే అతడితో మాట్లాడానని చెప్పినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా ఢిల్లీ పోలీసులు వరుసగా మూడోరోజైన సోమవారం కూడా దినకరన్‌ను ప్రశ్నించనున్నారు. ఆదివారం సుదీర్ఘంగా విచారించిన పోలీసులు... దినకరన్ ముందు ఆధారాలు పెట్టి మరీ ప్రశ్నలు గుప్పించినట్టు సమాచారం. ఈనెల 16న సుకేశ్ చంద్రశేఖర్ అనే యువకుడు ఢిల్లీ పోలీసులకు పట్టుబడడంతో దినకరన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పార్టీ గుర్తు కోసం మొత్తం రూ.50 కోట్ల మేర డీల్ కుదిరినట్టు ఆరోపణలు వస్తుండగా... ఢిల్లీ పోలీసులు చంద్రశేఖర్ వద్ద అరెస్టు సమయంలో రూ.1.3 కోట్ల నగదు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.
nation
20,449
15-02-2017 03:08:02
ఇంగ్లండ్‌ కుర్రాళ్ల భారీస్కోరు
తొలి ఇన్నింగ్స్‌ 501/5 డిక్లేర్డ్‌ ఫ భారత్‌ 156/2
sports
1,401
02-11-2017 02:06:34
డిసెంబరు ఆఖరులో రాష్ట్రాల ర్యాంకులు
వేగంగా మారుతున్న ఇఒడిబి స్కోర్‌ బోర్డ్‌పత్రాల దాఖలుకు మరో వారమే గడువుహైదరాబాద్‌-ఢిల్లీ (ఆంధ్రజ్యోతి): ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సలో రాష్ట్రాల ర్యాంకుల వివరాలు డిసెంబరు ఆఖరుకల్లా వెల్లడయ్యే అవకాశం ఉంది. వ్యాపార సౌలభ్య వాతావరణం కోసం తాము తీసుకుంటున్న చర్యలు, ప్రవేశపెట్టిన సంస్కరణలకు సంబంధించిన సాక్ష్యాలను దాఖలు చేయడానికి రాష్ట్రాలకు ఈ నెల 7వ తేదీ వరకు మాత్రమే గడువుంది. రాష్ట్రాలు ఎప్పటికప్పుడు దాఖలు చేస్తున్న పత్రాలతో ఇఒబిడి వెబ్‌సైట్‌లోని స్కోర్‌ బోర్డులో కనిపిస్తున్న ర్యాంకులు కూడా మారిపోతున్నాయి. ఉదాహరణకు మంగళవారం నాలుగోస్థానంలో ఉన్న ఒడిషా బుధవారం మూడో స్థానంలో, మూడో స్థానంలో మెరిసిన పశ్చిమబెంగాల్‌ నాలుగోస్థానంలో కనిపించాయి. 14వ స్థానంలో ఉన్న గోవా 16వ స్థానానికి చేరింది. ప్రస్తుతం తెలంగాణ మొదటి స్థానంలో, ఆంధ్రప్రదేశ్‌ 15వ స్థానంలో ఉన్నాయి.  వ్యాపార సౌలభ్యంలో రాష్ట్రాల ర్యాంకులను నిర్ణయించడానికి 376 రకాల ప్రమాణాలను పరిశీలిస్తారు. వీటికి సంబంధించిన సాక్ష్యాధార పత్రాలను ఎప్పటికప్పుడు లేదా ఆఖరు రోజు కూడా దాఖలు చేయవచ్చు. ఇతర రాష్ట్రాలు తమను అనుకరిస్తున్నాయనే అనుమానంతో ర్యాంకింగ్‌ విషయంలో పట్టుదలగా ఉన్న రాష్ట్రాలు ఆఖరు రోజు మొత్తం పత్రాలను అప్‌లోడ్‌ చేస్తున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. అందువల్ల ఆఖరు రోజు నాటికి స్కోర్‌ బోర్డులోని రాష్ట్రాల ర్యాంకులు మారిపోయే అవకాశం ఉంది. గడువు తేదీ తర్వాత స్కోర్‌బోర్డ్‌లోని ర్యాంకులను ఫ్రీజ్‌ చేస్తారు. ఆ తర్వాత సంస్కరణలు కేవలం మాటల్లోనే లేక చేతల్లో కూడానా అని నిగ్గుతేల్చేందుకు క్షేత్రస్థాయిలో వాస్తవాల నిర్థారణ చేపడుతారు. దీని ఆధారంగా మరికొన్ని పాయింట్లు జతచేస్తారు. ఆ తర్వాతనే తుది ర్యాంకింగ్‌లతో జాబితా విడుదల చేస్తారని పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు వివరించారు. గడువు వరకు నిత్యం మారిపోయే స్కోర్‌బోర్డ్‌ చూసి దానినే ర్యాంకింగ్‌గా భావించరాదని వారు వివరించారు.
business
5,679
01-08-2017 15:47:29
నటుడు నందును సిట్ అడిగిన ప్రశ్నలివీ..!
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఎట్టకేలకూ మొదటి అంకం పూర్తయిపోయింది. ఇవాళ నటుడు నందు అలియాస్ ఆనంద్‌ కృష్ణను సిట్ బృందం ప్రశ్నించింది. కేవలం మూడు గంటల్లోనే నందు విచారణ పూర్తయింది. సిట్ అడిగిన పలు ప్రశ్నలకు నందు సమాధానమిచ్చారు. డ్రగ్స్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేస్తూ వచ్చారు.           ముఖ్యంగా నటుడు నవదీప్, తరుణ్ పబ్‌ల విషయంలో నందును సిట్ బృందం ప్రశ్నించింది. అలాగే ఈ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో గల సంబంధాల గురించి సిట్ ప్రశ్నించింది. కెల్విన్ కాల్ లిస్టులో నందు పేరు ఉండటంతో ఆ కోణంలో సిట్ ప్రశ్నించింది. అసలు కెల్విన్ ఏవిధంగా పరిచయమయ్యాడు..? ఎక్కడ పరిచయమయ్యాడు.?..ఆయనతో ఉన్న సంబంధమేంటి? ఇలా నందుపై సిట్ ప్రశ్నల పరంపర కొనసాగించింది. మొత్తంగా చూస్తే కేవలం మూడు గంటల్లోనే నందు నుంచి సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లుగా తెలుస్తోంది. నందును సిట్ అడిగిన ప్రశ్నలివి..!సిట్:  మీకు డ్రగ్స్ తీసుకునే అలవాటుందా.?నందు: లేదు.సిట్:మరి మిమ్మల్ని సిట్ విచారణకు ఎందుకు పిలిచామనుకుంటున్నారు?నందు: నాకు తెలియదు.సిట్: నవదీప్ పబ్‌కు మీరు తరచూ వెళ్లేవారు కదా.?నందు: అవును.సిట్: నవదీప్ పబ్‌లో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయా.?నందు: నాకు తెలియదు.సిట్: నవదీప్ డ్రగ్స్ తీసుకుంటారని మీకు తెలుసా.?నందు: ఎప్పుడూ చూడలేదు.సిట్: డ్రగ్స్ ముఠాల గురించి మీదగ్గర ఏమైనా సమాచారం ఉందా.?నందు: నాకు తెలియదు.సిట్: డ్రగ్స్ మీరు తీసుకోవడమే కాకుండా మీ మిత్రులకు కూడా ఇవ్వడం జరిగిందా.?నందు: నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటే లేదు.    విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే నందు వెళ్లిపోయాడు. సిట్ కార్యాలయం నుంచి వెళుతూ.. వెళుతూ చిరు నవ్వుతో మీడియాకు అభివాదం చేస్తూ కారెక్కాడు. నందుతో పాటు ఆయన తండ్రి సిట్ కార్యాలయానికి వచ్చారు. సిట్ కార్యాలయానికి వెళ్లే ముందు..నందు సిట్ కార్యాలయానికి వెళ్లే ముందు అక్కడున్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాడు ఆలయం చుట్టూ ప్రదక్షణలు కూడా చేశాడు. ఈ కేసులో నుంచి బయటపడేయాలంటూ నిన్న రాత్రి నందు తన ఇంట్లో యాగం కూడా నిర్వహించినట్లు సమాచారం.  ముఖ్యమంత్రికి సూటి ప్రశ్న వేసిన తెలుగు హీరో  ముమైత్ ఖాన్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివి
entertainment
7,728
18-08-2017 22:36:43
ఎన్నాళ్లకెన్నాళ్లకీ..!
ప్రభాస్‌ ‘బాహుబలి’ మేనియా నుంచి మెల్లిగా బయటపడుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగున్నరేళ్లుగా ఆయన మాహిష్మతి సామ్రాజ్యపు ఆలోచనలతోనే గడిపారు. ఇప్పుడు వాటి నుంచి బయటపడే ప్రయత్నాల్లో ఉన్నారు. అందులో భాగంగానే తాజా సినిమా పనుల్లో నిమగ్నమయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న ‘సాహో’ రెగ్యులర్‌ షూటింగ్‌ శుక్రవారం మొదలైంది. ‘సాహో’ సెట్‌లో తొలిరోజు అనుభూతిని ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు ప్రభాస్‌. ‘షూటింగ్‌ సమయమిది. నాలుగున్నరేళ్ల ‘బాహుబలి’ జర్నీ తర్వాత ‘సాహో’ అనే కొత్త యాక్షన్‌ ప్రపంచంలో అడుగుపెట్టడం ఉత్కంఠగా ఉంది’’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. దాదాపు రూ.5కోట్ల వ్యయంతో రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన సెట్లో ప్రస్తుతం చిత్రీకరణ సాగుతోంది. దర్శకుడు సుజీత్‌ తెలుగుతో పాటు తమిళ్‌, హిందీ, మలయాళంలోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్‌తో ‘మిర్చి’ని తెరకెక్కించిన యువీ క్రియేషన్స్‌ సంస్థ ఈ తాజా చిత్రాన్ని నిర్మిస్తోంది.
entertainment
17,119
29-08-2017 13:21:34
ప్రార్థనా మందిరాలు కట్టించొద్దు...పరిహారం చాలు
న్యూఢిల్లీ: గోద్రా ఘటన తర్వాత గుజరాత్‌లో చెలరేగిన హింసాకాండలో దెబ్బతిన్న మత కట్టడాలను నిర్మించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అంటూ అప్పట్లో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు మంగళవారంనాడు కొట్టివేసింది. దీంతో గుజరాత్ సర్కార్‌కు పెద్ద ఊరట లభించినట్టయింది. నాటి అల్లర్ల సమయంలో దెబ్బతిన్న కట్టడాల మరమ్మతు, పునర్నిర్మాణ పనులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అల్లర్లలో ధ్వసంమైన కట్టడాలు, దుకాణ సముదాయాలు, ఇళ్ల పునర్నిర్మాణం, మరమ్మతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, ఇందుకు సంబంధించిన ఓ స్కీమ్‌ను కూడా ఆమోదించినట్టు అడిషనల్ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ పీసీ పంత్‌తో కూడిన ధర్మాసనం తీర్పు చెబుతూ, ప్రభుత్వం ప్రకటించిన స్కీమ్ ప్రకారం దెబ్బతిన్న రెసిడెన్స్, కమర్షియల్ ఆస్తులకు చెల్లించే రూ.50,000 రూపాయల పరిహారం మత కట్టడాలకూ వర్తిస్తుందని పేర్కొంది. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది.
nation
18,890
13-06-2017 21:04:05
ఖాకీలకు 'ఖాదీ' యూనిఫాం
ముంబై: ఖాకీ యూనిఫాం అంటే ముందుకు గుర్తుకు వచ్చేది పోలీసులే. మరి ఖాకీలు ఖాదీ కడితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందనేది పక్కన పెడితే మహారాష్ట్ర పోలీసులు ఇకమీదట ఖాదీ దుస్తుల్లో కనిపించబోతున్నారు. వారంలో ఒకరోజు సిబ్బంది తప్పనిసరిగా ఖాదీ యూనిఫాం ధరించాలంటూ మహారాష్ట్ర పోలీసు శాఖ తాజాగా తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన సర్క్యులర్‌ను జూన్ 1 స్పెషల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనూప్ కుమార్ సింగ్ జారీ చేశారు. ఖాదీ దుస్తుల వాడకాన్ని ప్రమోట్ చేయడం అన్ని శాఖల బాధ్యతని, ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించడం వల్ల ఎంతో మందికి స్వయం ఉపాధి లభిస్తుందని అనూప్ కుమార్ సింగ్ తెలిపారు. వారంలో ఒక రోజు ప్రత్యేకంగా ఒకే తరహా యూనిఫాంను అధికారులు, సిబ్బంది ధరించి విధులకు హాజరుకావాలని ఆ సర్క్యులర్‌లో ఐజీ పేర్కొన్నారు. ఈ మార్గదర్శకాలను అమలయ్యేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
nation