SNo
int64
0
21.6k
date
stringlengths
19
19
heading
stringlengths
3
91
body
stringlengths
6
38.7k
topic
stringclasses
5 values
5,433
07-11-2017 10:53:25
ద‌క్షిణాదిన అతి పెద్ద డిజాస్ట‌ర్‌.. స్పైడ‌ర్‌?
సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు, త‌మిళ అగ్ర‌ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో సినిమా అంటే.. అది ఎన్నో రికార్డుల‌ను తిర‌గ‌రాస్తుంద‌ని ఆశించారు. అందుకు త‌గిన‌ట్టుగానే నిర్మాత‌లు ఆ సినిమా కోసం భారీగా ఖ‌ర్చుపెట్టారు. హీరో, ద‌ర్శ‌కుడి రెమ్యున‌రేష‌న్‌ల‌తో క‌లిపి ఆ సినిమా బ‌డ్జెట్ మొత్తం రూ.150 కోట్లు దాటింది. దాదాపు ఏడాదిన్న‌ర‌పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కింది. అయితే విడుద‌లైన త‌ర్వాత ప‌రిస్థితి తారుమారైంది. విడుద‌లైన మొద‌టి షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుని నిర్మాత‌ల‌కు భారీ న‌ష్టాలు మిగిల్చింది. త‌మిళంలో కాస్త ప‌ర్వాలేదనిపించినా.. తెలుగులో మాత్రం డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఎంత‌లా అంటే ద‌క్షిణాదిలోనే ఇంతగా న‌ష్టాల‌ను మిగిల్చిన సినిమా ఇప్ప‌టివ‌ర‌కు రాలేద‌ట‌. దాదాపు 60 కోట్ల రూపాయ‌ల న‌ష్టాన్ని మిగిల్చింద‌ట‌. ద‌క్షిణాది సినీ చ‌రిత్ర‌లో ఇదే అత్యంత భారీ డిజాస్ట‌ర్ అని టాక్ వస్తోంది. దేశం మొత్తంలో చూస్తే మాత్రం `స్పైడ‌ర్` కంటే ముందు `బాంబేవెల్వెట్‌` ఉంద‌ట‌. ర‌ణ్‌బీర్ క‌పూర్ హీరోగా వ‌చ్చిన ఈ సినిమా వ‌ల్ల నిర్మాత‌లు దాదాపు 70 కోట్ల రూపాయ‌లు న‌ష్ట‌పోయార‌ట‌. అంటే దేశ చ‌రిత్ర‌లో రెండో అతిపెద్ద డిజాస్ట‌ర్‌గా `స్పైడ‌ర్` నిలిచింద‌న్నమాట‌.
entertainment
18,879
25-05-2017 20:43:35
పోలీస్ అధికారి భార్యను హత్య చేసింది.. కన్న కొడుకే
ముంబై: సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసును దర్యాప్తు చేసిన పోలీస్ అధికారి భార్యను దారుణంగా హత్య చేసింది కన్న కొడుకేనని తేలింది. మహారాష్ట్రలోని ముంబై పోలీస్ శాఖలో సీఐగా ధ్యానేశ్వర్ విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన ఆయన రక్తపు మడుగుల్లో మృతి చెందిన భార్య దీపాలిని చూసి షాకయ్యారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు హంతకుడు వారి కుమారుడేనని నిర్థారించారు. తల్లిని చంపిన తర్వాత రక్తంతో అక్కడ ఆమెతో విసిగిపోయాను..నన్ను పట్టుకోండి.. ఉరి తీయండి అని రాసి ఉంది. అలాగే ఆమె సెల్‌ఫోన్ కూడా మిస్ అయ్యింది.  వీటి ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు 21 ఏళ్ళ వారి కుమారుడు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు ప్రయాణమైనట్లు తెలుసుకున్నారు. అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గురువారం అతడ్ని అరెస్ట్ చేశారు. తల్లి హత్యపై ఆ కుమారుడ్ని ప్రశ్నించగా తానే హత్యచేశానని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
nation
3,181
08-12-2017 01:01:31
ఈ రొయ్యల షేరు మీసాలు బారెడు
అదరగొడుతున్న అపెక్స్‌ ఫ్రోజెన్‌ ఫుడ్స్‌మూడు నెలల్లోనే 400 శాతంహైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా ఉన్న ఆక్వా సంస్థ అపెక్స్‌ ఫ్రోజెన్‌ ఫుడ్స్‌ షేరు స్టాక్‌ మార్కెట్లో అదరగొడుతోంది. ఈ సంస్థ ఆగస్టులోనే పబ్లిక్‌ ఇష్యూకు వచ్చింది. స్టాక్‌ మార్కెట్లో ఈ షేరు సెప్టెంబరు 4న లిస్టయింది. ఐపిఒ ఆఫర్‌ ధర 175 రూపాయలు కాగా మార్కెట్లో 235 రూపాయల దగ్గర లిస్టయింది. ఇంట్రాడేలో 195 రూపాయల కనిష్ట స్థాయిని తాకి ఆఖరులో 210 రూపాయల వద్ద ముగిసింది. లిస్టింగ్‌తోనే ఇన్వెస్టర్లకు లాభాలను పంచిన ఈ షేరు గత మూడు నెలలుగా అప్రతిహతంగా దూసుకుపోతున్నది. డిసెంబరు 5న షేరు ధర 941 రూపాయల గరిష్ట స్థాయిని తాకింది. అంటే సుమారు 3 నెలల కాలంలోనే షేరు ధర ఆఫర్‌ ధరతో పోలిస్తే దాదాపు 431 శాతం పెరిగింది. బుధవారం నాటి క్లోజింగ్‌ ధర 900 రూపాయలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే వృద్ధి దాదాపు 400 శాతం ఉంది. కొద్ది రోజులుగా షేరు ధర ప్రతి రోజూ 5 శాతం పెరుగుతోంది. దేశీయ స్టాక్‌ మార్కెట్లు గత కొద్దికాలంగా బుల్‌ ఆపరేటర్ల పట్టులో ఉన్నప్పటికీ ఒక సాధారణ సంస్థ అతి తక్కువ కాలంలోనే ఈ స్థాయిలో మార్కెట్లో అదరగొట్టడం అరుదు. ఆక్వాకల్చర్‌ రంగంలో క్వాలిటీ స్టాక్స్‌ ఏవీ మార్కెట్లో అందుబాటులో లేవు. అందుబాటులో ఉన్న షేర్లను ఇన్వెస్టర్లు పోటీపడి వెన్నాడుతున్నారు. ఆక్వాకల్చర్‌కు అవసరమైన ఫీడ్‌ తయారు చేసే అవంతీ ఫీడ్స్‌ షేరు కూడా మార్కెట్లో కొంతకాలంగా దుమ్ము రేపుతోంది. అయితే, ఈ షేరు ధరకు దాని వాస్తవిక ఫండమెంటల్స్‌కు సంబంధం లేకుండా ఉందన్న ఆందోళన కూడా మార్కెట్‌ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.  అపెక్స్‌ ఫ్రోజెన్‌ షేరు దూకుడుపైనా నిపుణులు హెచ్చరికలు చేస్తున్నా ఇన్వెస్టర్లు మాత్రం కసిగా కొంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కేంద్రంగా ఉన్న అపెక్స్‌ ఫ్రోజెన్‌ ఫుడ్‌ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా 152.3 కోట్ల రూపాయలను సమీకరించింది. ఇందులో 25 కోట్ల రూపాయలు ప్రమోటర్ల షేర్ల విక్రయానికి సంబంధించిన మొత్తం కాగా మరో 127 కోట్ల రూపాయలను సంస్థ తాజా ఈక్విటీ షేర్ల విక్రయం ద్వారా సమీకరించింది. సమీకరించిన నిధులను తూర్పు గోదావరి జిల్లాలోనే ఉన్న జి రాగంపేటలో కొత్తగా నిర్మిస్తున్న ప్లాంట్‌ కోసం వెచ్చిస్తున్నట్టు సంస్థ వెల్లడించింది.  ఆక్వాకల్చర్‌ ప్రాడక్ట్స్‌ను ఈ సంస్థ బే ఫ్రెష్‌, బే హార్వెస్ట్‌, బే ప్రీమియం బ్రాండ్లతో విక్రయిస్తోంది. షెల్ప్‌ లైఫ్‌ను దృష్టిలో ఉంచుకొని క్వాలిటీ ఉత్పత్తులను తయారు చేస్తూ ఎగుమతుల మార్కెట్లో పట్టు సాధించింది. అమెరికా, యూకె, యూర్‌పలోని పలు సంస్థలు అపెక్స్‌ ఫ్రోజెన్‌ కస్టమర్లుగా ఉన్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ 292 కోట్ల రూపాయల అమ్మకాల రాబడిపై 22 కోట్ల రూపాయల నికరలాభం ప్రకటించింది.
business
3,212
10-04-2017 23:27:05
ఇ-కామర్స్‌లో కన్సాలిడేషన్‌
దేశీయ ఇ-కామర్స్‌ మార్కెట్‌ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, ఈ మార్కెట్లో కన్సాలిడేషన్‌ సంకేతాలు కనిపిస్తున్నాయని గార్ట్‌నర్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ సాండీ సేన్‌ తెలిపారు. రానున్న కాలంలో ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోళ్ల పరంపరను కొనసాగించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇన్వెస్టర్ల నుంచి ఫండింగ్‌తో పాటు నైపుణ్యాలను పొందడం మూలంగా తన స్థానాన్ని మరింత సుస్థిరపరచుకునే ఆస్కారం ఉందని ఆయన తెలిపారు.
business
12,645
07-03-2017 02:03:21
మహిళలకు ‘వేతన’ వెతలేనా?
న్యూఢిల్లీ, మార్చి 6: పురుషులతో పోల్చితే మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదు అని గర్వంగా చెప్పుకొంటాం. ‘ఆకాశంలో సగం అతివలు’.. అని అందంగా వర్ణిస్తాం కూడా. మరి.. వాస్తవంగా ఆ పరిస్థితి ఉందా? వేతన చెల్లింపుల పరంగానైతే దేశంలో మహిళల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతోందని ఓ సర్వే పరోక్షంగా స్పష్టం చేస్తోంది. మనదేశంలో పురుషుల సంపాదనతో పోల్చితే.. మహిళల సంపాదన 25శాతం తక్కువేనట! గంటకు ఇచ్చే సరాసరి వేతనం పురుషులకు రూ.345.80 ఉండగా.. మహిళలకు రూ.259.8 మాత్రమేనని మోన్‌స్టర్‌ ఇండియా సంస్థ ‘భారత్‌లో మహిళల ఆదాయం’ పేరుతో నిర్వహించిన ఓ సర్వే ద్వారా పేర్కొంది.     అంతేకాదు.. పురుషులు, మహిళలకు సమాన వేతనాలను చెల్లించేందుకు భారత్‌లో ఎన్నో చర్యలు తీసుకుంటున్నా.. వాటి ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఈ సర్వే స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా మహిళా ఉద్యోగుల్లో 62.4శాతం.. తోటి పురుష ఉద్యోగులకన్నా తక్కువ జీతం తీసుకుంటున్నామని, ప్రమోషన్లలోనూ పురుషులకే భారీగా అవకాశాలు లభిస్తున్నాయనే ఆందోళనతో ఉన్నారట. ఈ సంస్థ వివిధ రంగాలవారీగా వెల్లడించిన వివరాల ప్రకారం.. అత్యధికంగా తయారీ రంగంలో 29.9 శాతం అంతరం ఉండగా... ఐటీ రంగంలో 25.8శాతం అంతరం ఉందట. కాగా ఓవరాల్‌ సగటుతో పోల్చితే.. 21.5శాతం అంతరంతో బ్యాంకింగ్‌ ఆర్థిక సేవలు బీమా (బీఎఫ్ఎస్‌ఐ), 14.7శాతం అంతరంతో విద్యాపరిశోధనా రంగాల్లో పరిస్థితి కొద్దిగా మెరుగు అని పేర్కొంది.
nation
14,836
28-06-2017 08:50:48
భారత్ చేరుకున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: మూడు రోజుల విదేశీ పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ ప్రధానికి స్వాగతం పలికారు. విదేశీ పర్యటనలో భాగంగా పోర్చుగల్‌, అమెరికా, నెదర్లాండ్స్‌ దేశాల్లో మోదీ పర్యటించారు. అమెరికా అధ్యక్షడు ట్రంప్‌తో పాటు పోర్చుగల్, నెదర్లాండ్స్ అధినేతలను ప్రధాని మోడీ కలుసుకున్నారు. మోదీ పర్యటనతో ఈ మూడు దేశాలతో భారత్ అనుబంధం మరింత పటిష్టమైంది.
nation
10,928
19-04-2017 22:34:50
రజనీకాంత్‌కు వినిపించదా?
రజనీకాంత్‌కి చెవులు వినిపించవా? ఈ వాక్యం చదివి సూపర్‌స్టార్‌ అభిమానులకు కోపం రావచ్చేమో! కానీ ‘అవును నాకు చెవులు వినిపించవు’ అని స్వయంగా రజనీకాంత్ అంగీకరిస్తున్నారు. ఏయే సందర్భాల్లో ఆయనకు చెవులు వినిపించవో ఆయన ఓ కథ ద్వారా వివరించారు.. ‘‘మూడు కప్పలు ఒకసారి ఓ కొండమీదకు ఎక్కాలనుకున్నాయట. ‘కొండమీదకు ఎందుకు? కొండెక్కాలనే దురాలోచన ఎందుకు వచ్చింది? అంతదూరం ఎక్కడం కష్టం. అసలు ఎలా ఎక్కుతారు? దారిలో తినడానికి ఏమీ ఉండదు. ఒక వేళ సాహసించి ఎక్కేసినా కొండ మీద బతకడం కష్టం. అక్కడ పాములుంటాయి. దయచేసి మాట విని మీ ప్రయత్నాన్ని మానండి’ అని చుట్టూ ఉన్న కప్పలు చెప్పాయట. అయినా ఆ మూడు కప్పలు తమ ప్రయత్నాన్ని విరమించలేదు. ముందుకు పయనించాయి. ఐదు వందల అడుగుల ఉన్న ఆ కొండమీదకు వెళ్లే క్రమంలో మొదటి కప్ప 100 అడుగుల దూరం సాగి కింద పడింది. ఇంకో కప్ప 300 అడుగులు ఎక్కి కిందపడింది. కానీ మూడో కప్ప మాత్రం పైకి ఎక్కేసింది. ఎలా సాధ్యమైందని కింద ఉన్న కప్పలన్నీ మీటింగ్‌ పెట్టుకుని తేల్చిందేమిటంటే.. ఆ కప్పకు చెవులు వినిపించవు అని. ఈ కథను ఎందుకు చెప్పానంటే నేను మూడో కప్పలాంటి వాడిని. ఎదుటివారు నన్ను నిరుత్సాహపరచాలనుకున్నప్పుడు నాకు చెవులు వినిపించవు. మనసులో ఓ ఆలోచనతో అడుగు వేశానంటే గమ్యం చేరేవరకు విశ్రమించను. నేనే కాదు... జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగిన చాలామంది నాలా ఇతరుల మాటలను పెడచెవిన పెట్టినవారే అయి ఉంటారు’’ అని అన్నారు రజనీకాంత్.
entertainment
4,056
02-08-2017 04:12:26
చైనా వస్తు బహిష్కరణకు పిలుపు
చైనా నుంచి భారత్‌కు ఎదురవుతున్న ప్రమాదాలు, బెదిరింపులు, ఆక్రమణ ధోరణులు రోజురోజుకూ శ్రుతిమించిపోతున్నాయి. చైనా భారత్‌పై భౌతిక, ఆర్థిక, బౌద్ధిక, సాంస్కృతిక, వ్యూహాత్మక దురాక్రమణ చేస్తూ ఉంది. ఈ పరిణామాలన్నీ దేశ సార్వభౌమత్వంపై దాడిగా మనం నిర్ధారించుకోవాలి. చైనా విస్తరణవాదం, సామ్రాజ్యవాద ధోరణులకు మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దౌత్య సంబంధాలు కంటగింపుగా మారినట్లు స్పష్టమవుతుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమాలతో భారత్‌కు భారీగా పెట్టుబడులు వస్తుండడంతో పరిశ్రమల సంఖ్య, ఉత్పాదకత పెరగడం, భారత్‌కు తమ ఎగుమతులు తగ్గడం, తమ వ్యాపారంపైనా, దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతున్నాయని చైనా కుతంత్రాల దూకుడు పెంచింది. మన విదేశీమారక ద్రవ్య ఖర్చులో 41శాతం చైనాకు చేరుతోంది. పెట్రోలు దిగుమతి పక్కన పెడితే ఈ ఖర్చు 60 శాతానికి చేరుతుంది. చైనా దిగుమతుల ఖర్చు మన వస్తుఉత్పత్తి రంగపు మొత్తం ఉత్పత్తిలో 24 శాతం ఉంటుంది. అంటే చైనా వస్తువుల దిగుమతుల వల్ల మన దేశంలో ఉత్పత్తి, ఉపాధి రంగాల్లో 1/4 వంతు నష్టపోతున్నామన్నమాట. దీనివల్ల మన పరిశ్రమలు మూతపడుతున్నాయి.  మనం మళ్ళీ వాటిని వునరుద్ధరించుకోవాలి. చైనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ చర్యలతో పాటు దేశభక్త పౌరులుగా మనపైనా బాధ్యత ఉంది. అందుకు చైనా వస్తు బహిష్కరణ చేయాలి. తమ దేశంలో తయారైన చౌకబారు వస్తువులను, తక్కువ ధరకు భారత్‌లో డంప్ చేయడం ద్వారా భారత ఆర్థిక శక్తిని అడ్డుకోవాలని చైనా గత దశాబ్దాల కాలంగా ప్రయత్నం చేస్తోంది. చైనా కుతంత్రాలను ఎదుర్కొనేందుకు చైనా వస్తుబహిష్కరణ మంత్రాన్ని ప్రజలకు వివరించాలి. జూలై 8, 9 తేదీల్లో ఆగ్రా వద్ద భారత్- టిబెట్ సహయోగ్ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం చైనా వస్తు బహిష్కరణపై దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్ళుగా ఆర్‌ఎస్‌ఎస్‌, స్వదేశీ జాగరణ మంచ్ లాంటి అధిక సంఖ్యలో మానవ వనరులు కలిగిన సంస్థలు తమ కార్యాచరణను ప్రకటించాయి. జూలై చివరి వరకు సన్నాహాక సమావేశాలు, ఆగస్టు 1 నుంచి 15 వరకు చైనా వస్తు బహిష్కరణపై పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాయి. మన వస్తువులు కాస్త నాణ్యత తక్కువగా ఉన్నా, ఖరీదు ఎక్కువగా ఉన్నప్పటికీ దేశాభివృద్ధి కోసం, మన యువతకు ఉపాధి అవకాశాలు అందడం కోసం స్వదేశీ వస్తువులనే కొందాం.- కొట్టె మురళీకృష్ణ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, కరీంనగర్
editorial
12,418
23-11-2017 02:19:53
పరీక్ష రాయనివ్వలేదని...
చెన్నైలో తెలుగు విద్యార్థిని ఆత్మహత్యచెన్నై, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పరీక్షలు రాసేందుకు అనుమతించక పోవడంతో మనస్తాపానికి గురైన ఓ తెలుగు విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. చైన్నె నగర శివారులో ఉన్న సత్యభామ డీమ్డ్‌ యూనివర్సిటీలో చదువుతున్న ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వర్సిటీ యాజమాన్యమే దీనికి కారణమంటూ ఆగ్రహించిన తోటి విద్యార్థులు హస్టళ్లలో విధ్వంసం సృష్టించారు. దీంతో పోలీసులు లాఠీలు ఝళిపించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్‌కు చెందిన రాధామౌనిక ఈ వర్సిటీలో కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతోంది.  రెండురోజుల క్రితం జరిగిన ఇంటర్నల్‌ పరీక్షల్లో ఆమె కాపీయింగ్‌ చేస్తూ పట్టుబడింది. దీంతో ప్రొఫెసర్‌ ఆమెను పరీక్ష హాలు నుంచి బయటకు పంపించారు. తదుపరి పరీక్షలకు కూడా ఆమెను అనుమతించక పోవడంతో బుధవారం తన హాస్టల్‌ గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు ఆమె తన మొబైల్‌ నుంచి స్నేహితులందరికీ ‘ఐ మిస్‌ యూ ఆల్‌’, ఐ లవ్‌ యు ఆల్‌, థాంక్యూ’ అంటూ మెసేజ్‌లు పంపింది. కాగా, వర్సిటీ యాజమాన్యం వైఖరి వల్లే మౌనిక బలవన్మరణానికి పాల్పడిందంటూ విద్యార్థులకు వర్సిటీ రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. హాస్టల్‌ గదులు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కొన్నిచోట్ల నిప్పంటించారు. ఈ ఘటనలో రెండు బస్సులు కూడా దహనమైనట్లు సమాచారం.
nation
18,521
25-02-2017 00:08:45
వేయి పడగల విషం!
వీఎక్స్‌..!! ఇది సారిన్‌కన్నా 100 రెట్లు ప్రమాదకరం.  ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర విషం వీఎక్స్‌(నెర్వ్‌ ఏజెంట్‌). ఈ వీఎక్స్‌ను తాకితే చాలు.. బతకడం కష్టమే. వాన చినుకంత వీఎక్స్‌ మీదపడితే.. ఎంతటి మనిషైనా.. కొన్ని గంటల్లో మటాషే. ఇలాంటి వీఎక్స్‌తోనే ఉత్తర కొరియా కిమ్‌ జాంగ్‌ నామ్‌ను చంపేసింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ సోదరుడు నామ్‌పై ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, శక్తివంతమైన రసాయనాన్ని ప్రయోగించారని మలేసియా పోలీసులు గుర్తించారు. వారం రోజుల కిందట నామ్‌ను కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో ఇద్దరు మహిళలు రసాయనం చల్లి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ రసాయనం ఏంటనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వీఎక్స్‌ (నర్వ్‌ ఏజెంట్‌ను) అతనిపై ప్రయోగించారని తేలింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు నామ్‌ హత్యకు గురైన ప్రాంతంలో వీఎక్స్‌ అవశేషాలు ఏవీ మిగలకుండా శుభ్రం చేయించారు. రుచి.. వాసన లేకుండా కాషాయ రంగులో ఉండే.. ఈ వీఎక్స్‌ మలేసియాలోకి ఎలా వచ్చిందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ రసాయనాన్ని అతి తక్కువ మోతాదులో తెచ్చి ఉంటారని.. అలాంటపుడు దీన్ని గుర్తించడం కష్టమని మలేసియా అధికారులు తెలిపారు. ఈ రసాయనం ఉత్తర కొరియా నుంచే వచ్చి ఉంటుందని.. ఆ దేశం వద్ద 5000 టన్నుల వరకు ఈ వీఎక్స్‌ ద్రావణం ఉందని దక్షిణ కొరియా నిపుణులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మలేసియా పోలీసులు మాట్లాడుతూ.. మృతి చెందిన వ్యక్తి కళ్లు, ముఖంపై వీఎక్స్‌ అవశేషాలు కనిపించాయని చెప్పారు. ఈ కేసులో అరెస్టయిన ఇద్దరు మహిళలూ ఇప్పటికీ పోలీసుల కస్టడీలోనే ఉన్నారని తెలిపారు. వీరిలో ఒక మహిళకు వాంతులయ్యాయని.. వారిపై కూడా ఈ వీఎక్స్‌ ప్రభావం ఉండొచ్చని తెలిపారు. కాగా.. ఉత్తర కొరియాలో భారీ ఎత్తున రసాయన ఆయుధాలున్నాయని సమాచారం. వీఎక్స్‌, సారిన్‌, మస్టర్డ్‌, హైడ్రోజన్‌ సయనైడ్‌ వంటి అతి ప్రమాదకరమైన 25 రకాల రసాయనాల నిల్వలు అక్కడున్నాయని చెబుతున్నారు. ఇవే కాకుండా ఆంత్రాక్స్‌, స్మాల్‌ పాక్స్‌, ప్లేగ్‌ వంటి సమస్యలను సృష్టించే 13 రకాల జీవ ఆయుధాలు కూడా ఉత్తర కొరియాలో ఉన్నట్లు అక్కడి సైన్యం చెబుతోంది. 1988లో ఇరాక్‌ అధ్యక్షుడు సద్దాం హుసేన్‌ ఆదేశాల మేరకు ఇరాక్‌లోని హలబ్జా నగరంలో వీఎక్స్‌ను వినియోగించగా.. వేల మంది కుర్దులు చనిపోయారు. పైగా ఈ వీఎక్స్‌ను రూపొందించడం పెద్ద కష్టం కాదని.. సాధారణ ఎరువుల కర్మాగారంలోనూ దీన్ని తయారు చేయొచ్చని రసాయన నిపుణులు చెబుతున్నారు. ఉత్తర కొరియాలో ఇలాంటి ప్రమాదకర ఆయుధాలు తయారు చేసేందుకు ప్రత్యేక ప్రయోగ శాలలు కూడా ఉన్నాయని వెల్లడించారు.  ఈ రసాయనాన్ని సయనైడ్‌ లాగా నోటిలో వేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం శరీరంపై ఒక బొట్టు వేస్తే చాలు.. ఇది చర్మం ద్వారా శరీరంలోకి వెళ్లి నాడీ వ్యవస్థను సర్వనాశనం చేస్తుంది. బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. పక్షవాతం వస్తుంది. శ్వాస వ్యవస్థ దెబ్బతిని.. ఊపిరి ఆడదు. దీంతో కొన్ని నిమిషాల్లోనే చనిపోతాడు. నోటిలోకి వెళ్తే.. ఇక బతకడం దాదాపు కష్టం. వీఎక్స్‌ కన్నా మరింత ప్రమాదకరమైన రసాయనాలు, విషవాయువులు లేవు. కానీ ఇలాగే ప్రాణాంతకమైన వాయువులు, రసాయనాలున్నాయి. పొలోనియం, బొటూలినం, సారిన్‌, పొటాషియం సయనైడ్‌, హైడ్రోజన్‌ సయనైడ్‌, నాగుపాముల విషం ఈ కోవలోకి వస్తాయి. వీఎక్స్‌ అంటే..! ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన రసాయనం. దీన్ని కెమికల్‌ వెపన్‌గా పరిగణిస్తారు. ఐక్యరాజ్య సమితి దీనికి సమూహ వినాశకారి అని పేరుపెట్టింది. ఇది ప్రమాదకర వాయువు సారిన్‌ కన్నా 100 రెట్లు అధిక సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఇంజిన్‌ ఆయిల్‌లాగా ఉంటుంది. ఈ రసాయనం ఉత్తర కొరియాలోనే కాదు.. అమెరికా, చైనా, రష్యా ఇంకా చాలా దేశాల్లోనూ ఒక ఆయుధ సంపత్తిగా ఉంది. దీన్ని బ్రిటన్‌లోని కెమిస్ట్‌ రనాజీ ఘోష్‌ 1950లో తొలిసారిగా తయారు చేశారని భావిస్తున్నారు. 1961లో అమెరికా పెద్ద ఎత్తున దీన్ని తయారు చేసింది. ఇరాక్‌ కూడా 50 టన్నుల వరకు రూపొందించింది. - సెంట్రల్‌ డెస్క్‌
nation
7,929
18-06-2017 23:34:16
సారా విషయంలో భయమేస్తోంది
సైఫ్‌ అలీఖాన్‌, అమృతా సింగ్‌ తనయ సారా అలీఖాన్‌పై అందరూ దృష్టి సారిస్తున్నారు. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్శిటీలో చదువుకున్న సారా ‘కేదార్‌నాథ్‌’ సినిమా ద్వారా నాయికగా పరిచయం కానున్న విషయం తెలిసిందే. అయితే ఆమె తెరంగేట్రం తండ్రి సైఫ్‌కు భయాన్ని కలిగిస్తోందంట. ‘‘సారా సినిమాల్లోకి రావడం కాస్త నెర్వస్గా అనిపిస్తోంది. ఈ ఇండస్ట్రీలో మోస్ట్‌ డ్రైవింగ్‌ ఫ్యాక్టర్‌ ఏమిటంటే.. భయం. ఆమె ఎందుకు దాన్ని కోరుకుంటోంది? ఆమె ఎక్కడ చదువుకుందో చూడండి. ఇక్కడకు వచ్చి, సినిమాల్లో చేరకుండా న్యూయార్క్‌లోనే ఉండి ఉద్యోగం ఎందుకు చేసుకోకూడదు? నటనను నేను తక్కువ చేయట్లేదు. కాకపోతే ఇది స్థిరమైన వృత్తి కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ భయంభయంగానే గడుపుతుంటారు. మనమెంత బాగా చేసినా, విజయం సాధిస్తామనే గ్యారంటీ ఉండదు. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు కావాలనుకొనే జీవితం ఇది కాదు’’ అని చెప్పాడు సైఫ్‌. ఆసక్తికరమైన విషయం ఏమంటే సినిమాల్లోకి రావాలని సారా తీసుకున్న నిర్ణయంలో అతని పాత్రేమీ లేకపోవడం. ‘‘ఆమె నిర్ణయంలో నేను జోక్యం చేసుకోలేదు. ఏ విషయమైనా నాతో పంచుకుంటే, లేదా మాట్లాడితే.. సలహా ఇవ్వడానికీ, సాయం చేయడానికీ నేనెప్పుడూ సిద్ధమే’’ అని తెలిపాడు. కెరీర్‌కు కీలకమైన నిర్ణయం తీసుకోవడంలో కూతురు తనను నిర్లక్ష్యం చేసిందనే బాధ అతని మాటల్లో కనిపిస్తోంది.- సైఫ్‌
entertainment
2,024
01-04-2017 03:37:20
ఎయిర్‌టెల్‌ ప్రకటనకు ఎఎస్‌సిఐ బ్రేక్‌
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత వేగవంతమైన నెట్‌వర్క్‌ తమదేనంటూ ఎయిర్‌టెల్‌ చేసుకుంటున్న ప్రచార ప్రకటనకు అడ్వర్‌టైజ్‌మెంట్లను పర్యవేక్షించి, నియంత్రించే ప్రకటనల ప్రమాణాల మండలి (ఎఎస్‌సిఐ) బ్రేక్‌ వేసింది. ఆ ప్రకటన అభూతకల్పనగా ఉన్నదంటూ దానిలో మార్పులు చేయాలని లేదా పూర్తిగా ఉపసంహరించాలని ఆదేశించింది. ప్రత్యర్థి ఆర్‌జియో చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసును పరిశీలించిన ఎఎ్‌ససిఐ ఈ ఉత్తర్వు జారీ చేసింది. ఇందుకు ఏప్రిల్‌ 11వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఎఎ్‌ససిఐ ఉత్తర్వులపై తాము అప్పీలు చేస్తామని ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న కంపెనీల స్పీడ్‌ను పరిశీలించి సర్టిఫై చేసిన, మొబైల్‌ స్పీడ్‌ టెస్టింగ్‌లో అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ఊక్లా అధ్యయన నివేదిక ఆధారంగానే తాము ఆ ప్రచారం రూపొందించినట్టు తెలిపింది. తమ వాదానికి మద్దతుగా అన్ని ఆధారాలను ఎఎ్‌ససిఐకి అందచేసినట్టు కూడా తెలియచేసింది. అవసరం అయితే మరిన్ని వివరాలు అందించేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించింది.
business
14,310
08-04-2017 03:12:49
లడక్‌లో హిమపాతం.. ముగ్గురు జవాన్లు మృతి
జమ్ముకశ్మీర్‌లోని లడక్‌ ప్రాంతంలో భారీగా హిమపాతం కురుస్తోంది. బటాలిక్‌ సెక్టార్‌లో మంచుపెల్లలు విరిగిపడటంతో ఆర్మీ సైనిక పోస్టు వద్ద ఐదుగురు జవాన్లు మంచులో కూరుకుపోయారు. సహాయ బృందాలు ఇద్దరిని ప్రాణాలతో కాపాడాయి. మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
nation
8,494
07-02-2017 16:30:55
పవన్ అభిమానుల్ని తిట్టి ఉండాల్సింది కాదు: నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు చింతిస్తున్నాడు. అయితే.. అది నిన్న..మొన్న జరిగిన సంఘటన గురించి కాదు. నాగబాబు ఎందుకు చింతిస్తున్నాడో తెలియాలంటే.. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాలి. 2015లో.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌నుద్దేశించి చేసిన వ్యాఖ్యలవి. ఓ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అరుపులతో కేకలు పెట్టేస్తుంటే.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు నాగబాబు. ఆ సంఘటనను గుర్తు చేసుకున్న నాగబాబు.. ఆ రోజు పవన్ అభిమానులను అలా తిట్టి ఉండాల్సింది కాదని, దానికి చింతిస్తున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. పవన్ కల్యాణ్ అభిమానులంటే మెగా అభిమానులేనని, పవన్ ఎదుగుదలకు వారంతా పిల్లర్ల లాంటి వారని అన్నాడు. మెగా ఈవెంట్లలో వారు చేసే గోల చాలా గందరగోళంగా ఉంటుందని, మెగా హీరోల కార్యక్రమాల్లోనే కాకుండా ఇతర హీరోల ఫంక్షన్లలోనూ వారు చేసే అల్లరి వల్ల.. ఆ హీరోలకు ఎంతో అసౌకర్యం తలెత్తిందని అన్నాడు. బేషరతుగా ఓ హీరోపై ప్రేమను చూపించేది అభిమానులేనని, న్యూసెన్స్ చేశారని అలాంటి అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు చింతిస్తున్నానని చెప్పాడు. ఆ టైంలో అదే కరెక్ట్ అనిపించి అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశానని చెప్పాడు నాగబాబు.
entertainment
1,337
22-02-2017 23:35:29
ఉదయం మెరుగు
తిథి: మాఘ బహుళ ద్వాదశి నక్షత్రం: ఉత్తరాషాఢ; ఆర్ద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర జాతకులు, కుంభ, మీన రాశులవారు అప్రమత్తంగా ఉండాలి. నిఫ్టీ : 8926.90 (+19.05) ట్రెండ్‌ మార్పు వేళలు: ఉదయం 10.40, 11.32 ధోరణి: గ్రహగతులను బట్టి నిలకడగా ప్రారంభమై 9.30 నుంచి 1 మధ్యలో మెరుగ్గా ట్రేడవుతూ తదుపరి నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ట్రేడింగ్‌ వ్యూహం... నిఫ్టీ ఫ్యూచర్స్‌ 9.45 గంటల సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి) పైన ట్రేడవుతుంటే తగు స్టాప్‌లా్‌సతో లాంగ్‌ పొజిషన్లు తీసుకుని ఒంటి గంట సమయానికి క్లోజ్‌ చేసుకోవాలి. 1.15 తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్‌ పొజిషన్లు తీసుకుని మధ్యాహ్నం ముగింపు సమయానికి క్లోజ్‌ చేసుకోవాలి. ఇంట్రాడే ట్రేడింగ్‌కు ప్రారంభ స్థాయి కీలకం. అంతకన్నా దిగువన మాత్రమే షార్ట్‌ పొజిషన్లు శ్రేయస్కరం. నిరోధ స్థాయిలు : 8965, 9000 మద్దతు స్థాయిలు : 8885, 8850 మధ్యాహ్నం సమయానికి నిరోధ స్థాయిలకు చేరితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ళు, మద్దతు స్థాయిలకు చేరితే కనిష్ఠ స్థాయిల్లో అమ్మకాలు నివారించాలి. రిస్క్‌ భరించగల వారు మాత్రం పుల్‌బ్యాక్‌ ఆశలతో పొజిషన్లు తీసుకోవచ్చు. గమనిక: ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నికల్‌ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచన. మార్కెట్‌ వాస్తవిక కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి.
business
13,338
17-06-2017 20:40:17
'నమ్మ మెట్రో'కు ప్రణబ్ పచ్చజెండా
బెంగళూరు: మెట్రో నగరవాసుల చిరకాల స్వప్నమైన 'నమ్మ మెట్రో' అండర్‌ గ్రౌండ్ రైల్ సర్వీసును భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారంనాడు ప్రారంభించారు. ప్రణబ్‌తో పాటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాబోయే 15 ఏళ్లలో డజనకు పైగా భారత నగరాల్లో మెట్రో ప్రాజెక్టులు సిద్ధమవుతాయని ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతూ అన్నారు. నమ్మ మెట్రో అండర్ గ్రౌండ్ సెక్షన్ బెంగళూరు తూర్పు ప్రాంతంలోని నాగసంద్రను దక్షిణ ప్రాంతంలోని యెలచానహల్లిని కలుపుతుందని బెంగళూరు మెట్రో కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ ప్రదీప్ సింగ్ ఖరోల తెలిపారు. 24.2 కిలోమీటర్ల ఈ గ్రీన్ లైన్ సెక్షన్ సేవలు ఆదివారం నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఏడేళ్ల క్రితం నమ్మ మెట్రో ప్రాజెక్టుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేశారు.
nation
6,415
02-12-2017 12:01:11
సూర్య.. ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్..
సూర్య, కీర్తి సురేష్ జంటగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్ నేడు రిలీజ్ అయింది. ఈ సినిమా టైటిల్‌గా... 'గ్యాంగ్'ను ఖరారు చేసింది చిత్రబృందం‌. ఇది తమిళ్‌లో ‘తానా సెరిందా కూట్టమ్’ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోంది. ఇటీవల తమిళ్‌లో ఈ చిత్ర టీజర్ రిలీజ్ అయి రికార్డ్ స్థాయిలో దూసుకు పోతోంది. హీరో సూర్య ఇప్పటి వరకు చేయని పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తున్నారు. బాహుబలి సినిమాలో శివగామిగా రాజమాత పాత్రలో హుందాగా కనిపించిన రమ్యకృష్ణ ఈ సినిమాలో లుంగీ కట్టి హీరో సూర్యతో డ్యాన్స్ చేయడం బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
entertainment
11,354
11-07-2017 00:34:47
ఐఐటీల్లో కౌన్సెలింగ్‌ కొనసాగించొచ్చు
అడ్మిషన్ల ప్రక్రియపై స్టేను ఎత్తివేసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, జూలై 10: ఐఐటీల్లో కౌన్సెలింగ్‌, అడ్మిషన్ల ప్రక్రియకు మార్గం సుగమమైంది. దేశంలోని అన్ని ఐఐటీల్లో ఈ ప్రక్రియను కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఐఐటీ-జేఈఈ (అడ్వాన్స్‌)-2017 పరీక్ష ఫలితాల ఆధారంగా ఈ కౌన్సెలింగ్‌ నిర్వహించవచ్చంటూ సోమవారం తీర్పునిచ్చింది. ఈ మేరకు గతంలో దీనిపై విధించిన స్టేను ఎత్తివేస్తున్నట్లు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, ఎంఎం శంతనగౌడలతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. అంతేగాకుండా ఈ అంశంపై దాఖలైన పిటిషన్ల విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ హైకోర్టులకు సూచించింది. ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు తాము సాధించిన ర్యాంకుల ఆధారంగా.. తనకు నచ్చిన కాలేజీని ఎంపిక చేసుకుంటారని తెలిపింది. దీంతోపాటు ఇటువంటి పరిస్థితిని, బోనస్‌ మార్కులు ఇవ్వాల్సిన అవసరాన్ని మరోసారి రానివ్వవద్దని ఐఐటీలకు సూచించింది. 2005లో గురునానక్‌ యూనివర్సిటీ కేసులో ఇచ్చిన తీర్పు.. ఈ కేసుకు వర్తించదని తెలిపింది. ఈ అంశం ఎంతోమంది విద్యార్థులకు సంబంధించినదని, పైగా నెగెటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉందని పేర్కొంది. ప్రశ్నాపత్రంలో తప్పుగా ప్రచురితమైన ప్రశ్నలకు బోనస్‌ మార్కులు ఇచ్చేలా ఐఐటీల నిపుణుల కమిటీ నిర్ణయించిందని వెల్లడించింది. తప్పులు దొర్లిన ప్రశ్నలకుగాను విద్యార్థులందరికీ బోనస్‌ మార్కులు ఇవ్వాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఐశ్వర్యా అగర్వాల్‌ అనే విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. బోనస్‌ మార్కుల నిర్ణయం నిబంధనలను ఉల్లంఘించడమేనని, దీంతో తనతోపాటు ఎంతోమందికి నష్టం జరుగుతుందని పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు. ఆ ప్రశ్నలను అటెంప్ట్‌ చేసినవారికి మాత్రమే బోనస్‌ మార్కులు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో.. ఈ నెల 7న జరిగిన విచారణ సందర్భంగా.. తప్పుగా ప్రచురితమైన ప్రశ్నలను ప్రయత్నించకుండా వదిలివేసిన వారికి బోనస్‌ మార్కులు ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతూ స్టే ఇచ్చింది. అయితే సమాధానం తప్పుగా రాసిన ప్రశ్నలకు నెగెటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉందని, దీంతో చాలామంది విద్యార్థులు మార్కులు మైనస్‌ అవుతాయన్న భయంతోనే.. అనుమానం ఉన్న ప్రశ్నలను వదిలివేశారని ఐఐటీల తరఫున వాదించిన అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ తెలిపారు. అందుకే ఆయా ప్రశ్నలకు సంబంధించి విద్యార్థులందరికీ బోనస్‌ మార్కులు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
nation
9,572
01-03-2017 18:57:04
వారికి లొంగనందుకే నాకీపరిస్థితి: ప్రముఖ హీరోయిన్
కన్నడ కుట్టి అయినా.. అచ్చం తెలుగమ్మాయిలా కనిపించే హీరోయిన్ మాధవీలత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నచ్చావులే, స్నేహితుడా వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చురగొంది. చిన్న సినిమాల్లో నటించి హిట్ ట్రాక్‌ను సొంతం చేసుకుంది. కానీ సినీ ఇండస్ట్రీని మాత్రం మెప్పించలేకపోయింది. ఆ కారణంగానే ఆమెకు పెద్దగా సినిమా ఆఫర్లు రాలేదు. దీంతో మాధవీలత కోలీవుడ్‌కి మకాం మార్చేసింది. అక్కడా సక్సెస్ కాలేదు. కర్ణాటకలో పుట్టి పెరిగిన మాధవీలత మొదటి సినిమాతోనే మంచి టాలెంట్ కలిగిన నటి అని గుర్తింపు తెచ్చుకుంది. అయితే అంత టాలెంట్ ఉండి కూడా అయిదారు సినిమాలకే కనిపించకుండా పోయింది. వెండితెరకు దూరమవడానికి కారణమేంటని అడిగితే.. మాధవీలత షాకింగ్ ఆన్సర్ చెప్పింది. ఒక టీవీ షోలో మాట్లాడిన మాధవీలత... ఇండస్ట్రీలో ఎవరికీ లొంగకపోవడం వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక ప్రొడ్యూసర్‌ అడిగిన దానికి ఆమె నో చెప్పినందుకు తనను ఎలా వేధించాడో వివరించింది. లొకేషన్‌లో అందరిముందు అరిచేవాడని, ఒకసారి సాంగ్ షూటింగ్ కోసం షార్ట్ డ్రెస్ వేసుకోమంటే వేసుకోకపోవడంతో పెద్ద గొడవ జరిగిందని చెప్పింది. ఇండస్ట్రీలో పెద్ద మనుషులుగా చలామణీ అవుతున్న చాలమంది.. హీరోయిన్స్ విషయంలో మాత్రం సెక్సువల్ రిలేషన్‌కే ప్రాధాన్యత ఇస్తారంది. నేను గనుక నోరు విప్పితే ఎంతమంది కాపురాలు కూలిపోయో అంటూ పరోక్షంగా హెచ్చరించింది. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది పరిస్థితి ఇదేనని, సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను చెప్పుకొచ్చింది. ఇంకా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఎన్నో చేదు విషయాలు, వాటి వెనుక ఉన్న కఠిన వాస్తవాలను మాధవీలత ఆ ఇంటర్వ్యూలో పూసగుచ్చినట్లు వివరించింది.
entertainment
18,427
13-03-2017 01:33:14
యూపీ ఫలితాలతో బీజేపీలో ఉత్సాహం
 తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం: బాల్‌రాజు హైదరాబాద్‌/న్యూఢిల్లీ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): యూపీలో అఖండ విజయం రాష్ట్రంలోని బీజేపీ శ్రేణులకు ఎనలేని ఉత్సాహాన్నిచ్చింది. యూపీ విజయం స్ఫూర్తిగా రాష్ట్రంలోనూ పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ కోర్‌ కమిటీ భావిస్తోంది. దీనిపై చర్చించేందుకు సోమవారం సాయంత్రం కమిటీ సమావేశమవుతోంది. యూపీలో పార్టీ విజయానికి దోహదం చేసిన అంశాలను సమావేశంలో విశ్లేషిస్తారు. ఆ మేరకు రాష్ట్రంలోనూ పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. ఇదే సమయంలో అధికార టీఆర్‌ఎ్‌సతో వ్యవహరించాల్సిన విధానంపైనా సమీక్షిస్తామని బీజేపీ రాష్ట్ర నేతలు తెలిపారు. కాగా, తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని, యూపీ స్ఫూర్తితో రాష్ట్రంలో జెండా ఎగురవేస్తామని తెలంగాణ బీజేపీ సమన్వయకర్త ఎన్‌.బాల్‌రాజ్‌ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకూ పార్టీ దూసుకొస్తుందని, దీన్ని ఎవ్వరూ ఆపలేరని ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందని, దీన్ని అందిపుచ్చుకోవడానికి కార్యకర్తలు కష్టపడి పని చేయాలని ఆయన కోరారు.
nation
3,296
24-05-2017 01:11:54
ఉత్తరాంధ్ర ఏం కోరుతున్నది?
ఉత్తరాంధ్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలు కావాలంటే, ప్రభుత్వం వైపు నుంచి ప్రత్యేకించి అదే లక్ష్యంగా గల ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి ఏర్పాటు కావాలి. చిత్తశుద్ధి గల అధికారులను, ప్రజల, రాజకీయ పక్షాల, ప్రజాసంఘాల ప్రతినిధులను ఈ మండలిలో భాగం చేయాలి. విభజనచట్టం నిర్దేశించినట్టుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో విస్తరించి, 23,537 చ.కి.మీ విస్తీర్ణంతో (ఆంధ్రప్రదేశ్‌ విస్తీర్ణంలో 15 శాతం), దాదాపు ఒక కోటి జనాభాతో (ఆంధ్రప్రదేశ్‌ జనాభాలో 19 శాతం) ఉత్తరాంధ్ర, పుష్కలమైన జల, ఖనిజ, అటవీ వనరులతో, మానవ వనరులతో అభివృద్ధి పథంలో అగ్రభాగాన ఉండవలసిన స్థితిలో ఉన్నప్పటికీ, పాలకుల నిర్లక్ష్యం వల్ల తనకు న్యాయంగా రావలసిన వాటా కూడా దక్కని దుస్థితిలో ఉంది. తమ వాటా తమకు దక్కలేదని గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రజలు ఉద్యమించినప్పుడు, ఆ సమస్య పరిష్కారంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిషన్‌ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ఎంతగా వెనుకబడి ఉన్నదో గణాంకాలతో సహా చూపింది. రాష్ట్ర విభజన జరిగే సందర్భంలో అవశేష ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని, ప్రత్యేక ప్యాకేజీలో నిర్దిష్ట కేటాయింపులు చేస్తామని కేంద్ర, రాష్ట్ర పాలకులు నమ్మబలికారు. మూడు సంవత్సరాలు గడిచిపోయినా ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉంది. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి జస్టిస్‌ శ్రీకృష్ణ కమిషన్‌ వేసిన అంచనాలను మించిన మరింత దుర్భర స్థితి ఈ మూడు సంవత్సరాలలో ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి కూలంకషంగా చర్చించుకోవడం, ఉత్తరాంధ్ర ఏమి కోరుకుంటున్నదో ప్రజా ఆకాంక్షలన్నిటినీ సవివరంగా ముందుకు తేవడం, అన్ని వేదికల మీద, అన్ని రూపాలలో ఉత్తరాంధ్ర ప్రాంతీయ ప్రజా ఆకాంక్షలకు సముచిత స్థానం ఇచ్చి, ఆ ఆకాంక్షలు నెరవేరే దిశగా అన్నిరకాల భావ ప్రచార, ఉద్యమ నిర్మాణ, సంఘీభావ సమీకరణ ప్రయత్నాలకూ పూనుకోవడం ఈ ప్రాంతపు రాజకీయ నాయకుల, విద్యావంతుల, యువజనుల, విద్యార్థుల, ప్రజలందరి బాధ్యత. ఈ బాధ్యత ఎంత బృహత్తరమైనదో గుర్తించడానికి ఈ ప్రాంత ప్రజా సమస్యలను, ఆకాంక్షలను సింహావలోకనం చేద్దాం. విస్తారమైన సహజవనరుల, మౌలిక సౌకర్యాల లభ్యతలో ఉత్తరాంధ్ర ప్రపంచంలోనే అరుదైన ప్రాంతాలలో ఒకటి. నదులు, అడవులు, సముద్ర తీరం, ఖనిజ సంపద, జాతీయ రైలు, రహదారి మార్గాలు, ఓడరేవు, విమానాశ్రయం, అపారమైన మానవ శ్రమశక్తి, అన్నిటికన్ని వనరులూ పుష్కలంగా ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు ప్రాంతాలను చూసినా ఈ వనరులన్నీ ఉన్న ఏకైక సంపన్న ప్రాంతం ఉత్తరాంధ్రే. కానీ ఈ వనరుల్లో ఏ ఒక్కటీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి, ఉత్తరాంధ్ర బిడ్డల మెరుగైన జీవనానికి సంపూర్ణంగా ఉపయోగపడడం లేదు. ఇక్కడి వనరులను ఉపయోగించి ఇక్కడి ప్రజల, ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేసే రాజకీయ, ఆర్థిక, పాలనా విధానాలు లేవు. ఈ వనరులన్నీ బిడ్డకు దక్కని తల్లి స్తన్యంలా ఇతర ప్రాంతాల వారు కొల్లగొట్టుకుపోతుంటే అరికట్టే పాలక విధానాలు లేవు. కనుక ‘మా వనరులను మా అభివృద్ధికే వెచ్చించాలి’, ‘మా వనరులు కొల్లగొట్టడానికి ఇతరులకు హక్కు లేదు’ అని ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజానీకం తమ ఆకాంక్షను ఎలుగెత్తవలసిన అవసరం వచ్చింది. అన్నిటికన్నా ప్రధానమైన ఉత్తరాంధ్ర ఆకాంక్ష జల వనరుల గురించినది. బాహుదా, మహేంద్ర తనయ, వంశధార, నాగావళి, పెద్ద గెడ్డ, కందివలస గెడ్డ, చంపావతి, జంఝావతి, సీలేరు, శబరి, గోస్తని, నర్వ గెడ్డ, శారద, వరాహ, తాండవ వంటి జీవ నదులకూ నిత్యం ప్రవహించే సెలయేళ్లకూ ఆలవాలమైన, రాష్ట్రం మొత్తంలోకి అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఉత్తరాంధ్రలో వ్యవసాయానికి నీటి పారుదల సౌకర్యాలు కనీస స్థాయిలో కూడా లేవు. ఈ నదులలో సెలయేళ్లలో ప్రవహించే జలాలను సక్రమంగా వినియోగిస్తే ఉత్తరాంధ్రలో సాగుకు లాయకైన భూమి ప్రతి ఎకరానికీ నీటి పారుదల సౌకర్యం కలిగించవచ్చు. ఉత్తరాంధ్రను వ్యవసాయోత్పత్తులలో అన్నపూర్ణగా మార్చవచ్చు. దాదాపు యాభై ఎనిమిది లక్షల ఎకరాల ఉత్తరాంధ్ర విస్తీర్ణంలో ఇరవై నాలుగు లక్షల ఎకరాలు సాగుకు అనుకూలం కాగా, ప్రస్తుతం అందులో ఎనిమిది లక్షల ఎకరాలకు కూడా కాలువల కింద సాగునీటి పారుదల సౌకర్యం లేదు. ఎప్పటినుంచో ఉత్తరాంధ్ర ప్రజలకు పాలకులు ఆశచూపుతున్న ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను తక్షణమే ప్రారంభించి, నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుతున్నారు. ఉత్తరాంధ్రలోని పంట భూములన్నిటికీ సాగునీరు, అన్ని పట్టణాలకూ, గ్రామాలకూ తాగునీరు అందించడం తక్షణ కార్యక్రమంగా ప్రభుత్వం చేపట్టాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుతున్నారు. సాగునీటికీ తాగునీటికీ ఉద్దేశించిన పథకాలను పరిశ్రమలకు, ఇతర అవసరాలకు ఎట్టి పరిస్థితులలోనూ మళ్లించగూడదని కూడా కోరుతున్నారు. ఉత్తరాంధ్రలో ప్రవహించే నదుల్లో ఎక్కువభాగం ఒరిస్సాలో పుట్టిన అంతర్రాష్ట్ర నదులు గనుక ఆ రాష్ట్రంతో చర్చలకు, సామరస్య పూర్వకమైన పరిష్కారానికి ప్రయత్నించి, ఉత్తరాంధ్ర ప్రజల హక్కులను పరిరక్షించాలి. ఈ జలవనరుల సమస్యను సక్రమంగా పరిష్కరిస్తే ఉత్తరాంధ్రలో వ్యవసాయాభివృద్ధికి మార్గం సుగమమవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సాగుతున్న వలసలకు అడ్డుకట్ట పడుతుంది. పొట్టచేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి ఇక్కట్లు అనుభవిస్తున్న ఉత్తరాంధ్ర బిడ్డలు తమ గ్రామాలకు తిరిగివచ్చి గౌరవప్రదమైన జీవనం గడపడానికి వీలు కలుగుతుంది. వ్యవసాయాభివృద్ధి పెరిగితే వ్యవసాయాధార పరిశ్రమల స్థాపనకు, ఉపాధికీ, ప్రాంత అభివృద్ధికీ కూడా అవకాశాలు మెరుగవుతాయి. వ్యవసాయాధార పరిశ్రమలు, ఆహార, పండ్ల ప్రాసెసింగ్‌ పరిశ్రమలు, జీడిపప్పు పరిశ్రమలు ఇతోధికంగా స్థాపించి, ఆ పరిశ్రమలలోను, అనుబంధ పరిశ్రమలలోను ఉపాధి కల్పించడానికీ, ప్రాంత ఆదాయం పెంచడానికీ ఎన్నో అవకాశాలున్నాయి. అటువంటి పరిశ్రమలకు ఉదాహరణప్రాయమైన పరిశ్రమలను, ప్రోత్సాహక కేంద్రాలను, నైపుణ్య బదిలీ కేంద్రాలను ప్రభుత్వమే స్థాపించి ఇటువంటి పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేయవచ్చు. అలాగే ఉత్తరాంధ్రలో ఉన్న అటవీ వనరులతో, ఖనిజ వనరులతో కాగితం, ఖనిజాధార తయారీ పరిశ్రమలు, రసాయన పరిశ్రమలు, ఇటుకలు, పెంకులు, వస్త్ర పరిశ్రమలు వంటి ఎన్నో భారీ, మధ్యతరహా పరిశ్రమలను ఏర్పరచడం ద్వారా, ప్రోత్సహించడం ద్వారా ప్రస్తుతం ఉత్తరాంధ్రలో నెలకొని ఉన్న తీవ్రమైన నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నించవచ్చు. విశాఖపట్నంలో రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడానికి, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీతో సహా ఇతర సేవారంగ సంస్థలు నెలకొల్పడానికి ప్రభుత్వం ప్రయత్నించవచ్చు. ఇప్పటికి జరిగిన పారిశ్రామికాభివృద్ధిలో, ఉద్యోగకల్పనలో ఉత్తరాంధ్ర స్థానిక ప్రజానీకానికి దక్కిన భాగమెంతో, ఉత్తరాంధ్ర స్థానికుల నిరుద్యోగాన్ని తగ్గించడానికి ఏ చర్యలు తీసుకున్నారో అంచనా కట్టవలసే ఉంది. ఆ అసమానతలను తగ్గించడానికి కృషి చేయవలసే ఉంది. ఉత్తరాంధ్రలో గణనీయమైన సంఖ్యలో ఆదివాసీ జనాభా ఉంది. మూడు జిల్లాలలోను ఆదివాసీ ప్రాంతాలున్నాయి. ఆదివాసుల అభివృద్ధి కోసం 2012లో విడుదల అయిన అరకు డిక్లరేషన్‌ ఆదివాసీ ప్రాంతాలలో అమలు చేయవలసిన అభివృద్ధి పథకాల గురించి, విధానాల గురించి వివరమైన సూచనలు చేసింది. ఆ సూచనలు ఇంతవరకూ అమలులోకి రాలేదు. ఆదివాసీ ప్రాంతాల ప్రత్యేక అస్తిత్వాన్ని పరిరక్షించే చర్యలు చేపట్టడం, 1/70 చట్టాన్ని ఉల్లంఘిస్తూ అన్యాక్రాంతమైన ఆదివాసీ భూములను తిరిగి ఆదివాసులకు అప్పగించడం, రాజ్యాంగం 73, 74 సవరణల ప్రకారం, పంచాయతీ రాజ్‌ ఎక్స్‌టెన్షన్‌ టు షెడ్యూల్డ్‌ ఏరియాస్‌ చట్టం ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో పంచాయతీ పాలనను ప్రవేశపెట్టడం, గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం, బాక్సైట్‌ తవ్వకాలను ఆపివేయడం వంటి ఎన్నో డిమాండ్లను ఆదివాసులు ముందుకు తెస్తున్నారు. ఈ ఆదివాసీ ఆకాంక్షలన్నీ కూడా ఉత్తరాంధ్ర ప్రజా ఆకాంక్షలలో భాగమే. ఉత్తరాంధ్రలో మరొక పెద్ద ప్రజా సమూహం సముద్రం మీద ఆధారపడిన మత్స్యకారులు, ఇతరవర్గాలు. ఉత్తరాంధ్రకు ఉన్న 340 కిమీ సముద్రతీరాన్ని సముద్రం మీద ఆధారపడిన ప్రజల అభివృద్ధికి ఉపయోగించాలి. సముద్ర తీరంపై మత్స్యకారులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించాలి. ఫిష్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలను, కోల్డ్‌ స్టోరేజీలను స్థాపించి మత్స్యకారులకు, ఇతర నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి. కేవలం పాలకుల నిర్లక్ష్యం వల్ల విద్యారంగంలో ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉంది. రాష్ట్రంలోని 13 జిల్లాలలో అక్షరాస్యతలో విజయనగరం 13వ స్థానంలో, శ్రీకాకుళం 11వ స్థానంలో, విశాఖపట్నం 8వ స్థానంలో ఉన్నాయంటే ఈ మూడు జిల్లాల పట్ల పాలకుల నిర్లక్ష్యం అర్థమవుతుంది. పందొమ్మిదో శతాబ్ది చివరికే విద్యల నగరంగా ఉండిన విజయనగరం ఇరవయ్యొకటో శతాబ్దిలో అక్షరాస్యతలో చిట్టచివరికి చేరడం, దాన్ని సవరించడానికి పాలకులు ఎంతమాత్రం ప్రయత్నించకపోవడం, తగిన నిధులు కేటాయించి విద్యా సౌకర్యాలు కలిగించకపోవడం కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యారంగంలోనూ, కళాశాల, విశ్వవిద్యాలయాల ఉన్నత విద్యారంగంలోనూ పాలకుల ఈ నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. ప్రాథమిక ఆరోగ్యం, పర్యాటక రంగం, విద్యుచ్ఛక్తి, రవాణా, ప్రభుత్వరంగ పరిశ్రమలు, వలసలు, పాలన, స్థానిక స్వపరిపాలనా సంస్థలు, పారిశుధ్యం, పర్యావరణం వంటి ఏ రంగాన్ని తీసుకుని పరిశీలించినా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం స్పష్టంగా కనబడుతుంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెలుగులు నింపే, ఉత్తరాంధ్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలు కావాలంటే, ప్రభుత్వం వైపు నుంచి ప్రత్యేకించి అదే లక్ష్యంగా గల ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి ఏర్పాటు కావాలి. ఈ మండలిలో చిత్తశుద్ధి గల అధికారులను నియమించాలి. ఉత్తరాంధ్ర ప్రజల, రాజకీయ పక్షాల, ప్రజాసంఘాల ప్రతినిధులను ఈ మండలిలో భాగం చేయాలి. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014, సెక్షన్‌ 46(3)లో నిర్దేశించినట్టుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలి. ఆ ఆర్థిక ప్యాకేజీ, ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌లో కనీసం 15 శాతం (విస్తీర్ణాన్ని బట్టి) నుంచి 20 శాతం (జనాభాను బట్టి) ఉండాలి. అంటే రూ. 1.57 లక్షల కోట్ల 2017–18 ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ ప్రకారం ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ రూ. 22,000 కోట్ల నుంచి రూ. 30,000 కోట్లు ఉండాలి. ప్రజల వైపు నుంచి ఉత్తరాంధ్ర ఆకాంక్షల గురించి నిరంతర చర్చ, ఎప్పటికప్పుడు పాలకుల దృష్టికి తీసుకుపోవడం, ప్రచారం, ఆందోళన కార్యక్రమాలు కొనసాగాలి. ఇవీ ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు : ఉత్తరాంధ్ర, రాయలసీమకు బుందేల్‌ఖండ్‌, బోలంగీర్‌ - కలహండి – కోరాపుట్‌ తరహా ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి; ఉత్తరాంధ్రకు ప్రత్యేకంగా అభివృద్ధి మండలిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి; ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం పన్నుల రాయితీలతో కూడిన ప్రత్యేక హోదాను ప్రకటించాలి; ఉత్తరాంధ్రలోని 24 లక్షల ఎకరాలకు కనీసం ఒక పంటకైనా సాగునీరు సదుపాయం కల్పించాలి; ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలి; గోదావరి జలాల్లో ఉత్తరాంధ్రకు న్యాయమైన నీటి వాటాను కేటాయించాలి; గోదావరితో ఉత్తరాంధ్రలోని నదులను అనుసంధానం చేయాలి; విశాఖపట్నంలో రైల్వే జోన్‌ను వెంటనే ప్రకటించాలి; గిరిజన విశ్వవిద్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి; విమ్స్‌ ఆసుపత్రిని మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలి; ఉత్తరాంధ్ర మరో భోపాల్‌గా మారకుండా పర్యావరణాన్ని రక్షించాలి.కొణతాల రామకృష్ణమాజీ మంత్రిkonathalark09@gmail.comశ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో విస్తరించి, 23,537 చ.కి.మీ విస్తీర్ణంతో (ఆంధ్రప్రదేశ్‌ విస్తీర్ణంలో 15 శాతం), దాదాపు ఒక కోటి జనాభాతో (ఆంధ్రప్రదేశ్‌ జనాభాలో 19 శాతం) ఉత్తరాంధ్ర, పుష్కలమైన జల, ఖనిజ, అటవీ వనరులతో, మానవ వనరులతో అభివృద్ధి పథంలో అగ్రభాగాన ఉండవలసిన స్థితిలో ఉన్నప్పటికీ, పాలకుల నిర్లక్ష్యం వల్ల తనకు న్యాయంగా రావలసిన వాటా కూడా దక్కని దుస్థితిలో ఉంది. తమ వాటా తమకు దక్కలేదని గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రజలు ఉద్యమించినప్పుడు, ఆ సమస్య పరిష్కారంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిషన్‌ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ఎంతగా వెనుకబడి ఉన్నదో గణాంకాలతో సహా చూపింది. రాష్ట్ర విభజన జరిగే సందర్భంలో అవశేష ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని, ప్రత్యేక ప్యాకేజీలో నిర్దిష్ట కేటాయింపులు చేస్తామని కేంద్ర, రాష్ట్ర పాలకులు నమ్మబలికారు. మూడు సంవత్సరాలు గడిచిపోయినా ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉంది. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి జస్టిస్‌ శ్రీకృష్ణ కమిషన్‌ వేసిన అంచనాలను మించిన మరింత దుర్భర స్థితి ఈ మూడు సంవత్సరాలలో ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి కూలంకషంగా చర్చించుకోవడం, ఉత్తరాంధ్ర ఏమి కోరుకుంటున్నదో ప్రజా ఆకాంక్షలన్నిటినీ సవివరంగా ముందుకు తేవడం, అన్ని వేదికల మీద, అన్ని రూపాలలో ఉత్తరాంధ్ర ప్రాంతీయ ప్రజా ఆకాంక్షలకు సముచిత స్థానం ఇచ్చి, ఆ ఆకాంక్షలు నెరవేరే దిశగా అన్నిరకాల భావ ప్రచార, ఉద్యమ నిర్మాణ, సంఘీభావ సమీకరణ ప్రయత్నాలకూ పూనుకోవడం ఈ ప్రాంతపు రాజకీయ నాయకుల, విద్యావంతుల, యువజనుల, విద్యార్థుల, ప్రజలందరి బాధ్యత. ఈ బాధ్యత ఎంత బృహత్తరమైనదో గుర్తించడానికి ఈ ప్రాంత ప్రజా సమస్యలను, ఆకాంక్షలను సింహావలోకనం చేద్దాం. విస్తారమైన సహజవనరుల, మౌలిక సౌకర్యాల లభ్యతలో ఉత్తరాంధ్ర ప్రపంచంలోనే అరుదైన ప్రాంతాలలో ఒకటి. నదులు, అడవులు, సముద్ర తీరం, ఖనిజ సంపద, జాతీయ రైలు, రహదారి మార్గాలు, ఓడరేవు, విమానాశ్రయం, అపారమైన మానవ శ్రమశక్తి, అన్నిటికన్ని వనరులూ పుష్కలంగా ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు ప్రాంతాలను చూసినా ఈ వనరులన్నీ ఉన్న ఏకైక సంపన్న ప్రాంతం ఉత్తరాంధ్రే. కానీ ఈ వనరుల్లో ఏ ఒక్కటీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి, ఉత్తరాంధ్ర బిడ్డల మెరుగైన జీవనానికి సంపూర్ణంగా ఉపయోగపడడం లేదు. ఇక్కడి వనరులను ఉపయోగించి ఇక్కడి ప్రజల, ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేసే రాజకీయ, ఆర్థిక, పాలనా విధానాలు లేవు. ఈ వనరులన్నీ బిడ్డకు దక్కని తల్లి స్తన్యంలా ఇతర ప్రాంతాల వారు కొల్లగొట్టుకుపోతుంటే అరికట్టే పాలక విధానాలు లేవు. కనుక ‘మా వనరులను మా అభివృద్ధికే వెచ్చించాలి’, ‘మా వనరులు కొల్లగొట్టడానికి ఇతరులకు హక్కు లేదు’ అని ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజానీకం తమ ఆకాంక్షను ఎలుగెత్తవలసిన అవసరం వచ్చింది. అన్నిటికన్నా ప్రధానమైన ఉత్తరాంధ్ర ఆకాంక్ష జల వనరుల గురించినది. బాహుదా, మహేంద్ర తనయ, వంశధార, నాగావళి, పెద్ద గెడ్డ, కందివలస గెడ్డ, చంపావతి, జంఝావతి, సీలేరు, శబరి, గోస్తని, నర్వ గెడ్డ, శారద, వరాహ, తాండవ వంటి జీవ నదులకూ నిత్యం ప్రవహించే సెలయేళ్లకూ ఆలవాలమైన, రాష్ట్రం మొత్తంలోకి అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఉత్తరాంధ్రలో వ్యవసాయానికి నీటి పారుదల సౌకర్యాలు కనీస స్థాయిలో కూడా లేవు. ఈ నదులలో సెలయేళ్లలో ప్రవహించే జలాలను సక్రమంగా వినియోగిస్తే ఉత్తరాంధ్రలో సాగుకు లాయకైన భూమి ప్రతి ఎకరానికీ నీటి పారుదల సౌకర్యం కలిగించవచ్చు. ఉత్తరాంధ్రను వ్యవసాయోత్పత్తులలో అన్నపూర్ణగా మార్చవచ్చు. దాదాపు యాభై ఎనిమిది లక్షల ఎకరాల ఉత్తరాంధ్ర విస్తీర్ణంలో ఇరవై నాలుగు లక్షల ఎకరాలు సాగుకు అనుకూలం కాగా, ప్రస్తుతం అందులో ఎనిమిది లక్షల ఎకరాలకు కూడా కాలువల కింద సాగునీటి పారుదల సౌకర్యం లేదు. ఎప్పటినుంచో ఉత్తరాంధ్ర ప్రజలకు పాలకులు ఆశచూపుతున్న ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను తక్షణమే ప్రారంభించి, నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుతున్నారు. ఉత్తరాంధ్రలోని పంట భూములన్నిటికీ సాగునీరు, అన్ని పట్టణాలకూ, గ్రామాలకూ తాగునీరు అందించడం తక్షణ కార్యక్రమంగా ప్రభుత్వం చేపట్టాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుతున్నారు. సాగునీటికీ తాగునీటికీ ఉద్దేశించిన పథకాలను పరిశ్రమలకు, ఇతర అవసరాలకు ఎట్టి పరిస్థితులలోనూ మళ్లించగూడదని కూడా కోరుతున్నారు. ఉత్తరాంధ్రలో ప్రవహించే నదుల్లో ఎక్కువభాగం ఒరిస్సాలో పుట్టిన అంతర్రాష్ట్ర నదులు గనుక ఆ రాష్ట్రంతో చర్చలకు, సామరస్య పూర్వకమైన పరిష్కారానికి ప్రయత్నించి, ఉత్తరాంధ్ర ప్రజల హక్కులను పరిరక్షించాలి. ఈ జలవనరుల సమస్యను సక్రమంగా పరిష్కరిస్తే ఉత్తరాంధ్రలో వ్యవసాయాభివృద్ధికి మార్గం సుగమమవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సాగుతున్న వలసలకు అడ్డుకట్ట పడుతుంది. పొట్టచేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి ఇక్కట్లు అనుభవిస్తున్న ఉత్తరాంధ్ర బిడ్డలు తమ గ్రామాలకు తిరిగివచ్చి గౌరవప్రదమైన జీవనం గడపడానికి వీలు కలుగుతుంది. వ్యవసాయాభివృద్ధి పెరిగితే వ్యవసాయాధార పరిశ్రమల స్థాపనకు, ఉపాధికీ, ప్రాంత అభివృద్ధికీ కూడా అవకాశాలు మెరుగవుతాయి. వ్యవసాయాధార పరిశ్రమలు, ఆహార, పండ్ల ప్రాసెసింగ్‌ పరిశ్రమలు, జీడిపప్పు పరిశ్రమలు ఇతోధికంగా స్థాపించి, ఆ పరిశ్రమలలోను, అనుబంధ పరిశ్రమలలోను ఉపాధి కల్పించడానికీ, ప్రాంత ఆదాయం పెంచడానికీ ఎన్నో అవకాశాలున్నాయి. అటువంటి పరిశ్రమలకు ఉదాహరణప్రాయమైన పరిశ్రమలను, ప్రోత్సాహక కేంద్రాలను, నైపుణ్య బదిలీ కేంద్రాలను ప్రభుత్వమే స్థాపించి ఇటువంటి పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేయవచ్చు. అలాగే ఉత్తరాంధ్రలో ఉన్న అటవీ వనరులతో, ఖనిజ వనరులతో కాగితం, ఖనిజాధార తయారీ పరిశ్రమలు, రసాయన పరిశ్రమలు, ఇటుకలు, పెంకులు, వస్త్ర పరిశ్రమలు వంటి ఎన్నో భారీ, మధ్యతరహా పరిశ్రమలను ఏర్పరచడం ద్వారా, ప్రోత్సహించడం ద్వారా ప్రస్తుతం ఉత్తరాంధ్రలో నెలకొని ఉన్న తీవ్రమైన నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నించవచ్చు. విశాఖపట్నంలో రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడానికి, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీతో సహా ఇతర సేవారంగ సంస్థలు నెలకొల్పడానికి ప్రభుత్వం ప్రయత్నించవచ్చు. ఇప్పటికి జరిగిన పారిశ్రామికాభివృద్ధిలో, ఉద్యోగకల్పనలో ఉత్తరాంధ్ర స్థానిక ప్రజానీకానికి దక్కిన భాగమెంతో, ఉత్తరాంధ్ర స్థానికుల నిరుద్యోగాన్ని తగ్గించడానికి ఏ చర్యలు తీసుకున్నారో అంచనా కట్టవలసే ఉంది. ఆ అసమానతలను తగ్గించడానికి కృషి చేయవలసే ఉంది. ఉత్తరాంధ్రలో గణనీయమైన సంఖ్యలో ఆదివాసీ జనాభా ఉంది. మూడు జిల్లాలలోను ఆదివాసీ ప్రాంతాలున్నాయి. ఆదివాసుల అభివృద్ధి కోసం 2012లో విడుదల అయిన అరకు డిక్లరేషన్‌ ఆదివాసీ ప్రాంతాలలో అమలు చేయవలసిన అభివృద్ధి పథకాల గురించి, విధానాల గురించి వివరమైన సూచనలు చేసింది. ఆ సూచనలు ఇంతవరకూ అమలులోకి రాలేదు. ఆదివాసీ ప్రాంతాల ప్రత్యేక అస్తిత్వాన్ని పరిరక్షించే చర్యలు చేపట్టడం, 1/70 చట్టాన్ని ఉల్లంఘిస్తూ అన్యాక్రాంతమైన ఆదివాసీ భూములను తిరిగి ఆదివాసులకు అప్పగించడం, రాజ్యాంగం 73, 74 సవరణల ప్రకారం, పంచాయతీ రాజ్‌ ఎక్స్‌టెన్షన్‌ టు షెడ్యూల్డ్‌ ఏరియాస్‌ చట్టం ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో పంచాయతీ పాలనను ప్రవేశపెట్టడం, గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం, బాక్సైట్‌ తవ్వకాలను ఆపివేయడం వంటి ఎన్నో డిమాండ్లను ఆదివాసులు ముందుకు తెస్తున్నారు. ఈ ఆదివాసీ ఆకాంక్షలన్నీ కూడా ఉత్తరాంధ్ర ప్రజా ఆకాంక్షలలో భాగమే. ఉత్తరాంధ్రలో మరొక పెద్ద ప్రజా సమూహం సముద్రం మీద ఆధారపడిన మత్స్యకారులు, ఇతరవర్గాలు. ఉత్తరాంధ్రకు ఉన్న 340 కిమీ సముద్రతీరాన్ని సముద్రం మీద ఆధారపడిన ప్రజల అభివృద్ధికి ఉపయోగించాలి. సముద్ర తీరంపై మత్స్యకారులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించాలి. ఫిష్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలను, కోల్డ్‌ స్టోరేజీలను స్థాపించి మత్స్యకారులకు, ఇతర నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి. కేవలం పాలకుల నిర్లక్ష్యం వల్ల విద్యారంగంలో ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉంది. రాష్ట్రంలోని 13 జిల్లాలలో అక్షరాస్యతలో విజయనగరం 13వ స్థానంలో, శ్రీకాకుళం 11వ స్థానంలో, విశాఖపట్నం 8వ స్థానంలో ఉన్నాయంటే ఈ మూడు జిల్లాల పట్ల పాలకుల నిర్లక్ష్యం అర్థమవుతుంది. పందొమ్మిదో శతాబ్ది చివరికే విద్యల నగరంగా ఉండిన విజయనగరం ఇరవయ్యొకటో శతాబ్దిలో అక్షరాస్యతలో చిట్టచివరికి చేరడం, దాన్ని సవరించడానికి పాలకులు ఎంతమాత్రం ప్రయత్నించకపోవడం, తగిన నిధులు కేటాయించి విద్యా సౌకర్యాలు కలిగించకపోవడం కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యారంగంలోనూ, కళాశాల, విశ్వవిద్యాలయాల ఉన్నత విద్యారంగంలోనూ పాలకుల ఈ నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. ప్రాథమిక ఆరోగ్యం, పర్యాటక రంగం, విద్యుచ్ఛక్తి, రవాణా, ప్రభుత్వరంగ పరిశ్రమలు, వలసలు, పాలన, స్థానిక స్వపరిపాలనా సంస్థలు, పారిశుధ్యం, పర్యావరణం వంటి ఏ రంగాన్ని తీసుకుని పరిశీలించినా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం స్పష్టంగా కనబడుతుంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెలుగులు నింపే, ఉత్తరాంధ్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలు కావాలంటే, ప్రభుత్వం వైపు నుంచి ప్రత్యేకించి అదే లక్ష్యంగా గల ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి ఏర్పాటు కావాలి. ఈ మండలిలో చిత్తశుద్ధి గల అధికారులను నియమించాలి. ఉత్తరాంధ్ర ప్రజల, రాజకీయ పక్షాల, ప్రజాసంఘాల ప్రతినిధులను ఈ మండలిలో భాగం చేయాలి. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014, సెక్షన్‌ 46(3)లో నిర్దేశించినట్టుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలి. ఆ ఆర్థిక ప్యాకేజీ, ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌లో కనీసం 15 శాతం (విస్తీర్ణాన్ని బట్టి) నుంచి 20 శాతం (జనాభాను బట్టి) ఉండాలి. అంటే రూ. 1.57 లక్షల కోట్ల 2017–18 ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ ప్రకారం ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ రూ. 22,000 కోట్ల నుంచి రూ. 30,000 కోట్లు ఉండాలి. ప్రజల వైపు నుంచి ఉత్తరాంధ్ర ఆకాంక్షల గురించి నిరంతర చర్చ, ఎప్పటికప్పుడు పాలకుల దృష్టికి తీసుకుపోవడం, ప్రచారం, ఆందోళన కార్యక్రమాలు కొనసాగాలి. ఇవీ ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు : ఉత్తరాంధ్ర, రాయలసీమకు బుందేల్‌ఖండ్‌, బోలంగీర్‌ - కలహండి – కోరాపుట్‌ తరహా ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి; ఉత్తరాంధ్రకు ప్రత్యేకంగా అభివృద్ధి మండలిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి; ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం పన్నుల రాయితీలతో కూడిన ప్రత్యేక హోదాను ప్రకటించాలి; ఉత్తరాంధ్రలోని 24 లక్షల ఎకరాలకు కనీసం ఒక పంటకైనా సాగునీరు సదుపాయం కల్పించాలి; ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలి; గోదావరి జలాల్లో ఉత్తరాంధ్రకు న్యాయమైన నీటి వాటాను కేటాయించాలి; గోదావరితో ఉత్తరాంధ్రలోని నదులను అనుసంధానం చేయాలి; విశాఖపట్నంలో రైల్వే జోన్‌ను వెంటనే ప్రకటించాలి; గిరిజన విశ్వవిద్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి; విమ్స్‌ ఆసుపత్రిని మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలి; ఉత్తరాంధ్ర మరో భోపాల్‌గా మారకుండా పర్యావరణాన్ని రక్షించాలి.కొణతాల రామకృష్ణమాజీ మంత్రిkonathalark09@gmail.com
editorial
12,896
30-10-2017 01:57:19
మోనాలిసా నవ్వు వెనక....
న్యూఢిల్లీ, అక్టోబరు 28: ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన పెయింటింగ్‌లు ఉన్నా.. వాటిలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోయేది.. మోనాలిసా చిత్రమే..! లియోనార్డో డావిన్సీ కుంచె నుంచి జాలువారిన ఈ చిత్రం... చరిత్రలో ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. అయితే ఈ మోనాలిసా నవ్వు వెనక పెద్ద చరిత్రే ఉంది. అందమైన చిరునవ్వు కోసం డావిన్సీ ఎంత కష్టపడ్డారో వాల్టర్‌ ఇసాక్సన్‌ అనే ర చయిత ‘‘లియోనార్డో డావిన్సీ: ఏ బయోగ్రఫీ’’ అనే పుస్తకంలో వివరించారు. ‘‘మోనాలిసా నవ్వును గీసేందుకు డావిన్సీ నిద్రాహారాలు మానేసి.. శాంటా మారియా నోవా ఆస్పత్రిలో గడిపేవాడు. మార్చురీలో ఉన్న శవాలను అనుక్షణం పరిశీలిస్తూ ఉండేవాడు. ముఖాలపై చర్మాలను వలిచేసి... కండరాలు, నరాలపై అధ్యయనం చేసేవాడు. అసలు నవ్వు ఎలా పుడుతుంది.? అందమైన నవ్వు కనిపించాలంటే ముఖంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి? అనే అంశాలపై రాత్రింబవళ్లు విశ్లేషించేవాడు. కింది పెదవి కండరమే... రెండు పెదవుల కదలికలను నియంత్రిస్తుందని కొనుగొన్నాడు. ఎన్నో రకాల పెదవుల రూపాలను గీశాడు. ఇలా ఎన్నో పరిశోధనలు, విశ్లేషణల అనంతరం మోనాలిసా అందమైన చిరునవ్వును డావిన్సీఆవిష్కరించాడు.’’ అని వాల్టర్‌ ఇసాక్సన్‌ తన పుస్తకంలో పేర్కొన్నారు.
nation
17,272
05-02-2017 17:36:23
ఎయిమ్స్ ఆసుపత్రిలో.. నర్సుల నిరసన
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో నర్సులు నిరసన తెలిపారు. బాధిత వైద్యుల్ని తొలగించకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. రజ్బిర్ కౌర్ అనే నర్సు జనవరి 16న డెలివరీ కోసం ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యింది. కాన్పులో బిడ్డ మృతి చెందగా నాటి నుంచి తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆమె శనివారం రాత్రి చనిపోయింది. అయితే నర్సు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ సుమారు 500 మంది నర్సులు ఆదివారం ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. తోటి నర్సు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించిన డాక్టర్లను తొలగించకపోతే ఆందోళన ఉధృతం చే‌స్తామని హెచ్చరించారు.
nation
20,121
21-12-2017 01:30:28
షారుక్‌ను వెనక్కు నెట్టిన విరాట్‌
విలువైన సెలెబ్రిటీ బ్రాండ్‌గా అగ్రస్థానంసింధుకు 15వ స్థానంముంబై: సెంచరీలపై సెంచరీలు కొడుతూ క్రికెట్‌ రికార్డు లు తిరగరాస్తున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అటు బ్రాండ్‌ విలువలోనూ దూసుకుపోతున్నాడు. దేశంలో అత్యంత విలువైన సెలెబ్రిటీ బ్రాండ్‌గా విరాట్‌ అగ్రస్థానంలో నిలిచాడు. ఈక్రమంలో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ఖాన్‌ను అతను వెనక్కునెట్టడం విశేషం. కోహ్లీ బ్రాండ్‌ విలువ రూ.921 కోట్లకుపైగానే. గత ఏడాదితో పోలిస్తే అతడి బ్రాండ్‌ విలువ ఏకంగా 56శాతం పెరగడం గమనార్హం. ఎండార్స్‌మెంట్లకు తీసుకొనే మొత్తాలు పెరగడంతో పాటు మైదానంలో అద్భుత ప్రదర్శన, జనాదరణ సూచీ పెరిగిపోవడం.. విరాట్‌ బ్రాండ్‌ విలువ హెచ్చేందుకు కారణమైందని డఫ్‌, పెల్ప్స్‌ ‘రైజ్‌ ఆఫ్‌ ది మిలీనియల్స్‌’ నివేదిక వెల్లడించింది. గత అక్టోబరు నాటికి కోహ్లీ 20 బ్రాండ్లకు, షారుక్‌ 21 బ్రాండ్లకు ప్రచారకర్తలుగా ఉ న్నారు. ఈ సంస్థ ర్యాంకింగ్స్‌ ఇవ్వడం ప్రారంభించాక షారుక్‌ ఖాన్‌ తొలిసారి అగ్రస్థానం కోల్పోయాడు. రూ.678 కోట్లతో షారుక్‌ రెండో స్థానానికి దిగజారాడు. ఇక తొలి 15 మంది మహిళా సెలెబ్రిటీలలో స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు మొదటిసారి చోటు దక్కించుకుంది. దాదాపు రూ.96 కోట్ల బ్రాండ్‌ విలువతో ఆమె 15వ స్థానంలో నిలిచింది. పురుషుల టాప్‌-15లో భారత మాజీ కెప్టెన్‌ ధోనీ రూ.134 కోట్ల బ్రాండ్‌ విలువతో 13వ స్థానం చేజిక్కించుకున్నాడు.
sports
10,763
03-04-2017 20:18:16
తనకు అంతగా కలిసిరాని ప్రయోగం మరోసారి చేస్తానంటున్న నిఖిల్
వరుసగా వైవిధ్యమన చిత్రాలతో అలరిస్తున్న నిఖిల్ తాజాగా మరో సినిమాతో ముందుకు రాబోతున్నాడు. ఎప్పుడూ తనకు అచ్చిరని రిమేక్ సినిమాతో మరో సారి ప్రేక్షకులను అలరించాలని ప్రయత్నిస్తున్నాడు. గతంలో బాలీవుడ్ మూవీ ‘ఫస్ గయే రే ఒబామా’ను తెలుగులో శంకరాభరణంగా తెరకెక్కించినప్పటికీ ఊహించ ఫలితం అందుకోలేక పోయింది. అయితే ఇప్పుడు ఓ కన్నడ మూవీని రీమేక్ చేయబోతున్నాడట. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే పై వీడియో క్లిక్ చేయండి.
entertainment
822
27-10-2017 01:55:08
కాగ్నిజెంట్‌ చేతికి జోన్‌
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): యుకెకు చెందిన స్వతంత్ర డిజిటల్‌ సర్వీస్‌ ఏజెన్సీ జోన్‌ను కొనుగోలు చేయనున్నట్లు కాగ్నిజెంట్‌ వెల్లడించింది. అయితే ఎంత మొత్తానికి ఈ సంస్థను కొనుగోలు చేస్తుందనేది మాత్రం వెల్లడించలేదు. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఈ డీల్‌ను ముగించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్లు కాగ్నిజెంట్‌ తెలిపింది. కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌, డిజిటల్‌ స్ట్రాటజీ, టెక్నాలజీ, కంటెంట్‌ క్రియేషన్‌లో జోన్‌ కీలకంగా ఉంది. లండన్‌ కేంద్రగా 2000 సంవత్సరంలో కార్యకలాపాలు ప్రారంభించిన జోన్‌కు అడిడాస్‌, దాయిష్‌ టెలికాం, మెర్సెక్‌, మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్‌, యూనీలీవర్‌, అవివా వంటి కంపెనీలు కస్టమర్లుగా ఉన్నాయి. జోన్‌ కొనుగోలుతో ఎక్స్‌పీరియన్స్‌ డిజైన్‌, హ్యుమన్‌ సైన్స్‌ డ్రివెన్‌ ఇన్‌సైట్స్‌, అనలిటిక్స్‌లో కాగ్నిజెంట్‌ కీలకంగా మారనుంది. అంతేకాకుండా డిజిటల్‌ ఇంటరాక్టివ్‌ సొల్యూషన్స్‌తో యుకె, యూర్‌పలో కాగ్నిజెంట్‌ కార్యకలాపాలు విస్తరించే అవకాశం లభించనుంది. ఈ కొనుగోలుతో జోన్‌కు చెందిన 220 మందికి పైగా ఉద్యోగులు కాగ్నిజెంట్‌ డిజిటల్‌ బిజినెస్‌లోకి చేరిపోనున్నారు.
business
9,960
07-02-2017 13:53:17
యాంకర్ సుమ.. ఇక, సింగర్ సుమ!
బుల్లితెరపై మాటలతో మాయచేసస్తుంది యాంకర్ సుమ. టీవీల్లో యాంకరింగ్ ఒక్కటే కాదు.. పాటల వేడుకలు, ప్రత్యేకమైన కార్యక్రమాలకూ ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తుంటుంది. అయితే.. మాటలే కాదు.. పాటలూ బాగానే పాడుతుందట సుమ. అందుకే తొలిసారిగా సుమ ఓ చిత్రంలో పాట పాడిందట. ఆ సినిమా ఏదో తెలుసా? సాయిధరమ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని తీస్తున్న విన్నర్ సినిమాలో పాడిందట. ఆ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. ఇంతకీ సుమ పాడిన ఆ పాటేంటో తెలుసా? ఆ పాటకు ఎవరు డాన్స్ చేస్తున్నారో తెలుసా? సినిమాలో హాట్ యాంకర్ అనసూయ.. ఓ పాటకు నర్తిస్తోందన్న సంగతిని చిత్ర బృందం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ పాటే ‘సుయ..సుయ...’ అనే పాటట. ఆ పాటను సుమ పాడితే.. అనసూయ నర్తించిందని టాక్. ఇక, ఈ సినిమాలోని పాటలను ఒక్కో స్టార్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సుయ..సుయ పాటను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మంగళవారం విడుదల చేయబోతున్నాడు. మరి, మాటలతో ముంచెత్తే సుమ.. పాటలతోనూ తన టాలెంట్‌ను చూపించనుందన్నమాట.
entertainment
11,207
30-05-2017 13:10:32
పక్కలో బల్లెంపై చైనా అక్కసు!
న్యూఢిల్లీ: అసోం-అరుణాచల్ ప్రదేశ్‌లను కలుపుతూ భారత్ నిర్మించిన అతిపెద్ద నదీవంతెన ధోలా-సదియాపై చైనా అక్కసు వెళ్లగక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించిన కొద్దిరోజులకే డ్రాగన్ తన అసలు రూపం బయటపెట్టుకుంది. ‘‘చైనాతో సరిహద్దు వివాదం పరిష్కారం అయ్యేంత వరకు భారత్ జాగ్రత్తగా ఉండాలి. నిగ్రహం పాటించాలి. ఉమ్మడిగా వివాదాలను నియంత్రించేందుకు, శాంతిని కాపాడేందుకు, సరిహద్దు ప్రాంతంలో ప్రశాంతత నెలకొల్పేందుకు ఇది చాలా అవసరం’’ అంటూ చైనా విదేశాంగ శాఖ చెప్పుకొచ్చింది. బ్రహ్మపుత్ర నదిపై 9.2 కిలోమీటర్ల మేర నిర్మించిన ధోలా సదియా వారథిని గత వారం ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో అసోం- అరుణాచల్ ప్రదేశ్‌ల మధ్య 162 కిలోమీటర్లు దూరం తగ్గడంతో పాటు 5 గంటల ప్రయాణ సమయం తగ్గిపోయింది. అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా పిలుచుకుంటున్న చైనా.. ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలని కుట్రపన్నుతోంది. భారత్ నిర్మించిన నదీవంతెన భద్రతా దళాలకు సైతం ఉపకరించే అవకాశం ఉండడంతో చైనాకి దడ మొదలైనట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
nation
19,793
19-01-2017 17:45:03
ఇంగ్లండ్‌పై టీమిండియా బ్యాటింగ్ రికార్డ్
కటక్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెకండ్ వన్డే మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా విజృంభించింది. యువరాస్ సింగ్, ధోనీల సెంచరీలతో నిర్ణీత 50 ఓవర్లకు 381 పరుగులు చేసింది. అయితే ఈ క్రమంలో భారత జట్టు ఇంగ్లండ్‌పై సరికొత్త బ్యాటింగ్ రికార్డ్ నమోదు చేసింది. అదేమంటే.. ఇంగ్లండ్‌పై వన్డేల్లో ఇప్పటివరకూ నమోదైన అత్యధిక మూడో అత్యధిక స్కోర్ ఇదే. అంతకుముందు 2008లో ఇంగ్లండ్‌పై భారత జట్టు 387/5 చేయగా, 2015లో న్యూజిలాండ్ జట్టు 398/5 స్కోర్ నమోదు చేసింది.
sports
4,644
11-05-2017 19:37:30
మురుగదాస్‌కు అల్టిమేటం జారీ చేసిన ప్రిన్స్
పంక్చువాలిటీ విషయంలో పక్కాగా ఉండే ఆ స్టార్ హీరో... డైనమిక్ డైరెక్టర్‌కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడట. ఇంతకూ ఎవరా హీరో...? ఏమా కథాకమామీషు? మురుగదాస్ దర్శకత్వంలో 'స్పైడర్' సినిమా కోసం తన షెడ్యూల్ నుంచి అనుకున్న దానికన్నా ఎక్కువ డేట్లే కేటాయించిన మహేశ్ బాబు... ఎట్టకేలకు సహనం కోల్పోయాడని తెలుస్తోంది. స్వతహాగా మృదుస్వభావి అయిన ప్రిన్స్... డైరెక్టర్ డిలేకు ఇక తలొగ్గేది లేదని తేల్చేశాడట. ఈమేరకు మురుగదాస్‌కు అల్టిమేటం కూడా జారీచేశాడట. ఇన్నాళ్లూ మురుగదాస్ షూటింగ్‌ను పొడిగిస్తూ పోతున్నా సహకరిస్తూనే వచ్చిన మహేశ్ బాబు... ఇకపై అలా జరగబోదని స్పష్టం చేశాడట. మే 20వ తారీఖుతో తనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తి చేయాల్సిందిగా ఖరాఖండిగా చెప్పేశాడట. వచ్చేనెల కొరటాల చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాల్సి ఉండటంతో ప్రిన్స్ ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. మరోవైపు కొరటాల శివ... ప్రిన్స్‌తో తెరకెక్కించాల్సిన మూవీకి సంబంధించిన ప్రీ- ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేశాడట. ఫైనల్ స్క్రిప్ట్‌ను తిరుమల వేంకటేశ్వర స్వామి వారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజ కూడా చేయించాడట. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా ఇదే తరహాలో ఫైనల్ స్క్రిప్ట్ కు పూజలు నిర్వహిస్తుంటారు. అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న కొరటాల సైతం... 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్' చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నాడు. మరి.. వెంకన్న సెంటిమెంట్ ప్రిన్స్ తాజా మూవీకీ కలసి వస్తుందేమో చూడాలి.
entertainment
7,366
06-12-2017 11:39:35
తల్లి మరణం తరువాతే నాకు తెలిసొచ్చింది: ప్రముఖ నటి
మామూలుగా హీరోయిన్లకు తల్లులే అన్నీ అయి చూసుకుంటూ ఉంటారు. తండ్రి లేదా సోదరుల పాత్ర తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆనవాయితి ఇప్పటిది కాదు. కొన్ని దశాబ్దాలుగా వస్తున్నదే! ఇప్పుడు ఇదంతా ఎందుకు? అనే అనుమానం వస్తోంది కదూ! ఒకప్పటి హీరోయిన్‌ గౌతమి ఇటీవల తన వ్యక్తిగత విషయాలను మనసు విప్పి చెప్పారు. తన తల్లి జీవించి ఉన్నంత కాలం తనకు ఏమీ తెలియలేదట! ఆవిడ మరణించిన తరువాతే లోకం అంటే ఏమిటో తెలిసిందట! తల్లి మరణం తరువాత సరైన గైడెన్స్‌ లేక తను చాలా కోల్పోయిందట! తను పోగొట్టుకున్నది తెలుసుకునేసరికి సమయం మించిపోయిందని చెప్పుకొచ్చింది. ఇంతలా మనసు విప్పిన గౌతమి ఏం పోగొట్టుకుంది? అనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. దాంతో అందరూ తమకు తోచిన రీతిలో ఊహాగానాలు చేసేస్తున్నారు.
entertainment
12,334
02-03-2017 11:05:40
జవాను కుటుంబానికి రూ.10 లక్షల సాయం
తిరువనంతపురం: కాశ్మీర్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన సైనికుడు ఎం.జే.శ్రీజిత్ కుటుంబానికి ఆర్థిక సాయం పొడిగించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం పినరయి విజయన్ నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక సాయంతో పాటు దివంగత జవాను సోదరి శ్రీజకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని తీర్మానించారు. ఫిబ్రవరి 23న కాశ్మీర్‌లోని సోపియనాన్ జిల్లాలో ఆర్మీ కాన్వాయ్‌పై అర్థరాత్రి పూట ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో ముగ్గురు సైనికులు సహా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు జవానులు తీవ్రంగా గాయపడ్డారు.
nation
19,720
12-11-2017 00:49:59
చైనా ఓపెన్‌కు శ్రీకాంత్‌ దూరం
న్యూఢిల్లీ: స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌కు దూరం కానున్నాడు. కాలి గాయం కారణంగా వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి రావ డంతో ఈనెల 14 నుంచి 19 వరకు జరిగే ఈ సూపర్‌ సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల ముగిసిన సీనియర్‌ జాతీయ బ్యాడ్మింటన్‌ చాంపియ న్‌షిప్‌ సందర్భంగా అతను గాయపడ్డాడు. ‘చైనా ఓపెన్‌ నుంచి తప్పుకొంటున్నాను. కండరాల నొప్పి అధికంగా ఉంది. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యు లు సూచించారు. జాతీయ చాంపియన్‌షిప్‌లో గాయమైనా అలాగే ఆడడంతో కాస్త ఎక్కు వైంది. అయితే వారం రోజుల తర్వాత అంతా సర్దుకుంటుంది’ అని శ్రీకాంత్‌ తెలిపాడు. అయితే ప్రస్తుతం ప్రపంచ రెండో ర్యాంకర్‌గా ఉన్న శ్రీకాంత్‌ అగ్రస్థానం చేరుకోవాలంటే ఇక హాంకాంగ్‌ సూపర్‌ సిరీస్‌ వరకు ఆగాల్సి ఉంది.
sports
8,779
20-05-2017 10:52:29
ఉన్న విషయం చెబితే రెజీనాకు పొగరంటారు: రెజీనా
‌‘అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని’ అన్న చందంగా, అందం చందం ఉన్న రెజీనాకు ఆవగింజంత అదృష్టం లేకపోవడంతో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్టు ఉండిపోయింది. ‌ఫ్లాపుల కన్నా సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్నా స్టార్‌ హీరోలతో చేసే ఛాన్స్‌ మాత్రం అందుకోలేకపోయింది. అవడానికి తమిళ అమ్మాయే అయినా ఇంత వరకూ తమిళ తంబిల మనసు దోచుకోలేకపోయింది. చిట్టచివరకు తన మాతృభాషలో బిజీ అవుతున్న రెజీనాతో.... కోలీవుడ్‌లో బాగా బిజీ అయినట్టున్నారు?ఇక్కడ ఎప్పుడో బిజీ కావలసింది. భగవంతుడు నా కెరీర్‌ను మరోలా డిసైడ్‌ చేశాడు. అందుకే ఇక్కడ రావలసినంత పేరు రాలేదు. తమిళ అమ్మాయినే అయినా తమిళ సినిమాలు చేయడం లేదన్న బాధ ఎక్కడో ఓ మూల ఉండేది. ఇప్పుడు అది తీరిపోయింది. ప్రస్తుతం తమిళంలో వరుసగా ఐదు సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు చేస్తున్నవన్నీ నాకు పేరు తీసుకొచ్చేవే! త్వరలోనే కోలీవుడ్‌లో మంచి స్థాయికి చేరుకుంటానన్న నమ్మకం నాకుంది.  బాలీవుడ్‌ సినిమా ఆగిపోయిందట కదా?ఆగిపోలేదు. కొంత కాలం వాయిదా పడింది అంతే! తిరిగి షూటింగ్‌ మొదలవుతుంది. ఈ గ్యాప్‌లో దక్షిణాది సినిమాలు పూర్తి చేయాలని అనుకుంటున్నాను. బాలీవుడ్‌లో మరో సినిమా అంగీకరించారా?లేదు. ఒకరిద్దరు అడిగారు. కానీ ‘ఆంఖే 2’ తరువాత వారికి ఓకే చెబుదామనుకున్నాను. ఈ లోపలే షూటింగ్‌ వాయిదా పడడంతో ఇక వాటి గురించి ఆలోచించలేదు. ప్రస్తుతం తమిళంలో ఐదు, తెలుగులో ఒక సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నాను. ఇవి అయిపోయాగానే బాలీవుడ్‌ సంగతి ఆలోచిస్తాను. చిన్న హీరోలతో తప్ప పెద్ద హీరోలతో చేయకపోవడానికి కారణం?సినిమా ఒప్పుకునే ముందు కథ ఏమిటి‌? అందులో నా పాత్ర ఏమిటి? అని చూస్తాను తప్ప చిన్న హీరోనా? పెద్ద హీరోనా? బ్యానర్‌ ఎలాంటిది లాంటి విషయం పట్టించుకోను. నా సినిమాలు పరిశీలిస్తే ఇది అర్ధమవుతుంది. సినిమాల ఎంపికలో నా జడ్జిమెంట్‌ చాలా వరకూ కరెక్ట్‌గానే ఉంటుంది. అందుకే నా మీద ఫ్లాప్‌ హీరోయిన్‌ ముద్ర పడలేదు. ఇక పెద్ద హీరోలతోనే చేస్తేనే గుర్తింపు వస్తుంది అంటే నేను నమ్మను. దక్షి‍ణాదిన నాకు మంచి గుర్తింపే వచ్చింది. మంచి కథతో వస్తే ఎవరితో చేయడానికి అయినా నేను రెడీ! కృష్ణవంశీ మిమ్మల్ని రమ్యకృష్ణతో పోల్చడం సరైనదే అంటారా?ఆయన గొప్ప దర్శకులు. ఆయన అలా అన్నారంటే అది నా పట్ల ఆయనకున్న అభిమానమే. ఆయన మాటలు తప్పా, రైటా అని చెప్పడానికి నా స్థాయి సరిపోదు. రమ్యకృష్ణగారు గొప్ప నటి. ఆవిడ ఎక్కడ? నేను ఎక్కడ? నా మటుకు నేను ఆవిడతో పోల్చుకోలేను. ‘నక్షత్రం’ సినిమా నాకు మంచి గుర్తింపు తీసుకొస్తుందన్న నమ్మకం నాకుంది.  సినిమా ప్రమోషన్లకు రారని అంటారు. ఈ విషయంలో నయనతారను ఆదర్శంగా తీసుకున్నారా?ఎవరినీ ఆదర్శంగా తీసుకోవలసిన అవసరం లేదు. నాకు షూటింగ్‌ లేకపోతే కచ్చితంగా సినిమా ప్రమోషన్లకు వస్తాను. షూటింగ్‌ ఉన్నప్పుడు రమ్మంటే ఎలా రాగలను? అదే విషయం చెబితే రెజీనాకు పొగరు. ప్రమోషన్లకు రమ్మంటే రాదు అంటారు. అసలు నేను చేసిన సినిమాల ప్రమోషన్లకు దాదాపు అన్నిటికీ నేను అటెండ్‌ అవుతూనే ఉంటాను. ఎప్పుడన్నా ఒక్క సినిమాకు వెళ్ళకపోయేసరికి ఇలాంటి మాటలు అనేస్తారు. ఎలాంటి పాత్రలంటే ఇష్టం?ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాత్రలు చేయాలంటే ఇష్టం. నా అదృ‍ష్టం కొద్దీ నేను ఈ రంగంలోకి వచ్చినప్పటి నుంచి అలాంటి పాత్రలే నాకు వస్తున్నాయి. కొన్నిసార్లు కాంప్రమైజ్‌ కావలసి వస్తుంది. కానీ నా విషయంలో ఇప్పటి వరకూ అలా జరగలేదు. రానాతో నటించబోతున్నారట‍ కదా?‍ఆ ఛాన్స్‌ వస్తే ఎందుకు వదులుకుంటాను?
entertainment
9,929
30-05-2017 01:46:53
ఫాల్కే అకాడమీ అవార్డ్‌
‘అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్న నటి’గాప్రియాంకకు దాదాసాహెబ్‌ ఫాల్కే అకాడమీ అవార్డ్‌ వరించింది. దాదాసాహెబ్‌ ఫాల్కే అకాడమీ అండ్‌ అవార్డ్‌ కమిటీ ఛైర్మన్ గణేశ్ జైన్ ఈ విషయం ప్రకటిస్తూ ‘‘అంతర్జాతీయ వేదికపై తనకంటూ ఓ స్థానం సంపాదించుకుందంటే అందుకు ప్రియాంక చేసిన కృషి, ప్రయత్నాలే కారణం.గ్లోబల్‌ లెవల్‌లో భారత్ కు ఆమె ప్రాతినిథ్యం వహిస్తోంది. ఆమె సంపాదించుకున్న పేరు చూసి ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు. అందుకే ఈ సారి కొత్తగా ‘అంతర్జాతీయంగా పేరుపొందిన నటి’ విభాగాన్ని పరిచయం చేస్తున్నాం’’ అని చెప్పారు. జూన్ 1న ముంబైలో జరిపే వేడుకలో ప్రియాంకకు పురస్కారాన్ని అందించనున్నారు.
entertainment
16,074
27-05-2017 00:58:32
కొత్తగాలి వీస్తోంది!
దేశం మార్పును చవి చూస్తోంది.. పని సంస్కృతిలో మార్పు తీసుకొచ్చాంనల్లధనంపై వెనక్కి తగ్గం.. నేను తీసుకున్న కఠిన నిర్ణయం నోట్ల రద్దుసమస్యలు వస్తాయని తెలుసు.. ప్రజలను రెచ్చగొట్టాలని విపక్షాలు చూశాయిఅయినా జనం అండ మాకే.. ప్రధాని మోదీ ‘మూడేళ్ల’ విజయోత్సవ సందేశంన్యూఢిల్లీ, మే 26: అవినీతిపరుల నుంచి రాబట్టే నల్లధనాన్ని దేశంలోని పేదలకు పంచుతానని ప్రధాని నరేంద్ర మోదీ సూచనప్రాయంగా చెప్పారు. ‘‘నేనేం హామీ ఇచ్చానో, దానిపై వెనక్కి తగ్గేది లేదు’’ అని విజయవంతంగా మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం అసోంలోని గువాహటిలో జరిగిన విజయోత్సవ సభలో ప్రసంగించారు. ‘‘నేను కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, నేను ప్రజలకీ హామీ ఇచ్చాను కాబట్టి వెనుకాడను’’ అని స్పష్టీకరించారు. దేశంలో నిజాయితీ పరులు సంతోషంగా ఉన్నారని, వారంతా ప్రభుత్వంపై విశ్వాసాన్ని కలిగి ఉన్నారని చెప్పారు. కేంద్ర కేబినెట్‌ తొలి సమావేశంలోనే నల్లధనంపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని చెప్పారు.  ‘‘ఈ మూడేళ్ల నేను తీసుకున్న అతి కఠినమైన నిర్ణయం... పెద్దనోట్ల రద్దు. దీనిని ప్రజలకు వ్యతిరేకంగా మార్చాలని విపక్షాలు పట్టు వదలకుండా ప్రయత్నించాయి. ప్రజలను రెచ్చగొట్టాలని చూశాయి. కానీ... జనం మాత్రం మా నిర్ణయాన్నే సమర్థించారు’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ‘‘పెద్దనోట్ల రద్దుతో 90 లక్షల మంది కొత్తగా పన్ను పరిధిలోకి వచ్చారు. మాకు అండగా నిలిచిన 125 కోట్ల మంది ప్రజలకు ధన్యవాదాలు’’ అని ప్రధాని పేర్కొన్నారు. 1988లోనే పార్లమెంటు ఆమోదించినప్పటికీ... బినామీ ఆస్తుల నియంత్రణ చట్టాన్ని నోటిఫై చేయకపోవడంపై గత ప్రభుత్వాలకు చురకలు అంటించారు. ‘ఇదేం పరిపాలన!’ అని నిరసించారు. ‘‘ఒకప్పుడు ఎక్కడ చూసినా నల్లధనమే. ఇప్పుడు ప్రతి చోటా జన్‌ధన్‌ కనిపిస్తోం ది. ఇకపై ఇది డిజీ ధన్‌గా మారాలి’’ అని ఆకాంక్షించారు. ఎన్నెన్నో విజయాలు...ఓబీసీ కమిషన్‌ ఏర్పాటు, స్వచ్ఛ భారత, ఎల్‌పీజీ సబ్సిడీ వదులుకోవడం, సామాన్యులకు ఎల్‌ఈడీ బల్బులు, పల్లెలకు ఇంటర్నెట్‌, పోస్టాఫీసులను బ్యాంకులుగా మార్చడం, సాగునీరు తదితర రంగాల్లో ఎన్నో విజయాలు సాధించామని ప్రధాని తెలిపారు. గతంలో ప్రజల ఆకాంక్షలకు, ప్రభుత్వ పనులు జరుగుతున్న తీరుకు ఎక్కడా పొంతన ఉండేది కాదన్నారు. తాము కొత్త ఆలోచనలతో, వినూత్నంగా విధానాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ‘‘ప్రతి రోజూ ఒక కొత్త అడుగు వేస్తున్నాం. గత మూడేళ్లలో ఇలా ఒక్క అడుగైనా ముందుకు వేయని రోజు ఒక్కటంటే ఒక్కటీ లేదు. పని సంస్కృతిలో మార్పు తెచ్చాం. దేశమంతా ఈ మార్పును ఆస్వాదిస్తోంది. సరికొత్త, నవీన భారతాన్ని నిర్మించడమే మా లక్ష్యం. ఈ నవ భారతంలో అందరికీ సమాన గౌరవం లభిస్తుంది. ఎవ్వరిపైనా వివక్ష ఉండదు’’ అని ప్రధాని పేర్కొన్నారు. జీవితాలను మార్చేశాం...అంతకుముందు... ట్విట్టర్‌లోనూ ప్రధాని తన ‘మూడేళ్ల’ సందేశాన్ని వినిపించారు. తాము తీసుకున్న అనేక నిర్జ్దిష్ట చర్యలతో జన జీవితాలను మార్చేశామని తెలిపారు. ‘సాథ్‌ హై... విశ్వాస్‌ హై... హో రహాహై వికాస్‌’ (జనం తోడున్నారు. జనం నమ్ముతున్నారు. సర్వత్రా అభివృద్ధి జరుగుతోంది) అని నినదించారు. వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని గణాంకాలతో సహా గ్రాఫిక్స్‌ ద్వారా ట్విట్టర్‌ వివరించారు. తమ పరిపాలనపై ప్రజాభిప్రాయాలను కూడా ప్రధాని ఆహ్వానించారు. ‘నరేంద్ర మోదీ యాప్‌’ సర్వేలో పాల్గొనాలని ప్రజలను కోరారు.
nation
8,935
05-02-2017 12:23:05
‘అందరివాడు’ అనిపించుకుంటున్న మెగా హీరో!
చిరు, పవన్ మేనల్లుడు కావడం వల్ల మెగాఫ్యామిలీకి చెందిన హీరోలు సాయిధరమ్ మూవీకి సపోర్ట్ చేయడం కామన్. అయితే ఎన్టీఆర్, మహేశ్ వంటి ఇతర స్టార్ హీరోలు సైతం ఈ యువహీరో మూవీస్ ను ప్రమోట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.  సాయిధరమ్ తేజ్ రాబోయే చిత్రం ‘విన్నర్’.... గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ నెల మూడో వారంలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని మొదటి పాటను విడుదల చేశారు. 'సితార' అనే పల్లవితో సాగే పాటను మహేశ్ బాబు ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. మహేశ్ కూతురు పేరు కూడా సితార కావడం విశేషం..!  పోలికల్లోనే కాదు నలుగురినీ కలుపుకు పోవడంలోనూ మేనమామ చిరంజీవిని ఫాలో అవుతున్నాడు సాయిధరమ్ తేజ్. తన తోటి హీరోల ఆడియో ఫంక్షన్స్‌కు అటెండ్ అవుతూ వారందరితో క్లోజ్‌గా మూవ్ అయ్యే సాయిధరమ్.. స్టార్ హీరోల సపోర్టు కూడా అందుకుంటున్నాడు. రీసెంట్‌గా 'జవాన్' మూవీ ఓపెనింగ్‌కు ఎన్టీఆర్ వచ్చి క్లాప్ కొట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక రెండు రోజులు తిరక్కముందే మహేశ్ బాబు చేతులమీదుగా 'విన్నర్' మూవీ తొలిపాట విడుదల కావడం మరీ విశేషం. అందరినీ కలుపుకు పోయే విషయంలో మేనమావ చిరును ఫాలో అవుతున్న తేజ్ ఆయన రేంజ్‌లో సక్సెస్‌లను కూడా అందుకుంటాడేమో చూడాలి..!
entertainment
8,772
23-02-2017 14:18:27
అఖిల్‌- శ్రీయ.. బ్రేకప్‌ ఎక్కడ జరిగింది?
అక్కినేని అఖిల్‌, శ్రీయ భూపాల్‌ల పెళ్లి క్యాన్సిల్‌ అయిందన్న వార్త సంచలనం సృష్టించింది. మీడియాలో ఈ వార్త బుధవారమే వచ్చినప్పటికీ.. వారి మధ్య బ్రేకప్‌ ఎప్పుడో జరిగిపోయిందని సమాచారం. నిజానికి ఈ పెళ్లి నాగార్జునకు మొదట్నుంచీ ఇష్టం లేదట. చిన్న ఏజ్‌ (22 ఏళ్లు)లో, వయసులో పెద్దయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్‌ కాదని అఖిల్‌కు నాగ్‌ ఎంతగానో నచ్చ చెప్పాడట. చైతన్య కూడా వారించాడట. అయినప్పటికీ అఖిల్‌ వినకపోవడంతో సరే చెప్పేసిందట అక్కినేని కుటుంబం.
entertainment
3,190
15-05-2017 00:15:24
హెచ్‌డిఎ్‌ఫసి ఎర్గో ‘గ్రూప్‌ క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ఇన్సూరెన్స్‌’
మొత్తం కుటుంబ సభ్యులు/ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు దోహదపడే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకం ‘గ్రూప్‌ క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ఇన్సూరెన్స్‌’ను హెచ్‌డిఎ్‌ఫసి ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. 3 నెలల నుంచి 65 ఏళ్ల వరకు వయసున్న వారు ఈ పాలసీని తీసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కవరేజ్‌కు అవకాశం ఉంటుంది. మొదటి రోజు నుంచే కవరేజీ పొందవచ్చు. సమ్‌ ఇన్సూరెన్స్‌ ఒక్కొక్కరికి 5,000 రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.
business
16,969
19-12-2017 03:55:20
గ్రీసులో దోషికి 1489 ఏళ్ల జైలు!
మనుషుల అక్రమ రవాణా కేసులో తీర్పుథెస్సాలోనికి(గ్రీస్‌), డిసెంబరు 18: ఏదైనా నేరం చేస్తే భారతదేశంలో ఎంత కాలం శిక్షపడుతుంది? యావజ్జీవమైతే 14 ఏళ్లు జైలు ఊచలు లెక్కపెట్టాలి. జీవితపర్యంతం శిక్ష అయితే బతికినంతకాలం జైలు శిక్ష అనుభవించాలి. గ్రీస్‌లో మనుషులను అక్రమ రవాణా చేసిన కేసులో ఒక వ్యక్తికి ఏకంగా 1,489 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అక్కడి కోర్టు తీర్పు చెప్పింది. టర్కీ సరిహద్దు నుంచి 2015, 2016లో ఇరాకీ, సిరియా శరణార్థులను గ్రీస్‌లోకి అక్రమంగా తరలించిన కేసుల్లో థెస్సాలోనికి నగర కోర్టు శిక్షలు విధించింది. 54 ఏళ్ల గ్రీకు వ్యక్తికి ఇంత భారీ శిక్ష పడింది. ఇతను 500 మందికి పైగా శరణార్థులను అక్రమంగా తరలించాడు. అయితే గ్రీకు చట్టాల ప్రకారం ఒక దోషికి ఒక కేసులో గరిష్ఠంగా 25 ఏళ్ల జైలు విధించే అవకాశం ఉంది.
nation
11,110
04-05-2017 16:39:39
అమర జవాన్ల పిల్లల కోసం.. రాందేవ్ బాబా ప్రత్యేక స్కూలు
న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా, అమర జవాన్ల పిల్లల కోసం ప్రత్యేకంగా ఓ స్కూల్ ఏర్పాటు చేయనున్నారు. పతంజలి బ్రాండ్‌తో ఆయుర్వేద ఉత్పత్తుల వ్యాపారంలో దూసుకుపోతున్న ఆయన సామాజిక బాధ్యతగా దీన్ని చేపడుతున్నారు. అమరులైన సైనికుల పిల్లల కోసం పతంజలి ఆవాసీయ సైనిక్ స్కూల్‌ను ఈ ఏడాదిలో ప్రారంభించనున్నట్లు రాందేవ్ బాబా గురువారం ప్రకటించారు.  ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతంలో నెలకొల్పనున్న ఈ పాఠశాలలో, దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల పిల్లలకు ఉచితంగా విద్యనందించనున్నట్లు ఆయన వెల్లడించారు. పతంజలి ద్వారా వచ్చే లాభాలను చారిటీ ద్వారా నిర్వహించే ఇలాంటి పలు కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు రాందేవ్ బాబా తెలిపారు. మరిన్ని వివరాలకు ఈ వీడియో క్లిక్ చేయండి.
nation
4,844
13-10-2017 12:08:37
శ‌ర‌త్‌బాబు, న‌మిత పెళ్లిచేసుకోబోతున్నారా?
ప్ర‌స్తుతం త‌మిళ సినీ రంగంలో ఓ వార్త హాట్‌హాట్‌గా చ‌క్క‌ర్లు కొడుతోంది. సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్‌బాబు, హాట్ బాంబ్ న‌మిత త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నార‌న్న‌దే ఆ వార్త‌. దాదాపు రెండేళ్ల క్రితం ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శ‌ర‌త్‌బాబు మాట్లాడుతూ.. తాను త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నానని, ఆమె ఓ జ‌ర్న‌లిస్ట్ అని తెలిపారు. అయితే ఆ పెళ్లి గురించి ఇప్ప‌టివ‌ర‌కు మ‌రో వార్త బ‌య‌ట‌కు రాలేదు. తాజాగా శ‌ర‌త్‌బాబు, న‌మిత ఒక్క‌ట‌వబోతున్నారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.సీనియ‌ర్ న‌టి ర‌మాప్ర‌భ‌ను గ‌తంలో శ‌ర‌త్‌బాబు వివాహం చేసుకుని, విడాకులు కూడా తీసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం శ‌ర‌త్‌బాబు వ‌య‌సు 60 ఏళ్లు. వికీపీడియా ప్ర‌కారం న‌మిత వ‌య‌సు 36. అంటే దాదాపు 24 ఏళ్ల వ‌య‌సు తేడా. ప్ర‌స్తుతం వారిద్ద‌రూ స‌హ‌జీవనం చేస్తున్నార‌ని, త్వ‌ర‌లోనే పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప్ర‌చారం ఎంత‌గా జ‌రుగుతున్నా అటు శ‌ర‌త్‌బాబు కానీ, ఇటు న‌మిత కానీ ఖండించ‌లేదు. నిజ‌మ‌ని ధ్రువీక‌రించ‌లేదు. మ‌రి, ఈ వార్త నిజ‌మో, కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
entertainment
16,845
20-10-2017 14:29:50
పండుగపూట దారుణం.. పోలీస్ కానిస్టేబుల్ కాల్చివేత..
న్యూఢిల్లీ: దీపావళి వెలుగులు ఆరిపోక ముందే దుండగులు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు. రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను కాల్చి చంపారు. గురువారం రాత్రి మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతుడిని బాలముకుంద్ ప్రజాపతిగా గుర్తించారు. పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే గుర్తుతెలియని కొందరు వ్యక్తులు కానిస్టేబుల్‌ను హత్యచేయడం స్థానికంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై ఇప్పటికే విచారణ చేపట్టామనీ..... త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
nation
10,089
10-11-2017 11:35:03
భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న జూనియర్ ఎన్టీఆర్ దంపతులు
భద్రాచలం: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సతీసమేతంగా భద్రాచలం రామయ్యను దర్శించుకున్నాడు. అభిమానులు ఎన్టీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. దర్శకుడు కొరటాల శివ కూడా వీరితో పాటు వెళ్లాడు. ఈ సందర్భంగా సీతారాములకు జూనియర్ ఎన్టీఆర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు ఎన్టీఆర్‌కు భద్రాద్రి విశిష్టతను వివరించారు. స్వామి వారి దర్శనం అనంతరం జూనియర్ ఎన్టీఆర్‌కు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. జూనియర్ ఎన్టీఆర్‌ ఆలయంలోకి వెళుతున్న సమయంలో అభిమానులు భారీగా తరలిరావడంతో తోపులాట జరిగింది. ఎన్టీఆర్ తన అభిమానులకు అభివాదం చేస్తూ.. కొందరిని పలకరిస్తూ దర్శనం ముగించుకున్నాడు. రామాయణంలోని పాత్రల పేర్లతో తెరకెక్కిన జైలవకుశ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ భద్రాద్రి రామయ్యను దర్శనానికి వచ్చినట్లు అభిమానులు చెబుతున్నారు. ఫొటోల కోసం క్లిక్ చేయండి ఫొటోల కోసం క్లిక్ చేయండి
entertainment
20,994
18-06-2017 11:03:26
మరికొన్ని గంటల్లో ఫైనల్ ఫైట్.. క్రీడాభిమానులు ఏమంటున్నారో చూడండి.!
నేడే చాంపియన్స్‌ అంతిమ పోరుఅమీతుమీకి సిద్ధమైన భారత్‌-పాక్‌మూడోసారి టైటిల్‌కోసం భారత్‌ తహతహమొదటి సారి ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్‌ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులుసండేకు ప్రత్యేక ప్రాధాన్యంఇటు క్రికెట్‌.. అటు హాకీ పోటీలురెండు క్రీడల్లోనూ భారత్‌కు ప్రత్యర్థి పాక్‌ జట్టే..సూర్యాపేట : చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మాచ్‌కు భారత్‌-పాక్‌ జట్లు సిద్ధమయ్యాయి. ట్రోఫీని దక్కించుకోవాలని ఇరు జట్లు సమరా నికి సన్నద్ధమవుతున్నాయి. ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ ఇంగ్లాండ్‌ దేశంలో జరగనుంది. అసలే ఆదివారం దయాదుల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ కావడంతో ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. భారత్‌-పాక్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కంటే ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. చిరకాల ప్రత్యర్థి పాక్‌తో భారత్‌ మాచ్‌ చూసేందుకు క్రీడాభిమానులు ఇతర పనులను సైతం పక్కన పెట్టేస్తారు. మ్యాచ్‌ ప్రారంభం నుంచి మ్యాచ్‌ ముగిసేవరకు టీవీ ముందు నుంచి కదలని పరిస్థితి నెలకొంటుంది. ఎంతో ఉత్కంఠతో సాగనున్న మ్యాచ్‌లో ఎవరు విజేతలుగా నిలుస్తారో వేచి చూడాల్సిందే.. దూసుకెళ్తున్న భారత జట్టుచాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభమైన నాటి నుంచి జరిగిన టోర్నీల్లో భారత్‌ నాలుగు సార్లు ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండుసార్లు విజేతగా నిలిచి, ఒకసారి మాత్రం శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది. సౌరభ్‌గంగూలీ, మహేంద్రసింగ్‌ధోని నాయకత్వంలో రెండు సార్లు ట్రోఫీని భారత్‌ దక్కించుకుంది. లీగ్‌ దశలో పాక్‌ను ఓడించిన భారత్‌ అదే ఉత్సాహంతో ఫైనల్‌ మ్యాచ్‌లో పై చేయి సాధించాలనే పట్టుదలతో ఉంది. మొదటి సారి ఫైనల్‌కు పాక్‌ జట్టుచాంపియన్స్‌ ట్రోఫీ టోర్నీలో పాక్‌ జట్టు ఫైనల్‌కు చేరడం ఇదే మొదటిసారి. ఎప్పుడు లీగ్‌దశలోనే నిష్క్రమించేది. ప్రతిసారి భారత్‌-పాక్‌ జట్లు క్రికెట్‌ పోటీల్లో తలపడినపుడు పైచేయి భారత్‌ సాధిస్తూ వస్తుంది. భారత్‌తో మ్యాచ్‌ అంటేనే పాక్‌ ఆటగాళ్లు ఒకింత ఒత్తిడికి గురికావడం పరిపాటిగా మారింది. రాణిస్తున్న టాపార్డర్‌టోర్నీలో భారత్‌ జట్టు టాపార్డర్‌ రాణిస్తూ వస్తోంది. ముఖ్యంగా టోర్నీలో శిఖర్‌ధావన్‌ రాణించి టోర్నీలో అత్యధిక పరుగులు సాధించాడు. భారత్‌ తరఫున గతం లో గంగూలి పేరిట ఉన్న అత్యధిక పరుగులు(665)ను ధావన్‌ అధిగమించాడు. ఇప్పటికే ధావన్‌ 680 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసి ముందున్నాడు. 2013లో జరిగిన టోర్నీలో ధావన్‌ 363 పరుగులు చేసి మ్యాన్‌ ఆఫ్‌ద సిరీస్‌ అందుకున్నాడు. ధావన్‌తోపాటు కోహ్లి, రోహిత్‌శర్మ, యువరాజ్‌, ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో దుర్భే ద్యంగా ఉన్నారు. అదేవి ధంగా బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో కూడా భారత్‌ రాణిస్తుంది. బౌలింగ్‌ విభాగంలో పేసర్లు భువనేశ్వర్‌, బుమ్రాతో పాటు స్పిన్నర్లు అశ్విన్‌, జడేజాకు తోడు హార్దిక్‌ పాండ్యా, కేదార్‌జాదవ్‌ కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టు విజయంలో కీలకంగా మారారు. సూపర్‌ సండేచాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌, వరల్డ్‌ హాకీ లీగ్‌ మ్యాచ్‌లు ఆదివారం జరగనున్నాయి. భారత్‌ రెండు పోటీల్లో చిరకాల ప్రత్యర్థి పాక్‌లో తలపడుతున్నాయి. దీంతో ఆదివారం ప్రత్యేకత సంతరించుకుంది. అయితే క్రికెట్‌తోపాటు హాకీ వరల్డ్‌ లీగ్‌ మ్యాచ్‌ కూడా భారత్‌-పాక్‌ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన టీం ఫైనల్‌కు చేరుకుంటుంది. దీంతో ఆదివారం జరిగే క్రికెట్‌, హాకీ మ్యాచ్‌లు చూసేందుకు ప్రజలు ఎంతో ఆతృతగా ఉన్నారు. టీవీల ముందే అభిమానులుసాధారణంగా క్రికెట్‌ మ్యాచ్‌లు అంటే క్రీడాభిమానులు టీవీలకు అతుక్కు పోతారు. ఉద్యోగులు వారి విధులు నిర్వహిస్తూనే మ్యాచ్‌ వివరాలను ఎప్పటి కప్పుడు తెలుసుకుంటారు. మ్యాచ్‌లో భారత్‌ విజేతగా నిలస్తే పెద్ద ఎత్తున సంబరాలు కూడా జరుపుకుంటారు. చిన్నా, పెద్దా మ్యాచ్‌ను చూసేందుకు సిద్ధమయ్యారు. ఎన్ని పనులున్నా పక్కకు పెడుతున్నారు. జోరుగా బెట్టింగ్‌లుక్రికెట్‌ మ్యాచ్‌లు జరిగే సమయాల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తుంటారు. టీ20, ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఎక్కువగా బెట్టింగ్‌లు నిర్వహించారు. చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ కావడం అది భారత్‌-పాక్‌ జట్ల మధ్య పోరుకావడంతో బెట్టింగ్‌లు భారీగా జరిగే అవకాశాలు లేకపోలేదు. జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ, హుజూర్‌నగర్‌, భువనగిరి పట్టణాల్లో బెట్టింగ్‌లు జరగనున్నట్లు సమాచారం. ఒత్తిడిలో పాక్‌ జట్టుఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌తో తలపడనున్న పాక్‌ జట్టు ఒత్తిడిలో ఉంది. జట్టులో అనుభవం కలిగిన ఆటగాళ్లు లేరు. అంతేకాక టోర్నీలో జట్టు విషయంలో ఒకరిద్దరు మినహా ఆటగాళ్లు రాణించిన దాఖలాలు లేవు. బ్యాటింగ్‌ విషయంలో సర్పరాజ్‌, అజహర్‌, హఫీజ్‌ తప్పా మిగిలిన వారు రాణించలేదు. బౌలింగ్‌ కూడా అంతంతం మాత్రంగానే ఉంది. మొదటిసారి ఫైనల్‌కు చేరడంతో వారిపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. అలసత్వం వహిస్తే ట్రోఫీ పోయినట్లే..ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ జట్లు ఏమాత్రం అలసత్వం కనబర్చినా ట్రోఫీ పోయినట్లే. ఎందుకంటే పాక్‌పై ఎప్పుడు పైచేయి సాధిస్తామన్నా భావన భారత్‌ జట్టులో ఉంటుంది. పాక్‌ మాత్రం ఊహించని విధంగా మొదటిసారి ఫైనల్‌కు చేరింది. అదే ఉత్సాహంతో ట్రోఫీని దక్కించుకోవాలని, మరోవైపు చిరకాల ప్రత్యర్థి భారత్‌ను ఓడించాలనే పట్టుదలతో పాక్‌ జట్టు ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కప్‌ను చేజార్చుకున్నట్లే అవుతుంది. అనుభవం కలిగిన ఆటగాళ్లు జట్టులో ఉండడంతో ఎలాంటి తప్పులకు తావివ్వకుండా ట్రోఫీని దక్కించుకుంటారని క్రీడాభిమానులు భావిస్తున్నారు. ఇండియాదే విజయం పాకిస్థాన్‌- ఇండియా మధ్య లండన్‌లో ఆదివారం జరుగనున్న ఐసీసీ చాంపి యన్స్‌ పోటీలో ఇండియా సునాయంగా గెలుచి తీరు తుంది.. ఇండియా- పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ అంటే ఆ మజానే వేరు కదా.. క్రికెట్‌ చూడ డానికి మా స్నేహితులమంతా.. ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాం.. గత మ్యాచ్‌ మాదిరి గానే మ్యాచ్‌కు ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ, శిఖర్‌ దావన్‌లను పంపి.. జట్టుకు బలం చేకూర్చాల న్నారు.. 200పైగా పరుగులు తీసి విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు. - అడ్డగుల వంశీ, జూనియర్‌ లెక్చరర్‌, వంగపల్లి క్రికెట్‌, హాకీలో ఇండియానే గెలవాలి ఒకే రోజు.. ఒకే చోట క్రికెట్‌, హాకీ ప్రపంచ మ్యాచ్‌లు జరగడం.. ఇండియా- పాకిస్తాన్‌ దేశాలే తలపడటం యాదృచ్చికం.. ఈ రెండు దేశాలే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.. క్రికెట్‌, హాకీల్లో ఇండియానే గెలిచి ప్రపంచ క్రీడా చిత్రంలో తమదైన ముద్ర వేయాలి. ఆదివారం టీవీల్లో క్రీడలు చూడటానికే జనమంతా ఎదురుచూస్తున్నారు. - ఎస్‌ఎం ఓవైసీ ఖాద్రీ, టీచర్‌, జిల్లా హాకీ అసోసియేషన్‌ కార్యదర్శి.
sports
16,396
21-04-2017 20:36:20
'అద్వానీ రెచ్చగొట్టలేదు...నేనే ఆ పనిచేశా'
ఫైజాబాద్: అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదు కట్టడాన్ని కూల్చడానికి కరసేవకులను రెచ్చగొట్టింది ఎల్.కె.అద్వానీ కాదని, తానే ఆ పని చేశానని బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎల్.కె.అద్వానీ సహా పలువురిపై ఉన్న కుట్ర అభియోగాలను పునరుద్ధరిస్తూ రెండ్రోజుల క్రితం సుప్రీంకోర్టు తీర్చు చెప్పిన నేపథ్యంలో రామ్ విలాస్ వేదాంతి తాజా ప్రకటన చేశారు. నాటి ఘటనను ఆయన గుర్తు చేసుకుంటూ, మసీదును కూల్చి ఆ స్థలంలో రామాలయం కట్టాలనే పట్టుదలతో కరసేవకులు కట్టడాన్ని చుట్టుముట్టారని, ఆ సమయంలో వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్, మహంత్ అవైద్యనాథ్‌తో తాను కలిసి ఉన్నానని, కరసేవకులను ప్రస్తుతిస్తూ తాను వారిని రెచ్చగొట్టానని వేదాంతి తెలిపారు. మురళీ మనోహర్ జోషి, అద్వానీ, విజయరాజె సింధియా మాత్రం కరసేవకులను శాంతపరిచి పరిస్థితిని చక్కదిద్దెందుకు ప్రయత్నించారని వెల్లడించారు. బాబ్రీ మసీదు కుట్రదారులుగా సీబీఐ పేర్కొన్న 13 మందిలో వేదాంతి పేరు కూడా ఉంది.
nation
21,554
01-04-2017 23:57:14
స్టార్క్‌ రాంగ్‌ ట్వీట్‌
విరాట్‌ అనుకుని మరొకరికి సందేశం ముంబై: టెస్ట్‌ సిరీస్‌ సాధించిన విరాట్‌ కోహ్లీకి నేరుగా శుభాకాంక్షలు చెబుదామనుకున్న ఆస్ట్రే‌లియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ట్విటర్‌లో నవ్వులపాలయ్యాడు. కోహ్లీ అనుకుని మరొకరికి సందేశం పంపించాడు. ‘కొత్త ఐపీఎల్‌ టీమ్‌ను చూసుకోవాల్సిన అవసరం నాకు రాదనుకుంటా? నిన్ను కలిసే సమయం దొరక్కపోయినా.. సీరీస్‌ నెగ్గినందుకు శుభాకాంక్షలు. నీ గాయం తీవ్రమైనది కాదనుకుంటా. ఆర్‌సీబీ నెగ్గాలని కోరుకుంటూ గుడ్‌లక్‌’ అని కోహ్లీ అకౌంట్‌కు బదులు దగ్గరగా ఉన్న మరో వ్యక్తికి స్టార్క్‌ పొరపాటున ట్వీట్‌ చేశాడు.
sports
2,359
03-08-2017 01:03:09
సగం మంది స్నాప్‌డీల్‌ ఉద్యోగులపై వేటు!
న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్‌తో విలీన చర్చలు విఫలమైనా ప్రభావం స్నాప్‌డీల్‌ ఉద్యోగులపైనా కనిపిస్తోంది. ప్రస్తుతం స్నాప్‌డీల్‌లో 12,00 మంది వరకు ఉద్యోగులు పని చేస్తున్నారు. విలీన చర్చలు ఫలించక పోవడంతో స్నాప్‌డీల్‌ తన ఇ-కామర్స్‌ వ్యాపారాన్ని పూర్తిగా పునర్‌ వ్యవస్థీకరిస్తోంది. దీంతో వచ్చే రెండు మూడు నెలల్లో 600-700 మంది ఉద్యోగులను తప్పించే అవకాశం ఉందని సమాచారం.
business
20,164
12-12-2017 13:01:46
శ్రీవారి సేవలో క్రికెటర్‌ యువీ తల్లి
తిరుమల  (చిత్తూరు జిల్లా): క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ తల్లి షబ్నంసింగ్‌ సోమవారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం కల్యాణోత్సవం బ్రేక్‌లో ఆమె ఆలయంలోకి వెళ్లారు. శ్రీవారిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. షబ్నంసింగ్‌ మొదటిసారిగా తిరుమలకు వచ్చారు.
sports
5,253
30-05-2017 14:55:51
మారుతి.. ఓ వెరైటీ టైటిల్
డైరెక్టర్‌ మారుతి ఒకప్పటి దిగ్దర్శకుడు బాలచందర్‌కు వీరాభిమాని అయ్యుంటాడు. అందుకే ఆయన సినిమాలోని పాటలను, ఆయన సినిమా టైటిళ్లను బాగా ఉపయోగించుకుంటున్నాడు. నాని హీరోగా చేసిన సినిమాకు ‘భలే భలే మగాడివోయ్‌’ అనే టైటిల్‌ పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా తన నిర్మాణంలో తెరకెక్కబోతున్న సినిమాకు బాలచందర్‌ గతంలో రూపొందించిన రెండు సూపర్‌హిట్‌ సినిమాల పేర్లను పెట్టాడు. తన కొత్త సినిమాకు ‘ఆకలిరాజ్యంలో అంతులేని కథ’ అనే టైటిల్‌ పెట్టాడు మారుతి. మారుతి కథ అందిస్తున్న ఈ సినిమాకు ‘రోజులు మారాయి’ ఫేమ్‌ మురళి దర్శకుడు. ఈ సినిమా ద్వారా ఇద్దరు కొత్త హీరోలను పరిచయం చేస్తున్నాడట మారుతి.
entertainment
19,153
28-06-2017 08:11:36
గొప్పగా చేద్దామనుకుంటే.. నోరు పడిపోయింది
న్యూఢిల్లీ: ఇప్పుడు సోషల్ మీడియా అందరికీ మరింత అందుబాటులోకి రావడంతో... చాలామంది లైవ్ వీడియోలను ప్రసారం చేస్తున్నారు. ఒక మహిళ తన ప్రతిభను ప్రదర్శించాలనుకుంది. చివరికి ప్రయోగం వికటించి అడ్డంపడింది. 26 సంవత్సరాల ఆ యువతి లైవ్ వీడియోలో అలొవెరా(కలబంద) ప్రయోజనాలు చెబుదామనుకుంది. ఇందుకోసం రెండు పెద్ద ఆకులను తీసుకుని వాటిని తినడం ప్రారంభించింది. ముందుగా ఆమె ఈ ఆకులు ఎంతో రుచికరంగా ఉన్నాయని చెప్పింది. అయితే కొద్దసేపటికి చేదుగా ఉన్నాయంటూ ఉమ్మేసింది. ఆమె అలొవెరా అనుకొని అవే పోలికలతో ఉన్న వేరొక ఆకులను చూపించి తినేసింది. అయితే వాటిలో విష లక్షణాలు ఉండడంతో... ఆమెకు గొంతు దగ్గర మంటగా అనిపించసాగింది. తరువాత నోట మాట రాలేదు. చివరకు చేసేందేంలేక ఆసుపత్రిలో చేరింది. సహజంగా లభించే అలొవెరాను ఆయుర్వేద వైద్యంలో విరివిగా వినియోగిస్తారు. చర్మవ్యాధుల నివారణకు అలొవెరాను వాడతారు. ఇటీవలి కాలంలో అలొవెరా జ్యూస్‌ను ఆరోగ్యం కోసం సేవిస్తున్నారు.
nation
19,778
28-08-2017 02:29:59
ఆదుకున్న షకీబల్‌, తమీమ్‌
బంగ్లాదేశ్‌ 260 ఆలౌట్‌.. ఆసీస్‌ 18/3ఢాకా: సొంతగడ్డపై ఆస్ర్టేలియాతో తొలి టెస్ట్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌లో తడబడింది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం మొదలైన ఈ టెస్ట్‌లో బంగ్లా తొలి ఇన్నింగ్స్‌ లో 260 పరుగులకే ఆలౌటైంది. షకీబల్‌ హసన్‌ (84), తమీమ్‌ ఇక్బాల్‌ (71) అర్ధ సెంచరీలతో ఆదుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కంగారూలు తొలి రోజు ఆట చివరకు 3 వికెట్ల నష్టానికి 18 పరుగులు చేశారు. షకీబల్‌ రికార్డు: బంగ్లా ఆల్‌రౌండర్‌ షకీబల్‌ హసన్‌ టెస్ట్‌ క్రికెట్‌లో 3500 పరుగులు, 150 వికెట్లు తీసిన పదో ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఈ ఫీట్‌ను వేగంగా సాధించిన తొలి ప్లేయర్‌ అయ్యాడు.
sports
21,454
21-01-2017 03:41:56
స్వదేశానికి హేల్స్‌!
కటక్‌: భారత్ తో రెండో వన్డేలో గాయపడిన ఇంగ్లం డ్‌ ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌ మిగతా సిరీస్ కు దూరం కానున్నాడు. కటక్‌ వన్డేలో ఫీల్డింగ్‌ సందర్భంగా ఓ క్యాచ్‌ను అందుకునే ప్రయత్నంలో హేల్స్‌ కుడి చేతికి గాయమైంది. ఎక్స్‌రేలో అతని చేతి ఎముకలో చిన్న పగులు వచ్చిన్నట్టు తేలింది. స్వదేశానికి వెళ్లాక వచ్చే వారం అతను శస్త్ర చికిత్స చేయించుకోనున్నట్టు ఈసీబీ తెలిపింది. మూడు టీ20ల సిరీ్‌సకు హేల్స్‌ స్థానం లో మరో ఆటగాడిని ఎంపిక చేయనున్నారు.
sports
7,265
15-09-2017 10:34:29
ప్రముఖ హీరోయిన్‌ మీద డేరా బాబా ఎఫెక్ట్..?
డేరాబాబాకూ బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియాభట్‌కు ఏమాత్రం సంబంధం లేదు. అయినా ఆలియాభట్‌ ఇబ్బంది పడాల్సి వచ్చింది. అది ఎలాగంటే....ఆలియా నటిస్తున్న సినిమా షూటింగ్‌ హర్యానాలో జరుగుతోంది. ఆ సమయంలో డేరాబాబా అరెస్ట్‌ కావడంతో అక్కడ అల్లర్లు జరిగాయి. దీంతో షూటింగ్ ఆపేశారు. మిగతా వారి సంగతి ఎలా ఉన్నా అల్లర్ల కారణంగా తన డేట్లు వేస్ట్‌ అయ్యాయని ఆలియా తెగ బాధపడుతోందట! తిరిగి డేట్లు ఇవ్వాలంటే చాలా ఇబ్బంది అని ఆమె వాపోతోంది. బాబా బాధితులు బాలీవుడ్‌లో ఇంకా ఎంత మంది ఉన్నారో అంటున్నారు సినీ జనాలు.
entertainment
20,952
27-02-2017 02:17:43
అక్షత్ రెడ్డి సెంచరీ
సౌరాష్ట్రపై హైదరాబాద్‌ గెలుపు విజయ్‌ హజారే ట్రోఫీ కల్యాణి (పశ్చిమబెంగాల్‌): అక్షత్ రెడ్డి (132 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 154) భారీ సెంచరీతో కదం తొక్కడంతో విజయ్‌ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. అక్షత శతక ప్రదర్శనతో ఆదివారం జరిగిన గ్రూప్‌-డి మ్యాచ్‌లో హైదరాబాద్‌ 113 పరుగుల తేడాతో సౌరాష్ట్రపై గెలిచింది. తొలుత హైదరాబాద్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 312 పరుగులు చేసింది. సుమంత (91) అర్ధ సెంచరీ చేశాడు. అనంతరం సీవీ మిలింద్‌ (4/30), రవి కిరణ్‌ (2/46), మెహ్ది హసన్‌ (2/44) దెబ్బకు సౌరాష్ట్ర 38.5 ఓవర్లలో 199 పరుగులకే కుప్పకూలింది. మన్‌కండ్‌ (104) ఒక్కడే సెంచరీతో పోరాడాడు.
sports
20,661
07-04-2017 02:51:05
చెదిరిన స్వప్నం
 డేవిస్‌ కప్‌ నుంచి పేస్‌ అవుట్‌నేటినుంచే బెంగళూరులో టోర్నీవరల్డ్‌ రికార్డు కల చెదిరింది. డేవిస్‌ కప్‌లో తన హీరోచిత ఆటతో దేశానికి ఎన్నో విజయాలు అందించిన లియాండర్‌ పేస్‌పై వేటుపడింది. 1990లో భారత డేవిస్‌ కప్‌ టీమ్‌లోకి అడుగుపెట్టిన లియాండర్‌.. 27 ఏళ్లపాటు డబుల్స్‌ విభాగంలో ఎనలేని సేవలందించాడు. 55 మ్యాచ్‌ల్లో 42 విజయాలతో ప్రపంచ రికార్డును సమం చేశాడు. మరో మ్యాచ్‌ నెగ్గితే డేవిస్‌ కప్‌ చరిత్రలో అత్యధిక డబుల్స్‌ విజయాలు సాధించిన ప్లేయర్‌గా లియాండర్‌ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేదే. కానీ ఆ కల చెదిరింది. శుక్రవారం నుంచి ఉజ్బెకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో పేస్‌పై వేటుపడింది. నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌ మహేష్‌ భూపతి తన తొలి ఎంపికలోనే షాకింగ్‌ నిర్ణయాలు తీసుకున్నాడు. అయితే భూపతితో చెడిన సంబంధాల వల్లే లియాండర్‌కు చోటు దక్కలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.బెంగళూరు: డేవిస్‌ కప్‌ డబుల్స్‌లో వరల్డ్‌ రికార్డు సృష్టించాలనుకున్న వెటరన్‌ టెన్నిస్‌ స్టార్‌ లియాండర్‌ పేస్‌ కల చెదిరింది. 27 ఏళ్ల తర్వాత పేస్‌ డేవిస్‌ కప్‌ టీమ్‌లో చోటు కోల్పోయాడు. శుక్రవారం మొదలుకానున్న ఆసియా ఓసియానియా గ్రూప్‌-1 రెండో రౌండ్‌లో ఉజ్బెకిస్థాన్‌తో పోరుకు భారత జట్టులో పేస్‌కు స్థానం దక్కలేదు. నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌ మహేష్‌ భూపతి పేస్‌కు బదులు రోహన్‌ బోపన్నను ఎంపిక చేశాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో బోపన్న 24వ స్థానంలో ఉండగా.. ఒలింపిక్‌ మెడలిస్ట్‌ పేస్‌ అతడి కంటే 29 ర్యాంకులు వెనుకబడి 53వ స్థానం లో ఉన్నాడు. కాగా, పేస్‌ను తప్పించడాన్ని భూపతి సమర్థించుకున్నాడు. లియాండర్‌తో పోల్చితే బోపన్న మెరుగ్గా ఉన్నాడని చెప్పాడు. ఈ కారణంగానే రోహన్‌ను ఎంపిక చేసినట్టు తెలిపాడు. 1990లో జైపూర్‌లో జపాన్‌తో మ్యాచ్‌లో పేస్‌ డేవిస్‌కప్‌ అరంగేట్రం చేశా డు. అతడు జట్టులో చోటు కోల్పోవ డం దాదాపు మూడు దశాబ్దాల తర్వా త ఇదే తొలిసారి. 55 డేవిస్‌ కప్‌ మ్యాచ్‌లు ఆడిన పేస్‌ డబుల్స్‌లో 42 విజయాలతో నికొలా పిట్రాంగలి (ఇటలీ) రికార్డును సమం చేశాడు. మరొక్కటి నెగ్గితే 43 ఏళ్ల పేస్‌.. ప్రపంచ రికార్డును సృష్టిస్తాడు. ఇందు కోసం పేస్‌ తపిస్తున్నాడు. కానీ జట్టులో చోటు కోల్పోవడంతో లియాండర్‌ కల చెదిరింది. కాగా, పేస్‌ను తప్పించడం మంచి నిర్ణయమే కానీ.. దిగ్గజానికి ఇలా వీడ్కోలు పలకడం మాత్రం బాధ కలిగించిందని డేవిస్‌ కప్‌ మాజీ కెప్టెన్‌ జైదీప్‌ ముఖర్జీ అన్నాడు.
sports
21,417
20-07-2017 03:13:53
షమిపై మరోసారి..
కోల్‌కతా: భారత పేసర్‌ మహ్మద్‌ షమి మరోసారి నెటిజన్ల విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. తన కుమార్తె రెండో పుట్టిన రోజు వేడుకల ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. అందులో షమీ భార్య హసీన్‌ జహాన్‌ ‘హిజాబ్‌’ ధరించకపోవడంపై పలువురు ఆక్షేపణలు వ్యక్తం చేయడం గమనార్హం. కొందరైతే.. హిజాబ్‌ ధరించక పోవడం ద్వారా హసీన్‌ పాపం చేసిందని పేర్కొన్నారు. ‘నీ భార్య హిజాబ్‌ ధరించనందుకు విచారిస్తున్నాం. ఆ పాపాన్ని తక్కువగా అంచనా వేయడంకన్నా.. నువ్వు ఎవరిని ధిక్కరిస్తున్నావో చూడు మైడియర్‌ షమి సర్‌’ అని ఓ వ్యక్తి పోస్ట్‌ చేశాడు. ‘హిజాబ్‌ ధరించ కపోవడం, పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ద్వారా పురోగామి శక్తులను ప్రసన్నం చేసుకోవాలని భావిస్తున్నావా’ అని మరో నెటిజన్‌ ప్రశ్నించాడు. ‘నీవు ముస్లింవని నేను అనుకోవడంలేదు. పుట్టినరోజు వేడుకలను ఆ రకంగా నిర్వహించుకోవడాన్ని ఇస్లాం అనుమతించదు’ అని మరో వ్యక్తి ట్వీట్‌ చేశాడు.
sports
5,526
14-11-2017 22:35:40
సినిమాపై ఉత్తమ రచనలకూ...
తెలుగు సినిమాపై వచ్చిన ఉత్తమ గ్రంథాలకు ఇచ్చే అవార్డులు ఈసారి నాలుగు పుస్తకాలకు దక్కాయి. 2014కి గాను సీనియర్‌ సినీ జర్నలిస్టు, ఫిల్మ్‌ పిఆర్వో వీరమాచనేని ప్రమోద్‌కుమార్‌ రాసిన తెర వెనుక తెలుగు సినిమా పుస్తకానికీ, ప్రభాకర్‌ జైన్‌ రాసిన నా సినిమా సెన్సార్‌ అయిందోచ్‌ పుస్తకానికీ సంయుక్తంగా ఈ అవార్డు దక్కింది. ఇక, 2015కి గాను ప్రముఖ పరిశోధకుడు పైడిపాల రాసిన తెలుగు సినిమాల్లో డబ్బింగ్‌ పాటలు గ్రంథానికీ, 2016కి గాను పత్రికా రచయిత పులగం చిన్నారాయణ రాసిన పసిడితెర గ్రంథానికీ అవార్డులు దక్కాయి. ఇక, ఉత్తమ సినీ విమర్శకుడి విభాగంలోనూ 2014కు చిన్నారాయణకు మరో అవార్డు రావడం విశేషం. డాక్టర్‌ కంపల్లె రవిచంద్రన్‌ (2015), వట్టి విజయప్రసాద్‌ (2016)లకు మిగతా రెండేళ్ళకు ఉత్తమ సినీ విమర్శకుల అవార్డులు దక్కాయి.
entertainment
5,915
05-06-2017 12:17:33
ఒకే ఫ్యామిలీలో ఇద్దరు హీరోల సరసన ఆ ముద్దుగుమ్మ!
 తెలుగులో మహేశ్ బాబు అక్క మంజుల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్న అమైరా.. ఈ సినిమాలో యంగ్ హీరో సందీప్ కిషన్ సరసన నటించేందుకు కమిటైంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల కాకముందే అందాల భామకు మరో ఆఫర్ వచ్చిందట. అది కూడా మహేశ్ బాబు ఫ్యామిలీలోని హీరో సరసనే కావటం విశేషం. మహేశ్ బాబు చిన్న బావ, టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కబోయే కొత్త సినిమాలో అమైరాకు హీరోయిన్ బెర్త్ కన్ ఫామ్ అయ్యిందట.
entertainment
2,494
07-06-2017 08:13:05
నేటి నుంచి బిఎస్‌ఎన్‌ఎల్‌ మెగా మేళా
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సర్కిల్స్‌లో బుధవారం నుంచి శనివారం వరకు మెగా మేళా నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ రంగంలోని బిఎ్‌సఎన్‌ఎల్‌ పేర్కొంది. ఈ మేళా సందర్భంగా వినియోగదారులు కంపెనీ కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్లు, ఫ్రాంచైజీలు, రిటైల్‌ ఔట్‌లెట్లు, రోడ్‌షోల్లో ఉచిత 3జి స్మార్ట్‌ సిమ్‌ కార్డులు పొందవచ్చు. కొత్త కనెక్షన్‌ తీసుకుంటే 350 ఎంబి డేటా ఉచితంగా పొందవచ్చని పేర్కొంది. ఈ మేళా సందర్భంగా ఇంకా వినియోగదారులు ల్యాండ్‌లైన్‌, బ్రాడ్‌బ్యాండ్‌, మరియు ఎఫ్‌టిటిహెచ్‌ కనెక్షన్లు కూడా బుక్‌ చేసుకోవచ్చు.
business
13,400
20-03-2017 20:01:53
'ముసుగేసి తీసుకెళ్లారు...బాగా చూసుకున్నారు'
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో అదృశ్యమై ఎట్టకేలకు సోమవారం ఢిల్లీ చేరుకున్న సూఫీ మత బోధకులు సుష్మాస్వరాజ్‌తో సమావేశానంతరం మీడియాతో ముచ్చటించారు. గుఢచర్యం ఆరోపణలపై పాక్ అధికారులు తమను తీసుకెళ్లారంటూ మీడియాలో వచ్చిన వార్తలను వారు కొట్టిపారేశారు. అయితే తమ అదృశ్యానికి దారితీసిన కారణాలను వారు ప్రస్తావించకుండానే...ఒకింత ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. సూఫీ బోధకుల్లో ఒకరైన సయీద్ అసిఫ్ అలీ నిజామి మాట్లాడుతూ, కళ్లకు గంతలు కట్టి అజ్ఞాత ప్రాంతానికి  తీసుకువెళ్లారని, అయితే గౌరవంగానే చూసుకున్నారని చెప్పారు. 'కరాచీ నుంచి సుదూరంగా తీసుకెళ్లారు. ముఖానికి ముసుగు వేశారు. ఆహారం తీసుకోమన్నారు. టీ, బిస్కెట్లు కూడా ఆఫర్ చేశారు' అని నిజామీ చెప్పారు. పాక్ అధికారులు తమ పట్ల ఏమాత్రం దురుసుగా వ్యవహరించలేదన్నారు. 'మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. వీఐపీ రూముల్లో ఉంచారు. మా వివరాలు, దర్గా వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు' అని అసిఫ్ అలి చెప్పారు. ఎందువల్ల ఇంటారాగేట్ చేయాల్సి వచ్చిందని అడిగినప్పుడు...వీసాలు, ఇతర ఇమిగ్రేషన్ వివరాలు అడిగినట్టు ఆసిఫ్ అలీ మేనల్లుడు నజీమ్ అలి నిజామి సమాధానమిచ్చారు. స్వదేశానికి సురక్షితంగా తిరిగి వచ్చేందుకు తోడ్పడిన భారత్, పాక్ ప్రభుత్వాలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తాము క్షేమంగా తిరిగిరావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు.
nation
20,020
10-07-2017 01:42:45
నేడు కోచ్‌ సెలెక్షన్స్‌
10 మంది దరఖాస్తురేస్‌లో ముందున్న రవిముంబై: టీమిండియా కొత్త కోచ్‌ సెలెక్షన్స్‌కు అంతా సిద్ధమైంది. బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) కోచ్‌ పోస్టు కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థు లను సోమవారమిక్కడ ఇంటర్వ్యూ చేయనుంది. రెండేళ్లపాటు కొత్త కోచ్‌ కాంట్రాక్ట్‌ ఉంటుంది. మొత్తం 10 మంది దరఖాస్తు చేయగా.. అందులో టీమిండి యా మాజీ డైరెక్టర్‌ రవిశాస్త్రి కోచ్‌ రేస్‌లో ముందున్నాడు. శాస్త్రితోపాటు వీరేంద్ర సెహ్వాగ్‌, టామ్‌ మూడీ, రిచర్డ్‌ పైబస్‌, దొడ్డ గణేష్‌, లాల్‌చంద్‌ రాజ్‌ప త్‌, లాన్స్‌ క్లూస్నర్‌, రాకేష్‌ శర్మ (ఒమన్‌ జట్టు కోచ్‌), ఫిల్‌ సిమన్స్‌, ఉపేంద్రనాథ్‌ బ్రహ్మచారి (క్రికెట్‌తో ప్రత్యక్ష సంబం ధాలులేని ఓ ఇంజినీర్‌) అప్లై చేశారు. అయితే 10 మంది అభ్యర్థులను సీఏసీ ఇంటర్వ్యూ చేయనున్నట్టు సమాచారం. క్లూసెనర్‌ను స్టాండ్‌ బైగా ఉంచే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గా లు తెలిపాయి.
sports
11,360
20-08-2017 17:52:16
'నోట్ల రద్దుతో మావోయిస్టులు, వేర్పాటువాదుల నడ్డి విరిచాం'
ముంబై: పెద్ద నోట్ల రద్దుతో దేశంలోని పలు ప్రాంతాల్లో మావోయిస్టులు, జమ్మూకశ్మీర్‌లోని వేర్పాటువాదులు 'నిధుల కొరత'తో కుదేలయ్యారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో రాళ్లు రువ్వుడు ఘటనల్లో పాల్గొంటున్న నిరసనకారుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ముంబై బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షెలార్ ఆదివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో 'న్యూ ఇండియా ప్లెడ్జ్' అనే అంశంపై జైట్లీ మాట్లాడుతూ, నోట్ల రద్దు నిర్ణయం తర్వాత జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదులు, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో వేర్పాటువాదులు తీవ్ర నిధుల కొరతలో చిక్కుకున్నారని చెప్పారు. నోట్ల రద్దుకు ముందు కశ్మీర్‌లో నిరసనల పేరుతో వేలాది మంది రోడ్లపైకి వచ్చి రాళ్లు రువ్వేవారని, ఇప్పుడు ఆందోళన సమయంలో పట్టుమని 25 మంది కూడా రోడ్లపైకి రావడం లేదన్నారు. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు వల్ల కలిగిన ప్రయోజనాలను జైట్లీ మరింత వివరిస్తూ, ఇంతకుముందు లోపాయికారీగా బయటే డబ్బు చలామణీ అయ్యేదని, పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలోకి ఆ సొమ్ము వచ్చి చేరిందని చెప్పారు. బీజేపీ 'నవభారత నిర్మాణం' లక్ష్యంలో భాగంగా కీలకమైన రక్షణ, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాలకు హెచ్చు నిధులు ఖర్చు చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. 7 నుంచి 7.5 శాతం వృద్ధి రేటు పట్ల మోదీ ప్రభుత్వం సంతృప్తికరంగా లేదని జైట్లీ అన్నారు. జాతి ప్రయోజనాల దృష్ట్యా వృద్ధి రేటు పుంజుకునేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తుందని చెప్పారు. మోదీ సర్కార్ మూడేళ్ల పాలనలో పలు విజయాలు సాధించిందని, జీఎస్‌టీ అమలు, నోట్ల రద్దు, బినామీ లావాదేవీలకు సంబంధించిన చట్టాల సవరణ, పారదర్శకంగా స్పెక్ట్రం, సహజ వనరుల కేటాయింపులు, వివిధ దేశాలతో డబుల్ టేక్సేషన్ అవాయిడెన్స్ ఒప్పందాలు చేసుకోవడం వంటివి వీటిల్లో కీలకమని జైట్లీ తెలిపారు.
nation
20,522
26-11-2017 16:09:57
రోహిత్ సెంచరీ.. 610 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్!
నాగ్‌పూర్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత జట్టు 610 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 205 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం బరిలోకి దిగిన భారత బ్యాట్స్‌మెన్  ప్రత్యర్థి ఆటగాళ్లను చెడుగుడు ఆడుకున్నారు. బౌలర్లను ఉతికి ఆరేశారు. శ్రీలంకపై కెప్టెన్ కోహ్లీ తొలి డబుల్ సెంచరీ (213) నమోదు చేయగా ఓపెనర్ మురళీ విజయ్ (128), చతేశ్వర్ పుజారా (143) శతకాలు నమోదు చేశారు. తాజాగా రోహిత్ శర్మ కూడా సెంచరీ బాది టెస్టుల్లో మూడో శతకాన్ని నమోదు చేశాడు. 160 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 8 ఫోర్లు, 1 సిక్సర్‌తో 102 పరుగులు చేశాడు.  రోహిత్ సెంచరీ పూర్తయిన అనంతరం 610 పరుగులు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. వృద్ధిమాన్ సాహా 1, రోహిత్ శర్మ 102 నాటౌట్‌గా ఉన్నారు. పర్యాటకపై జట్టుపై భారత్ 405 పరుగుల భారీ ఆధిక్యంతో ఉంది. భారత్ చేసిన 610 పరుగుల్లో 586 పరుగులు సెంచరీల రూపంలో రావడం విశేషం. కాగా, శ్రీలంకపై భారీ ఆధిక్యం సాధించిన భారత్ మ్యాచ్‌పై పట్టు బిగించింది. ఆటకు ఇంకా రెండు రోజుల సమయం ఉండడంతో అద్భుతం జరిగితే తప్ప భారత్ గెలుపు ఖాయమైనట్టే. భారత క్రికెట్ అభిమానులకు ఓ శుభవార్త ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల జీతం ఎంతో తెలుసా?
sports
6,514
16-10-2017 12:57:40
సెలెబ్రిటీ చిత్రకారుడు!
ఎవరైనా సెలెబ్రిటీల వెంటపడతారు. సెలెబ్రిటీలు ఎప్పుడు సమయం ఇస్తారా అని ఎదురుచూస్తారు. కానీ, సువిగ్యశర్మ విషయంలో మాత్రం, ఇదంతా తలకిందులవుతుంది. ఆయన కోసం సెలెబ్రిటీలే ఎదురుచూస్తారు. ‘మా బొమ్మ గీసివ్వండి ప్లీజ్‌’ అంటూ మహామహా తారలు కూడా బతిమాలుకుంటారు. కాన్వాస్‌ మీద అంతఃసౌందర్యాన్ని చూపించడంలోనే కళాకారుడి ప్రజ్ఞ బయటపడుతుంది. ఈ విషయంలో సువిగ్యశర్మకు తిరుగులేదు. జైపూర్‌కి చెందిన 34 ఏళ్ల సువిగ్య పేరు బాలీవుడ్‌లో సుపరిచితం. ప్రియాంక చోప్రా, కంగనా రౌనత్‌, రాణీ ముఖర్జీ... తదితరులకు పెయింటింగ్స్‌ వేసిచ్చారు సువిగ్య. ఇక బిజినెస్‌ ప్రపంచంలో బిర్లాలు, అంబానీలు, సింఘానియాలు, బజాజ్‌లు, మిట్టల్‌లు సువిగ్య క్లయింట్ల లిస్టులో ఉన్నారు. అందులోనూ, సువిగ్య త్రీడీ పెయింటింగ్స్‌ సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. చిన్న చిన్న అంశాలను కూడా ఎంతో శ్రద్ధతో పరిశీలించడం ఆయన నైజం. ‘అనాటమీ’కి సువిగ్య చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఒక్కో కన్ను చిత్రించడానికే, మూడు గంటల సమయం తీసుకుంటారు. మేకిన్‌ ఇండియా వారోత్సవాల్లో ఆయన అధికారిక మినియేచర్‌ పెయింటర్‌గా పాల్గొన్నారు. ముంబయిలోని సిద్ధివినాయక ఆలయంలోని మూలమూర్తి చిత్రాన్ని 4 డైమెన్షనల్‌ వర్ణచిత్రంగా వేసి ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డుకెక్కారు. ఆ బొమ్మ కోసం ఏడాదిన్నరపాటు పనిచేశారు. 80 ఏళ్ల వారసత్వం...ఏడేళ్ల వయసు నుంచే సువిగ్య బొమ్మలు వేయడం మొదలుపెట్టాడు. నాన్న, తాతయ్యలు కూడా ప్రసిద్ధ చిత్రకారులే. 80 ఏళ్ల కుటుంబ వార సత్వాన్ని కొనసాగించడమే కాకుండా, కొత్త పద్ధతులతో ముందుకుతీసుకెళ్తున్నాడు సువిగ్య. బంగారం, విలువైన రాళ్లు, రత్నాలతో పొదగడం సువిగ్య స్పెషాలిటీ. మొఘల్‌, తంజావూర్‌ వర్ణచిత్ర పద్ధతులను మేళమించి నూతన ప్రక్రియను రూపొందించడంలో ఆయన సఫలమయ్యారు. అందుకే, ఆయన పెయింటింగ్స్‌ ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఇటీవల సువిగ్య వేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, టెండూల్కర్‌- అంజలి దంపతుల వర్ణచిత్రాలు ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టాయి. అంజలికైతే ఆ పోర్ర్టెయిట్‌ను చూడగానే నోట మాట రాలేదట. ‘కళ్లముందు మా ప్రతిరూపాలు నిలబడినట్టే ఉంది’ అని మెచ్చుకున్నారట. ‘భగవంతుడి ప్రతి సృష్టిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. అదేమిటో గుర్తించడమే కాకుండా, దాన్ని హైలెట్‌ చేయడమే నా విజయ రహస్యం’ అంటారు సువిగ్య శర్మ.
entertainment
8,119
30-07-2017 19:01:29
సన్నీలియోన్‌తో ఇలియానా ఢీ
ఫుల్ లెన్త్ హీరోయిన్ రోల్స్ తగ్గించి ఇప్పుడు వరుసగా ఐటెం నంబర్స్‌తో అలరిస్తోంది సన్నీలియోన్. లేటెస్ట్‌గా ఈ బ్యూటీ మరో స్పెషల్ సాంగ్‌తో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ ఏడాది జనవరిలో 'రయీస్' చిత్రంలో సన్నీ చేసిన 'లైలా మే లైలా' ఐటెం నంబర్ సూపర్ డూపర్ హిట్టయింది. మళ్లీ ఇప్పుడు మరో ఐటెం నంబర్‌తో రెడీ అయిపోయింది ఈ పోర్న్ స్టార్. అజయ్ దేవగణ్ 'బాద్షాహో' సినిమాలో సన్నీ చేసిన స్పెషల్ సాంగ్ 'పియా మోర్' లేటెస్ట్‌గా రిలీజైంది. బాలీవుడ్‌లో కిస్సుల వీరుడిగా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీతో కలసి ఈ సాంగ్‌లో వీరలెవెల్‌లో రెచ్చిపోయింది సన్నీలియోన్. రొమాన్స్‌ను పీక్స్‌లో చూపించే ఈ ఇద్దరి మధ్య రూపొందిన ఈ రొమాంటిక్ సాంగ్‌లో సన్నీ టాప్ లెస్‌గా హల్ చల్ చేసింది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌లో ఇలియానా కూడా టాప్ లెస్‌గా కనిపించి అందాల విందు చేసింది. అలాగే ఈ చిత్రంలో అజయ్ దేవగణ్-ఇలియానా మధ్య వచ్చే లాంగ్ లిప్ లాక్ సీన్ కూడా హైలైట్ కాబోతోందట. మొత్తంమీద ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఇలియానా ఐటెం నంబర్‌గా సన్నీ లియోన్ మధ్య అందాల ప్రదర్శనలో గట్టి పోటీయే ఉన్నట్టు కనిపిస్తోంది. మరి సినిమాలో వీరి రొమాంటిక్ అప్పీల్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో చూడాలంటే.. సెప్టెంబర్ 1 సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
entertainment
15,674
27-07-2017 03:20:44
రైలు బిర్యానీలో బల్లి!
ఛందౌలి, జూలై 26: ‘రైళ్లలో సరఫరా చేసే భోజనం మనుషులు తినలేరు.’ అని కంప్ట్రో‌లర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) వాతలు పెట్టి వారం కూడా గడువకముందే ఓ ప్రయాణికుడికి అందించిన వెజ్‌ బిర్యానీలో చచ్చిపోయిన బల్లి దర్శనమిచ్చింది. ఈ ఘటన పూర్వ ఎక్స్‌ప్రెస్‌లో మం గళవారం చోటుచేసుకుంది. బిర్యానీ ఆర్డర్‌ చేసిన ప్రయా ణికుడు, అలహాబాద్‌ హైకోర్టు న్యాయవాది సంతోశ్‌ కుమార్‌ సింగ్‌ పార్సిల్‌ చేతికందగానే కొంచెం తిన్నాడు. ఇంకో ముద్ద నోట్లో పెట్టుకుంటుండగానే నల్లగా మాడిపోయినట్లు బల్లి తారసపడింది. అంతే.. తిన్నదంతా కక్కేశాడు. వైద్యసాయం ఆలస్యంగా అందడంతో అతడు అస్వస్థతకు గురయ్యాడు. తోటి ప్రయాణికురాలు మేఘనా సిన్హా ట్విటర్‌ ద్వారా రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభుకు ఫొటోతో సహా ఫిర్యాదు చేశారు. వెం టనే స్పందించిన మంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.
nation
9,042
15-08-2017 13:18:53
పవన్ బర్త్‌డే కానుకగా మూవీ ఫస్ట్ లుక్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. పవన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా ఈ సినిమాలో అలరించనున్నారు. ఇందులో పవన్‌ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరో విశేషం ఏంటంటే విడుదలకు ముందే రూ.150 కోట్లకు పైగా బిజినెస్‌ చేసినట్లు సమాచారం. విడుదలకు ముందు ఇన్ని కోట్లు రాబట్టిన రెండవ సినిమాగా ఇది నిలవబోతోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే గిఫ్ట్‌గా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
entertainment
18,296
09-08-2017 01:01:35
కొడుక్కి వ్యతిరేకంగా సాక్ష్యం.. కోడలికి న్యాయం
బెంగళూరు, న్యూఢిల్లీ ఆగస్టు 8: అత్తలేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మో.. కోడల్లేని అత్త గుణవంతురాలు అన్నారో సినీకవి. అత్తాకోడళ్లు కలిసివుంటే వారికి క్షణం పొసగదనే భావనే ఈ పంక్తుల వెనుక ఉన్న పరమార్థం. అలాంటిది.. కన్నతల్లిని మరిపించేలా కోడలిని అత్తగారు చూసుకుంటే? తన కొడుకు దాష్టీకాల నుంచి ఆమెకు రక్షణగా నిలిస్తే? ఏకంగా కొడుకు నుంచే రూ.4 కోట్ల భరణాన్ని కోడలికి కోర్టు నుంచి ఇప్పించగలిగితే? ఇది రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ సాధ్యమేనని బెంగళూరులోని ఓ అత్తగారు నిరూపించారు. పట్టణానికి చెందిన దేవానంద్‌ శివశంకరప్ప ఓ వ్యాపారవేత్త. కర్ణాటక మాజీ మంత్రి, దివంగత ఎస్‌ఆర్‌ కాశప్ప కొడుకు. 2011లో మేనకోడలు వరుస అయ్యే యువతిని పెళ్లాడాడు. కాపురంలో పొరపొచ్చాలు రావడంతో 2012 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. తనకు భర్త నుంచి విడాకులు ఇప్పించాలని 2015లో ఆమె కోర్టును ఆశ్రయించింది. భర్త నుంచి తనకు రూ.4.85 కోట్లు భరణంగా ఇప్పించాలని అభ్యర్థించింది. ఈ మేరకు ఆమె భర్త శివశంకరప్పకు కోర్టు నోటీసులు పంపింది. ఈ కేసులో శివశంకరప్ప తల్లి, పిటిషనర్‌కు మద్దతుగా కోర్టులో సాక్ష్యం చెప్పడం గమనార్హం. తన కోడలి పట్ల కుమారుడి ప్రవర్తన బాగోలేదని ఆమె కోర్టులో కుండబద్దలు కొట్టింది. పైగా తన కొడుకు రెండో పెళ్లి చేసుకున్నాడని, వారికి ఓ కొడుకు కూడా ఉన్నాడని చెప్పింది. కోడలు అడిగిన భరణాన్ని తన కొడుకు నుంచి ఇప్పించాలని అభ్యర్థించింది. కేసులో ఆమె సాక్ష్యమే కీలకమైంది. దీంతో భార్యాభర్తలకు విడాకులు మంజూరు చేయడమే కాదు.. 60రోజుల్లోగా బాధితురాలికి 4కోట్ల భరణాన్ని చెల్లించాలని శివశంకరప్పను కోర్టు ఆదేశించింది. విడాకుల కేసు పెండింగ్‌లో ఉన్నా కూతురుకు పెన్షన్‌: కేంద్రంవిడాకుల కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. బాధితురాలికి తల్లిదండ్రుల తాలూకు ఫ్యామిలీ పెన్షన్‌ను పొందే వీలుందని కేంద్రం పేర్కొంది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం విడాకులు తీసుకున్న కూతురుకే ఆమె తల్లి, తండ్రి తాలూకు పెన్షన్‌ డబ్బును పొందే అవకాశం ఉండేది. అరుతే ఈ నిబంధనలకు కేంద్రం సడలించింది. జీవితపర్యంతం తల్లి, తండ్రిలో కనీసం ఒకరి పెన్షన్‌ డబ్బులైనా పొందే హక్కు విడాకులు తీసుకున్న వారి కూతురుకు ఉంటుందని కేంద్రం పేర్కొంది. దీంతో విడాకుల కేసు కోర్టులో పెండిగ్‌లో ఉన్న ఎంతోమంది మహిళలకు మేలు జరుగనుంది.
nation
14,017
13-02-2017 00:42:11
‘కామ్‌ కీ బాత్’ కావాలి
ప్రధానికి అఖిలేశ్‌ కౌంటర్‌ బదౌన్‌, ఫిబ్రవరి 12: యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంతోపాటు మాటల యుద్ధ మూ పెరుగుతోంది. రాష్ట్రంలో తన పాలన గురించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు సీఎం అఖిలేశ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘మంచి రోజులు వస్తాయంటూ మాటలు చెప్పి ప్రజలను మాయ చేసిన వారి పతనం ప్రారంభమైంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదూ... 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా వారు తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. మా ప్రభుత్వం ఎన్నో దుశ్చర్యలకు పాల్పడిందని వాళ్లు(బీజేపీ) అంటున్నారు. వాళ్ల ను నేను ఒక్కటే అడగాలనుకుంటున్నా. ప్రజల కోసం ఏమైనా చేసింది ఉంటే దాని గురించి చెప్పాలి. మన్‌కీ బాత కాదూ.. కామ్‌కీ బాత కావాలి’ అని బదౌన్‌లో ఎన్నికల ప్రచారంలో అఖిలేశ్‌ అన్నారు. ఇదిలావుండగా, లక్షింపూర్‌లో ప్రచారంలో అఖిలేశ్‌ భార్య డింపుల్‌ పాల్గొన్నారు. ఎన్నికల్లో పార్టీకి మద్దతివ్వాలని ఓటర్లను కోరారు.
nation
12,957
03-06-2017 16:00:51
ట్రిపుల్ తలాక్‌లు పెరగడానికి కారణం ....
ముంబై : ట్రిపుల్ తలాక్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అత్యాచారాలు, మహిళలపై గృహ హింస పెరుగుతున్నాయన్న ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి నేరాలకు కారణం పాశ్చాత్య సంస్కృతేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నేత ఇంద్రేష్ కుమార్ ఆరోపించారు. ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ ప్రేమ స్వచ్ఛమైనదని, దానిని పాశ్చాత్య సంస్కృతి వ్యామోహంగా మార్చేసిందన్నారు. అంతేకాకుండా వ్యాపారాత్మకం చేసిందన్నారు. అత్యాచారాలు, హింసకు కారణం కూడా పాశ్చాత్య సంస్కృతేనన్నారు. వాలెంటైన్స్ డే రూపంలో బహిరంగంగా ప్రేమను వ్యక్తం చేసుకుంటున్నారన్నారు. ట్రిపుల్ తలాక్, రేప్, గృహ హింస, స్త్రీ శిశు గర్భస్థ పిండాల హత్య వంటి నేరాలకు బాధ్యత పాశ్చాత్య సంస్కృతిదేనని తెలిపారు.
nation
7,036
03-10-2017 12:50:03
టాలీవుడ్ యంగ్ హీరో సొంత సినిమాకు హిందీలో సూపర్ క్రేజ్
తెలుగులో మార్కెట్ లేని ఓ యంగ్ హీరో సినిమా హిందీ హక్కులు భారీ రేటు పలకడం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది… తన హీరో మార్కెట్ ను మరింత విస్తరింపచేసుకోవాలని సదరు చిత్ర నిర్మాతలు ఇలాంటి గిమ్మిక్స్ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.                యంగ్ హీరో నాగశౌర్యకు టాలీవుడ్ లో లవర్ బోయ్ ఇమేజ్ బాగానే 'ఊహలు గుసగులాడే' చిత్రం అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన 'కళ్యాణ వైభోగమే', 'జ్యో అచ్యుతానంద' చిత్రాలూ ఫర్వాలేదనిపించాయి. అయితే... 'దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీరావే మా ఇంటికి, జాదుగాడు, అబ్బాయితో అమ్మాయి, ఒక మనసు, నీజతలేక' వంటి చిత్రాలు నిరాశకు గురిచేశాయి. బయటి చిత్రాల్లో అవకాశాలు పెద్దంతగా రాకపోవడం తనను తాను గట్టిగా ఫ్రూవ్ చేసుకోవాలనే కోరికతో నాగశౌర్య ఇటీవల హోమ్ ప్రొడక్షన్ ను ప్రారంభించాడు.             ఇంకా పేరు నిర్ణయించని నాగశౌర్య సొంత సినిమాలో... కన్నడ 'కిరిక్ పార్టీ' ఫేమ్ రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది… త్రివిక్రమ్ శిష్యుడు వెంకి కుడుముల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు… చిత్రీకరణ చివరి దశకు వచ్చిన ఈ సినిమాను నవంబర్ నెలాఖరులో విడుదల చేయాలనుకుంటున్నారు నిర్మాతలు… ఈ సినిమా హిందీ రైట్స్ ను ఇటీవల ఏకంగా 1.25 కోట్లకు అమ్మామని నిర్మాతలు ప్రకటించారు.             నాగశౌర్యకు నిజానికి తెలుగులో పెద్దంత మార్కెట్ లేదు… అందుకు కారణం అతనికి సరైన హిట్స్ లేకపోవడమే. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నాడు.. సాయిపల్లవి హీరోయిన్ గా ఎ.ఎల్. విజయ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా తెలుగులోనూ 'కణం' పేరుతో విడుదల కాబోతోంది... ఇదిలా ఉంటే తాజాగా నాగశౌర్య మరో సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.             పలు విజయవంతమైన చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన సాయి శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు... ఈ నేపథ్యంలో నాగశౌర్యకు లేని మార్కెట్ ను క్రియేట్ చేయడానికే సొంత బ్యానర్ లోని సినిమాకు హైప్ ను క్రియేట్ చేస్తున్నారని టాలీవుడ్ లో చెవులు కొరుక్కుంటున్నారు... మరి నిజంగానే ఆ సినిమా బాలీవుడ్ డబ్బింగ్ అంత రేటుకు అమ్ముడు పోయిందా? లేక హైప్ కోసమా? అన్నది తేలాల్సి ఉంది.
entertainment
10,660
21-07-2017 07:41:45
సినీపరిశ్రమ మీదే ఫోకస్‌ తప్పు: గోపీచంద్‌
హీరో గోపీచంద్‌ డ్రగ్స్ అంశంపై స్పందించాడు. ఈ మహమ్మారి అన్నిచోట్లా వ్యాపించిందని తెలిసినపుడు కేవలం సినిమా పరిశ్రమ మీదే ఫోకస్‌ చేయడం తప్పన్నాడు. ఇక్కడ మంచి ప్రభుత్వం ఉందని, సమర్థులైన నాయకులున్నారని, నేరస్తుల మీద తప్పకుండా చర్య తీసుకుంటారనే భావిస్తున్నానని తెలిపాడు. ఓ వ్యక్తి డ్రగ్స్‌ తీసుకున్నాడంటే అతని ఫ్యామిలీ డిస్టర్బ్‌ అవుతుందని, ఎవరు డ్రగ్స్‌ తీసుకున్నారో తెలియకుండా ఏమీ మాట్లాడకూడదని చెప్పా డు. ఇప్పుడు మనం నిందిస్తున్నవాళ్లు నిందితులు కారని తర్వాత తేలినా.. ఇప్పుడన్న మాటలను వెనక్కి తీసుకోలేమని అన్నాడు. ఒక దెబ్బ కొట్టినా ఫర్వాలేదు గానీ, ఒక మాట అని వెనక్కి తీసుకోలేమని తెలిపాడు. ఒత్తిడి నివారణకు డ్రగ్స్‌ వాడటం కూడా తప్పని.. ఒత్తిడి తగ్గించుకోవాలంటే ఆరోగ్యకరమైన మార్గాలు చాలా ఉన్నాయని సూచించాడు.
entertainment
8,155
11-11-2017 08:19:11
‘దంగల్’ నటి ఫాతిమా సనా చీర కట్టిందోచ్...
ముంబై : తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘దంగల్’ సినిమా నటి ఫాతిమా సనా షేక్ చీర కట్టింది. 25 ఏళ్ల ఈ అందాల భామ మెరూన్ రంగు చీర ధరించి ఫోటో షూట్ చేసింది. చీర కట్టిన సనా తన సరికొత్త చిత్రాలను సెల్ఫీ శారీ పేరిట ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. చీరలో సనా మెరిసిపోయిందని లక్షమంది నెటిజన్లు కామెంట్ చేశారు. ‘‘నీవు చీరలో మరింత గ్లామరస్ గా ఉన్నావంటూ’’ పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. సనా చీరకట్టిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ప్రస్థుతం అమీర్ ఖాన్ తో కలిసి ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ చిత్రంలో నటిస్తున్న ఫాతిమా సనా బాలనటిగా చాచీ 420, ఒన్ 2 కా 4 చిత్రాల్లో నటించింది. కొందరు చీరలో అందంగా ఉన్నావని పొగిడితే...మరికొందరు నెటిజన్లు ‘షేమ్ లెస్ సెల్ఫీ’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కొందరు నీవు బొడ్డు కిందకు చీర కట్టి తప్పు చేశావంటూ వ్యాఖ్యానించారు. మొత్తంమీద ఫాతిమా సనా షేక్ చీరకట్టిన వేళ వివాదాస్పదంగా మారింది.
entertainment
12,501
07-03-2017 09:32:53
భారత జాలర్లపై శ్రీలంక నేవీ కాల్పులు
మథురై: సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లిన జాలర్లపై శ్రీలంక నేవీ దళాలు కాల్పులు జరపడంతో ఓ భారతీయ జాలరి ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం రాత్రి కచ్చతీవులు సమీపంలోని పాల్క్ స్ట్రెయిట్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. 22 ఏళ్ల బాధితుడి మృతదేహాన్ని రామేశ్వరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సోమవారం పెద్దసంఖ్యలో రామేశ్వరం నుంచి జాలర్లు చేపలు పట్టేందుకు బయల్దేరి వెళ్లారు. కచ్చతీవులు సమీపంలో పడుతుండగా శ్రీలంక దళాలు అక్కడికి చేరుకుని ఒక్కసారిగా కాల్పులు జరపడం ప్రారంభించాయి. కనీసం ముందస్తు హెచ్చరికలు కూడా ఇవ్వకుండా కాల్పులకు దిగినట్టు మత్స్యకారులు వాపోయారు. కాల్పులు జరిగిన సమయంలో మొత్తం 2000 మంది జాలర్లు చేపల వేటలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు  రాత్రి 10 గంటలకు సముద్రంలో కాల్పులు జరిగినట్టు రామేశ్వరానికి సమాచారం రావడంతో మత్స్యకారుల కుటుంబాల్లో ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది. ‘‘శ్రీలంక ఆర్మీ జరిపిన కాల్పుల్లో తంగచిమదంకు చెందిన బ్రిత్సో (22) అనే మత్స్యకారుడు చనిపోయాడు. మరో ఐదుగురు గాయపడ్డారు. రాత్రి 12:30 గంటలకు  అంతా ఒడ్డుకు చేరుకున్నారు’’ అని రామేశ్వరం మత్స్యకారుల నాయకుడు ఎమిరిట్ పేర్కొన్నారు. కాగా శ్రీలంక దళాలు తమిళనాడు ప్రజలపై అమానుషంగా ప్రవర్తిస్తున్నాయని పేర్కొంటూ ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం పళనిస్వామి లేఖరాశాలు. కేవలం కొద్దిరోజుల వ్యవధిలోనే 32 మంది జాలర్లను నిర్భంధంలోకి తీసుకున్నాయనీ.. ప్రస్తుతం 128 బోట్లతో పాటు మొత్తం 85 మంది తమిళనాడు జాలరులు,  శ్రీలంక ఆధీనంలో ఉన్నారని పేర్కొన్నారు. శ్రీలంక వ్యవహారంపై కేంద్రం చొరవతీసుకుని మత్స్యకారులను వెనక్కి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
nation
3,165
02-03-2017 23:21:40
లాభాల స్వీకరణతో బ్రేక్‌
 వోకార్డ్‌ అమెరికా అనుబంధ సంస్థకు ఎఫ్‌డిఎ నుంచి హెచ్చరిక లేఖ అందడంతో ఆ కంపెనీ షేరు 4.95 శాతం వరకు నష్టపోయాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో కేవలం 8 కంపెనీల షేర్లు మాత్రమే లాభాలతో ముగిశాయి. గురువారంనాటి ట్రేడింగ్‌లో మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లకూ నష్టాలు తప్పలేదు.  శనివారం మాక్‌ ట్రేడింగ్‌
business
14,764
12-04-2017 16:57:58
ఫీజులపై నిలదీస్తే 'దేశద్రోహం' కేసులా?...కేంద్రంపై రాహుల్ నిప్పులు
న్యూఢిల్లీ: పీజుల పెంపుపై నిరసన తెలిపిన 66 మంది పంజాబ్ యూనివర్శిటీ విద్యార్థులపై 'దేశద్రోహం' అభియోగాలు మోపడంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రంపై మండిపడ్డారు. నిరసనలు తెలిపితే దోశద్రోహం ఎలా అవుతుందో, ఏ నిబంధల ప్రకారం దేశద్రోహం కేసులు నమోదు చేస్తారో తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఓ ట్వీట్‌లో రాహల్ ప్రశ్నించారు. 'ఫీజుల పెంపుపై నిరసనలు తెలిపడం కూడా ఇప్పుడు దేశద్రోహం అయిందా? యువకులకు మాట్లాడే హక్కు కూడా ఈ దేశంలో లేదా?' అని రాహుల్ నిలదీశారు. మంగళవారంనాడు పీయూ క్యాంపస్‌లో ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన యువకులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ ఘర్షణలో ఇరువర్గాల వారు గాయపడ్డారు. పంజాబ్ యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ అరుణ్ కుమార్‌ గ్రోవర్‌తో చర్చలు జరిపేందుకు విద్యార్థులు 'పీయూ బంద్' పాటించారు. చర్చలకు ఆహ్వానించకపోవడంతో ఆందోళనకు దిగిన విద్యార్థులు బారికేడ్లు దూకి బలవంతంగా వీసీ కార్యాలయంలో అడుగుపెట్టారు. దీంతో పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించారు. ఇందుకు ప్రతిగా విదార్థులు రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో ఇరువర్గాల వారూ గాయపడ్డారు. 66 మంది విద్యార్థులపై పోలీసులు దేశద్రోహం కేసులు నమోదు చేశారు.
nation
15,811
17-10-2017 18:08:51
ఉత్తర ప్రదేశ్ ‘గౌరవ కుటీరం’పై మోదీ ప్రశంసలు
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మరుగు దొడ్లకు పెట్టిన పేరు ప్రధాని నరేంద్ర మోదీని ఆకర్షించింది. మంగళవారం అఖిల భారత ఆయుర్వేద సంస్థను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఈ సంస్థ మన దేశంలోనే మొట్టమొదటిది. ఇది ఎయిమ్స్ తరహా సంస్థ. ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం కొత్తగా నిర్మించిన మరుగుదొడ్లపై ‘శౌచాలయం’ అని కాకుండా ‘ఇజ్జత్ ఘర్’ (గౌరవ కుటీరం) అని రాసి ఉండటం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని మోదీ చెప్పారు. ఈ పదాన్ని సృష్టించినందుకు ఆ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. తన ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థను ఆయుర్వేదం, యోగా, ఇతర ఆయుష్‌ విధానాలతో కలపడంపై దృష్టిపెట్టిందని మోదీ చెప్పారు. ఆయుర్వేదం కేవలం చికిత్సావిధానం మాత్రమే కాదన్నారు. సాంఘిక ఆరోగ్యం, ప్రజారోగ్యం, పర్యావరణ ఆరోగ్యంతో దీనికి సంబంధం ఉందన్నారు.
nation
8,799
31-05-2017 00:47:48
కళామాత కన్నీరు
తెలుగు సినీ రంగానికి పెద్ద దిక్కు అయిన దర్శకరత్న దాసరి నారాయణరావు మరణంతో సినీ పరిశ్రమ తీవ్రవిషాదంలో మునిగిపోయింది. ఈ వార్త నిజం కాకపోతే బాగుండు అని కోరుకోనివాళ్ళు లేరు. అయితే, పిడుగు లాంటి ఈ వార్త నిజమేనని తేలడంతో పరిశ్రమ వర్గీయులు దిగ్ర్భాంతికి లోనయ్యారు. ఆరు దశాబ్దాల పైగా సినీరంగంతో మమేకమైన వ్యక్తి కావడంతో దాసరి మృతికి దేశ దేశాల నుంచి సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. తారలెన్ని ఉన్నా... ఇప్పుడు చంద్రుడు లేడు!దాసరి గారు కోలుకుంటున్నారనుకున్నాను కానీ, ఇంతలోనే ఇలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. వయసులో, సినిమా రంగంలో నా కన్నా చిన్నవాడైనా, మా దర్శకులందరం పెద్దగా భావించేది దాసరినే! నోరూ వాయీ లేని నా లాంటి ఎందరి పక్షానో ఆయన మౌత పీస్‌. అంత వేగంగా రచన చేయడం, సినిమాలు తీయడం, ఎన్నెన్నో రంగాల్లో పనిచేయడం దాసరి వద్ద తపఁ, సమకాలీన సినిమా రంగంలో మరెవ్వరి దగ్గరా చూడం. ఆ మధ్య కొద్దినెలల క్రితం మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన (మా) నాకు ప్రత్యేకంగా సన్మానం చేసినపుఁడు కూడా అనారోగ్యం వల్ల ఆయన సభలో లేరు. సభలో ఎన్ని తారలున్నా, చంద్రుడు లాంటి దాసరి లేకపోవడం, రాలేకపోవడం లోటు అని సభాముఖంగా చెపాఁను. ఇవాళ నిజంగానే తారలెన్ని ఉన్నా, సినీ తారాలోకం చంద్రుడు లేక కళావిహీనమైపోయింది. ఆయనకు జన్మాంతర రహిత శివసాయుజ్యం కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. -ప్రముఖ దర్శకుడు, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు విజేత కె. విశ్వనాథ్‌ చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు తీసిన దర్శక రచయితపిడుగు లాంటి ఈ వార్త ఇపుఁడే తెలిసింది. పోర్చుగల్‌లో పదిహేనో శతాబ్దం నాటి చర్చి ప్రాంగణంలో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ వారి చిత్రం షూటింగ్‌లో ఉన్నాం. భారత కాలమానం కన్నా నాలుగున్నర గంటల వెనక కాబట్టి, ఇప్పుడిక్కడ మధ్యాహ్నమే అయింది. ఉన్నట్టుండి ఉరుము లేని పిడుగులా ఈ వార్త తెలియడంతో దిగ్ర్భాంతికి గురయ్యా. దాసరి గారు నాన్న గారికి ఎంతో సన్నిహితులు. నాకెంతో ఆత్మీయులు. నాన్న గారితో చరిత్రలో నిలిచిపోయే సర్దార్‌ పాపారాయుడు, బొబ్బిలిపులి లాంటి అద్భుతమైన చిత్రాలెన్నో తీశారు. దాసరి గారు గొప్ప దర్శకులే కాదు, గొప్ప రచయిత కూడా! శతాధిక చిత్రాలకు దర్శక రచయితగా రెండు బాధ్యతలూ సమర్థంగా నిర్వహించడం ఆయనకు మాత్రమే చెల్లింది. అలాంటి చరిత్ర మరొకరికి లేదు, రాదు. ఈ క్షణంలో ఇంతకు మించి ఏం చెప్పాలో కూడా మాటలు రావడం లేదు. -పోర్చుగల్‌ నుంచి ఆంధ్రజ్యోతితో హీరో నందమూరి బాలకృష్ణ ఒక శకం ముగిసింది!దాసరి గారి మరణంతో మా దర్శక కులానికే పెద్ద దిక్కు పోయింది. ఒక శకం ముగిసిపోయింది. కానీ, లెజెండ్స్‌ ఎప్పుడూ జీవించే ఉంటారు. ఉయ్‌ లవ్‌ యూ సర్‌... ఉయ్‌ మిస్‌ యూ సర్‌!-పోర్చుగల్‌ నుంచి దర్శక నిర్మాత పూరీ జగన్నాథ్‌ అన్నం పెట్టిన మహనీయుడు నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానూ అంటే, దానికి మూల కారణం దాసరి గారే. నేను సినిమా రంగానికి అట్లూరి పూర్ణచంద్రరావు గారి ద్వారా పరిచయమైనా, ఆ తరువాత తిరపతి చిత్రం ద్వారా నాకు ఈ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చి, పైకి తీసుకువచ్చింది మా గురువు దాసరి గారే. ఆ చిత్ర నిర్మాణ సమయంలో నా విధానం, నడవడిక నచ్చి మురళీ... నీ పద్ధతి నాకు నచ్చింది. నిన్ను పెద్ద హీరోను చేస్తాను అంటూ మాట ఇచ్చారాయన. ఇవ్వడమే కాకుండా, ఆ తరువాత దాదాపు నలభై చిత్రాల్లో అవకాశం కలిఁంచి, నాకు కొత్త జన్మ ఇచ్చారు. నటుడిగా నన్ను ప్రోత్సహించి, ఏ పాత్ర ఎలా చేయాలో, ఎలా నటించాలో నేరిఁ నన్ను తీర్చిదిద్దారు. ఆయన దగ్గర పనిచేసిన భారతంలో ఒక అమ్మాయి, కల్యాణి, ముద్దబంతి పువ్వు, ఇదెక్కడి న్యాయం లాంటి చిత్రాలు నాకెంతో గుర్తింపు తెచ్చాయి. పాలకొల్లు లాంటి ఒక చిన్న ఊళ్ళో పుట్టి, స్వశక్తితో సినిమా రంగంలో ఇంత స్థాయికి రావడం దాసరి గారికే చెల్లింది. రచన, నిర్మాణం, దర్శకత్వం ఇలా అన్ని విభాగాల్లో పట్టున్న ఆయనను చూసి, అక్కినేని నాగేశ్వరరావు గారు ఎపుఁడూ హ్యూమన కంప్యూటర్‌ అనేవారు.  నాటక రంగం నుంచి వచ్చిన ఆయన హైదరాబాద్‌కు వచ్చాక కూడా ఆ రంగం పురోభివృద్ధికి కృషి చేశారు. ఆయన స్థాయికి పెద్ద పెద్ద హీరోలతో సినిమా చేయగలిగినా, ఎపుఁడూ చిన్న టెక్నీషియన్లతో, నటీనటులతో సినిమాలు చేసి వాటిని పెద్ద హిట్‌ చేయాలని చూసేవారు. అలాగే చేశారు. అలా నా లాంటి ఎంతోమందికి సినిమా రంగంలో అన్నం పెట్టిన మహనీయుడు ఆయన. అమెరికాలో సుదూరంగా ఉండడంతో ఆయన చివరి ఘడియల్లో ఆయన దగ్గర ఉండలేకపోయినందుకు నేనెంతో బాధపడుతున్నా. తానా సభలకు వచ్చే ముందు కూడా గురువు గారితో మాట్లాడా. నువ్వు వెళ్ళిరా. వచ్చే లోగా చిన్న చిన్న ఇబ్బందుల్ని కూడా అధిగమించి, పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా తయారవుతా అన్న వ్యక్తి ఇంతలోనే కన్నుమూశారని తెలిసి నిశ్చేష్టుడినయ్యా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి నూటయాభైకి పైగా చిత్రాలు తీసిన దర్శకుడు, హీరోల డామినేషనను పక్కకునెట్టి, దర్శకుల డామినేషన తెచ్చిన వ్యక్తి అంటే ఆయనే. ఇవాళ నేను ఒక కుటుంబ సభ్యుణ్ణి కాదు... ఒక దేవుణ్ణి కోలోఁయా. -అమెరికా నుంచి ఆంధ్రజ్యోతితో నటుడు మురళీమోహన్ ఎలాగ తీరాలి... ఈ రుణమెలాగ తీరాలి!సృష్టిలో ప్రతి దానికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. గోరింటాకూ అంతే. తాను పెట్టుకున్న చేతిని పండించి, ఎన్నో రంగులు పూయించి తాను మాత్రం రాలిపోతుంది అంటూ మా కాంబినేషనలో వచ్చిన గోరింటాకు చిత్రానికి అద్భుతమైన క్యాప్షన రాశారు ఆ చిత్ర దర్శకుడైన దాసరి గారు. తెలుగు సినిమా రంగానికి ఎన్నో రంగులు కలిఁంచి, ఇవాళ ఒక గోరింటాకులా రాలిపోయారాయన. తెలుగు సినిమా నిర్మాతల చరిత్ర రాస్తున్నపుఁడు కానీ, అనేక ఇతర విషయాల్లో కానీ నాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా అన్ని విధాలా అండదండగా నిలిచిన కార్యశూరుడు ఆయన. అలాగే, తోటి రచయిత కష్టం గుర్తించి, రచయిత బొల్లిముంత శివరామకృష్ణ గారి ఆర్థిక పరిస్థితి తెలుసుకొని తెలుగు నిర్మాతల ట్రస్ట్‌ తరఫున ఆయనకు జీవితాంతం నెల నెలా డబ్బు పంపే ఏరాఁటు చేసిన మానవతా మూర్తి. ఆయన నూటయాభైకి పైగా సినిమాలు తీస్తే, అందులో స్ర్కీన ప్లేగా రైటర్‌గా తన పక్కన చోటిచ్చింది నా ఒక్కరికే. గోరింటాకులో నా పేరూ తన పేరుతో కలిపి వేసిన గొపఁ మనసు. నాకెంతో ఇష్టమైన మహానటి సావిత్రి గారికి ఆ సినిమాలో ప్రత్యేక పాత్ర కలిఁంచిందీ ఆయనే. అలాంటి మహోన్నత వ్యక్తితో నాది ఋణానుబంధం. మా గోరింటాకులోని శ్రీశ్రీ గారి పాటలోనే చెపాఁలంటే... ఎలాగ తీరాలి... ఈ ఋణమెలాగ తీరాలి!-గోరింటాకు చిత్ర నిర్మాత యువచిత్ర కె. మురారి ‘‘భారతదేశంలోని గొప్ప దర్శకుల్లో దాసరిగారు ఒకరు. నాకు ఆప్తులు, అత్యంత సన్నిహితులు. ఆయన మరణం తెలుగు పరిశ్రమకే కాదు భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరనిలోటు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. దాసరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’- రజనీకాంత్ నాకు నట జీవితాన్ని ప్రసాదించిన తండ్రి సమానులు దాసరిగారు మరణ వార్తని జీర్ణించుకోలేకపోతున్నా. మనసుకు కష్టంగా ఉన్నా.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సాయినాధుని కోరుకుంటున్నా’’- మోహన్ బాబు ‘‘దాసరిగారి కుటుంబానికి నా సానుభూతి తెలుపుతున్నా. ఆయన మృతి తెలుగు పరిశ్రమకు తీరనిలోటు. ఆయనతో గడిపిన క్షణాలన్ని నాకు గుర్తొస్తున్నాయి. నా గురువు కె.బాలచందర్‌ గారు ఆయన్ని ఎంతో ఆరాధించేవారు’’- కమల్‌హాసన్ దాసరి నారాయణరావుగారి మరణవార్త తెలుసుకుని తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యాను. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నా. ఆయన కుటుంబానికి అందరి ప్రార్థనలు తోడుంటాయి- మహేశ్ బాబు దాసరిగారి మరణం పరిశ్రమకు తీరనిలోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. దాసరి గారి మరణం సంతాప సూచకంగా బుధవారం నుంచి మూడు రోజులపాటు మా సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు నిలిపివేస్తున్నాం’’.- పవన్ కల్యాణ్‌, త్రివిక్రమ్‌, రాధాకృష్ణ. తెలుగు చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కు దర్శకరత్న డా.దాసరి నారాయణరావుగారి మరణం యావత చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’- రాంచరణ్‌ ఇండస్త్రీకి మాత్రమే కాదు మా కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.- మంచు మనోజ్‌ ‘‘తెలుగువాడిని సత్తాను ప్రపంచానికి పరిచయం చేసి.. దర్శకుడి స్థాయిని పెంచిన దాసరిగారి మరణ వార్త నాకెంతో బాధ కలిగించింది’’.- శర్వానంద్‌, హీరో ‘‘అనారోగ్యం కారణంగా ట్రీట్‌మెంట్‌ తీసుకుని త్వరగా కోలుకొని ఇంటికొచ్చారు. ఇటీవల అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. ఇంతలోనే పెను విషాదంలాంటి ఆయన మరణవార్త వినాల్సి వచ్చింది. పరిశ్రమకు పెద్ద దిక్కులా ఉండే వ్యక్తిని మేం కోల్పోయాం’’- మా అధ్యక్షుడు శివాజీరాజా ‘‘దర్శకుడు అనే పదానికి గొప్ప అర్ధం తీసుకొచ్చిన వ్యక్తి దాసరిగారు. చదువుకుంటున్న రోజుల్లో ప్రేమాభిషేకం సినిమా చూసి ఎంతో ఏడ్చాను. ఇప్పుడాయన పరిశ్రమను వదిలివెళ్లి యావత్త సినిమా కార్మికుడిని ఏడిపిస్తున్నారు. ఆయన దగ్గర పని చెయ్యనివారు కూడా ఆయన్ను గురువుగారు అని పిలుస్తారు. ఆ స్థాయి పరిశ్రమలో మరెవ్వరికీ లేదు. ఆయన పుట్టినరోజంటే ఇండసీ్ట్ర మొత్తానికి పుట్టినరోజే. దాసరి ఇల్లు నిత్యాన్నధాన సత్రంలాంటిది. ప్రతి రోజు 50 మంది కళాకారులు, కార్మికులు ఆయన ఇంట్లో చెయ్యి కడగాల్సిందే’’- కాశీవిశ్వనాథ్‌, నటుడు ‘‘అన్నయ్యగారు లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాడు. పరిశ్రమపాలిట దేవుడు, మహానుభావును. అలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ దొరకరు. ఆయన బావుంటే వెయ్యిమంది బావుంటారు. ఆయన ఎక్కడికి పోలేదని ఇక్కడే ఉన్నారని భావిస్తున్నాను’’ - గీతాంజలి, నటి ‘‘హిమాలయాలను అందుకున్న మహోన్నత వ్యక్తి. పరిశ్రమకు ఆయన చెయ్యని సేవలేదు. ఆయనతో ఎన్నో సినిమాలు చేశాను. నన్ను చూస్తేనే నవ్వేవారు. ఆరె బ్రహ్మీ అని దగ్గర కూర్చొపెట్టకుని అన్నం పెట్టేవారు. సహాయానికి పెట్టింది పేరు ఆయనది. అటువంటి అరుదైన వ్యక్తి పరిశ్రమకు మళ్లీ దొరకరు. - బ్రహ్మానందం, హాస్యనటుడు దర్శక ద్రోణాచార్యుడు దాసరిగారు మన మధ్యలేరనే వార్త నా మనసుని కలచివేసింది. తెలుగు దర్శక శిఖరం అస్తమించింది. ఆయన చూపిన బాటలో మా దర్శకులం అంతా నడిచి ఆయన ఆశయాన్ని నెరవేరుస్తాం’’ - బోయపాటి శ్రీను ‘‘తెలుగు సినిమా గొప్ప వ్యక్తినీ, శక్తినీ కోల్పోయింది. ఎంతోమందికి జీవితానిచ్చిన దాసరిగారు మన అందరి హృదయాల్లో ఎప్పుడూ బతికే ఉంటారు’’.- వి.వి.వినాయక్‌ ‘‘తెలుగు పరిశ్రమకు కొత్త పొకడల్ని పరిచయం చేసిన దర్శకుడాయన. దర్శకుడు అనే పేరుని శిఖరాగ్రానికి తీసుకెళ్లారు. రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన సేవల్ని వర్ణించలేం. పరిశ్రమ పెద్దగా ఎన్నో సమస్యల్ని పరిష్కరించారు. నాన్నగారికి, ఆయనకు మంచి అనుబంధం ఉండేది. మా బ్యానర్‌లో అద్భుతమైన సినిమాలు తీశారు’’ - డి.సురేశ్ బాబు, నిర్మాత
entertainment
19,756
17-10-2017 02:12:40
డెన్మార్క్‌లో ఢీ..
 ఫేవరెట్లుగా సింధు, శ్రీకాంత్‌బరిలో సైనా, ప్రణీత్‌ నేటి నుంచి డెన్మార్క్‌ ఓపెన్‌ఒడెన్స్‌: స్వల్ప విరామం అనంతరం భారత స్టార్‌ షట్లర్లు మళ్లీ రాకెట్‌ సవారీ చేసేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం మొదలయ్యే డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జపాన్‌ ఓపెన్‌లో ఆరంభ రౌండ్లలోనే వెనుదిరిగిన పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ ఈ టోర్నీ నెగ్గి మళ్లీ విజయాల బాట పట్టాలని కోరుకుంటున్నారు. అగ్ర షట్లర్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో ఈ ఇద్దరూ భారత్‌ నుంచి టైటిల్‌ ఫేవరెట్లు. రియో ఒలింపిక్స్‌, వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప రజత విజేత సింధు రెండో సీడ్‌గా బరిలోకి దిగనుంది. ఈ సీజన్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న తెలుగు షట్లర్‌ ఇప్పటికే ఇండియా ఓపెన్‌, కొరియా ఓపెన్‌లను ఖాతాలో వేసుకుంది. అయితే, అదే జోరును జపాన్‌ ఓపెన్‌లో కొనసాగించలేకపోయిన సింధు రెండో రౌండ్‌లో ఆతిథ్య దేశ స్టార్‌ నొజోమి ఒకుహరా చేతిలో పరాజయం పాలైంది. అయితే, ఈ టోర్నీ తర్వాత మూడు వారాల విరామంలో మెరుగ్గా సన్నద్ధమైన సింధు ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. బుధవారం జరిగే ఆరంభ రౌండ్‌లో పదో ర్యాంకర్‌ చైనా ప్లేయర్‌ చెన్‌ యుఫెయిని ఎదుర్కోనుంది. ఆగస్టులో జరిగిన వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో చెన్‌ను ఓడించిన సింధు మరోసారి ఆమెపై పైచేయి సాధించి శుభారంభం చేయాలని కోరుకుంటోంది. క్వార్టర్స్‌లో ఆమెకు చైనా ప్లేయర్‌, ఏడో సీడ్‌ హి బింగ్జియావో ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక, గతేడాది కెరీర్‌ను ప్రమాదంలో పడేసిన గాయం నుంచి కోలుకొని నెమ్మదిగా ఒక్కో అడుగు ముందుకేస్తున్న సైనా నెహ్వాల్‌ దాదాపు ఏడాదిన్నర విరామం తర్వాత తొలి సూపర్‌ సిరీస్‌ నెగ్గాలని బలంగా కోరుకుంటోంది. వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో కాంస్యం నెగ్గిన 12వ ర్యాంకర్‌ సైనా.. జపాన్‌ ఓపెన్‌ రెండో రౌండ్‌లో కరోలినా మారిన్‌ చేతిలో ఓడిపోయింది. ఈ టోర్నీ తొలి రౌండ్‌లోనే మారిన్‌తో ఆమెకు సవాల్‌ ఎదురవనుంది. ముఖాముఖీ పోరుల్లో ఈ ఇద్దరూ 4-4తో సమంగా నిలిచారు. మరి, జపాన్‌ ఓపెన్‌ నెగ్గి ఉత్సాహంలో ఉన్న కరోలినాను నెహ్వాల్‌ ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాలి.  మరో టైటిల్‌పై శ్రీకాంత్‌ కన్నుపురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ ఫేవరెట్‌. వరుసగా మూడు టోర్నీల్లో ఫైనల్‌ చేరిన అతను ఇండోనేసియా, ఆస్ట్రేలియా టైటిళ్లు గెలిచాడు. వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప, జపాన్‌ ఓపెన్‌లలో క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరిన ఎనిమిదో ర్యాంకర్‌ శ్రీకాంత్‌ ఇప్పుడు మరో టైటిల్‌పై కన్నేశాడు. క్వాలిఫయర్‌ ఆటగాడితో అతను ఈ టోర్నీని ఆరంభించనున్నాడు. క్వార్టర్స్‌లో కిడాంబికి లోకల్‌ స్టార్‌ విక్టర్‌ అక్సెల్సెన్‌ రూపంలోగట్టి పోటీ ఎదురయ్యే ఆస్కారం ఉంది. ఇక, బి. సాయి ప్రణీత్‌, హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ కూడా టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సింగపూర్‌ ఓపెన్‌ ఫైనల్లో శ్రీకాంత్‌ను ఓడించిన ప్రణీత్‌ కెరీర్‌లో తొలి సూపర్‌ సిరీస్‌ కైవసం చేసుకోగా.. యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ ప్రీ నెగ్గిన ప్రణయ్‌.. ఇండోనేసియా ఓపెన్‌లో లీ చోంగ్‌ వీ, చెన్‌ లాంగ్‌లను ఓడించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆరంభ రౌండ్‌లో ఎమిల్‌ హోల్ట్‌ను ప్రణయ్‌, క్రిస్టియన్‌ విట్టింగ్‌సను ప్రణీత్‌ ఎదుర్కోనున్నారు. సయ్యద్‌ మోదీ గ్రాండ్‌ విజేత సమీర్‌ వర్మ క్వాలిఫయర్‌తో పోరు ఆరంభించనున్నాడు. యూఎస్‌ ఓపెన్‌లో రన్నర్‌పగా నిలిచి మళ్లీ ఫామ్‌ అందిపుచ్చుకున్న కశ్యప్‌ డెన్మార్క్‌కు చెందిన విక్టర్‌ స్వెండ్సెన్‌తో తలపడతాడు. పురుషుల డబుల్స్‌లో సుమీత్‌ రెడ్డి-మను అత్రి, సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి, మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి రేసులో ఉన్నారు. మిక్స్‌డ్‌ జంట సాత్విక్‌సాయిరాజ్‌-అశ్విని జోరు కొనసాగించాలని చూస్తోంది. ప్రణవ్‌ జెర్రీ చోప్రాతో కలిసి సిక్కిరెడ్డి మిక్స్‌డ్‌లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
sports
9,692
07-03-2017 22:09:27
భళా... భానుమతి!
ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ వంటి ప్రముఖ కథానాయకులు తన చిత్రాల్లో నటించినప్పటికీ ‘నా సినిమాల్లో నేనే హీరోని, హీరోయిన్‌ని’ అని ప్రకటించే దమ్ము ఆ రోజుల్లో భానుమతికే ఉండేదంటారు. ఆమె మాటల్లో అహంకారం ధ్వనించినా అది ఆమె సహజలక్షణంగా భావించి మిగిలినవారు సరిపెట్టుకొనేవారు. బహుముఖ ప్రజ్ఙకు భాష్యంగా నిలిచిన భానుమతి తెలుగు చిత్రపరిశ్రమలో నిర్వహించని శాఖ లేదు. నటన, నిర్మాణం, దర్శకత్వం, గానం, రచన.. ఒకటేమిటి.. అన్నీ. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకొన్న ‘చండీరాణి’ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా అందులో ద్విపాత్రాభినయం చేసి రికార్డ్‌ నెలకొల్పారు భానుమతి. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ఆమెకు వంక పెట్టలేం. కేరెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారిన తర్వాత కూడా సినిమాలో హీరో ఎవరున్నా కథను నడిపే కీలక పాత్రలు మాత్రమే చేయడం ఆ తరంలో భానుమతికి మాత్రమే చెల్లింది.
entertainment
21,038
30-08-2017 01:40:54
గౌరవ్‌కు పతకం ఖాయం
వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో సెమీస్‌కు హాంబర్గ్‌: వరల్డ్‌ చాంపియన్‌ షిప్స్‌లో యువ బాక్సర్‌ గౌరవ్‌ బిధూరి సెమీస్‌కు చేరి కనీసం కాంస్యం ఖాయం చేసుకున్నా డు. బాంటమ్‌ వెయిట్‌ (56 కిలోలు) కేటగిరిలో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ గౌరవ్‌ బిధూరి.. ట్యునీసియా బాక్సర్‌ బీలెల్‌ మహమ్‌దిపై నెగ్గి సెమీస్‌ చేరుకున్నాడు. దీంతో వికాస్‌ క్రిషన్‌ తర్వాత ఆడిన తొలి వరల్డ్‌ చాంపి యన్‌షిప్స్‌లోనే పతకం ఖాయం చేసుకున్న రెండో ప్లేయర్‌గా నిలిచాడు. అయితే మెగా ఈవెంట్‌లో వికాస్‌, విజేందర్‌ సింగ్‌, శివ థాపాలు కాంస్యాలు మాత్రమే సాధించా రు. ఇప్పడు గౌరవ్‌ వారిని అధిగమించి పసిడి పంచ్‌ విసురుతాడో? లేదో? చూడా లి. కాగా, అమిత్‌ పంగల్‌ (49 కిలోలు), కవీందర్‌ బిస్త్‌ (56 కిలోలు) క్వార్టర్స్‌లోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అమి త్‌.. ఒలింపిక్‌ చాంపియన్‌ హసన్‌బాక్‌ దుస్మతోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌) చేతిలో, కవీం దర్‌.. ఇంక్యూ కిమ్‌ (కొరియా) ఓడారు.
sports
12,204
29-01-2017 01:19:57
బీజేపీకి.. ఆదిత్యనాథ్‌ సంస్థ ఝలక్‌!
యూపీలో ఎన్నికల బరిలోకి హిందూ యువ వాహిని గోరఖ్‌పూర్‌: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి హిందూ యువ వాహని(హెచ్‌వైవీ) ఝలక్‌ ఇచ్చింది. ఖుషీనగర్‌, గోరఖ్‌పూర్‌, మహారాజ్‌గంజ్‌ జిల్లాల్లోని ఆరు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులకు పోటీగా హెచ్‌వైవీ అభ్యర్థులు బరిలోకి దిగారు. హిందూ యువ వాహిని సంస్థను బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ ఏర్పాటు చేశారు. నేడు ఆ సంస్థే ఇలా తిరుగుబాటు ధోరణితో వ్యవహరించడంతో బీజేపీలో ఆందోళన నెలకొంది. అంతేకాదూ... రాష్ట్ర తూర్పు ప్రాంతంలోని మొత్తం 64 స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని హెచ్‌వైవీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌ సింగ్‌ ప్రకటించారు. ఇదిలావుండగా, యోగి ఆదిత్యనాథ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీలో, ముఖ్యంగా ఆదిత్యనాథ్‌కు బలమున్న తూర్పు ప్రాంతంలో గట్టి డిమాండ్‌ ఉంది. తమ నాయకుడు ఆదిత్యనాథ్‌ను బీజేపీ అవమానించిందనీ, పది మందిని సిఫారసు చేస్తే కేవలం ఇద్దరికే బీజేపీ టికెట్లు ఇచ్చిందని హెచ్‌వైవీ వర్గాలు తెలిపాయి. అయితే, యువ వాహిని తీరును ఆదిత్యనాథ్‌ తప్పుబట్టారు. సంస్థ ఆలోచనలు, విధానాలకు వ్యతిరేకంగా నడుస్తున్నవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
nation
9,851
18-02-2017 12:19:19
అనుపమా నిర్ణయాల వెనుక ఈ హీరో హస్తం ఉందా..?
ఒక సినిమాలో జంటగా నటించిన హీరో హీరోయిన్స్‌ మధ్య సహజంగానే కొంత చనువు ఏర్పడుతుంది. ఆ తరువాత సినిమా పబ్లిసిటీ పేరుతో మరింత దగ్గరవుతారు. ‘శతమానం భవతి’ హీరోహీరోయిన్లు అయిన  అనుపమా,శర్వానంద్ మధ్య సరిగ్గా ఇలాగే జరిగింది. వీరిద్దరూ ఇప్పటికే చాలా క్లోజ్‌ అయ్యారనీ, ఇద్దరి మధ్యా ఏదో నడుస్తోందనీ టాలీవుడ్‌ జనాలు అంటున్నారు.  సినిమాల ఎంపికలో హీరో సలహాలు, సంప్రదింపులు తీసుకుంటోందట హీరోయిన్‌! ఇందుకే ఇటీవల రెండు సినిమాలను వదులుకుంది. ఈ సినిమాలను వదులుకోవడానికి పలు కారణాలు బయటకు వచ్చినా, దీని వెనుక హీరో హస్తం ఉందనీ, అతగాడి సలహా మేరకే వాటిని వదులుకుందనీ అంటున్నారు. ‘ఇదిగో తోక అంటే అదిగో పులి’ అనే సినీజనాలకు వీరిద్దరూ మంచి టాపిక్‌ అయ్యారని మరికొందరు చెబుతున్నారు.
entertainment
2,629
16-07-2017 01:59:56
జిఎస్‌టిపై అపార్థాల ప్రచారం : జైట్లీ
లూథియానా : అత్యంత సులభమైన జిఎస్‌టి పన్ను విధానంపైనా లేనిపోని అపార్థాలు ప్రచారం చేశారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్కెట్‌లో మొబైల్‌ ఫోన్లు ప్రవేశ పెట్టినపుడూ ఇలాంటి పుకార్లే వ్యాప్తి చేశారన్నారు. ‘ఇది చాలా సులభమైన పన్ను విధానం. చట్టాన్ని పాటించే పన్ను చెల్లింపుదారులు ఎవరూ అధికారుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వారు ఆన్‌లైన్‌లోని రిటర్న్‌లు, అసెస్ మెంట్‌ ఆర్డర్లు ఆన్‌లైన్‌ ద్వారానే ఫైల్‌ చేయవచ్చు’ అన్నారు. అయితే జిఎస్‌టి హయాంలోనూ పన్నులు ఎగవేయాలని అతి తెలివి చూపించే వారికి మాత్రం తిప్పలు తప్పవని జైట్లీ హెచ్చరించారు.న్యాయ సేవలపైనా జిఎస్‌టి : లాయర్లు అందించే న్యాయ సేవలూ జిఎస్‌టి పరిధిలోకి వస్తాయని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ (సిబిఇసి) స్పష్టం చేసింది. అయితే ఈ భారం న్యాయ సేవలు అందుకునే ఖాతాదారులపైనే పడుతుంది. న్యాయ సేవలు అందించే సంస్థలకూ ఇది వర్తిస్తుంది. ఢిల్లీ హైకోర్టు అడిగిన వివరణకు సమాధానంగా సిబిఇసి ఈ విషయం తెలిపింది. 30 వరకే రిజిస్ట్రేషన్‌ : మరోవైపు ఇంకా జిఎస్‌టి కింద నమోదు కాని వ్యాపారులు సమయం వృధా చేసుకోకుండా ఈ నెల 30 లోగా నమోదు చేసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది.
business
9,797
06-09-2017 10:39:43
'జనసేన'లోకి పవన్ నన్ను పిలవకపోవడానికి కారణం అదే: నాగబాబు
తను ఆరెంజ్ సినిమాతో చాలా దెబ్బతిన్నానని.. పవన్ కల్యాణ్ చాలా సపోర్ట్ ఇచ్చినా తాను ఎలా సిట్యుయేషన్ నుంచి బయటపడాలని మదన పడ్డానని.. బుల్లితెర సపోర్ట్‌తో తాను పరిస్థితులను జయించానన్నారు నాగబాబు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు జనసేన పార్టీ గురించి ప్రస్తావించారు. తాను జనసేన పార్టీలోకి రావడమనేది కల్యాణ్ బాబు ఇష్టమన్నారు. ఆయన పని చేయమంటే తాను సిద్ధమన్నారు. అందరిలా తాను జాయిన్ అయి పని చేస్తాను అనడానికి తాను పబ్లిక్ కాదని.. తాను పవన్ అన్నయ్యనని అన్నారు. తాను పార్టీలోకి వస్తే పవన్‌కు ప్లస్ కాకున్న పర్వాలేదు కానీ మైనస్ కాకూడదని ఆలోచిస్తున్నానన్నారు. తనకు పదవులక్కర్లేదని పవన్ పిలిచి పని చేయమంటే ఓ కార్యకర్తగా కూడా పని చేస్తానన్నారు. పవన్ తనను పార్టీలోకి పిలవక పోవడానికి కారణం.. లైఫ్‌లో తాను పడ్డ కష్టాన్ని చూశారని.. ఇకపై తాను అంత కష్టపడనక్కర్లేదని ఫీలవుతున్నారన్నారు. ఆ యాంగిల్‌లో తనను పిలవకపోయి ఉండొచ్చన్నారు. పవన్ అంటే తనకు వ్యక్తిగా చాలా ఇష్టమన్నారు. వ్యక్తిగా పవన్ అమేజింగ్ పర్సన్ అని నాగబాబు కితాబిచ్చారు. చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేసిన పొలిటీషియన్  పవన్ కల్యాణ్ సినిమాకు మహేశ్ బాబు తోడయ్యాడు
entertainment
6,060
26-10-2017 23:11:28
వాటిని నమ్మొద్దు!
 నందమూరి కల్యాణ్‌రామ్‌తో ‘పటాస్‌’, సాయిధరమ్‌తేజ్‌తో ‘సుప్రీమ్‌’, ఇటీవల రవితేజతో ‘రాజా ది గ్రేట్‌’ చిత్రాలను రూపొందించిన దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఆయన తర్వాతి చిత్రం నితిన్‌తో ఉంటుందని కొన్నాళ్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే వాటన్నిటికీ చెక్‌ పెట్టేలా తన అభిప్రాయాన్ని ట్వీట్‌ చేశారు అనిల్‌. ‘‘నా తదుపరి సినిమా గురించి ఏమీ నిర్ణయించుకోలేదు. ఒకసారి ఫైనల్‌ అయిన తర్వాత ప్రకటిస్తా. కథతో నేను ఇంకా ఎవరినీ కలవలేదు. ఎవరికీ వినిపించలేదు. ఎలాంటి వదంతుల్ని నమ్మొద్దు’’ అని అనిల్‌ రావిపూడి ట్వీట్‌ చేశారు.
entertainment
17,734
05-02-2017 13:37:53
జమ్మూ కశ్మీర్‌లో హై అలర్ట్
శ్రీనగర్: భారత్‌పై దాయాది పాక్ దుస్సాహసానికి పాల్పడుతూనే ఉంది. సమయం దొరికితే చాలు ఎప్పుడు భారత్‌పై దాడి చేద్దామా అని చూస్తుంది. కశ్మీర్ యువతను లొంగదీసుకుని జవాన్లపై ఉసిగొల్పుతుంది. అందులో భాగంగానే ఆదివారం ‘కశ్మీర్ దినం’ను పాటిస్తోంది. ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ హింసను ప్రేరేపించే విధంగా హింసాత్మక వీడియోలు, చిత్రాలను కశ్మీర్ యువతను చూపిస్తూ వారిని రెచ్చగొడుతోంది. కశ్మీర్ స్వాతంత్ర్యం అంటూ పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్, లాహోర్, ఇస్లామాబాద్, మీర్పూర్, ముజఫరాబాద్ సహా పలు నగరాల్లో కార్యక్రమాలు చేపట్టారు. అయితే కశ్మీరీ యువత ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా.. హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్‌లో హై అలర్ట్ ప్రకటించాయి. పాక్‌లో, కశ్మీర్‌లో ఉన్న నిఘా సంస్థలు ఓ కన్నేసి ఉంచాయి. హఫీజ్ గృహ నిర్భందంలో ఉన్నా టెలికాస్ట్ ఉపన్యాసం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అనుమానిస్తున్నాయి.
nation
12,347
10-11-2017 01:47:01
కరుణ, కనిమొళి ఇళ్లలో సోదాలేవీ?: స్వామి
అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ, ఆమె కుటుంబ సభ్యులపై ఆదాయ పన్నుశాఖ అధికారులు సోదాలు చేయడంపై బీజేపీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి స్పందించారు. ‘శశికళకు వ్యతిరేకంగా నేను అనేక ఆధారాలు సమర్పించాను. వాటి ఆధారంగానే ఆమెకు జైలు శిక్ష పడింది. అలాగే మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, రాజ్యసభ సభ్యురాలైన ఆయన కుమార్తె కనిమొళి అవినీతి అక్రమాలకు సంబంధించి సుమారు 30 ఆధారాలను సంబంధిత అధికారులకు అందజేశాను. అయినా వారి ఇళ్లలో ఎందుకు ఐటీ సోదాలు జరగలేదు?’ అంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించారు.
nation
4,603
10-10-2017 22:13:56
కుమారుడిని ఎత్తుకున్న పవన్‌పై వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్..
పవన్ కళ్యాణ్-అన్నా లెజొనెవా దంపతులకు కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఇంతకు మునుపే 'పొలెనా' అనే పాప ఉండగా ఇప్పుడు బాబు జన్మించాడు. హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో అన్నా లెజొనెవాకు కాన్పు జరిగింది. కాన్పు అనంతరం ఆసుపత్రిలో బాబును ఎత్తుకుని మురిపెంగా చూస్తున్న పవన్ ఫోటో ఒకటి బయటకు వచ్చి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే తాజాగా రామ్‌గోపాల్ వర్మ ఈ ఫోటోను టాగ్ చేస్తూ పేస్‌బుక్ వేదికగా ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టాడు. 'తండ్రి ఊహకు అందనంత క్యూట్‌గా చూస్తున్నారు' అని రాసుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 25వ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి 'అజ్ఞాత వాసి' అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం.
entertainment
13,724
25-03-2017 10:56:31
ఆటలో అవినీతి..!
ఆంధ్రజ్యోతి, బెంగళూరు: గత ఏడాది బ్రెజిల్‌లో జరిగిన పారా ఒలింపిక్స్‌లో అవకాశం కల్పిస్తానని వికలాంగులైన అథ్లెటిక్స్‌ నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారని రామమూర్తి అనే వ్యక్తిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌కు చెందిన జోయితా కుమారి ఫిర్యాదు చేశారు. రామమూర్తి కూడా వికలాంగుడైన క్రీడాకారుడే. రామమూర్తి సుమారు నలుగురైదుగురు అథ్లెటిక్స్‌ నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన గతంలోనూ ఇటువంటి వసూళ్లకు పాల్పడి రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పారా ఒలింపిక్స్‌లో పాల్గొంటే పేరు సంపాదించవచ్చునని భావించారని ఇందుకోసం పాస్‌పోర్టు కూడా చేసుకున్నానని తన ఆశలు అడియాశలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇచ్చిన నగదు వాపస్‌ చేయడం లేదని కనీసం స్పందించడం లేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసే బాధ్యత ప్రత్యేక విభాగాలకు ఉంటుందని అయితే తనకు జాతీయ స్థాయిలో ప్రముఖులు తెలుసునని నమ్మించి వసూలు చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
nation
4,584
12-12-2017 12:17:34
అజ్ఞాతవాసి ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్!
అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ పూర్తైంది. వారణాసి షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని నిర్మాణాంతర పనుల్లో బిజీబిజీగా ఉంది. ఇటీవల ఫస్ట్‌లుక్ రిలీజ్ అయి దుమ్ము లేపింది. అయితే ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 19న ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్రబృందం సిద్ధమవుతున్నట్టు సమాచారం. హైదరాబాద్.. హెచ్ఐసీసీలో గ్రాండ్‌గా ఈ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్. అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. పవర్ స్టార్ పవన్ - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ నటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
entertainment
14,829
27-02-2017 02:53:13
ఇప్పుడొద్దు!
 కంపెనీలపై ఆంక్షలు  అమెరికన్ల మాదిరిగా ఉండాలి అమెరికాలో జాత్యహంకారం కొన్నిచోట్ల ఎక్కువ, కొన్నిచోట్ల తక్కువగా ఉంటుంది. ట్రంప్‌ అధ్యక్షుడు కావడంతో వలసవాదులపై ద్వేషం మరింత పెరిగింది. అందుకే అమెరికాలో అమెరికన్‌లా ఉండాలి. ఇంగ్లీషు మాట్లాడుతూ స్థానికులతో కలిసిపోవాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగవు. - రమేశ్‌ తంగెళ్లపల్లి  మన జాగ్రత్తలో మనం ఉండాలి ట్రంప్‌ వచ్చిన తర్వాత తమ ఉద్యోగాలను విదేశీయులు కొల్లగొడుతున్నారనే భావన అమెరికన్లలో మరింతగా పాతుకుపోయింది. విదేశీయులపై ద్వేషభావం పెరిగిపోయింది. ఈ సమయంలో భారతీయులు, తెలుగువారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనువుగానిచోట అధికులమనరాదనే నానుడిని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా జన సంచారం లేని ప్రాంతాల్లో ఉండొద్దు. బార్లు, రెస్టారెంట్లు, మాల్స్‌లో పొద్దుపోయే వరకు సంచరించొద్దు. నలుగురిలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి, అమెరికన్లకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు. - దీనబాబు కొండుభట్ల వాదనలకు దూరంగా ఉండాలి మా అన్నదమ్ములు అమెరికా వచ్చి 30 ఏళ్లు దాటింది. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. ట్రంప్‌ వచ్చిన దగ్గర నుంచి అందరిలో వారి ఉద్యోగాలు మనం (విదేశీయులు) పొందుతున్నామనే భావన పెరిగింది. ఈ వారంలో మా మూడు కుటుంబాలు కలిసి ఓ రెస్టారెంటుకు వెళితే అక్కడ ఒక అమెరికన్‌ మా అన్నయ్యతో మాట్లాడుతూ.. నీకెంత వస్తుంది? మా దేశం వచ్చి బాగా సంపాదిస్తున్నావ్‌? అనే ధోరణిలో మాట్లాడారు. అతనితో వాదించకుండా బయటకు వచ్చేశాం. జాతి విద్వేషం అత్యంత ప్రమాదకరమైంది. కొన్నాళ్లపాటు భారతీయులు సంయమనం పాటించాలి. ఎవరితోనూ అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. వాదనలు చేయొద్దు.! - బుచ్చి రాంప్రసాద్‌, ఏపీఎన్‌ఆర్‌టీ చీఫ్‌ కో ఆర్డినేటర్‌ రెచ్చగొడితే రెచ్చిపోవద్దు బహిరంగ ప్రదేశాల్లో వాదనలకు దూరంగా ఉండాలి. ఎవరైనా గొడవ పడాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టే ధోరణితో కనిపిస్తే అక్కడి నుంచి ఎదురు మాట్లాడకుండా వెళ్లిపోవాలి. మాతృ భాషపై ఎంత ప్రేమ ఉన్నప్పటికీ.. ఎక్కడ పడితే అక్కడ తెలుగులో మాట్లాడకూడదు. ముఖ్యంగా పబ్లిక్‌ ప్లేసె్‌సలో ఇంగ్లీషులోనే మాట్లాడాలి. కొన్ని ప్రదేశాల్లో ఎక్కువ సమయం ఉండకూడదు. - ఝాన్సీ రెడ్డి, అధ్యక్షురాలు, తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టీఎటీఏ)
nation
13,161
18-02-2017 11:16:33
తర్వాతి సీఎం తలైవానే... చెన్నైలో వెలిసిన పోస్టర్లు
చెన్నై: నిలువెత్తు ఖద్దరు దుస్తులు... చేతులు మడుస్తూ ఠీవిగా నడుస్తున్న సూపర్ స్టార్... పక్కనే కోట్లు వేసుకుని అటో నలుగురు ఇటో నలుగురు సెక్యురిటీ, అధికారులు... తమిళనాడు ముఖ్యమంత్రిగా తలైవానే కావాలంటూ చెన్నైయ్‌లో వెలిసిన పోస్టర్లు స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జయలలిత మరణించిన అనంతరం ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు ఆమె అనుచరులు నేనంటే నేనంటూ హైడ్రామాకి తెరతీసిన సంగతి తెలిసిందే. ఏఐఏడీఎంకే పార్టీలో రెండు నెలల నుంచి కొనసాగుతున్న ముసలం ఇంకా సద్దుమణకలేదు. ఈ నేపథ్యంలో అందరి చూపు తమిళ తంబీలు తలైవాగా అభిమానించే (తలైవా అంటే నాయకుడు అని అర్థం) సూపర్ స్టార్ రజినీకాంత్‌పై పడింది. రాజకీయాల్లోకి రావాలంటూ ఎన్నో ఏళ్లుగా అభిమానుల నుంచి డిమాండ్ వస్తున్నా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఏకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కోరినా ఇంకా సమాధానం చెప్పలేదు. ఈలోగా ఆయన అభిమానులు ‘తర్వాతి సీఎం తలైవానే’ అంటూ పోస్టర్లు ముద్రించి గోడలకు అతికిస్తున్నారు. వాటిని చూసినవారు కూడా అదే నిజమైతే బాగుండునని కోరుకుంటున్నారు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన వస్తేనే బాగుంటుందని చెబుతున్నారు. పట్టుమని పదిరోజులు కూడా పరిపాలించే అవకాశం లేకుండా... తాత్కాలిక ముఖ్యమంత్రుల పాలన కొనసాగుతున్న తరుణంలో ఆయన వస్తే పరిస్థితి మారుతుందని ఓ అభిమాని పేర్కొన్నాడు. ఓ వైపు ప్రజల్లో కొనసాగుతున్న అభిమానం, మరోవైపు ప్రధాన రాజకీయ పక్షాల మద్దతు ఉన్న రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే తమిళనాడు ముఖచిత్రం కొత్తగా మారడం ఖాయమని అంటున్నారు.
nation
3,816
28-11-2017 01:44:57
రెండు వేడుకలు
హైదరాబాద్‌ మహానగరం నేడు రెండు ప్రధాన ఘట్టాలకు వేదిక కాబోతున్నది. భాగ్యనగరవాసులు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మెట్రోరైల్‌కు ప్రధాని నరేంద్రమోదీ పచ్చజెండా ఊపుతారు. ఆ వెంటనే హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌) ఆరంభం కాబోతున్నది. నగర ప్రజారవాణా వ్యవస్థను గుణాత్మకంగా మెరుగుపరచగలిగే మెట్రోరైల్‌ ఆరంభంతోపాటు, దక్షిణాసియాలో తొలిసారిగా జరగబోతున్న జీఈఎస్‌ సదస్సులో ప్రధాని పాల్గొనడం, దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ హాజరుకావడంతో హైదరాబాద్‌ నగరం అందంగా ముస్తాబైంది. దానితో పాటు అసాధారణమైన భద్రతా ఏర్పాట్లను కూడా చవిచూస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారవేత్తలను, పెట్టుబడిదారులను ఒకేతాటిపైకి తెచ్చే ఉద్దేశంతో 2010లో ఏర్పాటైన జీఈఎస్‌ తన తొలి సదస్సును అమెరికాలో జరుపుకున్నది. అనంతరం ప్రతి ఏటా ప్రపంచంలోని ఏదో ఒక నగరంలో ఇది జరుగుతూ వస్తున్నది. భారతదేశం ఆతిథ్యం ఇస్తున్న ఈ 8వ సదస్సుకు వేదికగా హైదరాబాద్‌ ఎనిమిది రాష్ట్రాలతో పోటీపడి నెగ్గడం, ‘ఉమెన్‌ ఫస్ట్‌, ప్రాస్పరిటీ ఫర్‌ ఆల్‌’ అంటూ ఈ సదస్సు ప్రధానంగా మహిళా పారిశ్రామిక వేత్తలకు పెద్దపీట వేయడం విశేషం. పెట్టుబడుల ఒప్పందాలంటూ ఇక్కడ జరగకపోయినా, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తమ ఆలోచనలు పంచుకోవడం, యువపారిశ్రామికవేత్తలను, అంకుర సంస్థలను ఎదిగిన పారిశ్రామికవేత్తలు ప్రోత్సహించడం, పెట్టుబడులకు సహాయం చేయడం వంటివి లక్ష్యాలు కనుక అనేక వినూత్నమైన ఆలోచనలు వ్యాపార సంస్థలుగా మారేందుకు ఈ సదస్సు దోహదం చేస్తుంది. పారిశ్రామిక దిగ్గజాల స్ఫూర్తిదాయక సలహాలతో, ఆర్థిక తోడ్పాటుతో నవపారిశ్రామిక వేత్తలు ఎదిగేందుకు వీలుకలుగుతుంది. 150 దేశాల నుంచి పదిహేనువందల మంది ప్రతినిధులు పాల్గొనే హైదరాబాద్‌ సదస్సులో సగానికి పైబడి మహిళలే ఉండటం, పదిదేశాల నుంచి పూర్తిగా మహిళాబృందాలే రావడం మహిళా సాధికారతకు ఇతోధికంగా దోహదం చేస్తుంది. ఈ మూడురోజుల అంతర్జాతీయ సదస్సుకు ఉన్న స్వయం ప్రాధాన్యత అటుంచితే, అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తూ ఇవాంకా ట్రంప్‌ వస్తుండటం హడావుడిని మరింత పెంచింది. ఆమె కేంద్రంగా జరుగుతున్న అసాధారణమైన భద్రతా ఏర్పాట్లు, ఆతిథ్యాలపై మీడియా కథనాలు అందిస్తున్నది. విదేశీ ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొనే ఈ సదస్సుకూ, తరలివస్తున్న దేశప్రధానికీ, కేంద్రమంత్రులకూ, అమెరికా అధ్యక్షుడి పుత్రికకూ ఏర్పాట్లలో ఏ లోటూ లేకుండా చూడటం కత్తిమీద సామే. కానీ, ఈ సదస్సు హైదరాబాద్‌ను మరోమారు పెట్టుబడుల కేంద్రంగా గ్లోబల్‌ స్థాయిలో పరిచయం చేసేందుకు అవకాశమిస్తుందన్న మాట వాస్తవం. హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్టు అనేక కారణాలతో అనుకున్న దానికంటే ఆలస్యమైనప్పటికీ, ఏకకాలంలో ముప్పై కిలోమీటర్ల మేరకు రైళ్ళు నడపగల స్థాయిలో ఆరంభం కాబోతుండటం విశేషం. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సంకల్పించిన ఈ తొలి ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అద్భుతమే. సత్యం సంస్థ ఆర్థికంగా దెబ్బతినడంతో మెట్రో నిర్మాణాన్ని ఆదిలో స్వీకరించిన మేటాస్‌ సంస్థ పక్కకు తప్పుకోవడంతో ఆరంభంలో ఈ ప్రాజెక్టు ఎదురుదెబ్బ తిన్నది. ఆ తరువాత ఎల్‌ అండ్‌ టీ చేతుల్లోకి పోయి, దశాబ్దానికిపైగా రాజకీయ, న్యాయ వివాదాలు చుట్టుముట్టినా, ప్రాజెక్టు వ్యయం పెరిగిపోయినా, ప్రభుత్వాలు మారినా, రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ఎట్టకేలకు ప్రధానమైన భాగాన్ని పూర్తిచేసుకొని ఇప్పుడు కీలకమైన దశకు చేరుకుంది. ట్రాఫిక్‌ జామ్‌లతో గంటల తరబడి రోడ్లమీద నిలిచిపోయే హైదరాబాదీయులకు ఎంఎంటీఎస్‌ ఇతోధికంగా ఉపకరిస్తున్నా, దానిని విస్తరించాలన్న ఆలోచనలు ఆశించినంత మేరకు సాగలేదు. హైదరాబాద్‌కు భూగర్భ రైల్వే ఉపయోగిస్తుందా, ఎత్తైన పోతస్తంభాలపై పరుగులు తీస్తూ గగనవిహార సౌఖ్యాన్ని అందించే ఎలెవేటెడ్‌ మోడల్‌ అవసరమా అన్న చర్చ కూడా గతంలో విస్తృతంగా సాగింది. ఎట్టకేలకు దీనినే ఎంచుకోవడం, అనేక అవాంతరాలను దాటుకొని ఇప్పుడు అది ఆరంభానికి నోచుకోవడం ఆనందించలసిన ఘట్టం. 70 కిలోమీటర్ల మార్గాన్నీ వచ్చే ఏడాదికల్లా పూర్తిచేయాలన్న లక్ష్యంలో ప్రభుత్వం ఉన్నది. ప్రస్తుత ప్రయాణమార్గం మూడున్నర లక్షలమందికి ఉపకరిస్తే, మూడుకారిడార్లలో తొలిదశ పూర్తయితే ౧6లక్షల మందికి ఉపకరిస్తుంది. మహానగర రవాణా సమస్యను మెట్రోరైలు ఒక్కటే పరిష్కరిస్తుందా అన్న వాదనను అటుంచితే, ఆరంభోత్సవం అనంతరం కూడా ఈ ప్రాజెక్టును ఇదే వేగంతో పూర్తిచేస్తే ట్రాఫిక్‌ బాధల నుంచి నగర ప్రజలకు కచ్చితంగా చక్కని ఉపశమనం దక్కుతుంది.
editorial
20,369
27-05-2017 01:48:39
పేస్‌ గన్స్..
జెంటిల్మెన్ గేమ్‌ క్రికెట్‌ ఈ మధ్య కాలంలో బ్యాట్స్‌మెన్ ఆటగా మారిపోయింది...! నిర్జీవమైన పిచ్‌లపై అలవోకగా పరుగుల వరద పారిస్తున్నారు. వారికి ముకుతాడు వేసి మ్యాచ్‌లు నెగ్గాలంటే మంచి బౌలర్లు కావాల్సిందే..! వీరబాదుడు బ్యాటింగ్‌తో ఎంత పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించినా దాన్ని కాపాడుకోవాలంటే నిఖార్సైన పేసర్లు జట్టులో ఉండాల్సిందే..! అందునా పచ్చటి పచ్చికతో కూడిన పిచ్‌లు.. పేస్‌కు స్వర్గధామమైన ఇంగ్లండ్‌ వికెట్లు.. సీమ్‌కు అనుకూలించే అక్కడి వాతావరణంలో ఫాస్ట్‌ బౌలర్లు ఎంతో కీలకం..! దాంతో, మరో ఐదు రోజుల్లో మొదలవనున్న చాంపియన్స్ ట్రోఫీలో బౌలర్లే లీడర్లు కానున్నారు..! ఈ నేపథ్యంలో బుల్లెట్లలాంటి బంతులు సంధిస్తూ బ్యాట్స్‌మెనకు సవాల్‌ విసిరే కొంతమంది ‘పేస్‌ గన్స్’ గురించి ఓ లుక్కేద్దాం..!: (ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం) భువనేశ్వర్‌ కుమార్‌ (భారత్)స్వదేశంలో అయినా.. విదేశాల్లో అయినా డెత్ ఓవర్లలో బౌలింగ్‌ భారత్‌కు ప్రధాన సమస్యగా ఉండేది. అయితే, భువనేశ్వర్‌ కుమార్‌ రాకతో ఆ సమస్య తొలగిపోయింది. గత రెండు మూడేళ్లుగా స్లాగ్‌ ఓవర్లలో టీమిండియా బౌలింగ్‌ చాలా మెరుగైంది. డెత్ ఓవర్లలో చక్కటి లెంగ్త్‌తో భువీ వేసే బంతులు ఎలాంటి బ్యాట్స్‌మెనకైనా సవాలే. ఆ సామర్థ్యం వల్లే ఐపీఎల్‌ కెప్టెన్లు భువీని తమ జట్టులోకి తీసుకోవాలని ఆరాటపడుతున్నారు. వరుసగా రెండు ఐపీఎల్‌ సీజన్లలో అతను బెస్ట్‌ బౌలర్‌గా నిలిచాడంటే మామూలు విషయం కాదు. ఆరంభంలో స్వింగ్‌ రాబట్టి.. ఆఖర్లో ఫుల్‌ లెంగ్త్‌ బాల్స్‌ విసిరే భువీకి ఇంగ్లండ్‌ పరిస్థితులు మరింత బలం చేకూర్చనున్నాయి. ఐపీఎల్‌లో ఏడు ఎకానమీతో 26 వికెట్లు పడగొట్టి మంచి ఫామ్‌లో ఉన్న అతను ఈ టోర్నీలో భారత్ టైటిల్‌ నిలబెట్టుకునే ప్రక్రియలో కీలక పాత్ర పోషించడం ఖాయమని అంతా భావిస్తున్నారు. మిచెల్‌ స్టార్క్‌ (ఆస్ట్రేలియా)కొన్నేళ్ల నుంచి మిచెల్‌ స్టార్క్‌ ఆస్ట్రేలియా బౌలింగ్‌ విభాగాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. 27 ఏళ్ల ఈ లెఫ్టార్మ్‌ స్వింగ్‌ బౌలర్‌ ఈ మధ్య కాలంలో మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీ‌స్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు. 65 వన్డేల్లో 129 వికెట్లు పడగొట్టిన స్టార్క్‌ ఇప్పటికే వరల్డ్‌ క్లాస్‌ ఫాస్ట్‌ బౌలర్‌గా అందరికీ సుపరిచితుడు. కొన్ని తీవ్రమైన గాయాలు అతని కెరీర్‌ను ఇబ్బంది పెట్టాయి. అయినా.. ఎంతో ధైర్యంతో వాటిని ఎదుర్కొన్న స్టార్క్‌ ప్రతీసారి అంకితభావంతో తిరిగొచ్చాడు. ఈ సీజన్ ఐపీఎల్‌లో పాల్గొనాల్సివున్నా.. చివరి నిమిషంలో తప్పుకొన్నాడు. అదే సమయంలో చాంపియన్స్ ట్రోఫీ కోసం తన బౌలింగ్‌ను మెరుగు పరుచుకునేందుకు కసరత్తులు చేశాడు. దాంతో, ఈ మెగా టోర్నీకి అతను పూర్తిగా సన్నద్ధుడై వస్తున్నాడు. మహమ్మద్‌ ఆమెర్‌ (పాకిస్థాన్)నాణ్యమైన పేసర్లకు పెట్టింది పేరైన పాకిస్థాన్ క్రికెట్‌లో మహమ్మద్‌ ఆమెర్‌ ఓ సంచలనం. అద్భుతమైన బౌలింగ్‌తో చిన్నవయసులో ఎంతో పేరు గడించిన ఆమెర్‌ స్పాట్‌-ఫిక్సింగ్‌ కుంభకోణంలో ఇరుక్కొని కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకున్నాడు. అయితే, ఐదేళ్ల వేటు అనంతరం గతేడాది బరిలోకి దిగిన అతను తన బౌలింగ్‌లో ఏ మాత్రం పదును తగ్గలేదని నిరూపించుకున్నాడు. 2016 ఆసియాకప్‌లో, ఇంగ్లండ్‌తో వన్డే సిరీ‌స్‌లో పాక్‌ జట్టులో కీలక పాత్ర పోషించాడతను. వన్డేల్లో చివరిస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్‌ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా ఆమెర్‌ రికార్డుకెక్కాడు. 32 వన్డేల్లో 50 వికెట్లు తీసిన ఈ స్వింగ్‌ స్టార్‌ పాక్‌ బౌలింగ్‌కు నాయకత్వం వహించనున్నాడు. ఈ మెగా టోర్నీలో పాక్‌ను విజేతగా నిలిపితే తన రీ ఎంట్రీ స్టోరీకి అతను పరిపూర్ణ న్యాయం చేసినవాడవుతాడు. కాగిసో రబాడ (దక్షిణాఫ్రికా)రెండేళ్ల కిందటే కాగిసో రబాడ వన్డే అరంగేట్రం చేసినా.. దక్షిణాఫ్రికా జట్టులో అతని ప్రభావం గణనీయం. 34 మ్యాచ్‌ల్లో 57 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల ఈ యువ బౌలర్‌ నిలకడకు మారు పేరు. ఎన్నో మ్యాచ్ విన్నింగ్‌ ప్రదర్శనలతో జట్టులో కీలకంగా మారాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అతనిప్పుడు ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌పై నెగ్గినచారిత్రక వన్డే సిరీస్‌లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ ఐపీఎల్‌లో అతను ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఐదు మ్యాచలే ఆడడంతో తన మార్కు చూపలేకపోయినా క్రమశిక్షణతో బౌలింగ్‌ చేశాడు. బ్యాట్‌తోనూ మెరిసి ఆకట్టుకున్నాడు. సఫారీ స్టార్‌ పేసర్‌ డేల్‌ స్టెయిన కెరీర్‌ చరమాంకంలో ఉన్న నేపథ్యంలో రబాడ ఆ జట్టు పేస్‌ దళాన్ని నడిపించడంలో ముందున్నాడు. ప్రస్తుతంలో ఇంగ్లండ్‌లో వన్డే సిరీస్‌లో పాల్గొనడం చాంపియన్స్ ట్రోఫీలో అతనికి ఉపయోగ పడనుంది. ముస్తాఫిజుర్‌ రహ్మాన్ (బంగ్లాదేశ్)21 ఏళ్ల ఈ బంగ్లా బౌలర్‌ 2015లో మీర్పూర్‌ వన్డేలో భారత బ్యాటింగ్‌ లైనప్‌ను కకావికలు చేస్తూ అరంగ్రేటంలోనే సంచలనం సృష్టించాడు. తొలి వన్డేలోనే ఐదు వికెట్లు తీసిన బంగ్లాదేశ్ రెండో బౌలర్‌గా రికార్డుకెక్కాడు ముస్తాఫిజుర్‌. అయితే, ఆ తర్వాత అంచనాలను అందుకోలేక కొద్దిగా నిరుత్సాహపరిచాడు. గాయాలు కూడా అతని లయను దెబ్బతీశాయి. కానీ, 2016 ఐపీఎల్‌లో అతను చేసిన ప్రదర్శనను ఎవరూ మర్చిపోలేరు. కట్టుదిట్టమెన బౌలింగ్‌తో 17 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసిన ఫిజ్‌ సన్‌రైజర్స్‌ విజేతగా నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఈ సారి ఐపీఎల్‌ కాదని జాతీయ జట్టుకే ప్రాధాన్యం ఇచ్చిన రహ్మాన్.. గత నెలలో శ్రీలంకతో టీ-20లో నాలుగు వికెట్లతో లయ దొరకబుచ్చుకున్నాడు. ఈ మెగా టోర్నీలో బంగ్లా పేస్‌ విభాగాన్ని అతను నడిపించనున్నాడు.
sports
13,998
03-03-2017 02:52:26
‘ఉగ్ర’ ప్రపంచానికి యోగాతోనే శాంతి
అంతర్జాతీయ యోగా వేడుకలో ప్రధాని మోదీ రిషీకేశ్‌, మార్చి 2: ‘ప్రపంచం ప్రస్తుతం రెండు ముప్పులు ఎదుర్కొంటోంది. ఒకటి.. ఉగ్రవాదం.. రెండోది వాతావరణ మార్పులు. ఉగ్రవాద సంక్షుభిత విశ్వంలో శాశ్వత శాంతి నెలకొనాలంటే యోగానే మార్గం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రుషీకేశ్‌లో పవిత్ర గంగానది తీరాన పరమార్థ నికేతన్‌లో జరుగుతున్న అంతర్జాతీయ యోగా వేడుకలో ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. యోగా కేవలం వ్యాయామ రూపం కాదని, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక చింతనతో శాంతిని సాధించే మార్గమని తెలిపారు. ‘యోగా మానవుడిని ప్రకృతి దరికి తీసుకెళ్తుంది. నేను అనే అహంభావం నుంచి మనం అనే విశాల భావనను కలిగిస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించగానే సభికులు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పుల నుంచి ప్రపంచం ముప్పు ఎదుర్కొంటున్న నేపథ్యంలో శాంతిస్థాపనకు యోగానే మార్గమని మోదీ స్పష్టం చేశారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరమార్థ నికేతన్‌ అధిపతి స్వామి చిదానంద సరస్వతికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
nation
6,058
07-04-2017 17:50:52
నిండైన కామెడీకి నిండా 55 వసంతాలు!
తనదైన కామెడీతో కబడ్డీ ఆడేసి ప్రేక్షకుల పొట్టలు చెక్కలు చేయడంలో దిట్ట కోవై సరళ. నేడు కోవై సరళ పుట్టినరోజు. 1962లో ఆమె జన్మించారు. కోవై సరళ తెరపై కనిపిస్తే చాలు చూసేవారిలో కితకితలు మొదలవుతాయి. తమిళనాట పుట్టినా, తెలుగునాట కూడా తనకంటూ ఓ ఫాలోయింగ్‌ను సంపాదించారు కోవై సరళ. సరళ కామెడీ కోసమే సినిమాలు చూసేవారున్నారంటే అతిశయోక్తి కాదు. తనదైన యాసతో జనానికి వినోదం పంచుతోందామె. కోవై సరళ ఒకానొక దశలో ఓ కమర్షియల్ ఎలిమెంట్‌గా మారారు. కోవై సరళ కామెడీ ఉందంటే చాలు జనం థియేటర్లకు పరుగులు తీసేవారు. అంతలా ఆకట్టుకున్న ఆ హాస్యనటికి సరిగా ఈ మధ్యకాలంలో మరొకరు కానరారు. తెలుగు చిత్రాల్లోనూ ఎప్పటి నుంచో నటిస్తున్నప్పటికీ కోవై సరళ, బ్రహ్మానందంతో కలసి పండించిన హాస్యంతోనే పాపులర్ అయ్యారు. బ్రహ్మానందం, కోవై సరళ పలు చిత్రాల్లో పండించిన హాస్యం కడుపుబ్బ నవ్వించడమే కాదు, సదరు చిత్రాల ఆదరణకు వారి కామెడీ ఎంతగానో తోడ్పడింది. ఈ నాటికీ కోవై పేరు చెప్పగానే బ్రహ్మీతో ఆమె చేసిన హాస్యమే ముందుగా గుర్తుకు వస్తుంది. కోవై సరళ మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.
entertainment
1,117
07-06-2017 01:05:35
మిడ్‌సెషన్‌ మెరుగు
తిథి : జ్యేష్ఠ శుక్ల త్రయోదశి నక్షత్రం : విశాఖఅశ్విని, మఖ, మూల నక్షత్ర జాతకులు, వృశ్చిక, మీన రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి. నిఫ్టీ : 9637.15 (-37.95) ట్రెండ్‌ మార్పు వేళలు : ఉదయం 9.50 ధోరణి : గ్రహగతులను బట్టి నిలకడ/నిస్తేజంగా ప్రారంభమై 11.25 వరకు నిస్తేజంగా ఉండి 11.30 నుంచి 1.30 మధ్యన మెరుగ్గా ట్రేడవుతూ ఆ తర్వాత నిస్తేజంగా మారే ఆస్కారం ఉంది. ట్రేడింగ్‌ వ్యూహం...నిఫ్టీ ఫ్యూచర్స్‌ 9.30 సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి) కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్‌లాస్‌తో షార్ట్‌ పొజిషన్లు తీసుకుని 11.30 సమయానికి క్లోజ్‌ చేసుకోవాలి. 11.45 తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్‌ పొజిషన్లు తీసుకుని 1.30 సమయానికి క్లోజ్‌ చేసుకోవాలి. ఇంట్రాడే ట్రేడింగ్‌కు ప్రారంభ స్థాయి కీలకం. అంతకన్నా దిగువన మాత్రమే షార్ట్‌ పొజిషన్లు శ్రేయస్కరం. నిరోధ స్థాయిలు : 9680, 9715 మద్దతు స్థాయిలు : 9600, 9565మధ్యాహ్నం సమయానికి నిరోధ స్థాయిలకు చేరితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ళు, మద్దతు స్థాయిలకు చేరితే కనిష్ఠ స్థాయిల్లో అమ్మకాలు నివారించాలి. రిస్క్‌ భరించగల వారు మాత్రం పుల్‌బ్యాక్‌ ఆశలతో పొజిషన్లు తీసుకోవచ్చు. గమనిక : ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నికల్‌ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచన. మార్కెట్‌ వాస్తవిక కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. అశ్విని, మఖ, మూల నక్షత్ర జాతకులు, వృశ్చిక, మీన రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి. నిఫ్టీ : 9637.15 (-37.95) ట్రెండ్‌ మార్పు వేళలు : ఉదయం 9.50 ధోరణి : గ్రహగతులను బట్టి నిలకడ/నిస్తేజంగా ప్రారంభమై 11.25 వరకు నిస్తేజంగా ఉండి 11.30 నుంచి 1.30 మధ్యన మెరుగ్గా ట్రేడవుతూ ఆ తర్వాత నిస్తేజంగా మారే ఆస్కారం ఉంది. ట్రేడింగ్‌ వ్యూహం...నిఫ్టీ ఫ్యూచర్స్‌ 9.30 సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి) కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్‌లాస్‌తో షార్ట్‌ పొజిషన్లు తీసుకుని 11.30 సమయానికి క్లోజ్‌ చేసుకోవాలి. 11.45 తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్‌ పొజిషన్లు తీసుకుని 1.30 సమయానికి క్లోజ్‌ చేసుకోవాలి. ఇంట్రాడే ట్రేడింగ్‌కు ప్రారంభ స్థాయి కీలకం. అంతకన్నా దిగువన మాత్రమే షార్ట్‌ పొజిషన్లు శ్రేయస్కరం. నిరోధ స్థాయిలు : 9680, 9715 మద్దతు స్థాయిలు : 9600, 9565మధ్యాహ్నం సమయానికి నిరోధ స్థాయిలకు చేరితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ళు, మద్దతు స్థాయిలకు చేరితే కనిష్ఠ స్థాయిల్లో అమ్మకాలు నివారించాలి. రిస్క్‌ భరించగల వారు మాత్రం పుల్‌బ్యాక్‌ ఆశలతో పొజిషన్లు తీసుకోవచ్చు. గమనిక : ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నికల్‌ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచన. మార్కెట్‌ వాస్తవిక కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి.
business
16,331
02-09-2017 17:37:08
’ఆఫ్రికా దేశాల కన్నా భారత్ వెనుకబడింది‘
న్యూఢిల్లీ : ఆర్థిక, డిజిటల్ ఇంక్లూజన్‌లో ఐదు ఆఫ్రికా దేశాల కన్నా భారతదేశం వెనుకబడింది. ఉగాండా, నైజీరియా వంటి దేశాలు మన దేశాన్ని అధిగమించాయి. బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. దీనినిబట్టి ఫైనాన్షియల్ సర్వీసెస్, డిజిటల్ కంపెనీలకు మన దేశంలో మంచి అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్ పరిశీలించిన నాలుగు అంశాల్లో మూడింట్లో భారతదేశం పరిస్థితి బాగానే కనిపించింది. ఫైనాన్షియల్, డిజిటల్ ఇంక్లూజన్, క్రమబద్ధీకరణలలో సమున్నత స్థానంలోనే ఉంది. సేవల వినియోగంలో మన దేశం అతి తక్కువగా 44 శాతం స్కోరును మాత్రమే సాధించింది. సరిగ్గా ఇదే రంగంలో గరిష్ఠ వాటా సాధించాలని ఇండియన్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం భారతదేశం వెనుకంజలో ఉన్న అంశాలు ఏమిటంటే... 1. ఆన్‌లైన్ బిల్ పేమెంట్లు, కొనుగోళ్ళను ఉపయోగించుకుంటున్న పెద్దల శాతం. 2. మహిళలు మొబైల్ మనీ అకౌంట్లను కలిగియుండటం. 3. జీతం లేదా వేతనాలను పొందేందుకు మొబైల్ ఫోన్‌ను వాడేవారు. 4. యుటిలిటీ పేమెంట్లను మొబైల్ ఫోన్ ద్వారా చేసేవారు.
nation