SNo
int64
0
21.6k
date
stringlengths
19
19
heading
stringlengths
3
91
body
stringlengths
6
38.7k
topic
stringclasses
5 values
11,382
24-02-2017 03:36:02
స్టెంట్ల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: గుండెకు రక్త ప్రసరణ సాఫీగా సాగేందుకు రక్త నాళాల్లో అమర్చే స్టెంట్లపై కృత్రిమ కొరతను సృష్టించాలని ప్రయత్నిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆస్పత్రులు, తయారీ దారులను జాతీయ ఔషధ ధరల నియంత్రణా మండలి(ఎన్‌పీపీఏ) హెచ్చరించింది. కొరత సృష్టిస్తూ ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేస్తే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపింది. అన్ని ఆస్పత్రులు స్టెంట్ల కోసం తయారీ కంపెనీలను డిమాండ్‌ చేయాలని సూచించింది. స్టెంట్లపై ప్రజల్లో అపోహలు తొలగించడానికి కంపెనీలన్నీ తమ సూచనలను పాటించాలని ఆదేశించింది. ఒకవేళ సూచనలను ధిక్కరిస్తే నిత్యావసరాల వస్తువుల చట్టం-1955 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది. స్టెంట్లను కొనడానికి డిస్ర్టిబ్యూటర్‌ గానీ, ఆస్పత్రి గానీ విముఖత వ్యక్తం చేస్తే తయారీ కంపెనీ ఫిర్యాదుతో ఆయా ఆస్పత్రుల్లో సోదాలు నిర్వహిస్తామని వెల్లడించింది. కాగా, స్టెంట్ల ధరలను 75 శాతం తగ్గిస్తూ కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
nation
14,806
26-06-2017 01:38:38
నిజమైన మిత్రుడు మోదీ
ఆయన కోసం ఎదురు చూస్తున్నా...వ్యూహాత్మక అంశాలు చర్చించాలి..ట్రంప్‌ ట్వీట్‌... అమెరికా చేరుకున్న ప్రధానివాషింగ్టన్‌, జూన్‌ 25: ప్రధానమంత్రి నరేంద్రమోదీని నిజమైన స్నేహితుడిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అభివర్ణించారు. శ్వేతసౌధంలోకి ఆయనకు స్వా గతం పలికేందుకు ఎదురు చూస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. నిజమైన స్నేహితుడితో ముఖ్యమైన వ్యూహాత్మక అంశాలు చర్చించాల్సి ఉందన్నారు. సోమవారం మ ధ్యాహ్నం ఈ అగ్రనేతలు ఇద్దరి మధ్య శ్వేతసౌధంలో చర్చలు జరగనున్నాయి. ఆ తర్వాత మోదీ గౌరవార్థం ట్రంప్‌ ఒక డిన్నర్‌ ఏర్పాటు చేశారు. ఒక విదేశీ నేతకు ఆయన ఇలా వర్కింగ్‌ డిన్నర్‌ ఇవ్వడం ఇదే తొలిసారి. దీన్ని బట్టే మోదీ చాలా ముఖ్యమైన వ్యక్తి అని తెలుస్తోందని ప్రభుత్వంలోని సీనియర్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మోదీ, ట్రంప్‌ సుమారు 5 గంటల పాటు సమావేశం అవుతారని తెలుస్తోంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి విలేకరుల సమావేశంలో మాత్రం మాట్లాడటం లేదు. విడివిడిగా ప్రకటనలు జారీచేస్తారు. ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్నట్లు సెనేటర్‌ కమలా హేరిస్‌ ట్వీట్‌ చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మోదీ అమెరికా చేరుకున్నారు. ఆయనకు భారతీయులు సాదరంగా స్వాగతం పలికారు. ప్రధాని బసచేస్తున్న విల్లర్డ్‌ ఇంటర్‌కాంటినెంటల్‌ హోటల్‌ వద్దకు భారీ సంఖ్యలో ఎన్నారైలు చేరుకున్నారు. ప్రధాని కాన్వాయ్‌ అక్కడకు రాగానే ఒక్కసారిగా ‘మోదీ.. మోదీ’ అంటూ నినాదాలు మిన్నంటాయి. హోటల్లోకి వెళ్లడానికి ముందు ఆయన కారు దిగి, అక్కడున్న భారతీయులందరినీ పలకరించి లోపలకు వెళ్లారు. వెంటనే అక్కడున్నవాళ్లంతా జేబుల్లోంచి ఫోన్లు తీసి ఆయనను ఫొటోలు తీసుకున్నారు. కాగా, మోదీ.. ట్రంప్‌తో చర్చించేటపుడు హెచ్‌1బి వీసాల అంశాన్ని కూడా ప్రస్తావించాలని అమెరికన్‌ భారతీయులు కోరుకుంటున్నారు. హోటల్లో ఆయనకు స్వాగతం పలకడానికి వచ్చినవారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన మృదుల కూడా ఉన్నారు. ఆమె హెచ్‌1బి వీసాపై అమెరికాలో పనిచేస్తున్నారు. వీసా అంశాన్ని మోదీ ప్రస్తావిస్తారన్న నమ్మకం తమకుందని, ఇది ఇక్కడ పనిచేస్తున్న చాలా మందికి అవసరమన్నారు. ద్వైపాక్షిక చర్చల్లో ఉగ్రవాదం, సైబర్‌ నేరాలు ప్రధానాంశాలు అవుతాయని బీజేపీ విదేశీ విభాగం చైర్‌పర్సన్‌ ఆత్మాసింగ్‌ అన్నారు. కాగా, మోదీ, ట్రంప్‌ చర్చల్లో పౌర అణు ఒప్పందం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. ఏపీలోని కొవ్వాడ ప్రాంతంలో ఆరు అణు రియాక్టర్లను ఏర్పాటు చేసేందుకు అమెరికాకు చెందిన వెస్టింగ్‌హౌస్‌ సంస్థతో ఎన్‌పీసీఐఎల్‌ ఒప్పందం మీద సంతకాలు మాత్రం అప్పుడే అయ్యేలా లేవు. వెస్టింగ్‌హౌస్‌ సంస్థ దివాలా తీయడమే ఇందుకు కారణం అంటున్నారు. దాంతో ఆ సంస్థతో ఒప్పందానికి ఎన్‌పీసీఐఎల్‌ సుముఖంగా లేదు. ఈద్‌ శుభాకాంక్షలు: ట్రంప్‌ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికన్‌ ప్రజల తరఫున తాను, తన భార్య మెలానియా ఈద్‌ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఓ ప్రకటనలో చెప్పారు. ముస్లిం లు పాటించే విలువలను అమెరికా గౌరవిస్తుందన్నారు.
nation
4,350
29-01-2017 01:41:15
తెలుగు గతి ఇంతే...!
‘తెలుగువాడు కాదు తెగడకున్నతెలుగువాడు కాదు తెగులేదొ లేకున్నతిక్కలేనివాడు తెలుగువాడెటులౌను!!’’ అని సుప్రసిద్ధ సంపాదకులు, రచయిత నార్ల వెంకటేశ్వరరావు ఎప్పుడో అన్నమాట సార్వకాలిక సత్యంగా వుంది ఇవాళ మరీ సత్యంగా వుంది. తెలుగుకి ప్రాచీన భాష హోదాకి న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. అయినా ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళలేదు. కొన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలుగు భాష అంటరానిదిగానే వుంది. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు ప్రాచీన భాషపై పరిశోధనలు, ప్రచురణలు మొదలుపెట్టాయి. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నాయి. మనం చేతకాని దద్దమ్మలయ్యాం. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అసమర్థతలో పోటీపడుతున్నాయి. మాతృభాష పట్ల ఇంతటి నిర్లక్ష్యం వహించే ప్రభుత్వాలు ఎక్కడా కనపడవు. ఓ పక్క గవర్నర్‌, వెంకయ్య నాయుడు మాతృభాషను మరువొద్దు అంటూ సూక్తులు చెబుతారు. కాళోజీ, గిడుగు పండగలు చేస్తూ అలవోకగా చిలుక పలుకులు పలుకుతారు. మళ్ళీ సంవత్సరం వరకు ఊసెత్తరు. తెలంగాణ ప్రభుత్వం కేజీ టు పీజీ ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన అంటుంది. కేసీఆర్‌ గారికి ఉద్యమంలో వెంటవున్న భాషా ప్రియులు, కవులు ‘మనం ఏమీ చెయ్యలేం’ అంటున్నారంటే ఎవరి భయాలు వాళ్ళకి వున్నాయి. వేదికల మీద మాత్రం తెలుగు భాషపై అపూర్వ ప్రేమ ఒలికించే నటులు వీళ్ళు! చంద్రబాబు ప్రభుత్వం కూడా మునిసిపల్‌ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసింది. ఇప్పుడున్న అధికారుల్లో, నాయకుల్లో, శాస్త్రవేత్తల్లో ఎక్కువమంది తెలుగు మాధ్యమంలో చదువుకున్న వాళ్ళు కాదా? చెన్నై, బరంపురం వంటి నగరాల్లోని తెలుగు మాధ్యమ పాఠశాలలు ప్రభుత్వ సహకారం లేకపోవడంతో మూతపడుతున్నాయి. అయినా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. అమరావతి నగర నిర్మాణం గురించి సుభాషితాలు వల్లె వేస్తున్నవారు ట్యాంక్‌బండ్‌పై లాగా తెలుగు పెద్దల విగ్రహాలు పెడదామన్న ఆలోచనే పుట్టడం లేదు. తంజావూరు సరస్వతీ మహల్‌లోని తెలుగు వ్రాతప్రతుల్ని, పుస్తకాల్ని ఆంధ్రాకి తరలిద్దామనే భావనే కలగడంలేదు. ఇప్పటి రెండు తెలుగు ప్రభుత్వాలు గ్రంథాలయోద్యమాన్ని తమ శక్తి మేరకు అణచివేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా గ్రంథాలయాలు కొన్ని పుస్తకాలు కొనేవి. రాజారామ్మోహన్‌రాయ్‌ ఫౌండేషన్‌ ద్వారా పుస్తకాలు కొనేవారు. ఈ రెండూ మూతపడ్డాయి. అసలు వీటి గురించి జ్ఞాపకం లేనట్టు ఆయా శాఖలూ ప్రవర్తిస్తున్నాయి. రచయితలు, కవులు పడే అవస్థలు చెప్పలేనివి. ఎవరికో ఒకరికి లక్ష రూపాయలిచ్చి చేతులు దులుపుకోవటం భాషకి ద్రోహం చెయ్యటమే. కవులు, రచయితల వల్ల రాష్ట్రం సాధించుకున్నవారూ, తెలుగు పేరుతో పార్టీ ద్వారా అధికారం దక్కించుకున్న వారూ ఇద్దరూ తెలుగుకు ద్రోహం చేస్తున్నారు. ‘తెలుగు దీపాలు తెల్లవార్లూ వెలుగుతుండాలి’ అన్న దాశరథి మాట ఎప్పుడు నెరవేరుతుందో ఏమో! ద్వా.నా.శాస్త్రితెలుగువాడు కాదు తెగులేదొ లేకున్నతిక్కలేనివాడు తెలుగువాడెటులౌను!!’’ అని సుప్రసిద్ధ సంపాదకులు, రచయిత నార్ల వెంకటేశ్వరరావు ఎప్పుడో అన్నమాట సార్వకాలిక సత్యంగా వుంది ఇవాళ మరీ సత్యంగా వుంది. తెలుగుకి ప్రాచీన భాష హోదాకి న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. అయినా ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళలేదు. కొన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలుగు భాష అంటరానిదిగానే వుంది. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు ప్రాచీన భాషపై పరిశోధనలు, ప్రచురణలు మొదలుపెట్టాయి. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నాయి. మనం చేతకాని దద్దమ్మలయ్యాం. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అసమర్థతలో పోటీపడుతున్నాయి. మాతృభాష పట్ల ఇంతటి నిర్లక్ష్యం వహించే ప్రభుత్వాలు ఎక్కడా కనపడవు. ఓ పక్క గవర్నర్‌, వెంకయ్య నాయుడు మాతృభాషను మరువొద్దు అంటూ సూక్తులు చెబుతారు. కాళోజీ, గిడుగు పండగలు చేస్తూ అలవోకగా చిలుక పలుకులు పలుకుతారు. మళ్ళీ సంవత్సరం వరకు ఊసెత్తరు. తెలంగాణ ప్రభుత్వం కేజీ టు పీజీ ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన అంటుంది. కేసీఆర్‌ గారికి ఉద్యమంలో వెంటవున్న భాషా ప్రియులు, కవులు ‘మనం ఏమీ చెయ్యలేం’ అంటున్నారంటే ఎవరి భయాలు వాళ్ళకి వున్నాయి. వేదికల మీద మాత్రం తెలుగు భాషపై అపూర్వ ప్రేమ ఒలికించే నటులు వీళ్ళు! చంద్రబాబు ప్రభుత్వం కూడా మునిసిపల్‌ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసింది. ఇప్పుడున్న అధికారుల్లో, నాయకుల్లో, శాస్త్రవేత్తల్లో ఎక్కువమంది తెలుగు మాధ్యమంలో చదువుకున్న వాళ్ళు కాదా? చెన్నై, బరంపురం వంటి నగరాల్లోని తెలుగు మాధ్యమ పాఠశాలలు ప్రభుత్వ సహకారం లేకపోవడంతో మూతపడుతున్నాయి. అయినా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. అమరావతి నగర నిర్మాణం గురించి సుభాషితాలు వల్లె వేస్తున్నవారు ట్యాంక్‌బండ్‌పై లాగా తెలుగు పెద్దల విగ్రహాలు పెడదామన్న ఆలోచనే పుట్టడం లేదు. తంజావూరు సరస్వతీ మహల్‌లోని తెలుగు వ్రాతప్రతుల్ని, పుస్తకాల్ని ఆంధ్రాకి తరలిద్దామనే భావనే కలగడంలేదు. ఇప్పటి రెండు తెలుగు ప్రభుత్వాలు గ్రంథాలయోద్యమాన్ని తమ శక్తి మేరకు అణచివేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా గ్రంథాలయాలు కొన్ని పుస్తకాలు కొనేవి. రాజారామ్మోహన్‌రాయ్‌ ఫౌండేషన్‌ ద్వారా పుస్తకాలు కొనేవారు. ఈ రెండూ మూతపడ్డాయి. అసలు వీటి గురించి జ్ఞాపకం లేనట్టు ఆయా శాఖలూ ప్రవర్తిస్తున్నాయి. రచయితలు, కవులు పడే అవస్థలు చెప్పలేనివి. ఎవరికో ఒకరికి లక్ష రూపాయలిచ్చి చేతులు దులుపుకోవటం భాషకి ద్రోహం చెయ్యటమే. కవులు, రచయితల వల్ల రాష్ట్రం సాధించుకున్నవారూ, తెలుగు పేరుతో పార్టీ ద్వారా అధికారం దక్కించుకున్న వారూ ఇద్దరూ తెలుగుకు ద్రోహం చేస్తున్నారు. ‘తెలుగు దీపాలు తెల్లవార్లూ వెలుగుతుండాలి’ అన్న దాశరథి మాట ఎప్పుడు నెరవేరుతుందో ఏమో! ద్వా.నా.శాస్త్రి
editorial
14,469
27-09-2017 01:05:42
ఒకే ట్రాక్‌పై 3 రైళ్లు
అలహాబాద్‌ వద్ద తప్పిన ప్రమాదంఒక్క క్షణం ఆలస్యమైనా పెను ముప్పు!అలహాబాద్‌, సెప్టెంబరు 26: అది అలహాబాద్‌ రైల్వే జంక్షన్‌... ఉత్తర మధ్య రైల్వే ప్రధాన కేంద్రం. 10కి పైగా ప్లాట్‌ఫామ్‌లు... 12 ట్రాక్‌లు... రోజూ వేలాది మంది ప్రయాణికుల రాకపోకలు! రోజూ మాదిరిగానే కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్‌లో అనౌన్సుమెంట్లు మార్మోగుతున్నాయి. కంట్రోల్‌ రూమ్‌లో రైళ్ల కదలికలను గమనిస్తున్న అధికారుల గుండెల్లో ఒక్కసారిగా రైళ్లు పరిగెత్తాయి! అలహాబాద్‌ సమీపంలో మూడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఒకే ట్రాక్‌పై పరుగులు తీస్తున్నాయని గుర్తించి.. గగుర్పాటుకు గురయ్యారు. ఒక్క క్షణం ఆలస్యమైనా.. ఎంతటి ఘోరం జరిగి ఉండేదో! అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకుండా నివారించగలిగారు. ఒకే ట్రాక్‌పై చేరువగా పరుగు తీసిన దురంతో, హతియా-ఆనంద్‌ విహార్‌, మహోబోధి ఎక్స్‌ప్రె్‌సలకు పెను ముప్పు తప్పింది. ఏ ప్రమాదం లేదని తెలిశాక అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.  దేశంలో రెండు నెలల్లో పలు రైలు ప్రమాదాలు జరిగాయి. సెప్టెంబరు 7న 12 గంటల వ్యవధిలో మూడుచోట్ల రైళ్లు పట్టాలు తప్పడం కలకలం రేపింది. ఉదయం 6.20 గంటలకు ఉత్తరప్రదేశ్‌లో శక్తిపుంజ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. మధ్యాహ్నం ఢిల్లీ సమీపంలో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఇంజన్‌, పవర్‌ కోచ్‌, సాయంత్రం మహారాష్ట్రలో గూడ్స్‌ రైలు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. గత వారం ఆగ్రా కంటోన్మెంట్‌ వద్ద ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది. ఆగస్టు 23న కైఫియత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో 100 మంది గాయపడ్డారు. వరుస ప్రమాదాలతో రైల్వే బోర్డు చైర్మన్‌ మిట్టల్‌ రాజీనామా చేయవలసి వచ్చింది.
nation
9,773
05-12-2017 15:07:25
విశాల్ ఎన్నికల్లో పోటీ చేయడంపై ప్రముఖ రచయిత ట్వీట్..
ఆర్కే నగర్ స్థానం నుంచి పోటీ చేయాలని హీరో విశాల్ తీసుకున్న అనూహ్య నిర్ణయంపై భిన్నాభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమిళ ఆటోగ్రాఫ్ సినిమా దర్శకుడు చేరన్ విశాల్ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని తాము జీర్ణించుకోలేక పోతున్నామంటూ ఫేస్‌బుక్ వేదికగా వివాదాస్పద కామెంట్స్ చేశారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పరచూరి గోపాలకృష్ణ ఎన్నికల్లో విశాల్ పోటీ చేయడంపై ట్వీట్ చేశారు. "జీకే రెడ్డి గారితో లాయర్ భారతీదేవి చేసినప్పుడు విశాల్ పది సంవత్సరాల పిల్లాడు! ఈ రోజు పురచ్చి తలైవి నియోజకవర్గం, ఆర్కే నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే ఆనందంగా ఉంది. ఆల్ ది బెస్ట్ విశాల్. నిన్ను అసెంబ్లీలో చూడాలని ఉంది." అని గోపాలకృష్ణ ట్వీట్‌లో పేర్కొన్నారు.
entertainment
8,992
16-09-2017 21:56:39
'రాజా ది గ్రేట్' టైటిల్ ట్రాక్ విడుదల తేదీ..
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రాజా ది గ్రేట్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకుంది. కాగా ఈ సినిమా టైటిల్ ట్రాక్ ని సెప్టెంబర్18 సాయంత్రం 6గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అభిమానుల స్పందన కోసం ఎదురుచూస్తున్నానంటూ పేర్కొన్నాడు.
entertainment
18,786
20-09-2017 02:39:06
కూలీగా మారిన డేరా బాబా!
 కూరగాయలు పండిస్తూ రోజుకు రూ.20 సంపాదనచండీగఢ్‌, సెప్టెంబర్‌ 19: వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి.. లక్షల్లో అనుచర గణం.. ఎంతో మంది ప్రముఖులకు సైతం దేవుడు.. ఆయన ఇపుడు ఏమి చేస్తున్నాడో తెలుసా..? జైలులో రోజుకు రూ.20 కూలీ తీసుకుంటూ కూరగాయలు, ఎండు ద్రాక్ష మొక్కలు సాగుచేస్తున్నాడు. ఆయన మరెవరో కాదు.. డేరా సామ్రాజ్యాధినేత రామ్‌రహీంబాబా. గతంలో ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసినట్టు రుజువుకావడంతో 20ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా.. జైలు ఆవరణలోనే రోజుకు 8గంటలపాటు కూరగాయలను, ఎండు ద్రాక్ష మొక్కలను సాగు చేస్తున్నాడు. ‘జైలులో ఇతర ఖైదీల మాదిరిగానే రామ్‌రహీంను కూడా భావిస్తున్నాం. అతనికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించామని వస్తున్న వార్తల్లో నిజం లేద’ని డీజీపీ తెలిపారు. భద్రతా కారణాల రీత్యా రామ్‌రహీంను ఓ ప్రత్యేక బారక్‌లో ఉంచినట్టు తెలిపారు.
nation
10,277
24-11-2017 14:33:39
వైభవంగా చిన్నా కూతురి వివాహం
యాక్టర్ చిన్నా కూతురు వివాహం ఇవాళ తెల్లవారుజామున అంగరంగ వైభవంగా జరిగింది. చిన్నా పెద్ద కూతురు మోనిక వివాహం చైతన్య నిశ్చయమైంది. ఇవాళ ఉదయం తిరుమలలోని కర్ణాటక కల్యాణ మండపంలో ఈ వివాహం జరిగింది. ఇటీవల చిన్నా భార్య శిరీష అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించారు. ఆ విషాదం నుంచి కూతురి పెళ్లి వేడుకతో కాస్త ఊరట పొందారు చిన్నా.       ఈ ముగ్గురితో చేసింది ఒక్కరేనట  నటి చార్మీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
entertainment
20,593
05-08-2017 02:29:50
ప్రపంచ అథ్లెటిక్స్‌ షురూ
బోల్ట్‌ 100 మీ. రేస్‌ నేడు రా. 11 గం. స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌ 2లోలండన్‌: ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌ శుక్రవారం ఇక్కడ అంగరంగ వైభవంగా ఆరంభమయ్యా యి. పది రోజులపాటు అంటే.. ఈనెల 13 వరకూ జరిగే ఈ పోటీల్లో రెండు వేలమందికిపైగా అథ్లెట్లు పాల్గొంటు న్నారు. లండన్‌ మేయర్‌ సాదిక్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. విభేదాలను తొలగించి ప్రజలను ఒక్కటిగా చేసే శక్తి క్రీడలకు ఉందని పేర్కొన్నారు. తొలిరోజు పురుషుల 100 మీటర్ల స్ర్పింట్‌, డిస్కస్‌ త్రో, లాంగ్‌జంప్‌ ప్రీలిమినరీ పోటీలు జరిగాయి. మహిళల 1500 మీటర్ల పరుగు క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో దిబాబా (ఇథియోపియా) రన్నర్‌ 4 నిమిషాల 2.67 సెకన్లలో గమ్యం చేరుకొని సెమీస్‌కు అర్హత సాధించింది. దక్షిణాఫ్రికా రన్నర్‌ సెమెన్య కూడా తదుపరి రౌండ్‌కు చేరుకుంది. కాగా.. ఉసేన్‌ బోల్ట్‌ పోటీ పడే 100 మీ. రేస్‌ శనివారం జరుగనుంది. భారత కాలమా నం ప్రకారం రాత్రి 11 గంటలకు సెమీస్‌ మొదలవుతుంది.
sports
13,588
19-07-2017 03:05:47
5 కోట్లు సిద్ధం
500 వద్దనడంతో అన్నీ 2 వేల నోట్లే‘ఓలా డ్రైవర్‌’ ఫోన్‌ కోసం నిరీక్షణశ్రీకాంత్‌ కిడ్నాప్‌ అయి 12 రోజులున్యూఢిల్లీ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): గద్వాలకు చెందిన వైద్యుడు శ్రీకాంత్‌ గౌడ్‌ కిడ్నాప్‌ కేసును ఛేదించలేక.. చేసేది లేక ఢిల్లీ పోలీసులు కిడ్నాపర్‌ అడిగిన డబ్బు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. జూలై 6న ఢిల్లీలో శ్రీకాంత్‌ను ఓలా డ్రైవర్‌ కిడ్నాప్‌ చేయగా.. పోలీసులు ఇప్పటి వరకు కేసులో ఎటువంటి పురోగతి సాధించలేకపోయారు. దాంతో కిడ్నాపర్‌ డిమాండ్‌ చేసిన రూ.5 కోట్లు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు. శనివారమే ఓలా సంస్థ ద్వారా 6 బ్యాగుల్లో రూ.500 నోట్లను సిద్ధం చేశారు. అన్ని సంచులు తీసుకెళ్లడం తనకి కష్టమని రూ.2 వేల నోట్లు ఇవ్వాలని కిడ్నాపర్‌ డిమాండ్‌ చేశాడు. వారాంతం కావడంతో నోట్లు మార్చడం సాధ్యం కాలేదని కేసుని పర్యవేక్షి స్తున్న ఏసీపీ రాహుల్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రానికి రూ.2 వేల నోట్లు సిద్ధం చేశారు.  ప్రస్తుతం కిడ్నాపర్‌ నుంచి ఎప్పుడు ఫోన్‌ కాల్‌ వస్తుందా అని పోలీసులు ఎదురు చూస్తున్నారు. ఫోన్‌ కాల్‌ వచ్చిన వెంటనే శ్రీకాంత్‌తో మాట్లాడి, అతని ఆరోగ్యం గురించి తెలుసుకున్నాక డబ్బులు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. శ్రీకాంత్‌లా వేరేవాళ్లు మాట్లాడే అవకాశం ఉందని పోలీసులు గుర్తించారు. అందుకు తల్లిదండ్రుల గురించిన సమాచారం, చిన్ననాటి విషయాలపై కొన్ని ప్రశ్నలు అడిగి నిర్ధారణ చేసుకోవాలని భావిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతగా వాడినా శ్రీకాంత్‌ని కిడ్నాపర్‌ ఎక్కడ దాచాడో చిన్న క్లూ కూడా దొరకలేదు. దీంతో ముందు శ్రీకాంత్‌ని క్షేమంగా తీసుకురావడంపై దృష్టి సారించామని, ఆ తరువాత ఓలాది తప్పుందా, కిడ్నాపర్‌ పరిస్థితి ఏమిటనేది ఆలోచిస్తామని పోలీసులు చెబుతున్నారు.
nation
12,218
11-03-2017 02:32:27
ట్రంప్‌ ఉత్తర్వులపై రాష్ట్రాల నిరసన
వాషింగ్టన్‌, మార్చి 10: ఆరు ముస్లిం దేశాలపై తాజాగా విధించిన నిషేధంపై అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్షుడి ఉత్తర్వులను న్యాయపరంగా సవాల్‌ చేసేందుకు పలు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. అధ్యక్షుడి ఉత్తర్వులను అడ్డుకుంటామని వాషింగ్టన్‌ రాష్ట్రం ప్రకటించింది. ఒరిగాన్‌, న్యూయార్క్‌ రాష్ట్రాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. గతంలో ఏడు ముస్లిం దేశాల వలసలపై నిషేధం విధించినప్పుడు, వాటికి వ్యతిరేకంగా వాషింగ్టన్‌ రాష్ట్రం తొలిసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కాగా, అమెరికాలోని వాషింగ్టన్‌ రాష్ట్రంలో వారం క్రితం సిక్కు యువకుడిపై జరిగిన దాడికి కారణం అతని భారతీయ మూలాలేనని పోలీసులు నిర్ధారించారు.
nation
9,278
03-09-2017 22:51:38
ప్రవర్తన చాలా ముఖ్యం
‘‘జీవితంలో ఎదగాలనుకున్నవారు ఎవరైనా సరే కేవలం కష్టపడితే సరిపోదు’’ అని అంటున్నారు తమన్నా. మన పెద్దలు ‘కష్టే ఫలి’ అన్నారు కదా అని అడిగితే.. మోడ్రన్‌ డేస్‌లో దానికి ఇంకొకటి తప్పకుండా తోడవ్వాల్సిందే అని చెప్పుకొచ్చారు. అదేంటని ఆరా తీస్తే.. ‘‘లౌక్యం.. జీవితంలో ఎవరికైనా లౌక్యం తెలియాలి. ఎక్కడ ఎంత వరకు మాట్లాడితే బావుంటుందో తెలియాలి. అంతేగానీ దేవుడు నోరు ఇచ్చాడు కదా అని పిచ్చిపిచ్చిగా మాట్లాడకూడదు. నా దృష్టిలో మాటకు చాలా విలువ ఉంటుంది. పలికే ప్రతి మాటను లౌక్యంగా పలకాలి. నేను ఎవరితో మాట్లాడినా ఆచితూచి మాట్లాడుతుంటాను. ఈ పద్ధతి వల్ల చాలా వరకు సమస్యల నుంచి బయటపడగలుగుతున్నాను. కావాలంటే ఎవరైనా ప్రయత్నించి చూడొచ్చు’’ అని వివరించారు తమన్నా.
entertainment
12,806
14-09-2017 03:38:17
త్వరలో కమల్‌ కొత్త పార్టీ
నెలాఖరులోగా అధికారిక ప్రకటనచెన్నై, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): విశ్వనటుడు కమల్‌ హాసన్‌ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. పార్టీ ఏర్పాటుపై త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశముందని కమల్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి. జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయ సమీకరణలు మారిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కమల్‌ కూడా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇటీవల కోయంబత్తూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని రాజకీయ పార్టీ ఏర్పాటుపై సంకేతాలిచ్చారు. ఈ మేరకు విజయదశమికి పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఈ కొత్త పార్టీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆయన సన్నిహితుడొకరు వెల్లడించారు. స్థానిక ఎన్నిక ల్లో పోటీ చేస్తే పార్టీ సత్తా తెలియడంతో పాటు అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత వస్తుందని కమల్‌ భావిస్తున్నట్లు సమాచారం.
nation
11,409
10-02-2017 21:35:56
తమిళనాడు ‘రాజ్‌భవన్‌ రహస్యాలు’ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చేతిలో...
చెన్నై: తమిళనాడులో ఏం జరుగుతోంది..? గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ఏం చేయబోతున్నారు..? రాజ్‌భవన్‌ నిర్ణయం ఎలా ఉండబోతోంది..? ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి చేతిలో ఎక్స్‌క్లూజివ్‌ రిపోర్ట్‌. ఓ వైపు తమిళనాడులో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని రాజ్‌భవన్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభంపై రాజ్యాంగబద్ధంగా అన్ని విషయాలు పరిశీలించాకే ఓ నిర్ణయానికి రావాలన్న ఆలోచనలో గవర్నర్‌ ఉన్నారాని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆర్టికల్‌ 164(4) ప్రకారం ఎమ్మెల్యే కాని వ్యక్తి కేబినెట్‌ సభ్యులుగా బాధ్యత తీసుకోవాలన్నప్పుడు ఆరు నెలలు లోగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే శశికళ విషయంలో అది సాధ్యమవుతుందా..? ఎన్నికయ్యే పరిస్థితులు ఉన్నాయా..? అనే విషయాన్ని గవర్నర్ పరిగణనలోకి తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత జులైలో తీర్పును బట్టి చూస్తే పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చని న్యాయ నిపుణులు చెబుతున్న దృష్ట్యా భవిష్యత్‌ పరిణామాలపై గవర్నర్‌ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ సీఎం ఉన్నందున అధికార శూన్యత లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని గవర్నర్‌ విశ్వసిస్తున్నట్టు సమాచారం. అయితే రోజులు గడిచిన కొద్దీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించొచ్చన్న ఆందోళనలపైనా గవర్నర్‌ దృష్టి సారించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్‌తో పాటు ఉన్నతాధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు ఈ లింక్‌లో చూడొచ్చు...
nation
7,923
09-07-2017 06:57:27
పెళ్లి వేడుకలో తమన్నా... తన పెళ్లి గురించి చెప్పేసింది!
ముంబై: ‘బాహుబలి’ హీరోయిన్ తమన్నా తన సోదరుడు ఆనంద్ వివాహ వేడుకలో ఆనందంగా చిందులు వేశారు. ఇటీవల 3 రోజుల పాటు పాటు జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. జూలై 1న ఈ వివాహం జరగగా, పెళ్లి ఫొటోగ్రాఫర్ ఈ ఫొటోలను తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో తాజాగా పోస్ట్ చేశారు. జూన్ 29న ముంబైలోని అంథేరి వెస్ట్‌లో మెహందీ ఫంక్షన్ జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న తమన్నా... నీతూ లుల్లా డిజైన్ చేసిన లహంగాను ధరించారు. బాలీవుడ్ థీమ్‌తో నిర్వహించిన ఈ వేడుకలో డాన్ప్‌కు ప్రాధాన్యత నిచ్చారు. ఈ సందర్భంగా తమన్నా ఆనందంగా నృత్యం చేశారు.  జూన్ 30న ముంబై నోవాటెల్ హోటల్‌లో ప్రీవెడ్డింగ్ ఫంక్షన్ వైభవంగా జరిగింది. జూలై 1న ముంబైలోని ఇస్కాన్ మందిరంలో వివాహం జరిగింది. ఈ సందర్భంగా తమన్నా రెడ్ కలర్ లహంగాను ధరించి ఉత్సాహంగా కనిపించారు. తన సోదరుడు ఆనంద్ వివాహం గురించి తమన్నా మాట్లాడుతూ ‘ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉంది. నా సోదరుని కలలు నెరవేరాయి. వారిద్దరూ ఒకరికోసం మరొకరు పుట్టారు. మా వదిన కృతిక స్టన్నింగ్ బ్యూటీ. మేము ఎంతో అదృష్టవంతులం. ఆమె ఆశలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను’ అన్నారు. కాగా ఆనంద్, కృతికలు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ సందర్భంగా విలేకరులు తమన్నాను మీరి మీ వివాహం ఎప్పుడు? అని అడగ్గా ‘నాకు పెళ్లి అనే సాంప్రదాయం మీద ఎంతో గౌరవం ఉంది. తగిన సమయం వచ్చినప్పుడు వివాహం చేసుకుంటాను. అయితే ప్రస్తుతం సినీ కెరియర్ మీద దృష్టి పెట్టాను’ అన్నారు. తమన్నా ప్రస్తుతం ‘స్కెచ్’ అనే తమిళ సినిమా, ‘ఖామోషీ’ అనే హిందీ సినిమాతో పాటు మరో 5 సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాలన్నీ ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి.
entertainment
12,270
29-06-2017 01:15:21
500 కోట్ల ఆన్‌లైన్‌ మోసం సీబీఐ చేతికి
యాడ్స్‌పై క్లిక్‌ చేస్తే డబ్బులంటూ ఎరఉచ్చులో పడిన 4 లక్షల మంది‘యాడ్స్‌బుక్‌’లో సభ్యత్వం పేరుతో వసూళ్లుప్రచారకర్తలుగా షారుక్‌ ఖాన్‌, నవాజుద్దీన్‌కుంభకోణాన్ని ఛేదించిన యూపీ పోలీసులుతాజాగా కేసు దర్యాప్తు సీబీఐకి బదలాయింపున్యూఢిల్లీ, జూన్‌ 28: ‘‘క్లిక్కు కొట్టండి.. డబ్బులు పట్టండి’’ అంటూ దాదాపు 4 లక్షల మందిని.. రూ.500 కోట్ల మేర ముంచిన ఆన్‌లైన్‌ పోంజీ స్కామ్‌ గుర్తుందా? ఘజియాబాద్‌ కేంద్రంగా జరిగిన ఈ దందాపై దర్యాప్తు బాధ్యతలను ఉత్తరప్రదేశ్‌ పోలీసుల నుంచి సీబీఐ తీసుకుంది. ‘వెబ్‌వర్క్‌ ట్రేడ్‌లింక్స్‌’ అనే కంపెనీ పేరిట అనురాగ్‌ జైన్‌, సందేశ్‌ వర్మ అనే ఇద్దరు జరిపిన ఈ దందా గురించి ఈ ఏడాది జనవరిలో ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ‘యాడ్స్‌బుక్‌.కాం’ అనే సైట్‌ పేరిట కూడా వారు 2016 డిసెంబరు నుంచి ఇదే తరహా దందా నడిపారు. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ఖాన్‌ను, మరో నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీని ప్రచారకర్తలుగా నియమించుకోవడంతో చాలా మంది ఆ సైట్‌ను నమ్మి భారీగా డబ్బులు కట్టారు.  ఈ స్కీమ్‌లో సభ్యత్వాల పేరుతో గార్గ్‌, సుదేశ్‌ కేవలం నాలుగు నెలల్లో నాలుగు లక్షల మందిని ముగ్గులోకి దింపి భారీగా వసూళ్లు చేశారు. ‘వెబ్‌వర్క్‌’ పాపం బద్దలైన దరిమిలా యూపీ పోలీసులు యాడ్స్‌బుక్‌ కుంభకోణాన్నీ ఛేదించారు. ‘షారుక్‌ఖాన్‌, నవాజుద్దీన్‌ సిద్దిఖీని నమ్మి ఇందులో పెట్టుబడి పెట్టాం’ అని అప్పట్లో చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైనా ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ‘వెబ్‌ బాంబ్‌ పేలింది’ శీర్షికన కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. తాజాగా.. అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తు బాధ్యతను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు సీబీఐకి బదలాయించారు. అయితే.. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో షారుక్‌ఖాన్‌, నవాజుద్దీన్‌ సిద్దిఖీ పేర్లను మాత్రం పేర్కొనలేదు. ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ.. అనురాగ్‌ జైన్‌, సందేశ్‌ వర్మలపై తిరిగి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. దీనికి సంబంధించి షారూఖ్‌, నవాజుద్దీన్‌ల వివరణ కోరతామని సీబీఐ వర్గాలు తెలిపాయి.
nation
13,637
13-05-2017 02:46:07
అబద్ధాల కేజ్రీవాల్‌!
కపిల్‌ మిశ్రా తల్లి మాజీ మేయర్‌ అన్నపూర్ణ ధ్వజంన్యూఢిల్లీ, మే 12: ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు మరో చిక్కువచ్చి పడింది. తాను ‘తీసేసిన మంత్రి’ కపిల్‌ మిశ్రా ప్రశ్నలకే సమాధానం చెప్పని ఆయనకు.. కపిల్‌ తల్లి రూపంలో మరో సవాల్‌ ఎదురైంది. కపిల్‌ మిశ్రా తల్లి అన్నపూర్ణా మిశ్రా.. ఢిల్లీ మాజీ మేయర్‌. తాను ప్రారంభించిన విధానాలను ప్రశంసించి, వాటిని అనుసరిస్తున్న కేజ్రీవాల్‌... ఇప్పుడు తన కుమారుడిపై అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నపూర్ణ మండిపడ్డారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారితో కపిల్‌ మిశ్రా ఉన్న ఫొటోను ఆప్‌ నేతలు ట్విట్టర్‌లో పెట్టి.. బీజేపీతో కుమ్మక్కయ్యారనేలా ఆరోపణలు చేయడంపై తీవ్రంగా స్పందించారు. దీనిపై నేరుగా కేజ్రీకి లేఖ రాశారు. ‘‘ఆప్‌ నేత కుమార్‌ విశ్వాస్‌ తండ్రి సన్మాన సభలో తీసిన ఫొటో అది. ఆ కార్యక్రమానికి కేజ్రీవాల్‌తోపాటు ఆయన మంత్రులంతా హాజరయ్యారు. కపిల్‌కు రాజకీయాల్లోకి రావడం ఇష్టమేలేదు. అయినా.. నాపై కేజ్రీవాల్‌ ఒత్తిడిచేసి ఒప్పించారు. ఇప్పుడు.. నన్ను కూడా అవినీతిపరురాలిగా చిత్రీకరిస్తున్నారు’’ అని ఆక్రోశించారు. ఆ ప్రశ్నలకు బదులేదీ?ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ నుంచి 2 కోట్లు తీసుకోవడంతోపాటు, ఇతర కుంభకోణాలపై తన కుమారుడు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నపూర్ణ డిమాండ్‌ చేశారు. మరోవైపు.. కపిల్‌ మిశ్రా ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని.. ఆయనను వెంటనే ఆస్పత్రిలో చేర్చాలని వైద్యులు స్పష్టంచేశారు. సోమ్‌నాథ్‌ భారతి భార్యను కొట్టేవాడు హైకోర్టుకు చెప్పిన పోలీసులుమాజీ మంత్రి, ఆప్‌ ఎమ్మెల్యే సోమ్‌నాథ్‌ భారతి తన భార్య లిపికా మిత్రాను కొట్టి, హింసించే వారని ఢిల్లీ పోలీసులు హైకోర్టుకు చెప్పారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు అఫిడవిట్‌ సమర్పించారు.
nation
18,836
24-02-2017 02:07:14
అమెరికాలో తెలుగువాడి కాల్చివేత
ఓలేత్, ఫిబ్రవరి 23: జాతి వివక్షకు అమెరికాలో ఓ తెలుగువాడు బలయ్యాడు. మరో తెలుగు వ్యక్తికి తూటాగాయాలయ్యాయి. కాన్సస్‌ రాష్ట్రంలోని ఓలేత నగరంలో బుధవారం రాత్రి స్థానిక కాలమానం ప్రకారం 7.15 గంటల సమయంలో ‘ఆస్టిన్‌ బార్‌ అండ్‌ గ్రిల్‌’లో జరిగిందీ విషాదం. ఆ సమయంలో బార్‌లో ఉన్న తెలుగువారు శ్రీనివాస్‌ కూచిభొట్ల, అలోక్‌ మాడసానిలతో.. ఆడమ్‌ ప్యూరిన్టన్‌ అనే వ్యక్తి వాగ్యుద్ధానికి దిగాడు. పూర్తిగా తాగిన మత్తులో ఉన్న అతడు వారిద్దరినీ ఉద్దేశించి.. ‘మీరు నాకంటే ఎందులో గొప్ప? చెప్పండి’ అంటూ ఘర్షణ పడ్డాడు. ప్యూరిన్టన్‌ తీరును చూసిన బార్‌ సిబ్బంది అతడిని బయటకు పంపేశారు. కానీ, కొద్ది నిమిషాల్లోనే అతడు తుపాకీతో తిరిగొచ్చి శ్రీనివాస్‌, అలోక్‌లపై కాల్పులు జరిపాడు.   ఆ సమయంలో అతడు ‘మా దేశం వదిలిపోండి.. టెర్రరిస్ట్‌’ అని అరిచాడని, జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. కాగా.. కాల్పులు జరుపుతున్న ప్యూరిన్టన్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇయాన్‌ గ్రిల్లోట్‌ అనే అమెరికన్‌కు కూడా చేతిలో, భుజంలో తూటాలు దూసుకుపోయాయి. శ్రీనివాస్‌ కూచిబొట్ల ప్రాణాలు కోల్పోగా.. అలోక్‌ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. వారిద్దరూ తమ వద్దనే ఏవియేషన్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌ టీమ్‌లో పనిచేస్తున్నట్టు గార్మిన్‌ కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. కాగా.. కాల్పుల ఘటనతో అప్రమత్తమై ఆ ప్రాంతం మొత్తాన్ని పోలీసులు జల్లెడ పట్టారు. ఇంతలో వారికి ఒక బార్‌ టెండర్‌ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. తమ బార్‌కు ఒక వ్యక్తి వచ్చాడని.. ‘ఇప్పుడే నేను మధ్యప్రాచ్య ప్రాంతానికి చెందిన ఇద్దరిని కాల్చి వచ్చాను. దాక్కునే చోటు ఏదైనా ఉంటే చెప్పు’ అని తనను అడిగాడని ఆ బార్‌టెండర్‌ పోలీసులకు తెలిపాడు. ఆగమేఘాల మీద అక్కడికి వెళ్లిన పోలీసులకు ప్యూరిన్టన్‌ దొరికిపోయాడు. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో బీటెక్‌.. జాతివివక్షకు బలైన శ్రీనివాస్‌ కూచిబొట్ల ఏవియేషన్‌ ప్రోగ్రామ్స్‌ ఇంజనీర్‌. 2005లో జేఎన్‌టీయూలో బీటెక్‌ పూర్తి చేశారు. ఎల్‌పాసో (అమెరికా)లోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సా్‌సలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేశారు. ఇక.. అలోక్‌ మాడసాని గార్మిన్‌ కంపెనీలో ఏవియేషన్‌ ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌ వాసవి ఇంజనీరింగ్‌ కాలేజీలో చదువుకున్నారు.
nation
7,706
09-04-2017 22:27:05
ఫ్రెష్‌ లవ్‌స్టోరీ ‘మిస్టర్‌’
‘‘సినిమా పరిశ్రమలో ఓటమి, గెలుపు సహజం. నేను జయాపజయాలను రెండింటినీ చవిచూశాను. గెలుపు కన్నా ఓటమి నుంచి ఎక్కువగా నేర్చుకుంటాం. నేను ఓడినప్పుడు మరింత సీరియస్‌గా పనిచేసి విజయాన్ని దక్కించుకుంటాను’’ అన్నారు దర్శకుడు శ్రీను వైట్ల. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘మిస్టర్‌’ ఈ నెల 14న విడుదల కానుంది. బేబి భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ఠాగూర్‌ మధు నిర్మించారు. వరుణ్‌తేజ్‌ సరసన హెబ్బా పటేల్‌, లావణ్య త్రిపాఠి కథానాయికలు. ఈ చిత్రం గురించి శ్రీను వైట్ల మాట్లాడుతూ ‘‘మిస్టర్‌ ఓ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ. భావోద్వేగాలతో మిళితమైన స్వచ్ఛమైన ప్రేమకథను తెరకెక్కించాలని ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాను. గోపీమోహన్ చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. వరుణ్‌తేజ్‌ ఈ కథకు చక్కగా సరిపోతాడనిపించింది. నిర్మాతలకు కూడా ఇవన్నీ నచ్చడంతో సినిమాను మొదలుపెట్టారు. ప్రయాణాలకు ప్రాముఖ్యత ఉన్న చిత్రం కావడంతో స్పెయిన్ లోనే దాదాపు పదకొండు నగరాల్లో షూటింగ్‌ చేశాం. సౌత్ ఇండియాలో చిక్‌ మగళూర్‌, ఊటీ, కేరళలో కీలక సన్నివేశాలను తెరకెక్కించాం. వరుణ్‌లోని అన్ని రకాల నైపుణ్యాలను ఇందులో సంపూర్ణంగా చూపించే ప్రయత్నం చేశాం. తనలోని కామెడీ టైమింగ్‌ కూడా ఈ చిత్రంతో అందరికీ తెలుస్తుంది. సినిమా ఆద్యంతం ఫ్రెష్‌గా ఉంటుంది. చంద్రముఖి పాత్రలో లావణ్య, మీరా పాత్రలో హెబ్బా పటేల్‌ చక్కగా నటించారు. మిక్కీ పాటలకు ఇప్పటికే మంచి స్పందన వస్తోంది. నాకు సినిమాలంటే ప్రాణం. సినిమా సినిమాకీ అప్‌డేట్‌ అవుతుంటాను. ఎంతగా అప్‌డేట్‌ అయ్యానో తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ప్రేమ కోసం తెరకెక్కించాను ’’ అని చెప్పారు.
entertainment
7,226
25-10-2017 21:52:02
'లక్ష్మీస్ వీరగ్రంథం'పై వర్మ రియాక్షన్
ఎన్టీఆర్ పేరు మీద ఇప్పటి వరకు రెండు బయోపిక్‌లు మాత్రమే తెరకెక్కుతున్నట్లుగా అఫీషియల్‌గా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 'లక్ష్మీస్ వీరగ్రంథం' అంటూ ఎన్టీఆర్‌కి సంబంధించిన మరో బయోపిక్‌ అంటూ ప్రకటన విడుదల చేశారు. ఇందులో నటి వాణీ విశ్వనాధ్‌ని లక్ష్మీపార్వతి పాత్రకు సంప్రదించినట్లుగా తెలుపుతూ ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. అయితే ఇప్పటికే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అంటూ ప్రకటించేసిన వర్మ.. కేతిరెడ్డి ప్రకటించిన లక్ష్మీస్ వీరగ్రంథంపై ఆసక్తికరంగా స్పందించారు. లక్ష్మీస్ వీరగ్రంథం పోస్టర్‌ని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసి 'తానెవరో నాకు తెలియదు కానీ వీపు మాత్రం బాగుంది' అంటూ తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కామెంట్ చేశారు వర్మ.
entertainment
6,349
01-03-2017 12:26:34
ఎన్టీఆర్ కొత్త సినిమాకు కళ్లు చెదిరే ఆఫర్!
లాస్ట్ ఇయర్ తన కెరీర్‌లోనే బెస్ట్ సినిమాతో సరికొత్త రికార్డు సృష్టించిన టాలీవుడ్ స్టార్ హీరో... ఈ సారి సినిమా మొదలు పెట్టక ముందే రికార్డు క్రియేట్ చేస్తున్నాడట. ఎవరా హీరో? ఎంటా సినిమా? 'జనతా గ్యారేజ్' సక్సెస్‌తో జోష్ మీదున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్... ఎవరూ ఊహించని విధంగా బాబీ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. రీసెంట్‌గా షూటింగ్ మొదలైన ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకుంది సినిమా యూనిట్. ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేస్తుండటం... అందులో ఒకటి నెగటివ్ రోల్ అనే టాక్ రావడంతో మూవీపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇదిలా ఉంటే ఆరంభానికి ముందే ఈ సినిమాను ఓ భారీ ఆఫర్ పలకరించినట్టు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా థియెట్రికల్ రైట్స్‌ను ఏకంగా 85 కోట్లకు కొనుగోలు చేయడానికి ఓ బడా నిర్మాత ముందుకొచ్చాడట. ఈ మేరకు కళ్యాణ్ రామ్‌తో సదరు నిర్మాత చర్చలు కూడా జరిపినట్టు టాక్. కావాలంటే మరో ఐదు కోట్లు ఎక్కువగా ఇవ్వడానికి కూడా ఆయన సుముఖంగా ఉన్నాడట. అయితే కళ్యాణ్‌రామ్ మాత్రం ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటున్నారు. ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' దాదాపు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో తారక్ నయా మూవీ ఈ రేంజ్‌లో రేటు పలుకుతోందని కొందరు చర్చించుకుంటున్నారు. ఈ మధ్య ఎరాస్ వంటి సంస్థలు సినిమాను గంపగుత్తగా కొనేస్తుండటంతో వారితో పోటీపడేందుకు కొందరు నిర్మాతలు ముందుగానే జాగ్రత్త పడుతున్నారని సమాచారం. ఏదేమైనా ఎన్టీఆర్ నయా మూవీ బిజినెస్ కాస్త అటు ఇటుగా వంద కోట్లకు దగ్గరగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి సినిమా అంతకు మించి వసూళ్ళను సాధిస్తుందేమో చూద్దాం...
entertainment
11,838
11-11-2017 00:47:41
సింహాల జంటను వెంటాడిన బైకర్లు
అది గిర్‌ అభయారణ్యం. సింహాలకు ఆలవాలం. అక్కడ గంభీరంగా తిరిగే మృగరాజు ఒక్కసారిగా బెదిరిపోయాడు. ఆ వెనకే ఓ సివంగీ హడలిపోయి పరుగు తీసింది. కొంతమంది వ్యక్తులు బైకులపై రయ్‌ రయ్‌మంటూ వెంటాడడంతో ఆ సింహాల జంట భయపడిపోయింది. ఇది తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో. ఫేస్‌ బుక్‌లో బుధవారం పోస్టు చేశారు. బైక్‌ నంబర్‌ ఆధారంగా కూపీలాగి వీడియోలోని ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించిన వారిపై కేసు పెట్టి కటకటాల వెనక్కి నెట్టారు.
nation
2,738
16-09-2017 01:59:02
లారస్‌ లాబ్స్‌ యూనిట్‌కు ఎఫ్‌డిఎ ఓకే
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నంలోని యూనిట్‌ 2.. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి (యుఎస్‌ ఎఫ్‌డిఎ) నుంచి ఎస్టాబ్లిష్‌మెంట్‌ రిపోర్ట్‌ (ఇఐఆర్‌)ను అందుకుందని లారస్‌ లాబ్స్‌ వెల్లడించింది. అచ్యుతాపురం వద్ద ఉన్న ఫినిష్డ్‌ డోసేజ్‌ ఫార్ములేషన్స్‌ (ఎఫ్‌డిఎఫ్‌), యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఎపిఐ) ప్లాంట్‌, యూనిట్‌ 2కు సంబంధించి ఈ ఏడాద మే నెలలో ఎఫ్‌డిఎ తనిఖీలు నిర్వహించిందని తెలిపింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఎప్‌డిఎ.. ఇఐఆర్‌ను జారీ చేసిందని పేర్కొంది. యూనిట్‌ 2లోని ఎఫ్‌డిఎఫ్‌ విభాగం కూడా బిజివి హాంబర్డ్‌ (జర్మనీ నియంత్రణ సంస్థ) తనిఖీలను పూర్తి చేసుకుందని తెలిపింది. మరోవైపు విశాఖపట్నంలోని పరవాడ వద్ద ఉన్న యూనిట్‌ 1, 3ల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ఈ నెలలోనే తనిఖీలు చేసి ఎలాంటి అభ్యంతరాలను లేవనెత్తలేదని కంపెనీ తెలిపింది.
business
596
03-07-2017 00:01:44
9500 పైన స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌
నిఫ్టీ గత వారం 100 పాయిం ట్ల దిగువన బలమైన డౌన్‌ట్రెండ్‌లో ప్రారంభమై మద్దతు స్థాయి 9500 వరకు దిగజారినా తదుపరి వారం అంతా కన్సాలిడేషన్‌ సాధించి చివరికి ఈ స్థాయికి స్వల్పంగా పైన క్లోజయింది. వీక్లీ చార్టుల్లో వారం గరిష్ఠ, కనిష్ఠ స్థాయిలకు మధ్యలో అనిశ్చితంగా ముగిసింది. టెక్నికల్‌గా మార్కెట్‌ స్వల్పకాలిక కరెక్షన్‌లో ఉంది. స్వల్పకాలిక ట్రెండ్‌ నిర్ణాయక స్థాయి కన్నా స్వల్పంగా పైన అత్యంత కీలక కూడలిలో నిలిచింది. ఇటీవల ఏర్పడిన గరిష్ఠ స్థాయి 9700 నుంచి 250 పాయింట్ల మేరకు దిగజారి 9450 స్థాయి వరకు కూడా వచ్చింది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం మార్కెట్‌ రానున్న రెండు రోజుల్లో 9500 వద్ద మరింత బలం ప్రదర్శించాలి. ప్రధాన ట్రెండ్‌ ఇప్పటికీ ఎగువకే ఉంది. నెలవారీ చార్టుల్లో ఇంకా ఓవర్‌బాట్‌ స్థితి కొనసాగుతోంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి.బుల్లిష్‌ స్థాయిలు...స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం 9500 కన్నా పైన మరో రోజు బలంగా క్లోజ్‌ కావాలి. ఇంట్రాడే అప్‌ట్రెండ్‌ కోసం ఇంట్రాడే నిరోధం 9540 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 9600. ఆ పైన 9700. గత కొద్ది వారాలుగా ఈ స్థాయిలోనే నిలదొక్కుకోలేకపోతోంది. అ పైన మాత్రమే బలమైన అప్‌ట్రెండ్‌ ఉంటుంది. తదుపరి టార్గెట్‌ 10000.బేరిష్‌ స్థాయిలు...9500 పైన నిలదొక్కుకోలేకపోతే స్వల్పకాలిక కరెక్షన్‌లో పడుతుంది. ప్రధాన మద్దతు స్థాయిలు 9400, 9300. బ్యాంక్‌ నిఫ్టీ స్వల్ప పాజిటివ్‌ దృక్పథంతో ముగిసింది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం నిరోధ స్థాయి 23,300 పైన నిలదొక్కుకోవాలి. మైనర్‌ మద్దతు స్థాయి 23,200 కన్నా దిగజారితే మైనర్‌ కరెక్షన్‌ సంకేతం ఇస్తుంది. ప్రధాన మద్దతు స్థాయి 23000. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక కరెక్షన్‌లో పడుతుంది.  స్వల్పకాలిక వ్యూహం : 9500 కన్నా పైన నిలదొక్కుకుంటే స్వల్పకాలిక ట్రేడర్లు బై పొజిషన్లు పరిశీలించవచ్చు. 9450 దిగువన స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.పాటర్న్‌ : ఇండెక్స్‌ ప్రస్తుతం 45 డిగ్రీల కోణంలో ఏటవాలుగా దిగువకు కనిపిస్తున్న రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌ కన్నా స్వల్పంగా దిగువన ఉంది. అలాగే 9500 వద్ద అడ్డంగా కనిపిస్తున్న రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌ కన్నా స్వల్పంగా పైన ఉంది. రానున్న కొద్ది రోజుల్లో ఈ స్థాయికి పైన నిలదొక్కుకోవడం తప్పనిసరి. అప్పుడే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ ఉంటుంది. గత వారం 50 డిఎంఏ వద్ద మద్దతు తీసుకోవడం సానుకూల సంకేతం. -వి. సుందర్ రాజా
business
11,681
24-02-2017 21:31:21
శాంతి సాధనలో యోగా గొప్ప మార్పులు తెస్తుంది: మోదీ
కోయంబత్తూర్: జీవం ఎక్కడ ఉందో...శివం అక్కడ ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. జీవం నుంచి శివం చేరే యాత్ర యోగమని, నేను నుంచి మనం వరకు సాగే యాత్ర యోగా అని చెప్పారు. తమిళనాడు కోయంబత్తూరు వెల్లియంగిరి కొండల సమీపంలో ఈషా ఫౌండేషన్ యెగా కేంద్రంలో 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ ఆయన భిన్నత్వంలో ఏకత్వమే భారత్ గొప్పదనమని తెలిపారు. శివపార్వతుల కలయిక అంటే సముద్రం, పర్వతాల సంగమమని చెప్పారు. పాత తరాల ఆలోచనలను కొత్తతరాలకు ఎలా ఉపయోగపడతాయో ఆలోచించాలని మోదీ సూచించారు. ఆరోగ్య పరిరక్షణకు యోగా పాస్‌పోర్టు లాంటిందని, యోగా వల్ల రోగాల నుంచి విముక్తి లభిస్తుందన్నారు. యోగాను కేవలం వ్యాయామంగా చూడొద్దని, యోగాతో నూతన శకానికి నాంది పలకొచ్చని తెలిపారు. యోగాను భారత్ ప్రపంచానికి బహుమతిగా అందించిందని మోదీ చెప్పారు.  శాంతి సాధనలో యోగా గొప్ప మార్పులు తీసుకురాగలదన్నారు. సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో కలిసి మోదీ ఈషా ఫౌండేషన్ యోగా కేంద్రంలో కలియతిరిగారు. పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఆదియోగి పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో తమిళనాడు సిఎం పళని స్వామి, గవర్నర్ విద్యాసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.
nation
20,926
12-10-2017 01:46:31
బుల్స్‌ ప్లేఆఫ్‌ ఆశలు సజీవం..
35-32తో ఢిల్లీపై గెలుపు జైపూర్‌: ప్రొ కబడ్డీ సీజన్‌-5లో ప్లేఆఫ్‌ అవకాశాలను బెంగళూరు బుల్స్‌ ఇంకా సజీవంగా ఉంచుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 35-32తో దబాంగ్‌ ఢిల్లీపై నెగ్గింది. బుల్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ కుమార్‌ (12 పాయింట్లు), అజయ్‌ కుమార్‌ (10 పాయింట్లు) సూపర్‌ టెన్‌తో మెరిశారు. ఢిల్లీ రైడర్‌ రోహిత్‌ బలియాన్‌ 11 పాయింట్లు సాధించినా.. డిఫెన్స్‌ వైఫల్యంతో మ్యాచ్‌ను చేజార్చుకో వాల్సి వచ్చింది. సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తోన్న ఢిల్లీకి ఇది 15వ ఓటమి. అయితే బెంగళూరుకు ప్లేఆఫ్‌ అవకాశాలు ఇంకా ఉన్నాయి. అజయ్‌ కుమార్‌ రైడ్‌తో ఖాతా తెరిసిన బుల్స్‌.. మూడు నిమిషాలు గడిచే సరికి 3-1తో నిలిచింది. కానీ వరుసగా పాయింట్లు సాధించిన ఢిల్లీ 5-3తో ముందంజ వేసింది. తొమ్మిదో నిమిషంలో అజయ్‌ రెండు పాయింట్లు తేవడంతో స్కోరు 6-6తో సమమైంది. ఈ దశలో మ్యాచ్‌పై ఆధిపత్యం ప్రదర్శించిన బుల్స్‌ 17-9తో బ్రేక్‌కు వెళ్లింది. సెకండాఫ్‌ 30వ నిమిషంలో రోహిత్‌ సక్సెస్‌ ఫుల్‌ రైడ్‌తో బుల్స్‌ 24-15తో ఆధిక్యంలో నిలిచింది. 36వ నిమిషంలో బుల్స్‌ను ఆలౌట్‌ చేసిన ఢిల్లీ 27-30తో రేసులోకొచ్చింది. తర్వాతి రైడ్‌కు వచ్చిన రోహిత్‌ రెండు పాయింట్లు సాధించి ఢిల్లీని పుంజుకోకుండా దెబ్బకొట్టా డు. అయితే చివరి నిమిషంలో ఢిల్లీ నాలుగు పాయింట్లు సాధించినా ఓటమి తప్పలేదు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 37-27తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై నెగ్గింది.
sports
20,974
16-04-2017 00:26:12
పొలార్డ్‌కు బుర్రలేదని తిట్టలేదు!
న్యూఢిల్లీ: వెస్టిండీస్‌, ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మన్‌ కీరన్‌ పొలార్డ్‌పై తాను చేసిన విమర్శలపై కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ స్పందించాడు. పొలార్డ్‌ను తాను బుర్రలేదని తిట్టలేదని, కావాలంటే కామెంట్రీ ఫుటేజ్‌ను పరిశీలించుకోవాలని మంజ్రేకర్‌ అన్నాడు. ‘అలాంటి పదాలు వాడడం నా శైలి కాదు. నేను చాలా స్పష్టంగా ఉన్నా. అతణ్ణి విమర్శించాను తప్ప అవమానించలేద’ని మంజ్రేకర్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ నెల 9న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో.. ఛేదనలో పొలార్డ్‌ 17 బంతుల్లో 17 పరుగులే చేసి అవుటయ్యాడు. దీంతో అతనికి టాప్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసే సత్తా ఉందా? అని కామెంట్రీ బాక్స్‌లో మంజ్రేకర్‌ అన్నాడు. వీడియా ఫుటేజ్‌లోనూ సంజయ్‌ ‘బుర్రలేదు’ అనే పదం వాడలేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.
sports
9,052
14-02-2017 11:23:10
బాలకృష్ణ సినిమాలో నాగ్ నటిస్తాడా?
ఓ మహానటుడి జీవితకథ ఇప్పుడు సినిమాగా రూపొందబోతోంది. ఆ దిగ్గజ నటుడి పాత్రలో ఒదిగిపోయేందుకు ఓ నటుడు కూడా రెడీ అయ్యాడు. అయితే మహా నటుడికి సమకాలికుడైన మరో దిగ్గజ నటుడి పాత్రలో ఎవరు నటిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలుగు చలన చిత్రసీమలో ఎన్టీఆర్ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే మరో పేరు ఏఎన్నార్. వీరిద్దరూ సుమారు మూడున్నర దశాబ్దాలపాటు సిల్వర్ స్క్రీన్‌పై స్టార్ వార్‌ను కొనసాగించిన నటులు... ఓ వైపు తమ తమ సినిమాలలో కథానాయకులుగా నటిస్తూనే మరోవైపు ఎలాంటి ఈగోలకు పోకుండా డజనుకు పైగా చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించడం విశేషం. అలా టాలీవుడ్‌లో ఎన్టీఆర్, ఏఎన్నార్ ది విడదీయరాని అనుబంధం. తాజాగా ఎన్టీఆర్ బయోగ్రఫీతో సినిమా చేస్తానని బాలకృష్ణ ప్రకటించాడు. అందుకు తగ్గట్టు ఇప్పటికే స్క్రిప్ట్‌ను కూడా సిద్ధం చేయిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్‌గా మెయిన్ రోల్‌లో తానే నటించబోతున్నట్టు ఇప్పటికే స్పష్టం చేశాడు బాలయ్య. అయితే ఎన్టీఆర్ నట జీవితంలో ఎంతో ప్రాముఖ్యత గల ఏఎన్నార్ పాత్రను ఈ బయోపిక్‌లో ఎవరు చేయబోతున్నారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నటరత్న ఎన్టీఆర్ నటవారసుడిగా తెలుగు చిత్రసీమలో ప్రభంజనం సృష్టిస్తున్నాడు బాలకృష్ణ. అలాగే ఏఎన్నార్ నటవారసుడిగా టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నాడు నాగార్జున. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్‌లో రామారావు పాత్రలో బాలకృష్ణ కనిపిస్తే అక్కినేని పాత్రలో ఆయన తనయుడు నాగార్జున కనిపిస్తే బాగుంటుందని అభిమానుల ఆరాటం. ఇటీవల వీరిద్దరి మధ్య కొంత దూరం పెరిగినప్పటికీ బాలకృష్ణ 'శాతకర్ణి' సినిమాను మెచ్చుకుంటూ నాగ్ ట్వీట్ చేయటం విశేషం. సో వీరిద్దరూ కలసి నటిస్లే నందమూరి-అక్కినేని అభిమానులకు పండగే. మరి వారి కోరిక నెరవేరుతుందేమో చూద్దాం..
entertainment
13,821
01-09-2017 16:10:13
రాజీనామా వార్తలపై ఉమాభారతి మౌనం
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్వవస్థీకరణకు ముందే తాను రాజీనామా చేసినట్టు వస్తున్న వార్తలపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఉమాభారతి స్పందించేందుకు నిరాకరించారు. గురువారం నుంచి వినిపిస్తున్న ఊహాగానాలు తన దృష్టికి కూడా వచ్చాయని, దీనికి సంబంధించిన ఎలాంటి ప్రశ్నలకూ తాను స్పందించాలని అనుకోవడం లేదని ఉమాభారతి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గంగా ప్రక్షాళన పనులు అనుకున్న రీతిలో సాగడం లేదని ప్రధాని మోదీ అసంతృప్తితో ఉన్నారని, దీంతో ఆరోగ్య కారణాల రీత్యా తాను రాజీనామా చేస్తున్నట్టు ఉమాభారతి తన రాజీనామా పత్రాన్ని ప్రధానికి అందజేశారని వార్తలు వెలువడ్డాయి. కాగా, కేంద్ర మంత్రి సంజీవ్ బాల్యాన్ ఓ ట్వీట్‌లో తనను రాజీనామా చేయాలని కోరారని, వెంటనే రాజీనామా సమర్పించానని చెప్పారు. కేంద్ర స్కిల్ డవలప్‌మెంట్ సహాయ మంత్రి రాజీవ్ ప్రతాఫ్ రూఢీ సైతం తన రాజీనామాను ధ్రువీకరించారు. పార్టీ నిర్ణయం ప్రకారమే తాను రాజీనామా చేశానని, ఇందులో ఎలాంటి స్ట్రాటజీ లేదని చెప్పారు. పార్టీ అధికారానికి లోబడి పనిచేయాల్సి ఉంటుందని, క్రమశిక్షణ కలిగిన సైనికులుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని తాము పాటించాల్సిందేనని అన్నారు. తనకు అవకాశం ఇచ్చిన పార్టీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఆయన అన్నారు. పార్టీకి కట్టుబడి సేవలు కొనసాగిస్తామని చెప్పారు. కాగా, రూడీకి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.
nation
416
28-02-2017 23:33:21
కొనసాగిన కరెక్షన్‌
సూచన: స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. వి.సుందర్ రాజా
business
13,364
26-05-2017 14:48:29
మోదీ 'మన్ కీ బాత్' తొలి ప్రతిని అందుకున్న ప్రణబ్
న్యూఢిల్లీ: ఆల్ ఇండియా రేడియోలో ప్రయోగాత్మకంగా మోదీ ప్రతి నెలా ప్రసంగిస్తున్న 'మన్‌ కీ బాత్' కార్యక్రమం మంచి పాపులారిటీ తెచ్చుకుంది. మోదీ చేసిన ప్రసంగాలు, ఆయన ప్రస్తావించిన సామాజిక అంశాలతో కూడిన 'మన్ కీ బాత్-ఎ సోషల్ రివల్యూషన్ ఆన్ రేడియా' పుస్తకాన్ని రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారంనాడు ఆవిష్కరించారు. దీనితో పాటు 'మార్చింగ్ విత్ ఎ బిలియన్-అనలైజింగ్ నరేంద్ర మోదీస్ గవర్నమెంట్ ఎట్ మిడ్ టర్మ్' అనే పుస్తకావిష్కరణ జరిగింది. ఈ రెండు పుస్తకాల తొలి ప్రతిని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందుకున్నారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ పుస్తకాలను ఆవిష్కరించగా, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, తదితర ప్రముఖులు హాజరయ్యారు. పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ మంచి వక్త అని, దేశానికి, ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశానిర్దేశం చేశారని ప్రశంసించారు. మూడేళ్ల పాలనలో ప్రధాని కొన్ని మహత్తర నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి 'మన్ కీ బాత్' ప్రసంగంలో ఆయన ఎంచుకున్న అంశాలు ప్రాధాన్యత కలిగినవే కాకుండా, లక్షలాది మంది భారతీయులపై ప్రభావం చూపాయని అన్నారు. 'ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మన రాష్ట్రపతులు, ప్రధానులంతా మంచి వక్తలే కావడం విశేషం' అని ప్రణబ్ అన్నారు. రెండు పుస్తకాల్లోని సారాంశం, యోగ్యతలను బట్టి వీటికి విస్తృతమైన రీడర్‌షిప్ లభిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. 'మన్ కీ బాత్' పుస్తకాన్ని రాజేష్ జైన్ సంకలనం చేశారు. 'మార్చింగ్ విత్ ఎ బిలియన్' పుస్తకాన్ని ప్రముఖ జర్నిలిస్టు ఉదయ్ మహుర్కర్ రచించారు.
nation
8,785
11-07-2017 12:18:58
శాతకర్ణి డబ్బింగ్ సినిమా అని నేను చెప్పను: బాలకృష్ణ
‘‘తమిళనాడు, తెలుగునాడు ఎంతో ఘనచరిత్ర కలిగినవి. ఇక్కడ వీరపాండ్య కట్టబ్రహ్మణ - అక్కడ అల్లూరి సీతారామరాజు, ఇక్కడ ఎంజీఆర్‌ - అక్కడ ఎన్టీఆర్‌.. ఇలా ఎందరో గొప్ప నాయకులు పుట్టిన గడ్డ మనది. ఆంధ్ర విడిపోవడానికి ముందు మనది ఒకే నేల. రాష్ట్రాలు విడిపోయినా మనమంతా ఒక్కటే. మీ ప్రేమ, ఆశీర్వాదం నాకు ఎప్పటికీ కావాలి’’ అని తను పుట్టిన తమిళనాడుపై అభిమానాన్ని చాటుకున్నారు నందమూరి బాలకృష్ణ. చిరిత్రాత్మకమైన తన వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ని బాలకృష్ణ తమిళంలో డబ్ చేసిన విషయం తెలిసిందే. తమిళ వెర్షన్‌కు సంబంధించిన పాటలను సోమవారం రాత్రి చెన్నైలోని కలైవానర్‌ అరంగంలో ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... ‘‘నేను ఇక్కడే పుట్టాను. తమిళనాడు నీరు తాగి పెరిగిన శరీరం నాది. తమిళనాడు నా పుట్టనిల్లులాంటిది. ఆంధ్ర విడిపోవడానికి ముందు మనమంతా ఒకే రాష్ట్రం. మద్రాసు రాష్ట్రమే. నేనూ మీ ఇంటి బిడ్డనే. శాతకర్ణి తమిళ డబ్బింగ్‌ సినిమా అని నేను చెప్పను. ఎందుకంటే శాతకర్ణి చరిత్రను భారతదేశం మొత్తం తెలుసుకోవాలి. తెలుగు, తమిళం మాత్రమే కాదు, అన్ని భాషల్లోను ఈ సినిమా విడుదల కావాలి. చరిత్రను పిల్లలకు తెలిపే బాధ్యత తల్లిదండ్రులదే. ఈ సినిమాను పిల్లలకి చూపించి, మన చరిత్ర, సంస్కృతిని గొప్పతనాన్ని తెలియజేయాలని కోరుతున్నా. రాజ్యాలన్నింటినీ ఒక్కటి చేసి గ్రీకుల నుంచి దేశాన్ని కాపాడిన తెలుగువాడు ‘శాతకర్ణి’గా నటించడం నా అదృష్టం. ఒక్కో సినిమాకు ఒక్కో కారణం ఉంటుంది. బాపు లేకపోతే ‘శ్రీరామరాజ్యం’ చేసుండేవాడిని కాదు. అమ్మకి గౌరవమిచ్చే ‘శాతకర్ణి’ నా వందో చిత్రం కావడం పూర్వజన్మసుకృతం. ఇందుకు దర్శకుడు క్రిష్‌కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. నాన్న పేరుతోనే గుర్తింపునిచ్చే ఈ సమాజంలో అమ్మ పేరుకు గౌరవమివ్వడం గొప్ప విషయం. తల్లి పేరుతో బిడ్డ పేరు చెబుతుంటే.. అమ్మ ఎంత సంతోషిస్తుందో! ఇటువంటి సినిమాలు చేయడానికి ఆనాటి దిగ్గజాలే స్ఫూర్తి. నాన్నగారు, ఇక్కడ పెద్దనాన్న ఎంజీఆర్‌గారు, చిన్నాన్న శివాజీగారు ఎన్నో గొప్ప పాత్రలు పోషించారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విజయం వెనుక వారి ఆశీస్సులు కూడా ఉండే ఉంటాయి’’ అని అన్నారు.   తన తాజా చిత్రం ‘పైసావసూల్‌’ షూటింగ్‌ పూర్తయిందని, కేఎస్‌ రవికుమార్‌తో చేస్తున్న కొత్త చిత్రం షూటింగ్‌ త్వరలో కుంభకోణంలో జరుగనుందని బాలకృష్ణ ఈ సందర్భంగా చెప్పారు. తమిళనాడుకు దూరమై పలు దశాబ్దాలు గడిచినా, భాష రాకపోయినా తమిళ గడ్డపై తమిళంలోనే మాట్లాడేందుకు ప్రయత్నించి బాలకృష్ణ స్థానికుల మన్ననలు పొందారు.  తెలుగు నిర్మాతలు సి.కల్యాణ్‌, కాట్రగడ్డ ప్రసాద్‌, జవ్వాజి రామాంజనేయులు, చిత్ర నిర్మాతలు నరేంద్ర, ఆర్‌ఎన్‌సీ సినిమా రఘునాథ్‌, చిత్రదర్శకుడు క్రిష్‌, సంగీత దర్శకుడు చిరంజన్‌ భట్‌, తమిళ మాటల రచయిత మరుదభరణి తదితర సినీ ప్రముఖుల సమక్షంలో తమిళ నటుడు కార్తీ ఆడియో సీడీని విడుదల చేయగా, సీనియర్‌ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ తొలి సీడీని అందుకున్నారు. నాలుగేళ్ల తరువాత బాలకృష్ణ చెన్నైకి రావడంతో నగరంలోని ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఈ వేడుకకు భారీగా తరలివచ్చారు. ‘జై బాలయ్య’ అంటూ వారు చేసిన నినాదాలతో వేదిక ప్రాంగణం దద్దరిల్లిపోయింది. హీరో కార్తీ, డైరెక్టర్ కేఎఆస్‌ రవికుమార్‌ను వారి తల్లిపేర్లతోనే బాలకృష్ణ పిలవడం సభికులను మరింతగా ఆకట్టుకుంది.
entertainment
19,344
25-02-2017 01:43:13
ఏదో అనుకుంటే..
శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌ను మట్టికరిపించాం. వరుసగా 19 టెస్టుల్లో అపజయం లేకుండా సాగిపోతున్నాం. దాంతో, మన గడ్డపై పేలవ రికార్డున్న ఆసీస్‌కూ కష్టాలు తప్పవని భావించాం. ప్రత్యర్థిని స్పిన్‌ ఉచ్చు లో బిగించొచ్చని సంబరపడ్డాం. ఊహించినట్టే తొలి టెస్టును భారత బాగానే ఆరంభించింది. కానీ, రోజు గడిచేసరికి పరిస్థితి తారుమారైంది. టీమిండియా తాను పన్నిన ఉచ్చులో తానే చిక్కుకుంది. హేమాహేమీ బౌలర్లకే సింహస్వప్నమైన భారత బ్యాట్స్‌మెన్‌ కేవలం నాలుగు టెస్టుల అనుభవం ఉన్న ఒకీఫ్‌ దెబ్బకు దాసోహమన్నారు. పర్యాటక బౌలర్ల ప్రతిభతో పాటు మన బ్యాట్స్‌మెన్‌ నిర్లక్ష్యం కూడా భారత కొంప ముంచింది. రహానెతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కగా నడిపిస్తున్న రాహుల్‌ క్రీజుముందుకొచ్చి షాట్‌ ఆడాల్సిన అవసరమే లేదు. అంతకుముందే స్టార్క్‌ బౌలింగ్‌లో రెండు సార్లు ఎడ్జ్‌లు వచ్చినా అతను బతికిపోయాడు. అయినా కూడా ఆవేశానికి పోయి వికెట్‌ పారేసుకున్నాడు. అక్కడి నుంచి చూస్తుండగానే భారత ఆలౌటైపోయింది.  ఫామ్‌లోఉన్న మన బ్యాట్స్‌మెన్‌ 40 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్‌ కావడం జీర్ణించుకోలేని విషయం. ఇక, ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ ఆరంభంలోనే మూడు వికెట్లతో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టినా.. ఫీల్డింగ్‌ వైఫల్యం భారత కొంప ముంచింది. మన ఫీల్డర్లు ఏకంగా నాలుగు క్యాచ్‌లను చేజార్చడం శోచనీయం. స్మితకే మూడుసార్లు లైఫ్‌ ఇచ్చారు. మొత్తానికి రెండో రోజు మాది కాదని కోచ్‌ అనిల్‌ కుంబ్లే సులభంగా చెప్పొ చ్చు. కానీ భారత ఇప్పుడు మ్యాచ్‌ కోల్పోయే ప్రమాదంలో పడింది. ఆసీస్‌ ఇప్పటికే.. మూడొందల ఆధిక్యానికి చేరువైంది. మరో వంద లేదంటే కనీసం 50 పరుగులు చేసినా మ్యాచ్‌ వాళ్ల చేతుల్లో ఉన్నట్టే. ఈ పిచ్‌పై 350 పైచిలుకు స్కోరు ఛేదించడమంటే మాటలు కాదు. అసలు ఈ పరిస్థితికి పుణె పిచ్‌ కూడా కారణమే. ఆడుతున్నవి రెండు ప్రధాన జట్లయి నా రెండు రోజుల్లోనే 24 వికెట్లు.. శుక్రవారమే 15 వికెట్లు కూలడం చూస్తే మ్యాచ్‌ ముగిశాక ఈ పిచ్‌ క్యూరేటర్‌ పాండురంగ్‌ సాల్గావ్‌కర్‌ అనేక ప్రశ్నలకు వివరణ ఇచ్చుకోవాల్సిందే. మ్యాచ్‌కు రెండు రోజుల ముందు ‘ఇక్కడ బంతి ఎగురుతుంది’ అని మహారాష్ట్ర మాజీ పేసర్‌ అయిన సాల్గావ్‌కర్‌ ప్రకటించాడు.  కానీ, అలా జరిగే ఆస్కారమే లేదని, తొలి రోజు నుంచే బంతి తిరుగుతుందని స్టీవ్‌ స్మిత చెప్పాడు. రెండు రోజల ఆట చూశాక సాల్గావ్‌కర్‌ చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా జరిగింది. వాస్తవానికి పుణె వికెట్‌ ఫ్లాట్‌గా ఉంటుంది. నెల రోజుల క్రితం ఇక్కడ భారత-ఇంగ్లండ్‌ వన్డేలో రెండు జట్లూ 350 పైచిలుకు స్కోర్లు చేశాయు. అలాంటి పిచ్‌ ఇప్పుడిలా మారడం ఆశ్చర్యమే. దాంతో, క్యూరేటర్‌ స్వతహాగా పిచ్‌ తయారు చేశాడా లేక బీసీసీఐ క్యూరేర్‌ దల్జీత సింగ్‌ తలదూర్చాడా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
sports
8,964
11-11-2017 18:38:14
అల్లు అర్హ అప్పుడే నేర్చేసుకుంది
తనకి కూతురు పుట్టినప్పటి నుంచి అల్లు అర్జున్‌ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంత హ్యాపీగా ఉన్నారంటే రిలీజ్ రోజు టాక్ వీక్‌గా ఉన్న సినిమాలు కూడా కలెక్షన్లపరంగా సంచలనంగా మారుతూ, టాలీవుడ్‌ని షేక్ చేస్తున్నంత హ్యాపీగా ఉన్నారు. ఇక విషయంలోకి వస్తే తాజాగా అల్లు అర్జున్ తన ఫేస్‌బుక్ పేజీలో అల్లు అర్హ తాజా ఫొటోని షేర్ చేశారు.  తన భార్య అల్లు స్నేహా కాళ్లపై నిలబడి భోసి నవ్వులతో ఆకట్టుకుంటున్న ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెమెరాకి ఫోజులివ్వడం అప్పుడే నేర్చేసుకుందా అన్నట్లుగా ఈ ఫొటోలో ఉన్న అర్హ ఫోజుని చూసిన వారు కామెంట్స్ చేస్తుండటం విశేషం.
entertainment
1,101
29-03-2017 23:48:16
ఎపిలో సౌదీ రిఫైనరీ!
నేడు ఆరామ్‌కో ప్రతినిధులతో ఢిల్లీలో చర్చలు హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో భారీ చమురు శుద్ధి కర్మాగారం (రిఫైనరీ) ఏర్పాటు చేసేందుకు సౌదీ అరేబియా ఆసక్తి చూపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్‌లో పర్యటించినపుడు సౌదీ అరేబియా ప్రభుత్వ నిర్వహణలోని ఆరామ్‌కో కంపెనీ ఈ ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనపై అప్పట్లోనే ప్రాథమిక చర్చలు జరిగాయి. రాష్ట్రానికి వచ్చి దీనిపై వివరంగా చర్చించాలని ఆరామ్‌కో కంపెనీ ప్రతినిధులు నిర్ణయించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఈ కంపెనీ ప్రతినిధులు కొన్ని అనివార్య కారణాల వల్ల ఎపికి రాలేకపోతున్నామని సిఎం కార్యాలయానికి సమాచారం పంపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఢిల్లీలో తమను కలవొచ్చని తెలిపింది. దీంతో రాష్ట్రంలో పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను ఆరామ్‌కో కంపెనీ ప్రతినిధులకు వివరించేందుకు గురువారం ఒక ఉన్నతాధికార బృందం ఢిల్లీ వెళుతోంది. ఇంధన, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సిఆర్‌డిఎ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌, ఆర్థిక అభివృద్ధి బోర్డు (ఇడిబి) సిఇఒ జాస్తి కృష్ణ కిశోర్‌, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ కార్తికేయ మిశ్రాలతో కూడిన బృందం సౌదీ అరేబియా కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరుపుతుంది. ఈ చర్చలు ఫలప్రదమైతే వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో రాష్ట్రంలో మరో పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటవుతుంది. ప్రస్తుతం ఎపిలోని విశాఖపట్నంలో మాత్రమే ప్రభుత్వ రంగంలోని హెచ్‌పిసిఎల్‌ ఒక రిఫైనరీ నడుపుతోంది.
business
20,784
04-02-2017 00:55:54
20న ఐపీఎల్‌ వేలం
బరిలో 76 మంది ఆటగాళ్లు న్యూఢిల్లీ: అనేక సందిగ్దాల నడుమ ఐపీఎల్‌-10 వేలం తేదీ, వేదిక ఖరారయ్యాయి. బెంగళూరు వేదికగా ఈనెల 20న ఐపీఎల్‌-10 వేలం ఉంటుందని బీసీసీఐ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఏప్రిల్‌ 5న మొదలయ్యే ఐపీఎల్‌ కోసం 28 మంది విదేశీయులతో 76 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉంటారని తెలిపింది. వాస్తవానికి ఐపీఎల్‌ వేలం ఈనెల 4న జరగాల్సి ఉంది. అయితే.. అనురాగ్‌ ఠాకూర్‌, అజయ్‌ షిర్కేలను అధ్యక్ష కార్యదర్శి పదవుల నుంచి తొలగిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో బీసీసీఐలో సంక్షోభం ఏర్పడింది. దీంతో ఆటగాళ్ల వేలం వాయిదా పడింది. అలాగే వేలం వేదిక బెంగళూరు నుంచి ముంబైకి మారుస్తారనే వార్తలొచ్చాయి. కానీ.. ఈనెల 20న ఐపీఎల్‌ వేలం ఉంటుందని అది కూడా బెంగళూరులోనే నని బీసీసీఐ శుక్రవారం స్పష్టం చేసింది.
sports
9,219
03-05-2017 00:30:11
నమ్మిన భక్తుల కోసం...
పల్లెర ఆనంద్‌ కృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘నీలిమలై’. వృషాలిగోస్వామి కథానాయిక. సూర్యకిరణ్‌ ఇలాడి దర్శకుడు. భానుచందర్‌ కీలక పాత్రధారుడు. నిర్మాణానంతర కార్యక్రమాలు, సెన్సార్‌ పనులు పూర్తయ్యాయి. నిర్మాత మాట్లాడుతూ ‘‘భక్తి ప్రధాన కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. తనని నమ్ముకున్న వారికి దేవుడు ఏవిధంగా అండగా నిలిచాడు? ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఎలా ఆదుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇటీవల విడుదలైన పాటలకు స్పందన బావుంది. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల ద్వితీయార్ధంలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు. అలీ, సాయికిరణ్‌, అర్చితా, లక్ష్మీ, సత్యప్రకాశ్‌, ఛత్రపతి శేఖర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఆర్‌.రామచంద్రారెడ్డి, సంగీతం: దేవేంద్ర, సినిమాటోగ్రఫీ: కిరణ్‌ కుమార్‌.
entertainment
15,417
02-02-2017 20:03:07
మద్యం సేవించి ఫ్లైట్ విధులకు హాజరైన.. మహిళా పైలట్, సిబ్బంది
న్యూఢిల్లీ: ఓ మహిళా పైలట్‌తోపాటు ఇద్దరు కేబిన్ సిబ్బంది మద్యం సేవించి ఫ్లైట్ విధులకు హాజరయ్యారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో పట్టుబడటంతో వారిపై చర్యలు చేపట్టారు. జనవరి 25న ఎయిర్ ఇండియా‌కు చెందిన రాజ్‌కోట్ టు ఢిల్లీ విమాన సర్వీసులో విధులకు హాజరైన మహిళా పైలట్, మరో ఇద్దరు ఆల్కహాల్ టెస్ట్‌లో విఫలమయ్యారు.  దీంతో వారిని ఫ్లైయింగ్ విధుల నుంచి తప్పించి మూడు నెలల పాటు గ్రౌండ్ డ్యూటీలకు కేటాయించిన్నట్లు ఎయిర్ ఇండియా గురువారం వెల్లడించింది. మరోవైపు నిబంధనలను పక్కన పెట్టి గత నెల రోజులుగా పైలట్లు, సిబ్బందికి ఆల్కహాల్ పరీక్షలు నిర్వహించని ఓ అధికారిపై శాఖాపరమైన దర్యాప్తునకు ఎయిర్ ఇండియా ఆదేశించింది.
nation
20,782
10-09-2017 17:50:01
సచిన్ రికార్డులను బద్దలు గొట్టేది అతడే: కపిల్
న్యూఢిల్లీ: టీమిండియా సారథి విరాట్ కోహ్లీపై మాజీ సారథి కపిల్‌దేవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్ సాధించిన వంద సెంచరీల రికార్డును మరెవరూ చేరుకోలేరని గతంలో అనుకునేవాడినని, కానీ ఇప్పుడా సత్తా కోహ్లీలో కనిపిస్తోందన్నాడు. సచిన్ రికార్డును కోహ్లీ కచ్చితంగా అధిగమిస్తాడని కపిల్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 30 సెంచరీలు చేసేందుకు 375 మ్యాచ్‌లు ఆడాడని, కోహ్లీ కేవలం 194 వన్డేల్లోనే ఆ ఘనత సాధించాడని కొనియాడాడు. ఇతర దేశాలు నిర్వహిస్తున్న టీ20 లీగ్ మ్యాచుల్లో టీమిండియా ఆటగాళ్లు కూడా ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వాలని ఈ సందర్భంగా కపిల్ కోరాడు. ఆటగాళ్లు బీసీసీఐకి విధేయంగా ఉండాలనుకోవడం సరైనదేనని, అయితే వారిని అన్ని దేశాల లీగుల్లో ఆడేందుకు అనుమతిస్తే బాగుంటుందన్నాడు. ఇందుకోసం ఐసీసీ అన్ని బోర్డులతో చర్చించాలని కపిల్ సలహా ఇచ్చాడు.
sports
14,165
18-02-2017 11:09:09
చివరి అంకానికి చేరిన రాజకీయ జల్లికట్టు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో ఇవాళ బల పరీక్షకు సిద్ధమైన అందరి కంటే ముందుగానే శాసన సభకు చేరుకున్నారు. బల పరీక్ష సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై దృష్టి పెట్టారు. మరో వైపు గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి శశికళ వర్గం ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బయల్దేరారు. ఎమ్మెల్యేలు మధ్యలో ఎవరితో మాట్లాడకుండా.. అలాగే వారు జారి పోకుండా పళనిస్వామి, అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఎమ్మెల్యేలను బృందాలుగా విడగొట్టి వారి బాధ్యతలను మంత్రులకు అప్పగించారు.
nation
3,286
10-08-2017 04:08:31
మార్కెట్‌ రక్షణపై ఆర్‌సీఈపీ వేటు
ఆర్‌సీఈపీ ఒప్పందం అమల్లోకొస్తే ఇప్పటివరకూ పాక్షికంగానైనా ఉన్న దిగుమతి సుంకాలతో విదేశీ పెట్టుబడులను నిరోధించే రక్షణ తప్పుతుంది. మన ఉత్పత్తుల ధరలు బహుళజాతి సంస్థల లాభాల వేటకు బలవుతాయి. ఇప్పుడున్న ధరలు కూడా పంటలకు దక్కవు. పాడి, చేనేత, దేశీయ మార్కెట్‌పై ఆధారపడిన పరిశ్రమలు కుదేలవుతాయి. బహుళజాతి సంస్థలు ఉత్పత్తి రంగం మొదలు మార్కెట్ల వరకు అన్నింటా అధికారాన్ని చెలాయిస్తాయి. ఈ ఒప్పందం దేశ సార్వభౌమత్వానికి సవాలుగా మారుతుంది. జూలై 24 నుంచి 28 వరకూ హైదరాబాద్‌లో జరిగిన ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం’ (రీజినల్‌ కాంప్రహెన్సివ్‌ ఎకనామిక్‌ పార్టనర్‌ షిప్‌ – ఆర్‌సీఈపీ)పై చాలా వరకూ అంగీకారం కుదిరినట్లు తెలిసింది. ఈ ఒప్పందం వల్ల మనకున్న కొద్దిపాటి మార్కెట్‌ రక్షణ తప్పుతుంది. ఇప్పుడున్న ధరలు కూడా పంటలకు దక్కవు. పాడి, చేనేత, దేశీయ మార్కెట్‌పై ఆధారపడిన పరిశ్రమలు కుదేలవుతాయి. ప్రపంచ పెట్టుబడులు ఏకమై తలెత్తిన బహుళజాతి సంస్థలు ఉత్పత్తి రంగం మొదలుకొని మార్కెట్ల వరకు అన్నింటా అధికారాన్ని చెలాయిస్తాయి. దేశ సార్వభౌమత్వాన్ని కూడా సవాలు చేసే అధికారం చెలాయించే క్లాజులు ఇందులో ఉన్నాయి. ఈ మార్పులకు అవసరమైన ‘ఇన్వెస్టర్‌ -స్టేట్‌- డిస్‌ప్యూట్‌ -సెటిల్‌మెంటు’ (ఐఎస్‌డీఎస్‌) క్లాజుకు సభ్యదేశాలన్నీ అంగీకరించినట్టు సమాచారం పొక్కింది. ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంటు చాప్టర్‌నూ ఈ సమావేశంలోనే ముందుకుతెచ్చినట్టు తెలిసింది. పేటెంట్ల విధానానికి తెర ఎత్తారు. ఇంత తీవ్రత కలిగిన దీన్ని పార్లమెంటులో చర్చించకుండా ప్రభుత్వం ఆమోదించడానికి సిద్ధం కావడం ఎన్‌డీఏ పాలకులే కార్పొరేట్‌ ఏజెంట్లయ్యారన్న విమర్శకు తావిస్తోంది. ఆర్‌సీఈపీలో భారత్‌, చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగ్‌పూర్‌, మలేషియా, థాయ్‌లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వగైరా 16 సభ్య దేశాలున్నాయి. ఇవి 2012లో కాంబోడియాలో తొలి సమావేశం జరిపాయి. గత నెలలో హైదరాబాద్‌లో 19వ రౌండ్‌ జరిగింది. అనధికారికంగా తెలిసిన మేరకు దీనిలో అసంపూర్ణంగా ఉన్న అంశాలను వచ్చే నెలలో మనీలాలో జరిగే 20వ రౌండులో చర్చించనున్నారు. భారత్‌లో ఈ చర్చలు ఇక్కడి వరకూ రావడానికి తోడ్పడే క్రమం 1991 నుంచి మొదలైందని చెప్పొచ్చు. అప్పటి వరకు 113 శాతం దిగుమతి సుంకాలు విధించే హక్కుతో ప్రభుత్వరంగం ఆసరాగా భారత ఆర్థిక వ్యవస్థ పురోగమించింది. 1991 తరువాత ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రయివేటీకరణ (ఎల్‌పీజీ) విధానాలతో మన మార్కెట్టుకూ, పెట్టుబడులకూ ఉన్న రక్షణ తప్పింది. ప్రపంచ పెట్టుబడితో ఏకం కావాలన్న దేశీయ సంపన్న పెట్టుబడిదారుల ఒత్తిడితో మన పాలకులు ఇందులో చేరారు. ఆపై ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)లో 1995లో మన దేశాన్ని చేర్చారు. 1992 రెగ్యులేషన్‌ చట్టం ప్రకారం రూపొందిన 1997–2002 ‘ఎగ్జిమ్‌ పాలసీ’లోకి దించారు. ఐదేళ్ళకొకసారి దీన్ని మార్చేలా రూపొందించారు. ఇది ‘ఎగుమతి ప్రోత్సాహక విధివిధానాల’ను రూపొందించింది. ఇప్పటి వరకు జరిగిన ఈ మార్పుల కొనసాగింపుగా ఆర్‌సీఈపీ ఉంది. 1991 తరువాత జరిగిన మార్పులేంటి? దిగుమతులపై 113 శాతంగా ఉన్న సుంకాన్ని 32.7 శాతానికి మన పాలకులు దించారు. ఎగ్జిమ్‌ పాలసీ వచ్చాక వాజ్‌పేయి ప్రధానిగా ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఆయన ప్రభుత్వం ఫోఖ్రాన్‌ అణు పరీక్షలు జరపడం అమెరికా ఆగ్రహానికి కారణమైంది. దానిని ప్రసన్నం చేసుకునేందుకు మార్కెట్‌ రక్షణలో డబ్ల్యూటీవో మనకు ఇచ్చిన హక్కును మూడేళ్ళ ముందే వదులుకొని 2000, 2001లో 1428 వస్తువులను ఈ పాలసీ పరిధిలోకి తెచ్చారు. దీని ప్రకారం మన అవసరాలతో నిమిత్తం లేకుండా నిర్దేశిత మొత్తాలను దిగుమతి చేసుకొని తీరాలి. దీంతో చౌక పామోలిన్‌ దిగుమతులు జరిగాయి. ఫలితంగా వేరుశనగ, కొబ్బరి నూనె, ఇతర నూనె గింజల పంటల ధరలు పడిపోయాయి. దేశంలో అధికంగా గోధుమ ఉత్పత్తులు జరిగిన సంవత్సరమే ఎన్‌డీఏ ప్రభుత్వం దిగుమతులపై ఉన్న 25 శాతం సుంకాన్ని ఎత్తేసింది. దీంతో దిగుమతులు పెరిగి, రైతు అమ్మే గోధుమ ధరలు పడిపోయాయి. రెండేళ్ళు కరువుబారిన పడిన మధ్యప్రదేశ్‌లో 2016–17 వ్యవసాయ సీజన్లో దిగుబడులు పెరిగినా వరికి ధర లేకుండా పోయింది. కందిపప్పు దిగుమతితో మన రాష్ట్రంలో క్వింటా రూ.9 వేలు ఉన్న కంది ధర రూ.4 వేలకు పడిపోయింది. రైతు అమ్మే పంటల ధరలు పడిపోయినప్పుడు ప్రజలు కొనే పప్పుల ధరలు పెరగడంపై ప్రజల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమైంది. దీనిపై ఆదాయపు పన్ను శాఖ స్పందించి 2015 అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య దాడులు చేసింది. ఈ ధరల మాయాజాలపు రాకెట్‌ను అది మూడు శ్రేణులుగా విశ్లేషించింది. తొలి శ్రేణిలో ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేసే బహుళజాతి స్థాయి సంస్థలున్నాయి. ముఖ్యమైన గైనకోర్‌, ఎడిల్‌ వైన్‌, షార్పుమెంటు గ్రూపులు పప్పులను దేశంలోకి దిగుమతిచేసే ప్రధాన సంస్థలుగా ఉన్నాయి. ఇంకా ఏటీజీ గ్రూపు, కమోడిటీ మల్టీ నేషనల్‌ కార్పొరేషన్‌లు ఉన్నాయి. రెండో శ్రేణిలో దేశీయ డీలర్లయిన జిందాల్‌ గ్రూపునకు చెందిన దివిస్‌ జిందాల్‌, ప్రదీప్‌ జిందాల్‌, జిందాల్‌ ఆగ్రోతో పాటు సుపీరియర్‌ గ్రూపుకు చెందిన వికాస్‌ గుప్తా, ఎస్‌వి అగ్రిట్రేడ్‌కు చెందిన మనోజ్‌ అగర్వాల్‌, షార్పుమెంటు గ్రూపులున్నాయి. వీరు వ్యవసాయోత్పత్తులను రైతుల నుంచి సేకరించి తొలి శ్రేణి గ్రూపులకు అమ్ముతారు. మూడో శ్రేణిలో మనోజ్‌ అగర్వాల్‌, రిద్దిసిద్ది ఇంప్లెక్స్‌ పార్థ ఇంటర్నేషనల్‌, గున ఎంటర్‌ ప్రైజెస్‌, చార్లెస్‌ ప్రయివేటు ఇండియా సంస్థలున్నాయి. లాభాలు తగ్గించి చూపి, పన్నుల ఎగవేతకున్న అవకాశాలను ఇవి తెలియజేస్తాయి. వీరు ముందు చెప్పిన రెండు గ్రూపుల ప్రయోజనాలను కాపాడే పనిలో ఉంటారు. ఇవి మనీ ల్యాండ రింగుల్లోనూ తోడ్పడతాయి. ఇలా ఐటీ శాఖ రూపొందించిన 2,100 పేజీల నివేదికలో చౌకగా సేకరించడం, మార్కెట్లలో కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా ధరలు పెంచడంలో దేని పాత్ర అవి నిర్వహిస్తున్నాయని ‘ది వైర్‌’ విశ్లేషించింది.  ఇందువల్లే 2015లో తొలి దశలో 15 నుంచి 30 శాతం పెరిగిన పెసర, కంది, మినప ధరలు రెండో దశలో 64 శాతం పెరిగాయని విశ్లేషించింది. ఈ విధానాల ఫలితంగానే ప్రపంచ పాల ఉత్పత్తిలో 17 శాతం వాటాతో అతి పెద్ద ఉత్పత్తి కేంద్రంగా ఉన్న భారత్‌ పాడి పరిశ్రమ గాడి తప్పింది. 90 శాతంగా ఉన్న చిన్న, సన్నకారు రైతుల్లో పది శాతం మంది దీని నుంచి తప్పుకున్నారు. ఇలాంటి విధానాల మూలంగానే భారత బొమ్మల తయారీ పరిశ్రమ దారుణంగా దెబ్బతిన్నది. పింగాణీ పరిశ్రమ, చేనేత వృత్తులు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఆర్‌సీఈపీ ఒప్పందం అమల్లోకొస్తే ఇప్పటి వరకూ పాక్షికంగానైనా ఉన్న దిగుమతి సుంకాలతో నిరోధించే రక్షణ పూర్తిగా తప్పుతుంది. సంపూర్ణ స్వేచ్ఛా వాణిజ్యం అమలౌతుంది. మన ఉత్పత్తుల ధరలు బహుళజాతి సంస్థల లాభాల వేటకు బలౌతాయి. ప్రపంచ మార్కెట్‌లో బడుగు దేశాల ఉత్పత్తులకు తావుండదు. సంపన్న దేశాలు వీటిని ముడి సరుకు సరఫరాదారులుగా మారుస్తాయి. వాటినే నవీనీకరించి (ప్రాసెస్‌ చేసి) తమ ఉత్పత్తులుగా ప్రపంచంలో ఎక్కువ ధర ఉన్నచోట అమ్ముతాయి. ఈ ఒప్పందంలో ఉన్న పేటెంట్ల విధానం కొన్ని రంగాల్లో బహుళజాతి సంస్థల పెత్తనానికి చోటిస్తాయి. ప్రత్యేకించి పేటెంటు పొందిన విత్తన కంపెనీలు విత్తన ధరలను ఇష్టానుసారంగా పెంచేస్తాయి. మందుల కంపెనీల్లోనూ ఇదే తరహా పెత్తనాన్ని చెలాయిస్తాయి. ఇందువల్ల మన దేశంలో పేదలకు ఊరటగా ఉన్న జనరిక్‌ మందుల దుకాణాలు కనుమరుగవుతాయి. యంత్ర, వస్త్ర, ఎలక్ట్రానిక్‌, పింగాణీ తయారీ వగైరా దేశీయ పరిశ్రమల మార్కెట్‌ వీటి కబ్జాకు గురౌతుంది. ఇందులో ఉన్న ‘పెట్టుబడికి రక్షణ’ అన్న క్లాజు మన దేశ సార్వభౌమత్వానికే సవాలుగా మారుతుంది. మన దేశ ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ చట్టాల పేరిట వీటి పెట్టుబడులకు అనుమతులు నిరాకరిస్తే మన పాలకుల్ని అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాలు చేస్తాయి. అవి ప్రజా వ్యతిరేకమైనా పెట్టుబడి రక్షణ ఒప్పందాల మేరకు నడుచుకోవాలంటుంది. ఇందువల్ల మన జీడీపీలో అంటే వ్యవసాయ, పారిశ్రామిక, సేవలరంగ ఉత్పత్తుల్లో 1.6శాతం తగ్గుదల ఉం టుందని వాణిజ్యశాఖ అంచనాకట్టింది. అయినా దేశీయ కార్పొరేటు వర్గాలు సం పదను పెంచుకునేందుకివి తోడ్పడతాయి. ఇంత తీవ్రత కలిగిన ఈ ఒప్పందాన్ని పార్లమెంటులో చర్చకుపెట్టకుండా ఆమోదించే పనిలో ఎన్‌డీఏ పాలకులున్నారు.ఉన్నం వెంకటేశ్వర్లు జూలై 24 నుంచి 28 వరకూ హైదరాబాద్‌లో జరిగిన ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం’ (రీజినల్‌ కాంప్రహెన్సివ్‌ ఎకనామిక్‌ పార్టనర్‌ షిప్‌ – ఆర్‌సీఈపీ)పై చాలా వరకూ అంగీకారం కుదిరినట్లు తెలిసింది. ఈ ఒప్పందం వల్ల మనకున్న కొద్దిపాటి మార్కెట్‌ రక్షణ తప్పుతుంది. ఇప్పుడున్న ధరలు కూడా పంటలకు దక్కవు. పాడి, చేనేత, దేశీయ మార్కెట్‌పై ఆధారపడిన పరిశ్రమలు కుదేలవుతాయి. ప్రపంచ పెట్టుబడులు ఏకమై తలెత్తిన బహుళజాతి సంస్థలు ఉత్పత్తి రంగం మొదలుకొని మార్కెట్ల వరకు అన్నింటా అధికారాన్ని చెలాయిస్తాయి. దేశ సార్వభౌమత్వాన్ని కూడా సవాలు చేసే అధికారం చెలాయించే క్లాజులు ఇందులో ఉన్నాయి. ఈ మార్పులకు అవసరమైన ‘ఇన్వెస్టర్‌ -స్టేట్‌- డిస్‌ప్యూట్‌ -సెటిల్‌మెంటు’ (ఐఎస్‌డీఎస్‌) క్లాజుకు సభ్యదేశాలన్నీ అంగీకరించినట్టు సమాచారం పొక్కింది. ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంటు చాప్టర్‌నూ ఈ సమావేశంలోనే ముందుకుతెచ్చినట్టు తెలిసింది. పేటెంట్ల విధానానికి తెర ఎత్తారు. ఇంత తీవ్రత కలిగిన దీన్ని పార్లమెంటులో చర్చించకుండా ప్రభుత్వం ఆమోదించడానికి సిద్ధం కావడం ఎన్‌డీఏ పాలకులే కార్పొరేట్‌ ఏజెంట్లయ్యారన్న విమర్శకు తావిస్తోంది. ఆర్‌సీఈపీలో భారత్‌, చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగ్‌పూర్‌, మలేషియా, థాయ్‌లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వగైరా 16 సభ్య దేశాలున్నాయి. ఇవి 2012లో కాంబోడియాలో తొలి సమావేశం జరిపాయి. గత నెలలో హైదరాబాద్‌లో 19వ రౌండ్‌ జరిగింది. అనధికారికంగా తెలిసిన మేరకు దీనిలో అసంపూర్ణంగా ఉన్న అంశాలను వచ్చే నెలలో మనీలాలో జరిగే 20వ రౌండులో చర్చించనున్నారు. భారత్‌లో ఈ చర్చలు ఇక్కడి వరకూ రావడానికి తోడ్పడే క్రమం 1991 నుంచి మొదలైందని చెప్పొచ్చు. అప్పటి వరకు 113 శాతం దిగుమతి సుంకాలు విధించే హక్కుతో ప్రభుత్వరంగం ఆసరాగా భారత ఆర్థిక వ్యవస్థ పురోగమించింది. 1991 తరువాత ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రయివేటీకరణ (ఎల్‌పీజీ) విధానాలతో మన మార్కెట్టుకూ, పెట్టుబడులకూ ఉన్న రక్షణ తప్పింది. ప్రపంచ పెట్టుబడితో ఏకం కావాలన్న దేశీయ సంపన్న పెట్టుబడిదారుల ఒత్తిడితో మన పాలకులు ఇందులో చేరారు. ఆపై ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)లో 1995లో మన దేశాన్ని చేర్చారు. 1992 రెగ్యులేషన్‌ చట్టం ప్రకారం రూపొందిన 1997–2002 ‘ఎగ్జిమ్‌ పాలసీ’లోకి దించారు. ఐదేళ్ళకొకసారి దీన్ని మార్చేలా రూపొందించారు. ఇది ‘ఎగుమతి ప్రోత్సాహక విధివిధానాల’ను రూపొందించింది. ఇప్పటి వరకు జరిగిన ఈ మార్పుల కొనసాగింపుగా ఆర్‌సీఈపీ ఉంది. 1991 తరువాత జరిగిన మార్పులేంటి? దిగుమతులపై 113 శాతంగా ఉన్న సుంకాన్ని 32.7 శాతానికి మన పాలకులు దించారు. ఎగ్జిమ్‌ పాలసీ వచ్చాక వాజ్‌పేయి ప్రధానిగా ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఆయన ప్రభుత్వం ఫోఖ్రాన్‌ అణు పరీక్షలు జరపడం అమెరికా ఆగ్రహానికి కారణమైంది. దానిని ప్రసన్నం చేసుకునేందుకు మార్కెట్‌ రక్షణలో డబ్ల్యూటీవో మనకు ఇచ్చిన హక్కును మూడేళ్ళ ముందే వదులుకొని 2000, 2001లో 1428 వస్తువులను ఈ పాలసీ పరిధిలోకి తెచ్చారు. దీని ప్రకారం మన అవసరాలతో నిమిత్తం లేకుండా నిర్దేశిత మొత్తాలను దిగుమతి చేసుకొని తీరాలి. దీంతో చౌక పామోలిన్‌ దిగుమతులు జరిగాయి. ఫలితంగా వేరుశనగ, కొబ్బరి నూనె, ఇతర నూనె గింజల పంటల ధరలు పడిపోయాయి. దేశంలో అధికంగా గోధుమ ఉత్పత్తులు జరిగిన సంవత్సరమే ఎన్‌డీఏ ప్రభుత్వం దిగుమతులపై ఉన్న 25 శాతం సుంకాన్ని ఎత్తేసింది. దీంతో దిగుమతులు పెరిగి, రైతు అమ్మే గోధుమ ధరలు పడిపోయాయి. రెండేళ్ళు కరువుబారిన పడిన మధ్యప్రదేశ్‌లో 2016–17 వ్యవసాయ సీజన్లో దిగుబడులు పెరిగినా వరికి ధర లేకుండా పోయింది. కందిపప్పు దిగుమతితో మన రాష్ట్రంలో క్వింటా రూ.9 వేలు ఉన్న కంది ధర రూ.4 వేలకు పడిపోయింది. రైతు అమ్మే పంటల ధరలు పడిపోయినప్పుడు ప్రజలు కొనే పప్పుల ధరలు పెరగడంపై ప్రజల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమైంది. దీనిపై ఆదాయపు పన్ను శాఖ స్పందించి 2015 అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య దాడులు చేసింది. ఈ ధరల మాయాజాలపు రాకెట్‌ను అది మూడు శ్రేణులుగా విశ్లేషించింది. తొలి శ్రేణిలో ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేసే బహుళజాతి స్థాయి సంస్థలున్నాయి. ముఖ్యమైన గైనకోర్‌, ఎడిల్‌ వైన్‌, షార్పుమెంటు గ్రూపులు పప్పులను దేశంలోకి దిగుమతిచేసే ప్రధాన సంస్థలుగా ఉన్నాయి. ఇంకా ఏటీజీ గ్రూపు, కమోడిటీ మల్టీ నేషనల్‌ కార్పొరేషన్‌లు ఉన్నాయి. రెండో శ్రేణిలో దేశీయ డీలర్లయిన జిందాల్‌ గ్రూపునకు చెందిన దివిస్‌ జిందాల్‌, ప్రదీప్‌ జిందాల్‌, జిందాల్‌ ఆగ్రోతో పాటు సుపీరియర్‌ గ్రూపుకు చెందిన వికాస్‌ గుప్తా, ఎస్‌వి అగ్రిట్రేడ్‌కు చెందిన మనోజ్‌ అగర్వాల్‌, షార్పుమెంటు గ్రూపులున్నాయి. వీరు వ్యవసాయోత్పత్తులను రైతుల నుంచి సేకరించి తొలి శ్రేణి గ్రూపులకు అమ్ముతారు. మూడో శ్రేణిలో మనోజ్‌ అగర్వాల్‌, రిద్దిసిద్ది ఇంప్లెక్స్‌ పార్థ ఇంటర్నేషనల్‌, గున ఎంటర్‌ ప్రైజెస్‌, చార్లెస్‌ ప్రయివేటు ఇండియా సంస్థలున్నాయి. లాభాలు తగ్గించి చూపి, పన్నుల ఎగవేతకున్న అవకాశాలను ఇవి తెలియజేస్తాయి. వీరు ముందు చెప్పిన రెండు గ్రూపుల ప్రయోజనాలను కాపాడే పనిలో ఉంటారు. ఇవి మనీ ల్యాండ రింగుల్లోనూ తోడ్పడతాయి. ఇలా ఐటీ శాఖ రూపొందించిన 2,100 పేజీల నివేదికలో చౌకగా సేకరించడం, మార్కెట్లలో కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా ధరలు పెంచడంలో దేని పాత్ర అవి నిర్వహిస్తున్నాయని ‘ది వైర్‌’ విశ్లేషించింది.  ఇందువల్లే 2015లో తొలి దశలో 15 నుంచి 30 శాతం పెరిగిన పెసర, కంది, మినప ధరలు రెండో దశలో 64 శాతం పెరిగాయని విశ్లేషించింది. ఈ విధానాల ఫలితంగానే ప్రపంచ పాల ఉత్పత్తిలో 17 శాతం వాటాతో అతి పెద్ద ఉత్పత్తి కేంద్రంగా ఉన్న భారత్‌ పాడి పరిశ్రమ గాడి తప్పింది. 90 శాతంగా ఉన్న చిన్న, సన్నకారు రైతుల్లో పది శాతం మంది దీని నుంచి తప్పుకున్నారు. ఇలాంటి విధానాల మూలంగానే భారత బొమ్మల తయారీ పరిశ్రమ దారుణంగా దెబ్బతిన్నది. పింగాణీ పరిశ్రమ, చేనేత వృత్తులు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఆర్‌సీఈపీ ఒప్పందం అమల్లోకొస్తే ఇప్పటి వరకూ పాక్షికంగానైనా ఉన్న దిగుమతి సుంకాలతో నిరోధించే రక్షణ పూర్తిగా తప్పుతుంది. సంపూర్ణ స్వేచ్ఛా వాణిజ్యం అమలౌతుంది. మన ఉత్పత్తుల ధరలు బహుళజాతి సంస్థల లాభాల వేటకు బలౌతాయి. ప్రపంచ మార్కెట్‌లో బడుగు దేశాల ఉత్పత్తులకు తావుండదు. సంపన్న దేశాలు వీటిని ముడి సరుకు సరఫరాదారులుగా మారుస్తాయి. వాటినే నవీనీకరించి (ప్రాసెస్‌ చేసి) తమ ఉత్పత్తులుగా ప్రపంచంలో ఎక్కువ ధర ఉన్నచోట అమ్ముతాయి. ఈ ఒప్పందంలో ఉన్న పేటెంట్ల విధానం కొన్ని రంగాల్లో బహుళజాతి సంస్థల పెత్తనానికి చోటిస్తాయి. ప్రత్యేకించి పేటెంటు పొందిన విత్తన కంపెనీలు విత్తన ధరలను ఇష్టానుసారంగా పెంచేస్తాయి. మందుల కంపెనీల్లోనూ ఇదే తరహా పెత్తనాన్ని చెలాయిస్తాయి. ఇందువల్ల మన దేశంలో పేదలకు ఊరటగా ఉన్న జనరిక్‌ మందుల దుకాణాలు కనుమరుగవుతాయి. యంత్ర, వస్త్ర, ఎలక్ట్రానిక్‌, పింగాణీ తయారీ వగైరా దేశీయ పరిశ్రమల మార్కెట్‌ వీటి కబ్జాకు గురౌతుంది. ఇందులో ఉన్న ‘పెట్టుబడికి రక్షణ’ అన్న క్లాజు మన దేశ సార్వభౌమత్వానికే సవాలుగా మారుతుంది. మన దేశ ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ చట్టాల పేరిట వీటి పెట్టుబడులకు అనుమతులు నిరాకరిస్తే మన పాలకుల్ని అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాలు చేస్తాయి. అవి ప్రజా వ్యతిరేకమైనా పెట్టుబడి రక్షణ ఒప్పందాల మేరకు నడుచుకోవాలంటుంది. ఇందువల్ల మన జీడీపీలో అంటే వ్యవసాయ, పారిశ్రామిక, సేవలరంగ ఉత్పత్తుల్లో 1.6శాతం తగ్గుదల ఉం టుందని వాణిజ్యశాఖ అంచనాకట్టింది. అయినా దేశీయ కార్పొరేటు వర్గాలు సం పదను పెంచుకునేందుకివి తోడ్పడతాయి. ఇంత తీవ్రత కలిగిన ఈ ఒప్పందాన్ని పార్లమెంటులో చర్చకుపెట్టకుండా ఆమోదించే పనిలో ఎన్‌డీఏ పాలకులున్నారు.ఉన్నం వెంకటేశ్వర్లు
editorial
1,370
24-08-2017 01:34:15
సత్యం కేసులో సెబికి మరింత గడువు
న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణం కేసులో తాజా ఉత్తర్వులు జారీ చేసేందుకు సెక్యూరిటీస్‌ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబికి మరింత గడువు ఇచ్చింది. ఈ కేసులో కంపెనీ ప్రధాన ప్రమోటర్లయిన బి రామలింగ రాజు, అతడి సోదరుడు రామరాజు, తదితరులను సెబి 14 సంవత్సరాల పాటు స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీల నుంచి నిషేధించింది. ఇదిగాక వీరు అక్రమ లావాదేవీల ద్వారా ఇన్వెస్టర్లకు కలిగించిన నష్టానికి 1,849 కోట్ల రూపాయలు 12 శాతం వడ్డీతో చెల్లించాలని 2014 జూలైలో ఆదేశించింది. దీంతో వీరిద్దరూ సెబి ఆదేశాలను శాట్‌లో సవాల్‌ చేశారు. కేసును విచారించిన శాట్‌ వీలైతే నాలుగు నెలల్లో తాజా ఆదేశాలు జారీ చేయాలని మే 12న ఆదేశించింది. ఈ గడువును మరో నాలుగు నెలలు పొడిగిస్తూ ఈ నెల 21న మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. సరైన కారణాలు పేర్కొనకుండా సత్యం కంప్యూటర్స్‌ బోర్డు సభ్యులను, ఉన్నతాధికారులు 14 సంవత్సరాల పాటు స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీల్లో పాల్గొనకుండా నిషేధించడం న్యాయంగా లేదని శాట్‌ పేర్కొంది.
business
21,619
04-04-2017 01:37:29
యువ ఆటగాళ్లకు అవకాశం
(రవిశాస్త్రీ )ఐపీఎల్‌-10లో నన్ను ఆకర్షించే విషయాలు చాలానే ఉన్నాయి. రసవత్తరమైన క్రికెట్‌కు ఐపీఎల్‌ అద్భుత వేదిక. విజయం కోసం కొదమ సింహాల్లా తలపడే జట్లు.. లిప్తపాటులో తలకిందులయ్యే ఫలితాలు.. హీరోలు జీరోలు.. జీరోలు హీరోలు ఇలా అనుక్షణం ఐపీఎల్‌ మ్యాచ్‌లు సగటు అభిమానిని ఉత్కంఠకు గురిచేస్తాయి. సురేష్‌ రైనా లేదా శిఖర్‌ ధవన్‌ చాంపియన్స్‌ ట్రోఫీ కల కూడా ఇక్కడే తేలిపోతుంది. అయితే ఈసారి ఇంగ్లిష్‌ ఆటగాళ్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. భారీ ధర పలికిన బెన్‌ స్టోక్స్‌తోపాటు తైమల్‌ మిల్స్‌, క్రిస్‌ జోర్డాన్‌, క్రిస్‌ వోక్స్‌ వివిధ ఫ్రాంచైజీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత, ఆసే్ట్రలియా ఆటగాళ్ల మధ్య అహం అడ్డంకులు సృష్టిస్తుందనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే దేశానికి ఆడడం వేరు.. ఫ్రాంచైజీ క్రికెట్‌ వేరు. ఇక భారత యువ ఆటగాళ్లు జయంత యాదవ్‌, కరుణ్‌ నాయర్‌, కుల్దీప్‌ యాదవ్‌, కేదార్‌ జాదవ్‌ ఏమేరకు రాణిస్తారో చూడాలి. అఫ్ఘాన్‌ ఆటగాళ్లు మహ్మద్‌ నబి, రషీద్‌ ఖాన్‌ల ప్రదర్శన ఏవిధంగా ఉంటుందో గమనించాలి. అశ్విన్‌, రాహుల్‌, విజయ్‌లు లీగ్‌కు దూరమయ్యారు. కోహ్లీ కూడా అనుమానమే. ఐపీఎల్‌కు పరిచితమైన విదేశీ ప్లేయర్లు డుమిని, డికాక్‌, మిచెల్‌ స్టార్క్‌, మిచెల్‌ మార్ష్‌ కూడా గాయాలతో వైదొలిగారు. కోడ్‌ ఉల్లంఘన కారణంగా కరీబియన్‌ పవర్‌ హౌస్‌ ఆండ్రీ రస్సెల్‌ మెరుపులు చూడలేం. అయితే యువ ఆటగాళ్లు అవకాశాలను అందిపుచ్చుకుని స్టార్లు లేని లోటును భర్తీ చేస్తారని ఆశిస్తున్నా.
sports
12,247
20-01-2017 19:54:32
కశ్మీర్‌లో దంగల్ ఫేమ్ జైరా పోస్టర్లు దగ్ధం
జమ్మూ: దంగల్ ఫేమ్ జైరాకు వ్యతిరేకంగా కశ్మీర్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు ఆమె ఫోటోలు దగ్ధం చేశారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన ఆమె ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశారు. కశ్మీర్ యువత ఆమెను రోల్ మోడల్‌గా తీసుకోవాలని మెహబూబా ముఫ్తీ సూచించారు.  అయితే తాను కశ్మీర్ యువతకు రోల్ మోడల్ కానంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన జైరా, ఆ తర్వాత దాన్ని తొలగించింది. కాగా ఇది వివాదం కావడంతో జైరాపై కశ్మీర్ యువత మండిపడుతోంది.
nation
461
21-05-2017 00:15:59
హెచ్‌-1బి వీసాలపై భయం వద్దు
మనకు ఇచ్చే వీసాల సంఖ్య తగ్గదు: నిర్మలా సీతారామన్‌న్యూఢిల్లీ: హెచ్‌-1బి వీసాలపై వ్యక్తమవుతున్న భయాలను కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌ తోసిపుచ్చారు. అమెరికా పెట్టిన కొత్త నిబంధనలతో భారత వృత్తి నిపుణులకు ఇచ్చే హెచ్‌-1బి వీసాలేమీ తగ్గవని చెప్పారు. ‘వీసాలపై పరిశ్రమ ఆందోళన చెందాల్సిన పని లేదు. నాకు తెలిసినంత వరకు ప్రస్తుతం ఉన్న లాటరీ విధానానికి బదులు, ఇంకో విధానం తెస్తున్నారు. అంతే తప్పించి జారీ చేసే వీసాల సంఖ్య మార్చడం లేదు. కాబట్టి మనకి వచ్చే వీసాల సంఖ్య తగ్గదు’ అన్నారు. హెచ్‌-1బి వీసాలపై అమెరికా విధించిన ఆంక్షలతో ఖర్చులు పెరిగి పోతాయని భారత ఐటి పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో సీతారామన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. నిపుణులైన విదేశీయులు తాత్కాలికంగా అమెరికాలో పని చేసేందుకు అమెరికా ఏటా హెచ్‌-1బి వీసాలు లాటరీ పద్ధతిలో జారీ చేస్తుంటుంది. ఇందులో దాదాపు 17 శాతం వీసాలు భారత కంపెనీలకు వస్తుంటాయి. దీన్ని అడ్డం పెట్టుకుని అనేక కంపెనీలు స్థానికుల్ని కాదని, హెచ్‌-1బి వీసాలపై విదేశీయుల్ని అమెరికా తీసుకొచ్చి తక్కువ జీతాలకు నియమించుకుంటున్నాయని ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తెరదించుతూ కొత్త అధ్యక్షుడు ట్రంప్‌ లాటరీ విధానానికి స్వస్తి చెప్పి, అత్యంత నిపుణులు లేదా అత్యధిక జీతాలు తీసుకునే నిపుణులకు మాత్రమే ఈ వీసాలు జారీ చేయాలని ఆదేశించారు. దీంతో అధిక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల కోసం జారీ చేసే ఈ వీసాల్లో ఎక్కువ భాగం భారతీయులకే వస్తాయని సీతారామన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ఐటి కంపెనీలతో అమెరికా కంపెనీలకు జరుగుతున్న ‘ఆర్థిక’ మేలునూ ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) రద్దుపై కేంద్ర కేబినెట్‌ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని కూడా తెలిపారు. జిఎస్‌టితో ఎగుమతిదారులకు మేలుజూలై 1 నుంచి అమలుకానున్న జిఎ్‌సటి ఎగుమతిదారులకూ మేలు చేస్తుందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ముందస్తుగా చెల్లించే జిఎ్‌సటి నుంచి రిఫండ్‌గా వచ్చే మొత్తంలో 90 శాతం ఆరు నుంచి 10 రోజుల్లోనే ఎగుమతిదారులకు అందుతుందన్నారు. ఈ గడువులోగా రిఫండ్‌ అందకపోతే ఆ మొత్తంపై ప్రభుత్వం ఆరు శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తుందన్నారు. చిన్న, మధ్య తరహా ఎగుమతిదారులు చెల్లించే పన్నుల కోసం ప్రత్యామ్నాయ వ్యవస్థ రూపొందించాలని జిఎ్‌సటి మండలిని కోరినట్టు సీతారామన్‌ చెప్పారు. జిఎ్‌సటి వలన ముడి పదార్ధాల ధర, ఉత్పత్తి వ్యయాలు తగ్గి ఎగుమతిదారులు అంతర్జాతీయ మార్కెట్‌లో మరింత సమర్ధవంతంగా పోటీపడగలుగుతారన్నారు. రూపాయి ఆటుపోట్లు డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరగడంపైనా సీతారామన్‌ మాట్లాడారు. ఇదేం ఆకస్మిక పరిణామం కాదన్నారు. ఎగుమతిదారులూ దీనికి అలవాటు పడినట్టు చెప్పారు. అయితే రూపాయి మారకం విలువలో భారీ మార్పులు ఉంటే మాత్రం ఆర్‌బిఐ జోక్యం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు.
business
1,282
06-09-2017 02:26:38
మార్కెట్‌కు ఊరట
సెన్సెక్స్‌ 100 పాయింట్లు అప్‌ముంబై: భారత, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతల తగ్గింపుపై అంగీకారం కుదిరిందన్న వార్తలతో పాటు సేవల రంగం తిరోగమన స్థితి నుంచి బయటపడుతున్నదన్న సంకేతాలు మార్కెట్‌కు ఊపిరులిచ్చాయి. కొరియా ఉద్రిక్తతల నేపథ్యంలో సోమవారం భారీ నష్టాలతో వారానికి స్వాగతం పలికిన స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం కొంత కుదుటపడింది. దీంతో తక్కువ ధరల్లో షేర్లను కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు పరుగులు తీయడంతో సెన్సెక్స్‌ 107.30 పాయింట్ల మేరకు లాభపడి 31809.47 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 39.35 పాయింట్ల లాభంతో 9952.20 పాయింట్ల వద్ద క్లోజయింది. మార్కెట్‌ ప్రారంభంలో నిస్తేజంగానే ఉన్నప్పటికీ తదుపరి అందిన సానుకూల వార్తలతో కోలుకుని లాభాలతో ముగిసిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధనా విభాగం హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు. ప్రధానంగా కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగం నుంచి రికవరీకి మంచి మద్దతు లభించింది. రియల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, మెటల్‌, బ్యాంకింగ్‌ స్టాక్‌లు కూడా నష్టాలను పూడ్చుకోవడం కలిసి వచ్చింది. 2.96 శాతం లాభంతో కోల్‌ ఇండియా అగ్రస్థానంలో ఉండగా అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఆటో, ఆర్‌ఐఎల్‌ లాభాలతో ముగిశాయి. భారతి ఎయిర్‌టెల్‌ 2.25 శాతం నష్టంతో నష్టాల్లో అగ్రస్థానంలో నిలిచింది. స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌లు లాభపడ్డాయి. సెబి గణాంకాల ప్రకారం సోమవారం ఎఫ్‌పిఐలు 873.91 కోట్లు, దేశీయ సంస్థలు 49.10 కోట్ల రూపాయల విలువ గల అమ్మకాలు సాగించాయి. జెన్‌బర్క్‌ ఫార్మా షేర్ల బైబ్యాక్‌షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదన పరిశీలించేందుకు ఈ వారంలో డైరెక్టర్ల బోర్డు సమావేశం కాబోతున్నట్టు జెన్‌బర్క్‌ ఫార్మా బిఎ్‌సఇకి పంపిన సందేశంలో తెలిపింది. అయితే ఎంత పరిమాణంలో షేర్లు బైబ్యాక్‌ చేసేది వెల్లడించలేదు. మహీంద్రా ఫైనాన్స్‌ రూ.350 కోట్లు సమీకరణ మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ డెట్‌ ఇష్యూ ద్వారా 350 కోట్ల రూపాయలు సమీకరించినట్టు ప్రకటించింది. ఒక్కోటి 10 లక్షల రూపాయల ముఖ విలువ గల ఎన్‌సిడిల జారీ ద్వారా 350 ఎన్‌సిడిల జారీని మంగళవారం అధీకృత కమిటీ ఆమోదించిందని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు పంపిన సమాచారంలో తెలిపింది. గ్లోబల్‌ ఎడ్జ్‌ నుంచి వైదొలగిన కాఫీడేతమ అనుబంధ సంస్థ కాఫీడే ట్రేడింగ్‌... గ్లోబల్‌ ఎడ్జ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలోని వాటాలన్నింటినీ పూర్తిగా విక్రయిస్తున్నట్లు కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ ప్రకటించింది. ఈ డీల్‌ విలువ 100 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. భారత్‌ ఫైనాన్షియల్‌ షేర్లపై ఆంక్షలునాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ విభాగంలోని భారత్‌ ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌లో విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లకు ఆర్‌బిఐ పగ్గం వేసింది. ఇప్పటికే ఎఫ్‌పిఐల విభాగం నిర్దేశిత పరిమితికి చేరిపోయినందు వల్ల ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది. ఇక ముందు ఈ కంపెనీ షేర్లను ఎఫ్‌పిఐలు కొనుగోలు చేయాలంటే ముందుగా అనుమతి తీసుకోవలసి ఉంటుందని ప్రకటించింది. నేడే హెచ్‌డిఎ్‌ఫసి బాండ్ల జారీ ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ విధానంలో బాండ్ల జారీ ద్వారా బుధవారం హెచ్‌డిఎ్‌ఫసి 2,000 కోట్ల రూపాయల నిధులు సమీకరించనుంది. కంపెనీకి దీర్ఘకాలిక వనరుల సమీకరణ లక్ష్యమని ప్రకటించింది. ముందుగా గుర్తించిన వారికి మాత్రమే ఈ డిబెంచర్లు అందచేస్తామని, సాధారణ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉండదని తెలిపింది.
business
9,371
05-01-2017 13:10:20
బ్రహ్మానందాన్ని ఇరికించి, అనుష్కను తప్పించారట!
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ గురించి దర్శకుడు వీవీ వినాయక్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మెగాస్టార్ 150వ సినిమాను డైరెక్ట్ చేసే సదావకాశం తనకు ఎలా వచ్చిందో కూడా వినాయక్ వివరించారు. ‘‘ఒక రోజు అన్నయ్య ఫోన్ చేసి, వినయ్ ఒకసారి రా అంటే వెళ్లాను. నేను వెళ్లాక ‘కత్తి చూశావా నువ్వు’ అన్నారు. మామూలుగా చూశాను కానీ, అంత పరిశీలనగా చూడలేదన్నయ్యా అన్నా. ‘ఒకసారి నన్ను దృష్టిలో పెట్టుకుని చూసి, నీ అభిప్రాయం చెప్పు అన్నారు. పది రోజుల తర్వాత నోట్స్ రాసుకుంటూ చూశా. అది చూశాక మేజర్‌గా నాకు అనిపించింది.. కామెడీ బాగా ఉండాలి, తర్వాత పాటలు మంచిగా ఉండాలి అని అనుకుని స్క్రిప్ట్ రాసుకుని వెళ్లి ఎక్స్‌ప్లయిన్ చేశా. ఈ సినిమా అయితే మీకు ఫెంటాస్టిక్‌గా ఉంటుందన్నయ్యా అని చెప్పా. పూర్తిగా మెసేజ్ చెప్పినట్టు కాకుండా.. అలాగని ఏమీ లేకుండా చేస్తే మీ స్టేచర్‌కు కరెక్ట్ కాదు... అదంతా ఫర్‌ఫెక్ట్‌గా ఉందంటూ.. నేను రాసుకున్నా నోట్స్ అంతా చెప్పా. చెప్పగానే అన్నయ్య చాలా ఇంప్రెస్ అయ్యి ఓకే అన్నారు. తర్వాత పరుచూరి వెంకటేశ్వరరావుగారితో కూర్చుని మేము అనుకున్న స్క్రిప్ట్‌ను ఒక ఆర్డర్‌లో సెట్ చేసి మళ్లీ అన్నయ్యకు వివరించాను. ఒక సినిమా చూస్తే ఎలాగ ఉంటుందో అలా స్టోరీని నెరేట్ చేశాను. అన్నయ్య లేచి నన్ను హగ్ చేసుకుని ఫెంటాస్టిక్‌గా ఉందని చెప్పారు. అది అయ్యాక రెండుమూడు రోజుల తర్వాత ‘వినయ్ నాకు బ్రహ్మానందం కావాలి’ అని అన్నారు. దీంట్లోకి బ్రహ్మానందం పాత్ర ఎలా వస్తుంది అని నేను అనుకుంటుంటే.. ‘వాడు ఏదైనా నన్ను అనుమానించేలాగ, వాడిని నేను ఇరికించేలాగ ఏదైనా వస్తే బాగుంటుందేమో చూడు’ అని చిరంజీవిగారే సూచించారు. అప్పడు మళ్లీ ఒక ట్రాక్‌ను పక్కన పెట్టి, బ్రహ్మానందాన్ని ఎలాగోలా ఇరికించేశాం. హీరోయిన్స్ విషయంలో నేను నెరేషన్ ఇచ్చినప్పుడు అనుష్క, కాజల్ అని ఇచ్చా. తర్వాత బ్రహ్మానందాన్ని కొత్తగా అనుకున్నాక సింగిల్ హీరోయిన్ అయింది. తర్వాత ఇంక అనుష్క బిజీ అయిపోయింది. కాజల్ నా మైండ్‌లో అలాగే ఉండిపోయింది. చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్‌ను కూడా సజెస్ట్ చేశారు కానీ, నేను వద్దన్నాను. అయితే కాజల్.. లేదంటే అనుష్క అని ఫిక్సయ్యా. ఫైనల్‌గా కాజల్ ఓకే అయింది.’’ అని వినాయక్ చెప్పారు.
entertainment
4,193
23-08-2017 03:55:14
అన్నల పార్టీ ఎన్నికల్లో దిగాలి!
మా నాన్న 20 ఏళ్ల క్రితం చెప్పినట్టు పోరాటం జరగాల్సింది మారుమూల పల్లెలోనో, అడవిలోనో కాదు; మైదానంలో! మావోయిస్టులు పార్లమెంటరీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అది సాధ్యం. మా ఊరు ధూలిమిట్ట. పాత వరంగల్‌ జిల్లా సరిహద్దు (ప్రస్తుతం సిద్దిపేట జిల్లా)లోని ఓ మారుమూల గ్రామం. నేను చదువుకునే రోజుల్లో అంటే 1980–-90లో మా ఊరు నక్సల్‌ కార్యకలాపాలకు ఆయువుపట్టు. దోర్నాల, బెక్కల్‌, కూటిగల్లు తదితర పది పన్నెండు పల్లెల పిల్లలు చదువుకునేందుకు మా ఊరి హైస్కూలుకే వచ్చేవారు. రాత్రి అయిందంటే చాలు హాస్టల్‌లో ట్రంకు పెట్టెలు దరువేసేవి. పాటలతో వీధివీధంతా దద్దరిల్లేది. నా స్కూల్‌మేట్స్‌లో చాలామంది విప్లవోద్యమంలో చురుగ్గా పాల్గొనేవారు. ఆ తర్వాత వారిలో కొందరు పార్టీలో పైస్థాయికి ఎదిగారు. కొందరు ఎనకౌంటర్లలో చనిపోయారు. మా ఊరికి మూడు వైపులా పెద్దవాగు. దీంతో ద్వీపకల్పంలా ఉండేది. రోడ్డు వంటివి లేవు. రావడానికి పోలీసులు, అధికారులు భయపడేవారు. అన్నలు నిర్భయంగా రాత్రివేళ ఊర్లో సంచరించేవారు. హాస్టల్లో బస చేసేవారు. నా వయసు అప్పటికి పద్నాలుగేళ్లలోపే!  ఒకరోజు ఊరిలో పెద్దాయన కొడుకు, మాతో చదువుకునే పిల్లగాడే, తనకన్నా పెద్ద అయిన పాలేరును ‘రారా పోరా’ అని పిలిస్తే, ఉద్యమంలో పాల్గొనే పిల్లలు, గట్టిగా మందలించి బుద్ధిచెప్పడం చూశాను. మా మిత్రుడి అక్కను భర్త వదిలేస్తే, ఎన్నిసార్లు చెప్పినా దారికి రాకపోతే, ఒక్కసారి అన్నలకు చెప్పగానే సమస్య పరిష్కారమైపోయిందని గొప్పగా చెప్పుకొనేవారు. మా నాన్న మిత్రుడైన ఒక అధికారి, ఇంక్రిమెంటు కోసం వెళితే లంచం అడిగారనీ, అతడు అన్నలకు చెప్పగానే, ఏ లంచమూ లేకుండానే రెండ్రోజుల్లో ఇంక్రిమెంటు వచ్చిందని అనేవారు. పక్క ఊర్లో ప్రజాకోర్టు జరిగిందనీ, రేషన్‌ అమ్ముకున్న డీలర్‌ను అన్నలు కొట్టారనీ, తాగి బడికి లేటుగా వచ్చే టీచర్‌కు దేహశుద్ధి చేశారని, పగటి పూట పోలీసులు వచ్చి హాస్టల్‌ పిల్లల్ని తుపాకీ చూపి బెదిరించారనీ ఇలా రకరకాల ముచ్చట్లు రహస్యం అన్నట్టుగా బాహాటంగానే వినిపించేవి. చివరికి పిల్లలు ఆడుకునే ఆటల్లో కూడా ఎవరైనా తొండి చేస్తే అన్నలకు చెబుతా అని బెదిరించేవారు. ఇవన్నీ ఆసక్తిగా, హీరోయిక్‌గా కనిపించేవి. పార్టీలో చేరడం ఆదర్శంగా ఉండేది. మొత్తమ్మీద కుటుంబాల నుంచి సమాజం దాకా, తప్పు చేయవద్దనే భావన, చేసే వారిలో భయం, తప్పు చేస్తే ఏమవుతుందో అనే వెరపు ఉండేవి. తప్పు చేసిన వారు కూడా అది బయటపడగానే, ఎందుకొచ్చిన పీకులాటలే అని సరిదిద్దుకునే ప్రయత్నం చేసేవారు. అన్నివర్గాల్లో భయభక్తులు నిండిన, ప్రశ్నించగలిగిన ఒక చైతన్యవంతమైన సామాజిక జీవనం కనిపించేది. టెన్త్‌క్లాస్‌ చదివేటప్పుడు అనుకుంటా. నాన్న దగ్గర పడుకున్న నేను, రాత్రి 11 గంటలకు ఆయన లేచి బయటకు వెళుతుండడం చూశా. ఒక్కడే వెళుతున్నాడని నేనూ ఆయనతోపాటే పోయా. తీరా మేం వెళ్లింది ఓ ప్రజాకోర్టుకు. రైతు కూడా అయిన నాన్న సుదీర్ఘ కాలం ఆ ప్రాంతంలోనే తెలుగు పండిట్‌గా పనిచేయడం వల్ల, ఉద్యమంలో ఉన్నవాళ్లలో అనేకమంది ఆయన దగ్గర చదువుకుని వెళ్లినవాళ్లే అవడం వల్ల, నాన్న రాగానే గుర్తుపట్టి, నమస్తే పెట్టి ఓ అరుగు మీద కూర్చోబెట్టారు. ఊర్లోని రైతులంతా అక్కడే ఉన్నారు. అది ‘భూస్వాముల’ పొలాల్లో పనిచేసే పాలేర్ల (తెలంగాణలో జీతగాళ్లంటరు) సమస్య గురించి! వారికి జీతాలు మూడింతలు చేయాలని, మూడు జతల చెప్పులు, రెండు గొంగళ్లు, రెండు జతల అంగీ, ధోవతి/ప్యాంటు, ఛత్రీ, టార్చిలైటు ఇవ్వాలనీ, (నాకు గుర్తున్నంతవరకు) ఇలాంటివే ఇంకేవో సౌకర్యాలు కల్పించాలని అన్నలు చెప్పారు. అవన్నీ ఇస్తే గిట్టుబాటు కాదనీ, దానికంటే యవుసం బంజేయడం మంచిదనీ రైతులన్నారు. కాసేపు చర్చ జరిగింది. అప్పుడు నాన్నను మాట్లాడమన్నరు. ‘‘జీతమున్నోళ్లు, కమ్మరి, కుమ్మరి, వడ్లాయన, బేగరి ఇట్లా... రైతు తను బతుకుతూ ఊర్లో నలుగురిని సాదుతున్నడు. నాలుగెకరాలు, ఐదెకరాలు ఉన్న రైతుల్ని పట్టుకుని మీరు భూస్వాములంటున్నరు. ఇక్కడున్న రైతు మొత్తం ఆస్తి హైదరాబాద్‌లో ఉన్న ఓ సేటు ఇంట్లో పాయిఖానా విలువజేయదు. మీరు పోరాటం చేయాల్సింది ఇక్కడ కాదు. అక్కడ’’ అన్నడు నాన్న. మరికొంత చర్చ తర్వాత, పాలేర్లకు ఇవ్వాల్సిన సౌకర్యాల మీద రాజీ కుదిరి ప్రజాకోర్టు ముగిసింది. నక్సల్బరీ ఉద్యమానికి 50 ఏళ్లు నిండిన తరుణంలో జరుగుతున్న సిద్ధాంత చర్చను చదివిన తర్వాత నాకు చిన్ననాటి జ్ఞాపకాలు స్ఫురణకు వచ్చాయి. సిద్ధాంత రాద్ధాంతాల గురించి నాకు పెద్దగా తెలియదు. అయితే ఉద్యమం ఉత్థాన పతనాలను చూసే అవకాశం దక్కిన వ్యక్తిగా ఒక విషయం మాత్రం చెప్పగలను. స్వల్పకాలిక, దీర్ఘకాలిక పరిణామాలను విజువలైజ్‌ చేసి లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో నక్సలిజం విఫలమైంది. ఒక్క ఉదాహరణ. దున్నేవాడిదే భూమి అనే నినాదం. నక్సలైట్ల పోరాటం కన్నా మారిన ప్రాపంచిక పరిస్థితుల వల్ల ఇప్పుడు భూమి దున్నేవాడి వద్దకే చేరింది. నా అంచనా నిజమైతే గ్రామాల్లో 70- 80 శాతం భూమి, చిన్న కమతాలుగా సొంతంగా గానీ, కౌలు రూపంలో గానీ కర్షక కులాల (బీసీలు, ఎస్సీల) వద్దకు చేరింది. వేగవంతమైన ప్రపంచీకరణ క్రమం, వ్యవసాయ సంక్షోభంతో వస్తున్న వరుస నష్టాల కారణంగా అగ్రవర్ణ భూ యజమానులు మెరుగైన జీవితం కోసం, కొత్త ఆదాయ వనరులు వెతుక్కుంటూ పట్టణాల బాట పట్టడంతో ఈ పరిణామం సంభవించింది. అతి త్వరలో భూ బదలాయింపు వందశాతానికి చేరనుంది. ఇలా జరుగుతుందని అంచనా వేయడంలో ఉద్యమం విఫలమైంది. ఇలాంటివే ఎన్నో! వీటిపై 1998లోనే నేను వ్యాసం రాశాను. ‘అన్నలుంటే ఇలా జరిగేదా? అన్నలకు చెబితే క్షణాల్లో సమస్య పరిష్కారమయ్యేది. అన్నలున్నప్పుడే బాగుండేది. ఈ నా కొడుకులు పి...కుంటూ పని చేసేవారు’... నేను ఊరికి వెళ్లినపుడు, అవినీతి బాధితులైన, నిజాయతీ పరులైన యువకులు, పెద్దవాళ్ల నుంచి వినిపించే మాటలివి. నాడు నక్సలైట్లను వ్యతిరేకించిన అగ్ర కులస్థులు కూడా వీరిలో ఉన్నారు. కానీ ఊర్లలో అన్నలు లేరు. పల్లె నుంచి పట్నానికి చేరడమేమోగానీ, పల్లెల్ని కూడా విడిచి అడవిలోకి పోయారు. వరంగల్‌ ఆర్‌ఈసీ విద్యాధికులు చేరిన పార్టీ ఇప్పుడు ఆదివాసీలకు పరిమితమైంది. అడవి కోసం అన్నలనో, అన్నల కోసం అడవినో.. మొత్తానికి వేటాడే క్రమంలో అన్నలతో పాటు అడవులూ అంతరిస్తున్నాయి. పరాయి భావజాలంతో, మూర్ఖపు పట్టుదల, చందాల దందాలతో వ్యవహరించే కమ్యూనిస్టులు, మార్క్సిస్టుల కన్నా నక్సలైట్లకు ఈ దేశ సమస్యలపై అవగాహన, ప్రజల పట్ల నిబద్ధత ఎక్కువ. స్ఫూర్తి పరాయిదైనా, మార్గాన్ని అంగీకరించలేకున్నా, ప్రాణాన్ని పణంగా పెట్టగల వారి విలువలను శంకించలేం. నక్సల్బరీ ఉద్యమం 50 ఏళ్లు పూర్తిచేసుకున్న ఈ తరుణంలో అయినా మావోయిస్టు పార్టీ దృక్పథం సమూలంగా మారాల్సిన అవసరం ఉంది. ఎల్‌టీటీఈ మొదలుకుని ఐఎస్‌ దాకా ప్రపంచంలో ఎక్కడా సాయుధ పోరాటాలు సఫలమయ్యే సూచనలు కనిపించడం లేదు. అదే సమయంలో పార్లమెంటరీ పార్టీలన్నీ అవినీతికి, సత్యానంతర రాజకీయాలకు కేరాఫ్‌లుగా మిగిలిపోయాయి. వాస్తవ, శాస్త్రీయ, క్షేత్రస్థాయి పరిస్థితులు, గణాంకాలు, అంచనాలపై కాకుండా వ్యక్తిగత విశ్వాసాలు, ఉద్వేగాలపై ఆధారపడి ‘ప్రజాభిప్రాయాన్ని’ నిర్మించే రాజకీయ శకం నడుస్తోంది. ఇది తప్పని దీటుగా చెప్పేవారు లేరు. దేశంలో ప్రత్నామ్నాయ రాజకీయ శూన్యత ఏర్పడింది. వామపక్షాలు ప్రజల, విశ్వసనీయత కోల్పోయాయి. నెహ్రూ కుటుంబమే ఆలంబనగా బతికిన కాంగ్రెస్‌, చిట్టచివరి వారసుడిపై ఆధారపడి, అవసాన దశకు చేరింది. కుల రాజకీయాలకు కాలం చెల్లిపోయింది.  సోషలిస్టులు అవకాశవాదులయ్యారు. జాతీయ స్థాయిలో పోటీ రాజకీయ శిబిరం కనుచూపు మేరలో కనిపించడం లేదు. మైదాన ప్రాంతాల్లో సామాజిక వ్యవస్థకు ‘బలమైన చెక్‌’ లేకుండా పోయి, ఇష్టారాజ్యమైంది. నేను ముందు చెప్పినట్టు ఇప్పుడు సమాజానికి ఒక భయం, ఒక చెక్‌, ఒక డిటరెంట్‌ ఫోర్స్‌ అవసరం. సోషల్‌ మీడియా ఉన్మాదం బదులు సోషలాజికల్‌ చైతన్యం అవసరం. కమ్యూనిజం పోయి, కన్జ్యూమరిజమే యుగధర్మంగా మారిన కాలంలో, మా నాన్న 20 ఏళ్ల క్రితం చెప్పినట్టు పోరాటం జరగాల్సింది మారుమూల పల్లెలోనో, అడవిలోనో కాదు; మైదానంలో! మావోయిస్టులు పార్లమెంటరీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అది సాధ్యం. ఎన్నికల రాజకీయాల్లోకి రావాలా? వస్తే ఎన్ని సీట్లు వస్తాయి? ఒక పార్టీకి మద్దతిస్తే ఎలా ఉంటుంది? అన్న చర్చ 1987–-88లోనూ మావోయిస్టు పార్టీలో సాగింది. కానీ నిర్ణయం తీసుకోలేదు. ముందడుగు వేయడానికిదే తరుణం. దీనివల్ల అర్థంలేని హింసాకాండ ఆగిపోతుంది. తెలివిడి లేని హిపోక్రటిక్‌ నేతలతో విసిగిపోయిన లక్షలాది వామపక్ష వాదులు తమను అక్కున చేర్చుకునే నికార్సైన రాజకీయ శిబిరం కోసం ఎదురుచూస్తున్నారు. మావోయిస్టు పార్టీ ఎన్నికల రాజకీయాల్లోకి రావాలి. వంశాలు, కుటుంబాల ప్రాతిపదికన కాకుండా ఆదర్శాల ఆధారంగా జాతీయ స్థాయిలో రైట్‌, లెఫ్ట్‌ అనే రెండు పార్టీల రాజకీయ వ్యవస్థ ఏర్పడితే ఎంత బాగుంటుంది?! అడవి నుంచి అందర్లోకి వచ్చినపుడే కదా ఆదర్శం బతికేది! తిగుళ్ల కృష్ణమూర్తి మా ఊరు ధూలిమిట్ట. పాత వరంగల్‌ జిల్లా సరిహద్దు (ప్రస్తుతం సిద్దిపేట జిల్లా)లోని ఓ మారుమూల గ్రామం. నేను చదువుకునే రోజుల్లో అంటే 1980–-90లో మా ఊరు నక్సల్‌ కార్యకలాపాలకు ఆయువుపట్టు. దోర్నాల, బెక్కల్‌, కూటిగల్లు తదితర పది పన్నెండు పల్లెల పిల్లలు చదువుకునేందుకు మా ఊరి హైస్కూలుకే వచ్చేవారు. రాత్రి అయిందంటే చాలు హాస్టల్‌లో ట్రంకు పెట్టెలు దరువేసేవి. పాటలతో వీధివీధంతా దద్దరిల్లేది. నా స్కూల్‌మేట్స్‌లో చాలామంది విప్లవోద్యమంలో చురుగ్గా పాల్గొనేవారు. ఆ తర్వాత వారిలో కొందరు పార్టీలో పైస్థాయికి ఎదిగారు. కొందరు ఎనకౌంటర్లలో చనిపోయారు. మా ఊరికి మూడు వైపులా పెద్దవాగు. దీంతో ద్వీపకల్పంలా ఉండేది. రోడ్డు వంటివి లేవు. రావడానికి పోలీసులు, అధికారులు భయపడేవారు. అన్నలు నిర్భయంగా రాత్రివేళ ఊర్లో సంచరించేవారు. హాస్టల్లో బస చేసేవారు. నా వయసు అప్పటికి పద్నాలుగేళ్లలోపే!  ఒకరోజు ఊరిలో పెద్దాయన కొడుకు, మాతో చదువుకునే పిల్లగాడే, తనకన్నా పెద్ద అయిన పాలేరును ‘రారా పోరా’ అని పిలిస్తే, ఉద్యమంలో పాల్గొనే పిల్లలు, గట్టిగా మందలించి బుద్ధిచెప్పడం చూశాను. మా మిత్రుడి అక్కను భర్త వదిలేస్తే, ఎన్నిసార్లు చెప్పినా దారికి రాకపోతే, ఒక్కసారి అన్నలకు చెప్పగానే సమస్య పరిష్కారమైపోయిందని గొప్పగా చెప్పుకొనేవారు. మా నాన్న మిత్రుడైన ఒక అధికారి, ఇంక్రిమెంటు కోసం వెళితే లంచం అడిగారనీ, అతడు అన్నలకు చెప్పగానే, ఏ లంచమూ లేకుండానే రెండ్రోజుల్లో ఇంక్రిమెంటు వచ్చిందని అనేవారు. పక్క ఊర్లో ప్రజాకోర్టు జరిగిందనీ, రేషన్‌ అమ్ముకున్న డీలర్‌ను అన్నలు కొట్టారనీ, తాగి బడికి లేటుగా వచ్చే టీచర్‌కు దేహశుద్ధి చేశారని, పగటి పూట పోలీసులు వచ్చి హాస్టల్‌ పిల్లల్ని తుపాకీ చూపి బెదిరించారనీ ఇలా రకరకాల ముచ్చట్లు రహస్యం అన్నట్టుగా బాహాటంగానే వినిపించేవి. చివరికి పిల్లలు ఆడుకునే ఆటల్లో కూడా ఎవరైనా తొండి చేస్తే అన్నలకు చెబుతా అని బెదిరించేవారు. ఇవన్నీ ఆసక్తిగా, హీరోయిక్‌గా కనిపించేవి. పార్టీలో చేరడం ఆదర్శంగా ఉండేది. మొత్తమ్మీద కుటుంబాల నుంచి సమాజం దాకా, తప్పు చేయవద్దనే భావన, చేసే వారిలో భయం, తప్పు చేస్తే ఏమవుతుందో అనే వెరపు ఉండేవి. తప్పు చేసిన వారు కూడా అది బయటపడగానే, ఎందుకొచ్చిన పీకులాటలే అని సరిదిద్దుకునే ప్రయత్నం చేసేవారు. అన్నివర్గాల్లో భయభక్తులు నిండిన, ప్రశ్నించగలిగిన ఒక చైతన్యవంతమైన సామాజిక జీవనం కనిపించేది. టెన్త్‌క్లాస్‌ చదివేటప్పుడు అనుకుంటా. నాన్న దగ్గర పడుకున్న నేను, రాత్రి 11 గంటలకు ఆయన లేచి బయటకు వెళుతుండడం చూశా. ఒక్కడే వెళుతున్నాడని నేనూ ఆయనతోపాటే పోయా. తీరా మేం వెళ్లింది ఓ ప్రజాకోర్టుకు. రైతు కూడా అయిన నాన్న సుదీర్ఘ కాలం ఆ ప్రాంతంలోనే తెలుగు పండిట్‌గా పనిచేయడం వల్ల, ఉద్యమంలో ఉన్నవాళ్లలో అనేకమంది ఆయన దగ్గర చదువుకుని వెళ్లినవాళ్లే అవడం వల్ల, నాన్న రాగానే గుర్తుపట్టి, నమస్తే పెట్టి ఓ అరుగు మీద కూర్చోబెట్టారు. ఊర్లోని రైతులంతా అక్కడే ఉన్నారు. అది ‘భూస్వాముల’ పొలాల్లో పనిచేసే పాలేర్ల (తెలంగాణలో జీతగాళ్లంటరు) సమస్య గురించి! వారికి జీతాలు మూడింతలు చేయాలని, మూడు జతల చెప్పులు, రెండు గొంగళ్లు, రెండు జతల అంగీ, ధోవతి/ప్యాంటు, ఛత్రీ, టార్చిలైటు ఇవ్వాలనీ, (నాకు గుర్తున్నంతవరకు) ఇలాంటివే ఇంకేవో సౌకర్యాలు కల్పించాలని అన్నలు చెప్పారు. అవన్నీ ఇస్తే గిట్టుబాటు కాదనీ, దానికంటే యవుసం బంజేయడం మంచిదనీ రైతులన్నారు. కాసేపు చర్చ జరిగింది. అప్పుడు నాన్నను మాట్లాడమన్నరు. ‘‘జీతమున్నోళ్లు, కమ్మరి, కుమ్మరి, వడ్లాయన, బేగరి ఇట్లా... రైతు తను బతుకుతూ ఊర్లో నలుగురిని సాదుతున్నడు. నాలుగెకరాలు, ఐదెకరాలు ఉన్న రైతుల్ని పట్టుకుని మీరు భూస్వాములంటున్నరు. ఇక్కడున్న రైతు మొత్తం ఆస్తి హైదరాబాద్‌లో ఉన్న ఓ సేటు ఇంట్లో పాయిఖానా విలువజేయదు. మీరు పోరాటం చేయాల్సింది ఇక్కడ కాదు. అక్కడ’’ అన్నడు నాన్న. మరికొంత చర్చ తర్వాత, పాలేర్లకు ఇవ్వాల్సిన సౌకర్యాల మీద రాజీ కుదిరి ప్రజాకోర్టు ముగిసింది. నక్సల్బరీ ఉద్యమానికి 50 ఏళ్లు నిండిన తరుణంలో జరుగుతున్న సిద్ధాంత చర్చను చదివిన తర్వాత నాకు చిన్ననాటి జ్ఞాపకాలు స్ఫురణకు వచ్చాయి. సిద్ధాంత రాద్ధాంతాల గురించి నాకు పెద్దగా తెలియదు. అయితే ఉద్యమం ఉత్థాన పతనాలను చూసే అవకాశం దక్కిన వ్యక్తిగా ఒక విషయం మాత్రం చెప్పగలను. స్వల్పకాలిక, దీర్ఘకాలిక పరిణామాలను విజువలైజ్‌ చేసి లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో నక్సలిజం విఫలమైంది. ఒక్క ఉదాహరణ. దున్నేవాడిదే భూమి అనే నినాదం. నక్సలైట్ల పోరాటం కన్నా మారిన ప్రాపంచిక పరిస్థితుల వల్ల ఇప్పుడు భూమి దున్నేవాడి వద్దకే చేరింది. నా అంచనా నిజమైతే గ్రామాల్లో 70- 80 శాతం భూమి, చిన్న కమతాలుగా సొంతంగా గానీ, కౌలు రూపంలో గానీ కర్షక కులాల (బీసీలు, ఎస్సీల) వద్దకు చేరింది. వేగవంతమైన ప్రపంచీకరణ క్రమం, వ్యవసాయ సంక్షోభంతో వస్తున్న వరుస నష్టాల కారణంగా అగ్రవర్ణ భూ యజమానులు మెరుగైన జీవితం కోసం, కొత్త ఆదాయ వనరులు వెతుక్కుంటూ పట్టణాల బాట పట్టడంతో ఈ పరిణామం సంభవించింది. అతి త్వరలో భూ బదలాయింపు వందశాతానికి చేరనుంది. ఇలా జరుగుతుందని అంచనా వేయడంలో ఉద్యమం విఫలమైంది. ఇలాంటివే ఎన్నో! వీటిపై 1998లోనే నేను వ్యాసం రాశాను. ‘అన్నలుంటే ఇలా జరిగేదా? అన్నలకు చెబితే క్షణాల్లో సమస్య పరిష్కారమయ్యేది. అన్నలున్నప్పుడే బాగుండేది. ఈ నా కొడుకులు పి...కుంటూ పని చేసేవారు’... నేను ఊరికి వెళ్లినపుడు, అవినీతి బాధితులైన, నిజాయతీ పరులైన యువకులు, పెద్దవాళ్ల నుంచి వినిపించే మాటలివి. నాడు నక్సలైట్లను వ్యతిరేకించిన అగ్ర కులస్థులు కూడా వీరిలో ఉన్నారు. కానీ ఊర్లలో అన్నలు లేరు. పల్లె నుంచి పట్నానికి చేరడమేమోగానీ, పల్లెల్ని కూడా విడిచి అడవిలోకి పోయారు. వరంగల్‌ ఆర్‌ఈసీ విద్యాధికులు చేరిన పార్టీ ఇప్పుడు ఆదివాసీలకు పరిమితమైంది. అడవి కోసం అన్నలనో, అన్నల కోసం అడవినో.. మొత్తానికి వేటాడే క్రమంలో అన్నలతో పాటు అడవులూ అంతరిస్తున్నాయి. పరాయి భావజాలంతో, మూర్ఖపు పట్టుదల, చందాల దందాలతో వ్యవహరించే కమ్యూనిస్టులు, మార్క్సిస్టుల కన్నా నక్సలైట్లకు ఈ దేశ సమస్యలపై అవగాహన, ప్రజల పట్ల నిబద్ధత ఎక్కువ. స్ఫూర్తి పరాయిదైనా, మార్గాన్ని అంగీకరించలేకున్నా, ప్రాణాన్ని పణంగా పెట్టగల వారి విలువలను శంకించలేం. నక్సల్బరీ ఉద్యమం 50 ఏళ్లు పూర్తిచేసుకున్న ఈ తరుణంలో అయినా మావోయిస్టు పార్టీ దృక్పథం సమూలంగా మారాల్సిన అవసరం ఉంది. ఎల్‌టీటీఈ మొదలుకుని ఐఎస్‌ దాకా ప్రపంచంలో ఎక్కడా సాయుధ పోరాటాలు సఫలమయ్యే సూచనలు కనిపించడం లేదు. అదే సమయంలో పార్లమెంటరీ పార్టీలన్నీ అవినీతికి, సత్యానంతర రాజకీయాలకు కేరాఫ్‌లుగా మిగిలిపోయాయి. వాస్తవ, శాస్త్రీయ, క్షేత్రస్థాయి పరిస్థితులు, గణాంకాలు, అంచనాలపై కాకుండా వ్యక్తిగత విశ్వాసాలు, ఉద్వేగాలపై ఆధారపడి ‘ప్రజాభిప్రాయాన్ని’ నిర్మించే రాజకీయ శకం నడుస్తోంది. ఇది తప్పని దీటుగా చెప్పేవారు లేరు. దేశంలో ప్రత్నామ్నాయ రాజకీయ శూన్యత ఏర్పడింది. వామపక్షాలు ప్రజల, విశ్వసనీయత కోల్పోయాయి. నెహ్రూ కుటుంబమే ఆలంబనగా బతికిన కాంగ్రెస్‌, చిట్టచివరి వారసుడిపై ఆధారపడి, అవసాన దశకు చేరింది. కుల రాజకీయాలకు కాలం చెల్లిపోయింది.  సోషలిస్టులు అవకాశవాదులయ్యారు. జాతీయ స్థాయిలో పోటీ రాజకీయ శిబిరం కనుచూపు మేరలో కనిపించడం లేదు. మైదాన ప్రాంతాల్లో సామాజిక వ్యవస్థకు ‘బలమైన చెక్‌’ లేకుండా పోయి, ఇష్టారాజ్యమైంది. నేను ముందు చెప్పినట్టు ఇప్పుడు సమాజానికి ఒక భయం, ఒక చెక్‌, ఒక డిటరెంట్‌ ఫోర్స్‌ అవసరం. సోషల్‌ మీడియా ఉన్మాదం బదులు సోషలాజికల్‌ చైతన్యం అవసరం. కమ్యూనిజం పోయి, కన్జ్యూమరిజమే యుగధర్మంగా మారిన కాలంలో, మా నాన్న 20 ఏళ్ల క్రితం చెప్పినట్టు పోరాటం జరగాల్సింది మారుమూల పల్లెలోనో, అడవిలోనో కాదు; మైదానంలో! మావోయిస్టులు పార్లమెంటరీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అది సాధ్యం. ఎన్నికల రాజకీయాల్లోకి రావాలా? వస్తే ఎన్ని సీట్లు వస్తాయి? ఒక పార్టీకి మద్దతిస్తే ఎలా ఉంటుంది? అన్న చర్చ 1987–-88లోనూ మావోయిస్టు పార్టీలో సాగింది. కానీ నిర్ణయం తీసుకోలేదు. ముందడుగు వేయడానికిదే తరుణం. దీనివల్ల అర్థంలేని హింసాకాండ ఆగిపోతుంది. తెలివిడి లేని హిపోక్రటిక్‌ నేతలతో విసిగిపోయిన లక్షలాది వామపక్ష వాదులు తమను అక్కున చేర్చుకునే నికార్సైన రాజకీయ శిబిరం కోసం ఎదురుచూస్తున్నారు. మావోయిస్టు పార్టీ ఎన్నికల రాజకీయాల్లోకి రావాలి. వంశాలు, కుటుంబాల ప్రాతిపదికన కాకుండా ఆదర్శాల ఆధారంగా జాతీయ స్థాయిలో రైట్‌, లెఫ్ట్‌ అనే రెండు పార్టీల రాజకీయ వ్యవస్థ ఏర్పడితే ఎంత బాగుంటుంది?! అడవి నుంచి అందర్లోకి వచ్చినపుడే కదా ఆదర్శం బతికేది! తిగుళ్ల కృష్ణమూర్తి
editorial
7,704
27-02-2017 11:35:14
ఎన్టీయార్‌ బయోపిక్‌ను అక్కడితో ఆపేస్తారట!
ఇటీవలి కాలంలో సినీ రంగంతో పాటు అందర్నీ ఆకర్షించిన ప్రకటన.. ఎన్టీయార్‌ బయోపిక్‌ తీస్తామని బాలకృష్ణ ప్రకటించడం. నిజానికి ఓ సినిమాకు అవసరమైనంత డ్రామా ఎన్టీయార్‌ నిజ జీవితంలో ఉంది. ఎన్టీయార్‌ జీవితాన్ని వెండి తెరకెక్కిస్తాం అని బాలకృష్ణ ప్రకటించిన వెంటనే ఎవరిని విలన్‌గా చిత్రీకరిస్తారు? ఎక్కడి వరకు తెరకెక్కిస్తారు అనే ప్రశ్నలు బయల్దేరాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్ర్కిప్టు వర్క్‌ పూర్తయినట్టు సమాచారం.
entertainment
7,279
24-02-2017 17:01:39
కాటమరాయుడు తొలి రోజు నుంచే...
తెలుగు రాష్ట్రాల్లో చేనేత వస్త్రాలకు ప్రచారం కల్పిస్తానని ఇదివరకే పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాటమరాయడు సినిమాలో పూర్తిగా చేనేత వస్త్రాల్లోనే పవన్ కనిపిస్తాడట. కాటమరాయుడు సినిమాలో పవన్ కల్యాణ్‌కు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన ఇషితా సింగ్ ఆ వివరాలను వెల్లడించింది. చేనేత వస్త్రాలపై పవన్ కల్యాణ్ చాలా పర్టిక్యులర్‌గా ఉన్న నేపథ్యంలో.. పర్యావరణ హిత వస్త్రాలను తయారుచేశామని ఆమె చెప్పింది. కాటమరాయుడు సినిమా షూటింగ్ ప్రారంభమైన తొలి రోజు నుంచే పవన్ చేనేత వస్త్రాలను ధరిస్తున్నాడని, షూటింగ్ టాకీ పార్ట్ పూర్తయ్యే ముందు చేనేత వస్త్రాలకు ప్రచారం నిర్వహించేందుకు పవన్ ముందుకొచ్చాడని ఆమె తెలిపింది. కాగా, అవే చేనేత వస్త్రాలను ధరించే పవన్ రాజకీయ సభలు, సమావేశాలకు వెళ్తున్నాడు. మరి, చెప్పినట్టు పవన్ చేనేత వస్త్రాల్లోనే కనిపిస్తుండడం విశేషమే కదా.
entertainment
8,687
24-07-2017 17:16:30
అజాన్‌పై ప్రముఖ సింగర్ సుచిత్ర వివాదాస్పద వ్యాఖ్యలు
కొన్ని నెలల క్రితం బాలీవుడ్ ప్రముఖ సింగర్ సోనూ నిగమ్.. అజాన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంఘటన గుర్తుందా? ఆయన వ్యాఖ్యలపై ఇస్లాం మతపెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ మతపెద్ద.. సోనూకు గుండుకొరిగించి ఊరేగిస్తే రూ.11 లక్షలు ఇస్తానంటూ ఫత్వా కూడా జారీ చేశారు. ఇంత పెద్ద వివాదం అయింది ఆ వ్యవహారం. తాజాగా సోనూ నిగమ్ చేసిన వ్యాఖ్యల మాదిరే మరో బాలీవుడ్ ప్రముఖ సింగర్ సుచిత్రా కృష్ణమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలకు పలువురు నెటిజన్ల నుంచి మద్దతు లభిస్తున్నా.. పలువురు నెటిజన్లు మాత్రం ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు. ‘‘ఇంటికి 4.45కు వచ్చాను. కానీ, ఆ టైంలో వచ్చే అజాన్ (ముస్లింల ఉదయపు ప్రార్థనలు) శబ్దంతో చెవులు పగిలిపోతున్నాయి. ఇలాంటి మతాచారాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం కన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు’’ అంటూ ట్వీట్ చేశారు. ఇది కాస్తా వివాదానికి దారి తీసింది.           ఆమె ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన వారికి కూడా ఆమె సమాధానాలిచ్చింది. ఇస్లాం దేశాల్లో కన్నా భారత్‌లోనే భారీ శబ్దాలతో అజాన్‌ను పాటిస్తున్నారని మరో ట్వీట్ చేశారు. అంతేగాకుండా అజాన్‌తో పాటు గోరక్షకుల పేరిట జరుగుతున్న దానిపైనా ఆమె స్పందించారు. అజాన్ గురించి ఎలాగైతే స్పందించానో.. అలాగే గోరక్షకుల పేరిట జరుగుతున్న దాడులపైనా స్పందించానని, ఆ ట్వీట్లను గమనించలేదా అని రిప్లై ఇచ్చారు.
entertainment
400
03-07-2017 00:07:32
పిఎన్‌బి మాస్ట్రో డెబిట్‌ కార్డులకు బ్లాకేజ్‌ ప్రమాదం
న్యూఢిల్లీ : మాస్ట్రో డెబిట్‌ డెబిట్‌ కార్డులున్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పిఎన్‌బి) ఖాతాదారులు కొత్త చిక్కొచ్చి పడింది. వీరు ఈ నెలాఖరులోగా ఇవిఎం చిప్‌, పిన్‌ ఆధారిత డెబిట్‌ కార్డులు తీసుకోవాలి. లేకపోతే వారి డెబిట్‌ కార్డులు బ్లాకయ్యే ప్రమాదం ఉందని బ్యాంక్‌ హెచ్చరించింది. బ్యాంక్‌కు చెంది న ఏ బ్రాంచ్‌లో అయినా ఖాతాదారులు తమ పాత మాస్ట్రో డెబిట్‌ కార్డులు ఇచ్చి ఇవిఎం చిప్‌ ఆధారిత డెబిట్‌ కార్డులు తీసుకోవాలని కోరింది. ఖాతాదారులకు ఉచితంగానే ఈ సదుపాయం కల్పించినట్టు పిఎన్‌బి ఒక ప్రకటనలో తెలిపింది. ఇంకా దాదాపు లక్ష మంది ఖాతాదారులు పిఎన్‌బి జారీ చేసిన పాత మాస్ట్రో డెబిట్‌ కార్డులు వాడుతున్నట్టు అంచనా. బ్యాంక్‌ ఇప్పటికే వీరందరికీ విషయం తెలియజేస్తూ వెంటనే కొత్త డెబిట్‌ కార్డులు తీసుకోవాలని ఎస్‌ఎంఎ్‌సలు పంపించింది. ఏడాదికి ఒకసారి కూడా మాస్ట్రో డెబిట్‌ కార్డులు ఉపయోగించని ఖాతాదారులకు మాత్రం ఎలాంటి మెసేజ్‌లు పంపించలేదు. ఆర్‌బిఐ ఆదేశాల ప్రకారం వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా బ్యాంకులు ఖాతాదారులందరికీ, గతంలో జారీ చేసిన మాగ్నెటిక్‌ స్ర్టైప్‌ కార్డుల స్థానంలో మరింత సురక్షితమైన ఇవిఎం చిప్‌ ఆధారిత డెబిట్‌ కార్డులు జారీ చేయాలి.
business
5,524
16-09-2017 19:20:35
రవితేజ సినిమాలో సాయిధరమ్, రాశీఖన్నా...!
రవితేజ, మెహ్రీన్ జంటగా నటిస్తోన్న 'రాజా ది గ్రేట్' చిత్రంలో మరో జంట కూడా నటిస్తోందట. దర్శకుడు సెంటిమెంటే ఇందుకు కారణమని తెలుస్తోంది. రవితేజ హీరోగా రూపొందుతోన్న 'రాజా ది గ్రేట్' చిత్రం అక్టోబర్ రిలీజ్ టార్గెట్‌తో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. రవితేజకు జంటగా మెహ్రీన్ కౌర్ నటిస్తోన్న ఈ చిత్రంలో మరో ఇద్దరూ హీరోహీరోయిన్స్ నటిస్తుండటం విశేషం. ఆ జంట మరెవరో కాదు. గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో కలసి నటించిన సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా. ఈ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బెల్లం శ్రీదేవిగా 'సుప్రీమ్'లో నటించిన రాశీఖన్నాతో దర్శకుడు అనిల్ రావిపూడి తన తాజాచిత్రం 'రాజా ది గ్రేట్'లో ఓ స్పెషల్ సాంగ్ చేయించబోతున్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో రాశీఖన్నాతో పాటు హీరో సాయిధరమ్ తేజ్ కూడా అతిథిపాత్ర పోషిస్తుండటం విశేషం. ఓ ప్రత్యేకగీతంలో ఈ ఇద్దరూ కలసి కనిపిస్తారట. 'సుప్రీమ్' సినిమాల్లోని పాత్రల్లోనే వీరు 'రాజా ది గ్రేట్'లోనూ కనిపిస్తారట. గతంలో 'పటాస్'లో హీరోయిన్‌గా నటించిన శ్రుతి సోథితో 'సుప్రీమ్' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయించిన అనిల్ ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ చేస్తున్నాడు. ఇది అనిల్ సెంటిమెంట్ అంటున్నారు. సో అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీలో మెహ్రీన్‌కు ఓ స్పెషల్ సాంగ్ కన్ ఫామ్ అయిపోయినట్టేనన్న మాట..!
entertainment
2,857
29-04-2017 00:27:09
అక్షయ తృతీయ అమ్మకాల్లో 40 శాతం వృద్ధి
స్వల్పంగా పెరిగిన బంగారం ధర న్యూఢిల్లీ/ముంబై : అక్షయ తృతీయ సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా జువెలరీ దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడాయి. బంగారం, వివిధ రకాల పసిడి ఆభరణాలు కొనుగోలు చేయడానికి జనం ఆసక్తి చూపారు. దీంతో గత ఏడాదితో పోల్చితే ఈసారి అమ్మకాలు 40 శాతం మేర పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. పసిడి ధర తక్కువగా ఉండటంతో ఎక్కువ మంది బంగారం కొనుగోలుకు ప్రాధాన్యం ఇచ్చారు. రెండేళ్ల తర్వాత కస్టమర్ల సెంటిమెంట్‌ సానుకూలంగా మారిందని, దుకాణాల్లోకి వచ్చే వారికి సంఖ్య పెరిగిందని ఇండియా బులియన్‌ అండ్‌ జువెలర్స్‌ అసోసియేషన్‌ (ఐబిజెఎ) డైరెక్టర్‌ సౌరభ్‌ గాడ్గిల్‌ తెలిపారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌ సహా అన్ని ప్రధాన నగరాల్లోనూ అమ్మకాలు మెరుగ్గా ఉన్నట్టు వ్యాపారులు తెలిపారు.  పసిడి అమ్మకాలు ఈసారి 35 శాతం వరకు పెరిగినట్టు పిఎన్‌జి జువెలర్స్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ గాడ్గిల్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి సానుకూల వివరాలు అందాయని, దీన్ని బట్టి పరిశ్రమలో సుస్థిరత ఏర్పడినట్టు తెలుస్తోందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యుజిసి) ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోమసుందరమ్‌ పిఆర్‌ తెలిపారు. గత ఏడాది బులియన్‌ పరిశ్రమ చాలా సవాళ్లను ఎదుర్కొన్నదన్నారు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడటం, జిఎస్టితో రానున్న కాలంలో బంగారం ధర పెరుగుతుందన్న వార్తలతో ఈసారి అమ్మకాలు బాగానే పెరిగినట్టు ఆయన చెప్పారు. అక్షయ తృతీయ అమ్మకాలు రెండు రోజులపాటు జరగడం వల్ల అమ్మకాలు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉందని అఖిల భారత జెమ్స్‌ అండ్‌ జువెలరీ (జిజెఎఫ్‌) చైర్మన్‌ నితిన్‌ ఖండేల్వాల్‌ తెలిపారు.  ఈసారి వ్యాపారం బాగానే జరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారని, అయితే కాయిన్లు, కడ్డీలకు గిరాకీ 60 శాతం తగ్గినట్టు తెలుస్తోందన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి 25 శాతం వృద్ధిని అంచ నా వేస్తున్నామని తెలిపారు. గత ఏడాది అక్షయతృతీయ సందర్భంగా ఉన్న రేట్లకన్నా ఈసారి ధరలు తక్కువగా ఉన్నాయని, దీన్ని బట్టి ఈసారి 30-40 శాతం ఎక్కువగా అమ్మకాలు జరుగుతాయని ఆశిస్తున్నామని పిసి జువెలర్స్‌ సిఒఒ ఆర్‌కె శర్మ తెలిపారు. గత ఏడాది అక్షయ తృతీయకు ముందు జువెలర్లు సమ్మెలో ఉన్నారని, దీంతో అమ్మకాలు తగ్గాయని ఆయన చెప్పారు. అయితే ఈసారి షోరూమ్‌లకు ఎక్కువ మంది కస్టమర్లు వచ్చారని తెలిపారు. ఈసారి విలువ, పరిమాణంపరంగా అమ్మకాలు 30-40 శాతం అధికంగా ఉండటానికి అవకాశం ఉందని ఆయన చెప్పారు. సాధారణంగా అక్షయ తృతీయ సందర్భంగా తక్కువ బరువున్న ఆభరణాలకు గిరాకీ ఉంటుందని, అయితే పెళ్లిళ్ల సీజన్‌ కారణంగా ఎక్కువ బరువున్న ఆభరణాలకూ గిరాకీ ఏర్పడుతోందని జిజెఎఫ్‌ మాజీ చైర్మన్‌ జివి శ్రీధర్‌ తెలిపారు.
business
18,779
17-02-2017 02:27:52
ఓపీఎస్ ను తప్పఅందరినీ చేర్చుకుంటాం: తంబిదురై
చెన్నై, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వాన్ని తప్ప మిగతా ఎమ్మెల్యేలందరినీ మళ్లీ అన్నాడీఎంకేలో చేర్చుకుంటామని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ ఎం.తంబిదురై పేర్కొన్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు బసచేస్తున్న కూవత్తూరు రిసార్ట్‌ వద్ద గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీకి తీరని ద్రోహం తలపెట్టిన పన్నీర్‌ను ఎట్టి పరిస్థితులలోనూ తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు. కాగా, పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ఆహ్వానించినట్లు తెలిసి శశికళ బెంగళూరు జైలులో చిరునవ్వులు చిందించారు. ఈ విషయాన్ని జైలు సిబ్బంది తెలియపరచగానే నవ్వుతూ.. ‘అప్పుడే ఏమైంది...?’ అని వ్యాఖ్యానించినట్లు పొయె్‌సగార్డెన వర్గాలు తెలిపాయి.
nation
20,505
03-11-2017 01:52:19
భారత జట్ల శుభారంభం
సెపక్‌తక్రా ప్రపంచ కప్‌ హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): హైదరాబా ద్‌లో గురువారం ప్రారంభమైన సెపక్‌తక్రా ప్రపంచకప్‌లో భారత జట్లు శుభారంభం చేశాయి. పురుషుల టీమ్‌ చాంపియ న్‌షిప్‌లో భారత్‌ 21-6, 21-10తో ఫ్రాన్స్‌ను చిత్తు చేసింది. మరో పోటీలో థాయ్‌లాండ్‌ 21-4, 21-6 స్కోరుతో నేపాల్‌పై, మలేసి యా 21-10, 21-15 స్కోరుతో బంగ్లాదేశ్‌పై, జపాన్‌ 21-15, 21-12 స్కోరుతో నేపాల్‌పై, ఇరాన్‌ 21-14, 21-4 స్కోరుతో జర్మనీపై, మయన్మార్‌ 21-3, 21-8 స్కోరుతో బంగ్లాదేశ్‌పై గెలు పొందాయి. పాకిస్థాన్‌పై బ్రెజిల్‌కు వాకోవర్‌ లభించింది. మహి ళల టీమ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ 21-8, 21-8 స్కోరుతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. అంతకుముందు గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో వరల్డ్‌కప్‌ను రవాణా శాఖ మంత్రి ఎం.మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు క్రీడలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో శాట్స్‌ చైర్మన్‌ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
sports
5,787
12-12-2017 09:10:38
రజినీకాంత్... ఫైవ్ సక్సెస్ సీక్రెట్స్
నేడు సూపర్‌స్టార్ రజినీకాంత్ 67 వ పుట్టిన రోజు. 1950 డిసెంబరు 12న బెంగళూరులో రజినీ జన్మించారు. కండక్టర్ నుంచి సూపర్ స్టార్‌గా ఎదిగిన రజినీకాంత్‌కు కోట్ల సంఖ్యలో అభిమానులున్నారు. రజినీకాంత్ ప్రతీ కదలికలోనూ అభిమానులు ఒక అద్భుతాన్ని చూస్తుంటారనటంలో అతిశయోక్తి లేదు. రజినీ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కృషి ఉంది.సక్సెస్ సీక్రెట్స్1. సెన్సాఫ్ హ్యూమర్సినిమాలో తాను పోషించే పాత్రను రజినీ అత్యంత వేగంగా అర్థం చేసుకుంటారు. ఆ క్యారెక్టర్‌కు అనుగుణంగా తనను తాను మలచుకుంటారు.2. అబ్జర్వేషనల్ స్కిల్స్తన సినిమాలోని ప్రతీ సన్నివేశాన్నిరజినీ క్షుణ్ణంగా గమనిస్తారు. తన కో- స్టార్స్ ఎలా పనిచేస్తున్నారో అబ్జర్వ్ చేస్తారు.3. స్టయిల్సిగరెట్‌ను గాలిలోకి ఎగురవేసి, దాన్ని అలవోకగా క్యాచ్ చేసి, తిరిగి దానిని నోటిలో పెట్టుకోవడంలో రజినీ ఎంతో ఫేమస్. ఇది రజినీ సిగ్నేచర్ స్టయిల్.4. పంక్చ్యువాలిటీకాలాన్ని సద్వనియోగం చేయడంలో రజినీ ముందుంటారు. షూటింగ్‌కు సరైన సమయానికి హాజరవుతారు. షాట్ పూర్తయిన 15 నిమిషాల్లో తిరిగి మరో షాట్‌కు సిద్ధమైపోతారు.5. సంతృప్తిరజినీ దగ్గర కావలసినంత సంపద, కీర్తి ప్రతిష్టలున్నాయి. అన్ని విషయాల్లో రజినీ సంతృప్తి వ్యక్తం చేస్తారు. తన కోసం భగవంతుడిని మరేమీ కోరుకోనని రజినీ చెబుతుంటారు.
entertainment
7,156
15-05-2017 14:09:33
అనసూయపై ఆలీ కామెంట్
కమెడియన్ ఆలీ మరోసారి వార్తల్లో నిలిచాడు. హీరోయిన్లపై సెటైర్లు వేస్తూ... ఇది జస్ట్ ఫర్ ఫన్... లైట్ తీసుకోమని చెప్పడం ఆలీ స్టైల్. అనుష్క, సమంత లాంటి స్టార్ హీరోయిన్లపై కూడా గతంలో ఆలీ అభ్యంతరకర వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇప్పుడు తాజాగా అలీ బాధితుల జాబితాలోకి యాంకర్ అనసూయ వచ్చి చేరింది. యాంకర్ అనసూయ, ఆలీ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ ఇటీవలే ఓ అవార్డ్స్ ఫంక్షన్ చేశారు. ఈ ఈవెంట్‌లో రాజ్‌తరుణ్‌ను వేదికపైకి రావాల్సిందిగా అనసూయ ఆహ్వానించింది.  అయితే కొంచెం కొంటెగా మాట్లాడే రాజ్ తరుణ్ ‘‘నాకు ఎవరూ జత లేరా?’’ అని అనసూయనుద్దేశించి కామెంట్ చేశాడు. దీనికి కారణం లేకపోలేదు. అప్పటి వరకూ ఇద్దరినీ కలిపి ఆహ్వానించిన అనసూయ రాజ్ తరుణ్ విషయంలో మాత్రం ఒక్కడినే ఆహ్వానించింది. దీంతో రాజ్ తరుణ్ ఆ కామెంట్ చేశాడు. ఆ కామెంట్‌కు స్పందించిన అనసూయ పోడియం దిగి రాజ్‌తరుణ్‌తో కలిసి పైకి వచ్చేందుకు కిందకు వెళ్లింది. వెంటనే కలగజేసుకున్న ఆలీ ‘ఎవరు జత కావాలన్నా వెళ్లిపోతావా’ అంటూ తన మార్క్ డైలాగ్‌ను సంధించాడు. ఈ కామెంట్‌తో అనసూయ అవాక్కైంది. దీంతో అక్కడున్న వారంతా పైకి పగలబడి నవ్వినా.. ఆలీకి ఇంకా ఈ వెటకారం తగ్గలేదంటూ చర్చించుకున్నారు. అయితే అనసూయపై ఇలాంటి కామెంట్స్ చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆలీ ఇలాంటి కామెంట్సే చేశాడు.
entertainment
4,725
02-12-2017 17:17:51
క్రిస్మస్ బరిలో అఖిల్, నాని, అల్లు శిరీష్
బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోలు పోటీ పడాలని ఫ్యాన్స్ భావిస్తే తమ సినిమాలకు పోటీ ఉండొద్దని నిర్మాతలు అనుకుంటుంటారు. అయితే ఈ ఏడాది రెండోసారి బాక్సాఫీస్ దగ్గర వార్ ఖాయమని వినిపిస్తోంది. సినిమా అంటే ఆడియెన్స్‌కు వినోదమే కానీ నిర్మాతలకు మాత్రం ఇది పక్కా బిజినెస్. అందుకే తమ సినిమాను సేఫ్ జోన్‌లో విడుదల చేసి పెట్టుబడితో పాటు లాభాలు రాబట్టుకోవాలని చాలామంది నిర్మాతలు భావిస్తున్నారు. నిర్మాతలందరిదీ ఇదే అభిప్రాయం కావడంతో ఈ విషయంలో పట్టువిడుపులు కామనైపోయాయి. సంక్రాంతి, సమ్మర్ సీజన్‌ను మినహాయిస్తే మిగతా సమయాల్లో మరో సినిమాలతో పోటీ పడేందుకు హీరోలు, నిర్మాతలు అంతగా ఆసక్తి చూపించరు. అయితే ఈ ఏడాది పంద్రాగస్టు సీజన్‌లో మాత్రం కొందరు నిర్మాతలు పట్టుదలకు పోవడంతో మూడు సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. పంద్రాగస్టు సీజన్‌లో రానా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి', బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'జయ జానకి నాయక', నితిన్ నటించిన 'లై' సినిమాలో పోటీ పడ్డాయి. ఇందులో 'నేనే రాజు నేనే మంత్రి' ఆడియెన్స్‌ను ఆకట్టుకుని విజయం సాధించగా ‘జయజయ జానకి నాయక’ పర్వాలేదనిపించింది. నితిన్ నటించిన 'లై' సినిమా డిజాస్టర్ లిస్టులో చేరిపోయి నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. పంద్రాగస్టు సీజన్ సంగతి ఇలా ఉంటే క్రిస్మస్ బరిలోనే మరోసారి సేమ్ సీన్ రిపీటయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అఖిల్ కొత్త సినిమా 'హలో'తో పాటు నాని, దిల్ రాజు కాంబినేషన్‌లో 'ఎంసిఎ', అల్లు శిరీష్ నయా మూవీ 'ఒక్క క్షణం' సినిమాలు క్రిస్మస్ రేసులో ఉండటం దాదాపుగా ఖాయమైంది. ఈ ముగ్గురు ఎక్కడా తగ్గే పరిస్థితి లేకపోవడంతో మరోసారి పంద్రాగస్టు తరహాలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పోటీ తప్పదనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అదే జరిగితే కొద్దిగా ఇబ్బంది పడేది అఖిల్ 'హలో' సినిమానే అంటున్నారు. 30 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు సోలో రిలీజ్ ఉంటే ఓపెనింగ్స్‌తో సేఫ్ జోన్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పోటీ ఉంటే ఓపెనింగ్స్‌ను షేర్ చేసుకోవాల్సి వస్తుంది. మిగతా రెండు సినిమాలు బడ్జెట్ విషయంలో తక్కువ కాబట్టి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకాదరణ పొందితే ఏ సినిమా అయినా సేఫ్ అవడం ఖాయం కాబట్టి ఎవరికి వారు పోటీకి రెడీ అంటున్నారు. మరి రాబోయే క్రిస్టమస్ వార్‌లో ఎవరిదిపై చేయి అవుతుందో చూడాలి.
entertainment
5,770
16-08-2017 18:08:02
ఫిదా' కన్నా ముందే గుర్తించిన డైరెక్టర్
ఒకే ఒక్క సినిమాతో తెలుగువారిని 'ఫిదా' చేసేసిన ఆ మళయాళీ ముద్దుగుమ్మ అసలుకు ఎప్పుడో టాలీవుడ్‌లో అడుగుపెట్టాల్సిందట. ఏ భాషలోనైనా ప్రేక్షకులను అమాంతం తన బుట్టలో వేసుకునేందుకు ఒక్క సినిమా చాలు అంటోంది కొత్త అందం సాయి పల్లవి. మళయాళంలో 'ప్రేమమ్' సినిమాతో కుర్ర కారుకు హాట్ ఫేవరేట్‌గా మారిపోయిన ఈ చిన్నది. తెలుగులో 'ఫిదా'తో ఎలాంటి మ్యాజిక్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే డైరెక్టర్ శేఖర్ కమ్మల మాత్రం ఈమె టాలెంట్‌ను ఎప్పుడో గుర్తించాడట. నిజానికి సాయిపల్లవి టీనేజ్‌లోనే డాన్సింగ్ దివాగా ప్రేక్షకులకు పరిచయం అయింది. అయితే తరువాత వైద్య విద్యను అభ్యసించేందుకు విదేశాలకు వెళ్లిపోయింది. అప్పట్లోనే అమ్మడిలోని టాలెంట్‌ను గుర్తించిన శేఖర్ కమ్ముల, 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాలో నటించమని ఆమెను కోరాడట. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువును మధ్యలోనే ఆపేయకూడదని బలంగా నిశ్చయించుకున్న సాయిపల్లవి. శేఖర్ ఆఫర్‌ను అప్పుడు తిరస్కరించింది. కానీ, అమ్మడి ప్రతిభపై నమ్మకం కోల్పోని శేఖర్ ఆమె తిరిగివచ్చిన తరువాత తన కథతో 'ఫిదా' చేసేశాడు. ఏమైనా ప్రస్తుతం టాలీవుడ్‌లోనే వరుస ఆఫర్లు అందుకుంటోన్న సాయి పల్లవి. ఇక్కడే స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుందేమో చూడాలి.
entertainment
16,113
18-08-2017 17:10:20
జైలులో శశికళను కలిసిన దినకరన్
చెన్నై: అన్నాడీఎంకే వర్గాల విలీనానికి జరుగుతున్న ప్రయత్నాలు దాదాపు కొలిక్కి రావడం, టీటీవీ దినకరన్ ఆధిపత్యానికి గండిపడటం వంటి వరుస పరిణామాల నేపథ్యంలో శుక్రవారంనాడు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్రమ ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళను దినకరన్ కలుసుకున్నారు. శశికళను కలుసుకునేందుకు మధ్యాహ్నం 12 గంటలు నుంచి ఒంటి గంట మధ్య దినకరన్‌కు టైమ్ స్లాట్ ఇచ్చినట్టు జైలు అధికారులు ధ్రువీకరించారు. దినకరన్ వెంట ఆయన కుటుంబసభ్యులు కూడా ఉన్నారని, శశికళకు వారంతా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారని తెలుస్తోంది. తమిళనాడు రాజకీయ పరిస్థితులు, అన్నాడీఎంకే వర్గాలు విలీనం కానుండటం వంటి అంశాలను శశికళ దృష్టికి దినకరన్ తీసుకువచ్చినట్టు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. పార్టీపై పట్టు సాధించేందుకు దినకరన్ ఇటీవల మదురైలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం, ఇద్దరు ఎంపీలతో సహా మొత్తం 20 మంది ఎమ్మెల్యేల బలం తనకుందని దినకరన్ చాటుకోవడం, పళనిస్వామి సర్కార్‌పై నిప్పులు చెరిగిని నేపథ్యంలో శశికళను దినకరన్ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
nation
11,261
03-09-2017 13:55:22
మోదీ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రులు, శాఖలు
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రక్షణ మంత్రిగా దేశంలోనే తొలిసారి ఓ మహిళను ఎంపిక చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నిర్మల సీతారామన్‌కు రక్షణ మంత్రిత్వ శాఖను అప్పగించారు. కేంద్ర మంత్రులు - శాఖల వివరాలు... నరేంద్ర మోదీ - ప్రధాన మంత్రి, సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్లు, అణు ఇంధన శాఖ, అంతరిక్ష శాఖ, తదితర శాఖలు.కేబినెట్ మంత్రులు : రాజ్‌నాథ్ సింగ్ - హోం శాఖసుష్మా స్వరాజ్ - విదేశీ వ్యవహారాలుఅరుణ్ జైట్లీ - ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలునితిన్ జైరామ్ గడ్కరీ - రోడ్డు రవాణా, హైవేలు, నౌకాయానం, జల వనరులు, నదుల అభివృద్ధి, గంగా నది పునరుద్ధరణసురేశ్ ప్రభు - వాణిజ్యం, పరిశ్రమలుడీ వీ సదానంద గౌడ - గణాంకాలు, పథకాల అమలుఉమా భారతి - తాగునీరు, పారిశుద్ధ్యంరామ్ విలాస్ పాశ్వాన్ - వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీమేనకా గాంధీ - మహిళ, శిశు అభివృద్ధిఅనంత్ కుమార్ - రసాయనాలు, ఎరువులు, పార్లమెంటరీ వ్యవహారాలురవిశంకర్ ప్రసాద్ - న్యాయ శాఖ, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక పరిజ్ఞానం జగత్ ప్రకాశ్ నడ్డా - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంఅశోక్ గజపతి రాజు - పౌర విమానయానంఅనంత్ గీతే - భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ - ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్నరేంద్ర సింగ్ తోమర్ - గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గనులుచౌదరి బీరేంద్ర సింగ్ - స్టీల్ జువల్ ఓరమ్ - గిరిజన వ్యవహారాలురాధామోహన్ సింగ్ - వ్యవసాయం, రైతు సంక్షేమంథావర్ చంద్ గెహ్లాట్ - సాంఘిక న్యాయం, సాధికారతస్మృతి జుబిన్ ఇరానీ - టెక్స్‌టైల్స్, సమాచార, ప్రసార శాఖలుడాక్టర్ హర్ష వర్థన్ - సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులుప్రకాశ్ జవదేకర్ - మానవ వనరుల అభివృద్ధిధర్మేంద్ర ప్రధాన్ - పెట్రోలియం, సహజవాయువు, స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూవర్‌షిప్పీయూష్ గోయల్ - రైల్వేలు, బొగ్గునిర్మల సీతారామన్ - రక్షణ శాఖముక్తార్ అబ్బాస్ నఖ్వీ - మైనారిటీ వ్యవహారాలు దేశంలోని ఈ ప్రముఖుల నెల జీతాలెంతో తెలుసా?  అది కనుక అమలైతే భారతదేశం భూతల స్వర్గమే.. జగత్ ప్రకాశ్ నడ్డా - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంఅశోక్ గజపతి రాజు - పౌర విమానయానంఅనంత్ గీతే - భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ - ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్నరేంద్ర సింగ్ తోమర్ - గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గనులుచౌదరి బీరేంద్ర సింగ్ - స్టీల్ జువల్ ఓరమ్ - గిరిజన వ్యవహారాలురాధామోహన్ సింగ్ - వ్యవసాయం, రైతు సంక్షేమంథావర్ చంద్ గెహ్లాట్ - సాంఘిక న్యాయం, సాధికారతస్మృతి జుబిన్ ఇరానీ - టెక్స్‌టైల్స్, సమాచార, ప్రసార శాఖలుడాక్టర్ హర్ష వర్థన్ - సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులుప్రకాశ్ జవదేకర్ - మానవ వనరుల అభివృద్ధిధర్మేంద్ర ప్రధాన్ - పెట్రోలియం, సహజవాయువు, స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూవర్‌షిప్పీయూష్ గోయల్ - రైల్వేలు, బొగ్గునిర్మల సీతారామన్ - రక్షణ శాఖముక్తార్ అబ్బాస్ నఖ్వీ - మైనారిటీ వ్యవహారాలు దేశంలోని ఈ ప్రముఖుల నెల జీతాలెంతో తెలుసా?  అది కనుక అమలైతే భారతదేశం భూతల స్వర్గమే..
nation
18,419
15-05-2017 02:37:44
అవినీతి కేజ్రీవాల్‌.. రాజీనామా చెయ్‌!
లేదంటే కాలర్‌ పట్టుకుని తీహార్‌కు ఈడ్చుకుపోతా..కపిల్‌ మిశ్రా హెచ్చరికషెల్‌ కంపెనీల నుంచి ఆప్‌ ఖాతాలోకి కోట్లుతీవ్ర ఆరోపణలు గుప్పించి స్పృహ కోల్పోయిన మాజీ మంత్రిన్యూఢిల్లీ, మే 14: అవినీతి ఆరోపణల ప్రకంపనలతో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఐదుగురు ఆప్‌ నేతల విదేశీ పర్యటనల ఖర్చు వివరాలు చెప్పాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను డిమాండ్‌ చేస్తూ ఐదురోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ మాజీ మంత్రి కపిల్‌ మిశ్రా.. ఆదివారం మరిన్ని ఆరోపణలు గుప్పించారు. కేజ్రీవాల్‌ అవినీతిపరుడని, హవాలా లావాదేవీలు, విరాళాలు, షెల్‌ కంపెనీల ఏర్పాటు, ఆదాయ పన్ను విభాగానికి, ఎన్నికల కమిషన్‌కు సత్య సమాచారం అందించకుండా దాచిపెట్టడం వంటి పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆదివారమిక్కడ విలేకరులకు వెల్లడించారు. కేజ్రీ అవినీతిపరుడని రుజువైందని, ఆయన తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఆయన కాలర్‌ పట్టుకుని తీహార్‌ జైలుకు ఈడ్చుకుపోతానని మిశ్రా హెచ్చరించారు. ‘‘నాలుగు మోసపూరిత షెల్‌ కంపెనీలకు సంబంధించి ఐటీ విభాగం కేజ్రీవాల్‌కు నోటీసులు పంపింది. నిజానికి వందల షెల్‌ కంపెనీలను ఆయన సన్నిహితులు నడుపుతున్నారు. వీరిలో ఆప్‌ ఎమ్మెల్యేలు శివచరణ్‌ గోయల్‌, నరేశ్‌ యాదవ్‌ కూడా ఉన్నారు. ఢిల్లీలోని ఓ యాక్సిస్‌ బ్యాంకు బ్రాంచ్‌ ద్వారా లావాదేవీలు నడిపారు. నోట్ల రద్దు తర్వాత ఈ బ్రాంచ్‌పై ఐటీ దాడులు జరిగాయి. కేజ్రీ, ఆయన మద్దతుదారులు నల్లధనాన్ని చట్టబద్ధమైన ధనంగా మారుస్తుండగా నోట్ల రద్దు ప్రకటన వెలువడింది. దాంతో ఆయన దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. నరేశ్‌ యాదవ్‌ భార్య ప్రీతి యాదవ్‌కు కూడా బోగస్‌ కంపెనీలతో సంబంధాలున్నాయి. ఆయా కంపెనీల్లో ఆమె పెట్టుబడులు పెట్టారు. అది ఆప్‌ ఖాతాకు మళ్లింది. శివచరణ్‌ గోయల్‌, ఆయన భార్య కూడా పెద్దసంఖ్యలో షెల్‌ కంపెనీలు పెట్టారు. వాటి ద్వారా నల్లధనాన్ని ఆప్‌కు తరలించారు. వీటిపై సీబీఐకి సోమవారం ఆధారాలు సమర్పిస్తా. పెద్దఎత్తున విరాళాల స్కాం కూడా జరిగింది. విదేశాలు, స్వదేశం నుంచి వచ్చిన విరాళాల పూర్తి వివరాలను ఈసీ, ఐటీకి చెప్పకుండా దాచారు. ప్రియా బన్సల్‌ అనే మహిళ నుంచి 2014-15, 15-16 సంవత్సరాలకు గాను రూ.90 లక్షల విరాళం పార్టీకి వచ్చింది. కానీ ఆమె ఆదాయంపై కట్టిన పన్ను రూ.4 వేలే. 2014-15లో ఆప్‌ ఖాతాలో రూ.65.5 కోట్లు ఉన్నాయి. కానీ రూ.32.4 కోట్లే ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌కు తెలిపింది. పార్టీ వెబ్‌సైట్‌లో మాత్రం 27.3 కోట్లు ఉన్నట్లు చూపించింది. 2013-14లో ఆప్‌ ఖాతాల్లో రూ.45.74 కోట్లు ఉంటే కేవలం రూ.9.42 కోట్లు ఉన్నట్లు కేజ్రీవాల్‌ ఈసీకి తెలిపారు’’ అని పేర్కొన్నారు. అయితే విలేకరుల సమావేశం మధ్యలోనే ఆయన స్సృహ తప్పిపడిపోయారు. హుటాహుటిన ఆయన్ను రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు. కాగా, మిశ్రా తాజా ఆరోపణలను ఆప్‌ ఎప్పటిలాగే కొట్టిపారేసింది.
nation
11,014
09-11-2017 19:04:29
మాజీ న్యాయమూర్తి లంచం కేసు రాజ్యాంగ ధర్మాసనానికి
న్యూఢిల్లీ : న్యాయమూర్తులకు ఇచ్చేందుకు అని చెప్తూ లంచాలు తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణల కేసును రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు నివేదించింది. ఈ కేసులో నిందితుల్లో ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి కూడా ఉన్నట్లు సీబీఐ ఆరోపించింది. సెప్టెంబరు 19న దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్‌ను సీబీఐ నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలు, సాక్ష్యాధారాలను భద్రపరచాలని సీబీఐని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. సీలు వేసిన కవరులో ఈ పత్రాలను, సాక్ష్యాధారాలను పెట్టి ఈ నెల 13న రాజ్యాంగ ధర్మాసనానికి సమర్పించాలని తెలిపింది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో ఐదుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులు ఉంటారని జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ధర్మాసనం పేర్కొంది. సీబీఐ ఎఫ్ఐఆర్ ప్రకారం ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తి, మరికొందరు కలిసి అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఓ వైద్య కళాశాలలో ప్రవేశాలకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణలో ఉన్న ఓ కేసులో సానుకూల పరిష్కారాన్ని హామీ ఇస్తూ లంచం డిమాండ్ చేశారని, కుట్ర పన్నారని సీబీఐ ఆరోపించింది.
nation
15,105
11-11-2017 20:21:21
'పద్మావతి'కి బుండి రాణి మద్దతు
బుండి : సంజయ్ లీలా బన్సాలీ 'పద్మావతి' చిత్రం విడుదలను అడ్డుకుంటామన్న శ్రీ రాజ్‌పుత్ కర్ణి సేన హెచ్చరికల నేపథ్యంలో ఆ చిత్రానికి రాజస్థాన్‌‌లోని బుండి రాణి మద్దతుగా నిలిచారు. సినిమా విడుదలపై తమకెలాంటి అభ్యంతరం లేదని బుండి క్వీన్ మయూరి సింగ్ తెలిపారు. 'ముందు పద్మావతి చిత్రాన్ని విడుదల కానీయండి. రాజపుత్‌లను కించపరచేలా సినిమాలో చూపించడంలేదంటూ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ భరోసా ఇస్తున్నారు' అని ఆమె తెలిపారు. సినిమా విడుదలైన తర్వాత అందులో ఏదైనా అభ్యంతరం ఉన్నట్టు అనిపిస్తే అప్పుడే నిరసనలు తెలియజేద్దామని ఆమె అన్నారు. దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన 'పద్మావతి' చిత్రం షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావలసి ఉంది.
nation
19,716
12-12-2017 13:58:01
ర‌హానే లేక‌పోవ‌డంతో షాక‌య్యా: గంగూలీ
ఇటీవ‌ల శ్రీలంకతో ధ‌ర్మ‌శాల‌లో జ‌రిగిన మొద‌టి వ‌న్డేలో ర‌హానేను ఆడించ‌క‌పోవ‌డం త‌న‌కు చాలా ఆశ్చ‌ర్యం క‌లిగించింద‌ని టీమిండియా మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ అన్నాడు. ర‌హానేను తీసుకోక‌పోవ‌డానికి గ‌ల నిజ‌మైన‌ కార‌ణం ఏమిటో తెలుసుకునేందుకు ఆస‌క్తిగా ఉన్నాన‌ని వ్యాఖ్యానించాడు. ధ‌ర్మ‌శాల‌లో ఇటీవ‌ల జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ విభాగం ఘోరంగా విఫ‌ల‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ వైఫ‌ల్యానికి జ‌ట్టు ఎంపికే ప్రధాన కార‌ణ‌మ‌ని దాదా ఆరోపించాడు. `పేస్‌కు అనుకూలించే పిచ్‌పై ర‌హానేను తీసుకోక‌పోవ‌డం చాలా పెద్ద త‌ప్పిదం. అందుబాటులో ఉన్న అత్యుత్త‌మ ఆట‌గాళ్ల‌ను జ‌ట్టులోకి తీసుకోవాలి. మొహ‌లీ పిచ్ కూడా పేస్‌కు అనుకూలిస్తుంది. కాబ‌ట్టి ఆ మ్యాచ్‌లో ర‌హానేను తీసుకుని ఫస్ట్‌డౌన్‌లో ఆడించాల‌`ని గంగూలీ సూచించాడు.
sports
21,540
11-07-2017 02:28:49
విజయానికి అర్హులం కాదు
కింగ్‌స్టన్‌ (జమైకా): వెస్టిండీస్‌తో ఆదివా రం జరిగిన ఏకైక టీ20లో జట్టు ఆటతీరుపై కెప్టెన్‌ కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంజేశాడు. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో చెత్త ప్రదర్శన కనబరచిన తాము విజయానికి అర్హులమే కాదని వ్యాఖ్యానించాడు. ‘మేం మరో 25-30 పరుగులు చేయాల్సింది. నిజానికి మేం 230 పరుగులు సాధిస్తామను కున్నాం. మా ఫీల్డింగ్‌ కూడా అంత గొప్పగా లేదు. కొన్ని అవకాశాలను జారవిడిచాం. అలాంటప్పుడు మేం విజయానికి ఎలా అర్హు లం’ అని మ్యాచ్‌ అనంతరం కోహ్లీ ప్రశ్నించా డు. భారత టీ20 జట్టు ప్రస్తుతం పరివర్తన దశలో ఉందన్న కోహ్లీ.. కొన్ని చెడ్డ రోజులూ ఉంటాయని అన్నాడు. అయితే మొత్తంగా జట్టు రాణింపుపై సంతృప్తిగా ఉన్నట్టు చెప్పా డు. ‘టీ20ల్లో ఎవరైనా విజయం సాధించ వచ్చు. అందువల్ల ఒక మ్యాచ్‌ పరాజయంతో ఏదో అయిపోతుందని అనుకోను. మొత్తంగా విండీస్‌ టూర్‌ను మేం ఎంజాయ్‌ చేశాం’ అని కోహ్లీ చెప్పాడు.
sports
10,911
17-08-2017 22:39:55
అంతా మీరే చేశారు..
‘‘అంతా మీరే చేశారు. మీరు చేసిన పనివల్ల నేను ఆనందాన్ని పొందుతున్నాను’’ అని అంటున్నారు ఇలియానా. ‘దేవదాస్‌’ చిత్రంతో తెలుగువారందరికీ పరిచయమైన ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ‘బాద్షాహో’ చిత్రంలో గీతాంజలిగా నటించారు. అజయ్‌దేవ్‌గణ్‌, ఇమ్రాన్‌ హష్మి, ఈషా గుప్తా కీలక పాత్రల్లో నటించిన చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌ 1న విడుదల కానుంది. ఆ సినిమాలో తన పాత్రకు తప్పకుండా విమర్శకుల ప్రశంసలు అందుతాయని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారామె. దానికితోడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోయర్ల సంఖ్య 60లక్షలకు చేరింది. ఈ సందర్భంగా ఆమె ఓ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఆండ్రూ నీబోన్‌కి ఫొటో క్రెడిట్‌ ఇచ్చారు. ఫాలోయర్ల సంఖ్య 60లక్షలకు చేరుకోవడం తనకు అత్యంత ఆనందంగా ఉందని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.
entertainment
14,724
29-05-2017 11:11:33
‘బహిరంగంగా ఆ పని వద్దన్న డ్రైవర్‌ హత్య... బాధ్యులకు కఠిన శిక్ష తప్పదు’
న్యూఢిల్లీ : స్వచ్ఛ భారత్‌ను ప్రోత్సహించాలన్న లక్ష్యంగల ఈ-రిక్షా డ్రైవర్‌ను హతమార్చినవారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నవారిని వారించినందుకు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమని తెలిపారు. నిందితుల చర్యను ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై తాను స్వయంగా దృష్టి సారించానని, నిందితులను వదిలేది లేదని స్పష్టం చేశారు. వెంకయ్యనాయుడు సోమవారం ఇచ్చిన ట్వీట్‌లో స్వచ్ఛ భారత్‌ను ప్రోత్సహిస్తున్న డ్రైవర్ తన ప్రాణాలను కోల్పొవడం చాలా విచారకరమని పేర్కొన్నారు. మీడియా కథనాల ప్రకారం మెట్రో స్టేషన్ వద్ద శనివారం ఇద్దరు విద్యార్థులు మూత్ర విసర్జన చేస్తుండటాన్ని ఓ ఈ-రిక్షా డ్రైవర్ నిరోధించారు. ఈ విద్యార్థులిద్దరూ మద్యం సేవిస్తూ, మూత్ర విసర్జన చేశారని స్థానికులు చెప్పారు. తమను అడ్డుకున్న డ్రైవర్‌పై కక్షగట్టిన ఆ విద్యార్థులు రాత్రి పొద్దుపోయాక దాదాపు 14మందిని తీసుకొచ్చి, ఆ డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టారు. ఆయనను కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తువ్వాళ్లలో రాళ్లు వేసి డ్రైవర్‌ను కొట్టారు. ఈ విద్యార్థులు ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరీ మాల్ కళాశాలకు చెందినవారై ఉంటారని కొందరు చెప్తున్నారు. వీరిని అదే కళాశాల ఎదురుగా దింపినట్లు ఒక ఈ-రిక్షా డ్రైవర్ చెప్పారు.
nation
12,577
17-08-2017 08:01:39
మళ్లీ ఆస్పత్రిలో చేరిన డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి..!
ఆంధ్రజ్యోతి, చెన్నై : గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి బుధవారం ఉదయం స్థానిక ఆళ్వారుపేటలోని కావేరీ ఆస్పత్రిలో చేరడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. తమ నేతకు ఏమైందంటూ కార్యకర్తలు రోదిస్తూ రోడ్లపైకి వచ్చారు. అయితే ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌కావడంతో కార్యకర్తలు శాంతించారు. సాధారణ వైద్యపరీక్షల నిమిత్తం స్థానిక కావేరి ఆస్పత్రిలో చేరిన కరుణానిధికి బుధవారం ఉదయం వైద్యులు కృత్రిమ ఆహారనాళాన్ని మార్చారు. ఈ సందర్భంగా నాలుగు గంటలపాటు కరుణకు ఆస్పత్రిలో చికిత్సలందించారు. ఆ తర్వాత ఆయన ఆస్పత్రి నుంచి డిఛార్జ్‌ అయి గోపాలపురంలోని తన నివాసానికి చేరుకున్నారు. గత యేడాది డిసెంబర్‌ నుంచి కరుణ అనారోగ్యంతో బాధపడుతూ ఇంటిపట్టునే వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్న విషయం తెలిసిందే. ఆయనకు ట్రక్యోస్టమీ ద్వారా కృత్రిమ ఆహారనాళంను అమర్చారు.  ఆరుమాసాలకు ముందు అమర్చిన కృత్రిమ ఆహార నాళాన్ని మార్చాలని వైద్యులు సూచించడంతో . ఆ మేరకు కరుణానిధిని ఆపరేషన్‌ థియేటర్‌కు తరలించి పాత ఆహారనాళాన్ని తొలగించి కొత్తదానిని అమర్చారు. సుమారు నాలుగు గంటలపాటు ఈ చికిత్సలు జరిపారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు కరుణానిధి కారులో తన నివాసగృహానికి బయలుదేరారు. ఈ సందర్భంగా కావేరి ఆస్పత్రి నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేస్తూ సాధారణ వైద్య పరీక్షల నిమిత్తమే కరుణను ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకున్నామని, కృత్రిమ ఆహార నాళంను అమర్చామని వివరించారు.               కరుణ ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం వెలువడగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు కావేరి ఆస్పత్రి వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడారు. కరుణను ఆస్పత్రిలో చేర్చినప్పుడు ఆయన వెంట సతీమణి రాజాత్తి అమ్మాళ్‌, కుమార్తె కనిమొళి, కుమారుడు ఎం.కే తమిళరసు, మాజీ మంత్రులు ఏవీ వేలు, పొన్ముడి, పార్లమెంట్‌ సభ్యులు టీకేఎస్‌ ఇళంగోవన్‌, ఆర్‌ఎస్‌ భారతి తదితరులు ఉన్నారు. ఆస్పత్రి వద్ద కనిమొళి పాత్రికేయులతో మాట్లాడుతూ... కృత్రిమ ఆహారనాళం పాతబడటం వల్లే దానిని మార్చ టానికి కరుణను ఆస్పత్రిలో చేర్చినట్టు తెలిపారు. ఆ కృత్రిమ నాళంను ఆరు మాసాలకొకసారి మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆయన బాగా కోలుకున్నారని, ఇంటి పట్టునే మళ్లీ వైద్యుల చికిత్సలు కొనసాగు తాయని పేర్కొన్నారు. కరుణానిధి ఆస్పత్రిలో చేరినట్టు వార్త వెలువడగానే నగరంలో డీఎంకే ప్రముఖులు, నాయకులు పార్టీ కార్యాలయం అన్నా అరివాలయం, గోపాలపురంలోని ఆయన నివాసగృహం, కావేరి ఆస్పత్రి వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడారు. కరుణానిధి ఎన్‌ఎస్‌జీ కమెండోల భద్రత మధ్య ఆస్పత్రికి తీసుకువచ్చారు. చికిత్స ముగిసిన తర్వాత కూడా గట్టి బందోబస్తు మధ్య ఇంటికి తీసుకెళ్లారు. కరుణానిధి కారులో నుంచి వీల్‌చైర్‌మీద కూర్చోబెట్టి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆయన ప్రశాంతంగా కనిపించారు.
nation
10,464
03-11-2017 23:27:22
హీరోయిజం ఉన్న కథ
‘‘మంచి కథలతో వస్తే తెలుగులో వరుసగా సినిమాలు చెయ్యడానికి రెడీగా ఉన్నాను’’ అని కార్తీ అన్నారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘ఖాకీ’. పవర్‌ ఆఫ్‌ పోలీస్‌ అన్నది ఉపశీర్షిక. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నాయిక. హెచ్‌ వినోద్‌ దర్శకుడు. ఆదిత్యా మ్యూజిక్‌ ఉమేశ్‌గుప్తా, సుభాశ్‌ గుప్తా నిర్మాతలు. జిబ్రాన్‌ సంగీతం అందించారు. శుక్రవారం హైదరాబాద్‌లో పాటల్ని విడుదల చేశారు. దిల్‌ రాజు తొలి సీడీని ఆవిష్కరించారు. కార్తీ మాట్లాడుతూ ‘‘విక్రమార్కుడు’ రీమేక్‌లో పోలీస్‌గా కనిపించా. రెండోసారి పోలీస్‌ పాత్ర అనగానే డిఫరెంట్‌గా ఉండాలనుకున్నా. కథ వినగానే ‘మగధీర’లో సస్పెన్స్‌ అంశాలు గుర్తొచ్చాయి. 1995 -2005 సమయంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోందీ సినిమా. కథలో హీరోయిజం కనిపిస్తుంది. రెగ్యులర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ కథలకు భిన్నంగా ఉంటుంది. ఇంటెలిజెన్స్‌తో ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. యాక్షన్‌ ఎలిమెంట్స్‌ కూడా కొత్తగా ఉంటాయి. జిబ్రాన్‌ పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తున్నాయి’’ అని అన్నారు. దిల్‌ రాజు మాట్లాడుతూ ‘‘ఊపిరి’తో కార్తీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆయన ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా తెలుగులో చెయ్యాలి. పోలీస్‌ పాత్రలు చెయ్యడం కథానాయకులకు సవాల్‌ లాంటిది. కార్తీ బాగా యాక్ట్‌ చేశారు’’ అని చెప్పారు. ‘‘హిందూయిజం, ఎడ్యుకేషన్‌, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌, క్రైం గురించి ఈ సినిమాలో చూపించాం. వినోదాత్మకంగా ఉంటుంది’’ అని దర్శకుడు వినోద్‌ చెప్పారు. ఈ నెల 17న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.
entertainment
14,133
14-06-2017 16:50:39
రాష్ట్రపతి అభ్యర్థిపై.. ప్రతిపక్ష పార్టీల చర్చలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిపై ప్రతిపక్ష పార్టీలు చర్చలు జరిపాయి. ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో బుధవారం విపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గులామ్ నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గె నేతృతంలో ఈ చర్చలు జరిగాయి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, వామపక్ష, ఎన్సీపీ తదితర ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు ఇందులో పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి అంశంపై ప్రధానంగా చర్చించారు.
nation
3,360
08-09-2017 02:52:47
జ్ఞానోదయం!
పాకిస్థాన్‌ భూభాగం నుంచి లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ వంటి ఉగ్రసంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నమాట నిజమేనని ఆ దేశ విదేశాంగ మంత్రి ఖ్వాజా ఆసీఫ్‌ ఇప్పటికైనా అంగీకరించినందుకు సంతోషం. ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్‌ స్థావరంగా మారిదంటూ భారతదేశం దీర్ఘకాలంగా చేస్తున్న వాదనకు అమెరికా సహా పలుదేశాలు మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్‌ ఎట్టకేలకు ఈ వాస్తవాన్ని అంగీకరించింది. ఈ సంస్థలను పాకిస్థాన్‌ ఇప్పటికే నిషేధించి, నియంత్రించే పనిలో ఉన్నదని ఆసీఫ్‌ చెప్పుకొచ్చారు. ఇందులో నిజాయితీ ఎంతన్నది అటుంచితే, ఉగ్రసంస్థలను ఏరిపారేసే వరకూ తనదేశం మిగతా ప్రపంచం నుంచి సూటిపోటి మాటలు పడక తప్పదని గుర్తించినందుకు సంతోషించాలి. ఆసీఫ్‌ వ్యాఖ్యల ఆధారంగా ఈ సంస్థల ఏరివేతకు పాకిస్థాన్‌ నడుంబిగించబోతున్నట్టు పొరబడనక్కరలేదు. మారుతున్న భౌగోళిక రాజకీయాలకు అనుగుణంగా అడుగులు వేయకతప్పదన్న స్పృహ ఆ దేశానికి కలిగినట్టు అనుకోవచ్చు. చైనాలో బ్రిక్స్‌ సదస్సు జరిగిన రెండురోజులకే ఆసీఫ్‌ నోటివెంట ఈ మాటలు రావడంతో ఇదంతా ఆ సదస్సు తీర్మానం ప్రభావమేనని అనిపించడం సహజం. బ్రిక్స్‌ తీర్మానంలో ప్రస్తావించిన ఉగ్రవాద సంస్థల జాబితాలో పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థల పేర్లు ఉండటమూ, ఈ సంస్థలను నియంత్రించాల్సిన బాధ్యత ఆయా దేశాలదేనంటూ తీర్మానంచెప్పడంతో పాకిస్థాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టు చెప్పుకున్నాం. ఆసీఫ్‌ తన వ్యాఖ్యల్లో బ్రిక్స్‌ తీర్మానాన్ని తేలికగానే తీసిపారేశారు. మిగతాదేశాలు కూడా ఉన్నందున దీనిని చైనా వ్యక్తిగత అధికారిక అభిప్రాయంగా చూడనక్కరలేదని ఆయన వాదన. పనిలోపనిగా చైనా విదేశాంగశాఖ అధికారి కూడా ఒక సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ తీర్మానాన్ని పాకిస్థాన్‌కు వ్యతిరేకమైనదిగా అనుకోవడమో, చెప్పుకోవడమో తప్పని అంటూ, జాబితాలో ఉన్న ఉగ్రసంస్థలన్నీ ఐక్యరాజ్యసమితి గతంలో నిషేధించినవే తప్ప బ్రిక్స్‌ కొత్తగా అందులో చేర్చినవేమీ లేవని తేల్చేశారు. ఈ తీర్మానం బాధంతా అఫ్ఘానిస్థాన్‌ గురించే తప్ప మరో దేశంతో ముడిపడినది కాదని కూడా వివరణ ఇచ్చారు. నిజానికి సంయుక్త ప్రకటనలో చేర్చవలసిన అంశాలంటూ భారతదేశం ఓ 10 పేజీల డిమాండ్లు ముందుపెట్టి తీవ్ర ఒత్తిడిచేసినా చైనా లొంగకుండా పాకిస్థాన్‌ను కాపాడుకొచ్చిన విషయాన్ని ఆ అధికారి చెప్పుకొచ్చారు. ఉగ్రవాదంపై పోరు విషయంలో పాకిస్థాన్‌ ఎంతటి త్యాగాలు చేస్తున్నదో, ఎన్ని కష్టాలు పడుతున్నదో తనకు తెలుసనీ, సర్వకాల సర్వావస్థలందూ తాను పాకిస్థాన్‌ పక్షానే ఉంటానని చైనా ఓ హామీ కూడా ఇచ్చింది. పాకిస్థాన్‌ విదేశాంగమంత్రి నేడు చైనాలో పర్యటించబోతున్న నేపథ్యంలో చైనా ఈ వివరణ ఇచ్చి వుండవచ్చునని అనిపిస్తున్నది. బ్రిక్స్‌ తీర్మానమే ప్రధానంగా ఆసీఫ్‌ నేరాంగీకారానికి కారణం కాకున్నా, తన కారణంగా అంతర్జాతీయ వేదికల్లో మిత్రదేశం పడుతున్న ఇబ్బందిని పాకిస్థాన్‌ గుర్తిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై పెరుగుతున్న వ్యతిరేకత కారణంగా తనను ఇంతకాలమూ గుడ్డిగా వెనకేసుకొచ్చిన దేశాలు కూడా తనను కాపాడలేని దశకు చేరుకుంటున్నాయని పాకిస్థాన్‌ గుర్తిస్తున్నది. దాని విషయంలో అమెరికా వైఖరి ఇప్పటికే పూర్తిగా మారిపోయింది. అమెరికా ట్రంప్‌, భారత్‌ మోదీ సాన్నిహిత్యం కొత్తపుంతలు తొక్కుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌ వరుసగా అమెరికా చేత చీవాట్లు తింటున్నది. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు పాకిస్థాన్‌ను ఉగ్రవాదం విషయంలో చెడామడా ఏకిపారేసి, అఫ్ఘానిస్థాన్‌లో భారత్‌ పాత్రను అమాంతంగా పెంచేశారు. ఇది పాకిస్థాన్‌ కంటే చైనాకు అత్యంత ఆందోళన కలిగిస్తున్నది. అందువల్ల, ట్రంప్‌ వ్యాఖ్యలపై ఎదురుతిరిగినా, దౌత్యపర్యటనలు రద్దుచేసుకొని ఆగ్రహం ప్రదర్శించినా, ఉగ్రవాదం విషయంలో అమాయకత్వం నటించినా ఇకపై ప్రయోజనం ఉండబోదని పాకిస్థాన్‌కు అర్థమైంది. కాస్తంత నేరాంగీకారంతో పాటు కాలంతో పాటు మారుతున్నట్టుగా కనిపించడమే ఉత్తమం. ఉగ్రవాదంతో పాకిస్థాన్‌ బావుకున్నదేమీ లేదనీ, నష్టపోయిందే అధికమని ఆసీఫ్‌ ఈ ఇంటర్వ్యూలో అన్నారు. తన దేశం ఈ దుస్థితిలోకి జారిపోవడానికి ఇప్పుడు తమను వెలెత్తిచూపుతున్న అమెరికా కారణమంటూ పరోక్షవిమర్శలు కూడా చేశారు. సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా అమెరికా వేసిన ఎత్తుల్లో ఆఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌లు పావులుగా మారిపోయిన విషయం గుర్తుచేశారు. యాభై అరవైయేళ్ళ పాటు అమెరికాతో అంటకాగినందువల్ల లాభపడిందేమీ లేదనీ, పాకిస్థాన్‌ ప్రస్తుతం తన నెత్తిన ఈ గతాన్ని మోస్తున్నదనీ, దానిని సత్వరమే దించుకొని బాగుపడే ప్రయత్నం చేస్తుందని అంటున్నారాయన.  మూడురోజులపాటు జరిగిన పాకిస్థాన్‌ దౌత్యవేత్తల సమావేశం కూడా ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల్లో వచ్చిన మార్పునే ప్రధానంగా చర్చించింది. గతాన్ని వదల్చుకొని కొత్తదారిలో సాగుతామంటే దానర్థం అమెరికాతో పాటు ఉగ్రవాదాన్ని కూడా వదల్చుకోవడమేనా అన్నది చూడాలి. అత్యంత శక్తిమంతమైన సైన్యమే అన్ని విధానాలనూ నిర్దేశిస్తున్నందున ఉగ్రసంస్థలను కాలదన్నడం పాకిస్థాన్‌కు సులభమైన విషయం కాదు. ఆసీఫ్‌ ఈ వ్యాఖ్యలు చేయడానికి కొద్ది ముందే ఆ దేశ సైనికాధికారి కశ్మీర్‌ విముక్తి పోరాటానికి మద్దతు ప్రకటిస్తూ భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇకపై చైనాను ఇరుకున పెట్టకుండా తనపక్షాన నిలుపుకోవాలన్న ఆలోచన ఉత్తమమైనదే అయినా ఉగ్రవాద సంస్థల విషయంలో పాకిస్థాన్‌ పౌరప్రభుత్వం చేయగలిగింది తక్కువే. నిజానికి గత ఏడాది అక్టోబర్‌లోనే పాక్‌ విదేశాంగ కార్యదర్శి ఒక రహస్య సమావేశంలో ఇదేరకమైన హెచ్చరిక చేశారు. ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ పోరును అమెరికా, ఈయూ ఇత్యాది దేశాలు కంటితుడుపు చర్యగా చూస్తున్నాయనీ, ఈ సంస్థల విషయంలో నిర్దిష్టంగా, కఠినంగా వ్యవహరించని పక్షంలో పాకిస్థాన్‌ దౌత్యపరంగా ఒంటరి అయిపోతుందని హెచ్చరించారు ఆయన. ప్రధాని పాల్గొన్న ఈ రహస్య సమావేశం వివరాలు డాన్‌ పత్రికలో రావడంతో అనవసరపు వివాదం రేగి అసలు సమస్య వెనక్కుపోయింది. ఇప్పుడు అదే జరుగుతోంది. చైనా, సౌదీ అరేబియా, టర్కీ ఇత్యాది పాక్‌ మిత్రదేశాలు దానిపక్షాన నిలవడానికి జంకుతున్న స్థితి ఏర్పడుతున్నది. అమెరికా, అఫ్ఘానిస్థాన్‌, భారత్‌లకు వ్యతిరేకంగా పనిచేసే ఉగ్రసంస్థలకు ఆశ్రయం ఇస్తూ, ఇందుకు ప్రతిగా తానూ ఉగ్రవాదాన్ని అనుభవిస్తూ ఇదేరీతిన సాగేకంటే తన రక్షణ, దౌత్య విధానాలను ప్రజాశ్రేయస్సు లక్ష్యంగా, దేశాభివృద్ధి కేంద్రకంగా తీర్చిదిద్దుకుంటే పాకిస్థాన్‌కు మేలు జరుగుతుంది.
editorial
17,316
07-10-2017 19:30:20
అందరికీ అందుబాటులోకి డిజిటల్ అక్షరాస్యత : మోదీ
న్యూఢిల్లీ : ఆబాల గోపాలానికి డిజిటల్ అక్షరాస్యతను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. గాంధీనగర్ ఐఐటీలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ రోజుల్లో డిజిటల్ విభజనను (డిజిటల్ టెక్నాలజీ కొందరికి అందుబాటులో లేకపోవడం) భరించడం సాధ్యం కాదన్నారు.  సమాజంలోని అన్ని వర్గాలకు, అన్ని వయసుల వారికి డిజిటల్ అక్షరాస్యతను చేరువ చేస్తామన్నారు. ఆయన రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం గుజరాత్ వచ్చారు. డిజిటల్ ఇండియా పారదర్శకతకు హామీ ఇస్తుందని మోదీ చెప్పారు. దీనివల్ల సేవలు సక్రమంగా అందుతాయని, సుపరిపాలన సాధ్యమవుతుందని వివరించారు. విద్యా రంగం కేవలం పరీక్షల దృష్టితో మాత్రమే ఉండకూడదని, నవ కల్పనలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ‘‘మీరు ఐఐటియన్లు, నేను నా చిన్నతనంలో టీ-యిన్‌ను (టీ అమ్మాను). కొన్ని సంవత్సరాల క్రితం ఇదే రోజున నేను మొదటిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. అప్పటి వరకు నేను ఎన్నడూ ఎమ్మెల్యేను కాను. నేను ఏం చేసినా, అత్యుత్తమ సామర్థ్యంతో చేయాలని ఆనాడే నిర్ణయించుకున్నాను’’ అని మోదీ చెప్పారు.
nation
13,902
18-07-2017 01:33:25
నాటి పోస్టర్‌ బోయ్‌.. కాబోయే ఉప రాష్ట్రపతి
వెంకయ్య అలుపెరుగని రాజకీయ ప్రస్థానంజై ఆంధ్ర ఉద్యమం, ఎమర్జెన్సీలో పోరాటంఉదయగిరి ఎమ్మెల్యేగా రాజకీయ అరంగేట్రంన్యూఢిల్లీ, హైదరాబాద్‌, నెల్లూరు, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ఒకనాడు వాజపేయి, ఆడ్వాణీల వాల్‌ పోస్టర్లు అతికించారాయన! అలాంటిది ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి ఆయనే అర్హుడని ముక్తకంఠంతో తీర్మానించారు అగ్రనేతలంతా! సాధారణ కుటుంబంలో పుట్టి సామాన్య కార్యకర్తగా పయనం ప్రారంభించిన ఆయన.. విశాఖలో విద్యార్థి నేతగా ఉద్యమ పథంలో ఉవ్వెత్తున ఎగిశారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వెనకడుగు వేయక.. దీక్షాదక్షతలతో ముందుకు సాగిన ఆయన దేశ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. ఆయనే ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ముప్పవరపు వెంకయ్యనాయుడు. రాజకీయ నాయకులన్న తర్వాత ఉత్థాన పతనాలుంటాయి. కానీ, ఏనాడూ పార్టీలు మారని వెంకయ్యనాయుడు తన గ్రాఫ్‌ను చక్కగా నిలుపుకున్నారు. సాధారణంగా ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వారు రెండో సారి గెలిచినా మెజారిటీ కొంతైనా తగ్గుతుంది. కానీ 1983 ఎన్నికల్లో ఆయన రెండోసారి గెలిచినప్పుడు రెట్టింపు మెజారిటీ అంటే 20 వేల ఓట్లతో గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలే చందాలతో పాటు ఓట్లు వేసుకుని గెలిపించారు. రెండోసారి పోటీ చేసినప్పుడు ఎన్టీఆర్‌ ప్రభంజనం ఉధృతంగా ఉన్నా గెలుపు సాధించి అసెంబ్లీలో తన వాణి వినిపించారు. 1949 జూలై 1న జన్మించిన వెంకయ్య నెల్లూరు వీఆర్‌ హైస్కూలులో పాఠశాల విద్యను అభ్యసించారు. వీఆర్‌ కాలేజీలో పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో న్యాయ శాస్త్రాన్ని అభ్యసించారు. విశాఖలోనే ఆయన రాజకీయ ప్రస్థానానికి బీజం పడింది. అఖిల భారత విద్యార్థి పరిషత్‌లో చేరి విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధికి కృషి చేశారు. వర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడిగా ఎన్నికయ్యారు. స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సె్‌స)లో స్వయంసేవక్‌గా కీలక పాత్ర పోషించారు. కాకాని వెంకటరత్నం నేతృత్వంలో 1972లో ప్రారంభమైన జై ఆంధ్ర ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించారు.  ఆ సమయంలో వెంకయ్యకు మంచి గుర్తింపు వచ్చింది. సోషలిస్టు నేత జయప్రకాశ్‌ నారాయణ్‌ అవినీతికి వ్యతిరేకంగా స్థాపించిన ఛత్ర సంఘర్ష్‌ సమితికి ఆంధ్రప్రదేశ్‌ కన్వీనర్‌గా 1974లో నియమితులయ్యారు. ఆ తర్వాత కాలంలో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లారు. జైలు నుంచి విడుదలయ్యాక 1977లో జనతా పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అక్కడి నుంచి రాజకీయంగా వెనుదిరిగిచూసుకోలేదు. వెంకయ్యనాయుడు ఉదయగిరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978, 1983లలో గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు.  అనంతర కాలంలో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి 1998లో కర్నాటక నుంచి మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004లో రెండో సారి, 2010లో మూడోసారి అదే రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లారు. 1999లో వాజ్‌పేయి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ సభ్యునిగా వ్యవహరిస్తున్న వెంకయ్య కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. అంతేకాదు తెలుగు ప్రజలకు దేశ రాజధానిలో పెద్ద దిక్కు అయ్యారు. నినాదాలు ఇవ్వడంలో వెంకయ్య ఆయనకు ఆయనే సాటి. మోదీ అంటే ‘మేకింగ్‌ ఆఫ్‌ డెవలప్డ్‌ ఇండియా’ అనే నినాదం ఆయనదే. ఇప్పుడది మోదీ సర్కారు అధికార నినాదమైంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు వారధిగా నిలిచి.. పార్లమెంటు సజావుగా సాగడానికి కృషి చేశారు. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందడంలో వెంకయ్య కృషి మరువలేనిది. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా స్మార్ట్‌ సిటీ, అమృత్‌, స్వచ్ఛ భారత్‌, అందరికీ ఇళ్లు వంటి పథకాలను ప్రవేశపెట్టారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తన ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన విజయవంతం అయింది. సాధారణ రైతు కుటుంబం నుంచి..వెంకయ్య సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు. రాజకీయ వారసత్వం లేదు. నిబద్ధత.. క్రమశిక్షణే ఆలంబన. మహాత్ముల ఆశయాలు, ఆలోచనలే మార్గదర్శకాలు. స్వయంకృషితో ప్రకాశిస్తూ అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు ఎదిగారు. ఎన్నో పదవులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించిన ఆయన వాగ్ధాటి, చతురతతో మాటల మాంత్రికుడిగా పేరొందారు. మాతృ భాష అంటే ఎంతో మమకారం చూపే ఆయన బహుభాషా కోవిదుడు. ఉదయగిరి నుంచిరాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన సింహపురి బిడ్డగా ఎనలేని ఆదరణ సంపాదించుకున్నారు. నెల్లూరు జిల్లా తమిళనాడు సరిహద్దులో ఉన్న ప్రభావమో ఏమో కాని ఆ ప్రాంతంలో అత్యధికులు లుంగీ (అడ్డపంచె) కడతారు. వెంకయ్య కూడా నెల్లూరు పంచెకట్టును మాత్రం మానలేదు. నెల్లూరు యాస, భాష, మాట, ప్రాస అన్ని కూడా ఆయన ప్రసంగాల్లో చోటు చేసుకోవడంతో జనం ఆయన ప్రసంగాలు వినేందుకు ఎంతో ఆసక్తి చూపుతారు. పేరు: ముప్పవరపు వెంకయ్యనాయుడుతల్లిదండ్రులు : రంగయ్యనాయుడు, రమణమ్మవివాహం: 1971, ఏప్రిల్‌ 14 భార్య: ఉషమ్మపిల్లలు: దీపావెంకట్‌, హర్షవర్ధన్‌చదువు : డిగ్రీ, లా ప్రధాన ఘట్టాలు, పదవులు1973-74 : ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల అధ్యక్షుడు1974-75 : లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ యువజన చాత్ర సంఘర్ష్‌ సమితి ఆంధ్రప్రదేశ్‌ కన్వీనర్‌1977-80 : జనతా పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు1978: ఉదయగిరి ఎమ్మెల్యేగా ఎన్నిక1983 : రెండోసారి ఉదయగిరి ఎమ్మెల్యేగా, లెజిస్లేచర్‌ పార్టీ నేతగా బాధ్యత ఎన్నిక1980-83 : బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి1988-93 : ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు1993-2000 : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి1998 : కర్నాటక నుంచి రాజ్యసభకు ఎన్నిక 2015లో : రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ సభకు ఎన్నిక2000-2002 : ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి2002-2004 : బీజేపీ జాతీయ అధ్యక్షుడు2014 నుంచి : నరేంద్ర మోదీ కేబినెట్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, సమాచార శాఖామంత్రి
nation
5,879
21-10-2017 18:46:04
ఈ ముద్దుగుమ్మకు అది అంత సేఫ్ కాదట !
వరుస విజయాలను ఎంజాయ్ చేస్తున్న ఆ ముద్దుగుమ్మ ఫిట్‌నెస్‌పై అంతగా ఫోకస్ చేయడం లేదట. అమ్మడు బాడీ లుక్‌పై దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో కష్టాలు తప్పవని సినీజనం చెవులు కొరుక్కుంటున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ..?హీరోయిన్లకు హిట్స్ ఎంత ముఖ్యమో ఫిజిక్‌ను స్లిమ్‌గా మెయిన్‌టేన్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఏ మాత్రం బరువు పెరిగినా ముద్దుగుమ్మలను పక్కనపెట్టేస్తుంటారు స్టార్ హీరోలు, దర్శకులు. అందుకే హిట్స్ లేకపోయినా ఫిట్‌నెస్ విషయంలో ఎంతగానో కేర్ తీసుకుంటుంటారు మన ముద్దుగుమ్మలు. ఇందుకోసం పక్కా డైట్‌తో పాటు గంటల తరబడి జిమ్‌లో గడుపుతుంటారు.  అయితే అప్‌కమింగ్ బ్యూటీ మెహ్రీన్ ఈ విషయంలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోవడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫిట్‌నెస్ విషయంలో దృష్టి పెట్టకపోవడం వల్లే ఆర్తి ఆగర్వాల్, హన్సిక వంటి భామలు తెలుగులో తొందరగా ఫేడౌట్ అయిపోయారనే టాక్ ఉంది. ప్రస్తుతం మెహ్రీన్ కూడా ఫిట్‌నెస్ విషయంలో అంతగా దృష్టి పెట్టకపోవడంతో ఈమె కూడా వారి జాబితాలో చేరిపోతుందేమో అనే ప్రచారం జరుగుతోంది. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించిన మెహ్రీన్ రీసెంట్‌గా రిలీజైన 'మహానుభావుడు', 'రాజా ది గ్రేట్' సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకుంది. అయితే 'రాజా ది గ్రేట్' సినిమాలో ఆమె లావుగా కనిపిస్తోందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. అప్‌కమింగ్ హీరోయిన్ ఇంత తొందరగా బరువు పెరగడం మంచిదికాదని అమ్మడు ఈ విషయంలో దృష్టి పెట్టకపోతే ఫ్యూచర్ కష్టమే అని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి వరుస విజయాలను ఎంజాయ్ చేస్తున్న మెహ్రీన్ బాడీ లుక్‌పై శ్రద్ధ పెట్టాల్సిన సమయం తొందరగానే వచ్చినట్టు కనిపిస్తోంది.
entertainment
1,871
08-08-2017 02:06:25
సుబాబుల్‌ రైతుకు కష్టాలు
కొనుగోళ్లు పూర్తిగా బంద్‌తాజాగా జిఎ్‌సటి సాకుకంచికచర్ల: ఆంధ్రప్రదేశ్‌లో సుబాబుల్‌ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. సుబాబుల్‌ కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఏ మాత్రం స్పందన లేదు. రైతులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ మార్కెటింగ్‌ శాఖ అఽధికారులు కూడా పట్టించుకోవటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు తప్పితే పరిస్థితిపై సమీక్ష కూడా చేయటం లేదు. మార్కెట్‌ యార్డుల్లో కాకుండా తక్కువ ధరకు రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ సర్టిఫికెట్‌ (ఆర్‌సి) పై కొనుగోలు చేసేందుకు ఒక ప్రముఖ కంపెనీ తెర వెనుక ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసింది.  మరోవైపు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు ఒకట్రెండు సార్లు సమావేశాలు నిర్వహించి ధరలు పెంచి కొనుగోళ్లు చేయాలని కంపెనీలను ఆదేశించినా అది ఎక్కడా అమలు కావడం లేదు. ఏడాది నుంచి తూతూమంత్రంగా సుబాబుల్‌ కర్ర కొంటున్న కంపెనీలు ప్రస్తుతం పూర్తిగా నిలిపివేశాయి. జిఎ్‌సటి కారణంగా వే బిల్లుల సమస్య ఏర్పడిందంటూ ఐటిసి గత నెల చివరి వారం నుంచి కర్ర కొనటం లేదు. కొద్ది రోజుల నుంచి ఎపిపిఎం కూడా అదేబాట పట్టింది. టన్నుకు 4,400 రూపాయల ధరకు గాను చేతికి నికరంగా మూడు వేల రూపాయలు కూడా దక్కని దుస్థితి నెలకొన్నది. కంపెనీల దోపిడీని అరికట్టాల్సిందిగా రైతులు పోరాటం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. కంపెనీలు ఆడిందే ఆటగా పాడిందే పాటగా తయారైంది. కంపెనీల మాయాజాలంలో చిక్కుకున్న రైతుల గోడు ఆలకించే నాధుడే కనిపించటం లేదు.   జనవరి నుంచి జూలై వరకు 2016లో నందిగామ ఎఎంసి పరిధిలో 2,39,774 టన్నుల సుబాబుల్‌ కర్ర కొనగా, 2017లో అదే కాలానికి నామమాత్రంగా 40,875 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు.కంచికచర్ల ఎఎంసి పరిధిలో 2016లో జూలై వరకు 50,208 టన్నులు కొనగా, ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 18 వేల టన్నులు మాత్రమే కొన్నారు. ఆర్‌సిపై కొనుగోళ్లకు కుట్రఆర్‌సి (రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌) పై కొనుగోళ్లకు ఒక ప్రముఖ కంపెనీ ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే పక్కనే గల ఖమ్మం జిల్లాలో ఆర్‌సిపై తక్కువ ధరకు సుబాబుల్‌ కర్ర కొనుగోలు చేస్తున్నది. ఈ విధానంలో కంపెనీ నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయదు. ట్రేడ్‌ లైసెన్సు ఉన్న దళారులతో కాంట్రాక్టు కుదుర్చుకోవటంతో కంపెనీలకు వీలైనంత తక్కువ ధరకు కర్ర లభ్యమవుతుంది. మరోవైపు తెలంగాణాలోని సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ పేపర్‌ మిల్లు కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలోని రైతులకు కుచ్చుటోపీ పెట్టింది.  ఆ కంపెనీ నుంచి దాదాపుగా 11 కోట్ల రూపాయలకు పైగా రావాల్సి ఉంది. మిల్లు మూతబడటం, పైగా బ్యాంకులు సీజ్‌ చేయటం, కోర్టులో కేసులు నడుస్తుండటంతో రైతులకు సొమ్ములు రావటం లేదు. మూడేళ్ల నుంచి నిరీక్షిస్తున్న రైతులు, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ నుంచి హామీ లభించటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొనుగోళ్లు బంద్‌ అయినందున తాము పడుతున్న ఇబ్బందులు, నష్టాలను దృష్టిలో పెట్టుకుని తక్షణమే పాలకులు, అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు. కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
business
18,733
22-05-2017 03:17:55
త్వరలో సర్జికల్‌ స్ర్టైక్స్‌ 2.0!
కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌న్యూఢిల్లీ, మే 21: నియంత్రణ రేఖ ఆవల.. ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం మరోసారి సర్జికల్‌ దాడులు నిర్వహించనుందా? ఇందుకు ముహూ ర్తం కూడా ఖరారైందా? కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన ‘ఇండియా టుడే ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ కాన్ఫరెన్స్‌’లో పాల్గొన్న జితేంద్రసింగ్‌ పాక్‌ ప్రోత్సాహిత ఉగ్రవాదంపై ఓ ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ‘‘తొలిసారి సర్జికల్‌ దాడులు నిర్వహించినప్పుడు పని పూర్తయిన తర్వాతే విషయం వెల్లడించాం. ఇప్పుడూ అంతే. తప్పకుండా తిరుగులేని నిర్ణయాన్ని తీసుకుంటాం. అయితే అదేమిటో ఇప్పుడు చెప్పం. అవసరమైన మేరకు అవసరమైన చర్యలను భద్రతా సంస్థలు(సైన్యం) తీసుకుంటాయి’’అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలను చూస్తుంటే రెండో దఫా సర్జికల్‌ స్ర్టైక్స్‌కు ప్రధాని మోదీ ప్రభుత్వం సంసిద్ధమైనట్లుగా అవగతమవుతోందని విశ్లేషకులు అంటున్నారు.
nation
13,752
25-11-2017 17:14:24
‘కౌగిలింతల దౌత్యం విఫలమైంది’
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. 2008 నవంబరు 26న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి సూత్రధారి హఫీజ్ సయీద్‌ను పాకిస్థాన్ విడుదల చేసిన నేపథ్యంలో రాహుల్ ట్విటర్ వేదికగా మోదీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ కౌగిలింతల దౌత్యం విఫలమైందని ఎద్దేవా చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ పాక్ మిలిటరీ ఫండింగ్‌ను లష్కరే తొయిబా నుంచి వేరు చేశారన్నారు. మోదీ, ట్రంప్ మరిన్నిసార్లు కౌగిలించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను గృహ నిర్బంధం నుంచి ఈ నెల 24న విడుదల చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వం సరైన సాక్ష్యాధారాలను సమర్పించలేదని చెప్తూ హైకోర్టు హఫీజ్‌ను విడుదల చేసింది.
nation
5,487
14-09-2017 09:47:42
‘జై లవకుశ’లో నివేదా పాత్ర పేరు ఇదే...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న తొలి సినిమా ‘జై లవకుశ’. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రాశీఖన్నాతో పాటు నివేదా థామస్ నటిస్తోంది. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో తన పాత్ర పేరును బయటపెట్టింది నివేదా. ఎన్టీఆర్ చేస్తున్న జై, లవ, కుశ మూడు పాత్రల్లో జైకు జోడీగా నివేదా నటిస్తున్న విషయం తెలిసిందే. రావణుడి లక్షణాలున్న జైకు జోడీగా నటిస్తున్న నివేదా పాత్ర పేరు ఓ సీనియర్ హీరోయిన్ పేరు అవడం విశేషం. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి సీనియర్ హీరోలతో నటించిన సిమ్రన్ పేరును ‘జై లవకుశ’లో నివేదా పాత్రకు పెట్టారు. ‘సిమ్రన్ సూన్’ అంటూ ‘జై లవకుశ’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేసి తన పాత్ర పేరును బయటపెట్టింది నివేదా. రావణుడి పక్కన సిమ్రన్ ఎలా కనిపించబోతోందో వేచి చూద్దాం.
entertainment
16,526
01-09-2017 02:54:44
8 మంది ఔట్‌!
రేపే కేంద్ర కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ?ఆర్థిక మంత్రిగా పీయూష్‌.. జైట్లీ రక్షణకు పరిమితం?ఐదుగురి రాజీనామా.. నిర్మలకు పార్టీ పదవి.. కొత్తగా మరో 8 మందికి అవకాశం!సూపర్‌ శాఖగా రవాణా.. రైల్వే విలీనం.. సురేశ్‌ ప్రభు, అశోక్‌ శాఖల మార్పుఆంధ్రప్రదేశ్‌ నుంచి హరిబాబుకు పదవి.. ‘కొత్త మిత్రుడు’ జేడీయూకు చోటున్యూఢిల్లీ, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. శనివారం కేబినెట్‌ను విస్తరించే అవకాశం ఉంది. 8 మందికి పదవీ గండం ఉంటే.. 8 మందికి కొత్తగా అవకాశాలు రావచ్చు. మరో ఏడెనిమిది మంది శాఖలు మార్చే అవకాశం ఉంది. మొత్తం మీద పునర్వ్యవస్థీకరణతో 25 మందిపై ప్రభావం ఉంటుందని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఐదుగురు మంత్రులు రాజీనామా చేశారు. వారిలో స్కిల్‌ డెవల్‌పమెంట్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ శాఖ మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ, జల వనరుల శాఖ సహాయ మంత్రి సంజీవ్‌ బల్యాన్‌ రాజీనామాలను ఆమోదించారు కూడా. బిహార్లో జేడీయూ మంత్రివర్గంలో చేరడానికి రూడీ మార్గం సుగమం చేశారని విశ్లేషకులు అంటుంటే.. ఆయనకు పార్టీ పదవిని అప్పగించనున్నారని బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక, జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి ఆరోగ్య కారణాలు చూపి రాజీనామా చేస్తే.. పార్టీ ఆదేశాల మేరకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఫగన్‌ సింగ్‌ కులస్తే, మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ శాఖ సహాయ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను ఇంకా ఆమోదించాల్సి ఉంది.  అలాగే, వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌ సింగ్‌కు పదవీ గండం తప్పదని అంటున్నారు. ఆయనతోపాటు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ శాఖ మంత్రి కలాజ్ర్‌ మిశ్రా కూడా రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. వీరిలో నిర్మలా సీతారామన్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అత్యంత విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, రోడ్డు రవాణా, హైవేలు, షిప్పింగ్‌ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి రైల్వే శాఖను అప్పగించనున్నారు. ఇటీవలి వరుస రైలు ప్రమాదాల నేపథ్యంలో ఆ శాఖ మంత్రి సురేశ్‌ ప్రభుకు స్థాన చలనం తప్పట్లేదు. ఆయనతోపాటు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు శాఖను కూడా మార్చనున్నారు.  విద్యుత్తు శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు పదోన్నతి ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఆర్థిక, రక్షణ శాఖల బాధ్యతలు చూస్తున్న అరుణ్‌ జైట్లీకి రక్షణ శాఖను పూర్తి స్థాయిలో అప్పగించి, పీయూష్‌కు ఆర్థిక శాఖ అప్పగించనున్నారు. ఏపీ నుంచి బీజేపీ తరఫున కంభంపాటి హరిబాబుకు అవకాశం ఉందంటున్నారు. టీడీపీ కేబినెట్‌లో చేరుతుందా లేదా అనే దానిపై సందిగ్ధం కొనసాగుతోంది. అలాగే, జేడీయూకు ఒక కేబినెట్‌, రెండు సహాయ మంత్రి పదవులు ఇవ్వనుండగా, అన్నాడీఎంకే చేరికపై ఇంకా సందిగ్ధం వీడలేదు. కేబినెట్లో చేరేది లేదని ఎన్సీపీ స్పష్టం చేసింది. మోదీతో అమిత్‌ షా భేటీబీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో గురువారం భేటీ అయ్యారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అంతకుముందు ఎనిమిది మంది మంత్రులు అమిత్‌ షాతో భేటీ కావడం గమనార్హం. అరుణ్‌ జైట్లీ, నిర్మలా సీతారామన్‌, జితేంద్రసింగ్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌, పీపీ చౌదరి, ధర్మేంద్ర ప్రధాన్‌ తదితరులు షాను కలిసిన వారిలో ఉన్నారు. కాగా, గుజరాత్‌ ఎన్నికలపై చర్చించడానికే ఆ రాష్ట్ర ఇన్‌చార్జిలు, కేంద్ర మంత్రులు అమిత్‌ షాతో భేటీ అయ్యారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.  మరోవైపు, కేబినెట్‌ విస్తరణ ఎప్పుడైనా జరగొచ్చని, మరికొద్ది రోజులే తాను రక్షణ మంత్రిగా కొనసాగే అవకాశాలున్నాయని అరుణ్‌ జైట్లీ విలేకరులకు తెలిపారు. అన్నాడీఎంకే సీనియర్‌ నేత, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై కూడా అమిత్‌తో భేటీ అయ్యారు. కేబినెట్‌లో తమకూ అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. మోదీ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చినా.. పితృపక్షాల కారణంగా సెప్టెంబరు నెలాఖరు వరకు మంచి రోజులు లేవని, అందుకే 2వ తేదీనే విస్తరణ చేపట్టే అవకాశాలున్నట్టు బీజేపీ ముఖ్య నేత తెలిపారు. యూపీ బీజేపీ అధ్యక్షుడిగా మహేంద్ర పాండేఉత్తరప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర సహాయ మంత్రి మహేంద్ర పాండేను అమిత్‌షా నియమించారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న కేశవప్రసాద్‌ మౌర్య డిప్యూటీ సీఎం కావడంతో మహేంద్ర పాండేను నియమించాల్సి వచ్చింది. దీంతో పాండేకు పదవీ గండం ఉందన్న వార్తలూ వినవస్తున్నాయి.
nation
16,381
28-04-2017 22:01:34
ఆదిమ గిరిజన తండాకు చెందిన విద్యార్థినికి.. కేంద్ర మంత్రి అభినందన
న్యూఢిల్లీ: ఆదిమ గిరిజన తెగ సమూహం మాన్కిడియాకు చెందిన ఓ బాలిక తొలిసారిగా పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. దీంతో గిరిజన విద్యార్థిని మోనికాను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం అభినందించారు. ఉన్నతంగా చదివి రాణించాలని ఆయన ఆకాంక్షించారు.
nation
15,185
02-02-2017 04:25:24
అభివృద్ధి పథంలో ఓ నూతన శకం : అమిత్ షా
ఈ బడ్జెట్‌.. అభివృద్ధి పథంలో ఓ నూతన శకం. అన్ని వర్గాల ప్రజల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్‌ రూపుదిద్దుకుంది. ద్రవ్యలోటును 3.2శాతానికే పరిమితం చేయడం హర్షణీయం. పార్టీలకు నగదు విరాళాన్ని రూ.2వేలకే పరిమితం చేయడం చరిత్రాత్మక నిర్ణయం.-అమిత్ షా
nation
8,336
11-11-2017 18:43:10
బాలీవుడ్‌ బాద్‌షా కుమారుడిపై కరణ్ జోహర్ కామెంట్
 బాలీవుడ్ స్టార్ మూవీ మేకర్ కరణ్ జోహర్ బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్ ఖాన్‌పై కామెంట్ చేశాడు. బాద్‌షా కంటే ఆర్యన్ చాలా గొప్ప సూపర్ స్టార్ అవుతాడని కరణ్ కితాబిచ్చాడు. ఆర్యన్.. షారుక్‌ ఖాన్‌ కుమారుడు కదా.. ఇక అతను స్టార్ కావడంలో పెద్ద గొప్పేముంది అనుకుంటున్నారేమో.. అలా అనుకుంటే మీ అంచనా పూర్తిగా తప్పు. ఆర్యన్‌కు చాలా టాలెంట్ ఉంది.. కేవలం ఆ టాలెంట్‌తోనే సూపర్ స్టార్ అవుతాడని కరణ్ చెప్పుకొచ్చాడు. శనివారం రోజు జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన కరణ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
entertainment
14,467
12-02-2017 02:08:55
రావత్‌ లాంటి బాహుబలిని ఓడించండి
ఉత్తరాఖండ్‌లో ప్రచారంలో మోదీ
nation
18,284
19-04-2017 20:20:36
కశ్మీర్‌లో పరిస్థితిని సమీక్షించిన బీజేపీ కోర్ గ్రూప్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం ఆయన నివాసంలో బుధవారంనాడు జరిగింది. పార్టీ కీలక నేతలు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు, జితేంద్ర సింగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా జమ్మూకశ్మీర్‌లోని ప్రస్తుత పరిస్థితిని సమావేశంలో సమీక్షించినట్టు పార్టీ వర్గాల సమాచారం. జవాన్లపై దాడుల అంశం కూడా ఈ సమావేశంలో చర్చించారని తెలిసింది. కాగా, కశ్మీర్‌లో సోమవారంనాడు హింసాకాడ చెలరేగిన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు లోయలోని కశ్మీర్ యూనివర్శిటీ, కాలేజీలు రెండవరోజైన బుధవారంనాడు కూడా మూతపడ్డాయి
nation
1,475
29-05-2017 03:47:28
జిఎస్‌టితో మరింత ఊపు
మోదీ సర్కార్‌ మూడు వసంతాలు పూర్తి చేసుకుంది. ఇదే సమయంలో స్టాక్‌ మార్కెట్‌ రేసు గుర్రంలా పరుగెడుతోంది. త్వరలో అమల్లోకి వచ్చే జిఎ్‌సటి.. ఇండెక్స్‌లను మరింత ముందుకు తీసుకెళుతుందని మార్కెట్‌ పండితులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏ కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు బంగారు బాతులుగా మారే అవకాశం ఉందో చెబుతున్నారు. అవేమంటే.. మోదీ సర్కార్‌ అమలు చేస్తున్న అతి పెద్ద సంస్కరణగా జిఎస్‌టిని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ పన్ను అమల్లోకి వస్తోంది. చాలా వస్తు, సేవలపై జిఎస్‌టి పన్ను రేట్లు ఇప్పటికే ఖరారయ్యాయి. జిఎ్‌సటి అమలుతో దేశమంతా ఒకే మార్కెట్‌గా మారిపోనుంది. జిఎస్‌టితో సహా మోదీ సర్కార్‌ చేపట్టిన వివిధ సంస్కరణలతో ఈ మూడేళ్లలో స్టాక్‌ మార్కెట్టూ రికార్డు స్థాయిలో పెరిగింది.  భారీ లాభాలు పంచిన కంపెనీల షేర్లు అనేక కంపెనీల షేర్లు గత మూడేళ్లలో ఇన్వెస్టర్లకు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు పంచాయి. మోదీ సర్కార్‌ అధికారం చేపట్టే నాటికి రూ.23,000 వద్ద ఉన్న ఎంఆర్‌ఎఫ్‌ షేర్లు ఇపుడు దాదాపు రూ.65,391.35 వద్ద ట్రేడవుతున్నాయి. ఐషర్‌ మోటార్స్‌, మారుతి, ఇండియా బుల్‌ హౌసింగ్‌, ఇండోకౌంట్‌, కెన్‌ ఫిన్స్‌ హోమ్స్‌, దాల్మియా భారత, బజాజ్‌ ఫైనాన్స్‌ కంపెనీల షేర్లూ ఇన్వెస్టర్లకు భారీ లాభాలు కూడబెట్టాయి.జూలై 1 నుంచి అమలయ్యే జిఎ్‌సటి స్టాక్‌ మార్కెట్‌కీ బూస్ట్‌లా పని చేస్తుందని మార్కెట్‌ వర్గాల అంచనా. ముఖ్యంగా ఈ కంపెనీల షేర్లు జిఎ్‌సటితో బాగా ప్రయోజనం పొందే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. కోల్‌ ఇండియాజిఎస్‌టితో కోల్‌ ఇండియా అత్యధికంగా లాభపడనుందని విశ్లేషకులు చెబుతున్నారు. కంపెనీ ఉత్పత్తి చేసే బొగ్గుపై పన్ను భారం 11.7 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గనుంది. ఇది కోల్‌ ఇండియాకు బాగా కలిసి రానుంది. దేశంలో ఉత్పత్తి అయ్యే బొగ్గులో 80 శాతం వాటా కోల్‌ ఇండియాదే. ఈ పన్ను భారం తగ్గడం కంపెనీ లాభాలను బాగా పెంచుతుందని అంచనా. ప్రస్తుతం రూ.268.35 దగ్గర కోట్‌ అవుతున్న కోల్‌ ఇండియా షేర్లు వచ్చే ఏడాది కాలంలో రూ.365 వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా. ఆల్‌ కార్గో లాజిస్టిక్స్‌లాజిస్టిక్స్‌ రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీల్లో ఆల్‌ కార్గో లాజిస్టిక్స్‌ ఒకటి. జిఎస్‌టితో అసంఘటిత రంగంలోని లాజిస్టిక్‌ కంపెనీలూ సంఘటిత రంగంలోకి రానున్నాయి. లాజిస్టిక్‌ ఖర్చులూ ప్రస్తుత స్థాయి నుంచి 20 శాతం వరకు తగ్గుతాయి. ఇవన్నీ ఈ కంపెనీకి కలిసి రానున్నాయి. ప్రస్తుతం రూ.178.50 నుంచి రూ.180 మధ్య ఉన్న ఈ కంపెనీ షేరు వచ్చే 12 నెలల్లో రూ.230 వరకు చేరే అవకాశం ఉందని అంచనా. బ్రిటానియాజిఎ్‌సటితో అన్ని ఆహారోత్పత్తులపైనా పన్నుల భారం తగ్గనుంది. ఈ నిర్ణయం తప్పకుండా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమకు మేలు చేస్తుంది. పన్నుల భారం తగ్గడంతో బ్రిటానియా వంటి బిస్కట్ల తయారీ కంపెనీల ఉత్పత్తి వ్యయం తగ్గి లాభాలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లు రూ.3,514-3,555 మధ్య కోట్‌ అవుతున్నాయి. ఈ ధరలో కొనుగోలు చేస్తే ఏడాది కాలంలో ఈ షేర్లు రూ.4,065 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. కోల్గేట్‌టూతపేస్టుపై ఇప్పటి వరకు 22-24 శాతం పన్ను పోటు ఉండేది. జిఎ్‌సటితో ఇది 18 శాతానికి దిగొచ్చింది. కోల్గేట్‌ సహా టూత పేస్టు తయారీ కంపెనీలన్నిటికి ఇది మేలు చేస్తుంది. ఈ రంగంలో కోల్గేట్‌ ప్రధాన కంపెనీ. కంపెనీ బ్యాలెన్స్‌ షీటూ బాగానే ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లు రూ.980-1,000 మధ్య ట్రేడవుతున్నాయి. ప్రస్తుత ధరలో కొన్నా ఈ కంపెనీ షేర్లు ఏడాది కాలంలో రూ.1,180 వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా. బజాజ్‌ కార్ప్‌ లిమిటెడ్‌ఎఫ్‌ఎంసిజి విభాగంలో బజాజ్‌ కార్ప్‌ అత్యంత వేగంగా ఎదుగుతోంది. జిఎస్‌టి శ్లాబులతో ఈ కంపెనీ బాగా లాభపడనుంది. అప్పులు లేకుండా మంచి బ్యాలెన్స్‌ షీట్‌ కలిగి ఉండడం కూడా బజాజ్‌ కార్ప్‌కు కలిసి రానుంది. ప్రస్తుతం రూ.359-365 మధ్య కోట్‌ అవుతున్న ఈ కంపెనీ షేర్లు ఏడాది కాలంలో రూ.450 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా.
business
3,439
15-06-2017 02:25:27
నడిచే జ్ఞానపీఠం
సినారె కలం తిప్పితే కవనంగళం విప్పితే గానంక్లాసు రూములో వారి పాఠంప్రవహించే జ్ఞానపీఠం.హనుమాజిపేట నుంచి హస్తిననుఅజేయమైన అక్షరంతో చేరినవాడువాక్కుకు వయసు లేదంటూసప్తతిని లిప్తలో దాటినవాడువేల పాటలతో గుండె మీటినవాడుగతాన్ని వర్తమానానికి ముడివేసిపదమై, పాదమై, నాదమైఅక్షర వేదమై భాసించినవాడుకలం సాక్షిగా కాలాన్ని గెలిచినవాడుపాటలో ఏమందో చెప్పిమాటలో గుట్టును విప్పినవాడునిత్యం కవిత్వమై మొలకెత్తినిజాల్ని నిర్భయంగా చెప్పినవాడుతుదిశ్వాస వరకు పర్వత శిఖరాలను పలకరిస్తూతన ఎత్తుల్ని కొలుచుకున్నవాడునా తరం మహాకవిగావేలాది సభల్లో పరిమళించినవాడుఇవాళ అస్తమించినారేపు తూర్పున ఉదయిస్తాడువిశ్వ ‘విశ్వంభరు’డై విస్తరిస్తాడుఓ మహాకవీ!మా తరానికి మీరే గొప్ప పురస్కృతి!మీ అక్షరాలకు చేస్తున్నా నమస్కృతి!!- బీరం సుందరరావు
editorial
671
26-04-2017 23:25:04
ద్వితీయార్ధం బేరిష్‌
తిథి: వైశాఖ శుక్ల పాడ్యమినక్షత్రం: భరణిధోరణి: గ్రహగతులను బట్టి నిలకడగా ప్రారంభమై 10.45 నుంచి 1.15 వరకు మెరుగ్గా ట్రేడవుతూ తదుపరి ముగింపు వరకు నిస్తేజంగా కదలాడే ఆస్కారం ఉంది.ఇంట్రాడే ట్రేడింగ్‌కు ప్రారంభ స్థాయి కీలకం. అంతకన్నా దిగువన మాత్రమే షార్ట్‌ పొజిషన్లు శ్రేయస్కరం.
business
1,429
06-10-2017 02:12:00
ఐపిఒ మార్కెట్లో బుల్‌ రన్‌
2017 రికార్డు సంవత్సరంగా మారే అవకాశంరూ.32,500 కోట్ల సమీకరణముంబై: భారత మార్కెట్లో ఐపిఒల జోరు భారీగా పెరిగింది. కంపెనీలు స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌కు పరుగులు తీయడంతో ఈ ఏడాది ఐపిఒల జారీలో రికార్డు సృష్టించే ఆస్కారం ఉన్నదని ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ తాజా నివేదికలో తెలిపింది. ఈ ఏడాది కార్పొరేట్‌ కంపెనీలు ఐపిఒల ద్వారా 500 కోట్ల డాలర్లకు (రూ.32,500 కోట్లు) పైబడి నిధులు సమీకరించే అవకాశం ఉన్నట్టు ఆ నివేదిక అంచనా వేసింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో మార్కెట్లోకి 16 ఎస్‌ఎంఇ పబ్లిక్‌ ఇష్యూలు వచ్చాయని, అన్ని కంపెనీలు కలిసి 180 కోట్ల డాలర్లు (రూ.11,700 కోట్లు) సమీకరించాయని తెలియచేస్తూ యూరప్‌, పశ్చిమాసియా, ఇండియా, ఆఫ్రికా (ఈంఇఐఎ) ప్రాంతంలోనే ఇది అత్యధిక సమీకరణ అని పేర్కొంది.  అలాగే ఎస్‌బిఐ లైఫ్‌ 130 కోట్ల డాలర్లు (రూ.8450 కోట్లు) వసూలు చేసి ఈంఇఐఏ ప్రాంతంలోనే అతిపెద్ద ఇష్యూగా నిలిచిందని తెలిపింది. జిఎ్‌సటి కారణంగా మార్కెట్లో ఆటుపోట్లు పెరిగినప్పటికీ ఐపిఒ మార్కెట్‌ అవకాశాలు మాత్రం బలంగానే ఉన్నట్టు అంతర్జాతీయ ఐపిఓ ధోరణులపై ఆ సంస్థ వెలువరించిన నివేదికలో పేర్కొంది. నియంత్రణాపరమైన కట్టుబాట్ల కారణంగా బీమా రంగంలోని కంపెనీలు కూడా ఐపిఒల జారీకి ఆతృత పడుతున్నాయని, దీనికి తోడు కేంద్రప్రభుత్వం తన ఆధీనంలోని రక్షణ రంగానికి చెందిన నాలుగు పిఎ్‌సయుల లిస్టింగ్‌కు సన్నాహాలు చేస్తున్నదని ఆ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా కూడా ఐపిఒల మార్కెట్‌ ఆకర్షణీయంగానే ఉన్నదని, 2007 తర్వాత పబ్లిక్‌ ఇష్యూలకి ఇదే ఉత్తమ సంవత్సరం కానున్నదని అంచనా వేసింది. ఈ ఏడాది అంతర్జాతీయంగా 1600 నుంచి 1700 పబ్లిక్‌ ఇష్యూల ద్వారా వివిధ కంపెనీలు 20 వేల కోట్ల డాలర్ల (రూ.13 లక్షల కోట్లు) వరకు సమీకరించే ఆస్కారం ఉన్నదని అంచనా ప్రకటించింది. ప్రతాప్‌ స్నాక్స్‌ అదుర్స్‌స్టాక్‌ మార్కెట్‌లో గురువారం లిస్టింగ్‌ అయిన ప్రతాప్‌ స్నాక్స్‌ ప్రారంభంలోనే అదరగొట్టింది. ఈ షేరు ఇష్యూ ధర 938 రూపాయలు కాగా బిఎ్‌సఇలో 33.26 శాతం లాభంతో 1250 రూపాయల వద్ద లిస్టింగ్‌ అయింది. ఇంట్రాడేలో ఈ షేరు 40.41 శాతం లాభంతో 1317.05 రూపాయల వరకు చేరి చివరికి 25.61 శాతం లాభంతో 1178.30 రూపాయల వద్ద ముగిసింది. ఎన్‌ఎ్‌సఇలో ఈ షేరు జోరు అలాగే సాగి చివరికి 25.86 శాతం లాభంతో 1180.65 రూపాయల వద్ద క్లోజయింది. బిఎ్‌సఇలో 17.86 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఇలో 91 లక్షల షేర్లు చేతులు మారాయి. గురువారం మార్కెట్‌ ముగిసే సమయానికి కంపెనీ మార్కెట్‌ విలువ 2763.47 కోట్ల రూపాయలుంది. గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌కు 2.11 రెట్ల ఓవర్‌ సబ్‌స్ర్కిప్షన్‌గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ ఇష్యూ రెండో రోజు 2.11 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. 1157 కోట్ల సమీకరణ లక్ష్యంగా మార్కెట్లోకి వచ్చిన సంస్థ ఇష్యూలో భాగంగా 1,80,27,464 షేర్లు జారీ చేయగా రెండో రోజు చివరికి 3,79,93,120 బిడ్లు దాఖలయ్యాయి. ఈ ఇష్యూ శుక్రవారం ముగుస్తుంది.
business
2,824
23-06-2017 23:36:24
దక్షిణాదిపై గ్రీన్‌లామ్‌ ఇండస్ట్రీస్‌ దృష్టి
హైదరాబాద్‌లో ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గ్రీన్‌లామ్‌ ఇండస్ట్రీస్‌ చెందిన గ్రీన్‌లామ్‌ లామినేట్స్‌ దక్షిణ భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా తన లామినేట్‌ ఉత్పత్తుల ప్రదర్శన కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కొనుగోలు చేసే ముందే వినియోగదారులు ఈ కేంద్రంలో తమకు కావలసిన లామినేట్‌ ఉత్పత్తులను, డిజైన్లను నేరుగా పరిశీలించుకోవచ్చని కంపెనీ లామినేట్‌, ఇతర ఉత్పత్తుల కంట్రీ హెడ్‌ అనూజ్‌ సంగల్‌ విలేకరులతో చెప్పారు. కేరళ తర్వాత దక్షిణాదిన హైదరాబాద్‌లోనే కంపెనీ తొలి సారిగా ఇలాంటి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వచ్చే రెండు మూడేళ్లలో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, వరంగల్‌, కరీంనగర్‌ నగరాల్లోనూ ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. బ్యాక్టీరియా కూడా దరి చేరని తమ లామినేట్‌ ఉత్పత్తులు దేశంలోనే గాకుండా, 102 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు అనూజ్‌ సంగల్‌ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ లామినేట్స్‌ బిజినెస్‌ రూ.475 కోట్లు ఉంటే అందులో రూ.70 కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సాధించినట్టు కంపెనీ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సిహెచ్‌ శ్రీనివాస చక్రవర్తి చెప్పారు. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 30 శాతం ఎక్కువ. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే వృద్ధి రేటు కొనసాగుతుందని కంపెనీ భావిస్తోంది. కృష్ణపట్నంలో కొత్త యూనిట్‌!గ్రీన్‌లామ్‌ ఇండస్ట్రీ్‌సకు చెందిన లామినేట్‌ ఉత్పత్తి యూనిట్లు ప్రస్తుతం ఉత్తర భారతంలోని రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయి. అయితే కంపెనీ మొత్తం అమ్మకాల్లో దక్షిణ భారత రాష్ట్రాల వాటా 35 శాతం వరకు ఉంది. ఇందులో హైదరాబాద్‌ నుంచి అత్యధిక ఆదాయం సమకూరుతోంది. దీంతో వీలైనంత త్వరగా స్థానిక మార్కెట్లకు చేరేందుకు దక్షిణాదిలోనూ ఉత్పత్తి యూనిట్‌ ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలను పరిశీలిస్తున్నట్టు కంపెనీ లామినేట్‌, ఇతర ఉత్పత్తుల కంట్రీ హెడ్‌ అనూజ్‌ సంగల్‌ చెప్పారు. రవాణా సదుపాయాలు, రేవు పట్టణానికి చేరువగా ఉండడం, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సహాయం ఆధారంగా కొత్త యూనిట్‌పై నిర్ణయం తీసుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పరిసర ప్రాంతాలనూ కంపెనీ పరిశీలిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన ఇంకా ప్రారంభ దశలోనే ఉందని కంపెనీ వర్గాలు చెప్పాయి. జిఎస్‌టితో లామినేట్స్‌పై పన్నుల భారం 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గినా, వినైల్‌ లామినేటెడ్‌ ఉత్పత్తులపై మాత్రం ఎలాంటి మార్పు ఉండదని గ్రీన్‌లామ్‌ ఇండస్ట్రీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌) అలెక్స్‌ జోసెఫ్‌ చెప్పారు.
business
2,190
01-07-2017 01:38:43
యాంటీ ప్రాఫిటీరింగ్‌పై ఆందోళన వద్దు
జిఎస్‌టి చట్టంలో ఉన్న యాంటీ ప్రాఫిటీరింగ్‌ నిబంధనపై పరిశ్రమ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. తక్కువ పన్నుల ద్వారా కలిగే ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిబంధనను చేర్చారని, ఒకవేళ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించే వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. జిఎస్‌టికన్నా ముందు కంపెనీలు పొందే ప్రోత్సాహకాలు, సబ్సిడీలను వినియోగదారులకు అందించేవికావని తెలిపారు. జిఎ్‌సటి రేట్ల ప్రయోజనాన్ని కస్టమర్లకు ఇస్తున్నదీ లేనిదీ పర్యవేక్షించేందుకు జాతీయ యాంటీ ప్రాఫిటీరింగ్‌ అథారిటీని ఏర్పాటు చేశారు. లాభాలను పంచకపోతే ఆ సంస్థల/కంపెనీల రిజిస్ర్టేషన్‌ను ఈ అథారిటీ రద్దు చేయవచ్చు.
business
15,015
19-04-2017 17:48:23
న్యాయం కోసం.. హై కోర్టును ఆశ్రయిస్తా: తేజ్ బహదూర్
న్యూఢిల్లీ: బీఎస్ఎఫ్ విధుల నుంచి తనను తొలగించడంపై హైకోర్టును ఆశ్రయిస్తానని జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ అన్నారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్న ఆయన, తనకు అక్కడ న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. నిజాలు మాట్లాడితే జరిగే పరిణామాలు ఇలాగే ఉంటాయని బీఎస్ఎఫ్‌ను వీడుతున్న సందర్భంగా తేజ్ బహదూర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.  జవాన్లకు నాసిరకం ఆహారం ఇస్తున్నారని ఆరోపిస్తూ తేజ్ బహదూర్ యాదవ్ తీసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. చివరకు క్రమశిక్షణ చర్యల కింద బీఎస్ఎఫ్ ఆయనను విధుల నుంచి తొలగించింది.
nation
19,401
08-08-2017 05:07:24
సతేంద్ర, మోహిత్‌కు రజతాలు
న్యూఢిల్లీ: ఆసియా జూనియర్‌ బాక్సింగ్‌ లో సతేంద్ర రావత్‌ (80+ కిలోలు), మోహిత్‌ ఖంతనా (80) రజత పతకాలు నెగ్గారు. సోమవారంనాటి ఫైనల్లో అల్మతోవ్‌ (ఉజ్బెకి స్థాన్‌) చేతిలో సతేంద్ర, తొంగబే (కజకిస్థాన్‌) చేతిలో మోహిత్‌ ఓటమి పాలయ్యారు. ఇక సెమీస్‌లో ఓడిన అంకిత్‌ నర్వాల్‌ (57), భవేష్‌ కాంతిమణి (52), సిద్దార్ధ్‌ మాలిక్‌ (48), వినిత్‌ దాహియ (75), అక్షయ్‌ సివాచ్‌ (60), అమన్‌ (70) కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.
sports
3,844
21-06-2017 01:15:25
మృత్యు ప్రయోగాలు
 బెంగుళూరు ఫార్మా కంపెనీ ఔషధ ప్రయోగాలతో ప్రాణం పోగొట్టుకున్నట్టుగా చెబుతున్న కరీంనగర్ జిల్లా నాగంపేట గ్రామానికి చెందిన వంగర నాగరాజు మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం జరిగింది. క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న ఒక వ్యక్తి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. పకడ్బందీగా, అనేక నిబంధనలకు అనుగుణంగా జరగవలసిన ఈ ఔషధ ప్రయోగాలు, ఫార్మా కంపెనీలు, దళారీల డబ్బుయావ వల్ల అక్రమ మార్గాల్లో సాగుతూ నిరుపేదల ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. ఒక రైల్వే కాంట్రాక్టరు వద్ద చిన్న ఉద్యోగం చేసుకొనే నాగరాజు కొద్దిపాటి డబ్బుకోసం తన ప్రాణాలనే ప్రమాదంలో పడేసుకున్నాడని ఆయన కుటుంబీకులకు ఆలస్యంగా తెలిసింది. మే 25న బెంగుళూరు లోటస్‌ ల్యాబ్స్‌లో ఆయన తనపై ఔషధప్రయోగానికి వీలుగా అంగీకారపత్రంపై సంతకం చేసి, ప్రయోగం ముగిసిన రెండురోజుల తరువాత బయటకు వస్తూనే సమీపంలోని పేవ్‌మెంటు మీద చతికిలబడిపోయాడు. చేతులు కాళ్ళవాపులతో, ఉబ్బిన పొట్టతో కష్టపడి సొంతూరు చేరుకొని జూన్‌ 2న మరణించాడు. నాగరాజు అసలు విషయం చెప్పకపోవడంతో కుటుంబీకులు, గ్రామ పీహెచ్‌సీ వైద్యులు వడదెబ్బే మరణానికి కారణమని నిర్ధారించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండానే ఖననం చేశారు. పెద్దకర్మరోజు వచ్చిన మిత్రుడు ఒకరు నాగరాజుకు బెంగుళూరులో ఒక సంస్థ డబ్బు ఇవ్వాల్సి ఉన్నదని చెప్పడం, ఇంట్లో క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన కొన్ని పత్రాలు దొరకడంతో వారికి మరణ కారణం చూచాయగా అర్థమైంది. తాము ఫార్మా కంపెనీ అధికారులను కలిసినప్పుడు, నాగరాజు అంగీకారపత్రంపై సంతకం చేసినందున తమను ఎవరూ ఏమీ చేయలేరనీ, ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన ఇరవైవేలు మాత్రమే ఇస్తామని చెప్పారనీ, తాము ఒప్పుకోకపోవడంతో బయటకు గెంటేశారని కుటుంబీకుల ఆరోపణ. ఈ సందర్భంగా అక్కడున్న వలంటీర్లు కొందరు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన మరికొందరు కూడా అనారోగ్యం బారినపడినట్టు వీరితో చెప్పడం ఆందోళన కలిగిస్తున్న అంశం. నాగరాజు కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో సోమవారం కాకతీయ మెడికల్‌ కాలేజీకి చెందిన ఫోరెన్సిక్‌ నిపుణులతో మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. నివేదిక రావడానికి మూడునాలుగు వారాలు పట్టవచ్చును కనుక, ఇంతలోగా, సదరు ఫార్మాకంపెనీ నుంచి జాబితా సంపాదించి ఇరుగుపొరుగు రాష్ట్రప్రభుత్వాలకు సమాచారమివ్వగలిగితే మిగతావారికి ఆపద వాటిల్లకుండా చూడవచ్చు.నాగరాజును అతడి స్నేహితులో, పరిచయస్తులో ఈ వ్యవహారంలోకి దింపినట్టు తెలుస్తున్నది. ఇటీవలే వరంగల్‌కు చెందిన యువకుడు ఒకరు హైదరాబాద్‌లోని ఒక ఫార్మాకంపెనీపై మానవహక్కుల సంస్థను ఆశ్రయించినప్పుడు ఈ వ్యవస్థ విస్తృతి ఎంతటిదో మరింత స్పష్టంగా తెలిసొచ్చింది. మందుల కంపెనీలకు వలంటీర్లను సమకూర్చే వాట్సప్‌ గ్రూపులే వందకుపైగా ఉన్నాయి. కంపెనీల అవసరాన్ని తీర్చడానికి ఏజెంట్లు ఆధునిక టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఒక ఉత్పత్తి సంస్థ తయారుచేసిన కొత్త మందును మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేముందు పరీక్షించడం అవసరం. ప్రాథమికంగా పలు జీవులపైన అనేక దశల్లో ప్రయోగాలు పూర్తయ్యాక, మనుషులపై వాడి చూడటం మొదలవుతుంది. ఇది కూడా అనేక దశల్లో, ప్రతీ దశ పలు విడతలుగా ఉంటుంది. ప్రధానంగా పేదలు, నిరక్షరాస్యులే డబ్బు అవసరం రీత్యా ముందుకువస్తారు కనుక, వారిలో అత్యధికులకు తమపై ఏ మందును ప్రయోగిస్తున్నారో, దాని స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రభావాలు ఏమిటో తెలియకుండానే అంగీకార పత్రాలపై సంతకాలు చేస్తారు. పరీక్షలకు మనుషులు పెద్దసంఖ్యలో అవసరపడతారు కనుక, వలంటీరుగా వచ్చే వ్యక్తి 10వేల నుంచి 20వేల వరకూ సంపాదిస్తే, వీరందరినీ సమకూర్చే దళారీకి భారీ మొత్తం ముడుతుంది. ఏయే నగరాల్లో ఎక్కడెక్కడ ఏయే తేదీల్లో ప్రయోగాలున్నవో, ఎంత డబ్బు ఇస్తారో వీరు తెలియపరుస్తారు కానీ, మిగతా ముఖ్యమైన వివరాలు చెప్పరు. వచ్చినవారికి ఏ ప్రమాదమూ లేదన్న దళారీల నోటిమాట మాత్రమే ఆధారం. తమకు ఆ సంస్థ సమస్త వివరాలు విప్పిచెప్పిందనీ, ప్రయోగమూ, ప్రమాదమూ తనకు తెలిసే అంగీకరిస్తున్నానని పత్రంమీద ఉంటుంది. చాలా కంపెనీలు ఈ పత్రాల్లోనూ పూర్తివివరాలు చెప్పకపోవడమూ, ప్రయోగం అన్ని దశలూ ముగిసేవరకూ వాటిని అందించకపోవడమూ జరుగుతున్నది. సుదీర్ఘమైన, సంక్లిష్టమైన పత్రాలను చదివి అర్థం చేసుకోగలిగే స్థితిలో ఈ నిరక్షరాస్య వాలంటీర్లు కూడా ఉండరు. బీపీ, షుగర్‌ వంటివి ఉన్నట్టుగా తేలితే కంపెనీలు తిరస్కరిస్తాయని దళారీలు భయపెట్టడంతో వలంటీర్లు ముందుగా మందులు మింగడం వారికి మరింత ప్రమాదకరంగా మారుతున్నది. అలాగే, ఒక మందు ప్రయోగం ముగియగానే సదరు వలంటీరును దళారీలు మరో మందు ప్రయోగానికి తీసుకుపోవడం కూడా ప్రాణంమీదకు తెస్తున్నది. ప్రయోగాల్లోని ప్రతిదశ ఫలితాలను ఎప్పటికప్పుడు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ)కు నివేదించాలనీ, ఏ దశలో ప్రయోగం వికటించినా తెలియచేయాలని నియమాలు చెబుతున్నా చాలా సంస్థలు ఆ పని సక్రమంగా చేయవు. క్లినికల్‌ ట్రయల్స్‌ కోరలు లేని డ్రగ్‌ అండ్‌ కాస్మోటిక్స్‌ చట్టం పరిధిలో ఉన్నందున ఎవరి ప్రాణంమీదకు వచ్చినా కంపెనీని కఠినంగా దండించగలిగే వీలులేకుండా పోతున్నది. వలంటీర్లను సమీకరించే విషయంలోనూ విస్పష్టమైన విధానాలు లేవు.  న్యాయస్థానాలో, మానవహక్కుల సంస్థలో ఆదేశించినప్పుడు పోలీసులు కేసు నమోదు చేయడం తప్ప అంతిమంగా బాధితులకు న్యాయం జరగడం అరుదు. దేశంలో సగానికి సగం క్లినికల్‌ ట్రయల్స్‌ రిపోర్టు కాకుండా జరిగిపోతున్నాయి. కంపెనీలు ఖర్చుతగ్గించుకోవడం కోసం వీటిని పేదలకు, నిరక్షరాస్యులకు పరిమితం చేయడంతో వారిపట్ల ఉండే నిర్లక్ష్యం ప్రాణాంతకంగా పరిణమిస్తున్నది. వారికి ఆరోగ్యబీమా ఇవ్వాలనీ, వారి ఆరోగ్యాన్ని పరీక్షిస్తూ సుదీర్ఘకాలం పర్యవేక్షించాలనీ, సదరు మందు మార్కెట్‌లోకి విడుదలయ్యాక ఉచితంగా అందించాలనీ పలు నిబంధనలు ఉన్నప్పటికీ ఆచరణలో జరగడం లేదు. మరణాలు సంభవించినప్పుడు క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రమాదకరమైనవన్న భావన సమాజంలో మరింత హెచ్చుతుందే తప్ప తగ్గదు. సక్రమమైన నియంత్రణలతో పాటు, భారీ ప్రచారంతో అన్ని వర్గాలవారూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చేట్టు ప్రభుత్వాలు చేయగలిగినప్పుడు పేదల ప్రాణాలతో చెలగాటమాడే ఈ పరిస్థితిలో మార్పువస్తుంది.
editorial
5,824
06-10-2017 18:31:22
రాజా ది గ్రేట్ ట్రైలర్: ఇట్స్ లాఫింగ్ టైమ్
రవితేజ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతోన్న చిత్రం 'రాజా ది గ్రేట్'. ఈ చిత్ర ట్రైలర్‌ని శుక్రవారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అంధుడిగా రవితేజ నటిస్తోన్న ఈ చిత్రంలో ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ని అనిల్ రావిపూడి పొందుపరిచాడు. కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్, యాక్షన్ ఇలా అన్నీ సమపాళ్లలో ఈ చిత్రంలో ఉన్నాయనేది ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. అనిల్ రావిపూడి 'పటాస్, సుప్రీమ్' చిత్రాల '801 మరియు జింగ్ జింగ్' మాదిరిగానే ఈ చిత్రంలో 'ఉహు హు హూ.. ఉహు హు హూ' అనే సిగ్నేచర్ మూమెంట్ సినిమాని అలరిస్తుందనడానికి ట్రైలర్ చివరిలో రవితేజ, రాధిక, కమెడియన్ శ్రీనివాస రెడ్డిల అభినయం తెలుపుతోంది. ఇక రామ్‌గోపాల్ వర్మ ట్వీట్స్‌పై వేసిన పంచ్ డైలాగ్‌తో పాటు ట్రైలర్‌లో రవితేజ చెప్పిన డైలాగ్స్‌ కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ''మా అమ్మ నాకు నేర్పింది ఒక్కటే. లైఫ్ ఏది ఎదురొచ్చి మనకివ్వదు. మనమే ఎదురెళ్లి తీసుకోవాలి. బాధ నుంచి సంతోషమైనా, ఓటమి నుంచి గెలుపైనా..'' అనే సెంటిమెంట్ డైలాగ్‌తో పాటు''ఎన్ని కళ్లు నన్ను చూస్తున్నా.. ఎంత మంది నా వైపు వస్తున్నా.. మీరేసే అడుగు, చూసే చూపు, పీల్చే శ్వాస.. ఎవ్రీథింగ్ అండర్ మై కంట్రోల్..ఎవడ్రా నువ్వు? అని విలన్ అంటే ఐ యామ్ ఎ వారియర్..వచ్చి ఒక్కసారి నాకు వినబడు..'' అనే యాక్షన్ డైలాగ్''బుజ్జి.. ప్రేక్షకుల ముఖ చిత్రాలెంటో..ఆనందానికి, ఆశ్చర్యానికీ మధ్య వెలిగిపోతోంది. హా.. ఇట్స్ లాఫింగ్ టైమ్...ఉహు హు హూ.. ఉహు హు హూ'' అంటూ కామెడీ ఇలా అన్ని మిక్స్ చేసి ట్రైలర్‌తో సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచగలిగాడు అనిల్ రావిపూడి. కాన్సెప్ట్ పరంగా మహేష్ బాబు 'ఒక్కడు' సినిమాకి దగ్గరగా ఉన్నా, రవితేజ ఛాలెంజింగ్‌గా చేసిన నటన అన్నింటినీ జయించేస్తోందని ట్రైలర్ నిరూపిస్తోంది. అనిల్ రావిపూడి కోసం చేశాడో లేక సినిమా కోసం చేశాడో తెలియదు కానీ సాయి కార్తీక్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశాడు. టోటల్‌గా ట్రైలర్ దేనికోసమో దానిని మాత్రం రిచ్‌గా చేరవేసింది. రవితేజకి హిట్, అనిల్ రావిపూడికి హ్యాట్రిక్ హిట్, దిల్ రాజుకి డబుల్ హ్యాట్రిక్‌ని ఈ చిత్రం ఇస్తుందని ఫిక్స్ అయిపోవచ్చు.
entertainment
10,832
27-07-2017 20:38:31
మహేష్ ఆ సీన్ కోసం 20 కోట్ల ఖర్చు !
మురుగదాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం 'స్పైడర్'. సినిమా కోసం మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. సినిమాపై భారీ అంచనాలున్నాయి. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా 120కోట్ల భారీబడ్జెట్ తో ఎక్కడా కాంప్రమైస్ కాకుండా అన్ని హంగులు జోడించి ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజా సమాచారమేమిటంటే.. సినిమాలోని ఓ సన్నివేశం కోసం 20 కోట్ల రూపాయలతో సెట్ వేశారట. అది కూడా కేవలం ఎనిమిది నిమిషాల సన్నివేశం కోసమే. చిత్రంలో విలన్‌గా నటిస్తున్న ఎస్.జే.సూర్య బాంబు దాడితో ఓ పాఠశాలను ధ్వంసంచేయడానికి ప్రయత్నిస్తుంటే..హీరో మహేష్ దాన్ని అడ్డుకోవడం కోసం పోరాడే ఈసన్నివేశాన్ని సినిమాకే హైలైట్ గా నిలిచేలా భారీ హంగులతో చిత్రీకరించడంతో.. కేవలం ఈ ఒక్క సన్నివేశానికి 20 కోట్ల ఖర్చు జరిగిందని తెలిసింది. ఇక ఇటీవలే విడుదలైన ఈసినిమా టీజర్ సోషల్ మీడియానే ఓ కుదుపు కుదిపేస్తూ కోట్లలో వ్యూస్ పట్టేస్తోంది.
entertainment
16,630
11-07-2017 17:02:43
మాజీ సీఎం కుమార్తెపై ఈడీ ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ : బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట మంగళవారం హాజరయ్యారు. రూ.8,000 కోట్ల మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఆమెను ఈడీ ప్రశ్నించింది.  ఈడీ జోనల్ కార్యాలయానికి మిసా భారతి మంగళవారం ఉదయం 11 గంటలకు వచ్చారు. దర్యాప్తు అధికారికి వాంగ్మూలం ఇచ్చారు. మిషైల్ ప్రింటర్స్ అండ్ ప్యాకర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆమె పాత్ర గురించి అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. గతంలో అరెస్టయిన చార్టర్డ్ అకౌంటెంట్‌తో ఆమెకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయని కూడా అడిగినట్లు సమాచారం.
nation
16,915
13-02-2017 23:47:30
‘ధిక్కారం’పై ధిక్కారం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ‘మీపై కోర్టు ధిక్కారం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదు? మా ముందుకు వచ్చి వివరణ ఇవ్వండి’ అని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌ ధిక్కరించారు. సాటి న్యాయమూర్తులను నిందిస్తూ, వారిపై ఆరోపణలు చేస్తూ లేఖలు రాసిన జస్టిస్‌ కర్ణన్‌ను సోమవారం తమ ముందు హాజరు కావాలని సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఆయనకు ఈ నెల 8న దీనిపై నోటీసు కూడా జారీ చేసింది. అయితే... జస్టిస్‌ కర్ణన్‌ సోమవారం సుప్రీంకోర్టు ముందుకు రాలేదు. ఆయన తరఫున న్యాయవాది కూడా ఎవరూ హాజరు కాలేదు. ‘‘జస్టిస్‌ కర్ణన్‌ రాలేదు. కారణం కూడా తెలియదు’’ ధర్మాసనం పేర్కొంది. ‘‘నేను దళితుడిని కాబట్టే ఇలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో చర్చించాలి’’ అంటూ ప్రధానికి ఈనెల 10న కర్ణన్‌ లేఖ రాసినట్లు తెలిసింది. సోమవారం ఈ అంశా న్నీ ధర్మాసనం పరిశీలించింది. జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టి్‌సలు దీపక్‌ మిశ్రా, జె.చలమేశ్వర్‌, రంజన్‌ గొగోయ్‌, ఎంబీ లోకూర్‌, పీసీ ఘోష్‌, కురియన్‌ జోసెఫ్‌ సభ్యులుగా ఉన్నారు. తనను మద్రాస్‌ హైకోర్టు నుంచి కలకత్తా కోర్టుకు బదిలీ చేసిన ఆదేశాలపై జస్టిస్‌ కర్ణన్‌ ‘సొంతంగా స్టే’ ఇచ్చుకున్న కేసును ఏడుగురు సభ్యుల విస్తత ధర్మాసనానికి అప్పగించాలని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల బెంచ్‌ నిర్ణయించింది.
nation
7,780
03-05-2017 11:15:26
మా ఫ్యామిలీ కోసం డబ్బు సంపాదించాలి: హెబ్బా
తొలి సినిమాతోనే తెలుగువారితో అబ్బా అనిపించింది హెబ్బాపటేల్‌. ఉత్తరాది అమ్మాయే అయినా దక్షిణాదిన పాగా వేసింది. చిన్న సినిమాలకు మంచి ఆప్షన్‌గా మారిపోయింది. చిన్న సినిమాలతోనే సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ అనే ట్యాగును తగిలించుకుంది. తెర మీదే కాకుండా బయట కూడా బోల్డ్‌గా మాట్లాడడం, వ్యవహరించడం ఆమెకు అలవాటు. ఆ అలవాటుతోనే తన గురించిన ఓ నిజాన్ని నిర్భయంగా బయటపెట్టేసింది. ఆ నిజం ఏమిటో ఆమె మాటల్లోనే.... మీ గురించి...ముంబాయిలో మాస్‌ మీడియాలో డిగ్రీ చేశాను. నాన్న నఫీజ్‌, అమ్మ సోఫియా. ప్రస్తుతానికి నా వ్యవహారాలన్నీ మా మదర్‌, మేనేజర్‌ చూసుకుంటూ ఉంటారు. నా సినిమాల విషయంలో నాన్న ప్రమేయం అంతగా ఉండదు. నా సినిమాలు చూసినా నటన బాగుంటే బాగుంది అని మెచ్చుకుంటారు అంతే! సినిమాల్లో అవకాశం ఎలా వచ్చింది?కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌ చేసేదాన్ని అప్పుడే కన్నడ, తమిళ సినిమాల్లో చేసే అవకాశం వచ్చింది. ఆ రెండు భాషల్లో నా సినిమాలు చూసి తెలుగులో ‘అలా ఎలా’లో ఛాన్స్‌ వచ్చింది. కెరీర్‌ మలుపు తిప్పింది మాత్రం ‘కుమారి 21 ఎఫ్‌’ సినిమానే. ఆ సినిమా తరువాత ఇక వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. నా అదృష్టం కొద్దీ తెలుగులో చేసిన సినిమాలన్నీ మంచి విజయాన్నే సాధించాయి.  పెద్ద హీరోలతో చేయలేదన్న బాధ లేదా?ఏ హీరోతో చేసినా సినిమా సక్సెస్‌ గురించే మాట్లాడుకుంటారు కానీ, పెద్దా చిన్నా అన్న తేడా ఉండదు. అసలు నాకు గుర్తింపు తెచ్చిందే చిన్న సినిమాలు. ఇప్పుడిప్పుడే పెద్ద హీరోలతో చేసే అవకాశం వస్తోంది.  మొన్నా మధ్య ఓ వ్యక్తితో డేటింగ్‌ చేశానని చెప్పారు కదా....?నిజమే! ఆ వ్యక్తితో డేటింగ్‌ చేశాను. ఆ వ్యక్తి ఎవరు? అన్నది అప్రస్తుతం. ఎందుకంటే ఇప్పుడు తనకీ నాకూ ఎలాంటి సంబంధం లేదు. నిజం చెప్పాలంటే అతని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ రోజు ఇలా ఉన్నాను అంటే అతని చలవే! ఎందుకో తెలియదు మా మధ్య ఉన్నట్టుండి దూరం పెరిగిపోయింది. తను మా కుటుంబానికి కూడా తెలుసు. తనతో విడిపోయిన తరువాత ప్రేమా, పెళ్ళి గురించి ఆలోచించే తీరిక లేనంత బిజీ అయిపోయాను. మా ఫ్యామిలీ అంతా ముంబాయిలోనే ఉంటుంది. అక్కడ వాళ్ళకి ఓ మంచి ఇల్లు కొనాలి. దానికి డబ్బు సంపాదించాలి. డబ్బు కావాలంటే సినిమాలు చేయాలి. ప్రస్తుతానికి నా ముందు ఉన్న పెద్ద లక్ష్యం ఇదే! అయితే ముంబాయిలో ఇల్లు కొనడం అంటే మాటలు కాదు. అందుకే వారికోసం, నాకోసం హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొనే ఆలోచన ఉంది. రాజ్‌తరుణ్‌తో విబేధాలు సమసిపోయినట్టేనా?తనతో నాకు ఎప్పుడూ గొడవలు లేవు. మా మధ్య స్నేహం తప్ప మరొకటి లేదు. మా మధ్య ఏదో ఉంది అన్నది పుకారు మాత్రమే! రెండు మూడు సినిమాలు కలిసి చేసినంత మాత్రాన ఆ వ్యక్తితో సంబంధం ఉన్నట్టేనా? అంత మంచి స్నేహం ఉన్నప్పుడు రాజ్‌తరుణ్‌తో కలిసి ర్యాంప్‌ వాక్‌ ఎందుకు చేయనన్నారు?నేను చేయను అనలేదు ఆ సమయంలో అత్యవసరంగా ఓ పెద్ద డైరక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడవలసి వచ్చింది. అదీ సినిమా గురించే! ర్యాంప్‌ వాక్‌ కన్నా ఇదే ముఖ్యం అనుకున్నా. అదే విషయం రాజ్‌తో చెబితే తను అర్థం చేసుకున్నాడు. ముందు డైరక్టర్‌గారితో మాట్లాడు అని చెప్పాడు. మా మధ్య జరిగిన సంభాషణ తెలియని వాళ్ళు మా మధ్య ఏదో గొడవ జరిగిందనీ, అందుకే రాజ్‌తరుణ్‌తో కలిసి ర్యాంప్‌ వాక్‌ చేయలేదని పుట్టించేశారు. ఈ వార్తలు వచ్చిన తరువాత తనతో కలిసి ఓ సినిమా చేశాను. అప్పుడు మా మధ్య సయోధ్యత కుదిరింది అన్నారు. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు అనేసుకుంటే అందులో నా బాధ్యత ఎంత?మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి కదా‌ తెర మీద బోల్డ్‌గా కనిపిస్తారు కదా? నిజజీవితంలో కూడా అంతేనా?తెర మీద కనిపించే దానికీ, నిజజీవితానికి అస్సలు పొంతన ఉండదు. తెర మీద ఇద్దరు ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్‌తో కనిపిస్తాను. నిజజీవితంలో అలా ఉండను. నేను చదివింది ఉమెన్స్‌ కాలేజ్‌. అందుకే మగ స్నేహితులు చాలా తక్కువ మంది ఉంటారు. అదీ కాక మా ఇంట్లో రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌ ఎక్కువే! తెర మీద ఉన్నట్టు నిజజీవితంలో ఉంటానంటే ఒప్పుకోరు. అంత స్ర్టిక్ట్‌గా ఉండేవారు మిమ్మల్ని సినిమాల్లోకి ఎలా అనుమతించారు?నటన వేరు. జీవితం వేరు. అది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెర మీద ఉన్నట్టు నిజజీవితంలో ఉండనక్కర్లేదు కదా! తెర మీద ఎలా ఉన్నా ఇంట్లో సగటు ఆడపిల్లలాగే ఉంటాను.  హెబ్బా తెర మీదా, బయటా కూడా ఎక్స్‌పోజింగ్‌ చేస్తుందంటారు కదా? ఎంత వరకూ నిజం?తెర మీద అంటే గ్లామర్‌గా కనిపించక తప్పదు. బయట సినీమా ప్రమోషన్లకొచ్చినప్పుడు చుడీదార్లు వేసుకొస్తే హెబ్బాకు ఫ్యాషన్‌ తెలీదు అంటారు. కాస్త ఫ్యాషన్‌గా వస్తే ఎక్స్‌పోజింగ్‌ చేస్తున్నాను అంటున్నారు. ఇంటా బయటా ఎలా ఉండాలో ఎవరైనా ఓ లిస్ట్‌ రాసి ఇస్తే ఇక నుంచి అలాగే ఉంటాను. అలా ఉండడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు కూడా! వరుస విజయాలు సొంతం చేసుకుంటున్నారు కదా...మీ విజయ రహస్యం?అందులో నా క్రెడిట్‌ ఏమీ లేదు. దర్శకులు ఎలా చెబితే అలా చేసుకుంటూ పోవడమే నా పని. నన్ను బాగా చూపించినా, నా పాత్రకు మంచి పేరొచ్చినా అదంతా దర్శకుల ఘనతే! ఎలాంటి పాత్రలంటే ఎక్కువ ఇష్టం?ఇప్పటి వరకూ పక్కింటి అమ్మాయి, చిలిపి అమ్మాయి పాత్రలే ఎక్కువ చేశాను ఆయా పాత్రల్లోనే ప్రేక్షకులు నన్ను ఎక్కువ ఆదరించారు. ఈ పాత్రలే చేయాలి. ఇవి చేయకూడదు అన్న నిబంధనలేమీ పెట్టుకోలేదు.  హెబ్బా రెమ్యునరేషన్‌ పెంచేసింది అంటున్నారు?అసలు నాకు ఎంత ఇస్తున్నారో? ఎంత పెంచానో ఎవరైనా చెబితే సంతోషిస్తాను. నా రెమ్యునరేషన్‌ విషయం మా మదర్‌, మేనేజర్‌ చూసుకుంటారు. ఆ డబ్బు వ్యవహారాలు నాకు అర్థం కావు. నేను పట్టించుకోను. తెలుగులో చేస్తున్న సినిమాలు?‘ఏంజిల్‌’ షూటింగ్‌ పూర్తి అయి విడుదలకు సిద్ధంగా ఉంది. మంచి డేట్‌ చూసుకుని విడుదల చేయబోతున్నారు. ‘అంధగాడు’ షూటింగ్‌ జరుగుతోంది. రెండు మూడు కథలు వినడం జరిగింది కానీ వేటికీ ఓకే చెప్పలేదు. కోలీవుడ్‌లో చేయడం లేదా?లేదు. ప్రారంభంలో చేశాను. కానీ అక్కడ ఇంత వరకూ ఏ సినిమాకీ ఓకే చెప్పలేదు. ముంబాయి అమ్మాయి అయి ఉండి బాలీవుడ్‌లో ప్రయత్నించలేదా?మొదట నాకు అవకాశం ఇచ్చింది దక్షిణాది పరిశ్రమ. అందుకే నా దృష్టి అంతా ఇక్కడ పెట్టాను. అక్కడ అవకాశం వచ్చినా డేట్లు కుదరక చేయలేదు. ఉత్తరాది కన్నా దక్షిణాది నాకు బాగుంది. దీన్ని వదిలి అక్కడ నేను చేసే సినిమాలు ఉంటాయి అని అనుకోవడం లేదు.
entertainment